బ్రాంకైటిస్ ఆస్తమాకు కారణం కావచ్చు | Bronchitis may lead to asthma | Sakshi
Sakshi News home page

బ్రాంకైటిస్ ఆస్తమాకు కారణం కావచ్చు

Published Thu, Sep 19 2013 11:32 PM | Last Updated on Mon, Oct 22 2018 2:06 PM

బ్రాంకైటిస్ ఆస్తమాకు కారణం కావచ్చు - Sakshi

బ్రాంకైటిస్ ఆస్తమాకు కారణం కావచ్చు

ఒక్క క్షణం శ్వాస తీసకోవడంలో ఇబ్బంది ఏర్పడితే విలవిల్లాడిపోతాం. కానీ చాలామంది పొగతాగే అలవాటుతో శ్వాససంబంధ సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్న శ్వాసకోశ వ్యాధులకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది.
 
 పొగతాగే అలవాటు ఉన్నవారిలో ఊపిరితిత్తులు మరింత త్వరగా క్షీణిస్తాయి. సాధారణంగా పొగతాగే వారిలో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు అనేకం వస్తుంటా యి. పొగతాగే వారు వదిలే పొగలో సుమారు 43 రకాల క్యాన్సర్ పదార్థాలు, 30 రకాల లోహాలు, 4500 రకాల పదార్థాలు ఉంటాయి. వీటివలన శ్వాసనాళాలు కుచించుకుపోయి దీర్ఘకాలం పాటు దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. ఈ సమస్యను క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) అంటారు.
 
 లక్షణాలు: ఈ సమస్యతో బాధపడేవారికి కనిపించే ప్రధాన లక్షణం దగ్గు. దగ్గుతో పాటు శ్లేష్మం వస్తుంటుంది. పగటివేళ దగ్గు ఎక్కువగా ఉంటుంది. శ్వాసనాళాల్లో అడ్డు అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. పొగతాగే వారిలో వయసు పైబడిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య ఎక్కువైనపుడు రాత్రుళ్ళు నిద్రపట్టదు. 40 ఏళ్ళు పైబడిన వారిలో ఇది కొంత ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నపిల్లల్లో కనిపించదు.

 తీవ్రమైన దశ:  దగ్గు, కళ్లె పడటం ఎక్కువగా ఉంటుంది. పగలైనా, రాత్రివేళయినా శ్వాసించడం కష్టమవుతుంది. మెట్లు ఎక్కడం, చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి వస్తారు. రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ల వల్ల కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. బరువు తగ్గిపోతారు.
 
 క్రానిక్ బ్రాంకైటిస్:
ఒక ఏడాదిలో కనీసం మూడు నెలల చొప్పున వరుసగా రెండేళ్ళపాటు కళ్లెతో కూడిన దగ్గు ఉంటే దానిని క్రానిక్ బ్రాంకైటిస్‌గా అనుమానించాలి. దీనిలో కూడా శ్వాసనాళం ఇన్‌ఫెక్షన్ల వల్ల అవి దళసరిగా మారతాయి. ఫలితంగా గాలిని పీల్చుకోవడంలో, బయటకు విడవడంలో ఇబ్బందులు వస్తాయి.

 వాయునాళ పొరల్లో ఉండే గ్రంథులు కఫం (మ్యూకస్) అనే జిగురు స్రావాన్ని తయారుచేస్తాయి. ఇది గాలిలోని దుమ్ముకణాలను వడగొట్ట్టడానికి, హాని కలిగించే పదార్థాల తీవ్రతను తగ్గించడానికి, శ్వాసనాళాల్లో తగినంత తడి ఉండేలా చూడటానికి ఉపకరిస్తుంది. క్రానిక్ బ్రాంకైటిస్‌తో బాధపడే వారిలో ఆ గ్రంథులు పెద్దగా అవుతాయి. దానివలన కఫం అక్కడే ఎక్కువగా తయారయి ఊపిరితిత్తులలోకి చేరి తిష్ట వేస్తుంది. దీంతో తెరలు తెరలుగా దగ్గు వస్తూ ఉంటుంది. ఇది ఏళ్లతరబడి ఉండిపోయినప్పుడు రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది.
 
 జాగ్రత్తలు:

 ఇంటి వాతావరణం శుభ్రంగా ఉంచుకోవాలి.
     
 పొగ, వాహనకాలుష్యం, దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి.
     
 శ్వాస సంబంధిత వ్యాయామాలు చేస్తుండాలి.
     
 నిత్యం వాకింగ్ చేయడంతో పాటు నిపుణుల పర్యవేక్షణలో కండర పటిష్టతను పెంచే వ్యాయామాలు చేస్తుండాలి.
     
 పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
     
 ప్రొటీన్ ఎక్కువగా లభించే ఆహారపదార్థాలను తినాలి.
     
 ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి.
 
 హోమియో చికిత్స: శ్వాస సంబంధ సమస్యలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఆర్సనిక్ ఆల్బం, ఆంటినమ్, ఇపికాక్ ఆంటినమ్ క్రూడ్ వంటి మందులు ఈ వ్యాధిని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. అయితే రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిశీలించాక చికిత్స అందించాల్సి ఉంటుంది. హోమియో మందులు సీఓపీడీ, క్రానిక్ బ్రాంకైటిస్ నుంచి చాలావరకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. పైగా హోమియో మందుల వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే శ్వాస సంబంధ వ్యాధులు ఇట్టే తగ్గిపోతాయి.
 
 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ,
 వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై
 అపాయింట్‌మెంట్ కొరకు 9246199922

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement