Bronchitis
-
ఆస్పత్రి నుంచి నేడు పోప్ ఫ్రాన్సిస్ డిశ్చార్జి
రోమ్: కేథలిక్కుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్(86) శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని వాటికన్ వర్గాలు తెలిపాయి. సెంట్ పీటర్స్ స్క్వేర్‌లో బుధవారం సంప్రదాయ వారాంతపు ప్రసంగం అనంతరం అస్వస్థతకు గురైన పోప్‌ను రోమ్‌లోని గెమెల్లి పాలీక్లినిక్‌లో చేర్పించారు. బ్రాంకైటిస్‌తో బాధపడుతున్నట్లు పరీక్షల్లో తేలింది. యాంటీబయాటిక్ చికిత్సకు స్పందిస్తున్నారని వాటికన్ ప్రతినిధి చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందన్నారు. అయితే, ఆదివారం నుంచి ఈస్టర్ వీక్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారా లేదా అనేది సందిగ్ధంలో పడింది. ఇప్పటికే మోకాలి నొప్పితో బాధపడుతున్న పోప్ కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నారు. కాగా, పోప్ ఫ్రాన్సిస్ త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ శుక్రవారం ట్వీట్ చేశారు. -
బాబుకు బ్రాంకైటిస్... తగ్గడం ఎలా?
మా బాబు వయసు ఆరేళ్లు. గత మూడు నెలలుగా దగ్గుతో బాధపడుతున్నాడు. అప్పుడప్పుడూ జ్వరం, కొద్దిపాటి కళ్లె కూడా కనిపిస్తున్నాయి. పరీక్షలన్నీ చేసి డాక్టర్లు ‘బ్రాంకైటిస్’గా నిర్ధారణ చేసి మందులిచ్చారు. అయినా పెద్దగా ఫలితం కనబడటం లేదు. పూర్తిగా తగ్గాలంటే ఆయుర్వేద చికిత్స సూచింప ప్రార్థన. కె. రాధిక, సిరిసిల్ల మీరు చెప్పిన లక్షణాలను బట్టి, ఆయుర్వేదంలో దీనిని ‘పిత్తజ కాస’గా పరిగణించవచ్చు. అప్పుడప్పుడు ఇక్కడ అసాత్మ్యత (అలర్జీ) కూడా చోటు చేసుకుంటుంది. సాధారణంగా పిల్లలను ఆకర్షించే చాక్లెట్లు, నూడిల్స్, లాలీపాప్స్ ఐస్‌క్రీములు, కూల్‌డ్రింక్స్ వంటి చిరుతిళ్లను పూర్తిగా నిషేధించాలి. బయటి తిండిని మానేయాలి. ఇంట్లో వండే వంటకాలలో వాడే నూనెలు, రంగులు మొదలైనవాటిల్లో కల్తీ లేకుండా చూసుకోవాలి. బలకరమైన ఆహారంతో బాటు బాదం, జీడిపప్పు వంటి ఎండుఫలాలను తినిపించండి. పాలు, పెరుగు తగు రీతిలో సేవించాలి. ఈ కింద వివరించిన మందుల్ని ఒక నెలపాటు వాడి ఫలితాన్ని సమీక్షించండి. రస పీపరీ రస (మాత్రలు) ... ఉదయం 1, రాత్రి 1. అతిమధురం చూర్ణం రెండు గ్రాములు, ప్రవాళ పిష్ఠి ఒక చిటికెడు కలిపి తేనెతో రెండుపూటలా తినిపించండి. వాసారిష్ట (ద్రావకం) ... ఒక చెంచా మందుకి ఒక చెంచా నీళ్లు కలిపి, రెండు లేక మూడు పూటలా తాగించాలి. నా వయసు 68. శీతాకాలంలో చర్మం పొడిగా మారి దురదలు రాకుండా ఉండాలంటే ఆయుర్వేద సూచనలీయగలరు. - ఎస్. మేరీ, విశాఖపట్నం ఆయుర్వేద సూత్రాల రీత్యా ‘రూక్షత్వక’ (పొడిచర్మం)ను నివారించడానికి ఈ కింది విధానాలను పాటించండి. రోజుకి నాలుగైదు లీటర్ల నీరు తాగండి. ఆహారంలో ఆకుకూరలు, మునగకాడలు విరివిగా వాడండి. రోజూ రెండు చెంచాలు నువ్వుల పప్పు (పచ్చిది) నమిలి తినండి. ఉప్పు, కారం తగ్గించాలి. స్నానం కోసం సబ్బులేమీ వాడవద్దు. ముఖాలంకరణకు పౌడర్లు, క్రీములు వాడవద్దు. చెమటపట్టేటట్టు తేలికపాటి వ్యాయామం అవసరం. రాత్రిపూట కనీసం ఆరుగంటల నిద్ర ఉండాలి. మానసిక ఒత్తిడి లేకుండా ప్రాణాయామం ఉపయోగకరం. స్వచ్ఛమైన నువ్వులనూనెతో శరీరమంతా అభ్యంగనం చేసుకొని, అనంతరం సున్నిపిండి లేదా శనగపిండితో నలుగుపెట్టుకొని, పిదప గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ ప్రక్రియ రోజు విడిచి రోజు చేసినా సరిపోతుంది. ముఖానికి: పాలమీగడ, శనగపిండి, నిమ్మరసం, తేనె కలిపిన ముద్దను పూసుకొని, 20 నిమిషాల అనంతరం గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ‘కుమార్యాసవం, శారిబాద్యాసవం’ ద్రావకాలను రెండేసి చెంచాలు ఒక గ్లాసులో కలుపుకొని, సమానంగా నీళ్ల్లు కలిపి, రెండుపూటలా తాగాలి. నా వయసు 73. మలబద్దకానికి ‘త్రిఫలాచూర్ణం’ వాడవచ్చా? - సిద్ధప్ప, అనంతపురం ‘కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ’... ఈమూడింటిని విడివిడిగా చూర్ణం చేసి సమానంగా కలుపుకుంటే త్రిఫలాచూర్ణం తయారవుతుంది. దీంతో కషాయం కాచుకుని రాత్రి పడుకునేప్పుడు 30 మి.లీ. తాగండి. రోజువారీ విరేచనం సాఫీగా అవుతుంది. ఈ ఔషధం గుండెకు, కంటికి, రక్తనాళాలకు, కాలేయానికి, మెదడుకు బలం కలిగించే చక్కటి రసాయనంగా ఆయుర్వేదం వర్ణించింది. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్ -
ఆపరేషనే అంతిమ నిర్ణయం కాదు...
ఇవాల్టి రోజుల్లో ప్రతి చిన్న వ్యాధికి ఆపరేషన్ చేయించుకోవలసి వస్తోంది. ఉదాహరణకు మొలలు, సైనస్, ముక్కులో కండరం పెరగడం వంటి వాటికి ఆపరేషన్ చేయించుకుంటున్నారు. అయినా ఏం లాభం...రెండు నుంచి మూడు నెలలలోపు మరల అదే వ్యాధి వస్తూంటుంది. కాని హోమియోపతిలో అయితే, రోగి శారీరక, మానసిక స్థితులను బట్టి మందులు ఇచ్చి, ఆ వ్యాధిని సమూలంగా తొలగించడం ద్వారా మరల మరల రాకుండా చూడవచ్చు. ఫైల్స్, ఫిస్టుల్యా, పిష్షర్స్ మలవిసర్జన కష్టతరమైనా, మామూలుగా కాక తక్కువసార్లు మల విసర్జన జరుగుతున్నా దానిని ‘మలబద్దకం’గా పరిగణించాలి. ఈ విధంగా ఉన్నప్పుడు, మలవిసర్జన ప్రక్రియ కష్టతరంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మలవిసర్జన చేసినప్పుడు, ఎక్కువ ముక్కినప్పుడు, అన్నవాహిక చివరి భాగంలో, మలద్వారానికి పైన పురీషనాళం చివర వాచిపోయిన రక్తనాళాలను ‘మొలలు’ (హెమరాయిడ్స్) అంటారు. ముఖ్యంగా గర్భం ధరించిన సమయంలో మొలలు తొలిసారిగా కన్పించవచ్చు. వ్యాధి లక్షణాలు: మలద్వారం చుట్టూ దురద మలవిసర్జన సమయంలో నొప్పి మలద్వారం చుట్టూ వాచిపోవడం, ఉబ్బుగా కనిపించడం మల విసర్జన సమయం లో లేదా మల విసర్జన అనంతరం రక్తస్రావం మలాశయం నుంచి పూర్తిగా మలవిసర్జన జరగలేదేమోనన్న భావన కలగడం. పాజిటివ్ హోమియోపతి మందులు మలబద్దకాన్ని చాలావరకు నివారిస్తాయి. మందులతో పాటు ఆహారపు అలవాట్లను కూడా పూర్తిగా అనుసరిస్తే, మలబద్దకం, దాని నుంచి వచ్చే తీవ్రతలను పూర్తి స్థాయిలో అరికట్టవచ్చు. PCOD ఈ సమస్య యుక్తవయస్సులో ఉండే ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. PCOD అనగా అండాశయాలలో నీటి బుడగలు ఏర్పడి అవి ఈస్ట్ లాగా డెవలప్ అవుతాయి. దీనివల్ల నెలసరి రాకపోవడం, అండం విడుదల జరుగకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య ఎక్కువగా 20-30 సం. వయస్సుగల వారిలో కనిపిస్తుంది. వ్యాధి లక్షణాలు: నెలసరి రాకపోవడం బరువు పెరగడం సంతానం కలగకపోవడం అవాంఛిత రోమాలు ఆమినోరియా జుట్టు రాలడం చర్మం మందంగా మారడం కారణాలు: ఇది ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత వలన మానసిక ఒత్తిడి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. ఆడవారిలో ముఖ్యంగా నెలసరి, అండం విడుదల జరగాలంటే FSH, LH హార్లోన్లు ముఖ్యపాత్ర వహిస్తాయి. FSH హార్మోన్ కన్నా LH హార్లోన్ ఎక్కువగా ఉన్నప్పుడు నీటిబుడగలు ఏర్పడి అవి కణితిలా మారి అండం విడుదల కాదు. నెలసరి అసలు రాకపోవచ్చు. మానసిక ఒత్తిడి అంటే ఎక్కువగా ఆలోచించి ఎక్కువ బాధపడడం వంటి కారణాలు మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. అప్పుడు PCOD ఉన్నవారిలో తొందరగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టాన్సిల్స్ మన చుట్టూ ఉన్న వాతావరణంలో సహజంగా ఉండే వ్యాధికారక సూక్ష్మక్రిములు శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినా, మనం తీసుకునే నీటిద్వారా కాని, ఆహారం ద్వారా కాని ఇవి లోపల చేరి ఇన్ఫెక్షన్స్ని కలుగచేసి కొన్నిరకాల విషపదార్థాలతో చీముని కలుగుజేస్తాయి. అందువల్ల టాన్సిల్స్ వ్యాధి వస్తుంది. టాన్సిల్స్ అనేవి గొంతులో నాలుక వెనుక భాగానికి సమీపంగా రెండువైపులా ఉండే చిన్న బంతుల వంటి నిర్మాణాలు. ఆరోగ్యవంతమైన టాన్సిల్స్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. వ్యాధి లక్షణాలు: గొంతునొప్పి దగ్గు ఆహారం మింగినప్పుడు గొంతులో నొప్పి లేక కష్టంగా ఉండడం మెడ భాగంలో బిళ్ళలు కట్టడం తరచూ జ్వరం రావడం తోటిపిల్లలతో పోలిస్తే నీరసంగా కనిపించడం పెరుగుదల లోపించుట. టాన్సిల్స్ వ్యాధి ఉన్నప్పుడు సరైన వైద్యం చేయకుండా చాలాకాలం నిర్లక్ష్యం చేసినట్లయితే టాన్సిల్స్ లోపల, చుట్టుపక్కల, గొంతులోని ఇతరభాగాలకు చీము చేరుతుంది. మధ్యచెవికి, ముక్కు దగ్గర ఉండే గాలి గదుల్లోకి చేరితే సైనసైటిస్, ఊపిరితిత్తుల్లోకి చేరితే శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి. సైనసైటిస్ సైనస్లో ఇన్ఫెక్షన్ చేరి అక్కడ కఫం, చీము తయారై నిలువ ఉన్నప్పుడు దానిని సైనసైటిస్ అంటారు. ఇది నాసల్ ఎలర్జీ, పాలిప్స్ వంటి వాటివల్ల అధికంగా మ్యూకస్ స్రవించడం వల్ల లేదా రంధ్రం మూసుకుపోవడం వల్ల, లేదా పిప్పిపన్ను ఇన్ఫెక్షన్, సైనస్‌లోకి చేరినా వస్తుంది. టాన్సిల్స్ వ్యాధి, ఎడినాయిడ్స్ వ్యాధి, ముక్కులోపల ఉండే గోడ పక్కకు వంగిన సైనసైటిస్ వస్తుంది. వ్యాధి లక్షణాలు తరచుగా జలుబు ఉండడం ముక్కు ద్వారా గాలి పీల్చుకోవడం కష్టంగా ఉండడం ముక్కు, గొంతులోకి కఫం, చీముతో కూడిన కఫం రావడం కొందరికి చెడువాసన వస్తుంది తలనొప్పి నుదుట భాగంలో, కళ్లకింద, కనుబొమ్మల మధ్య, తలకు ఇరుపక్కల, తల వెనుక భాగంలో వస్తుంది. సైనస్ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ సైనస్ నుండి ఇతర భాగాలకు వ్యాపించి, గొంతు, శ్వాసనాళాలకు వచ్చి, ఫారింజైటిన్, టాన్సిలైటిన్, బ్రాంకైటిస్ మొదలైన వ్యాధులు రావచ్చు. ఈ వ్యాధిని సరైన సమయంలో గుర్తించిన ఎడల ఎటువంటి ఆపరేషన్ లేకుండా పాజిటివ్ హోమియోపతి మందుల ద్వారా చాలా వరకు నివారించే అవకాశం ఉంది. పొట్ట ఉబ్బరం, తేన్పులు, ఎసిడిటీ, అరుగుదల లేకపోవడం, ఉదర భాగం కుడివైపు నొప్పి పొట్ట ఉబ్బరంగా ఉండడం ముఖ్యంగా కొవ్వు పదార్థాలు ఆహారంలో తీసుకున్నప్పుడు ఇది పిత్తాశయంలో రాళ్ళ వల్ల అని భావించవచ్చు. గాల్స్టోన్కు చికిత్స తీసుకోని యెడల అది చాలా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు. పాజిటివ్ హోమియోపతి మందులు వాడుట వలన వేగవంతమైన, మంచి ఫలితాలు సాధించవచ్చును. వ్యాధి లక్షణాలు: కొంతమందిలో గాల్‌స్టోన్ వలన వికారంగా అనిపించడం, కుడి ఉదర భాగంలో తీవ్రంగా నొప్పి అన్పించడం వంటి లక్షణాలు కన్పించడం జరుగుతుంది ఇటువంటి లక్షణాలు స్టోన్స్ పిత్తాశయం నుంచి జారి పేగులకు కలిసే మార్గంలో అడ్డుపడినప్పుడు కన్పిస్తాయి నొప్పి ఆకస్మికంగా మొదలై 3గంటల వరకు ఉండవచ్చును. నొప్పితో పాటు జ్వరం, అరుగుదల లేకపోవడం, చర్మం, కన్ను యొక్క తెలుపుభాగం పసుపురంగులో మారడం జరుగుతుంది. డయాబెటిస్, అతిబరువు, తక్కువ కెలోరీల ఆహారం, రక్తంలో కొలస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండడం. ప్రెగ్నెన్సీ, గర్భనిరోధక మాత్రలు, ఓల్డేజ్... కొద్దిమందిలో వంశపారంపర్యంగా కూడా రావచ్చును. పాజిటివ్ హోమియోపతి వైద్యవిధానంలో ఇటువంటి వ్యాధులు ముఖ్యంగా ముక్కులో కండరం పెరగటం, సైనస్, ముక్కులో కాయలు రావడం వంటి ఇతర కాంప్లికేషన్స్‌కు దారి తీయకుండా చూస్తాయి. వ్యక్తి శరీర తత్వాన్ని బట్టి వ్యాధులు మారుతూ వస్తాయి. ఈ తత్వాన్ని బట్టి మందులు తీసుకుంటే, ఎటువంటి ఆపరేషన్ అవసరం లేకుండా వ్యాధిని సమూలంగా నయం చేయవచ్చు. డా॥టి. కిరణ్‌కుమార్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై అపాయింట్మెంట్ కొరకు 9246199922 -
బ్రాంకైటిస్ ఆస్తమాకు కారణం కావచ్చు
ఒక్క క్షణం శ్వాస తీసకోవడంలో ఇబ్బంది ఏర్పడితే విలవిల్లాడిపోతాం. కానీ చాలామంది పొగతాగే అలవాటుతో శ్వాససంబంధ సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్న శ్వాసకోశ వ్యాధులకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. పొగతాగే అలవాటు ఉన్నవారిలో ఊపిరితిత్తులు మరింత త్వరగా క్షీణిస్తాయి. సాధారణంగా పొగతాగే వారిలో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు అనేకం వస్తుంటా యి. పొగతాగే వారు వదిలే పొగలో సుమారు 43 రకాల క్యాన్సర్ పదార్థాలు, 30 రకాల లోహాలు, 4500 రకాల పదార్థాలు ఉంటాయి. వీటివలన శ్వాసనాళాలు కుచించుకుపోయి దీర్ఘకాలం పాటు దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. ఈ సమస్యను క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) అంటారు. లక్షణాలు: ఈ సమస్యతో బాధపడేవారికి కనిపించే ప్రధాన లక్షణం దగ్గు. దగ్గుతో పాటు శ్లేష్మం వస్తుంటుంది. పగటివేళ దగ్గు ఎక్కువగా ఉంటుంది. శ్వాసనాళాల్లో అడ్డు అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. పొగతాగే వారిలో వయసు పైబడిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య ఎక్కువైనపుడు రాత్రుళ్ళు నిద్రపట్టదు. 40 ఏళ్ళు పైబడిన వారిలో ఇది కొంత ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నపిల్లల్లో కనిపించదు. తీవ్రమైన దశ: దగ్గు, కళ్లె పడటం ఎక్కువగా ఉంటుంది. పగలైనా, రాత్రివేళయినా శ్వాసించడం కష్టమవుతుంది. మెట్లు ఎక్కడం, చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి వస్తారు. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ల వల్ల కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. బరువు తగ్గిపోతారు. క్రానిక్ బ్రాంకైటిస్: ఒక ఏడాదిలో కనీసం మూడు నెలల చొప్పున వరుసగా రెండేళ్ళపాటు కళ్లెతో కూడిన దగ్గు ఉంటే దానిని క్రానిక్ బ్రాంకైటిస్‌గా అనుమానించాలి. దీనిలో కూడా శ్వాసనాళం ఇన్ఫెక్షన్ల వల్ల అవి దళసరిగా మారతాయి. ఫలితంగా గాలిని పీల్చుకోవడంలో, బయటకు విడవడంలో ఇబ్బందులు వస్తాయి. వాయునాళ పొరల్లో ఉండే గ్రంథులు కఫం (మ్యూకస్) అనే జిగురు స్రావాన్ని తయారుచేస్తాయి. ఇది గాలిలోని దుమ్ముకణాలను వడగొట్ట్టడానికి, హాని కలిగించే పదార్థాల తీవ్రతను తగ్గించడానికి, శ్వాసనాళాల్లో తగినంత తడి ఉండేలా చూడటానికి ఉపకరిస్తుంది. క్రానిక్ బ్రాంకైటిస్‌తో బాధపడే వారిలో ఆ గ్రంథులు పెద్దగా అవుతాయి. దానివలన కఫం అక్కడే ఎక్కువగా తయారయి ఊపిరితిత్తులలోకి చేరి తిష్ట వేస్తుంది. దీంతో తెరలు తెరలుగా దగ్గు వస్తూ ఉంటుంది. ఇది ఏళ్లతరబడి ఉండిపోయినప్పుడు రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. జాగ్రత్తలు: ఇంటి వాతావరణం శుభ్రంగా ఉంచుకోవాలి. పొగ, వాహనకాలుష్యం, దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి. శ్వాస సంబంధిత వ్యాయామాలు చేస్తుండాలి. నిత్యం వాకింగ్ చేయడంతో పాటు నిపుణుల పర్యవేక్షణలో కండర పటిష్టతను పెంచే వ్యాయామాలు చేస్తుండాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రొటీన్ ఎక్కువగా లభించే ఆహారపదార్థాలను తినాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. హోమియో చికిత్స: శ్వాస సంబంధ సమస్యలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఆర్సనిక్ ఆల్బం, ఆంటినమ్, ఇపికాక్ ఆంటినమ్ క్రూడ్ వంటి మందులు ఈ వ్యాధిని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. అయితే రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిశీలించాక చికిత్స అందించాల్సి ఉంటుంది. హోమియో మందులు సీఓపీడీ, క్రానిక్ బ్రాంకైటిస్ నుంచి చాలావరకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. పైగా హోమియో మందుల వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే శ్వాస సంబంధ వ్యాధులు ఇట్టే తగ్గిపోతాయి. హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై అపాయింట్మెంట్ కొరకు 9246199922 -
బ్రాంకైటిస్...
ఈ సీజన్లో శ్వాస సరిగా అందకపోవడంతో దమ్ము, ఆయాసంతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ప్రస్తుతం నెలకొన్నట్లుగా ముసురు, చినుకులతో ఉన్న వాతావరణం ఉంటే చాలు కొందరిలో ఆ ప్రభావం వెంటనే కనిపిస్తుంటుంది. అంటే వాతావరణంలో మార్పు లేదా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వంటి మార్పులతో కొందరికి ఊపిరి సక్రమంగా అందదు. ఊపిరితిత్తుల్లోని శ్వాసకోశవాహికల్లోని లోపలి పొరలో సంభవించే ఇన్ఫ్లమేషన్ (వాపు) వల్ల శ్వాసకోశనాళాలు సన్నబడతాయి. దాంతో ఊపిరితీసుకోడానికి ఇబ్బంది కలుగుతుంది. ఈ కండిషన్‌నే వైద్యపరిభాషలో ‘బ్రాంకైటిస్’ అంటారు. కారణాలు చల్లటి వాతావరణం సరిపడకపోవడం జలుబు ఫ్లూ జ్వరం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నిమోనియా దుమ్మూ, ధూళి, పొగ, రసాయనాలు, సిగరెట్ పొగ వల్ల శ్వాసకోశనాళాలు సన్నబడటం పొగతాగేవారు ఉన్న కుటుంబాల్లోని చిన్నపిల్లల్లో శ్వాసకోశనాళాలు పొగ పెంపుడుజంతువుల వెంట్రుకలు గాలీ వెలుతురు సరిగా సోకని గదుల వంటి అనేక కారణాలు బ్రాంకైటిస్‌కు దోహదపడతాయి. లక్షణాలు శ్వాసనాళాలు బిగదీసుకుని పోయినట్లుగా ఉండి ఊపిరి సరిగా అందకపోవడం జ్వరం చలి కండరాలనొప్పులు ముక్కుదిబ్బడ ముక్కుకారడం గొంతునొప్పి తలనొప్పి కొన్ని సందర్భాల్లో ఒకటి నుంచి రెండు వారాల పాటు దగ్గు ఛాతీలో నొప్పి ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం పిల్లికూతలు ఆయాసం ఎక్కువదూరం నడవలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలం కనిపించే అవకాశాలు శ్వాసకోశ నాళాల్లో కలిగే మార్పుల వల్ల ఆయాసం, దగ్గు, కఫం, జ్వరం, నీరసం వంటి మాటిమాటికీ కనిపిస్తూ ఒక్కోసారి అది దీర్ఘకాలం కనిపించే వ్యాధిగా మారుతుంది. దీన్నే ‘క్రానిక్ బ్రాంకైటిస్’ అని అంటారు. దీనితో రోగనిరోధకశక్తి తగ్గడం, ఆస్తమాలోకి దింపడం వంటి పరిణామాలు కూడా సంభవిస్తాయి. రోగనిర్ధారణ ఛాతీ ఎక్స్-రే కఫం కల్చర్ (స్పుటమ్ కల్చర్) పీఎఫ్‌టీ (స్పైరోమెట్రీ), పూర్తి రక్త పరీక్ష (సీబీపీ), ఈఎస్ఆర్ హోమియోలో వాడదగ్గమందులు ఆంటిమ్ టార్ట్, కార్బోవెజ్, లొబీలియా, కాలీకార్బ్, ఆర్సినికమ్, స్పాంజియా, బ్రయోనియా, ఫాస్ఫరస్, ఇపికాక్ లాంటి మందులను రోగి లక్షణాలను, మానసిక ప్రవృత్తి వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మోతాదును, మందులను నిర్ణయించాల్సి ఉంటుంది. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్