
ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నాం
వాటికన్ వర్గాల వెల్లడి
రోమ్: ‘పోప్ ఫ్రాన్సిస్(88) స్పృహలోనే ఉన్నారు. అయితే, సంక్లిష్టమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కార ణంగా ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది’అని వాటికన్ ఆదివారం తెలిపింది. శనివారం రాత్రి శ్వాసలో ఇబ్బందులు తలెత్తడంతోపాటు, రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోయాయి. పూర్తి స్థాయిలో శ్వాస తీసుకోలేని కారణంగా ప్రారంభించిన ఆక్సిజన్ సరఫరాను ఆదివారం కూడా కొనసా గించారు.
రక్తం ఎక్కించినట్లు వాటి కన్ వర్గాలు వివరించాయి. ‘రాత్రి ప్రశాంతంగా గడి చింది. ఆయన విశ్రాంతి తీసుకున్నారు’అని పేర్కొ న్నాయి. మరికొన్ని వైద్య పరీక్షలను నిర్వహించిన ట్లు వెల్లడించింది. పోప్ బెడ్‌పై నుంచి లేచారా, ఏమైనా ఆహారం తీసుకున్నారా అనే విషయాలను మాత్రం వాటికన్ ప్రస్తావించలేదు. బ్రాంకైటిస్ తీవ్ర రూపం దాల్చడంతో పోప్ ఈ నెల 14వ తేదీన గెమెల్లి ఆస్పత్రిలో చేరడం తెలిసిందే.
వాటికన్‌లో ప్రత్యేక ప్రార్థనలు
ఆదివారం ఉదయం సెయింట్ పీటర్స్ బసిలికాలో పోప్ ఫ్రాన్సిస్ హోలీ ఇయర్ ప్రారంభ వేడుకలను ప్రారంభించాల్సి ఉంది. ఆయన ఆస్పత్రిలో ఉన్న కారణంగా ఆర్చ్ బిషప్ రినో ఫిసిచెల్లా ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోప్ ఫ్రాన్సిస్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమం చేపట్టారు. ‘ఆస్పత్రిలో బెడ్‌పై ఉన్నా పోప్ ఫ్రాన్సిస్ మనకు సన్నిహితంగా మనమధ్యే ఉన్నట్లుగా ఉంది’అని ఫిసిచెల్లా అన్నారు.
ఫ్రాన్సిస్ రాజీనామా చేయబోరు
తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో పోప్ ఫ్రాన్సిస్ పదవికి రాజీనామా చేయనున్నారంటూ వస్తున్న వదంతులను వాటికన్ అధికార వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. పోప్ తన విధులను నిర్వహించలేని సమయంలో ప్రత్యామ్నాయం ఏమిటన్న దానిపై ఎటువంటి స్పష్టత లేదు. ఇలాంటి సందర్భం తలెత్తినప్పుడు ఏం చేయాలన్న దానిపై పోప్ స్పష్టత ఇచ్చినట్లు చెబుతున్నాయి. వైద్యపరమైన అశక్తత ఏర్పడితే రాజీనామా లేఖ రాసి ఉంచినట్లు గతంలోనే పోప్ ఫ్రాన్సిస్ చెప్పిన విషయాన్ని ఆ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఆస్పత్రిలో ఉన్న పోప్ ఫ్రాన్సిస్‌ను వాటికన్ ఉన్నతాధికారులు కొందరు రహస్యంగా కలిసినట్లు వస్తున్న వార్తలను సైతం తోసిపుచ్చాయి. ఫ్రాన్సిస్ ఆరోగ్యం, ఆయన కోలుకోవడం, తిరిగి వాటికన్ రావడంపైనే మాట్లాడుకోవాలే తప్ప, ఇటువంటి అవసరం లేని అంశాలంటూ స్పష్టం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment