రోమ్: కేథలిక్కుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్(86) శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని వాటికన్ వర్గాలు తెలిపాయి. సెంట్ పీటర్స్ స్క్వేర్‌లో బుధవారం సంప్రదాయ వారాంతపు ప్రసంగం అనంతరం అస్వస్థతకు గురైన పోప్‌ను రోమ్‌లోని గెమెల్లి పాలీక్లినిక్‌లో చేర్పించారు. బ్రాంకైటిస్‌తో బాధపడుతున్నట్లు పరీక్షల్లో తేలింది.
యాంటీబయాటిక్ చికిత్సకు స్పందిస్తున్నారని వాటికన్ ప్రతినిధి చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందన్నారు. అయితే, ఆదివారం నుంచి ఈస్టర్ వీక్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారా లేదా అనేది సందిగ్ధంలో పడింది. ఇప్పటికే మోకాలి నొప్పితో బాధపడుతున్న పోప్ కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నారు. కాగా, పోప్ ఫ్రాన్సిస్ త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ శుక్రవారం ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment