సిరియాలో మారణహోమం ఆపండి: పోప్
వాటికన్ సిటీ/జెరూసలేం: సిరియాలో మారణహోమానికి ముగింపు పలకాలని పోప్ ఫ్రాన్సిస్ విజ్ఞప్తి చేశారు. ఈస్టర్ సందర్భంగా ఆదివారం వాటికన్ సిటీలో నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం సెయిం ట్ పీటర్స్ బాసిలికా చర్చి ప్రాంగణంలో గుమిగూడిన భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.
యుద్ధం, కరువు, రాజకీయ అనిశ్చితితో తీవ్ర ఇక్కట్లు పడుతున్న సిరియా ప్రజల కోసం ప్రార్థించారు. అలాగే ఉక్రెయిన్, ఆఫ్రికాలో అంతర్యుద్ధాలు ముగిసిపోవాలని ఆకాంక్షించారు. కాగా, ఈస్టర్ సందర్భంగా జెరూసలేంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏసుక్రీస్తు పునరుత్థానం చెందినట్లు భావించే ప్రాంతంలో నిర్మించిన సపుల్కర్ చర్చిని వేలాది మంది సందర్శించారు.