Vatican City
-
ఆయుధాల గర్జనలు ఆగిపోవాలి
వాటికన్ సిటీ: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవుల అత్యున్నత గురువు పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచ మానవాళికి శాంతి సందేశం ఇచ్చారు. ప్రపంచమంతటా ఘర్షణలు ఆగిపోవాలని, శాంతి సామరస్యం నెలకొనాలని ఆకాంక్షించారు. బుధవారం వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌కు తరలివచి్చన వేలాది మందిని ఉద్దేశించి పోప్ బాసిలికా చర్చి బాల్కనీ నుంచి ప్రసంగించారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు ఆశీస్సులు అందజేశారు. అమాయకుల ఉసురు తీస్తున్న యుద్ధాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయుధాలు నిప్పులు కక్కుతున్న చోట ఇకనైనా కాల్పుల విరమణ పాటించాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ఇప్పటికైనా ముగించాలని ఇరుపక్షాలకు హితవు పలికారు. జరిగిన నష్టం చాలని అన్నారు. సుదీర్ఘ శాంతిని నెలకొల్పే దిశగా చర్చలకు రెండు దేశాలూ చొరవ తీసుకోవాలని సూచించారు. యుద్ధాన్ని ముగించి, సంప్రదింపులకు తలుపులు తెరవాల్సిన సమయం వచి్చందన్నారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల పట్ల పోప్ ఆందోళన వ్యక్తంచేశారు. ఆ ప్రాంతంలో ఆయుధాల గర్జనలు ఆగిపోవాలని, నిశ్శబ్దం తిరిగి రావాలని పేర్కొన్నారు. గాజాలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని చెప్పారు. వారి క్షుద్బాధ తీర్చాలని, మానవతా సాయం విరివిగా అందించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. గాజాలో కాల్పుల విరమణకు సిద్ధం కావాలని హమాస్, ఇజ్రాయెల్‌కు పోప్ సూచించారు. బందీలను విడుదల చేయాలని, తద్వారా శాంతికి బాటలు వేయాలని హమాస్ మిలిటెంట్లకు హితవు పలికారు. లెబనాన్, మయన్మార్, సిరియా, ఆఫ్రికా తదితర దేశాల్లో సంఘర్షణల పట్ల మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ప్రారి్థస్తున్నట్లు తెలిపారు. వాతావరణ మార్పులు, దుష్పరిణామాలపైనా పోప్ మాట్లాడారు. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో వ్యాధుల బారినపడి పెద్దసంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి చికిత్స అందించాలని, సాంత్వన కలిగించాలని మానవతావాదులను కోరారు. -
కార్డినల్‌గా కేరళ బిషప్
తిరువనంతపురం: కేరళకు చెందిన 51 ఏళ్ల మత ప్రబోధకుడు మాన్సిగ్నర్ జార్జ్ జాకబ్ కోవక్కడ్ను కార్డినల్‌గా ప్రకటిస్తూ పోప్ ఫ్రాన్సిస్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 21 మందిని కార్డినల్స్‌గా పోప్ ప్రకటించినట్టు వాటికన్ సిటీ ఆదివారం వెల్లడించింది. రోమ్‌లో క్రిస్మస్ సీజన్ మొదలయ్యే డిసెంబర్ 8న వీరంతా కార్డినల్స్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. జాకబ్ నాలుగేళ్లుగా పోప్ అంతర్జాతీయ పర్యటనల కార్యక్రమాలను చూసుకుంటున్నారు. చంగనచెర్రీ సైరో–మలబార్ ఆర్క్డయాసిస్కు చెందిన జాకబ్ వాటికన్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. పలు దేశాల్లో వాటికన్ ‘దౌత్య’ కార్యాలయాల్లో పనిచేశారు. 1973లో తిరువనంతపురంలో జన్మించిన జాకబ్ 2004 జూలై 24న చర్చి ఫాదర్ అయ్యారు.కొత్తవారిలో 99 ఏళ్ల బిషప్ సైతం..కొత్తగా కార్డినల్స్‌గా ఎన్నికైన 21 మందిలో అత్యంత వృద్దుడు, 99 ఏళ్ల ఏంజిలో అసెర్బీ సైతం ఉన్నారు. ఈయన గతంలో వాటికన్ దౌత్యవేత్తగా పనిచేశారు. గతంలో ఈయనను కొలంబియాలో వామపక్ష గెరిల్లా దళాలు ఆరు వారాలపాటు బంధించాయి. 21 మంది కొత్త కార్డినల్స్లో అత్యంత తక్కువ వయసు వ్యక్తిగా 44 ఏళ్ల బిషప్ మైకోలా బైచోక్ ఉన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉక్రెయిన్ గ్రీకు కేథలిక్ చర్చిలో ఈయన సేవలందిస్తున్నారు. నిబంధనల ప్రకారం 120 మంది మాత్రమే కార్డినల్స్ కాగలరు. కానీ పోప్‌ఫ్రాన్సిస్ ఎక్కువ మందిని ఎంపికచేశారు. దీంతో కొత్తవారితో కలుపుకుని సంఖ్య 142కు పెరిగింది. -
అద్దె గర్భాలను నిషేధించాలి: పోప్
రోమ్: అద్దె గర్భాలతో మాతృత్వం పొందడం అనేది సంప్రదాయబద్ధం కాదని, ఇలాంటి అనైతిక విధానాన్ని ప్రపంచమంతటా నిషేధించాలని పోప్ ఫ్రాన్సిస్ చెప్పారు. ఆధునిక యుగంలో గర్భం, మాతృత్వం కూడా వ్యాపారమయం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. అద్దెగర్భం అనేది మహిళల గౌరవాన్ని కించపర్చడమే అవుతుందని అన్నారు. ఆయన సోమవారం వాటికన్ సిటీలో వివిధ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధం గురించి ప్రస్తావించారు. ప్రపంచంలో శాంతియుత పరిస్థితులు నానాటికీ క్షీణిస్తున్నాయని, శాంతికి, మానవత్వానికి విఘాతం కలుగుతోందని చెప్పారు. ఈ పరిణామం ఎంతమాత్రం క్షేమకరం కాదని అన్నారు. కొన్ని దేశాల్లో సంక్షోభాలు, ఫలితంగా వలసలు పెరిగిపోతుండడం, వాతావరణ మార్పులతో ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతుండడం పట్ల పోప్ ఆందోళన వ్యక్తం చేశారు. అణ్వాయుధాల ఉత్పత్తి పెచ్చరిల్లుతుండ డం భూగోళంపై మానవాళికి మనుగడకు ఎప్పటికైనా ముప్పేనని పేర్కొన్నారు. -
భారతీయులు ఉండని దేశాలు ఏవి? పాక్‌తో పాటు జాబితాలో ఏమున్నాయి?
ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలో భారతీయులు స్థిరపడుతున్నారు. అయితే పాకిస్తాన్లో భారతీయులు స్థిరపడటానికి ఇష్టపడటం లేదు. ఇలా ఒక్క పాకిస్తాన్‌లోనే కాదు యూరప్‌లో కూడా భారతీయులు నివసించని దేశాలు అనేకం ఉన్నాయని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. భారతదేశీయులు నివసించని ప్రపంచంలోని కొన్ని దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల్లో వేలాది మంది భారతీయులు స్థిరపడ్డారు. అయితే కొన్ని దేశాల్లో ఒక్క భారతీయుడు కూడా కనిపించడు. ప్రపంచంలోని దాదాపు 195 దేశాల్లో భారతీయులు నివసిస్తున్నారు. కానీ భారతీయులు నివసించని దేశాలు పాకిస్తాన్‌తో సహా చాలా ఉన్నాయి. వాటికన్ సిటీ యూరోపియన్ దేశం వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. కేవలం 0.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేశం ఉంది. అక్కడ నివసించే ప్రజలు రోమన్ క్యాథలిక్ మతాన్ని అనుసరిస్తారు. ఈ దేశంలో జనాభా కూడా చాలా తక్కువ. ఈ దేశంలో ఒక్క భారతీయుడు కూడా నివసించడం లేదు. అయితే దీనికి భిన్నంగా భారతదేశంలో రోమన్ క్యాథలిక్ మతాన్ని అనుసరించే క్రైస్తవులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. శాన్ మారినో శాన్ మారినో కూడా ఐరోపాలోని ఒక రిపబ్లిక్ దేశం. ఇక్కడ మొత్తం జనాభా 3 లక్షల 35 వేల 620. ఈ దేశ జనాభాలో ఒక్క భారతీయుడు కూడా కనిపించడు. అయితే ఈ దేశంలో భారతీయ టూరిస్టులు కనిపిస్తారు. బల్గేరియా బల్గేరియా ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశం. ఇది ప్రకృతి అందాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. 2019 జనాభా లెక్కల ప్రకారం బల్గేరియా మొత్తం జనాభా 6,951,482. ఇక్కడ నివసించే అధికశాతం జనాభా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తుంది. ఈ దేశంలో భారతీయులు ఎవరూ నివసించరు. అయినా ఇక్కడ భారతీయ దౌత్యవేత్తలు కనిపిస్తారు. తువాలు తువాలు ఓషియానియా ఖండంలోని ఒక ద్వీపంలో ఉన్న దేశం. తువాలును ఎల్లిస్ దీవులు అని కూడా అంటారు. ఇది ఓషియానియాలో ఉంది. ఇది ఆస్ట్రేలియాకు ఈశాన్య పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఈ దేశ జనాభా దాదాపు 10 వేలు. ఈ ద్వీపంలో కేవలం 8 కిలోమీటర్ల పొడవైన రోడ్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ భారతీయులెవరూ నివసించరు. ఈ దేశానికి 1978లో స్వాతంత్ర్యం వచ్చింది. పాకిస్తాన్ భారతీయులు నివసించని దేశాల జాబితాలో మన పొరుగు దేశం పాకిస్తాన్ కూడా ఉంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారతీయులెవరూ ఇక్కడ నివసించడం లేదు. పాకిస్తాన్లో భారత దౌత్యవేత్తలు, ఖైదీలు తప్ప మన దేశానికి చెందినవారెవరూ కనిపించరు. ఇది కూడా చదవండి: వీధి కుక్కలను చంపడం తప్పుకాదని గాంధీ ఎందుకన్నారు? -
అస్వస్థతకు గురైన పోప్.. ఆస్పత్రిలో చేరిక
వాటికన్ సిటీ: పోప్ ఫ్రాన్సిస్ అస్వస్థతో బుధవారం ఆస్పత్రిలో చేరారు. 86 ఏళ్ల పోప్ శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు, ఆయన్ని రోమ్‌లోని(ఇటలీ) జెమెల్లీ ఆస్పత్రిలో చేరినట్లు వాటికన్ సిటీ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. మరికొన్ని రోజులు ఆయన ఆస్పత్రిలోనే ఉంటారని తెలుస్తోంది. అయితే శ్వాస కోశ సంబంధిత సమస్యలే అయినప్పటికీ.. ఆయన కోవిడ్ సోకలేదని స్పష్టం చేసింది ఆ ప్రకటన. ఆయన అనారోగ్యంపై వార్తలు బయటకు రాగానే.. త్వరగా కోలుకోవాలంటూ సందేశాలు పంపుతున్నారు పలువురు. గత కొంతకాలంగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఏడాదికాలంగా పలు ముఖ్యకార్యక్రమాలకు ఆయన గైర్హాజరు అవుతున్నారు. ఇదీ చదవండి: ప్రజల ఇష్టానుసారమే నిర్ణయం తీసుకుంటాం! -
రిటైర్డ్ పోప్ బెనెడిక్ట్-16 కన్నుమూత
వాటికన్ సిటీ: పోప్ బాధ్యతల నుంచి కొన్నేళ్ల క్రితం తప్పుకున్న బెనెడిక్ట్-16 కన్నుమూశారు. 95 ఏళ్ల బెనెడిక్ట్ అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచినట్లు వాటికన్ అధికారులు ప్రకటించారు. ‘పోప్ ఎమెరిటస్, బెనెడిక్ట్ 16 ఈ రోజు వాటికన్లోని మేటర్ ఎక్లేసియా మొనాస్టరీలో ఉదయం 9:34 గంటలకు కన్నుమూశారని బాధతో మీకు తెలియజేస్తున్నాను’అని ఓ ప్రకటన విడుదల చేశారు వాటికన్ ప్రతినిధి మాటియో బ్రూనీ. 2013లో పోప్ బాధ్యతల నుంచి తప్పుకుని అందరినీ ఆశ్యర్చానికి గురిచేశారు బెనెడిక్ట్16. అప్పటి నుంచి వాటికన్ గ్రౌండ్స్‌లోని కాన్వెంట్లో నివసిస్తున్నారు. ఆయన అసలు పేరు జోసెఫ్ రాట్జింగర్. మాజీ పోప్‌లకు రూల్‌బుక్ లేనప్పటికీ, బెనెడిక్ట్ అంత్యక్రియలు ఫ్రాన్సిస్ అధ్యక్షతన వాటికన్లో జరగాలని భావిస్తున్నారు. ఇదీ చదవండి: పంజా విసురుతోన్న కోవిడ్ ‘సూపర్ వేరియంట్’.. అంత ప్రమాదకరమా? -
రిటైర్డ్ పోప్ బెనెడిక్ట్16 ఆరోగ్యం విషమం
వాటికన్ సిటీ: పోప్ బాధ్యతల నుంచి కొన్నేళ్ల క్రితం తప్పుకున్న బెనెడిక్ట్–16 ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని వాటికన్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని పేర్కొన్నాయి. 95 ఏళ్ల బెనెడిక్ట్ చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వార్థక్యం వల్ల పలు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయని వాటికన్ అధికార ప్రతినిధి మాటియో బ్రూనీ తెలియజేశారు. బెనెడిక్ట్ కోలుకోవాలంటూ అందరూ ప్రార్థించాలని పోప్ ఫాన్సిస్ విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. వాటికన్ ఆడిటోరియంలో బుధవారం పోప్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. బెనెడిక్ట్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారని ప్రకటించారు. పూర్తి వివరాలు మాత్రం బహిర్గతం చేయలేదు. చదవండి: ‘బాంబ్’ కోరల నుంచి బయటపడని అమెరికా.. కనీవినీ ఎరగని విధ్వసం -
ఉక్రెయిన్ ఎంబసీలకు ‘జంతువుల కళ్ల’ పార్శిళ్లు
కీవ్: వివిధ దేశాల్లోని తమ రాయబార కార్యాలయాలకు లెటర్ బాంబులు, ఉత్తుత్తి లెటర్ బాంబులు, ఆవు, పంది కళ్లతో కూడిన పార్శిళ్లు అందినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోని ఉక్రెయిన్ ఎంబసీకి శుక్రవారం జంతువుల కళ్లతో కూడిన పార్శిల్ అందింది. ప్రత్యేకమైన రంగు, వాసనతో కూడిన ద్రవంలో ముంచిన ఇటువంటి ప్యాకేజీలు హంగరీ, నెదర్లాండ్స్, పోలండ్, క్రొయేషియా, ఇటలీ తదితర ప్రాంతాల్లోని 17 ఎంబసీలకు అందాయని ఉక్రెయిన్ పేర్కొంది. అదేవిధంగా, వాటికన్ సిటీలోని ఉక్రెయిన్ రాయబారి నివాసంపై దాడి జరిగింది. కజకిస్తాన్ ఎంబసీకి బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో ఎంబసీలు, కాన్సులేట్ల వద్ద భద్రత మరింత పెంచాలని ఉక్రెయిన్ ఆదేశించింది. గత వారం స్పెయిన్ ప్రధాని సాంచెజ్‌తోపాటు మాడ్రిడ్‌లోని ఉక్రెయిన్, అమెరికా దౌత్య కార్యాలయాలకు లెటర్ బాంబులు అందాయి. -
కార్డినల్‌గా తొలి దళితుడు.. పూల ఆంథోనీ
సాక్షి, హైదరాబాద్: ఆర్చిబిషప్ పూల ఆంథోనీ(60) క్యాథలిక్ కార్డినల్‌గా ప్రకటించబడ్డ విషయం తెలిసిందే. కేథలిక్కుల మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్.. వాటికన్ సిటీ(ఇటలీ) సెయింట్ పీటర్స్ బాసిలికాలో ఇవాళ పూల ఆంథోనీని కార్డినల్‌గా అధికారికంగా ప్రకటించనున్నారు. ఏపీ కర్నూల్‌కు చెందిన పూల ఆంథోనీ.. కార్డినల్ హోదా అందుకోబోయే తొలి దళితుడు కూడా. ఇవాళ(ఆగస్టు 27న) జరగబోయే కొత్త కార్డినల్స్ పరిషత్ సమావేశానికి కూడా పూల ఆంథోనీ హాజరుకానున్నారు. ఇక కేథలిక్ చర్చి చరిత్రలో ఈ హోదా పొందిన తొలి తెలుగు వ్యక్తి పూల ఆంథోనీ. కార్డినల్ హోదాలో.. పోప్ ఎన్నికలో పాల్గొనే అవకాశం పూల ఆంథోనీకి ఉంటుంది. ఆంథోనీతో పాటు భారత్ నుంచి గోవా, డామన్ ఆర్చి బిషప్ ఫిలిపె నెరి అంటోనియో సెబాస్టియో డొ రొసారియో ఫెర్రో కూడా కార్డినల్ ర్యాంక్ పొందిన వాళ్లలో ఉన్నారు. నేపథ్యం.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చిందుకూరు గ్రామంలో జన్మించిన ఆంథోనీ.. 1992లో మొదటిసారిగా కడపలో క్రైస్తవ మతాచార్యుడుగా, 2008లో కర్నూలు బిషప్‌గా నియమితులయ్యారు. 2021 జనవరిలో హైదరాబాద్ ఆర్చిబిషప్ అయ్యారు. కార్డినల్‌గా నియమితులైన ఆంథోనీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర ప్రాంతాలతో కూడిన హైదరాబాద్ ఆర్చిబిషప్ హోదాలోనూ కొనసాగుతున్నారు. ఇదీ చదవండి: 500 ఏళ్ల కళా చరిత్రలో అతి పెద్ద వేలం -
కార్డినల్‌గా పూల ఆంథోనీ
హైదరాబాద్: ఆర్చిబిషప్ పూల ఆంథోనీ(60) భారత్‌లో కార్డినల్‌గా నియమితులయ్యారు. కేథలిక్కుల మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో ఆదివారం 21 మందిని కొత్త కార్డినల్స్‌గా ప్రకటించారు. వీరిలో భారత్ నుంచి ఆంథోనీతోపాటు గోవా, డామన్ ఆర్చి బిషప్ ఫిలిపె నెరి అంటోనియో సెబాస్టియో డొ రొసారియో ఫెర్రో ఉన్నారు. కేథలిక్ చర్చి చరిత్రలో ఈ హోదా పొందిన తొలి తెలుగు వ్యక్తి పూల ఆంథోనీ. కార్డినల్ హోదాలో పోప్ ఎన్నికలో పాల్గొనే అవకాశం ఈయనకు ఉంటుంది. ఆగస్ట్ 27వ తేదీన జరిగే సమావేశం నాటికి కార్డినల్స్ సంఖ్య 229కు పెరగనుంది. అందులో 131 మందికి పోప్ ఎన్నికలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చిందుకూరు గ్రామంలో జన్మించిన ఆంథోనీ 1992లో మొదటిసారిగా మతాచార్యుడుగా, 2008లో కర్నూలు బిషప్‌గా నియమితులయ్యారు. 2021 జనవరిలో హైదరాబాద్ ఆర్చిబిషప్ అయ్యారు. ఆగస్ట్ 27న వాటికన్లో కొత్త కార్డినల్స్ పరిషత్ సమావేశానికి పూల ఆంథోనీ హాజరుకానున్నారు. కార్డినల్‌గా నియమితులైన ఆంథోనీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర ప్రాంతాలతో కూడిన హైదరాబాద్ ఆర్చిబిషప్ హోదాలోనూ కొనసాగనున్నారు. -
సామాన్యునికి సెయింట్‌హుడ్
వాటికన్ సిటీ: మూడు శతాబ్దాల క్రితం క్రైస్తవాన్ని స్వీకరించి, చిత్రహింసలకు గురైన తమిళనాడుకు చెందిన సాధారణ పౌరుడు దేవసహాయం పిళ్లైకి సెయింట్‌హుడ్ (మహిమాన్విత హోదా) లభించింది. వాటికన్ నగరంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ ఆయనకు మహిమాన్విత హోదా ప్రకటించారు. భారత్‌కు చెందిన ఒక సాధారణ పౌరుడికి కేథలిక్కు మతంలో అత్యున్నత గౌరవం దక్కడం ఇదే మొదటిసాది. దేవసహాయంతో పాటు పలు దేశాలకు చెందిన మరో తొమ్మిది మందికి సెయింట్ హోదా ఇచ్చారు. వారిలో నలుగురు మహిళలున్నారు. 1712 ఏప్రిల్ 23న కేరళలోని ట్రావెంకోర్ రాజ్యంలో హిందూ నాయర్ కుటుంబంలో దేవసహాయం జన్మించారు. ట్రావెంకోర్ రాజు మార్తాండ వర్మ సంస్థానంలో అధికారిగా పని చేశారు. క్రైస్తవం పట్ల ఆకర్షితుడై ఆ మతాన్ని స్వీకరించి ప్రబోధాలు చేయసాగారు. కోపోద్రిక్తుడైన రాజు దేవసహాయాన్ని ఊరూరా తిప్పుతూ చిత్రహింసలు పెట్టారు. అయినా ప్రజల సమానత్వంపైనే ప్రసంగాలు చేయడంతో 1752 జనవరి 14న కన్యాకుమారిలో కాల్చిచంపారు. దేవసహాయాన్ని చిత్రహింసలకు గురి చేసిన అన్ని ప్రాంతాల్లోనూ అద్భుతమైన మహిమలు జరిగాయని భారత్‌కు చెందిన కేథలిక్ బిషప్స్ సమాఖ్య పోప్ ఫ్రాన్సిస్ దృష్టికి తీసుకెళ్లింది. ఆ మహిమలను 2014లో పోప్ గుర్తించినట్టు వెల్లడించారు. -
స్త్రీని బాధపెట్టడం అంటే దేవుడిని అవమానించడమే
To Hurt A Woman Is To Insult God": Pope Francis In New Year's Speech: పోప్ ఫ్రాన్సిస్ నూతన సంవత్సర ప్రసంగంలో మహిళలపై హింసను అరికట్టాలని పిలుపునిచ్చారు. స్త్రీని అవమానించడం అంటే దేవుడిని అవమానించడమేనని అన్నారు. అంతేకాదు సెయింట్ పీటర్స్ బసిలికాలోని రోమన్ క్యాథలిక్ చర్చిలో పవిత్ర మేరీ మాత సమక్షంలో నూతన సంవత్సర వేడుకల తోపాటు ప్రపంచ శాంతి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు (చదవండి: ఐదేళ్ల జైలు శిక్ష తర్వాత మాజీ అధ్యక్షురాలికి క్షమాభిక్ష) పైగా ఫ్రాన్సిస్ నూతన సంవత్సర వేడుకల్లో మహిళలు మనకు జీవితాన్ని ప్రసాదించడమే కాక ప్రపంచాన్ని ఐక్యమత్యంగా ఉంచుతారు కాబట్టి మనమందరం మహిళలను రక్షించడానికే ఎక్కువ ప్రయత్నాలు చేద్దాం అని పిలుపునిచ్చారు. అంతేకాదు మానవత్వానిక ప్రతీక అయిన స్త్రీని అవమానించటం అంటే దేవుడిని అవమానించడమే అని స్పష్టం చేశారు. పైగా కోవిడ్ లాక్డౌన్ సమయాల్లో గృహహింస గురించి ఫ్రాన్సిస్ చాలాసార్లు మాట్లాడారు. అంతేకాక రాబోయే సంవత్సరంలో వాటికన్లో తనను అధికారికంగా సందర్శించే నాయకులకు పోప్ సంతకం చేసిన కాపీని అందజేస్తారు. (చదవండి: రోగితో నర్సు చాటింగ్.. రూ. 20 లక్షలు ఇవ్వమంటూ బ్లాక్మెయిల్!) -
వాట్ ఏ ఎక్స్ప్రెషన్స్...ఎవ్వరికైనా నవ్వు రావల్సిందే....
న్యూయార్క్: కొంత మంది తమ హావాభావాలతో భలే నవ్విస్తారు. అంతేకాదు కొంత మంది జోక్ చెప్పుతున్న తీరుని చూస్తేనే నవ్వుస్తుంది. నిజానికి వారు చెప్పే జోక్ కన్నా వారి ఫెషియల్ ఎక్స్ప్రెషన్న్ని బట్టే నవ్వు వచ్చేస్తోంది. అయితే ముఖకవళికలే ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని ప్రతిబింబిస్తాయి. (చదవండి: సింహం సైలంట్‌గా ఉందని వేళాకోళం చేశావో..) అంతేకాదు ఈ ముఖకవళికలే మనం అవతలి వ్యక్తితో చొరవగా ఉండేందుకు కూడా ఉపకరిస్తాయి. ఏంటిది అనుకోకండి. ఇక్కడ ఒక అనువాదకురాలు ఇద్దరు ప్రముఖ వ్యక్తుల సమావేశంలో ఆమె చూపించిన హావాభావాలకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలెవరామె ఎక్కడ జరిగింది అనేకదా... వివరాల్లోకెళ్లితే...వాటికన్ అనువాదకురాలు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన మావేశంలోను తాజగా అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిగిన సమావేశాలను పోలుస్తూ ఒక వీడియు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ వీడియోలో రెండు సమావేశాల్లోనూ వాటికన్ అనువాదకురాలి ముఖకవళికలు నెటిజన్లుకు నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి. అంతేకాదు స్కాట్లాండ్లో జరిగనున్న కాప్26 శిఖరాగ్ర సమావేశం కోసం యూరోపియన్ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షడు జో బైడెన్ రోమ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ పర్యటనలో భాగంగా వాటికన్ పర్యటించినప్పుడు జో బైడెన్ వాటికన్ అనువాదకురాలు సమక్షంలో పోప్‌ని కలిసినప్పుడు ఆమె తెగ నవ్వుతూ ఉన్నారు. ఈ క్రమంలో గతంలో డోనాల్డ్ ట్రంప్ వాటికన్ పర్యటనలో ఇదే వాటికన్ అనువాదకురాలు సమక్షంలో పోప్‌ని కలిసినప్పుడు ఆమె సీరియస్‌గా ఉంటుంది. దీంతో ఈ రెండూ సమావేశాల్లోను ఆమె హావాభావాలను పోలుస్తూ ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు వాటికన్ అనువాదకురాలి ఎక్స్‌ప్రెషన్స్‌ని చూసి తెగ నవ్వుతూ రకరకాలుగా ట్వీట్ చేశారు. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో ఉన్న వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జెన్నిఫర్ పాల్మీరీ ఈ పోలికను "అద్భుతం" అని పోస్ట్ చేశారు. Italian translator: Trump vs. Biden pic.twitter.com/bpQnSB4uNP — The Recount (@therecount) October 29, 2021 (చదవండి: ఇదేం ట్రెండ్రా నాయనా... డస్ట్‌బిన్ కవరే డ్రెస్సు.!) -
పోప్ ఫ్రాన్సిస్‌ను భారత్ ఆహ్వానించిన మోదీ
ఢిల్లీ: ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లపై ప్రపంచ దేశాల అధినేలతో చర్చిస్తున్నారు. ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘీ ఆహ్వానం మేరకు రోమ్ వెళ్లిన నరేంద్ర మోదీ శనివారం పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశం అయ్యారు. ఫ్రాన్సిస్ పోప్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనను కలిసిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. వాటికన్ సిటీలో ప్రధాని నరేంద్ర మోదీ, పోప్ ఫ్రాన్సిస్ మధ్య గంట పాటు సమావేశం కొనసాగింది. (చదవండి: మహాత్ముని తర్వాత మోదీయే: రాజ్‌నాథ్) షెడ్యూల్ ప్రకారం 20 నిమిషాలు కొనసాగాల్సినప్పటికీ, గంట పాటు కొనసాగిన మీటింగ్‌లో పేదరిక నిర్మూలన సహా అనేక విస్తృత అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ధరిత్రి పరిరక్షణ చర్యలపై చర్చించారు. భారత్ పర్యటనకు రావాలని పోప్ ఫ్రాన్సిస్‌కు ఆహ్వానం పలికారు మోదీ. నవంబర్ 1 నుంచి 2 వరకూ గ్లాస్గోలో పర్యటించనున్నారు మోదీ. గ్లాస్గోలో రెండు రోజులపాటు జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ(కాప్) సదస్సుకు 120 దేశాల అధ్యక్షులు, ప్రతినిధులు హాజరవుతారన్నారు. చదవండి: నేను మరణించాలని కోరుకున్నారు: పోప్ -
పోప్‌ను కలిసిన రియల్ సూపర్ హీరో
వాటికన్ సిటీ: వాటికన్ సిటీలో శాన్ దమాసో వేదికగా ఓ వ్యక్తి స్పైడర్ మ్యాన్ వేషధాణలో అందరి దృష్టిని ఆకర్షించాడు. మాటియో విల్లార్డిటా అనే వ్యక్తి స్పైడర్ మ్యాన్ వేషధాణలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఉత్సాహపరుస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను బుధవారం వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిశాడు. పోప్‌కు తలకు ధరించే స్పైడర్ మ్యాన్ మాస్క్‌ను ఇచ్చాడు. అనంతరం మాటియో మాట్లాడుతూ.. ఆనారోగ్యంతో ఉన్న చిన్న పిల్లలు, వారి కుటుంబాల కోసం ప్రార్థించాలని పోప్ ఫ్రాన్సిస్ని కోరినట్లు తెలిపారు. చిన్నారుల వద్దకు తాను వెళ్లినప్పుడు వారి బాధను మాస్క్ ద్వారా చూస్తున్నట్లు తెలియజేడానికి పోప్‌కు మాస్క్ ఇచ్చినట్లు తెలిపాడు. తనకు పోప్ ఫ్రాన్సిస్‌ను కలవటం చాలా ఆనందంగా ఉందని, ఆయన తన మిషన్‌ను గుర్తించారని మాటియో పేర్కొన్నారు. ఇక స్పైడర్ మ్యాన్ వేషాధారణలో ఉన్న మాటియోతో పలువురు సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం స్పైడర్ మ్యాన్ వేషధారణలో ఉన్న మాటియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. చదవండి: ప్రాణం కోసం విలవిల.. గట్టిగా చుట్టి మింగేసింది -
సినాడ్ అండర్ సెక్రటరీగా మహిళ
వాటికన్ సిటీ: రోమన్ క్యాథలిక్కుల గురువు పోప్ ఫ్రాన్సిస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంప్రదాయాన్ని పక్కనబెట్టి కీలకమైన సినాడ్ (బిషప్పుల మహాసభ) అండర్ సెక్రటరీ పదవికి మొట్టమొదటిసారిగా మహిళను ఎంపిక చేశారు. ఆమెకు ఓటింగ్ హక్కులను కూడా కల్పించారు. కొత్తగా నియమితులైన ఇద్దరు అండర్ సెక్రటరీల్లో ఒకరు స్పెయిన్‌కు చెందిన లూయిస్ మారిన్ డీ సాన్ మార్టిన్ కాగా, మరొకరు ఫ్రాన్సుకు చెందిన సిస్టర్ నథాలీ బెకార్ట్(51) కావడం గమనార్హం. క్రైస్తవ మతంలో సిద్ధాంతపరంగా తలెత్తే ప్రధాన ప్రశ్నలపై సినాడ్ అధ్యయనం చేస్తుంది. సినాడ్‌లో బిషప్పులు, కార్డినల్స్ తోపాటు నిపుణులు కూడా ఉంటారు. వీరిలో బిషప్పులు, కార్డినల్స్కు మాత్రమే ఓటింగ్ హక్కులుంటాయి. అండర్ సెక్రటరీగా నియమితురాలైన బెకార్ట్‌కు కూడా ఓటింగ్ హక్కు కల్పించారు. చర్చికి సంబంధించిన విషయాల్లో సూక్ష్మపరిశీలన, నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలు కీలకంగా మారాలన్న పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్ష మేరకు ఈ నియామకం జరిగిందని సినాడ్ సెక్రటరీ జనరల్ కార్డినల్ మరియో గ్రెక్ తెలిపారు. ‘గతంలో నిపుణులుగా, పరిశీల కులుగా మాత్రమే మహిళలు సినాడ్‌లో ఉండే వారు. సిస్టర్ బెకార్ట్ ఎంపికతో మహిళలు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు కూడా అవకాశం కలిగింది’అని ఆయన పేర్కొన్నారు. ఫ్రాన్సు లోని జేవియర్ సిస్టర్స్ సంస్థ సభ్యురాలైన బెకార్ట్, ప్యారిస్‌లోని ప్రఖ్యాత హెచ్ఈసీ బిజినెస్ స్కూల్ నుంచి మేనేజ్మెంట్లో డిగ్రీ పొందారు. బోస్టన్ యూనివర్సిటీలో కూడా ఆమె అధ్యయనం చేశారు. 2019 నుంచి సినాడ్‌కు కన్సల్టెంట్‌గా కొనసాగుతున్నారు. కాగా, సినాడ్ తరువాతి సమావేశం 2022లో జరగనుంది. 2019లో అమెజాన్‌పై ఏర్పడిన ప్రత్యేక సినాడ్ సమావేశానికి 35 మంది మహిళా ఆడిటర్లను ఆహ్వానించినప్పటికీ వారెవరికీ ఓటింగ్ హక్కులు ఇవ్వలేదు. -
కరోనా టీకా అందరికీ అందాలి
వాటికన్ సిటీ: కరోనా టీకాపై పేటెంట్ హక్కులు ఎవరికి ఉన్నప్పటికీ.. అది ప్రజలందరికీ అందాలని పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్షించారు. కరోనాపై ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వారికి, వైరస్ బాధితులకు తొలుత టీకా అందేలా ప్రభుత్వాలు కృషి చేయాలని విన్నవించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పోప్ ఇటలీలో ఉన్న వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ నుంచి సందేశం ఇచ్చారు. కరోనా బారినపడే అవకాశం ఉన్నవారికి ముందుగా టీకా ఇస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. పలు కరోనా వ్యాక్సిన్లు అభివృద్ధి చెందుతుండడం ప్రపంచానికి ఒక ఆశారేఖ లాంటిదేనని అన్నారు. పోటీని కాదు, పరస్పర సహకారాన్ని పెంపొందించే దిశగా దేశాల అధినేతలు, వ్యాపారవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు ముందడుగు వేయాలని పేర్కొన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మనుషులంతా ఒకరికొకరు సహరించుకోవాలని చెప్పారు. మన కుటుంబం, మన మతం, మన వర్గం కాకపోయినా ఇతరులకు స్నేహ హస్తం అందించాలని ఉద్బోధించారు. కళ తగ్గిన క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలపై కరోనా ప్రభావం పడింది. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్లు, ఆంక్షలు, సరిహద్దుల మూసివేతలు, ప్రయాణాల నిషేధాలతో క్రిస్మస్ కాంతులు మసకబారాయి. అయితే వ్యాక్సిన్లపై ఆశలు మానవాళి మదిలో కదలాడుతూ పండుగ స్ఫూర్తిని కొనసాగించేలా చేశాయని, కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో అధికారికంగా చర్చ్‌లు సామూహిక ప్రార్ధనలు రద్దు చేశాయి. ధాయ్‌లాండ్ తదితర దేశాలకు పండుగ కోసం వచ్చిన స్వదేశీయులు క్వారంటైన్లో గడుపుతున్నారు. ఆఫ్రికాదేశాల్లో సైతం ప్రజలు ఆంక్షల మూలంగా పండుగ ఉత్సాహాన్ని పొందలేకపోయారు. వాటికన్లో క్రిస్మస్ రోజు ఆనవాయితీగా సెయింట్ పీటర్ బాసిలికా బాల్కనీలో దర్శనమిచ్చే పోప్, ఈ దఫా దర్శనాన్ని రద్దు చేసుకున్నారు. -
కనిపించని క్రిస్మస్ ఉత్సాహం
బెత్లహాం: ప్రతిసంవత్సరం బెత్లహాంలో అంగరంగవైభవంగా జరిగే క్రిస్మస్ వేడుకలపై కరోనా నీడ పడింది. దీంతో గురువారం ఆరంభమైన ఉత్సవాలకు కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. ప్రతిసారీ ప్రపంచం నలుమూలల నుంచి బెత్లహాంకు భక్తులు ఈ ఉత్సవాలు చూసేందుకు వచ్చేవారు. ఈదఫా ప్రయాణాలపై ఆంక్షలతో దాదాపు విదేశీ యాత్రికులు కనిపించడంలేదు. వాటికన్ సిటీలో జరిగే పోప్ ఫ్రాన్సిస్ పూజాకార్యక్రమాలకు కూడా కర్ఫ్యూ కారణంగా ఎవరూ హాజరు కాకపోవచ్చని అంచనా. యూరప్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా కరోనా ఆంక్షలు క్రిస్మస్ ఉత్సాహాన్ని తగ్గించాయి. -
ఆనాడు ట్రంప్ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు!
వాషింగ్టన్: వాషింగ్టన్కు చెందిన ఆర్చ్ బిషప్ విల్టన్ గ్రెగోరీని పోప్ ఫ్రాన్సిస్ రోమన్ క్యాథలిక్ చర్చ్ మతాధిపతి (కార్డినల్)గా నియమించారు. విల్టన్ గ్రెగోరీ ఈ పదవి అధిరోహించిన మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్. గతంలో ఇతర నల్లజాతీయులు కార్డినల్స్‌గా పనిచేసినప్పటికీ, గ్రెగోరీ మాత్రమే మొట్టమొదటి అమెరికన్ జాతీయుడు. ఈ చర్య అమెరికాలోని క్యాథలిక్ నల్లజాతీయుల పురోగతికి గొప్ప ముందడుగని గ్రెగోరీ వ్యాఖ్యానించారు. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ని పోలీసులు చంపివేసిన తరువాత నిరసనలు వెల్లువెత్తాయి.(చదవండి: ఆ వీడియో లేకపోతే... నిజం తెలిసేది కాదు!!) ఈ నేపథ్యంలో గ్రెగోరీ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. జాతి వివక్ష వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్న సందర్భంలో వాషింగ్టన్ డీసీలోని క్యాథలిక్ చర్చికి డొనాల్డ్ ట్రంప్ సందర్శన ప్రయత్నాన్ని గ్రెగోరీ అడ్డుకోవడంతో ఆయన తొలిసారి వార్తల్లోకెక్కారు. కాగా, వాటికన్ వేడుకలకు హాజరైన 12 మందికి కార్డినల్ హోదాను పోప్ ప్రదానం చేసి, ఆ హోదాను ప్రతిబింబించే ఉంగరం, ఎర్రటోపీ బహూకరించారు. (చదవండి: ఎఫ్‌బీఐపై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం) -
లైవ్ స్ట్రీమింగ్‌లో పోప్ ఈస్టర్ సందేశం
వాటికన్ సిటీ: కోవిడ్ మహమ్మారిపై పోరాటం చేస్తూ ప్రపంచమే లాక్డౌన్లో ఉన్న నేపథ్యంలో ఈస్టర్ వేడుకల సందడి ఎక్కడా కనిపించలేదు. ఇటలీ నుంచి పనామా వరకు చర్చిలన్నీ బోసిపోయి కనిపించాయి. ప్రజలందరూ ఇళ్లల్లో ఉండే ప్రార్థనలు చేసుకున్నారు. నిర్మానుష్యంగా ఉన్న సెయింట్ పీటర్ చర్చిలో పోప్ ఫ్రాన్సిస్ ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన లైవ్ స్ట్రీమింగ్ ద్వారా క్రైస్తవ సోదరుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ దేశాలన్నీ సోదరభావంతో ఒక్కటై కోవిడ్‌పై పోరాడాలని పిలుపునిచ్చారు. ‘‘ఇవాళ నా ఆలోచనలన్నీ కోవిడ్ వ్యాధితో బాధపడుతున్న వారిపైనే ఉన్నాయి. ఎందరో ఈ మహమ్మారికి బలైపోయారు. తమ ప్రియమైన వ్యక్తుల్ని కోల్పోయారు’’అని అన్నారు. -
ప్రజలు లేకుండానే పోప్ ప్రార్థనలు
వాటికన్ సిటీ: కరోనా కారణంగా వాటికన్ సిటీ వెలవెలబోయింది. ఏటా గుడ్ ఫ్రైడేకు ముందు వచ్చే ఆదివారం జరుపుకునే మ్రానికొమ్మల (పామ్) ఆదివారం ప్రార్థనలకు దేశ, విదేశాల నుంచి వేలాది సంఖ్యలో హాజరయ్యే వారు. కరోనా వైరస్ వ్యాప్తి భయంతో ఈ ఏడాది వాటికన్ సిటీని మూసివేయడంతో, భక్తులు లేకుండానే పోప్ ఫ్రాన్సిస్ ప్రత్యేక దివ్యబలి పూజను సెయింట్ పీటర్స్ బసిలికా లోపలే నిర్వహించారు. ఆ కార్యక్రమంలోనూ అతి తక్కువ మంది హాజరు కాగా, వారు కూడా భౌతిక దూరాన్ని పాటించారు. ఈ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి మానవాళి ఆశలపై గండి కొట్టిందని, హృదయాలపై మోయరాని భారాన్ని పెట్టిందని అన్నారు. -
నన్ను కొరకనంటేనే ముద్దిస్తాను: పోప్
వాటికన్ సిటీ: పోప్ ఫ్రాన్సిస్.. నూతన సంవత్సర వేడుకల్లో ఓ మహిళ తన చేయి పట్టుకుని వెనక్కు లాగినందుకు ఆమె చేతిని రెండుసార్లు కొట్టి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత దానికి క్షమాపణలు కూడా చెప్పారునుకోండి. అది వేరే విషయం. తాజాగా పోప్ ఫ్రాన్సిస్ మరోసారి వార్తల్లో నిలిచారు. వేలాదిమంది జనం గుమిగూడి ఉన్న హాల్ మధ్యలో పోప్ ఫ్రాన్సిస్ నడుచుకుంటూ వెళ్తున్నారు. అరుపులు, రొదలతో హాలంతా సందడిగా ఉంది. అంతమంది అరుపుల మధ్యలో ఓ నన్ గొంతు గట్టిగా ప్రతిధ్వనించింది. ‘ఒక్క ముద్దు ఇవ్వండి పోప్..’ అంటూ గట్టిగా కేకేసింది. అది విన్న పోప్ ఓ క్షణమాగి తనను కొరకనంటేనే ఇస్తానన్నారు. పోప్ జవాబుతో అక్కడి జనమంతా ఘొల్లున నవ్వారు. ‘ముందు నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. నేను నీకు ముద్దిస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో నన్ను కొరకకూడదు’ అని చమత్కారంగా బదులిచ్చారు. దానికి నన్ సరేనంటూ మాటిచ్చింది. వెంటనే పోప్ ఆమె కుడి చెంపపై సుతారంగా ముద్దు పెట్టారు. దీంతో పట్టలేని సంతోషంతో ఆ మహిళ ‘థాంక్ యూ పోప్’ అంటూ గంతులు వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా పోప్ ఫ్రాన్సిస్ జనాలు అతని చేతిని తాకడానికి అనుమతిస్తారు. కానీ ప్రజలు తన చేతిని ముద్దాడటాన్ని మాత్రం అస్సలు సహించరు. దీనివల్ల సూక్ష్మక్రిములు త్వరగా వ్యాప్తి చెందుతాయని ఆయన బలంగా నమ్ముతారు. చదవండి: మహిళకు క్షమాపణ చెప్పిన పోప్ ప్రాన్సిస్ ఈ ఏడాది పోప్ ఫ్రాన్సిస్ సందేశం -
మహిళకు క్షమాపణ చెప్పిన పోప్
వాటికన్ సిటీ : పోప్ ప్రాన్సిస్ ఓ మహిళకు క్షమాపణ చెప్పారు. ప్రతి ఒక్కరు సహనం కోల్పోతారని..అదే తనకు జరిగిందని తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వాటికన్లో పలువురు భక్తులను పోప్ ప్రాన్సిన్ పలకరిస్తూ వెళ్లారు. ఈ సమయంలో అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న భక్తుల్లో ఓ మహిళ ఆయన చేయి పట్టుకుని వెనక్కి లాగడంతో.. పోప్ పడిపోబోయారు. తర్వాత ఆయన వెంటనే నిలదొక్కుకొని.. సహనం కోల్పోయి మహిళ చేతిపై రెండు సార్లు కొట్టారు. ఇందుకు సంబంధిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు నెటిజన్లు పోప్‌కు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టగా.. మెజారిటీ నెటిజన్లు ఆ మహిళ చర్యను తప్పుబట్టారు. అయితే ఈ చర్యపై పోప్ ట్విటర్లో స్పందించారు. ‘మనం చాలా సార్లు సహనం కోల్పోతుంటాం. అదే నా విషయంలో జరిగింది. నిన్న నేను చేసిన పనికి క్షమాపణలు చెబుతున్నాను’ అంటూ పేర్కొన్నారు. -
ఆఫ్రికాలో శాంతి నెలకొనాలి
వాటికన్ సిటీ: అంతర్యుద్ధంతో సతమతమైపోతున్న ఆఫ్రికా దేశాల్లో శాంతి స్థాపన జరగాలని పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్షించారు. మధ్యప్రాచ్యం, వెనిజులా, లెబనాన్ ఇతర దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణానికి ఇకనైనా ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పోప్ వాటికన్ నగరం నుంచి తన సందేశాన్నిచ్చారు. ఆఫ్రికాలో క్రైస్తవులపై తీవ్రవాద సంస్థలు జరుపుతున్న దాడుల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హింసతో రగిలిపోతున్న దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలతో సతమతమైపోతున్న దేశాల్లో, వ్యాధులు పడగవిప్పిన నిరుపేద దేశాల్లో ఈఏడాదైనా శాంతి, సుస్థిరతలు నెలకొనాలని పోప్ ఆకాంక్షించారు. ‘మధ్యప్రాచ్యం సహా ఎన్నో దేశాల్లో యుద్ధ వాతావరణంలో చిన్నారులు భయంతో బతుకులీడుస్తున్నారు. వారందరి జీవితాల్లో ఈ క్రిస్మస్ వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను‘‘అని పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. అంబరాన్నంటిన సంబరాలు క్రిస్మస్ సంబరాలు ప్రపంచవ్యాప్తంగా అంబరాన్నంటాయి. క్రిస్టియన్ నేతలు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ శాంతి సందేశాలను పంపించుకున్నారు. సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. తీవ్ర తుఫాన్‌తో అల్లాడిపోయిన ఫిలిప్పీన్స్‌లో వేలాది మంది వరద ముప్పులో చిక్కుకోవడంతో క్రిస్మస్ హడావుడి కనిపించలేదు. ఇక ఫ్రాన్స్‌లో పింఛను సంస్కరణలకు వ్యతిరేకంగా నాలుగు వారాలుగా జరుగుతున్న రవాణా సమ్మెతో రాకపోకలు నిలిచిపోయాయి. బంధువులు, స్నేహితులు తమవారిని చేరుకోకపోవడంతో క్రిస్మస్ సందడి కనిపించలేదు. -
సిస్టర్ థ్రెషియాకు సెయింట్‌హుడ్
వాటికన్ సిటీ: భారత్‌కు చెందిన సిస్టర్ మరియం థ్రెషియాకు ఆదివారం వాటికన్ సిటీలో ఘనంగా జరిగిన ఒక కార్యక్రమంలో ‘సెయింట్‌హుడ్’ను పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. మరియంతో పాటు ఇంగ్లండ్‌కు చెందిన కార్డినల్ జాన్‌హెన్రీ న్యూమన్, స్విట్జర్లాండ్‌కు చెందిన నన్ మార్గెరెట్ బేయస్, బ్రెజిల్‌కు చెందిన సిస్టర్ డల్స్ లోపెస్, ఇటలీ నన్ గ్యూసెప్పిన వానినిలను కూడా దైవ దూతలుగా పోప్ ప్రకటించారు. ‘ఈ రోజు ఈ ఐదుగురు దైవదూతల కోసం ఆ ప్రభువుకు కృతజ్ఞతలు తెల్పుకుందాం’ అని పోప్ ఫ్రాన్సిస్ అక్కడికి భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద ఈ ఐదుగురి భారీ చిత్రపటాలకు వేలాడదీశారు. ఈ కార్యక్రమానికి ప్రిన్స్ చార్లెస్ హాజరయ్యారు. భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ శాఖ సహాయమంత్రి వీ మురళీధరన్ నేతృత్వం వహించారు. తాజాగా సెయింట్‌హుడ్ పొందిన ఐదుగురిలో ముగ్గురు మహిళలున్నారన్న పోప్ ఫ్రాన్సిస్.. ‘వారు ఈ లౌకిక ప్రపంచానికి పవిత్రమైన ప్రేమపూరిత జీవన మార్గాన్ని చూపారు’ అని ప్రశంసించారు. ‘సెయింట్ మార్గరెట్ బేయస్ కుట్టుపని చేసే స్త్రీ అయినా చిన్న ప్రార్థన, సహనపూరిత జీవితంలోని శక్తిని మనకు చూపారు’ అని పోప్ పేర్కొన్నారు. న్యూమన్ రాసిన ఒక ప్రార్థన గీతాన్ని కూడా ఆయన ఉటంకించారు. 1801లో జన్మించిన న్యూమన్ గొప్ప కవి. బోధకుడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న మేధావి. బ్రెజిల్లో అతిపెద్ద సేవా సంస్థను సిస్టర్ డల్స్ లోపెస్ ప్రారంభించారు. రెండు సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. బ్రెజిల్‌కు చెందిన తొలి మహిళా సెయింట్ లోపెస్‌నే కావడం విశేషం. ఆ చర్చ్ నుంచి నాలుగో సెయింట్ సెయింట్ మరియం థ్రెషియాతో కలిపి కేరళలోని శతాబ్దాల చరిత్ర కలిగిన సైరో మలబార్ కేథలిక్ చర్చ్ లేదా చర్చ్ ఆఫ్ మలబార్ సిరియన్ కేథలిక్స్ నుంచి ఇప్పుడు నలుగురు సెయింట్స్ ఉన్నారు. ఈ చర్చ్ నుంచి 2008లో సిస్టర్ అల్ఫోన్సా సెయింట్‌హుడ్ పొందారు. ఆ తరువాత 2014లో ఫాదర్ కురియాకోస్ ఎలియాస్ చావర, సిస్టర్ యూఫ్రేసియా(యూఫ్రేసియమ్మగా చిరపరిచితం)లకు కూడా ఈ హోదా లభించింది. జీసస్ తరఫున మరియం థ్రెషియా పేదలకు ఎంతో సాయమందించారని, రోగులకు స్వాంత్వన చేకూర్చారని చర్చ్ పేర్కొంది. జీసస్ క్రైస్ట్‌కు శిలువ వేసినప్పుడు ఆయన శరీరంపై పడిన గుర్తు వంటిది మరియం థ్రెషియా శరీరంపై కూడా ఉండేదని, అయితే, ఆమె ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారని వెల్లడించింది. ఆమె చుట్టూ ఒక కాంతిపుంజం ఉండేదని, వ్యాధులను నయం చేయగలగడం వంటి ప్రత్యేక శక్తులు ఆమెకు ఉన్నాయని పేర్కొంది. కేరళలోని త్రిచూర్ దగ్గరలోని పుతెంచిరలో తోమ, తాండ దంపతులకు 1876, ఏప్రిల్ 26న సిస్టర్ థ్రెషియా జన్మించారు. 1902లో జోసెఫ్ విద్యాతిల్‌ను తన గురువుగా స్వీకరించారు. 1904లో తన పేరుకు మరియంను చేర్చుకున్నారు. 1914 మే నెలలో ‘కాంగ్రెగెషన్ ఆఫ్ ద సిస్టర్స్ ఆఫ్ ద హోలీ ఫ్యామిలీ’ని ప్రారంభించారు. 1926 జూన్ 8న, తన 50 ఏళ్ల వయసులో మరణించారు. సిస్టర్ థ్రెషియా చేసిన ఒక అద్భుతాన్ని నిర్ధారించిన పోప్ ఫ్రాన్సిస్ ఈ ఫిబ్రవరి 12న ఆమెను సెయింట్‌హుడ్‌కు అర్హురాలిగా ప్రకటించారు. అక్టోబర్ 13న కెనొనైజేషన్ ఉంటుందన్నారు. 2000లో బీటిఫికేషన్ పొందిన సిస్టర్ థ్రెషియాకు 2019లో సెయింట్‌హుడ్ అందింది. బీటిఫికేషన్ తరువాత అత్యంత తొందరగా, 19 ఏళ్లలోనే, సెయింట్‌హుడ్ పొందిన వ్యక్తి సిస్టర్ థ్రెషియానే కావడం విశేషం. సిస్టర్ థ్రెషియా సెయింట్ హోదా పొందనుండడం భారతీయులందరికీ గర్వకారణమని ఇటీవల ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో ప్రస్తావించారు. పోప్‌తో మురళీధరన్ భేటీ: విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ ఆదివారం పోప్ ఫ్రాన్సిస్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ‘భగవద్గీత అకార్డింగ్ టు గాంధీ’ అనే పుస్తకాన్ని, కేరళ దేవాలయల్లో జరిగే ఉత్సవాల్లో పాల్గొనే ఏనుగు ప్రతిమను పోప్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి తన శుభాకాంక్షలు తెలపాలని పోప్ కోరారు. నా వైకల్యం దూరమైంది సిస్టర్ థ్రెషియాకు సెయింట్ హుడ్ ప్రకటించడంపై త్రిచూర్ దగ్గర్లోని ఆమడంకి చెందిన మేథ్యూ పెలిస్రీ(69) చాలా సంతోషంగా ఉన్నారు. సిస్టర్ థ్రెషియా కారణంగానే తన వైకల్యం దూరమైందని ఆయన చెప్పారు. ‘వాటికన్ సిటీలో జరిగే సెయింట్‌హుడ్ ప్రదాన కార్యక్రమానికి వెళ్లాలనుకున్నాను కానీ వృద్ధాప్య సమస్యల వల్ల వీలు కాలేదు. 2000 సంవత్సరంలో జరిగిన బీటిఫికేషన్ కార్యక్రమానికి వెళ్లాను’ అని వివరించారు. పుట్టినప్పటినుంచే మేథ్యూ రెండు కాళ్లలోనూ వైకల్యం ఉండేది. పట్టుదలతో 33 రోజుల పాటు నిరాహారంగా ఉంటూ, నిరంతరం సిస్టర్ థ్రెషియాకు ప్రార్థన చేశారు. ఒక రాత్రి సిస్టర్ థ్రెషియా ఆయనకు స్వప్నంలో కనిపించారు. ఆ మర్నాడు లేచి చూస్తే ఆయన వైకల్యం మాయమైంది. తన కుమారుడికి సిస్టర్ థ్రెషియా సాంత్వన చేకూర్చినట్లు ఆయన తల్లికి సైతం కల వచ్చింది. సిస్టర్ మరి యం థ్రెషియాకు సెయింట్ హుడ్ను ప్రకటించడంపై కేరళలోని కేథలిక్కులు ఆనందోత్సాహాలతో పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద పోప్ ఫ్రాన్సిస్