కటికవాడిని అవుదామనుకున్నా: పోప్ ఫ్రాన్సిస్ | I wanted to be butcher, says Pope Francis | Sakshi
Sakshi News home page

కటికవాడిని అవుదామనుకున్నా: పోప్ ఫ్రాన్సిస్

Published Fri, Jan 1 2016 1:50 PM | Last Updated on Sun, Sep 3 2017 2:55 PM

కటికవాడిని అవుదామనుకున్నా: పోప్ ఫ్రాన్సిస్

కటికవాడిని అవుదామనుకున్నా: పోప్ ఫ్రాన్సిస్

వాటికన్ సిటీ: చిన్నతనంలో తాను కటికవాడిని(మాంసం అమ్మే వ్యక్తి) కావాలనుకున్నానని పోప్ ఫ్రాన్సిస్ వెల్లడించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన చిన్నారి గాయకులతో ఆయన ముచ్చటించారు. 'నేను చిన్నతనంలో ఉండగా కటికివాడిని(బుచర్) కావాలని ఆలోచించే వాడిన'ని చెప్పారు.

ఇంటర్నేషనల్ ప్యురీ కాంటోర్స్ చిల్డ్రన్ కోయిర్ సంగీత బృందానికి చెందిన 6 వేల మంది చిన్నారులతో ఆయన మాట్లాడారు. తన చిన్నతనంలో బ్యూనోస్ ఎరిస్ లోని మార్కెట్ స్టాల్స్ లో మాంసం అమ్మేవాళ్లను చూసేందుకు అమితోత్సాహం చూపేవాడినని అర్జెంటీనాకు చెందిన ఈ రోమన్ కేథిలిక్ ప్రధాన మత గురువు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement