pope francis
-
పోప్ స్పృహలోనే ఉన్నారు
రోమ్: ‘పోప్ ఫ్రాన్సిస్(88) స్పృహలోనే ఉన్నారు. అయితే, సంక్లిష్టమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కార ణంగా ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది’అని వాటికన్ ఆదివారం తెలిపింది. శనివారం రాత్రి శ్వాసలో ఇబ్బందులు తలెత్తడంతోపాటు, రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోయాయి. పూర్తి స్థాయిలో శ్వాస తీసుకోలేని కారణంగా ప్రారంభించిన ఆక్సిజన్ సరఫరాను ఆదివారం కూడా కొనసా గించారు. రక్తం ఎక్కించినట్లు వాటి కన్ వర్గాలు వివరించాయి. ‘రాత్రి ప్రశాంతంగా గడి చింది. ఆయన విశ్రాంతి తీసుకున్నారు’అని పేర్కొ న్నాయి. మరికొన్ని వైద్య పరీక్షలను నిర్వహించిన ట్లు వెల్లడించింది. పోప్ బెడ్‌పై నుంచి లేచారా, ఏమైనా ఆహారం తీసుకున్నారా అనే విషయాలను మాత్రం వాటికన్ ప్రస్తావించలేదు. బ్రాంకైటిస్ తీవ్ర రూపం దాల్చడంతో పోప్ ఈ నెల 14వ తేదీన గెమెల్లి ఆస్పత్రిలో చేరడం తెలిసిందే.వాటికన్లో ప్రత్యేక ప్రార్థనలుఆదివారం ఉదయం సెయింట్ పీటర్స్ బసిలికాలో పోప్ ఫ్రాన్సిస్ హోలీ ఇయర్ ప్రారంభ వేడుకలను ప్రారంభించాల్సి ఉంది. ఆయన ఆస్పత్రిలో ఉన్న కారణంగా ఆర్చ్ బిషప్ రినో ఫిసిచెల్లా ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోప్ ఫ్రాన్సిస్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమం చేపట్టారు. ‘ఆస్పత్రిలో బెడ్‌పై ఉన్నా పోప్ ఫ్రాన్సిస్ మనకు సన్నిహితంగా మనమధ్యే ఉన్నట్లుగా ఉంది’అని ఫిసిచెల్లా అన్నారు.ఫ్రాన్సిస్ రాజీనామా చేయబోరుతీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో పోప్ ఫ్రాన్సిస్ పదవికి రాజీనామా చేయనున్నారంటూ వస్తున్న వదంతులను వాటికన్ అధికార వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. పోప్ తన విధులను నిర్వహించలేని సమయంలో ప్రత్యామ్నాయం ఏమిటన్న దానిపై ఎటువంటి స్పష్టత లేదు. ఇలాంటి సందర్భం తలెత్తినప్పుడు ఏం చేయాలన్న దానిపై పోప్ స్పష్టత ఇచ్చినట్లు చెబుతున్నాయి. వైద్యపరమైన అశక్తత ఏర్పడితే రాజీనామా లేఖ రాసి ఉంచినట్లు గతంలోనే పోప్ ఫ్రాన్సిస్ చెప్పిన విషయాన్ని ఆ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఆస్పత్రిలో ఉన్న పోప్ ఫ్రాన్సిస్‌ను వాటికన్ ఉన్నతాధికారులు కొందరు రహస్యంగా కలిసినట్లు వస్తున్న వార్తలను సైతం తోసిపుచ్చాయి. ఫ్రాన్సిస్ ఆరోగ్యం, ఆయన కోలుకోవడం, తిరిగి వాటికన్ రావడంపైనే మాట్లాడుకోవాలే తప్ప, ఇటువంటి అవసరం లేని అంశాలంటూ స్పష్టం చేశాయి. -
పోప్ ఆరోగ్యం విషమం
రోమ్: క్రైస్తవుల మత గురువు పోప్ ప్రాన్సిస్ ఆరోగ్యం విషమించింది. వైరస్, బ్యాక్టీరి యా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో తీవ్ర శ్వాస సంబంధ వ్యాధిలో బాధపడుతున్న పోప్ గత కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 88 ఏళ్ల పోప్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. రక్తహీనత సమస్య మరింత ఎక్కువైంది. దీంతో తాజాగా ఆయనకు రక్తం ఎక్కించారు. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోయింది. పూర్తిస్తాయిలో శ్వాస తీసుకోలేని కారణంగా అధిక పీడనంతో ఆయనకు ఆక్సీజన్ సరఫరాను కొనసాగిస్తున్నారు. బ్రాంకైటిస్, న్యుమోనియాలతో కూడా పోప్ బాధపడుతున్నారు. -
ఆస్పత్రిలోనే పోప్ ఫ్రాన్సిస్
రోమ్: పోప్ ఫ్రాన్సిస్(88) ప్రమాదం నుంచి బయటపడలేదు కానీ, ఆయనకు ప్రాణాపాయం లేదని ఆయనకు చికిత్స చేస్తున్న రోమ్‌లోని గెమెల్లి ఆస్పత్రి వైద్య బృందం తెలిపింది. వచ్చే వారమంతా ఆయన ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని కూడా వైద్యులు స్పష్టం చేశారు. బ్రాంకైటిస్, న్యుమోనియాతో తీవ్ర అనారోగ్యం బారిన పడిన పోప్ ఈ నెల 14వ తేదీన ఆస్పత్రిలో చేరిన విష యం తెల్సిందే. శుక్రవారం మొదటిసారిగా పోప్ ఆరోగ్యంపై వారు స్పష్టత ఇచ్చారు. ‘అప్పుడప్పుడూ ఆయనకు విటమిన్లు, మినరల్స్‌తో కూడిన ఆక్సిజన్‌ను అందజేస్తున్నాం. న్యుమోనియా రెండు ఊపిరితిత్తుల్లోనూ ఉంది. దీని నివారణ వైద్య చికిత్సలకు ఆయన సరిగ్గానే స్పందిస్తున్నారు’అని గెమెల్లి ఆస్పత్రి వైద్య బృందం వివరించింది. శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్తోనూ ఆయన ఇబ్బంది పడుతున్నట్లు పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది. ఇలా ఉండగా, పోప్ ఫ్రాన్సిస్ దీర్ఘకాలంపాటు ఆస్పత్రిలోనే కొనసాగాల్సి అవసరం వస్తే పరిస్థితి ఏమిటి? ముఖ్యమైన రోజు వారీ విధులను నిర్వహించలేనప్పుడు ఆ బాధ్యతల నుంచి ఆయన తప్పుకుంటారా అన్న చర్చ కార్డినల్స్లో ఇప్పటికే మొదలైందని చెబుతున్నారు. -
ఆయుధాల గర్జనలు ఆగిపోవాలి
వాటికన్ సిటీ: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవుల అత్యున్నత గురువు పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచ మానవాళికి శాంతి సందేశం ఇచ్చారు. ప్రపంచమంతటా ఘర్షణలు ఆగిపోవాలని, శాంతి సామరస్యం నెలకొనాలని ఆకాంక్షించారు. బుధవారం వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌కు తరలివచి్చన వేలాది మందిని ఉద్దేశించి పోప్ బాసిలికా చర్చి బాల్కనీ నుంచి ప్రసంగించారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు ఆశీస్సులు అందజేశారు. అమాయకుల ఉసురు తీస్తున్న యుద్ధాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయుధాలు నిప్పులు కక్కుతున్న చోట ఇకనైనా కాల్పుల విరమణ పాటించాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ఇప్పటికైనా ముగించాలని ఇరుపక్షాలకు హితవు పలికారు. జరిగిన నష్టం చాలని అన్నారు. సుదీర్ఘ శాంతిని నెలకొల్పే దిశగా చర్చలకు రెండు దేశాలూ చొరవ తీసుకోవాలని సూచించారు. యుద్ధాన్ని ముగించి, సంప్రదింపులకు తలుపులు తెరవాల్సిన సమయం వచి్చందన్నారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల పట్ల పోప్ ఆందోళన వ్యక్తంచేశారు. ఆ ప్రాంతంలో ఆయుధాల గర్జనలు ఆగిపోవాలని, నిశ్శబ్దం తిరిగి రావాలని పేర్కొన్నారు. గాజాలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని చెప్పారు. వారి క్షుద్బాధ తీర్చాలని, మానవతా సాయం విరివిగా అందించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. గాజాలో కాల్పుల విరమణకు సిద్ధం కావాలని హమాస్, ఇజ్రాయెల్‌కు పోప్ సూచించారు. బందీలను విడుదల చేయాలని, తద్వారా శాంతికి బాటలు వేయాలని హమాస్ మిలిటెంట్లకు హితవు పలికారు. లెబనాన్, మయన్మార్, సిరియా, ఆఫ్రికా తదితర దేశాల్లో సంఘర్షణల పట్ల మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ప్రారి్థస్తున్నట్లు తెలిపారు. వాతావరణ మార్పులు, దుష్పరిణామాలపైనా పోప్ మాట్లాడారు. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో వ్యాధుల బారినపడి పెద్దసంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి చికిత్స అందించాలని, సాంత్వన కలిగించాలని మానవతావాదులను కోరారు. -
కార్డినల్‌గా కేరళ బిషప్
తిరువనంతపురం: కేరళకు చెందిన 51 ఏళ్ల మత ప్రబోధకుడు మాన్సిగ్నర్ జార్జ్ జాకబ్ కోవక్కడ్ను కార్డినల్‌గా ప్రకటిస్తూ పోప్ ఫ్రాన్సిస్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 21 మందిని కార్డినల్స్‌గా పోప్ ప్రకటించినట్టు వాటికన్ సిటీ ఆదివారం వెల్లడించింది. రోమ్‌లో క్రిస్మస్ సీజన్ మొదలయ్యే డిసెంబర్ 8న వీరంతా కార్డినల్స్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. జాకబ్ నాలుగేళ్లుగా పోప్ అంతర్జాతీయ పర్యటనల కార్యక్రమాలను చూసుకుంటున్నారు. చంగనచెర్రీ సైరో–మలబార్ ఆర్క్డయాసిస్కు చెందిన జాకబ్ వాటికన్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. పలు దేశాల్లో వాటికన్ ‘దౌత్య’ కార్యాలయాల్లో పనిచేశారు. 1973లో తిరువనంతపురంలో జన్మించిన జాకబ్ 2004 జూలై 24న చర్చి ఫాదర్ అయ్యారు.కొత్తవారిలో 99 ఏళ్ల బిషప్ సైతం..కొత్తగా కార్డినల్స్‌గా ఎన్నికైన 21 మందిలో అత్యంత వృద్దుడు, 99 ఏళ్ల ఏంజిలో అసెర్బీ సైతం ఉన్నారు. ఈయన గతంలో వాటికన్ దౌత్యవేత్తగా పనిచేశారు. గతంలో ఈయనను కొలంబియాలో వామపక్ష గెరిల్లా దళాలు ఆరు వారాలపాటు బంధించాయి. 21 మంది కొత్త కార్డినల్స్లో అత్యంత తక్కువ వయసు వ్యక్తిగా 44 ఏళ్ల బిషప్ మైకోలా బైచోక్ ఉన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉక్రెయిన్ గ్రీకు కేథలిక్ చర్చిలో ఈయన సేవలందిస్తున్నారు. నిబంధనల ప్రకారం 120 మంది మాత్రమే కార్డినల్స్ కాగలరు. కానీ పోప్‌ఫ్రాన్సిస్ ఎక్కువ మందిని ఎంపికచేశారు. దీంతో కొత్తవారితో కలుపుకుని సంఖ్య 142కు పెరిగింది. -
పోప్‌ను అవమానించడం మా ఉద్దేశం కాదు
తిరువనంతపురం: పోప్–మోదీ భేటీపై సోషల్ మీడియాలో చేసిన కామెంట్ పట్ల కేరళ కాంగ్రెస్ క్రైస్తవ సమాజానికి క్షమాపణలు చెప్పింది. పోప్‌ను అవమానించడం తమ ఉద్దేశం కాదని స్పష్టత ఇచి్చంది. జీ7 సదస్సులో పోప్ ఫ్రాన్సిస్‌తో మోదీ భేటీపై కేరళ కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా అకౌంట్లో చేసిన పోస్టు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. మోదీ–పోప్ ఫోటోను పోస్టు చేసిన కేరళ కాంగ్రెస్.. దానికి ‘‘చివరకు దేవున్ని కలిసే అవకాశం పోప్‌కు దక్కింది’’ అని క్యాప్షన్ రాసింది. ఆ పోస్టుపై బీజేపీతోపాటు ఇతర పారీ్టలు విమర్శలు గుప్పించాయి. దీంతో తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఆ పోస్టును తొలగించిన కేరళ కాంగ్రెస్, క్రైస్తవులకు క్షమాపణలు చెప్పింది. -
G7 Summit 2024: కృత్రిమ మేధపై పోప్ ఆందోళన
బరీ(ఇటలీ): రోజురోజుకూ విశ్వవ్యాప్తంగా విస్తృతమవుతున్న కృత్రిమ మేధపై పోప్ ఫ్రాన్సిస్ ఒకింత ఆందోళన వ్యక్తంచేశారు. కృత్రిమ మేధ అభివృద్ధి, వినియోగంలో మనిషి గౌరవానికి భంగం కలుగకుండా చూసుకోవాలని జీ7 శిఖరాగ్ర సదస్సు వేదికగా పోప్ పిలుపునిచ్చారు. ఇంతటి అత్యాధునిక సాంకేతికతలు మితిమీరితే మానవ సంబంధాలు సైతం కృత్రిమంగా మారే ప్రమాదముందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ‘మానవ భవిష్యత్తుకు కృత్రిమ మేధ(ఏఐ) భరోసా, బెంగ’ అంశంపై పోప్ మాట్లాడారు. అంతర్జాతీయ సమావేశాలు, ప్రభుత్వాల విధానపర నిర్ణయాలు, కార్పొరేట్ బోర్డుల వంటి అంశాలే ఎజెండాగా సాగే జీ7 వంటి అగ్రస్థాయి కూటమి భేటీలో పోప్ మాట్లాడటం చరిత్రలో ఇదే తొలిసారికావడం విశేషం. ‘‘ ఏఐ అనేది మానవ కేంద్రీకృతంగా ఎదిగేలా రాజకీయ నేతలు ఓ కంట కనిపెట్టాలి. మనుషులకు సంబంధించిన అంశాలపై నిర్ణయాలను మనుషులే తీసుకోవాలిగానీ మెషీన్లు కాదు. మెషీన్ల నిర్ణయాలపై ఆధారపడి, కనీసం మన జీవితాల గురించి కూడా సొంతంగా ఆలోచించలేని పరిస్థితిని మనం కోరుకోవద్దు’ అని అన్నారు. ఓపెన్ఏఐ వారి చాట్‌జీపీటీ చాట్‌బోట్ తరహా ఏఐ వినియోగం విస్తృతమవుతున్న తరుణంలో ఏఐకు పూర్తిగా దాసోహమవడంపై ప్రపంచదేశాలు, అంతర్జాతీయ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారు. భారత్‌లో పర్యటించండి: పోప్‌కు ఆహా్వనం జీ7 సదస్సుకు విచ్చేసిన పోప్ ఫ్రాన్సిస్‌ను మోదీ కలిశారు. వీల్‌చైర్‌లో కూర్చున్న పోప్‌ను మోదీ ఆప్యాయంగా ఆలింగం చేసుకున్నారు. కొద్దిసేపు మాట్లాడారు. భారత్‌లో పర్యటించాలని పోప్‌ను మోదీ ఆహా్వనించారు. -
ఇరాన్ దాడులు.. ఇజ్రాయెల్‌కు పోప్ కీలక సూచన
వాటికన్‌సిటీ: ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంపై పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. ఇరాన్ డ్రోన్ దాడులకు ఇజ్రాయెల్ స్పందించవద్దని లేదంటే హింస పెరుగుతుందని పోప్ అన్నారు. ‘యుద్ధం చాలు, దాడులు చాలు, హింస చాలు. శాంతి కావాలి. చర్చలు కావాలి’అని వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్ స్క్వేర్ వద్ద సందర్శకులను ఉద్దేశించి పోప్ ప్రసంగించారు. కాగా, ఇజ్రాయెల్‌పై శనివారం(ఏప్రిల్ 13) రాత్రి వందల కొద్దీ డ్రోన్లతో ఇరాన్ దాడులు చేసింది. ఈ డ్రోన్లు, మిసైళ్లలో చాలా వాటిని ఇజ్రాయెల్ కూల్చి వేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ దాడులకు ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందనేది ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు పోప్ సూచన కీలకంగా మారింది. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి చేసి ఆ దేశ ఆర్మీ ఉన్నతాధికారులను ఇజ్రాయెల్ చంపినందుకే ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది. ఇదీ చదవండి.. ఇరాన్ దాడులు అమెరికా వ్యూహం ఫలించిందా -
అద్దె గర్భాలను నిషేధించాలి: పోప్
రోమ్: అద్దె గర్భాలతో మాతృత్వం పొందడం అనేది సంప్రదాయబద్ధం కాదని, ఇలాంటి అనైతిక విధానాన్ని ప్రపంచమంతటా నిషేధించాలని పోప్ ఫ్రాన్సిస్ చెప్పారు. ఆధునిక యుగంలో గర్భం, మాతృత్వం కూడా వ్యాపారమయం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. అద్దెగర్భం అనేది మహిళల గౌరవాన్ని కించపర్చడమే అవుతుందని అన్నారు. ఆయన సోమవారం వాటికన్ సిటీలో వివిధ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధం గురించి ప్రస్తావించారు. ప్రపంచంలో శాంతియుత పరిస్థితులు నానాటికీ క్షీణిస్తున్నాయని, శాంతికి, మానవత్వానికి విఘాతం కలుగుతోందని చెప్పారు. ఈ పరిణామం ఎంతమాత్రం క్షేమకరం కాదని అన్నారు. కొన్ని దేశాల్లో సంక్షోభాలు, ఫలితంగా వలసలు పెరిగిపోతుండడం, వాతావరణ మార్పులతో ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతుండడం పట్ల పోప్ ఆందోళన వ్యక్తం చేశారు. అణ్వాయుధాల ఉత్పత్తి పెచ్చరిల్లుతుండ డం భూగోళంపై మానవాళికి మనుగడకు ఎప్పటికైనా ముప్పేనని పేర్కొన్నారు. -
Merry Christmas: బాల యేసులు ఎందరో యుద్ధంలో మరణిస్తున్నారు
వాటికన్ సిటీ: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ తన సందేశంలో గాజాపై ఇజ్రాయెల్ హేయ దాడులను ప్రస్తావించారు. పాలస్తీనియన్ల అపార ప్రాణనష్టానికి హేతువైన ఇజ్రాయెల్ దాడులను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చి ప్రధాన బాల్కనీ నుంచి సోమవారం పోప్ తన సందేశం వినిపించారు. ‘‘ గాజా సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల్లో బాలలు కన్నుమూస్తున్నారు. వారంతా నేటి తరం బాల యేసులు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు అక్కడి అమాయక పౌరుల నెత్తుటి పంట పండిస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌లో హమాస్ మెరుపుదాడి దారుణం. నాడు అపహరించుకుపోయిన వారందర్నీ హమాస్ విడిచిపెట్టాలి. ప్రపంచ ఆయుధ విపణి యుద్ధవీణ తంత్రులను మోగిస్తోంది. గాజా, ఉక్రెయిన్, సిరియా, యెమెన్, లెబనాన్, ఆర్మేనియా, అజర్బైజాన్లలో సైనిక, సామాజిక, రాజకీయ సంక్షోభాలు సమసిపోవాలి. ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల హక్కులు పరిరక్షించబడాలి. గాజా స్ట్రిప్‌లో మానవతా సాయానికి దారులు తెరచి మానవీయ సంక్షోభాన్ని నివారించాలి’’ అని పోప్ వ్యాఖ్యానించారు. విశ్వవ్యాప్తంగా పెరిగిన ఆయుధ కొనుగోళ్లపై స్పందించారు. ‘‘ఆయుధాల ఉత్పత్తి, కొనుగోలు, రవాణా ఊహకందనంత పెరిగిన ఈ తరుణంలో కనీసం శాంతి అన్న పదం మనం ఉచ్ఛరించగలమా?’’ అని పోప్ ఆవేదన వ్యక్తంచేశారు. -
ఒడిశా ఘటనపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న సానుభూతి
ఒడిశా రైలు ప్రమాదంపై ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ విచారాన్ని వ్యక్తం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ కూడా ఆదివారం జరిగిన ప్రార్థనల్లో చనిపోయిన 275 మంది మృతికి సంతాపాన్ని తెలిపారు. "ఒడిశా బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదం అత్యంత విషాదకరం. ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నాను. గాయాల బారిన పడిన వారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు అండగా మా ప్రార్ధనలు ఉంటాయి." -ఆంటోనియో గుటెర్రెస్ వాటికన్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం జరిగిన ప్రార్థనల్లో ప్రత్యేకంగా ఒడిశా ప్రమాదం గురించి ప్రస్తావించి మృతులకు సంతాపాన్ని తెలియజేశారు. " ఒడిశా రైలు ప్రమాదంలో మృతి చెందినవారి ఆత్మలను పరలోకంలో ప్రభువు అంగీకరించును గాక. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనలోని బాధితులకు నా ప్రార్ధనలు తోడుగా ఉంటాయి. గాయపడినవారికి, వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను." - పోప్ ఫ్రాన్సిస్ బాలాసోర్ ఘటనలో 275 మంది మరణించగా వెయ్యికి పైగా గాయపడ్డారు. భారత దేశ చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదాల్లో ఒకటిగా ఈ ట్రైన్ యాక్సిడెంట్ మిగిలిపోతుంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపి, మరెందరినో దిక్కులేని వారిగా మిగిల్చిన ఈ సంఘటనపై ప్రపంచవ్యాప్తంగా చాలామంది నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. -
ఆస్పత్రి నుంచి నేడు పోప్ ఫ్రాన్సిస్ డిశ్చార్జి
రోమ్: కేథలిక్కుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్(86) శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని వాటికన్ వర్గాలు తెలిపాయి. సెంట్ పీటర్స్ స్క్వేర్‌లో బుధవారం సంప్రదాయ వారాంతపు ప్రసంగం అనంతరం అస్వస్థతకు గురైన పోప్‌ను రోమ్‌లోని గెమెల్లి పాలీక్లినిక్‌లో చేర్పించారు. బ్రాంకైటిస్‌తో బాధపడుతున్నట్లు పరీక్షల్లో తేలింది. యాంటీబయాటిక్ చికిత్సకు స్పందిస్తున్నారని వాటికన్ ప్రతినిధి చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందన్నారు. అయితే, ఆదివారం నుంచి ఈస్టర్ వీక్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారా లేదా అనేది సందిగ్ధంలో పడింది. ఇప్పటికే మోకాలి నొప్పితో బాధపడుతున్న పోప్ కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నారు. కాగా, పోప్ ఫ్రాన్సిస్ త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ శుక్రవారం ట్వీట్ చేశారు. -
అస్వస్థతకు గురైన పోప్.. ఆస్పత్రిలో చేరిక
వాటికన్ సిటీ: పోప్ ఫ్రాన్సిస్ అస్వస్థతో బుధవారం ఆస్పత్రిలో చేరారు. 86 ఏళ్ల పోప్ శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు, ఆయన్ని రోమ్‌లోని(ఇటలీ) జెమెల్లీ ఆస్పత్రిలో చేరినట్లు వాటికన్ సిటీ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. మరికొన్ని రోజులు ఆయన ఆస్పత్రిలోనే ఉంటారని తెలుస్తోంది. అయితే శ్వాస కోశ సంబంధిత సమస్యలే అయినప్పటికీ.. ఆయన కోవిడ్ సోకలేదని స్పష్టం చేసింది ఆ ప్రకటన. ఆయన అనారోగ్యంపై వార్తలు బయటకు రాగానే.. త్వరగా కోలుకోవాలంటూ సందేశాలు పంపుతున్నారు పలువురు. గత కొంతకాలంగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఏడాదికాలంగా పలు ముఖ్యకార్యక్రమాలకు ఆయన గైర్హాజరు అవుతున్నారు. ఇదీ చదవండి: ప్రజల ఇష్టానుసారమే నిర్ణయం తీసుకుంటాం! -
స్వలింగ సంపర్కం నేరం కాదు: పోప్
వాటికన్ సిటీ: స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాలను పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఆ చట్టాలు పూర్తిగా అనైతికమైనవి. స్వలింగ సంపర్కం నేరం కాదు. దేవుడు తన పిల్లలందరినీ సమానంగా, బేషరతుగా ప్రేమిస్తాడు’’ అని అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘‘స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాలను కొందరు క్యాథలిక్ బిషప్‌లు కూడా సమర్థిస్తున్నారని నాకు తెలుసు. కానీ నా విజ్ఞప్తల్లా ఒక్కటే. స్వలింగ సంపర్కుల పట్ల కాస్త మృదువుగా వ్యవహరించాలి. వారిని కూడా చర్చిల్లోకి అనుమతించాలి. వారిని స్వాగతించి గౌరవించాలి తప్ప వివక్ష చూపి అవమానించరాదు’’ అని ఆయన సూచించారు. అయితే, స్వలింగ సంపర్కం పాపమేనని పోప్ పేర్కొనడం విశేషం. ‘‘ఇది ఒక దృక్కోణం. కాకపోతే ఈ విషయంలో సాంస్కృతిక నేపథ్యాలు తదితరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మాటకొస్తే ఇతరులపై జాలి, దయ చూపకపోవడమూ పాపమే. కాబట్టి నేరాన్ని, పాపాన్ని విడిగానే చూడటం అలవాటు చేసుకుందాం’’ అన్నారు. క్యాథలిక్ బోధనలు స్వలింగ సంపర్కాన్ని తప్పుడు చర్యగానే పేర్కొంటున్నా స్వలింగ సంపర్కులను కూడా ఇతరులతో సమానంగా గౌరవించాలని చెబుతాయి. క్యాథలిక్ చర్చి ప్రకారం స్వలింగ వివాహాలు నిషిద్ధం. దాదాపు 67 దేశాల్లో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. వీటిలోనూ 11 దేశాల్లో ఇందుకు మరణశిక్ష కూడా విధించే ఆస్కారముందని ఈ చట్టాలను రద్దు చేయాలంటూ ఉద్యమిస్తున్న హ్యూమన్ డిగ్నిటీ ట్రస్ట్ పేర్కొంది. అమెరికాలో కూడా 12కు పైగా రాష్ట్రాలు దీన్ని నేరంగానే పరిగణిస్తున్నాయి. ఇలాంటి చట్టాలను రద్దు చేయాలని ఐక్యరాజ్యసమితి కూడా ప్రపంచ దేశాలకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసింది. -
రిటైర్డ్ పోప్ బెనెడిక్ట్16 ఆరోగ్యం విషమం
వాటికన్ సిటీ: పోప్ బాధ్యతల నుంచి కొన్నేళ్ల క్రితం తప్పుకున్న బెనెడిక్ట్–16 ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని వాటికన్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని పేర్కొన్నాయి. 95 ఏళ్ల బెనెడిక్ట్ చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వార్థక్యం వల్ల పలు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయని వాటికన్ అధికార ప్రతినిధి మాటియో బ్రూనీ తెలియజేశారు. బెనెడిక్ట్ కోలుకోవాలంటూ అందరూ ప్రార్థించాలని పోప్ ఫాన్సిస్ విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. వాటికన్ ఆడిటోరియంలో బుధవారం పోప్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. బెనెడిక్ట్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారని ప్రకటించారు. పూర్తి వివరాలు మాత్రం బహిర్గతం చేయలేదు. చదవండి: ‘బాంబ్’ కోరల నుంచి బయటపడని అమెరికా.. కనీవినీ ఎరగని విధ్వసం -
పోప్‌గా ఎన్నికవగానే... రాజీనామా లేఖ రాసిచ్చా
రోమ్: ఆనారోగ్య కారణాలతో విధులు నిర్వర్తించలేని పరిస్థితి ఎదురైతే ఏం చేయాలన్న ఆలోచన తనకు ఎప్పుడో వచ్చిందని పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. ‘‘అందుకే పోప్‌గా ఎన్నికైన వెంటనే త్యాగపత్రం (రాజీనామా లేఖ) రాశా. దాన్ని కార్డినల్ టార్సిసియో బెర్టోనే చేతికిచ్చా. నేను విధులు నిర్వర్తించలేని పరిస్థితి ఎదురైతే పనికొస్తుందని చెప్పా’’ అని చెప్పారు. ఆయన తాజాగా ఓ వార్తా పత్రికతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు తదితరాల వల్ల పోప్ విధులు నిర్వర్తించలేకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా ఈ మేరకు వెల్లడించారు. అలాంటప్పుడు ఏం చేయాలో స్పష్టంగా చెప్పే నిబంధన ఉందని బదులిచ్చారు. రహస్యం బయట పెట్టాను గనుక ఎవరైనా బెర్టోనే దగ్గరికెళ్లి పోప్ రాజీనామా లేఖ చూపించమని అడగవచ్చంటూ చమత్కరించారు. శనివారం 86వ ఏట అడుగు పెట్టిన పోప్ ఫ్రాన్సిస్ కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటం తెలిసిందే. ఆయనకు 2021లో పేగు శస్త్రచికిత్స జరిగింది. మోకాలి నొప్పి తీవ్రంగా బాధించడంతో కొద్ది నెలలు వీల్‌చైర్‌కు పరిమితమయ్యారు. ఇప్పుడు చేతికర్ర సాయంతో నడుస్తున్నారు. మోకాలి నొప్పి బాధ్యతల నిర్వహణకు అడ్డంకిగా మారిందన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. మనం తలతో పని చేస్తాం తప్ప మోకాలితో కాదంటూ ఛలోక్తి విసిరారు. వృద్ధాప్య కారణాలతో గతంలో పోప్ బెనెడిక్ట్ రాజీనామా ఫ్రాన్సిస్‌కు ముందు పోప్‌గా ఉన్న బెనెడిక్ట్–16 రాజీనామా చేయడం తెలిసిందే. వృద్ధాప్యం వల్ల బాధ్యతలను సరిగా నిర్వర్తించ లేకపోతున్నానంటూ ఆయన 2013లో రాజీనామా చేసి తప్పుకున్నారు. గత 600 ఏళ్లలో ఇలా బాధ్యతల నుంచి తప్పుకున్న తొలి పోప్‌గా రికార్డు సృష్టించారు. అనంతరం ఫ్రాన్సిస్ పోప్‌గా ఎన్నికయ్యారు. -
మరింత మందిని కనండి.. ఇటాలియన్లకు పోప్ పిలుపు
మటేరా: ఎన్నికల వేళ ఇటాలియన్లు మరింత మంది పిల్లలను కనాలంటూ పోప్ ఫ్రాన్సిస్ ఇచ్చిన పిలుపు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆదివారం మటేరాలో ఆయన బిషప్‌ల సమావేశంలో ఈ మేరకు కోరారు. వలసదారులను స్వాగతించాలని పిలుపునిచ్చారు. దేవుడు కుటుంబం, మాతృభూమి’నినాదంతో ప్రచారం చేస్తున్న మెలోనీ నేతృత్వంలోని రైటిస్ట్ పార్టీ కూడా ఎక్కువ మందిని కంటే ప్రోత్సాహకాలిస్తామని వాగ్దానం చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ జననాల రేటున్న దేశాల్లో ఇటలీ ఒకటి. చదవండి: చైనాలో ‘సైనిక కుట్ర’పై... అదే అస్పష్టత -
కార్డినల్‌గా తొలి దళితుడు.. పూల ఆంథోనీ
సాక్షి, హైదరాబాద్: ఆర్చిబిషప్ పూల ఆంథోనీ(60) క్యాథలిక్ కార్డినల్‌గా ప్రకటించబడ్డ విషయం తెలిసిందే. కేథలిక్కుల మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్.. వాటికన్ సిటీ(ఇటలీ) సెయింట్ పీటర్స్ బాసిలికాలో ఇవాళ పూల ఆంథోనీని కార్డినల్‌గా అధికారికంగా ప్రకటించనున్నారు. ఏపీ కర్నూల్‌కు చెందిన పూల ఆంథోనీ.. కార్డినల్ హోదా అందుకోబోయే తొలి దళితుడు కూడా. ఇవాళ(ఆగస్టు 27న) జరగబోయే కొత్త కార్డినల్స్ పరిషత్ సమావేశానికి కూడా పూల ఆంథోనీ హాజరుకానున్నారు. ఇక కేథలిక్ చర్చి చరిత్రలో ఈ హోదా పొందిన తొలి తెలుగు వ్యక్తి పూల ఆంథోనీ. కార్డినల్ హోదాలో.. పోప్ ఎన్నికలో పాల్గొనే అవకాశం పూల ఆంథోనీకి ఉంటుంది. ఆంథోనీతో పాటు భారత్ నుంచి గోవా, డామన్ ఆర్చి బిషప్ ఫిలిపె నెరి అంటోనియో సెబాస్టియో డొ రొసారియో ఫెర్రో కూడా కార్డినల్ ర్యాంక్ పొందిన వాళ్లలో ఉన్నారు. నేపథ్యం.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చిందుకూరు గ్రామంలో జన్మించిన ఆంథోనీ.. 1992లో మొదటిసారిగా కడపలో క్రైస్తవ మతాచార్యుడుగా, 2008లో కర్నూలు బిషప్‌గా నియమితులయ్యారు. 2021 జనవరిలో హైదరాబాద్ ఆర్చిబిషప్ అయ్యారు. కార్డినల్‌గా నియమితులైన ఆంథోనీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర ప్రాంతాలతో కూడిన హైదరాబాద్ ఆర్చిబిషప్ హోదాలోనూ కొనసాగుతున్నారు. ఇదీ చదవండి: 500 ఏళ్ల కళా చరిత్రలో అతి పెద్ద వేలం -
‘తూర్పు’పై రష్యా పట్టు
కీవ్: తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా క్రమంగా పట్టు సాధిస్తోంది. అక్కడ 80 శాతం ఇప్పటికే రష్యా చేతిలోకి వెళ్లిపోయింది. అక్కడి డొనెట్స్క్ ప్రాంతంలో కీలక నగరమైన సెవెరోడొనెట్స్‌క్‌ను కూడా రష్యా సేనలు దాదాపుగా ఆక్రమించుకున్నాయి. భారీ ఆయుధాలతో అవి పెను విధ్వంసం సృష్టిస్తుండటంతో ఉక్రెయిన్ సేనలు శివారు ప్రాంతాలకు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన పౌరులను వీలైనంత త్వరగా తరలించేందుకు ఉక్రెయిన్ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. లక్ష మంది జనాభాలో వలసల అనంతరం 12 వేల మంది దాకా ఇంకా నగరంలో ఉన్నట్టు అంచనా. వారికి న్యితావసరాలతో పాటు అన్నిరకాల సరఫరాలకూ దారులు పూర్తిగా మూసుకుపోయాయి. దాదాపు 800 మంది దాకా ఆశ్రయం పొందుతున్న అజోట్ కెమికల్ ప్లాంటుపై రష్యా పెద్దపెట్టున బాంబు దాడులు చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ప్లాంటులో నుంచి పౌరులు సురక్షితంగా వెళ్లిపోయేందుకు వీలుగా బుధవారం మానవీయ కారిడార్ తెరుస్తామని రష్యా సైనికాధికారి కల్నల్ జనరల్ మిఖాయిల్ మిజినెత్సేవ్ ప్రకటించారు. ఉక్రెయిన్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పరిస్థితి క్లిష్టంగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు. కానీ తమ దళాలు శక్తిమేరకు పోరాడుతున్నాయన్నారు. రష్యాది క్రూరత్వం: పోప్ రష్యాపై పోప్ ఫ్రాన్సిస్ తొలిసారిగా తీవ్ర పదజాలం ప్రయోగించారు. ఉక్రెయిన్‌లో రష్యా దళాలు చెప్పలేనంత క్రూరత్వానికి, అకృత్యాలకు పాల్పడుతున్నాయంటూ మండిపడ్డారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ దేశ రక్షణలో ఉక్రెయిన్ పౌరులు చూపుతున్న ధైర్యసాహసాలు, హీరోయిజం అద్భుతమని ప్రశంసించారు. తూర్పున విస్తరించేందుకు నాటో చేసిన ప్రయత్నాలే రష్యాను యుద్ధానికి పురిగొల్పాయని అభిప్రాయపడటం విశేషం. -
కార్డినల్‌గా పూల ఆంథోనీ
హైదరాబాద్: ఆర్చిబిషప్ పూల ఆంథోనీ(60) భారత్‌లో కార్డినల్‌గా నియమితులయ్యారు. కేథలిక్కుల మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో ఆదివారం 21 మందిని కొత్త కార్డినల్స్‌గా ప్రకటించారు. వీరిలో భారత్ నుంచి ఆంథోనీతోపాటు గోవా, డామన్ ఆర్చి బిషప్ ఫిలిపె నెరి అంటోనియో సెబాస్టియో డొ రొసారియో ఫెర్రో ఉన్నారు. కేథలిక్ చర్చి చరిత్రలో ఈ హోదా పొందిన తొలి తెలుగు వ్యక్తి పూల ఆంథోనీ. కార్డినల్ హోదాలో పోప్ ఎన్నికలో పాల్గొనే అవకాశం ఈయనకు ఉంటుంది. ఆగస్ట్ 27వ తేదీన జరిగే సమావేశం నాటికి కార్డినల్స్ సంఖ్య 229కు పెరగనుంది. అందులో 131 మందికి పోప్ ఎన్నికలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చిందుకూరు గ్రామంలో జన్మించిన ఆంథోనీ 1992లో మొదటిసారిగా మతాచార్యుడుగా, 2008లో కర్నూలు బిషప్‌గా నియమితులయ్యారు. 2021 జనవరిలో హైదరాబాద్ ఆర్చిబిషప్ అయ్యారు. ఆగస్ట్ 27న వాటికన్లో కొత్త కార్డినల్స్ పరిషత్ సమావేశానికి పూల ఆంథోనీ హాజరుకానున్నారు. కార్డినల్‌గా నియమితులైన ఆంథోనీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర ప్రాంతాలతో కూడిన హైదరాబాద్ ఆర్చిబిషప్ హోదాలోనూ కొనసాగనున్నారు. -
సామాన్యునికి సెయింట్‌హుడ్
వాటికన్ సిటీ: మూడు శతాబ్దాల క్రితం క్రైస్తవాన్ని స్వీకరించి, చిత్రహింసలకు గురైన తమిళనాడుకు చెందిన సాధారణ పౌరుడు దేవసహాయం పిళ్లైకి సెయింట్‌హుడ్ (మహిమాన్విత హోదా) లభించింది. వాటికన్ నగరంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ ఆయనకు మహిమాన్విత హోదా ప్రకటించారు. భారత్‌కు చెందిన ఒక సాధారణ పౌరుడికి కేథలిక్కు మతంలో అత్యున్నత గౌరవం దక్కడం ఇదే మొదటిసాది. దేవసహాయంతో పాటు పలు దేశాలకు చెందిన మరో తొమ్మిది మందికి సెయింట్ హోదా ఇచ్చారు. వారిలో నలుగురు మహిళలున్నారు. 1712 ఏప్రిల్ 23న కేరళలోని ట్రావెంకోర్ రాజ్యంలో హిందూ నాయర్ కుటుంబంలో దేవసహాయం జన్మించారు. ట్రావెంకోర్ రాజు మార్తాండ వర్మ సంస్థానంలో అధికారిగా పని చేశారు. క్రైస్తవం పట్ల ఆకర్షితుడై ఆ మతాన్ని స్వీకరించి ప్రబోధాలు చేయసాగారు. కోపోద్రిక్తుడైన రాజు దేవసహాయాన్ని ఊరూరా తిప్పుతూ చిత్రహింసలు పెట్టారు. అయినా ప్రజల సమానత్వంపైనే ప్రసంగాలు చేయడంతో 1752 జనవరి 14న కన్యాకుమారిలో కాల్చిచంపారు. దేవసహాయాన్ని చిత్రహింసలకు గురి చేసిన అన్ని ప్రాంతాల్లోనూ అద్భుతమైన మహిమలు జరిగాయని భారత్‌కు చెందిన కేథలిక్ బిషప్స్ సమాఖ్య పోప్ ఫ్రాన్సిస్ దృష్టికి తీసుకెళ్లింది. ఆ మహిమలను 2014లో పోప్ గుర్తించినట్టు వెల్లడించారు. -
Ukraine War: హామీకి రష్యా తూట్లు.. పుతిన్ స్పందన కరువు!
కీవ్: కాల్పుల విరమణ హామీకి తూట్లు పొడుస్తూ మారియుపోల్‌లోని అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంటుపై రష్యా సైన్యం మంగళవారం మళ్లీ కాల్పులకు, దాడులకు దిగిందని ఉక్రెయిన్ ఆరోపించింది. ప్లాంటును స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను కూడా ముమ్మరం చేసిందని చెప్పింది. ప్లాంటును ఆక్రమించొద్దని సైన్యాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్, రెండు వారాల క్రితం ఆదేశించడం తెలిసిందే. ప్లాంటులో చిక్కుబడ్డ పౌరులు సురక్షితంగా వెళ్లనిచ్చేందుకు ఐరాస విజ్ఞప్తి మేరకు రష్యా రెండు రోజుల క్రితం అంగీకరించింది. అందులో భాగంగా సోమవారం 100 మందికి పైగా పౌరులు ప్లాంటు నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. మరో 200 మంది దాకా మహిళలు, పిల్లలు ప్లాంటులో ఉన్నట్టు సమాచారం. ఇక యుద్ధం మొదలైన నాటినుంచి 10 లక్షలకు పైగా ఉక్రేనియన్లను రష్యాకు తరలించినట్టు ఆ దేశ రక్షణ శాఖ అంగీకరించింది. వీరిలో 2 లక్షలకు పైగా చిన్నారులే ఉన్నారని చెప్పింది. ఇదిలా ఉండగా శాంతి చర్చల విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వైఖరిపై పోప్ ఫ్రాన్సిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాస్కో వచ్చి చర్చలు జరుపుతానని నెలన్నర కింద కోరితే.. పుతిన్ ఇప్పటికీ స్పందించలేదని పోప్ ఫ్రాన్సిస్ చెప్పారు. మరింత సాయం: ఇంగ్లండ్ ఉక్రెయిన్‌కు మరింత సైనిక సాయం చేస్తామని ఇంగ్లండ్ ప్రకటించింది. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ఉక్రెయిన్ పార్లమెంటును ఉద్దేశించి మాట్లాడారు. మరో 30 కోట్ల పౌండ్ల మేరకు సైనిక సాయం అందిస్తామని చెప్పారు. ఉక్రెయిన్ పోరాట పటిమ అద్భుతమని కొనియాడారు. ‘‘ఈ పోరులో ఉక్రెయిన్ గెలిచి తీరాలి. అందుకోసం ఏం చేయడానికైనా ఇంగ్లండ్ సిద్ధం. కీవ్ ఆక్రమణ యత్నాన్ని తిప్పికొట్టడం ద్వారా ఉక్రెయిన్ ఇప్పటికే 21వ శతాబ్దంలో అత్యంత గొప్ప సాయుధ విజయాన్ని నమోదు చేసింది’’ అని ప్రశంసించారు. ఉక్రెయిన్‌కు 13 ప్రత్యేక బులెట్ ప్రూఫ్ టొయోటా లాండ్ క్రూజర్లు పంపనున్నట్టు ఇంగ్లండ్ చెప్పింది. చదవండి: రష్యా మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం -
Ukraine War: యుద్ధం ఆపకుంటే ఆకలి కేకలు తప్పవు!
ఉక్రెయిన్ ప్రపంచంలోనే అత్యధికంగా ఆహారోత్పత్తులను ఎగుమతి చేసే దేశం. అలాంటి దేశం యుద్ధంతో తల్లడిల్లుతోంది. రష్యా బలగాల దాడుల్లో పంట పండించడం కష్టతరంగా మారడమే కాదు.. ఇప్పటికే ఉన్న పంట నాశనం అయిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే.. ఉక్రెయిన్‌తో పాటు కొన్ని దేశాల్లో ఆకలి కేకలను ప్రపంచం చూడాల్సి వస్తుంది. ఈ మాటలు అంటోంది ఎవరో కాదు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ. ఒకవైపు రష్యాకు లొంగిపోయే ప్రసక్తే లేదంటున్న జెలెన్స్కీ.. ఏది ఏమైనా శాంతి చర్చల ద్వారానే సమస్య పరిష్కారం కావాలని, అందుకోసం ఎంత దూరమైనా వెళ్తానని అంటున్నాడు. ఉక్రెయిన్‌పై రష్యా బలగాల దాడులు 27వ రోజుకి చేరిన వేళ.. మంగళవారం ఇటాలియన్ పార్లమెంట్‌ను ఉద్దేశించి జెలెన్స్కీ ప్రసంగించాడు. రష్యా దాడులు ఒక్క ఉక్రెయిన్ను మాత్రమే సంక్షోభంలో నెట్టేయదని, చాలా దేశాలు ఆహార కొరతతో ఇబ్బందిపడతాయని జెలెన్స్కీ అంటున్నాడు. కాబట్టి, ఆక్రమణదారులను ఓడించేందుకు సాయం చేయాలంటూ ఇటలీ ప్రతినిధులను కోరాడాయన. దానికి ఇటలీ కూడా సానుకూలంగానే స్పందించింది. ఇక ఉక్రెయిన్ నుంచి గోధుమలు, మొక్కజోన్న, సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలోనే మేజర్ వాటాదారునిగా ఉంది ఉక్రెయిన్. అయితే రష్యా దాడుల నేపథ్యంలో.. నల్ల సముద్ర తీరాలను షిప్పులు దాటే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడికక్కడే వాణిజ్యం స్థంభించి పోయింది. పైగా ఉత్పత్తుల్లో చాలావరకు పాడైపోయినట్లు ఉక్రెయిన్ అధికారులు చెప్తున్నారు. లెబనాన్, ఈజిప్ట్, యెమెన్.. ఇతర దేశాలు ఇటీవలి సంవత్సరాలలో ఉక్రేనియన్ గోధుమలపై ఆధారపడుతున్నాయి. ఈ యుద్ధం ఎఫెక్ట్‌తోనే గోధుమల ధరలు గత నెలలో 50% మేర పెరిగాయి. ఇదిలా ఉంటే.. పాశ్చాత్య దేశాల అధినేతలను ఉద్దేశించి జెలెన్స్కీ ఓ వీడియో లింక్‌ను విడుదల చేశాడు. ఉక్రెయిన్ ఎల్లప్పుడూ అతిపెద్ద ఆహార ఎగుమతిదారులలో ఒకటనే విషయం తెలుసు కదా, అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పుడు పరిస్థితుల్లో కొన్ని దేశాలు ఆకలి కేకలు పెట్టొచ్చు. రష్యన్ ఫిరంగి దాడులతో ఉన్న పంటలు నాశనం అవుతున్నాయి.. ఇంక కొత్త పంటలు ఎలా పండుతాయి? అని నిలదీశాడు. పోప్.. ప్లీజ్ జోక్యం చేసుకోండి ఉక్రెయిన్ పరిణామాలపై జెలెన్స్కీ, పోప్ ఫ్రాన్సిస్‌తో ఫోన్లో చర్చించినట్లు సమాచారం. ఈ విషయంలో జోక్యం చేసుకుని.. శాంతి చర్చల ద్వారా ఒక ముగింపు పలకాలని ఆయన్ని జెలెన్స్కీ కోరినట్లు సమాచారం. ఈ మేరకు చర్చల సారాంశం తాలుకా సందేశాన్ని ఆయన ట్విట్టర్లో సైతం పోస్ట్ చేశారు. అయితే పోప్-Russian Orthodox Patriarch Kirill మధ్య శాంతి స్థాపన కోసం ఈ నెల మొదట్లోనే చర్చలు జరిగాయి. కానీ, Patriarch Kirill of Moscow మాత్రం.. ఉక్రెయిన్ బలగాలను దుష్టశక్తులుగా పేర్కొంటూ యుద్ధానికి ఎగవేస్తుండడం విశేషం. ఇక యుద్ధం మొదలై.. దాదాపు నెలరోజులు కావొస్తున్న చర్చల్లో ఎలాంటి పురోగతి లేకుండా పోవడంతో ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. Talked to @Pontifex. Told His Holiness about the difficult humanitarian situation and the blocking of rescue corridors by Russian troops. The mediating role of the Holy See in ending human suffering would be appreciated. Thanked for the prayers for Ukraine and peace. pic.twitter.com/wj4hmrTRGd — Володимир Зеленський (@ZelenskyyUa) March 22, 2022 చదవండి: భాష రాక ఉక్రేనియన్ల గోస.. ఆ అంధుడికి సలాం! -
స్త్రీని బాధపెట్టడం అంటే దేవుడిని అవమానించడమే
To Hurt A Woman Is To Insult God": Pope Francis In New Year's Speech: పోప్ ఫ్రాన్సిస్ నూతన సంవత్సర ప్రసంగంలో మహిళలపై హింసను అరికట్టాలని పిలుపునిచ్చారు. స్త్రీని అవమానించడం అంటే దేవుడిని అవమానించడమేనని అన్నారు. అంతేకాదు సెయింట్ పీటర్స్ బసిలికాలోని రోమన్ క్యాథలిక్ చర్చిలో పవిత్ర మేరీ మాత సమక్షంలో నూతన సంవత్సర వేడుకల తోపాటు ప్రపంచ శాంతి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు (చదవండి: ఐదేళ్ల జైలు శిక్ష తర్వాత మాజీ అధ్యక్షురాలికి క్షమాభిక్ష) పైగా ఫ్రాన్సిస్ నూతన సంవత్సర వేడుకల్లో మహిళలు మనకు జీవితాన్ని ప్రసాదించడమే కాక ప్రపంచాన్ని ఐక్యమత్యంగా ఉంచుతారు కాబట్టి మనమందరం మహిళలను రక్షించడానికే ఎక్కువ ప్రయత్నాలు చేద్దాం అని పిలుపునిచ్చారు. అంతేకాదు మానవత్వానిక ప్రతీక అయిన స్త్రీని అవమానించటం అంటే దేవుడిని అవమానించడమే అని స్పష్టం చేశారు. పైగా కోవిడ్ లాక్డౌన్ సమయాల్లో గృహహింస గురించి ఫ్రాన్సిస్ చాలాసార్లు మాట్లాడారు. అంతేకాక రాబోయే సంవత్సరంలో వాటికన్లో తనను అధికారికంగా సందర్శించే నాయకులకు పోప్ సంతకం చేసిన కాపీని అందజేస్తారు. (చదవండి: రోగితో నర్సు చాటింగ్.. రూ. 20 లక్షలు ఇవ్వమంటూ బ్లాక్మెయిల్!) -
పోప్ ఫ్రాన్సిస్‌తో ప్రధాని మోదీ భేటీ
-
పోప్ ఫ్రాన్సిస్‌ను భారత్ ఆహ్వానించిన మోదీ
ఢిల్లీ: ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లపై ప్రపంచ దేశాల అధినేలతో చర్చిస్తున్నారు. ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘీ ఆహ్వానం మేరకు రోమ్ వెళ్లిన నరేంద్ర మోదీ శనివారం పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశం అయ్యారు. ఫ్రాన్సిస్ పోప్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనను కలిసిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. వాటికన్ సిటీలో ప్రధాని నరేంద్ర మోదీ, పోప్ ఫ్రాన్సిస్ మధ్య గంట పాటు సమావేశం కొనసాగింది. (చదవండి: మహాత్ముని తర్వాత మోదీయే: రాజ్‌నాథ్) షెడ్యూల్ ప్రకారం 20 నిమిషాలు కొనసాగాల్సినప్పటికీ, గంట పాటు కొనసాగిన మీటింగ్‌లో పేదరిక నిర్మూలన సహా అనేక విస్తృత అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ధరిత్రి పరిరక్షణ చర్యలపై చర్చించారు. భారత్ పర్యటనకు రావాలని పోప్ ఫ్రాన్సిస్‌కు ఆహ్వానం పలికారు మోదీ. నవంబర్ 1 నుంచి 2 వరకూ గ్లాస్గోలో పర్యటించనున్నారు మోదీ. గ్లాస్గోలో రెండు రోజులపాటు జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ(కాప్) సదస్సుకు 120 దేశాల అధ్యక్షులు, ప్రతినిధులు హాజరవుతారన్నారు. చదవండి: నేను మరణించాలని కోరుకున్నారు: పోప్ -
నేను మరణించాలని కోరుకున్నారు: పోప్
రోమ్: క్యాథలిక్ క్రైస్తవుల మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మరణించాలని చర్చికే చెందిన కొందరు అధికారులు కోరుకు న్నారని వ్యాఖ్యానించారు. ఇటీవలే ఆయనకు ఉదర సంబంధిత సర్జరీ జరిగింది. సర్జరీ సమయానికి తాను తీవ్ర అస్వస్థతతో ఉన్నానని వారు భావించారంటూ సంప్రదాయవాదులను ఉద్దేశించి అన్నారు. తాను మరణించాలని వారు కోరు కున్నారని చెప్పారు. గత వారం ఆయన స్లొవేకియా పర్యటనకు వెళ్లారు. అక్కడ ఓ మీడియాకు ఇచ్చిన ఇంట ర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. తాను మరణిస్తే తదుపరి పోప్‌ను ఎన్నుకోవడానికి కూడా వారు సిద్ధమయ్యారని, కానీ దేవుడి దయ వల్ల తాను బాగానే ఉన్నానని పేర్కొన్నారు. లాటిన్ భాషా పూజా విధానం కారణంగా చర్చిలో చీలికలు వస్తున్నాయని అంతర్గత నివేదికల ద్వారా గ్రహిం చిన పోప్ ఫ్రాన్సిస్, దానిపై ఆంక్షలు పెట్టారు. ఇది చర్చిలోని సంప్రదాయవాదులకు నచ్చలేదు. దీంతో పాటు ఆయన తీసుకునే పలు నిర్ణయాలు సంప్రదాయవాదులకు కోపం తెప్పిస్తున్న నేపథ్యంలో పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
పోప్ ఫ్రాన్సిస్ కీలక నిర్ణయం
రోమ్: క్రైస్తవుల ఆరాధనా పద్ధతికి సంబంధించిన వ్యవహారంపై పోప్ ఫ్రాన్సిస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చర్చిలో చీలికకు కారణమవుతోందనే కారణంతో ‘లాటిన్ మాస్’పై శుక్రవారం ఆంక్షలు పెట్టారు. ఈ ఆంక్షలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ చర్యతో మాజీ పోప్ బెనెడిక్ట్16 తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత పోప్ ఫ్రాన్సిస్ వ్యతిరేకించినట్లు అయింది. ప్రస్తుతమున్న స్థానిక భాష ఆరాధనా క్రమాన్ని 1960లలో జరిగిన వాటికన్2 సమావేశం నుంచి పాటిస్తున్నారు. అంతకు ముందు ఆ కార్యక్రమాన్ని కేవలం లాటిన్ భాషలోనే ప్రపంచమంతటా నిర్వహించేవారు. అయితే కొన్ని చోట్ల లాటిన్ భాష ఇంకా కొనసాగుతుండగా, పోప్ దానిపై ఆంక్షలు పెట్టారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల బిషప్లెవరూ వారి ప్రాంతాల్లో లాటిన్ మాస్ గ్రూపులు ఏర్పడకుండా చూసుకోవాల్సిన బాధ్యతను కూడా ఈ ఆంక్షల్లో పోప్ ప్రస్తావించారు. అంతర్గతంగా చర్చిలో జరుగుతున్న వ్యవహారాలపై పోప్ నివేదిక తెప్పించుకోగా, అందులో లాటిన్ మాస్ వ్యవహారంపై ప్రత్యేక గ్రూపులు ఉన్నట్లు తేలింది. దీంతో తప్పక జోక్యం చేసుకోవాల్సిన బాధ్యత తనపై పడిందని పోప్ పేర్కొన్నారు. ప్రస్తుత పోప్‌పై సంప్రదాయవాదులు ఆయన నిర్ణయంపై వ్యతిరేకత వెలిబుచ్చుతున్నారు. -
అరబ్ దేశంలో పోప్ ఫ్రాన్సిస్ చారిత్రక పర్యటన
ఉర్: కేథలిక్ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్(84) అరబ్ దేశం ఇరాక్‌లో మొట్టమొదటిసారిగా పర్యటిస్తున్నారు. శనివారం ఆయన ఇరాక్‌లోని పవిత్ర నగరం నజాఫ్‌లో షియాల గ్రాండ్ అయతొల్లా అలీ అల్– సిస్తానీ(90)తో భేటీ అయ్యారు. ఈ చారిత్రక సమావేశంలో ఇరువురు మతపెద్దలు శాంతియుత సహజీవనం సాగించాలని ముస్లింలను కోరారు. ఇరాక్‌లోని క్రైస్తవులను కాపాడుకోవడంలో మతాధికారులు కీలకపాత్ర పోషించాలని, ఇతర ఇరాకీయుల మాదిరిగానే వారు కూడా సమానహక్కులతో స్వేచ్ఛగా జీవించాలని గ్రాండ్ అయతొల్లా అలీ అల్– సిస్తానీ ఆకాంక్షించారు. తన వద్దకు వచ్చేందుకు శ్రమ తీసుకున్న పోప్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత బలహీనవర్గాలు, తీవ్ర వేధింపులకు గురయ్యే వారి పక్షాన గళం వినిపించినందుకు పోప్ ఫ్రాన్సిస్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారని వాటికన్ పేర్కొంది. ఇరాక్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియాలు గౌరవించే మత పెద్దల్లో అల్ సిస్తానీ ఒకరు. అల్ సిస్తానీ నివాసంలో జరిగిన ఈ భేటీకి కొన్ని నెలల ముందు నుంచే అయతొల్లా కార్యాలయం, వాటికన్ అధికారుల మధ్య తీవ్ర కసరత్తు జరిగినట్లు సమాచారం. గ్రాండ్ అయతొల్లా భేటీతో ఇరాక్‌లోని షియా సాయుధ ముఠాల వేధింపుల నుంచి క్రైస్తవులకు భద్రత చేకూర్చడం, క్రైస్తవుల వలసలను నిరోధించడమే పోప్ ఫ్రాన్సిస్ పర్యటన ఉద్దేశంగా భావిస్తున్నారు. 40 నిమిషాల సేపు చర్చలు పోప్ ఫ్రాన్సిస్ శనివారం బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్ బెంజ్ కారులో నజాఫ్‌కు బయలుదేరి వెళ్లారు. షియాలు అత్యంత పవిత్రంగా భావించే ఇమామ్ అలీ సమాధి ఉన్న రసూల్ వీధిలోని అల్ సిస్తానీ నివాసానికి కాలినడకన చేరుకున్నారు. అక్కడ, ఆయనకు సంప్రదాయ దుస్తులు ధరించిన కొందరు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పోప్ శాంతి చిహ్నంగా పావురాలను గాలిలోకి వదిలారు. పోప్ తన షూస్ వదిలేసి అల్ సిస్తానీ ఉన్న గదిలోకి ప్రవేశించారు. సందర్శకుల రాక సమయంలో సాధారణంగా తన సీట్లో కూర్చుని ఉండే అల్ సిస్తానీ లేచి నిలబడి, పోప్ ఫ్రాన్సిస్‌ను తన గదిలోకి ఆహ్వానించారనీ, ఇది అరుదైన గౌరవమని చెప్పారు. మాస్కులు ధరించకుండానే ఇరువురు పెద్దలు దగ్గరగా కూర్చుని మాట్లాడుకున్నారని చెప్పారు. వారి భేటీ సుహృద్భావ వాతావరణంలో 40నిమిషాల పాటు సాగిందని నజాఫ్‌కు చెందిన అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అల్ సిస్తానీయే ఎక్కువ సేపు మాట్లాడారన్నారు. ఫ్రాన్సిస్‌కు టీ, బాటిల్ నీళ్లు అందజేయగా, ఆయన నీరు మాత్రమే తాగారని చెప్పారు. అయితే, ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న పోప్.. శుక్రవారం బాగ్దాద్‌లో పలువురితో సమావేశం కావడం, అల్ సిస్తానీ కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోవడం నేపథ్యంలో కొంత ఆందోళన వ్యక్తమైందని కూడా ఆయన అన్నారు. అనంతరం ఆయన పురాతన ఉర్ నగరంలో సర్వమత సమ్మేళానికి వెళ్లారు. అక్కడ, మత పెద్దలంతా గౌరవపూర్వకంగా లేచి నిలబడి ఆయనకు స్వాగతం పలికారు. మాస్కు ధరించి పోప్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇరాక్‌లోని ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతాల వారు శతాబ్దాలుగా ఉన్న వైరాన్ని మరిచి శాంతి, ఐక్యతల కోసం కృషి చేయాలని ఆయన కోరారు. క్రైస్తవులు, ముస్లింలు, యూదుల విశ్వాసాలకు మూలపురుషుడిగా భావించే అబ్రహాం జన్మించింది ఉర్లోనే కావడం విశేషం. శుక్రవారం ఇరాక్ చేరుకున్న పోప్ ఫ్రాన్సిస్ మొదటి రోజు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలయ్యాక పోప్ చేపట్టిన మొదటి పర్యటన ఇదే. గ్రాండ్ అయతొల్లాతో భేటీ అయిన మొదటి పోప్ కూడా ఆయనే. పోప్ రాక సందర్భంగా నజాఫ్‌లో 25 వేల మంది బలగాలు భారీ బందోబస్తు చేపట్టాయి. -
సినాడ్ అండర్ సెక్రటరీగా మహిళ
వాటికన్ సిటీ: రోమన్ క్యాథలిక్కుల గురువు పోప్ ఫ్రాన్సిస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంప్రదాయాన్ని పక్కనబెట్టి కీలకమైన సినాడ్ (బిషప్పుల మహాసభ) అండర్ సెక్రటరీ పదవికి మొట్టమొదటిసారిగా మహిళను ఎంపిక చేశారు. ఆమెకు ఓటింగ్ హక్కులను కూడా కల్పించారు. కొత్తగా నియమితులైన ఇద్దరు అండర్ సెక్రటరీల్లో ఒకరు స్పెయిన్‌కు చెందిన లూయిస్ మారిన్ డీ సాన్ మార్టిన్ కాగా, మరొకరు ఫ్రాన్సుకు చెందిన సిస్టర్ నథాలీ బెకార్ట్(51) కావడం గమనార్హం. క్రైస్తవ మతంలో సిద్ధాంతపరంగా తలెత్తే ప్రధాన ప్రశ్నలపై సినాడ్ అధ్యయనం చేస్తుంది. సినాడ్‌లో బిషప్పులు, కార్డినల్స్ తోపాటు నిపుణులు కూడా ఉంటారు. వీరిలో బిషప్పులు, కార్డినల్స్కు మాత్రమే ఓటింగ్ హక్కులుంటాయి. అండర్ సెక్రటరీగా నియమితురాలైన బెకార్ట్‌కు కూడా ఓటింగ్ హక్కు కల్పించారు. చర్చికి సంబంధించిన విషయాల్లో సూక్ష్మపరిశీలన, నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలు కీలకంగా మారాలన్న పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్ష మేరకు ఈ నియామకం జరిగిందని సినాడ్ సెక్రటరీ జనరల్ కార్డినల్ మరియో గ్రెక్ తెలిపారు. ‘గతంలో నిపుణులుగా, పరిశీల కులుగా మాత్రమే మహిళలు సినాడ్‌లో ఉండే వారు. సిస్టర్ బెకార్ట్ ఎంపికతో మహిళలు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు కూడా అవకాశం కలిగింది’అని ఆయన పేర్కొన్నారు. ఫ్రాన్సు లోని జేవియర్ సిస్టర్స్ సంస్థ సభ్యురాలైన బెకార్ట్, ప్యారిస్‌లోని ప్రఖ్యాత హెచ్ఈసీ బిజినెస్ స్కూల్ నుంచి మేనేజ్మెంట్లో డిగ్రీ పొందారు. బోస్టన్ యూనివర్సిటీలో కూడా ఆమె అధ్యయనం చేశారు. 2019 నుంచి సినాడ్‌కు కన్సల్టెంట్‌గా కొనసాగుతున్నారు. కాగా, సినాడ్ తరువాతి సమావేశం 2022లో జరగనుంది. 2019లో అమెజాన్‌పై ఏర్పడిన ప్రత్యేక సినాడ్ సమావేశానికి 35 మంది మహిళా ఆడిటర్లను ఆహ్వానించినప్పటికీ వారెవరికీ ఓటింగ్ హక్కులు ఇవ్వలేదు. -
కరోనా టీకా అందరికీ అందాలి
వాటికన్ సిటీ: కరోనా టీకాపై పేటెంట్ హక్కులు ఎవరికి ఉన్నప్పటికీ.. అది ప్రజలందరికీ అందాలని పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్షించారు. కరోనాపై ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వారికి, వైరస్ బాధితులకు తొలుత టీకా అందేలా ప్రభుత్వాలు కృషి చేయాలని విన్నవించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పోప్ ఇటలీలో ఉన్న వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ నుంచి సందేశం ఇచ్చారు. కరోనా బారినపడే అవకాశం ఉన్నవారికి ముందుగా టీకా ఇస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. పలు కరోనా వ్యాక్సిన్లు అభివృద్ధి చెందుతుండడం ప్రపంచానికి ఒక ఆశారేఖ లాంటిదేనని అన్నారు. పోటీని కాదు, పరస్పర సహకారాన్ని పెంపొందించే దిశగా దేశాల అధినేతలు, వ్యాపారవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు ముందడుగు వేయాలని పేర్కొన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మనుషులంతా ఒకరికొకరు సహరించుకోవాలని చెప్పారు. మన కుటుంబం, మన మతం, మన వర్గం కాకపోయినా ఇతరులకు స్నేహ హస్తం అందించాలని ఉద్బోధించారు. కళ తగ్గిన క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలపై కరోనా ప్రభావం పడింది. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్లు, ఆంక్షలు, సరిహద్దుల మూసివేతలు, ప్రయాణాల నిషేధాలతో క్రిస్మస్ కాంతులు మసకబారాయి. అయితే వ్యాక్సిన్లపై ఆశలు మానవాళి మదిలో కదలాడుతూ పండుగ స్ఫూర్తిని కొనసాగించేలా చేశాయని, కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో అధికారికంగా చర్చ్‌లు సామూహిక ప్రార్ధనలు రద్దు చేశాయి. ధాయ్‌లాండ్ తదితర దేశాలకు పండుగ కోసం వచ్చిన స్వదేశీయులు క్వారంటైన్లో గడుపుతున్నారు. ఆఫ్రికాదేశాల్లో సైతం ప్రజలు ఆంక్షల మూలంగా పండుగ ఉత్సాహాన్ని పొందలేకపోయారు. వాటికన్లో క్రిస్మస్ రోజు ఆనవాయితీగా సెయింట్ పీటర్ బాసిలికా బాల్కనీలో దర్శనమిచ్చే పోప్, ఈ దఫా దర్శనాన్ని రద్దు చేసుకున్నారు. -
కనిపించని క్రిస్మస్ ఉత్సాహం
బెత్లహాం: ప్రతిసంవత్సరం బెత్లహాంలో అంగరంగవైభవంగా జరిగే క్రిస్మస్ వేడుకలపై కరోనా నీడ పడింది. దీంతో గురువారం ఆరంభమైన ఉత్సవాలకు కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. ప్రతిసారీ ప్రపంచం నలుమూలల నుంచి బెత్లహాంకు భక్తులు ఈ ఉత్సవాలు చూసేందుకు వచ్చేవారు. ఈదఫా ప్రయాణాలపై ఆంక్షలతో దాదాపు విదేశీ యాత్రికులు కనిపించడంలేదు. వాటికన్ సిటీలో జరిగే పోప్ ఫ్రాన్సిస్ పూజాకార్యక్రమాలకు కూడా కర్ఫ్యూ కారణంగా ఎవరూ హాజరు కాకపోవచ్చని అంచనా. యూరప్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా కరోనా ఆంక్షలు క్రిస్మస్ ఉత్సాహాన్ని తగ్గించాయి. -
బికినీ మోడల్ ఫోటోకి ‘లైక్’.. చిక్కుల్లో పోప్
వాటికన్ సిటి: మతాధికారులు, గురువులు, ప్రీస్ట్‌లకు కొన్ని పరిమితులు ఉంటాయి. సామాన్యుల మాదిరిగా ప్రవర్తించకూడదు. బంధాలు, బాహ్య సుఖాలకు దూరంగా ఉండాలి. వాంఛలు లేకుండా బతకాలి. అలా కాదని హద్దు దాటితే ఇదిగో ఇలానే విమర్శలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. తాజాగా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు పోప్ ఫ్రాన్సిస్. ‘మీకిది తగునా.. దీనికి మీ సమాధానం ఏంటి’ అని ప్రశ్నిస్తున్నారు నెటిజనులు. ఇంత ఆగ్రహం దేనికి అంటే పోప్ ఇన్స్టాగ్రామ్ అధికారక అకౌంట్ నుంచి.. బికినీ ధరించిన ఓ బ్రేజిలియన్ మోడల్ ఫోటోని లైక్ చేశారు. దాంతో ఈ విమర్శలు. వివరాలు.. మోడల్ నటాలియో గారిబోట్టో గత నెల ఐదో తారీఖున బికినీ ధరించి ఓ స్కూల్ లాకర్ వద్ద నిలబడి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘నేను మీకు ఒకటి, రెండు విషయాలు నేర్పించగలను’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫోటోకి 1.5 మిలియన్లకి పైగా లైక్స్ వచ్చాయి. ఈ ఫోటోని పోప్ ఫ్రాన్సిన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఈ నెల 13న ‘లైక్’ చేసినట్లు ఉంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. అనుహ్యంగా మరుసటి రోజే ‘డిస్లైక్’ అని కనిపించింది. దాంతో కాస్త గందరగోళం తలెత్తింది. ఈ లోపు నటాలియా మానేజ్మెంట్ కంపెనీ సీఓవై.కో ఈ విషయాన్ని తన పబ్లిసిటీకి వాడుకోవాలని భావించింది. పోప్ ఫ్రాన్సిస్ లైక్ చేసిన స్క్రీన్ షాట్‌ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ‘సీఓవై.కోకి పోప్ నుంచి ఆశీర్వాదాలు లభించాయి. మా ఐకానికిక్ క్వీన్ నటాలియాకు ధన్యవాదాలు’ అంటూ స్క్రీన్ షాట్‌ని షేర్ చేసింది. దాంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. అది కాస్తా ముదరడంతో హోలీ సీ ఈ వార్తల్ని ఖండించింది. సిబ్బంది ఎవరో మోడల్ ఫోటోని లైక్ చేసి ఉండవచ్చు. దీని గురించి విచారణ చేస్తున్నాం అని తెలిపారు. వాటికన్ ప్రతినిధి గార్డియన్‌తో మాట్లాడుతూ, "హోలీ సీ నుంచి" లైక్ "వచ్చిందని భావిస్తున్నాం. వివరణ ఇవ్వాల్సిందిగా ఇన్‌స్టాగ్రామ్‌ని కోరాం" అని తెలిపారు. (నన్ను కొరకనంటేనే ముద్దిస్తాను: పోప్) పోప్ ఫ్రాన్సిస్ సోషల్ మీడియాలో అధిక ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. అతని ఇన్స్టాగ్రామ్ ఖాతా ఫ్రాన్సిస్కస్కు 7.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీనిలో 971 పోస్టులు ఉన్నాయి. వేరే అకౌంట్లని ఫాలో అవ్వరు. -
పోప్ హితవు
ఒకే జెండర్‌కు చెందినవారు కలిసి సహజీవనం చేద్దామనుకోవడంలో తప్పేమీ లేదని క్యాథలిక్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించి పెను సంచలనం రేపారు. అలాంటి లైంగిక భావనలున్నవారు కూడా దేవుని బిడ్డలే...వారిని దూరంగా విసిరికొట్టడం కానీ, బాధించడంగానీ సరైంది కాదని, వారి సహజీవనాన్ని కూడా వివాహంగా గుర్తించాలని ఒక డాక్యుమెంటరీలో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు దేశదేశాల్లోని ప్రభుత్వాలను ఆలోచింపజేస్తాయి. వాస్తవానికి 2013లో పోప్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడే స్వలింగ సంపర్కులకు మద్దతుగా ఆయన ప్రకటన చేశారు. అయితే అలాంటివారి సహజీవనాన్ని చట్టబద్ధం చేయాలని గట్టిగా కోరడం ఇదే ప్రథమం. పోప్ తాజా ప్రకటన ఆధునిక కాలానికి అనుగుణంగా మతంలో సంస్కరణలు తీసుకురావాలని కోరుకుంటున్నవారికి బలాన్నిస్తుంది. అదే సమయంలో సంప్రదాయవాదులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఎవరూ తమ వ్యక్తిగత లైంగిక భావనల కారణంగా బెదిరింపులూ, వేధింపులూ ఎదుర్కొనే పరిస్థితి వుండ కూడదు. అలాంటివారికి చట్టబద్ధమైన గుర్తింపు ఇచ్చినప్పుడు మాత్రమే వారు అందరిలా సమా జంలో ప్రశాంతంగా జీవించగలుగుతారు. కానీ మన దేశంతో సహా అనేక దేశాల్లో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377లోని అసహజ నేరాల జాబితా స్వలింగ సంపర్కాన్ని నేరంగా చూస్తోంది. అందుకు యావజ్జీవ శిక్ష లేదా పదేళ్లవరకూ శిక్ష, జరిమానా విధించవచ్చునని ఆ సెక్షన్ చెబుతోంది. సుప్రీంకోర్టు సైతం ఆ సెక్షన్ రాజ్యాంగబద్ధమైనదే నంటూ 2012లో తీర్పునిచ్చింది. అయితే 2018లో దాన్ని సవరించుకుంది. పరస్పర అంగీకారం వున్న స్వలింగసంపర్క సంబంధాలు నేరం కాదని తీర్పునిచ్చింది. ప్రాణులను స్త్రీ, పురుషులుగా మాత్రమే ప్రకృతి ఎంపిక చేయనప్పుడు లైంగికత అంటే ఫలానా విధంగా మాత్రమే వుండాలని శాసించే హక్కు ఎవరికీ ఉండబోదని అమెరికన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ సి కిన్సే ఒక సందర్భంలో చెప్పాడు. మన రాజ్యాంగం వ్యక్తిగత స్వేచ్ఛకూ, సమానత్వ భావనకూ, మైనారిటీల హక్కులకూ రక్షణ నిచ్చింది. కానీ భిన్న లైంగిక భావనలున్న స్వలింగ సంపర్కులను నేరస్తులుగా పరిగణించే చట్టం మాత్రం దశాబ్దాలపాటు యధావిధిగా కొనసాగింది. సున్నితంగా ఆలోచించే స్వభావమూ, సహాను భూతితో వ్యవహరించే గుణమూ న్యాయవ్యవస్థలో కొరవడితే రాజ్యాంగం ప్రవచించే ఉన్నతా దర్శాలు, వాగ్దానాలు ఉత్త మాటలుగా మిగిలిపోతాయి. ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగం నీడలో కూడా ప్రకృతి సహజమైన చర్యను నేరంగా పరిగణించే సెక్షన్ 377 ఏడు దశాబ్దాలు కొన సాగిందంటే అది మన న్యాయవ్యవస్థ వైఫల్యమనే చెప్పాలి. బ్రిటిష్ వలసవాదులు తమ దేశంలో అమలవుతున్న చట్టాన్ని 1861లో యధాతథంగా ఇక్కడ అమల్లోకి తెచ్చారు. అయితే స్వలింగసంపర్కుల వివాహాన్ని గుర్తించడానికి అనువైన చట్ట నిబంధనలు ఇంకా ఏర్పడలేదు. తమని 1954నాటి ప్రత్యేక వివాహ చట్టం కింద దంపతులుగా గుర్తించాలంటూ ఇటీవలే ఢిల్లీకి చెందిన మానసిక ఆరోగ్య నిపుణులు కవితా అరోరా, అంకితా ఖన్నాలు హైకోర్టు తలుపులు తట్టారు. తాము దంపతులుగా సహజీవనం చేస్తున్నామని, అందరి కుటుంబాలకూ బంధువులు వచ్చిపోతున్నట్టే తమ వద్దకూ వస్తుంటారని, అలాంటపుడు తమ సహజీవనాన్ని వివాహంగా గుర్తించడంలో అభ్యంతరం దేనికని వారు ప్రశ్నిస్తున్నారు. స్వలింగ సంపర్కం నేరంకాదని సుప్రీం కోర్టు ప్రకటించి రెండేళ్లవుతున్నా వివాహచట్టాల్లో అందుకు వీలు కల్పించే సహజీవనాన్ని పొందు పరచకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దాన్ని వివాహంగా ఎందుకు గుర్తించాలన్న సంశయం వచ్చినవారికి కవితా అరోరా, అంకితా ఖన్నా సవివరమైన జవాబిస్తున్నారు. బ్యాంకులో ఉమ్మడి ఖాతా తెరవాలంటే వారిమధ్య చట్టబద్ధమైన సంబంధం వున్నట్టు రుజువుండాలి. ఇద్దరు మహిళలను దంపతులుగా, కుటుంబంగా గుర్తించడం అసాధ్యం కనుక అధికారికమైన అడ్రస్ ప్రూఫ్ వారి నివాసగృహానికి లభించడం లేదు. పాస్‌పోర్టు పొందాలన్నా అదే ఇబ్బంది. ఆ చిరునామాలో నివసిస్తున్న వారిలో ఒకరిని యజమానిగా, మరొకరిని అద్దెకుంటున్నవారిగా మాత్రమే పరిగణించ గలమని పోలీసుల వాదన. ఇక వారసత్వ హక్కులు వంటివి సరేసరి. పీఎఫ్, గ్రాట్యుటీ వంటివి పొందేటపుడు నామినీగా గుర్తించడం, వారితో వున్న సంబంధాన్ని తెలపడం కూడా అసాధ్యం. ఇలా చట్టపరమైన అవరోధాలు ఎన్నో వున్నాయి. వీరి తరహాలోనే మరో ఇద్దరు స్వలింగ సంపర్కులు తమ వివాహాన్ని హిందూ వివాహ చట్టం కింద గుర్తించాలంటూ ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. గత నెలలో ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం చేసిన వాదన వింతగా వుంది. ఒకే జెండర్‌కు చెందినవారి మధ్య వివాహం భారతీయ విలువల ప్రకారం సమ్మతం కాదని, అది పవిత్రంగా పరిగణించడం సాధ్యపడదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. మరి స్వలింగ సంపర్కం రాజ్యాంగబద్ధమైనదేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్రం ఏం గౌరవిస్తున్నట్టు? ఇది మన దేశానికి పరిమితమైన ధోరణి మాత్రమే కాదు. ప్రపంచ దేశాలన్నిటా ఇలాంటి పరిస్థితే వుంది. దాదాపు 30 దేశాల్లో మాత్రమే ఇంతవరకూ స్వలింగసంపర్కుల వివాహాన్ని గుర్తించే చట్టాలున్నాయి. చాలాచోట్ల ఈ వివాహాలను అనైతికతగా పరిగణించే ఛాందసవాదులదే పైచేయి. కొన్నిచోట్లయితే అది మరణశిక్షకు అర్హమైన నేరం! అందువల్లే పోప్ ఫ్రాన్సిస్ చేసిన ప్రకటన స్వలింగసంపర్కులకు కొత్త బలాన్నిచ్చింది. ఏ దేశానికైనా సామాజిక, సంప్రదాయిక కట్టుబాట్లుం టాయి. అయితే అవి రాజ్యాంగ నైతికతతో విభేదించినప్పుడు రాజ్యాంగం మాటే చెల్లుబాటు కావాలి. ప్రజాస్వామ్య రిపబ్లిక్లు ఏర్పడిన దేశాల్లో కూడా ఇంకా బూజుపట్టిన భావాలదే పైచేయి అవుతున్న వేళ పోప్ ప్రకటన అక్కడి ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించాలి. -
లైవ్ స్ట్రీమింగ్‌లో పోప్ ఈస్టర్ సందేశం
వాటికన్ సిటీ: కోవిడ్ మహమ్మారిపై పోరాటం చేస్తూ ప్రపంచమే లాక్డౌన్లో ఉన్న నేపథ్యంలో ఈస్టర్ వేడుకల సందడి ఎక్కడా కనిపించలేదు. ఇటలీ నుంచి పనామా వరకు చర్చిలన్నీ బోసిపోయి కనిపించాయి. ప్రజలందరూ ఇళ్లల్లో ఉండే ప్రార్థనలు చేసుకున్నారు. నిర్మానుష్యంగా ఉన్న సెయింట్ పీటర్ చర్చిలో పోప్ ఫ్రాన్సిస్ ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన లైవ్ స్ట్రీమింగ్ ద్వారా క్రైస్తవ సోదరుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ దేశాలన్నీ సోదరభావంతో ఒక్కటై కోవిడ్‌పై పోరాడాలని పిలుపునిచ్చారు. ‘‘ఇవాళ నా ఆలోచనలన్నీ కోవిడ్ వ్యాధితో బాధపడుతున్న వారిపైనే ఉన్నాయి. ఎందరో ఈ మహమ్మారికి బలైపోయారు. తమ ప్రియమైన వ్యక్తుల్ని కోల్పోయారు’’అని అన్నారు. -
ప్రజలు లేకుండానే పోప్ ప్రార్థనలు
వాటికన్ సిటీ: కరోనా కారణంగా వాటికన్ సిటీ వెలవెలబోయింది. ఏటా గుడ్ ఫ్రైడేకు ముందు వచ్చే ఆదివారం జరుపుకునే మ్రానికొమ్మల (పామ్) ఆదివారం ప్రార్థనలకు దేశ, విదేశాల నుంచి వేలాది సంఖ్యలో హాజరయ్యే వారు. కరోనా వైరస్ వ్యాప్తి భయంతో ఈ ఏడాది వాటికన్ సిటీని మూసివేయడంతో, భక్తులు లేకుండానే పోప్ ఫ్రాన్సిస్ ప్రత్యేక దివ్యబలి పూజను సెయింట్ పీటర్స్ బసిలికా లోపలే నిర్వహించారు. ఆ కార్యక్రమంలోనూ అతి తక్కువ మంది హాజరు కాగా, వారు కూడా భౌతిక దూరాన్ని పాటించారు. ఈ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి మానవాళి ఆశలపై గండి కొట్టిందని, హృదయాలపై మోయరాని భారాన్ని పెట్టిందని అన్నారు. -
నన్ను కొరకనంటేనే ముద్దిస్తాను: పోప్
వాటికన్ సిటీ: పోప్ ఫ్రాన్సిస్.. నూతన సంవత్సర వేడుకల్లో ఓ మహిళ తన చేయి పట్టుకుని వెనక్కు లాగినందుకు ఆమె చేతిని రెండుసార్లు కొట్టి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత దానికి క్షమాపణలు కూడా చెప్పారునుకోండి. అది వేరే విషయం. తాజాగా పోప్ ఫ్రాన్సిస్ మరోసారి వార్తల్లో నిలిచారు. వేలాదిమంది జనం గుమిగూడి ఉన్న హాల్ మధ్యలో పోప్ ఫ్రాన్సిస్ నడుచుకుంటూ వెళ్తున్నారు. అరుపులు, రొదలతో హాలంతా సందడిగా ఉంది. అంతమంది అరుపుల మధ్యలో ఓ నన్ గొంతు గట్టిగా ప్రతిధ్వనించింది. ‘ఒక్క ముద్దు ఇవ్వండి పోప్..’ అంటూ గట్టిగా కేకేసింది. అది విన్న పోప్ ఓ క్షణమాగి తనను కొరకనంటేనే ఇస్తానన్నారు. పోప్ జవాబుతో అక్కడి జనమంతా ఘొల్లున నవ్వారు. ‘ముందు నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. నేను నీకు ముద్దిస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో నన్ను కొరకకూడదు’ అని చమత్కారంగా బదులిచ్చారు. దానికి నన్ సరేనంటూ మాటిచ్చింది. వెంటనే పోప్ ఆమె కుడి చెంపపై సుతారంగా ముద్దు పెట్టారు. దీంతో పట్టలేని సంతోషంతో ఆ మహిళ ‘థాంక్ యూ పోప్’ అంటూ గంతులు వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా పోప్ ఫ్రాన్సిస్ జనాలు అతని చేతిని తాకడానికి అనుమతిస్తారు. కానీ ప్రజలు తన చేతిని ముద్దాడటాన్ని మాత్రం అస్సలు సహించరు. దీనివల్ల సూక్ష్మక్రిములు త్వరగా వ్యాప్తి చెందుతాయని ఆయన బలంగా నమ్ముతారు. చదవండి: మహిళకు క్షమాపణ చెప్పిన పోప్ ప్రాన్సిస్ ఈ ఏడాది పోప్ ఫ్రాన్సిస్ సందేశం -
మహిళకు క్షమాపణ చెప్పిన పోప్
వాటికన్ సిటీ : పోప్ ప్రాన్సిస్ ఓ మహిళకు క్షమాపణ చెప్పారు. ప్రతి ఒక్కరు సహనం కోల్పోతారని..అదే తనకు జరిగిందని తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వాటికన్లో పలువురు భక్తులను పోప్ ప్రాన్సిన్ పలకరిస్తూ వెళ్లారు. ఈ సమయంలో అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న భక్తుల్లో ఓ మహిళ ఆయన చేయి పట్టుకుని వెనక్కి లాగడంతో.. పోప్ పడిపోబోయారు. తర్వాత ఆయన వెంటనే నిలదొక్కుకొని.. సహనం కోల్పోయి మహిళ చేతిపై రెండు సార్లు కొట్టారు. ఇందుకు సంబంధిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు నెటిజన్లు పోప్‌కు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టగా.. మెజారిటీ నెటిజన్లు ఆ మహిళ చర్యను తప్పుబట్టారు. అయితే ఈ చర్యపై పోప్ ట్విటర్లో స్పందించారు. ‘మనం చాలా సార్లు సహనం కోల్పోతుంటాం. అదే నా విషయంలో జరిగింది. నిన్న నేను చేసిన పనికి క్షమాపణలు చెబుతున్నాను’ అంటూ పేర్కొన్నారు. -
బాగుంటుంది
‘‘కనీసం భోజన సమయంలోనైనా ఫోన్లను పక్కన పెట్టండి’’ అని ఈ ఏడాది పోప్ ఫ్రాన్సిస్ సందేశం! సందేశంగా ఇవ్వలేదు. అడిగారు. పోప్ అంతటివారే అడిగితే టైమ్ ఇవ్వలేమా?! కుటుంబ సభ్యులతో కూర్చుని భోంచేసే ఆ కొద్ది టైమ్! మాధవ్ శింగరాజు కొత్త రోజులోకి.. కొత్త సంవత్సరంలోకి.. కొత్త దశాబ్దంలోకి వచ్చేశాం! చివరి రెండంకెల్లోని ఒకటీ తొమ్మిది వెళ్లిపోయి, రెండూ సున్నా వచ్చాయి కనుక కొత్త దశాబ్దమే. విడిగా విలువ లేకపోయినా, పక్కవాటికి విలువ తెస్తుంది కనుక సున్నా కూడా అంకె కిందికే వస్తుంది. కాలం ముందు మనిషి కూడా సున్నానే. గుండు సున్నా. ఐనా ఆ సున్నా లేకపోతే కాలానికి విలువ లేదు. కాలం నిలువ లేదు. ఊపిరులు లేకపోతే వాయువనేది ఒకటుందని తెలుస్తుందా? కాలమూ అంతే. పక్కన మనిషి లేకుండా కాలాన్నీ చూడలేం, కొలవలేం. ఆ మనిషి కూడా ఊరికే కూర్చొని ఉంటేనో, ఊరికే నిలుచుని ఉంటేనో, ఊరికే పడుకుని ఉంటేనో కాలానికి కౌంట్ ఉండదు. గోడ మీది గడియారం ఆగిపోయినట్లు ఆగిపోతుంది. మనిషి పని చేస్తుండాలి. పరుగులు తీస్తుండాలి. అప్పుడే ఉత్సాహం. ఆరోగ్యం. మనిషికీ, కాలానికీ. ఈరోజు సాయంత్రానికి ఇవాళ మన రోజెలా గడిచిందో తెలుస్తుంది. నిన్న సాయంత్రం ఏడాదంతా ఎలా గడిచిందో పడమటి గది తలుపులు తెరిచి ఉదయిస్తున్న మసక చీకటిలో చూసుకునే ఉంటాం. పది ఏడాదులు ఉండిపోయిన దశాబ్దాన్నీ.. ఈ కొత్త దశాబ్దపు తొలి రోజున.. జ్ఞాపకాల వత్తిని కాస్త పెద్దది చేసి కాలాల నీడల్ని ఒకసారి తడుముదాం.‘నిర్భయ’తో మొదలై, ‘దిశ’తో ముగిసింది ఈ దశాబ్దం! అమానుష ఘటన నుంచి.. అభయమిచ్చే చట్టం వరకు. మధ్యలో మిగతావన్నీ కాలానుగతంగానో, కాలంలో భాగంగానో జరిగినవే. వాటిని బట్టి చూస్తే.. ఉల్లిపాయల కరువుతో మొదలై ఉల్లిపాయల కరువుతో ఈ దశాబ్దం ముగిసినట్లు! 2010 డిసెంబర్లో ఉల్లిపాయల కోసం దేశం తల్లడిల్లడం ఆ ఏడాది ప్రధాన విశేషం. ఉత్తరప్రదేశ్‌లో ఒకే నెలలో ఆరు రైలు ప్రమాదాలు జరగడం, పదిహేనవ జనాభా లెక్కల సేకరణ, బాలలకు నిర్బంధ ఉచిత విద్య.. మిగతావి. ‘నిర్భయ’ ఘటన 2012 డిసెంబరులో జరిగింది. ఆ ముందువరకు.. అజ్మల్ కసబ్ ఉరితీత, ‘అండర్ అచీవర్’ అని ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి ‘టైమ్’ పత్రిక రాయడం, ఇండియా పార్లమెంటు 60వ వార్షికోత్సవం.. ప్రధానంగా గుర్తుండే విషయాలు. స్వామీ వివేకానంద 150 వ జయంతి, పబ్లిక్ టెలిగ్రామ్ సర్వీస్ నిలిచిపోవడం, ఇస్రో ‘మార్స్’ ప్రయోగం, స్వచ్ఛభారత్, జీఎస్టీ, ఇరోమ్ షర్మిల పదహారేళ్ల నిరశన దీక్ష విరమణ, పెద్ద నోట్ల రద్దు, ఆర్టికల్ 370 ఎత్తివేత, కర్తార్‌పూర్ కారిడార్, అయోధ్య తీర్పు, పౌరసత్వ సవరణ చట్టం.. ఇవన్నీ నిర్భయ ఘటన తర్వాత ఈ పదేళ్ల పరిణామాలు. ఒక దశాబ్దంలో ఇన్ని జరిగినా నిర్భయతో మొదలైన దశాబ్దంగానే 2010–2019 మిగిలిపోవడానికి కారణం.. నిర్భయ చట్టం వచ్చాక కూడా దేశంలో అఘాయిత్యం జరగని రోజు, జరగని ప్రాంతం లేకపోవడం. ఒక దశాబ్దంలో ఎన్ని చట్టాలు వచ్చినా ‘దిశ’ యాక్ట్‌తోనే ఈ దశాబ్దం నిలిచిపోవడానికి కారణం.. శిక్షకు ‘డెడ్ లైన్’ పెట్టడం. నిర్భయ యాక్ట్ ఆ పని చేయలేకపోయింది. క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ (ఇదే నిర్భయ యాక్ట్), వర్క్‌ప్లేస్ హెరాస్మెంట్ యాక్ట్.. రెండూ ఈ దశాబ్దంలో(2013) వచ్చినవే. పురుషుల్ని సవరించే చట్టాలివి. ఈ సవరణ లాభం లేదని తేలిపోయింది. ఏపీ ప్రభుత్వం తెచ్చిన ‘చక్కదిద్దే’ దిశ యాక్ట్ ఒక్కటే ఇప్పుడు భరోసా. ఈ కొత్త దశాబ్దపు ఆరంభం నుంచే భరోసాలు ప్రసాదించే మరికొన్ని మార్పులు కూడా సంభవిస్తే బాగుంటుంది. పేషెంట్లను ఎదురుగా పెట్టుకుని వాట్సాప్ చూస్తుండే డాక్టర్లు మారాలి. క్లాస్‌రూమ్‌లో పిల్లల్ని వాళ్ల కర్మకు వాళ్లను వదిలేసి ఫేస్‌బుక్‌లోకి వెళ్లిపోయే టీచర్లు మారాలి. ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చినవాళ్లను ‘ఆ.. ఏంటి?’ అని ఒక మాట అడిగేసి, ఫోన్లో మీమ్స్‌ని చూస్తూ నవ్వుకుంటుండే పోలీసులు మారాలి. ఇంకా.. సమస్త వృత్తుల సకల జనులు తమ చేతిలోని ఫోన్‌కి తమ ఉద్యోగ బాధ్యతల్ని, పౌర విధుల్ని బలి చేయడం మారాలి. ‘‘కనీసం భోజన సమయంలోనైనా ఫోన్లను పక్కన పెట్టండి’’ అని ఈ ఏడాది పోప్ ఫ్రాన్సిస్ సందేశం! సందేశంగా ఇవ్వలేదు. అడిగారు. పోప్ అంతటివారే అడిగితే టైమ్ ఇవ్వలేమా?! కుటుంబ సభ్యులతో కూర్చుని భోంచేసే ఆ కొద్ది టైమ్! ∙ -
ఆఫ్రికాలో శాంతి నెలకొనాలి
వాటికన్ సిటీ: అంతర్యుద్ధంతో సతమతమైపోతున్న ఆఫ్రికా దేశాల్లో శాంతి స్థాపన జరగాలని పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్షించారు. మధ్యప్రాచ్యం, వెనిజులా, లెబనాన్ ఇతర దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణానికి ఇకనైనా ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పోప్ వాటికన్ నగరం నుంచి తన సందేశాన్నిచ్చారు. ఆఫ్రికాలో క్రైస్తవులపై తీవ్రవాద సంస్థలు జరుపుతున్న దాడుల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హింసతో రగిలిపోతున్న దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలతో సతమతమైపోతున్న దేశాల్లో, వ్యాధులు పడగవిప్పిన నిరుపేద దేశాల్లో ఈఏడాదైనా శాంతి, సుస్థిరతలు నెలకొనాలని పోప్ ఆకాంక్షించారు. ‘మధ్యప్రాచ్యం సహా ఎన్నో దేశాల్లో యుద్ధ వాతావరణంలో చిన్నారులు భయంతో బతుకులీడుస్తున్నారు. వారందరి జీవితాల్లో ఈ క్రిస్మస్ వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను‘‘అని పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. అంబరాన్నంటిన సంబరాలు క్రిస్మస్ సంబరాలు ప్రపంచవ్యాప్తంగా అంబరాన్నంటాయి. క్రిస్టియన్ నేతలు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ శాంతి సందేశాలను పంపించుకున్నారు. సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. తీవ్ర తుఫాన్‌తో అల్లాడిపోయిన ఫిలిప్పీన్స్‌లో వేలాది మంది వరద ముప్పులో చిక్కుకోవడంతో క్రిస్మస్ హడావుడి కనిపించలేదు. ఇక ఫ్రాన్స్‌లో పింఛను సంస్కరణలకు వ్యతిరేకంగా నాలుగు వారాలుగా జరుగుతున్న రవాణా సమ్మెతో రాకపోకలు నిలిచిపోయాయి. బంధువులు, స్నేహితులు తమవారిని చేరుకోకపోవడంతో క్రిస్మస్ సందడి కనిపించలేదు. -
సిస్టర్ థ్రెషియాకు సెయింట్‌హుడ్
వాటికన్ సిటీ: భారత్‌కు చెందిన సిస్టర్ మరియం థ్రెషియాకు ఆదివారం వాటికన్ సిటీలో ఘనంగా జరిగిన ఒక కార్యక్రమంలో ‘సెయింట్‌హుడ్’ను పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. మరియంతో పాటు ఇంగ్లండ్‌కు చెందిన కార్డినల్ జాన్‌హెన్రీ న్యూమన్, స్విట్జర్లాండ్‌కు చెందిన నన్ మార్గెరెట్ బేయస్, బ్రెజిల్‌కు చెందిన సిస్టర్ డల్స్ లోపెస్, ఇటలీ నన్ గ్యూసెప్పిన వానినిలను కూడా దైవ దూతలుగా పోప్ ప్రకటించారు. ‘ఈ రోజు ఈ ఐదుగురు దైవదూతల కోసం ఆ ప్రభువుకు కృతజ్ఞతలు తెల్పుకుందాం’ అని పోప్ ఫ్రాన్సిస్ అక్కడికి భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద ఈ ఐదుగురి భారీ చిత్రపటాలకు వేలాడదీశారు. ఈ కార్యక్రమానికి ప్రిన్స్ చార్లెస్ హాజరయ్యారు. భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ శాఖ సహాయమంత్రి వీ మురళీధరన్ నేతృత్వం వహించారు. తాజాగా సెయింట్‌హుడ్ పొందిన ఐదుగురిలో ముగ్గురు మహిళలున్నారన్న పోప్ ఫ్రాన్సిస్.. ‘వారు ఈ లౌకిక ప్రపంచానికి పవిత్రమైన ప్రేమపూరిత జీవన మార్గాన్ని చూపారు’ అని ప్రశంసించారు. ‘సెయింట్ మార్గరెట్ బేయస్ కుట్టుపని చేసే స్త్రీ అయినా చిన్న ప్రార్థన, సహనపూరిత జీవితంలోని శక్తిని మనకు చూపారు’ అని పోప్ పేర్కొన్నారు. న్యూమన్ రాసిన ఒక ప్రార్థన గీతాన్ని కూడా ఆయన ఉటంకించారు. 1801లో జన్మించిన న్యూమన్ గొప్ప కవి. బోధకుడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న మేధావి. బ్రెజిల్లో అతిపెద్ద సేవా సంస్థను సిస్టర్ డల్స్ లోపెస్ ప్రారంభించారు. రెండు సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. బ్రెజిల్‌కు చెందిన తొలి మహిళా సెయింట్ లోపెస్‌నే కావడం విశేషం. ఆ చర్చ్ నుంచి నాలుగో సెయింట్ సెయింట్ మరియం థ్రెషియాతో కలిపి కేరళలోని శతాబ్దాల చరిత్ర కలిగిన సైరో మలబార్ కేథలిక్ చర్చ్ లేదా చర్చ్ ఆఫ్ మలబార్ సిరియన్ కేథలిక్స్ నుంచి ఇప్పుడు నలుగురు సెయింట్స్ ఉన్నారు. ఈ చర్చ్ నుంచి 2008లో సిస్టర్ అల్ఫోన్సా సెయింట్‌హుడ్ పొందారు. ఆ తరువాత 2014లో ఫాదర్ కురియాకోస్ ఎలియాస్ చావర, సిస్టర్ యూఫ్రేసియా(యూఫ్రేసియమ్మగా చిరపరిచితం)లకు కూడా ఈ హోదా లభించింది. జీసస్ తరఫున మరియం థ్రెషియా పేదలకు ఎంతో సాయమందించారని, రోగులకు స్వాంత్వన చేకూర్చారని చర్చ్ పేర్కొంది. జీసస్ క్రైస్ట్‌కు శిలువ వేసినప్పుడు ఆయన శరీరంపై పడిన గుర్తు వంటిది మరియం థ్రెషియా శరీరంపై కూడా ఉండేదని, అయితే, ఆమె ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారని వెల్లడించింది. ఆమె చుట్టూ ఒక కాంతిపుంజం ఉండేదని, వ్యాధులను నయం చేయగలగడం వంటి ప్రత్యేక శక్తులు ఆమెకు ఉన్నాయని పేర్కొంది. కేరళలోని త్రిచూర్ దగ్గరలోని పుతెంచిరలో తోమ, తాండ దంపతులకు 1876, ఏప్రిల్ 26న సిస్టర్ థ్రెషియా జన్మించారు. 1902లో జోసెఫ్ విద్యాతిల్‌ను తన గురువుగా స్వీకరించారు. 1904లో తన పేరుకు మరియంను చేర్చుకున్నారు. 1914 మే నెలలో ‘కాంగ్రెగెషన్ ఆఫ్ ద సిస్టర్స్ ఆఫ్ ద హోలీ ఫ్యామిలీ’ని ప్రారంభించారు. 1926 జూన్ 8న, తన 50 ఏళ్ల వయసులో మరణించారు. సిస్టర్ థ్రెషియా చేసిన ఒక అద్భుతాన్ని నిర్ధారించిన పోప్ ఫ్రాన్సిస్ ఈ ఫిబ్రవరి 12న ఆమెను సెయింట్‌హుడ్‌కు అర్హురాలిగా ప్రకటించారు. అక్టోబర్ 13న కెనొనైజేషన్ ఉంటుందన్నారు. 2000లో బీటిఫికేషన్ పొందిన సిస్టర్ థ్రెషియాకు 2019లో సెయింట్‌హుడ్ అందింది. బీటిఫికేషన్ తరువాత అత్యంత తొందరగా, 19 ఏళ్లలోనే, సెయింట్‌హుడ్ పొందిన వ్యక్తి సిస్టర్ థ్రెషియానే కావడం విశేషం. సిస్టర్ థ్రెషియా సెయింట్ హోదా పొందనుండడం భారతీయులందరికీ గర్వకారణమని ఇటీవల ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో ప్రస్తావించారు. పోప్‌తో మురళీధరన్ భేటీ: విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ ఆదివారం పోప్ ఫ్రాన్సిస్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ‘భగవద్గీత అకార్డింగ్ టు గాంధీ’ అనే పుస్తకాన్ని, కేరళ దేవాలయల్లో జరిగే ఉత్సవాల్లో పాల్గొనే ఏనుగు ప్రతిమను పోప్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి తన శుభాకాంక్షలు తెలపాలని పోప్ కోరారు. నా వైకల్యం దూరమైంది సిస్టర్ థ్రెషియాకు సెయింట్ హుడ్ ప్రకటించడంపై త్రిచూర్ దగ్గర్లోని ఆమడంకి చెందిన మేథ్యూ పెలిస్రీ(69) చాలా సంతోషంగా ఉన్నారు. సిస్టర్ థ్రెషియా కారణంగానే తన వైకల్యం దూరమైందని ఆయన చెప్పారు. ‘వాటికన్ సిటీలో జరిగే సెయింట్‌హుడ్ ప్రదాన కార్యక్రమానికి వెళ్లాలనుకున్నాను కానీ వృద్ధాప్య సమస్యల వల్ల వీలు కాలేదు. 2000 సంవత్సరంలో జరిగిన బీటిఫికేషన్ కార్యక్రమానికి వెళ్లాను’ అని వివరించారు. పుట్టినప్పటినుంచే మేథ్యూ రెండు కాళ్లలోనూ వైకల్యం ఉండేది. పట్టుదలతో 33 రోజుల పాటు నిరాహారంగా ఉంటూ, నిరంతరం సిస్టర్ థ్రెషియాకు ప్రార్థన చేశారు. ఒక రాత్రి సిస్టర్ థ్రెషియా ఆయనకు స్వప్నంలో కనిపించారు. ఆ మర్నాడు లేచి చూస్తే ఆయన వైకల్యం మాయమైంది. తన కుమారుడికి సిస్టర్ థ్రెషియా సాంత్వన చేకూర్చినట్లు ఆయన తల్లికి సైతం కల వచ్చింది. సిస్టర్ మరి యం థ్రెషియాకు సెయింట్ హుడ్ను ప్రకటించడంపై కేరళలోని కేథలిక్కులు ఆనందోత్సాహాలతో పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద పోప్ ఫ్రాన్సిస్ -
కేరళ నన్‌కు సెయింట్‌హుడ్ నేడే
కొచ్చి: కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని (నన్) మరియం థ్రెసియా చిరమెల్ మంకిడియాన్‌కు క్రైస్తవ మతాధినేత పోప్ ఫ్రాన్సిస్ ‘పునీత హోదా’ (సెయింట్‌హుడ్)ను ప్రదానం చేయనున్నారు. వాటికన్లోని సెయింట్ పీటర్ ప్రధాన ప్రార్థనాస్థలిలో ఆమెతో పాటు ఇంగ్లండ్‌కు చెందిన కార్డినల్ జాన్ హెన్రీ, స్విట్జర్లాండ్‌కు చెందిన మహిళ మార్గరెట్ బేస్‌కు, బ్రెజిల్‌కు చెందిన సిస్టర్ డూస్లెకు, ఇటలీకి చెందిన సిస్టర్ గిసెప్పినాలకు పునీత హోదా ప్రకటించనున్నారు. 2000వ సంవత్సరంలో పోప్ సెయింట్ జాన్‌పాల్2, మరియం థ్రెసియాకు ‘బ్లెస్డ్’ హోదాను ప్రకటించారు. -
ఇస్లాం గడ్డపై కేథలిక్ల బహిరంగ సభ
అబుధాబీ: ఇస్లాం గడ్డపై తొలిసారి పర్యటిస్తున్న క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ చారిత్రాత్మక కేథలిక్ల బహిరంగ సభలో పాల్గొన్నారు. మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధానిలోని జాయేద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో జరిగిన ఈ సభకు సుమారు 1.70 లక్షల మంది కేథలిక్‌లు హాజరయ్యారు. ఓపెన్ టాప్ వాహనంలో వాటికన్ జెండాలను ఎగురవేస్తూ పోప్ స్టేడియంలోకి ప్రవేశించారు. స్టేడియంలో సుమారు 50 వేల మంది కేథలిక్‌లు ఉండగా.. స్టేడియం బయట ఏర్పాటుచేసిన పెద్ద పెద్ద స్క్రీన్ల ద్వారా పోప్ ప్రసంగాన్ని మరో 1.20 లక్షల మంది వీక్షించారు. సుమారు 4 వేల మంది ముస్లింలకు కూడా సభకు సంబంధించిన టికెట్లను విక్రయించినట్లు స్థానిక చర్చి అధికారులు తెలిపారు. సభకు భారీగా హాజరైన వలస కార్మికులు, శరణార్థులను ఉద్దేశించి పోప్ ప్రసంగించారు. ‘ఇంటిని విడిచిపెట్టి ఇంత దూరంలో జీవనం కొనసాగించడం చాలా కష్టతరమైంది. మిమ్మల్ని ప్రేమించే వారి ఆప్యాయతలను మీరు కోల్పోతున్నారు. అలాగే భవిష్యత్‌కు సంబంధించిన అనిశ్చితి కూడా మీలో నెలకొని ఉంటుంది. కానీ భగవంతుడు చాలా నమ్మదగినవాడు. తనను నమ్ముకున్న వాళ్లను ఎన్నటికీ విడిచిపెట్టడు’ అని పోప్ వలస కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. యూఏ ఈలో భారత్, ఫిలిప్పీన్స్‌కు చెందిన కేథలిక్ వలస కార్మికులు అధిక శాతంలో ఉన్నారు. దేశంలో సుమారు 10 లక్షల మంది కేథలిక్‌లు నివసిస్తున్నారు. అంటే యూఏఈలో ప్రతీ 10 మందిలో ఒకరు కేథలిక్ కావడం గమనార్హం. -
దుబాయ్‌లో పర్యటించిన తొలి పోప్
అబుదాబీ: చరిత్రాత్మక పర్యటన కోసం దుబాయ్‌లో అడుగుపెట్టిన క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్‌కు ఘన స్వాగతం లభించింది. ఆదివారం రాత్రి దుబాయ్ చేరుకున్న పోప్‌కు మిలటరీ పరేడ్‌తో అధికారులు ఆహ్వానం పలికారు. దీంతో దుబాయ్‌లో పర్యటించిన తొలి పోప్‌గా పోప్ ఫ్రాన్సిస్‌కు చరిత్రకెక్కారు. పోప్ బసచేసిన అబుదాబీ అధ్యక్ష భవనం వద్ద అధికారులు గౌరవ సూచకంగా గాలులోకి కాల్పులు జరిపారు. దుబాయ్‌లో జరగనున్న ఇంటర్ఫెయిత్ కాన్ఫరెన్స్‌కు హాజరుకావాలన్న అబుదాబీ యువరాజు షేక్ మహ్మద్ బిన్ జయేద్ ఆహ్వానం మేరకు పోప్ యూఏఈలో పర్యటిస్తున్నారు. ‘సోదరుడిగా.. యూఏఈతో కలసి పనిచేసేందుకు, శాంతి మార్గంలో పయనించేందుకు ఇక్కడకు వచ్చాను’ అని ఈ సందర్భంగా పోప్ అన్నారు. దీనిలో భాగంగా పోప్‌తో సోమవారం జరిగిన భేటీపై యూఏఈ ప్రిన్స్ స్పందిస్తూ.. ‘పోప్‌ను కలవడం చాలా సంతోషాన్ని కలిగించింది. సమావేశంలో భాగంగా పరస్పర సహకార మెరుగుదల, సహనశీలత, ప్రజలు, సమాజం కోసం శాంతి, స్థిరత్వం, అభివృద్ధి సాధించడానికి చేయాల్సిన ముఖ్యమైన విషయాలపై చర్చించాం’అని ప్రిన్స్ ట్వీట్ చేశారు. 1219లో ఈజిప్ట్ మాలెక్ అల్ కమేల్, స్టెయింట్ ఫ్రాన్సిస్ అస్సిసి మధ్య సమావేశాన్ని పోప్ గుర్తు చేసుకున్నారు. -
రోమెరో, పోప్ పాల్–6లకు సెయింట్‌హుడ్
వాటికన్ సిటీ: హత్యకు గురైన, ఎల్ సాల్వడార్‌కు చెందిన ఆర్చ్‌బిషప్ ఆస్కార్ అర్నుల్ఫో రోమెరో గాల్డమెజ్‌తోపాటు ఇటలీకి చెందిన పోప్ పాల్–6లకు సెయింట్‌హుడ్‌ను పోప్ ఫ్రాన్సిస్ ప్రదానం చేశారు. రైతుల హక్కుల కోసం పోరాడిన రోమెరో 1980లో చర్చిలోనే హత్యకు గురయ్యారు. పోప్ పాల్–6పై కూడా 1970లో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో హత్యాప్రయత్నం జరిగినా అప్పట్లో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. 1978లో అనారోగ్యంతో మరణించారు. వీరిద్దరికీ సెయింట్‌హుడ్ ఇస్తున్నట్లు ఆదివారం వాటికన్లో ప్రార్థనల కోసం హాజరైన వేలాది మంది భక్తుల ముందు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. ‘పాల్–6, రోమెరోలను క్రైస్తవ సన్యాసులుగా మేం ప్రకటిస్తున్నాం. వారిని సన్యాసుల జాబితాలో చేరుస్తూ, చర్చిల్లో వీరిని కూడా ఆరాధించాలని ఆదేశిస్తున్నాం’ అని ఫ్రాన్సిస్ చెప్పారు. ఎముకల కేన్సర్‌తో చనిపోయిన, ఇటీలీకి చెందిన అనాథ బాలుడు, జర్మన్ నన్ సహా మరో ఐదుగురికి కూడా పోప్ ఫ్రాన్సిస్ సెయింట్‌హుడ్ ప్రసాదించారు. హత్యకు గురైన సమయంలో రోమెరో రక్తంతో తడిసిన తాడు ను బెల్ట్‌గా ధరించి పోప్ ఫ్రాన్సిస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్ సాల్వడార్ అధ్య క్షుడు సాంచెజ్ సెరెన్, చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్, స్పెయిన్ రాణి సోఫియాహాజరయ్యారు. సెయింట్‌హుడ్ హోదా ఇలా: సెయింట్‌హుడ్‌ను పొందటమంటే రోమన్ క్యాథలిక్ చర్చిలో అత్యున్నత స్థాయిని పొందటమే. ఒక వ్యక్తిని సెయింట్ (సన్యాసి)గా ప్రకటించేందుకు మొత్తంగా ఐదు దశలుంటాయి. వ్యక్తిని సన్యాసిగా ప్రకటించేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించేందుకు ముందుగా ఆ వ్యక్తి చనిపోయిననాటి నుంచి కనీసం ఐదేళ్లు ఆగాలి. ఆ తర్వాత సదరు వ్యక్తి చనిపోయిన ప్రాంతంలోని క్రైస్తవ మతగురువులు విచారణ జరిపి, ఆ వ్యక్తి పవిత్రత, సత్యనిష్టతల గురించి వివరాలు సేకరిస్తారు. సెయింట్ హోదా ఇవ్వదగిన వ్యక్తిగా తేలితే ఆ విషయాన్ని వారు సెయింట్లను సిఫారసు చేసే ఓ కమిటీకి తెలుపుతారు. ఆ తర్వాత సదరు చనిపోయిన వ్యక్తికి అద్భుత శక్తులున్నట్లు తేలాలి. అంటే ఆ వ్యక్తి తమ కలలో కనిపించాడనీ, తమ అనారోగ్యాన్ని బాగు చేయడమో, కష్టాలను తీర్చాడనో ఎవరో ఒకరు చెప్పాలి. వాటిలోని వాస్తవాలను పరీక్షించిన అనంతరం అదొక అద్భుత మని రుజువైతే వారిని బీటిఫై చేస్తారు. ఆ తర్వాత మరోసారి అలాంటి అద్భుతం జరిగి నట్లు తేలితే వారికి సెయింట్ హోదా ఇస్తారు. పోప్‌పాల్–6, రొమెరో -
అబార్షన్.. కిరాయి హత్యే: పోప్ ఫ్రాన్సిస్
వాటికన్ సిటీ: గర్భవిచ్చిత్తి అంటే కిరాయి హత్యతో సమానమని పోప్ ఫ్రాన్సిస్ వ్యాఖ్యానించారు. అబార్షన్‌కు పాల్పడటమంటే కిరాయి హంతకుడి సాయంతో ఒకరిని అంతం చేయడమేనని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. బుధవారం వాటికన్ సిటీలో ప్రార్థనల సందర్భంగా భక్తులనుద్దేశించి ప్రసంగం సందర్భంగా పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘యుద్ధాలు, స్వార్ధంతో చేసే దారుణాలు, అబార్షన్లు ఇలాంటివన్నీ ఓకే తరహావి. అభంశుభం తెలియని ఓ పసి ప్రాణాన్ని చంపేస్తున్న అబార్షన్‌ను ఎలా మనం శాస్త్రీయమైన విధానంగా చెప్పగలం? ఏ ప్రాతిపదికన సమాజంలో, మానవీయతలో అబార్షన్‌కు చోటివ్వగలం? ’ అని పోప్ ప్రశ్నించారు. అర్జెంటీనాలో అబార్షన్‌ను చట్టబద్ధంచేస్తూ తెస్తున్న ఓ బిల్లును సైతం పోప్ ఇటీవల తీవ్రంగా వ్యతిరేకించారు. -
స్త్రీలోక సంచారం
ఐర్లండ్‌లోని ప్రార్థనాస్థల నివాస ప్రాంగణాలలో, అనాధ ఆశ్రమాలలో, మతపరమైన విద్యాలయాలలో దశాబ్దాలుగా జరుగుతున్నట్లు వచ్చిన లైంగిక అకృత్య ఆరోపణలపై స్పందించిన పోప్ ఫ్రాన్సిస్.. డబ్లిన్‌లో కొందరు బాధితులను ప్రత్యక్షంగా కలుసుకుని.. వారిని, వారి తల్లులను క్షమాపణ వేడుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఐర్లండ్ వచ్చిన ఫ్రాన్సిస్.. పర్యటన ముగింపు కార్యక్రమంగా డబ్లిన్‌లోని ఫీనిక్స్ పార్క్‌లో కనీసం లక్షమంది హాజరైన బహిరంగ సభలో మాట్లాడుతూ, ‘‘క్యాథలిక్ మత విలువలు, విశ్వాసాలు పరిఢవిల్లిన ఒకప్పటి ఐర్లండ్‌లో ఈ విధమైన క్షీణతను జీర్ణించుకోలేకపోతున్నాను’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆగస్టు 26న జరిగిన ఎనిమిదవ ఫుల్, హాఫ్ మారథాన్లలో వయసుతో నిమిత్తం లేకుండా మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొనగా, వారిలో జయంతి సంపత్‌కుమార్ అనే మహిళ.. చీరలో 42 కి.మీ పరుగులు తీసి ప్రత్యేక స్ఫూర్తిగా నిలిచారు. ఈ రెండు మారథాన్ల కోసం దేశంలోని వివిధ నగరాల నుంచి వచ్చిన 3 వేల మంది రన్నర్లతో కలిపి మొత్తం 22 వేల మంది పాల్గొన్న 42,195 కి.మీ ఫుల్ మారథాన్ మహిళల గ్రూపులో కెన్యా యువతి పాస్కలియా చెప్కాచ్, జ్యోతి గౌహతి, సీమ మొదటి మూడు స్థానాల్లో నిలవగా, 21,095 కి.మీ. హాఫ్ మారథాన్‌లో స్వాతీగద్వే, వర్షాదేవీ, నవ్యా వడ్డె కొన్ని నిమిషాల వ్యత్యాసంతో తొలి మూడు స్థానాలు గెలుచుకున్నారు. ‘టాసా’ (తెలంగాణ అండ్ ఆంధ్రా సబ్ ఏరియా) ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్‌లోని టాసా ప్రధాన కార్యాలయంలో ‘ఆర్మీ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ (అవ్వ) వీక్.. వేడుకలు జరిగాయి. సైన్యంలో పని చేస్తున్న వారి జీవిత భాగస్వాములు, పిల్లలు, వారిపై ఆధారపడి జీవిస్తున్న ఇతరుల సంక్షేమం కోసం ఢిల్లీలో 1966 ఆగస్టు 23 న ఈ సంస్థ ఆవిర్భవించిన నాటి నుండీ జరుగుతున్న ఈ ‘అవ్వ’ వీక్.. ఈ ఏడాది థీమ్ (‘ఇయర్ ఆఫ్ ది డిజేబుల్డ్ సోల్జర్’) కి అనుగుణంగానే తన కార్యక్రమాలు రూపొందించుకుంది. హార్ట్ సర్జరీ కోసం ఫ్రాన్స్‌కు వెళుతున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ (80) ను ఆమె ఇంటికి వెళ్లి మరీ పరామర్శించిన ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఆమె చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ నిమిత్తం వైద్యుల సలహా మేరకు ఫ్రాన్స్‌లోని లీల్ ప్రాంతంలో ఉన్న ‘యూనివర్సిటీ హాస్పిటల్’లో షీలా దీక్షిత్ అడ్మిట్ అవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చూసుకోవడం కోసం ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే నలుగురు సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. స్త్రీశక్తి పాత్రలకు ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ నటి ఎమ్మా థాంప్సన్ (59), తన 18 ఏళ్ల కుమార్తె గయా వైజ్ గత ఏడాది లండన్ అండర్‌గ్రౌండ్ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఏ విధంగా లైంగిక వేధింపునకు గురైందో ‘సన్’ పత్రికకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ, ‘‘అంతమంది మధ్యలో ప్రయాణిస్తున్నప్పటికీ, తనపై చేతులు వేసినవాడికి భయపడటం తప్ప, వాడినేమీ అనలేకపోవడమే నా కూతుర్ని చాలాకాలం పాటు బాధించింది’’ అని తెలిపారు. ‘‘వేధింపునకు గురైన స్త్రీకి ఆ వేధింపు కన్నా కూడా, ‘ఎందుకిలా చేస్తున్నావ్?’ అని అడగలేకపోవడం, తిరిగి మాటకు మాట అనలేకపోవడమే పెద్ద అవమానం’’ అని భావించిన తన కూతురు ఆ ఘటనను మర్చిపోవడానికి చాలా ప్రయత్నం చేయవలసి వచ్చిందని చెప్పిన ఎమ్మా.. మతపరమైన విశ్వాసాల కారణంగా రక్తమార్పిడికి తిరస్కరించిన ఒక చిన్నారి చుట్టూ అల్లిన కథాంశంతో ‘చిల్డ్రన్ యాక్ట్’ అనే చిత్రంలో త్వరలోనే నటించబోతున్నారు. చైనాలో కార్ పూలింగ్ సర్వీస్‌కు ప్రఖ్యాతిగాంచిన ‘దీదీ చాషింగ్’.. గతవారం రైడ్–షేరింగ్ సర్వీస్‌లో ఒక ప్రయాణీకురాలిపై అత్యాచారం, ఆ పై ఆమె హత్య జరిగిన ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ తక్షణం తమ సేవలన్నీ రద్దు చేయడమే కాకుండా, కంపెనీ జనరల్ మేనేజర్‌ను, వైస్ ప్రెసిడెంట్‌ను ఆ పదవుల నుంచి తొలగించింది. అనంతరం, కార్పూలింVŠ సర్వీసులో మహిళల భద్రతా ప్రమాణాలపై చైనా పోలీస్, రవాణా శాఖలకు వివరణ ఇస్తూ, ఆ శాఖల ఆదేశం మేరకు సెప్టెంబర్ 1 కల్లా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో సేవలను పునఃప్రారంభిస్తామని తెలిపింది. దేశద్రోహ నేరారోపణపై రెండేళ్ల క్రితం 2016 ఏప్రిల్ 3న టెహ్రాన్ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేసి, ఐదేళ్ల శిక్ష విధించి, అక్కడి ఎవిన్ జైల్లో పెట్టిన ‘థాంప్సన్ రాయిటర్స్ ఫౌండేషన్’ (బ్రిటన్) ప్రతినిధి, బ్రిటన్ సంతతి ఇరాకీ మహిళ.. నజానిన్ జఘారి రాట్‌క్లిఫ్‌కు అనూహ్యంగా మూడు రోజుల ‘విముక్తి’ని ప్రసాదించి, కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం ఇచ్చిన ఇరాన్ ప్రభుత్వం.. ఆ తర్వాత ఏమాత్రం పొడిగింపు లేకుండా తిరిగి ఆమెను అరెస్టు చేయడంపై ఆమె పేరుతో ట్విట్టర్లో ఉన్న ‘ఫ్రీ నజానిన్’ అకౌంట్లో దిగ్భ్రాంతి వ్యక్తమౌతోంది. ప్రభుత్వం ఇచ్చిన విరామ సమయంలో నజానిన్ తన నాలుగేళ్ల కూతురు గాబ్రియేలాను ఎత్తుకుని ఉల్లాసంగా ఉన్న ఫొటోను ట్విట్టర్లో చూసిన వారు భావోద్వేగాలకు లోనై, నజానిన్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నట్లు ఆమె భర్త రిచర్డ్ రాట్క్లిఫ్ ట్విట్టర్లో ఆవేదనగా ఒక కామెంట్‌ను పోస్ట్ చేశారు. గర్భం వచ్చిన తొలి వారాలలో గర్భవిచ్ఛిత్తి (అబార్షన్) కోరుకునేవారు ఇక నుంచి ఇంట్లో కూడా ‘అబార్షన్ పిల్’ వేసుకునేందుకు అనుమతించే కొత్త చట్టం ఒకటి ఇంగ్లండ్‌లో ఈ ఏడాది ఆఖరులో అమలులోకి రానుంది. ప్రస్తుతం పదో వారం లోపు అబార్షన్ చేయించుకునేందుకు చట్టపరమైన ఆమోదం ఉన్న ఇంగ్లండ్‌లో.. అబార్షన్‌ను క్లినిక్‌లో మాత్రమే 24 నుంచి 48 గంటల మధ్య విరామంతో వేసుకోవలసిన రెండు పిల్స్‌తో చేస్తుండగా, మొదటి పిల్ వేసుకున్న తర్వాత, ఇంటికి వెళ్లిపోయి, రెండో పిల్ కోసం మళ్లీ క్లినిక్‌కు వెళ్లే సమయంలో దారి మధ్యలో గర్భస్రావం జరిగేందుకు ఉన్న ప్రమాదాన్ని ఈ ‘హోమ్ పిల్’ తో నివారించవచ్చునని కొత్త చట్టాన్ని సమర్థించేవారు అంటున్నారు. -
కేరళను ఆదుకోండి: పోప్
వాటికన్ సిటీ: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన కేరళను ఆదుకోవాలని పోప్ ఫ్రాన్సిస్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. వరద బాధితుల కోసం ఆయన ఆదివారం సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద ప్రార్థనలు నిర్వహించారని వాటికన్ న్యూస్ పేర్కొంది. ‘కేరâý ప్రజల్ని ఆదుకోనేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలి’ అని ఆయన కోరారు. -
జీవితం సంతోషాల పూదోట
లోపాలు, కోపాలు, దిగుళ్లు, చింతలు ఎన్ని ఉన్నప్పటికీ సంతోషం అనేది ఈ జీవితంలో చేయవలసిన ఒక గొప్ప సాహసం అని మరచిపోవద్దు. సంతోషం అంటే మబ్బుల్లేని ఆకాశం కాదు. ప్రమాదాలు లేని రహదారి కాదు. నిస్సత్తువ లేని పని గంటలు కాదు. నిరాశ కలిగించని మానవ సంబంధాలు కాదు. సంతోషంగా ఉండడం అంటే.. క్షమాగుణంలోని శక్తిని కనుక్కోవడం, యుద్ధాలలో ఆశల్ని నిలుపుకోవడం, భయంలో భద్రతను, విడిచివేతలో ప్రేమను వెతుక్కోవడం. సంతోషం అంటే చిరునవ్వును ఆస్వాదించడం మాత్రమే కాదు. విచారానికి అదొక ప్రతిఫలనం కూడా. సంతోషం అన్నది విధి విలాసం కాదు. కాలంతో పాటు అంతర్యానం చేయగలవారు సాధించే విజయం. సంతోషం అంటే ఎడారులను దాటుకుంటూ నీ లోలోపలి లోతుల్లో ఒయాసిస్సులను అన్వేషించడం. నీ జీవితంలోని మహిమలకు ప్రతి ఉదయం దేవుడికి ధన్యవాదాలు తెలుపుకోవడం. సంతోషం అంటే ‘కాదు’ అనే మాటను వినగలిగిన ధైర్యాన్ని కలిగి ఉండడం. విమర్శలో నిబ్బరంగా ఉండడం. నీ పిల్లల్ని ముద్దాడడం. తల్లిదండ్రులను లాలించడం. స్నేహితులతో కవితాత్మక క్షణాలను గడపడం... వాళ్లు మనల్ని బాధించినా కూడా! ‘నేను పొరపాటు చేశాను’ అని ఒప్పుకోవడం పరిణతి. ‘నన్ను క్షమించు’ అని అడగగలగడం ధైర్యం. నీ జీవితం సంతోషానికి అవకాశాల çపూదోట అవ్వాలి. సంతోషాన్ని ప్రేమించే వసంతం కావాలి. శీతాకాలంలో వెచ్చటి విజ్ఞత అవ్వాలి. ఒక తప్పు జరిగిపోతే జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టు. అప్పుడు మాత్రమే జీవితంతో నువ్వు ప్రేమలో ఉండగలవు. సంతోషంగా ఉండడం అంటే జీవితంలో పరిపూర్ణత ఉండడం మాత్రమే కాదని అప్పుడు నువ్వు గ్రహిస్తావు. అయితే సహనాన్ని నువ్వు కన్నీళ్లతో సాగు చెయ్యాలి. కోల్పోయినవాటితో సహనాన్ని సాధన చెయ్యాలి. నీ పొరపాట్లతో ప్రశాంతత అనే శిల్పాన్ని మలుచుకోవాలి. బాధను ఆహ్లాదమనే పట్టీగా వేసుకోవాలి. అడ్డంకులతో జ్ఞానద్వారాలను తెరవాలి. విడిచిపెట్టకు. నిన్ను ప్రేమించే మనుషులను ఎప్పటికీ విడిచిపెట్టకు. సంతోషాన్ని వదులుకోకు. జీవితమనే అద్భుతమైన ఆట నుంచి తప్పుకోకు. (కొత్త సంవత్సరంలో పోప్ ఫ్రాన్సిస్ ఇచ్చిన ప్రసంగం నుంచి) -
శ్మశానం ముందు తమ్ముడి శవంతో..
సాక్షి, వెబ్ డెస్క్ : లోకం చీకటిమయంగా మారడానికి కారణమైన అణు యుద్ధంపై పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడారు. రెండేళ్ల తమ్ముడి శవాన్ని వీపునకు కట్టుకుని శ్మశానవాటికకు మోసుకెళ్తున్న పదేళ్ల బాలుడి చిత్రం గురించి ప్రత్యేకించి చర్చించారు. అమ్మ ఒడి నుంచి బయటకు రాని పసివాళ్ల చుట్టూ ఉన్న లోకం చీకటి మయం కావడానికి కారణం రెండో ప్రపంచ యుద్ధమని అన్నారు. జపాన్ దేశంలో ఆరేళ్లుగా జరగుతున్న రెండో ప్రపంచయుద్ధ మారణకాండ ఆగష్టు 9, 1945న ఉగ్రరూపం దాల్చింది. జపాన్‌లోని నాగసాకిపై అమెరికా అణుబాంబును విసిరింది. దీంతో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర మారణకాండకు సంబంధించిన చిత్రాలను అమెరికా మెరైన్స్ ఫొటోగ్రాఫర్ జోయ్ ఒ డొన్నెల్ తన కెమెరాలో బంధించారు. 1945 అణుబాంబు దాడి అనంతరం నాలుగేళ్ల పాటు డొన్నెల్ జపాన్‌లోనే ఉన్నారు. ఆయన తీసిన వందల చిత్రాల్లో తమ్ముడి శవాన్ని దహన సంస్కారాలు చేసేందుకు ఎదురుచూపులు చూస్తున్న పిల్లవాడిది కూడా ఒకటి. ఈ చిత్రాన్ని చూసిన పోప్ ఫ్రాన్సిస్ చలించిపోయారు. యుద్ధ పరిణామాల గురించి ఈ ఫొటో చెబుతున్నంత స్పష్టంగా మరేదీ చెప్పలేదని పేర్కొన్నారు. ఆ సమయంలో బాలుడి బాధ వర్ణానాతీతం అని చెప్పారు. పళ్లతో పెదవులను అదిమిపెట్టి బాధను ఓర్చుకునేందుకు బాలుడు ప్రయత్నించినట్లు వెల్లడించారు. ట్రంప్ వర్సెస్ కిమ్ ఉత్తరకొరియా పదే పదే అణుదాడిపై మాట్లాడుతున్న నేపథ్యంలో అణు ఆయుధ వ్యతిరేక సమావేశంలో ఆదివారం పోప్ ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగసాకిపై అణు దాడి ఫొటోలను తిలకించారు. శ్మశానవాటికలో తమ్ముడి శవాన్ని దహన సంస్కారాలు చేసేందుకు ఎదురుచూపులు చూస్తున్న పిల్లవాడి క్షోభ ప్రపంచ దేశాలకు అర్థం కావాలని, అందుకే ఈ ఫొటోను పునః ముద్రించి అందరికీ పంచాలని కోరారు. అణు హెచ్చరికలపై కిమ్ దేశంతో చర్చలు జరిపేందుకు వాటికన్ సిటీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. -
బంగ్లాదేశ్‌లో పోప్ పర్యటన
ఢాకా: పోప్ ఫ్రాన్సిస్ గురువారం ఉదయం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకున్నారు. బంగ్లాదేశ్‌లో ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. మయన్మార్‌లో పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో ఢాకా చేరుకున్న పోప్‌కు బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సైనిక బలగాల గౌరవ వందనం ఆయన స్వీకరించారు. పోప్ పర్యటన సందర్భంగా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోప్ తన పర్యటనలో మయన్మార్ రొహింగ్యాల సమస్యను ప్రముఖంగా ప్రస్తావిస్తారని భావిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న రెండవ పోప్..ఫ్రాన్సిస్. మొదటిసారిగా 1986 లో పోప్ జాన్‌పాల్-2 బంగ్లాదేశ్‌లో పర్యటించారు. -
పోప్ జాన్‌పాల్1కు సెయింట్‌హుడ్!
వాటికన్ సిటీ: 33 రోజులు పోప్‌గా ఉన్న దివంగత పోప్ జాన్‌పాల్1కు సెయింట్‌హుడ్ హోదా ఇచ్చే ప్రతిపాదనకు పోప్ ఫ్రాన్సిస్ ఆమోదం తెలిపారు. 1978 ఆగస్టు 26న పోప్‌గా బాధ్యతలు స్వీకరించిన ఈయన గుండెపోటుతో అదే ఏడాది సెప్టెంబర్ 28న తుదిశ్వాస విడిచారు. పోప్‌జాన్‌పాల్1కు సెయింట్‌హుడ్ హోదా ఇవ్వాలంటే ముందుగా బీటిఫికేషన్ ప్రక్రియ పూర్తవ్వాలి. ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా పోప్ జాన్‌పాల్1ను ‘సద్గుణశీలి’గా పోప్ ఫ్రాన్సిస్ గుర్తించారు. ఆ తర్వాత జాన్‌పాల్ పేరిట జరిగిన మొదటి అద్భుతాన్ని రోమన్ క్యాథలిక్ చర్చి ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఆయన మరణం తర్వాత జరిగిన అద్భుతాన్ని సైతం చర్చి గుర్తించాలి. -
సిస్టర్ మరియాను ‘బ్లెస్డ్’గా ప్రకటించిన వాటికన్
భోపాల్/ఇండోర్ : కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని రాణి మరియా వట్టాలిని వాటికన్లో రోమన్ కేథలిక్ చర్చి దీవెన పొందిన(బ్లెస్డ్) వ్యక్తిగా ప్రకటించింది. ఇండోర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ నుంచి వచ్చిన ప్రకటనను కార్డినల్ ఏంజెలో అమాటో చదివి వినిపించారు. పునీత(సెయింట్‌హుడ్)కు ముందు హోదానే బ్లెస్డ్.. ఈ కార్యక్రమంలో మరియాను కత్తితో పొడిచి చంపిన హంతకుడు కూడా పాల్గొనడం గమనార్హం. సిస్టర్ రాణిగా పేరుపడ్డ మరియా 1995లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హత్యకు గురయ్యారు. దేవాస్ జిల్లాలో బస్సులో ప్రయాణిస్తుండగా హంతకుడు ఆమెను 50 సార్లు పొడిచి హత్య చేశాడు. -
ప్రార్థన చేస్తూ.. నిద్రపోయేవాడిని : పోప్
వాటికన్ సిటీ : ప్రార్థన చేస్తూ తానూ నిద్రలోకి జారుకున్న సందర్భాలు ఉన్నాయని పోప్ ఫ్రాన్సిస్ చెప్పారు. దాదాపు సెయింట్లు అందరికీ ఈ అనుభవం ఎదురవుతుందని వెల్లడించారు. మంగళవారం క్యాథలిక్ టీవీ 2000లో ప్రసారమైన ఓ కార్యక్రమంలో పోప్ ఈ విషయం చెప్పారు. 19వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ నన్ సెయింట్ థెరిస్కూ ఇలాంటి అనుభవాలు ఎదురైన సంఘటనలున్నాయని అన్నారు. సాధారణ ప్రజలను కలిసినప్పుడు పోప్ తన శక్తిని రేడియట్ చేస్తారు. అయితే, పోప్ ప్రార్థన చేసే సమయంలో ఆయన ముఖ కవళికలు భిన్నంగా ఉంటాయి. -
పోప్ ఫ్రాన్సిస్‌కు గాయాలు
కార్టాజెనా : క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్‌కు గాయాలు అయ్యాయి. తనకోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఓపెన్ టాప్ వాహనంలో కొలంబియాలో భారీ జన సమూహం మధ్య పర్యటిస్తున్న ఆయన అనూహ్యంగా పట్టుతప్పి వాహనంలో నిలువుగా ఉన్న ఇనుప కడ్డీకి తాకడంతో స్వల్పంగా గాయాలు అయ్యాయి. కొన్ని రక్తపు బిందువులు కూడా పడ్డాయి. ఈ కారణంగా తలకు చిన్న బొప్పి కట్టడంతో దవడ ఎముక భాగంలో, ఎడమకంటి పక్కన చిన్న గాయాలయ్యాయి. అయితే, దీనికి సంబంధించి వాటికన్ సిటీ ప్రకటన చేస్తూ పోప్‌కు స్వల్పగాయమే అయిందని, కంగారు పడాల్సిన పనిలేదని చెప్పింది. ప్రస్తుతం ఆయనకు ఐస్‌తో ట్రీట్మెంట్ చేశారని, ఆయన పర్యటన కొనసాగుతుందని వెల్లడించింది. తనకు గాయం అవగానే 'నాకు పంచ్ పడింది.. నేను బానే ఉన్నాను' అంటూ పోప్ జోక్ చేశారు. -
ఆయువు పోస్తారా.. తీస్తారా
11 నెలల పసిగుడ్డు. కాళ్లు చేతులు కదపలేడు. ఊపిరి కూడా సొంతంగా తీసుకోలేడు. తొమ్మిది నెలలుగా వెంటిలేటర్‌పైనే ఉన్నాడు. అరుదైన జన్యుపరమైన లోపం. మెదడు బాగా దెబ్బతింది. బతికే అవకాశాల్లేవు అంటున్నారు వైద్య నిపుణులు. వెంటిలేటర్ తొలగించి చిన్నారికి ‘విముక్తి’ ప్రసాదించడం ఉత్తమమని తేల్చారు. ససేమిరా అంటోంది కన్నప్రేమ. బిడ్డను బతికించుకునేందుకు ఆఖరి అవకాశం ఇవ్వాలని న్యాయ పోరాటానికి దిగారు తల్లిదండ్రులు. హైకోర్టు, సుప్రీంకోర్టు నిరాకరించాయి. అంతే.. ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలాయి. పసివాడి ప్రాణం నిలబడాలని కోరుకున్న లక్షలాది మంది విలవిల్లాడుతున్నారు. ప్రపంచం యావత్తు ఎవరీ చిన్నారని ఆరా తీస్తోంది. అతని పేరు చార్లీ గార్డ్. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ ‘‘అనారోగ్యం కారణంగా ప్రాణహాని ఉన్నపుడు.. ఆ జీవికి ప్రేమతో అండగా నిలబడటం దేవుడు మనందరిపై పెట్టిన బాధ్యత’’ – పోప్ ఫ్రాన్సిస్ ట్వీట్ ‘‘బ్రిటన్‌లోని మా మిత్రులు, పోప్ కోరుకుంటున్నట్లుగా చిన్నారి చార్లీకి మా వల్ల అయ్యే ఏ సహాయమైనా చేయడానికి సిద్ధం’’ – ట్రంప్ పోప్ ఫ్రాన్సిస్ చిన్నారి చార్లీని రోమ్‌లోని ఆసుపత్రిలో చేర్చాలని.. ప్రశాంతంగా చివరి శ్వాస తీసుకోవడానికి ప్రార్థనలు చేద్దామని తల్లిదండ్రులను ఆహ్వానించారు. మరోవైపు వైట్‌హౌస్ ప్రతినిధులు చార్లీ తల్లిదండ్రులతో మాట్లాడి అవసరమైన ఏ సహాయమైనా చేస్తామని చెప్పారు. ప్రపంచమంతా చిన్నారి చార్లీ కోసం పోరాడుతుంటే మనమేం చేస్తున్నట్లు అనే ప్రశ్నను బ్రిటిషర్లు లేవనె త్తుతున్నారు. ఏం జరుగుతోందో తెలియదు. కానీ ‘భగవం తుడా చార్లీని బతికించు’అని ప్రపంచం ప్రార్థిస్తోంది. అత్యంత అరుదు.. బ్రిటన్‌కు చెందిన క్రిస్ గార్డ్, కోనీ యేట్స్‌కు 2016 ఆగస్టు 4న జన్మించాడు చార్లీ. రెండు నెలల వయసు వచ్చే సరికి బరువు పెరగకపోవడం, ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో పరీక్షలు చేశారు. మిటో కాండ్రియల్ డీఎన్ఏ డిప్లెషన్ సిండ్రోమ్(ఎంఎండీఎస్) అనే అత్యంత అరుదైన జన్యులోపంతో బాధపడుతున్నట్లు తేలింది. దీని వల్ల శక్తి హీనత, మెదడు దెబ్బతినడం, కాలేయం విఫలం కావ డం, మూర్ఛపోవడం.. తదితర సమస్యలతో సతమత మవుతారు. ప్రపంచంలో ఇప్పటివరకు 16 మందిలో మాత్రమే దీనిని గుర్తించారు. చికిత్స నిమిత్తం లండన్‌లోని గ్రేట్ అర్మాండ్ స్ట్రీట్ ఆసుపత్రిలో చేర్చారు. చార్లీకి వైద్య పరంగా చేయగలిగిందేమీ లేదని.. కాబట్టి వెంటిలేటర్ తొలగించ డానికి అనుమతివ్వాలని ఆసుపత్రి దరఖాస్తు చేసింది. దీన్ని క్రిస్, కోని లండన్ హైకోర్టులో సవాల్ చేశారు. అమెరికాలో ఇలాంటి వ్యాధికి చికిత్స ప్రయోగాల దశలో ఉందని.. అతన్ని అమెరికాకు తీసుకెళ్లి చికిత్స చేయించడానికి అనుమతివ్వాలని వేడుకున్నారు. ‘అతనికి ఒక్క అవకాశం ఇవ్వరూ..’అని ప్రాధేయపడ్డారు. ఏప్రిల్ 11న హైకోర్టు వీరి విజ్ఞప్తిని తిరస్కరిం చింది. లైఫ్ సపోర్టింగ్ మెషీన్‌ను ఆపు చేయాలని చెప్పింది. భారమైన హృదయంతో చార్లీని దృష్టిలో పెట్టుకొని తానీ నిర్ణయాన్ని వెలువరిస్తున్నాని జస్టిస్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. బ్రిటన్ సుప్రీంకోర్టు కూడా వెంటిలేటర్‌ను తొలగిం చాలనే అభిప్రాయపడింది. మరోవైపు అమెరికాలో చార్లీ చికిత్స కోసం రూ.10.92 కోట్లు విరాళాల రూపంలో సమీకరించారు. ఆఖరి ప్రయత్నంగా యూరోప్ మానవ హక్కుల కోర్టును ఆశ్రయిం చగా.. జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. బిడ్డ ఊపిరి ఆపుతారనే నిజాన్ని జీర్ణించు కోలేక కన్నీరు మున్నీరయ్యారు క్రిస్, క్రోని. షెడ్యూల్ ప్రకారం జూన్ 30న వెంటి లేటర్‌ను తొలగించాలి. బిడ్డతో మరికొంత సమయం గడప డానికి, ప్రశాంతంగా వీడ్కోలు పలకడానికి సమయం కావాలన్న చార్లీ తల్లిదండ్రుల కోరిక మేరకు.. వెంటి లేటర్‌ను కొనసాగిస్తున్నారు. అయితే చార్లీని ఇంటికి తీసుకెళ్లాలని, ఆఖరి సారిగా లాలపోసి.. జోల పాడాలని ఆ తల్లి కోరుకుంది. దీనికి వీల్లేదని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో ఆమె తల్లడిల్లిపోతోంది. -
‘ఏం జరుగుతోంది? బాంబుకు అమ్మ పేరేంటి?’
మిలాన్: అమెరికాను పోప్ ఫ్రాన్సిస్ విమర్శించారు. బాంబులకు తల్లి పేరు పెట్టడమేమిటని ఆయన ప్రశ్నించారు. విధ్వంసాలు సృష్టించే బాంబులను వర్ణించేందుకు అమ్మ అనే పదాన్ని ఉపయోగించరాదని ఆయన హితవు పలికారు. ఇటీవల కాలంలో ప్రపంచంలోని అన్ని బాంబులకు తల్లి(మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్)గా పేర్కొంటూ అమెరికా ఓ పెద్ద బాంబును సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై జారవిడిచిన విషయం తెలిసిందే. అనంతరం ప్రపంచ బాంబులకు తండ్రిలాంటి బాంబు(ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్) రష్యా వద్ద ఉందంటూ చర్చ జరిగింది. అయితే, అనూహ్యంగా శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన పోప్.. పేలుడు పదార్థాన్ని తల్లి పేరుతో వర్ణించరాదని అన్నారు. ‘ఆ పేరు నేను విన్నప్పుడు నాకు సిగ్గుగా అనిపించింది. తల్లి జన్మనిస్తుంది. బాంబు మాత్రం చావునిస్తుంది. అయినా దీనిని తల్లిగా పిలుస్తున్నాం. అసలు ఏం జరుగుతోంది?’ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 24న పోప్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సిరియాలో మారణహోమం ఆపండి: పోప్
-
సిరియాలో మారణహోమం ఆపండి: పోప్
వాటికన్ సిటీ/జెరూసలేం: సిరియాలో మారణహోమానికి ముగింపు పలకాలని పోప్ ఫ్రాన్సిస్ విజ్ఞప్తి చేశారు. ఈస్టర్ సందర్భంగా ఆదివారం వాటికన్ సిటీలో నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం సెయిం ట్ పీటర్స్ బాసిలికా చర్చి ప్రాంగణంలో గుమిగూడిన భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. యుద్ధం, కరువు, రాజకీయ అనిశ్చితితో తీవ్ర ఇక్కట్లు పడుతున్న సిరియా ప్రజల కోసం ప్రార్థించారు. అలాగే ఉక్రెయిన్, ఆఫ్రికాలో అంతర్యుద్ధాలు ముగిసిపోవాలని ఆకాంక్షించారు. కాగా, ఈస్టర్ సందర్భంగా జెరూసలేంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏసుక్రీస్తు పునరుత్థానం చెందినట్లు భావించే ప్రాంతంలో నిర్మించిన సపుల్కర్ చర్చిని వేలాది మంది సందర్శించారు. -
చర్చిల్లో మత గురువులుగా పెళ్లయినవారు!
బెర్లిన్ : పెళ్లయిన పురుషులను కూడా చర్చిలలో మత గురువులుగా నియమించే ప్రతిపాదనపై ఆలోచిస్తున్నట్లు పోప్ ఫ్రాన్సిస్ గురువారం చెప్పారు. మతాచార్యుల కొరత వేధిస్తున్నందున గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో పనిచేయడానికి సిద్ధపడే పెళ్లయిన పురుషులకు అవకాశం లభించవచ్చని ఆయన ఒక జర్మనీ వార పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అనేకచోట్ల మతాచార్యుల కొరత ఉన్నందున, వారి నియామకానికి కొత్త పద్ధతులు అవలంబించాలని చర్చిల్లో చాలా మంది భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. బ్రహ్మచర్యం పాటించేవారితోపాటు చర్చిల్లో పనిచేయడానికి కృతనిశ్చయంతో ఉండే వయసు మళ్లిన, పెళ్లయిన పురుషులకు కూడా అవకాశం ఇవ్వాలని చర్చిల్లోని వారు అనుకుంటున్నారని పోప్ పేర్కొన్నారు. -
మధ్య ప్రాచ్యంలో శాంతి స్థాపన జరగాలి
పోప్ ఫ్రాన్సిస్ క్రిస్మస్ సందేశం • ఉగ్రదాడి మృతులకు సంతాపం • ప్రపంచవ్యాపంగా ఘనంగా క్రిస్మస్ సంబరాలు వాటికన్ సిటీ/న్యూఢిల్లీ: జీహాదీల దాడులతో రక్తసిక్తమ వుతున్న మధ్య ప్రాచ్య దేశాల్లో శాంతి స్థాపన నెలకొనాలని పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్షించారు. ఉగ్రవాదుల కిరాతక దాడుల్లో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆరేళ్లుగా అంతర్యుద్ధంతో అట్టు డుకుతున్న సిరియాలో తుపాకులు నిశ్శబ్ధంగా మారాలని ఆదివారం ఇక్కడ ఇచ్చిన తన క్రిస్మస్ సందేశం లో పిలుపునిచ్చారు. నలభై వేల మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమం లో పోప్ భావోద్వేగంతో ప్రసంగించారు. చరి త్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించే దిశగా అడుగులు వేయాలని ఇజ్రాయిల్, పాలస్తీని యన్లకు సూచించారు. కాగా, బెర్లిన్ క్రిస్టమస్ మార్కె ట్‌పై ఐసిస్ ట్రక్ దాడిలో 12 మంది మర ణించిన నేపథ్యంలో యూరప్ అంతటా భారీ భద్రత ఏర్పాటు చేశారు. మిలాన్‌లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో ఈ దాడుల అను మానితుడు అనిస్ అమ్రి హతమయ్యాడు. ఫ్రాన్స్‌లో జీహాదీ ట్రక్కు దాడిలో 86 మంది బలైన దారుణం మరువకముందే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రజలు వణుకుతు న్నారు. దీంతో ప్రభుత్వం 91 వేల మంది భద్రతా సిబ్బందిని జనసమ్మర్థ ప్రాంతాలు, మార్కెట్లు, చర్చిల వద్ద నియమించింది.క్రైస్తవ మత పెద్దలు తమ సందేశాల్లో... యుద్ధం, దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. బెత్లెహామ్‌లో ఘనంగా వేడుక క్రీస్తు జన్మస్థానం బెత్లెహామ్‌లోని చర్చ్ ఆఫ్ నేటివిటీ భక్తులతో కళకళలాడింది. ప్రపంచం నలుమూలల నుంచి వేలాది భక్తులు ఇక్కడికి తరలివచ్చారు. గత ఏడాది పాలస్తీనియన్లు ఇజ్రాయలీలపై కత్తులతో దాడులు చేసిన క్రమంలో... ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే గట్టి భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఆనందంగా సంబరాల్లో పాల్గొన్నారు. అమెరికా, బ్రిటన్‌తో పాటు ప్రపంచ దేశాల్లో క్రీస్తు జన్మదిన వేడుక ఆడంబరంగా సాగింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు వైట్‌హౌస్ నుంచి తమ చివరి క్రిస్మస్ సందేశాన్నిచ్చారు. భారత్‌లో అర్ధరాత్రి నుంచే వెలుగులు శనివారం అర్ధరాత్రి నుంచే భారత్‌లో క్రిస్మస్ వెలుగులు విరజిమ్మాయి. చర్చిలు విద్యుత్ కాంతులతో మిరిమిట్లు గొలిపాయి. క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, రాష్ట్రాల సీఎంలు పండగ సంబరాల్లో పాల్గొన్నారు. -
2017లో భారత్‌కు పోప్
వాటికన్ సిటీ: పోప్ ఫ్రాన్సిస్ వచ్చే ఏడాది భారత్ లో పర్యటించనున్నారు. ఈమేరకు 2017 విదేశీ పర్యటనల షెడ్యూలును ఆదివారం ప్రకటించారు. పోర్చుగల్, బంగ్లాదేశ్, కొలంబియా, ఆఫ్రికాలూ జాబితాలో ఉన్నాయి. మే 13న పోర్చుగల్‌లోని మారియన్ చర్చిని సందర్శించడం ఖరారైంది. భారత్, బంగ్లాదేశ్ దేశాల పర్యటనలు కూడా దాదాపు ఖాయమయ్యాయి. -
విశ్వజనని
మదర్ థెరిసాకు సెయింట్ హుడ్ హోదా ప్రకటించిన పోప్ ఫ్రాన్సిస్ ఆమె సేవాతత్పరతకు అందిన గౌరవం అన్న పోప్ వాటికన్ సిటీలో అంగరంగ వైభవంగా కార్యక్రమం - వేలాదిగా తరలివచ్చిన క్రైస్తవ మత పెద్దలు, అభిమానులు.. - హాజరైన 13 దేశాల అధినేతలు.. కోల్‌కతాలో పండుగ వాతావరణం - సంప్రదాయాలను తోసిరాజని స్క్రీన్లకు అతుక్కుపోయిన నన్స్ - గంటలు మోగిస్తూ, చప్పట్లు చరుస్తూ హర్షాతిరేకాలు ఎక్కడో మేసిడోనియాలో కళ్లు తెరిచింది.. ప్రేమే ధర్మం.. సేవే మార్గమంటూ కదిలింది.. పేదలు, దీనులను అక్కున చేర్చుకుంది.. విశ్వజననిగా మానవత్వాన్ని పరిమళింపజేసింది.. 87 ఏళ్ల వయసులో ఆ కళ్లు మూతపడ్డాయి.. 19 ఏళ్ల తర్వాత.. నేడు.. ఆ కళ్లు మళ్లీ ‘తెరుచుకున్నాయి’.. కళ్ల నిండా విశ్వప్రేమను వర్షిస్తూ.. మానవత్వంలోనే ‘దైవత్వం’ ఉందని చాటిచెబుతూ.. థెరిసా ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. నాకు వాళ్ల (పేదలు) భాష రాకపోవచ్చు. కానీ వారి ముఖాలపై చిరునవ్వు విరిసేలా చేయగలను అనేవారు. ఆ చిరునవ్వులను మన హృదయాల్లో నింపుకుందాం. మన జీవన ప్రయాణంలో లక్షలాది దీనులకు వాటిని పంచుదాం. - పోప్ వాటికన్ సిటీ/కోల్‌కతా: మానవ సేవకు తన జీవితాన్ని అంకితం చేసి, క్రీస్తు ప్రేమ సందేశాన్ని లోకానికి చాటిచెప్పిన మానవతామూర్తి మదర్ థెరిసాకు పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హుడ్ హోదా ప్రకటించారు. ఆదివారం రోమ్‌లోని వాటికన్ సిటీలో ప్రపంచం నలుమూలల నుంచి తరలి వచ్చిన క్రైస్తవ మతపెద్దలు, వేలాది మంది యాత్రికులు, 13 దేశాలకు చెందిన అధినేతలు, థెరిసా ఆర్డర్‌కు చెందిన నన్స్ మధ్య ఈ మేరకు ప్రకటన చేశారు. ఇది మూర్తీభవించిన మాతృప్రేమకు, అనాథలను, పేదలను అక్కున చేర్చుకున్న సేవాతత్పరతకు అందిస్తున్న గౌరవమని పేర్కొన్నారు. ‘‘ఆమె పవిత్ర హృదయం మాకు అత్యంత సమీపంలో ఉంది. నిర్మలమైన ఆమె మనసును తలచుకున్నప్పుడల్లా మా గుండెలోతుల్లోంచి ‘మదర్’ అని వినిపిస్తోంది. కోల్‌కతాకు చెందిన థెరిసాను నేటి నుంచి సెయింట్స్ జాబితాలో చేరుస్తున్నాం..’’ అని భావోద్వేగంతో అన్నారు. పేదరికాన్ని సృష్టిస్తున్న ఈ ప్రపంచ దేశాల నాయకుల నేరాన్ని పేద గొంతుల తరఫున థెరిసా వినిపించిందన్నారు. ఈ కార్యక్రమంలో వినిపించాల్సిన సందేశాన్ని ముందుగానే రాతపూర్వకంగా రూపొంది స్తారు. అయితే అందులో ఈ విషయాలు పేర్కొనకపోయినా పోప్ ఫ్రాన్సిన్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మదర్ గొప్పతనాన్ని కొనియాడారు. మదర్ థెరిసా దైవానికి అత్యంత సమీపంలో ఉందనడానికి.. భారత్‌లోని కోల్‌కతా మురికివాడల్లో నిరుపేదలకు చేసిన సేవలే నిదర్శనమన్నారు. ‘‘ఆమె ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. ‘నాకు వాళ్ల(పేదలు) భాష రాకపోవచ్చు. కానీ వారి ముఖాలపై చిరునవ్వు విరిసేలా చేయగలను’ అని థెరిసా అనేవారు. ఆ చిరునవ్వులను మన హృదయాల్లో నింపుకుందాం. మన జీవన ప్రయాణంలో లక్షలాది దీనులకు వాటిని పంచుదాం’’ అని అన్నారు. గర్భస్థ శిశువులు ఈ లోకంలో అత్యంత బలహీనమైన వారని, అబార్షన్లతో వారిని చంపేయడాన్ని థెరిసా తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని పోప్ ఫ్రాన్సిస్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. సెయింట్‌హుడ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత పోప్ ఫ్రాన్సిస్ టాప్‌లెస్ జీప్‌లో సెయింట్‌పీటర్స్ స్క్వేర్‌లో తిరుగుతూ వేలాది మంది అభిమానులకు అభివాదం చేశారు. కోల్‌కతాలో పండగ వాతావరణం వాటికన్ సిటీలో మదర్ థెరిసాకు సెయింట్ హుడ్ ప్రకటిస్తున్న సమయంలో ఆమె కార్యక్షేత్రమైన కోల్‌కతాలో పండగ వాతావరణం కనిపించింది. నగరంలో అనేకచోట్ల పెద్దపెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి వాటికన్ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాట్లు చేశారు. ఇక థెరిసా సేవా కార్యక్రమాలకు హెడ్‌క్వార్టర్‌గా ఉన్న మదర్హౌస్లో హర్షాతిరేకాలు మిన్నంటాయి. సాధారణంగా భావోద్వేగాలకు అతీతంగా, ప్రశాంత వదనాలతో కనిపించే నన్స్ ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. టీవీలు, సెల్ఫోన్లకు దూరంగా ఉండే సిస్టర్స్ అంతా స్క్రీన్ల ముందు వాలిపోయి వాటికన్లో జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఆనందంతో పెద్దగా అరుస్తూ, చప్పట్లు చరుస్తూ, గంటలు మోగిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు. మదర్‌హౌస్ ముందు థెరిసా నిలువెత్తు చిత్రపటాన్ని ఉంచారు. పూలు, విద్యుద్దీపాలు, థెరిసా చిత్రపటాలతో భవనాన్ని అలంకరించారు. సందర్శకులకు వీలుగా రోజంతా మదర్హౌస్ను తెరిచి ఉంచారు. ఉదయం 6 గంటలకే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనేక మంది విదేశీయులు కూడా మదర్హౌస్కు తరలివచ్చారు. థెరిసా సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. మానవ సేవే మాధవ సేవగా.. 1910 ఆగస్ట్ 26న మేసిడోనియాలోని స్కోప్జేలో జన్మించిన థెరిసా నన్‌గా మారి తన సేవా కార్యక్రమాలకు కోల్‌కతాను కేంద్రంగా చేసుకున్నారు. దీనులు, అన్నార్థులు, రోగపీడితులు, అనాథలను అక్కున చేర్చుకొని ఆదరించింది. 1931 నుంచి 1997 సెప్టెంబర్ 5న కన్ను మూసేవరకు కోల్‌కతాలోనే సేవాకార్యక్రమాలు నిర్వహించారు. 1979లో నోబెల్ శాంతి బహుమతి అందుకుంది. 1997లో ఆమెను పవిత్రమూర్తి (బీటిఫికేషన్)గా గుర్తించే ప్రక్రియ మొదలైంది. మదర్ థెరిసా మరణానంతరం జరిగిన రెండు అద్భుతాల(1998లో ఒకటి, 2008లో మరొకటి)ను ధ్రువీకరించుకున్న తర్వాత థెరిసాకు.. ఆమె 19వ వర్ధంతి సందర్భంగా రోమన్ కేథలిక్ చర్చి సెయింట్‌హుడ్ హోదాతో గౌరవించింది. ఆమె ఆదర్శాలను అలవర్చుకుందాం.. సెయింట్‌హుడ్ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ఎందరో క్రైస్తవ మత పెద్దలు, థెరిసా అభిమానులు తరలివచ్చారు. ఇటలీలో థెరిసా ఆర్డర్‌కు చెందిన 1,500 మంది ఇళ్లు లేని నిరుపేదలను పోప్ ఫ్రాన్సిస్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారికి వీఐపీ సీట్లు కేటాయించి ముందు వరుసలో కూర్చోబెట్టారు. బ్రెజిల్లో థెరిసా మహిమతో బ్రెయిన్‌ట్యూమర్ నుంచి బయటపడిన ఆండ్రినో, ఆయన భార్య ఫెర్నాండా కూడా హాజరయ్యారు. 2003లో నిర్వహించిన బీటిఫికేషన్ కార్యక్రమానికి ఏకంగా 3 లక్షల మంది తరలివచ్చారు. కానీ ఈసారి లక్ష మంది మాత్రమే హాజరయ్యార ని చెబుతున్నారు. కార్యక్రమానికి 3 వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆగస్టు 26, 1910: మేసిడోనియాలో అల్బేనియన్ దంపతులకు జననం. ఆగ్నస్ గోన్షా బోజాక్షియుగా నామకరణం. 1928: ఐర్లండ్‌లో కేథలిక్ నన్ (సిస్టర్ మేరీ థెరిసాగా) మార్పు. 1929: కోల్‌కతాలో మిషనరీ, చారిటీ కార్యక్రమం ప్రారంభం. 1948: వరకు సెయింట్ మేరీ స్కూల్లో బోధన. 1950 అక్టోబర్: మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రారంభం. 1960ల్లో: కుష్టువ్యాధి, అతిసారం, క్షయవ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు. 1979: నోబెల్ శాంతి బహుమతి ప్రదానం. 1997 సెప్టెంబర్ 5: కోల్‌కతాలో చివరి శ్వాస. 2003: బెంగాలీ యువతికి వ్యాధి నయం చేసినందుకు పోప్ జాన్‌పాల్ -2 ద్వారా బీటిఫైడ్ (పవిత్రమూర్తిగా) గుర్తింపు. 2015: బ్రెజిల్ యువకుడికి బ్రెయిన్ ట్యూమర్‌ను తగ్గించటం ద్వారా సెయింట్‌హుడ్ ఇవ్వాలని నిర్ణయం. 2016 సెప్టెంబర్ 4: మదర్ థెరిసాకు సెయింట్ (మహిమాన్విత) హోదా ఇచ్చినట్లు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటన. సెయింట్ థెరిసా మహిమలు భారతరత్న, నోబెల్ శాంతి బహుమతి విజేత సెయింట్ థెరిసా పేదల పాలిట కల్పతరువు. ఆదివారం ‘మహిమాన్విత’ (సెయింట్‌హుడ్) గౌరవాన్ని అందుకున్న థెరిసా.. బతికున్నన్ని రోజులూ జీవితాన్ని అనాథలు, అభాగ్యులకే అంకితం చేసింది. ఎవరు బాధపడుతూ..తనను తలచుకున్నా.. మరుక్షణమే నేనున్నానంటూ ఆదుకునే ఆ చేతులు.. కోల్‌కతాలో ఒకరికి, బ్రెజిల్లో మరొకరికి ప్రాణదానం చేశాయి. చికిత్సలేని భయంకరమైన రోగాలనుంచి విముక్తి కలిగించాయి. బ్రెజిల్లో.. బ్రెజిల్‌కు చెందిన మార్సిలియో ఆండ్రినో అనే వ్యక్తి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాడు. మెదడులో సమస్య కారణంగా జీవితాంతం సమస్యలు తప్పవని డాక్టర్లు తేల్చేశారు. ఈ సమయంలోనే థెరిసా చిత్రపటాన్ని ఆండ్రినో మంచం వద్ద ఉంచిన అతని భార్య.. తీవ్రమైన వ్యాధినుంచి కాపాడమని ప్రార్థన చేసింది. కొంతకాలం తర్వాత (2008లో) ఓ రోజు రాత్రి ఆండ్రినోకు తీవ్రమైన తలనొప్పి వచ్చి ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆరోజు రాత్రి ఏదో ప్రశాంతమైన వాతావరణంలో తన నొప్పిని ఎవరో తీసేసినట్లు అనిపించిందని.. తెల్లవారాక ఆండ్రినో చెప్పాడు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కూడా వ్యాధి నయమైపోయినట్లు గుర్తించారు. ఈ విషయం పోప్ ఫ్రాన్సిస్ దృష్టికి వచ్చింది. ఆ తర్వాత జరిపిన పరిశోధనల ఆధారంగానే మదర్‌కు థెరిసా సెయింట్‌హుడ్ బహూకరించారు. కోల్‌కతాలో.. మోనిక బెస్రా పశ్చిమబెంగాల్లోని మారుమూల ప్రాంతానికి చెందిన ఓ గిరిజన మహిళ. 1997లో తీవ్రమైన కడుపునొప్పితో ఆమె ఆసుపత్రిలో చేరింది. కడుపులో కణితి కారణంగానే నొప్పి అని తేల్చిన వైద్యులు.. చికిత్సనందించలేమని చేతులెత్తేశారు. కొన్ని నెలల తర్వాత మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆధ్వర్యంలో జరిగే ఆసుపత్రిలో చేరారు. ఈమెను పరిశీలించిన వైద్యులు.. ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమన్నారు. అయితే, 1998 సెప్టెంబర్ 5న కోల్‌కతాలో మదర్ థెరిసా తొలి వర్ధంతి సభ జరుగుతోంది. అందరూ ప్రార్థన చేస్తున్న సమయంలో.. థెరిసా చేతినుంచి ఓ జ్యోతి ఆకారం వచ్చి మోనిక కడుపులోకి వెళ్లినట్లు గుర్తించారు. ఆ రోజు సాయంత్రం కూడా ఇద్దరు నన్స్.. థెరిసా చిత్రపటాన్ని మోనిక కడుపుకు కట్టారు. దీంతో ఏడాది కాలంగా నొప్పితో రాత్రుళ్లు సరిగా నిద్రపోని మోనిక.. ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయింది. తెల్లవారాక పరీక్షలు చేస్తే.. అసలు ఆమెకు కడుపులో కణితి కాదుకదా.. కణితి ఆనవాళ్లు కూడా కనిపించలేదు. దీంతో వైద్యులంతా ఆశ్చర్యపోయారు. దేశానికే గర్వకారణం: మోదీ మదర్ థెరిసాకు సెయింట్‌హుడ్ బహుకరించటం దేశానికే గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జీ-20 సదస్సులో భాగంగా చైనాలో ఉన్న మోదీ.. బహుకరణ కార్యక్రమం కాగానే.. ‘సెయింట్‌హుడ్ ఇవ్వటం మదర్ థెరిసాకు దక్కిన గొప్ప గౌరవం. భారతరత్న, నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు ఈ గౌరవం దక్కటం భారత్‌కే గర్వకారణం’ అని ట్వీట్ చేశారు. సేవలకు గుర్తింపు: సోనియా సమాజంలో అణగారిన వర్గాలకు, అభాగ్యులకు చేసిన సేవలకు ప్రతిఫలంగానే మదర్ థెరిసాకు సెయింట్‌హుడ్ బహుకరించారని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలిపారు. ప్రేమ, కరుణ, మానవత్వానికి థెరిసా జీవితమే పర్యాయపదమన్నారు. ప్రపంచంలోని పేదలకు, అభాగ్యులకు సేవచేయాలనుకునే వారికి మదర్ స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. ప్రేమతో ప్రపంచాన్ని గెలిచిన థెరిసా అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రజాసేవలో తరించారు: సుష్మ వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగిన సెయింట్‌హుడ్ కార్యక్రమానికి భారత్ తరపున కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ పాల్గొన్నారు. ప్రజల సేవలో తరించిన మహోన్నత వ్యక్తిత్వానికి సుష్మా నివాళులర్పిం చారు. ‘భారతదేశంలోని నలు మూలలు, వివిధ విశ్వాసాలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తులతో ఇక్కడికి వచ్చాను. మదర్ థెరిసా జీవితాన్ని గౌరవించేందుకే మేమంతా ఇక్కడికి వచ్చాం’ అని సుష్మ వెల్లడించారు. వీరితోపాటు ఢిల్లీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రుల నేతృత్వంలోనూ రెండు బృందాలు ఈ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్లాయి. 1997లో మరణం తర్వాత రెండు సందర్భాల్లో థెరిసా తన దివ్యత్వాన్ని చూపించినందుకు ఈ గౌరవాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. సేవాభావానికి ప్రతీక సెయింట్ థెరిసా వైఎస్ జగన్ ఘన నివాళి సాక్షి, హైదరాబాద్: సెయింట్ హోదాను పొందిన దివంగత మదర్ థెరిసాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. సేవాభావం, దయాగుణానికి ప్రతీక అయిన థెరిసా ప్రేమ, దయ, కరుణకున్న తిరుగులేని శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారని ఆయన ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో శ్లాఘించారు. మదర్ థెరిసాను సెయింట్ల జాబితాలో చేర్చడం (క్యాననైజేషన్) భారతదేశానికి ఎనలేని ప్రాధాన్యతను తెచ్చి పెట్టిందని కొనియాడారు. భారతదేశంలో ఆమె స్థాపించిన మిషనరీలు విశ్వవ్యాప్తంగా విస్తరించి పేదల పట్ల సేవా భావాన్ని పెంపొందించాయన్నారు. ఆమె పేదలకు, ఆపదలో ఉన్న వారికి నిరంతరం అలుపెరుగకుండా చేసిన సేవలకు ఎన్నో అవార్డులు లభించాయని, నోబెల్ బహుమతిని కూడా గెల్చుకున్న దయాశీలి థెరిసా అన్నారు. ‘సెయింట్‌హుడ్’ ప్రదానం చేసిన క్షణం ప్రతి భారతీయుడు గర్వించ దగిందన్నారాయన. సోమవారం సెయింట్ థెరిసా 19వ వర్ధంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ ‘నేనివాళే ఉండవచ్చు. కానీ ఈ సేవలు కలకాలం నిలిచి పోతాయి’ అన్న కరుణామయి మాటల్లోని సందేశం విశ్వవ్యాప్తంగా విస్తరించేలా చేస్తూ ముందుకు సాగాలని జగన్ తెలిపారు. సేవాతత్పరతకు దక్కిన గౌరవం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సెయింట్ థెరిసాకు మహిమాన్విత హోదా ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆమె చూపిన మానవత్వానికి, సేవాతత్పరతకు దక్కిన అరుదైన గౌరవమే ఈ సెయింట్ హోదా అని ప్రశంసించారు. మనుషుల్లో దైవత్వం ఉంటుందని సెయింట్ మదర్ థెరిసా నిరూపించారని చంద్రబాబు తెలిపారు. పోప్‌కు మమత అరుదైన కానుక వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌కు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అరుదైన కానుకను అందించారు. బెంగాలీ లిపిలో.. బలుచురీ సిల్క్‌పై రాసిన బైబిల్‌ను బహుమానంగా అందించారు. ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ సుపీరియర్ జనరల్ సిస్టర్ ప్రేమ, ఆర్చ్ బిషప్.. ఈ పుస్తకాన్ని పోప్‌కు అందిస్తారు’ అని మమత ట్వీట్ చేశారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆహ్వానితురాలిగా మమత వాటికన్ వెళ్లిన సంగతి తెలిసిందే. 1,500 మంది పేదలకు పిజ్జా వాటికన్‌సిటీలో సెయింట్‌హుడ్ బహూకరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత.. మదర్ థెరిసా బాటలో పోప్ ఫ్రాన్సిస్ 15వందల పేదలకు పిజ్జాలు పంచిపెట్టారు. మదర్ థెరిసా సంస్థ సిస్టర్స్ ఆఫ్ చారిటీ సంస్థకు చెందిన చాలా మంది.. ఆదివారం నాటి కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రత్యేకమైన బస్సుల్లో వచ్చారు. వారికి పోప్ పిజ్జాలు ఇచ్చారు. మొత్తం లక్షమందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఇన్‌స్టాగ్రామ్‌లో పోప్ ఫాలోవర్లు 30 లక్షలు
వాటికన్ సిటీ: ప్రఖ్యాత ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య తాజాగా 30 లక్షల మార్కును దాటింది. ఈ ఏడాది మార్చిలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరచిన పోప్ ఇప్పటివరకు మొత్తంగా 143 ఫొటోలు, వీడియోలను అప్లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ అకౌంట్ ఇంగ్లీష్‌లో.. సబ్‌టైటిల్స్ ఇతర భాషల్లో అందుబాటులో ఉంది. 120కోట్ల మంది కేథలిక్‌లకు పోప్‌గా ఎన్నికై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా యువతతో మమేకమయ్యేందుకు మార్చిలో ఆయన ఈ ఖాతాను ప్రారంభించారు. పోప్ ట్విట్టర్ ఖాతా ఫాలోవర్ల సంఖ్య 2.7కోట్లు. -
కష్టకాలంలో మానవీయ స్పర్శ
బైలైన్ శరణార్థుల విషయంలో యూరప్ మడిగట్టుకుని ఉండలేదని, ఉదాసీనంగా లేదా శత్రుపూరితంగా వ్యవహరించజాలదని పోప్ అన్నారు. ఆయన మత విశ్వాసం ఇతరులను కలుపుకుని పోయేది. మనుషుల బాధల పట్ల ఆయనకున్న పట్టింపు మత విశ్వాసాల సరిహద్దు గోడలను అధిగమించినది. అసలు చెప్పుకోవాల్సిన కథనాలే అతి తరచుగా వార్తల్లో పడి కొట్టుకుపోతుంటాయి. ఉదయం నుంచి రాత్రి వరకు సాగే సుదీర్ఘ సమాచార కవాతులో వార్తలు సైతం కళ్ల ముందు కదలాడుతూ పోయే శీర్షికలుగా మారిపోతాయి. వాటి ప్రాముఖ్యతను కొలిచే పాటి తీరిక, శ్రద్ధ ఎవరికి ఉంటుంది? ఏప్రిల్ 16న ఒక ప్రాముఖ్యత గల ఘటన జరిగింది. ఆ కథనం పూర్తిగా కాకపోయినా, చాలా వరకు దాన్ని చేరవేసే క్రమంలో కొట్టుకుపోయింది. రోమన్ కేథలిక్కుల మత పెద్దయైన హోలీ ఫాదర్ పోప్ ఫ్రాన్సిస్, యుద్ధ విధ్వంసానికి గురైన సిరియా వంటి ముస్లిం దేశాల శరణార్థులను కలుసు కున్నారు. నేడు మరుపున పడిపోయిన ఒకప్పటి సుప్రసిద్ధ గ్రీకు ద్వీపం లెస్బోస్లో ఈ కలయిక జరిగింది. యూరప్ అంచున ఉన్న గ్రీస్, రెండు శతాబ్దాల స్వతంత్ర అస్తిత్వం తర్వాత... మళ్లీ ఆ ఖండపు ముఖ ద్వారంగా మారింది. అయి తే, యూరోపియన్లు మాత్రం గ్రీస్, యూరప్‌కు రక్షణను కల్పించే అడ్డుగోడగా నిలవా లనే కోరుకున్నారు. ఒకప్పు డు, అట్టోమన్-తురుష్క సేనలు గ్రీస్‌ను స్థావరంగా చేసుకుని బాల్కన్ దేశాల లోకి చొరబడుతూ, అక్కడి నుంచి శక్తివంతమైన యూరోపియన్ రాజ్యాలపైకి దృష్టిని సారిస్తూ ఉండేవి. నేడు యుద్ధ బీభత్సానికి గురైన ముస్లిం దేశాల ప్రజలు టర్కీని ఆనుకుని ఉన్న లెస్బోస్ను జర్మనీ, స్కాండినేవియాలకు, సుదూరంలోని బ్రిటన్‌కు చేర్చే హార్బర్‌గా మార్చారు. 16, 17 శతాబ్దాలలోని యూరోపియన్ దర్బారులు అట్టోమన్ సామ్రాజ్య శక్తి యురేసియా, మధ్యధరా ఆఫ్రికా ప్రాంతాలకు విస్తరించడం గురించి సహేతుకంగానే ఆందోళ న చెందుతుండేవి. పాశ్చాత్య నాటకకర్తలే ఆనాటి జనరంజ క ప్రసార మాధ్యమాల శాసకులు. వారు తురుష్కులను యూరప్ నాగరికతను, సంపదను, సౌందర్యాన్ని కాలరాచి వేయడానికి వేచి చూస్తున్న రాక్షసులుగా చిత్రించారు. ఉదారవాద మేధావి షేక్స్పియర్ ఇందుకు మినహాయింపు. ఈసారి యూరప్‌లో భయాన్ని రేకెత్తించినది అరబ్బుల వంపు తిరిగిన ఖడ్గాల దండయాత్ర కాదు, వచ్చిపడే జనాభా దండు. ఈ సారి గుంపులు గుంపులుగా వచ్చి పడ్డవారు వేగాశ్వ పదఘట్టనల సంరంభంతో రాలేదు. దుర్బలమైన పడవల్లో శరణార్థులై వచ్చారు. అలా వచ్చే సాధారణ ప్రజలు, పౌరులుగా మారగలుగుతారు. కాబట్టి నేటి ప్రజాస్వామ్య యుగంలో వారు సైతం సైనికులంత గానూ ఆందోళనను రేకెత్తిస్తున్నారు. యూరోపియన్ ప్రభుత్వాలు తొలుత ఈ శరణార్థుల వెల్లువను చూసి బెంబేలెత్తిపోయాయి. మానవీయ స్పందన లకు, పెరుగుతున్న ప్రజాగ్రహానికి మధ్యన అవి ఇరుక్కు పోయి మ్రాన్పడిపోయినట్టనిపించింది. టర్కీతో తీవ్ర దౌత్య కృషి, సరిహద్దు రక్షణ చర్యలను పటిష్టం చేయడం కలసి వాటికి కొంత ఉపశమనాన్ని కలుగజేశాయి. అయితే ఎవరికీ చెందని భారీ శరణార్థుల జనాభా సరిహద్దుల మధ్యన చిక్కుకు పోయి మిగిలింది. తమ మాతృ భూమికి తిరిగి వెళ్లడమనే ఆలోచనకే వారు భయకంపితులౌతున్నారు. అలాంటి ఆపత్కాలంలో పోప్ ఫ్రాన్సిస్ లెస్బోస్లోని ఒక శరణార్థుల శిబిరాన్ని స్వయంగా సందర్శించారు. ఇది, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత మానవ మహా విపత్తని ఆయన అన్నారు. పోప్ మాటలను ఆచితూచి జాగ్రత్తగా వాడటమే కాదు, ఎంతో ఆలోచన చేసిన తర్వాత నే కార్యాచరణకు దిగారు. లండన్ నుంచి వెలువడే ‘సండే టైమ్స్’ పత్రికలో వెలువడ్డ క్రిస్టియన్ లాంబ్ కథనం ప్రకారం... పోప్ శరణార్థులకు మద్దతును వాగ్దానం చేసి వారి సౌఖ్యం కోసం ప్రార్థన చేశారు. డజను మంది ముస్లిం శరణార్థులను వాటికన్ నగరంలోకి స్వీకరించారు. (ఆ 12 మంది డమాస్కస్‌కు, ఐఎస్ఐఎస్ అదుపులో ఉన్న డయర్ ఎజ్జార్ పట్టణానికి చెందినవారు). దీన్ని మీరు సంకేతాత్మక మైనదిగా కొట్టి పారేయవచ్చు. కానీ, అది సామాన్యుల హృదయాల్లో మారు మోగే శక్తివంతమైన ప్రేమాస్పద చర్య. లాంబ్ కథనానికి జోడించిన అందమైన ఫొటోలో ఒక పిల్లాడు నవ్వుతున్న ఆ మతాధిపతి చేతిని ముద్దాడుతుం డగా.. అతని తల్లి ఉద్వేగంతో కన్నీటిని బిగబడుతూ కనిపి స్తుంది. చెప్పాల్సిన అవసరం ఉన్న దయనీయ కథనాలు ఎన్నో ఉన్న మాట నిజమే. కానీ, ఆశ కూడా ఒక కథనమే. నిజమే, పోప్ ముస్లింలకు స్నేహ హస్తాన్ని చాస్తున్నా రు. ఇంతకు ముందు కూడా ఆయన ఈ పని చేశారు, ఇక ముందూ చేస్తారు. ఆయన మత విశ్వాసం ఇతరులను కలుపుకుని పోయేది. మనుషుల బాధల పట్ల ఆయనకున్న పట్టింపు మత విశ్వాసాల సరిహద్దు గోడలను అధిగమించి నది. నూర్ ఇస్సా, హస్సన్ అనే ఇంజనీర్ల జంట వారి రెండేళ్ల కొడుకు వంటి కుటుంబాల విషయంలో యూరప్ మడిగట్టుకుని ఉండలేదని, ఉదాసీనంగా లేదా శత్రుపూరి తంగా వ్యవహరించజాలదని కూడా ఆయన చెబుతున్నారు. ఆ ముగ్గురి కుటుంబం ఇకపై డమాస్కస్‌లో కాక వాటికన్ లోనే జీవిస్తుంది. ఐదేళ్ల క్రితం లేదా రెండు, మూడేళ్ల క్రితం సైతం వారు తమ మనుగడలో అలాంటి మలుపు వస్తుం దని ఊహించలేదు. వారెన్నడూ సిరియా వదిలి పోవాలని అనుకోనేలేదు. అత్యంత నిర్దాక్షిణ్యమైన యుద్ధం కారణంగా తీవ్ర విధ్వంసానికి భయంకరమైన ఒంటరితనానికి గురై ఉన్నవారిని వారి దేశం నుంచి తరిమేశారు. అయినా వారు అదృష్టవంతులు. అంతకంటే భిన్నమైన జీవితం కోసం అన్వేషణలో వారిలాంటి వేలాది మంది ప్రాణాలను కోల్పో యారు. యూరప్ ఈ విషాదాన్ని అర్థం చేసుకోలేదని అనడం సమంజసం కాదు. చాలా ప్రభుత్వాలు తాము చేయగలిగినదంతా చేశాయి. ఈ విషయంలో చేసిన కృషికి గానూ జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మర్కెల్ వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించాల్సి రావచ్చునేమోగానీ, చరిత్రలో ఆమె ఎన్నటికీ గుర్తుండిపోతారు. కానీ, ఇంకా ఆ నరకంలో తేలుతున్న వారిని ప్రపంచం మరచిపోలేదు. ప్రపంచంలోనే అత్యంత సుప్రసిద్ధ మతానికి పెద్ద అయిన పోప్ మనం వినడానికి సిద్ధంగా లేని ఒక విషయా న్ని కూడా చెప్పారు. మానవత్వానికి అర్థం తెలుసుకోకపోతే మానవులు ఇక మానవులే కారు. నేటి మన నేతల పట్ల సంశయాత్మక దృష్టితో చూడటం ఫ్యాషన్‌గా మారింది. తర చుగా అందుకు సమంజసమైన కారణాలను సైతం చూపు తుంటారు. మతం, సంశయాత్మకతకు వ్యతిరేకంగా హామీని కల్పించే బీమా కాదు. భగవదాంశ సంభూతునిగా భావించే మత పెద్దే ఆ భగవంతునిలో విశ్వాసాన్ని ప్రదర్శించడాన్ని చూసినప్పుడు... మనం ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవడం, ఆయన దృక్పథాన్ని ప్రశంసించడం తప్పదు. వ్యాసకర్త: ఎం.జె. అక్బర్ (సీనియర్ సంపాదకులు) పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి -
కంట నీరు పెట్టిన పోప్ ఫ్రాన్సిస్
లెస్బోస్(గ్రీస్): ‘మీరు ఒంటరి కాదు. ఆత్మస్థైర్యం కోల్పోవద్దు’ అంటూ గ్రీకులోని లెస్బోస్ ద్వీపంలో చిక్కుకున్న శరణార్థులకు పోప్ ఫ్రాన్సిస్ భరోసా ఇచ్చారు. వలసల సమస్యలు పరిష్కరించడానికి మానవత్వంతో సమిష్టిగా ముందుకు రావాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అంతర్గత యుద్ధంతో సిరియా నుంచి పారిపోయి ఇక్కడి ఓడ రేవులో తలదాచుకున్న శరణార్థుల స్థావరాన్ని ఎక్యుమెనికల్ పాట్రియార్క్, గ్రీస్ చర్చ్ హెడ్, ఆర్చిబిషప్ ఐరోనిమస్‌తో కలసి శనివారం పోప్ సందర్శించారు. అక్కడున్నవారి దురవస్థను చూసి చలించిన పోప్ కంట నీరు పెట్టారు. దౌత్య, రాజకీయ మార్గాల ద్వారా ఈ సంక్షోభాన్ని అంతర్జాతీయ సమాజం, స్వచ్ఛంద సంస్థలు ధైర్యంగా ఎదుర్కోవాలని కోరుతూ ముగ్గురు మత పెద్దలూ ఓ తీర్మానంపై సంతకం చేశారు. ‘మేము కూడా సముద్రమనే శ్మశానానికి వెళుతున్నాం. తలదాచుకునేందుకు సముద్ర మార్గంలో బయలుదేరిన చాలామంది జాడ లేకుండా పోయారు’ అని లెస్బోస్ బయలుదేరే ముందు పోప్ ఆవేదనగా చెప్పారు. లెస్బోస్లో అడుగుపెట్టిన ఫ్రాన్సిస్‌కు శరణార్థ శిబిరంలోని చిన్నారులు, మహిళలు, వృద్ధులు స్వాగతం పలికారు. చిన్నారులు కొన్ని చిత్రాలు వేసి పోప్‌కు బహూకరించారు. శిబిరంలో ఒకరు ఆశీర్వదించమంటూ కన్నీటితో పోప్ పాదాలపై పడ్డారు. మరికొందరు తమకు విముక్తి కల్పించమంటూ పెద్దగా అరుస్తూ వేడుకున్నారు. యూరప్‌కు గుణపాఠం... గ్రీస్ సందర్శించిన పోప్ ఫ్రాన్సిస్ అక్కడి శరణార్థుల శిబిరంలోని 12 మంది సిరియా ముస్లింలను తన చార్టర్ విమానంలో ఇటలీకి తీసుకువచ్చారు. తద్వారా శరణార్థులను ఎలా ఆదరించాలో యూరప్‌కు గుణపాఠం నేర్పారు. ఆరుగురు చిన్నారులు సహా మూడు కుటుంబాలకు చెందిన వీరికి హోలీ సీ మద్దతు తెలిపింది. ఇటలీ కేథలిక్ శాంటెజిదియో సమాజం వారి బాధ్యతలు తీసుకుంది. -
కౌగిలింతతో కనుచూపు!
వాటికన్ సిటీ: వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పోప్ ఫ్రాన్సిస్ కౌగిలించుకోవడంతో చూపు మందగించిన బాలికకు మామూలు చూపు వచ్చింది. ఓహియోకి చెందిన ఐదేళ్ల బాలిక లిజ్జీ మైయర్స్ జెనెటిక్ సమస్యతో కారణంగా క్రమంగా తన కంటి చూపును కోల్పోతోంది. దీంతో లిజ్జీ కుటుంబ సభ్యులు ఆమెను పోప్ వద్దకు తీసుకుని వచ్చారు. పోప్ స్వయంగా పాపను దగ్గరకు తీసుకుని కౌగిలించుకున్న తర్వాత చేతులతో ఆమె కళ్లను తడిమారు. అంతే ఆ చిన్నారి ఇప్పుడు మామూలుగా చూడగలుగుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ చిన్నారి తల్లిదండ్రులు వెల్లడించారు. అంతేకాదు తాను ఉషెర్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలియని లిజ్జీ పోప్‌కు ఒక బొమ్మను కూడా బహుమతిగా ఇచ్చింది. ఒక్క సారిగా మామూలు దృష్టి రావడంతో లిజ్జీ ఆశ్చర్యానికి గురైందట. ఆమె దూరం నుంచి వస్తువులను చూపించి గుర్తుపడుతుండటంతో కూతురుకు చూపు వచ్చినందుకు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. -
హృతిక్ రోషన్ వివాదాస్పద వ్యాఖ్యలు
ముంబై: బాలీవుడ్ కండల వీరుడికి కష్టాలు వీడడం లేదు. 'క్వీన్'తో ప్రేమాయణం నడిపి వివాదాలపాలైన బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. క్రైస్తవమతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో లీగల్ నోటీసు అందుకున్నాడు. ట్విటర్ లో పోప్ ఫ్రాన్సిస్ పై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని హృతిక్ రోషన్ కు క్రిస్టియన్ సెక్యులర్ ఫోరం లీగల్ నోటీసు పంపింది. తమ మతాధిపతిని అవమానించడం ద్వారా క్రైస్తవుల మనోభావాలను, విశ్వాసాలను దెబ్బతీశారని పేర్కొంటూ 295ఏ సెక్షన్ కింద నోటీసులిచ్చింది. రాష్ట్ర అల్పసంఖ్యాకవర్గాల కమిషన్ మాజీ ఉపాధ్యక్షుడు అబ్రహం మాతాయ్ ఈ నోటీసులు పంపారు. కంగనా రౌనత్ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ హృతిక్.. పోప్ పేరు ప్రస్తావించారు. 'ఎవరితోనైనా సన్నిహితంగా మెలిగే హక్కు హృతిక్ రోషన్ కు ఉంది. కానీ తన వ్యక్తిగత వివాదంలోకి పోప్ ఫ్రాన్సిస్ ను లాగడం సమంజసం కాదు. పోప్ పై చేసిన వ్యాఖ్యలకు హృతిక్ బేషరతుగా క్షమాణ చెప్పాల'ని మాతాయ్ డిమాండ్ చేశారు. -
పాదాలు కడిగి ముద్దాడారు..
-
సెప్టెంబర్ 4న థెరిసాకు సెయింట్ హోదా
కోల్‌కతా : నోబెల్ బహుమతి గ్రహీత, భారతరత్న మదర్ థెరిసాకు సెప్టెంబర్ 4వ తేదీన పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హుడ్ను అధికారికంగా ప్రదానం చేయనుంది. ఈ మేరకు పోప్ ప్రాన్సిస్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మదర్ థెరిసాలోని అతీత శక్తిని గత ఏడాదే పోప్ గుర్తించిన విషయం తెలిసిందే. దీంతో అధికారికంగా ఈ హోదాను ఈ ఏడాది సెప్టెంబర్ నాలుగో తేదీన రోమ్‌లో థెరిసాకు ఇవ్వనుంది. దీంతో ప్రపంచ శాంతిదూతగా పేరొందిన థెరిస్సా ఇక దైవదూతగా అవతరించనున్నారు. మాసిడోనియాలో 1910లో జన్మించిన మదర్ థెరిసా కోల్‌కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించి 45 ఏళ్లపాటు పేదలు, రోగులకు విశిష్టమైన సేవలందించారు. 1951లో భారత పౌరసత్వం స్వీకరించారు. 1979లో నోబెల్ శాంతి బహుమతి పొందారు. 1997లో కోల్‌కతాలో ఆమె తుదశ్వాస విడిచారు. కాగా మదర్ థెరిసా రోమన్ క్యాథలిక్ కేంద్రమైన వాటికన్ నుంచి ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ' స్థాపనకు అనుమతి పొందారు. రోమన్ క్యాథలిక్ వ్యవస్థకు అనుబంధంగా ఉంటూ, స్వతంత్ర ప్రతిపత్తి గల ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ' ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తన సేవలందించిన విషయం తెలిసిందే. -
కండోమ్‌లు ఓకే.. గర్భస్రావం వద్దు!
జికా వైరస్ వస్తుందన్న భయం ఉన్న మహిళలు కావాలంటే కండోమ్‌ల లాంటి కృత్రిమ గర్భనిరోధక పద్ధతులు వాడొచ్చు గానీ, ఆ పేరు చెప్పి గర్భస్రావానికి వెళ్లడం మాత్రం సరికాదని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి గర్భస్రావం ఒక్కటే మార్గం అనడాన్ని ఆయన నిర్మొహమాటంగా ఖండించారు. 1960 ప్రాంతాల్లో బెల్జియన్ కాంగో ప్రాంతంలో కొంతమంది నన్లపై పదేపదే అత్యాచారాలు జరిగేవని, వాళ్లు గర్భం ధరించకుండా ఉండేందుకు కృత్రిమ గర్భనిరోధ పద్ధతులు పాటించాల్సిందిగా అప్పట్లో పోప్ పాల్ -6 చెప్పిన విషయాన్ని పోప్ ఫ్రాన్సిస్ గుర్తుచేశారు. అబార్షన్లు మానవాళికే మంచివి కావని, అయితే గర్భం రాకుండా ఆపడం మాత్రం తప్పు కాదని ఆయన చెప్పారు. జికా లాంటి సందర్భాలలో అయితే పోప్ పాల్ 6 సూచించిన మార్గాన్ని అనుసరించడం మంచిదని తెలిపారు. గర్భిణులకు ఎక్కువగా సోకుతున్న జికా వైరస్ కారణంగా పుట్టబోయే శిశువులకు కూడా లోపాలు ఉంటున్నాయన్న కారణంగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్వవ్యాప్త ఆరోగ్య ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
కటికవాడిని అవుదామనుకున్నా: పోప్ ఫ్రాన్సిస్
వాటికన్ సిటీ: చిన్నతనంలో తాను కటికవాడిని(మాంసం అమ్మే వ్యక్తి) కావాలనుకున్నానని పోప్ ఫ్రాన్సిస్ వెల్లడించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన చిన్నారి గాయకులతో ఆయన ముచ్చటించారు. 'నేను చిన్నతనంలో ఉండగా కటికివాడిని(బుచర్) కావాలని ఆలోచించే వాడిన'ని చెప్పారు. ఇంటర్నేషనల్ ప్యురీ కాంటోర్స్ చిల్డ్రన్ కోయిర్ సంగీత బృందానికి చెందిన 6 వేల మంది చిన్నారులతో ఆయన మాట్లాడారు. తన చిన్నతనంలో బ్యూనోస్ ఎరిస్ లోని మార్కెట్ స్టాల్స్ లో మాంసం అమ్మేవాళ్లను చూసేందుకు అమితోత్సాహం చూపేవాడినని అర్జెంటీనాకు చెందిన ఈ రోమన్ కేథిలిక్ ప్రధాన మత గురువు వెల్లడించారు. -
అనిశ్చితి తొలగిపోవాలి
పోప్ క్రిస్మస్ సందేశం వాటికన్ సిటీ: ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితి, అస్థిరత తొలగిపోయి ప్రశాంత వాతావరణం నెలకొనాలని పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా శుక్రవారం సెయింట్ పీటర్ బాసిలికా బాల్కనీ నుంచి సన్నీ స్క్వేర్‌లోని 10వేల మంది భక్తుద్దేశించి పోప్ తన సందేశాన్నిచ్చారు. సిరియా, లిబియానుంచి వస్తున్న శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న వారిని ప్రశంసించారు. సిరియా అంతర్యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఐక్యరాజ్యసమితి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈజిప్ట్ గగనతలంలో, బీరుట్, పారిస్, బమాకోలలో జరిగిన ఉగ్రవాద చర్యలను ఆయన ఖండించారు. ఐసిస్ ఉగ్రవాదుల ఆగడాలు మితిమీరుతున్నాయని.. పురాతన కట్టడాలను ధ్వంసం చేయటం తగదన్నారు. చర్చిలనుంచి ముస్లింల సమాధుల వరకు దేన్నీ వదలటం లేదని, పశ్చిమాసియా దేశాల్లో క్రైస్తవుల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాక్, యెమెన్, బురుండీ, దక్షిణ సుడాన్లలో హింసతో లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారని.. ఇళ్లు వదిలిపోతున్నారని పోప్ అన్నారు. కాగా, క్రిస్మస్ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. క్రీస్తు జన్మించిన బెత్లెహామ్‌లోని చర్చ్ ఆఫ్ నేటివిటీలో గురువారం రాత్రి ప్రార్థనా కార్యక్రమం ఘనంగా జరిగింది. -
ప్రపంచమంతా శాంతిని నెలకొల్పండి: పోప్
పవిత్ర భూమితో పాటు ప్రపంచమంతటా శాంతి నెలకొనాలని పోప్ ఫ్రాన్సిస్ తన క్రిస్మస్ సందేశంలో పేర్కొన్నారు. దేవుడు పుట్టిన చోటే శాంతి కూడా పుట్టిందని, శాంతి పుట్టిన చోట ఇక విద్వేషాలకు, యుద్ధానికి చోటులేదని ఆయన తెలిపారు. అయినా ఈ ప్రపంచంలో మాత్రం ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయని, అందువల్ల శాంతిని నెలకొల్పాలని అన్నారు. రోమ్ నగరంతో పాటు ప్రపంచం అంతటికీ క్రిస్మస్ సందర్భంగా ప్రతి యేటా పోప్ తన సందేశాన్ని అందిస్తుంటారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్దకు భారీ సంఖ్యలో హాజరైన భక్తులను ఉద్దేశించి పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడారు. శాంతిని నెలకొల్పాలని చెప్పడమే కాక, దానికి మార్గాలను కూడా ఆయన సూచించారు. ఉదాహరణకు ఇజ్రాయెలీలు, పాలస్తీనా వాసులు ప్రత్యక్షంగా చర్చించుకోవాలని, రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఘర్షణకు ఓ పరిష్కారాన్ని కనుగొనాలని అన్నారు. దీనివల్ల ఇరు దేశాల ప్రజలు సుహృద్భావంతో కలిసి జీవించే అవకాశం ఉంటుందని తెలిపారు. -
మరింత మానవత..!
పేదరికం, పర్యావరణంపై ప్రపంచానికి పోప్ ఫ్రాన్సిస్ పిలుపు * ఐరాస, ఆర్థిక సంస్థల్లో సంస్కరణలు చేపట్టాలి * ప్రకృతి వనరులను ధ్వంసం చేసే హక్కు మనిషికి లేదు * ఐరాస సర్వప్రతినిధి సమావేశంలోప్రసంగం న్యూయార్క్: పేదల ప్రయోజనాలను, పర్యావరణాన్ని గౌరవించే మరింత మానవీయమైన అంతర్జాతీయ వ్యవస్థ కావాలని పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచానికి పిలుపునిచ్చారు. బలహీనులను అభివృద్ధి ఫలాలకు దూరం చేసే ఆర్థిక వ్యవస్థపై విమర్శలు సంధించారు. అమెరికాలో పర్యటిస్తున్న పోప్ శుక్రవారం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 70వ సమావేశంలో ప్రసంగించారు. సంస్కరణవాదిగా పేరొందిన ఆయన ఉన్నతమైన ప్రపంచ నిర్మాణానికి సంబంధించి పలు అంశాలపై తన ఆలోచనలను పంచుకున్నారు. క్రైస్తవులపై వేధింపులు, ఇరాన్ అణు ఒప్పందం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, బాలికల విద్యా హక్కు వంటి కీలక వర్తమాన సమస్యలను స్పృశించారు. ఐరాస భద్రతా మండలి వంటి అంతర్జాతీయ సంస్థల్లో, రుణదాతల సంస్థల్లో సంస్కరణలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అన్ని రకాల దుర్వినియోగాన్ని, అధిక వడ్డీరేట్లకు అడ్డుక ట్ట వేయడానికి ఇది తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. సంస్కరణవాద ఆలోచనలతో నాస్తికుల మెప్పు కూడా పొందుతున్న 78 ఏళ్ల పోప్ ఆయా అంశాలపై ఏమన్నారో ఆయన మాటల్లోనే.. సుస్థిర అభివృద్ధి కావాలి.. దేశాల సుస్థిర అభివృద్ధిని ప్రపంచ ఆర్థిక సంస్థలు కాపాడాలి. అణచివేత రుణ విధానాలకు, జనాన్ని మరింత పేదరికంలో ముంచే విధానాలకు దూరంగా ఉండాలి.(పోప్ స్వదేశం అర్జెంటీనా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) ఆంక్షలతో ఆర్థిక సంక్షోభంలో పడిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు). ఇరాన్‌తో అగ్రదేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందం శక్తిమంతమైన రాజకీయ సౌహార్దానికి, నిజాయితీకి, సహనానికి చిహ్నం. వాతావరణ మార్పులను అరికట్టాలి.. వాతావరణ మార్పుల నిరోధంపై డిసెంబర్లో ప్యారిస్‌లో జరిగే ఐరాస ఉన్నత సమావేశంలో మౌలికమైన, శక్తిమంతమైన ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నాను. ఈ విశ్వం.. సృష్టికర్త ఇచ్చిన ప్రేమాస్పద ఫలం. దాన్ని దుర్వినియోగం, విధ్వంసం చేసే అధికారం మానవజాతికి లేదు. స్వార్థం, అధికారం కోసం, భౌతిక సంపదల కోసం అంతులేని దాహం సహజవనరుల విధ్వంసానికి దారి తీస్తోంది. బలహీనులను వాటికి దూరం చేస్తోంది. పర్యావరణ దుర్వినియోగంతో పేదలు దారుణ అన్యాయానికి గురవుతున్నారు. క్రైస్తవుల భద్రత తదితరాలపై.. ప్రపంచమంతా శాంతి పరిఢవిల్లాలి. సిరియా, ఇరాక్లలో తీవ్రవాదులు వేధిస్తున్న క్రైస్తవులకు, ఇతర మతాల వారికి భద్రత కావాలి. లక్షలాదిమందిని నిశ్శబ్దంగా చంపుతున్న మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయాలి. బాలికలతోపాటు బాలలందరికీ విద్యాహక్కు కల్పించాలి. దీనికి ఐరాస గురుతర బాధ్యత తీసుకోవాలి. అసంబద్ధమైన పద్ధతులు, జీవన శైలులను బలవంతంగా రుద్దకూడదు. కాగా శుక్రవారం అమెరికన్లు న్యూయార్క్‌లో పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి పోప్‌కు ఘన స్వాగతం పలికారు. -
'అమ్మా నాన్నలతో కలిసి జీవించే హక్కు నాకుంది'
అమాయకమైన మోము.. రెండు చిట్టి జడలు... కళ్లలో పట్టుదల... ప్రపంచానికి చాటి చెప్పాలనే తపన.. అత్యంత శత్రు దుర్భేద్యమైన సెక్యూరిటీ ఉన్నా వెరవలేదు...బెదరలేదు. తనకన్నా ఎత్తు ఉన్న బారికేడ్లను దూకేసింది ఐదు సంవత్సరాల సోఫీ క్రూజ్! నిన్నటివరకు ప్రపంచానికి సోఫీ క్రూజ్ ఎవరో తెలియదు.. కానీ ఈరోజు ప్రపంచంలోని అన్ని ప్రధాన చానళ్లలో, పేపర్లలో, సోఫీ సాహసం కథలు కథలుగా కనిపిస్తోంది.. వినిపిస్తోంది. ఇంతకీ ఎవరీ సోఫీ క్రూజ్.. మెక్సికో నుంచి 'అక్రమంగా' అమెరికాకు వలస వచ్చిన శరణార్థి రౌల్ క్రూజ్ కూతురు. కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్ డీసీకి తనవారితో కలిసివచ్చింది. కనీసం 'ఆయన' దృష్టికైనా శరణార్ధుల సమస్యను తీసుకెళితే పరిష్కారం వస్తుందని. ఎవరికి దృష్టికని సందేహమా?.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది క్యాథలిక్కుల గురువు పోప్ ఫ్రాన్సిస్. పోప్ ఫ్రాన్సిస్ మొదటి అమెరికా పర్యటన. కట్టుదిట్టమైన భద్రత. పోప్ కాన్వాయ్ వాషింగ్టన్ వీధుల గుండా సాగుతోంది. దారి పొడవునా నిలబడ్డ వేలాది మంది పోప్‌ను దర్శించుకోవాలని ఆరాటం... కేకలు.. అరుపులు.. భక్తి పారవశ్యం.. ఇంతలో కలకలం.. బారికేడ్‌ను దాటుకొని చేతిలో కలర్ క్రేయాన్స్‌తో పరుగెత్తింది సోఫీ. ఆమెను అడ్డుకున్న సెక్యూరిటీ.. పోప్ దృష్టిని ఆకర్షించడంతో సోఫీ సక్సెస్. పోప్ ...సెక్యూరిటీని వారించి దగ్గరగా పిలిచుకొని దీవించాడు. ప్రజల కేరింతల మధ్య.. అసలు ఆ లెటర్లో సోఫీ ఏం రాసింది.. "పోప్ ఫ్రాన్సిస్.... నేను మీకొక విషయం చెప్పదలచుకున్నాను. నా హృదయం భారంగా, బాధతో ఉంది. నేను మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నాను. మీరు అధ్యక్షుడితో.. కాంగ్రెస్‌తో మాట్లాడండి.. మా అమ్మానాన్నలు ఇక్కడ ఉండేందుకు అనుమతి ఇవ్వమని అడగండి.. మా అమ్మానాన్నలను నా నుంచి దూరం చేస్తారేమో అనే భయం నన్ను నిత్యం వెంటాడుతోంది" ఒక్కసారిగా సోఫీ ప్రంపంచం దృష్టిని ఆకర్షించింది. అక్రమ వలసదారుల సమస్యను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. సోఫీ అమెరికాలో పుట్టింది కాబట్టి ఇబ్బంది లేదు. సమస్యల్లా ఆమె అమ్మా నాన్నలదే. తర్వాత మీడియా ఇంటర్వ్యూల్లో కూడా సోఫీ మౌలికమైన ప్రశ్నలనే లేవనెత్తింది. ' మా అమ్మానాన్నలతో కలిసి జీవించే హక్కు నాకుంది. నేను సంతోషంగా జీవించే హక్కు కూడా నాకు ఉంది' అని మరీ చెప్పింది. తన కూతురు చేసిన పనికి తనకు గర్వంగా సంతోషంగా ఉందని రౌల్ పొంగిపోతున్నారు. పోప్ ఫ్రాన్సిస్ ఈ విషయమై స్పందిస్తారని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. ఇపుడు సోఫీ క్రూజ్ ఐదేళ్ల బుడి బుడి నడకల అమాయకమైన అమ్మాయి... ఒక సమస్యకు 'బ్రాండ్ అంబాసిడర్' కదా.. హాట్సాఫ్ సోఫీ క్రూజ్! ఎస్.గోపీనాథ్ రెడ్డి -
అమెరికా పార్లమెంట్లో పోప్ ఫ్రాన్సిస్
-
వైట్ హౌస్‌కు విచ్చేసిన పోప్ ఫ్రాన్సిస్
-
'నేను కళ్లు మూసుకుంటే మొద్దు నిద్రే'
వాటికన్ సిటీ: తాను మొద్దులా నిద్రపోతానని పోప్ ఫ్రాన్సిస్ చెప్పారు. ఆయన పోర్చుగీస్‌కు చెందిన రేడియో చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తన వ్యక్తిగత విషయాలు చెప్పారు. తనకు నిద్రలేమి సమస్య లేదని అన్నారు. 'నేను ఈ సందర్భంగా మీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను. నాకు నిద్రలేమి సమస్య లేదు. నేను మొద్దులా నిద్రపోతాను' అని అన్నారు. మరి మీరు తొందరగా నిద్రలేవాలంటే ఎలా అని మరో ప్రశ్న వేయగా.. తనకు చాలా పని ఉందని భావిస్తే మాత్రం వెంటనే మేల్కొంటానని చెప్పారు. దేవుడు ఆదేశించినప్పుడు మాత్రం అది ఏ ప్రాంతంలోనైనా శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయేందుకు సంతోషపడతానని చెప్పారు. -
పోప్ ఫ్రాన్సిస్ పశ్చిమాసియా పర్యటన
అమ్మాన్: పోప్ ఫ్రాన్సిస్ పశ్చిమాసియా పర్యటనలో భాగం ఈరోజు జోర్డాన్ బయలుదేరారు. ముస్లీలు, యూదులతో సంబంధాలు మెరుగుపరచుకోవడం కోసం ఆయన ఈ పర్యటన చేస్తున్నారు. క్రైస్తవ మతానికి సంబంధించి ఒక పురాతన వివాదం పరిష్కారం విషయమై కూడా ఆయన పర్యటన జరుపుతున్నారు. పోప్ ఫ్రాన్సిస్ మూడు రోజుల పాటు జోర్డాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్‌లో పర్యటిస్తారు. ఇది పూర్తిగా మతపరమైన పర్యటనగా భావిస్తున్నారు.