వాటికన్‌సిటీ: ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంపై పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. ఇరాన్ డ్రోన్ దాడులకు ఇజ్రాయెల్ స్పందించవద్దని లేదంటే హింస పెరుగుతుందని పోప్ అన్నారు. ‘యుద్ధం చాలు, దాడులు చాలు, హింస చాలు. శాంతి కావాలి. చర్చలు కావాలి’అని వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్ స్క్వేర్ వద్ద సందర్శకులను ఉద్దేశించి పోప్ ప్రసంగించారు.
కాగా, ఇజ్రాయెల్‌పై శనివారం(ఏప్రిల్ 13) రాత్రి వందల కొద్దీ డ్రోన్‌లతో ఇరాన్ దాడులు చేసింది. ఈ డ్రోన్‌లు, మిసైళ్లలో చాలా వాటిని ఇజ్రాయెల్ కూల్చి వేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ దాడులకు ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందనేది ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలకు గురిచేస్తోంది.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు పోప్ సూచన కీలకంగా మారింది. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి చేసి ఆ దేశ ఆర్మీ ఉన్నతాధికారులను ఇజ్రాయెల్ చంపినందుకే ఇరాన్ డ్రోన్‌లు, మిసైళ్లతో ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది.
ఇదీ చదవండి.. ఇరాన్ దాడులు అమెరికా వ్యూహం ఫలించిందా
Comments
Please login to add a commentAdd a comment