
వాషింగ్టన్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ అణుస్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
నార్త్ కరోలినాలో శుక్రవారం(అక్టోబర్4) జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ట్రంప్ ఈమేరకు వ్యాఖ్యానించారు.కాగా,ఇరాన్ అణు కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందనే అంశంపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ను ఓ విలేకరి ప్రశ్నించగా బైడెన్ స్పందించలేదు.
దీనిపై బైడెన్ వైఖరిని ట్రంప్ తప్పుబట్టారు. ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ జరిపిన మిసైల్ దాడులకు సమాధానంగా ఇరాన్ అణుస్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేయాలని ట్రంప్ సూచించారు.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌కు మూడింది
Comments
Please login to add a commentAdd a comment