టెహ్రాన్:ఇటీవల ఇజ్రాయెల్ తమ సైనిక స్థావరాలపై చేసిన వైమానిక దాడులకు ప్రతిదాడులు చేసేందుకు ఇరాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులకు సిద్ధం చేయాలని ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేని తన దళాలను ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.
ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులకు సంబంధించి ఇరాన్ మిలిటరీ ఉన్నతాధికారులు తాజాగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు ఏర్పాట్లు చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ అలీఖమేనీ తన ముఖ్య సైనికాధికారులను ఈ చర్చల సందర్భంగా ఆదేశించినట్లు సమాచారం.
ఇందులో భాగంగా ఇరాన్ దళాలు ఇజ్రాయెల్‌కు చెందిన సైనిక స్థావరాల జాబితాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే ఇరాక్ భూభాగం నుంచి ఇరాన్ తన అనుకూల మిలిటెంట్ గ్రూపుల ద్వారా దాడికి పాల్పడొచ్చని ఇజ్రాయెల్ నిఘావర్గాలు భావిస్తున్నాయి.
కాగా, అక్టోబర్ మొదటి వారంలో తొలుత ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో దాడి చేయగా ఈ దాడులకు ప్రతీకారంగా ఇటీవలే ఇజ్రాయెల్ ఇరాన్ సైనిక స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రం ధ్వంసమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఇదీ చదవండి: హెజ్బొల్లా దాడులతో ఇజ్రాయెల్‌లో బీభత్సం
Comments
Please login to add a commentAdd a comment