iraq
-
కోళ్ల అందాల పోటీలు..!
కోడి పందేల్లోనే కాదు, అందాల పోటీల్లోనూ తగ్గేదేలే అంటున్నాయి కోళ్లు. కోళ్లకు అందాల పోటీలేంటని ఆశ్చర్యపోకండి, అందం ఎవరి సొంతం కాదని, కోడి పందేల మాదిరే, ఇరాక్‌లోని కుర్దిస్తాన్ జిల్లా, సులేమానిలో ఓ ప్రైవేటు సంస్థ ఇటీవల కోళ్లకు అందాల పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో, దాదాపు వందకుపైగా కోళ్లు పోటీ పడగా, ఇరాక్‌కు చెందిన గరీబ్ మహమ్మద్ పెంచుకున్న కోడి, 96 పాయింట్లతో విజయం సాధించింది. కోడి శరీర పరిమాణం, రంగు, జాతి, ఈకల నాణ్యత, శరీర అకృతి ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, పోటీ న్యాయనిర్ణేతలు దీనికి ఈ పాయింట్లను ఇచ్చారు. ఇక ఈ విషయమై మహమ్మద్ మాట్లాడుతూ ‘నేను నా రెండు కోళ్లను కేవలం ప్రదర్శన కోసం మాత్రమే పెంచాను. వాటి ఆరోగ్యం, ఆహారం విషయంలో మొదటి నుంచే చాలా జాగ్రత్తలు తీసుకున్నా. ఇంకా చెప్పాలంటే, నా పిల్లల కంటే నా కోడినే నేను ఎక్కువగా ప్రేమిస్తాను’ అని చెప్పాడు. (చదవండి: సునామీలో సర్వం కోల్పోయారు..కానీ ఆ అక్కా చెల్లెళ్లు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా..) -
ఇజ్రాయెల్‌పై ప్రతిదాడికి ఇరాన్ ప్లాన్..?
టెహ్రాన్:ఇటీవల ఇజ్రాయెల్ తమ సైనిక స్థావరాలపై చేసిన వైమానిక దాడులకు ప్రతిదాడులు చేసేందుకు ఇరాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులకు సిద్ధం చేయాలని ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేని తన దళాలను ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులకు సంబంధించి ఇరాన్ మిలిటరీ ఉన్నతాధికారులు తాజాగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు ఏర్పాట్లు చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ అలీఖమేనీ తన ముఖ్య సైనికాధికారులను ఈ చర్చల సందర్భంగా ఆదేశించినట్లు సమాచారం.ఇందులో భాగంగా ఇరాన్ దళాలు ఇజ్రాయెల్‌కు చెందిన సైనిక స్థావరాల జాబితాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే ఇరాక్ భూభాగం నుంచి ఇరాన్ తన అనుకూల మిలిటెంట్ గ్రూపుల ద్వారా దాడికి పాల్పడొచ్చని ఇజ్రాయెల్ నిఘావర్గాలు భావిస్తున్నాయి.కాగా, అక్టోబర్ మొదటి వారంలో తొలుత ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో దాడి చేయగా ఈ దాడులకు ప్రతీకారంగా ఇటీవలే ఇజ్రాయెల్ ఇరాన్ సైనిక స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రం ధ్వంసమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.ఇదీ చదవండి: హెజ్బొల్లా దాడులతో ఇజ్రాయెల్‌లో బీభత్సం -
ఇరాన్‌పై దాడి.. మూడు దేశాల గగనతలం మూసివేత
టెహ్రాన్:తమపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇవాళ(శనివారం) తెల్లవారుజామున పెద్దఎత్తున దాడులు చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇతర నగరాల్లోని సైనిక స్థావరాలే టార్గెట్‌గా క్షిపణుల దాడి జరిపింది. దీంతో ఒక్కసారిగా పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రయోగించిన మిసైల్స్ కారణంగా విమాన సర్వీసులు నిలిపివేశారు. ఫ్లైట్ రాడార్ 24, ఓపెన్ సోర్స్ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ప్రకారం.. మూడు దేశాలు( ఇరాన్, ఇరాక్, సిరియా) మీదుగా ఏ విమానమూ ప్రయాణించడం లేదు.ఈ మూడు దేశాల మధ్య విమనాలు ప్రయాణించే గగనతలం మూసివేశారు. అయితే.. దాడులు ముగిసిన అనంతరం గగనతలంలో విమాన సర్వీసుల ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తామని ఇరాన్ ప్రకటించింది. అదేవిధంగా కొన్ని గంటల పాటు జోర్డాన్, ఇజ్రాయెల్ గగనతలం మూసివేయబడినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.The airspace of #Iran, #Iraq, #Jordan, #Syria and #Israel is closed as Israeli war planes attack various locations in Iran for the last few hours. pic.twitter.com/5MEcNGaiNk— Hamdan News (@HamdanWahe57839) October 26, 2024అక్టోబర్ 1న హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా ఇరాన్.. ఇజ్రాయెల్‌పై 200కుపైగా రాకెట్లు, క్షిపణుల ప్రయోగించింది. ఇరాన్ వైమానిక దాడులకు ప్రతీకంగా ఇవాళ ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేసింది. ఇజ్రాయల్ చేసిన దాడులపై ఇరాన్ స్పందించింది. ‘‘శనివారం తెల్లవారుజాము నుంచి ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇలామ్, ఖుజెస్తాన్, టెహ్రాన్‌లోని సైనిక స్థావరాలను ఐడీఎఫ్ లక్ష్యంగా దాడులు జరిపింది. అయితే ఈ దాడులు పరిమిత నష్టాన్ని మాత్రమే కలిగించాయి" అని ఓ ప్రకటనలో పేర్కొంది. -
పసిపిల్లల మాంసం తినిపించారు
ఐసిస్ చెర నుంచి బయటపడ్డ ఫాజియా సిడో అనే మహిళ భయంకరమైన విషయాలు వెల్లడించింది. తనతో పాటు ఇతర ఖైదీలతో పసి పిల్లల మాంసం తినిపించారని తెలిపింది! 2014లో ఇరాక్‌లోని సింజార్‌లో దాడి చేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సిడోను ఆమె ఇంటి నుంచి ఎత్తుకెళ్లారు. అప్పటికి ఆమెకు 11 ఏళ్లు. ‘‘తీసుకెళ్లాక మమ్మల్ని రోజుల తరబడి ఆకలితో ఉంచారు. తర్వాత అన్నం, మాంసంతో కూడిన భోజనం ఇచ్చారు. చాలా ఆకలితో ఉన్నందున వింత రుచి ఉన్నప్పటికీ తిన్నాం. తర్వాత అంతా అస్వస్థతకు గురయ్యాం. మేం తిన్నది పసి పిల్లల మాంసమని ఆ తర్వాత ఐఎస్ ఉగ్రవాదులు బయటపెట్టారు. యజిదీ పిల్లల మాంసమని చెప్పారు. తలలు నరికిన చిన్నారుల ఫొటోలు చూపించి, ‘ఇప్పుడు మీరు తిన్న మాంసం ఈ పిల్లలదే’ అని చెప్పారు. అది విని మాకు మతిపోయింది. ఓ మహిళ హార్ట్ ఫెయిల్యూర్‌తో మృతి చెందారు. ఓ తల్లి ఆ ఫొటోల్లో తన బిడ్డను గుర్తించి గుండె పగిలేలా ఏడ్చారు’’ అంటూ ఆ భయానక క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఐసిస్ తమ బందీలకు మనుషుల మాంసం తినిపించిందని గతంలో వచి్చన ఆరోపణలను సిడో కథనం ధ్రువీకరించింది. ఈ విషయాన్ని 2017లో యాజిదీ పార్లమెంటేరియన్ వియాన్ దఖిల్ తొలిసారి వెలుగులోకి తెచ్చారు. ఇంకా ఐసిస్ చెరలోనే... 2014లో ఉత్తర ఇరాక్‌లో మైనారిటీలైన వేలాదిమంది యాజిదీ మహిళలు, చిన్నారులను ఐసిస్ కిడ్నాప్ చేసింది. వారిలో సిడో ఒకరు. మరో 200 మంది యాజిదీ మహిళలు, పిల్లలతో కలిసి అండర్ గ్రౌండ్ జైలులో తొమ్మిది నెలల పాటు బందీగా ఉన్నారు. కలుíÙత నీటితో కొందరు చిన్నారులు మృతి చెందారు. సిడోను అబూ అమర్ అల్–మక్దీసీతో సహా అనేక మంది జిహాదీ ఫైటర్లకు విక్రయించారు. ఆమెతోపాటు చాలా మందిని బానిసలుగా అమ్మారు. ఏళ్ల తరబడి హింస, దోపిడీ తర్వాత ఇజ్రాయెల్, అమెరికా, ఇరాక్ రహస్య మిషన్ వల్ల ఆమె చెర నుంచి సిడో బయటపడ్డారు. తరువాత ఆమెను ఇజ్రాయెల్‌లోని కెరెమ్ షాలోమ్ క్రాసింగ్‌కు పంపారు. అక్కడినుంచి జోర్డాన్‌కు ప్రయాణించి చివరికి ఇరాక్‌లోని తన కుటుంబాన్ని తిరిగి కలుసుకున్నారు. సిడో ప్రస్తుతం సురక్షితంగా ఉన్నప్పటికీ దశాబ్ద కాలం బందీగా ఉన్నప్పటి మానసిక గాయాలు తీవ్రంగా ఉన్నాయని ఆమె న్యాయవాది తెలిపారు. 2014 యాజిడీ మారణహోమం నుంచి 3,500 మందికి పైగా యాజిదీలను రక్షించారు. సుమారు 2,600 మంది గల్లంతయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా మిలిటరీ బేస్‌పై రాకెట్ల దాడి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా మిలిటరీ క్యాంపు మీద ఇటీవల రాకెట్ల దాడి జరిగింది. ఈ రాకెట్లను అక్కడి యాంటీ మిసైల్ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు అమెరికా మిలిటరీ అధికారులు తెలిపారు. మొత్తం మూడు కత్యూష రాకెట్లతో జరిగిన దాడిలో భవనాలు, వాహనాలు ధ్వంసంకాగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. ఇరాక్‌లో ఇప్పటికీ 2500 మంది దాకా అమెరికా సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిపై ఇరాన్ సహాయంతో కొన్ని మిలిటెంట్ గ్రూపులు తరచూ దాడులు చేస్తుంటాయి. ఇదీ చదవండి: నెతన్యాహూతో మాట్లాడిన ప్రధాని మోదీ -
Kolkata: విమానం ప్రయాణంలో విషాదం
ఇరాక్ నుంచి చైనా వెళ్తున్న విమానంలో విషాదం చోటు చేసుకుంది. ఓ టీనేజీ ప్రయాణికురాలు అస్వస్థతకు గురై సీటులోనే కుప్పకూలిపోగా.. విమానాన్ని కోల్‌కతాలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే.. ఆస్పత్రికి తరలించేలోపు ఆ బాలిక కన్నుమూసింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతురాలు బాగ్దాద్ సర్ చినార్ ప్రాంతానికి చెందిన డెరన్ సమీర్ అహ్మద్(16). మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఏఐ 473 విమానంలో చైనా గువాంగ్జౌకు వెళ్తోంది. అయితే బుధవారం అర్ధరాత్రి దాటాక.. హఠాత్తుగా ఆమె అస్వస్థతకు గురైంది.దీంతో విమానాన్ని దారి మళ్లించి అరగంటకు కోల్‌కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్‌పోర్ట్‌లో దించారు. ఎయిర్పోర్ట్ నుంచి ఆమెను ఏఏఐ ఆంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన తర్వాత గురువారం అర్ధరాత్రి మిగతా ప్రయాణికులతో విమానం తిరిగి బయల్దేరింది. ఈ ఘటనపై అసహజ మరణంగా కోల్‌కతా బాగౌతి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం పూర్తి అయ్యాక.. మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. -
Iraq: బాలికల కనీస వివాహ వయసు 9 ఏళ్లకు కుదిస్తూ బిల్లు ప్రతిపాదన
అమ్మాయిలకు కనీస వివాహ వయసును 9 ఏళ్లకు కుదిస్తూ ఇరాక్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదిత బిల్లుపై తీవ్ర ఆగ్రహం, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. పర్సనల్ స్టేటస్ లాను సవరించే ఉద్దేశంతో రూపొందించిన ఈ వివాదాస్పద బిల్లును ఇరాక్ న్యాయశాఖ మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.. అయితే ఇది ఆమోదం పొంది చట్టంగా మారితే వివాహానికి కనీస అమ్మాయి వయస్సు 9 ఏళ్లు ఉండగా.. అబ్బాయి వయస్సు 15 ఏళ్లుకు కుదించనున్నారు.కుటుంబ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునేందుకు, మతపరమైన అధికారులు లేదా సివిల్ న్యాయవ్యవస్థలో దేనినైనా ఎంచుకోవడానికి ఈ బిల్లు అనుమతిస్తుంది. అయితే, వారసత్వం, విడాకులు, పిల్లల సంరక్షణ విషయాలలో మహిళ హక్కులను ఇది హరిస్తుందని విమర్శకులు భయపడుతున్నారు. బిల్లు కానీ పార్లమెంటులో ఆమోదం పొందితే బాల్య వివాహాలు భారీగా పెరిగిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. లింగ సమానత్వంతోపాటు మహిళా హక్కుల విషయంలో ఇప్పటి వరకు సాధించిన పురోగతిని ఈ బిల్లు నట్టేట్లో కలిపేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ బిల్లు ఆమోదం పొందితే, 9 ఏళ్లలోపు బాలికలు మరియు 15 ఏళ్లలోపు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి అనుమతిస్తారు, ఇది పెరిగిన బాల్య వివాహాలు మరియు దోపిడీల భయాలను రేకెత్తిస్తుంది. ఈ తిరోగమన చర్య మహిళల హక్కులు మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో దశాబ్దాల పురోగతిని అణగదొక్కుతుందని విమర్శకులు వాదించారు.మానవహక్కుల సంఘాలు, మహిళా సంఘాలు సైతం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బాలికల విద్యను ఇది అడ్డుకుంటుందని, వారి ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. చిన్న వయసులోనే గర్భం దాల్చడం, గృహ హింస వంటి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ ప్రకారం, ఇఆరక్లో 28శౠతం మంది బాలికలకు 18 ఏళ్ల లోపు వివాహాలుజరుగుతున్నట్లు వెల్లడైంది. అయితే ఇరాక్ గతంలోనూ ఇలాంటి ప్రయత్నమే చేసినప్పటికీ అప్పట్లో చట్ట సభ్యుల వ్యతిరేకతతో వెనక్కి తగ్గింది. -
తొలి ‘డోపీ’ దొరికాడు!
ఒలింపిక్స్‌లో ప్రారంబోత్సవ వేడుకలకు ముందే డోపింగ్‌తో ఆటగాడు సస్పెండ్ అయ్యాడు. ఇరాక్‌కు చెందిన జూడో ఆటగాడు సజ్జాద్ సెహెన్ నిషేధిత ఉత్రే్పరకాలు మెటాన్డినోన్, బోల్డెనోన్ తీసుకున్నట్లుగా పరీక్షలో తేలింది. మంగళవారం జరిగే పోటీల్లో ఈ జూడో ప్లేయర్ 81 కేజీల విభాగంలో పోటీ పడాల్సి ఉండగా, ఇప్పుడు ‘పాజిటివ్’గా దొరికిపోయాడు. దాంతో అతడిని పోటీల నుంచి తప్పించడంతో పాటు ఒలింపిక్స్‌కు సంబంధించిన ఎలాంటి కార్యక్రమంలోనూ పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్లు ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ) ప్రకటించింది. -
పరిణతితో ప్రవర్తించాలి
ప్రపంచంలో ఉన్న ఘర్షణలు చాల్లేదన్నట్టు కొత్త తగువులు పుట్టుకొస్తున్న తీరు ఆందోళన కలిగి స్తోంది. ఇస్లామిక్ రాజ్యాలైన ఇరాన్, పాకిస్తాన్‌లు ఉగ్రవాదాన్ని అణిచే పేరిట పరస్పరం క్షిపణులతో, డ్రోన్లతో దాడులు జరుపుకోవటం తాజా పరిణామమైతే ఇంతవరకూ ఇరుపక్షాలకూ సర్దిచెప్పటా నికి ఎవరూ ప్రయత్నిస్తున్నట్టు లేదు. పాక్ గగనతలాన్ని అతిక్రమించిన ఇరాన్ విమానాలు సున్నీ మిలిటెంట్ సంస్థ జైష్ అల్ అదల్ స్థావరాలపై దాడులు చేయగా పాకిస్తాన్ సైతం ఇదే వంకతో ఇరాన్ భూభాగంపై బాంబులు కురిపించింది. ఇరాక్, సిరియాలపైనా ఇరాన్ దాడులు చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం మొదలై రెండేళ్లు దాటుతుండగా, మూడు నెలల క్రితం గాజాలో ఇజ్రాయెల్ మొదలెట్టిన దాడులు విరామం లేకుండా సాగుతూనేవున్నాయి. దాదాపు 24,000 మంది పాలస్తీనా పౌరుల ప్రాణాలు బలయ్యాయి. అటు ఎర్ర సముద్రంలో హౌతీలపై అమెరికా, బ్రిటన్లు చేస్తున్న దాడులు ఫలిస్తున్న సూచనలు కనబడటం లేదు. ఇండో–పసిఫిక్ప్రాంతం రానున్న కాలంలో పెను సవాలు కాబోతున్నదని అగ్రరాజ్యాలు అంచనా వేసుకుని పది హేనేళ్లుగా పథక రచన చేస్తుండగా తాజా పరిణామాలు ఆ అంచనాలను తలకిందులు చేశాయి. దేశాల మధ్య ఉన్న విభేదాలు దీర్ఘకాలం అపరిష్కృతంగా ఉండిపోతే అవి ఏదో ఒక దశలో కొత్త బలాన్ని సంతరించుకుని మరింత సంక్లిష్టంగా మారుతాయి. ఇప్పుడు ఘర్షణలు తలెత్తిన ప్రాంతాలు, ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ప్రాంతాలు గమనిస్తే ఈ సమస్యలు కొత్తగా తలెత్తి నవి కాదని అర్థమవుతుంది. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం చోటుచేసుకుని అప్పటి పాలకుడు ఇరాన్ షా పదవీచ్యుతుడయ్యేవరకూ ఇరాన్, పాకిస్తాన్ రెండూ అమెరికాకు గట్టి మిత్ర దేశాలు. మనతో 1965లోనూ, ఆ తర్వాత 1971లోనూ పాకిస్తాన్ తలపడినప్పుడు ఆ దేశాన్ని అన్నివిధాలా ఆదుకున్న చరిత్ర ఇరాన్‌ది. పాకిస్తాన్ విచ్ఛిన్నాన్ని సహించబోనని ఇరాన్ షా పరోక్షంగా మన దేశాన్ని హెచ్చరించాడు. అలాగని ఇరాన్–పాకిస్తాన్ సరిహద్దులు ఎప్పుడూ ప్రశాంతంగా లేవు. అక్కడ స్థావరాలు ఏర్పర్చుకుని ఆ రెండింటినీ చికాకు పెడుతున్న బలూచిస్తాన్ మిలిటెంట్లకు కొదవ లేదు. కానీ ఇరాన్లో ఆయతుల్లా ఖొమైనీ ఏలుబడి తర్వాత అక్కడ షియాల ఇస్లామిక్ రాజ్యం ఏర్పడ్డాకే ఆ దేశానికి సున్నీ మెజారిటీ పాకిస్తాన్‌తో సమస్యలు బయల్దేరాయి. అటు పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీసిన స్థితిలో వుండగా, ఇటు ఇరాన్ అమెరికా విధించిన ఆంక్షలతో ఊపిరాడకుండా వుంది. ఇలాంటి గడ్డు స్థితిలో అక్కడ తక్షణం యుద్ధం తలెత్తే ప్రమాదం వుండకపోవచ్చు. అలాగని ఆ రెండు దేశాలూ ఒక అంగీకారానికి రాకపోతే ఏమైనా జరగొచ్చు. వాస్తవానికి ఇజ్రాయెల్ అస్తిత్వా నికి ఏ బెడదా లేకుండా చేయటానికీ, పశ్చిమాసియాలో తన పట్టు జారకుండా చూసుకొనేందుకూ అమెరికా చేయని ప్రయత్నమంటూ లేదు. పాలస్తీనా విషయంలో 1973 వరకూ ఏకతాటిపై ఉన్న అరబ్ దేశాలూ, ఇతర ముస్లిం దేశాలూ ఆ తర్వాత కాలంలో పరస్పరం విభేదించుకోవటంలో అమె రికా పాత్ర తక్కువేమీ కాదు. 1979లో ఇజ్రాయెల్–ఈజిప్టు మధ్య సయోధ్య కుదిర్చిన మాదిరిగానే 1994లో జోర్డాన్‌తో, ఈమధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, మొరాకోలతో ఇజ్రా యెల్‌కు సఖ్యతను ఏర్పర్చింది కూడా అమెరికాయే. మరోపక్క సిరియాలో బషర్ అల్ అసద్‌తో, యెమెన్‌లో హౌతీలతో, గాజాలో హమాస్, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫ్రంట్లతో, లెబనాన్‌లో హిజ్బొ ల్లాతో జట్టుకట్టి అమెరికా అనుకూల ఫ్రంట్‌కు ప్రత్యామ్నాయాన్ని రూపొందించటంలో ఇరాన్ చాన్నాళ్లుగా బిజీగా వుంది. ఇజ్రాయెల్‌కు దగ్గరైన దేశాల్లో చాలా భాగం సున్నీ ఆధిపత్యంలోనూ, ఇరాన్ కూడగడుతున్న దేశాలు షియా ప్రాబల్యంలోనూ ఉండటం యాదృచ్ఛికం కాదు. ఈమధ్యలో చైనా ఏడెనిమిదేళ్లుగా జరుపుతున్న మధ్యవర్తిత్వం ఫలించి నిరుడు మార్చిలో ఇరాన్–సౌదీ మధ్య చర్చలు మొదలయ్యాయి. ఏదీ కారణం లేకుండా మొదలు కాదు. విస్తరించదు. బలూచిస్తాన్‌లో ముస్లిం మైనారిటీల సమస్యలను పరిష్కరించటంలో ఇరాన్, పాకిస్తాన్ రెండూ వైఫల్యం చెందటం వల్లే ఆ ప్రాంతం చాన్నాళ్లుగా భగ్గుమంటోంది. బలూచిస్తాన్‌లో అటు షియాలూ, ఇటు సున్నీలూ ఉన్నా జాతి, తెగల పరంగా ఆ వర్గాలమధ్య ఎన్నో వ్యత్యాసాలున్నా ఆ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలూ, భాష వగైరాల్లో అక్కడి ప్రజల తీరుతెన్నులే వేరు. తాము అటు ఇరాన్‌కూ, ఇటు పాకిస్తాన్‌కూ చెంద బోమని, తమది ప్రత్యేక విధానమని వారి వాదన. స్వతంత్ర సిస్తాన్–బలూచిస్తాన్ ఏర్పాటులోనే తమ భవిష్యత్తు ముడిపడివున్నదని అక్కడి పౌరులు భావిస్తుంటారు. ఈ మైనారిటీల మనోభావా లను సకాలంలో గుర్తించి, సరిచేసేందుకు ప్రయత్నించివుంటే మిలిటెంట్ సంస్థల ప్రభావం అక్కడ వుండేది కాదు. కానీ అటు ఇరాన్, ఇటు పాకిస్తాన్ అణిచివేతనే నమ్ముకున్నాయి. పైగా మీ మెతక దనంవల్లే సమస్య ముదిరిందని పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. తాజా ఇరాన్ దాడుల వెనక పశ్చిమాసియా ఘర్షణలను విస్తరించాలన్న ఆలోచనలున్నాయని కొందరు విశ్లేషకులు అనుమానిస్తు న్నారు. కరోనా మహమ్మారి, రష్యా–ఉక్రెయిన్ ఘర్షణలు ఇప్పటికే ప్రపంచాన్ని పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయేలా చేశాయి. రష్యానూ, ఇజ్రాయెల్‌నూ అదుపు చేసేందుకు ప్రయత్నించాల్సిన తరుణంలో మరో సంక్షోభాన్ని పెంచటం క్షమార్హం కానిది. కనుకనే పాకిస్తాన్, ఇరాన్ రెండూసంయమనం పాటించి చర్చలకు సిద్ధపడాలి. ఆ ప్రాంత మైనారిటీల మనోభావాలేమిటో తెలుసు కుని పరిణతితో ఆలోచిస్తే శాశ్వత పరిష్కారం అసాధ్యం కాదని గుర్తించాలి. -
పాక్‌పై ఇరాన్ క్షిపణి దాడులు.. తీవ్ర హెచ్చరికలు
ఇస్లామాబాద్: తమ బలగాలపై దాడులు చేస్తున్న ఉగ్రవాదులపై ఇరాన్ ఉక్కుపాదం మోపుతోంది. క్షిపణి దాడులతో ఉగ్రవాద స్థావరాలపై దాడులకు తెగబడుతోంది. సిరియా, ఇరాక్‌లో ఇరాన్ మంగళవారం క్షిపణి దాడులు చేసింది. ఆ వెంటనే నేడు పాకిస్థాన్ ప్రాంతంలోని బలూచిస్థాన్‌లో క్షిపణులతో రెచ్చిపోయింది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని జైష్ ఉల్-అడ్ల్ టెర్రర్ గ్రూప్ రెండు స్థావరాలపై ఇరాన్ దాడి చేసింది. అయితే ఈ దాడుల్ని పాక్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మృతి చెందారని.. మరో ముగ్గురు బాలికలు తీవ్రంగా గాయపడ్డారని పాక్ తెలిపింది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని జైష్ ఉల్-అడ్ల్ టెర్రర్ గ్రూప్ రెండు స్థావరాలను డ్రోన్లు, క్షిపణులతో ధ్వంసం చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నివేదించింది. పాక్ సరిహద్దు వెంట తమ బలగాలపై దాడులు చేసిన ఉగ్రవాద గ్రూప్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు వెల్లడించింది. అయితే తమ గగనతలంలో ఇరాన్ చేపట్టిన ఈ చర్యను పాక్ ఖండించింది. తమ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని హెచ్చరించింది. సిరియా, ఇరాక్ ప్రాంతాలపై ఇరాన్ మంగళవారం దాడులకు తెగబడింది. సిరియా, ఇరాక్ ఆధీనంలోని స్వయంప్రతిపత్తి కలిగిన కుర్దిస్థాన్ ప్రాంతంలో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు జరిపింది. ఇజ్రాయెల్ గూఢచార బృందాల సమావేశంపై దాడి జరిపినట్లు ఇరాన్ పేర్కొంది. ఈ దాడుల్లో ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయం ధ్వంసమైనట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ గ్రూప్స్ తెలిపింది. ఇందులో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించాయి. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలైనట్లు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: Iran Attacks On Iraq Spy HQ: సిరియా, ఇరాక్‌పై ఇరాన్ క్షిపణి దాడులు -
సిరియా, ఇరాక్‌పై ఇరాన్ క్షిపణి దాడులు
టెహ్రరాన్: సిరియా, ఇరాక్ ప్రాంతాలపై ఇరాన్ దాడులకు తెగబడింది. సిరియా, ఇరాక్ ఆధీనంలోని స్వయంప్రతిపత్తి కలిగిన కుర్దిస్థాన్ ప్రాంతంలో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు జరిపింది. ఇజ్రాయెల్ గూఢచార బృందాల సమావేశంపై దాడి జరిపినట్లు ఇరాన్ పేర్కొంది. ఈ దాడుల్లో ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయం ధ్వంసమైనట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ గ్రూప్స్ తెలిపింది. ఇందులో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించాయి. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలైనట్లు పేర్కొన్నాయి. మరణించిన పలువురు పౌరుల్లో ప్రముఖ వ్యాపారవేత్త పెష్రా డిజాయీ కూడా ఉన్నారని కుర్దిస్థాన్ డెమోక్రటిక్ పార్టీ తెలిపింది. బాలిస్టిక్ క్షిపణులతో సిరియాలోని పలు ప్రాంతాలపై కూడా ఇరాన్ దాడులు చేసింది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్స్ కమాండర్లకు చెందిన స్థలాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఇరాన్‌లోని కెర్మాన్, రాస్క్లలో ఇటీవల ఉగ్రవాదులు దాడులు జరిపి పలువురు ఇరాన్ దేశస్థులను హతమార్చారు. ఆ దాడులకు ప్రతిస్పందనగా సిరియాపై ఇరాన్ క్షిపణులతో రెచ్చిపోయింది. సిరియాకు చెందిన అలెప్పో గ్రామీణ ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. మధ్యధరా సముద్రం వైపు నుంచి 4 క్షిపణులు వచ్చినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వార్ మానిటర్ తెలిపింది. సిరియా, ఇరాక్ ఆధీనంలోని కుర్దిస్థాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ గూఢచారి బృందాలు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఇరాన్ ఆరోపిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తున్న ఇరాన్ ఈ మేరకు దాడులు జరిపింది. ఇదీ చదవండి: పుతిన్, మోదీ కీలక చర్చలు.. రష్యాకు విషెస్ చెప్పిన ప్రధాని -
Iraq: హెజ్బొల్లా స్థావరాలపై అమెరికా దాడులు
వాషింగ్టన్: ఇరాక్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా దాడులకు దిగింది. ఉత్తర ఇరాక్‌లో మిలిటెంట్లు జరిపిన దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు గాయపడడంతో అధ్యక్షుడు బైడెన్ ఆదేశాల మేరకు హెజ్బొల్లాపై దాడులకు దిగినట్లు దేశ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ చెప్పారు. ‘ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా గ్రూపునకు చెందిన మూడు స్థావరాలపై ఇరాక్‌లోని మా బలగాలు దాడులు జరిపాయి. ఖచ్చితమైన లక్ష్యాలను ఎంచుకుని వరుస దాడులు జరిపాం. ఇరాక్, సిరియాల్లో మా బలగాలపై ఇటీవల మిలిటెంట్లు తరచుగా దాడులు జరుపతున్నారు. దీనికి ప్రతిగా అధ్యక్షుడి ఆదేశాలతో మిలిటెంట్ల స్థావరాలపై దాడులు చేశాం’ అని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడుతున్న హమాస్‌తో పాటు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తున్న హౌతీ మిలిటెంట్లు, ఇరాక్‌లోని హెజ్బొల్లా గ్రూపు మిలిటెంట్ల వెనుక ఇరానే ఉందని అమెరికా ఆరోపిస్తుండటం గమనార్హం. ఇదీచదవండి..అమెరికా ఎన్నికలు.. ట్రంప్ క్యాంపెయిన్‌లో ఆమె కీ రోల్ ! -
ఇరాక్‌తో ఒకలా! ఇజ్రాయెల్‌తో మరోలా!!
పాలస్తీనాలో భాగమైన గాజా రాజ్యరహిత పరిస్థితి... దాన్ని పాలిస్తున్న హమాస్‌ను తీవ్రవాదంలోకి నెట్టింది. ఇజ్రాయెల్‌లోని పాలస్తీనా బందీలను వదలమన్న ఐక్య రాజ్య సమితి 194వ తీర్మానాన్ని ఇజ్రాయెల్ ఖాతరు చేయలేదు. పైగా పాలస్తీనాను ఆక్ర మించింది. తీవ్ర నిరసనలతో 2023 అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఇజ్రాయెల్ గాజాపై ప్రతీకార యుద్ధానికి దిగింది. ఈ చర్యను అనేక దేశాలు ఖండించాయి. గతంలో భద్రతా మండలి 1441వ తీర్మానాన్ని 2002 నవంబర్ 8న ఏకగ్రీవంగా ఆమోదించింది. అనేక తీర్మానాల్లో నిర్ధారించినట్లు తన నిరాయుధీకరణ బాధ్యత నిర్వహణకు సద్దాం హుస్సేన్‌కు ఈ తీర్మానం తుది అవకాశాన్నిచ్చింది. 687వ తీర్మాన యుద్ధ విరమణ ఆదేశాన్ని ఇరాక్ పాటించలేదనీ, విధ్వంసక నిషిద్ధ ఆయుధాలను సంపాదించి, నిషేధిత క్షిపణులను తయారు చేసిందనీ, 1990–91లో కువైట్ ఆక్రమణలో తన సైనిక దోపిడీకి పరిహారం నిరాకరించిందనీ ఆరోపించింది. ఇరాక్ తప్పుడు వ్యాఖ్యానాలు, సమర్థనలు, ఈ తీర్మాన అమలు వైఫల్యం ఇరాక్ బాధ్యతల ఉల్లంఘన అని హెచ్చ రించింది. ఈ తీర్మానంలో ఇరాక్‌పై యుద్ధ ప్రసక్తి లేదు. ఐరాస పర్యవేక్షణ, పరిశీలన, తనిఖీ కమిషన్, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తనిఖీలను ఇరాక్ అనుమతించాలని పేర్కొన్నారు. 2002 సెప్టెంబర్‌లో అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్లు్య. బుష్ ఐరాస సాధారణ సభలో ఇరాక్ తప్పు లను చదివారు. ఆ తప్పులు: ఐరాస భద్రతా సమితి 1373వ (ఉగ్రవాద నిరోధక) తీర్మానాన్ని ఇరాక్ ఉల్లంఘించింది. ఇరాన్, ఇజ్రాయెల్, పాశ్చాత్య దేశాలపై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థలకు మద్దతిస్తోంది. అఫ్గానిస్తాన్ నుంచి తప్పించుకున్న అల్ ఖైదా ఉగ్రవాదులు ఇరాక్‌లో ఉన్నారు. ఐరాస మానవ హక్కుల కమిషన్ 2001లో ఇరాక్‌లో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలను గమనించింది. ఇరాక్‌లో జీవ, రసాయన ఆయుధాలు, దీర్ఘ లక్ష్య క్షిప ణుల తయారీ, ఉపయోగం ఐరాస తీర్మానాల అతిక్రమణ. ఐరాస పథకం ఆహారానికి చమురు డబ్బుతో ఇరాక్ ఆయుధాల కొనుగోలు. భద్రతా మండలిలో వీటో హక్కు, శాశ్వత సభ్యత్వమున్న రష్యా, చైనా, ఫ్రాన్స్‌లకు ఇరాక్‌పై అమెరికా యుద్ధానికి దిగుతుందన్న అనుమానముంది. తీర్మానంలో తీవ్ర పరిణామాలు, పాదార్థిక ఉల్లంఘనలు వంటి పదాలు యుద్ధానికి దారితీయరాదని, ఇరాక్‌పై చర్యకు మరొక తీర్మానం అవసరమని రష్యా, ఫ్రాన్స్‌లు వాదించాయి. 1441వ తీర్మాన ముసాయిదాను తయారుచేసిన అమెరికా, ఇంగ్లండ్‌లు, తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన ఏకైక అరబ్బు దేశం సిరియా, ఈ తీర్మాన లక్ష్యం ఇరాక్ నిరాయుధీకరణని, దానికి ఇరాక్ సహకరించకపోతే భద్రతా మండలి తర్వాతి కార్యక్రమాన్ని నిర్ణయించాలని అన్నాయి. ఇరాక్ 2002 నవంబర్ పదమూడున తీర్మానాన్ని అంగీకరించింది. అమెరికా (ఐరాస) తీర్మాన ఆరోపణలు రుజువు కాలేదని ఐరాస తనిఖీ అధికారులు 2002 నవంబర్‌లో నివేదించారు. అదే ఏడాది డిసెంబర్లో ఇరాక్ 12 వేల పేజీల ఆయుధ నివేదికను ఇచ్చింది. ఏ ఐరాస సభ్య దేశమూ యుద్ధానికి అనుకూలం కాదు. అమెరికా, ఇంగ్లండ్‌లు చాలా తారుమారు పనులు చేశాయి. ఒకటి రెండు దేశాలు ఐరాస భద్రతా మండలిని ఆదేశించలేవని ఐరాస సభ్య దేశాలు ప్రకటించాయి. ఇరాక్‌పై యుద్ధం అసమ్మతమని న్యాయ కోవిదులు తమ అభిప్రాయాలను తెలిపారు. అయినా 2003 మార్చి 19న అమెరికా ఇరాక్‌పై యుద్ధానికి దిగింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పోలండ్లు ఇరాక్‌పై యుద్ధం చేశాయి. 2003 మే వరకు వరకు యుద్ధం సాగింది. ఇరాక్ సర్వనాశనమైంది. సద్దాం హుస్సే న్ను బంధించి ఉరిదీశారు. ఐరాస ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ ఇరాక్‌పై యుద్ధం చట్టవ్యతిరేకమనీ, ఐరాస వ్యవస్థాపక ఒప్పంద ఉల్లంఘననీ 2004 సెప్టెంబర్‌లో ప్రకటించారు. యుద్ధనివారణ కోసం ఐరాస సభ్య దేశాలు ఒక దేశంపై మరొక దేశం దాడిని ఆపాలన్నది రెండవ ప్రపంచ యుద్ధ విధ్వంసం తర్వాత ఏర్పడ్డ ఐరాస ప్రధాన లక్ష్యం. ఇజ్రాయెల్ ఐరాస సభ్య దేశం. పాలæ స్తీనా, వాటికన్ నగరం ఐరాస పరిశీలన దేశాలు. యుద్ధ నిరోధంలో పాలస్తీనా కంటే ఇజ్రాయెల్‌పై ఎక్కువ బాధ్యత ఉంది. అంతర్జాతీయ మానవత్వ చట్టాలను పాటించి, మానవత్వంతో గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాలనీ, ప్రజలకు అత్యవసర ఆహార, ఔషధాలను అందించాలనీ, బందీలను వదలాలనీ ఐరాస సర్వసభ్య సాధారణ సభ 2023 అక్టోబర్ 27న తీర్మానించింది. ఈనాటికీ ఈ తీర్మానాన్ని ఇజ్రాయెల్ అమలు చేయలేదు. యుద్ధాన్ని ఆపలేదు. అమెరికా... ఇజ్రాయెల్ పక్షం వహిస్తోంది. కనీసం తాత్కా లిక విరామాన్ని పాటించమని అమెరికా మిత్ర దేశాలే కోరాయి. ఐరాస 1441వ తీర్మాన చట్టవ్యతిరేక దుర్వినియోగానికి, ఐరాస ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడ్డ అమెరికా, అలాగే ఇరాక్‌పై యుద్ధంలో పాల్గొన్న ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పోలండ్లు నేటి ఐరాస తీర్మానాన్ని ఎందుకు అమలు చేయించవు? ఇరాక్‌ను కక్షతో శిక్షించిన అమెరికా మానవత్వంతో ఇజ్రాయెల్‌ను ఎందుకు దండించదు? సంగిరెడ్డి హనుమంత రెడ్డి వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి ‘ 9490 20 4545 -
Iraq wedding fire: పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం
మోసల్ (ఇరాక్): ఇరాక్‌లోని ఒక పెళ్లి వేడుకల్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో తీవ్ర విషాదం నెలకొంది. అతిథులతో కిక్కిరిసిపోయిన హాలులో వధూవరులు డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి 114 మంది మరణించారు. మరో 150 మంది వరకు గాయపడ్డారు. ఆస్పత్రితో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇరాక్‌లోని నినెవెహ్ ప్రావిన్స్ ఖరఖోష్ పట్టణంలో పెళ్లి వేడుకలో హాలులో బాణాసంచా కాల్చడంతో ఒక్కసారి డెకరేషన్‌కు మంటలు అంటుకొని వ్యాపించాయి. ఆ హాలు నిర్మాణంలో ఉపయోగించిన సామాగ్రి, పెళ్లి కోసం చేసిన డెకరేషన్ కూడా మండించే స్వభావాన్ని కలిగి ఉండడంతో అగ్ని కీలలు త్వరితగతిన విస్తరించాయి. కళ్ల ముందే షాండ్లియర్లు, సీలింగ్ నుంచి పెచ్చులు కింద పడడంతో పెళ్లికి హాజరైన అతిథులు అటూ ఇటూ వెళ్లడానికి వీల్లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో వధూవరులు తీవ్రంగా గాయపడినా వారి ప్రాణాలకు ప్రమాదం లేదని స్థానిక మీడియా వెల్లడించింది. పెళ్లి వేడుకలు అంబరాన్నంటుతున్న సమయంలో ఆనందంతో కేరింతలు కొడుతున్న అతిథులు ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో హాహాకారాలు చేశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పెళ్లి వేడుకలు జరిగే మండపం అంతా ప్లాస్టిక్‌తో డెకరేషన్ చేశారు. వధూవరులు డ్యాన్స్ చేస్తుండగా హాలులోనే బాణాసంచా కాల్చారు. అవి నేరుగా రూఫ్‌కి తాకాయి. సీలింగ్‌కి మంటలు అంటుకోవడంతో అవి విస్తృతంగా వ్యాపించాయి. ఆ ఫంక్షన్ హాలుని శాండ్విచ్ ప్యానెల్స్, వినిల్ షీట్స్, ఫ్యాబ్రిక్‌తో నిర్మించడంతో మంటలు ఎగిసెగిసి పడ్డాయి. దీంతో పై నుంచి డెకరేషన్ సామాగ్రి కింద పడి ఎవరూ కదలడానికి వీల్లేకుండా పోయింది. అతిథుల సంఖ్య భారీ స్థాయిలో 1,000 నుంచి 1100 మంది ఉండడంతో అటూ ఇటూ వెళ్లాడానికి దారి లేక అందరూ అక్కడే చిక్కుకుపోయి మంటలకి ఆహుతైపోయారు. -
Iraq: భారీ అగ్నిప్రమాదం.. వంద మందికిపైగా మృతి
బాగ్దాద్: ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వివాహ వేడుకలో పెను విషాదం చోటు చేసుకుంది. ఓ ఫంక్షన్ హాల్లో మంటలు చెలరేగి వంద మందికి పైగా మృతి చెందారు. వందాలది మంది గాయపడగా.. మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. ఉత్తర ఇరాక్ నెనెవెహ్ ప్రావిన్స్ అల్‌హమ్‌దానియా జిల్లాలో మంగళవారం రాత్రి ఓ పెళ్లి ఫంక్షన్ హాల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వంద మందికిపైగా సజీవ దహనం అయ్యారు.మృతుల్లో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా ఉన్నారు. ప్రమాదంలో 500 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాణాసంచా కాల్చే క్రమంలోనే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది. 110 dead including the bride and groom in the fire incident at a wedding hall in Hamdaniyah,Iraq 550 injured Video is from AVA Media#Iraq #Hamdaniyah pic.twitter.com/I4dSQbQi1s — North X (@__NorthX) September 26, 2023 Nineveh Governor: Preliminary investigations indicate that the Hamdaniyah fire was caused by fireworks inside the wedding hall.#Iraq pic.twitter.com/1IuH0vqpif — Alahad TV-EN (@ahad_en) September 27, 2023 -
భారత్ దగ్గు మందు సురక్షితం కాదు: డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
జెనీవా: ఇరాక్‌లో విక్రయిస్తున్న భారత్ తయారీ దగ్గు మందు సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. జలుబు, దగ్గు నివారణ కోసం ‘కోల్డ్ అవుట్’ పేరుతో దగ్గు రూపొందించిన సిరప్ తయారీలో వాడే పదార్థాలు పరిమితికి మించి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. చెన్నైకు చెందిన ఫోర్ట్స్ ల్యాబోరేటరీస్ కంపెనీ తయారు చేసిన కోల్డ్ అవుట్ అనే దగ్గు మందును ఇరాక్‌కు చెందిన దాబిలైఫ్ ఫార్మాకు విక్రయించింది. ఈ మందులో డైథిలీన్ ఇథలీన్ మోతాదుకు మించి ఉన్నట్టుగా డబ్ల్యూహెచ్ఒ గుర్తించింది. కోల్డ్ అవుట్లో 0.25% డైఇథలీన్, 2.1% ఇథలీన్ గ్లైకాల్‌లు ఉన్నట్లు తెలిపింది. ఈ దీని వినియోగం సురక్షితం కాదని డబ్ల్యూహెచ్‌వో సూచించింది చిన్నారులు ఈ మందు తాగితే అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. తీవ్ర అస్వస్థతకు గురై మరణం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా ఇటీవల భారత్‌లో తయారైన సిరప్ గురించి డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీ చేయడం ఇదే ప్రథమం. కాగా గతంలో భారత్‌లో తయారైన దగ్గు మందులను ఉపయోగించడం వల్ల ఉజ్బెకిస్థాన్‌లోని గాంబియాలో 89 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో సిరప్‌ను ఉజ్బెకిస్థాన్‌కు సరఫరా చేసిన మరియోన్ బయోటెక్ అనుమతులను భారత్ ప్రభుత్వం రద్దు చేసింది. అంతకముందు కామెరూన్లో చిన్నారుల మృతికి కారణమైన దగ్గు మందు తయారు చేసిన రీమాన్ ల్యాబ్స్ కూడా సిరప్ తయారీలో నాణ్యత పాటించలేదని విచారణలో తేలింది. -
షాక్‌లో శాస్త్రవేత్తలు.. బయటపడ్డ 5000 ఏళ్ల నాటి ఫ్రిడ్జ్.. అందులో ఏం దాచేవారో తెలుసా!
చరిత్రను వెలికితీయడంతో పాటు వాటి ఆధారాలను భద్రపరచే లక్ష్యంతో పురావస్తు శాఖ పని చేస్తుంటుంది. ఈ క్రమంలో ఒక్కోసారి వారికి ఆశ్చర్యం కలిగించే ఘటనలు ఎదురవుతుంటాయి. తాజాగా దక్షిణ ఇరాక్‌లో తవ్వకాలు జరుపుతున్న పురావస్తు శాస్త్రవేత్తల బృందానికి అటువంటి అనుభవమే ఎదురైంది. దాదాపు 5000 సంవత్సరాల నాటి రెస్టారెంట్ అవశేషాలు బయటపడ్డాయి. 5వేల ఏళ్ల నాటి ఫ్రిడ్జ్.. వివరాల్లోకి వెళితే.. సుమేరియన్ నాగరికతకు ముఖ్యమైన కేంద్రంగా పిలిచే పురాతన లగాష్ శిధిలాల మధ్య పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు ప్రారంభించారు. ఈనేపథ్యంలో ఇటీవల అక్కడ 5వేల ఏళ్ల నాటి రెస్టారెంట్‌ను కనుగొన్నారు. అందులో ఆ కాలం నాటి ఓవెన్, కొన్ని బెంచీలు, గిన్నెలు, ఇతర పాత్రలలో బయటపడ్డాయి. అన్నింటికంటే విచిత్రంగా ‘జీర్’ అనే పిలిచే మట్టి రిఫ్రిజిరేటర్ బయట పడటం శాస్త్రవేత్తలును ఆశ్చరపరిచింది. ఆ ఫ్రిజ్‌లో బీర్‌ను దాచినట్టు వారికి రుజువులు కూడా దొరికాయి. అంతేకాకుండా ఆ పురాతన బీర్ తయారు చేసే ఒక రెసిపీని కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు చెప్పారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, పిసా విశ్వవిద్యాలయ బృందాల సంయుక్త ప్రయత్నాల ఫలితంగా ఈ ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చాయి. ఈ తవ్వకాల ఆ బృందం.. డ్రోన్ ఫోటోగ్రఫీ, థర్మల్ ఇమేజింగ్, మాగ్నెటోమెట్రీ, మైక్రో-స్ట్రాటిగ్రాఫిక్ శాంప్లింగ్ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించుకున్నారు. -
సద్దాం హుస్సేన్ వాడని ఓడ
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఓడ ఇరాక్ మాజీ అధినేత సద్దాం హుస్సేన్ ముచ్చటపడి ప్రత్యేకంగా తయారు చేయించుకున్నది. అయితే, ఆయన తన జీవితకాలంలో ఎన్నడూ దీనిని వాడలేదు. నాలుగు అంతస్తులు, పద్దెనిమిది విశాలమైన గదులు, లోపల అధునాతన సౌకర్యాలతో రూపొందించిన ఈ 270 అడుగుల పొడవైన ఓడ పేరు ‘బస్రా బ్రీజ్’. ఇందులో ఫైవ్‌స్టార్ హోటల్‌ను తలదన్నే ఏర్పాట్లన్నీ ఉన్నాయి. ఒక సెలూన్, డ్రైక్లీనింగ్ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. సద్దాం హుస్సేన్ ఈ ఓడను ఒక డెన్మార్క్ కంపెనీ ద్వారా తయారు చేయించుకున్నాడు. దీని తయారీ 1980లో ప్రారంభమైంది. తయారీ పూర్తయ్యాక మరుసటి ఏడాది ఇది ఇరాక్ తీరానికి చేరుకుంది. ఇంత ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ఈ ఓడలో సద్దాం హుస్సేన్ ఎన్నడూ అడుగుపెట్టలేదు. ఇరాక్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ ఓడను బస్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో శాస్త్ర పరిశోధన కేంద్రంగా మార్చింది. నిజానికి ఇరాక్ ప్రభుత్వం 2018లో ఈ ఓడను 30 మిలియన్ డాలర్లకు (రూ.245 కోట్లు) అమ్మకానికి పెట్టినా, దీని కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ఇప్పుడిది శాస్త్ర పరిశోధన కేంద్రంగా మారడంతో వార్తలకెక్కింది. -
యూట్యూబర్‌ను కిడ్నాప్ చేసి డ్రగ్స్ ఇచ్చిన తండ్రి..కోపంతో దారుణంగా
బాగ్ధాద్: ఇరాక్‌కు చెందిన 22 ఏళ్ల యూట్యూబర్ టిబా అల్ అలీ దారుణ హత్యకు గురైంది. కన్నతండ్రే ఆమెను కిరాతకంగా హతమార్చాడు. డ్రగ్స్ ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి గొంతునులుమి అంతం చేశాడు. అనంతరం స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయిందనే అవమానం భరించలేకే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఏం జరిగిందంటే..? టిబ 2017లోనే ఇళ్లు వదిలి టర్కీకి వెళ్లిపోయింది. సిరియాకు చెందిన తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే జనవరిలో తన సొంత దేశం ఇరాక్ జట్టు ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు స్వదేశానికి తిరిగివచ్చింది. ఈ సమయంలోనే ఆమెను తండ్రి కిడ్నాప్ చేసి వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. అయితే టిబా తన తల్లితో మాట్లాడేందుకు ఒప్పుకుందని, స్నేహితురాలి ఇంట్లో ఆమెను కలిసేందుకు అంగీకరించిందని తెలుస్తోంది. కానీ తండ్రి ఆమెను బలవంతంగా కిడ్నాప్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రం వాగ్వాదం చెలరేగింది. అయితే టిబాకు తండ్రి డ్రగ్స్ ఇవ్వడంతో ఆమె కాసేపటికే సృహకోల్పోయింది. అనంతరం ఆమె నిద్రలో ఉండగానే గొంతునులిమి హత్య చేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. చదవండి: కార్చిచ్చు బీభత్సం.. వందల ఇళ్లు ధ్వంసం.. 13 మంది మృతి.. -
ఫుట్‌బాల్ స్టేడియం సమీపంలో పేలుడు.. 10 మంది యువకులు మృతి
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఫుట్ స్టేడియం సమీపంలో భారీ పేలుడు సంభవించి 10 మంది మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ గ్యారేజ్‌లో పేలుడు పదార్థాలున్న వాహనం పేలి మంటలు పక్కనే ఉన్న గ్యాస్ ట్యాంకర్‌కు వ్యాపించడంతో అది కూడా పేలి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా రోజూ ఫుట్‌బాల్ ఆడేందుకు స్టేడియానికి వచ్చే యువకులే అని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఇరాక్ సైన్యం ప్రకటనలో తెలిపింది. పేలుడుకు గల కరాణాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొంది. చదవండి: ఆస్పత్రులూ ఖాళీ.. ఖేర్సన్ నుంచి రష్యా సేనల పలాయనం -
రణరంగంలా మారిన బాగ్ధాద్.. కాల్పుల్లో 15మంది మృతి
బాగ్ధాద్: ఇరాక్ రాజధాని బాగ్ధాద్ రణరంగాన్ని తలపిస్తోంది. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు షీతె క్లెరిక్ మొఖ్తదా సదర్ ప్రకటించగానే ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. సోమవారం అత్యంత పటిష్ఠ భద్రత ఉండే గ్రీన్ జోన్‌ను(పార్లమెంటు భవనం) ముట్టడించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రీన్ జోన్లో కొందరు బాంబులతో విరుచుకుపడ్డారు. తుపాకీ కాల్పుల మోత మోగించారు. ఈ ఘటనలో 15 మంది సదర్ మద్దతుదారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 250 మంది గాయపడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరిపిందని వార్తలు వచ్చాయి. అయితే ప్రత్యక్షసాక్షులు మాత్రం సదర్ మద్దతుదారులకు, ప్రో-ఇరాక్ కో ఆర్డినేషన్ ఫ్రేమ్ వర్క్ అనూకుల వ్యక్తులకు మధ్య ఘర్షణలు చెలరేగాయని పేర్కొన్నారు. కో ఆర్డినేషన్ ఫ్రేంవర్క్ సానుభూతిపరులు సదర్ మద్దతుదారులపై కాల్పులు జరిపారని చెప్పారు. ఈ క్రమంలోనే సదర్ సపోర్టర్లు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని వివరించారు. మరోవైపు కో ఆర్డినేషన్ ఫ్రేమ్‌వర్క్ ఈ దాడిని ఖండించింది. సదర్ మద్దతుదారులు సంయమనం పాటించి చర్చలకు రావాలని సూచించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో నిరసనకారులపై భద్రత దళాలు గానీ, పోలీసులు గానీ కాల్పులు జరపకుండా తాత్కాలిక ప్రధాని ముస్తఫా అల్ ఖదేమీ నిషేధం విధించారు. అందరూ శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు. బాగ్ధాద్‌లో పరిణామాలపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకరమని పేర్కొంది. పరిస్థితులు చేయి దాటిపోకుండా, హింసాత్మక ఘటనలకు తావులేకుండా ఉండాలని సూచించింది. అగ్రరాజ్యం అమెరికా కూడా బాగ్ధాద్‌లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాక్‌లో ఎన్నికలు జరిగి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఏర్పాటుకాక రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారీటీ రాకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. అయితే ప్రో-ఇరాక్ కో ఆర్డినేషన్ ఫ్రేం వర్క్ అన్ని పార్టీలతో కలిసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముస్తఫా అల్ ఖదేమీని తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకుంది. దీన్ని మొఖ్తదా సదర్ మద్దతుదారాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇదివరకే పలుమార్లు గ్రీన్ జోన్‌ను ముట్టడించారు. అక్టోబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సదర్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినా మెజార్టీ సీట్లు సాధించలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన విపక్షాలతో చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. చదవండి: 300 మందితో వెళ్తున్న నౌకలో భారీ అగ్ని ప్రమాదం -
ఇరాక్‌లో ఉద్రిక్తతలు.. 3 రోజులుగా పార్లమెంట్‌లోనే నిరసనకారులు
బాగ్దాద్: ఇరాక్‌లో ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇరాన్ అనుకూల పార్టీలు, షియా గురువు ముఖ్తదా అల్–సదర్ వర్గాల మధ్య రాజధాని బాగ్దాద్‌లో ఘర్షణ వాతావరణం నెలకొంది. అల్–సదర్ అనుచరులు మూడు రోజులుగా పార్లమెంట్లో బైఠాయించారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటవలేదు. ఇరాన్ అండతో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. షియా గురువు అల్–సదర్ అనుచర వర్గం ఆ ప్రయత్నాలను అడ్డుకుంటోంది. ఇరాన్ అనుకూల శక్తుల వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం బాగ్దాద్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. సంక్షోభం మరింత ముదిరేలా కనిపిస్తోంది. -
పార్లమెంటును దిగ్బంధించిన నిరసనకారులు
బాగ్ధాద్: వందలాది మంది నిరసనకారులు ఇరాక్ పార్లమెంటును దిగ్బంధించారు. షియా నేత ముక్తదా అల్ సద్రకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించినా, గాల్లోకి కాల్పులు జరిపినా లెక్క చేయకుండా సిమెంటు బారీకేడ్లను తొలగించి మరీ పార్లమెంటులోకి ప్రవేశించారు. నిరసనకారులు పార్లమెంటును దిగ్బంధించడం వారం రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో ముక్తదా అల్ సద్రకు చెందిన పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే కావాల్సిన మెజార్టీ మాత్రం అందుకోలేకపోయింది. దీంతో ఇటీవలే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం విపక్షాలకు ఇచ్చారు ముక్తదా. ఫలితంగా దేశంలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ఇటీవలే విపక్షాలు మహమ్మద్ అల్ సుదానీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాయి. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్ మద్దతుదారులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీల్లేదని పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. చదవండి: సర్వస్వం కోల్పోయినా పెంపుడు కుక్కను మాత్రం వదల్లేదు.. -
Iraq: పార్లమెంట్లో నిరసనకారుల రచ్చ
బాగ్దాద్: నిరసనకారుల రంగప్రవేశంతో ఇరాక్ పార్లమెంట్ భవనం దద్దరిల్లిపోయింది. ఇరాన్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు నిరసనకారులు. భవనంలోని ప్రతీ గదిలోకి దూసుకెళ్లి.. ఇరాకీ జెండాలతో రచ్చ రచ్చ చేశారు. ఇరాక్ రాజకీయ-ఆర్థిక సంక్షోభాలను కారణాలుగా చూపిస్తూ.. మాజీ మిలిటెంట్, ప్రస్తుత మతపెద్ద మోఖ్వాతదా సద్ర్ మద్దతుదారులు ఈ చేష్టలకు దిగారు. ఇరాక్‌లో ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు ఏడాది కావస్తున్నా.. కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాలేదు. ఈ క్రమంలో.. కోఆర్డినేషన్ ఫ్రేమ్‌వర్క్ బ్లాక్ తరపున మహ్మద్ అల్-సుడానీ అధికారికంగా ప్రధాని పదవికి నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న ఇరాకీ మతపెద్ద, ఇరాకీ షీతే నిర్వాహకుడు మోఖ్వాతదా సద్ర్‌కు చెందిన మద్దతుదారులు వందల మంది ఒక్కసారిగా పార్లమెంట్‌లోకి దూసుకొచ్చారు. హై సెక్యూరిటీ జోన్ దాటుకుని.. అల్-సుడానీ నామినేషన్ సంగతి తెలుసుకున్న మోఖ్వాతదా మద్దతుదారులు.. పార్లమెంట్ భవనం వైపు దూసుకొచ్చారు. రాజధాని బాగ్దాద్‌లో ఉన్న హై సెక్యూరిటీగా పేర్కొనే గ్రీన్ జోన్‌ను దాటుకుని.. ముందుకొచ్చారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించినా లాభం లేకుండా పోయింది. ఇక పార్లమెంట్ భవనం వద్ద ఆ టైంలో కొద్దిమంది మాత్రమే సెక్యూరిటీ గార్డులు ఉండగా.. వాళ్లు భయంతో ప్రతిఘటించకుండా నిరసనకారుల్ని లోపలికి అనుమతించారు. బెంచ్‌ల ఎక్కి.. పార్లమెంట్ భవనంలో టేబుళ్ల మీద నడుస్తూ.. నానా రభస సృష్టించారు నిరసనకారులు. ఇరాన్‌కు శాపనార్థాలు పెడుతూ.. ఇరాకీ జెండాలు ప్రదర్శించారు. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి విధ్వంసానికి పాల్పడలేదు నిరసనకారులు. రాజకీయంగానే కాదు.. చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలోనూ ఇరాక్ లాంటి చమురు ఆధారిత దేశం ఆర్థికంగా దిగజారిపోతోందని నిరసనకారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టైంలో.. ఇరాన్ అనుకూల వ్యక్తి ప్రధాని పదవి చేపట్టేందుకు తాము ఒప్పుకోబోమని అంటున్నారు. ఇక నిరసకారులు తక్షణమే బయటకు వచ్చేయాలంటూ ప్రధాని ముస్తఫా అల్-కధెమి పిలుపు ఇచ్చారు. దౌత్యపరమైన ఇబ్బందులూ తలెత్తే అవకాశం ఉంటుందని, అది గమనించాలని నిరసనకారులకు పిలుపు ఇచ్చాడు ఆయన. రాజకీయ సంక్షోభం మాజీ ఉగ్రవాది, ఇరాకీ మతపెద్ద మోఖ్వాతదా సద్ర్‌కు చెందిన విభాగం.. 2021 అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 329 సీట్లకుగానూ 73 స్థానాలు గెల్చుకుంది. అయితే అప్పటి నుంచి ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు మాత్రం ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో తాజాగా ప్రధాని నామినేషన్ వేయడానికి వెళ్లిన మహ్మద్ అల్-సుడానీ మాజీ మంత్రి, మాజీ గవర్నర్ కూడా. అయితే.. ఆయన ఇరాన్ అనుకూల వ్యక్తి అని, అక్కడి పార్టీల మద్దతు కూడా ఉందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం ఒత్తిడి పెంచే క్రమంలో సద్ర్ తీసుకున్న ఓ నిర్ణయం బెడిసి కొట్టింది. తన బ్లాక్‌కు చెందిన 73 మంది చట్ట సభ్యులు రాజీనామా చేశారు. దీంతో 63 మంది కొత్త చట్ట సభ్యులు మొన్న జూన్‌లో ప్రమాణం చేయగా.. ఇరాన్ అనుకూల ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. -
నదిలో బయటపడ్డ రహస్యం...పెద్ద చరిత్రే ఉందంటున్న పురావస్తు శాఖ
నదుల్లోని నీటిని వినియోగించుకునేందుకు లేదా పంటలు పండించడానికో లేదా విద్యుత్ కోసం రిజర్వాయర్లు లేదా డ్యాంలను ప్రభుత్వం నిర్శిస్తుంటుంది. దీని వల్ల దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల పై ఆ కట్టడాలు బాగా ప్రభావం చూపిస్తాయి. అవి మునిగిపోవడం లేదా కనుమరుగైపోవడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే నైసర్గిక భూగోళ స్వరూపాన్ని మార్చేస్తాయి. ఈ డ్యాంలను నిర్మించడానికి భూమిని చాలా లోతుగా తవ్వి నిర్మిస్తుంటారు. దీంతో చుట్టూ ఉన్న పొలాలు, ఇళ్లు, ప్రాంతాలు ఆ నది ప్రవాహానికి ధ్వంసమైపోతుంటాయి. అచ్చం అలానే ఇక్కడొక నది పై నిర్మించిన రిజర్వాయర్ కారణంగా పురాతనమైన నగరం కనుమరుగైపోయింది. ప్రస్తుతం ఆ రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గడంతో బయటపడింది. ఎక్కడ జరిగింది? ఏంటా నగరం అనే కదా!. వివరాల్లోకెళ్తే..కెమునేలోని కుర్దిస్థాన్ ప్రాంతంలో దాదాపు మూడు వేల ఏళ్ల నాటి పురాతన ఇరాక్ నగరం బయటపడింది. వాస్తవానికి టైగ్రిస్ నది పై నిర్మించిన రిజర్వాయర్‌లో నీటి స్థాయిలు తగ్గిపోవడంతో ఈ నగరం బయటపడింది. ఐతే ఇది కాంస్య యుగానికి చెందిన ఒక పురాతన సామ్రాజ్యం అని ఆర్కియాలజీ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ఆర్కియాలజీ బృందంలోని డాక్టర్ ఇవానా పుల్జిజ్ ఈ నగరం నేరుగా ట్రెగ్రిస్ నదిపై ఉన్నందున మిట్టాని సామ్రాజ్యంలోని ప్రధాన ప్రాంతాలతో అనుసంధానించి ఉందని చెబుతున్నారు. ఇరాక్ ప్రభుత్వం కూడాఈ రిజర్వాయర్ తిరిగి నిండిపోక ముందే తవ్వకాలు జరిపి ఆ నగరానికి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు జర్మన్‌కి చెందిన ఆర్కియాలజీ బృందానికి అనుమతిచ్చింది. ఈ మేరకు ఆర్కియాలజీ బృందం ఈ నగరానికి సంబంధించిన కొన్నిఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. క్రీస్తు పూర్వం 1550 నుంచి 1350లలో మిట్టని సామ్రాజ్యం పాలనలో ఈ పురాతన నగరం కీలక కేంద్రంగా ఉందని తెలిపింది. ఐతే ఆ రిజర్వాయర్‌లో మళ్లీ నీటి నిల్వలు పెరగడంతో ఆ పురాతన ప్రదేశానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా తవ్విన భవనాలను ప్లాస్టిక్ షీటింగ్‌తో చుట్టి ఉంచారు. ప్రస్తుతం ఆ నగరం మరోసారి పూర్తిగా మునిగిపోయింది. (చదవండి: 20 ఏళ్ల యువతికి 3డీ ప్రింటెడ్ చెవి) -
మరో కొత్త వైరస్ కలకలం.. 19 మంది మృతి
కొత్త వైరస్లు మానవాళికి సవాల్లు విసురుతున్నాయి. ఇప్పటికే కరోనా, దాని కొత్త వేరియంట్లతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెందుతున్న ప్రజలను మంకీ ఫాక్స్, మ్యాంగో ఫీవర్, టమాటో వ్యాధులు మరింత టెన్షన్ పెడుతున్నాయి. తాజాగా కాంగో ఫీవర్ కేసులు పెరగడం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది. జంతువుల నుంచి మనుషులకు సోకే కాంగో ఫీవర్ ఇరాక్‌లో కలకలం రేపుతోంది. కొత్త వైరస్ వ్యాప్తితో ఆ దేశ ప్రజలు వణికిపోతున్నారు. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటికే 19 మంది మృత్యువాత పడ్డట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. శరవేగంగా వ్యాపించడం, అంతర్గత, బహిర్గత రక్తస్రావానికి(ముక్కు నుంచి రక్తం కారడం) దారి తీయడం, విపరీతమైన జ్వరం దీని ముఖ్య లక్షణాలు. దీని బారిన పడ్డ ప్రతీ ఐదుగురిలో ఇద్దరి చొప్పున మరణిస్తున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ వైరస్ తొలిసారిగా మొట్టమొదట 1944లో క్రిమియాలో కనుగొనబడింది. ఈ తర్వాత 1979లో ఇరాక్‌లోనే వెలుగు చూసింది. ఆఫ్రికా, ఆసియా, మధ్యతూర్పు ప్రాంతాల్లో ఎక్కువగానే కనిపించే కాంగో ఫీవర్ వైరస్ ఇరాక్ ప్రజలను అల్లకల్లోలం చేస్తోంది. ఇక, ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తిస్తుంది. అయితే, ఈ వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం మరింత టెన్షన్ పెడుతోంది. కాగా, కాంగో హెమోరేజిక్ అనే పేను ద్వారా జంతువుల్లో ఈ వైరస్ వ్యాప్తి జరుగుతుంది. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల్లో ఈ వైరస్ వాహకంగా ఈ పేలు పనిచేస్తుంది. వైరస్ బారిన పడిన పశువుల రక్తాన్ని తాకినప్పుడు, పశువధ కేంద్రాల్లోని పదార్థాల ద్వారా మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. ఇది కూడా చదవండి: విమాన ప్రయాణం విషాదాంతం -
భారత ఆర్చర్లకు ఆరు పతకాలు ఖాయం
న్యూఢిల్లీ: ఆసియా కప్ స్టేజ్–2 ఆర్చరీ టోర్నమెంట్ వ్యక్తిగత విభాగాల్లో భారత ఆర్చర్లకు రెండు స్వర్ణ పతకాలతో సహా మొత్తం ఆరు పతకాలు ఖాయమయ్యాయి. ఇరాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటికే టీమ్ విభాగంలో భారత్‌కు ఆరు పతకాలు లభించాయి. వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో భారత్‌కు చెందిన ప్రథమేశ్, రిషభ్ యాదవ్ ఫైనల్ చేరగా... సమాధాన్ జావ్కర్ కాంస్యం కోసం పోటీపడనున్నాడు. సమాధాన్ గెలిస్తే భారత్ ఈ విభాగంలో క్లీన్‌స్వీప్ చేస్తుంది. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు పర్ణీత్ కౌర్, సాక్షి చౌదరీ ఫైనల్లోకి ప్రవేశించారు. -
అమెరికాకు బిగ్ షాక్.. రాయబార కార్యాలయంపై మిస్సైల్స్ దాడి
బాగ్దాద్: ఓ వైపు ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ అంతర్జాతీయంగా మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇరాక్‌లో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయంపై ఆదివారం మిస్సైల్ దాడులు జరిగాయి. ఈ దాడులతో ఒక్కసారి అగ్రరాజ్యం అలర్ట్ అయ్యింది. వివరాల ప్రకారం.. ఉత్తర ఇరాక్‌లోని ఇర్బిల్ పట్టణంలో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయ భవనం వైపు దాదాపు 12 మిస్సైల్స్ దూసుకొచ్చినట్లు అమెరికా భద్రతా వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇరాన్‌కు సమీప దేశాల నుంచి మిస్సైల్స్ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. మిస్సైల్ దాడుల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అమెరికా భద్రతా సిబ్బంది ఒకరు మీడియాకు చెప్పారు. అయితే, ఈ దాడులపై బైడెన్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఈ దాడులు ఎవరు చేశారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ దాడులను ఖండిస్తున్నట్టు ఇరాన్ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. మిస్సైల్స్ దాడుల వల్ల అమెరికా రాయబార కార్యాలయం పరిసరాల్లో మాత్రమే నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే అది కొత్త భవనమని అందులో ప్రస్తుతానికి ఎవరూ ఉండటం లేదని సమాచారం. -
1485 ఎకరాల్లో అతి పేద్ద శ్మశానం.. ఇప్పటివరకు 50 లక్షల మృతదేహాలు..
World's largest cemetery where more than 5 million dead people are buried: ఈ సృష్టిలో నా అంతటి వాడులేడని విర్రవీగే మనిషి.. కట్టుబట్టలతో మాత్రమే తన చివరి మజిలీని చేరుకుంటాడనే విషయం అందరికీ తెలిసిందే.! ఐనా ఎత్తుకు పైఎత్తులు వేసి మరొకరిని చిత్తుచేయాలనే కుబుద్ధి ఎన్ని జన్మలెత్తినా మారదు. అంత పోరాటం చేసి చివరికి చేరేది అంతశయ్యకే..! జీవన్మరణాలు ఎంత విచిత్రమైనవో స్మశానాన్ని చూస్తే అర్ధమవుతుంది. తారతమ్య భేదాలు లేకుండా ఒకే చోట ఖననం అవుతారు. ప్రేతభూమి మహత్యమదే!! ఎంతటివారినైనా కాదనకుండా తనలో ఇముడ్చుకుంటుంది. ఐతే ప్రతి ఊరిలో ఒక శ్మశానవాటిక తప్పక ఉంటుంది. సాధారణంగా రెండు మూడు ఎకరాల్లో శ్మశానవాటికలు ఉంటాయి. ఆ దేశంలో వేల ఎకరాల్లో ఒక శ్మాశానవాటిక ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానవాటికది.. ఎక్కడుందో తెలుసా! వారికి చాలా ప్రత్యేక స్థలమిది! ఇరాక్ దాదాపు 1485 ఎకరాల్లో ఉంటుందీ శ్మశానం. ఇప్పటివరకూ 50 లక్షల మృతదేహాలను ఖననం చేసిన ఈ శ్మశాన వాటిక చూపరులకు ఓ మహానగరాన్ని తలపించేలా ఉంటుంది. ‘వాడీ ఉస్ సలామ్’ అని ఈ శ్మశానాన్ని పిలుస్తారు. దీనికి ‘వ్యాలీ ఆఫ్ పీస్’ అనే మరోపేరు కూడా ఉంది. రోజుకు కనీసం రెండు వందలకుపైగా మృతదేహాలను ఖననం చేస్తారిక్కడ. షియా ముస్లీంలకు ఈ శ్మశానం చాలా ప్రత్యేకమైనది. ప్రపంచంలో షియాలు ఎక్కడున్నా మరణించిన తర్వాత వారిని, వారి కుటుంబ సభ్యుల మృతదేహాలను ఇక్కడే ఖననం చేయాలని కోరుకుంటారట. ఆ యుద్ధకాలంలో అధిక సంఖ్యలో.. ఇది చాలా పురాతనమైన శ్మశానవాటిక. గత 1400 యేళ్ల నుంచి ఈ శ్మశానంలో ఖననాలు జరుగుతున్నాయి. 18వ శతాబ్ధంలో ఇరాన్ - ఇరాక్ మధ్య జరిగిన యుద్ధంలో మరణించిన వారిని ఇక్కడ ఖననం చేయడంలో ఒక్కసారిగా సమాధుల సంఖ్య పెరిగింది. ఇరాన్‌తో యుద్ధ సమయంలో రోజుకు 250 మృతాదేహాలను ఖననం చేసేవారట. 19వ శాతాబ్ధంలో జరిగిన గల్ఫ్ యుద్ధ సమయంలో ఈ శ్మశానవాటికలో ఉగ్రవాదులు దాగడం మూలంగా అనేక సమాధులను ఇరాక్ సైన్యం పడగొట్టారు. వందల వేల మృతదేహాలను ఈ యుద్ధ కాలంలో ఖననం చేశారిక్కడ. శ్మశానికి కూడా కథలుంటాయని, వాటికీ చరిత్ర ఉంటుందనడానికి వాడీ ఉస్ సలామ్ ఓ ఉదాహరణ. చదవండి: Viral Video: డ్యామిట్!! కథ అడ్డం తిరిగింది! మూడున్నర అడుగుల పామును అమాంతం మింగిన చేప.. -
ఇరాక్ ప్రధానిపై హత్యాయత్నం
బాగ్దాద్: ఇరాక్ ప్రధానమంత్రి ముస్తఫా–అల్–కదిమి హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆదివారం వేకువజామున కదిమి నివాసమే లక్ష్యంగా సాయుధ డ్రోన్లతో దాడి జరిగిందని, ఆయనకు ఎటువంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు. గత నెలలో వెలువడిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ఇరాన్ మద్దతుగల మిలీషియాలు తిరస్కరించడంతో తలెత్తిన ఉద్రిక్తతలకు తాజా ఘటన ఆజ్యం పోసినట్లయింది. ప్రభుత్వ ఆఫీసులు, దౌత్య కార్యాలయాలతో అత్యధిక భద్రతా ఏర్పాట్లుండే గ్రీన్ జోన్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ప్రధాని నివాసంపై పేలుడు పదార్థాలు నిండిన రెండు డ్రోన్లతో జరిగిన దాడిలో కదిమి భద్రతా సిబ్బంది ఏడుగురు గాయపడినట్లు పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఇద్దరు అధికారులు అసోసియేటెడ్ ప్రెస్‌కు తెలిపారు. ‘దేవుని దయవల్ల నేను, నా ప్రజలు క్షేమంగా ఉన్నాం’అని ప్రధాని కదిమి దాడి అనంతరం ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా, దాడికి బాధ్యత తమదేనంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. ఇరాక్ ప్రధానిపై డ్రోన్ దాడిని అమెరికా, ఈజిప్టు, యూఏఈ ఖండించాయి. దేశంలో అక్టోబర్ 10వ తేదీన పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల నిర్వహణపై ఐరాస భద్రతామండలి కూడా హర్షం వ్యక్తం చేసింది. ఇరాన్ మద్దతున్న మిలీషియా గ్రూపులు మాత్రం రీకౌంటింగ్ చేపట్టాలంటూ గ్రీన్‌జోన్‌కు సమీపంలో టెంట్లు వేసుకుని నిరసనలు సాగిస్తున్నాయి. -
ఇరాక్ ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి
బాగ్దాద్: ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్ కధిమి నివాసంపై డ్రోన్ దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్ ఆదివారం తెల్లవారుజామున బాగ్దాద్‌లోని ప్రధాని నివాసాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇరాక్ ప్రధాని కధిమి ఈ డ్రోన్ దాడి నుంచి తప్పించుకున్నారు. ఇరాక్ మిలటరీ దీన్ని హత్యాప్రయత్నమని పేర్కొంది. బాగ్దాద్‌లోని పటిష్టమైన గ్రీన్జోన్లో ఉన్న కధిమి నివాసమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ఇరాక్ మిలిటరీ ఓ ప్రకటనలో తెలిపింది. 'నేను క్షేమంగా ఉన్నాను, అంతా ప్రశాంతంగా ఉండాలని' కధిమి తన అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు దాడికి తామే బాధ్యులమని ఏ సంస్థ ప్రకటించలేదు. చదవండి: (పునీత్ రాజ్‌కుమార్‌కు మొదట వైద్యం చేసిన డాక్టర్ ఇంటికి భారీ బందోబస్తు) -
అపహరణకు గురైన ఇరాక్ పురాతన శాసనాన్ని తిరిగి ఇచ్చేశాం!
వాషింగ్టన్: మూడు దశాబ్దాల క్రితం అపహరణకు గురైన గిల్గమేశ్ అనే ఇరాక్ పురాణ ఇతిహస కథలకు సంబంధించిన శిలాశాసనాన్ని(టాబ్లెట్) వాషింగ్టన్ వేడుకల సందర్భంగా అమెరికా తిరిగి ఇరాక్‌కి అందజేసింది. ఈ మేరకు ఇరాక్ సాంస్కృతిక శాఖ మంత్రి హసన్ నజీమ్ ఆ టాబ్లెట్‌ని స్వీకరించారు. దీంతో ఇరాక్ సమాజం పట్ల నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించగలిగమంటూ... హర్షం వ్యక్తం చేశారు. (చదవండి: ఒక్క రోజులోనే కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు...!) చిన్నపరిమాణంలో ఉన్న పురాతన రాతి శాసనం(టాబ్లెట్) అయినప్పటికీ, ఇది అత్యంత విలువైన చారిత్రక కళా సాంస్కృతిక సంపదగా హజీమ్ పేర్కొన్నార. అంతేకాదు అత్యంత పురాతన సాహిత్య రచనలలో ఒకటిగా పరిగణించే గిల్గమేశ్ ఇతిహాసానికి సంబంధించిందని చెప్పారు. ఇది అమరత్వం కోసం తపనతో ఉన్న మొసపటోమియో రాజు కథను వివరిస్తోందన్నారు. అన్నిమతాల సారాంశం ఏకేశ్వరోపాసన(ఒక్కడే దేవుడు అనే సిద్ధాంతం)ని గురించి నొక్కి చెప్పేలా ఉంటుందని యునెస్కో(ఐక్యరాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సమితి) డైరెక్టర్ ఆండ్రీ అజౌలే అన్నారు. ఈ ఇతిహసం మానవత్వానికి నిధిగా ఆండ్రీ అజౌలే అభివర్ణించారు. ఈ రాతి శాసనాన్ని(టాబ్లెట్) తన స్వస్థానానికి చేర్చటంతో వారసత్వాన్ని నాశనం చేసే అంతర్జాతీయ సమాజంపై సాధించిన ప్రధాన విజయంగా ఆమె పేర్కొన్నారు. ఇది ఇతిహాసాల సారాంశాన్ని తెలియజేసే శాసనం(టాబ్లెట్) అని యూఎస్ అసిస్టెంట్ అటర్నరీ జనరల్ కెన్నిత్ పోలిట్ అన్నారు. 1991లో గల్ఫ యుద్ధంలో ఈ శాసనం ఇరాక్ మ్యూజియం నుంచి అపహరణకు గురై తిరిగి మళ్లీ బ్రిటన్‌లో కనిపించింది. లండన్‌కి చెందిన జోర్డాన్ కుటుంబం నుంచి అమెరికన్ ఆర్ట్ డీలర్ ఈ టాబ్లెట్‌ని కొనుగోలు చేశాడు. 2007లో దీన్ని తప్పుడు ధృవీకరణ పత్రంతో విక్రయించారు. తదనంతరం మరోసారి 2014లో క్రాఫ్ట్ చైన్ యజమాని హబీ లాబీ, నుంచి వాషింగ్టన్ లోని బైబిల్ మ్యూజియంలో రాయిని ప్రదర్శించాలనుకునే ఫండమెంటలిస్ట్ క్రైస్తవులకు విక్రయించారు. 2017లో ఈ టాబ్లెట్ అసంపూర్ణంగా ఉందని ఆందోళన చెందారు. ఆ తర్వాత 2019లో దీనిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఈ తరుణంలో అపహరణకు గురైన పురాతన కాలంనాటి వారసత్వ సంపదలను వెలికితీయాలంటూ ప్రపంచదేశాలకు ఇరాక్ సాంస్కృతిక శాఖ మంత్రి హసన్ నజీమ్ పిలుపునిచ్చారు. అంతేకాదు అన్ని యూనివర్సిటీలు, మ్యూజియంలు, ఇనిస్టిట్యూట్లు పురాతన వస్తువులు సేకరించే వారు వారసత్వ సంపద అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేసేలా అందరూ కృషి చేయాలన్నారు నజీమ్. గత నెలలో చిన్న చిన్న పరిమాణంలోని 17 వేల పురాతన కళాఖండాలు ఇరాక్‌కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ముక్కలు ఎక్కువగా దాదాపు 4వేల సంవత్సరాల క్రితంలోని సుమేరియన్ కాలం నాటివి. (చదవండి: పియానో బామ్మ కొత్త ఆల్బమ్.. 107లో సిక్సర్) -
రెచ్చిపోయిన ఉగ్రవాదులు: పోలీస్ శిబిరంపై బాంబు దాడి
బాగ్దాద్: ఐసిస్ ఉగ్రదాడులు రెచ్చిపోయారు. తమ ఆట కట్టించేందుకు పని చేస్తున్న పోలీసులను మట్టుబెట్టారు. పోలీసులే లక్ష్యంగా బాంబు దాడి జరిపారు. ఈ ఘటనలో ఏకంగా 13 మంది పోలీసులు కన్నుమూశారు. దీంతో ఇరాక్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఆ దేశంలోని కిర్కుక్ పట్టణానికి 65 కిలోమీటర్ల దూరంలోని అల్ రషద్ ప్రాంతంలో అర్ధరాత్రి ఈ దారుణ సంఘటన జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న ఫెడరల్ పోలీస్ చెక్‌పోస్టుపై ఇస్లామిక్ స్టేట్ ఆర్గనైజేషన్ ఉగ్రవాదులు బాంబు దాడి జరిపారు. ఈ ఘటనలో భద్రతా దళాలకు చెందిన 13 మంది మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారని ఆ దేశ భద్రత అధికారి వెల్లడించారు. వారి దాడుల నేపథ్యంలో ఆ దేశంలో హై అలర్ట్ ప్రకటించారు. చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక చదవండి: తండ్రిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు.. సమర్ధించిన ముఖ్యమంత్రి -
ఈద్ లక్ష్యంగా ఆత్మాహుతి దాడి.. రద్దీతో భారీగా మృతులు
-
భారీ పేలుడు.. రద్దీమార్కెట్ మొత్తం రక్తసిక్తం
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో మరో మారణ హోమం చోటు చేసుకుంది. ఈద్ లక్క్ష్యంగా చేసుకుని భారీ కుట్రకు పాల్పడ్డారు మిలిటెంట్లు. బాగ్దాద్ శివారు నగరం సద్ర్‌లోని ఓ రద్దీ మార్కెట్లో భారీ బాంబు పేలుడుకు పాల్పడగా.. ఆ ప్రాంతం రక్తపు ముద్దలతో భీకరంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటిదాకా 35 మంది చనిపోగా, 60 మందికిపైగా గాయపడ్డారు. సద్ర్ సిటీ వహాయిలత్ మార్కెట్లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బక్రీద్ కోసం మార్కెట్లకు క్యూ కట్టిన జనాలను లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. రద్దీ మార్కెట్ కావడంతో ఎటు చూసినా తెగిపడిన అవయవాలు, రక్తపు ముద్దలే కనిపిస్తున్నాయి. మృతుల్లో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నారు. గాయపడ్డ వాళ్లలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఘటనకు స్థానికంగా తయారుచేసిన పేలుడు పదార్థాన్నే ఉపయోగించినట్లు అధికారులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే ఈ దాడి తమ పనేనని ఐఎస్ఐఎల్(ఐఎస్ఐఎస్) ప్రకటించుకుంది. ఇరాక్ అధ్యక్షుడు బర్హమ్ సాలి ఈ దాడిని ‘క్రూరమైన నేరం’గా అభివర్ణించాడు. కాగా, ఈ ఏడాదిలో ఈ తరహా దాడి ఇది మూడోది. మరోవైపు సోషల్ మీడియాలో ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. -
ఇరాక్‌లో ఘోరం: అగ్నిప్రమాదంలో 92 మంది బుగ్గి
బాగ్దాద్: ఇరాక్‌లోని నసిరియా నగరంలోని కోవిడ్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 92 మంది మరణించారు. మరో 100 మందికి పైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. అల్ హుస్సేన్ టీచింగ్ ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో సోమవారం రాత్రి అగ్ని కీలలు చెలరేగడంతో రోగులు మంటల్లో చిక్కుకొని ఎటూ వెళ్లే వీల్లేక ప్రాణాలు కోల్పోయారు. అగి్నమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పడానికి రాత్రంతా శ్రమించారు. మంగళవారం ఉదయం చూసేసరికి కాలిన మృత దేహాలు, దట్టమైన పొగ, ఎటు చూసినా రోగులు, బంధువుల రోదనలే కనిపించాయి. తమ వాళ్లు ఎలా ఉన్నారో తెలీక బంధువులు ఏడుస్తూ కలియతిరగడం కనిపించింది. ప్రభుత్వ నిర్లక్ష్య పూరిత వైఖరి కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవస్థలన్నీ విఫలమవడంతో సామాన్యులు మూల్యం చెల్లించాల్సి వస్తోందని విమర్శించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియలేదు. కొందరు అధికారులు ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని చెబితే, మరికొందరు ఆక్సిజన్ సిలండర్ పేలడంతో ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఈ ఆస్పత్రిలో కరోనా వార్డుని 70 పడకలతో మూడు నెలల క్రితమే ప్రారంభించారు. గత ఏప్రిల్‌లో బాగ్గాద్‌లోని ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 82 మంది మరణించిన విషయం తెలిసిందే. -
కొవిడ్ వార్డులో ఘోర ప్రమాదం
-
కొవిడ్ వార్డులో ఘోర ప్రమాదం.. ఆహుతైన 52 మంది!
Iraq Covid Ward Fire బాగ్దాద్: ఇరాక్‌లో ఓ ఆస్పత్రి కొవిడ్ వార్డులో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 52 మంది చనిపోగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవాళ్లంతా కరోనా పేషెంట్లేనని అధికారులు ధృవీకరించారు. కాగా, మంటలు, పొగ దట్టంగా అలుముకోవడంతో ప్రమాద తీవ్రత మరింతగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇరాక్ నస్రీయా నగరంలోని అల్ హుస్సేయిన్ ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది. ఆక్సిజన్ ట్యాంకర్లు పేలడంతోనే ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో ఐసోలేషన్ వార్డులో ఉన్న పేషెంట్లంతా మంటల్లో చిక్కుకుని హాహా కారాలు చేశారు. అర్ధరాత్రి సమయం కావడంతో ఒకరిద్దరు నర్సులు తప్ప విధులు ఎవరూ లేరు. దీంతో వాళ్లను రక్షించే ప్రయత్నాలు ఫలించలేదు. కాగా, ఆ వార్డులో కెపాసిటీ 70 పడకలుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇరాక్‌లో గత మూడునెలల్లో ఇలాంటి ఘటన రెండోది ఇది. ఏప్రిల్‌లో రాజధాని బాగ్దాద్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో 82 మంది మరణించగా.. 110 మంది గాయపడ్డారు. ఇక నస్రీయా ఘటన తర్వాత భారీగా ఆస్పత్రి ముందుకు చేరుకున్న జనాలు.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడలేని ప్రభుత్వం అంటూ నిరసన వ్యక్తం చేశారు. -
Fact Check: ఆ సైనికుడి కన్నీళ్లు ఉత్తవే!
ఓవైపు తుపాకుల మోత. ఆ బుల్లెట్ల శబ్దాల మధ్యే ఓ సైనికుడు తన సెల్‌ఫోన్ తీస్తాడు. ఇక ఇంటికి తిరిగొచ్చే అవశాలు లేవని, అమ్మను జాగ్రత్తగా చూసుకోమని సోదరుడికి చెప్తూనే.. ‘అమ్మా.. ఇక సెలవు’ అంటూ ముద్దులతో వీడియో కట్ చేస్తాడు. ఎమోషనల్ వీడియోగా ఇది సోషల్ మీడియాలో ఇది బాగా సర్క్యూలేట్ అవుతోంది. కన్నీటి రియాక్షన్లు చాలానే వస్తున్నాయి. ఐసిస్‌తో పోరాటంలో ఆ ఇరాక్ సైనికుడు ఈ వీడియో తీశాడని బాగానే ప్రచారం చేశారు. కట్ చేస్తే... 2015లో 17 నిమిషాల నిడివి ఉన్న ‘డయలింగ్’ అనే షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యింది. ఈ షార్ట్ ఫిల్మ్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ కావడంతో పాటు ప్రశంసలు అందుకుంది కూడా. ఈ ఇరాకీ షార్ట్ ఫిల్మ్‌కు బహా అల్ కజెమి అనే వ్యక్తి డైరెక్టర్‌గా వ్యహరించాడు. తాజాగా వైరల్ అయిన వీడియో.. ఆ షార్ట్ ఫిల్మ్లోనిదేనని క్లారిటీ ఇస్తూ అతను పోస్ట్ పెట్టాడు. ఇది అసలు ఫ్యాక్ట్ చెక్. విషాదాంతంగా ఉండే ఈ షార్ట్ ఫిల్మ్‌లో ఒక సైనికుడి వీరమరణం.. అతని రాక కోసం ఎదురు చూసే తల్లి చివర్లో గుండె పగిలిపోవడం కథాంశంగా ఉంటుంది. ఇక ఈ షార్ట్ ఫిల్మ్‌లో నటించిన మెన్హెల్ అబ్బాస్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియోను పోస్ట్ చేసి.. వైరల్ వీడియో నిజంది కాదని, తన షార్ట్ ఫిల్మ్దని క్లారిటీ ఇచ్చాడు. చదవండి: ఆ అమ్మాయిని అసభ్యంగా తాకింది ఎవరంటే.. -
మంటల్లో కోవిడ్ ఆస్పత్రి.. 82 మంది మృతి
బాగ్దాద్: మహారాష్ట్రలోని కోవిడ్ ఆస్పత్రుల్లో ప్రమాదాలు స్ఫురించేలా ఇరాక్‌లోని బాగ్దాద్‌లో కూడా ఘోరం జరిగింది. బాగ్దాద్‌లోని ఇబన్ అల్‌ఖతీబ్ ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 82 మంది మృతి చెందారు. మరో 110 మంది కాలిన గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కరోనా బాధితుల కోసం ఉంచిన ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో ఆస్పత్రిలో మంటలు వ్యాపించాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉన్న అంతస్తులోనే ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో వెంటిలేటర్ మీద ఉన్న 28 మంది రోగులు మంటలకి ఆహుతయ్యారు. మరికొందరు దట్టంగా వ్యాపించిన పొగతో ఊపిరాడక మరణించారు. ఈ ఘటన నిర్లక్ష్యం కారణంగా జరిగిందని తేలడంతో ఆరోగ్య మంత్రి హసన్ అల్ తమిమీని ప్రధాని సస్పెండ్ చేశారు. ప్రమాదం సమయంలో ఆస్పత్రిలో హృదయ విదారక సన్నివేశాలు కనిపించాయి ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్న కొందరు రోగులు వాటిని తీసేసి పరుగులు పెట్టే దృశ్యాలు మనసుల్ని కలిచివేశాయి. రోగుల కోసం వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు కూడా మంటల్లో చిక్కుకున్నారు. ఆ ఆçస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగితే రక్షించే వ్యవస్థ లేకపోగా, ఫాల్ సీలింగ్‌లో వినియోగించిన సామగ్రితో మంటలు మరింత విస్తృతంగా వ్యాపించాయని దేశ మానవ హక్కుల కమిషన్ అధికార ప్రతినిధి అలీ అల్–బయతి చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తేవడానికి కొన్ని గంటల సేపు శ్రమించారు. దాదాపు 200 మంది ప్రాణాలను కాపాడారు. -
అరబ్ దేశంలో పోప్ ఫ్రాన్సిస్ చారిత్రక పర్యటన
ఉర్: కేథలిక్ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్(84) అరబ్ దేశం ఇరాక్‌లో మొట్టమొదటిసారిగా పర్యటిస్తున్నారు. శనివారం ఆయన ఇరాక్‌లోని పవిత్ర నగరం నజాఫ్‌లో షియాల గ్రాండ్ అయతొల్లా అలీ అల్– సిస్తానీ(90)తో భేటీ అయ్యారు. ఈ చారిత్రక సమావేశంలో ఇరువురు మతపెద్దలు శాంతియుత సహజీవనం సాగించాలని ముస్లింలను కోరారు. ఇరాక్‌లోని క్రైస్తవులను కాపాడుకోవడంలో మతాధికారులు కీలకపాత్ర పోషించాలని, ఇతర ఇరాకీయుల మాదిరిగానే వారు కూడా సమానహక్కులతో స్వేచ్ఛగా జీవించాలని గ్రాండ్ అయతొల్లా అలీ అల్– సిస్తానీ ఆకాంక్షించారు. తన వద్దకు వచ్చేందుకు శ్రమ తీసుకున్న పోప్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత బలహీనవర్గాలు, తీవ్ర వేధింపులకు గురయ్యే వారి పక్షాన గళం వినిపించినందుకు పోప్ ఫ్రాన్సిస్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారని వాటికన్ పేర్కొంది. ఇరాక్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియాలు గౌరవించే మత పెద్దల్లో అల్ సిస్తానీ ఒకరు. అల్ సిస్తానీ నివాసంలో జరిగిన ఈ భేటీకి కొన్ని నెలల ముందు నుంచే అయతొల్లా కార్యాలయం, వాటికన్ అధికారుల మధ్య తీవ్ర కసరత్తు జరిగినట్లు సమాచారం. గ్రాండ్ అయతొల్లా భేటీతో ఇరాక్‌లోని షియా సాయుధ ముఠాల వేధింపుల నుంచి క్రైస్తవులకు భద్రత చేకూర్చడం, క్రైస్తవుల వలసలను నిరోధించడమే పోప్ ఫ్రాన్సిస్ పర్యటన ఉద్దేశంగా భావిస్తున్నారు. 40 నిమిషాల సేపు చర్చలు పోప్ ఫ్రాన్సిస్ శనివారం బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్ బెంజ్ కారులో నజాఫ్‌కు బయలుదేరి వెళ్లారు. షియాలు అత్యంత పవిత్రంగా భావించే ఇమామ్ అలీ సమాధి ఉన్న రసూల్ వీధిలోని అల్ సిస్తానీ నివాసానికి కాలినడకన చేరుకున్నారు. అక్కడ, ఆయనకు సంప్రదాయ దుస్తులు ధరించిన కొందరు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పోప్ శాంతి చిహ్నంగా పావురాలను గాలిలోకి వదిలారు. పోప్ తన షూస్ వదిలేసి అల్ సిస్తానీ ఉన్న గదిలోకి ప్రవేశించారు. సందర్శకుల రాక సమయంలో సాధారణంగా తన సీట్లో కూర్చుని ఉండే అల్ సిస్తానీ లేచి నిలబడి, పోప్ ఫ్రాన్సిస్‌ను తన గదిలోకి ఆహ్వానించారనీ, ఇది అరుదైన గౌరవమని చెప్పారు. మాస్కులు ధరించకుండానే ఇరువురు పెద్దలు దగ్గరగా కూర్చుని మాట్లాడుకున్నారని చెప్పారు. వారి భేటీ సుహృద్భావ వాతావరణంలో 40నిమిషాల పాటు సాగిందని నజాఫ్‌కు చెందిన అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అల్ సిస్తానీయే ఎక్కువ సేపు మాట్లాడారన్నారు. ఫ్రాన్సిస్‌కు టీ, బాటిల్ నీళ్లు అందజేయగా, ఆయన నీరు మాత్రమే తాగారని చెప్పారు. అయితే, ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న పోప్.. శుక్రవారం బాగ్దాద్‌లో పలువురితో సమావేశం కావడం, అల్ సిస్తానీ కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోవడం నేపథ్యంలో కొంత ఆందోళన వ్యక్తమైందని కూడా ఆయన అన్నారు. అనంతరం ఆయన పురాతన ఉర్ నగరంలో సర్వమత సమ్మేళానికి వెళ్లారు. అక్కడ, మత పెద్దలంతా గౌరవపూర్వకంగా లేచి నిలబడి ఆయనకు స్వాగతం పలికారు. మాస్కు ధరించి పోప్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇరాక్‌లోని ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతాల వారు శతాబ్దాలుగా ఉన్న వైరాన్ని మరిచి శాంతి, ఐక్యతల కోసం కృషి చేయాలని ఆయన కోరారు. క్రైస్తవులు, ముస్లింలు, యూదుల విశ్వాసాలకు మూలపురుషుడిగా భావించే అబ్రహాం జన్మించింది ఉర్లోనే కావడం విశేషం. శుక్రవారం ఇరాక్ చేరుకున్న పోప్ ఫ్రాన్సిస్ మొదటి రోజు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలయ్యాక పోప్ చేపట్టిన మొదటి పర్యటన ఇదే. గ్రాండ్ అయతొల్లాతో భేటీ అయిన మొదటి పోప్ కూడా ఆయనే. పోప్ రాక సందర్భంగా నజాఫ్‌లో 25 వేల మంది బలగాలు భారీ బందోబస్తు చేపట్టాయి. -
ఆత్మాహుతి దాడులు: 13 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ ఆత్మాహుతి దాడులలో దద్దరిల్లింది. గురువారం చోటు చేసుకున్న వరుస సూసైడ్ ఎటాక్స్‌లో పలువురు ప్రాణాలు కోల్పోగా అనేకమంది గాయాల పాలయ్యారు. సెంట్రల్ బాగ్దాద్‌లో రెండు ఆత్మాహుతి పేలుళ్లు కలకలం సృష్టించాయి. తాయరన్ స్క్వేర్‌లో రద్దీగా ఉన్న మార్కెట్ వద్ద ఇద్దరు వ్యక్తులు తమను తాము బాంబులతో పేల్చుకున్న ఘటనలో 13 మంది మృతి చెందారని ప్రాథమిక నివేదికలు ద్వారా తెలుస్తోంది. మరో 30 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్తానిక పోలీసులు వెల్లడించారు. ఇరాక్ రాజధానిలో నగరంలో 2017 తరువాత ఇదే అదిపెద్ద దాడి అని భావిస్తున్నారు. -
ట్రంప్‌కు మరో షాక్ : అరెస్ట్ వారెంట్
బాగ్దాద్: మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవికి గుడ్‌బై చెప్పనున్న డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. ఇరాన్ సైనికాధికారిని హత్య కేసులో ఇరాక్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జనరల్ ఖాసిమ్ సులేమాని, అబూ మహదీ అల్ ముహండిస్‌లను హతమార్చిన డ్రోన్‌దాడిపై దర్యాప్తు చేయాల్సిందిగా బాగ్దాద్ కోర్టు జడ్జ్ ఆదేశించారు. అబూమహదీ అల్ ముహండిస్ కుటుంబంనుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసిన తరువాత వారెంట్ జారీ చేసే నిర్ణయం జరిగిందని, హత్యలపై దర్యాప్తు కొనసాగుతోందని సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ గురువారం వెల్లడించింది. బాగ్దాద్‌లో గత ఏడాది జనవరి 3న వైమానిక దాడిలో జనరల్ ఖాసిం సులేమానిని హతమార్చిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే ఈ కేసులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు మరో 47 మంది ఇతర అమెరికన్ అధికారులను అదుపులోకి తీసుకునేందుకు సహకరించాలంటూ ఇరాన్ ఇంటర్‌పోల్‌ను కోరింది. ట్రంప్ అధ్యక్ష పదవీకాలం ముగిసినా ట్రంప్‌ను వదిలేది లేదని ఇరాన్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. -
ఇరాక్ ఆర్మీ స్థావరంపై ముష్కర దాడి
బాగ్దాద్ : ఇరాక్‌పై ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పశ్చిమ బాగ్దాద్‌లోని ఇరాక్ ఆర్మీ స్థావరంపై సాయుధులైన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో11 మంది పౌరులు మరణించారు. సైన్యం సహా మొత్తం 8మంది గాయాలపాలయ్యారని పోలీసు, వైద్య వర్గాల నుంచి సమాచారం. అల్-రద్వానియా ప్రాంతంలోని ఆర్మీ స్థావరంపై జరిగిన దాడిలో దుండగులు గ్రేనెడ్, అధునాతన ఆయుధాలను వాడినట్టు తెలుస్తోంది. ఈ దాడి పాల్పడిన ఉగ్రవాదులు నాలుగు వాహనాల్లో వచ్చారని తెలుస్తోంది. ఉగ్రదాడిపై స్పందించిన ‘ఇరాక్ మిలిటరీ దాడి జరిగింది. ప్రభుత్వ మద్దతు ఉన్న సున్నీ మిలిషియా ఆర్మీపైనా అని ఇందులో నలుగురు మరణించారు. ముగ్గురు గాయపడ్డార’ని అధికార వర్గాలు తెలిపాయి. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం ఆర్మీ, పోలీసు బృందాలు అపరేషన్ మొదలెట్టినట్టు పోలీసు వర్గాల సమాచారం. -
పిల్లికూతల మధ్య పులి
దక్షిణాది ఇరాక్‌లో పురుషులకు పని చేసే తొలి బార్బర్‌గా జైనబ్ వార్తలకెక్కింది. స్త్రీలు కొత్త ఉపాధి మార్గాల్లో పయనించడం తెలుసు. అయితే అవన్నీ దాదాపుగా సామాజిక అంగీకారం ఉన్న ఉపాధి మార్గాలే. పురుషులకే పరిమితం వంటి ఉపాధి మార్గాల్లో స్త్రీలు ప్రవేశించినప్పుడు వారికి వ్యతికరేకత రావడం సహజం. ఇక ఇరాక్ వంటి దేశంలో ముస్లిం స్త్రీలకు ఇది ఎక్కువ సవాలు కావచ్చని అనుకుంటాం. కాని జైనబ్ ఆ సవాళ్లను ఎదిరించి నిలుచుంది.ఇరాక్‌లోని బాబిలోన్ ప్రాంతంలో ఉండే ‘హిల్లా’ పట్టణంలో జైనబ్ ఒక సంచలనం సృష్టించినట్టే లెక్క. ఎందుకంటే ఆమె హిజాబ్ ధరించి ఆ పట్టణంలోని బార్బర్ షాప్‌లో పురుషులకు హెయిర్ కట్ చేస్తుంది. కోరిన వారికి ఫ్యాన్సీ పచ్చబొట్లను కూడా పొడుస్తుంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన జైనబ్ ఇలాంటి పురుషుల ఉపాధిలోకి రావడం అక్కడి పురుషులకు మింగుడు పడలేదు.‘నేను షాపుకు నడిచినంత సేపు నా వెనుక పిల్లికూతలు కూసి హేళన చేసిన వారే అంతా’ అంది జైనబ్.కాని ఆమె అదంతా పట్టించుకోకుండా పని చేయడం మొదలెట్టింది. ‘నా స్నేహితురాళ్లకు ఇదే చెబుతుంటాను. మనం ఉన్నది ఇంట్లో కూచుని గుడ్లు పెట్టడానికి కాదు అని’ అంటుందామె. జైనబ్ పని చేసే కొద్దీ ఆమెను గౌరవించి తల అప్పగించడానికి వచ్చే పురుషులు పెరిగారు. ‘నాకంటూ కొంతమంది కస్టమర్లు ఏర్పడ్డారు’ అంటుంది జైనబ్ సంతృప్తిగా. ఆమెకు సెలూన్ ఓనర్ గట్టి మద్దతుగా నిలిచాడు. ‘కొందరు మత పెద్దలు వచ్చి ఇందుకు అభ్యంతరం చెప్పారు. నేను పట్టించుకోలేదు. ఇరాక్ నవ నిర్మాణంలో స్త్రీలు కూడా ముఖ్య భూమిక పోషించేలా మనం వారిని ప్రోత్సహించాలి కదా’ అన్నాడతను.హిజాబ్‌ను ఒక అస్తిత్వంగా భావిస్తూ హిజాబ్‌తోనే ఉద్యోగ ఉపాధి రంగాల్లో కొనసాగాలనే స్త్రీలు భారతదేశంలో ఉన్నారు. -
అమ్మకానికి సద్దాం హుస్సేన్ ఫోటో
వాషింగ్టన్: ఇరాక్ మాజీ అధ్యక్షుడు, నియంత సద్దాం హుస్సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ ఇరాకీ నేత ఫోటోను ఓ అమెరికన్ ఈ కామర్స్ సైట్ అమ్మకానికి పెట్టింది. పైగా డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తోంది. వివరాలు.. అమెరికాకు చెందిన ఈ కామర్స్ సైట్ ‘విష్’లో సద్దాం ఫోటోను అమ్మకానికి ఉంచింది. ధరను 20 డాలర్లుగా నిర్ణయించింది. పైగా డిస్కౌంట్‌ను కూడా ప్రకటించింది. ‘అన్ని ప్రొడక్ట్స్‌పై 60-80శాతం డిస్కౌంట్ లభించనుంది’ అంటూ విష్ ప్రమోట్ చేసిన యాడ్‌లో సద్దాం హుస్సేన్ ఫోటో కూడా ఉంది. దానిపై రేటు 20 డాలర్లుగా నిర్ణయించబడింది. ఇది చూసిన నెటిజనులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ‘సద్దాం హుస్సేన్‌ను ఎవరు కొనాలనుకుంటున్నారు.. అది కూడా కేవలం 20 డాలర్లకే’ అంటూ కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి ఇది సద్దాం ఫోటో కాపీ. అమెరికా సేనలకు పట్టుబడిన తర్వాత తీసిన సద్దాం ఫోటోను ప్రీమియం హెవీ స్టాక్ పేపర్లో రీప్రింట్ చేశారు. పైగా ‘దీన్ని ఉరి తీయవచ్చు లేదా ప్రేమ్ కట్టించుకోవచ్చు’ అంటూ ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఇది తెగ ట్రెండ్ అవుతోది. Who wants to buy Saddam Hussein for $20? pic.twitter.com/4tTpgSRKLj — The State Of Selling (@StateOfSelling) August 27, 2020 1979 జూలై 16 నుంచి 2003 ఏప్రిల్ 9 వరకు ఇరాక్‌ను అప్రతిహతంగా పాలించిన సద్దామ్, 2003 లో అమెరికా ఆధ్వర్యంలో జరిగిన ఇరాక్ ఆక్రమణలో పదవి కోల్పోయాడు. యుద్ధానంతరం అమెరికా సేనలకు బందీగా పట్టుబడి, ఇరాక్ న్యాయస్థానంలో విచారణ తరువాత 2006 డిసెంబర్ 30 న ఉరితీయబడిన సంగతి తెలిసిందే. -
అమెరికాను దెబ్బకొట్టి తీరతాం: ఇరాన్
టెహ్రాన్: ఇరాన్ ఖుడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సులేమాని హత్యకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ పునరుద్ఘాటించారు. ఖాసీంను హతమార్చినందుకు అమెరికాను దెబ్బకొట్టి తీరతామని స్పష్టం చేశారు. ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్- కధిమితో మంగళవారం జరిగిన భేటీలో ఖమేనీ ఈ మేరకు వ్యాఖ్యలు చేసినట్లు ఆయన అధికారిక వెబ్సైట్ వెల్లడించింది. కాగా ఈ ఏడాది ప్రారంభంలో ఇరాన్ మద్దతున్న హిజ్బుల్ బ్రిగేడ్ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు.. ఇరాక్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేసిన విషయం విదితమే. ఇందుకు ప్రతీకారంగా అగ్రరాజ్యం.. జనవరి 3న ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో రాకెట్ దాడికి పాల్పడి.. ఇరాన్ జనరల్ సులేమానిని హతమార్చింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరుకోవడంతో పరస్పరం ప్రతీకార దాడులకు దిగాయి. (ట్రంప్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఇరాన్) ఈ క్రమంలోనే ఇరాన్లో ఉక్రెయిన్ విమానం కూలిపోగా 176 మంది మృత్యువాత పడ్డారు. తొలుత ఈ ఘటనతో తమకు సంబంధం లేదన్న ఇరాన్.. ఆ తర్వాత మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, తమను క్షమించాల్సిందిగా బాధితుల కుటుంబాలను అభ్యర్థించింది. అదే విధంగా సులేమానిని హతమార్చిన అమెరికా, అందుకు సహకరించిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సులేమాని గురించి అమెరికాకు సమాచారమిచ్చిన తమ పౌరుడిని ఉరి తీసేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఇరాన్ న్యాయ శాఖ గత నెలలో ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా... అమెరికా- చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతున్న వేళ ఇరాన్ డ్రాగన్‌తో దౌత్య సంబంధాలు మెరుగుపరచుకుంటూ భారీ ఒప్పందాలు చేసుకోవడం గమనార్హం. అదే విధంగా ఇరాక్‌తోనూ సత్సంబంధాలు కొనసాగించే దిశగా ప్రధానితో ఖమేనీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.(అమెరికాకు ఇరాన్ వార్నింగ్) -
త్వరలోనే అతడికి ఉరిశిక్ష అమలు: ఇరాన్
టెహ్రాన్: ఇరాన్ ఖుడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సులేమాని గురించి అమెరికాకు సమాచారమిచ్చిన తమ పౌరుడిని ఉరి తీసేందుకు రంగం సిద్ధమైనట్లు ఆ దేశ న్యాయ శాఖ వెల్లడించింది. ఖాసీం జాడ గురించి అమెరికా, ఇజ్రాయిల్ ఇంటలిజెన్స్‌కు తెలియజేసినందుకు త్వరలోనే అతడికి మరణ శిక్ష అమలు చేయనున్నట్లు మంగళవారం తెలిపింది. ఈ మేరకు ఇరాన్ జ్యుడిషియరి అధికార ప్రతినిధి ఘోలంహుసేన్ ఇస్మాయిలీ మాట్లాడుతూ.. ‘‘సీఐఏ(అమెరికా ఇంటలిజెన్స్ సంస్థ) గూఢాచారి మహ్మద్ మౌసావి- మాజిద్‌కు మరణ శిక్ష విధించారు. అమరుడైన సులేమాని జాడ గురించి శత్రువులకు అతడు సమాచారమిచ్చాడు’’ అని వెల్లడించారు. (అమెరికాకు ఇరాన్ వార్నింగ్) కాగా ఇరాన్ మద్దతున్న హిజ్బుల్ బ్రిగేడ్ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు.. ఈ ఏడాది ప్రారంభంలో ఇరాక్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేశారు. ఇందుకు ప్రతీకారంగా అమెరికా.. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో రాకెట్ దాడికి పాల్పడి.. ఇరాన్ జనరల్ సులేమానిని హతమార్చింది. దీంతో అమెరికాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన.. ఇరాన్.. ఇరాక్‌లో ఉన్న అమెరికా వైమానిక స్థావరాలపై డజనుకు పైగా క్షిపణులతో విరుచుకుపడింది. అప్పటి నుంచి ఇరు దేశాల నేతలు పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నారు.(ఇరాన్‌ను కుదిపేస్తున్న పరువు హత్య) ఇక తాజాగా తమ నావికా దళంలో ఇటీవల కొత్తగా అసుర- క్లాస్ స్పీడ్‌బోట్స్, జోల్ఫాఘర్ కోస్టల్ పెట్రోలింగ్ బోట్లు, తారేఘ్ సబ్మెరైన్లు వచ్చి చేరిన తరుణంలో అమెరికా కవ్వింపు చర్యలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరికలు జారీ చేసింది. సముద్రంలో తమ ఓడలకు అడ్డుతగిలితే ఇరాన్ నౌకలను ధ్వంసం చేయాలని ఆదేశాలిచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన నేపథ్యంలో.. ఇరాన్ ఈ మేరకు కౌంటర్ ఇచ్చింది. కాగా ఇరాన్- అమెరికా మధ్య దశాబ్దాల కాలంగా వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే.(విమానం పంపండి: ఇరాన్‌కు అమెరికా విజ్ఞప్తి!) -
కరోనా వేదన.. అరణ్య రోదన
మోర్తాడ్ (బాల్కొండ) : ఇరాక్‌లో తెలంగాణకు చెందిన వలస కార్మికులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అసలే అఖామా రెన్యువల్ కాక అవస్థలు పడుతున్న కార్మికులకు లాక్డౌన్ శరాఘాతంగా మారింది. ఉపాధి కోల్పోయి నివాస స్థలాలకే పరిమితమైన కార్మికులకు చేతిలో చిల్లిగవ్వ లేక పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. నెల రోజులుగా అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తుండటంతో మనోళ్లు దుర్భర జీవితం గడుపుతున్నారు. ఏం చేయాలో అర్థంకాక భయాందోళనతో జీవితం గడుపుతున్నారు. ఇరాక్‌లో తెలంగాణ జిల్లాల నుంచి వలస వెళ్లినవారు దాదాపు 13 వేల మంది కార్మికులు ఉంటారని అంచనా. గతంలో లక్ష మంది వరకు ఉండగా.. ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో ఈ మధ్యనే ఎంతో మంది ఇంటిబాట పట్టారు. ఎలాగైనా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయనే ఆశతో కొంత మంది అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఇరాక్‌కు మొదట విజిట్ వీసాపై వెళ్లిన వారంతా అక్కడ అఖామాలను పొందారు. కాలపరిమితి ముగిసేలోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ విషయంలో కొన్ని ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడినట్లు వెలుగు చూడటంతో ఇరాక్ ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. ఫలితంగా విదేశీ కార్మికుల అఖామాల రెన్యువల్‌ను డిసెంబర్లో నిలిపివేసింది. గడువు ముగిసినా అఖామా లేనివారు మాత్రం రోజువారీ కూలీగా పనిచేస్తూ రహస్యంగానే జీవితం గడుపుతున్నారు. అర్ధాకలితో అలమటిస్తున్నాం అఖామాలు లేని కార్మికులకు అతీగతీ లేకుండా పోయింది. నెల రోజుల నుంచి లాక్డౌన్ అమలు వల్ల వీరి అవస్థలు వర్ణనాతీతం. గతంలో తీసుకున్న సరుకులతో కొన్ని రోజులు వెళ్లదీసిన కార్మికులు.. డబ్బులు లేక మళ్లీ సరుకులు కొనుగోలు చేయలేక పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. రోజుకు ఒకపూట తింటూ అర్ధాకలితో అలమటిస్తున్నామని పలువురు కార్మికులు ‘సాక్షి’తో ఫోన్లో వాపోయారు. ఎలాగైనా స్వదేశానికి వద్దామన్నా రాలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేదన అరణ్య రోదనగా మారిందన్నారు. చొరవ చూపండి ప్రస్తుతం ఇరాక్‌లో నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే అఖామా లేని కార్మికులు ఇంటి దారి పట్టక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. తమకు పెద్ద దిక్కులేకుండా పోయిందని కా ర్మికులు వాపోతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి కనీస సౌకర్యాలు కల్పిం చేలా చొరవ చూపాలని కోరుతున్నారు. వీరంతా సేఫ్ అయితే అఖామాను పొందిన కార్మికులకు ఆయా కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు నివాసం, భోజన సదుపాయాలను ఏర్పాటు చేశాయి. ఇరాక్‌లోని నిన్వేహ్, సలావుద్దీన్, దియాల, అంబర్, కిర్కుక్ ప్రాంతాలను మినహాయించి బాగ్దాద్, ఖుర్దిస్తాన్, ఎర్బిల్ తదితర ప్రాంతాల్లో వలస కార్మికులు ఉపాధి పొందుతున్నారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత వీరికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. వారిని స్వదేశానికి రప్పించాలి ఇరాక్‌లోని తెలంగాణ గల్ఫ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొంత మంది కార్మికులకు నిత్యావసర సరుకులను అందించాం. అఖామా రెన్యువల్ కాని కార్మికులను గుర్తించి వారికి తిండి కోసం అవసరమైన సామగ్రిని చేరవేశాం. ఖుర్దిస్తాన్ పార్లమెంట్ సభ్యుడు ష్వాన్ జరారీ మా విన్నపానికి స్పందించి కార్మికులకు అవసరమైన నిత్యావసర సరుకులను మానవతా దృక్పథంతో అందించారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత వలస కార్మికులను స్వదేశానికి రప్పించడానికి చర్యలు తీసుకోవాలి. – రాయల్వార్ రాంచందర్, ఉపాధ్యక్షుడు, టీజీఈడబ్ల్యూఏ -
ఇరాన్లో 92కు చేరిన కరోనా మృతుల సంఖ్య
బాగ్దాద్ : ప్రంపచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. అన్ని దేశాలకు వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇరాన్లో ఇప్పటి వరకు 92 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. అలాగే 2,922 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇరాన్లో కరోనా సోకిన వారి సంఖ్య 3,140 మందికి చేరింది. బుధవారం ఇరాన్ అధ్యక్షుడు హసన్ రైహానీ కేబినెట్ సమావేశంలో మాట్లాడుతూ.. ఇరాన్‌లోని 31 ప్రావిన్స్‌లలో ఈ వైరస్ ప్రభావితమయ్యాయని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 90 వేల మంది ఈ వ్యాధి భారిన పడగా.. 3,100 మంది చనిపోయారు. (హైటెక్ సిటీలో కరోనా కలకలం.. ఆఫీసులు ఖాళీ!) ఇదిలా ఉండగా తాజాగా ఇరాక్‌లో తొలి కరోనా డెత్ నమోదైంది. కరోనా వ్యాధితో 70 ఏళ్ల వ్యక్తి బుధవారం మృతి చెందాడు. ఇటీవల ఆ వ్యక్తి ఇరాన్ నుంచి వచ్చినట్లు తెలిసింది. కాగా మొదట కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా అతనికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో సులైమనియాలోని ఈశాన్య ప్రాంతంలో అతన్ని అధికారులు నిర్భంధించగా.. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మరణించినట్లు అధికారులు తెలిపారు.దీంతో ఇరాక్‌లో ఇప్పటి వరకు 31కరోనా కేసులు నమోదవ్వగా..దేశంలో ఇదే తొలి కరోనా మృతి అని ప్రభుత్వం ప్రకటించింది. (కరోనా ఎఫెక్ట్: 25 కోట్ల మాస్క్‌ల స్మగ్లింగ్) -
అమెరికన్ ఎంబసీ సమీపంలో రాకెట్ దాడి
బాగ్దాద్ : ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో అమెరికన్ రాయబార కార్యాలయం సమీపంలో ఐదు రాకెట్లు పడిఉండటాన్ని గుర్తించారు. అమెరికా సహా పలు దేశాల రాయబార కార్యాలయాలున్న గ్రీన్జోన్లో వరుసగా రాకెట్ దాడులు చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఇరాక్ పార్లమెంట్ కూడా ఇదే ప్రాంతంలో ఉండటం గమనార్హం. బాగ్దాద్‌లోని అత్యంత భద్రత కలిగిన గ్రీన్‌జోన్‌ను ఐదు రాకెట్లు ఢీకొన్నాయని ఇరాక్ భద్రతా దళాలు పేర్కొన్నాయి. ఇరాక్ నుంచి అమెరికన్ దళాలు వైదొలగాలని ప్రముఖ మత గురువు మటాడా సదర్ పిలుపుతో బాగ్దాద్‌లో రెండు రోజుల కిందట భారీ ర్యాలీ జరిగిన నేపథ్యంలో రాకెట్ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. గత వారంలోనూ బాగ్దాద్‌లోని గ్రీన్జోన్లో మూడు రాకెట్లు అమెరికన్ ఎంబసీ సమీపంలో ఢీకొన్నాయి. కాగా తాజా దాడిలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిన సమాచారం వెల్లడికాలేదు. చదవండి : అమెరికా లక్ష్యంగా.. ఇరాక్ స్థావరాలపై దాడులు -
అమెరికా లక్ష్యంగా.. ఇరాక్ స్థావరాలపై దాడులు
అమెరికా దళాలే లక్ష్యంగా మరోసారి దాడులు జరిగాయి. ఇరాక్‌లోని సైనిక స్థావరాలపై రాకెట్లతో దాడులు జరిగాయి. తాజీ స్థావరం వద్ద ఖత్యుషా తరహా రాకెట్లు పేలినట్లు ఇరాక్ మిలటరీ ప్రకటించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. దాదాపు రెండు రాకెట్లు అమెరికా దళాలు ఉన్న ఇరాక్‌లోని సైనిక స్థావరాల వైపు దూసుకొచ్చినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఈ దాడికి సంబంధించి ఇప్పటి వరకూ ఎవరూ బాధ్యత వహించలేదు. చదవండి: ఉద్రిక్తతలు తగ్గాలనే కోరుకుంటున్నాం కాగా.. గత ఆదివారం అల్ బలాద్ వైమానిక స్థావరంపై కూడా ఇదే తరహాలో రాకెట్ దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నప్పటి నుంచి ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై పలుమార్లు రాకెట్ల దాడి జరిగింది. ఇరాన్ అగ్ర కమాండర్ ఖాసీం సులేమానీ హత్య తర్వాత అమెరికా సైన్యమే లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. అయితే తాజా జరిగిన దాడులు కూడా ఇరానే చేసింటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఇరాన్ మరో దాడి.. అమెరికా ఆగ్రహం!
వాషింగ్టన్: అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ మరోసారి ఇరాక్‌పై రాకెట్లు ప్రయోగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పేర్కొన్నారు. ఈ ఘటన తమను షాక్‌కు గురిచేసిందన్నారు. తరచుగా జరుగుతున్న ఈ దాడులు ఇరాక్ సార్వభౌమత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయని మండిపడ్డారు. బాధ్యులైన వారిని గుర్తించి ఇరాక్ ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని... ప్రజలకు జవాబుదారీగా ఉండాలని పేర్కొన్నారు. రాకెట్ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మైక్ పాంపియో ట్వీట్ చేశారు. అదే విధంగా ఇరాక్‌లో ఉన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రమూకలను అంతమొందించేందుకు అమెరికా, ఐరోపా దేశాలు నిర్విరామంగా కృషి చేస్తాయన్నారు. ఈ మేరకు ఫ్రాన్స్ మంత్రితో తాను చర్చలు జరిపానని, ఇరాన్ దుష్ట చర్యలను అడ్డుకునేందుకు ఉమ్మడిగా ముందుకు సాగనున్నట్లు పేర్కొన్నారు. అంతేగాకుండా మధ్య ప్రాచ్యంలో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు టర్కీ విదేశాంగ మంత్రితో కూడా చర్చలు జరిపినట్లు మైక్ పాంపియో వెల్లడించారు.(ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక) కాగా ఇరాన్ మద్దతున్న హిజ్బుల్ బ్రిగేడ్ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు.. ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై చేసిన విషయం విదితమే. ఇందుకు ప్రతీకారంగా అమెరికా.. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో రాకెట్ దాడికి పాల్పడి.. ఇరాన్ జనరల్ సులేమానిని హతమార్చింది. ఈ నేపథ్యంలో ఇరాన్.. ఇరాక్‌లో ఉన్న అమెరికా వైమానిక స్థావరాలపై డజనుకు పైగా క్షిపణులతో విరుచుకుపడింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ విమానాన్ని పొరబాటున కూల్చివేసినట్లు ఇరాన్ అంగీకరించింది. ఈ ఘటనలో మృతి చెందిన 173 మంది కుటుంబాలకు, వారి దేశాలను క్షమాపణ కోరింది. అయితే తాజాగా... ఇరాక్‌లోని అమెరికా స్థావరంపై ఇరాన్ మళ్లీ దాడి చేసింది. బాగ్దాద్‌కు 80 కి.మీ.ల దూరంలోని అల్ బలాద్ వైమానిక దళ స్థావరంపై ఆదివారం 8 ‘కాట్యూషా’ తరహా రాకెట్లను ప్రయోగించింది. (అవును.. మేమే కూల్చేశాం: ఇరాన్) ఈ దాడిలో ఇరాక్ సైన్యానికి చెందిన ఇద్దరు అధికారులు, ఇద్దరు ఎయిర్‌మెన్ గాయపడ్డారు. స్థావరం లోపల రన్‌వే పై మోర్టారు బాంబులు పడ్డాయని ఇరాక్ సైన్యం ప్రకటించింది. అల్ బలాద్ ఇరాక్ ఎఫ్ 16 యుద్ధ విమానాల ప్రధాన కేంద్రం. ఇక్కడ అమెరికా వైమానిక దళానికి చెందిన చిన్న బృందం, కొందరు అమెరికా కాంట్రాక్టర్లు ఉన్నారు. ఇరాన్-అమెరికాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. అల్ బలాద్ స్థావరం నుంచి అమెరికా వైమానిక దళ సభ్యులు, ఇతర సాంకేతిక సహాయ బృందాల వారిలో చాలామంది ఇప్పటికే వెళ్లిపోయారు. 15 మంది అమెరికా సైనికులు, ఒక చిన్న విమానమే ఈ స్థావరంలో ఉంది. కాగా, గత బుధవారం తాము జరిపిన క్షిపణి దాడుల లక్ష్యం అమెరికా సైనికులను చంపడం కాదని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. ‘నాటి దాడుల్లో మా లక్ష్యం నిజానికి శత్రు సైనికులను హతమార్చడం కాదు. అదంత ముఖ్యం కూడా కాదు’అని రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ హుస్సేన్ సలామీ ఇరాన్ పార్లమెంట్‌కు వివరించారు. Outraged by reports of another rocket attack on an Iraqi airbase. I pray for speedy recovery of the injured and call on the Government of #Iraq to hold those responsible for this attack on the Iraqi people accountable. — Secretary Pompeo (@SecPompeo) January 12, 2020 -
ఇరాక్‌లో ఉద్రిక్త పరిస్థితులు, మనోళ్లు భద్రమే..
సాక్షి, నెట్వర్క్:ఇరాక్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో వలస కార్మికుల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాక్‌లోని పలు ప్రాంతాల్లో తెలంగాణకు చెందిన సుమారు పది వేల మంది కార్మికులు ఉన్నట్లు అంచనా. వారంతా వివిధ రంగాల్లో పనులు చేస్తున్నారు. బాగ్దాద్ పట్టణానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారు ఉంటున్నారు. ఇప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడంతో కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళనచెందుతున్నారు. అయితే, తాము భద్రంగానే ఉన్నామంటూ పలువురు కార్మికులు తమ వారికి ఫోన్‌చేసి సమాచారమిస్తున్నారు. మాచారెడ్డి మండలానికి చెందిన గోపి ‘సాక్షి’తో మాట్లాడుతూ తాము బాగ్దాద్‌కు కొంత దూరంలో ఉన్నామని, ఇటువైపు ఎలాంటి గొడవలు లేనప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన అయితే ఉందని తెలిపాడు. తాము జాగ్రత్తలు తీసుకుంటున్నామని పలువురు వలస కార్మికులు వివరించారు. ఇరాక్‌లో నెలకొన్న అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మన విదేశాంగ శాఖ కూడా వలస కార్మికుల రక్షణకు పలు సూచనలు చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, క్యాంపుల్లోనే ఉండాలని విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు చెప్పినట్లు కార్మికులు వెల్లడించారు. అకామా(గుర్తింపుకార్డులు) లేని కార్మికులు స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉండగా.. శాంతియుత వాతావరణం నెలకొన్న తరువాతనే ఇరాక్ విడిచి ఇంటికి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకోవాలని కూడా విదేశాంగ శాఖ సూచించింది. బాంబు దాడులకు తోడువర్షం జోరు... ఇరాక్‌లో బాంబుదాడులు కొనసాగుతుండటమే కాకుండా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో కార్మికులు క్యాంపులను విడిచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. కొన్ని రోజుల నుంచి ఇరాక్‌లో వర్షాలు కురుస్తున్నాయి. వర్క్ వీసా ఉన్నవారు మాత్రమే కష్టపడి తమ కంపెనీలకు వెళ్లి పనులు చేసుకుని క్యాంపులకు చేరుకుంటున్నారు. ఎర్బిల్‌లో మన వారి సంఖ్య ఎక్కువ.. ఇరాక్‌లోని ఎర్బిల్‌లో మన రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎర్బిల్ పర్యాటక ప్రాంతం కావడంతో ఇరాక్‌కు ఉపాధి కోసం వెళ్లిన వారు ఈ ప్రాంతంలోని హోటళ్లు, మాల్స్ ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ఉపాధి పొందుతున్నారు. సుమారు ఐదు వేల మంది తెలంగాణ జిల్లాలకు చెందిన వలస కార్మికులుఉంటారని స్వచ్చంద సంస్థల ద్వారా తెలుస్తోంది. ఇతర ప్రాంతాల్లో మన రాష్ట్రానికి చెందిన వారు తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇరాక్‌కు వెళ్లడానికిమరోసారి నిషేధం.. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడానికి ఇరాక్ కేంద్రబిందువు కావడంతో మన దేశస్తులు అక్కడకు వలస వెళ్లకుండా మన విదేశాంగ శాఖ మరోసారి నిషేధం విధించింది. ఇరాక్‌కు వలస వెళ్లే కార్మికుల ఎమిగ్రేషన్ క్లియరెన్స్‌ను నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు ఇది అమలులో ఉంటుందని పేర్కొంది. 2014లో ఇరాక్‌లోని ఉగ్రమూకలు మన దేశానికి చెందిన 39 మంది వలసదారులను బందీలుగా చేసుకుని హతమార్చారు. దీంతో ఇరాక్‌కు వలస వెళ్లడాన్ని నిషేధిస్తూ 2014 జూలై 17న భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇరాక్‌లో శాంతియుత వాతావరణం నెలకొన్నట్లు గుర్తించిన మన ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సవరిస్తూ 2019 సెప్టెంబర్ 16న నిర్ణయం తీసుకుంది. ఇదే సంవత్సరం అక్టోబర్ 1 నుంచి ఇరాక్‌లోని ఐదు ప్రాంతాలను మినహాయించి ఇతర పట్టణాల్లో ఉపాధి కోసం వలస వెళ్లడానికి ఎమిగ్రేషన్ అనుమతి ఇచ్చింది. నిన్వేహ్, సలాహుద్దీన్, దియాల, అంబర్, కిర్కుక్ ప్రాంతాలకు ఎమిగ్రేషన్ అనుమతి లేదు. ఈ ప్రాంతాలను మినహాయించి ఇతర పట్టణాలకు వెళ్లేందుకు ఎమిగ్రేషన్ అనుమతి ఉండగా.. ఇప్పుడు మొత్తంగా నిషేధం అమలులోకి వచ్చింది. జాగ్రత్తగానే ఉంటున్నాం.. ఇరాక్‌లో ఉన్న వలస కార్మికులమంతా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తెలంగాణ గల్ఫ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్మికులకు తగిన సూచనలు చేశాం. ఇక్కడ కొంత ఉద్రిక్తత ఉన్నా.. ప్రమాదం ఏమీలేదు. వలసదారుల కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శాంతియుత వాతావరణం నెలకొంటే బాగుంటుంది. బాంబుదాడులు, వర్షం వల్ల అనేక మంది కార్మికులు క్యాంపుల్లోనే ఉంటున్నారు. – రాయల్వర్ రాంచందర్, ఉపాధ్యక్షుడు, టీజీఈడబ్ల్యూఏ అమ్మా.. బాగానే ఉన్నాం... మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికిచెందిన మెరుగు శ్రీను ఇరాక్‌లోని ఎర్బిల్ ప్రాంతంలోఉంటున్నాడు. తాను బాగానే ఉన్నానని, దాడులు తాముఉంటున్న ప్రాంతానికి చాలా దూరంలో జరుగుతున్నాయని, తమకు ఇబ్బంది ఏమీలేదని తన తల్లికి ఫోన్‌చేసి చెప్పాడు. తాను క్షేమంగానే ఉన్నానని, బెంగపెట్టుకోవద్దన్నాడు. బాంబుల శబ్ధం వచ్చింది : కుర్మ శ్రీనివాస్ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికిచెందిన నేను ఇరాక్‌లోని అంకామ ప్రాంతంలో ఉంటున్నా. రాత్రిపూట ఒక్కసారిగా బాంబుల శబ్దం వచ్చింది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో బాంబులు పడ్డట్లు ఇక్కడి వారు తెలిపారు. ఇరాన్ దేశం ఇక్కడి అమెరికా సైన్యంపై దాడులు చేసినట్లు చెబుతున్నారు. బాంబుల శబ్ధం విన్నాక అందరం గదిలోకి వెళ్లాం. భయంతో బయటకు రాలేదు. మాకు ప్రస్తుతానికి ఇబ్బంది ఏమీ లేదు. -
ఇరాక్ గ్రీన్‌జోన్‌లోకి దూసుకొచ్చిన రాకెట్లు
-
దద్దరిల్లుతున్న ఇరాక్.. మరో రాకెట్ దాడి
బాగ్దాద్: ఇరాన్- అమెరికా పరస్పర ప్రతీకార దాడులతో ఇరాక్ దద్దరిల్లుతోంది. తమ జనరల్ ఖాసిం సులేమానిని హతమార్చినందుకు ప్రతీకారంగా ఇరాన్... ఇరాక్‌లో ఉన్న అమెరికా వైమానిక స్థావరాలపై బుధవారం క్షిపణులు వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అయితే అదే రోజు అర్ధరాత్రి సమయంలో ఇరాక్ రాజధాని బాగ్దాద్ గ్రీన్‌జోన్‌లోకి రెండు రాకెట్లు దూసుకువచ్చాయి. విదేశీ రాయబార కార్యాలయాలు కలిగి నిత్యం భద్రతా సిబ్బంది నిఘాలో ఉండే ఈ ప్రాంతంపై కత్యూష రాకెట్ల దాడి జరగడం కలకలం రేపింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కాగా అమెరికా రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకునే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇరాక్‌కు చెందిన హషీద్ గ్రూపు(ఇరాక్‌లోని పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్)లే ఈ దాడికి పాల్పడినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.(అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు.. ఈ విరోధం నేటిది కాదు) ఇక ఇరాన్ మద్దతున్న హిజ్బుల్ బ్రిగేడ్ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు.. గత మంగళవారం ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై చేసిన విషయం విదితమే. ఇందుకు ప్రతీకారంగా అమెరికా.. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో రాకెట్ దాడికి పాల్పడి.. ఇరాన్ జనరల్ సులేమానిని హతమార్చింది. ఈ దాడిలో సులేమానితో పాటు ఇరాక్ మిలిటరీ కమాండర్ అబూ మహ్ది అల్- ముహందీస్‌తో పాటు మరికొంత మంది అధికారులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో తమ కమాండర్‌ను చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని హషీద్ గ్రూపులు ప్రకటించాయి. ఇరాక్ పారా మిలిటరీ చీఫ్ ఖైస్ అల్- ఖాజిలీ(అమెరికా ఇతడిని ఉగ్రవాదిగా బ్లాక్‌లిస్టులో పెట్టింది) మాట్లాడుతూ..‘ఇరాన్ ప్రతీకారం కంటే ఇరాక్ ప్రతీకారం ఏమాత్రం తక్కువగా ఉండబోదు’ అని వ్యాఖ్యానించాడు.(రేపే ప్రకటన.. ఆత్మరక్షణ కోసమే) ఇక సిరియాలో కీలకంగా వ్యవహరించే ఇరాక్ పారామిలిటరీ గ్రూపు హర్కత్ అల్- నౌజాబా సైతం...‘ అమెరికా సైనికులారా మీరు కళ్లు మూసుకోకండి. అమరుడైన ముహందీస్ కోసం ఇరాకీలందరూ చేతులు కలుపుతారు. మీరు ఇరాక్‌ను వదిలివెళ్లేంత వరకు ప్రతీకారంతో రగిలిపోతారు’ అని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హషీద్ గ్రూపులే బుధవారం అర్ధరాత్రి అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా కత్యూష రాకెట్లు ప్రయోగించినట్లు తెలుస్తోంది. (ఇరాన్ క్షిపణుల వర్షం.. అమెరికా శాంతి మంత్రం) -
ఇరాక్‌ను విడిచిపెట్టి వచ్చేయండి
మనీలా : ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఆయా దేశాలు తమ పౌరులను పశ్చిమాసియా దేశాల నుంచి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.మంగళవారం రాత్రి ఇరాక్‌లోని అమెరికా మిలటరీ స్థావరాలపై ఇరాన్ దాడి చేయడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో ఆయా దేశాలు తమ పౌరులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిలిప్పీన్స్ ప్రభుత్వం తమ పౌరులను వెనక్కి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆ దేశ విదేశాంగ కార్యదర్శి ఎడ్వర్డో మెనెజ్ ఒక ప్రకటనను విడుదల చేశారు. 'ఇరాక్‌లో మా దేశానికి చెందిన 1600 మంది పౌరులు పనిచేస్తున్నారు. అలాగే ఇరాక్‌కు వలస వెళ్లిన వారిని కూడా అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్లిపోవాలని తెలిపాం. మా పౌరులను స్వదేశానికి రప్పించేందుకు మూడు కార్గో విమానాలు, ఓడలను పంపాము. ముందుగా మా పౌరులను ఇరాక్ నుంచి ఖతార్, లొరెంజానాకు తరలిస్తాం. అక్కడి నుంచి కార్గో విమానాలు, ఓడల ద్వారా వారిని స్వదేశానికి తీసుకొస్తామని' ఎడ్వర్డో మెనెజ్ ఆ ప్రకటనలో తెలిపారు. (ఈ దాడులు అమెరికాకు చెంపపెట్టులాంటివి) -
‘అమెరికా ఉగ్రవాదులు’ ; జర్మనీ కీలక నిర్ణయం
బెర్లిన్/టెహ్రాన్: ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీని అమెరికా మట్టుబెట్టిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ మద్దతున్న హిజ్బుల్ బ్రిగేడ్ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు.. గత మంగళవారం ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై చేసిన విషయం విదితమే. ఇందుకు ప్రతీకార చర్యగా ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో శుక్రవారం రాకెట్ దాడికి పాల్పడి.. అగ్రరాజ్యం సులేమానిని హతమార్చింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటున్నారు. అంతేగాకుండా ఇరాక్ పార్లమెంట్ సైతం అమెరికా తమ దేశం నుంచి వెంటనే వెళ్లిపోవాలంటూ తీర్మానం చేసింది. అదే విధంగా... సులేమానీని హతమార్చిన అమెరికా సైన్యాన్ని ఉగ్రవాదులుగా పేర్కొంటూ ఇరాన్ పార్లమెంట్ మంగళవారం తీర్మానించింది. దీంతో మధ్య ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.(52తో పాటు.. 290 కూడా గుర్తుపెట్టుకో ట్రంప్!) ఈ నేపథ్యంలో జర్మనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాక్‌లో మోహరించిన తమ బలగాలు కొన్నింటిని వెనక్కి పిలిపించినట్లు పేర్కొంది. బాగ్దాద్, తాజీలో ఉన్న సదరు బలగాల(30 మంది సైనికులు)ను జోర్డాన్, కువైట్‌కు తరలించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు జర్మనీ విదేశాంగ మంత్రి హైకో మాస్ మట్లాడుతూ.. ‘ఇరాక్ ప్రభుత్వం, పార్లమెంట్ నుంచి మాకు ఆహ్వానం అందినపుడు బలగాలు మోహరించాం. అయితే ప్రస్తుతం విదేశీ బలగాలు తమ దేశం విడిచి వెళ్లాలని ఆ దేశ పార్లమెంట్ తీర్మానించింది. కాబట్టి చట్టప్రకారం మేం అక్కడ ఉండకూడదు. ఇందుకు సంబంధించి త్వరలోనే బాగ్దాద్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. కాగా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌ను ఎదుర్కొనే క్రమంలో ఇరాక్‌కు మద్దతుగా.. జర్మనీ దాదాపు 415 మంది సైనికులను అక్కడ మోహరించిన విషయం తెలిసిందే. (ఇరాన్‌కు అమెరికా షాక్!) ఇక పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరలు, అమెరికా, ఇరాన్‌లు చేస్తున్న తీవ్ర ప్రకటనల నేపథ్యంలో జర్మనీ చాన్సెలర్ మెర్కెల్, ఫ్రాన్సు అధ్యక్షుడు మేక్రాన్, బ్రిటన్ ప్రధాని జాన్సన్ ఒక ఉమ్మడి ప్రకటన చేశారు. ‘ ఇటువంటి సందర్భాల్లో ఐఎస్‌కు వ్యతిరేకంగా జట్టుగా కలిసి ఉండటం చాలా ముఖ్యం’ అని పేర్కొన్నారు. అదే విధంగా ఐఎస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధాన్ని ప్రమాదంలో పడవేయవద్దని విఙ్ఞప్తి చేశారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు అన్ని పక్షాల వారు బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. సంబంధిత కథనాలు ట్రంప్ తలపై రూ.575 కోట్లు మా ప్రతీకారం భీకరం నిశ్శబ్దంగా చంపేశారు అమాయకులను చంపినందుకే.. -
ట్రంప్ తలపై రూ.575 కోట్లు
టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్ జనరల్ సులేమానీ మృతికి కారణమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తలకు ఇరాన్ వెలకట్టింది. ఆయన్ను చంపిన వారికి దాదాపు రూ.575 కోట్ల భారీ నజరానా ఇస్తామని ప్రకటించింది. మరోవైపు, అమెరికా డ్రోన్ దాడిలో చనిపోయిన జనరల్ సులేమానీ(62) మృతదేహం సోమవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు చేరుకుంది. సులేమానీకి నివాళులర్పించేందుకు నలుపు రంగు దుస్తులు ధరించిన జనం ఇసుకేస్తే రాలనంతమంది తరలివచ్చారు. అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నేతృత్వంలో ప్రార్థనలు జరిగాయి. జనరల్ సులేమానీ, తదితరులకు చెందిన శవపేటికల వద్ద ప్రార్థనలు చేసే సమయంలో ఖమేనీ కన్నీటి పర్యంతమయ్యారు. అధ్యక్షుడు రౌహానీ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను చంపిన వారికి భారీ బహుమానం అందజేస్తామంటూ ఈ సందర్భంగా ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.ఇరాన్‌లోని 8 కోట్ల మంది పౌరుల నుంచి ఒక్కో అమెరికా డాలర్(సుమారు రూ.71.79) చొప్పున రూ.575 కోట్లు చందాగా వసూలు చేసి ట్రంప్‌ను చంపిన వారికి అందజేస్తామన్నట్లు మిర్రర్ వెబ్సైట్ తెలిపింది. సులేమానీకి నివాళులర్పిస్తూ ఖమేనీ కంటతడి అలాగైతే.. ఇరాక్‌పైనా ఆంక్షలు అమెరికా బలగాలు తమ దేశం నుంచి వెంటనే వెళ్లిపోవాలంటూ ఇరాక్ పార్లమెంట్ తీర్మానించడంపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.‘ఇరాక్ కోసం మేం చాలా డబ్బు వెచ్చించాం. మా బలగాలను ఉంచిన వైమానిక స్థావరం ఏర్పాటుకు కోట్లాది డాలర్ల ఖర్చయింది. అదంతా తిరిగి చెల్లించకుండా ఖాళీ చేసేదిలేదు. ఒక వేళ మాపై ఒత్తిడి చేసినా, తేడాగా వ్యవహరించినా ఎన్నడూ ఎదుర్కోనంతటి తీవ్ర ఆంక్షలను ఇరాక్ చవిచూడాల్సి ఉంటుంది’అని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరలు, అమెరికా, ఇరాన్‌లు చేస్తున్న తీవ్ర ప్రకటనల నేపథ్యంలో జర్మనీ చాన్సెలర్ మెర్కెల్, ఫ్రాన్సు అధ్యక్షుడు మేక్రాన్, బ్రిటన్ ప్రధాని జాన్సన్ ఒక ఉమ్మడి ప్రకటన చేశారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అన్ని పక్షాల వారు బాధ్యతగా వ్యవహరించాలని ప్రకటనలో పేర్కొన్నారు. అణు ఇంధన శుద్ధి పరిమితులపై.. తాజా పరిణామాల నేపథ్యంలో 2015 అణు ఒప్పందంలోని ఇంధన శుద్ధిపై పరిమితులను ఇకపై పట్టించుకోబోమని ఇరాన్ ప్రకటించింది. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పెంచుకుంటామని, ఇందుకోసం పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను విస్తృతం చేస్తామని తెలిపింది. అణ్వాయుధాలను తయారు చేయబోమన్న మునుపటి హామీకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. కాగా, 2018లో అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్న అమెరికా ప్రకటించిన తర్వాత ఇరాన్ చేసిన తాజా ప్రకటనతో ఈ ఒప్పందం అమలు ప్రమాదం పడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విరోధం ఇప్పటిది కాదు ► 1979: అమెరికా అండతో కొనసాగుతున్న ఇరాన్ పాలకుడు మొహమ్మద్ రెజా పహ్లావీకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. దీంతో ఆయన అమెరికాకు పారిపోయారు. ఆందోళనకారులు టెహ్రాన్‌లోని అమెరికా ఎంబసీని 1979 నవంబర్ నుంచి 1981 జనవరి వరకు ముట్టడించారు. ► 1988: గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ విమానాన్ని అమెరికా బలగాలు కూల్చివేశాయి. ఈ ఘటనలో 290 మంది ప్రాణాలు కోల్పోయారు. ► 2000: ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందనే ఆరోపణలపై అమెరికా ఆంక్షలు. ► 2002: ఇరాక్, ఉత్తరకొరియాతోపాటు ఇరాన్‌ను అమెరికా దుష్ట్రతయంలో చేర్చింది. ► 2013–16: ఒబామా హయాంలో ఇరాన్‌తో సంబంధాలు గాడినపడ్డాయి. ► 2015: అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, రష్యా, చైనా, జర్మనీలు ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ► 2019: అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. -
ఖాసీం అంత్యక్రియలు.. హోరెత్తిన నినాదాలు
టెహరాన్: బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా వైమానిక దాడి చేయటంతో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసీం సులేమానీ మృతి చెందిన సంగతి తెలిసిందే. శుక్రవారం సులేమానీకి వేలాది మంది ప్రజలు అశ్రు నివాళులర్పించారు. అదేవిధంగా సులేమానీ అంత్యక్రియల్లో పాల్గొన్న ఇరాక్ దేశ ప్రజలు పెద్ద ఎత్తున అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘డెత్ టూ అమెరికా’ అంటూ గర్జించారు. అమెరికాపై ప్రతీకార్య చర్య తప్పదని హెచ్చరించారు. కాగా, వేలాది మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నందునే ఇరాన్ సైనిక జనరల్ సులేమానీని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీ, లండన్ వంటి ప్రాంతాల్లో జరిగిన ఉగ్రవాదుల దాడుల వెనుక అతని హస్తముందన్నారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ఉగ్రవాది సులేమానీని తన ఆదేశాలతోనే అమెరికా సైన్యం మట్టుబెట్టిందని, దీంతో అతని శకం అంతమైందని ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. సులేమానీ హత్యపై ఐరాసలోని ఇరాన్ రాయబారి మజీద్ తఖ్త్ రవంచి స్పందిస్తూ.. తమ బద్ధ విరోధి పాల్పడిన యుద్ధచర్యగా అమెరికానుద్దేశించి పేర్కొన్న విషయం తెలిసిందే. చదవండి: అమాయకులను చంపినందుకే.. చదవండి: ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక చదవండి: ఎప్పుడో చంపేయాల్సింది -
ఇరాక్‌లో యుద్ధ వాతావరణం
-
అమాయకులను చంపినందుకే..
బాగ్దాద్/వాషింగ్టన్/బ్రస్సెల్స్: వేలాది మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నందునే ఇరాన్ సైనిక జనరల్ సులేమానీని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. న్యూఢిల్లీ, లండన్ వంటి ప్రాంతాల్లో జరిగిన ఉగ్రవాదుల దాడుల వెనుక అతని హస్తముందన్నారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ఉగ్రవాది సులేమానీని తన ఆదేశాలతోనే అమెరికా సైన్యం మట్టుబెట్టిందని, దీంతో అతని శకం అంతమైందని చెప్పారు. ఫ్లోరిడాలోని సొంత రిసార్ట్‌లో శనివారం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. గడిచిన 20 ఏళ్లలో పశ్చిమాసియాలో అస్థిరతను సృష్టించేందుకు కుట్రపన్నారని, అతని కనుసన్నల్లోనే ఇటీవల ఇరాక్‌లోని తమ సైనికులు, ఎంబసీపై దాడులు జరిగాయన్నారు. సులేమానీ మరణంతో ఈ ప్రాంతంలో యుద్ధం ప్రారంభమవుతుందన్న ఆందోళనలను ట్రంప్ కొట్టిపారేశారు. ఇరాన్ సహా తమను బెదిరించే వారిపై ఎలాంటి చర్య అయినా తీసుకునేంతటి శక్తి అమెరికాకు ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి పరిమితం సులేమాని మృతితో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో..ఉగ్రవాదులపై పోరులో ఇరాక్ సైన్యానికి సహకరిస్తున్న అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు, నాటో తమ కార్యక్రమాలను నిలిపి వేశాయి. ‘సంకీర్ణ బలగాలను కాపాడుకోవడమే ఈ సమయంలో మాముందున్న లక్ష్యం. ప్రస్తుతానికి సైనిక శిక్షణ, ఉగ్రవాదులపై పోరు వంటి కార్యక్రమాలను పరిమితం చేసుకున్నాం. దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఓ సైనికవర్గాలు వెల్లడించాయి. అమెరికా తాజా డ్రోన్ దాడి ఈ ప్రాంతంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయని విశ్లేకులు అంటున్నారు. 2011లో అల్ ఖాయిదా చీఫ్ లాడెన్, 2019లో ఐఎస్ చీఫ్ బాగ్దాదీ హతమైనప్పటి కంటే తాజా దాడి ఎక్కువ ప్రభావం చూపనుందని పేర్కొంటున్నారు. సులేమానీకి అశ్రు నివాళి సులేమానీ(62)కి వేలాది మంది ప్రజలు అశ్రు నివాళులర్పించారు. శుక్రవారం బాగ్దాద్‌లో విమానాశ్రయం వద్ద అమెరికా డ్రోన్ దాడిలోæ సులేమాని, ఇరాకీ పారా మిలటరీ అధిపతి అబుæ ముహందిస్ మరణించడం తెల్సిందే. వీరి శవ పేటికలను బాగ్దాద్‌లోని ప్రముఖ షియా మసీదుకు తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఇరాక్ ప్రధాని అదెల్ అబ్దుల్ మహ్దీ, షియాల మత పెద్ద అమ్మర్ అల్ హకీం, ఇరాక్ మాజీ ప్రధాని నూరి అల్ మాలికితోపాటు ఇరాన్ అనుకూల ప్రముఖులు పాల్గొన్నారు. మృతదేహాలను షియాల పవిత్ర నగరం నజాఫ్‌కు, అటునుంచి ఇరాన్‌కు తీసుకెళ్లనున్నారు. సులేమానీ హత్యపై ఐరాసలోని ఇరాన్ రాయబారి మజీద్ తఖ్త్ రవంచి స్పందిస్తూ.. తమ బద్ధ విరోధి పాల్పడిన యుద్ధచర్యగా అమెరికానుద్దేశించి పేర్కొన్నారు. ఇరాన్ అనుకూల కాన్వాయ్‌పై మళ్లీ దాడి అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధ భయాలు అలుముకున్న నేపథ్యంలో శనివారం మరోసారి ఇరాన్ అనుకూల ఇరాకీ పారామిలటరీ అధికారి వాహన శ్రేణి లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో హషీద్ సురక్షితంగా బయటపడగా ‘కొందరు గాయపడ్డారు, కొందరు చనిపోయారు’ అంటూ ఓ అధికారి తెలిపారు. అంతకుమించి వివరాలు వెల్లడి కాలేదు. ముస్లిం తీవ్రవాద సంస్థలపై పోరాటంలో ఇరాక్ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే అక్కడ 5,200 మంది అమెరికా సైనికులు ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరికితోడు మరో 3,500 మందిని అక్కడకు తరలించనున్నట్లు అమెరికా ప్రకటించింది. బాగ్దాద్‌లోని అమెరికా స్థావరంపై రాకెట్ దాడి ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని బలాడ్ అమెరికా వైమానిక స్థావరంపై శనివారం రాత్రి రాకెట్ దాడి జరిగింది. ఒక రాకెట్ సురక్షిత ప్రాంతంగా ప్రకటించిన గ్రీన్జోన్లో పేలగా రెండోది వెలుపల ప్రాంతాన్ని తాకిందని ఇరాక్ సైన్యం తెలిపింది. వీటివల్ల నష్టంపై వివరాలను వెల్లడించలేదు. అయితే, రాకెట్ల ప్రయోగ స్థానాన్ని గుర్తించేందుకు డ్రోన్లను పంపినట్లు వివరించింది. టెహ్రాన్‌లో అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను తగలబెడుతున్న నిరసనకారులు -
ఉద్రిక్తం.. అమెరికా మరోసారి రాకెట్ల దాడి
బాగ్దాద్ : ఇరాక్‌పై అగ్రరాజ్యం అమెరికా మరోసారి దాడులకు పాల్పడింది. రెండు రోజు (శనివారం) సైతం ఉత్తర బాగ్దాద్ నగరంపై అమెరికా రాకెట్లు దూసుకెళ్లాయి. ఈ రాకెట్ల దాడిలో సైన్యానికి చెందిన ఆరుగురు సిబ్బంది మృతిచెందారు. ఇరాక్ మిలీషియా కమాండర్ లక్ష్యంగా వైమానికి దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ఇరాన్ దేశ రివల్యూషనరీ గార్డ్ కమాండర్ జనరల్ ఖాసీం సులేమాని అమెరికా జరిపిన దాడుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకే ఈ దాడికి పాల్పడినట్టు పెంటాగన్ ప్రకటించింది. అమెరికా దౌత్యవేత్తలపై దాడి చేసినందుకే ఇరాక్‌పై దాడికి దిగామని ట్రంప్ తెలిపారు. ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తాము ప్రయత్నించడంలేదని ట్రంప్ పేర్కొన్నారు. (ఎప్పుడో చంపేయాల్సింది: ట్రంప్) మరోవైపు ఇరాక్‌లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే వెనక్కి తిరిగి రావాలని అమెరికా విదేశాంగ శాఖ పిలుపునిచ్చింది. ఇరాన్ మద్దతున్న మిలిటెంట్లు అమెరికా దౌత్యకార్యాలయం దగ్గర జరిపిన దాడులతో ఎంబసీలో కార్యకలాపాలు నిలిపివేశామని, పౌరులెవరూ అక్కడికి వెళ్లవద్దని ట్వీట్ చేసింది. ఈ పరిణామాలతో మధ్య ప్రాచ్యానికి అమెరికా మరో 3,500 మంది బలగాలను తరలించింది. సులేమాని చంపేసినందుకు అమెరికాపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇదివరకే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ దాడి.. 8 మంది మృతి
బాగ్దాద్ : ఇరాక్‌లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై రాకెట్ దాడి జరిగింది. ఎయిర్ కార్గో టెర్మినల్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దాడి చోటుచేసుకుంది. మొత్తంగా మూడు రాకెట్ దాడులు జరిగినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో రెండు కార్లు ధ్వంసం కాగా, 8 మంది మృతిచెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇరాన్, ఇరాక్‌కు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు ఉన్నట్టు ఇరాక్ మీడియా పేర్కొంది. ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సోలెమన్, ఇరాక్ మిలీషియా కమాండర్ అబూ మహదీ అల్ ముహండిస్ మృతిచెందినట్టు ఇరాక్ మిలీషియా ప్రతినిధి వెల్లడించారు. ఈ దాడికి పాల్పడింది అమెరికా బలగాలే అని ఇరాక్ పీఎంఎఫ్ ప్రతినిధి అహ్మద్ అల్ అస్సాది ఆరోపించారు. దీనిపై యూఎస్ అధికారులు స్పందిస్తూ.. బాగ్దాద్‌లో ఇరాన్‌తో ముడిపడి ఉన్న రెండు లక్ష్యాలపై దాడి జరిగినట్టు తెలిపారు. అయితే మరింత సమాచారం వెల్లడించేందుకు వారు నిరాకరించారు. మరోవైపు.. మూడు రాకెట్లతో బాగ్దాద్ విమానాశ్రయంపై దాడి జరిగిందని ఇరాక్ పారా మిలటరీ గ్రూప్స్ తెలిపాయి. ఈ దాడిలో ఇరాక్ పారా మిలటరీకి చెందిన ఆరుగురు సభ్యులు, ఇద్దరు అతిథులు ఉన్నట్టు వారు పేర్కొన్నారు. కాగా, ఇటీవల ఇరాన్ అనుకూల మిలీషియా సభ్యులు, పలువురు నిరసనకారులు బాగ్దాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై దాడిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన అమెరికా.. ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. ఈ క్రమంలోనే బాగ్దాద్ ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ దాడులు జరగడం పలు అనుమానాలకు తావిచ్చేలా ఉంది. అయితే ఇప్పటివరకు ఈ దాడికి పాల్పడింది ఎవరనే దానిపై స్పష్టత లేదు. ఈ దాడులతో మధ్య ఆసియా ప్రాంతంలో ఉద్రిక్తలు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. -
ఇరాక్‌లో యూఎస్ ఎంబసీపై దాడి
బాగ్దాద్: ఇరాన్ మద్దతున్న హిజ్బుల్ బ్రిగేడ్ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు మంగళవారం ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కార్యాలయం ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేసి, రిసెప్షన్ ప్రాంతాన్ని తగలబెట్టారు. ఇరాన్ మద్దతున్న తీవ్రవాద సంస్థ హషెద్ అల్ షాబికి హిజ్బుల్ బ్రిగేడ్ సాయుధ విభాగం. దానికి ఇరాక్‌లో, సిరియాలో ఉన్న కీలక స్థావరాలపై అమెరికా ఆదివారం వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఆ దాడుల్లో పాతికమందికి పైగా చనిపోయారు. ఆ దాడులకు ప్రతీకారంగానే యూఎస్ రాయబార కార్యాలయంపై సోమవారం దాడి జరిగింది. మిలటరీ యూనిఫాం వేసుకున్న ఆందోళనకారులు ‘ఆక్రమణదారు అమెరికా’ అని ఉన్న ప్లకార్డులు పట్టుకుని ఈ దాడిలో పాల్గొన్నారు. ఆందోళనకారులను చెదర గొట్టడానికి అమెరికా సైనికులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. -
ఇరాక్‌లో అమెరికా దాడులు
బాగ్దాద్: ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల వర్గంపై అమెరికా ఆదివారం రాత్రి బాంబుల వర్షం కురిపించింది. సిరియా సరిహద్దుల్లోని అల్ ఖయిమ్ ప్రాంతంలో ఉన్న హెజ్బొల్లా బ్రిగేడ్స్‌కు చెందిన పలు స్థావరాలపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 25 మంది చనిపోయారు. 51 మంది గాయాలపాలయ్యారు. మృతులు, క్షతగాత్రుల్లో పలువురు కమాండర్లు కూడా ఉన్నారు. ఇరాన్ అనుకూల హషెద్ అల్ షాబి సంస్థ విభాగమే హెజ్బొల్లా బ్రిగేడ్స్. ఈ దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాదాన్ని అమెరికా ప్రోత్సహిస్తోందని, దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం లేదని మండిపడింది. ఇందుకు అమెరికా మూల్యం చెల్లించక తప్పదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి అబ్బాస్ మౌసవి హెచ్చరించారు. ఇరాక్‌లోని 3, సిరియాలోని 2 స్థావరాలపై అమెరికా జరిపిన దాడులు విజయవంతమయ్యాయని అమెరికా రక్షణ మంత్రి ఎస్పర్ చెప్పారు. -
ఇరాక్‌లో అకామా కష్టాలు
ఎన్.చంద్రశేఖర్, మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా) డాలర్ల రూపంలో వచ్చే వేతనాలతో తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవచ్చనే ఆశతో ఇరాక్ బాట పట్టిన వలస కార్మికులకు నిరాశే మిగిలింది. ఇరాక్‌లోని వివిధ ప్రాంతాల్లో పనిచేసుకోవడానికి వలస కార్మికులకు గతంలో జారీచేసిన రెసిడెన్స్ కార్డు(అకామా)లను అక్కడి ప్రభుత్వం కొన్ని రోజులుగా రెన్యూవల్ చేయడం లేదు. అకామా గడువు తీరిన వారికి తిరిగి కొత్తవి ఇవ్వడం లేదు. అకామా లేకపోవడంతో కంపెనీలు కూడా పనులలో పెట్టుకోవడం లేదు. అకామా లేకుండా ఆ దేశంలో నివసిస్తే అక్కడి చట్టం ప్రకారం జైలుశిక్ష పడుతుంది. అంతేకాక భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పనిచేయడానికి అవకాశం లేక.. ఇంటికి వెళ్లడానికి మార్గం లేక కార్మికులు దయనీయ స్థితిలో ఉన్నారు. కుంభకోణం జరిగిందని.. ఇరాక్‌కు విజిట్ వీసాలపై వచ్చిన వారు పనిచేసుకోవడానికి అక్కడి ప్రభుత్వంఅకామాలను పెద్ద ఎత్తున జారీచేసింది. ఒక ఏడాది పాటు పనిచేయడానికి అకామాలను జారీచేసిన ఇరాక్ ప్రభుత్వం.. అకామా గడువు ముగిసిన తరువాత రెన్యూవల్ చేసుకోవాలని సూచించింది. రెన్యూవల్‌కు 400 డాలర్లనుంచి 500 డాలర్లు అంటే.. మన కరెన్సీలో రూ.30వేల వరకు చెల్లించాలి. అయితే, అకామా రెన్యూవల్ విషయంలో కుంభకోణం జరిగినట్లు ఇరాక్ ప్రభుత్వం గుర్తించింది. ఏజెన్సీలు ప్రభుత్వాన్ని మోసగించి భారీ మొత్తంలో నిధులను పక్కదారి పట్టించినట్లు వెల్లడైంది. కొన్ని ఏజెన్సీలు నకిలీ అకామాలను సృష్టించినట్లు వెలుగుచూడడంతో అక్కడి ప్రభుత్వం వ్యక్తిగత అకామాల రెన్యూవల్ నిలిపివేసింది. తెలంగాణ కార్మికులు 10వేల మందిఇరాక్లోని ఎర్బిల్, సులేమినియా,కిర్కుక్ తదితర పట్టణాల్లోని టూరిజంప్రాంతాలు, హోటల్స్, షాపింగ్ మాల్స్, పరిశ్రమల్లో పనిచేయడానికి మన రాష్ట్రానికిచెందిన కార్మికులు వలస వెళ్లారు. ఆ దేశంలో తెలంగాణ కార్మికులు ప్రస్తుతం సుమారు 10వేల మంది ఉన్నట్టు అంచనా. ఇందులో కేవలం 20 శాతం మంది కార్మికులకే వర్క్ పర్మిట్, పర్మినెంట్ అకామాలు ఉన్నాయి. తాత్కాలిక, వ్యక్తిగత అకామాల రెన్యూవల్‌ను ఇరాక్ ప్రభుత్వం నిలిపివేయడంతో 80 శాతం మంది కార్మికులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. స్వదేశానికి రావాలనుకునే కార్మికులు అక్కడి ప్రభుత్వానికి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అకామా లేకుండా చట్టవిరుద్ధంగా ఉన్నందుకు రోజుకు 20 డాలర్ల చొప్పున జరిమానా చెల్లించాలనే నిబంధన ఉంది. అకామా రెన్యూవల్ నిలిచిపోయిన నాటి నుంచి ఎన్ని రోజులు ఆ దేశంలో ఉంటే అన్ని రోజులకు జరిమానా చెల్లించాలి. ఉపాధి కోసం వెళ్లిన తాము పనిలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇలాంటి పరిస్థితిలో భారీ మొత్తంలో జరిమానా ఎలా చెల్లించాలని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత కాన్సులేట్‌లో దరఖాస్తు అకామాలు లేకపోవడంతో కార్మికులు రహస్య ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం 15 మంది తెలంగాణ కార్మికులు ఇంటికి రావడానికి సహకారం అందించాలని ఎర్బిల్లోని భారత కాన్సులేట్‌లో దరఖాస్తు పెట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన బట్టు గంగాధర్ (సాహెబ్పేట్), భూమేష్ సాకలి (రెంజర్ల), ప్రేమ్‌చంద్ (వేల్పూర్), ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సత్తయ్య అంకతి (వెంకట్రావ్‌పేట్), గోపాల్ దురూరి (ఉదుంపూర్), చిన్న నర్సయ్య చిట్యాల (బట్టాపూర్), జగిత్యాల జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ పల్లేరియా (ధర్మాజిపేట్), ప్రశాంత్ మామిడిపెల్లి (లింగంపేట్), వెంకటేష్ సిరికొండ( లింగంపేట్), రమేష్ రేగుల (చెందోలి), అనిల్ ఉప్పరి (సర్వాపూర్), శ్రీనివాస్ కల్లా (లొత్నూర్), శ్రీనివాస్ భైరవేణి (లొత్నూర్), మంచిర్యాల జిల్లాకు చెందిన చంద్రయ్య దుర్గం (ధర్మారం), దివాన్ పసి (గోరక్‌పూర్ శివపూర్) వీరంతా నాలుగైదేళ్ల కింద ఇరాక్‌కు ఉపాధి కోసం వలస వెళ్లారు. అక్కడ అకామా రెన్యూవల్ కాకపోవడంతో ఇంటికి చేరడానికి మన విదేశాంగ శాఖ సహాయాన్ని అభ్యర్థిస్తున్నారు. అయితే, విదేశాంగ శాఖ అధికారుల నుంచి స్పందన లేదనే కార్మికులు అంటున్నారు. ఆ ఐదు ప్రాంతాలు మినహా.. ఇరాక్‌లోని మిగతా పట్టణాలకు వెళ్లవచ్చుఇరాక్లో ఉపాధి కోసం కార్మికులు వలస వెళ్లడానికి మొదట్లో మనదేశం ఎమిగ్రేషన్ సౌకర్యం కల్పించింది. అయితే, 2014లోఇరాక్లో టెర్రరిస్టులు మన దేశానికి చెందిన 39 మంది కార్మికులను హతమార్చారు.దీంతో భద్రతా కారణాల రీత్యా భారతీయులు ఇరాక్ వెళ్లడాన్ని (ఎమిగ్రేషన్) నిషేధిస్తూ 2014 జులై 17న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇరాక్‌లో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని అందిన సమాచారం మేరకు తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న ఐదు ప్రాంతాలు నిన్వేహ్ (మొసుల్), సలాహుద్దీన్ (టిక్రిత్), దియాల (బఖూబా), అంబర్ (రమాది), కిర్కుక్ లను మినహాయించి మిగతా ప్రాంతాలకు ఎమిగ్రేషన్ అనుమతినిస్తూ భారత ప్రభుత్వం 2019 అక్టోబర్ 1న ఉత్తర్వులను జారీచేసింది. ఇరాక్ నుంచి రప్పించాలి.. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం సాహేబ్పేట్కు చెందిన బట్టు గంగాధర్ నాలుగేళ్ల కింద ఇరాక్‌కు వెళ్లాడని ఆయన తల్లి రుక్మాబాయి, భార్య సుజాత చెప్పారు. అకామా రెన్యూవల్ కాకపోడంతో గంగాధర్ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నట్లు వారు వివరించారు. తమతో ఫోన్లో మాట్లాడుతున్నాడని, కొన్ని నెలల నుంచి పనిలేకపోవడంతో చేతిలో చిల్లిగవ్వా లేదని ఆవేదన వ్యక్తం చేశాడని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని గంగాధర్‌తో పాటు ఇతర కార్మికులను స్వదేశానికి రప్పించాలని వారు కోరుతున్నారు. వర్క్ వీసా ద్వారానే వెళ్లాలి.. ఇరాక్‌కు వర్క్ వీసాపైనే వెళ్లాలి. విజిట్ వీసాపై అక్రమ మార్గంలో వెళ్లిన వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా ఐదేళ్ల పాటు ఇరాక్‌లో పనిచేశాను. అప్పట్లో విజిట్ వీసాపై వెళ్లినా కంపెనీ అకామా పొందడం వల్ల నాకు ఇబ్బంది కలగలేదు. కానీ, ఇప్పుడు వెళ్లే వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విజిట్ వీసాపై వెళ్లవద్దు. అలాగే ఇరాక్‌లో ఉండిపోయిన కార్మికులను మన ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఇంటికి రప్పించాలి. – మాటేటి కొమురయ్య,గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి -
ఇరాక్‌లో ఇరుక్కుపోయారు!
జన్నారం: ఉపాధి కరువై.. బతుకు బరువై డబ్బులు సంపాదించుకోవచ్చనే ఆశతో విదేశాలకు వెళ్లిన తెలంగాణవాసులు అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. జన్నారం మండలం సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది వరకు పనులు లేక పస్తులుంటున్నారు. తమను స్వదేశానికి రప్పించాలని వారు వేడుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ధర్మారం గ్రామానికి చెందిన జాడి చంద్ర య్య గతేడాది వెళ్లి పనుల్లేక ఇబ్బందులు పడుతున్నాడు. కవ్వాల్ గ్రామానికి చెందిన కుంటాల నర్సయ్య, సేర్ల లచ్చన్న రెండేళ్ల క్రితం ఇరాక్ వెళ్లారు. ఏదో కారణంగా 3 నెలలుగా వారు జైలు పాల య్యారు. వీరంతా ఏజెంట్ల మోసాలకు గురై ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం ‘‘ఇరాక్‌లో ఇబ్బంది పడుతున్న తెలంగాణవాసుల గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాం. ఎన్ఆర్ఐ బిభాగం కార్యదర్శి చిట్టిబాబు దృష్టికి తీసుకెళ్లాం. వారిని త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. ’’ మాటేటి కొమురయ్య, గల్ఫ్ వెల్ఫేర్,అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
రాజీనామా చేస్తా ఇరాక్ ప్రధాని ప్రకటన
బాగ్దాద్: ప్రధాని పదవికి రాజీనామా చేస్తానంటూ ఇరాక్ ప్రధాని అదెల్ అబ్దుల్ మహ్తి శుక్రవారం ప్రకటించారు. తన రాజీనామాను పార్లమెంటుకు సమర్పిస్తానని, దాంతో పార్లమెంటు ఇతర అవకాశాలను పరిశీలించుకుంటుందని చెప్పారు. ఇరాక్ ప్రధానికి మద్దతు ఉపసంహరించుకోవాలంటూ చట్టసభ సభ్యులకు అత్యున్నత షియా మతగురువు పిలుపునివ్వటంతో రెండు నెలలుగా అల్లర్లు జరుగుతున్నాయి. అల్లర్లలో 400 మంది మృతి చెందగా, 15 వేల మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రధాని రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నారు. -
ఇరాక్ సైన్యం కాల్పుల్లో 27 మంది మృతి
సిరియా: ఇరాక్ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వ బలగాలు జరిపిన కాల్పుల్లో 27 మంది మృతి చెందారు. నజాఫ్ నగరంలోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయానికి నిరసనకారులు బుధవారం అర్థరాత్రి నిప్పు పెట్టారు. ఈ ఘటనపై ఇరాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామ అనంతరం నజాఫ్‌తోపాటు మిగతా నగరాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు బలగాలను భారీగా మోహరించింది. దీంతో నజాఫ్‌లో రెండు కీలక వంతెనలపై బైఠాయించిన ఆందోళనకారులను బలవంతంగా ఖాళీ చేసేందుకు బలగాలు ప్రయత్నించాయి. ఈ సందర్భంగా బలగాలు జరిపిన కాల్పుల్లో 23 మంది చనిపోగా 165 మందికి పైగా గాయపడ్డారు. బాగ్దాద్‌లో రక్షితప్రాంతంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించిన నిరసనకారులపైకి బలగాలు కాల్పులు జరపగా నలుగురు చనిపోగా 22 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. -
ఐసిస్ చీఫ్ హతం
-
ఐసిస్ చీఫ్ బాగ్దాదీని పట్టించింది అతడే!
బాగ్దాద్ : సిరియాలో మారణహోమం సృష్టించిన ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బాకర్-అల్- బాగ్దాదీని మట్టుబెట్టేందుకు అతడి ప్రధాన అనుచరుడు ఇచ్చిన సమాచారమే తోడ్పడిందని ఇరాక్ భద్రతా అధికారులు తెలిపారు. సిరియాను నరకప్రాయం చేయడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా వేళ్లూనుకుపోయిన ఉగ్రమూక ఐఎస్ చీఫ్‌ను అమెరికా సేనలు ఆదివారం హతం చేసిన విషయం తెలిసిందే. చిన్నారులు సహా వేలాది మంది సిరియన్లను దారుణంగా హతమార్చిన అబు బాకర్ బాగ్దాదీని తమ సైన్యం చుట్టుముట్టడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ‘ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా పురుడుపోసుకున్న ఐఎస్ ఉగ్రవాద సంస్థ వేలాది మంది ప్రాణాలను తీసింది. కానీ.. దాని స్థాపకుడు బాగ్దాది చివరికి ఒక పిరికివాడిలా తనను తాను అంతం చేసుకున్నాడు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అబు బాకర్‌ను అంతమొందించడంలో తమకు సహకరించిన సిరియా కుర్దిష్ వర్గాలు, రష్యా, టర్కీ తదితర మిత్రదేశాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఇరాక్ భద్రతా అధికారులు ఈ ఆపరేషన్‌లో అబు బాకర్ ప్రధాన అనుచరుడు ఇస్మాయిల్ అల్-ఇతావీ ఇచ్చిన సమాచారం ఎంతగానో ఉపయోగపడిందంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.(చదవండి : ఐసిస్ చీఫ్ బాగ్దాదిని మేం చంపలేదు.. కానీ) కూరగాయల బస్సుల్లో వెళ్లేవాడు.. అబు బాకర్ జాడ కోసం అన్వేషిస్తున్న క్రమంలో అతడి ప్రధాన అనుచరుడు ఇతావీ 2018 ఫిబ్రవరిలో టర్కిష్ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని ఇరాక్ సేనలకు అప్పగించారు. ఈ క్రమంలో విచారణలో భాగంగా... ‘ఐదు ఖండాలలో తన ఉన్మాదంతో విధ్వంసం సృష్టించిన అబు బాకర్ ఎల్లప్పుడూ మినీ బస్సుల్లోనే తన సహచరులతో సమావేశమయ్యాడు. కూరగాయలతో నిండిన ఆ బస్సుల్లో వారంతా దొంగచాటుగా గమ్యస్థానాలకు చేరుకునేవారు. ఇస్లామిక్ సైన్సెస్‌లో పీహెచ్డీ చేసిన ఇతావీ అబు బాకర్ ఐదుగురు ముఖ్య అనుచరుల్లో ఒకడు. అతడు 2006లో ఉగ్ర సంస్థ ఆల్ ఖైదాలో చేరాడు. 2008లో అమెరికా సేనలకు పట్టుబడటంతో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఈ క్రమంలో ఇతావీ గురించి తెలుసుకున్న అబు బాకర్ తమతో చేతులు కలపాల్సిందిగా అతడిని కోరాడు. ఈ క్రమంలో మత పరమైన సూచనలు ఇవ్వడంతో పాటు ఇస్లామిక్ స్టేట్ కమాండర్లను ఎంపిక చేయడంలోనూ ఇతావీ కీలక పాత్ర పోషించేవాడు. ఇందులో భాగంగా 2017లో తన సిరియన్ భార్యతో కలిసి పూర్తిగా సిరియాకే మకాం మార్చాడు. అయితే 2018లో టర్కీ అధికారులకు అతడితో పాటు నలుగురు ఇరాకీలు, ఒక సిరియన్ చిక్కాడు. దీంతో వాళ్లను మాకు అప్పగించారు. అప్పుడే ఇతావీ మాకు బాగ్దాదీ గురించిన రహస్యాలన్నీ చెప్పాడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు సిరియాలోని ఇడ్లిబ్ అనే ప్రాంతంలో అబు బాకర్ తల దాచుకున్నాడని మాకు తెలిసింది. అయితే ఇడ్లిబ్‌పై పట్టు కలిగి ఉన్న, ఐఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసే మరో ఉగ్రసంస్థ నుస్రా ఫ్రంట్ అబు బాకర్‌ను చంపేందుకు వెంటపడటంతో.. అతడు తరచుగా వివిధ ప్రాంతాలకు పయనమయ్యేవాడు. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులు, ముగ్గురు అనుచరులను ఎల్లప్పుడూ వెంటబెట్టుకునేవాడని ఇతావీ తెలిపాడు. అదే విధంగా అతడు ఏయే సమయాల్లో ఏ చోట తల దాచుకుంటాడనే విషయాన్ని కూడా మాకు చెప్పాడు. దీంతో మేము అమెరికా భద్రతా సంస్థ సెంట్రల్ ఇంటలెజిన్స్ ఏజెన్సీతో సమన్వయం చేసుకుని... ఇడ్లిబ్ సమీప ప్రాంతాల్లో ఎక్కువ సైన్యాలను మోహరించాలని సూచించాం. ఈ క్రమంలో గత ఐదు నెలలుగా సీఐఏ డ్రోన్స్, సాటిలైట్స్‌తో ఆ ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేసింది. ఇప్పుడు అబు బాకర్ హతమయ్యాడు అని ఇరాక్ అధికారులు వెల్లడించారు. -
ఇరాక్ నిరసనల్లో 28 మంది మృతి
బాగ్దాద్: అవినీతి, నిరుద్యోగాలకు వ్యతిరేకంగా ఇరాక్ పౌరులు గత మూడు రోజులుగా కొనసాగిస్తున్న నిరసనలు గురువారానికి దక్షిణానికి విస్తరించాయి. ఇప్పటి వరకు ఈ నిరసనల్లో జరిగిన హింసలో 28 మంది చనిపోయారు. 600 మందికి పైగా నిరసనకారులకు, పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసు కాల్పులు, వాటర్ కెనాన్స్, భాష్పవాయు ప్రయోగాలకు వెరవకుండా ఇరాకీలు, ఎవరి నాయకత్వం లేకుండానే, ఈ నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి అదెల్ అబ్దెల్ మెహదీకి ఈ నిరసనలు పెద్ద సవాలుగా మారాయి. షియాలు ఎక్కువగా ఉండే పట్టణాల్లో నిరసనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రదర్శనల్లో ప్రధాన రాజకీయ పార్టీల జోక్యాన్ని నిరనసకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం విశేషం. -
ఇరాక్‌లో ఇందన్పల్లి వాసి మృతి
సాక్షి, జన్నారం: ఉపాధి వేటలో మరో కూలీ రాలిపోయాడు. ఉన్న ఊరిలో పని దొరక్క గల్ఫ్ వెళ్లిన కార్మికుడిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబలించింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్‌పల్లికి చెందిన రాగుల రాజేందర్(32) నాలుగు నెలల క్రితం ఉపాధి కోసం ఇరాక్ దేశం వెళ్లాడు. వెళ్లే సమయంలో ఏజెంట్‌కు రూ.2లక్షలు అప్పజెప్పాడు. అక్కడికి వెళ్లాక పని దొరకలేదు. దీంతో 20 రోజుల క్రితం ఇరాక్‌లోని ఎర్బిల్‌లో ఓ కంపెనీలో కూలీగా చేరాడు. పనిచేస్తూ వేరే చోట గదిలో ఉండేవాడు. ఈక్రమంలో శనివారం పని ముగించుకుని గదికి తిరిగి వెళ్తుండగా ఎర్బిల్లోని అక్వాం ప్రాంతంలో రోడ్డు దాటే క్రమంలో కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో రాజేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని రాజేందర్‌తో పనిచేస్తున్న స్నేహితులు ఇందన్‌పల్లిలోని కుటుంబీకులకు ఫోన్ ద్వారా చేరవేశారు. కుప్పకూలిన తల్లి.. కుమారుడి మరణ వార్త విని తల్లి ఎల్లవ్వ కుప్పకూలింది. గల్ఫ్ వెళ్లి కుటుంబాన్ని పోషిస్తాడనుకున్న కొడుకు విగత జీవుడిగా మారడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. మృతుడికి భార్య శైలజతో పాటు ఆరునెలల కుమారుడు మణికుమార్ ఉన్నారు. విషయం తెలుసుకున్న తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి మాటేటి కొమురయ్య ఫోన్లో కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అలాగే హైదరబాద్‌లోని గల్ఫ్ సెక్షన్ సెక్రెటరీ రాజుతోనూ మాట్లాడారు. ప్రవాస మిత్ర లేబర్ యూనియన్ పరామర్శ.. ఇరాక్‌లో మృతిచెందిన రాజేందర్ కుటుంబాన్ని ఆదివారం ప్రవాస మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పరికిపండ్ల స్వదేశ్ పరామర్శించారు. ఇందన్పల్లిలో కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇరాక్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి రాజేందర్ మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పిస్తామని తెలిపారు. అలాగే రాజేందర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. గల్ఫ్‌లో ఏదైనా సమస్య వస్తే వలస కార్మికులు ప్రభుత్వ హెల్ఫ్‌లైన్ నంబర్ 1800119030 లేదా మిత్ర లేబర్ యూనియన్ నంబర్ 9491613129లో సంప్రదించాలని కోరారు. -
మా వాళ్లను విడిపించరూ..!
జన్నారం(ఖానాపూర్): ‘మా నాన్న మాతో మాట్లాడక రెండు నెలలయితంది. ఇరాక్ దేశంలో జైళ్లో పడ్డాడట. అమ్మ వాళ్లు ఏడుస్తున్నరు. మా కోసం వేరే దేశం వెళ్లిన మా నాన్నను ఇంటికి తీసుకువచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలి. కేటీఆర్ సార్ మా మీద దయ చూపాలి, మా నాన్నను తీసుకురావాలి’అని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామానికి చెందిన కుంటాల లచ్చన్న పిల్లలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కవ్వాల్ గ్రామానికి చెందిన లచ్చన్న, షేర్ల రాజు ఉపాధి కోసం 2015లో ఇరాక్ వెళ్లారు. వీసా కోసం నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏజెంట్‌కు రూ.1.50 లక్షలు కట్టారు. ఏజెంట్ విజిట్ వీసాతో వారిని అక్కడికి పంపించాడు. అక్కడికి వెళ్లాక ఏజెంట్ మోసం చేశాడని తెలిసింది. దీంతో తెలిసిన వారి వద్ద ఉంటూ దొంగ చాటుగా పనిచేస్తూ జీవించారు. ఏడాది తర్వాత పనిచేసిన డబ్బులతో అఖా మా చేయించుకున్నారు. ఆ సమయంలో అప్పుల పాలయ్యారు. అఖామా వచ్చాక ఎర్బిల్లోని పాఠశాలలో పని దొరికింది. ఇద్దరూ అక్కడే పని చేస్తూ అఖామాకు చేసిన అప్పులు తీర్చారు. ఇక స్వదేశంలో చేసిన అప్పులే తీర్చాల్సి ఉంది. అప్పులు తీర్చి ఇంటికి వద్దామనుకున్నారు. ఏప్రిల్ 16న పోలీసులు వచ్చి ఎలాంటి కారణం లేకుండా వారిద్దరినీ పట్టుకెళ్లారు. ఎందుకు పట్టుకెళ్లారో.. ఎన్ని రోజులు జైళ్లో ఉంచుతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. -
ఇరాక్‌లో 71 మంది జలసమాధి
మోసుల్: ఇరాక్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. మోసుల్ నగరంలో టైగ్రిస్ నదిపై వెళుతున్న ఓ నౌక గురువారం నదీ ప్రవాహానికి పల్టీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 19 మంది చిన్నారులు సహా 71 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 55 మంది ప్రయాణికులను అధికారులు రక్షించారు. ఈ విషయమై ఇరాక్ ఆరోగ్యశాఖ మంత్రి సయిఫ్–అల్–బదర్ మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో నౌకలో 150 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. ఇది నౌక సామర్థ్యం కంటే రెట్టింపన్నారు. కుర్దుల నూతన సంవత్సరాది నౌరోజ్ సందర్భంగా వీరంతా మోసుల్ నుంచి ఉమ్–అల్–రబీన్ అనే పర్యాటక దీవికి బయలుదేరారని వెల్లడించారు. -
ఇరాక్‌పై ఎమిగ్రేషన్ నిషేధం పాక్షికంగా సడలింపు
న్యూఢిల్లీ : భారతీయులు ఇరాక్ దేశానికి వెళ్లడాన్ని (ఎమిగ్రేషన్) 2014 జులై 17న కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయితే, ఇరాక్‌పై ఉన్న ఎమిగ్రేషన్ నిషేధాన్ని పాక్షికంగా సడలిస్తూ కేంద్ర సర్కారు ఈ నెల 4న ఉత్తర్వులిచ్చింది. ఇరాక్‌లోని ప్రావిన్సులైన నినెవెహ్ (మోసుల్ రాజధాని), సలాహుద్దీన్ (టిక్రిత్ రాజధాని), దియాల, (బఖూబా రాజధాని), అంబార్ (రమాది), కిర్కుక్ ప్రాంతాలను మినహాయించి.. మిగతా ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లవచ్చని ప్రభుత్వం పేర్కొంది. భారత ప్రభుత్వ ఈ– మైగ్రేట్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. దీంతోపాటు బాగ్దాద్‌లోని ఇండియన్ ఎంబసీ లేదా ఇర్బిల్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయాలలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. -
పనులు లేక పస్తులు..
ఎన్.చంద్రశేఖర్, మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా) : కష్టపడి పనిచేసి తాము సంపాదించిన సొమ్మును ఇంటికి çపంపాలని ఎంతో ఆశతో ఇరాక్ వెళ్లిన కార్మికులు.. పనులు లేక పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 11 మంది కార్మికులు ఇరాక్‌లో తాము అనుభవిస్తున్న కష్టాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నాలుగు నెలల క్రితం కార్మికులు ఇరాక్ వెళ్లడానికి వీసాల కోసం నందిపేట్ మండలంలోని ఓ ఏజెంటును సంప్రదించారు. ఒక్కో కార్మికుని వద్ద రూ.1.80లక్షలు వసూలు చేసిన ఏజెంటు వర్క్ వీసాకు బదులు విజిట్ వీసా ఇచ్చి పంపించాడు. ఇప్పుడు విజిట్ వీసాపై వెళ్లాలని, ఇరాక్ వెళ్లిన తర్వాత తమ మరో ఏజెంటు వర్క్ వీసా ఇప్పిస్తాడని నమ్మించాడు. ఒక్కో కార్మికునికి నెలకు రూ.50వేల వరకు వేతనం ఉంటుందని చెప్పాడు. కానీ, స్వదేశంలోని ఏజెంటు చెప్పిన విధంగా ఇరాక్‌లో కార్మికులకు వర్క్ వీసా లభించలేదు. ఇరాక్‌లోనే ఉన్న జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌కు చెందిన మరో ఏజెంటు కార్మికులను కలుసుకున్నా పని మాత్రం చూపలేదు. ఎర్బిల్లోని ఒక అద్దె ఇంటిలో కార్మికులను దింపి మాయమయ్యాడు. ఒక వారం పాటు రోజూ భోజనం సరఫరా చేసి.. ఆ తరువాత రెండు, మూడు రోజులకు ఒకసారి మాత్రమే భోజనం అందిస్తున్నాడని కార్మికులు తెలిపారు. ఎర్బిల్లోని ఇంటికి అద్దెను ఏజెంటు చెల్లించకపోవడంతో తామే అద్దె భారం మోసామని వెల్లడించారు. నాలుగు నెలల నుంచి కార్మికులు అద్దె ఇంట్లో గడుపుతున్నారు. ఇరాక్‌లో ఉన్న తమ వారు పడుతున్న కష్టాలను తెలుసుకుని వారి కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఒక్కో కార్మికునికి రూ.50వేల వరకు పంపించారు. ఇరాక్ వెళ్లడానికి చేసిన అప్పుకు మరింత అప్పు తోడై తమ కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారిందని వాపోతున్నారు. రోజుకు 16 డాలర్ల చొప్పున జరిమానా.. ఇరాక్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందుకు అక్కడి ప్రభుత్వం రోజుకు 16 డాలర్ల చొప్పున జరిమానా విధిస్తుంది. అంటే రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1,200 వరకు జరిమానా భరించాల్సి ఉంటుంది. అంతేగాక ఇంటికి రావడానికి అవసరమైన విమాన చార్జీలు సైతం సొంతంగా సమకూర్చుకోవాలి. ఇరాక్ నుంచి ఇంటికి రావాలంటే ఒక్కో కార్మికుడు దాదాపు రూ.లక్ష వరకు ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఇరాక్‌లో ఉన్న తమ వారిని ఇంటికి రప్పించడానికి చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. -
ఇరాక్‌లో నరకం అనుభవిస్తున్న ఇందూరు వాసులు!
సాక్షి, నిజామాబాద్: నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయిన 15 మంది నిజామాబాద్ జిల్లా వాసులు ఇరాక్‌లో చిక్కుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి కల్పిస్తానని మోసగించి వీరిని నకిలీ ఏజెంట్.. విజిట్ వీసా మీద ఇరాక్ పంపించాడు. అక్కడికి వెళ్లిన తర్వాత తాము మోసపోయిన విషయాన్ని గుర్తించిన బాధితులు.. గత నాలుగున్నర నెలలుగా ఓ చిన్న గదిలో ఉంటూ.. స్వదేశానికి ఎలా చేరుకోవాలో తెలియక నరకం అనుభవిస్తున్నారు. ఏజెంట్ చేతిలో మోసపోయి ఇరాక్‌లో చిక్కుకుపోయిన నిజామాబాద్ జిల్లా వాసులను ఆదుకోవాలని, వారిని తిరిగి స్వస్థలానికి రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం ప్రతినిధి బసంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బాధితులను మోసగించిన నకిలీ ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
‘సిరియా ఎప్పుడైనా అమెరికాపై దాడి చేసిందా?!’
నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండే తత్త్వం.. ఎంతటి వారినైనా తన వాగ్ధాటితో మెప్పించగల చతురత.. యుద్ధరంగంలో శత్రువులను మట్టికరిపించే వ్యూహం.. నచ్చని అంశాలను నిర్భయంగా వ్యతిరేకించే నిక్కచ్చితనం.. వివాదాలను సైతం దీటుగా ఎదుర్కొనే దృఢచిత్తం.. అన్నీ కలిస్తే.. తులసి గబ్బార్డ్! ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడే అర్హత నూటికి నూరుపాళ్లు ఆమెకే ఉందంటారు తులసి సన్నిహితులు. ‘అవును.. ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాను. మా దేశ దశ దిశల గురించిన శ్రద్ధ నాకు ఉంది. అందుకే ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను’ అంటూ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయమై తన మనసులోని మాటను బయటపెట్టారు డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు, కాంగ్రెస్ సభ్యురాలు తులసి గబ్బార్డ్. అన్నీ సజావుగా సాగితే ఆమె అభ్యర్థిత్వం ఖరారు కావడం పెద్ద సమస్యేమీ కాకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ నుంచి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారందరి కంటే కూడా తులసే ఓ మెట్టు పైన ఉన్నారని అంటున్నారు ఆమె సహసభ్యులు. ఒకవేళ వారి మాటలు గనుక నిజమైనట్లైతే అధ్యక్ష పదవి కోసం బరిలో దిగే తొలి హిందువుగా తులసి చరిత్రకెక్కుతారు. అలాగే ఎన్నికల్లో గెలుపొందితే ఈ పదవి దక్కించుకున్న తొలి మహిళగా.. అత్యంత పిన్న వయస్సులో అగ్రరాజ్య పీఠాన్ని అధిరోహించిన వ్యక్తిగా... ఇలా పలు రికార్డులు ఆమె సొంతమవుతాయి. ఇక్కడ మరో విశేషమేమిటంటే తులసి హిందువు అని తెలియగానే చాలా మంది ఆమె ఇండో అమెరికన్ అని పొరబడ్డారు. కానీ ఆమె అమెరికన్ సమోవా సంతతికి చెందిన వారు! తల్లి ద్వారా హిందూ ధర్మమార్గంలోకి తనను తాను కర్మయోగిగా చెప్పుకొనే తులసి టీనేజ్ నుంచే హిందూధర్మాన్ని పాటించడం మొదలు పెట్టారు. అమెరికన్ సమోవా సంతతికి చెందిన మైక్ గబ్బార్డ్.. యూరోపియన్ సంతతికి చెందిన కరోల్ దంపతుల ఐదుగురు సంతానంలో తులసి నాలుగోవారు. క్యాథలిక్ ధర్మాన్ని పాటించే తండ్రి, హిందూ ధర్మాన్ని పాటించే తల్లి.. ఇలా చిన్ననాటి నుంచే తులసికి భిన్న మతాచారాలతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తల్లివైపే మొగ్గు చూపిన ఆమె ఇప్పటికీ హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నారు. చైతన్య మహాప్రభువు నెలకొల్పిన గౌడీయ వైష్ణవాన్ని ఆచరించే తులసితో పాటు.. ఆమె తోబుట్టువులు భక్తి, జై, నారాయణ్, బృందావన్లు కూడా హిందూ ధర్మాన్నే పాటిస్తున్నారు. భగవద్గీతను తన ఆధ్యాత్మిక గ్రంథంగా భావించే తులసి హిందూ సంప్రదాయం ప్రకారమే తన స్నేహితుడు అబ్రహం విలియమ్స్‌ను (2015లో) పెళ్లాడారు. సైనికురాలిగా ఉండేందుకే మొగ్గు 2002లో హవాయి స్టేట్ లెజిస్లేటివ్‌గా ఎన్నియ్యారు తులసి గబ్బార్డ్. తద్వారా అత్యంత పిన్న వయస్సు(21)లో ఈ పదవి అలంకరించిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. 2004లో అమెరికా ఇరాక్‌తో యుద్ధం ప్రకటించే నాటికే ఆమె సైన్యంలో చేరారు. అదే సమయంలో హవాయి లెజిస్లేచర్‌కు తిరిగి ఎంపికవ్వడం కోసం జరిగిన ఎన్నికల్లో పోటీ పడాలని నిశ్చయించుకున్నారు. కానీ యుద్ధ కారణాల రీత్యా పరాయిదేశంలో ఉన్న ఓ వ్యక్తి తనను ఎన్నుకున్న ప్రజలకు ఎంతవరకు న్యాయం చేయగలుగుతారంటూ... తులసిపై ప్రత్యర్థి విమర్శల దాడికి దిగడంతో.. తాను సైనికురాలిగా ఉండేందుకే ఇష్టపడతానని ఆమె స్పష్టం చేశారు. పదవికి రాజీనామా చేసి 2005లో ఇరాక్ యుద్ధంలో పాల్గొని తదనంతర కాలంలో మేజర్‌గా ర్యాంకు కూడా పొందారు. అంతేకాకుండా 2009లో కువైట్‌తో యుద్ధం జరిగినపుడు హవాయి నేషనల్ గార్డుగా, ఆర్మీ కెప్టెన్‌గా ఆమె సేవలు అందించారు. ఓ సైనికురాలిగా పూర్తిస్థాయి బాధ్యతలు నెరవేర్చడం కోసం వైవాహిక జీవితాన్ని కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల భర్త నుంచి విడిపోయారు ఆమె. భారత్ అంటే ప్రత్యేక అభిమానం హిందూ ధర్మాన్ని పాటించే తులసికి కర్మభూమిగా పేరొందిన భారతదేశం అంటే ప్రత్యేక అభిమానం. ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమెరికా పర్యటనకు వీసా నిరాకరించిన సమయంలోనూ ప్రభుత్వంపై విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు. 2014లో ప్రధాని హోదాలో మోదీ న్యూయార్క్‌లోని మేడిసన్ స్క్వేర్‌లో ప్రసంగించిన సమయంలో ఆయనను కలిసి అభినందించడంతో పాటు.. ప్రమాణస్వీకారం చేసే సమయంలో తన వద్ద పెట్టుకునే భగవద్గీతను మోదీకి బహూకరించారు. ఆమె ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ కాంగ్రెషనల్ ఇండియా కాకస్ (భారత్‌కు మద్దతు తెలిపే గ్రూపు) కో చైర్‌పర్సన్‌గా ఉన్నారు. హిల్లరీకి వ్యతిరేకంగా ప్రచారం! డెమోక్రటిక్ పార్టీలో చేరిన కొద్ది కాలంలోనే తన విలక్షణ వ్యక్తిత్వంతో కీలక నాయకురాలిగా ఎదిగారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే తులసి.. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి వార్తల్లో నిలిచారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి హిల్లరీకి పోటీగా బెర్నే సాండర్స్‌ను ప్రతిపాదించి మరీ ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ విషయంలో పలువురితో విభేదాలు తలెత్తడంతో పార్టీ నేషనల్ కమిటీ వైస్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు కూడా. వివాదాలు- విదేశాంగ విధానం... టెర్రరిజాన్ని వ్యతిరేకించే తులసి... 2017లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌ను కలిసేందుకు రహస్యంగా అక్కడికి వెళ్లడం వివాదాస్పదమైంది. ఈ పర్యటనకు హౌజ్ ఎథిక్స్ కమిటీ అనుమతి ఉందని చెప్పినప్పటికీ ప్రత్యర్థులు మాత్రం ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ‘ అతడిని కలిసే అవకాశం వచ్చింది. సిరియా ప్రజల పట్ల నిజమైన బాధ్యత ఉన్న వారెవరైనా నాలాగే చేస్తారు. వారి కష్టాలను స్వయంగా చూసే అవకాశం దక్కింది. శాంతిని పెంపొందించాలంటే చేతులు ముడుచుకుని కూర్చుంటే సరిపోదు. చర్చల ద్వారానే అది సాధ్యమవుతుంది. సిరియా ఎప్పుడైనా అమెరికాపై దాడి చేసిందా అని అక్కడి ప్రజలు అడిగినపుడు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. నిజానికి తప్పు ఎవరిది’ అంటూ తులసి తన చర్యను సమర్థించుకున్నారు. అంతేకాదు ఆల్‌ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రసంస్థలకు ప్రత్యక్ష, పరోక్షంగా మద్దతు తెలిపే దేశాలకు అమెరికా సహకరించకూడదని, వారికి నిధులు ఇవ్వడం ఆపేయాలని కోరుతూ అదే ఏడాది కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు తులసి. ఈ సందర్బంగా..‘ ఐసిస్, ఆల్‌ఖైదా వంటి సంస్థలు ఆయుధాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు సమకూర్చేది నేనైనా, మరెవరైనా సరే వారికి తప్పకుండా శిక్షపడాలి. వాళ్లను జైళ్లో పెట్టి తీరాలి. ఇటువంటి నిబంధనలను ఏళ్ల నాటి నుంచి అమెరికా ఉల్లంఘిస్తోంది’ అని అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పిన ధీశాలి తులసి. అందుకే.... మెడలో హారం, చేతిలో భవద్గీతతో విలక్షణమైన ఆహార్యం కలిగి ఉండే తులసి గబ్బార్డ్ అంటే ఇండో అమెరికన్లకు ప్రత్యేక అభిమానం. అధ్యక్ష పదవికి ఆమె పోటీచేయనున్నారనే విషయాన్ని ప్రకటించింది కూడా ఇండో అమెరికనే కావడం విశేషం. ఇక అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇండో అమెరికన్లు తులసి అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో ఆమెకు భారీ మెజార్టీ చేకూర్చడంలో తమ వంతు సాయం చేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో! - సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్ -
‘హింసించడంలోనే ఆనందమని వెకిలిగా నవ్వాడు’
ఒకప్పుడు ఐసిస్ బానిసగా మృగాళ్ల కబంధ హస్తాల్లో చిత్రవధ అనుభవించింది... కుటుంబాన్ని కోల్పోయింది.. మూడు నెలల పాటు తనపై కొనసాగిన అత్యాచారాలను తట్టుకోలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించింది.. కానీ నాడు అలా చేసి ఉంటే ఆమె పేరు ప్రపంచానికి తెలిసేదే కాదు.. ఆమె లాంటి ఎందరో లైంగిక బానిసలకు విముక్తి లభించేదీ కాదు.. కష్టాల కడలిని దాటి లైంగిక బానిస నుంచి నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా గుర్తింపు పొందిన నదియా మురాద్ వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం. లైంగిక హింసకు వ్యతిరేకంగా.. సాక్షి వెబ్‌డెస్క్ ప్రత్యేకం : లైంగిక హింసను అరికట్టేందుకు కృషి చేసినందుకు, అత్యాచార బాధితులకు అండగా నిలిచినందుకు ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి నదియా మురాద్ ఎంపికయ్యారు. ఆఫ్రికాకు చెందిన గైనకాలజిస్ట్ డెనిస్ ముక్వేజ్‌తో సంయుక్తంగా ఓస్లోలో డిసెంబరు 10న ఆమె శాంతి పురస్కారం అందుకోనున్నారు. అధికార దాహంతో వివిధ దేశాల్లో అంతర్యుద్ధానికి తెగబడుతున్న ఐసిస్ వంటి ఉగ్రమూకల రాక్షసక్రీడ(లైంగిక హింస)కు వ్యతిరేకంగా చేసిన పోరాట ఫలితంగానే వీరిద్దరిని అవార్డు వరించింది. డెనిస్ బాధితులకు అండగా నిలిస్తే నదియా స్వయంగా ఆ బాధలన్నీ అనుభవించారు. ఇరాక్‌కు చెందిన యాజాదీ యువతిగా తాను ఎదుర్కొన్న పరిస్థితులను ప్రపంచానికి తెలియజేసి తన లాంటి ఎంతో మందిని ఆ నరకం నుంచి విముక్తులను చేసేందుకు తన వంతు కృషి చేశారు... చేస్తూనే ఉన్నారు. ఆ మూడు నెలలు నరకం.. ‘ నాకు అప్పుడు 21 ఏళ్లు. 2014, జూలైలో లో నన్ను కిడ్నాప్ చేశారు. ఆ సమయంలో అడ్డొచ్చినందుకు మా అమ్మతో పాటు నా ఆరుగురు సోదరులను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత నాతో పాటు, నా మేనకోడళ్లను కూడా లైంగిక బానిసలుగా మెసూల్ పట్టణానికి తీసుకువెళ్లి ఇస్లాం మతంలోకి మార్చారు. మాలాంటి ఓ ముప్పై మంది బాధితులు ఉన్న శిబిరంలో మమ్మల్ని పడేశారు. రోజూ సుమారు అక్కడికి ఓ వంద మంది ఉగ్రవాదులు వచ్చేవారు. వారికి నచ్చిన వారిని ఎంపిక చేసుకుని రాక్షసానందం పొందేవారు. చిన్న పిల్లలైన నా మేనకోడళ్లపై కూడా వాళ్లు కనికరం చూపలేదు. ఈ అకృత్యాలను తట్టుకోలేక ఓ రోజు వారికి ఎదురు తిరిగాను. దీంతో కోపోద్రిక్తుడైన ఐసిస్ నాయకుడొకడు నన్ను తీవ్రంగా కొట్టాడు. చిత్రవధ చేశాడు. ఇలా హింసించే బదులు మమ్మల్ని చంపేయని అడిగాను. కానీ వాడలా చేయలేదు సరికదా ఇలా హింసించడంలోనే ఆనందం ఉందంటూ వెకిలిగా నవ్వాడు. ఇదంతా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ నా లాంటి ఎంతో మంది యువతుల జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి కదా. ఇంత పిరికిగా ఆలోచిస్తే లాభం లేదనుకుని తప్పించుకునే మార్గం కోసం అన్వేషించాను. ఆ సమయంలో మెసూల్లోని ఓ ముస్లిం కుటుంబం నాకు సహాయం చేసింది. అలా మూడు నెలల తర్వాత ఆ నరక కూపం నుంచి ఎలాగోలా బయటపడి శరణార్థుల శిబిరానికి చేరుకున్నాను. అయినా సిరియా- ఇరాక్ వంటి దేశాల్లో అంతర్యుద్ధం కొనసాగుత్నుంత కాలం యాజాదీల పరిస్థితి ఇంతకంటే మెరుగ్గా ఉంటుందా అని నాకు నేనే సమాధానం చెప్పుకొన్నాను’ అంటూ యాజాదీగా పుట్టినందుకు ఐసిస్ ఉగ్రమూకల అకృత్యాలకు బలౌతున్న కుర్దిషియన్ వర్గానికి చెందిన యాజాదీ యువతుల దీన పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు నదియా. ఆమె పరిచయంతో.. పోరాటం ఉధృతం శరణార్థుల శిబిరానికి చేరిన తర్వాత నదియా తమ బాధలను బాహ్య ప్రపంచానికి చెప్పే అవకాశం లభించింది. బ్రిటీష్ లాయర్, హక్కుల కార్యకర్త అమల్ క్లూనీ పరిచయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అమల్ ఇచ్చిన ప్రోత్సాహమే... తమకు జరుగుతున్న అన్యాయాన్ని నదియా ప్రపంచానికి చాటిచెప్పేలా చేసింది. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై తన గళం విప్పే అవకాశాన్ని కల్పించింది. అలా చేయడం ద్వారా సుమారు నాలుగున్నర లక్షల మంది బాధితులకు విముక్తి లభించింది. ‘ద లాస్ట్ గర్ల్’ ..బై నదియా మురాద్ తాను, తన వంటి యాజాదీలు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితుల గురించి ద లాస్ట్ గర్ల్ పేరిట నదియా ఒక పుస్తకాన్ని రాశారు. 2017లో ఆవిష్కరించిన ఈ పుస్తకానికి అమల్ క్లూనీ ముందుమాట రాసి మరోసారి నదియాకు మద్దతుగా నిలిచారు. అదే ఏడాది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇరాక్‌లో ఐసిస్ దురాగతాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించడంతో నదియా పోరాటానికి ఫలితం దక్కినట్లైంది. కన్నీళ్లే కాదు.. ఆనంద భాష్పాలు ఉంటాయని చెప్పిన ప్రియనేస్తం చిన్న వయస్సులోనే లైంగిక బానిసగా మారిన నదియా బహుశా తన జీవితంలో పెళ్లి అనే వేడుక ఉంటుందని అస్సలు ఊహించలేదేమో. ఎందుకంటే అప్పటి వరకు మృగాళ్లనే చూసిన నదియాకు అబిద్ షముదీన్ పరిచయం కాలేదు. అతడు కూడా యాజాదీ హక్కుల కార్యకర్త. ఎంతోమంది బాధితుల కష్టాలను కళ్లారా చూసిన వ్యక్తి. నదియా వ్యక్తిత్వానికి ముగ్ధుడైన అబిద్ ఆమెను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే తన ఆలోచనను ఆమెతో పంచుకున్నాడు. అబిద్‌పై ఉన్న అభిమానం ఆమె చేత సరేనని చెప్పించింది. ఈ క్రమంలోనే ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట త్వరలోనే వివాహబంధంతో ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యారు. ‘మా యాజాదీలు అనుభవిస్తున్న కష్టాలే మమ్మల్ని దగ్గర చేశాయి. వారికోసం ఇప్పటి నుంచి ఒక్కటిగా కలిసి పోరాడతాం అంటూ తనకు కాబోయే భర్త గురించి తన సోషల్ మీడియా పేజీలో రాసుకొచ్చారు 25 ఏళ్ల నదియా మురాద్. జీవితంలో కన్నీళ్లే కాదు ఆనంద భాష్పాలు కూడా ఉంటాయని చాటి చెప్పిన తన ప్రియనేస్తం అబిద్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. -
మోడల్ దారుణ హత్య
బాగ్దాద్ : తారా ఫేర్స్ అనే ఇరాకీ మోడల్ దారుణ హత్యకు గురైంది. తన ఇంటి నుంచి పోర్షే వాహనంలో బయల్దేరిన తారా(22)పై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి కాల్చి చంపారు. కారులో నుంచి ఆమెను కిందకి లాగి తుపాకీ గురిపెట్టి వరుసగా మూడు బుల్లెట్లు తలలోకి దించారు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాల్సిందిగా ఇరాక్ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. కాగా తారా మోడల్‌గా రాణిస్తూ తనకంటూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తారాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అయితే సంప్రదాయాలకు విరుద్ధంగా మోడల్‌గా పని చేస్తుందన్న కారణంగానే ఛాందసవాదులు తారను అత్యంత దారుణంగా చంపివేశారంటూ ఆమె అభిమానులు ఆరోపిస్తున్నారు. ‘అందరు అమ్మాయిల్లాగే జీవితాన్ని తనకు నచ్చినట్టుగా, సంతోషంగా గడపాలనుకున్న తారాను కొంత మంది ఉగ్రవాదులు కాల్చి చంపారు. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ గురువారం తారా వాళ్ల టార్గెట్. వచ్చే గురువారం ఇంకెవరో. స్వేచ్ఛగా జీవించాలనుకునే అమ్మాయిలకు ఇక్కడ ఇలా జరగడం సాధారణమైపోయింది కదా. నిజంగా సిగ్గు పడాల్సిన విషయం’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఇరాకీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఐసిస్‌పై లక్ష మిసైళ్లు
ఐసిస్.. సిరియా, ఇరాక్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడులు నిర్వహించి వేలాదిమందిని పొట్టనపెట్టుకున్న రాక్షసమూక. పశ్చిమాసియా దేశాలైన సిరియా, ఇరాక్‌లో గణనీయమైన భూభాగాన్ని అక్రమించుకుని ఖలీఫత్ పేరిట 2014లో ఏకంగా సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆయిల్, ఇతర సహజవనరుల్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ ఆ సొమ్ముతో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద భావజాలానికి మద్దతుగా నిలిచింది. మైనారిటీ మతస్తుల్ని బందీలుగా చేసుకుని గొంతు కోసి హతమార్చడం, తమ భావజాలాన్ని వ్యతిరేకించే సొంత మతస్తుల్ని సజీవ దహనం చేయడం వంటి దారుణ చర్యలతో వణుకు పుట్టించింది. అయితే ఇదంతా గతం. 2014లో ఐసిస్‌ను అణచివేసేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా భారీ ఎత్తున వైమానిక దాడులకు ఆదేశాలిచ్చారు. చివరికి 2017, అక్టోబర్‌లో ఐసిస్ ఉగ్రవాదులు నక్కిన చివరి నగరమైన రక్కాను సంకీర్ణ సేనలు స్వాధీనం చేసుకోవడంతో ఐసిస్‌ను ఓడించేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రకటించారు. అయితే నిజంగానే ఐసిస్‌ను పూర్తిగా అణచేశారా? భవిష్యత్‌లో ఉగ్రదాడులు చేయడానికి వీల్లేకుండా దాన్ని ఆర్థికమూలాల్ని పూర్తిగా నాశనం చేశారా? అంటే జవాబు కాదనే వినిపిస్తోంది. ఈ విజయం తాత్కాలికమే: జమాత్–అల్–తావీద్–వల్–జీహాద్ (జేటీజే) పేరుతో 1999లో ఏర్పడ్డ ఈ సంస్థ.. క్రమక్రమంగా పశ్చిమాసియాలో పట్టు పెంచుకోవడం ప్రారంభించింది. లాడెన్ నేతృత్వంలోని అల్‌కాయిదాకు విధేయత ప్రకటించుకున్న జేటీజే.. 2003లో ఇరాక్‌పై–అమెరికా యుద్ధంలో పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా దాడులకు పాల్పడింది. 2014 నాటికి ఇరాక్, సిరియాల్లో గణనీయమైన భూభాగాన్ని స్వాధీనం చేసుకుని సంస్థ పేరును ఐసిస్‌గా మార్చుకుంది. అప్పట్నుంచి ప్రపంచవ్యాప్తంగా సిరియా, ఇరాక్, ఫ్రాన్స్, బెల్జియం సహా 29 దేశాల్లో 140 ఉగ్రదాడులకు పాల్పడి వేలాది మందిని పొట్టనపెట్టుకుంది. కశ్మీర్‌లోనూ అల్లరిమూకలు ఐసిస్ జెండాలు ప్రదర్శించంపై భారత నిఘా సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఓ రక్షణ సంస్థ నివేదిక ప్రకారం సంకీర్ణ సేనలు ఐసిస్ అధీనంలోని 29,741 స్థావరాలపై ఇప్పటివరకూ 1,07,814 మిస్సైళ్లను, బాంబుల్ని ప్రయోగించాయి. ఈ దాడుల్లో 60,000 మంది ఉగ్రవాదులు, 6,321 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఓవైపు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు, మరోవైపు రష్యా, ఇరాన్, సాయంతో పోరాడుతున్న సిరియన్ బలగాలు ఐసిస్ కబంధ హస్తాల నుంచి చాలా పట్టణాలకు విముక్తి కల్పించాయి. అయితే ఈ విజయం తాత్కాలికమేననీ, ఇరుపక్షాల మధ్య దీర్ఘకాలిక పోరాటానికి ఇది ఆరంభమేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటివరకూ అఫ్గాన్‌లో 17 మంది అమెరికన్ కమాండర్లు మారినా పరిస్థితి మారకపోవడాన్ని గుర్తుచేస్తున్నారు. సోషల్ మీడియానే ఆయుధం: సంకీర్ణ సేనలు, రష్యా, ఇరాన్ బలగాల వరుస దాడులతో కుదేలయినప్పటికీ ఈ ప్రాంతంలో ఐసిస్ తన ప్రాబల్యాన్ని పూర్తిగా కోల్పోలేదని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. అమెరికా, యూరప్ దేశాలపై ఆత్మాహుతి దాడులతో విరుచుకుపడాలని సామాజిక మాధ్యమాల ద్వారా యువతకు ఉగ్రవాదులు విషాన్ని నూరిపోస్తున్నారని తెలిపారు. సరికొత్తగా గెరిల్లా యుద్ధ తంత్రాన్ని అనుసరిస్తున్నారన్నారు. ఇందులోభాగంగా యుద్ధాలు, ప్రభుత్వ అసమర్ధత కారణంగా ఉపాధి లేకుండా నిరుద్యోగులుగా ఉన్న యువతను భారీగా భర్తీ చేసుకుంటూ ఐసిస్, ఇతర ఉగ్రసంస్థలు శక్తిమంతంగా మారేందుకు యత్నిస్తున్నాయని చెప్పారు. ఉగ్రమూకల్ని అణచివేయడంలో సైనిక చర్య ద్వారా తాత్కాలిక ఫలితాలను మాత్రమే సాధించగలమనీ, దీర్ఘకాలంలో పరిస్థితిలో ఎలాంటి మార్పు రాబోదన్నారు. ఈ దేశాల్లో సామాజిక, ఆర్థిక, పర్యావరణ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని పరిష్కారానికి యత్నించినప్పుడు సానుకూల ఫలితాలు వస్తాయన్నారు. ► సంకీర్ణ సేనలు లక్ష్యంగా చేసుకున్న ఐసిస్ స్థావరాలు 29,741 ► ఐసిస్‌పై ప్రయోగించిన మిస్సైళ్లు, బాంబులు 1,07,814 ► హతమైన ఉగ్రవాదులు 60,000 ► చనిపోయిన పౌరులు 6,321 ► ఐసిస్ పంజా విసిరిన దేశాలు 29 ► ప్రపంచవ్యాప్తంగా జరిపిన ఉగ్రదాడులు 140 ► ఐసిస్ వద్ద ఆధునిక మెషీన్గన్ల నుంచి రసాయన ఆయుధాల వరకు ► ఇటీవలే బల్గేరియా నుంచి ఓ శక్తివంతమైన మిసైల్‌ను కూడా ఐసిస్ సేకరించిందన్న అమెరికా -
అల్యూమినియంలో దాగారు.. ఎక్స్-రేకు చిక్కారు..
ఇస్తాంబుల్ : కంటైనర్ల ద్వారా అక్రమంగా టర్కీలోకి ప్రవేశించాలని చూసిన ఏడుగురిని ఎక్స్ రే మిషన్ పట్టించింది. ఇరాక్ చెందిన ఏడుగురు టర్కీలోకి అక్రమంగా ప్రవేశించాలని చేసిన యత్నం మాత్రం ఆసక్తికరంగా ఉంది. అధికారులు గుర్తించకుండా ఉండేందుకు ఏడుగురు అల్యూమినియం షీట్లను తమ శరీరాలకు చుట్టుకున్నారు. అనుకున్నట్లే అధికారులు వారిని గుర్తించలేకపోయారు. అయితే, సరిహద్దులో ఎక్స్ రే మిషన్ చేసిన స్కాన్‌లో వీరి బండారం బయటపడింది. షీట్లలో ఏడుగురు వ్యక్తులు ఉన్నట్లు ఎక్స్ రే స్కాన్‌ను చూసిన అధికారులు తెలుసుకున్నారు. వెంటనే కంటైనర్‌ను తెరచి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
క్షణ క్షణం.. దుర్భర జీవితం
ఐసీస్‌పై పోరులో భాగంగా సంభవిస్తున్న పరిణామాల కారణంగా సొంత దేశంలోనే శరణార్థులుగా మారిన ఇరాకీ మహిళలకు ఆదరణ లభించకపోగా, వారిపై పెద్ద ఎత్తున íహింస, లైంగిక అకృత్యాలు జరుగుతున్నాయి!‘‘ప్రతిరోజూ నన్ను నేను రక్షించుకోవడం గగనమైపోతోంది. నాలుగు గోడలు, ఒకే తలుపు ఉన్న చిన్న గది ఉంటే చాలు. లోపలి నుంచి తాళం వేసుకుంటే బతికిపోతానని అనుకుంటాను. ఏ రోజుకు ఆ రోజు ఇదే నా చివరి రాత్రి అనుకుంటాను’’ గుండెలు పిండేసేలా ఉన్న ఓ బాధిత మహిళ తానున్న స్థితి గురించి చెప్పిన మాటలివి! ‘‘అసలు నేనెందుకు ఇంకా బతికి ఉన్నాను? ఐసీస్‌పై పోరులో జరిగిన వైమానిక దాడుల్లోనే చనిపోకుండా ఎందుకింకా బతికున్నాను?’’ అంటూ ఆమె వాపోతోంది. ‘‘నేను జైలులో ఉన్నట్టే అనుకుంటున్నాను. భర్త, తండ్రి మరెవరూ లేక ఏకాకిగానే భావిస్తున్నాను. ఈ ఒత్తిళ్లు ఎదుర్కోలేక కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. కానీ పిల్లల మొహం గుర్తుకు వచ్చి ఆగిపోయాను’’ అని అంటోంది! ఆమె ఒక్కరే కాదు, ఇరాక్‌లోని సహాయ, పునరావాస శిబిరాల్లోని మొసుల్ ప్రాంత మహిళలు, ముఖ్యంగా ఐసీస్‌తో సంబంధాలున్నట్టు భావిస్తున్న వారి కుటుంబ సభ్యులు.. సంక్షోభ ప్రాంతాల్లో తీవ్రమైన హింస, పీడనలు ఎదుర్కొంటున్నారు. రక్షకులే భక్షకులౌతున్నారు! ఇస్లామిక్ స్టేట్ (ఐసీస్) తీవ్రవాదులతో కుటుంబ సంబంధాలున్నాయన్న అనుమానాలపై ఇరాకీ మహిళలు అత్యాచారాలు మొదలుకుని వివిధ రూపాల్లో లైంగిక హింసకు, దోపిడీకి గురవుతున్నారు. ఇరాక్‌లోని అంతర్గత శరణార్థ ప్రజల (ఇంటర్నల్ డిస్ప్లేస్డ్ పీపుల్) శిబిరాల్లోనూ వీరికి వేధింపులు తప్పడం లేదు. ఐసీస్‌పై పోరులో భాగంగా సంభవిస్తున్న పరిణామాల కారణంగా తమ సొంత దేశంలోనే శరణార్థులుగా మారిన ఆడవారికి ఆదరణ లభించాల్సిన చోటే పెద్ద ఎత్తున హింసకు, లైంగిక అకృత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి దురదృష్టకర పరిస్థితులు ఎదుర్కొంటున్న మహిళల కోసం ఏర్పాటు చేసిన శిబిరాల్లోనే; సహాయ, సహకారాలు అందించి చేదోడు వాదోడుగా నిలవాల్సిన వారే ఈ లైంగిక దోపిడీకి తెరతీస్తున్నారు! బాధితులను తిరిగి తమ సొంత గ్రామాలు, ప్రాంతాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కొందరు కష్టం మీద ఇళ్లకు చేరుకున్నా వారికీ ఇక్కట్లు తప్పడం లేదు. వారి ఇళ్లపై ఐసీస్ అంటూ ముద్ర వేయడంతో పాటు కరెంట్, నీళ్లు, ఇతర సర్వీసులు కట్ చే సేస్తున్నారు. దుర్భర స్థితిపై ఆమ్నెస్టీ నివేదిక ఇరాక్‌లోని ఎనిమిది క్యాంప్‌లను పరిశీలించిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అక్కడ నెలకొన్న పరిస్థితులను ఓ నివేదికలో కళ్లకు కట్టినట్టుగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఈ క్యాంపుల్లోని 92 మంది మహిళలను కలుసుకుని వారి జీవన స్థితిగతులపై ఆరా తీసింది. వీరంతా కూడా తమ బాధామయ జీవితాన్ని, తమకు ఎదురైనా ఘోరమైన అనుభవాలను పూసగుచ్చినట్టు వివరించారు. యుద్ధంలో ఐసీస్‌కు తగిలిన ఎదురుదెబ్బ కారణంగా మొసుల్ నుంచి పారిపోతున్న క్రమంలో ఈ మహిళల భర్తలు మరణించడం, అరెస్ట్ కావడం, లేదా కనిపించకపోవడం వంటి ఘటనలు పెద్ద సంఖ్యలోనే చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో వేలాది మంది ఆడవాళ్లు తమ కుటుంబాలను తామే నిర్వహించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వారిపైన కూడా సహాయం పేరిట అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రోదనలు, పెడబొబ్బలు ఈ సహాయ, పునరావాస శిబిరాల్లోని మహిళలు అత్యాచారానికి, లైంగిక హింసకు గురవుతున్న సమయంలో అరుపులు,పెడబొబ్బలు వినిపించేవని ఆమ్నెస్టీకి అక్కడి మహిళలు తెలియజేశారు. రక్షణ, ఆహారం, నీళ్లు, ఇతర రూపాల్లోని మానవతా సహాయం, అత్యవసరాల కోసం డబ్బు.. అందివ్వడానికి ప్రతిఫలంగా నిర్బంధ శారీరక సుఖం కోసం ఇక్కడి మహిళలపై సైనికులు, శిబిరాల్లోని సిబ్బంది ఒత్తిడి తెస్తున్నారని ఓ మహిళ వాపోయింది. ఈ శిబిరాల్లోని మహిళలంతా కూడా తమ రక్షణ, భద్రత గురించి ఇదే విధమైన భయాందోళనలు వ్యక్తం చేశారు. మహిళలపై హింస, లైంగికదాడుల నివారణకు ఇరాకీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. ఈ శిబిరాల్లో అమానుషమైన పద్ధతుల్లో దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ క్యాంప్‌ల్లోకి మగవారెవరూ అడుగు పెట్టకుండా నిరోధించాలి. – లిన్ మాలౌఫ్, డైరెక్టర్, ఆమ్నెస్టీ మిడిల్ ఈస్ట్ రీసెర్చ్ – కె.రాహుల్, సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు..16 మంది మృతి
బాగ్దాద్ : ఆయుధాలు ధరించిన ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 16 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఇరాక్‌లోని సలాహుద్దీన్ ప్రావిన్స్‌లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాగ్దాద్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుజైల్ పట్టణంలోని ఓ గ్రామంలో ఆయుధాలతో వచ్చిన వ్యక్తి మూడు ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని కాల్పులు జరిపాడని స్థానిక లుటెనంట్ కల్నల్ మహమ్మద్ అల్ జుబౌరీ తెలిపారు. కాల్పులు జరిగిన మూడు ఇళ్లు రహిమ్ అల్ మర్జౌక్ అనే న్యాయమూర్తి ముగ్గురు కుమారులవిగా గుర్తించారు. చనిపోయిన వారంతా ఈ ముగ్గురు కుటుంబాలకు చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నారు. ఈ ఘటనపై భద్రతా బలగాలు దర్యాప్తు ప్రారంభించాయి. సంఘటనాస్థలాన్ని సీజ్ చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన్నట్లు జుబౌరీ తెలిపారు. -
13 మంది నిందితులను ఉరి
-
13 మందికి ఉరి
బాగ్దాద్: ఉరిశిక్ష విధించరాదని అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్నప్పటికీ ఇరాక్ తాను అనుకున్న పని చేసింది. ఉగ్రవాదంతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో 13 మంది నిందితులను ఉరి తీసినట్లు ఇరాక్ అధికారులు తెలిపారు. కారు బాంబులు, సెక్యూరిటీని చంపడం, కిడ్నాపులు తదీతర నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలు 11 మందిపై నిరూపితమయ్యాయని ఇరాక్ మంత్రిత్వశాఖ తెలిపింది. మరో ఇద్దరు దోషుల గురించి వివరాలు వెల్లడించలేదు. ఏ ఒత్తిడి ద్వారా ప్రభావితం కాకుండా చట్టం అమలు చేయడంలో అంకితభావం ప్రదర్శిస్తున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ఇరాకీ న్యాయస్థానాల్లో పారదర్శకత లేకపోవడంతో యూరోపియన్ యూనియన్‌తో పాటు పలు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. 2003, జూన్ 3న ఇరాక్‌లో మరణశిక్షను తాత్కాలికంగా రద్దు చేశారు. కానీ పలు కారణాలతో 2004, ఆగస్టు 8న మళ్లీ మరణశిక్ష ఇరాక్‌లో అమలులోకి వచ్చింది. -
స్వదేశానికి ‘ఇరాక్ మృతదేహాలు’
అమృత్సర్/కోల్‌కతా: ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన 39 మంది భారతీయుల్లో 38 మృతదేహాలను ప్రత్యేక విమానంలో కేంద్రం సోమవారం భారత్‌కు తీసుకొచ్చింది. మరొక మృతదేహం ఎవరిదనే విషయం కచ్చితంగా నిర్ధారణ కాకపోవటంతో దాన్ని ఇరాక్‌లోనే ఉంచారు. మృతదేహాలను తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఆదివారం ఇరాక్ వెళ్లడం తెలిసిందే. 38 మృతదేహాల్లో 27 పంజాబ్‌కు, నాలుగు హిమాచల్ ప్రదేశ్‌కు చెందినవి కావడంతో ఆ 31 మృతదేహాలను అమృత్‌సర్‌లోని విమానాశ్రయంలో బంధువులకు అప్పగించారు. మిగిలిన ఏడింటిని కోల్‌కతా, పట్నా విమానాశ్రయాల్లో ఆప్తులకు అధీన పరిచారు. వీరంతా దాదాపు సంవత్సరం క్రితమే చనిపోయారనీ, భూమిలో పాతిపెట్టిన శవాలను ఇటీవల వెలికి తీసి తెచ్చినందున ఇప్పుడు ఈ శవపేటికలను తెరవడం మంచిది కాదని వీకే సింగ్ సూచించారు. శవాలను పాతిపెట్టిన స్థలంలో విషపదార్థాలు ఉండేవనీ, అలాగే మృతదేహాలను ఎంబామింగ్ చేసి శవపేటికల్లో పెట్టడంతో వాటిని తెరవడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. -
ఆ 38 మృతదేహాలను భారత్‌కు..
అమృత్సర్: పొట్టకూటికోసం ఇరాక్ వెళ్లి, అంతర్యుద్ధం సమయంలో ఐసిస్ చేతిలో కిరాతకంగా హతమైన 38 మంది భారతీయు మృతదేహాలు సోమవారం స్వదేశానికి చేరుకున్నాయి. పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఆర్మీ విమానంలో బాగ్ధాద్ నుంచి అమృత్సర్(పంజాబ్)కు తరలించారు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సూచనమేరకు సహాయ మంత్రి వీకే సింగ్ స్వయంగా ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. మృతదేహాలను తీసుకొచ్చేందుకుగానూ సింగ్ ఆదివారం ఆర్మీకి చెందిన విమానంలో బాగ్ధాద్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అత్యధికులు పంజాబీలే: ఇరాక్‌లో చనిపోయిన 39 మందిలో ఒక మృతదేహానికి ఇంకా పరీక్షలు నిర్వహించాల్సిన ఉండగా, మిగిలిన 38 మంది మృతదేహాలు స్వదేశానికి చేరుకున్నాయి. వీరిలో అత్యధికులు పంజాబీలే కావడం గమనార్హం. సోమవారం తీసుకొచ్చిన 38 మృతదేహాల్లో 27 దేహాలను పంజాబ్‌లోనే దించేశారు. అక్కడి నుంచి ఆయా మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు. మిగిలిన మృతదేహాలను పట్నాకు తరలించారు. బాగ్ధాద్లోని భారత రాయయార కార్యాలయం మృతదేహాల తరలింపులో కీలక పాత్ర పోషించింది. కాగా, ఆ 39 మందిని చంపేశారు మంత్రి ఆగ్రహం: 38 మృతదేహాలతోపాటు అదే విమానంలో తిరిగొచ్చిన మంత్రి వీకే సింగ్‌ను అమృత్సర్ ఎయిర్‌పోర్టు నుంచి పంజాబ్ రాష్ట్ర మంత్రులు నవజ్యోత్ సింగ్ సిద్దూ, ఇంకొందరు తోడ్కొని వెళ్లారు. అనంతరం వీకే సింగ్ మీడియాతో మాట్లాడారు. ‘మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తారా?’ అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇది ఫుట్‌బాల్ ఆడినట్లో లేదా బిస్కెట్లు తయారుచేసినంత సులువైన పనికాదు. ఇప్పటికిప్పుడు పరిహారంపై నన్నడిగితే ఏం చెప్పాలి? కేంద్రం, రాష్ట్రాలు ఉమ్మడిగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అప్పటిదాకా నేనేమీ చెప్పలేను’’ అని విసుక్కున్నారు. బాగ్ధాద్ విమానాశ్రంలో దృశ్యాలు.. -
38 మంది భారతీయుల మృతదేహాల తరలింపు
-
త్వరలోనే స్వదేశానికి భారతీయుల మృతదేహాలు
న్యూఢిల్లీ/చండీగఢ్: ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదుల చేతుల్లో హతమైన 39 మంది భారతీయుల మృతదేహాలను వారం రోజుల్లో భారత్‌కు తీసుకురానున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. సోమవారం తనను ఢిల్లీలో కలిసిన బాధిత కుటుంబసభ్యులకు సుష్మ ఈ విషయాన్ని తెలిపారు. ఇందుకోసం విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ స్వయంగా ఇరాక్ వెళ్లి మొత్తం లాంఛనాలను పూర్తి చేస్తారని తెలిపారు. ఇరాక్‌కు ఉద్యోగాలకు వెళ్లినవారే తమ కుటుంబ పోషణకు ఆధారమని కుటుంబసభ్యులు సుష్మకు తెలిపారు.ప్రభుత్వం ఇచ్చిన భరోసాను.. మృతదేహాలను వెనక్కు రప్పించేందుకు చేస్తున్న యత్నా లను వారు అభినందించారు. ‘ప్రభుత్వం అన్ని రకాల హామీలను ఇచ్చింది. కుటుంబంలో ఒక రికి ప్రభుత్వోద్యోగం ఇచ్చే ప్రయత్నం చేస్తా మని సుష్మాజీ చెప్పారు. ఇందుకోసం బాధితులకు చెందిన నాలుగు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడతానన్నారు. మృతదేహాలను వారంలోగా భారత్ తెస్తామన్నారు’ అని మృతుడు గోవింద్ సింగ్ సోదరుడు తెలిపారు. -
బందీల మరణరహస్యం
ఇరాక్‌లోని మోసుల్‌లో నాలుగేళ్లక్రితం ఐఎస్ ఉగ్రవాదులకు బందీలుగా చిక్కి ఆచూకీ లేకుండాపోయిన 39 మంది భారత పౌరులు ఆ ఉన్మాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ఎట్టకేలకు పార్లమెంటులో ప్రకటించారు. వీరంతా పంజాబ్, బిహార్, హిమాచల్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్‌కు చెందినవారు. పుట్టిన గడ్డపై పొట్ట నిండక బతుకు తెరువు కోసం ఎంత దూరమైనా పోవడానికి సిద్ధపడుతున్న వలస కార్మికులు ఎన్నో కడగండ్లు పడుతున్నారు. అటు ఉగ్రవాద మూకల దాడులు, ఇటు అమెరికా సేనలు సాగించే ద్రోన్ దాడులతో ఇరాక్ వంటి దేశాలు వల్లకాటిగా మారాయి. అటువంటి చోటకు సైతం వెళ్లడానికి సాహసించారంటేనే ఆ కార్మికుల కుటుంబాలు ఎంత దీనస్థితిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. మోసుల్ ఉదంతంలో చిక్కుకుని ఐఎస్ ఉగ్రవాదుల కన్నుగప్పి తప్పించుకొచ్చిన హర్జిత్ మాసి అప్పట్లోనే తనతోపాటున్న 39 మందినీ వారు కాల్చి చంపారని చెప్పాడు. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని కొట్టిపారేసింది. వారంతా ఇంకా సజీవంగానే ఉన్నారని తమకు సమాచారం అందిందని, ఆ బందీల విడుదల కోసం సకలవిధాలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత సైతం బందీల కుటుంబాలవారికి సుష్మా అలాగే చెబుతూ వచ్చారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఉన్నట్టుండి ఆ బందీలను ఉగ్రవాదులు కాల్చిచంపారని చెబితే ఆ కుటుంబాలు ఏమైపోవాలి? కేంద్రం కేవలం హర్జిత్ మాసి చెప్పిన కథనాన్ని కొట్టిపారేసి ఊరుకోలేదు. పోలీసులు అతన్ని నిర్బంధంలోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల నుంచి అతన్ని సంరక్షించే ఉద్దేశంతోనే ఈ పని చేశామని చెప్పారు. స్వేచ్ఛగా వదిలిన కొన్నాళ్ల తర్వాత మళ్లీ వేరే కారణంతో అతను జైలుకు పోవాల్సివచ్చింది. ఏం చేసినా అతను తొలుత చెప్పిన మాట మీదే ఉన్నాడు. భవన నిర్మాణ పనిలో ఉండగా వచ్చిన ఉగ్రవాదులు అందరినీ అపహరించారని, ఆ తర్వాత తమలో ఉన్న బంగ్లాదేశ్ పౌరు లను విడిచిపెట్టారని చెప్పాడు. ఆ మర్నాడు ఒక కొండపైకి తీసుకెళ్లి బందీలందరినీ వరసబెట్టి కాల్చేసినప్పుడు తనకు అదృష్టవశాత్తూ కాలిలో తూటా దూసుకు పోయిందని, చచ్చినట్టు నటించి వాళ్లు నిష్క్రమించాక సురక్షిత ప్రాంతానికి చేరు కుని భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించానని చెప్పాడు. హర్జిత్ చెప్పిన కథనాన్ని ఆ ఉదంతంలో బయటపడ్డ బంగ్లా పౌరులు కూడా మరికొన్నాళ్లకు ధ్రువీ కరించారు. ఒక ఆంగ్ల దినపత్రిక రెండేళ్లక్రితం కుర్దుల ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఉటంకిస్తూ భారత పౌరుల్ని ఉగ్రవాదులు హతమార్చారని వెల్లడించింది. అప్పుడు కూడా కేంద్రం ఆ కథనాన్ని ఖండించింది. చివరకు మోసుల్ నుంచి ఐఎస్‌ను తరిమి కొట్టిన ఏడెనిమిది నెలల తర్వాతగానీ బందీల మరణంపై ప్రకటన చేయలేదు. నిజమే... ఒక మతిమాలిన గుంపు చెరలో ఉన్న వ్యక్తిని విడిపించడం అంత సులభమేమీ కాదు. పైగా రాజ్యం నియంత్రణలేని ప్రాంతంలో... ఎవరి హిత వచనాలూ, వేడుకోళ్లూ తలకెక్కనిచోట వేరే దేశం బలప్రయోగం చేయడం లేదా వారితో ఓపిగ్గా చర్చించడం అసాధ్యం. కానీ అలాంటిచోట సైతం బందీల చెర నుంచి విజయవంతంగా విడిపించిన చరిత్ర మన ప్రభుత్వానికుంది. ఇరాక్‌లోనే తిక్రిత్ ప్రాంతంలో ఇదే ఐఎస్ ఉగ్రవాదుల చెరలో మన దేశానికి చెందిన 46 మంది నర్సులు చిక్కుకున్నప్పుడు మన అధికారులు అత్యంత చాకచక్యంగా వ్యవ హరించారు. మధ్యవర్తులను గుర్తించి వారి ద్వారా ఉగ్రవాదులతో సంప్రదింపులు జరిపారు. ఒక దశలో ఆ సంప్రదింపులు విఫలమయ్యాయని, నర్సులందరినీ ఎక్కడికో తరలించాలని ఉగ్రవాదులు సంకల్పించారని వార్తలొచ్చాయి. అలాంటి సమయంలో కూడా అధికారులు జాగ్రత్తగా అడుగులేశారు. ఎలా చేశారో, ఏం చెప్పి ఒప్పించారో ఇప్పటికీ వెల్లడికాలేదు. కానీ ‘సంప్రదాయేతర విధానాల’ ద్వారా బందీలకు విముక్తి కలిగించామని మాత్రం చెప్పారు. ఒకప్పుడు సద్దాం హుస్సేన్ హయాంలో పనిచేసిన బాత్ పార్టీ ముఖ్యులు, సైన్యంలో కీలకపాత్ర పోషిం చినవారు ఐఎస్‌లో చురుగ్గా ఉన్నారు. ఐఎస్ చేజిక్కించుకున్న నగరాలకు వారు ‘మేయర్లు’గా వ్యవహరించారు. అలాంటివారి ద్వారా ఆ నర్సులను విడుదల చేయించగలిగారు. మరి ఆ పనే ఇక్కడెందుకు చేయలేకపోయారు? స్వయంగా ఆ ఉదంతంలో చిక్కుకుని బయటపడ్డ వ్యక్తిని నోర్మూయించే ప్రయత్నం ఎందుకు చేశారు? ఆ తర్వాత బందీల విషయంలో ఆ వ్యక్తి చెప్పింది నిజమేనని వేరే వ్యక్తులు ధ్రువీకరించినప్పుడు సైతం అది నిజం కాదని అంత గట్టిగా ఎలా చెప్పగలిగారు? ఎందుకని ఇన్నేళ్లుగా బాధిత కుటుంబాలకు ఆశలు కల్పించారు? అయిదారు వర్గాల సమాచారం ఆధారంగా బందీలు క్షేమంగా ఉన్నారని ధ్రువీకరించుకున్నామని ఎందుకు నమ్మబలికారు? మోసుల్‌లో బందీలైనవారంతా నిరుపేదలు. పూటకు గతిలేని కుటుంబాల వారు. అందువల్లే తమవారి గురించి పట్టించుకోలేదని, ఎలాంటి ప్రయత్నాలూ చేయకపోయినా, ధ్రువీకరించుకోదగ్గ సమాచారమంటూ లేకపోయినా నాలుగేళ్లుగా కట్టుకథలు వినిపించారని ఆ కుటుంబాలు ఆక్రోశిస్తున్నాయి. నిరుడు అక్టోబర్‌లో తమ నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించినప్పుడే అనుమానాలొచ్చాయని కొంద రంటున్నారు. కుటుంబ పెద్దగా ఉంటున్నవారు, ఆత్మీయులు ఉన్నట్టుండి కనుమరుగయ్యారంటే ఎలాంటివారైనా వేదనపడతారు. ఆచూకీ లేకుండా మాయమైతే, ఏళ్లు గడుస్తున్నా ఏ సమాచారమూ లేకపోతే ఆ బాధ మరింతగా పెరుగుతుంది. నరరూప రాక్షసుల చెరలో మగ్గుతున్నారని తెలిస్తే వారికి ఏ క్షణంలో ఏమవుతుందో, ఎలాంటి చిత్రహింసలు చవిచూస్తున్నారో అనుకుంటూ అను క్షణమూ కుమిలిపోతారు. పాలకులు దృఢంగా వ్యవహరిస్తున్నామని మాత్రమే అనుకుంటే సరిపోదు. ఇలాంటి విషయాల్లో సున్నితంగా కూడా ఆలోచించాలి. తమ నిర్వా్యపకత్వాన్నో, నిస్సహాయతనో వెనువెంటనే నిజాయితీగా వెల్లడించి ఉంటే ఇన్నేళ్ల క్షోభ వారికి తప్పేది. ఈపాటికి కాస్తయినా కోలుకునేవారు. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం ఆ బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి. వారికి జీవనోపాధి కల్పించాలి. -
ఇది అమానవీయం కాదంటారా?
సాక్షి, న్యూఢిల్లీ : ఇరాక్‌లో అదృశ్యమైన 39 మంది ఎలా ఉన్నారన్న సమాచారం కోసం గత నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్న వారి కుటుంబ సభ్యులకు మంగళవారం నాడు వారు భరించలేని విషాద వార్తలను భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఇరాక్ ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే ఇరాక్‌లో 40 మంది భారతీయ కార్మికులను ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు కిడ్నాప్ చేశారన్న వార్త వెలుగులోకి వచ్చింది. అంటే, ఇది మోదీ ప్రభుత్వానికి మొట్టమొదటి సవాల్. ఈ సవాల్‌ను ఎంత సీరియస్‌గా తీసుకున్నా టెర్రరిస్టుల చేతుల నుంచి భారతీయులను విడిపించడం అంత సులువు కాకపోవచ్చు. కానీ నాలుగేళ్లుగా వారు క్షేమంగా ఉన్నారని, వారిని సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పదే పదే చెబుతూ సుష్మా స్మరాజ్ భారతీయులను, ముఖ్యంగా కుటుంబ సభ్యులను ఎందుకు మభ్య పెడుతూ వచ్చారన్నదే జవాబు దొరకని ప్రశ్న. సుష్మా స్మరాజ్ ఈ నాలుగేళ్లలో ఆరుసార్లు నిర్బంధితుల క్షేమ సమాచారంపై ప్రకటనలు విడుదల చేశారు. ప్రతి ప్రకటనలో వారు ‘ప్రాణాలతో ఉన్నారు, క్షేమంగా ఉన్నారు’ను నొక్కి చెప్పారు. వారిని కాల్చివేయడాన్ని తాను కళ్లారా చూశానంటూ టెర్రరిస్టుల చెర నుంచి తప్పించుకొని వచ్చిన హార్జీత్ మాసిహ్ వెల్లడించిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేయడంలో అర్థం ఏముంది? తప్పించుకొచ్చిన వైనంపై హార్జీత్ చెప్పిన మాటలు నమ్మశక్యంగా అనిపించలేదని, అందుకనే ఆయన మాటలను నమ్మలేదని సుష్మా ఇప్పుడు వివరణ ఇస్తున్నారు. అసలు ఆమె మాటలే నమ్మశక్యంగా లేవు. వారు క్షేమంగా ఉన్నట్లు కచ్చితమైన సమాచారం లేకుండా ఆమె ఎందకు ప్రకటనలు చేసినట్లు? ఎందుకు మభ్యపెట్టినట్లు? పైగా ఇరాక్‌లోని ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టుల నిర్బంధంలో ఉన్నవారిని విడిపించి తీసుకరావడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను పంపిస్తున్నట్లు కథలు ప్రచారం అయ్యాయి. ఒక వర్గం మీడియా అయితే నాడు అజిత్ దోవల్‌ను భారతీయ జేమ్స్ బాండ్‌గా అభివర్ణించింది. చివరకు నిర్బంధితులు క్షేమంగా లేరని, వారిని ఎప్పుడో చంపేశారనే విషయం తెల్సిన తర్వాత కూడా ఈ విషయాన్ని సుశ్మా స్వరాజ్ వారి కుటుంబ సభ్యులకు ముందుగా తెలియజేయకుండా, పార్లమెంట్‌కు ముందుగా తెలియజేయడం అమానవీయమే! -
ఐఎస్ అపహరించిన 39 మందిని చంపేశారు
-
ఆ 39 మందిని చంపేశారు
న్యూఢిల్లీ: ఇరాక్‌లో నాలుగేళ్ల క్రితం ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు అపహరించిన భారతీయుల కథ విషాదాంతమైంది. ఆ 39 మంది భారతీయులు చనిపోయారని, వారి మృతదేహాలను గుర్తించామని కేంద్రం ప్రకటించింది. వారిని ఉగ్రవాదులు ఊచకోత కోసి మోసుల్ పట్టణం సమీపంలోని బదోష్ అనే గ్రామంలో పూడ్చిపెట్టినట్లు గుర్తించామని తెలిపింది. డీఎన్ఏ పరీక్షల అనంతరం వారు అపహరణకు గురైన భారతీయులేనని నిర్ధారణకు వచ్చినట్లు మంగళవారం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభకు తెలిపారు. లోక్‌సభలోనూ సుష్మ ఈ విషయం ప్రకటించాల్సి ఉన్నా ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య సభ వాయిదా పడింది. అయితే, ఈ విషయాన్ని ముందుగా బాధిత కుటుంబ సభ్యులకు తెలపకుండా, సభలో ప్రకటించడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. బాధిత కుటుంబాల పట్ల ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తించిందని విమర్శించాయి. భారతీయుల అపహరణ విషయంలో ప్రభుత్వం ఇన్నాళ్లూ వారిని తప్పుదోవ పట్టించిందని ఆరోపించాయి. బాధిత కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 2014లో మోసుల్ పట్టణం ఐఎస్ ఉగ్రవాదుల అధీనంలో ఉండగా.. మొత్తం 40 మంది భారతీయులు అపహరణకు గురవగా, వారిలో ఒకరు బంగ్లాదేశ్‌కు చెందిన ముస్లింనని చెప్పుకుని సురక్షితంగా బయటపడ్డాడు. లాంఛనాలు పూర్తిచేసి 39 మంది భారతీయుల మృతదేహాలను స్వదేశం తీసుకురావడానికి 10 రోజులు పట్టొచ్చని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ చెప్పారు. మట్టి దిబ్బ కింద మృతదేహాలు.. ‘విస్పష్ట ఆధారాలు లభించే వరకూ ఎవరూ చనిపోయారని ప్రకటించనని ఇదివరకే చెప్పా. కచ్చితమైన నిర్ధారణ అనంతరమే ఈ ప్రకటన చేస్తున్నా. కార్మికుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించి, ఇక వారి నిరీక్షణకు ముగింపు పలకబోతున్నామని భారమైన హృదయంతో చెబుతున్నా’ అని సుష్మ భావోద్వేగంతో పేర్కొన్నారు. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ ఎలా జరిగిందో సుష్మ వివరించారు. ‘ఐఎస్ చెర నుంచి మోసుల్ విముక్తమైన తరువాత స్థానిక అధికారుల సాయంతో గాలింపును విస్తృతం చేశాం. మోసుల్ దగ్గర్లోని బదోష్ గ్రామంలోని ఒక మట్టిదిబ్బ కింద చాలా మంది మృతదేహాలను ఉగ్రవాదులు పూడ్చిపెట్టినట్లు మాకు సమాచారం అందింది. రాడార్ సాంకేతికతతో అది నిజమేనని గుర్తించాం. ఆ మృతదేహాలను వెలికితీశాం. ఆ మృతదేహాలు గల్లంతైన భారతీయులవేనని ధ్రువీకరించడం చాలా కష్టమైంది. మట్టి దిబ్బ కింద ఒకరి శరీరంపై మరో శరీరాన్ని పూడ్చి ఉగ్రవాదులు క్రూరత్వం ప్రదర్శించారు. మృతదేహాల వద్ద లభించిన ఆధారాల సాయంతో వారు భారతీయులేనని ప్రాథమికంగా నిర్ధారించాం. అనంతరం డీఎన్ఏ పరీక్షల కోసం బాగ్దాద్ తరలించాం. ఆ పరీక్షల్లో 38 మంది డీఎన్ఏలు సరిపోలగా, ఒక వ్యక్తివి 70% వరకు సరిపోయాయి’ అని సుష్మ వివరించారు. మృతుల్లో 27 మంది పంజాబీలు, నలుగురు హిమాచల్ ప్రదేశ్, ఆరుగురు బిహార్, ఇద్దరు పశ్చిమ బెంగాల్ వాసులున్నారు. నేనేమీ దాయలేదు: సుష్మ మోసుల్‌లో భారత కార్మికుల అపహరణ వ్యవహారంలో తానేమీ దాయలేదని, ఎవరికీ కల్పిత హామీలు ఇవ్వలేదని సుష్మ తెలిపారు. ఉగ్రవాదుల చెర నుంచి తెలివిగా బయటపడ్డ హర్జీత్‌ను ప్రభుత్వం వేధించిందన్న ఆరోపణలను ఖండించారు. చావు విషయాల్లో కూడా కాంగ్రెస్ రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. డీఎన్ఏ సరిపోలిన మొదటి వ్యక్తి సందీప్ అని, చివరి, 39వ వ్యక్తి డీఎన్ఏ 70 శాతమే సరిపోలిందని, అతని తల్లిదండ్రులు చనిపోవడంతో ఇతర కుటుంబ సభ్యుల డీఎన్ఏతో ఆయన డీఎన్ఏను పోల్చినట్లు తెలిపారు. ఆ ఒక్కడు తప్పించుకున్నాడిలా.. 2014లో ఇరాక్‌లోని రెండో పెద్ద పట్టణమైన మోసుల్‌లో నిర్మాణరంగంలో కార్మికులుగా పనిచేస్తున్న మొత్తం 40 మంది భారతీయులు, మరికొందరు బంగ్లాదేశీయులను ఐఎస్ అపహరించింది. అందులో గురుదాస్‌పూర్‌కు చెందిన హర్జీత్ మాసిహ్ మాత్రం తాను బంగ్లాదేశీ ముస్లింనని చెప్పి తప్పించుకున్నాడు. మిగతా 39 మందిని ఐఎస్ ఉగ్రవాదులు చంపుతుండగా చూశానన్న హర్జీత్ మాటలను ప్రభుత్వం కొట్టిపారేసింది. ఆయనవి కట్టుకథలని ప్రకటించింది. బందీలను తొలుత ఓ వస్త్ర కర్మాగారంలో ఉంచి ఆ తరువాత బాదోశ్ గ్రామంలోని చెరసాలకు తరలించారు. ఓ కేటరింగ్ వ్యాపారి వెల్లడించిన వివరాల ప్రకారం..భోజనం చేసి తిరిగొస్తుండగా 40 మంది భారతీయులతో పాటు కొందరు బంగ్లాదేశ్ కార్మికులను ఐఎస్ ఉగ్రవాదులు బందీలుగా తీసుకున్నారు. వస్త్ర కర్మాగారంలో భారతీయులు, బంగ్లాదేశీయులను వేరుచేశారు. ఆ తరువాత బంగ్లాదేశీ కార్మికులను ప్రత్యేక వాహనంలో ఎర్బిల్‌కు తరలించారు. బంగ్లాదేశీయుడినని చెప్పుకున్న హర్జీత్..తన పేరు అలీ అని మార్చుకుని ఎర్బిల్ వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ నాలుగేళ్లలో.... ♦ జూన్ 15, 2014: ఇరాక్‌లోని మోసుల్‌లో 40 మంది భారతీయుల కిడ్నాప్.. బంగ్లాదేశీ ముస్లింనని చెప్పి ఐఎస్ నుంచి తప్పించుకున్న హర్జీత్ మాసిహ్ ♦ మే 15, 2015: అపహరించిన 5 రోజుల అనంతరం 39 మందిని ఒక కొండపైకి తీసుకెళ్లి వరుసగా నిలబెట్టి కాల్చి చంపారని చెప్పిన హర్జీత్.. ఇరాక్ నుంచి వచ్చాక తాను భారత్ దర్యాప్తు సంస్థల కస్టడీలో ఉన్నానని వెల్లడి. ♦ జూన్ 20, 2016: కిడ్నాపైన 39 మంది భారతీయులు సజీవంగా ఉన్నారన్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ♦ జూలై 2017: మోసుల్కు ఐఎస్ నుంచి విముక్తి. బదోష్ జైల్లో 39 మంది బందీలుగా ఉన్నారన్న సమాచారంతో ఇరాక్‌కు వెళ్లిన విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్. ♦ అక్టోబర్ 28, 2017: కిడ్నాపైన భారతీయుల బంధువుల నుంచి డీఎన్ఏ శాంపిల్స్ సేకరించిన అధికారులు ♦ మార్చి 20, 2018: ఆ 39 మంది భారతీయుల్ని ఉగ్రవాదులు ఊచకోత కోసి బదోష్ గ్రామంలో పూడ్చిపెట్టినట్లు పార్లమెంటులో ప్రకటన చేసిన సుష్మాస్వరాజ్. ఎందుకు దాచారు? చండీగఢ్: ఇరాక్‌లో భారతీయ కార్మికులు చనిపోయారని సుష్మా స్వరాజ్ రాజ్యసభలో చేసిన ప్రకటనను విన్న వెంటనే బాధిత కుటుంబాలు విషాదంలో మునిగాయి. ఇన్నాళ్లూ ఈ విషయాన్ని తమ వద్ద ఎందుకు దాచిపెట్టారని కేంద్రాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. తమవారు చనిపోయారని ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని పంజాబ్‌లోని బాధిత కుటుంబాల సభ్యులు తెలిపారు. ‘సుష్మా స్వరాజ్‌ను 12 సార్లు కలుసుకున్నాం. జాడ తెలియకుండా పోయిన భారతీయులంతా బతికే ఉన్నారని ఆమె ధైర్యం చెప్పారు. హర్జీత్ మాసిహ్ అబద్ధాలాడుతున్నాడని అన్నారు. ప్రభుత్వం తప్పుడు వివరాలు ఇవ్వడం కన్నా అసలు వారి వద్ద విశ్వసనీయ సమాచారం లేదని చెబితే బాగుండేది’ అని అమృత్‌సర్‌కు చెందిన ఓ మృతుడి సోదరుడు సార్వాన్ వాపోయాడు. యెమెన్‌లో కేరళ నర్సులను కాపాడిన ప్రభుత్వం పంజాబ్‌కు చెందిన కార్మికులను రక్షించడంలో విఫలమైందని ఆక్రోశం వెళ్లగక్కాడు. గల్లంతైన 27 ఏళ్ల మజీందర్ సింగ్ సోదరి గుర్పీందర్ కౌర్ కూడా ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. తొలుత వారంతా బతికే ఉన్నారన్న ప్రభుత్వం హఠాత్తుగా ఇలాంటి ప్రకటన చేయడమేంటని ఆవేదన చెందింది. ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి: హర్జీత్ తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు తనపై పెట్టిన మానవ అక్రమ రవాణా కేసును ఉపసంహరించుకోవాలని హర్జీత్ డిమాండ్ చేశారు. ఐఎస్ నిర్బంధంలోని కార్మికులు ఆనాడే చనిపోయారని నాలుగేళ్లుగా చెబుతున్నానన్నారు. పోలీసులు తనపై అక్రమంగా పెట్టిన కేసు వల్ల ఆరు నెలలు జైలులో గడిపి బెయిల్‌పై బయటికి వచ్చినట్లు తెలిపారు. -
మసీహ్ చెప్పిందే జరిగిందా?
ఇరాక్‌లోని మోసుల్‌లో 39 మంది భారత కార్మికులను తన కళ్ల ముందే ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు కాల్చిచంపడం చూశానని పదే పదే చెబుతున్న హర్జీత్ మసీహ్వి కట్టుకథలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పడంతో అతని వ్యవహారం ఆసక్తికరంగా మారింది. పంజాబ్‌లోని గుర్దాస్పూర్ జిల్లా కాలా అఫ్ఘానాకు చెందిన 25 ఏళ్ల మసీహ్ ఇస్లామిక్ స్టేట్ నుంచి ప్రాణాలతో బయటి పడ్డాక ఇరాకీ కుర్దిస్థాన్ రాజధాని ఎర్బిల్ నుంచి మంత్రి సుష్మతో ఫోన్లో మాట్లాడారు. ‘ఐఎస్ మనుషుల నుంచి ఎలా తప్పించుకున్నావు?’ అని పంజాబీలోనే సుష్మ ప్రశ్నించగా, అతని సమాధానం సంతృప్తికరంగా లేదనీ, కట్టుకథలా ఉందని ఆమె అన్నారు. మోసూల్ సమీపంలోని బాదుష్ లో మిగిలిన 39 మందిని ఊచకోత కోశాక అక్కడి నుంచి ఎర్బిల్‌కు ఎలా తప్పించుకు వచ్చావని ప్రశ్నిస్తే మసీహ్ జవాబివ్వలేదని కూడా సుష్మ పార్లమెంటులో వెల్లడించారు. మోసుల్‌లో సమీపంలోని మోసుల్ యూనివర్సిటీ ఆవరణలోని వ్యవసాయ, అటవీ కళాశాల వెనుక ప్రభుత్వ కాంట్రాక్టు నిర్మాణ ప్రాజెక్టులో పని చేస్తున్న 40 మంది భారత కార్మికుల్లో ఒకడినని మసీహ్ చెప్పారు. ఈ నిర్మాణ పని చేపట్టిన బాగ్దాద్‌కు చెందిన తారిక్ అల్ హుదా అనే సంస్థ యూఏఈలోని తన శాఖ కార్యాలయం ద్వారా పంజాబ్ నుంచి రప్పించిన కాంట్రాక్టు కార్మికుల్లో మసీహ్ ఒకరనే విషయంలో అనుమానం లేదు. ఈ కార్మికులను తీవ్రవాదులు బందీలుగా తీసుకున్న తర్వాత 2014 జూన్ 16న 39 మందిని కాల్చిచంపారని మొదటి నుంచీ మసీహ్ చెబుతున్నాడు. తమకు భోజనం ఏర్పాట్లు చేసే కేటరర్ సాయంతో బంగ్లాదేశీగా నాటకమాడి అలీ పేరుతో మసీహ్ ఎర్బిల్ చేరుకుని కాలి గాయానికి అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అక్కడి నుంచి బాగ్దాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నాడు. మంత్రి సుష్మతో మాట్లాడాక భారత్ వచ్చి పదే పదే తన కళ్ల ముందే 39 మందిని ఊచకోత కోశారని, ప్రభుత్వం చెబుతున్నట్టు వారెవరూ బతికి లేరని మసీహ్ మీడియాకు చెప్పడం విదేశాంగ శాఖకు ఇబ్బందిగా మారింది. కిందటేడాది మార్చిలో అరెస్ట్ తనను కలిసిన భారత కార్మికుల కుటుంబసభ్యులతో సుష్మ వారి భద్రతపై హామీ ఇస్తూ, 39 మందీ బతికే ఉన్నారని ఓ పక్క చెబుతుండగా, మరో వైపు మసీహ్ మాటలు కేంద్ర సర్కారుకు చీకాకు పెట్టాయి. దీంతో విదేశాంగశాఖ ఆదేశాలపై పంజాబ్ పోలీసులు మసీహ్‌పై కేసు నమోదు చేశారు. ఐఎస్ అపహరించుకుపోయిన మజిందర్ సింగ్ అనే యువకుడి సోదరి గుర్భిందర్ కౌర్ ఫిర్యాదుపై మసీహ్‌ను కిందటేడాది మార్చిలో అరెస్ట్ చేశారు. ‘కాలా అఫ్ఘానాకు చెందిన హర్జీత్ మసీహ్, రాందాస్ గ్రామానికి చెందిన రాజ్బీర్ సింగ్ ట్రావెల్ ఏజెంట్లు. మా తమ్ముడు మజిందర్ దుబాయ్ వెళ్లడానికి ఫతేగఢ్ చురియాలోని వారి ఆఫీసులో ఈ ఇద్దరికీ రెండు లక్షల రూపాయలు చెల్లించాడు,’ అని గుర్భిందర్ విదేశాంగ మంత్రిత్వశాఖకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. అపహరణకు గురైన మొత్తం 39 మంది ఆచూకీ మసీహ్‌కు తెలుసని కూడా ఆమె ఆరోపించారు. మసీహ్‌ను అరెస్టు చేసినప్పుడు అతని దగ్గరి బంధువైన రాజ్బీర్ పరారీలో ఉన్నాడు. ఆరు నెలలు గురుగ్రామ్. నోయిడా జైళ్లలో గడిపిన మసీహ్ బెయిలుపై విడుదలయ్యాడు. నేనెప్పుడూ అబద్ధమాడలేదు సర్కారు మాటల్లో నిజం లేదు: మసీహ్ ‘నేనెప్పుడూ అబద్ధమాడలేదు. ప్రభుత్వమే అబద్ధాలాడుతోంది,’ అని ఓ టీవీ న్యూస్ చానల్లో మసీహ్ చెప్పాడు. ‘2014 మే వరకూ అంతా బాగానే ఉంది. ఫ్యాక్టరీలో మేం ఎప్పటిలా పనిచేసుకుంటున్నాం. మోసుల్ శివారు ప్రాంతాల్లో ఐఎస్ తీవ్రవాదుల కాల్పులు మొదలయ్యాయి. నెల తర్వాత వారు మా ఫ్యాక్టరీలో ప్రవేశించి మమ్మల్ని అపహరించుకుపోయారు. కొన్నాళ్లకు మరో ప్రాంతానికి తీసుకుపోయి మమ్మల్ని మోకాళ్లపై కూర్చోవాలని ఆదేశించి మాపై కాల్పులు ప్రారంభించారు. నా కాలికి గాయమైంది. మరుసటి రోజు నేను లేచి చూస్తే, నా తోటి కార్మికులందరూ శవాలై పడి ఉన్నారు. నేను కొన్ని రోజులపాటు నడుస్తూ ఓ బంగ్లాదేశీ సహాయ శిబిరానికి చేరుకున్నా. అక్కడి నుంచి నన్ను ఆస్పత్రికి తరలించారు. వారం తర్వాత నేను ఇండియాకు తిరిగి వచ్చా,’ అని కిందటేడాది ఓ ఇంగ్లిష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మసీహ్ చెప్పాడు. ‘ప్రభుత్వం ఎందుకు వాస్తవాన్ని అంగీకరించి 39 మంది మరణించిన విషయం చెప్పడం లేదో నాకు తెలియడం లేదు. వారు బతికే ఉంటే ఈ మూడేళ్లలో సర్కారు ఏంచేసినట్టు? నేను అబద్దం చెప్పడం వల్ల నాకు ఒరిగేదేముంది?’ అని మసీహ్ ప్రశ్నించాడు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
వారు చనిపోయినట్లు టీవిలోనే చూశాను
న్యూఢిల్లీ: ఇరాక్‌లో 30 మంది భారతీయులు చనిపోయారంటూ రాజ్యసభలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చేసిన ప్రకటనపై వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. తమ వారు చనిపోయారని నేరుగా రాజ్యసభలో ఎలా ప్రకటిస్తారని వారు తప్పుపడుతున్నారు. సుష్మా తీరు తమను తీవ్రంగా బాధించిందని కుటుంబసభ్యులు తెలిపారు. 2014లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అపహరించిన 39 మంది భారతీయుల్లో.. 30 మంది చనిపోయారని, వారి మృతదేహాలను గుర్తించామని కేంద్ర మంత్రి సుష్మా చేసిన ప్రకటన చూసి దిగ్భ్రాంతికి గురయ్యామని, తన తమ్ముడు కూడా మృతి చెందాడన్న వార్తను నమ్మలేకపోతున్నామని మృతుడి సోదరి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. సుష్మా ముందుగా కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. ‘సుష్మా ప్రకటనను నేను టీవిలో చూశాను. వారు మృతి చెందారన్న వార్త మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నా సోదరుడు మజీందర్ సింగ్ ఫోన్‌ను మైసూల్లో స్వాధినం చేసుకున్నారు. అతన్ని ఐసిస్ చంపి ఉంటుందని అనుకుంటున్నాం’ అని గుర్విందర్ కౌర్ తెలిపారు. గత నాలుగేళ్లుగా వారు బ్రతికే ఉన్నారని మంత్రి తమతో చెప్తూ వచ్చారని, కానీ ఎప్పుడూ ఒక్క ఆధారం చూపలేదని ఆమె తప్పుబట్టారు. ఈ విషయమై సుష్మా స్వరాజ్‌తో మాట్లాడానికి వేచిచూస్తున్న సమయంలోనే వారు మృతి చెందారని పార్లమెంట్లో ప్రకటించడంతో షాక్తిన్నామని చెప్పారు. తమ కుటుంబసభ్యులు మృతి చెందారన్న వార్త ముందుగా తమకు కాకుండా బయటి ప్రపంచానికి తెలిపారని సుష్మా తీరును తప్పబట్టారు. ఇరాక్‌లో భారతీయులు చనిపోయారన్న పక్కా సమాచారంతోనే పార్లమెంట్లో ప్రకటన చేస్తున్నట్లు సుష్మా తెలుపగా.. దీనిపై గుర్విందర్ కౌర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మృతదేహాలు స్వాధీనం చేసుకున్న తరువాత కూడా తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అయితే, ఈ విమర్శలపై స్పందించిన సుష్మా.. ముందుగా పార్లమెంట్‌కు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే పార్లమెంటులో ప్రకటన చేశామని చెప్పుకొచ్చారు. -
‘ఇరాక్‌లో భారతీయ బందీల’పై కేంద్రం ప్రకటన
-
ట్విస్ట్.. 39 మందిని చంపటం అతను చూడలేదు
సాక్షి, న్యూఢిల్లీ : ఐసిస్ ఉగ్రవాదులకు బందీలుగా చిక్కిన 39 మంది భారతీయులు ప్రాణాలతో లేరనే పార్లమెంట్లో భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే వారిని చంపటం తాను కళ్లారా చూశానంటూ హర్జిత్ మసిహ్ అనే పంజాబ్‌కు చెందిన వ్యక్తి మీడియా ఛానెళ్లకు తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మసిహ్ వ్యవహారంపై విదేశాంగ శాఖ స్పందించింది. హర్జిత్ మసిహ్ చెబుతున్న కథనాలు అబద్ధమని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. ‘మోసుల్‌లో ఐసిస్ ఉగ్రవాదులకు చిక్కిన బందీల్లో అతను లేనే లేడు. కానీ, ఉగ్రవాదుల నుంచి రక్షించుకునేందుకు అలీగా తన పేరును మార్చుకుని.. కొంతమంది బంగ్లాదేశీయులతో కలిసి తప్పించుకునే యత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఎర్బిల్ వద్ద ఇరాక్ ఆర్మీకి అతను పట్టుబడ్డాడు. వారు అతన్ని భారత రాయబార కార్యాలయానికి తరలించగా.. మూడు నెలల నిర్భంధం తర్వాత తిరిగి ఇండియాకు వచ్చాడు. మీడియాతో బంధీలను చంపటం తాను చూశానని హర్జిత్ చెప్పటం వాస్తవం లేదు. ఒక పౌరుడిగా అతను చెబుతున్న మాటలను.. భాద్యతగల ప్రభుత్వంగా విచారణ చేపట్టాకే మేం ధృవీకరించాల్సి ఉంటుంది. అతన్ని అధికారులు వేధించారన్న ఆరోపణలు కూడా నిజం కాదు’ అంటూ సుష్మా పేర్కొన్నారు. హర్జిత్ చెప్పిన కథనం... పంజాబ్‌కు చెందిన హర్జిత్ వలస కూలీగా మోసుల్కు వెళ్లాడు. నిర్మాణ పనుల కోసం వెళ్లిన అతన్ని, మరో 39 మంది భారతీయ కూలీలను జూన్ 11, 2014లో ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. తన కళ్ల ముందే వారందరినీ ఉగ్రవాదులు ఊచకోత కోశారు. అయితే గాయాలతో ఉన్న తాను చచ్చినట్లు నటించి ప్రాణాలతో బయటపడ్డానని.. ఎర్బిల్ ప్రాంతంలో ఇరాకీ ఆర్మీ చెక్ పాయింట్ వద్ద తనను గమనించిన అధికారులు భారతీయ రాయబార కార్యాలయానికి తీసుకెళ్లారని.. అక్కడి నుంచి తాను ఇండియాకు చేరానని అతను ప్రముఖ మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే విదేశాంగ శాఖ స్పందించింది. లోక్‌సభలో ప్రకటన చెయ్యనివ్వరా? కాగా, ఇరాక్‌లో 39 మంది భారతీయుల మరణం పట్ల విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ రాజ్యసభలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే లోక్‌సభలో ఆమె ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తీవ్రంగా స్పందించారు. ‘రాజ్యసభలో ప్రకటన చేస్తే విన్నారు. లోక్‌సభలో మాత్రం అడ్డుకుంటున్నారు. ఈ ఆందోళనలకు కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోంది అంటూ ఆమె ఆక్షేపించారు. ఇక మృతదేహాల గుర్తింపు కష్టతరంగా ఉన్నప్పటికీ.. త్వరలో వాటిని ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. -
ఆ 39 మంది భారతీయులను చంపేశారు
-
ఆ 39 మంది భారతీయులను చంపేశారు..
సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధికోసం పరాయిదేశానికి వెళ్లి అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయులు తిరిగివస్తారనే ఆశలు కూలిపోయాయి. ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదులకు బందీలుగా చిక్కిన ఆ 39 మంది భారతీయులు ప్రాణాలతోలేరని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ మేరకు మంగళవారం పార్లమెంట్ ఉభయసభల్లో ప్రకటన చేశారు. ఐసిస్ చేతుల్లో హతమయ్యారు: ఇరాక్ రెండో అతిపెద్ద నగరం మోసుల్‌ను ఐసిస్ ఉగ్రవాదులు హస్తగతం చేసుకునేనాటికి(2014నాటికి) అక్కడ10 వేల మంది భారతీయులు ఉండేవారు. హెచ్చరికల నేపథ్యంలో చాలా మంది అక్కడి నుంచి వచ్చేయగా.. ఇంకొద్దిమంది ఉగ్రవాదులకు బందీలుగా చిక్కారు. వారిలో 39 మందిని గుర్తించిన భారత అధికారులు.. విడుదలకోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. బందీలను సురక్షితంగా తీసుకొస్తామని భారత్‌లోని వారి కుటుంబీకులకు విదేశాంగశాఖ భరోసా కూడా ఇచ్చింది. ఈ ప్రయత్నాలు సాగుతుండగానే ఐసిస్ పెద్ద ఎత్తున నరమేధాలకు పాల్పడింది. బందీలుగా చిక్కిన విదేశీయులను ఎక్కడిక్కడే చంపేసింది. కష్టతరంగా మృతదేహాల గుర్తింపు : ఇటీవల ఐసిస్ ప్రాబల్యం తగ్గుముఖంపట్టడం, మోసుల్ సహా ఇతర నగరాలను ప్రభుత్వ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్న దరిమిలా.. సామూహిక మారణకాండలకు సంబంధించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా చనిపోయినవారిని గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. భారత్‌లోని కుటుంబ సభ్యుల డీఎన్ఏ నమూనాలను.. మోసుల్‌లో లభించిన మృతదేహాల నమూనాలతో పోల్చుతూ వెళ్లారు. కష్టతరంగా సాగిన ఈ ప్రక్రియ అంతా విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఆధ్వర్యంలో సాగిందని సుష్మా స్వరాజ్ చెప్పారు. పార్లమెంట్ నివాళి : ఇరాక్‌లో చనిపోయిన 39 మంది భారతీయులకు పార్లమెంట్ నివాళి అర్పించింది. రాజ్యసభలో రెండు నిమిషాలు మౌనం పాటించగా, లోక్‌సభలో తీర్మానాన్ని ఆమోదించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి చెప్పారు. -
చేయని తప్పుకు ఇరాక్ జైల్లో..
ధర్మపురి: కుటుంబ పోషణ కోసం పరాయి దేశం వెళ్లిన ఐదుగురు రాష్ట్ర వాసులు ఏజెంట్ల మోసంతో జైలుపాలై.. చివరికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఏ తప్పు చేయని వీరు ఇరాక్‌లో ఏడాదిపాటు జైల్లో నరకయాతన అనుభవించారు. ఇందులో ముగ్గురు ఎట్టకేలకు విడుదలై మంగళవారం స్వగ్రామాలకు చేరుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతాపూర్ అనుబంధ గ్రామం మగ్గిడికి చెందిన దుర్గం శాంతయ్య, పసుల లక్ష్మణ్, జక్కి రాజుతోపాటు మంచిర్యాల జిల్లా దండెపెల్లి మండలానికి చెందిన కోడి రాజన్న, నిర్మల్ జిల్లాకు చెందిన దుర్గం నారాయణ బతుకుదెరువుకోసం 2016, జూన్ 17న ఇరాక్ వెళ్లారు. ఇందుకోసం ధర్మపురికి చెందిన ఓ ఏజెంట్‌కు రూ.1.40 లక్షలు ఇచ్చారు. ఆ ఏజెంట్ కంపెనీ వీసా అని చెప్పి విజిట్ వీసాపై ఈ ఐదుగురినీ ఇరాక్ పంపించాడు. ఏడాదికి రూ.లక్ష వేతనం ఉంటుందని నమ్మించాడు. అయితే అక్కడికి వెళ్లాక పరిస్థితి మారింది. అక్కడ ఓ కంపెనీలో ఆరునెలలపాటు నెలకు కేవలం 400 దినార్ల వేతనంతో పనిచేశారు. వేతనం చాలకపోవడంతో అక్కడ మరో ఏజెంట్‌ను కలిశారు. ఎక్కువ వేతనం వచ్చే కంపెనీలో ఉద్యోగం పెట్టిస్తానని సదరు ఏజెంట్ చెప్పడంతో వీరు ఇంటి నుంచి మరో రూ.1.30 లక్షలు తెప్పించి ఆ ఏజెంట్‌కు ఇచ్చారు. అయితే అతడు ఉద్యోగం చూపకపోవడంతో కొంతకాలం అతని చుట్టూ తిరిగారు. చివరకు విధిలేని పరిస్థితిలో 2017, మే 14న ఇంటికి తిరుగు ముఖం పట్టారు. నకిలీ వీసాగా గుర్తించి జైలుకు.. ఏజెంట్లను నమ్మి వారికి ఒక్కొకరు రూ.2.70 లక్షలు ముట్టజెప్పినా ఫలితం లేకపోవడంతో ఇంటికి బయల్దేరిన వలస బాధితుల వీసాలను అక్కడి విమానాశ్రయంలో తనిఖీ చేయగా, అవి విజిట్ వీసాలు అని తేలింది. గడువు ముగిసిన తర్వాత కూడా ఇరాక్‌లో ఉన్నందుకు పోలీసులు ఐదుగురినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మే 14 నుంచి సుమారు 10 నెలలు జైల్లో నరకం చూశామని బాధితులు తెలిపారు. కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని వారు కన్నీటి పర్యంతమయ్యారు. తమ వద్ద ఉన్న సెల్ఫోన్లు, బ్యాగులు, ఇంటికి తీసుకొచ్చేందుకు కొనుగోలు చేసిన సుమారు 60 వేల విలువైన వస్తువులను కూడా అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేయని తప్పుకు తాము శిక్ష అనుభవిస్తున్నామని అక్కడివారి ద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులు తమను విడిపించుకునేందుకు అనేక పాట్లు పడ్డారని బాధితులు తెలిపారు. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ను కూడా కలవడానికి ఢిల్లీ వెళ్లారని, మంత్రి కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవిత తదితరులను కలసి వినతిపత్రాలు అందించారని వివరించారు. తమ కుటుంబ సభ్యుల ప్రయత్నాలు ఫలించి ఎట్టకేలకు విముక్తి కలిగిందన్నారు. జక్కి రాజు, దుర్గం నారాయణ మరో 15 రోజులకు స్వగ్రామానికి వస్తారని తెలిపారు. జైల్లో నరకం చూశా పొట్టకూటి కోసం పరాయి దేశం వెళ్లిన మమల్ని జైల్లో బంధించారు. జీతం చాలక ఇంటికి వచ్చేముందు ఎయిర్‌పోర్టులో వీసాలు చూసి జైలుకు పంపించారు. పది నెలలు జైల్లో నరకం చూశాం. కటుంబం ఎట్లుంటదో తెలియదు. ఏజెంటు చేసిన మోసానికి బలయ్యాం. ప్రభుత్వం ఆదుకోవాలి. – పసుల లక్ష్మణ్, మగ్గిడి -
ఆత్మాహుతి దాడుల్లో 26మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి బాంబు దాడులతో దద్దరిల్లింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో సోమవారం ఉదయం జరిగిన జంట ఆత్మాహుతి దాడుల్లో సుమారు 26మంది దుర్మరణం చెందగా, వందలాదిమంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. బాగ్దాద్‌లోని రద్దీగా ఉండే టెరాన్ స్క్వేర్ సమీపంలోజంట పేలుళ్లు సంభవించినట్లు ఆర్మీ అధికారి వెల్లడించారు. అయితే ఈ పేలుళ్లకు పాల్పడింది ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థగా అనుమానిస్తున్నారు. మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
సుష్మా స్వరాజ్ నీకు ఇది తగునా.?
న్యూఢిల్లీ : ట్విట్టర్లో ప్రశ్నించినంత మాత్రాన అకౌంట్‌ను బ్లాక్ చేయడం తగునా.. అని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా నిలదీశారు. ఇందుకు సంబంధించిన స్ర్కీన్ షాట్లను ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. విదేశాంగ మంత్రి తనని బ్లాక్ చేయడం ద్వారా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఏదైనా అంశం గురించి అడిగితే ఒక పార్లమెంటు సభ్యుని ఖాతాను బ్లాక్‌చేస్తారా అని ప్రశ్నించారు. ఇదేనా ఒక మంత్రి వ్యవహరించే తీరు.. అని సుష్మా స్వరాజ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. 2014లో ఇరాక్‌లో అపహరణకు గురైన 39 మంది భారతీయుల విషయంలో ఈ ఇద్దరి నేతల మధ్య మాటల యుద్దం నడిచిన విషయం తెలిసిందే. గతంలో దీనిపై సుష్మా స్వరాజ్ పార్లమెంటులో మాట్లాడుతూ.. ఐసిస్ ఉగ్రవాదుల చేతిలో అపహరణకు గురైన భారతీయులు బాదుష్ జైలులో ఉన్నట్టు ఇరాక్ అధికారులు సమాచారమిచ్చారన్నారు. అపహరణకు గురైన వారిని మరణించినట్లు ప్రకటించడం చాలా తేలికైన పనని, కానీ తాను అలా చేయబోనన్నారు. అలా చెప్పిన నన్నెవరూ ప్రశ్నించే వారు లేరన్నారు. ఎలాంటి రుజువులు లేకుండా అలా చెప్పడం సమంజసం కాదన్నారు. Is this the way to run external affairs ministry? Does it behove the office of Sushma Swaraj ji to block a Member of Parliament for asking tough questions on 39 Indians missing in Iraq? pic.twitter.com/CvYl8aLREF — Partap Singh Bajwa (@Partap_Sbajwa) 27 December 2017 -
ఇరాక్ జైలులో తెలంగాణ వాసులు
-
ఇరాక్‌లో బందీలుగా రాష్ట్ర కార్మికులు
మోర్తాడ్(బాల్కొండ): పొట్ట చేతపట్టుకుని ఇరాక్‌కు వెళ్లిన తెలంగాణ జిల్లాలకు చెందిన ఐదుగురు కార్మికులు అక్కడి బస్రా జైల్లో బందీలుగా ఉన్నారు. ఇంటికి వచ్చే తరుణంలో ఎయిర్‌పోర్టులో కార్మికులను అరెస్టు చేసిన ఇరాక్ పోలీసులు జైల్లో బంధించారు. వారికి తమ ఇంటివారితో మాట్లాడటానికి కూడా అవకాశం కల్పించడం లేదు. తమ వారిని విడిపించాలని బాధిత కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ గల్ఫ్ కల్చరల్ అసోషియేషన్ అధికార ప్రతినిధి పాట్కూరి బసంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, ఇతర ఉన్నతాధికారులను కలిసి విన్నవించారు. జగిత్యాల జిల్లాకు చెందిన జక్కి రాజు, పసుపుల లక్ష్మణ్, దుర్గం శాంతయ్య, మంచిర్యాల జిల్లాకు చెందిన కోడి రాజయ్య, నిర్మల్ జిల్లాకు చెందిన తాళ్లపెల్లి నారాయణలు ఏజెంట్ల ద్వారా 16 నెలల కింద ఇరాక్ వెళ్లారు. అక్కడ 10 నెలల పాటు వివిధ కంపెనీల్లో పనిచేసిన కార్మికులకు యాజమాన్యాలు సరైన వేతనమివ్వలేదు. కడుపునిండా భోజనం పెట్టలేదు. వసతి సరిగా లేకపోవడంతో కార్మికులు అనారోగ్యా నికి గురయ్యారు. ఇరాక్‌లో ఉంటే తాము బతికి బట్ట కట్టలేమని, తమని ఎలాగైనా స్వదేశానికి పంపించా లని ఇరాక్‌లో ఉన్న తమ గల్ఫ్ ఏజెంటును వేడుకు న్నారు. గత మేలో ఐదుగురు కార్మికులను ఇంటికి పంపించడానికి ఇరాక్‌లో ఉన్న ఏజెంటు దాసరి మురళి » స్రా ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చాడు. అక్కడి పోలీసులు ఆ కార్మికులను అరెస్టు చేసి జైల్లో ఉంచా రు. ఏజెంటు దాసరి మురళి సమాచారం ఇవ్వడం తోనే బాధిత కుటుంబీకులు ఈ సమాచారం తెలుసు కోగలిగారు. మే 14న అరెస్టైన కార్మికులు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఇరాక్‌లోని మన విదేశాంగ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి కార్మికులను విడిపించాలని వారి కుటుంబీకులు కోరుతున్నారు. -
తొలి మ్యాచ్‌లో క్లబ్ ఇండియా ఓటమి
సాక్షి, హైదరాబాద్: ఆసియా పురుషుల క్లబ్ లీగ్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో తొలి రోజు భారత్‌కు చెందిన క్లబ్ ఇండియా జట్టుకు ఓటమి ఎదురైంది. అల్ శుర్తా (ఇరాక్) క్లబ్‌తో సోమవారం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో క్లబ్ ఇండియా 37–51తో ఓడిపోయింది. ఈనెల 30 వరకు జరిగే ఈ పోటీల్లో అల్నూర్ (సౌదీ అరేబియా), అల్ దుహైల్ (ఖతర్), షార్జా (యూఏఈ), నఫ్త్ ఓ గాజ్ (ఇరాన్), మస్కట్ (ఒమన్), అల్ అహ్లి (ఖతర్), ఆర్కోర్ (ఉజ్బెకిస్తాన్), అల్నజ్మా (బహ్రెయిన్), అల్ శుర్తా (ఇరాక్), క్లబ్ ఇండియా (భారత్) జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. పోటీల నిమిత్తం కోటి రూపాయల ఖరీదు చేసే ఈ 9ఎంఎం టెరాఫ్లెక్స్ మ్యాట్‌ను స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు భారత జట్టుకు ప్రాతి«నిధ్యం వహిస్తున్నారు. వరంగల్‌కు చెందిన అశోక్, భరణి టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
భూ విలయం : 530కి చేరిన మృతులు
టెహ్రాన్ : ఇటీవల ఇరాక్-ఇరాన్ సరిహద్దుల్లో విధ్వంసం సృష్టించిన భూకంప మృతుల సంఖ్య 530కి చేరుకుంది. ఆదివారం రాత్రి సంభవించిన ఈ భూకంపంలో 8 వేల మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇరాన్ అధికారులు మంగళవారం రాత్రి వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో ఇరాన్ పశ్చిమ ప్రాంతంలోని కెర్మన్షా ప్రావిన్సు, ఇరాక్ ఉత్తర భాగంలోని కుర్దిష్ ప్రావిన్సుల్లోని పలు ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంప తీవ్రతకు ఇరాన్-ఇరాక్ సరిహద్దుల్లో ఉన్న జహాబ్ పట్టణం పూర్తిగా దెబ్బతింది. ఇరాన్లో 14 ప్రావిన్సులపై భూకంప ప్రభావం పడింది. ఇరాక్‌లోని హలబ్జ పట్టణానికి 31 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలం నుంచి 23.2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని భూ పరిశీలన సంస్థ తెలిపింది. గత మూడు రోజులుగా చాలా ప్రాంతాలు అంధకారంలోనే ఉండిపోయాయి. -
ఇరాన్ సరిహద్దులో భారీ భూకంపం
-
ఇరాన్ సరిహద్దులో భూ విలయం
టెహ్రాన్: రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం ఇరాక్–ఇరాన్ సరిహద్దుల్లో భారీ విధ్వంసం సృష్టించింది. భూకంప తీవ్రతకు భారీ భవనాలు, ఇళ్లు నేలమట్టవడంతో రెండు దేశాల్లో మొత్తం 407 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 7 వేల మంది గాయపడ్డారు. ఆదివారం అర్ధరాత్రి భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. రాత్రివేళ కావడంతో చాలా మంది తప్పించుకునే వీల్లేక శిథిలాల కింద చిక్కుకుని మరణించారు. ఇరాక్‌లోని హలబ్జ పట్టణానికి 31 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలం నుంచి 23.2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికా భూ పరిశీలన సంస్థ తెలిపింది. ఇరాన్, ఇరాక్ స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 9.48 గంటల (భారత కాలమానం ఆదివారం రాత్రి 11.48 గంటలు) సమయంలో భూప్రకంపనలు మొదలయ్యాయి. కొద్ది క్షణాల్లో ఇరాన్ పశ్చిమ ప్రాంతంలోని కెర్మన్షా ప్రావిన్సు, ఇరాక్ ఉత్తర భాగంలోని కుర్దిష్ ప్రావిన్సుల్లో పలు ప్రాంతాలు శిథిలాల దిబ్బగా మారిపోయాయి. ఒక్క ఇరాన్‌లోనే 401 మంది మృత్యువాతపడగా, మరో 6,603 మంది క్షతగాత్రులయ్యారు. ఇరాక్‌లో ఆరుగురు మరణించగా 535 మంది గాయపడ్డారు. భూకంపం అనంతరం దాదాపు 100 స్వల్ప ప్రకంపనాలు నమోదయ్యాయి. తీవ్రంగా దెబ్బతిన్న సర్పోలే జహాబ్ సిటీ ఇరాన్, ఇరాక్ సరిహద్దుల్లో జర్గోస్ పర్వతాల మధ్య ఉన్న సర్పోలే జహాబ్ పట్టణం(ఇరాన్) భూకంపం తీవ్రతకు బాగా దెబ్బతింది. జహాబ్‌లో విద్యుత్తు, నీటి సరఫరా వ్యవస్థలు పూర్తిగా నాశనం కాగా.. టెలిఫోన్, సెల్‌ఫోన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇరాన్లో 14 ప్రావిన్సులపై భూకంప ప్రభావం ఉందని స్థానిక వార్తాసంస్థ తెలిపింది. ఇరాన్ అగ్రనేత అయతుల్లా ఖొమైనీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. భూకంప బాధితులకు పూర్తి స్థాయిలో సాయం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ భూకంప ప్రభావిత ప్రాంతాల్ని మంగళవారం పరిశీలించనున్నారు. పలు నగరాల్లో భవనాలు కంపించినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఇరాక్ ప్రధాన మంత్రి హైదర్ అల్ అబాదీ అధికారులను ఆదేశించారు. ఇరాన్, ఇరాక్‌ల్లో సంభవించిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని... భూకంపానికి ఎక్కువగా నష్టపోయిన సర్పోలే జహాబ్ ప్రావిన్స్‌లో 300 మంది మరణించినట్లు ప్రాథమిక అంచనా. ‘మా అపార్ట్మెంటు భవనం కూలింది. అదృష్టవశాత్తూ ప్రకంపనలు మొదలవగానే వస్తువులన్నీ ఇంట్లో వదిలేసి బయటకు పరుగెత్తడంతో ప్రాణాలు కాపాడుకున్నాం’ స్థానిక మహిళ చెప్పింది. మరో వ్యక్తి తన అనుభవాన్ని వివరిస్తూ.. ‘భూమి కంపించగానే ఇంటిల్లిపాదీ వీధిలోకి పరుగెత్తాం. భూమి రెండోసారి కంపించగానే మొత్తం భవనం కూలిపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్లో భూప్రకంపనలు సాధారణం. 2003లో 6.6 తీవ్రతతో వచ్చిన భూకంపానికి చారిత్రక నగరం బామ్‌లో 26 వేలమంది మృత్యువాత పడ్డారు. -
ఇరాన్-ఇరాక్‌లో భారీ భూకంపం
బాగ్దాద్ : ఇరాన్-ఇరాక్ సరిహద్దు ప్రాంతమైన హలాబ్జాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపతీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైంది. ఇరాన్-ఇరాక్ సరిహద్దు ప్రాంతాల్లో భూకంప తీవ్రత అధికంగా ఉండటంతో వందలాది ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, వ్యాపార కార్యాలయాలు దెబ్బతినగా.. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో దాదాపు 200మందికి పైగా మృతిచెందగా, వేలాది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవంతులు, లిఫ్ట్‌లకు ప్రజలు దూరంగా ఉండాలని ఇరాక్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషస్ ఇరాకీ స్టేట్ టీవీ ద్వారా ఆదేశాలు జారీ చేసింది. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారని, సహాయక కార్యక్రమాలు పూర్తయితే కానీ పూర్తి వివరాలు అందుబాటులోకి రావని అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్, లెబనాన్, కువైట్, టర్కీలలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. -
చెదరని స్వప్నం
ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదుల సుదీర్ఘ చెరలో నిలువెల్లా క్షతగాత్రగా మిగిలిన ఇరాక్‌లోని కుర్దుల ప్రాంతం స్వతంత్ర రాజ్యంగా ఎదగాలన్న చిరకాల వాంఛను ఫలింపజేసుకునేందుకు తొలి అడుగు వేసింది. ఇరాక్ ప్రభుత్వమే కాదన్నా... ఇరుగు పొరుగునున్న టర్కీ, ఇరాన్‌లు ఆగ్రహావేశాలతో చెలరేగినా... ఐక్యరాజ్యసమితి వద్దని బతిమాలినా మూడు రోజుల క్రితం రిఫరెండం నిర్వహించుకుంది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉన్నా ఆ రిఫరెండంలో పాల్గొన్న 93 శాతంమంది పౌరుల్లో అత్యధికులు స్వతంత్ర కుర్దిస్తాన్ ఆవిర్భావానికి అనుకూలంగా ఓటేశారని సమాచారం వస్తోంది. తుది ఫలితం గురువారం అధికారికంగా వెలువడాల్సి ఉంది. ఇరాక్ ప్రధాని హైదర్ అల్–అబాదీ ఈ రిఫరెండాన్ని ‘వ్యూహాత్మక, చరిత్రాత్మక తప్పిదం’గా అభిర్ణిస్తే... టర్కీ అధ్యక్షుడు ‘నమ్మకద్రోహ’మని మండిపడ్డారు. ఇరాన్ మత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు దీన్ని ‘మరో ఇజ్రాయెల్’ స్థాపించడానికి వేసిన ఎత్తుగడగా వ్యాఖ్యానించారు. చిత్రమేమంటే ప్రపంచంలో ఇజ్రాయెల్ ఒక్కటే కుర్దుల రిఫరెండాన్ని సమర్ధించింది. ఈ సమర్ధనే రిఫరెండం పర్యవసానాలెలా ఉండబోతున్నాయో సూచిస్తోంది. కుర్దిష్ ప్రాంతీయ ప్రభుత్వ అధ్యక్షుడు మసౌద్ బర్జానీ ఇప్పటికిప్పుడు సరిహద్దు రేఖలు గీసే ఆలోచనేదీ లేదని హామీ ఇచ్చినా, ‘మంచి ఇరుగుపొరుగు’గా ఉండాలంటే ఏం చేయాలన్న అంశంపై సంభాషణలకు ఇది ప్రాతిపదికని చెబుతున్నారు. పశ్చిమాసియాలో తమకంటూ సొంతంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకోవా లని శతాబ్దాలుగా తహతహలాడుతున్నా కుర్దులకు అది నెరవేరని స్వప్నంగానే మిగి లింది. కుర్దు జాతి ప్రజలకంటూ ఇప్పుడు సొంత భూభాగం లేదు. వారుండే ప్రాంతం ఇరాక్, ఇరాన్, టర్కీ, సిరియా భూభాగాల్లో కలిసి ఉంది. ఆ జాతి ప్రజలు ఇంకా ఆర్మేనియా, అజర్బైజాన్లలో కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ఇరాక్‌లో కుర్దిష్ భాషకు అధికార భాష హోదా ఉన్నా వేరే దేశాల్లో ఆ పరిస్థితి లేదు. వేర్వేరు దేశాల్లో ఆ భాషకు వేర్వేరు లిపులు కూడా తప్పలేదు. తామంతా ఒకే భూభాగంలో ఉమ్మడి లిపితో, సంస్కృతితో, స్వతంత్రంగా బతకాలని కుర్దులు వాంఛిస్తున్నా అది ఇప్పట్లో నెరవేరే సూచనలు కూడా కనబడటం లేదు. ఉత్తర ఇరాక్‌లోని కుర్దుల ప్రాంతానికి మాత్రం స్వయంపాలిత ప్రభుత్వం ఉంది. అంత కుమించి ఆశించరాదని ఇరాక్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. హద్దు మీరితే చర్య లుంటాయంటున్నది. అందుకు కారణం ఉంది. కుర్దిస్తాన్ ప్రాంతీయ ప్రభుత్వం (కేఆర్జీ) ఏలుబడిలోని ప్రాంతంలో దండిగా చమురు బావులున్నాయి. అక్కడ రోజుకు 6,50,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతుంది. ఇది ఇరాక్ చమురు ఉత్పత్తిలో 15 శాతం. ప్రపంచ చమురులో 0.7 శాతం. తన మాట వినకుండా రిఫరెండం నిర్వహించినందుకు కేఆర్జీ నుంచి చమురు కొనుగోలు చేయరాదని ఇరాక్ నిర్ణయించడమే కాదు... ఇకపై చమురు కోసం తమ ఫెడరల్ ప్రభుత్వాన్ని మాత్రమే సంప్రదించాలని ఇరుగుపొరుగు దేశాలకు సూచించింది. అమెరికా ఒత్తిళ్ల పర్యవసానంగా సరే అన్నా చమురు మార్కెటింగ్‌ను కేఆర్జీకి అప్పగించడం ఇరాక్ ప్రభుత్వానికి ఆదినుంచీ ఇష్టం లేదు. చివరకు ఒప్పుకున్నా పలు సందర్భాల్లో అందుకు ఆటంకాలు కల్పించింది. చమురు డబ్బుతో కేఆర్జీ ముందూ మునుపూ పుంజుకుంటుందని భయం. ఈ రిఫరెండంతో టర్కీ కూడా ఆగ్రహించింది. చమురు మార్కెటింగ్‌కు సహకరిస్తున్నందుకు ఇదా ప్రతిఫలమని కేఆర్జీపై అది విరుచుకుపడుతోంది. కుర్దులు నాలుగు దేశాల్లోనూ దశాబ్దాలుగా తీవ్ర అణచివేతనూ, వేధింపులనూ ఎదుర్కొంటున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అటొమన్ సామ్రాజ్యాన్ని రద్దు చేసినప్పుడు స్వతంత్ర కుర్దిస్తాన్ ఏర్పాటుకు హామీ ఇచ్చినా టర్కీ తీవ్రంగా ప్రతిఘటించడంతో అది ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన అనేక తిరుగుబాట్లను ఆ దేశం అణచివేసింది. ఇరాన్లో సైతం కుర్దులు స్వయంపాలన కోసం పోరా డుతూనే ఉన్నారు. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ ఏలుబడిలో వారిపై యుద్ధ విమా నాలు బాంబుల వర్షం కురిపించాయి. హలబ్జా నగరంలో 1988లో విషవాయువు ప్రయోగించడంతో 5,000మంది పౌరులు మృత్యువాత పడ్డారు. 1991లో గల్ఫ్ యుద్ధం సమయంలో ఉత్తర ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతం అమెరికా, మిత్రదేశాల కూటమి రక్షణలోకి వచ్చింది. ఇరాక్‌లో, సిరియాలో తన చెప్పుచేతల్లో ఉన్న కుర్దు గ్రూపులకు అమెరికా అండదండలందిస్తున్నా స్వతంత్ర కుర్దిస్తాన్ ఏర్పాటు దానికి ససేమిరా ఇష్టం లేదు. ఐఎస్ పీడ విరగడైందో లేదో తేలకుండానే పశ్చిమాసియాలో మరో కుంపటి రాజుకోవడం అమెరికాకు ససేమిరా ఇష్టం లేదు. కుర్దులకు మద్ద తిస్తే అది నాలుగు దేశాలతో కొత్త సమస్యలను సృష్టిస్తుంది. ఇరాక్ పాలకులు ఎదురుతిరగొచ్చు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ దూరం జరగొచ్చు. ఇదంతా ఆ ప్రాంతంలో ఇప్పుడున్న తన పలుకుబడిని దెబ్బతీస్తుందని అది భయపడుతోంది. బ్రిటన్, యూరప్ యూనియన్(ఈయూ), అరబ్‌లీగ్ దేశాల భయం కూడా అదే. ఇరాక్‌లో, సిరియాలో, ఇరాన్లో పాశ్చాత్య దేశాలకు పావులుగా పని చేస్తున్నారన్న అపప్రద కుర్దులకున్నా ఒక జాతిగా వారి ఆకాంక్షలు న్యాయమైనవి. వాటిపై నీళ్లు జల్లాలని చూడటం అధర్మం. అమెరికాను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన ఐఎస్ ఉగ్రవాదులతో రణరంగంలో ప్రత్యక్షంగా తలపడింది కుర్దులే. వారి సహకారం లేకపోతే ఐఎస్‌ను తరిమికొట్టడం అసా ధ్యమయ్యేది. దానికి ప్రతిఫలంగా తాము కోరుకున్న ప్రత్యేక రాజ్యానికి తోడ్పడాలన్నది కుర్దుల వాదన. ప్రశాంతత ఏర్పడ్డాక చూద్దామని అమెరికా సర్దిచెబుతున్నా అదెప్పటికి సాధ్యమన్నది కీలక ప్రశ్న. జాతుల స్వయంప్రతి పత్తిని గౌరవించాలన్న మౌలిక విధానానికి కట్టుబడి ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకోవాలని, దాని ఆధ్వర్యంలోనే తమ దీర్ఘకాల సమస్యకు పరిష్కారం లభించాలని కుర్దులు కోరుకుంటున్నారు. వాయిదాలతో పొద్దుపుచ్చడం ఇకపై సాధ్యం కాదని ఆ ప్రాంత దేశాలూ, అమెరికా తదితర అగ్రరాజ్యాలు గుర్తించక తప్పదు. -
ఆ 39 మంది ఏమయ్యారో?!
బాగ్దాద్ : మూడేళ్ల కిందట మోసుల్‌లో అపహరణకు గురైన 39 మంది భారతీయుల ఆచూకీ ఇంత వరకూ తెలియలేదని ఇరాక్ ప్రధాని హైదర్ ఆల్ అబాదీ తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అపహరించిన 39 మంది భారతీయుల ఆచూకీ తెలుసుకునేందుకు ఇరాక్ సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆదివారం చెప్పారు. మూడేళ్ల కిందట అపహరణకు గురైన 39 మంది జీవించి ఉన్నారా? లేదా అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. అయితే వాళ్లు ప్రాణాలతో ఉండాలని మాత్రం భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. గత వారంలో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్.. 39 మంది కార్మికులను క్షేమంగా విడిపించాలని తనను కోరినట్లు ఆయన చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ నుంచి మోసుల్‌ను స్వాధీనం చేసుకున్న క్షణం నుంచి 39 భారతీయుల ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. -
ఇరాక్‌లో మరో ముసలం..
సాక్షి, మోసుల్ : ఐసిస్‌ను చావుదెబ్బ కొట్టి మోసుల్ పట్టణాన్ని చేజిక్కించుకున్న ఇరాక్‌లో ఇప్పుడు మరో కొత్త జగడం మొదలైంది. ఇది ఇరుగుపోరుగు దేశాలైన టర్కీ, సిరియా, ఇరాన్‌లను కలవరపాటుకు గురిచేయడమే కాకుండా అమెరికాకూ ఆందోళన కలిగిస్తోంది. ఇరాక్‌లో అంతర్భాగంగా ఉన్న కుర్దిస్థాన్ రీజినల్ గవర్నమెంట్ (కేఆర్జీ)కి సెమీ అటానమస్ హోదా ఉంది. కుర్దుల ఆధిపత్యం కలిగిన కుర్దిస్థాన్ ప్రాంతాన్ని ఈ ప్రభుత్వమే పరిపాలిస్తుంది. రెండేళ్ల విరామం తర్వాత శుక్రవారం సమావేశమైన కుర్దిస్థాన్ పార్లమెంటు స్వతంత్య్ర దేశ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని తీర్మానించింది. దహుక్, ఇబ్రిల్, సులేమానియా ఫ్రావిన్సుల్లో ఈనెల 25వ తేదీన ఈ రిఫరెండం నిర్వహించనున్నారు. దీన్ని ఇరాక్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. రిఫరెండం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఎవరీ కుర్దులు? యూరప్, ఇతర పాశ్చాత్య దేశాలకు వలస వెళ్లిన వారితో కలిపి కుర్దులు సుమారు నాలుగు కోట్ల మంది ఉంటారని అంచనా. సొంతంగా దేశమంటూ లేని అతిపెద్ద జాతిగా కుర్దులకు గుర్తింపు ఉంది. ఇరాక్‌కు ఉత్తరాన ఉండే కుర్దిస్థాన్, టర్కీకి ఆగ్నేయాన, సిరియాకు ఉత్తరాన, వాయువ్య ఇరాన్లలో 5 లక్షల చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించిన భూభాగంలో (ఇది నాలుగు దేశాల్లో విస్తరించి ఉంది) కుర్దులు ఉన్నారు. కుర్దీ భాష, ఆచార వ్యవహారాల్లో సారూప్యత కారణంగా తామంతా ఒక్క జాతేననే భావన కుర్దీల్లో బలపడింది. స్వతంత్య్రదేశం కావాలనే డిమాండ్ దాదాపు వందేళ్లుగా ఉంది. ఇరాక్‌లోని కుర్దిస్థాన్‌లో 53 లక్షల మంది నివసిస్తున్నారు. టర్కీలో కోటిన్నర మంది కుర్దులు ఉన్నారు. సిరియాలో 20 లక్షల దాకా ఉంటారు. ఇరాన్లో వీరి జనాభా 80 లక్షల దాకా ఉంటుంది. కుర్దుల్లో మెజారిటీ (దాదాపు 80 శాతం) సున్నీలే. మిగతా వారు షియాలు, ఇతర మతస్తులు. వందేళ్ల డిమాండ్... మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్య ఓటమి, పతనం అనంతరం మిత్రదేశాలు ప్రత్యేక కుర్దిస్థాన్ ప్రస్తావన తెచ్చాయి. అయితే 1923లో జరిగిన లుజానే ఒప్పందంలో... ప్రత్యేక కుర్దిస్థాన్ భావనను పట్టించుకోకుండా ఆధునిక టర్కీ సరిహద్దులు నిర్ణయించారు. దాంతో టర్కీ, ఇరాన్, ఇరాక్, సిరియాల్లో కుర్దులు అల్పసంఖ్యాక వర్గాలుగా మిగిలిపోయారు. అప్పటి నుంచి ప్రత్యేక కుర్దిస్థాన్ డిమాండ్లను పైన పేర్కొన్న దేశాలు నిర్దాక్షిణ్యంగా అణచివేస్తూ వచ్చాయి. సద్దాం హుస్సేన్ కుర్దులను దారుణంగా హింసించాడు. 1988లో ఇరాకీ సైన్యం హలబ్జా పట్టణంలో కుర్డులపైకి రసాయనిక ఆయుధాలను సైతం ప్రయోగించింది. టర్కీ అయితే కుర్దుల పేర్లపై, వేషధారణపై కూడా ఆంక్షలు విధించింది. అసలు వీరిని గుర్తించడానికి సైతం నిరాకరించి... పర్వతప్రాంత టర్కులుగా వీరిని పిలిచింది. టర్కీలో నివసించే కుర్దుల కోసం ప్రత్యేక రాజ్యం కావాలనే డిమాండ్‌తో 1978లో కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే) ప్రారంభమైంది. 1984లో పీకేకే సాయుధపోరాట మార్గాన్ని ఎంచుకుంది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఈ పోరాటంలో దాదాపు 40 వేల మంది కుర్దులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కుర్దుల స్వరాజ్యకాంక్ష 1991లో కువైట్ యుద్ధంలో ఇరాక్ ఓటమితో మళ్లీ బలపడింది. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణదళాలు... ఇరాక్ ఉత్తరభాగాన్ని నో ఫ్లయ్ జోన్ (ఈ భూభాగం మీదుగా విమానాలు వెళ్లకూడదు)గా ప్రకటించాయి. దాంతో ఇరాకీ బలగాలు ఈ ప్రాంతం నుంచి వెనక్కితగ్గాయి. ఫలితంగా కుర్దుల ఆర్మీ ‘పెష్మెర్గా’ బలపడింది. 2003లో సద్దాం హుస్సేన్‌ను పదవీచుత్యుడిని చేశాక... ఈ ప్రాంతంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మొదలైంది. అమెరికా కనుసన్నల్లో మెలిగే ఇరాక్ ప్రభుత్వంతో పలుదఫాలుగా చర్చల అనంతరం 2005లో కుర్దిస్థాన్ ప్రాంతానికి సెమీ అటానమస్ హోదాను కల్పించి... స్వీయ పాలనకు వెసులుబాటు కల్పించారు. పొరుగుదేశాలకు భయమెందుకు? కుర్దిస్థాన్ రీజినల్ గవర్నమెంటు (కేఆర్జీ)కి 1,90,000 పటిష్టమైన సైన్యం (పెష్మెర్గా) ఉంది. కుర్దిస్థాన్ డెమొక్రటిక్ పార్టీ (పీడీకే) అధినేత మసూద్ బర్జానీ ఇరాక్‌లో అంతర్భాగంగా ఉన్న కుర్దిస్థాన్ ప్రాంతానికి అధ్యక్షుడు. 2005 నుంచి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. పైగా పెష్మెర్గాకు కమాండర్ ఇన్ చీఫ్ కూడా. ఇరాక్, టర్కీలకు సరిహద్దుల్లో ఉండే కొబేన్ పట్టణంపై ఐసిస్ 2014లో దాడి ప్రారంభించినపుడు... తమ సరిహద్దుల్లోకి ఈ ఉగ్రసంస్థ చొచ్చుకువస్తున్నా... టర్కీ సైన్యాన్ని పంపడానికి నిరాకరించింది. అప్పుడు పెష్మెర్గా రంగంలోకి దిగి విజయవంతంగా ఐసిస్‌ను నిలువరించింది. కొబేన్ ఐసిస్ వశం కాకుండా చూసింది. అమెరికా వైమానిక దాడులు చేయడమే కాకుండా పెష్మెర్గాకు దిశానిర్దేశం చేయడానికి తమ యుద్ధ నిపుణులను కూడా పంపింది. దీంతో ఐసిస్‌పై పోరులో పెష్మెర్గాను కీలకమైన భాగస్వామిగా అమెరికా పరిగణిస్తోంది. ప్రత్యేక రాజ్యం కోసం ఈనెల 25న రిఫరెండం నిర్వహించాలని కుర్దిస్థాన్ పార్లమెంటు తీర్మానించడంతో పొరుగుదేశాలు ఉలిక్కిపడ్డాయి. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేకపోతే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాయి. స్వతంత్రాన్ని ప్రకటించుకోవడానికి తాము రిఫరెండం నిర్వహించడం లేదని, స్వరాజ్యం కోసం ఇరాక్ కేంద్ర ప్రభుత్వంతో తాము భవిష్యత్తులో జరపబోయే చర్చల్లో ఈ రిఫరెండం ఫలితాలు తమకు అనుకూలంగా పనికివస్తాయని కేఆర్జీ అధికారులు అంటున్నారు. రిఫరెండంలో కుర్దిస్థాన్‌కు అనుకూలంగా ప్రజాతీర్పు వస్తే... తమ దేశాల్లోని కుర్దులు కూడా ఇరాక్‌లోని కురిస్థాన్తో కలిసిపోతామనే డిమాండ్లతో ఉద్యమాలకు దిగుతారని టర్కీ, ఇరాన్, సిరియాల భయం. తమ దేశంలో ఇదే డిమాండ్లతో సాయుధ పోరు చేస్తున్న సంస్థలకు పెష్మెర్గా అండ తోడైతే... తమ దేశాల్లో అశాంతి తలెత్తుతుందని, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలుగుతుందని టర్కీ, ఇరాన్ భావిస్తున్నాయి. పెష్మెర్గాకు అమెరికా సన్నిహితంగా ఉండటం కూడా ఇరాన్ అభ్యంతరాలకు, అనుమానాలకు మరో కారణం. అమెరికా ఆందోళన ఏమిటంటే... మోసుల్ స్వాధీనం ద్వారా ఐసిస్‌ను ఇరాక్‌లో పరిమిత భూభాగానికి పరిమితం చేశామని... ఇకమీదట కలిసికట్టుగా దాన్ని తుడిచిపెట్టగలమని అమెరికా భావించింది. అయితే ఇరాక్‌లోని జాతుల మధ్య అంతర్గత విబేధాలు తలెత్తితే ఐక్యత దెబ్బతింటుందని, ఐసిస్ మళ్లీ పుంజుకుంటుందని అమెరికా భయం. అస్థిరత ఏర్పడుతుందని ఆందోళన చెందుతోంది. అందుకే శుక్రవారం కుర్దిస్థాన్ పార్లమెంటు రిఫరెండం తీర్మానాన్ని ఆమోదించిన కొద్ది గంటల్లోనే వైట్‌హౌస్ స్పందించింది. రిఫరెండం వెనక్కి తీసుకోవాలని, ఇరాక్ ప్రభుత్వంతో చర్చలు జరపాలని పిలుపిచ్చింది. ఐసిస్‌ను ఓడించే ప్రయత్నాలకు కేఆర్జీ తాజా చర్య భంగకరమని వ్యాఖ్యానించింది. ఆఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల పాలనకు తెరదించినా... సుస్థిర ప్రభుత్వం, బలమైన నాయకత్వం లేకపోతే జరిగే విపరిణామాలేమిటో అమెరికాకు బాగా తెలిసొచ్చాయి. ఇప్పటికీ ఆఫ్గానిస్థాన్ నిత్యం నెత్తురోడుతోంది. ఇలాంటిది ఇరాక్‌లో పునరావృతం కాకూడదని అమెరికా ఆశిస్తోంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రదాడి, 74 మంది మృతి
-
ఐసిస్ నరమేధం.. 74 మంది మృతి
నసీరియా: ఇరాక్, సిరియాల్లో నెత్తుటేర్లు పారిస్తున్న ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ మరోసారి రెచ్చిపోయింది. ఇరాక్‌లోని దిఖర్ ప్రావిన్సు నసీరియా పట్టణంలో ఓ రెస్టారెంట్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఐసిస్ ఉగ్రవాదులు, అనంతరం సమీపంలోని చెక్‌పోస్ట్‌పై ఆత్మాహుతిదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 74 మంది దుర్మరణం చెందగా, 91 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడ్డవారిలో చాలామంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉందన్నారు. ఐసిస్‌కు వ్యతిరేకంగా భద్రతాబలగాలతో కలిసి పోరాడుతున్న షియా సంస్థ ‘హషీద్ అల్ షాబీ’ సభ్యుల రూపంలో ఉగ్రవాదులు చెక్‌పోస్ట్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి చేసింది తామేనని ఐసిస్ ప్రకటించింది. -
త్యాగమయుడు
పూర్వం ఇరాక్ దేశంలో నమ్రూద్ అనే రాజు ఉండేవాడు. చాలా దుర్మార్గుడు. తాను దైవాంశ సంభూతుడినని ప్రకటించుకొని నిరంకుశంగా పరిపాలన చేస్తుండేవాడు. రాజు మాట వేదవాక్కుగా పరిగణించబడేది. దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మాట్లాడడం కాదుగదా, కనీసం అలా ఊహించడానికే ప్రజలు గడగడలాడిపొయ్యేవారు. అలాంటి పరిస్థితుల్లో రాజు దైవత్వానికి, రాచరికపు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఇబ్రాహీం అలైహిస్సలాం అనే దైవప్రవక్తగళం విప్పారు. ఆనాడు సమాజంలో పాతుకుపోయి ఉన్న వివిధరకాల దురాచారాలకు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. విగ్రహారాధనను ఖండించారు. విషయం తెలుసుకున్న నమ్రూద్ ఇబ్రాహీంగారిని తన దర్బారుకు పిలిపించాడు. ‘నేనుకాక మరొక దేవుడెవరో ఉన్నాడని మాట్లాడుతు న్నావట, ఎవరు నీ దేవుడు చెప్పు?’ అని గర్జించాడు. ప్రశాంత చిత్తంతో ఉన్న ఇబ్రాహీం ఏమీ మాట్లాడలేదు. ‘మాట్లాడవేం. చెప్పు?’ మళ్ళీ గాండ్రించాడు. ‘రాజా! ఎవరి ఆధీనంలో జీవన్మరణాలున్నాయో ఆయనే మన ప్రభువు, మనదేవుడు.’ అన్నారు ఇబ్రాహీం. ‘అలాగా..! అయితే చూడు..’ అంటూ ఉరిశిక్ష పడిన ఖైదీని, నిరపరాధి అయిన యువకుడిని పిలిపించాడు. మరణ శిక్ష విధించబోయే ఖైదీని విడుదల చేస్తూ, అమాయక యువకుణ్ణి చంపేశాడు.’ తరువాత... ‘ఇప్పుడు చెప్పు. చావబోయేవాడికి జీవితం ప్రసాదించాను, బతక వలసినవాణ్ణి చంపేశాను. అంటే జీవన్మరణాలు నాచేతిలో ఉన్నాయి. మరి నేను దేవుణ్ణికానా?’ అన్నట్లు చూశాడు గర్వంగా. ఓహో! జీవన్మరణాల అర్థాన్ని ఇలా అన్వయించు కున్నాడా? అని మనసులో అనుకున్న ఇబ్రాహీం, ‘సరే అయితే, దేవుడు సూర్యుణ్ని తూర్పున ఉదయింపజేసి, పశ్చిమాన అస్తమింపజేస్తాడు. నువ్వు, పశ్చిమాన ఉదయింప జేసి, తూర్పున అస్తమించేలా చేయి’ అని సవాలు విసిరారు. నమ్రూద్ ఆగ్రహంతో ఊగిపోతూ, ‘ఇతణ్ణి భగభగమండే అగ్నిగుండంలో వేసి కాల్చిచంపండి’అని ఆదేశించాడు. క్షణాల్లో రాజాజ్ఞ కార్యరూపం దాల్చింది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అగ్నికీలల్లో ఆయన్ని విసిరేశారు. కాని దేవుని ఆజ్ఞతో అగ్ని తన కాల్చే గుణాన్ని కోల్పోయి, పూల పానుపుగా మారింది. ఇబ్రాహీం ప్రవక్త సురక్షితంగా బయట పడ్డారు. తరువాత ఇబ్రాహీం ప్రవక్త స్వదేశాన్ని విడిచి పెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. సత్య ధర్మాన్ని, దేవుని ఏకత్వాన్ని బోధిస్తూ, మూఢనమ్మకాలు, సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ వివిధ ప్రాంతాలు పర్యటించారు. ఈక్రమంలో ఆయన అనేక కష్టనష్టాలు, పరీక్షలు ఎదుర్కొన్నారు. దైవాజ్ఞ మేరకు భార్యాబిడ్డల్ని నిర్జన ఎడారి ప్రాంతంలో వదిలేయడం, కన్నకొడుకును దైవమార్గంలో త్యాగం చేయడం మానవ జాతి చరిత్రలో చిరస్మరణీయ పరిణామాలు. దైవాదేశ పాలనలో తన సమస్తాన్నీ సమర్పించిన త్యాగధనుడు కనుకనే ఐదువేల సంవత్సరాలు గడిచినా చరిత్ర ఆయన్ని స్మరించు కుంటోంది.ఆయన నిలిచిన ప్రదేశం, నిర్మించిన దైవగహం, జమ్ జమ్ జలం, సఫా, మర్వాల సయీ, ఆయన, ఆయన కుటుంబం నడయాడిన నేల, వారి ఒక్కోఆచరణ ప్రళయకాలం వరకూ, సందర్శనీయ, స్మరణీయ ఆచరణలుగా దేవుడు నిర్ధారించాడు. ఈ అన్నిటికీ అసలు ప్రేరణ దైవ సంతోషం, శాశ్వత సాఫల్యం. ఎవరికైనా అంతకన్నా కావలసింది ఇంకేముంటుంది? సత్యంకోసం, ధర్మంకోసం, ధర్మసంస్థాపనకోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించిన ఆమహనీయుల జీవితం మనకూ ఆదర్శం కావాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
‘అతడు’ తరహాలో..!
-
‘అతడు’ తరహాలో..!
బాగ్దాద్ : ఇరాక్‌లో జరిగిన ఈ హత్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తిని ఇలా హత్య చేయవచ్చా?! అనిపించేలా హత్య చేసి హంతకుడు పారిపోయాడు. బాగ్దాద్‌లోని ఒక రోడ్డులో రాత్రిపూట ఒక వ్యక్తి ఇంటికి వెళుతున్నాడు. కారులో ఉన్న వ్యక్తి.. అతన్ని పిలిచి ఏదో మాట్లాడుతూ.. గన్ తీసి కాల్చివేశాడు. బుల్లెట్ తగిలిన వ్యక్తి రోడ్డుమీదే కుప్పకూలిపోయాడు. శుక్రవారం ఈ హత్య జరిగినట్లు భావిస్తుండగా.. ఈ వీడీయోను సోషల్ మీడియాలో ఇప్పటికే 50 వేల మంది చూశారు. -
విద్యుత్ కేంద్రంపై దాడి.. 8 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్‌లోని ఓ విద్యుచ్చక్తి కేంద్రంపై గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన దాడిలో 8మంది ప్రాణాలు కోల్పోగా 10మంది తీవ్రంగా గాయపడ్డారు. సమర్రా నగర సమీపంలోని అల్-జల్‌సియా విద్యుత్ కేంద్రం ఆవరణలోకి గుర్తు తెలియని ఏడుగురు వ్యక్తులు ఆయుధాలు, పేలుడు సామగ్రితో ప్రవేశించి కాల్పులకు తెగబడ్డారు. వారి కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది, ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు ఆగంతకులు హతమయ్యారు. ఘటన అనంతరం భద్రతా దళాలు విద్యుత్ కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అయితే, ఈ ఘటనకు తామే బాధ్యులమని ఏ ప్రకటన వెలువడలేదు. ఐఎస్ తీవ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. -
ఆ పాపం నేను చేయను: సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ: 'కచ్చితమైన ఆధారాలు లేకుండా ఒక వ్యక్తి చనిపోయాడని ప్రకటించడం పాపం. అలాంటి పాపాన్ని నేను చేయను' అని విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. 2014 నుంచి ఇరాక్‌లో కనిపించకుండాపోయిన 39మంది భారతీయుల ఆచూకీ గురించి బుధవారం ఆమె లోక్‌సభలో ప్రకటన చేశారు. ఈ విషయమై లోక్‌సభలో మాట్లాడేందుకు ఇప్పటివరకు మూడుసార్లు సుష్మ ప్రయత్నించినప్పటికీ.. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో అది వీలుపడలేదు. సోమవారం సాయంత్రం, మంగళవారం ఈ విషయమై సభలో ప్రకటన చేసేందుకు సుష్మా ప్రయత్నించారు. అయితే, సభ్యుల ఆందోళన మధ్య అందుకు వీలుపడలేదు. బుధవారం కూడా ఆమె ప్రకటన చేసే సమయంలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన దిగారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ పదేపదే సభ్యులకు నచ్చజెప్పి శాంతించారు. 2014లో ఇరాక్‌లోని మోసుల్ అపహరణకు గురైన 39మంది భారతీయుల గురించి ఎలాంటి సమాచారం లేదని, వారు చనిపోయారు? బంధీలుగా ఉన్నారా? అన్నదానిపై సమగ్ర ఆధారాలు లేవని సభకు తెలిపారు. -
జమ్మూకశ్మీర్‌లో ఐసిస్ అడుగు..
ఇరాక్‌లో పట్టుకోల్పోతున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్(ఐఎస్ఐఎస్) భారత్‌లో అడుగుమోపి తన ఉనికి కాపాడుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం కశ్మీర్ రాష్ట్రంలోని వేర్పాటువాద ప్రభావిత జిల్లాలను ఎంపిక చేసుకుంది. 'అన్సరుల్ ఖలీఫా జమ్మూకశ్మీర్' అనే పేరుతో టెలిగ్రామ్ గ్రూప్‌ను నిర్వహిస్తున్న ఐసిస్.. ఉగ్ర భావజాలాన్ని వ్యాప్తి చేస్తోంది. కొద్ది వారాల క్రితం జమ్మూకశ్మీర్ పోలీసులకు ఫోన్ చేసిన ఐసిస్ సానుభూతిపరులు ముస్లిం, ఇస్లాం వ్యతిరేకులకు తుపాకులతోనే సమాధానం చెబుతాం అంటూ బెదిరించారు. ఈ నెల 5వ తేదీన కశ్మీర్‌లోని సానుభూతిపరులకు ఉగ్రదాడులు ఎలా చేయాలో ఐసిస్ మార్గ నిర్దేశం చేసినట్లు సమాచారం. సోమవారం టెలిగ్రామ్ గ్రూప్‌లో.. భారీ ట్రక్కులతో ఉగ్రదాడులకు ఎలా పాల్పడాలి అనే దానిపై హిందీలో సూచనలు సలహాలు ఐసిస్ అందించింది. బుర్హన్ వానీ కాల్చివేత అనంతరం ఐసిస్ వైపు మళ్లే వేర్పాటువాద యువత సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. తాజాగా ఐసిస్ ఇరాక్‌లోని మోసుల్ నగరాన్ని సైన్యానికి కోల్పోయి కకావికలమైంది. తన పేరు తలుచుకుంటే వణికిపోయేలా.. ఎలాగైనా తిరిగి మునుపటి స్ధాయిని అందుకోవాలని అందుకు భారతే మంచి ప్రదేశమని ఐసిస్ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, భారత రక్షణ శాఖ అధికారులు మాత్రం కశ్మీర్లో ఐసిస్ ఆనవాళ్లను కొట్టిపారేస్తున్నారు. అందుకు ఓ ఈక్వేషన్‌ను చూపుతున్నారు. ఐసిస్ భారత్‌లో లేదు కాబట్టే ఇప్పటివరకూ జరిగిన ఉగ్రదాడుల్లో ఒక దాడిని కూడా తాను చేసినట్లు ప్రకటించలేదని అంటున్నారు. కాగా, అన్సరుల్ ఖలీఫా పేరుతో ఐసిస్‌కు చెందిన ఉగ్రవాదులు టెలిగ్రామ్ గ్రూప్‌ను నిర్వహిస్తున్నారని ఎన్ఐఏ ఎప్పటినుంచో అనుమానిస్తోంది. 'అన్సరుల్ ఖలీఫా కేరళ' పేరుతో గ్రూపు ప్రారంభించిన ఆరుగురుని కేరళలోని కన్నూరులో ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. వీరందరూ ఆన్లైన్లో రాడికలైజ్ అయ్యారని సమాచారం. ఆదివారం 'అన్సరుల్ ఖలీఫా జమ్మూకశ్మీర్' టెలిగ్రామ్ గ్రూప్‌లో మరణించిన ఉగ్రవాది సజద్ గిల్కర్‌ను కీర్తిస్తూ మెసేజ్‌లు సర్కూలేట్ అయ్యాయి. -
బాగ్దాది కథ ముగిసింది
బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) నాయకుడు అబూబకర్ అల్ బాగ్దాది ప్రాణాలతో లేరని ఉగ్రవాద సంస్థ మంగళవారం ప్రకటించింది. దీంతో బాగ్దాదీ చనిపోయాడంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించినట్లయింది. త్వరలోనే ఆయన వారసుడిని ఎన్నుకుంటామని తెలిపింది. మోసుల్‌లోని తల్ అఫార్ పట్టణంలోని ఐఎస్ఐఎస్ తన సొంత మీడియా ద్వారా సంక్షిప్తంగా ఈ ప్రకటన చేసింది. బాగ్దాదీ చనిపోయాడని పేర్కొన్న సంస్థ.. ఎలా చనిపోయాడు? తదితర వివరాలను మాత్రం వెల్లడించలేదని ఇరాక్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ చెర నుంచి మోసుల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఇరాక్ ప్రధాని హైదర్ అల్-అబాదీ ప్రకటించిన మరునాడే ఐఎస్ఐఎస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. దాదాపు ఎనిమిది నెలలుగా ఐఎస్ చేతుల్లో ఉన్న మోసుల్‌ను భీకర పోరు తర్వాత ఇరాక్ సేనలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. -
మోసుల్‌లో విజయం సాధించాం
ఇరాక్ ప్రధాని అబాదీ ప్రకటన మోసుల్: ఇరాక్‌లోని మోసుల్ నగరంలో ఐసిస్ ఉగ్రవాదులపై విజయం సాధించామని ఆ దేశ ప్రధాని హైదర్ అల్ అబాదీ ఆదివారం ప్రకటించారు. ఈ ‘విముక్త’ నగరంలో ఆయన విజయ ప్రకటన చేశారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ‘అబాదీ మోసుల్కు వెళ్లి ఈ ఘన విజయాన్ని సాధించినందుకు వీర సైనికులకు, దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు’ అని వెల్లడించింది. అబాదీ మోసుల్‌లో నల్లటి సైనిక దుస్తుల్లో, తలపై టోపీతో ఉన్న ఉన్న ఫొటోను ఆయన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఆదివారం కూడా నగరంలో కాల్పులు, వైమానిక దాడులు జరిగాయి. ఆదివారం మోసుల్ సమీపంలోని టైగ్రిస్ నది దాటి పారిపోతున్న 30 మంది ఉగ్రవాదులను హతమార్చామని ఇరాక్ సైన్యం తెలిపింది. మోసుల్‌ను ఉగ్రవాదుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇరాక్ బలగాలు తొమ్మిది నెలలు భీకర యుద్ధం చేశాయి. ఘర్షణలకు భయపడి 9 లక్షల మంది ప్రజలు నగరాన్ని వదలివెళ్లారు. అమెరికా సైనిక సాయంతో ఇరాక్ సైన్యం ఐసిస్ చెరలోని చాలా ప్రాంతాలను ఇదివరకే విముక్తం చేసింది. -
ఇఫ్తార్ వికటించి 900 మందికి అస్వస్థత..
బాగ్ధాద్: ఇరాక్‌లో రంజాన్ మాసం సంధర్భంగా ఇచ్చిన ఇఫ్తార్ విందు వికటించి ఇద్దరు మృతి చెందగా వందల మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మోసుల్ నగరంలోని క్యాంపులో చోటుచేసుకుంది. ఫుడ్ పాయిజన్ ఈ ఘటనకు ప్రధాన కారణమని తెలుస్తోంది. రంజాన్ మాసం సందర్భంగా ఖతారీ హ్యూమనిరేషన్ అనే ఆర్గనైజేషన్ ఇప్తార్ విందును ఏర్పాటు చేసింది. ఈ విందులో పాల్గొన్న సుమారు 900 మంది తీవ్ర అస్వస్థతకులోనయ్యారు. వీరిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. ఆహారం తిన్న క్యాంపు జనం వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. ఇఫ్తార్ విందు వికటించడం వలన డిహైడ్రేషన్ గురయ్యారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు అందుతున్నాయి. ఇప్తార్ విందులో పెట్టిన చికెన్, బీన్స్ ఆహారాన్ని ఖతారీ చారిటీ ఇర్భిల్ నగరంలోని ఓ రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చినట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. ట్రస్టుకు సంబంధించిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఇర్భిల్ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య యుద్దం జరుగుతుంది. -
ఇరాక్‌లో జంట పేలుళ్లు: 31 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో జరిగిన రెండు వేర్వేరు బాంబు పేలుళ్లలో 31 మంది మరణించారు. తొలిదాడిలో...సోమవారం రాత్రి కరాదాలో రద్దీగా ఉండే ఐస్‌క్రీం దుకాణంలో ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకోవడంతో 17 మంది చనిపోగా, 32 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు దుకాణం బయట సాయం కోసం అర్థిస్తున్న దృశ్యాలు కనిపించాయి. రెండో సంఘటనలో... మంగళవారం షవాకా ప్రాంతంలోని ప్రభుత్వ పింఛను కార్యాలయం సమీపంలో బాంబులు అమర్చిన కారు పేలడంతో 14 మంది మరణించగా 37 మంది గాయాలపాలయ్యారు. రెండు దాడులకు పాల్పడింది తామేనని ఐసిస్ ప్రకటించింది. షియా ముస్లింలే లక్ష్యంగా పేలుళ్లు జరిపినట్లు పేర్కొంది. -
భారత వైద్యుల ఘనత: 8 కాళ్ల బిడ్డ సురక్షితం
పుట్టుకతో ఎనిమిది కాళ్లతో జన్మించిన కరమ్ ఆపరేషన్ అనంతరం తిరిగి సురక్షితంగా ఇంటికి చేరుకున్నాడు. గతేడాది అక్టోబర్‌లో ఇరాక్‌లో సర్వాద్ అహ్మద్ నాదర్, గుఫ్రాన్ అలీ దంపతులకు కరమ్ జన్మించాడు. పుట్టుకతోనే ఎనిమిది కాళ్లతో జన్మించడంతో బిడ్డకు ఆపరేషన్ చేయాలని అక్కడి వైద్యులు సూచించారు. వైద్యుల సలహాతో కరమ్‌ను వెంటనే ఢిల్లీలోని జేపీ ఆసుపత్రిలో చేర్పించారు నాదర్, అలీ దంపతులు. అప్పటి నుంచి కరమ్‌కు మూడు సార్లు ఆపరేషన్లు నిర్వహించిన జేపీ ఆసుపత్రి వైద్యులు బిడ్డను కాపాడటంలో విజయం సాధించారు. పూర్తిగా కోలుకున్న కరమ్‌ను ఇంటికి పంపుతున్నట్లు మంగళవారం తెలిపారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కవలలు రూపుదిద్దుకుంటున్న సమయంలో హఠాత్తుగా రెండో బిడ్డ ఎదుగుదల ఆగిపోవడం వల్ల బిడ్డ ఇలా జన్మిస్తుందని వివరించారు. మొదటి ఆపరేషన్‌లో బిడ్డ పొట్టపై ఉన్న అవయవాలను తొలగించినట్లు చెప్పారు. ఆ తర్వాత బిడ్డ కార్డియాక్ సమస్యను ఎదుర్కొంటుండటంతో సర్జన్లు ఆ సమస్య నుంచి బిడ్డను బయటపడేశారని తెలిపారు.ఆ తర్వాత రెండు ఆపరేషన్లలో మిగిలిన భాగాల్లో ఉన్న అవయవాలను తొలగించినట్లు వివరించారు. ప్రపంచ దేశాల నుంచి భారత్‌కు వస్తున్న మెడికల్ పర్యాటకుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇందుకు ప్రధానకారణం భారత్ తక్కువ ధరలో ఉత్తమ వైద్యం అందిస్తుండటమే. ఈజిప్టుకు చెందిన ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళ తన బరువు తగ్గించుకోవడానికి ముంబైకు వచ్చిన విషయం తెలిసిందే. -
ఇరాక్‌లో ఆత్మాహుతి దాడి
బాగ్దాద్ : ఇరాక్ మరోసారి నెత్తురోడింది. తిక్రిత్ నగరంలోని పౌరుల్ని, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన ఆత్మాహుతి దాడిలో 31 మంది ప్రాణాలు కోల్పోగా, 42 మంది గాయపడ్డారు. మృతి చెందినవారిలో 14మంది పోలీసులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాగా ఉగ్రవాదులు పోలీస్ దుస్తుల్లో వచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. భద్రతదళాలే లక్ష్యంగా పదిమంది ఈ దాడిలో పాల్గొనగా వారిలో ఇద్దరు ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఇప్పటి వరకు దాడిని తామే చేసినట్లు ఏ సంస్థా ప్రకటించుకోలేదు. -
ఇరాక్ వలసదారులకు విముక్తి
హైదరాబాద్: ఇరాక్‌కు వలస వెళ్లి ప్రమాదకర ఐసిస్ జోన్లో చిక్కుకున్న 31మంది తెలంగాణ కార్మికులు ఈరోజు తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి నుంచి వారు ఈ సాయంత్రానికి స్వస్థలాలకు చేరుకోనున్నారు. మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాల నుంచి అనేకమంది కార్మికులు రెండేళ్ల క్రితం ఇరాక్‌కు వలస వెళ్లారు. ఏజెంట్ల మాటలు నమ్మి వారు మోసపోయారు. అక్కడ ప్రమాదకర ఐసిస్ జోన్లో చిక్కుకుపోవడంతో తల్లడిల్లిన వారి కుటుంబీకులు తమవారిని రక్షించాలని తెలంగాణ, కేంద్ర ఫ్రభుత్వాలను అభ్యర్థించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌లు చొరవ తీసుకుని వీరికి విముక్తి కలిగించారు. -
ఇంటికి గల్ఫ్ బాధితులు
► కేటీఆర్ చొరవతో ఇండియాకు సాక్షి, న్యూఢిల్లీ: జీవనోపాధి కోసం ఇరాక్ వెళ్లి ఏజెంట్ల మోసాలతో అక్కడ చిక్కుకున్న 31 మంది తెలంగాణ, ఏపీకి చెందిన భవన నిర్మాణ కార్మికులు సోమవారం స్వదేశానికి చేరుకోనున్నారు. అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, గోదావరి జాల్లాలకు చెందిన 31 మంది భవన నిర్మాణ కార్మికులు విజిట్ వీసాలపై ఇరాక్ వెళ్లారు. వీసాలను పర్మినెంట్ చేస్తామని చెప్పి ఏజెంట్లు మోసం చేయడంతో కార్మికులకు పని దొరక్క, తిండి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో బాధితులు తమ సమస్యలను తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం ప్రతినిధి బసంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కె. తారకరామారావు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మస్వరాజ్‌తో చర్చించారు. దీంతో ఆమె వెంటనే ఇరాక్‌లోని భారత రాయబారిని సంప్రదించి కార్మికులను స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేశారు. సోమవారం వీరందరూ దుబాయ్ మీదుగా ఢిల్లీ చేరుకోనున్నారు. -
ఇస్లామిక్ స్టేట్‌కు గట్టి ఎదురుదెబ్బ
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు నిర్వహించిన వైమానిక దాడుల్లో ఆ సంస్థ కీలక నేత ఇబ్రహీం అల్-అన్సారీ హతమయ్యాడు. బాగ్దద్లో సంకీర్ణ సేనలకు నేతృత్వం వహిస్తున్న కల్నల్ జోఫ్ఫ్ స్క్రోక్కా గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల ద్వారా నిర్వహించే ఇస్లామిక్ స్టేట్ ప్రచార కార్యక్రమాల్లో అల్-అన్సారీ కీలక వ్యక్తి అని జోసఫ్ తెలిపారు. విదేశీయులను ఇస్లామిక్ స్టేట్లోకి ఆకర్షించడం, పశ్చిమ దేశాలపై దాడులను ప్రోత్సహించడంలో అల్-అన్సారీ పాత్ర ఉందని ఆయన వెల్లడించారు. పశ్చిమ ఇరాక్‌లోని అల్-క్వైమ్ పట్టణంలో జరిగిన ఈ వైమానిక దాడుల్లో అల్- అన్సారీతో పాటు.. నలుగురు ఇస్లామిక్ స్టేట్ మల్టీ మీడియా ఆపరేషన్ టీంకు చెందిన వారు హతమయ్యారని భద్రతా అధికారులు వెల్లడించారు. -
ఇరాక్‌లో పేలుళ్లు..13 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. పోలీస్ చెక్ పాయింట్ సమీపంలో మానవ బాంబుతో ముష్కరుడు దాడి చేశాడు. ఈ ఘటనలో సుమారు 13 మంది మృతి చెందగా 24 మంది గాయపడ్డారని ఇరాక్ పోలీసులు గురువారం మీడియాకు వెల్లడించారు. బుధవారం రాత్రి పోలీస్ చెక్ పాయింట్ సమీపంలో మానవ బాంబర్ ట్యాంకర్‌తో దూసుకొచ్చి పేల్చుకున్నాడని పోలీసులు తెలిపారు. పేలుడు దాటికి 15 వాహనాలు దగ్దమయ్యాయి. -
ఇరాక్‌లో ఇరుక్కున్న వారు ఇంటికి..
⇒ బాధితులను పంపాలని తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి ⇒ నెలాఖరు లోగా పంపించేందుకు ఎంబసీ హామీ జన్నారం(ఖానాపూర్): ఇరాక్‌లో చిక్కు కున్న బాధితులను స్వగ్రామాలకు రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇరాక్‌లోని భారత రాయ బార కార్యాలయ అధికారులపై ఒత్తిడి తెచ్చాయి. ఈ నెలాఖరు లోగా వారిని తిరిగి పంపించేం దుకు అక్కడి రాయబార కార్యాలయ అధికారి దీపక్ విజ్ఞాని హామీ ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధికార ప్రతినిధి బసంతరెడ్డి, తపాలపూర్వాసి మాటేటి కొమురయ్య ఆదివారం ‘సాక్షి’కి వివరించారు. ‘ఇరాక్‌లో ఇరుక్కున్నాం.. ఆదుకోండి’ శీర్షికన ఈ నెల 10న ‘సాక్షి’ మెయిన్‌లో కథనం ప్రచురితమైంది. మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా లకు చెందిన సుమారు 300 మంది విజిట్ వీసాపై వెళ్లి అక్కడ ఇబ్బందులు పడుతున్న విష యాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసు కొచ్చింది. ఈ కథనానికి స్పందిం చిన ఢిల్లీ భారత రాయబార కార్యాలయ ఎన్నారై విభాగం అధికారి చిట్టిబాటు... బసంతరెడ్డితో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ అధికారి కూడా ఆయనకు ఫోన్ చేసి వివరాలు సేకరించారు. ఇరాక్‌లోని ఎర్బిల్ భారత రాయబార సంస్థలో రాజు అనే అధికారిని డిప్యూటీ కౌన్సిలర్‌గా నియమించి, ఈ సమస్య పరిష్కరించాలని ఢిల్లీ కార్యాలయం నుంచి ఆదేశించారు. ఈ క్రమంలో బాధితులను ఈ నెలాఖరు వరకు తిరిగి పంపిస్తామని దీపక్ విజ్ఞాని హామీ ఇచ్చి నట్లు తెలిపారు. ‘సాక్షి’ కథనంతోనే స్పం దించారని, తాము ‘సాక్షి’ పేపర్‌ను మరువబోమని బాధితులు పేర్కొన్నట్లు కొమురయ్య ఫోన్ ద్వారా తెలిపారు. -
పాడైపోయెను గూడు
గ్రౌండ్ అప్ పాడైపోయెను గూడు ఇరాక్ ఇంకా చల్లపడలేదు. సద్దాం హయాం నుంచీ ఆ దేశంలో ఏదో ఒక కల్లోలం! ప్రస్తుతం ఐసిస్ జిహాదీలకు, ఇరాక్ ప్రభుత్వానికీ మధ్య భీకర పోరాటం జరుగుతోంది. ఐసిస్ ఇరాక్‌లో ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటుంటే... ఇరాక్ దీటుగా పోరాడి ఒక్కో ప్రాంతాన్నీ విడిపించుకుంటూ వస్తోంది. జిహాదీలు ఆత్మాహుతి దళాలతో దొంగ దెబ్బ తీస్తుంటే, ఇరాక్... రాకెట్ దాడులతో ఐసిస్ జిహాదీలను తరిమికొడుతోంది. ఈ రెండు వర్గాల నడుమ ఇరాక్‌లోని వేలాది కుటుంబాలు చెల్లాచెదురవుతున్నాయి. అయినవాళ్లను పోగొట్టుకుని ఎందరో అనాథలవుతున్నారు. వీళ్ల కోసం అమెరికా నాయకత్వంలోని సంకీర్ణదళాలు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాయి. మోసీల్ పట్టణంలోని అలాంటి ఒక రక్షణ శిబిరంలోకి... కూతుర్ని ఎత్తుకుని, పరుగులు తీస్తున్న ఇరాక్ తండ్రినే మీరిప్పుడు ఫొటోలో చూస్తున్నది. తల్లి ఎక్కడుందో వీళ్లకు తెలియదు. వీళ్లు ఎక్కడున్నారో ఆమెకు తెలియదు. ఒకళ్ల ప్రాణాలు ఒకళ్ల దగ్గరున్నాయని మాత్రం ఈ విషాద దృశ్యం తెలియజేస్తోంది. బుల్ అండ్ లిటిల్ గర్ల్ మాన్‌హట్టన్‌లోని వాల్ స్ట్రీట్ కంచు ఆంబోతుకు సవాల్ విసురుతూ... ‘నువ్వా? నేనా?’ అన్నట్లు దానికి ఎదురుగా నిలుచున్న చిన్న పిల్ల విగ్రహం ఒకటి ఇప్పుడు ప్రపంచానికి ముచ్చటగొల్పుతోంది. మహిళా సాధికారతకు, అంతకు మించి మహిళా శక్తికి తార్కాణంగా ఉన్న ఈ చిన్నారి విగ్రహాన్ని మొన్నటి మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద కంపెనీల బోర్డు నిర్ణయాలలో మహిళల భాగస్వామ్యం ఇప్పటికీ తక్కువగానే ఉందని, మహిళా శక్తిని అంగీకరించి, వారికి సమాన అవకాశాలను కల్పిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సురక్షితంగా ఉంటుందనీ సూచిస్తూ బుల్కి ఎదురుగా ఈ లిటిల్ గర్ల్‌ని ఉంచారు. సాధించింది సేనాని భార్య మేజర్ అమిత్ దేశ్వాల్! ఏడాది క్రితం మణిపూర్‌లో తీవ్రవాదులతో పోరాడి మరణించిన సైనిక వీరుడు. ఆర్మీ స్పెషల్ ఫోర్స్‌లో పని చేస్తూ దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ అమిత్ దేశ్వాల్ ఆశయాన్ని ఇప్పుడు ఆయన భార్య నీతా భుజం మీదకు తుపాకీలా ఎత్తుకున్నారు. 33 ఏళ్ల నీతా భారత సైన్యంలో ‘షార్ట్ సర్వీస్ కమిషన్’ ఆఫీసర్‌గా ఎన్నికయ్యారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఏప్రిల్ 1న ప్రారంభమై 49 వారాల పాటు సాగే శిక్షణ అనంతరం నీతా ఆర్మీ విధుల్లో చేరుతారు. సరిగ్గా గత ఏడాది ఏప్రిల్‌లోనే ఆమె తన భర్తను కోల్పోయారు. ఆ షాక్ నుంచి తేరుకోడానికి ఆమెకు రెండు నెలలు పట్టింది. ఆ తర్వాత గుండె దిటవు చేసుకుని తన మూడేళ్ల కొడుకుతో పాటు హర్యానా నుంచి ఢిల్లీ వెళ్లి ‘సర్వీస్ సెలక్షన్ బోర్డు’ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. తన భర్త అర్ధంతరంగా వదిలిపెట్టి వెళ్లిన దేశ రక్షణ బాధ్యతలో పాల్పంచుకోవడమే ఆమె లక్ష్యం. అదిప్పుడు నెరవేరింది. చెన్నైలో శిక్షణ పూర్తయ్యాక లెఫ్ట్‌నెంట్ క్యాడర్ అధికారిగా దేశానికి సేవలు అందిస్తారు నీతా. కసిగా ఉన్నాడు మిన్ బహదూర్ షేర్‌చాన్ ప్రస్తుత వయసు 86. దేశం నేపాల్. 2008లో ఈయన ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కాడు. ఎక్కిన రెండేళ్ల తర్వాత 2010లో ‘ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అతివృద్ధుడు’గా గిన్నిస్ బుక్‌ని ఎక్కాడు. అయితే షేర్చాన్కి ఆ సంతోషం ఎక్కువకాలం మిగల్లేదు. యుచీరో మియూరా అనే 80 ఏళ్ల వృద్ధ మహాశయుడు 2015లో ఎవరెస్టును ఎక్కి, మన షేర్చాన్ని గిన్నెస్లోంచి తోసేశాడు! అప్పట్నుంచీ షేర్‌చాన్ కసిగా ఉన్నాడు. మళ్లీ ఎలాగైనా ఎవరెస్టును ఎక్కేసి, తన జపాన్ ప్రత్యర్థి మియూరాను గిన్నిస్‌నుంచి ఒక్క తన్ను తన్నేయాలన్న దృఢనిశ్చయంతో ఉన్నాడు. ఏడాది లోపు ఎక్కితీరుతాను అని కూడా చెబుతున్నాడు. ‘నేను వృద్ధుడిని కావచ్చు. మనసు ఇంకా యంగ్‌గానే ఉంది’అని అంటున్నాడు. అయితే రికార్డు కోసం పంతాన్ని నెగ్గించుకోవాలనుకోవడం లేదట షేర్‌చాన్. ప్రపంచశాంతి, భూమాతను కాపాడుకోవడం... అనే అంశాలపై ప్రజలను చైతన్యం చేయడం కోసం ఈ శిఖరయాత్రను చేపడుతున్నాడట. నూరేళ్ల విలాపం ఇరవై ఏళ్ల క్రితం ఇండియాలో వినాయకుడు పాలు తాగాడు. ఇప్పుడు క్రిమియా ద్వీపకల్పం సిమ్ఫెరోపోల్లోని రష్యా చివరి చక్రవర్తి రెండవ నికోలాయ్ విగ్రహం కన్నీళ్లు కారుస్తోంది. తర్కానికి అతీతంగా భక్తివిశ్వాసాలు మనుషులను నడిపిస్తాయని అనుకోడానికి ఈ రెండు వార్తలు నిదర్శనం. ఉక్రెయిన్ నుంచి రష్యా సిమ్ఫెరోపోల్ను కలుపుకున్న రెండేళ్ల తర్వాత 2016లో నికోలాయ్ విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. పూర్వపు చక్రవర్తుల మాదిరిగానే రెండవ నికోలాయ్ భక్తిపరుడు. నికోలాయ్ పదవీచ్యుతుడై వందేళ్లు అయిన సందర్భంగా అతడి విగ్రహం విలపిస్తూ ఉండివుండొచ్చని క్రిమియా న్యాయవాది నాటాలియా పొర్లోన్స్కయా అంటున్నారు. పాపం.. బ్యాంక్! ఈ తాబేలు పేరు ‘బ్యాంక్’. అసలు పేరు ఆమ్సిన్. వయసు 25. ఇంకో నూటా పాతికేళ్ల జీవితం ఉండగానే ఇదిగో... ఇలా హాస్పిటల్ పాలయింది! తాబేళ్ల జీవితకాలం సాధారణంగా 150 ఏళ్లు. జాతిని బట్టి 200 ఏళ్లు బతికే తాబేళ్లూ ఉన్నాయి. అయ్యో! మరి మన ‘బ్యాంక్’కు ఇంతలోనే ఏమయింది?!తాబేలు ఉన్న కొలనులోకి నాణేలను విసిరితే ఎక్కువకాలం జీవిస్తామని థాయ్‌లాండ్‌లో ఓ నమ్మకం ఉంది. ఆ నమ్మకమే ఇప్పుడు ‘బ్యాంక్’ ప్రాణాల మీదికి తెచ్చింది. థాయ్ రాజధాని బ్యాంకాక్‌కు దగ్గర్లో శ్రీరచ అనే తీరప్రాంత సమీప పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఓ కొలను ఉంది. ఆ కొలనులో ఓ తాబేలు ఉండేది. ఆ తాబేలే... ఇప్పుడు థాయ్ ఆసుపత్రిలో ఉన్న ‘బ్యాంక్’. బ్యాంక్... కొలనులో ఉన్నప్పుడు అది నీటి పైకి తేలినప్పుడు... కొలను దగ్గరున్న వాళ్లు తాబేలు ఉన్న వైపు నాణేలు విసిరేవారు. వాటిని ‘గుడ్ లక్ పెన్నీస్’ అంటారు. అయితే ఆ గుడ్ లక్ పెన్నీలు... కొలనులోని తాబేలుకు బ్యాడ్ లక్ పెన్నీలు అయ్యాయి. ఎన్నాళ్ల నుంచి ఆ తాబేలు... నీటిలోకి వచ్చి పడుతున్న నాణేలను మింగుతుందో గానీ, దాని కడుపు ఉబ్బిపోయి, కదలలేని స్థితికి వచ్చింది. ఈ సంగతిని ఓ నేవీ అధికారి గమనించాడు. వెంటనే దాన్ని యూనివర్శిటీ ఆసుపత్రికి చేర్చాడు. డాక్టర్లు స్కాన్ చేసి చూస్తే తాబేలు కడుపులో నాణేలు కనిపించాయి! వెంటనే ఆపరేషన్‌కు ఏర్పాట్లు జరిగాయి. తాబేలుకు మత్తు ఇచ్చారు. కడుపుపైన చిన్న కోత పెట్టారు. ఏడు గంటల పాటు శ్రమించి దాని కడుపులోంచి 915 థాయ్ నాణేలను తీశారు. ఒంట్లోంచి ఒక్కసారిగా ఐదు కిలోల బరువు తగ్గిపోవడంతో తాబేలు తేలికపడింది. డాక్టర్లూ ఊపిరి పీల్చుకున్నారు. అసలే ఈ తాబేలు... అంతరించిపోతున్న జీవజాతిలో ఉంది మరి! ఈ సంఘటన యూనివర్శిటీలోని వెటర్నరీ డిపార్ట్మెంట్ హెడ్డు నంతరికా ఛాస్యూకి చాలా బాధ కలిగించింది. మీడియాను పిలిపించి, నీళ్లలో నాణేలు వేయడం మానుకోవాలని స్థానికులకు, టూరిస్టులకు ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం బ్యాంక్ ఆసుపత్రిలో కోలుకుంటోంది. -
పచ్చటి పెళ్లిపందిరిలో రక్తపుటేరులు
-
ఇరాక్‌లో ఇరుక్కున్నాం.. ఆదుకోండి
జన్నారం: ఏజెంట్ల మాయమాటలు నమ్మి ఇరాక్ వెళ్తే మొదటికే మోసం వచ్చింది. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలని చెప్పి లక్షలు గుంజిన ఏజెంట్లు విజిట్ వీసాలు చేతికిచ్చి పంపారు. మూడు నెలల వీసా గడువు ముగి యడంతో ఉత్తర తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన సుమారు మూడు వందల మంది ఇరాక్‌లో ముప్పుతిప్పలు పడుతు న్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని పది మంది బాధి తులు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని ‘సాక్షి ’కి అందజేశారు. అసలేం జరిగిందంటే... మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు చెందిన సుమా రు మూడు వందల మంది ఉపాధి కోసం గత ఐదారు నెలల క్రితం ఇరాక్ వెళ్లారు. ఇందు కోసం ఏజెంట్లకు లక్షన్నర వరకు చెల్లించారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఎవరూ పట్టిం చుకోక పోవడంతో మోసపోయినట్లు గుర్తిం చారు. అయితే అఖామా (అనుమతి) లేకుండా తమ దేశంలో ఉండవద్దని, అలాంటి వారికి రూ.రెం డు లక్షల జరిమానా లేదా జైలుశిక్ష తప్పదని ఇరాక్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అఖామా లేకుండా ఎర్బిల్ ప్రాంతంలో ఉంటున్న వారంతా ఆందోళనలో పడ్డారు. గల్ఫ్ బాధితుల సంఘం రాష్ట్ర అధికార ప్రతి నిధి బసంతరెడ్డి, జన్నారం మండలం తపాలపూర్‌కు చెందిన కొమురయ్యలను కలిసి తమ గోడు విన్నవించారు. వారు 31 మం దిని రెండు నెలల క్రితం ఇండియా పంపించేం దుకు చొరవ చూపారు. జన్నారం మండలా నికి చెందిన మరో 50 మంది ఇలాంటి బాధలు అనుభవిస్తున్నట్లు తెలియడంతో గత నెల రోజుల క్రితం ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచు రించింది. అధికారులు మరో 46 మందిని స్వదేశానికి పంపడానికి ఇరాక్‌లోని ఎర్బిల్ భారత రాయబార సంస్థ అధికారి దీపక్ విజ్ఞాని ఒప్పుకుని వారి పేర్లను ప్రకటించారు. ఔట్ కోసం వెళితే పట్టుకుంటున్నారు.. భారత రాయబార సంస్థ ప్రతినిధి తిరిగి స్వ దేశానికి పంపడానికి పేర్లను ప్రకటించ డంతో వారు అక్కడి దేశంలోని అఖామా కార్యాల యంలో ఔట్ తేదీ ప్రకటించాలని వెళ్లారు. వారు తేదీ ప్రకటించడంలో జాప్యం చేస్తున్న ట్లు బాధితులు సాక్షితో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇరాక్ దేశం నిబంధనలను తీవ్రత రం చేసిందని, ఇందులో భాగంగా ఓ గదిలో ఉంటున్న పది మందిని అక్కడి పోలీసులు పట్టుకెళ్లినట్లు జన్నారం మండలం తపాల పూర్‌కు చెందిన కొమురయ్య తెలిపారు. తిండిలేక పస్తులు ఉంటున్నారని పేర్కొన్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంన గర్, సిరిసిల్ల, కామారెడ్డి తదితర జిల్లాలకు చెందిన సుమారు మూడు వందల మంది అఖామా లేకుండా ఇబ్బంది పడుతున్నా రు. సాక్షి పేపర్లో వచ్చిన వార్తతో 46 మందిని ఇండియా పంపడానికి ఎర్బిల్‌లో ని భారత రాయబార సంస్థ ఒప్పుకుంది. కాని బయటకు పంపే తేదీ చెప్పడం లేదు. ఇక్కడి ప్రభుత్వం మొదట రూ.2లక్షల జరి మానా చెల్లించాల్సిందిగా ఆదేశించినా తరు వాత దానికి రూ.55 వేలకు కుదించింది. - కొమురయ్య, ఇరాక్ (తపాలపూర్) -
ఈసారి ఆరు దేశాలపై..
సవరించిన వలస నిషేధపు ఉత్తర్వులపై ట్రంప్ సంతకం ► ఈ నెల 16 నుంచి అమల్లోకి ► జాబితా నుంచి ఇరాక్ తొలగింపు వాషింగ్టన్ : పట్టువదలని విక్రమార్కుడిలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నది సాధించారు. అమెరికాలోకి వలసల నిరోధం కోసం... సవరించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై సోమవారం సంతకం చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఆరు ముస్లిం ఆధిక్య దేశాల పౌరుల్ని 90 రోజుల పాటు అమెరికాలోకి అనుమతించరు. కొత్తగా వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే ఈ ఉత్తర్వు వర్తిస్తుందని, ఇప్పటికే చెల్లుబాటయ్యే వీసాలు కలిగి ఉంటే వారికి అమెరికాలో ప్రవేశం కల్పిస్తామని స్పష్టం చేశారు. సవరించిన ఉత్తర్వుల్లో ఇరాక్ పేరును తొలగించడం గమనార్హం. అమెరికా వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసేవారిని క్షుణ్నంగా తనిఖీ చేసేందుకు ఇరాక్ అంగీకరించడంతో ఆ దేశం పేరును జాబితా నుంచి తొలగించారు. సవరించిన ఉత్తర్వుల్లో ఏముంది? సూడాన్ , సిరియా, ఇరాన్, లిబియా, సోమాలియా, యెమెన్ దేశాలకు చెందిన ప్రజల్ని అమెరికాలోకి రాకుండా 90 రోజుల పాటు నిషేధించారు. మార్చి 16 నుంచి కొత్త ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. అలాగే మార్చి 16కు ముందు జారీ చేసిన వీసాల్ని రద్దు చేయరు. జనవరి 27న జారీచేసిన నిషేధపు ఉత్తర్వులతో రద్దైన వీసాల్ని పునరుద్దరిస్తారు. అలాగే చట్ట ప్రకారం శాశ్వత నివాసితులు, గ్రీన్ కార్డుదారులకు ఉత్తర్వులు వర్తించవు. 90 రోజుల్లో నిబంధనల్ని సమీక్షించి... విదేశాల నుంచి ఉగ్రవాదులు, నేరస్తులు అమెరికాలో ప్రవేశించకుండా కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తామని పేర్కొన్నారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించే పథకాన్ని వచ్చే 120 రోజుల పాటు తాత్కాలికంగా రద్దు చేసున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అమెరికాలోకి అనుమతించే శరణార్థుల సంఖ్యపై పరిమితి విధించారు. 2017లో 50 వేలకు మించి శరణార్థుల్ని అమెరికాలో అనుమతించరు. పాత ఉత్తర్వుల్లో సిరియా శరణార్థులపై శాశ్వత నిషేధమని పేర్కొనగా సవరించిన దాంట్లో అలాంటి నిబంధన విధించలేదు. శరణార్థులకు ఆశ్రయంపై హోం ల్యాండ్ భద్రతా విభాగం, ఇతర భద్రతా విభాగాలు సమీక్షించి... వారు భవిష్యత్తులో అమెరికా భద్రతకు ముప్పు కాకుండా ప్రణాళిక రూపొందిస్తారని కొత్త ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జనవరి 27న ట్రంప్ జారీచేసిన నిషేధపు ఉత్తర్వును సియాటిల్ డ్రిస్ట్రిక్ట్ కోర్టు నిలిపివేసింది. అనంతరం అమెరికా న్యాయశాఖ ఆ తీర్పును అప్పీలు కోర్టులో సవాలు చేయగా అక్కడా చుక్కెదురైంది. పక్కాగా రూపొందించాం: వైట్‌హౌస్ ఈ సారి నిషేధపు ఉత్తర్వులు చాలా పక్కాగా రూపొందించారని వైట్‌హౌస్ అధికారులు చెబుతున్నారు. గతంలో వలే అమెరికా విమానాశ్రయాల్లో ఎలాంటి గందరోగళం ఉండదని, చెల్లుబాటయ్యే వీసాలతో ప్రయాణిస్తూ అమెరికా ఎయిర్‌పోర్టులకు చేరుకున్నవారిని కూడా దేశంలోని అనుమతిస్తారని వారు చెప్పారు. నిషేధం విధించిన దేశాల్లో మూడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుండగా... మరో మూడు దేశాలు ఉగ్రవాదులకు స్థావరంగా ఉన్నాయని అమెరికా అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ తెలిపారు. అమెరికన్లూ.. ఆ దేశాలకు వెళ్లొద్దు ఆరు ముస్లిం దేశాలపై నిషేధం అనంతర పరిణామాలు, ఐసిస్ హెచ్చరికల నేపథ్యంలో మధ్య, దక్షిణ ఆసియా దేశాల పర్యటనకు వెళ్లొద్దని అమెరికా ప్రభుత్వం తన పౌరులను కోరింది. ముఖ్యంగా పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్‌లకు పోనేపోవద్దని హితవు పలికింది. భారత్‌లోనూ ఐసిస్ చాపకిందనీరులా ఉందని, ఇండియాలో పర్యటించే అమెరికన్లు జాగ్రత్తగా వ్యవహరించాలని విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటన చేసింది. .@POTUS has signed a new executive order that will keep the nation safe. Read it at https://t.co/XcBwwEJJHF pic.twitter.com/Yx2mikXl2A — Sean Spicer (@PressSec) March 6, 2017 -
ఓటమిని అంగీకరించిన ఐసీస్
-
కొత్త వలస విధానంపై ట్రంప్ కీలక నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఇరాక్‌కు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ కొత్త వలస విధాన చట్టంలో నిషేధిత దేశాల జాబితా నుంచి ఇరాక్‌ను తొలగించారు. అమెరికా అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించిన తర్వాత ఈ విషయం వెల్లడించారు. అమెరికా కాంగ్రెస్‌లో ట్రంప్ వలస విధానం గురించి ప్రసంగించారు. దేశ భద్రతను పెంచడం, పకడ్బందీగా చట్టాలను అమలు చేయడం, అమెరికన్లకు ఉద్యోగాలను, వేతనాలు పెంచడంపై దృష్టిసారిస్తున్నామని, కొత్తవలస విధాన చట్టం సానుకూలంగా ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇస్లామిక్ దేశాలైన ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్ పౌరులు అమెరికాలోకి రాకుండా ట్రంప్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా ట్రంప్ ఉత్తర్వులు చెల్లవంటూ అమెరికా ఫెడరల్ కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. దీంతో ఆయా దేశాలకు చెందినవారికి తాత్కాలికంగా ఉపశమనం లభించినట్లయింది. ఈ నేపథ్యంలో కొత్త వలస విధాన చట్టం తీసుకురావాలని ట్రంప్ నిర్ణయించారు. ఈసారి ఎలాంటి లోపాలు లేకుండా కొత్త ఇమ్మిగ్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకురానున్నారు. ట్రంప్ దీనిపై సంతకం చేయనున్నారు. -
డేంజర్ లో 3.5 లక్షల చిన్నారులు
లండన్: ఇరాక్‌లోని పశ్చిమ మోసుల్ నగరంలో జిహాదీలకు, సైన్యానికి మధ్య జరుగుతున్న పోరులో 3.5 లక్షల మంది చిన్నారులు చిక్కుకున్నారని లండన్ కేంద్రంగా పనిచేస్తున్న సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఈ వ్యూహాత్మక నగరాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఇరాకీ దళాలు తాజాగా జిహాదీలపై దాడి ప్రారంభించిన నేపథ్యంలో ఈ సంస్థ ఈ విధంగా హెచ్చరించింది. ఇరాకీ దళాలు, వారితో కలిసి పనిచేస్తున్న అమెరికా, యూకే సైన్యం కలిసి చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు ఎటువంటి ఆపద కలుగకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నించాలని కోరింది. యుద్ధంలో చిక్కుకున్న బాలలు 18 ఏళ్ల లోపువారేనని తెలిపింది. ఐసిస్ క్యాంపుల నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేయొద్దని బందీలకు సూచించింది. పారిపోతే జిహదీలకు చిక్కితే ప్రాణాలు తీయడం ఖాయమని హెచ్చరించింది. ఒకవేళ తప్పించుకుని బయటకు వచ్చినా భద్రతా దళాలు, జిహాదీల మధ్య నిరాంతరాయంగా కొనసాగుతున్న కాల్పులతో ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చని వివరించింది. -
బాంబు దాడులు భారత్‌లోనే అధికం
న్యూఢిల్లీ: గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా జరిగిన బాంబు దాడుల్లో ఎక్కువ పేలుళ్లు భారత్‌లోనే జరిగినట్లు నేషనల్ బాంబ్ డేటా సెంటర్ (ఎన్బీడీసీ) తాజా నివేదికలో వెల్లడించింది. యుద్ధం కాలంలో ఇరాక్, అఫ్గాన్ దేశాలపై జరిగిన బాంబు దాడుల కంటే భారత్‌లోనే అధికంగా దాడులు జరిగినట్లు పేర్కొంది. ఈ ప్రకారం గత ఏడాది 406 బాంబుదాడులతో భారత్ మొదటి స్థానంలో నిలవగా, 221 బాంబుదాడుల తో ఇరాక్ రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈ దాడుల్లో ఎంతమంది మరణించారు, ఎంతమంది గాయపడ్డారన్న అంశాలేవీ నివేదికలో వెల్లడించలేదు. ఇక పొరుగు దేశం పాకిస్తాన్ లో 161, అఫ్గానిస్తాన్ లో 132 బాంబు దాడులు జరిగాయి. -
వరుస ఆత్మాహుతి దాడులు; 10 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ మళ్లీ బాంబుదాడులతో దద్దరిల్లింది. శనివారం ఇరాక్ రాజధాని బాగ్దాద్‌తో పాటు మోసుల్ నగరంలో జరిగిన వరుస ఆత్మాహుతి దాడుల్లో కనీసం 10 మంది మరణించగా, మరో 33 మంది గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించారు. ఇరాక్‌లో ఐఎస్ ఉగ్రవాదులకు, భద్రత దళాలకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఐఎస్ ఆధీనంలో ఉన్న మోసుల్‌ను ఇరాక్ భద్రత దళాలు ఇటీవల స్వాధీనం చేసుకున్నాయి. మోసుల్‌లో ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేయడంతో నలుగురు మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు. మోసుల్‌లోనే మరో రెండు చోట్ల సూసైడ్ కారు బాంబులను పేల్చారు. -
‘ట్రంప్.. మాపై నిషేధం ఎత్తివేయండి ప్లీజ్’
బాగ్దాద్: ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాదీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేశారు. తమ దేశంపై విధించిన ట్రావెలింగ్ బ్యాన్ తొలగించాలని కోరారు. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం కారణంగా అమాయకులైన తమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ట్రంప్‌కు చెప్పారు. ఈ మేరకు ఇరాక్ అధికార ప్రతినిధి వివరాలు తెలియజేశారు. మొత్తం ఏడు ముస్లిం దేశాలపై అమెరికాలోకి అడుగుపెట్టకుండా ట్రావెలింగ్ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. ఇందులో ఇరాక్ కూడా ఉంది. దీంతో ఈ నిర్ణయం నాటికి అమెరికా నుంచి ఇరాక్ వచ్చిన వారు.. అమెరికా వెళ్లాల్సిన వారికి చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో ట్రంప్ విధించిన ట్రావెలింగ్ బ్యాన్ చెల్లదంటూ కిందిస్థాయి కోర్టు తొలుత అనంతరం ఫెడరల్ కోర్టు స్పష్టం చేయడంతో కొంత ఊరట కలిగినట్లయింది. ప్రస్తుతం కొన్ని దేశాల నుంచి అమెరికాలో అడుగుపెడుతున్నారు. అయితే, ఇప్పటికి కూడా ఆ ఏడు ముస్లిం దేశాల్లో ఏ దేశంపై కూడా ట్రంప్ పూర్తిగా వెనక్కి తగ్గకపోగా ఆ వ్యవహారం కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలోనే తమ దేశంపై ట్రావెల్ బ్యాన్ తొలగించాలని అబాదీ కోరారు. వాస్తవానికి ఇరాక్‌కు ఆర్ధికంగా, రాజకీయంగా, సైనిక రక్షణపరంగా ప్రపంచంలోనే అత్యధిక సహాయం అందుతుంది ఒక్క అమెరికా నుంచే. ఈ విషయాలు కూడా ట్రంప్‌కు అబాదీ గుర్తు చేసినట్లు తెలిసింది. సంబంధిత వార్తలకై ఇక్కడ చదవండి (ఆ ఎత్తివేతపై ట్రంప్ అప్పీల్!) (‘నిషేధం’పై వెనక్కి!) (డోనాల్డ్ ట్రంప్ వీసా ఆంక్షలు ఎత్తివేత!) (ట్రంప్‌కు మరో గట్టి ఎదురు దెబ్బ!) -
కూరగాయల మార్కెట్ వద్ద భారీ పేలుడు
-
కూరగాయల మార్కెట్ వద్ద భారీ పేలుడు
- 11 మంది దుర్మరణం, 35 మందికి తీవ్రగాయాలు - బాగ్దాద్‌లో మళ్లీ పేట్రేగిన ఉగ్రవాదులు బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ శివారు సదర్ పట్టణంలో మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. అక్కడి ప్రధాన కూరగాయ మార్కెట్‌పై ఆదివారం ఉదయం ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో కనీసం 11 మంది దుర్మరణం చెందారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. భద్రతాదళం అధికారి చెప్పిన వివరాల ప్రకారం.. సదర్ నగరంలోని జమీలా మార్కెట్ ప్రధాన గేటు వద్ద ఈ సంఘటన జరిగింది. పేలుడు పదార్థాలు నింపిన కారును నడుపుకుంటూ ఉగ్రవాది.. మార్కెట్‌లోపలికి చొరబడేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన సెక్యూరిటీ గార్డు వెంటనే అప్రమత్తమై, కారు ఆపాల్సిందిగా హెచ్చరించాడు. ఎంతకీ వినకపోవడంతో కారుకు గురిపెట్టి కాల్పులు జరిపాడు. అంతలోనే కారులో ఉన్న ఉగ్రవాది తననుతాను పేల్చేసుకున్నాడు. భారీ శబ్ధం, దుమ్ము ఎగిసిపడటంతో కొద్ది నిమిషాలపాటు అక్కడ అల్లకల్లోల పరిస్థితి తలెత్తింది. పేలుడు ధాటికి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. షియాలు అధికంగా నివసించే సదర్ ప్రాంతంలో కొత్త సంవత్సరంలో చోటుచేసుకున్న రెండో దాడి ఇది. జనవరి 2న ఇదే పట్టణంలో ఐసిస్ జరిపిన పేలుళ్లలో 35 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నేటి ఘటనకు బాధ్యతవహిస్తున్నట్లు ఎవ్వరూ ప్రకటించనప్పటికీ, ఇది ముమ్మాటికి సున్నీ తీవ్రవాదుల పనే అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. -
కూలిన మిలిటరీ హెలికాప్టర్
బాగ్దాద్: ఇరాక్‌లో మిలిటరీ హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో బుధవారం ఇద్దరు మృతి చెందారు. హెలికాప్టర్లో తలెత్తిన సాంకేతిక లోపంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. బాగ్దాద్‌కు ఉత్తర దిశగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైజీ పట్టణం సమీపంలో హెలికాప్టర్ కూలినట్లు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మొసూల్ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఏరివేయడానికి ఇరాకీ భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. -
ఇరాక్‌ను సద్దాంకే వదిలేయాల్సింది
ఆయన వల్లే ఇరాక్ ఐక్యత సాధ్యపడింది సీఐఏ అధికారి తాజా పుస్తకంలో సంచలన విషయాలు 2003లో ఇరాక్‌పై అమెరికా దండెత్తి ఉండాల్సింది కాదని ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా, కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తీరిగ్గా విచారిస్తున్నారు. ఇరాక్‌లో అమెరికా చేసిన యుద్ధం, ఆ తర్వాత నెలకొన్న గందరగోళ పరిస్థితులే మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి కారణం. ఇది జాతుల సంఘర్షణకు దారితీసి ఇరాక్, సిరియాలను వెంటాడుతున్నదనే భావనతోనే అక్కడి విషయాల్లో తదుపరి జోక్యానికి ఒబామా సర్కారు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఇరాక్ పాలకుడు సద్దాం హుస్సేన్‌ను విచారించిన అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ మాజీ అధికారి జాన్ నిక్సన్ ఈ నెలలో తీసుకొస్తున్న పుస్తకం ప్రాధాన్యం సంతరించుకుంది. యుద్ధం వల్ల పదవీభ్రష్టుడైన సద్దాం హుస్సేన్ 2013 డిసెంబర్లో సంకీర్ణ సేనలకు చిక్కారు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన సంవాదం, విచారణ విషయాలను తాజా పుస్తకంలో నిక్సన్ వివరించారు. ఇరాక్‌ను ఆక్రమించడం అప్పటి వాషింగ్టన్ నియోకన్జర్వేటివ్లు అనుకున్నంత సులభం కాదని సద్దాం అప్పుడే హెచ్చరించారని ఆయన తన పుస్తకంలో తెలిపారు. ఈ పుస్తకంలోని పలు వివరాలను టైమ్ మ్యాగజీన్ వెల్లడించింది. 'సద్దాంను నేను విచారించినప్పుడు.. 'మీరు విఫలం కాబోతున్నారు. ఇరాక్‌ను పాలించడం అంత సులభం కాదని మీరు తెలుసుకుంటారు' అని ఆయన అన్నారు. ఎందుకు అలా అనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? అని నేను అడుగగా.. 'మీరు ఇరాక్‌లో ఎందుకు విఫలమవుతారంటే.. మీకు స్థానిక భాష, చరిత్ర తెలియదు. మీరు అరబ్ మనోగతాన్ని అర్థం చేసుకోలేరు' అని సద్దాం అన్నారు' అని నిక్సన్ వివరించారు. నిజానికి సద్దం చెప్పింది నిజమేనని, బహుళ జాతుల సమ్మేళనమైన ఇరాక్ మనుగడకు, సున్నీ ఉగ్రవాదం, షియాల ఆధిపత్యముండే బద్ధవిరోధి ఇరాన్‌ను ఎదుర్కోవడానికి ఆయనలాంటి నిరంకుశ శక్తిమంతుడు అవసరమని ఇప్పుడు అనిపిస్తోందని నిక్సన్ అభిప్రాయపడ్డారు. 'సద్దాం నాయకత్వ శైలి, క్రూరత్వం అతని పాలనలోని లోపాలుగా చెప్పవచ్చు. కానీ తన పరిపాలన పునాధికి ఎలాంటి ముప్పు వాటిల్లినా సద్దాం చాలా నిరంకుశంగా వ్యవహరించాడు. ప్రజాఉద్యమంతో, ప్రజాఅసంతృప్తితో తన ప్రభుత్వం కూలిపోతుందన్న భయమేలేని స్థితిలో ఆయన ప్రభుత్వాన్ని నడిపాడు' అని నిక్సన్ పేర్కొన్నాడు. సద్దాం హయాంలో క్రూరమైన ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ విజయం సాధించే ప్రసక్తే లేదని, ప్రస్తుత షియా ప్రభుత్వ బలహీనత వల్లే ఇస్లామిక్ స్టేట్ ఇంత స్థాయికి రాగిలిందని అభిప్రాయపడ్డారు. సద్దాంలో ఎన్ని ప్రతికూలతలు ఉన్నా.. తాను ఉన్నంతకాలం ఇరాక్‌ను ఒక దేశంగా ఐక్యంగా కొనసాగించినందుకు ఆయనపై తనకు అపారమైన గౌరవం కలిగిందని నిక్సన్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ విషయంలో ఎంత వాదన జరిగినా.. చివరకు తాను పేర్కొన్న విషయాన్ని అంగీకరించక తప్పదని, నిజానికి ఇరాక్‌ను నడిపించే బాధ్యతను సద్దాంకు వదిలేసి ఉంటే బాగుండేదని నిక్సన్ పేర్కొన్నారు. -
ఇరాక్‌లో ఐసిస్ నరమేధం
ఆత్మాహుతి దాడిలో : 70 మంది మృతి హిల్లా: ఇరాక్‌లోని దక్షిణ బాగ్దాద్‌లో ఐసిస్ గురువారం జరిపిన ఆత్మాహుతి బాంబు దాడిలో 70 మంది చనిపోయారు. మృతుల్లో అత్యధికులు షియాలే ఉన్నట్లు తెలిసింది. పెట్రోల్ బంకులో నిలిపి ఉంచిన యాత్రికుల బస్సుల మధ్యలో బాంబులతో నిండిన ట్రక్కును పేల్చారు. రాజధాని బాగ్దాద్‌కు 120 కి.మీ. ల దూరంలోని షోమలి అనే గ్రామంలో ఈ దాడి జరిగింది. బస్సుల మధ్యలో పెద్ద ట్రక్కు పేలిందని, ఇది ఆత్మాహుతి దాడి అని స్థానిక భద్రతా చీఫ్ ఫలా అల్ రాధీ చెప్పారు. చనిపోయిన 70 మందిలో పది కన్నా తక్కువే ఇరాక్ ప్రజలున్నారని, మిగతా వారంతా ఇరాన్ వాసులని తెలిపారు. గాయపడిన 20 మందిని సమీప ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు. దాడి జరిగిన ప్రాంతంలో చెల్లాచెదురుగా పడిఉన్న అవశేషాలు సామాజిక మాధ్యమాల్లో విసృ్తతంగా వ్యాపించాయి. పేలుడుకు వాడిన ట్రక్కులో 500 లీటర్ల అమోనియం నైట్రేట్‌ను నింపినట్లు బాగ్దాద్‌లోని జాయింట్ ఆపరేషన్ కమాండ్ పేర్కొంది. -
ఇరాక్‌లో తెలంగాణ వాసి కిడ్నాప్
కోరుట్ల(సిరిసిల్ల రాజన్న): బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లిన సిరిసిల్ల జిల్లా వాసి గుర్తు తెలియని దుండగుల చేతిలో కిడ్నాప్‌కు గురయ్యాడు. వివరాలివీ.. ఇబ్రహీంపట్నం మండలం కొజాన్‌కొత్తూర్ గ్రామానికి చెందిన బి.రవి ఉపాధి కోసం కొంతకాలం క్రితం ఇరాక్ దేశానికి వెళ్లాడు. అతడుండే ప్రాంతంలో అంతర్యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు గుర్తు తెలియని దుండగులు రెండు రోజుల క్రితం రవిని ఎత్తుకుపోయారు. ఈ విషయాన్ని తోటి వారు కుటుంబసభ్యులకు ఫోన్లో తెలిపారు. ప్రస్తుతం రవి పొరుగునే ఉన్న టర్కీ దేశంలో ఉన్నట్లు చెబుతున్నారని వారు పేర్కొన్నారు. అతడి క్షేమ సమాచారాలు పూర్తిగా తెలియకపోవటంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.