► కేటీఆర్ చొరవతో ఇండియాకు
సాక్షి, న్యూఢిల్లీ: జీవనోపాధి కోసం ఇరాక్ వెళ్లి ఏజెంట్ల మోసాలతో అక్కడ చిక్కుకున్న 31 మంది తెలంగాణ, ఏపీకి చెందిన భవన నిర్మాణ కార్మికులు సోమవారం స్వదేశానికి చేరుకోనున్నారు. అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, గోదావరి జాల్లాలకు చెందిన 31 మంది భవన నిర్మాణ కార్మికులు విజిట్ వీసాలపై ఇరాక్ వెళ్లారు. వీసాలను పర్మినెంట్ చేస్తామని చెప్పి ఏజెంట్లు మోసం చేయడంతో కార్మికులకు పని దొరక్క, తిండి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దీంతో బాధితులు తమ సమస్యలను తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం ప్రతినిధి బసంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కె. తారకరామారావు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మస్వరాజ్‌తో చర్చించారు. దీంతో ఆమె వెంటనే ఇరాక్‌లోని భారత రాయబారిని సంప్రదించి కార్మికులను స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేశారు. సోమవారం వీరందరూ దుబాయ్ మీదుగా ఢిల్లీ చేరుకోనున్నారు.