బాగ్దాద్: ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వివాహ వేడుకలో పెను విషాదం చోటు చేసుకుంది. ఓ ఫంక్షన్ హాల్‌లో మంటలు చెలరేగి వంద మందికి పైగా మృతి చెందారు. వందాలది మంది గాయపడగా.. మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది.
ఉత్తర ఇరాక్ నెనెవెహ్ ప్రావిన్స్ అల్‌హమ్‌దానియా జిల్లాలో మంగళవారం రాత్రి ఓ పెళ్లి ఫంక్షన్ హాల్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వంద మందికిపైగా సజీవ దహనం అయ్యారు.మృతుల్లో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా ఉన్నారు. ప్రమాదంలో 500 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బాణాసంచా కాల్చే క్రమంలోనే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది.
110 dead including the bride and groom in the fire incident at a wedding hall in Hamdaniyah,Iraq
— North X (@__NorthX) September 26, 2023
550 injured
Video is from AVA Media#Iraq #Hamdaniyah pic.twitter.com/I4dSQbQi1s
Nineveh Governor: Preliminary investigations indicate that the Hamdaniyah fire was caused by fireworks inside the wedding hall.#Iraq pic.twitter.com/1IuH0vqpif
— Alahad TV-EN (@ahad_en) September 27, 2023
Comments
Please login to add a commentAdd a comment