
లండన్: భారీ అగ్నిప్రమాదంతో పవర్ కట్ చోటు చేసుకోగా హీథ్రో ఎయిర్‌పోర్టు మూతపడింది. రెండు రోజులపాటు విమానాశ్రయంలో రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు.. ప్రయాణికులెవరూ ఎయిర్‌పోర్ట్ వైపు రాకూడదని విజ్ఞప్తి జారీ చేశారు. ఎయిర్‌పోర్టుకు విద్యుత్ సరఫరా చేసే ఓ ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం చెలరేగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
లండన్ బరో ఆఫ్ హిల్లింగ్డన్‌లోని హయేస్‌లో ఉన్న ఓ సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో హీథ్రో ఎయిర్‌పోర్టుతో పాటు సుమారు 16 వేల నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విదుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో కార్యకలాపాలు నిలిచిపోగా.. అధికారులు ఎయిర్‌పోర్టు మూసేశారు. పలు విమానాలు దారి మళ్లగా.. తిరిగి సేవలను పునరుద్ధరించే అంశంపై నిర్వాహకులు స్పష్టమైన ప్రకటన మాత్రం చేయలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవర్ కట్‌కు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకపోవడంపై జోకులు పేలుస్తున్నారు.
మరోవైపు అగ్నిప్రమాదం కారణంగా చెలరేగిన పొగ, ధూళితో బరో ఆఫ్ హిల్లింగ్డన్ ప్రాంతమంతా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న 10 ఫైర్ ఇంజన్లను, 200 సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. 150 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు.. దట్టమైన పొగ అలుముకోవడంతో ఎవరూ బయటకు రావొద్దని.. తలుపులు, కిటికీలు మూసే ఉంచాలని అధికారులు స్థానికులకు సూచించారు.
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో హీథ్రో ఎయిర్‌పోర్టు ఒకటి. ప్రతీ ఏడాది ఇక్కడి నుంచి ప్రయాణించేవాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. OAG అనే సంస్థ గణాంకాల ప్రకారం.. కిందటి ఏడాది రద్దీ ఎయిర్‌పోర్టుల జాబితాలో ఇది నాలుగో స్థానంలో నిలిచింది. అయితే తాజా అగ్ని ప్రమాదంతో సోషల్ మీడియాలో ఈ ఎయిర్‌పోర్టుపై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
Due to a fire at an electrical substation supplying the airport, Heathrow is experiencing a significant power outage.
To maintain the safety of our passengers and colleagues, Heathrow will be closed until 23h59 on 21 March.
Passengers are advised not to travel to the airport… pic.twitter.com/7SWNJP8ojd— Heathrow Airport (@HeathrowAirport) March 21, 2025
Comments
Please login to add a commentAdd a comment