power cut
-
కరెంటోళ్లం.. మాకే ఫైన్ వేస్తారా..?
మెదక్ మున్సిపాలిటీ: ‘మేం కరెంటోళ్లం.. మాకే ఫైన్ వేస్తారా?’అంటూ విద్యుత్‌శాఖ ఉద్యోగులు ట్రాఫిక్ సిగ్నళ్లకు విద్యుత్ నిలిపివేసిన ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ నెల 14న ట్రిపుల్ రైడ్‌గా వెళ్తున్న ఓ బైక్‌కు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. దీంతో ‘మేం కరెంటోళ్లం. డ్యూటీపై వెళ్తున్నాం. మాకే ఫైన్ వేస్తారా? మేమేంటో చూపిస్తాం’అని బెదిరించి వెళ్లిపోయారు. తర్వాత పట్టణంలోని రెండు ప్రధాన కూడళ్లలో ఉన్న ట్రాఫిక్ సిగ్నళ్లకు విద్యుత్ సరఫరాను నిలిపేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ చలాన్లను సరిచేస్తామని చెప్పినప్పటికీ విద్యుత్ లైన్ తొలగించారని సీఐ నాగరాజు తెలిపారు. అనంతరం ట్రాన్స్‌కో అధికారులతో చర్చించడంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. ఇదే విషయమై ఏఈ నవీన్‌ను వివరణ కోరగా.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద విద్యుత్ మీటర్లు లేవని, వాటిని బిగించుకోవాలని సూచిస్తూ సరఫరాను నిలిపివేసి.. తర్వాత పునరుద్ధరించినట్లు చెప్పారు. -
విద్యుత్ సరఫరా లేక పరీక్ష వాయిదా
వేంపల్లె: వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇంటర్మిడియట్ ఫస్టియర్ సెమిస్టర్ పరీక్ష వాయిదా పడింది. ఆర్కే వ్యాలీ డైరెక్టర్ తెలిపిన వివరాల మేరకు.. ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో గురువారం రాత్రి 2 గంటల నుంచి ఉదయం 8 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఆన్లైన్ విధానం ఉండడంతో.. ఇడుపులపాయలోని విద్యుత్ సరఫరా సమస్య వల్ల అన్ని ట్రిపుల్ ఐటీల్లోనూ ఉదయం నిర్వహించాల్సిన సెమిస్టర్ పరీక్షను మధ్యాహా్ననికి వాయిదా వేశారు. చివరకు విద్యుత్ సిబ్బంది గురువారం ఉదయం ఎనిమిది గంటల తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. వర్షం వల్ల డిస్క్‌లు కాలిపోవడం, బ్రేకర్‌లో బల్లులు పడడంతో ఈ సమస్య తలెత్తిందని విద్యుత్ అధికారులు చెప్పారు. దీంతో ఎన్నిసార్లు ప్రయత్నించినా లైను ట్రిప్ అయ్యిందన్నారు. వెంటనే డిస్‌్కలు మార్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు. మళ్లీ ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని విద్యుత్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.వెంకట నాగేంద్ర చెప్పారు. -
విద్యుత్ సరఫరా నిలిపేస్తాం!.. బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన అదానీ పవర్
అదానీ పవర్‌కు చెందిన.. అదానీ పవర్ జార్ఖండ్ లిమిటెడ్ (APJL) నవంబర్ 7 నాటికి దాదాపు 850 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 7,200 కోట్లు) బకాయిలు చెల్లించకపోతే బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరించింది.ఇప్పటికే బకాయిలు సరిగ్గా చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరాను సగానికి తగ్గించేసింది. కాగా ఇప్పుడు రూ. 7200 కోట్లు చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేయనుంది. పవర్ గ్రిడ్ బంగ్లాదేశ్ పీఎల్సీ ప్రకారం.. అదానీ ప్లాంట్ గురువారం రాత్రి దాని ఉత్పత్తిని గణనీయంగా తగ్గించింది. దీంతో దేశంలో సుమారు 1600 మెగావాట్స్ కంటే ఎక్కువ కొరత ఏర్పడింది.1496 మెగావాట్ల సామర్థ్యం ఉన్న అదానీ పవర్ ప్లాంట్.. ఒక ఆపరేషనల్ యూనిట్ నుంచి కేవలం 700 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేసింది. బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డ్ (PDB)కి ముందస్తు లేఖలో.. అదానీ పవర్ అక్టోబర్ 30 లోపు బకాయిలను క్లియరెన్స్ చేయాలని ఇప్పటికే కోరింది. లేఖలోని.. చెల్లింపులు చేయడంలో విఫలమైతే విద్యుత్ సరఫరాను నిలిపివేయవలసి ఉంటుందని పేర్కొంది.ఇదీ చదవండి: ధరల తగ్గుదలపై వరల్డ్ బ్యాంక్ క్లారిటీబంగ్లాదేశ్లో మాజీ ప్రధాని షేక్ హసీనాను తొలగించిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటయింది. ఆ తరువాత అదానీ బకాయిల పరిష్కారం కోసం తన డిమాండ్లను తీవ్రతరం చేసింది. నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ.. ఈ సమస్యకు సంబంధించి ప్రధాన సలహాదారు యూనస్‌తో నేరుగా సంభాషించారు. -
వానల్లోనూ కోతలు
రాష్ట్రంలో అస్తవ్యస్థ విద్యుత్ సరఫరాకు ఇది ఓ ఉదాహరణ మాత్రమే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యుత్ రంగంలో ఉన్న కాంట్రాక్టులేమిటి? కమీషన్లు వచ్చే పనులేమిటి? అని ఆరా తీయడం, పది మంది డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో బలవంతంగా రాజీనామాలు చేయించడం మినహా నాణ్యమైన విద్యుత్తు సరఫరాపై దృష్టి పెట్టలేదు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో రైతులకు 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ అందించాలనే కనీస స్పృహ లేకుండా వ్యవహరిస్తోంది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా వానాకాలంలో సైతం విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఓవైపు ఉక్కపోత, దోమల దాడితో జనం అల్లాడుతుంటే మరోవైపు విద్యుత్ కోతలు వేధిస్తున్నాయి. కళ్లుగప్పేందుకు విడతల వారీగా.. తమ అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకు సబ్స్టేషన్లకు వార్షిక మరమ్మతులు, విద్యుత్ లైన్ల తనిఖీలు చేపడుతున్నామంటూ ప్రభుత్వ పెద్దలు అధికారులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు. ఒకేసారి విద్యుత్ సరఫరా నిలిపివేస్తే తమ నిర్వాకాలు తెలిసిపోతాయనే భయంతో రోజూ 15 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఇదేమిటని అడిగితే ‘‘మెయింట్‌నెన్స్ వర్క్స్’’ అంటున్నారని ప్రజలు వాపోతున్నారు. రైతులు, సామాన్యులతో పాటు పరిశ్రమలకు సైతం విద్యుత్ కోతలు తప్పడం లేదు. సాధారణంగా వేసవిలో విధించే విద్యుత్ కోతలు ఇప్పుడే దాపురించాయి. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉండూరులో గత రెండు నెలలుగా రోజుకు ఆరు నుంచి ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతున్నట్లు గ్రామస్తులు గగ్గోలు పెడుతున్నారంటే పరిస్ధితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వినియోగం తక్కువే.. రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధికి విద్యుత్ వినియోగం పెరగటాన్ని ఓ సూచికగా భావిస్తారు. దానికి తగ్గట్టుగానే వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదైంది. ప్రస్తుతం రోజుకి 227.755 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం జరుగుతోంది. వీటీపీఎస్‌లో దెబ్బతిన్న రోటర్.. ఏపీ జెన్కో థర్మల్ కేంద్రాల నుంచి కేవలం 76.143 మిలియన్ యూనిట్లు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగినంత లేకపోవడం ఉత్పత్తి పడిపోవడానికి ఓ కారణమైతే సాంకేతిక సమస్యలు మరో కారణం. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)లో నాలుగు రోజుల క్రితం 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్లో జనరేటర్ రోటర్ పాడయ్యింది. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఇది కూడా ఓ కారణం. విద్యుత్ కోతలు ఇలా..» అనకాపల్లి జిల్లా యలమంచిలి టౌన్, రూరల్ పరిధిలో ఫీడర్ల ఓవర్ లోడ్ వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. అచ్యుతాపురం సెజ్ పారిశ్రామిక ప్రాంతం, రాంబిల్లి మండలంలో రోజూ గంట చొప్పున విద్యుత్‌ను నిలిపివేస్తున్నారు. అచ్యుతాపురం మండల పరిధిలో నడింపల్లి, దొప్పెర్ల, ఇరువాడ, రావిపాలెం పరిసరాల్లో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గొలుగొండ మండలం పరిధిలోని చోద్యం, విప్పలపాలెం, అమ్మపేట, మల్లంపేట, జోగుంపేట, గొలుగొండ, కంఠారం, బాలారం, కేడీపేట గ్రామాల్లో విడతల వారీగా రోజుకి 2 గంటల పాటు కోతలు విధిస్తున్నారు. » నెల్లూరు జిల్లాలో లైన్లకు మరమ్మతులు పేరుతో కోతలు విధిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. » జగ్గంపేట నియోజకకవర్గం గోకవరం మండలంలో కొత్తపల్లి, కామరాజుపేట తదితర గ్రామాల్లో నెల రోజులుగా అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. » వైఎస్సార్ కడప జిల్లాలో వ్యవసాయానికి 7 గంటలు మాత్రమే కరెంటు అందుతోంది. » ప్రకాశం జిల్లా చీమకుర్తి పరిసరాల్లో గ్రానైట్ పరిశ్రమలకు రోజులో రెండు గంటలపాటు అనధికారిక విద్యుత్ కోతలు అమల్లో ఉన్నాయి. ఉత్పత్తి తగ్గడంతో బయట కొంటున్నాం..‘‘ఒడిశా నుంచి కొత్త రోటర్ వీటీపీఎస్‌కు రావడానికి మరో నాలుగు రోజులు పట్టవచ్చు. ఉత్పత్తి తగ్గడంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొంటున్నాం. రాష్ట్రంలో అధికారిక విద్యుత్ కోతలు లేవు. సబ్æ స్టేషన్లో మరమ్మతులు, సాంకేతిక ఇబ్బందులు తలెత్తినప్పుడు ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంటుంది’’ –కె.విజయానంద్, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. ‘‘ఈ చిత్రంలో కనిపిస్తున్న పంచాది శ్రీను విజయనగరం జిల్లా నెల్లిమర్ల సమీపంలోని వల్లూరులో మూడెకరాల కౌలు పొలంలో వరి పండిస్తున్నాడు. మెట్ట ప్రాంతం కావడంతో అక్కడ కాలువలు లేవు. చెరువు ఉన్నా ఆ నీళ్లు అన్ని పొలాలకూ సరిపోవు. వ్యవసాయ విద్యుత్ బోర్లపైనే ఆధారపడి ఇక్కడి రైతులు సాగు చేస్తుంటారు. కొద్ది రోజులుగా రోజూ కోతలు విధిస్తున్నారు. సోమవారం ఏకంగా మూడు గంటల పాటు వ్యవసాయ విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. ఇలాగైతే పంట ఎండిపోయి అప్పుల పాలు కావడం ఖాయమని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు’’ – సాక్షి, అమరావతి/నెట్వర్క్ -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పవర్ కట్స్
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ పక్క తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడి జలమండలి ఆఫీసులపై దాడులు జరుగుతున్నాయి. మరోపక్క అక్కడి ఎయిర్‌పోర్టుకు కరెంటు కోతలు తప్పడం లేదు. సోమవారం(జూన్17) ఎయిర్‌పోర్టు టర్మినల్ మూడులో కరెంటు కష్టాలు ఎదురయ్యాయి. కరెంటు కోతల వల్ల ప్రయాణికులు చెకింగ్,బోర్డింగ్ సమయంలో ప్రయాణికులు కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కరెంటు సమస్యను పరిష్కరించామని, కేవలం 10 నిమిషాలే కరెంటు పోయిందని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(డయల్) ఒక ప్రకటనలో తెలిపింది. -
ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం.. పలు ప్రాంతాల్లో అంధకారం
దేశరాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలను దాటి బెంబేలెత్తిస్తున్నాయి. దీనికితోడు ఒక వైపు నీటి ఎద్దడి, మరోవైపు కొత్తగా తలెత్తిన విద్యుత్ సంక్షోభం ఢిల్లీవాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.ఢిల్లీలోని మండోలా, లోని ప్రాంతాల్లోని పవర్ గ్రిడ్ స్టేషన్లలో అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా మంటలు చెలరేగాయి. ఫలితంగా ఉత్తర ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం 2:11 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.ఢిల్లీలోని వజీరాబాద్, కాశ్మీరీ గేట్, గీతా కాలనీ, హర్ష్ విహార్, ప్రీత్ విహార్, ఐపీ పవర్, రాజ్‌ఘాట్, నరేలా, గోపాల్పూర్ ప్రాంతాల్లోని సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ అంతరాయాల కారణంగా పలు నీటి శుద్ధి ప్లాంట్లు పనిచేయడం లేదు. ఇది తాగునీటి సమస్యకు తీవ్రతరం చేసింది. ఈ నేపధ్యంలో సమస్య పరిష్కారం కోసం కేంద్ర ఇంధన శాఖ మంత్రితో ఢిల్లీ మంత్రి అతిషి భేటీ కానున్నారు. ఈ విషయాన్ని అతిషీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఖాతాలో తెలిపారు.నీటి ఎద్దడి సమస్యను కూడా అతిషీ దానిలో ప్రస్తావించారు. గత కొన్ని వారాలుగా ఢిల్లీలో తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయని, దీని కారణంగా నీటి వినియోగం పెరిగిందని, హర్యానా నుంచి రావాల్సిన నీరు అంతకంతకూ తగ్గుతోందని, హర్యానాలోని వజీరాబాద్ బ్యారేజీ, మునక్ కెనాల్ నుంచి నీరు రావడం లేదని ఆమె పేర్కొన్నారు. దీనికితోడు ఢిల్లీలోని డబ్ల్యూటీపీలు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదని కూడా తెలిపారు. -
సీఎం రేవంత్‌రెడ్డి.. దీనికి ఏం సమాధానం చెప్తారు?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కరెంట్ కోతల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమ ర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి కరెంట్ కోతలు లేవుని, 24 గంటలు నాణ్యమైన కరెంట్‌ను తమ ప్రభుత్వం సరాఫరా చేస్తుందని చెప్పారు. అలా చెప్పి 24 గంటలు కూడా కాకముందే ప్రజలు కరెంట్ కోసం రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారని ‘ఎక్స్’ వేదికగా ఫైర్ అయ్యారు.CM Revanth says NO power cuts & 24 Hour uninterrupted, quality power is being supplied Why are these people protesting at Substation ? https://t.co/xlAK3PDFcA— KTR (@KTRBRS) June 3, 2024 హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో రాత్రి కరెంట్ లేక సబ్ స్టేషన్ ముందు ప్రజలు ధర్నాలు చేశారని తెలిపారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో షోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఎక్కడా విద్యుత్ కోతలు లేవు
సాక్షి, అమరావతి: విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినప్పటికీ, ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడటంలేదు. మండు వేసవి వస్తే గత ప్రభుత్వంలో గంటల తరబడి విద్యుత్ కోతలు గుర్తొస్తాయి. టీడీపీ హయాంలో గృహ వినియోగదారులకు పెట్టిన ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్ఆర్)లు, పరిశ్రమలకు విధించిన పవర్ హాలిడేలు ఆందోళనకు గురిచేస్తుంటాయి. కానీ గత ఐదేళ్లలో ప్రజలు వేసవి విద్యుత్ కష్టాలను మర్చిపోయేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేశారు. ముందస్తు ప్రణాళికలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ సంస్థలను తీర్చిదిద్దారు. దీనిద్వారా ప్రజలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా నాణ్యమైన విద్యుత్తు అందుతోంది. ఈ వేసవిలో రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ విద్యుత్ డిమాండ్ భారీగా 236 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అయినప్పటికీ, ఎక్కడా విద్యుత్ కోతలు, అవాంతరాలు లేకుండా సరఫరా జరుగుతోంది. అయితే వేసవిలో సబ్ స్టేషన్లు, లైన్ల మరమ్మతులకు చేపట్టాల్సిన సాధారణ మెయింటెనెన్స్, వ్యవసాయ ఫీడర్లను ఇతర ఫీడర్లతో వేరుచేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, భారీ ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటం, సబ్ స్టేషన్లపై పిడుగులు పడటం, ఉడుతలు, బల్లులు, పక్షులు, పాములు వంటి చిరు ప్రాణులు ఫీడర్లను దెబ్బతీయడం వంటి కారణాల వల్ల పలు ప్రాంతాల్లో స్వల్ప కాలం పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి వస్తోంది.అది కూడా 23 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకే. ఇది మినహా రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) సీఎండీ ఐ.పృధ్వీతేజ్, ఆంధ్రప్రదేశ్ మధ్య, దక్షిణ ప్రాంత డిస్కంల సీఎండీ కె.సంతోషరావు స్పష్టం చేశారు. వారు ‘సాక్షి’కి బుధవారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. » అనంతపురం సర్కిల్ పరిధిలోని 33/11కెవి సబ్‌స్టేషన్‌లో అత్యవసర మరమ్మతుల కారణంగా ఆ మండల పరిధిలోని గ్రామాల్లో 28వ తేదీన విద్యుత్ సరఫరా ఉండదని ఈనెల 27న పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశాం. మరమ్మతులు పూర్తయిన వెంటనే సరఫరాను పునరుద్ధరించాం. » కదిరిలోని 132/33 కెవి సబ్స్ట్షేన్ సమీపంలో పిడుగుపాటు కారణంగా సబ్ స్టేషన్ మరమ్మతుకు గురవడంతో దాని పరిధిలోని తొమ్మిది 33/11 కెవీ సబ్స్టేషన్లకు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వెంటనే మరమ్మతులు పూర్తి చేసి సరఫరాను పునరుద్ధరించాం. » వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను వేరు చేయడం ద్వారా గ్రామాలకు త్రీఫేజ్ విద్యుత్తును సరఫరా చేసే పనులు జరుగుతున్నాయి. అందుకోసం లైన్ క్లియరెన్స్æ తీసుకోవడం కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. » రాజమహేంద్రవరం 33/11 కేవీ తాడితోట సబ్ స్టేషన్‌లోని 11 కేవీ గాంధీపురం ఫీడర్పై ఉదయం 07.20 గంటలకు చెట్ల కొమ్మలు పడటం వల్ల కాసేపు కరెంట్ ఆగింది. డిస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ (డీటీఆర్) స్విచ్‌ను మార్చి, కొమ్మలను తొలగించి 45 నిమిషాల్లోనే సరఫరాను పునరుద్ధరించారు. » శ్రీకాకుళం సర్కిల్ ఇచ్ఛాపురం టౌన్లో ఇన్కమింగ్ వైపు ఉన్న లైవ్ వైర్, క్రాస్ ఆర్మ్‌కి మధ్య బల్లి తాకింది. దీంతో ఏఎస్ పేట కాలనీ వద్ద హై టెన్షన్ (హెచ్‌టీ) ఇన్కమింగ్ సైడ్ జంపర్ కట్ అయ్యింది. దీనివల్ల ఇచ్ఛాపురంలోని కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కేవలం 23 నిమిషాల్లోనే దీనిని సరిచేసి విద్యుత్తు సరఫరా చేశాం. రాష్ట్రంలో ఇంతకు మించి విద్యుత్ సరఫరాలో అవాంతరాలు లేవు. పరిశ్రమలు, గృహ, వాణిజ్య వినియోగదారులకు ఎలాంటి విద్యుత్ కోతలు అమలు చేయడం లేదు. -
అమెరికాలో సుడిగాలుల బీభత్సం
వ్యాలీ వ్యూ (టెక్సాస్): అమెరికాలో టెక్సాస్, ఒక్లహామా, అర్కాన్సాస్ రాష్ట్రాల్లో భీకర సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. ట్రక్కుల పార్కింగ్ స్టేషన్, ఇళ్లను తుడిచిపెట్టేస్తూ సాగిన విధ్వంసకాండలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్లహామాలో టోర్నడోలు భీకర వినాశనానికి కారణమయ్యాయి. భీకర గాలుల ధాటికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వేలాది ఇళ్లలో జనం అంధకారంలో మగ్గిపోయారు. -
మేయర్ ఇంటి వద్ద కరెంటు పోలేదు
హైదరాబాద్: ‘విద్యుత్‌పై సమీక్ష చేసి.. ఒక్క నిమిషం కూడా కరెంటు పోనియ్యం.. అని సచివాలయంలో చెప్పి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లగానే కరెంటు పోయింది.. ప్రొటోకాల్ ప్రకారం సీఎం ఉన్న ఏరియాలో కరెంటు పోవద్దు.. రేవంత్‌రెడ్డి మీకే దిక్కు లేదు.. మీరు ప్రజలకేం గ్యారంటీ ఇస్తారు’ అని బీఆర్ఎస్ నేత వై.సతీ‹Ùరెడ్డి ఆదివారం చేసిన ట్వీట్‌తో విద్యుత్ అధికారులు స్పందించారు. శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఎన్బీటీనగర్లో కేకే, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వచ్చారని, ఆయన ఉన్నంతసేపు ఎలాంటి కరెంటు అంతరాయం కలగలేదని, టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు రీట్వీట్ చేశారు. ఇంటర్నల్ వైరింగ్ లోపంతో టెంపరరీగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లు వెలుగుతూ ఆరిపోయాయని, ఇది కరెంటు వైర్ సమస్య వల్ల తలెత్తిందని, అసలు కరెంటు పోలేదని స్పష్టం చేశారు. మేయర్ ఇంటి ముందు, పరిసర ప్రాంతాల్లో వీధి దీపాలు నిరంతరాయంగా వెలిగాయన్నారు. ఇదిలా ఉండగా కరెంటు పోయినట్లుగా వచి్చన వార్తల పట్ల మేయర్ నివాస సిబ్బంది కూడా స్పందించారు. సీఎం ఉన్నంతసేపు అసలు కరెంటు పోలేదని, ఒక వైర్ కదలిక వల్ల ఫ్లడ్ లైట్లు ఆరుతూ వెలిగాయన్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇంటికి 11 కేవీ ఫీడర్‌తో స్పెషల్‌గా కరెంటు సరఫరా ఉందని బంజారాహిల్స్ ఏడీఈ ఆర్.హైమానంద వెల్లడించారు. శనివారం సీఎం వచి్చన సమయంలో మేయర్ ఇంటితో పాటు ఎన్బీటీనగర్లో కరెంటు అంతరాయం కలగలేదని స్పష్టం చేశారు. మేయర్ ఇంటి వద్ద సీఎం ఉన్న సమయంలో మూడుసార్లు కరెంటు పోయిందంటూ జరుగుతున్న దు్రష్పచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. -
కరెంట్ కోతలు అంటూ..పచ్చ పైత్యం
-
Fact check: ముదిరింది ఎండే కాదు..ఈనాడు పచ్చ పైత్యం కూడా
సాక్షి, అమరావతి: ఎండలు మండుతున్నాయో లేదో ఏసీ గదుల్లో కూర్చునే రామోజీకేం తెలుస్తుంది. ఒకసారి కళ్లు తెరిచి రోడ్డు మీదకు వస్తే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతుంది. వాతావరణ మార్పుల కారణంగా ఫిబ్రవరి నెలలోనే ఎండలు ముదురుతుండటంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. అయినప్పటికీ ప్రజలు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా కోతలు లేని నాణ్యమైన విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు అందిస్తున్నాయి. కానీ ఎండ కన్నెరుగని డ్రామోజీ ‘ఎండలు ముదరక ముందే ఎడా పెడా కోతలు’ శీర్షికన ఈనాడులో అడ్డగోలుగా ఓ అబద్దాన్ని అచ్చేశారు. ఈ అసత్య కథనంపై రాష్ట్ర విద్యుత్ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. రాష్ట్రంలో ఏదైనా సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల సమయంలో వచ్చే స్వల్ప విద్యుత్ అంతరాయాలను వ్యవసాయ విద్యుత్ కోతలుగా చూపిస్తూ తరచూ కథనాలు ప్రచురించడం ఈనాడు దిగజారుడుతనానికి నిదర్శనమని, ఇలాంటి నీతిమాలిన పాత్రికేయం ఆ పత్రిక పతనానికి నాంది అని దుయ్యబట్టాయి. వాస్తవాలేమిటో వివరించాయి. ఈనాడు ఆరోపణ: విద్యుత్ కోతలతో పంటలు ఎండుతున్నాయని ప్రకాశం జిల్లాలో ఓ గ్రామం రైతులు, విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని పార్వతీపురం మన్యం జిల్లాలోని ఓ గ్రామం రైతులు ఆందోళన చేశారు. వాస్తవం: పార్వతీపురం మన్యం జిల్లా యర్రసామంతవలస 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో ఏర్పడ్డ విద్యుత్ అంతరాయం, ప్రకాశం జిల్లా ఉమా మహేశ్వరపురం 33/11 కేవి సబ్ స్టేషన్, అద్దంకి దగ్గర గుండ్లకమ్మ వంతెన సమీపంలో 33 కేవీ కుంకుపాడు లైన్ మరమ్మతుల వల్ల తలెత్తిన అంతరాయాలను వ్యవసాయ విద్యుత్ కోతలుగా ఈనాడు ప్రచురించింది. అది అవాస్తవం. నిజానికి ఈ రెండు చోట్లా ప్రత్యామ్నాయంగా ఏపీ ట్రాన్స్‌కో హై వోల్టేజ్ సబ్ స్టేషన్ లైన్ల ద్వారా విద్యుత్ అందించడం కూడా జరిగింది. వ్యవసాయ వినియోగదారులకు పగటి పూట విద్యుత్ సరఫరాకు అధికారులు గతంలోనే చర్యలు తీసుకున్నారు. అక్కడక్కడా సమస్యలు తలెత్తినా వెంటనే నివారించేందుకు సబ్‌స్టేషన్, లైన్ల సామర్థ్యం పెంపుదల పనులు జరుగుతున్నాయి. ఇంక ఆందోళన చేయాల్సిన అవసరమేముంది? అదంతా కేవలం రామోజీ మార్కు సృష్టి మాత్రమే. ఈనాడు ఆరోపణ: రైతులకు పగటిపూట అంతరాయం లేకుండా 9 గంటలు విద్యుత్ ఇస్తామని చెప్పిన సర్కారు.. వేసవి ఆరంభంలోనే చేతులెత్తేసింది. ముందస్తు ప్రణాళికల్లో విఫలమైంది. వాస్తవం: రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం విద్యుత్ వినియోగం పెరుగుతోంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా నాణ్యమైన నిరంతరాయ విద్యుత్‌ను విద్యుత్ సంస్థలు అందిస్తున్నాయి. ఇందుకోసం బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని అందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికను రూపొందిస్తున్నాయి. రైతులకు పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్తును ఎటువంటి ఆటంకాలు లేకుండా సరఫరా చేస్తున్నాయి. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం ఈ ఎడాది రబీ సీజను నుండి సోలార్ విద్యుత్‌ను వ్యవసాయానికి ప్రత్యేకంగా సరఫరా చేయనున్నాయి. గడిచిన పది రోజుల్లో ప్రజలకు.. ముఖ్యంగా రైతులకు ఏమాత్రం కొరత లేకుండా విద్యుత్ అందిస్తున్నాయి. -
కరెంట్ కట్ చేస్తే.. సస్పెన్షన్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా విద్యుత్ కోతలు విధించే అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయన్న ప్రచారం నేపథ్యంలో సీఎం గురువారం సచివాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం ఎలాంటి విద్యుత్ కోతలు విధించాలని ఆదేశించలేదని.. అనవసరంగా కోతలు పెట్టి రైతులను, ప్రజలను ఇబ్బందిపెడితే క్షమించేది లేదని హెచ్చ రించారు. అవసరానికి సరిపడా విద్యుత్ ఉందని, గతంతో పోలిస్తే సరఫరా పెరిగిందన్నారు. అయినా కూడా కోతలు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులదేనని సీఎం పేర్కొన్నారు. ఇటీవల పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపేసిన ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ సిబ్బంది అత్యుత్సాహంతో.. ఇటీవల రాష్ట్రంలో మూడు సబ్స్టేషన్ల పరిధిలో కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని.. మిగతాచోట్ల ఎలాంటి ఇబ్బందీ లేదని ట్రాన్స్‌కో సీఎండీ రిజ్వీ ఈ సమీక్షలో వివరించారు. ఆయాచోట్ల సరఫరా లోపానికి కారణాలేమిటని సీఎం ప్రశ్నించగా.. సబ్స్టేషన్లలో లోడ్ హెచ్చుతగ్గులను డీఈలు సరిచూడాలని, అలా చేయకపోవడంతో సమస్య తలెత్తిందని సీఎండీ వివరించారు. దీంతో ఇలా నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మరమ్మతులు, సాంకేతిక సమస్యలు, ప్రకృతిపరమైన కారణాలు మినహా విద్యుత్ సరఫరాలో కోతలు ఉండొద్దని స్పష్టం చేశారు. విద్యుత్ కోతలు విధించే పక్షంలో ముందుగా ఆయా సబ్స్టేషన్ల పరిధిలోని వినియోగదారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన క్షేత్రస్థాయి సిబ్బంది అత్యుత్సాహంతో కోతలు విధిస్తున్నట్టు తన దృష్టికి వచి్చందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో సరిపడా విద్యుత్ అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని అధికారులు సీఎంకు వివరించారు. ఈసారి ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 13వ తేదీ వరకు రోజుకు సగటున 264.95 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశామని.. గతేడాది ఇదే వ్యవధిలో 242.44 మిలియన్ యూనిట్ల సరఫరానే ఉందని తెలిపారు. -
Israel-Hamas war: గాజా ఆస్పత్రిని చుట్టుముట్టిన ఐడీఎఫ్
రఫా: ప్రాణాలతో మిగిలి ఉన్న బందీలను హమాస్ మిలిటెంట్లు నాసిర్ ప్రాంగణం అడుగునున్న సొరంగాల్లో దాచినట్లు ఇజ్రాయెల్ రక్షణ బలగాలు (ఐడీఎఫ్)అనుమానిస్తున్నాయి. దీంతో, వారం రోజులుగా ఆస్పత్రిని దిగ్బంధించి అణువణువూ శోధిస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీ దాడితో సంబంధమున్నట్లుగా అనుమానిస్తున్న 20 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఆస్పత్రిలోని 460 మందికి పైగా సిబ్బంది, రోగులను ఎలాంటి సౌకర్యాలు లేని ఆ పక్కనే ఉన్న పాతభవనంలోకి తరలివెళ్లాలని ఆర్మీ ఆదేశించింది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతోపాటు, ఆక్సిజన్ నిల్వలు అడుగంటడంతో ఐసీయూలోని ఆరుగురు రోగుల్లో ఐదుగురు చనిపోయినట్లు గాజా అధికారులు శుక్రవారం తెలిపారు. -
కరెంట్ ‘కట్’ కట!
సాక్షి, హైదరాబాద్: నగరంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం గరిష్టంగా 31.4 డిగ్రీలు నమోదైంది. కేవలం పగలే కాదు రాత్రి ఉష్ణోగ్రతల్లోనూ భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు చలితో వణికిన వారంతా ప్రస్తుతం ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు మళ్లీ ఆన్ చేస్తున్నారు. ఫలితంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఇక అనధికారిక కోతలు అమలవుతుండటంతో సిటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవికి ముందే పరిస్థితి ఇలా ఉంటే...ఏప్రిల్, మే మాసాల్లో పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గత ఏడాది ఫిబ్రవరిలో ఇదే రోజు 2308 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కాగా, తాజా గా సోమవారం 2833 మెగావాట్ల వరకు చేరడం ఆందోళన కలిగిస్తుంది. డిమాండ్‌కు, సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం నమోదవుతుండటం, సబ్ స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాయి. ఫీడర్లు తరచూ ట్రిప్పవుతున్నాయి. సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి. 65 ఎంయూలకు చేరిన డిమాండ్ గ్రేటర్ పరిధిలో తొమ్మిది సర్కిళ్లు ఉండగా, వీటి పరిధిలో 58 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 52 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మరో ఏడు లక్షల వరకు వాణిజ్య, లక్షకుపైగా ఇతర కనెక్షన్లు ఉన్నాయి. ప్ర స్తుతం విద్యుత్ డిమాండ్ 65 మిలియన్ యూనిట్లకు చేరింది. ఈ నెల మొదటి వారంలో రోజు సగటు డిమాండ్ 55 ఎంయూలు ఉండగా, ప్రస్తుతం 65 ఎంయూలకు చేరింది. కేవలం పది రోజుల వ్యవధిలోనే పది ఎంయూలు పెరగడం విశేషం. భగ్గున మండుతున్న ఎండలకు ఉక్కపోత తోడవడంతో గృహ, వాణిజ్య విద్యుత్ మీటర్లు అప్పుడే గిర్రున తిరుగుతున్నాయి. ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో రైతులు పంటల సాగుకు పూర్తిగా వ్యవసాయ మోటార్లపైనే ఆధారపడి ఉన్నారు. గృహ వినియోగంతో పాటు వ్యవసాయ వినియోగం కూడా పెరగడంతో లోడ్బ్యాలెన్స్ను పాటించాల్సి వస్తుంది. పలు ఫీడర్ల పరిధిలో అర్థరాత్రి తర్వాత సరఫరా నిలిచిపోతుంటే..మరికొన్ని ఫీడర్ల పరి ధిలో తెల్లవారుజాము నుంచి ఉదయం ఏడు గంటల వరకు నిలిచిపోతోంది. ఆ సమయంలో చలిగాలులు వీస్తుండటం, ఆ సమయంలో ఉక్కపోత కూడా లేకపోవడం ఊరట కలిగించే అంశమే అయినప్పటికీ..భవిష్యత్తు డిమాండ్ డిస్కం ఇంజనీర్లకు ఆందోళనకు గురి చేస్తుంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ మాత్రం ఈ అనధికారిక కోతల అంశాన్ని కొట్టిపారేస్తుంది. డిమాండ్‌కు తగినంత సరఫరా ఉందని, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పుతోంది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. -
ఎంజీఎంలో విద్యుత్ అంతరాయం.. పేషెంట్ మృతి
హన్మకొండ: వరంగల్ ఎంజీఎం అస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ అంతరాయంతో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్ మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో విద్యుత్ అంతరాయంతో వెంటిలేటర్ పనిచేయక బొజ్జ బిక్షపతి (45) అనే పేషెంట్ మృతి చెందాడు. నర్సంపేట మండలం రాజేశ్వరపల్లి గ్రామానికి చెందిన బిక్షపతి ఆర్ఐసీలో చికిత్స పొందుతున్నాడు. ఆయన శ్వాస సంబంధిత వ్యాధితో ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అయితే నిన్న (శుక్రవారం) విద్యుత్ అంతరాయంతో ఆయనకు అమర్చిన వెంటిలేటర్ కాసేపటి వరకు పనిచేసి ఆగిపోయింది. అదే సమయంలో ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది వెంటనే స్పందించి జనరేటర్ ఆన్ చేశారు. కానీ, దురదృష్టవశాత్తు ఆ జనరేటర్ పని చేయకపోవటంతో ఒక్కసారి వెంటిలేటర్ ఆఫ్ అయి రోగి బిక్షపతి మృతి చెందాడు. చదవండి: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం -
Power Outage: అంధకారంలో శ్రీలంక
కొలంబో: శ్రీలంకలో ఒక్కసారిగా అంధకారం అలుముకుంది. దేశంలో మొత్తం విద్యుత్ వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక సమస్యలతో పవర్ కట్ జరిగినట్లు ఆ దేశ విద్యుత్ సంస్థ సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (CEB) శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే దేశంలో కరెంట్ అంతరాయం కలగటంతో పలు ఆసుపత్రుల్లో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు తెలుస్తోంది. Countrywide Power Outage Reported in Sri Lanka 🇱🇰 A widespread power outage struck Sri Lanka, according to a spokesperson from the #Electricity Supply Council who spoke with local media. 1/3 | #SriLanka | #srilankan | pic.twitter.com/u5xBGO8z7E — Sputnik India (@Sputnik_India) December 9, 2023 దేశంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నామని సీఈబీ సంస్థ ప్రతినిధి నోయెల్ ప్రియాంత తెలిపారు. ఇక మరో వైపు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. #Srilanka countrywide #power outrage is by possible tripping of the main transmission line caused by lightning . NOT possible sabotage as controversial restructuring electricity bill presented parliament yeasterday amidst union protest. pic.twitter.com/SKG4gPVtRe — Vajira Sumedha🐦 🇱🇰 (@vajirasumeda) December 9, 2023 -
Israel-Hamas War: గాల్లో వేలాది ప్రాణాలు!
దెయిర్ అల్‌బలాహ్ (గాజా): గాజాలో మానవీయ సంక్షోభం క్రమంగా తీవ్ర రూపు దాలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ఆస్పత్రుల ముంగిట్లోకి చేరడంతో పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. ఇజ్రాయెల్ అష్టదిగ్బంధం దెబ్బకు కనీస సౌకర్యాలన్నీ నిలిచిపోవడంతో గాజాలో 20 ఆస్పత్రులు ఇప్పటికే పూర్తిగా స్తంభించిపోయాయి. మిగిలిన 15 ఆస్పత్రులూ అదే బాటన ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. కరెంటు సరఫరా లేక ప్రధాన ఆస్పత్రి అల్ షిఫాలో తశనివారం వైద్య పరికరాలన్నీ మూగవోయాయి. దాంతో వైద్య సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. అల్ ఖుద్స్ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి. ఆ ఆస్పత్రికి ఏకంగా 20 మీటర్ల సమీపం దాకా సైన్యం చొచ్చుకొచి్చందని తెలుస్తోంది! దాంతో అందులోని 14 వేల మంది రోగులు, శరణార్థుల ప్రాణాల్లో గాల్లో దీపంగా మారాయి. విరామం లేకుండా దూసుకొస్తున్న తూటాలు, బాంబు వర్షం కారణంగా అల్ షిఫా ఆస్పత్రిలోని వేలాది మంది కూడా ప్రాణ భయంతో వణికిపోతున్నారు. అందులో 1,500 మందికి పైగా రోగులు, అంతే సంఖ్యలో వైద్య సిబ్బంది, 15 వేలకు పైగా శరణార్థులున్నట్టు చెబుతున్నారు. వైద్య సేవలతో పాటు కరెంటు, ఆక్సిజన్ సరఫరాలు పూర్తిగా నిలిచిపోవడంతో పలు ఆస్పత్రుల్లో ఐసీయూల్లోని రోగులు, ఇంక్యుబేటర్లలోని చిన్నారులు నిస్సహాయంగా మృత్యుముఖానికి చేరువవుతున్నారు. ఇలా ఇప్పటికే 200 మందికి పైగా మరణించారని, మరికొన్ని వందల మంది మృత్యువుతో పోరాడుతున్నారని హమాస్ ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది! ఈ పరిణామాలపై అంతర్జాతీయ సమాజం గగ్గోలు పెడుతున్నా ఇజ్రాయెల్ మాత్రం దాడులాపేందుకు ససేమిరా అంటోంది. కనీసం వాటికి విరామమిచ్చేందుకు కూడా ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మరోసారి నిరాకరించారు. షిఫా.. శిథిల చిత్రం అల్ షిఫా ఆస్పత్రిలో తాగునీటితో పాటు ఆహార పదార్థాలు కూడా పూర్తిగా నిండుకున్నాయి. దాంతో వైద్యంతో సహా ఏ సేవలూ అందక రోగులు నిస్సహాయంగా మృత్యువాత పడుతున్నారు. శనివారమే 100 మందికి దుర్మరణం పాలైనట్టు హమాస్ పేర్కొంది. వీటికి తోడు ఐసీయూ విభాగంపై బాంబు దాడి జరిగింది. ఆస్పత్రిని ఇజ్రాయెల్ సైన్యం అన్నివైపుల నుంచీ దిగ్బంధించింది. అక్కడ హమాస్ ఉగ్రవాదులతో భీకరంగా పోరాడుతున్నట్టు ప్రకటించింది. ఆస్పత్రి ప్రాంగణంతో పాటు పరిసరాలన్నీ బాంబు మోతలతో దద్దరిల్లుతున్నాయి. బాంబు దాడుల్లో రెండు అంబులెన్సులు తునాతునకలయ్యాయి. కనీసం రోగులు, క్షతగాత్రులను ఆస్పత్రి నుంచి మరో చోటికి తరలించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అడుగు కదిపినా స్నైపర్ల తూటాలు దూసుకొస్తున్నట్టు ఆస్పత్రి సిబ్బంది వాపోతున్నారు. ఈ ఆస్పత్రి కిందే ఉగ్రవాద సంస్థ హమాస్ ప్రధాన కార్యాలయముందని ఇజ్రాయెల్ మొదటినుంచీ ఆరోపిస్తుండటం తెలిసిందే. అయితే అంతర్జాతీయ ఖండనల నేపథ్యంలో శనివారం సాయంత్రానికల్లా ఇజ్రాయెల్ మాట మార్చింది. అల్ షిఫా ఆస్పత్రిపై దాడులు జరపడం లేదని, అక్కణ్నుంచి వెళ్లిపోవాలనుకున్న వారికోసం కారిడార్ తెరిచే ఉంచామని చెప్పుకొచ్చింది. దాడుల్లో గాయపడుతున్న రెండు రోజులుగా ప్రధానంగా అల్ అహిల్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. కానీ అక్కడ కూడా మౌలిక సదుపాయాలేవీ లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. కారిడార్లతో పాటు ఎక్కడ పడితే అక్కడ రోగులను నిస్సహాయంగా వదిలేసిన దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. పడకేసిన వైద్యం గాజా అంతటా వైద్య సేవలు పూర్తిగా పడకేసినట్టేనని అక్కడ సహాయక చర్యలు చేపడుతున్న ఐరాస సంస్థలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ‘‘గాజాలోని మొత్తం 35 ఆస్పత్రులూ చేతులెత్తేసినట్టే. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది’’ అని అవి చెబుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర గాజాలోని అల్ నస్ర్, అల్ రంటిసి సహా చాలా ఆస్పత్రులు సైనిక దిగ్బంధంలో ఉన్నాయి. దీనికి తోడు గాజావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యధికం ఎప్పుడో మూతబడ్డాయి. -
విద్యుత్ సరఫరాలో విశాఖ దూకుడు
గాలి వీచిందా..? అయితే కరెంట్ గోవిందా.? వర్షం పడుతోందా..? టార్చ్‌లైట్స్, చార్జింగ్ లైట్స్ వెతుక్కోవాల్సిందే. ఇంకేముంది.. గంటల తరబడి కరెంట్ రాదు. ఏంటో ఈ పవర్ సప్లై ..రోజులో గంటల తరబడి కరెంట్ ఉండటం లేదు. ఇదీ ఒకప్పుడు వినియోగదారుల నుంచి తరచూ వినిపించిన మాట.. కాలం మారింది.. కరెంట్ సరఫరాలోనూ మార్పులు వచ్చాయి. సరఫరా అంతరాయమూ మారింది. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ.. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు విశాఖ సర్కిల్ నిరంతరం శ్రమిస్తోంది. అందుకే సగటున పవర్ కట్‌ను రోజులో కేవలం 4 నిమిషాలకు మాత్రమే తగ్గించుకుంటూ ఈపీడీసీఎల్ పరిధిలో ఉన్న సర్కిళ్లలో నంబర్ వన్‌లో కొనసాగుతోంది. విద్యుత్ సరఫరా విషయంలో విశాఖ దూకుడుగా వ్యవహరిస్తోందని సైదీ సైఫీ సూచీలే స్పష్టం చేస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలో 5 సర్కిల్స్ ఉన్నాయి. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, ఏలూరు, విజయనగరం సర్కిల్స్ పరిధిలో నిరంతరం విద్యుత్ సరఫరాలో ఉన్న లోపాలు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నారా లేదా అనే అంశాలను పరిశీలిస్తోంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన వ్యవస్థలే సిస్టమ్ యావరేజ్ ఇంట్రప్షన్ డ్యూరేషన్ ఇండెక్స్ (సైదీ), సిస్టమ్ యావరేజ్ ఇంట్రప్షన్ ఫ్రీక్వెన్సీ ఇండెక్స్ (సైఫీ). రోజూ ఆయా సర్కిల్స్ పరిధిలో ఎంత సేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.? ఎంత సమయానికి పున రుద్ధరించారు.? ఇలాంటి వివరాలను ఎప్పటికప్పు డు గణిస్తూ సరాసరిని చూపిస్తుంటుంది. ఈ విషయంలో విశాఖ సర్కిల్ నంబర్‌వన్‌లో నిలిచింది. ఈ సర్కిల్ పరిధిలో 17,57,727 మంది వినియోగదారులున్నారు. ఇందులో 15,02,204 డొమెస్టిక్ కనెక్షన్లుండగా, 1,70,580 కమర్షియల్, 49,037 అగ్రికల్చర్, 30,632 ఇన్స్టిట్యూషనల్, 5,274 ఇండస్ట్రీస్ కనెక్షన్లున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సైదీ సైఫీ ర్యాంకింగ్‌ను ప్రకటిస్తుంది. నాలుగు నిమిషాలు మాత్రమే.. 2014–19 మధ్య కాలంతో పోల్చితే సర్కిల్ పరిధిలో వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ కాలంలో రోజుకు సగటున 60 నుంచి 85 నిమిషాల వరకూ విద్యుత్ అంతరాయం ఉండేది. అంటే 24 గంటల్లో కనీసం గంటకు పైగా కరెంట్ కోతలు ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవి. పంపిణీ విషయంలో పక్కాగా వ్యవహరిస్తూ ఆధునిక సాంకేతికతను సిబ్బంది అందిపుచ్చుకుంటూ సరఫరా అంతరాయాన్ని తగ్గించారు. గంట ఉండే అంతరాయం క్రమంగా నిమిషాలకు చేరుకుంది. ఇప్పుడు కేవలం 4 నుంచి 10 నిమిషాలు మాత్రమే రోజులో విద్యుత్ అంతరాయం ఉంటుంది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సగటున రోజుకు 9 నిమిషాలు మాత్రమే సరఫరాకు అంతరాయం ఉండగా.. ఈ నెలలో కేవలం 4 నిమిషాలు మాత్రమే సగటు ఇంట్రప్షన్ ఉన్నట్లు సైదీ సైఫీ నివేదికలో స్పష్టమైంది. నంబర్ వన్ ర్యాంకులో... విశాఖ సర్కిల్ గత కొద్ది నెలలుగా విశాఖ సర్కిల్ సైదీ సైఫీ ర్యాంకింగ్‌లో నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అంతరాయాలు లేకుండా అందించడంలో సర్కిల్ అధికారులు, సిబ్బంది సఫలీకృతమవుతున్నారు. తర్వాత ర్యాంకింగ్స్‌లో రాజమండ్రి, శ్రీకాకుళం, ఏలూరు, విజయనగరం ఉన్నాయి. కేవలం సర్కిల్ మాత్రమే కాకుండా.. ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు ఇంట్రప్షన్ తగ్గిస్తూ సరఫరా అందిస్తున్నారు. విశాఖ సర్కిల్లో 4 నిమిషాలు మాత్రమే ఉండగా రాజమహేంద్రవరంలో 8 నిమిషాలు, శ్రీకాకుళం పరిధిలో 10, విజయనగరంలో 13, ఏలూరులో 16 నిమిషాలు మాత్రమే రోజుకు సగటున విద్యుత్ కోతలు జరుగుతున్నట్లు సైదీ సైఫీ ర్యాంకింగ్స్‌లో స్పష్టమైంది. మరింత తగ్గించేందుకు కృషి చేస్తున్నాం ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాం. వినియోగదారులకు ఇచ్చే విద్యుత్‌ను నాణ్యంగా ఎలా అందించాలనే అంశంపై సీఎండీ సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం. దానికనుగుణంగా మార్పులు చేస్తూ అంతరాయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం సగటున 4 నిమిషాలున్న ఇంట్రప్షన్ను క్రమంగా తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. విపత్తుల కారణంగా ఏదైనా అవాంతరాలు ఎదురైనా వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇటీవలే ఆటోమేటెడ్ సబ్‌స్టేషన్‌ను రూపొందించాం. మిగిలిన చోట్లా అదే తరహా టెక్నాలజీ వస్తే ఈ అంతరాయం మరింత తగ్గించగలం. – ఎల్ మహేంద్రనాథ్, ఏపీఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ ఎస్ఈ -
ఏపీలో విద్యుత్ కోతలు లేవు.. అవాస్తవాలు నమ్మొద్దు: విజయానంద్
సాక్షి, విజయవాడ: ఏపీలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని, పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చామని కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలు అవాస్తవమని ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ కే. విజయానంద్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిశ్రమలకు, వ్యవసాయానికి, గృహావసరాలకి ఎక్కడా కోతలు విధించటం లేదని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆగస్ట్ లో 18 శాతం డిమాండ్ పెరిగిందని ఆయన వివరించారు. ఆగస్ట్ నెలలో సరాసరిన రోజుకి 230 మిలియన్ యూనిట్ల డిమాండ్ కాగా, గత ఏడాదిలో 190 మిలియన్ యూనిట్ల మాత్రమే ఉంది. పెరిగిన డిమాండ్‌తో పాటు వర్షాభావ పరిస్ధితులు తోడయ్యాయి. ఆగస్ట్ 30, 31 తేదీల్లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. సెప్టెంబర్ నెల ఈ వారంలో సరాసరిన 210 మిలియన్ యూనిట్ల వరకు డిమాండ్ ఉంది. ఏపీలోనే కాదు దేశ వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ ఉంది. కర్ణాటక, తమిళనాడు, రాజస్ధాన్, మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో కోతలు అమలవుతున్నాయి. పెరిగిన విద్యుత్ డిమాండ్‌కి తగ్గట్లు ఏపీలో విద్యుత్ సరఫరా చేస్తున్నాం.’’ అని విజయానంద్ తెలిపారు. చదవండి: బాబు బంగ్లాకే ముడుపులు.. మళ్లీ ఆ ముగ్గురే ఏపీలో విద్యుత్ కొరత రాకుండా ముందు జాగ్రత్తగా 40 మిలియన్ యూనిట్ల కొనుగోలు చేశాం. యూనిట్‌ని 13 రూపాయిల వరకు కొనుగోలు చేయడానికి కేంద్రం అనుమతి ఉన్నా యూనిట్ 7.50 రూపాయిలకే కొనుగోలు చేశాం. బొగ్గు కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం. ఏపీలో సెప్టెంబర్ నెలకి సరిపడా బొగ్గు నిల్వలు’’ ఉన్నాయని విజయానంద్ వెల్లడించారు. -
‘కోతల’ కథలు మీ బాబు కోసమేగా రామోజీ..
సాక్షి, అమరావతి : ఆగస్టు నెలలో గత వందేళ్లలో కనీవినీ ఎరుగని ప్రతికూల పరిస్థితులు ఉత్పన్నమై కొనాలన్నా విద్యుత్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు చాలా అరుదుగా తలెత్తుతుంటాయని భారత వాతావరణ శాఖ స్వయంగా ప్రకటించింది. అయినా, రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ), విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ప్రణాళికాబద్ధంగా, ముందుచూపుతో వ్యవహరించడం ద్వారా పీక్‌లోడ్ సమయంలో సైతం విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కనీస స్థాయికి తగ్గించగలిగాయి. వాస్తవం ఇది కాగా.. నిరంతరం కోతలు విధించినట్లుగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ‘వైకాపా విద్యుత్ కోతల పథకం’ శీర్షికతో శుక్రవారం ఈనాడు తప్పుడు కథనాన్ని అచ్చేసింది. దేశవ్యాప్తంగా నెలకొన్న విద్యుత్ కొరత పరిస్థితులు, ఇందుకు కారణాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపర్చాల్సిందిపోయి బాధ్యతారాహిత్యంగా.. వరుసగా అసత్య కథనాలను ఈనాడు అడ్డగోలుగా వండి వారుస్తోంది. అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించుకోవడానికే కోతల పథకం ప్రవేశపెట్టిందంటూ ప్రభుత్వంపై బురదజల్లుతోంది. విద్యుత్ పంపిణీ సంస్థలు నెలవారీ సాధారణ ప్రణాళిక ప్రకారం వివిధ విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ కొనుగోలుకు అంచనాలు తయారుచేసుకుంటాయి. విద్యుత్ కేంద్రాలు డిస్పాచ్ ప్రణాళికను సాధారణంగా ఒక నెల ముందుగానే సిద్ధంచేసుకుంటాయి. ఈ అంచనాలతోనే జల, పవన, థర్మల్, సౌర విద్యుత్ కేంద్రాలు విద్యుత్ లభ్యతను పొందుపరుస్తాయి. ఇవేవీ పట్టించుకోకుండా కేవలం చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే రామోజీ దిగజారుతున్నారని ఈనాడు కథనం స్పష్టంచేస్తోంది. దారుణంగా పడిపోయిన జల, పవన విద్యుదుత్పత్తి.. ప్రతికూల వాతావరణంతో జల, పవన విద్యుత్ ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం నుంచి ఈ ఏడాది ఆగస్టులో ఒక్క యూనిట్ విద్యుత్ కూడా ఉత్పత్తి కాకపోవడం ఇందుకు నిదర్శనం. గత ఏడాది ఆగస్టులో జలవిద్యుత్ ఉత్పత్తి 680 మిలియన్ యూనిట్లు కాగా.. ఈ ఏడాది ఇదే నెలలో 208 మిలియన్ యూనిట్లకు ఉత్పత్తి పడిపోయింది. పవన విద్యుదుత్పత్తి ఒక్కోసారి 2,500 మెగావాట్ల నుంచి 150–200 మెగావాట్లకు దారుణంగా తగ్గిపోయింది. మరోవైపు.. మండు వేసవిని మరిపించేలా రాష్ట్రంలో తీవ్రమైన ఎండ, ఉక్కపోత పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనివల్ల గృహావసరాల రంగంతోపాటు అన్ని రంగాల్లో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగిపోయింది. వర్షపాత లేమివల్ల కాలువలు చెరువులు నిండక రైతులు కూడా సాగునీటి కోసం ఈ నెలలో విద్యుత్ పంపుసెట్లపై ఎక్కువగా ఆధారపడ్డారు. ఆగస్టులో కనీస స్థాయికి చేరాల్సిన వ్యవసాయ విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. దానివల్ల గ్రిడ్ మీద తీవ్ర ఒత్తిడి పడింది. ఒక్కసారిగా విద్యుదుత్పత్తి పెరుగుతుందా? ఇలా అనూహ్య వాతావరణ పరిస్థితులతో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగినట్లు ఉత్పత్తి పెంచడం వీలుకాదు. అందువల్ల కొనాలన్నా విద్యుత్ దొరకని పరిస్థితి కొంత అనివార్యమవుతుంది. వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయడానికి విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అన్ని అనుమతులిచ్చింది. అయితే, దేశవ్యాప్తంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితులవల్ల బహిరంగ మార్కెట్లోనూ, విద్యుత్ ఎక్సే్ఛంజీల్లోను స్వల్పకాలిక, అత్యవసర విద్యుత్ సమయాల్లో కొనుగోలుకు తగినంత విద్యుత్ అందుబాటులో లేదు. పైగా దేశవ్యాప్తంగా బొగ్గు కొరత వేధిస్తోంది. బిడ్డింగ్ పరిమాణంలో కేవలం 5–10 శాతం మాత్రమే విద్యుత్ లభిస్తోంది. టైం బ్లాక్‌కు 2 వేల మెగావాట్లకు ఆన్లైన్లో బిడ్ వేస్తుంటే కేవలం 100 నుండి 200 మెగావాట్ల విద్యుత్ మాత్రమే దొరుకుతోంది. ఇది కూడా సీలింగ్ ధర యూనిట్‌కు రూ.10 వద్ద లభిస్తోంది. సెంట్రల్ గ్రిడ్ నుంచి ఓవర్ డ్రా చేయాలన్నా మనకు 250 మెగావాట్లకు మించి చేసేందుకు అనుమతిలేదు. ఒక్కోసారి ఆ గరిష్ట పరిమాణం దాటి కూడా ఓవర్ డ్రా చేస్తున్నాం. ఇందుకోసం అధిక ధర, జరిమానా కూడా చెల్లించాల్సి వస్తోంది. అయినా.. ఒక్కోసారి ఓవర్ డ్రాలు నియమాలకు మించి పెరిగిపోతుంటే గ్రిడ్ భద్రత రీత్యా ఆటోమాటిక్ లోడ్ రిలీఫ్ వ్యవస్థ ఆక్టివేట్ కావడంతో అక్కడక్కడా విద్యుత్ సరఫరాలో స్వల్పంగా అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ ఆటోమాటిక్ వ్యవస్థ ఆక్టివేట్ కాగానే వెంటనే పరిస్థితులు చక్కదిద్ది రాష్ట్రమంతా లోడ్‌ను అందుబాటులో ఉన్న ఉత్పత్తితో సమన్వయం చేసి గ్రిడ్ వైఫల్యం చెందకుండా అత్యవసర చర్యలు తీసుకుంటున్నారు. గ్రిడ్‌లో సర్దుబాటు కోసం అప్పుడప్పుడూ ఇస్తున్న అత్యవసర లోడ్ రిలీఫ్‌లు రోజువారీగా సరఫరా చేస్తున్న మొత్తం విద్యుత్ పరిమాణంలో 2.5 శాతం కూడా లేదు. అక్కడలా.. ఇక్కడిలా ఏంటి రామోజీ!? విద్యుత్ కోతలపై రామోజీ రాతలు కేవలం డ్రామాలని, తాను భుజానికెత్తుకుని మోస్తున్న వారి రాజకీయ ప్రయోజనాల కోసమేనని నిరూపించుకున్నారు. ‘వైకాపా విద్యుత్ కోతల పథకం’ అంటూ శుక్రవారం ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌లో రాస్తే, ఇదే విద్యుత్ కోతలపై రెండ్రోజుల క్రితం అంటే ఆగస్టు 30న ‘వర్షాలు లేక.. కరెంటు కాక’ శీర్షికతో తెలంగాణ ఎడిషన్‌లో కథనాన్ని ప్రచురించింది. జల విద్యుత్ ఉత్పత్తి లేక కోట్లలో నష్టం అని.. ఇంధన ఎక్స్చేంజీల్లో కొందామన్నా కరెంటు దొరకడంలేదని విద్యుత్ కోతలకు కారణాలను తెలంగాణలో రాసుకొచ్చింది. దేశవ్యాప్తంగా భారీగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని ఆ కథనంలో చెప్పిన ఈనాడు.. ఏపీకి వచ్చేసరికి ప్లేటు మార్చింది. వాస్తవాలను దాచిపెట్టి, రాష్ట్ర ప్రభుత్వమే ఈ పరిస్థితులకు కారణమన్నట్లు అసత్య కథనాన్ని ముద్రించింది. దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులే తెలంగాణ, ఏపీలోనూ ఉంటాయనే విషయాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించడం గమనార్హం. దక్షిణ భారతదేశమంతా ఇదే పరిస్థితి.. నిజానికి.. ఆగస్టులో దక్షిణ భారతదేశమంతా విద్యుత్ సరఫరా పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆగస్టులో విద్యుత్ పంపిణీ సంస్థలు దాదాపు రూ.1,000 కోట్లు ఖర్చుచేసి సరాసరి 1,360 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను అత్యవసరంగా స్వల్పకాలిక ఎక్సే్ఛంజీల నుంచి కొరతను అధిగమించడానికి కొనుగోలు చేశాయి. మిగిలిన స్వల్ప పరిమాణం 3–5 మిలియన్ యూనిట్లు కూడా కొనడానికి సిద్ధపడినా మనకు అవసరం వచ్చినపుడు మార్కెట్లో తగినంత విద్యుత్ అందుబాటులో లేకపోవడంవల్ల కొరత ఏర్పడింది. అత్యవసర లోడ్ రిలీఫ్ పరిస్థితి ఈ ఏడాదంతా లేదు. అత్యవసర విద్యుత్ కొనుగోలు కోసం ఎంత ఖర్చయినా వెనుకాడవద్దని, ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. -
ఎనిమిదేళ్ల గర్విత్.. మిస్టర్ కూల్
ఫరీదాబాద్: మనం వెళ్తున్న లిఫ్ట్ హఠాత్తుగా ఆగిపోతే ఏం చేస్తాం? ఒక్కసారిగా కంగారుపడతాం. కేకలు వేస్తాం. ఎప్పుడు బయటపడతామా అని క్షణక్షణం ఎదురుచూస్తాం. లిఫ్ట్ తలుపులు తెరుచుకుని క్షేమంగా బయటకువచ్చేదాకా ఆందోళన తగ్గదు. కానీ, హరియాణాలో లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన ఎనిమిదేళ్ల బాలుడు గర్విత్ ఏమాత్రం టెన్షన్ పడకుండా రెండు గంటలపాటు చక్కగా హోంవర్క్ పూర్తిచేసుకున్నాడు. మిస్టర్ కూల్ అనిపించుకున్నాడు. హరియాణా రాష్ట్రం గ్రేటర్ ఫరీదాబాద్‌లోని సెక్టార్–86లో ఉన్న ఒమాక్సీ హైట్ సొసైటీ అపార్టుమెంట్ నాలుగో అంతస్తులో గర్విత్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం 5 గంటలకు ట్యూషన్ కోసం అదే అపార్టుమెంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌కు లిఫ్ట్‌లో బయలుదేరాడు. రెండో అంతస్తుకు చేరుకోగానే లిఫ్ట్ ఆగిపోయింది. కాసేపు ఎదురుచూసినా లిఫ్ట్ కదల్లేదు. ఇక చేసేదిలేక హోంవర్క్ చేసుకోవడం ప్రారంభించాడు. గర్విత్ ఇంకా రాలేదంటూ ట్యూషన్ టీచర్ అతడి తండ్రి పవన్‌కు ఫోన్ చేసింది. దాంతో ఆందోళనకు గురైన పవన్ అపార్టుమెంట్ అంతటా గాలించడం మొదలుపెట్టాడు. రెండో అంతస్తుకు చేరుకొని బిగ్గరగా పిలవడంతో గర్విత్ స్పందించాడు. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయానని బదులిచ్చాడు. రాత్రి 7 గంటలకు ఇతరుల సాయంతో లిఫ్ట్ డోర్లను బలవంతంగా తెరవగా, గర్విత్ నవ్వుతూ బయటకువచ్చాడు. హోంవర్క్ లిఫ్ట్‌లో పూర్తి చేసుకున్నానని చెప్పాడు. పిల్లాడి ధైర్యం చూసి అపార్టుమెంట్‌వాసులు ఆశ్చర్యపోయారు. -
‘కోత’లపై చీకటి రాతలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 226.488 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుంటే దానిలో కేవలం 1.35 మిలియన్ యూనిట్లు లోటు ఏర్పడింది. ఇది సరఫరా చేసిన మొత్తంలో కేవలం 0.6 శాతం మాత్రమే. దీనికే ‘చీకటి రాజ్యం’ అంటూ తాటికాయంత అక్షరాలతో పచ్చబ్యాచ్‌కు చెందిన క్షుద్రపత్రిక ఓ కథనాన్ని అచ్చేసింది. రామోజీ మోస్తున్న చంద్రబాబు హయాంలో వారంలో రెండ్రోజులు పరిశ్రమలకు ‘పవర్‌హాలిడే’, గ్రామాల్లో పగలంతా విద్యుత్ కోతలు విధించిన సంగతి ఈనాడు మర్చిపోయినా ప్రజలు మర్చిపోరని రామోజీకి తెలియకపోవడం ఆశ్చర్యకరం. స్థానిక పరిస్థితుల కారణంగా తలెత్తిన విద్యుత్ అంతరాయాలన్నిటినీ విద్యుత్ కోతలుగా చూపించాలనే ప్రయత్నంలో అసలు నిజాలకు రామోజీ పాతరేశారు. కానీ, రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితులను విద్యుత్ సంస్థలు వాస్తవాలతో సహా ‘సాక్షి’కి వెల్లడించాయి. ఆ వివరాలు.. ఉత్పత్తి, వాతావరణ ప్రభావం.. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ గ్రిడ్ డిమాండ్ దాదాపు గతేడాది ఇదే రోజు జరిగిన 200.595 మిలియన్ యూనిట్లు కంటే 25.893 మిలియన్ యూనిట్లు (12.91 శాతం) పెరిగింది. కానీ, ఈ డిమాండ్‌కు సరిపడా సరఫరాకు వనరులు అందుబాటులో లేవు. ఈ సీజన్లో అధికంగా ఉండాల్సిన పవన విద్యుత్ కూడా వాతావరణంలో మార్పులవల్ల అంచనా వేసిన దానిలో కేవలం 30 శాతం కూడా రావడంలేదు. రోజులో వివిధ సమయాల్లో ఒక్కోసారి అంచనాలో కేవలం 10 శాతం కూడా ఉత్పత్తి కావటంలేదు. అలాగే, ఈ ఏడాది కృష్ణా నది బేసిన్లో జల విద్యుత్ ఉత్పత్తి ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ఎగువ రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో మన రాష్ట్రంలో ఉన్న జలాశయాలకు ఇంకా నీటి చేరిక మొదలుకాలేదు. దానివల్ల జల విద్యుదుత్పత్తి కూడా జరగడంలేదు. ఏపీ జెన్కోలోని కొన్ని థర్మల్ విద్యుత్కేంద్రాలు వార్షిక మరమ్మతుల నిర్వహణ కోసం ఆపారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలోని కుడిగి థర్మల్ విద్యుత్ కేంద్రం కూడా ప్రస్తుతం అందుబాటులో లేదు. హిందుజా థర్మల్ కేంద్రంలో బొగ్గు కొరతవల్ల రెండు 520 మెగావాట్ల జనరేటర్లలో కేవలం ఒకటి మాత్రమే పనిచేస్తోంది. మార్కెట్లో దొరకడంలేదు.. ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని ఏఏ సమయాల్లో విద్యుత్ కొరత ఏర్పడుతుందో ఆయా సమయాల్లో అత్యవసరంగా మార్కెట్ కొనుగోళ్లకు వెళ్లాల్సి వస్తోంది. స్వల్పకాలిక మార్కెట్లో కూడా తగినంత విద్యుత్ అందుబాటులో ఉండటంలేదు. ఎంత ధర వెచ్చించినా బహిరంగ మార్కెట్లో స్వల్పకాలిక కొనుగోళ్లు చేద్దామన్నా తగినంత విద్యుత్ అందుబాటులో లేదు. మనం పెట్టే బిడ్డింగ్ పరిమాణంలో కేవలం 10–20 శాతం మాత్రమే దొరుకుతుంది. అత్యంత అధిక ధర (సీలింగ్ ధర)కు బిడ్డింగ్ వేయడానికి సిద్ధపడినా కూడా తగినంత విద్యుత్ లభించడంలేదు. అయినప్పటికీ ఎలాగోలా ప్రయత్నించి బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్ సగటు రేటు రూ.7.483 చొప్పున రూ.46.803 కోట్లతో 46.802 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను శనివారం కొనుగోలు చేశారు. నిరంతర చర్యలు.. ఇక విద్యుత్ గ్రిడ్‌ను సమతుల్యం చేసే క్రమంలో విద్యుత్ సరఫరాలో అక్కడక్కడ కొన్ని అవరోధాలు ఏర్పడ్డాయి. ఈ నియంత్రణ చర్యలు చేపట్టకపోతే దేశీయ గ్రిడ్ నుంచి ఓవర్ డ్రాయల్ విపరీతంగా పెరిగిపోయి మొత్తం గ్రిడ్ మనుగడకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉండడంతో దక్షిణ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్, జాతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ మార్గదర్శకాలకు అనుగుణంగా శనివారం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో అనివార్యంగా విద్యుత్ కోతలు విధించాల్సి వచ్చింది. దక్షిణ భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. కానీ, ఈనాడు, మరికొన్ని పత్రికల్లో రాస్తున్నట్లు మన రాష్ట్రంలో వేలాది గ్రామాల్లో విద్యుత్ కోతలు, చీకటి రాజ్యం పరిస్థితులు లేవు. సామాన్య గృహ విద్యుత్ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం తలెత్తకూడదని ముందుగా పరిశ్రమలు వాడే విద్యుత్‌కు నియంత్రణ విధించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి అధికారులు సూచనలిచ్చారు. మరోవైపు.. నిత్యం విద్యుత్ కొనుగోలుకు డిస్కంలు చర్యలు తీసుకుంటున్నాయి. విద్యుత్ ఎక్స్చేంజీల్లోనే కాకుండా వారం ముందస్తు ద్వైపాక్షిక కొనుగోళ్ల ద్వారా కూడా విద్యుత్ కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. -
కోతల్లేకుండా విద్యుత్ సరఫరా
సాక్షి, అమరావతి/దొండపర్తి (విశాఖ దక్షిణ) : నైరుతి రుతుపవనాల ఆలస్యం కారణంగా దక్షిణాదిన ఈ ఏడాది మే, జూన్ నెలల్లో మునుపెన్నడూ లేనంతగా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగినప్పటికీ ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేసి దక్షిణ ప్రాంతీయ గ్రిడ్ సామర్థ్యాన్ని నిరూపించామని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె. విజయానంద్ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలలో విద్యుత్ రంగ అభివృద్ధి నిమిత్తం శుక్రవారం విశాఖపట్నంలో మొదలైన సదరన్ రీజనల్ పవర్ కమిటీ (ఎస్ఆర్పీసీ) 47వ సమావేశం శనివారం ముగిసింది. ప్రాంతీయ కమిటీకి చైర్మన్‌గా ఉన్న విజయానంద్ అధ్యక్షతన కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఆర్పీసీతో పాటు 45వ టెక్నికల్ కో–ఆర్డినేషన్ కమిటీ (టీసీసీ) సమావేశం కూడా జరిగింది. రెండ్రోజుల పాటు జరిగిన ఈ సదస్సులకు రాష్ట్ర విద్యు త్ సంస్థలైన ట్రాన్స్‌కో, డిస్కంలు ఆతిథ్యం ఇచ్చా యి. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వ్యవసాయ వినియోగదారులకు ప్రభు త్వం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోందని.. దీనికి ఖర్చుచేసే మొత్తాన్ని రైతుల ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలకు బదిలీ చేయడానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పథకాన్ని అమలుచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే, రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల వసూళ్ల కోసం అమలుచేస్తున్న ఆధునిక సాంకేతిక పద్ధతులను ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఐ. పృథి్వతేజ్ ప్రతినిధులకు వివరించారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు లేఖ.. ఇక దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ రంగ సంస్థలు, వాటి నిర్వహణ, వాణిజ్య కార్యకలాపాలు, సమస్యలు, వాటి పరిష్కారం కోసం పరస్పరం సహకరించుకోవడం, అందుకు అవసరమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం.. దక్షిణ గ్రిడ్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్పీసీ, ఎస్ఆర్ఎల్డీసీ సంస్థల నుంచి అవసరమైన సలహాలు పొందడం వంటి అంశాలపై ఈ సదస్సులో ప్రతినిధులు చర్చించారు. అలాగే, అంతర్రాష్ట్ర విద్యుత్ రవాణా చేసే ఇంట్రా స్టేట్ లైన్లకు సెంట్రల్ పూల్ నుంచి ట్రాన్స్మిషన్ చార్జీలను పొందేందుకు గతేడాది డిసెంబర్ 6న ఇచ్చిన ఆదేశాలను అమలుచేయాలని విద్యుత్ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని కమిటీ తీర్మానించింది. -
రోజూ ఒకే టైంలో పవర్ కట్.. అసలు సంగతి తెలిసి గ్రామస్తుల మైండ్ బ్లాక్!
పాట్నా: ప్రేమికులు సిటీలో సులభంగా కలుసుకునే వెసలుబాటు ఉంటుంది. అయితే గ్రామంలో ఇలాంటివి కుదరవన్న సంగతి తెలిసిందే. రోజంతా ఇంట్లో పనులు, పోనీ మధ్యలో కలుద్దామా అంటే ఎవరైన చూస్తారన్న భయం కూడా ఉంటుంది. అయితే ఓ యువతి మాత్రం తన ప్రియుడిని కలుసుకునేందుకు కొత్త ప్లాన్ వేసింది. రాత్రి పూట్ అయితే బెటర్ అని భావించి ఓ వింత పనికి పూనుకుంది. రాత్రి వేళలో తాము కలిసే సమయంలో ఎవరి కంట పడకూడదనే ఆలోచనతో ఆ ఊరి మొత్తానికి కరెంట్ కట్ చేసేది. ఈ వింత ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బేతియా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. అయితే, ఒకే గ్రామం కావడంతో ఇద్దరూ కలుసుకోవడం కుదరడం లేదు. పగలు ఎంత ప్రయత్నించిన కుదరకపోయేసరికి యువతి, రాత్రి సమయంలో కలుసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంకేముంది అందుకు వారి ప్లాన్ ప్రకారం ప్రతి రోజూ రాత్రి పూట ఊరిలో కరెంట్ కట్ చేసేసేది.అందుకోసం సమీపంలోని ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లి విద్యుత్ సరఫరాను నిలిపివేసేది. అనంతరం ప్రియుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయేది. ఇలా కొంతకాలంగా వారిద్దరూ కలయిక కోసం గ్రామం మొత్తం అంధకారంలోకి నెట్టేది. దీంతో ప్రతి రోజూ ఇలా ఎందుకు జరుగుతోందా అని అనుమానం వచ్చిన గ్రామస్థులు ఒక రోజు మాటు వేయడంతో.. చీకట్లో యువతి, యువకుడి ప్రేమ వ్యవహారం బైటపడింది. ప్రేమికులిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ వ్యవహారమంతా ప్రేమ వ్యవహారానికి సంబంధించినదిగా గ్రామస్థులు గుర్తించారు. యువతి చేస్తున్న పనికి చిరెత్తుకొచ్చిన గ్రామస్తులు ఆమె ప్రియుడిని చితకబాదడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో బయటకు రావడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై చర్యలు తీసుకున్న పోలీసులు వీడియో ఆధారంగా ముగ్గురు అదపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ప్రేమికురాలు, ప్రియురాలి కుటుంబాల మధ్య సెటిల్మెంట్ కూడా జరిగి.. వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలిపారు. చదవండి Video: షాకింగ్.. ఢిల్లీ వీధుల్లో మహిళా పైలట్, భర్తను లాక్కొచ్చి, చితకబాది! -
డిమాండ్‌కు సరిపడా విద్యుత్.. రాష్ట్రంలో ఎక్కడా కోత లేదు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ హామీ మేరకు రాష్ట్రంలో డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా జరుగుతోందని, ఎక్కడా విద్యుత్ కోతలు విధించడంలేదని ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో) బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ నెల 24న 206.62 మిలియన్ యూనిట్లు, 25న 197.19 మిలియన్ యూనిట్లు, 26న 201.97 మిలియన్ యూనిట్లు చొప్పున ఎలాంటి విద్యుత్ లోటు, లోడ్ రిలీఫ్‌లు లేకుండా అందించాయని తెలిపింది. ఈ మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీజెన్కో) థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు సగటున రోజుకు 80 మిలియన్ యూనిట్లు అందించాయని వెల్లడించింది. 27వ తేదీ వరకు సగటు విద్యుత్ ఎగుమతి (అమ్మకాలు) రోజుకు 1.36 మిలియన్ యూనిట్లు మాత్రమేనని పేర్కొంది. అందువల్ల సరఫరా – డిమాండ్ గ్యాప్ కారణంగా లోడ్ రిలీఫ్‌లు లేవని, గ్రిడ్ డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను డిస్కంలు సమకూర్చుకుంటున్నాయని తెలిపింది. విద్యుత్ కొరత తీర్చడానికి ఎప్పటికప్పుడు బహిరంగ మార్కెట్ (ఎనర్జీ ఎక్సే్చజీలు) నుంచి కొని, రాష్ట్రంలోని వినియోగదారులకు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నాయని వివరించింది. -
వాస్తవాలు కనలేరా.!
సాక్షి, అమరావతి: పసలేని కథనాలకు ఈనాడు కేరాఫ్‌గా మారింది. లేని వాటిని ఉన్నట్లుగా అవాస్తవాల అచ్చుతో పబ్బం గడుపుకుంటోంది. అలాంటి పనికిరాని కథనాల్లో ఒకటి ఈ విద్యుత్ కోతల కథనం. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా ఏ విధమైన విద్యుత్ కోతలు అమలులో లేవు. అయినా ప్రతి రోజూ 2 – 3 గంటలు విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఈనాడు పదే పదే అసత్య ప్రచారం చేస్తోంది. ప్రజలు నవ్వుతారనే కనీస ఇంగితం కూడా లేకుండా గత ప్రభుత్వంలో ఐదేళ్లూ విద్యుత్ కోతలే లేవని మరో అబద్ధం చెబుతోంది. వేసవి కారణంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం రోజూ రూ.కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్‌ను కొని మరీ ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా సరఫరా చేస్తుంటే, కరెంటు కొనలేరా? అంటూ కళ్లుండీ గుడ్డిరాతలు అచ్చేసింది. అసలు వాస్తవాలను ఇంధన శాఖ ‘సాక్షి’కి వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం.. ఆరోపణ: డిమాండ్ మేరకు విద్యుత్ అందుబాటులో లేనప్పుడు మార్కెట్లో కొనాలి. అలా కాకుంటే ఉత్పత్తి చేయాలి. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ లేని కోతలు ఇప్పుడెందుకు వచ్చాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవం: ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఈ ఐదు నెలల్లో ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో రూ.3059.4 కోట్లు వెచ్చించి 3,633.81 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేసింది. అలాగే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వంద శాతం కరెంటు ఉత్పత్తి చేస్తోంది. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో 40 నుంచి 45 శాతం ఏపీజెన్కో నుంచే సమకూరుతోంది. రోజూ దాదాపు 105 మిలియన్ యూనిట్లు జెన్కో అందిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో ఏ ఒక్క రోజూ విద్యుత్ కోతలు విధించాలి్సన అవసరమే రావడంలేదు. ఆరోపణ: షెడ్యూల్ వేసి సరఫరా నిలిపివేస్తున్నారు. డిమాండ్ సర్దుబాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోత పెడుతున్నారు. వాస్తవం: విద్యుత్ డిమాండ్ గతేడాదితో పోల్చితే భారీగా పెరిగింది. దీంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్ రేట్లు అధికంగా ఉన్నప్పటికీ యూనిట్ పది రూపాయలైనా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అంతరాయాల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తోంది. సర్దుబాటు అవసరమే లేదు. ఈనాడు చెబుతున్న 0.24 మిలియన్ యూనిట్లు, 0.19 మిలియన్ యూనిట్లు అనేది కేవలం గ్రిడ్ ఫ్రీక్వెన్సీని నిర్దిష్ట స్థాయిలో నిలిపి ఉంచడానికి చేసిన డిమాండ్ సర్దుబాటు మాత్రమే. విద్యుత్ కొరతో లేక కోతో కాదు. ఆరోపణ: రాత్రి వేళ అనూహ్యంగా పెరుగుతున్న డిమాండ్‌ను నియంత్రించలేని పరిస్థితి. ఆ సమయంలో కోతలకు సాంకేతిక కారణాలను సాకుగా చెబుతున్నారు. వాస్తవం: వేసవి కారణంగా రాత్రి వేళ అనూహ్యంగా విద్యుత్ వినియోగం పెరిగి 11 కె.వి. పంపిణీ ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. 33 కె.వి. లైన్లపై, సబ్స్టేషన్లపై కూడా అధిక లోడు ప్రభావం ఉంటోంది. దీంతో ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. పంపిణీ సంస్థ (డిస్కం)లలో క్షేత్ర స్థాయిలో 33/11 కె.వి. సబ్‌స్టేషన్ పరిధిలో 24 గంటలు నిర్వహణ సిబ్బంది అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అధిక లోడు, అధిక ఉష్ణోగ్రతలు, అకాల గాలివానల వల్ల కొన్ని చోట్ల స్వల్పకాలం ఏర్పడే విద్యుత్ అంతరాయాలను భూతద్దంలో చూపిస్తూ రాష్ట్రమంతటా పరిస్థితి ఇలానే ఉందని ఈనాడు కట్టు కథలు అల్లుతోంది. ఆరోపణ: ప్రకాశం జిల్లాలో 2, 3 గంటలు, విజయనగరం జిల్లాలో 2 నుంచి 4 సార్లు కరెంటు సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు జనరేటర్లపై ఆధారపడాల్సి వస్తోంది. వాస్తవం: వేసవి ఎండలు, వాతావరణంలో మార్పుల కారణంగా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం, విజయనగరం జిల్లా గజపతినగరం, రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు, గాలులు సంభవిస్తున్నాయి. ఈ కారణంగా విద్యుత్ స్తంభాలు విరగడం, ట్రాన్స్ఫార్మర్లు పడిపోవడం జరుగుతోంది. వాటిని పునరుద్ధరించే క్రమంలో ఆ ప్రాంతాల్లో కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంతే తప్ప విద్యుత్ కోతలు విధిస్తున్నారనేది అవాస్తవం. ఆరోపణ: లోడ్ అంచనా వేసి ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలి. కానీ డిస్కంలు అలా చేయలేకపోయాయి. వాస్తవం: వేసవి కాలంలో రాత్రి వేళ ఏసీలు, కూలర్ల వినియోగం బాగా పెరిగింది. తద్వారా పెరిగే డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్ సరఫరా కూడా జరుగుతోంది. ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో లోడును అంచనా వేసి దానికి తగ్గట్టుగా కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు వాడుకునేలా మరికొన్ని ట్రాన్స్ఫార్మర్లు డిస్కంల వద్ద సిద్ధంగా ఉన్నాయి. -
ఎడాపెడా ‘ఈనాడు’ అబద్ధాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతల్లేవని, వినియోగదారులకు నిరంతరం విద్యుత్‌ను సరఫరా చేసేందుకు కృషిచేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సీఎండీ కె. సంతోషరావు, ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) సీజీఎం వి. విజయలలిత స్పష్టంచేశారు. ఈనాడు దినపత్రికలో శుక్రవారం ‘ఎడాపెడా విద్యుత్ కోతలు’.. ‘కరెంటు కోతతో రోగుల కన్నీరు’.. ‘రొయ్యకు కరెంట్ షాక్’.. శీర్షికలతో ప్రచురితమైన కథనాలపై వారు స్పందించారు. కేవలం సాంకేతిక సమస్యలతోనే అక్కడక్కడా సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయే తప్ప, రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలను అమలుచేయడంలేదని వారు వెల్లడించారు. వారు పేర్కొన్న అంశాలివీ.. ♦ తిరుపతి జిల్లా, పెళ్లకూరు మండలం చెంబేడు గ్రామంలో విద్యుత్ కోతలులేవు. గ్రామ పరిధిలోని ఓ వినియోగదారుడు చెట్ల కొమ్మలను తొలగిస్తున్నప్పుడు కొమ్మలు విద్యుత్ లైనుపై పడడంతో సంబంధిత ట్రాన్స్ఫార్మర్ పరిధిలో మాత్రమే గురువారం ఉ.8 నుంచి 10 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా నాయుడుపేటలో కండక్టర్ తెగిపోయిన కారణంగా బుధవారం రాత్రి అరగంట పాటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నాయ ఫీడరు ద్వారా విద్యుత్ సరఫరా చేశారు. అయితే, లైన్ మరమ్మతు పూర్తయిన తర్వాత ఫీడర్‌ను మార్చేందుకు మరోమారు పది నిమిషాలపాటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ♦ ఏలూరు జిల్లా, దెందులూరులో విద్యుత్ కోతలులేవు. కానీ, గత శుక్ర, శనివారాలలో రాత్రి వేళల్లో భీమడోలు, పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈదురుగాలులు, వర్షాల కారణంగా, 33కేవీ లైనులో సాంకేతిక లోపాలు తలెత్తాయి. వాటి మరమ్మతుల కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఎండల తీవ్రతకు, అధిక లోడు వలన 220 కేవీ నుంచి ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్‌లో మూడో పవర్ ట్రాన్స్ఫార్మర్ ఓవర్ లోడ్ కారణంగా దానిని మార్చడానికి లైన్ క్లియర్ తీసుకున్నారు. దీంతో గణపవరం, నిడమర్రు, ఉండి, భీమవరం, పాలకోడేరు, కాళ్ళ, ఆకివీడు మండలాల్లో ఆక్వా రైతులకు కొంతమేర విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ♦ విజయనగరం జిల్లాలో గురువారం ఉ.11.02 నుండి 11.08 వరకు, బుడతనాపల్లి గ్రామంలో ఎల్టి సర్విసు ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏబీ స్విచ్ ఆపడంవల్ల అంతరాయం కలిగింది. గురువారం 11 కేవీ ఉడా ఫీడర్పై 14.42 గంటలకు యూకలిప్టస్ చెట్టు కొమ్మలు పడటంవల్ల అదే ఫీడర్పై ఉన్న బీఆర్ అంబేడ్కర్ గురుకుల కార్యాలయానికి విద్యుత్ అంతరాయం కలిగిన వెంటనే సిబ్బంది చెట్లు, కొమ్మలు తొలగించి 15.48 గంటలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ♦ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం 50 పడకల ఆసుపత్రి, ఏలూరు గవర్నమెంట్ ఆస్పత్రికి ఎలాంటి విద్యుత్ అంతరాయం ఏర్పడలేదు. టెక్కలి గవర్నమెంట్ ఆస్పత్రికి గురువారం 12 నిమిషాల పాటు, పలాస కమ్యూనిటీ ఆస్పత్రికి గంట 40 నిమిషాలు పాటు ఈదురుగాలులు వేస్తున్న సమయంలో మాత్రమే అంతరాయం ఏర్పడింది. ♦వేసవిలో ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా వున్నందున విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతోంది. సంస్థ పరిధిలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగినప్పటికీ డిమాండుకు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. వేడి నుంచి ఉపశమనం కోసం ఏసీల వినియోగం పెరగడంవల్ల లోడ్ ఎక్కువైనపుడు కొన్ని ప్రాంతాల్లోని ట్రాన్స్ఫార్మర్లలో ఫ్యూజులు పోతున్నాయి. గత కొన్నిరోజులుగా బలమైన గాలులు, వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు కూలిపోవడం, లైన్లు తెగిపోవడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎండలు, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా.. ఇక ప్రజల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కరెంటు కోటాను అందిస్తోంది. రోజూవారీ వినియోగం 255 మిలియన్ యూనిట్లు ఉన్నప్పటికీ కోతలు లేకుండా సరఫరా చేస్తోంది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు అధికారులు, సిబ్బంది ఎండలు, వర్షాన్ని లెక్కచేయకుండా త్వరితగతిన సరఫరాను పునరుద్ధరించేందుకు కృషిచేస్తున్నారు. ముఖ్యంగా ఆస్పత్రులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి కోతలు విధించడంలేదు. అదేవిధంగా రాత్రి సమయాల్లో విధుల నిర్వహణకు టీమ్‌లను ఏర్పాటుచేశారు. సమాచారం అందుకున్న సిబ్బంది సత్వరం స్పందించి సరఫరాను పునరుద్ధ రించేందుకు చర్యలు చేపడుతున్నారు. కార్పొరేట్ ఆఫీస్ నుంచే కాకుండా సర్కిల్ స్థాయి, డివిజన్ స్థాయిల్లో కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయాల పర్యవేక్షణకు లోడ్ మానిటరింగ్ సెల్లు 24గంటలూ పనిచేస్తున్నాయి. విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలు తలెత్తితే వినియోగదారులు టోల్ ఫ్రీ నెంబర్ 1912కు ఫోన్‌చేసి పరిష్కారం పొందవచ్చు. -
కోతల్లేని కరెంట్..
నాడు చీకటి రోజులు గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ‘పట్టణాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 వరకు.. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 వరకు.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పగలంతా విద్యుత్ సరఫరా ఉండదు’ అని అధికారికంగా ప్రకటనలు జారీ అయ్యేవి. ‘ఎండా కాలం కదా.. పవర్ కట్ మామూలే’ అని అప్పటి పాలకులు దబాయించే వారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలిసేది కాదు. వంటింట్లో మిక్సీలు తిరక్క గృహిణులు, హాల్లో ఫ్యాన్ తిరక్క పిల్లలు, ఆఫీసుల్లో ఏసీలు పని చేయక ఉద్యోగులు, జిరాక్స్ సెంటర్ల వద్ద విద్యార్థుల పాట్లు అన్నీ ఇన్నీ కాదు. విద్యుత్ ఎప్పుడొస్తుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వచ్చేది. ఆ రోజులను గుర్తు చేస్తే చాలు ప్రజలు కథలు కథలుగా చెబుతారు. నేడు వెలుగు జిలుగులు ఎక్కడా ‘విద్యుత్ కోత’ అన్న పదానికి తావు లేకుండా సీఎం వైఎస్ జగన్ ముందు చూపుతో వ్యవహరించారు. గృహాలకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి ఏ రీతినా సమస్య లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం బొగ్గు నిల్వలు సరిపడా ఉండేలా చూసుకోవడంతో పాటు బయటి మార్కెట్లోనూ విద్యుత్ కొనుగోలు చేశారు. సరఫరాలో నాణ్యత పెరిగేలా వ్యవస్థాగత మార్పులు చేశారు. ఈ ఏడాది ఇదివరకెన్నడూ లేనంతగా అనూహ్యంగా డిమాండ్ పెరగడంతో అక్కడక్కడ ఓవర్‌లోడ్‌తో ట్రిప్ కావడం తప్పించి ఏ సమస్యా లేకుండా శ్రద్ధ పెట్టారు. అలాంటి చోట్ల నిమిషాల వ్యవధిలోనే మరమ్మతులు చేసేలా యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. తద్వారా ఇళ్లలో, కార్యాలయాల్లో ఎక్కడా ‘విద్యుత్ కోత’ అన్నమాటే వినిపించడం లేదు. ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు నిరంతరాయంగా పని చేస్తున్నాయి. వ్యవసాయానికి 18.49 లక్షల వ్యవసాయ సర్వీసులకు పగటి పూటే 9 గంటలు నిరంతర విద్యుత్ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో 7 వేల మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. దీంతోపాటు రూ.1700 కోట్లతో ఫీడర్లను అప్‌గ్రేడ్ చేసింది. తద్వారా 30 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎలాంటి ఢోకా లేకుండా ఏర్పాటు చేసింది. పరిశ్రమలకూ ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తోంది. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇదివరకెన్నడూ లేని విధంగా విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ, ఎక్కడా కోతలన్నదే లేకుండా సరఫరా సవ్యంగా సాగుతోంది. ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా పెరగడం, ఎండలు మండిపోతుండటం వల్ల విద్యుత్ వినియోగం అమాంతం పెరిగింది. అయినా కాసేపు కూడా విద్యుత్ కోత లేకుండా నిరంతరాయంగా సరఫరా జరిగేలా సీఎం వైఎస్ జగన్ ముందు చూపుతో వ్యవహరించారు. గత సంవత్సరం గరిష్ట డిమాండ్‌తో పోలిస్తే ఇప్పుడు 27.51 శాతం అధికంగా ఉంది. ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటుతోంది. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఫలితంగా ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్‌లు వంటి గృహోపకరణాలు నిరంతరం పని చేస్తున్నాయి. ఎక్కువ సమయం ఇంట్లోనే గడపడం వల్ల మిక్సీలు, గ్రైండర్లు, టీవీలు, కంప్యూటర్ల వినియోగం కూడా అధికంగానే ఉంటోంది. మరోవైపు పారిశ్రామిక వినియోగం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం రాకార్డు స్థాయిలో పెరిగిపోయింది. రోజువారీ డిమాండ్ 248.985 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. గత ఏడాది ఇదే సమయానికి 195.266 మిలియన్ యూనిట్లుగా ఉండింది. రోజులో పీక్ డిమాండ్ 12,482 మెగావాట్లుగా ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 9308 మోగావాట్లు మాత్రమే. అంటే 34.10 శాతం పెరిగింది. పగటి పూట సగటు పీక్ డిమాండ్ 10,374 మెగావాట్లు, సాయంత్రం వేళల్లో 9,582 మెగావాట్లకు చేరుకుంది. అయినప్పటికీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్‌కు ఇబ్బంది లేకుండా, డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ సంస్థలు వినియోగదారులకు నిరంతరం కరెంట్ సరఫరా చేస్తున్నాయి. ఇలా దేశంలోనే ఎక్కడా జరగడం లేదని, రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనిస్తోందని చెప్పడానికి ఇదొక పెరామీటర్‌గా చెప్పవచ్చని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. ముందు చూపుతో విద్యుత్ కొనుగోలు ప్రస్తుతం ఏపీజెన్కో థర్మల్ నుంచి 89.981 మి.యూ, ఏపీ జెన్కో హైడల్ నుంచి 5.414 మి.యూ, సెంట్రల్ జెనరేటింగ్ స్టేషన్ల నుంచి 43.012 మి.యూ, సెయిల్, హెచ్‌పీసీఎల్, గ్యాస్ వంటి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుంచి 28.510 మి.యూ, సోలార్ నుంచి 25.605 మి.యూ, విండ్ నుంచి 11.591 మి.యూ, ఇతర మార్గాల్లో 1.496 మిలియన్ యూనిట్లు చొప్పున విద్యుత్ సమకూరుతోంది. అయితే ఇది మాత్రమే సరిపోవడం లేదు. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్ సగటు రేటు రూ.7.537 చొప్పున రూ.33.936 కోట్లతో 45.023 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ప్రతి రోజూ కొనుగోలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ విధంగా డిమాండ్‌ను అందుకోలేక భారీగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. జార్ఖండ్‌లో 4.62 మి.యూ, హర్యానాలో 2.64 మి.యూ, ఉత్తరప్రదేశ్‌లో 2.03 మి.యూ, కర్ణాటకలో 1.97 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఏర్పడింది. సరిపడా బొగ్గు నిల్వలు దేశంలోని మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 70 శాతం థర్మల్ నుంచే వస్తోంది. ఇందులో ఇప్పుడు వినియోగిస్తున్న బొగ్గుకు దాదాపు 40 శాతం నుంచి 50 శాతం అదనంగా బొగ్గును సమకూర్చుకోవాలని, విదేశీ బొగ్గును 6 శాతం దిగుమతి చేసుకుని స్వదేశీ బొగ్గుతో కలిపి వాడుకోవాలని కేంద్రం చెప్పింది. అందుకు అనుగుణంగా రైల్వే ర్యాక్స్‌ను పెంచాలని ఏపీజెన్కో, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని, రైల్వేను కోరాయి. 14 రైల్వే ర్యాకులు సరిపోవడం లేదని, వీటితో పాటు మరో ఆరు ర్యాకులు పెంచాలని అడిగాయి. దీంతో మరో మూడు ర్యాకులు అదనంగా వచ్చాయి. వీటి ద్వారా మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి, సింగరేణి కాలరీస్ నుంచి బొగ్గును తీసుకువస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం వీటీపీఎస్‌లో 83,479 మెట్రిక్ టన్నులు, ఆర్టీపీపీలో 30,001 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నంలో 29,000 మెట్రిక్ టన్నులు, హిందూజా వద్ద 19200 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. యుద్ధ ప్రాతిపదికన వీటీపీఎస్ పునరుద్ధరణ సోలార్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉన్నప్పుడు, థర్మల్ జనరేటర్లు పీక్ లోడ్‌లో పని చేస్తున్నప్పుడు వీటీపీఎస్ వద్ద జనరేటర్లు ఈ నెల 17వ తేదీ రాత్రి 7 గంటలకు ట్రిప్ అయ్యాయి. పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి ఆ రోజు వాతావరణం, సమయం మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రిజర్వాయర్ మట్టం తక్కువగా ఉన్నందున శ్రీశైలంలో హైడల్ ఉత్పత్తి అందుబాటులో లేదు. గ్యాస్ పరిమితి కారణంగా గ్యాస్ స్టేషన్ల నుంచి ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను కొనుగోలు చేసి మరీ ప్రజలకు అందించారు. అదే సమయంలో వీటీపీఎస్‌లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, అన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించారు. వాస్తవాలు మరచి దుష్ప్రచారం ఎక్కడా విద్యుత్ కోతలు లేకపోయినప్పటికీ చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేలా ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోంది. గత చంద్రబాబు ప్రభుత్వం హయాంలో విద్యుత్ సరఫరా దుస్థితిని వ్యూహాత్మకంగా విస్మరిస్తోంది. గంటల తరబడి కోతలు విధించారనే విషయాన్ని దాస్తోంది. అప్పట్లో వేసవిలో కరెంటు పరిస్థితి చెప్పనలవి కాదు. వేసవిలో కాకుండా కూడా కోతలు విధించిన రోజులున్నాయి. పరిశ్రమలకైతే ఏకంగా పవర్ హాలిడేలు ఇచ్చారు. వారంలో మూడు రోజులు పరిశ్రమలన్నింటికీ తాళం వేయాల్సి వచ్చేది. జిరాక్స్ మిషన్లు, పిండి మరలు, కూల్ డ్రింక్స్ దుకాణాలు, కూలింగ్ వాటర్ ప్లాంట్లు గంటల తరబడి పని చేయక చిరు వ్యాపారులు నష్టాలు చవిచూశారు. విద్యుత్ కోతల గురించి మాట్లాడితే అప్పటి ప్రభుత్వ పెద్దలు, మంత్రులు దబాయించే వారు. ‘ఎండా కాలం.. ఆ మాత్రం విద్యుత్ కోత ఉండదా.. ఇప్పుడే కొత్తగా కోతలు విధిస్తున్నా.. ఇది వరకు కోతల్లేవా’ అని ఎదురు దాడికి దిగేవారు. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ సీఎం జగన్ ప్రభుత్వం కోత అన్నదే లేకుండా విద్యుత్ సరఫరా చేస్తుంటే ఎల్లో మీడియాకు కడుపు మండుతోంది. వంకర బుద్ధి చూపిస్తూ.. చిన్న చిన్న సాంకేతిక కారణాలతో విద్యుత్ పోయిన ప్రాంతాలను చూపుతూ దుష్ప్రచారం చేస్తోంది. -
కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతల వల్లే జనాభా పెరిగింది
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సౌకర్యం లేనందునే, దేశంలో జనాభా పెరిగిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. కర్ణాటకలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘అధికారంలోకి వస్తే ఉచితంగా కరెంటు ఇస్తామని కాంగ్రెస్ ఇప్పుడు హామీ ఇస్తోంది కానీ, గతంలో ఆ పార్టీ ప్రభుత్వ హయాంలో కరెంటు సరఫరా సరిగా చేయలేకపోయింది, గ్రామాల్లో అస్సలే కరెంటు లేదు. ఫలితంగా జనాభా పెరిగిపోయింది’అని అన్నారు. ప్రధాని మోదీ హయాంలో 24 గంటలూ విద్యుత్ ఉంటోందని చెప్పారు. -
విద్యుత్ కోతలపై రైతుల నిరసన
నల్లగొండ: విద్యుత్ కోతలను నిరసిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు శుక్రవారం రోడ్డెక్కారు. తిప్పర్తిలో అద్దంకి – నార్కట్‌పల్లి హైవేపై ధర్నా చేశారు. నకిరేకల్, పెద్దవూర, రామన్నపేట మండలాల్లో సబ్ స్టేషన్ల ఎదుట ఆందోళన చేపట్టారు. 24 గంటల పాటు విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. -
కరెంట్ కోతలపై అన్నదాతల నిరసన
జగిత్యాల రూరల్: అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ జగిత్యాల జిల్లా పోరండ్ల గ్రామంలోని రైతులు ఆదివారం స్థానిక సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. వ్యవసాయ రంగానికి వచ్చే త్రీఫేజ్ కరెంట్ సరఫరాలో అంతరాయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులను కార్యాలయంలోని ఓ గదిలో ఉంచి తాళం వేశారు. సబ్‌స్టేషన్ ఎదుట సుమారు రెండు గంటలపాటు బైఠాయించారు. వ్యవసాయ రంగానికి నిరంతరం త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. కనీసం ఐదు గంటలు కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు. సమయపాలన లేకుండా అధికారులు కోతలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు. రాత్రి, పగలు తేడాలేకుండా 24 గంటలపాటూ వ్యవసాయ బావుల వద్ద కరెంట్ కోసం పడిగాపులు కాస్తున్నామని పేర్కొన్నారు. కాగా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఉద్యోగులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. గది తాళం తీసి వారికి విముక్తి కల్పించారు. -
విద్యుత్ సిబ్బందిని బంధించిన రైతులు
కోరుట్ల రూరల్: అప్రకటిత విద్యుత్ కోతలకు నిరసనగా ధర్మారం రైతులు మంగళవారం సబ్‌స్టేషన్ సిబ్బందిని కార్యాలయం గదిలో బంధించి తాళం వేశారు. అనంతరం సబ్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. వ్యవసాయ రంగానికి 24గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలతో నీళ్లు అందక వరి, మక్క, కూరగాయల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కోరుట్ల–మల్లాపూర్ మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. మల్లాపూర్ ఏడీఈ శ్రీనివాసరావు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో సిబ్బందిని విడుదల చేసి ఆందోళన విరమించారు. -
దేశవ్యాప్తంగా కరెంట్ బంద్.. ‘చీకటి’లో పాకిస్తాన్ ప్రజలు (ఫోటోలు)
-
అల్లాడుతున్న పాకిస్తాన్ ప్రజలు.. దేశవ్యాప్తంగా కరెంట్ కట్!
ఇస్లామాబాద్: ఇప్పటికే ఆర్థిక కష్టాలతో అల్లాడిపోతున్న పాకిస్తాన్ నెత్తిపై మరో పిడుగు పడింది. అకాశన్నంటిన నిత్యావసరాల ధరలు, ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు మరో కష్టం వచ్చిపడింది. నేషనల్ గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు సోమవారం అంధకారంలోనే గడిపారు. హోటళ్లు, రెస్టారెంట్లు దీపాల వెలుగులోనే నడిచాయి. సాధారణ పౌరులు ఇళ్లలో కొవ్వత్తులు వెలిగించుకొని జీవనం సాగించారు. నేషనల్ గ్రిడ్‌లో ఫ్రీక్వెన్సీ పడిపోడవంతో సోమవారం ఉదయం 7:30 గంటలకు దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీన్ని పునరుద్ధరించేందుకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే ఎట్టకేలకు ఇస్లామాద్, గుజ్రావాలా ప్రాంతాల్లో మాత్రం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. మిగతా నగరాల్లో కూడా పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు విద్యత్ శాఖ మంత్రి ఖురాం దస్తగిర్ పేర్కొన్నారు. కరెంటు కోతలు సహజమే.. విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న పాకిస్తాన్లో కరెంటు కోతలు సర్వసాధరణమైపోయాయి. హాస్పిటళ్లు, ఫ్యాక్టరీలు, ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు జనరేటర్ల సాయంతో నడుస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పాఠశాలల్లో కూడా వెలుతురు లేకుండానే పాఠాలు బోధిస్త్నున్నారు. కొన్ని చోట్ల బ్యాటరీతో నడచే లైట్లను ఉపయోగిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భాలు మాత్రం చాలా తక్కువే. గతంలో 2021లో గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా పాక్ మొత్తం విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు మరోసారి ఇదే కారణంతో దేశం మొత్తం అంధకారంలోకి వెళ్లింది. చదవండి: ఆందోళనలతో అట్టుడుకుతున్న బ్రెజిల్, పెరు.. ఏమిటీ సమస్య? -
కరెంటు కట్.. పాకిస్తాన్లో స్తంభించిన విద్యుత్ సరఫరా..
ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా పలు నగరాల్లో సోమవారం ఉదయం 7:30 గంటల నుంచి కరెంటు సరఫరా ఆగిపోయింది. పాకిస్తాన్ మీడియా సంస్ధలు ఈ విషయాన్ని వెల్లడించిన తర్వాత ఆ దేశ విద్యుత్ శాఖ కూడా ట్వీట్ చేసింది. నేషనల్ గ్రిడ్ ఫ్రీక్వెన్సీ పడిపోవడం వల్లే విద్యుత్ సరఫరా స్తంభించినట్లు అధికారులు తెలిపారు. దాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌లోని 117 గ్రిడ్ స్టేషన్లు సహా కరాచీ, పేషావర్, బలూచిస్తాన్‌లోని 22 జిల్లాలు విద్యత్ సరఫరా అంతరాయం కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 2021లో కూడా పాకిస్తాన్లో ఇలాగే జరిగింది. సింధ్ రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రంలో సాంకేతిక తప్పిదం కారణంగా ఫ్రీక్వెన్సీ 50 నుంచి సున్నాకు పడిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒక్కరోజు తర్వాత దీన్ని పునరుద్ధరించారు. చదవండి: ఉక్రెయిన్‌కు ఆయుధాలిస్తే ప్రపంచ వినాశనమే.. రష్యా హెచ్చరిక -
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్ రాజధానిలో నీటి సరాఫరా బంద్
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. రష్యా యుద్ధంతో ఉక్రెయిన్ పూర్తిగా ధ్వంసమవుతోంది. శత్రువు దాడి నుంచి తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ సేనికులు తీవ్రంగా పోరాడుతున్నారు. ఉక్రెయిన్ దేశ రాజధాని కీవ్‌పై రష్యా బలగాలు మరోసారి దృష్టి సారించాయి. రాజధాని ప్రాంతాన్ని చేజిక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. తాజాగా కీవ్‌ను లక్ష్యంగా చేసుకొని రష్యా భీకర దాడులు చేపట్టింది. శుక్రవారం తెల్లవారుజామున కీవ్ బాంబుల మోతతో దద్దరిల్లింది. రష్యా చర్యతో మౌలిక సదుపాయాలు దెబ్బతినడం వల్ల కీవ్‌లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని కీవ్ మేయర్ విటాలీ క్విచ్కో వెల్లడించారు. మెట్రో సర్వీస్‌లు నిలిపివేయడంతో స్టేషన్లను షెల్టర్స్‌గా వినియోగించుకోవాలని తెలిపారు. కీవ్‌లోని సెంట్రల్ జిల్లాలు, డెస్న్యాన్ జిల్లాలో పేలుళ్ల మోత వినిపించిందని, స్థానిక ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని పేర్కొన్నారు. కాగా రష్యా వరుస దాడుల దాడులతో ఉక్రెయిన్ విద్యుత్ నెట్వర్క్ ఇప్పటికే తీవ్రంగా దెబ్బతింది. విద్యుత్ అంతరాయం కారణంగా లక్షలాది ఉక్రెనియన్లు అంధకారంలో చిక్కుకుపోయారు. ఉక్రెయిన్ విద్యుత్, ఇంధన, మౌలిక సదుపాయాల వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని రష్యా ఈ దాడులు చేపట్టింది. చదవండి: కొండచరియలు విరిగిపడి 50 మంది గల్లంతు -
విద్యుత్ లైన్లపైకి దూసుకెళ్లిన విమానం.. 90 వేల ఇళ్లకు పవర్ కట్..
వాషింగ్టన్: అమెరికా మేరీలాండ్‌లోని మాంట్గోమెరీ కౌంటీలో ఓ చిన్న సైజు విమానం విద్యుత్ లైన్లపైకి దూసుకెళ్లింది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటీ హాని జరగలేదు. కానీ కరెంటు తీగలు తెగిపోవడంతో కౌంటీలోని 90 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా కౌంటీవాసులంతా అంధకారంలోకి వెళ్లారు. వర్షాలు పడటంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 10 అంతస్తుల ఎత్తులోనే ఈ ప్రమాదం జరగడానికి కచ్చితమైన కారణాలు మాత్రం ఇప్పుడే చెప్పలేమన్నారు. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదన్నారు. ఈ ప్రమాదంపై మాంట్గోమెరీ పోలీసులు ట్వీట్ చేశారు. విమానం విద్యుత్ లైన్లపైకి దూసుకెళ్లిన ప్రాంతం వైపు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు. అక్కడ కరెంటు తీగలు నెలపై పడి ఉన్నాయని పేర్కొన్నారు. చదవండి: తిరగబడ్డ చైనా.. మితిమీరిన ఆంక్షలపై కన్నెర్రజేసిన జనం.. -
బంగ్లాదేశ్‌లో 'సిత్రాంగ్' బీభత్సం.. 35 మంది బలి.. 80 లక్షల మందిపై..
ఢాకా: బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల వరదలు సంభవించి 35 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20 వేల మంది నీటిలో చిక్కుకున్నారు. సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో విద్యుత్ సరఫారాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా 80 లక్షల మంది అంధకారంలోనే ఉండిపోయారు. ఎక్కడికక్కడ చెట్లు, స్తంభాలు నేలకొరిగాయని, బుధవారం వరకు విద్యుత్ పునరుద్ధరణ సాధ్యం కాదని అధికారులు తెలిపారు. First time seeing continuous heavy rain with strong wind in Dhaka. I wonder what's the situation in coastal areas where the cyclone is actually hitting. May Allah protect them#CycloneSitrang #Bangladesh pic.twitter.com/XoPaZF75Zc — Ajijur Rahman 🇧🇩 (@AjijurR84590395) October 24, 2022 వరదల ధాటికి 10,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 6,000 హెక్టార్ల పంట దెబ్బతింది. వేల చేపల ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. దీంతో ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లింది. #BREAKING #BANGLADESH 🔴BANGLADESH :#VIDEO CYCLONE SITRANG HIT THE COAST BAY OF BENGAL EARLY TUESDAY! Tropical Cyclone #Sitrang has strengthened to 40 knots over the past several hours & is forecast to continue INTENSIFYING.#BreakingNews #UltimaHora #CycloneSitrang #Ciclon pic.twitter.com/ysVAvHSiOW — loveworld (@LoveWorld_Peopl) October 24, 2022 అయితే మంగళవారం సాయంత్రం నాటికి తుఫాను తీవ్రత తగ్గిందని అధికారులు పేర్కొన్నారు. వరదల సమయంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. తుఫాన్ కారణంగా సోమవరం తాత్కాలికంగా నిలిపివేసిన విమాన సర్వీసులను 21 గంటల తర్వాత మంగళవారం నుంచి పునరుద్ధరించినట్లు వెల్లడించారు. Another-As cyclone #Sitrang batteredparts of #Bangladesh on Monday, atleast seven people lost their lives, including three members of a family, in the #collapse of a brick railing and trees.#cyclone #cycloneSitrang #weather #news #BREAKING #BREAKINGNEWS #Viral #climate pic.twitter.com/KpgqVfmG3q — Top Disaster (@Top_Disaster) October 25, 2022 చెట్టు కూలి విషాదం తుఫాన్ సమయంలో కుమిలా జిల్లాలో ఓ ఇంటిపై చెట్టుకూలి తల్లిదండ్రులతో పాటు 4 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ ఘటనల్లో మొత్తం 35 మంది మరణించినట్లు పేర్కొన్నారు. As cyclone #Sitrang battered parts of #Bangladesh on Monday, atleast seven people lost their lives, including three members of a family, in the #collapse of a brick railing and trees.#CycloneSitrang #cyclone pic.twitter.com/eVg5KIbG5f — Chaudhary Parvez (@ChaudharyParvez) October 25, 2022 డెల్టా ప్రాంతమైన బంగ్లాదేశ్‌లో తరచూ తుఫాన్లు, వరదలు సంభవించి 1.6 కోట్ల మంది ప్రభావితమవుతున్నారు. అయితే వాతావరణ మార్పుల కారణంగానే గతంతో పోల్చితే అత్యంత ప్రమాదకర విపత్తులు సంభవిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. చదవండి: ముందున్నది ముళ్లదారే.. రిషికి అంత ఈజీ కాదు..! -
ఉక్రెయిన్‌పై క్షిపణుల మోత.. యూరప్‌కు కరెంటు కట్
కీవ్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మరింత భీకర రూపం దాల్చింది. రష్యా, క్రిమియాలను కలిపే కెర్చ్ వంతెనపై బాంబు పేలుళ్లకు ప్రతీకారంగా దాడులను రష్యా మంగళవారం మరింత తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్ నగరాలే లక్ష్యంగా సోమవారం ఏకంగా 84 క్షిపణులతో విరుచుకుపడటం తెలిసిందే. మంగళవారం ఉక్రెయిన్‌లోని మిలటరీ కమాండ్ సెంటర్లు, ఇంధన కేంద్రాలే లక్ష్యంగా భారీ దాడులకు దిగింది. దాంతో జెలెన్స్కీ ప్రభుత్వం యూరప్ దేశాలకు విద్యుత్ సరఫరాను నిలిపేయాల్సి వచ్చింది. సుదూర ప్రాంతాలను ఛేదించే దీర్ఘ శ్రేణి క్షిపణులతో రష్యా విధ్వంసం సృష్టిస్తోంది. క్షిపణి దాడుల తో లివీవ్ నగరం అల్లాడుతోంది. వేలాది మంది బంకర్లలో తలదాచుకుంటున్నారు. మంగళవారం దాడుల్లో 20 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. మరోవైపు ఉక్రెయిన్‌కు అండగా గగనతల రక్షణ వ్యవస్థలను తరలించడానికి అమెరికా, జర్మనీ అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడారు. అత్యాధునికమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను పంపుతామని హామీ ఇచ్చారు. ఫేస్‌బుక్‌పై ఉగ్ర ముద్ర ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగాంల మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ కంపెనీని ఉగ్రవాద సంస్థగా రష్యా ప్రకటించింది. ఫేస్బుక్, ఇన్‌స్టా ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు అది ఊతమిస్తోందని ఆరోపిస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు ఐరాస: ఐక్యరాజ్యసమితిలో భారత్ మరోసారి రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. ఉక్రెయిన్‌లో నాలుగు ప్రాంతాలను రష్యా దురాక్రమించడాన్ని వ్యతిరేకిస్తూ ఐరాస సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానంపై రహస్య ఓటింగ్ నిర్వహించాలన్న రష్యా డిమాండ్‌ను భారత్ తిరస్కరించింది. దీనిపై జరిగిన ఓటింగ్‌లో మరో 100కు పైగా దేశాలతో కలిసి రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్, డొనెట్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యా విలీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ అల్బేనియా తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై రష్యా రహస్య ఓటింగ్ డిమాండ్‌ను భారత్ సహా 107 సభ్య దేశాలు తిరస్కరించాయి. 13 దేశాలు రష్యా డిమాండ్‌కు అనుకూలంగా ఓటేయగా చైనా సహా 39 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. -
Typhoon Talas: జపాన్‌లో 'తలస్' బీభత్సం.. ఇద్దరు మృతి
టోక్యో: సెంట్రల్ జపాన్‌లో తలస్ తుఫాను బీభత్సం సృష్టించింది. శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల ధాటికి వరదలు సంభవించాయి. కొంచరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో వేల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కకెగావా నగరంలో ఒకరు తన ఇంటిపై కొండచరియలు విరిగిపడి చనిపోయాడు. దీని పక్క నగరం ఫుకురోయ్లో మరోవ్యక్తి వరదలో వాహనంలో చిక్కుకుని మరణించాడు. షిజువోకాలో మరో వ్యక్తి వరదలో వాహనం నడుపుతూ కొట్టుకుపోయి అదృశ్యమయ్యాడు. అతను కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు రికార్డుస్థాయిలో 40సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. వరదల వల్ల అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 1,20,000 ఇళ్లు అంధకారంలో ఉన్నాయి. 55వేల మంది ఇళ్లకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వీరికి శుభ్రమైన నీటిని అందించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జపాన్‌లో వేసవి కాలం, శరద్ రుతువులతో తరచూ తఫాన్లు వస్తుంటాయి. గతవారం కూడా నన్మదోల్ తుఫాన్ నైరుతి జపాన్ను అతలాకుతలం చేసింది. అప్పుడు సంభవించిన వివిధ ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. మరో 147మంది గాయపడ్డారు. చదవండి: బ్రిటన్ రాణి సమాధి ఫోటోలు వైరల్ -
పాక్... మరో శ్రీలంక
ఇస్లామాబాద్: శ్రీలంక మాదిరిగానే పాకిస్తాన్ కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో గంటల కొద్దీ విద్యుత్ కోతలు అమల్లో ఉండటంతో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందని పాకిస్తాన్ ప్రభుత్వమే ప్రజలను హెచ్చరించింది. విద్యుత్ కోతల కారణంగా ఇప్పటికే మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని శుక్రవారం నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డ్ (ఎన్ఐబీటీ) ట్విట్టర్లో తెలిపింది. దేశ అవసరాలకు సరిపోను ద్రవీకృత సహజ వాయువు(ఎల్ఎన్జీ) అందకపోవడంతో జూలైలో ఈ సమస్య మరింత తీవ్రం కావచ్చని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా ఇటీవల పేర్కొన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ డిమాండ్ ఒక వైపు పెరుగుతుండగా జూన్‌లో దిగుమతులు తగ్గిపోయినట్లు జియో న్యూస్ పేర్కొంది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా కరాచీ తదితర నగరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీల్లో పని గంటలను కుదించారు. ఇంధన కొరతను అధిగమించేందుకు ఖతార్‌తో చర్చలు జరుగుతున్నాయి. విదేశీ కరెన్సీ నిల్వలు పడిపోవడంతో దేశంలో ద్రవ్యోల్బణం ఒక్కసారిగా రెట్టింపయింది. -
పాక్‌లో ఇంటర్నెట్ బంద్ హెచ్చరికలు!
ఇస్లామాబాద్: తీవ్ర విద్యుత్ సంక్షోభం నడుమ.. పాకిస్థాన్‌లో ఇంటర్నెట్ బంద్ హెచ్చరికలు జారీ అయ్యాయి. టెలికామ్ ఆపరేటర్లు మూకుమ్మడిగా మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తామని గురువారం అల్టిమేటం జారీ చేశాయి. ఈ మేరకు.. నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డు(NIBT) ఒక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా గంటల తరబడి కరెంట్ కోతలు కొనసాగుతున్నాయి. అంతరాయం వారి(టెలికాం ఆపరేటర్ల) కార్యకలాపాలకు ఇబ్బందులను కలిగిస్తున్నాయి. అందుకే టెలికామ్ ఆపరేటర్లు మొబైల్, ఇంటర్నెట్ సేవలు ఆపేస్తామని హెచ్చరిస్తున్నారు అని ఎన్ఐబీటీ ప్రకటించింది. పాక్ దేశ ఆవిర్భావం తర్వాత ఈ స్థాయిలో విద్యుత్ కోతలు ఎదుర్కొవడం ఇదే ప్రథమం. ఇక విద్యుత్సంక్షోభం మునుముందు మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రధాని షెహబాబ్ షరీఫ్ ముందస్తు ప్రకటనలు చేయడం గమనార్హం. ఎల్ఎన్జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) సరఫరా ఇబ్బందికరంగా మారిందని, అయితే ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు. మరోవైపు మునుపెన్నడూ లేని విధంగా జూన్ నెలలో.. నాలుగు ఏళ్ల తర్వాత అధికంగా చమురు ఇంధనాలను పాక్ దిగుమతి చేసుకుంది. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో సహజవాయువు విషయంలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
పోలీసుకు తన ‘పవర్’ చూపాడు.. ఏకంగా పోలీస్ స్టేషన్‌కే పవర్ కట్
లక్నో: అధికారం ఉంది కదా అని ఎవరితోనైనా ఆటాడుకోవచ్చనుకుంటే ఏమవుతుంది.. ఒక్కోసారి అదే అధికారం రివర్స్ దాడి చేస్తుంది! ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఇటీవల భగవాన్ స్వరూప్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మోదీసింగ్ అనే పోలీసు అధికారి అతన్ని ఆపాడు. బండి కాగితాలు చూపాలని అడిగాడు. అయితే అత్యవసర పని మీద వెళ్తున్నందున కాగితాలు వెంట తెచ్చుకోవడం మరచిపోయానని స్వరూప్ బదులిచ్చాడు. కావాలంటే ఇంటికి వెళ్లి కాగితాలు తీసుకొచ్చి చూపుతానని బతిమిలాడాడు. కానీ ఆపింది పోలీసు కదా.. అదేం కుదరదని తేల్చిచెప్పాడు. రూ. 500 జరిమానా కట్టాలంటూ చలాన్ వేశాడు. మోదీసింగ్ చర్యతో స్వరూప్ రగిలిపోయాడు. అసలే ‘కరెంటోడు’ కావడంతో పోలీ'సులకు తన స్టయిల్లో గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఇంకేముంది.. తన సహచర విద్యుత్ సిబ్బందితో కలసి వెళ్లి మోదీసింగ్ పనిచేసే హర్దాస్పూర్ పోలీసుస్టేషన్‌కు పవర్ కట్ చేసి పారేశాడు! ఎందుకిలా చేశావని.. మీడియా ప్రతినిధులు అడిగితే పోలీసుస్టేషన్ సిబ్బంది విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని... అందుకే విద్యుత్ సరఫరా నిలిపివేశానని చెప్పుకొచ్చాడు. చదవండి: రెండో రోజు విచారణకు రాహుల్ గాంధీ.. ఢిల్లీలో ఆంక్షలు -
విద్యుత్ కోతల్లేవు.. ‘ప్రైవేటు’ కుట్రల్లేవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కోతలు లేవని ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్ స్పష్టంచేశారు. పల్లెల్లో కోతలంటూ జరుగుతున్న ప్రచారం పచ్చి అబద్ధమని చెప్పారు. 4వ తేదీన మాత్రమే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో గ్రిడ్ భద్రత దృష్ట్యా కేవలం కొన్ని గంటలు లోడ్ రిలీఫ్ విధించాల్సి వచ్చిందని తెలిపారు. కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో బూడిదను బయటికి పంపడంలో ఏర్పడ్డ సాంకేతిక సమస్యపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ఈ ప్లాంటును ప్రైవేటీకరించడానికే హాఫర్స్‌ను కూల్చారన్నది అవాస్తవమని వివరించారు. ఈ ప్లాంట్‌ను ఆదానీకి అప్పగిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. శ్రీధర్ సోమవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు తీవ్రంగా ఉండి, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పటికీ అతి తక్కువ కోతలతో విద్యుత్ సరఫరా చేశాం. ఏప్రిల్ 15 నుంచి పరిశ్రమలకు పవర్ హాలిడే కూడా ఎత్తేశాం. ఆ తరువాత రోజుకి 180 నుంచి 190 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండేది. ఉష్ణోగ్రతలు పెరిగి, గృహ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండటంతో నాలుగు రోజులుగా డిమాండ్ అనూహ్యంగా 225 ఎంయూకు పైగా ఉంది. ఈ నెల 4న 224 ఎంయూ డిమాండ్ ఉంది. అయినా అంతమేరకు విద్యుత్ సరఫరా చేశాం. అయితే పవన విద్యుత్ 800 మెగావాట్లు పడిపోయింది. బయటి మార్కెట్లో దొరకలేదు. ఫలితంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య పీక్ అవర్స్‌లో 4.6 ఎంయూ లోటు ఏర్పడింది. అప్పటికే సెంట్రల్ గ్రిడ్ నుంచి అదనంగా విద్యుత్ తీసుకున్నాం. ఇంకా తీసుకుంటే గ్రిడ్ కూలిపోతుంది. దీంతో 2 నుంచి 3 గంటలు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్ఆర్) అమలు చేయాల్సి వచ్చింది. అంతేతప్ప అది విద్యుత్ కోత కాదు. విదేశీ బొగ్గుతో నడిచే కృష్ణపట్నం ప్లాంట్‌కు టన్ను రూ.24 వేలు చొప్పున 18 లక్షల టన్నులను అదానీ సంస్థ సరఫరా చేస్తుంది. స్వదేశీ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేసే డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీసీ), రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లకు 13 లక్షల బొగ్గును టన్ను రూ.19,500కు చెట్టినాడు సంస్థ సమకూరుస్తుంది. ఈ రెండు టెండర్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుమతితో ఖరారు చేశాం. జూలై మొదటి వారం నుంచి బొగ్గు సరఫరా మొదలవుతుంది. మన దగ్గర విద్యుత్ ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలకు ఇచ్చి, వారి దగ్గర ఉన్నప్పుడు తీసుకునే ఏర్పాటు చేస్తున్నాం. అవసరమైనప్పుడు కొనేలా షార్ట్‌టర్మ్ టెండర్లు పిలుస్తున్నాం. కృష్ణపట్నం ప్లాంటుకు క్వాలిటీ బొగ్గు కావాలి. దీని నుంచి వచ్చే ఫ్లైయాష్‌ను సిమెంటు కంపెనీలు తీసుకోవడంలేదు. రెండేళ్లుగా పెన్నా సిమెంట్ మాత్రమే 40శాతం తీసుకుంటోంది. స్థానికంగా వాడేది 10శాతం. మిగిలిన 50శాతాన్ని యాష్‌పాండ్‌లోకి పంపుతుంటారు. పైపు నుంచి బూడిద వెళుతున్నప్పుడు దానిలోని ఎలక్ట్రోడ్స్ను ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ (ఈఎస్పీ) సేకరించి కిందకు పంపుతుంది. ఎక్కువ బూడిద రావడంతో ప్లేట్స్ (హాఫర్స్) కింద పడిపోయాయి. దీంతో ప్లాంటును నిలిపివేయాల్సి వచ్చింది. దీనిపై డైరెక్టర్, చీఫ్ ఇంజనీర్, ఎస్ఈ బృందంతో విచారణ చేయిస్తున్నాం. ఇది సాంకేతిక సమస్యే తప్ప ఎలాంటి కుట్రా లేదు. కృష్ణపట్నం ప్లాంటును ప్రైవేటీకరించం. ప్లాంట్ నిర్వహణకు మనకు పడుతున్న కాస్ట్కంటే తక్కువకు ఎవరైనా ఇస్తామంటే పారదర్శక టెండర్ల ద్వారా ఓ అండ్ ఎం విధానంలో అప్పగిస్తాం. దీనివల్ల యూనిట్ రేటు తగ్గి వినియోగదారులకే మేలు జరుగుతుంది. ఎస్బీఐ కాప్స్ బిడ్ డాక్యుమెంట్ తయారు చేసి టెండర్ల ప్రక్రియకు సహకరించేందుకు ఈరోజే ఆదేశాలిచ్చాం. ప్లాంటులో ఉద్యోగులంతా ఏపీ జెన్కో నుంచి డిప్యుటేషన్‌పై వెళ్లినవారే. వారు అభద్రతకు గురి కావద్దు. -
ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ కోతల్లేవు.. పవన్ కరెంట్ ఆపేశారు
సాక్షి, విశాఖపట్నం/తగరపువలస (భీమిలి) :రాష్ట్రంలో కరెంట్ కోతల్లేవని.. పవర్ హాలిడే ఎప్పుడో ఎత్తేశామని రాష్ట్ర మైనింగ్, అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టంచేశారు. చంద్రబాబు డైరెక్షన్లో జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ కూడా ముందస్తు ప్రణాళికలో భాగంగా పవర్ నిలిపివేసి మొబైల్ ఫోన్ లైట్లలో మీటింగ్ నిర్వహించారన్నారు. విశాఖలో పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి విద్యుత్, మైనింగ్, అటవీశాఖ అధికారులతో శనివారం పెద్దిరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రామకుప్పంలో చంద్రబాబు కాగడాల ప్రదర్శన కోసం ఉద్దేశపూర్వకంగా విద్యుత్ సరఫరాను నిలిపివేసి ర్యాలీ చేపట్టారని.. ఆ అడుగుజాడల్లోనే శుక్రవారం పవన్‌కల్యాణ్ కూడా నడిచారని ఎద్దేవా చేశారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకం విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు తమ పార్టీ ముందు నుంచీ వ్యతిరేకమని పెద్దిరెడ్డి అన్నారు. తవ్వకాలు జరపవద్దని వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదాలో చెప్పారని.. అలాగే, నాటి ప్రజా సంకల్పయాత్రలోనే గిరిజనులకు హామీ కూడా ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. కోర్టు కూడా మాకు అనుకూలంగానే తీర్పు ఇవ్వడం సంతోషకరంగా ఉందన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతివి తప్పుడు రాతలు మంత్రి కారుమూరి మాట్లాడుతూ.. తాడేపల్లిగూడెం నియోజకవర్గం చెట్లపాలెంలో ధాన్యం కొనుగోలు చేయలేదని తప్పుడు రాతలు రాశారని, అధికారులు అక్కడి వెళ్లి ఆరాతీస్తే 25 రోజుల క్రితమే కొనుగోలు చేసినట్లు తేలిందన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో తప్పుడు వార్తలు రాశారని మంత్రి మండిపడ్డారు. ఈనాడు పత్రికలో రైతు ప్రమేయం లేకుండా ఫొటోవేసి అభిప్రాయం రాశారని విమర్శించారు. పోలవరం పూర్తిచేస్తే టీడీపీ పోటీచేయదా.. అనంతరం.. తగరపువలస చిట్టివలస బంతాట మైదానంలో భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జీవీఎంసీ భీమిలి జోన్ 1, 2, 3 వార్డులకు చెందిన 3,190 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడారు. రానున్న రెండేళ్లలో సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పోలవరం పనులు పూర్తిచేస్తే 2024 ఎన్నికల్లో టీడీపీ పోటీచేయదా అని ప్రశ్నించారు. అవినీతికి తావులేకుండా, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తుంటే అభివృద్ధి జరగలేదని టీడీపీ ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. -
Sakshi Cartoon: శ్రీలంకలో రోజుకు 15 గంటల కరెంట్ కోత
శ్రీలంకలో రోజుకు 15 గంటల కరెంట్ కోత -
ఏపీలో నిరంతరాయంగా విద్యుత్ పంపిణీ
-
ఏపీలో ఇక నిరంతరాయ విద్యుత్ సరఫరా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కానుంది. మరోవైపు పరిశ్రమలకు విద్యుత్ కోతల వేళలు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మే 9 నుంచి పరిశ్రమలకు పవర్ హాలిడే ఉపసంహరణ కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఈ నెల 16వ తేదీ నుంచి పరిశ్రమలకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా ఇస్తున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు కొరత వలన కొద్దిరోజుల పాటు పరిశ్రమలకు విద్యుత్ పంపిణీ లో సమస్యలు తలెత్తాయని, ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడటంతో అన్ని రంగాల వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. -
వధువు చెల్లిని పెళ్లి చేసుకున్న వరుడు... షాక్‌లో బంధువులు
Bride marries sister's groom: ఇటీవల కాలంలో వివాహాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. వధువు వరుడుకి సర్ప్రైజ్ ఇచ్చేలా డ్యాన్స్‌లు చేయడం వంటివి ఇటీవల పెద్ద ట్రెండ్ అయిపోయింది. ఇదంతా ఒకత్తైయితే ఒకేసారి వివాహం చేసుకుంటున్నామని ఆనందంగా ఉన్న ఈ అక్కాచెల్లెళ్లకు ఒక ఊహించని చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకెళ్తే... మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రమేష్ లాల్ అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలు నికిత, కరిష్మాలకు వేర్వేరు కుటుంబాలకు చెందిన యువకులతో వివాహం నిశ్చయించాడు. ఈ మేరకు రమేష్ తన కుమార్తెలిద్దరికి ఒకేసారి వివాహం నిర్వహించాడు. ఐతే సరిగ్గా పెళ్లితంతు సమయంలో కరెంట్ పోయింది. అదీగాక వధువరులు మేలి ముసుగు ధరించి ఉన్నారు. పైగా ఒకేరకమైన పెళ్లి దుస్తులు ధరించడంతో ముహుర్త ఘట్టం వద్దకు వచ్చే వరకు కూడా అక్కడున్న బంధువులెవరికీ ఎవరూ ఎవర్నీ పెళ్లి చేసుకుంటున్నారో అర్థం కాలేదు. అయితే ఇంతలో వివాహతంతు కూడా ముగిసిపోయింది. ఆయా జంటలకు కూడా తమ తమ ఇంటికి చేరుకునేవరకు తాము ఎవర్ని పెళ్లి చేసుకున్నాం అనేది తెలియకపోవడం విచిత్రం. పాపం ఆయా కుటుంబాల వాళ్లు కూడా వధువరులు మారిపోయారనే విషయాన్ని వివాహతంతు ముగిసిపోయే వరకు గుర్తించలేదు. దీంతో కాసేపు ఆయా కుటుంబాల మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. ఐతే ఆయా జంటలు మరోసారి వివాహం జరిపించాలని పెద్దలను కోరడంతో ఆ గొడవ కాస్త సద్దుమణిగింది. (చదవండి: పారిపోతూ.. విధి నుంచి తప్పించుకోలేకపోయాడు) -
కరెంట్ కష్టాలకు చెక్.. పునరుత్పాదక విద్యుత్‌కు ప్రణాళిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్ముందు కరెంట్ కష్టాలు తలెత్తకుండా.. పుష్కలంగా విద్యుత్ అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న విద్యుత్ కొరత నేపథ్యంలో రాష్ట్రానికి విద్యుత్ భద్రత కల్పించే లక్ష్యంతో 33,240 మెగావాట్ల భారీ సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ (పీఎస్పీ) ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉండే నీటి వనరులను ఉపయోగించుకుని పంప్డ్ హైడ్రో స్టోరేజీ, సౌర, పవన విద్యుత్‌ల కలయికగా ఈ అధునాతన ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో రాష్ట్రానికి పుష్కలంగా నిరంతర విద్యుత్ అందుబాటులోకి రావడంతో పాటు ఇంధన రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు రానున్నాయి. అంతేకాక.. మన విద్యుత్ అవసరాలు తీర్చుకుంటూనే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే అవకాశం ఉండటంతో, రాష్ట్రానికి ఆదాయం సమకూరనుంది. రిపోర్టులన్నీ సిద్ధం.. రాష్ట్రంలో మొత్తం 29 చోట్ల 33,240 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించనున్న ఈ పీఎస్పీ ప్రాజెక్టులకు సంబంధించి టెక్నో కమర్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్‌లను అధికారులు రూపొందించారు. మొదటి దశలో 6,600 మెగావాట్ల సామర్థ్యంతో ఏడుచోట్ల నిర్మించే ప్రాజెక్టుల డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను తయారుచేస్తున్నారు. వీటిలో నాలుగు రిజర్వాయర్ల ఆధారిత ఆన్ రివర్ ప్రాజెక్టులు కాగా.. మరో మూడు ఆఫ్ రివర్ ప్రాజెక్టులని అధికారులు చెబుతున్నారు. ఇక మొదటి దశలో ఏర్పాటుచేసే ప్రాజెక్టుల ఫీజిబిలిటీ రిపోర్టులను కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్లకు అధికారులు పంపించారు. గండికోట, కురుకుట్టి, కర్రివలసల్లో ఏర్పాటుచేసే పీఎస్పీ ప్రాజెక్టులకు సంబంధించి డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (డీజీపీఎస్) సర్వేను పూర్తిచేశారు. అలాగే.. చిత్రావతి, గండికోట, సోమశిల, కురుకుట్టి, కర్రివలసలలో ఏర్పాటుచేసే ప్రాజెక్టులకు జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లు జరుగుతున్నాయి. రెండో దశలో ఏర్పాటుచేసే ప్రాజెక్టుల ఫీజిబిలిటీ రిపోర్టులను కూడా న్యూ–రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) అధికారులు రూపొందిస్తున్నారు. ఆదాయంతోపాటు యువతకు ఉపాధి ప్రతి వినియోగదారునికి ఇరవై 4 గంటలూ విద్యుత్ సరఫరాను అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి పీఎస్పీ ప్రాజెక్టులు దోహదపడతాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెన్యువబుల్ ఇంధన ఎగుమతి విధానం కింద పీఎస్పీ ప్రాజెక్టుల్లో తయారయ్యే విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడం ద్వారా రాష్ట్రానికి ఆదాయం లభిస్తుంది. అదే విధంగా వీటివల్ల యువతకు ఉపాధి లభిస్తుంది. – ఎస్ రమణారెడ్డి, వైస్‌చైర్మన్/ఎండీ, ఎన్ఆర్ఈడీసీఏపీ -
కుప్పంలో టీడీపీ నేతల ‘కరెంట్ డ్రామా’
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వంపై బురద జల్లడానికి కుప్పం(చిత్తూరు) టీడీపీ నేతలు ఎన్నిరకాల అడ్డదారులు తొక్కాలో.. అన్ని దారుల్లోనూ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కరెంట్ కోతల డ్రామాను తెర మీదకు తీసుకొచ్చారు. ఒక పథకం ప్రకారం రాత్రివేళల్లో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను బంద్ చేయిస్తున్న పచ్చ నేతలు.. ఆ వెంటనే కరెంట్ లేదంటూ కొవ్వొత్తులతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అయితే అసలు విషయం వెలుగు చూడడంతో ఇప్పుడు నీళ్లు నములుతున్నారు. ఇక ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లోనే నడుస్తున్న డ్రామా అంటున్నారు స్థానిక నేతలు. విషయం వెలుగులోకి రావడంతో ఈ కుట్ర వెనుక ఉన్న టీడీపీ నేతపై కేసు నమోదు అయ్యింది. అంతేకాదు.. విద్యుత్ సరఫరాను నిలిపివేసిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. -
‘చీకటి’ రాజకీయంపై విచారణకు ఆదేశం
శాంతిపురం/తిరుపతి రూరల్: టీడీపీ నాయకులు ప్రమాదం పేరిట విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయించి, విద్యుత్ కోతలపై నిరసనలకు దిగిన వ్యవహారంపై ఎస్పీడీసీఎల్ సీరియస్‌గా స్పందించింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్టు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ హరనాథరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. టీడీపీ నాయకులు శుక్రవారం రాత్రి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కెనమాకులపల్లిలో షార్ట్ సర్క్యూట్ జరిగిందని శాంతిపురం సబ్‌స్టేషన్‌కు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలుపుదల చేయించారు. కరెంటు పోగానే విద్యుత్ కోతలకు నిరసనగా గ్రామంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈ విషయం ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ఎమ్మెల్సీ భరత్.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎస్పీడీసీఎల్ విచారణకు ఆదేశిస్తూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.హరిని విచారణ అధికారిగా నియమించింది. ఘటనతో సంబంధం ఉన్న షిఫ్ట్ ఆపరేటర్‌ను తొలగించేందుకు ఆదేశాలిచ్చారు. విచారణ నివేదిక అందిన తర్వాత బాధ్యులైన ఇతర అధికారులు, ప్రైవేటు వ్యక్తులపై చర్యలకు సిఫార్సు చేస్తారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు, సిబ్బందిని ఆదేశిస్తున్నట్టు పేర్కొన్నారు. -
16 రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు.. ఆరేళ్ల తరువాత తీవ్ర విద్యుత్ కొరత
సాక్షి, అమరావతి: విపరీతమైన వేడిగాలులు ఉక్కపోతతో ఆరేళ్ల తరువాత యావత్ దేశం తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంటోంది. బొగ్గు నిల్వలూ తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. దేశంలో పీక్–పవర్ డిమాండ్ గురువారం గరిష్ట స్థాయికి చేరుకుంది. వచ్చే నెలలో ఇది 8 శాతం వరకు పెరగనుంది. ఏప్రిల్ మొదటి 27 రోజుల్లో విద్యుత్ సరఫరా డిమాండ్ కంటే 1.88 బిలియన్ యూనిట్లు (1.6 శాతం) తగ్గింది. ఇదీ వివిధ రాష్ట్రాల్లో పరిస్థితి.. ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి విద్యుత్ సరఫరాచేసే పవర్ ప్లాంట్లలో బొగ్గు కొరత ఏర్పడే అవకాశముందని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి సత్యేందర్ జైన్ చెప్పినదాని ప్రకారం.. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌కు చెందిన దాద్రీ–2, ఝజ్జర్ (ఆరావళి) పవర్ ప్లాంట్లలో బొగ్గు కొరత ఏర్పడింది. దాద్రీలో ఒక రోజుకు మాత్రమే నిల్వలు ఉన్నట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. హరియాణా: గరిష్ట విద్యుత్ డిమాండ్ దాదాపు 9 వేల మెగావాట్లకు చేరుకోగా, సరఫరా దాదాపు 1,500 మెగావాట్లు తగ్గింది. 33.72 మిలియన్ యూనిట్ల కొరత కారణంగా గురుగ్రామ్‌లో 4–6 గంటల పాటు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర అవసరాలకు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి అదనపు విద్యుత్‌ను తీసుకోవాలని హరియాణా నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్: దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఈ రాష్ట్రంలో 3 వేల మెగావాట్ల లోటు ఉంది. దాదాపు 23 వేల మెగావాట్ల డిమాండ్ ఉంటే, సరఫరా 20 వేల మెగావాట్లు. 29.52 మిలియన్ యూనిట్ల కొరతవల్ల గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో లోడ్ షెడ్డింగ్ ఏర్పడింది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో సగటున 15 గంటల 7 నిమిషాలపాటు విద్యుత్ సరఫరా అవుతోంది. బిహార్: డిమాండ్ అకస్మాత్తుగా పెరగడంతో బిహార్ రోజుకు 200–300 మెగావాట్ల విద్యుత్ లోటును ఎదుర్కొంటోంది. రాష్ట్ర వినియోగం రోజుకు 6 వేల మెగావాట్లు కాగా వివిధ వనరుల నుండి 5,000–5,200 మెగావాట్లు అందుబాటులో ఉంటోంది. 15.90 మిలియన్ యూనిట్ల కొరత ఉంటోంది. రాజస్థాన్: విద్యుత్ డిమాండ్ 31 శాతం పెరిగింది. దీంతో విద్యుత్ కొరత 43.59 మిలియన్ యూనిట్లు ఏర్పడింది. ఇది రోజుకు 5 నుండి 7 గంటల విద్యుత్ కోతలకు దారితీసింది. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయి. కేరళ: ఈ రాష్ట్రంలో గురువారం నుంచి కరెంటు కోతలు మొదలయ్యాయి. బొగ్గు సంక్షోభం కారణంగా ఉత్పత్తి 400 మెగావాట్లు తగ్గడంతో విద్యుత్ కోత విధించాలని రాష్ట్ర విద్యుత్ బోర్డు నిర్ణయించింది. పంజాబ్: విద్యుత్ డిమాండ్ 40 శాతం పెరిగిందని ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో అన్ని వనరుల నుండి విద్యుత్ సరఫరా లభ్యత 1,679 లక్షల యూనిట్లు కాగా 30.65 మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడింది. రోపర్ థర్మల్ ప్లాంట్‌లో 8.3 రోజులు, లెహ్రా మొహబ్బత్ ప్లాంట్‌లో నాలుగు రోజులు, జీవీకేలో 2.4 రోజులకు సరిపడా మాత్రమే బొగ్గు ఉంది. వీటితోపాటు జమ్మూకశ్మీర్‌లో 5.28 మిలియన్ యూనిట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 6.71 మి.యూ, మధ్యప్రదేశ్‌లో 13.72 మి.యూ, జార్ఖండ్‌లో 5.78 మి.యూ, ఒడిశాలో 2.69 మి.యూ, తమిళనాడులో 1.60 మి.యూ కొరత ఏర్పడింది. అలాగే, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ వంటి రాష్ట్రాలు సైతం విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో రోజుకి 2–8 గంటల మేర విద్యుత్ కోత విధిస్తున్నారు. ఏపీలో ఇదీ పరిస్థితి.. ఇక ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ డిమాండ్ 8.33 శాతం పెరిగింది. రోజువారీ డిమాండ్ 230 మిలియన్ యూనిట్లు ఉండగా 215 మిలియన్ యూనిట్లు సరఫరా జరుగుతోంది. వ్యవసాయ విద్యుత్ వినియోగం కాస్త తగ్గినప్పటికీ వేసవి కారణంగా గృహ విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో డిమాండ్ తగ్గడంలేదు. థర్మల్ నుంచి 78.40 మి.యూ, సెంట్రల్ గ్యాస్ స్టేషన్ల నుంచి 37.82 మి.యూ, హైడ్రో 6.52 మి.యూ, గ్యాస్, సెయిల్ 8.74 మి.యూ, విండ్ 13.70 మి.యూ, సోలార్ 24.45 మి.యూ, హిందుజా 11.55 మి.యూ, ఇతర ఉత్పత్తి కేంద్రాలు 1.64 మిలియన్ యూనిట్లు చొప్పున అందిస్తున్నాయి. పవర్ ఎక్స్ఛేంజ్ల నుంచి 32.73 మిలియన్ యూనిట్లను రూ.12 నుంచి రూ.20 (యూనిట్) చొప్పున కొనుగోలు చేసి వినియోగదారులకు అందిస్తున్నారు. -
కరెంటుకు కటకట
న్యూఢిల్లీ: మండే ఎండలతో ఓవైపు అల్లాడుతున్న జనానికి కరెంటు కోతలు చుక్కలు చూపిస్తున్నాయి. ఢిల్లీ, రాజస్తాన్, పంజాబ్, యూపీ సహా 16కి పైగా రాష్ట్రాల్లో డిమాండ్ పీక్స్‌కు చేరింది. సరిపడా కరెంటు పంపిణీ చేయలేకపోవడంతో గంటల తరబడి కోతలు కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా కరెంటు వాడకం భారీగా పెరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 2:50 గంటలకు దేశ చరిత్రలోనే అత్యధికంగా 207.11 గిగావాట్లకు చేరిందని కేంద్ర విద్యుత్ శాఖ ట్వీట్ చేసింది. కేంద్రం చేతగానితనమే విద్యుత్ సంక్షోభానికి కారణమంటూ కాంగ్రెస్ నేత రాహుల్ మరోసారి దుయ్యబట్టారు. ‘‘మోదీ జీ! దేశమన్నా, ప్రజలన్నా మీకు అస్సలు పట్టదా?’’ అంటూ నిలదీశారు. ఇకనైనా విద్వేషపు బుల్డోజర్లను ఆపి విద్యుత్కేంద్రాలను నిరంతరాయంగా నడపడంపై దృష్టి పెట్టాలన్నారు. ఢిల్లీలో ఒక్క రోజు బొగ్గు నిల్వలే థర్మల్ విద్యుత్‌పైనే అత్యధికంగా ఆధారపడ్డ నేపథ్యంలో విద్యుత్కేంద్రాలకు బొగ్గు సకాలంలో అందక సంక్షోభం ముంచుకొచ్చింది. ఢిల్లీలో ఒక్క రోజుకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలున్నాయి. బొగ్గు అందకుంటే ఆస్పత్రులకు, మెట్రోకు కరెంటివ్వలేమని కేజ్రివాల్ ప్రభుత్వం పేర్కొంది. ‘‘ఇప్పటిదాకా ఎలాగోలా సర్దుబాటు చేశాం. పరిస్థితులు చెయ్యి దాటుతున్నాయి’’ అంటూ కేజ్రివాల్ ట్వీట్ చేశారు. విద్యుత్కేంద్రాలకు బొగ్గు పంపిణీకి వీలుగా 657 పాసింజర్ రైళ్లను కేంద్రం నిరవధికంగా రద్దు చేసింది. వాటికి బదులు యుద్ధప్రాతిపదికన బొగ్గు వాగన్లను రవాణా చేస్తామని రైల్వే శాఖ పేర్కొంది. 165 థర్మల్ విద్యుత్కేంద్రాలకు గాను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రోజువారీ బొగ్గు నిల్వల నివేదిక ప్రకారం 56 కేంద్రాల్లో 10% బొగ్గు నిల్వలే ఉన్నాయి. 26 కేంద్రాల్లోనైతే 5% కంటే తక్కువకు పడిపోయాయి. బొగ్గు నిల్వలు 21 రోజులకు సరిపడా లేకుంటే నిరంతరాయ విద్యుత్ పంపిణీ వీలు పడదు. కేంద్రం వర్సెస్ కేజ్రివాల్ ఢిల్లీలో డిమాండ్ రోజుకు 6 వేల మెగావాట్లకు పెరగడంతో పంపిణీ కష్టంగా మారింది. బొగ్గు నిల్వలు ఒక్క రోజుకు సరిపడా మాత్రమే ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వం చెప్పగా, అదేమీ లేదంటూ ఎన్టీపీసీ ట్వీట్ చేసింది. ‘‘ఢిల్లీకి కరెంటు సరఫరా చేసే ఉంచహార్, దాద్రి విద్యుత్కేంద్రాలు 100% సామర్థ్యంతో పని చేస్తున్నాయి. బొగ్గు పంపిణీ సక్రమంగానే జరుగుతోంది. దాద్రిలో 1.4 లక్షల మెట్రిక్ టన్నులు, ఉంచహార్లోని ఐదు యూనిట్లలో 95 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి’’ అని చెప్పింది. -
ఢిల్లీలో దంచికొడుతున్న ఎండలు.. కీలక వ్యవస్థలకు 24 గంటల కరెంట్ కష్టమే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం డేంజర్స్ బెల్స్ మోగిస్తోంది. హీట్ వేవ్ కారణంగా దేశరాజధానిలో విద్యుత్ డిమాండ్ తారాస్థాయికి చేరడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మెట్రో, హాస్పిటల్స్ వంటి కీలక వ్యవస్థలకూ నిరంతర విద్యుత్ అందించడం సాధ్యంకాదని ప్రభుత్వం హెచ్చరించింది. బొగ్గు కొరత కారణంగా దాద్రీ-2, ఊంచహార్ పవర్ స్టేషన్స్ నుంచి కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని... ఇది ఇలాగే కొనసాగితే, ఢిల్లీ మెట్రోతోపాటు ప్రభుత్వ హాస్పిటల్స్, ఇతర కార్యాలయాలకు 24 గంటలు విద్యుత్ అందించడం కుదరదని కేజ్రీవాల్ సర్కార్ స్పష్టంచేసింది. విద్యుత్ సంక్షోభాన్ని నివారించేందుకు బొగ్గు సరఫరా కోసం ఢిల్లీ సర్కార్ కేంద్రం తలుపు తట్టింది. తక్షణమే బొగ్గు సరఫరా పెంచాలంటూ ఈమేరకు ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ కేంద్రానికి లేఖ రాశారు. ఢిల్లీ విద్యుత్ అవసరాల్లో 25 నుంచి 30శాతం థర్మల్ పవర్ స్టేషన్స్ నుంచే వస్తోందని వివరించారు. కేజ్రీవాల్ ప్రభుత్వ వినతిమేరకు ఢిల్లీకి బొగ్గు సరఫరాను పెంచేందుకు కేంద్రం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. బొగ్గు రవాణా చేసే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా కొన్ని ప్రయాణికుల రైళ్లను రద్దు చేసినట్లు భారత రైల్వే వెల్లడించింది. చదవండి👉🏻పంజాబ్: శివసేన, సిక్కు వర్గాల మధ్య ఘర్షణలు, వీడియోలు వైరల్ ఫుల్ డిమాండ్ ఏప్రిల్ నెలలో తొలిసారిగా రోజువారీ పవర్ డిమాండ్ 6వేల మెగావాట్ల మార్క్‌ను టచ్ చేసింది. తగినంత బొగ్గు నిల్వలు లేకపోవడంతో .. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేసే దాద్రీ -2 పవర్ స్టేషన్లో కేవలం ఒక్కరోజుకు సరిపడా బొగ్గు నిల్వలే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. దాద్రీ-2 నుంచి ఢిల్లీకి 1751 మెగావాట్ల విద్యుత్ అందుతోంది. ఇక్కడ ఉత్పత్తి నిలిచిపోతే ఢిల్లీలో బ్లాకౌట్ కావడం ఖాయం అంటున్నారు నిపుణులు. చదవండి👉🏼 పెట్రోల్ ధరలు చాలా తక్కువ పెంచాం: కేంద్ర మంత్రి -
కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'ఏపీలో విద్యుత్ కోతలు లేవు. బొగ్గు అధికంగా కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రోడ్లు బాగుపడ్డాయి. ఎన్నికలు సమీపిస్తున్నందునే కేటీఆర్ అలా మాట్లాడి ఉండొచ్చు. ఏపీలో పరిస్థితి బాగాలేదు.. తెలంగాణలో అంతా బాగుందంటే ఓట్లు పడొచ్చని కేటీఆర్ భావించారేమోనని' మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చదవండి: (ఏపీకి పెండింగ్ బకాయిలు చెల్లించండి: సుప్రీంకోర్టు) -
ట్రాన్స్‌కో పటిష్టతతోనే విద్యుత్ సమస్యలకు చెక్
సాక్షి, అమరావతి: విద్యుత్ సమస్యలకు చెక్ పెట్టి, ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలంటే ఏపీ ట్రాన్స్‌కో పటిష్టంగా ఉండాలని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నారు. ఆయన సోమవారం సచివాలయంలో ట్రాన్స్‌కో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో రూ.3,897.42 కోట్లతో జరుగుతున్న పనులను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. వీటిలో వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.223.47 కోట్లతో, గ్రీన్ ఎనర్జీ కారిడార్ కోసం రూ.941.12 కోట్లతో, విశాఖపట్నం–చెన్నై కారిడార్‌లో రూ.605.56 కోట్లతో పనులు జరుగుతున్నాయని వివరించారు. మూడు జోన్లలో సిస్టమ్ ఇంప్రూవ్‌మెంట్‌లో భాగంగా రూ.762.53 కోట్ల పనులు, అలాగే 400 కేవీ సామర్థ్యంతో కూడిన విద్యుత్ సరఫరా కోసం రూ.1,257.56 కోట్ల పనులు, ఇతరత్రా రూ.107.18 కోట్ల పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఎస్ఎస్ఆర్పై కమిటీ ట్రాన్స్‌కో చేపట్టిన పనులకు సంబంధించి ఏటా స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ (ఎస్ఎస్ఆర్)పై రివిజన్ జరగాలని సూచించారు. ఇందుకోసం వెంటనే కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్, ట్రాన్స్ కో జేఎండీ పృధ్వీతేజ్, డిప్యూటీ సెక్రటరీ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు సకాలంలో అనుమతులు రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి, నిర్మాణ పనులకు సకాలంలో నిబంధనలకు అనుగుణంగా అనుమతులివ్వాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం అటవీ శాఖ, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, ఎస్ఎస్ఏ, జెన్కో, ట్రాన్స్‌కో, ఏపీఐఐసీ తదితర ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన పనులు అటవీ ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయన్నారు. అటవీ శాఖ నుంచి అనుమతులు రాకపోవడం వల్ల ఆయా పనులు ముందుకు సాగడం లేదనే ఫిర్యాదులొస్తున్నాయని తెలిపారు. ఫారెస్ట్ కన్సర్వేటివ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ విభాగాలు అవసరమైన అనుమతులు పొందడంలో అలసత్వం వహిస్తున్నాయన్నారు. అడవులు, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ప్రసాద్, అటవీ దళాల అధిపతి ప్రతీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కొరతపై ‘కోర్ కమిటీ’
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా తీవ్రంగా ఉన్న బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్ కొరతను మే మొదటి వారానికల్లా అధిగమించేందుకు ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు అన్నిరకాల చర్యలు చేపడుతున్నాయి. దీన్లో భాగంగా రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు బొగ్గు లభ్యత పెంచడం, విద్యుత్ కొరతను అధిగమించడం వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేకంగా ఒక డైరెక్టర్ (బొగ్గు)ను నియమించింది. ఇప్పటివరకు ఏపీజెన్కో డైరెక్టర్లే ఈ బాధ్యతలు కూడా చూసేవారు. కానీ ఇప్పుడు ప్రత్యేకాధికారితోపాటు ఉన్నతాధికారులతో ఒక కోర్ మేనేజ్మెంట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్ పర్యవేక్షణలో పరిశ్రమలకు కూడా మే మొదటివారానికి పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్దరించాలనే లక్ష్యంతో ఈ బృందం పనిచేయనుంది. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో రెండు నుంచి ఐదురోజులకు సరిపడా బొగ్గునిల్వలు మాత్రమే ఉన్నాయి. నిబంధనల ప్రకారం థర్మల్ ప్లాంట్‌లో 24 రోజులకు సరిపడా బొగ్గునిల్వలు ఉండాలి. అన్ని రాష్ట్రాలు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నాయి. ఫలితంగా డిమాండ్–సరఫరా మధ్య అంతరం బాగా పెరిగిపోయింది. విద్యుత్ ఎక్సే్ఛంజిల్లో గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా యూనిట్ ధర గతేడాది అక్టోబర్ తరువాత మళ్లీ రూ.12 నుంచి రూ.20 వరకు పలుకుతోంది. మన రాష్ట్ర విద్యుత్ సంస్థలు కూడా పీక్ అవర్స్‌లో ఇదే ధర వద్ద విద్యుత్ కొనక తప్పని పరిస్థితి ఏర్పడింది. భారీగా పెరిగిన డిమాండ్ రాష్ట్రంలో వేసవి కారణంగా విద్యుత్ డిమాండ్ అమాంతం పెరిగింది. 2018–19లో 63,605 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా ప్రస్తుతం అది 68,905 మిలియన్ యూనిట్లకు చేరింది. అంటే గతంలో ఎన్నడూ లేనివిధంగా 8.33 శాతం చొప్పున విద్యుత్ డిమాండ్ పెరగింది. అదే సమయంలో బొగ్గు లభ్యత భారీగా పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలోను మన రాష్ట్రంలో గృహ అవసరాలకు నిరంతరం, వ్యవసాయానికి ఏడుగంటలు ఉచిత విద్యుత్ సరఫరాకు ఇబ్బంది తలెత్తకుండా చేసేందుకు విద్యుత్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 23న డిస్కంలు 208 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేశాయి. గత ఏడాది అదే రోజున 192 మిలియన్ యూనిట్లు సరఫరా అయింది. ప్రజలు అర్థం చేసుకుంటారు తప్పని సరై, విధిలేని పరిస్థితుల్లోనే పరిశ్రమలకు విద్యుత్ సరఫరాపై ఆంక్షలు విధించామని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో ఆదివారం మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ వివరాలను రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి మీడియాకు వెల్లడించారు. తాత్కాలికంగా ఏర్పడిన విద్యుత్ కొరత సమస్యను ప్రజలు అర్థం చేసుకుంటారన్న నమ్మకం తమకు ఉందని, నెలాఖరుకల్లా విద్యుత్ కొరత తీరుతుందని మంత్రి చెప్పారు. ఎంత ఖర్చయినా సరే బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ తగినంత విద్యుత్ లభ్యత లేకపోవడమే ప్రధాన సమస్యగా మారిందని పేర్కొన్నారు. విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండే మే–అక్టోబర్ నెలల మధ్య కాలానికి విద్యుత్ సంస్థలు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్ మంత్రికి వివరించారు. విద్యుత్ రంగంపై ప్రతివారం నిర్వహించే సమీక్షల్లో భాగంగా ఏపీ ట్రాన్స్‌కో ప్రాజెక్టులు, నిర్వహణపై సోమవారం సెక్రటేరియట్లో చర్చిస్తానని మంత్రి అధికారులకు చెప్పారు. టెలీకాన్ఫరెన్స్‌లో జేఎండీ ఐ.పృధ్వీతేజ్, గ్రిడ్ డైరెక్టర్ ఎ.వి.కె.భాస్కర్, మూడు డిస్కంల సీఎండీలు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో ఈదురు గాలులతో వర్ష బీభత్సం.. విమానాల దారి మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల్లో ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. గురువారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌లోని పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. కాసేపటికే వర్షంతో పాటు భారీగా ఈదురు గాలులు వీయడంతో పలు కాలనీల్లో కరెంట్ సప్లై నిలిచిపోయింది. pic.twitter.com/AhQYuP9TwH — IMD_Metcentrehyd (@metcentrehyd) April 21, 2022 ఇదిలా ఉండగా.. ఈదురు గాలులు బలంగా వీయడంతో వాతావరణం అనుకూలించక శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో హైదరాబాద్‌కు రావాల్సిన విమానాలను అధికారులు దారి మళ్లిస్తున్నారు. ఇప్పటికే నాలుగు విమానాలను దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. రెండు విమానాలను ఏపీలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు మళ్లించగా.. ఢిల్లీ, ముంబై నుంచి రావాల్సిన విమానాలను బెంగళూరుకు మళ్లించారు. Wow..Rain Start..🌧️🌧️#Hyderabad #Office#Ramoji Film City#rain @HiHyderabad @Hyderabad_Bot @swachhhyd @Ramoji_FilmCity pic.twitter.com/nzBXNC0VCv — Priyanka Sahoo (@Priyank41223414) April 21, 2022 ఇది చదవండి: కంట్రోల్లోనే కరోనా.. మాస్క్‌లు ధరించాల్సిందే!: తెలంగాణ డీహెచ్ -
అక్టోబర్ నుంచే దేశంలో బొగ్గు కొరత: ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్
సాక్షి, విజయవాడ: గత ఏడాది అక్టోబర్ నుంచి దేశంలో బొగ్గు కొరత ఉందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఎక్కడా బొగ్గు సరఫరాకు డబ్బు కొరత లేదు. సమయానికి చెల్లింపులు చేస్తున్నాం. కోల్ ఇండియా వాళ్లకు రూ.150 కోట్లు నిన్న చెల్లించాం. హిందూజకు బొగ్గు సరఫరా చేయాలని కేంద్రానికి లేఖ రాశాం. విద్యుత్ వినియోగం 14 శాతానికి పెరిగింది. దీనికి తోడు బొగ్గు కొరత ఏర్పడింది. సెకితో 2024 వరకు ప్రభుత్వం 7 వేల మెగావాట్ల కోసం ఒప్పందం ఉంది. ఇది రాష్ట్రంలోని 19 లక్షల బోర్లకు ఉపయోగిస్తున్నాము. 2014-15 వరకు డిస్కంలు తెచ్చిన రుణాలు రూ.30 వేల కోట్లు ఉన్నాయి. 2018-19కి ఇవి రూ.62 వేల కోట్లకు పెరిగాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి గత ప్రభుత్వంలో చేసిన అప్పులు పెరిగాయి. 2019 నుంచి ఈ ప్రభుత్వం వచ్చాక డిస్కమ్‌లకు 36 వేల కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారు. బొగ్గు, వినియోగం పెరగడం వల్ల విద్యుత్తు కొరత ఏర్పడింది. నెలాఖరుకి సమస్య పరిష్కారం అవుతుంది' అని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ అన్నారు. చదవండి: (మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై బొత్స కీలక వ్యాఖ్యలు) -
అదుపులోకి విద్యుత్ కొరత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ కొరత క్రమంగా అదుపులోకి వస్తోందని, ఈ నెలాఖరుకల్లా అంతా సర్దుకుంటుందని ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్ అన్నారు. గృహావసరాలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడం తమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టంచేశారు. ఆస్పత్రులకు కరెంట్ కష్టాలు లేకుండా చూడాలని డిస్కమ్‌లకు ఆదేశాలిచ్చామని, పరిస్థితులను అర్ధంచేసుకుని వినియోగదారులు సహకరించాలని కోరారు. బొగ్గు కొరతతో దేశవ్యాప్తంగా విద్యుత్ సమస్య ఏర్పడిందని.. అలాగే, బొగ్గు ధర కూడా విపరీతంగా పెరిగిందన్నారు. ఇక ఈ నెలాఖరుకల్లా కరెంట్ కోతల నుంచి ఉపశమనం కలుగుతుందని శ్రీధర్ ఆశాభావం వ్యక్తంచేశారు. విజయవాడ ఆర్ అండ్ బీ భవనంలో శనివారం ఆయన మీడియాకు రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. విద్యుత్ కొరతకు ఇవే కారణాలు.. దేశవ్యాప్తంగా గతేడాది అక్టోబర్ నుంచి ఏర్పడ్డ బొగ్గు కొరత.. పోస్ట్ కోవిడ్ తర్వాత రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం.. దేశీయంగా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లకు పెరిగిన డిమాండ్ వంటి మూడు ప్రధాన కారణాలవల్ల విద్యుత్ కొరత ఏర్పడింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే బొగ్గు వినియోగం కూడా పెరిగి లభ్యత తగ్గింది. గతంలో రూ.6 వేలకు దొరికిన బొగ్గు ధర ఇప్పుడు రూ.17 వేల నుంచి రూ.40 వేల వరకూ వెళ్లింది. బొగ్గు సరఫరా గురించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానితో మాట్లాడటం, రైల్వే, కోల్, ఎనర్జీ మంత్రిత్వ శాఖలకు లేఖలు రాయడం, ఎంపీలు కూడా వారిని వెళ్లి కలవడంతో బొగ్గు నిల్వలు లేనప్పటికీ మన రాష్ట్రానికి రోజుకి కావాల్సినంత బొగ్గు వస్తోంది. అన్ని రంగాల్లో పెరిగిన వినియోగం 2020 మార్చి–ఏప్రిల్‌లో కోవిడ్ లాక్డౌన్ కారణంగా కేవలం 160 మిలియన్ యూనిట్ల గృహ వినియోగం మాత్రమే ఉండేది. 2021 మార్చి–ఏప్రిల్‌లో 200 నుంచి 210 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. 2022 మార్చి–ఏప్రిల్‌లో కోవిడ్ పరిస్థితి నుంచి బయటపడటం.. అన్ని రంగాల్లోనూ కార్యకలాపాలు పెరగడం.. ఈ ఏడాది మార్చి నుంచే మొదలైన ఎండలవల్ల గృహావసరాల వినియోగం కూడా ఎక్కువగా ఉండడంతో రోజుకి సగటున 235 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతోంది. 20–25 ఎంయూల విద్యుత్ లోటు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినంత వినియోగం ఇప్పుడు ఒక్క మన రాష్ట్రంలో జరుగుతోంది. 2014–15లో రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగం 130 మిలియన్ యూనిట్లు ఉండేది. ఇప్పుడది 190 మిలియన్ యూనిట్లకు చేరింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కలిపి మొత్తం 500 మిలియన్ యూనిట్లు అవసరం. అలాగే, రాష్ట్రంలో సగటున రోజుకి 235 మిలియన్ యూనిట్ల అవసరం ఉండగా, పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న ఏపీ జెన్కో ద్వారా 80 నుంచి 85 ఎంయూ, ఎన్టీపీసీ ద్వారా 45 ఎంయూ, ఐపీపీఎస్ 10 ఎంయూ, సోలార్ 25 ఎంయూ, విండ్ 10 ఎంయూ, ద్వారా అన్నీ కలిపి మొత్తం 175 ఎంయూ వరకూ విద్యుత్ అందుబాటులో ఉంటోంది. ఇంకా 55 మిలియన్ యూనిట్లు లోటు ఉంటోంది. 30 మిలియన్ యూనిట్ల వరకు కొనుగోలు చేస్తున్నాం. మార్చిలో 1,551 మిలియన్ యూనిట్లను యూనిట్‌కి రూ.8.11 చొప్పున రూ.1,058 కోట్లతో విద్యుత్ కొనుగోలు చేశాం. ఇంకా 20–25 ఎంయూ వరకూ లోటు ఉంది. దక్షిణాదిలో కొరత ఎక్కువ పవర్ ఎక్సే్ఛంజ్‌లో విద్యుత్ దొరకని కారణంగా ఇటీవల వ్యవసాయానికి, గృహాలకు కోత విధించాల్సి వచ్చింది. వ్యవసాయానికి పగటిపూట ఏడు గంటల నిరంతర విద్యుత్ ఇవ్వాలని ఆదేశాలిచ్చాం. గృహ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున పరిశ్రమలకు లోడ్ రిలీఫ్ ఇవ్వాలని నిర్ణయించాం. లేదంటే గ్రిడ్‌కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. విద్యుత్ కొరత తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనూ ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు ఇంకా ఎక్కువగా ఉంది. గుజరాత్లో పవర్ హాలిడే ఇచ్చారు. ఇక నిరంతరం నడిచే పరిశ్రమలు 50 శాతం మాత్రమే విద్యుత్ వాడాలనే నిబంధనతోపాటు పరిశ్రమలకు పవర్ హాలిడే వల్ల 10 మిలియన్ యూనిట్ల వరకూ ఆదా అవుతోంది. ఈ మొత్తాన్ని గృహావసరాలకే కేటాయిస్తున్నాం. దీంతో శనివారం కేవలం 4 మిలియన్ యూనిట్లే కోరత ఏర్పడింది. సాగుకు వాడే విద్యుత్ వినియోగం ఈనెల 15 తరువాత తగ్గే అవకాశం ఉంది. అది వస్తే పరిశ్రమలకు యథావిథిగా విద్యుత్ సరఫరా ఉంటుంది. -
AP: విద్యుత్ కోతలు తాత్కాలికమే.. ఇతర రాష్ట్రాలది ఇదే పరిస్థితి
సాక్షి, విజయవాడ: మార్చి నెల నుంచి ఎండలు పెరగడంతోనే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరిగిందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీధర్ అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '2020 మార్చ్ నెలలో 160 మిలియన్ యూనిట్ల కాగా గత ఏడాది 210 మిలియన్ యూనిట్లు ఉంది. ఈ ఏడాది ఇపుడు 240 మిలియన్ యూనిట్లకి చేరుకుంది. ఇంత డిమాండ్ ఉమ్మడి రాష్డ్రంలో ఉండేది. జెన్ కో ద్వారా పూర్తి ఉత్పత్తి జరుగుతోంది. జెన్ కో ద్వారా సగం ఉత్పత్తి మాత్రమే జరుగుతోందని కొన్ని మీడియాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. డిమాండ్‌కి ఉత్పత్తికి దాదాపు 55 మిలియన్ యూనిట్లు తేడా ఉంది. ఏపీలోనే కాదు తెలంగాణా, గుజరాత్ తదితర రాష్ట్రాలు ఇదే సమస్యని ఎదుర్కొంటున్నాయి. మార్చ్ నెలలో రాష్ట్ర అవసరాల కోసం 1551 మిలియన్ యూనిట్లని కొనుగోలు చేశాం. ఇందుకోసం దాదాపు రూ.1250 కోట్లని ఖర్చు చేశాం. బొగ్గు కొరత కారణంగా ఈ సమస్య ఏర్పడింది. విద్యుత్ కొనడానికి సిద్దంగా ఉన్నా దొరకటం లేదు. తప్పని పరిస్ధితులలో పరిశ్రమలకి 15 రోజులపాటు ఆంక్షలు విధించాము. వారంలో ఒకరోజు పరిశ్రమలకి పవర్ హాలిడే ప్రకటించాయి. నెలాఖరునాటికి సాదారణ పరిస్ధితులు వస్తాయని భావిస్తున్నాం. వ్యవసాయ విద్యుత్ వినియోగం నెలాఖరు నుంచి పూర్తిగా తగ్గుతుంది. తెలంగాణా, తమిళనాడు రాష్డ్రాల అధికారులతో మాట్లాడాం అక్కడా ఇదే పరిస్ధితి. చదవండి: (కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై సజ్జల కీలక వ్యాఖ్యలు) 2014-15లో సరాసరిన 130 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే ప్రస్తుతం సరాసరిన రోజుకి 190 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంది. రోజుకి 30 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తున్నాం. తప్పని పరిస్ధితుల్లోనే రోజుకి గ్రామీణ ప్రాంతాలలో గంట.. పట్టణ ప్రాంతాలలో అరగంట మాత్రమే కోతలు ప్రకటించాం. ఆసుపత్రులకి పూర్తిస్ధాయి సరఫరా కొనసాగించాలని ఆదేశించాం. వ్యవసాయానికి నిరంతరాయంగా ఏడు గంటల విద్యుత్ ఇవ్వాలని ఆదేశించాం. పూర్తి సామర్ద్యంతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ విద్యుత్ కోతలు తాత్కాలికం మాత్రమే. ప్రజలు అర్ధం చేసుకుని సహకరించాలని కోరుతున్నాం. నెలాఖరు నుంచి మళ్లీ విద్యుత్ డిమాండ్ తగ్గి సాధారణ పరిస్ధితులకి వస్తుంది అని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. -
దిగజారిన పరిస్థితి.. ఏకంగా 10 గంటల పవర్ కట్! భారత్ ఏమంటోంది..
ప్రజల కనీస అవసరాలు తీర్చలేక ద్వీపదేశం శ్రీలంక అల్లాడిపోతోంది. ఆహార, ఆర్థిక సంక్షోభంతో సింహళ దేశం విలవిల్లాడుతోంది. విదేశీ మారక నిల్వలు గణనీయంగా పడిపోవడంతో కీలక దిగుమతులు నిలిచిపోయాయి. పెట్రోల్ నుంచి కూరగాయల వరకూ అన్నీంటికీ కొరతే. డీజిల్ లేక బంకులు మూతపడ్డాయి. ఔషధాల కొరతతో శస్త్రచికిత్సలు ఆగిపోయాయి. అత్యవసరాలతోపాటు నిత్యావసరాలూ లభించక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇంధన కొరత కారణంగా శ్రీలంకలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కరెంట్ కోతలు పెరిగాయి. తాజాగా ఈ కోతల సమయాన్ని మరింత పెంచుతూ లంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజుకు 7 గంటలపాటు కరెంట్ సరఫరా నిలిపివేస్తుండగా.. దాన్ని 10 గంటలకు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. అంటే దేశవ్యాప్తంగా రోజుకు 10 గంటలపాటు పవర్ కట్ ఉంటుంది. విద్యుత్ కోతలు పెరగడంతో లంకేయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో వీధి దీపాలు వెలగక నగరాలు అంధకారంగా కన్పిస్తున్నాయి. రెస్టారెంట్లు, వీధి వ్యాపారులు క్యాండిల్ వెలుతురులో వ్యాపారాలు చేస్తున్నారు. మరోవైపు లంక దీనస్థితిపై భారత విదేశాంగమంత్రి జైశంకర్ ట్విట్టర్లో స్పందించారు. ఈ విషయంలో భారత్ ఎలా సహకరించగలదో తెలుసుకోమని మన దేశ రాయబారిని ఆదేశించారు. ఆర్థిక సంక్షోభంలో అల్లాడుతున్న శ్రీలంకకు బిలియన్ డాలర్ల రుణం ఇవ్వనున్నట్టు భారత్ ఇప్పటికే ప్రకటించింది. (చదవండి: రష్యా దురాక్రమణ.. ఆఫీస్‌కు లేటయి బతికిపోయాడు!) -
కరెంట్ కోతలు.. మళ్లీ మొదలు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరెంటు కోతలు మళ్లీ మొదలైనట్టు కనిపిస్తోంది. పల్లెల్లో అనధికార విద్యుత్ కోతలు విధిస్తున్నారని కొన్ని రోజులుగా రైతన్న లు రోడ్డెక్కుతున్నారు. గత శని, ఆది, సోమవారాల్లో మెదక్ జిల్లా రైతులు సబ్ స్టేషన్ల ఎదుట ధర్నా చేశారు. మహబూబ్‌నగర్ రైతులు కూడా కోతలు పెడుతున్నారని చెబుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో కరెంటు కోతలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ మాత్రం కోతలేం లేవని, సాంకేతిక కారణాలతో అంతరాయాలు ఏర్పడుతున్నాయని అంటున్నారు. మరోవైపు ఎండలు పెరగడంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి మంగళవారం ఉదయం 12.20 గంటలకు 14,160 మెగావాట్ల గరిష్ట విద్యు త్ డిమాండ్ నమోదైంది. డిమాండ్ పెరగడంతో కొరతను తీర్చుకోవడానికి పవర్ ఎక్ఛేంజీల నుంచి రాష్ట్రం ఎక్కువ ధర పెట్టి విద్యుత్ కొంటోంది. సబ్ స్టేషన్ల ఎదుట రైతుల ధర్నా రాష్ట్రంలోని 25 లక్షల బోరుబావుల కింద సాగు చేస్తున్న యాసంగి పంటలు మరో 15 రోజుల్లో చేతికొచ్చే అవకాశముంది. ఈ సమయంలో అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. గత శని, ఆది, సోమవారాల్లో మెదక్ జిల్లాలో రామాయంపేట, నిజాంపేట, శివంపేట సబ్ స్టేషన్ల ఎదుట రైతులు ధర్నాలు చేశారు. ఉదయం 7.15 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేసి తర్వాత సింగిల్ ఫేజ్ సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలోనూ సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వ్యవసాయ విద్యుత్‌కు కోతలు విధిస్తున్నారని అన్నదాతలు చెబుతున్నారు. అధికారులేమో సాంకేతిక కారణాలతో మూడ్రోజులు దాదాపు 14 గంటలు విద్యుత్ కోతలు పెట్టామని చెప్పారు. డిమాండ్ పెరుగుతుండటంతో.. రోజూ ఉదయం 7.45–8.45 గంటల మధ్య వ్యవసాయ విద్యుత్ వినియోగం భారీగా ఉంటోంది. ఆ తర్వాత వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గుతున్నా గృహాలు, వాణిజ్యం, పరిశ్రమలు, ఇతర కేటగిరీల వినియోగం పెరుగుతోంది. రైతులు ఉదయం, సాయంత్రం వేళల్లో బోర్లు వేస్తుండటంతో సాయంత్రం 6–7.30 మధ్య కూడా డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్ నిర్వహణలో భాగంగా సాయంత్రం 5 నుంచి ఉదయం 7 గంటల వరకు పల్లెల్లో త్రీఫేజ్ విద్యుత్ సరఫరాను ఆపేస్తున్నట్టు తెలుస్తోంది. రైతులు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో విద్యుత్‌ను వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యుత్ ధరల భగభగ విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడంతో కొరతను తీర్చుకోవడానికి తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలూ పవర్ ఎక్ఛేంజీలపై అధారపడాల్సి వస్తోంది. యూనిట్‌కు రూ.14 నుంచి రూ.20 చొప్పున ఎక్ఛేంజీలు విక్రయిస్తున్నాయి. ఒక దశలో యూనిట్‌కు రూ. 20 వరకూ ధరలు పెరిగాయి. ఉక్రెయిన్ యుద్ధంతో పేలుడు పదార్థాల కొరత ఏర్పడి దేశంలోని విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా కూడా తగ్గి విద్యుత్ ధరలు పెరుగుతున్నాయి. రాష్ట్రం రోజుకు సగటున 50 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్‌ను కొంటోంది. సోమవారం సగటున యూనిట్‌కు రూ.14.52 ధరతో 40 ఎంయూల విద్యుత్‌ను కొన్నది. ఇందులో 6.5 ఎంయూల విద్యుత్‌ను యూనిట్‌కు రూ.20 చొప్పున కొనుగోలు చేసింది. ఈ నెల 25న రాష్ట్రం 58 ఎంయూల విద్యుత్‌ను కొని ఒక్కరోజే రూ.100 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. విద్యుత్ కోతల్లేవు డిమాండ్ పెరిగినా విద్యుత్ కోతలు విధించట్లేదు. 132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ ఇన్సులేటర్ కాలిపోవడంతోనే మెదక్ జిల్లాలో ఓ రోజు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. డిమాండ్ కు తగ్గట్టు నిరంతర సరఫరా కొనసాగించడానికి పవర్ ఎక్ఛేంజీల నుంచి ఎక్కువ ధర పెట్టి విద్యుత్ కొంటున్నాం. 17,000 మెగావాట్లకు డిమాండ్ పెరిగినా సరఫరాకు సిద్ధంగా ఉన్నాం. –ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు పెట్టుబడి చేతికందని పరిస్థితి 24 గంటల విద్యుత్ వస్తుందనే ఆశతో ఉన్న కొద్దిపాటి ఎకరా భూమిలో వరి నాటు వేశా. విద్యుత్ కోతల వల్ల పంట ఎండిపోతోంది. పెట్టిన పెట్టుబడి కూడా చేతికందని పరిస్థితి నెలకొంది. – ఆంజనేయులు, రైతు, చెండి, మెదక్ -
ఎందుకీ కారు కూతలు! పాత ఫొటోలతో కరెంట్ కోతలంటూ రాతలు
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ( ఏపీఎస్పీడీసీఎల్ ) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్.హరనాధరావు స్పష్టం చేశారు. ‘ఎందుకీ కోతలు!’ శీర్షికన ఓ దినపత్రిక ప్రచురించిన కథనాన్ని ఖండిస్తూ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ► కర్నూలు జిల్లా కోసిగి మండలంలో 160 కేవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎల్టీ కేబుల్ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఎటువంటి అంతరాయాలు లేవు. ► రైతులకు 9 గంటల పాటు విద్యుత్ అందడం లేదన్న కథనంలో నిజం లేదు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేవు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. ► అనంతపురం జిల్లా మడకశిర మండలంలో మంగళవారం ఆర్టీపీపీలో కెపాసిటర్ ఓల్టేజ్ ట్రాన్స్ ఫార్మర్ సమస్య కారణంగా సబ్ స్టేషన్లు ట్రిప్ కావడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. ► చిత్తూరు జిల్లాలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేవు. ► అనంతపురం జిల్లాలో గృహాలు, పరిశ్రమలు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేవు. బుధవారం 18.227 ఎంయూల విద్యుత్‌ను సరఫరా చేశాం. ప్రతి నెలా రెండో శనివారం లేదా 3వ శనివారం సబ్ స్టేషన్లు, లైన్ల నిర్వహణ కోసం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ► ప్రస్తుతం రాష్ట్ర గ్రిడ్‌లో దాదాపు 45 శాతం సౌర, పవన, ఇతర వనరుల స్థాపిత విద్యుత్ ఉంది. వీటి నుంచి వచ్చే విద్యుత్ ’తప్పక సేకరణ’ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. సంవత్సరంలో దాదాపు ఆరు నెలలు ఈ వనరుల నుంచి విద్యుదుత్పత్తి అధికంగా ఉంటుంది. సౌర కేంద్రాల నుంచి సంవత్సరం మొత్తం ఉంటుంది కానీ పగటి పూట మాత్రమే లభ్యత ఉంటుంది. ► రోజువారీ గ్రిడ్ డిమాండ్‌లో కేవలం 4 గంటలు (ఉదయం, సాయంత్రం పీక్ లోడ్ సమయంలో) మాత్రమే కొంత వరకూ విద్యుత్ కొరత ఏర్పడుతోంది. దీన్ని అధిగమించడానికి బహిరంగ మార్కెట్ లో ముందురోజు బిడ్డింగ్ విధానంలో సమకూర్చుకుంటున్నాం. ఈ విధానంలో అందుబాటులోకి రాకపోతే రోజువారీ మార్కెట్లో కానీ అత్యవసర మార్కెట్లో కానీ విద్యుత్ సేకరించి కొనుగోలు చేస్తున్నాం. ► రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాల నుంచి అందుబాటులో ఉన్నంతవరకు ఎలాంటి బ్యాక్ డౌన్ లేకుండా విద్యుత్ సేకరిస్తున్నాం. ప్రస్తుతం ఏ విద్యుత్ కేంద్రాన్ని షట్ డౌన్ చేయడం లేదు. బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర ఉన్నా వినియోగదారుల సౌకర్యార్ధం ముఖ్యంగా వ్యవసాయదారుల కోసం ప్రస్తుత రబీ సీజన్లో ఒక్క సెంటు భూమికి కూడా సాగు నీటి కొరత తలెత్తకుండా విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం. కోతలు లేవు.. నాణ్యమైన కరెంట్ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలోని విద్యుత్తు వినియోగదారులకు నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నామని ఏలూరు ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్.జనార్దనరావు ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఎందుకీ.. కోతలు!’ శీర్షికతో ఓ దినపత్రిక ప్రచురించిన కథనంలో నిజం లేదని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యుత్ కోతలతో సాగు నీరందక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయనడం అవాస్తవమన్నారు. బుట్టాయగూడెం విద్యుత్ శాఖ అధికారులు లోడ్ రిలీఫ్ కోసం కోతలు విధిస్తున్నారనడం కూడా అవాస్తవమేనని, విద్యుత్ అధికారులు అటువంటి వివరణ ఏదీ ఇవ్వలేదని వెల్లడించారు. వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్తు సరఫరా చేస్తున్నామన్నారు. వినియోగదారులందరికి నిరంతరాయంగా సరఫరా చేసేందుకు అవసరమైన సిబ్బంది, సామగ్రి 24 గంటలు అందుబాటులో ఉన్నాయన్నారు. సాంకేతిక సమస్యల కారణంగా ఏర్పడిన అంతరాయాలను సరిదిద్ది త్వరితగతిన పునరుద్ధరిస్తున్నారని వివరించారు. విద్యుత్ అంతరాయాలు తలెత్తినప్పుడు వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912కు తెలియచేయాలని ఎస్ఈ కోరారు. మడకశిరలో కరెంట్ కోతలు లేవు అనంతపురం జిల్లా మడకశిరలో బుధవారం కరెంట్ కోతలు విధించారన్న వార్తల్లో నిజం లేదని హిందూపురం డివిజన్ డీఈ డి.భూపతి స్పష్టం చేశారు. ఆర్టీపీపీలో సాంకేతిక సమస్యలతో మంగళవారం ఉదయం మాత్రం కొద్ది గంటలు సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. విద్యుత్ కోతలపై ఓ పత్రిక ప్రచురించిన కథనం నిరాధారమని మడకశిర ఏడీఈ వెంకటేశ్వర్లు చెప్పారు. ఆ ఫొటో... ఇప్పటిది కాదు నా ఫ్యాక్టరీలో కరెంటు లేకపోవడంతో కార్మికులు ఖాళీగా కూర్చున్నట్లు ఓ పత్రికలో ఫొటో ప్రచురించారు. అసలు ఆ ఫొటో ఇప్పటిది కాదు. ఇటీవల కరెంట్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదు. గురువారం ఓ ఛానల్ వాళ్లు వచ్చి విద్యుత్తు కోతల గురించి మాట్లాడాలని కోరారు. లేని వాటిని ఉన్నట్లు చెప్పడం అన్యాయం. అందుకు నేను ఒప్పుకోలేదు. బుధవారం కరెంటు సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగలేదు. మంగళవారం మాత్రం రెండు గంటల పాటు అంతరాయం ఏర్పడింది. ఈమేరకు మాకు ముందుగానే సెల్‌ఫోన్‌కు సమాచారం ఇచ్చారు. – ఆనంద్, టెక్ మనోరా ప్యాకింగ్ పరిశ్రమ యజమాని, మడకశిర ఆగింది అరగంటే.. శ్రీకాకుళం జిల్లా పలాస–కాశిబుగ్గలో విద్యుత్తు కండెక్టర్ తెగిపోవడంతో బుధవారం సాయంత్రం 6.40 నుంచి 7.14 వరకు 34 నిమిషాల పాటు కరెంట్ సరఫరా ఆగిపోయింది. మరమ్మతుల అనంతరం సరఫరాను పునరుద్ధరించారు. ఇక్కడ కరెంట్ లేక రాత్రంతా గాడాంధకారం నెలకొందనే తరహాలో ఓ పత్రిక ఫోటోలు ప్రచురించింది. -
చేతులెత్తేసిన శ్రీలంక ప్రభుత్వం.. అల్లాడుతున్న లంకేయులు
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాలుస్తోంది. నిధుల లేమితో దేశ అవసరాలకు తగ్గ ఇంధనం దిగుమతి చేసుకోలేక ప్రభుత్వం చేతులెత్తింది. దీంతో దేశమంతా విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మంగళవారం దేశ పవర్ గ్రిడ్‌ను రెండుగంటలు నిలిపివేస్తున్నట్లు లంక ప్రజావసరాల కమిషన్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో విడతలవారీగా కోతలుంటాయని తెలిపింది. ఇంధన కొరతతో జాతీయ గ్రిడ్‌కు 541 మెగావాట్ల విద్యుత్ నష్టం వాటిల్లుతోందని తెలిపింది. ఒకపక్క విద్యుత్ సంక్షోభం కొనసాగుతున్న వేళ డ్యాముల్లో నీటి నిల్వలు తగ్గడంతో జలవిద్యుదుత్పత్తి తగ్గింది. (ఇది చదవండి: యుద్ధం ముంగిట యూరప్.. ఉక్రెయిన్‌లోకి రష్యా సైన్యం) కాగా, కరోనా కారణంగా శ్రీలంకలో టూరిజం దెబ్బతినడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే శ్రీలంక పెట్రోలియం కార్పొరేషన్, సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ బ్యాంకులకు ప్రభుత్వం 3.3 బిలియన్ డాలర్లు మేర చెల్లింపులకు బాకీ పడింది. ప్రభుత్వం వద్ద తగినంత నిధులు లేకపోవడంతో చెల్లింపులు జరగక దేశంలోకి వచ్చిన చమురు సైతం పోర్టుల్లోనే నిలిచిపోయిందని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ఉదయ గమ్నన్పిలి వెల్లడించారు. ఇదిలా ఉండగా పెట్రో ఉత్పత్తుల కోసం.. ఇటీవలే భారత్ సైతం లంకకు 500 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించిన విషయం తెలిసిందే. అయితే, వంద శాతం సేంద్రియ ఉత్పత్తులను పండిచాలని శ్రీలంక ప్రభుత్వం 2021లో తీసుకున్న ఓ నిర్ణయం వల్ల అక్కడ సంక్షోభం ఏర్పడింది. దీంతో, బ్లాక్ మార్కెట్లో బియ్యం, చక్కెర, ఉల్లిపాయలు సహా నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వీటికి తోడు గతేడాది అక్టోబర్‌లో వంట గ్యాస్ ధర సిలిండర్ రూ. 2,657 కు చేరి రికార్డు సృష్టించింది. తాజాగా కరెంట్ కోతలుసైతం విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. (ఇది చదవండి: బంగారు గనిలో పేలుడు.. 59 మంది దుర్మరణం) -
ఏపీలో విద్యుత్ కోతల ప్రచారం అబద్దం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ అంతరాయంపై వస్తున్న కథనాలను ఏపీ విద్యుత్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నాగులపల్లి శ్రీకాంత్ ఖండించారు. విద్యుత్ అంతరాయంపై వస్తున్న కథనాలన్నీ అవాస్తవమని పేర్కొన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 24 గంటలు విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగానే విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ కనెక్షన్లకు పూర్తిగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రోజుకి 204 మిలియన్ యూనిట్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. 30 మిలియన్ యూనిట్లను రోజు తాత్కాలిక అవసరాల కోసం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. డిమాండ్‌కు తగ్గట్టుగా దీర్ఘకాలిక విద్యుత్‌ను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. జెన్కో, కృష్ణపట్నం, సెంట్రల్ జెనరేటింగ్, విండ్, సోలార్, జలవిద్యుత్ ఉత్పత్తిని వినియోగిస్తున్నామని వెల్లడించారు. 7 వందల నుండి 2 వేల మెగావాట్ల వరకు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఎన్టీపీసీతో ఉన్న సమస్య పరుష్కరించామని తెలిపారు. -
వేసవి కాలంలో కరెంటు కోతలు తప్పవా..?
ధరలను పెంచలేకపోతే బొగ్గు ఉత్పత్తి పడిపోవచ్చని ప్రభుత్వ మైనర్ కోల్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. బొగ్గు ఉత్పత్తి పడిపోతే విద్యుత్ సహ ఇతర ఆధారిత రంగాలలో సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రపంచంలోని అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు అయిన కోల్ ఇండియాలో జీతాలు పెరగడం, డీజిల్ అధిక ధరల నుంచి సంస్థ ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ధరలు పెంచకపోతే కంపెనీలోని కొన్ని యూనిట్లు మనుగడ సాగించడం కష్టం అని ఛైర్మన్ ప్రమోద్ అగర్వాల్ తెలిపారు. దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాలలో భాగంగా కోల్ ఇండియా బొగ్గు ధరలను పెంచడానికి ప్రభుత్వ మద్దతు అవసరం. దేశంలో కరెంట్ ధరలు పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దేశంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన 70 శాతం బొగ్గును కోల్ ఇండియా ఉత్పత్తి చేస్తుంది. గత ఏడాది బొగ్గు ఉత్పత్తి పడిపోవడంతో విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. గత ఏడాది సెప్టెంబర్ నెలలో విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు కనిష్టస్థాయి నుంచి పెరిగినప్పటికీ, అవి ఇప్పటికీ ఏప్రిల్ 2020లో గరిష్ట నిల్వలలో మూడవ వంతు మాత్రమే ఉన్నాయి. వేసవి సమీపిస్తున్న కొద్దీ దేశంలో విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ పెరుగుతుంది. ఈ సమయంలో కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి నిలిపివేస్తామని ప్రకటించడం ఆందోళన కలిగించే విషయం. (చదవండి: ఎలక్ట్రానిక్ చిప్స్ తయారీ కోసం వేదాంత గ్రూపు భారీగా పెట్టుబడులు..!) -
మారని తీరు.. ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి కరెంట్ కట్
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి రూ.కోటికి పైగా విద్యుత్తు బిల్లులు చెల్లించకపోవడంతో సరఫరా నిలిపివేసినట్లు ఏడీఈ బాలకృష్ణ మంగళవారం పేర్కొన్నారు. బిల్లులు చెల్లించకుండా కరెంటును యధావిధిగా వాడుకోవడంతో శాఖ అధికారులు హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్‌సీఏ)పై గతంలో విద్యుత్తు చౌర్యం కేసు నమోదు చేశారు. దీంతో హెచ్‌సీఏ కోర్టును ఆశ్రయించింది. కోర్టులో విద్యుత్తు శాఖకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇటీవల అధికారులు బకాయిల విషయమై హెచ్‌సీఏకు నోటీసులు జారీ చేసినా.. చెల్లించకపోవడంతో సరఫరా నిలిపేశారు. చదవండి: (Nalgonda: నిశీధిలో ఏం జరిగింది..?) -
కరెంట్ ‘కట్‘కట!
సాక్షి, హైదరాబాద్: బొగ్గు కొరత కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు విద్యుత్ డిమాండ్, సరఫరాలను పరిశీలిస్తే.. మొత్తంగా నెలకొన్న లోటులో 11.2 శాతం మేర గత ఏడెనిమిది రోజుల్లోనే నమోదవడం గమనార్హం. అంతర్జాతీయంగా, దేశీయంగా బొగ్గు కొరత తీరి.. థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి పునరుద్ధరించే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో.. జాతీయస్థాయిలో గ్రిడ్ నిర్వహణను నియంత్రించే ‘పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ (పొసోకో)’రోజువారీ నివేదికలను విశ్లేషిస్తే.. గత వారం, పదిరోజులుగా పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు విధిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హరియాణా, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లోనూ కొంతమేర విద్యుత్ కోతలు విధిస్తున్నారు. బిహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం రోజుకు 8–7 గంటలకు మించి విద్యుత్ సరఫరా ఉండడం లేదని జాతీయ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. పొసోకో నివేదికల మేరకు.. జార్ఖండ్‌లో ఏకంగా 18–24 శాతం వరకు విద్యుత్ కొరత ఏర్పడగా, రాజస్థాన్‌లో 11 శాతం, బిహార్‌లో 6శాతం వరకు రోజువారీ విద్యుత్ కొరత తలెత్తుతోంది. దక్షిణాదిన కేరళలో విద్యుత్ కొరత ఎక్కువగా ఉండగా.. కర్ణాటకలో స్వల్పంగా కొరత కనిపిస్తోంది. గత ఏడాది అక్టోబర్ తొలివారంలో దేశవ్యాప్తంగా నమోదైన విద్యుత్ లోటుతో పోల్చితే.. ఈసారి విద్యుత్ లోటు 21 రెట్లు ఎక్కువగా ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వారం రోజులుగా దేశంలో రోజూ సగటున 3,880 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ డిమాండ్ ఉండగా.. 80–110 ఎంయూ వరకు కొరత నమోదవుతోంది. 115 ప్లాంట్లలో 6 రోజులకే నిల్వలు.. ‘సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ)’తాజా నివేదిక ప్రకారం.. దేశంలో 1,65,066 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 135 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో.. సగటున కేవలం 4 రోజులకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్నాయి. సాధారణంగా థర్మల్ ప్లాంట్లలో కనీసం 15 నుంచి 30 రోజుల విద్యుదుత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ 115 ప్లాంట్లలో 0–6 రోజులకు సరిపడానే నిల్వలు ఉన్నాయి. 16,430 మెగావాట్ల సామర్థ్యమున్న 17 ప్లాంట్లలో సోమవారం నాటికి బొగ్గునిల్వలు ఖాళీకావడంతో.. వాటిలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. అంతేగాకుండా చాలా థర్మల్ ప్లాంట్లు బొగ్గు కొరత కారణంగా సామర్థ్యం కన్నా తక్కువగా విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం కోవిడ్ మహమ్మారి ప్రభావం తగ్గిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. దీనితో విద్యుత్‌కు డిమాండ్ బాగా పెరిగింది. బొగ్గుకు కొరత మొదలై.. ధరలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే చైనా వంటి దేశాలు సరిపడా బొగ్గు లేక విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. చైనాలో పరిశ్రమలు మూతపడుతున్నాయి. మన దేశంలోనూ కొద్దిరోజులుగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో దిగుమతి చేసుకున్న బొగ్గుపై ఆధారపడిన థర్మల్ ప్లాంట్లకు ఆర్థిక భారం పడింది. దేశీయంగా కోల్ ఇండియా, సింగరేణి బొగ్గు సరఫరాను పెంచి సంక్షోభాన్ని అధిగమిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కాగా ఏపీలోనూ బొగ్గు కొరత ఉందని, వెంటనే సరఫరా పెంచాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. -
ముసురుకుంటున్న చీకట్లు!
కరెంట్ కోత, లైట్లు లేక కొవ్వత్తులతో కాలక్షేపం... ఒకప్పుడు నిత్యానుభవం. కొన్నేళ్ళుగా దూరమైన ఆ అనుభవం త్వరలోనే మళ్ళీ దేశమంతటా ఎదురుకాక తప్పేలా లేదు. వస్తున్న వార్తలను బట్టి చూస్తే, ఒకప్పటిలా మళ్ళీ విద్యుత్ కోతలు దేశమంతటా నిత్యకృత్యం కానున్నాయి. దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వలు తగ్గాయి. సొంతంగా విద్యుదుత్పత్తి చేద్దామంటే బొగ్గు కొరత. థర్మల్ విద్యుత్కేంద్రాలు మూతపడే పరిస్థితి. పోనీ... ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్తే కొందామంటే, అనూహ్యమైన విద్యుత్ కొనుగోలు రేట్ల మోత. యూనిట్‌కు పాతిక రూపాయలు పెట్టినా, విద్యుత్ లభించని దుఃస్థితి. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అందుకే, గృహావసర విద్యుత్ వినియోగం తగ్గించుకొని, విద్యుత్ ఆదా చేయాల్సిందిగా అన్ని ప్రభుత్వాలూ ప్రజలను అభ్యర్థించాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో ప్రజలకు విద్యుత్ కోతలు తప్పవన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యం ఇది. మన దేశంలో 135 థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. అవన్నీ మునుపెన్నడూ లేనంత బొగ్గు నిల్వల కొరతను ఎదుర్కొంటున్నాయనీ, విద్యుత్ కొరత తప్పదనీ సాక్షాత్తూ ‘భారతీయ కేంద్ర విద్యుత్ అథారిటీ’ డేటాయే స్పష్టం చేస్తోంది. దేశవ్యాప్తంగా అవసరమైన విద్యుత్తులో 70 శాతాన్ని ఇవే ఉత్పత్తి చేస్తాయి. కానీ, బొగ్గు నిల్వల తీవ్ర కొరత కారణంగా ఈ 135 థర్మల్ ప్లాంట్లలో 106, అంటే దాదాపు 80 శాతం ప్లాంట్లు సంక్షోభ, లేదా అతి తీవ్ర సంక్షోభ స్థితిలో ఉన్నాయి. సాధారణంగా 14 రోజులకు సరిపడా నిల్వలుండాలని భారత ప్రభుత్వం మాట. కానీ, ఇప్పుడు రెండు రోజులకు మించి లేవు. తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లలోని బొగ్గు, లిగ్నైట్ గనులున్న ప్రాంతాల్లో అధిక వర్షపాతం వల్ల బొగ్గు రవాణాకు చిక్కులొచ్చాయి. వర్షాకాలానికి ముందే తగినంత బొగ్గు నిల్వలు చేసుకొనే దూరదృష్టి లేకుండా పోయింది. మరోపక్క విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే బొగ్గుతో నడిచే విద్యుత్కేంద్రాలు సైతం చతికిలబడ్డాయి. షిప్పింగ్ ఆలస్యాల కారణంగా అంతర్జాతీయ గొలుసుకట్టు సరఫరా దెబ్బతింది. అంతర్జాతీయ బొగ్గు రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కనీసం 40 శాతం మేర బొగ్గు ధరలు పెరిగినట్టు లెక్క. కొన్నిచోట్ల ఒక టన్ను 60 డాలర్లుండేది ఇప్పుడు దాదాపు 120 డాలర్లు అయిందని కథనం. దాంతో, అవసరమైన అంతర్జాతీయ బొగ్గును కొనే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఆ రేట్లకు కొనలేక, తమ సామర్థ్యంలో సగం కన్నా తక్కువ విద్యుత్తునే ఆ కేంద్రాలు ఉత్పత్తి చేస్తున్న పరిస్థితి. కేరళలో 4, మహారాష్ట్రలో 13 థర్మల్ విద్యుత్కేంద్రాలు మూతబడ్డాయి. పంజాబ్‌లో దాదాపు సగం థర్మల్ విద్యుత్కేంద్రాలు ఆగిపోయాయి. ఇక, దక్షిణాదినా పలు విద్యుత్కేంద్రాలు మూతబడే పరిస్థితి. ఇప్పటికే రాజస్థాన్‌లో రోజుకో గంట, పంజాబ్‌లో 3 గంటలు, ఢిల్లీలో విడతల వారీగా విద్యుత్ కోత నడుస్తోంది. అలాగే, కేరళ, గుజరాత్, తమిళనాడు, అతి తీవ్రమైన బొగ్గు కొరత ఉన్న జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు సైతం పవర్ కట్ బాటలోకి వస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ విద్యుత్ సంక్షోభంపై ఇప్పటికే కేంద్రానికి వివరంగా లేఖ రాశారు. కోవిడ్ తర్వాత విద్యుత్ డిమాండ్ 15 శాతం పెరిగిందనీ, రాష్ట్ర అవసరాల కోసం విద్యుత్ కొనాలన్నా అందుబాటులో లేదనీ వాస్తవాల్ని వివరించారు. 20 ర్యాక్‌ల బొగ్గు కేటాయింపు సహా అనేక తక్షణ పరిష్కారాలూ సూచించారు. ఢిల్లీ సహా కొందరు ఇతర ముఖ్యమంత్రులూ తమ కష్టాలు కేంద్రానికి విన్నవించారు. కానీ, సంక్షోభ పరిష్కారానికి కేంద్రం మీనమేషాలు లెక్కించింది. చైనా లాంటి చోట్ల ఇప్పటికే విద్యుత్ సంక్షోభం కనిపిస్తున్నా, మన పాలకులు అంతా బాగుందన్నారు. సమాచార లోపం వల్లే అనవసర భయాలన్నారు. ఎట్టకేలకు సోమవారం కేంద్ర హోమ్‌మంత్రి సారథ్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరపాల్సి వచ్చింది. నిజానికి, విద్యుత్ లాంటి విషయాల్లో వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం చేసే బాధ్యత కేంద్రానిది. కానీ, ఆ పని సమర్థంగా చేస్తున్నట్టు కనిపించదు. రాష్ట్రాలు విద్యుత్ కోసం అధిక రేట్లకైనా సరే ప్రైవేట్ సంస్థల వద్దకు పరిగెత్తాల్సిన పరిస్థితి కల్పించే కుట్ర ఈ కొరతకు కారణమని కొందరి వాదన. 1957 నాటి చట్టంలో తేనున్న సవరణలతో అరణ్యాలు, గిరిజన భూముల్ని కేంద్రం సేకరించి, బొగ్గు గనుల తవ్వకాలకు ప్రైవేట్ వారికి కట్ట బెట్టడానికే ఇదంతా అని ఆరోపిస్తున్నవారూ లేకపోలేదు. వాటిలో నిజానిజాలు ఏమైనా, కరోనా అనంతరం ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న వేళ విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలపై అజాగ్రత్త స్వయంకృతమే. పాలకులు ‘ఆత్మ నిర్భర భారత్’ నినాదంతో సరిపెట్టకుండా, బొగ్గు, చమురు, సహజవాయువుల దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు తగిన పరిస్థితులు కల్పించాలి. ఇవాళ మంచినీటి లానే విద్యుత్ కూడా! విద్యుత్ లేకపోతే నాగరక జీవి మనుగడే కష్టం. అందుకే, విద్యుత్ రంగంలోనూ ఆచరణవాదంతో సంస్కరణలు తేవడమూ ముఖ్యం. మన దేశ విద్యుత్ అవసరాల్లో 90 శాతం శిలాజ ఇంధనాల నుంచి తీర్చుకుంటున్నాం. భవిష్యత్తుకు ఇది సరి కాదు. ఎక్కడైనా బొగ్గు నిల్వలు శాశ్వతంగా ఉండవు కాబట్టి, ఎప్పటికైనా పునర్వినియోగ విద్యుత్ వైపు మళ్ళాల్సిందే. దేశవ్యాప్తంగా సౌరశక్తి అనే ఉచిత, సహజ వనరును సమర్థంగా ఉపయోగించుకొని, సోలార్ పవర్ ఉత్పత్తి పెంచుకుంటే, సమస్యలుండవు. పవన విద్యుదుత్పత్తి పైనా గట్టిగా దృష్టి పెట్టక తప్పదు. ఆ మధ్య ఆక్సిజన్ కొరత... ఇప్పుడు బొగ్గు కొరత. కళ్ళ ముందున్నా సరే... సమస్యను గుర్తించడానికి నిరాకరిస్తే, కాలం గడిచేకొద్దీ కష్టమే! -
అవన్నీ అనవసరమైన భయాందోళనలు
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరతతో థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూతపడే పరిస్థితి వస్తుందని ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పలు రాష్ట్రాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సంక్షోభ నివారణకు కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోకుండా అవసరమైన అన్ని వనరులు వినియోగించేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్.కె.సింగ్ ఎన్టీపీసీ, రిలయెన్స్ ఎనర్జీ సహా వివిధ విద్యుదుత్పత్తి కేంద్రాలు, విద్యుత్ సరఫరా కంపెనీలు, విద్యుత్ అధికారులతో ఆదివారం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ డిమాండ్‌కు తగిన బొగ్గు నిల్వలు ఉన్నాయని, అనవసర భయాందోళనలు వద్దని స్పష్టం చేశారు. విద్యుదుత్పత్తి కేంద్రాల్లో 4 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, విద్యుత్ సరఫరాకు ప్రమాదం ఏమీ లేదని భరోసా ఇచ్చారు. సమాచార లోపమే కారణం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్), ఢిల్లీలోని డిస్కమ్‌ల మధ్య సమాచార లోపం వల్లే అనవసర ఆందోళనలు తలెత్తాయని చెప్పారు. ఢిల్లీ డిస్కమ్‌లకి, గెయిల్‌కి మధ్య కాంట్రాక్టు పూర్తి అయిపోవడంతో ఇక గ్యాస్ సప్లయ్ చేయలేమని గెయిల్ రాసిన లేఖతో విద్యుత్ ప్రమాదం ముంచుకొస్తోందన్న భయం తలెత్తి ఉండవచ్చునని మంత్రి అభిప్రాయపడ్డారు. ‘విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాసిన లేఖపై లెఫ్ట్‌నెంట్ జనరల్ నాతో మాట్లాడారు. అలాంటి పరిస్థితి రాదని వాళ్లకి చెప్పాను. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలకు అవసరమయ్యే గ్యాస్ సరఫరా చేయమని గెయిల్ సీఎండీని ఆదేశించాం. సరఫరా కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు’అని మంత్రి తెలిపారు. బొగ్గు గనులున్న ప్రాంతాల్లో భారీ వర్షాలతో తవ్వకాలు నిలిచిపోవడం, సరఫరా మందగించడం, అంతర్జాతీయంగా బొగ్గు ధరలు భారీగా పెరగడంతో భరించలేని కంపెనీలు ఉత్పత్తిపై చేతులెత్తేస్తున్నాయి. గుజరాత్లో టాటా పవర్ ఉత్పత్తి నిలిపివేత విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుపైనే ఆధారపడిన టాటా పవర్ అధిక ధరలకు బొగ్గు కొనలేక గుజరాత్‌లోని ముంద్రా ప్లాంట్‌లో ఉత్పత్తి ఆపేసింది. ఈ ప్లాంటు ద్వారా గుజరాత్‌కు 1,850 మెగావాట్లు, పంజాబ్‌కు 475, రాజస్తాన్‌కు 380, మహారాష్ట్రకు 760, హరియాణాకు 380 మెగావాట్లు విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది. బొగ్గు నిల్వలు ఎంత ఉన్నాయంటే.. బొగ్గు నిల్వలపై కేంద్ర విద్యుత్ శాఖ, బొగ్గు గనుల శాఖ వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గును సరఫరా చేస్తున్నట్టు స్పష్టం చేశాయి. కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్ కంపెనీ, క్యాప్టివ్ కోల్‌మైన్స్, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు అన్నీ కలుపుకుంటే అక్టోబర్ 9న మొత్తంగా 19.2 లక్షల టన్నులు సరఫరా చేస్తే , విద్యుత్ ప్లాంట్లలో 18.7 లక్షల టన్నులు వినియోగించారు. అంటే వినియోగానికి మించి సరఫరా ఉందని, కొన్ని రోజులు గడిస్తే బొగ్గు నిల్వలు పెరుగుతాయని విద్యుత్ శాఖ వెల్లడించింది. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మరో ప్రకటనలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు దాదాపుగా 72 లక్షల టన్నులున్నాయని, ఇవి నాలుగు రోజులకి సరిపోతాయని పేర్కొంది. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) దగ్గర 400 లక్షల టన్నుల స్టాకు ఉందని, విద్యుత్ ప్లాంట్లకు దానిని సరఫరా చేస్తున్నట్టుగా వివరించింది. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలకి రోజుకి 18.5 లక్షల టన్నుల బొగ్గు అవసరమైతే ప్రస్తుతం రోజుకి 17.5 లక్షల టన్నులు సరఫరా చేస్తున్నామని, వర్షాల కారణంగా పంపిణీ కాస్త నెమ్మదించిందని అంగీకరించింది. గత ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకు దేశీయంగా లభించే బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి 24 శాతం పెరిగిందని వివరించింది. అప్పట్లో ఆక్సిజన్‌కూ కొరత లేదన్నారు: సిసోడియా కేంద్రం ప్రతీ సమస్యని తేలిగ్గా తీసుకుంటోందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. బొగ్గు సంక్షోభం తరుముకొస్తున్నా ఏమీ లేదని అంటోందని మండిపడ్డారు. కోవిడ్ రెండో వేవ్ సమయంలో ఆస్పత్రులు, డాక్టర్లు ఆక్సిజన్‌కి కొరత ఉందని మొరపెట్టుకున్నా అలాంటిదేమీ లేదని మభ్యపెట్టిందని, ఫలితంగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని, అనవసరంగా లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నారంటూ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కే. సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో సిసోడియా విలేకరులతో మాట్లాడారు. ‘‘కేంద్ర విద్యుత్ మంత్రి బొగ్గుకి కొరత లేదని అంటున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధానికి అలా లేఖ రాసి ఉండకూడదని కూడా అన్నారు. ఒక కేంద్రమంత్రిగా ఆయన చాలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు’’అని సిసోడియా అన్నారు. సమస్య నుంచి పారిపోవాలని కేంద్రం భావిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కొరతని, ఇప్పటి బొగ్గు సమస్యతో పోలుస్తూ కేంద్రంపై సిసోడియా విరుచుకుపడ్డారు. -
2 రాష్ట్రాల్లో కరెంటు కష్టాలు
న్యూఢిల్లీ: బొగ్గు కొరత కారణంగా ఢిల్లీ, పంజాబ్‌లకు కరెంటు కోతలు తప్పకపోవచ్చని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. థర్మల్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గును కేంద్రం సరఫరా చేయాలన్నారు. దేశ రాజధానికి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్లకు అవసరమైన బొగ్గు, గ్యాస్ సరఫరా అయ్యేలా జోక్యం చేసుకోవాలని కోరు తూ ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఎన్టీపీసీ నుంచి విద్యుత్ అందకుంటే రానున్న రోజుల్లో కోతలు తప్పకపోవచ్చన్నారు. పంజాబ్‌లోని ధర్మల్ ప్లాంట్లు బొగ్గు కొరత కారణంగా తక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్నాయని సీఎం చెన్నీ చెప్పారు. -
China Power Crisis: చైనాలో చీకట్లు !
షెన్యాంగ్: చైనాలో స్మార్ట్ ఫోన్ వెలుగులో ప్రజలు బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు. చాలా నగరాల్లో విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలనే లక్ష్యాలను చేరుకోవడానికి విద్యుత్ కోతలు అమలు చేశారని కొందరు ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తూ ఉంటే , ఇటీవల కాలంలో బొగ్గు ధరలు ఆకాశాన్నంటడంతో డిమాండ్‌కి తగ్గ సప్లయ్ చేయలేమని విద్యుత్ కంపెనీలు చేతులెత్తేసినట్టు వార్తలు వస్తున్నాయి. చైనాలో కొన్ని ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఫలితంగా స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు మొదలయ్యాయి. ఇటీవల చైనా విద్యుత్ వినియోగం రెట్టింపు అయింది. దీంతో కర్బన ఉద్గారాలు అధిక స్థాయిలో వెలువడి వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సు అక్టోబర్ 12–13 తేదీల్లో చైనాలోని కన్మింగ్‌లో జరగనుంది. ఆతిథ్య దేశంగా ఉంటూ ఈ స్థాయిలో ఇంధనాన్ని వినియోగిస్తే అంతర్జాతీయంగా విమర్శలు వస్తాయి. దీంతో అధ్యక్షుడు జిన్ పింగ్‌పై సంప్రదాయ ఇంధన వినియోగాన్ని తగ్గించాలనే ఒత్తిడి పెరుగుతోంది. ఆ లక్ష్యాలను చేరుకోవడానికే భారీగా విద్యుత్ కోతలు విధించారని తెలుస్తోంది. చైనాలో దాదాపుగా 20 ప్రాంతాల్లో అత్యధికంగా ఇంధనాన్ని వినియోగిస్తూ, ఉత్పత్తులు భారీగా చేపట్టడంతో కాలుష్యం పెరిగిపోయింది. చైనాలోని ఓ ఇంట్లో సెల్‌ఫోన్ వెలుగులో భోజనం చేస్తున్న కుటుంబ సభ్యులు -
భవిష్యత్తు మొత్తం ఈ వాహనాలదే!
ఒకప్పుడు రైలు బండ్లు బొగ్గుతో నడిచేవి, తర్వాత డీజిల్ ఇంజన్లు వచ్చాయి.. ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రిక్ ఇంజన్ల ఆధారంగా నడుస్తున్నాయి. ఇక బైకులు, స్కూటర్లు, కార్లు, బస్సులు దాదాపు అన్ని వాహనాలకు పెట్రోలు, డీజిలే ఆధారం. అయితే భవిష్యత్తులో ఇవన్నీ ఎలక్ట్రిక్ బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఎలా ఉంటుంది. ఈవీలకు సంబంధించి మౌలిక సదుపాయలకు సంబంధించి రాబోతున్న మార్పులపై టాటా పవర్ సీఈవో ప్రవీర్ సిన్హా ఎకనామిక్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయలు తెలిపారు. అందులో ప్రధాన విషయాలు మీ కోసం.. విస్తరిస్తున్న ఈవీ ఇండియాలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రముఖ టూ వీలర్ తయారీ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీకి ప్రణాళికలు సిద్ధం చేశాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే మార్కెట్లో అడుగు పెట్టాయి. రెండేళ్ల కిందటి నాటి పరిస్థితులతో పోల్చి చూస్తే ఇప్పుడు ఈవీ టూవీలర్స్ అమ్మకాలు బాగా పెరిగాయి. అంతేకాదు ఒకప్పుడు ఈవీ వెహికల్స్ ధరలు లక్షకు పైగానే ఉండేవి. ఇప్పుడు వాటి ప్రారంభ ధర రూ. 60,000ల దగ్గరకు వచ్చింది. ధరలే ముఖ్యం మిగిలిన దేశాలతో పోల్చితే భారతీయుల ఆలోచణ ధోరణి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఫీచర్లు, ఆప్షన్లు ఎన్ని ఉన్నా ధర ఎంత అన్నదే ప్రధానం. వస్తువు కొనుగోలులో ధర కీలకంగా మారుతుంది. పది లక్షల రూపాయల లోపు ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురాగలిగితే పెను మార్పులు వస్తాయి. ఈవీ కార్ల అమ్మకాలు భారీ స్థాయిలో పెరుగుతాయి. ఆ దిశగా టాటా మోటార్స్ ప్రయత్నిస్తోంది. రాబోయే మూడునాలుగేళ్లలో మార్కెట్లో ఉన్న మిగిలిన కంపెనీలు కూడా ఇదే తరహాలో విభిన్న శ్రేణిల్లో ఈవీ కార్లు తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. టాటావే ఎక్కువ ఈవీ వెహికల్స్‌కి ఛార్జింగ్ అనేది ప్రధాన సమస్య. ప్రస్తుతం ఈ సమస్యపై మార్కెట్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం మన దగ్గరున్న పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లలో టాటావే అధికం. వంద నగరాలతో పాటు జాతీయ రహదారుల వెంట టాటా ఆధ్వర్యంలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు సేవలు అందిస్తున్నాయి. దీనికితోడు ప్రస్తుతం హెచ్‌పీసీఎల్ భాగస్వామ్యంలో భారీ ఎత్తున ఛార్జింగ్ స్టేషన్లు తేబోతున్నాం. అంతేకాదు షాపింగ్‌మాల్స్, కాఫీ షాప్స్, పార్కులు... తదితర జనాలు వచ్చి పోయే చోట్ల కూడా ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశాం. ఛార్జింగ్ స్టేషన్లు హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌తో కలిసి దేశవ్యాప్తంగా 18,000 పెట్రోల్ బంకులలో ఈవీ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను టాటా పవర్ నిర్మించబోతుంది. వీటికి సంబంధించిన పనులు త్వరలో మొదలవుతాయి. ఇక దేశవ్యాప్తంగా 75 వేలకు పైగా పెట్రోలు బంకులు ఉన్నాయి. మిగిలిన కంపెనీలు కూడా ఇదే దిశగా ప్రయత్నాలు చేస్తాయి. తద్వారా పబ్లిక్ ప్లేస్‌లలో ఛార్జింగ్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సమస్య రానివ్వం మన దగ్గర పవర్ కట్ సమస్య ఉంది. ముఖ్యంగా రూరల్ ఇండియాలో కరెంటో కోత సర్వసాధారణమైన సమస్య. దీనిపై అవగాహన ఉంది. పవర్ కట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పని తీరుపై ప్రభావం పడకుండా అందుబాటులో కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తాం. పవర్ కట్ వచ్చినా ఛార్జింగ్ స్టేషన్ పని చేసేలా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తాం,. - సాక్షి, వెబ్‌డెస్క్ -
పంజాబ్ ‘పవర్’ పాలిటిక్స్
ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా రోజుకు 14 గంటలు గృహవిద్యుత్ కోత. ఈ శుక్రవారం నుంచి ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే ప్రభుత్వ కార్యాలయాలు. ఆఫీసుల్లో ఏసీల వాడకంపై నిషేధం విధిస్తూ సాక్షాత్తూ ప్రభుత్వ ఆదేశాలు. విద్యుత్‌ను పొదుపుగా వాడాలంటూ, వీలైనంత ఆదా చేయాలంటూ విజ్ఞప్తులు. ఉష్ణోగ్రతలు పెరిగి, వరి నాట్లు జోరుగా సాగుతున్న వేళ పొలాల్లో కరెంట్ లేదు. ఇంట్లో చమటలు కక్కుతున్నా కనీసం ఫ్యాన్లు తిరిగే పరిస్థితి లేదు. చివరకు వ్యవసాయానికి కీలకమైన ఈ సీజన్లో పొలాలకూ, ఇళ్ళకూ కరెంట్ సరఫరాను మళ్ళించడం కోసం అక్కడి రాష్ట్ర విద్యుత్ సంస్థ (పీఎస్‌పీసీఎల్) విద్యుత్తును భారీగా వినియోగించే పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పాటు పూర్తిగా తప్పనిసరి విద్యుత్ కోత విధించింది. ఇదీ – పంజాబ్‌లో ఇప్పుడు నెలకొన్న స్థితి. మునుపెన్నడూ అక్కడ చూడని విద్యుత్ సంక్షోభ పరిస్థితి. ‘పంజాబ్ పరిస్థితి దిగజారిపోయింది’ అని ప్రతిపక్ష ‘శిరోమణి అకాలీదళ్’ (ఎస్ఏడీ) వీధికెక్కి నిరసనలు చేస్తున్నది అందుకే! పనిలో పనిగా ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌లో పాగా వేసేందుకు స్వరం పెంచారు. అధికార కాంగ్రెస్ పార్టీ నేత– మాజీ క్రికెటర్ నవ జోత్ సింగ్ సిద్ధూ సైతం ‘సరైన దిశలో చర్యలు చేపడితే, పవర్ కట్ అవసరమే లేదు’ అని సవాలక్ష సూచనలిస్తూ, స్వపక్ష సర్కారుపైనే బౌన్సర్లు విసురుతున్నారు. వెరసి, కొద్దినెలల్లో పంజాబ్ ఎన్నికలు జరగాల్సిన వేళ ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల నోటా వినిపిస్తున్న మాట ఒకటే – ‘పవర్’! ఇటు ఎలక్ట్రికల్ పవర్, అటు పొలిటికల్ పవర్!! రాజకీయాల్లో కావాల్సినంత అనుభవం ఉన్నప్పటికీ, ఈ ముప్పేటదాడిలో పంజాబ్ పాలకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ చమటలు కక్కుతున్నారు. అన్నవస్త్రాల లాగానే అన్నిటికీ విద్యుత్ అత్యవసరమైన కాలమిది. గద్దెనెక్కాలనుకొనే పెద్దలెవ రైనా సరే ఇంటికీ, పొలాలకూ, పరిశ్రమలకూ నిరంతరాయమైన విద్యుత్ సరఫరా చేస్తామనేదీ అందుకే! విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ సరఫరా అనేక సందర్భాలలో అన్ని రాష్ట్రాలలో ఓ ఎన్నికల అజెండా. రానున్న పంజాబ్ ఎన్నికలలోనూ అదే కీలక అంశం కానుందని ఈపాటికే అందరికీ అర్థమై పోయింది. అత్యంత సారవంతమైన భూమితో, భారతదేశ ధాన్యాగారంగా పేరొందిన వ్యవసాయ ఆధారిత పంజాబ్ రాష్ట్రంలో ప్రధాన ఓటు బ్యాంకు రైతులే! కానీ, కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృ త్వంలోని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చినట్టుగా వ్యవసాయానికి రోజూ ఎనిమిది గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయలేకపోతోంది. పెరిగిన ఉష్ణోగ్రతలు, వ్యవసాయ సీజన్ కావడంతో పంజాబ్‌లో విద్యుత్ గిరాకీ ఒక్కసారిగా 14,500 మెగావాట్లకు చేరింది. సరఫ రాకూ, గిరాకీకి మధ్య 1500 మెగావాట్ల లోటు తలెత్తింది. అందువల్లే, ఇప్పుడింత విద్యుత్ కోత. పంజాబ్ ప్రభుత్వానికి సొంత విద్యుదుత్పాదక కేంద్రాలున్నా, అవి చాలక ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తోంది. ప్రైవేటులో కొన్న పవర్ వల్ల సహజంగానే అక్కడి ప్రజలపై ఆ భారం పడుతోంది. నెలవారీ బిల్లులు తడిసిమోపెడవుతున్నాయి. ఇక, ఏటా రాష్ట్రంలో విద్యుత్ గిరాకీ సగటున 500 మెగావాట్ల మేర పెరుగుతుంటుంది. లాక్డౌన్ వల్ల నిరుడు తగ్గినా, ఈసారి మళ్ళీ గిరాకీ ఉంటుందని అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దాంతో, పంజాబ్ ప్రజానీకం కరెంట్ కోసం కటకటలాడు తోంది. ఊహించని విపత్తులో పడి సర్కారు విలవిలలాడుతోంది. ఒకరకంగా ఇది సర్కారీ స్వయంకృతాపరాధమే. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ప్రభుత్వ అజమాయిషీలోని భటిండా సౌర విద్యుత్ కేంద్రాన్నీ, అలాగే రోపార్‌లోని మరో సౌర విద్యుత్ కేంద్రంలోని రెండు యూనిట్లనూ మూసేసింది. అలా 880 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం తగ్గిపోయింది. ఓ లోటును భర్తీ చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లేమీ చేయకపోగా, అనేక కొత్త యూనిట్ ప్రతిపాదనల్ని కూడా సర్కారు తోసిపుచ్చింది. పోనీ, బయట నుంచి కొందామంటే, రాష్ట్ర విద్యుత్ సంస్థ వద్ద నిధులు లేవు. వ్యవసాయ సబ్సిడీలు, ఆఫీసు కరెంట్ బిల్లులు కలిపి ఆ సంస్థకు రూ. 7 వేల కోట్లు ప్రభుత్వమే బాకీ ఉంది. ఏటా 10 వేల కోట్ల పైగా సబ్సిడీ భారంతో పాటు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లోని లోపాలు, విద్యుత్ చౌర్యాన్ని అరికట్టడంలో అశ్రద్ధ – ఇవన్నీ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందమయ్యాయి. వాటిని అరికట్టే రాజకీయ సంకల్పం కొరవడింది. తప్పు మీద తప్పు చేసిన పంజాబ్ సీఎం అమరీందర్‌కు సొంత పార్టీలోనూ శాంతి లేదు. ఆయన, çస్వపక్షంలో విపక్షమైన సిద్ధూ – ఇద్దరూ పాటియాలా జిల్లాకు చెందినవారే. ఇద్దరూ జాట్ సిక్కులే. కానీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సిద్ధూ మూన్నాళ్ళ క్రితం ప్రియాంక, రాహుల్‌లను కలుసుకొన్నప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిని చేస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చిందట. అయినా సరే, సొంత పార్టీ ముఖ్యమంత్రిపై సిద్ధూ బ్యాటింగ్ దాడి కొనసాగిస్తుండడం గమనార్హం. ఇదే అవకాశంగా కేజ్రీవాల్ ఏకంగా దేశం మొత్తంలో పంజాబ్‌లోనే విద్యుత్ ఛార్జీలు ఎక్కువని వాస్తవ విరుద్ధంగా విమర్శించారు. అధికారంలోకొస్తే ప్రతి ఇంటికీ నెలకు 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని ఉదారంగా హామీ ఇచ్చారు. అమరీందర్ సైతం ఈ మధ్య 70 లక్షల మంది గృహ వినియోగదారులకు లబ్ధి కలిగేలా పవర్ ట్యారిఫ్ కూడా తగ్గించారు. 1965 ఇండో–పాక్ యుద్ధంలో పాల్గొన్న అనుభవం ఉన్న ఈ మాజీ సైనికాధికారికి రానున్న ఎన్నికల యుద్ధం నల్లేరుపై బండి నడక కాదు. ఎన్నికలలో కరెంట్ షాక్ కొట్టకముందే ఆయన, ఆయన పార్టీవారు కళ్ళు తెరుస్తారా అన్నది ప్రశ్న. -
ముంబై పవర్‌కట్: డ్రాగన్ పనే!
న్యూఢిల్లీ: గతేడాది దేశ ఆర్థిక రాజధాని ముంబై వ్యాప్తంగా భారీ పవర్ కట్ సంభవించిన సంగతి తెలిసిందే. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారి అజాగ్రత్త వల్లనో.. లేక మరే ఇతర కారణాల వల్లనో ఈ పవర్ కట్ సంభవించి ఉంటుందని భావించారు జనాలు. కానీ వాస్తవం ఇది కాదట. నాటి ముంబై పవర్ కట్ వెనక చైనా హ్యాకర్లు ఉన్నారట. ఈ విషయాన్ని ఓ అమెరికన్ సంస్థ వెల్లడించింది. డ్రాగన్ దేశం సరిహద్దుల్లోనే కాక మన దేశంలోకి కూడా తొంగి చూస్తోందనే వార్త ప్రస్తుతం ఆందోళనలు రేకెత్తిస్తోంది. కాగా గతేడాది సరిహద్దు ఉద్రిక్తత సమయంలోనే చైనా ఈ కుతంత్రానికి పాల్పడినట్లు తెలుస్తోంది.. ఆ సమయంలో డ్రాగన్.. మన దేశ విద్యుత్తు రంగంపై గురిపెట్టిందని.. మన ప్రభుత్వానికి చెందిన విద్యుత్తు సంస్థల కంప్యూటర్ నెట్‌వర్క్‌లు, లోడ్ డిస్పాచ్ సెంటర్లు తదితర వాటిని చైనా ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న హ్యాకింగ్ గ్రూప్‌లు లక్ష్యంగా చేసుకున్నాయని అమెరికాకు చెందిన సదరు సంస్థ వెల్లడించింది. గతేడాది అక్టోబరు 12న ముంబైలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా స్తంభించి అనేక రైళ్లు, ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు, స్టాక్ మార్కెట్ లావాదేవీలు వంటి తదితర కార్యక్రమాలు నిలిచిపోయాయి. శివారు ప్రాంతాల్లో అయితే 10 నుంచి 12 గంటలు కరెంట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, ఈ కరెంట్ కట్కు.. సరిహద్దు వివాదంతో సంబంధం ఉందని అమెరికాలోని రికార్డెడ్ ఫ్యూచర్ అనే సంస్థ ఓ అధ్యయనం ద్వారా వెల్లడించింది. ఉద్రిక్తతల సమయంలో భారత పవర్‌గ్రిడ్‌పై చైనా సైబర్ నేరగాళ్లు గురిపెట్టారని, సరిహద్దులో భారత్ వెనక్కి తగ్గకపోతే దేశమంతా అంధకారంలోకి వెళ్తుందని చైనా ‘ముంబయి పవర్‌కట్’తో హెచ్చరించిందని సదరు సంస్థ తెలిపింది. చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న రెడ్ఎకో గ్రూప్ అనే సంస్థ భారత్‌లోని ఎన్టీపీసీ సహా ఐదు ప్రైమరీ లోడ్ డిస్ప్యాచ్ సెంటర్లు, విద్యుత్ సంస్థల కంప్యూటర్ నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థల్లోని 21 ఐపీ అడ్రస్‌లపై హ్యాకర్లు దాడి చేసినట్లు తెలిపింది. ఈ ఐపీ అడ్రస్‌ల ద్వారా విద్యుత్ సరఫరాను నిర్వహించే కంట్రోల్ సిస్టమ్స్‌లోకి సైబర్ నేరగాళ్లు మాల్వేర్ను ప్రవేశపెట్టినట్లు రికార్డెడ్ ఫ్యూచర్ నివేదిక పేర్కొంది. మహారాష్ట్రలోని పద్గాలో గల లోడ్ డిస్పాచ్ సెంటర్లో ఈ మాల్వేర్ కారణంగానే సాంకేతిక లోపం తలెత్తిందని, ఇది ముంబయిలో భారీ పవర్‌కట్‌కు దారితీసిందని అధ్యయనం పేర్కొంది. వాస్తవానికి గల్వాన్ ఘర్షణ జరిగిన తర్వాత కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్.కె. సింగ్ మాట్లాడుతూ.. చైనాలో తయారయ్యే విద్యుత్ పరికరాల్లో మాల్వేర్ ఉందేమో అన్న అంశంపై తనిఖీలు ముమ్మరం చేస్తామని తెలిపారు. ఆయన ఈ విషయం చెప్పిన కొన్ని నెలలకే ముంబయిలో గ్రిడ్ విఫలం కావడం గమనార్హం. కాగా.. సరిహద్దు వివాదానికి తెరదించేలా ఇటీవల భారత్, చైనా కీలక ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పాంగాంగ్ సరస్సు వద్ద రెండు దేశాలు బలగాలను ఉపసంహరించాయి. ఇలాంటి సమయంలో ఈ అధ్యయనం వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. చదవండి: ఢిల్లీ ఓటమి.. అందుకే ముంబైలో పవర్ కట్! ఆ వ్యూహం మా దగ్గర పని చేయదు: నరవాణే -
టెక్సాస్‌పై మంచు దుప్పటి
డల్లాస్: అమెరికా దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా టెక్సాస్ మంచు పంజా బారినపడి గజగజలాడుతోంది. తీవ్రంగా వీస్తున్న మంచు తుఫాను గాలుల ధాటికి టెక్సాస్‌లో పవర్ ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది. ఇప్పటికే రాష్ట్రం నుంచి పలు విమానాలను రద్దు చేశారు. డల్లాస్, హూస్టన్ నగరాలల్లో ఉష్ణోగ్రతలు మైనస్‌ల్లోకి పడిపోయాయి. హిమపాతం సమయంలో ఇతర ప్రమాదాలు నివారించేందుకు టెక్సాస్ విద్యుత్ శాఖ(ఎర్కాట్) పలు ప్రాంతాల్లో కరెంటు కోతలను ఆరంభించింది. ప్రజలు సురక్షితంగా ఉండడమే ప్రధానమని, ఈ సమయంలో విద్యుత్ వాడకం తగ్గించేందుకే కోతలు విధిస్తున్నామని తెలిపింది. విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తిగా స్తంభించకుండా ఉండేందుకే ఈ కోతలని తెలిపింది. కోతల కారణంగా దాదాపు 23 లక్షల మంది ప్రభావితమయ్యారని వెబ్సైట్లు పేర్కొన్నాయి. రాష్ట్రంలోని పలు నగరాల్లో కరెంటు కోతలు, ట్రాఫిక్ కష్టాలపై అధికారులు ప్రజలను సమాయత్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 254 కౌంటీలకు గవర్నర్ గ్రెగ్ అబాట్ డిజాస్టర్ డిక్లరేషన్ జారీ చేశారు. ఎక్కడికక్కడ నేషనల్ గార్డ్ యూనిట్లను సమాయత్తం చేశారు. టెక్సాస్‌లో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు అధ్యక్షుడు జోబైడెన్ ఆదివారం రాత్రి ప్రకటించారు. -
జపాన్‌లో భారీ భూకంపం
టోక్యో: జపాన్‌లో శనివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. తీరప్రాంతమైన ఫుకుషిమా, మియాగి పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైనట్లు తెలిపారు. జపాన్ సముద్రంలో 60 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఆ దేశ వాతావరణ ఏజన్సీ చెప్పింది. భారీ భూకంపమే అయినప్పటికీ సునామీ ఉండకపోవచ్చని స్పష్టం చేసింది. ఫుకుషిమాలోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో ప్రస్తుతానికి ఏం సమస్యా ఎదురు కాలేదని అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా ఎనిమిదిన్నర లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కో తెలిపింది. క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ప్రభుత్వం చెప్పింది. తక్షణ సాయం అందించేందుకు జపాన్ ప్రధాని కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి సమాచారం సేకరిస్తున్నారు. పలు వార్తాల చానెళ్లలో భూకంపం కారణంగా పెచ్చులూడిన ఇళ్లు కనిపించాయి.