ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో మరో భారత రాయబారికి చేదు అనుభవం ఎదురైంది. ఇస్లామాబాద్‌లో భారత రాయబారి నివాసంలో పాకిస్తాన్ అధికారులు ఉద్దేశపూర్వకంగా నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. డిసెంబర్ 25న జరిగిన ఈ ఘటనపై భారత హైకమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ విదేశాంగ శాఖకు లేఖ రాసింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
ఇస్లామాబాద్‌లో కొత్తగా నిర్మించిన భారత హైకమిషన్ నివాస సముదాయానికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు పాకిస్తాన్ నిరాకరిస్తున్న సమయంలోనే తాజా విద్యుత్ కోత ఘటన వెలుగుచూడటం గమనార్హం. కొత్త భవనాలకు టెలికాం కనెక్షన్లు సమకూర్చని పాకిస్తాన్.. భారత్ పంపిన సామగ్రిని సరిహద్దుల్లోనే నిలిపేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment