లైట్లు వెలుగకపోవడంతో ఏటీఎం కేంద్రంలో నెలకొన్న చీకటి
మద్నూర్(జుక్కల్) నిజామాబాద్ : ఏటీఎం కేంద్రాల వద్ద అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని దొంగలు దోచుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న సందర్భాల్లో ఏటీఎం కేంద్రం అంధకారంలో ఉంటే ఇంకేముంది. మండల కేంద్రంలోని ఆంధ్రాబ్యాంక్ ఏటీఎం కేంద్రంలో ఆదివారం లైట్లు వెలగకపోవడంతో లబ్ధిదారులు చీకట్లోనే డబ్బులను డ్రా, విత్‌డ్రాలు చేసుకున్నారు. జన సంచారం లేని ప్రాంతంలో బ్యాంకు ఉండడంతో వినియోగదారులు డబ్బులు డ్రా చేసేందుకు, జమ చేసేందుకు భయపడ్డారు. ఏటీఎం కేంద్రం వద్ద తప్పకుండా సెక్యురిటీ గార్డు, కేంద్రంలో విద్యుత్ లైట్లు ఉండేలా ఇప్పటికైనా బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment