darkness
-
వెయిటర్గానే ఉండిపోతానేమో అనుకున్నాడు...కట్ చేస్తే..!
అవార్డ్ విజేత, చిత్రకారుడు దీనా సో ఓతేహ్ నీడ– కాంతిలో విలక్షణతను చూపడంలో మాస్టర్. యునైటెడ్ స్టేట్స్లో ఉండే ఈ కళాకారుడి చిత్రాలు మిగతా వాటితో పోల్చితే చాలా భిన్నంగా ఉంటాయి. చీకటి నుండి వెలువడే ప్రకాశవంతమైన చిత్రాలను మన కళ్లకు కడతాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటాన్ని ‘చిత్రం’గా చూపుతాడు. గురువెవ్వరూ లేకుండానే తన ఊహల్లో నుండి పుట్టుకువచ్చిన కళ గురించి వివరిస్తుంటే వినేవారు చాలా అబ్బురంగా చూస్తారు. ‘‘మా అమ్మ చిన్నప్పటి నుండి నాలో కళాత్మక అభిరుచిని గుర్తించింది. దానిని పెంపొందించడానికి ప్రాధాన్యతను ఇచ్చింది. నేను మంచి కళాకారుడిగా మారుతానని ముందే అనుకున్నాను. కళను వృత్తిగా కొనసాగించాలనే ఆలోచన చాలా ఆలస్యంగా వచ్చింది. నాకు 12 ఏళ్ల వయసులో నా కుటుంబం యునైటెడ్ స్టేట్స్కు వలస వచ్చింది. నాటి పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. మా అమ్మనాన్నలు విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో మాకు సంబంధించిన న్యాయపరమైన పత్రాలన్నీ నాన్న తనతో తీసుకెళ్లిపోయారు. సరైన పత్రాలు లేకపోవడంతో 18 ఏళ్ల వయసులో చదవుకు స్కాలర్షిప్కు అర్హత కోల్పోయాను. దీంతో ఎనిమిదేళ్లు వెయిటర్‌గా పనిచేశాను. అప్పుడు నా కెరీర్ వెయిటర్ అనే అనుకున్నాను. అనిశ్చితి నుంచి నైపుణ్యాలుమొదట నేను ఫైన్ ఆర్ట్ ఆర్టిస్ట్‌ను కాదు. సరైన పత్రాలు లేక΄ోవడం వల్ల వలసదారునిగా ఎనిమిదేళ్లు అనిశ్చితిని ఎదుర్కొన్నాను. ఇష్టపడే పని చేస్తున్నప్పుడే స్థిరత్వం లభించడం ప్రారంభమైంది. నాకు నేను స్వయంగా ఇలస్ట్రేషన్స్ వేసేవాణ్ణి. ఈ సాధన ద్వారా ఇలస్ట్రేషన్ నా నైపుణ్యాలు పెరిగాయి. అది ఎంతగా అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్‌లో డిగ్రీ సాధించాను. మాస్టర్స్ ప్రోగ్రామ్ద్వారా స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్‌లో మరింత అధ్యయనం సాధ్యమైంది. అప్పుడే ఇలస్ట్రేషన్ నాకు సరిగ్గా సరి΄ోతుందనిపించింది. కథలు చెప్పడం, నేర్చుకోవడం, సమస్యను పరిష్కరించడం, సృష్టించడం... ఇలా ప్రతీది నా మనో వికాసానికి, వృద్ధికి ఇలస్ట్రేషన్ ఆర్ట్ కొత్త తలుపులు తెరిచింది. చివరకు నాది అయిన మార్గంలో ఉన్నట్టు అనిపించింది. ఇదంతా సాధ్యమైంది మా అమ్మ ద్వారా. ఆమే నన్ను నేను గర్వపడేలా చేసింది.నిశ్శబ్దం నుంచి...పరధ్యానాన్ని నివారించడానికి సాధారణంగా స్కెచ్ వేయడం ప్రారంభిస్తాను. కొన్నిసార్లు తెల్లవారుజామున 4–5 గంటల సమయాన్ని ఎంచుకుంటాను. ఆ నిశ్శబ్ద సమయం, ప్రపంచం మేల్కొనే ముందు నేను చాలా సృజనాత్మకంగా ఉంటాను. పరధ్యానాల నుండి విముక్తి పొందుతాను. ఏదైనా ‘రంగు’లోనే ఆలోచిస్తాను. ఎందుకంటే అది ఏదో ఒక చిన్న సృష్టికి కారణం అవుతుంది. అక్కడ నుంచి నా స్కెచ్లకు విస్తృతంగా పని దొరుకుతుంది. ఆరిస్ట్ మార్షల్ అరిస్కాన్ ఎప్పుడూ ఒక మాట చెబుతాడు ‘మీకు తెలిసిన వాటిని గీయండి’ అని. ఆ పదాన్ని అర్ధం చేసుకోవడానికి నాకు సమయం పట్టింది. కానీ, కాలక్రమేణా అది స్పష్టమైంది. కాంతి–చీకటి మధ్య అంతర్గత పోరాటం నాకు తెలిసింది. నేను నా జీవితంలో చాలా చీకటి కాలాలను ఎదుర్కొన్నాను. పోరాటాలకు మించిన అందం వాటిలోనే ఉందని నా ప్రగాఢ నమ్మకం. ఒక అంశంపై తగినంత అవగాహన లేకుండా పని మొదలుపెడితే ఆందోళన కలుగుతుంది. అయితే, ఆ క్షణంలో నేను నా అహం, ఊహాత్మక తీర్పులను, ఫెయిల్ అవుతానేమో అనే భయాలను వదిలేస్తూ ఆర్ట్‌లోకి ప్రయాణిస్తాను’’ అని వివరిస్తాడు ఈ చిత్రకారుడు View this post on Instagram A post shared by Nautilus Magazine (@nautilusmag) -
మన ముంగిళ్లలో వెలుగు పూలు
సాధారణంగా అమావాస్యనాడు చిక్కటి చీకట్లు అలముకుని ఉంటాయి. అయితే దీపావళి అమావాస్యనాడు మాత్రం అంతటా వెలుగుపూలు విరగపూస్తాయి. చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఇంట ఉల్లాసం, ఉత్సాహం వెల్లివిరుస్తాయి. ముంగిళ్లన్నీ దీపకాంతులతో కళకళలాడే ఈ పర్వదినం ప్రాముఖ్యత, ఆచార సంప్రదాయాలను తెలుసుకుని ఆచరిద్దాం...దీపావళికి సంబంధించి కథలెన్నో ఉన్నప్పటికీ శ్రీ కృష్ణుడు సత్యభామ సమేతుడై... లోక కంటకుడైన నరకాసురుని వధించిన సందర్భంగా మాత్రమే దీపావళి జరుపుకుంటున్నామన్న కథే బహుళ ప్రాచుర్యంలో ఉంది.నరకాసుర వధభూదేవి కుమారుడైన నరకుడు ప్రాగ్జ్యోతిషపురమనే రాజ్యాన్ని పాలించేవాడు. నరకుడు అంటే హింసించేవాడు అని అర్థం. పేరుకు తగ్గట్టే ఉండాలని కాబోలు.. రాజై ఉండి కూడా దేవతల తల్లి అదితి కర్ణకుండలాలను, వరుణుడి ఛత్రాన్ని అపహరించాడు. దేవతలను, మానవులను, మునులను హింసల పాల్జేసేవాడు. దేవతల మీదికి పదేపదే దండెత్తేవాడు. వాడు పెట్టే హింసలు భరించలేక అందరూ కలసి శ్రీ కృష్ణుని దగ్గర మొరపెట్టుకోగా, కృష్ణుడు వాడిని సంహరిస్తానని మాట ఇచ్చి, యుద్ధానికి బయలుదేరాడు. ప్రియసఖి సత్యభామ తాను కూడా వస్తానంటే వెంటబెట్టుకెళ్లాడు. యుద్ధంలో అలసిన కృష్ణుడు ఆదమరచి, అలసట తీర్చుకుంటుండగా అదను చూసి సంహరించబోతాడు నరకుడు. అది గమనించిన సత్యభామ తానే స్వయంగా విల్లందుకుని వాడితో యుద్ధం చేస్తుంది. ఈలోగా తేరుకున్న కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి, వాడిని సంహరిస్తాడు.లోక కంటకుడైన నరకాసురుని వధ జరిగిన వెంటనే ఆ దుష్టరాక్షసుడి పీడ వదిలిందన్న సంతోషంతో దేవతలు, మానవులు దీపాలను వెలిగించి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అప్పటినుంచి ప్రతి ఏటా దీపావళి పండగ జరుపుకోవడం ఆచారంగా మారింది.ఈ పర్వదినాన ఇలా చేయాలి...ఈ రోజున తెల్లవారు జామునే తలకి నువ్వుల నూనె పెట్టుకుని, తలంటుస్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు ఆకులను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వపాపాలను హరింపజేయడమే గాక గంగాస్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం.దీపావళి నాడు విధివిధానంగా లక్ష్మీపూజ చేయాలి. ఎందుకంటే, దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లలో తన కళను ఉంచి వెళుతుందని శాస్త్రవచనం. అందుకే దీపావళి నాడు ఇంటిని వీలైనంత అందంగా అలంకరించాలి.దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి?దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది. వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారంలో (బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో), తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి. అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పురాతన వృక్షాల వద్ద, ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి. అలాగే నాలుగు వీధుల కూడలిలో దీపం వెలిగించాలి. నువ్వులనూనె దీపాలనే వెలిగించడం, మట్టి ప్రమిదలనే వాడడం శ్రేష్ఠం. దీపావళి పితృదేవతలకు సంబంధించిన పండుగ కాబట్టి ఈనాటి సాయంత్రం గోగు కాడల మీద దివిటీలు వెలిగించి తిప్పుతారు. ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయని, తద్వారా పితృదేవతలు సంతోషిస్తారని, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుందనీ విశ్వాసం.దీపావళి నాటి అర్ధరాత్రి చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతో కొడుతూ, తప్పెట్ల చప్పుళ్లతోనూ, డిండిమం అనే వాద్యాన్ని వాయిస్తూ జ్యేష్ఠలక్ష్మిని (దరిద్ర దేవతను) సాగనంపాలని, లక్ష్మీదేవికి పచ్చకర్పూరంతో హారతినివ్వాలనీ శాస్త్రవచనం.లక్ష్మీపూజ ఇలా చేయాలి...ఇంటిగుమ్మాలను మామిడి లేదా అశోకచెట్టు ఆకుల తోరణాలతోనూ, ముంగిళ్లను రంగవల్లులతోనూ తీర్చిదిద్దాలి. అనంతరం... ఒక పీటను శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీద కొత్త కండువా పరిచి, బియ్యం ΄ోసి లక్ష్మీదేవి, గణపతి ప్రతిమలను ఉంచాలి. కలశం పెట్టే అలవాటున్న వారు ఆనవాయితీ తప్పకూడదు. ఆ ఆచారం లేనివారు అమ్మవారిని ధ్యానావాహనాది షోడశోపచారాలతో పూజించాలి. వ్యాపారస్తులైతే పూజలో కొత్త పద్దుపుస్తకాలను ఉంచాలి. మిగిలినవారు నాణాలను, నూతన వస్త్రాభరణాలను, గంధ పుష్పాక్షతలు, మంగళకరమైన వస్తువులను ఉంచి యథాశక్తి పూజించాలి. దీపావళి నాడు లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోనూ, ఇంద్రకృత మహాలక్ష్మీ అష్టకంతోనూ పూజించడం సత్ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీపూజలో చెరకు, దానిమ్మ, గులాబీలు, తామర పువ్వులు, వెండి వస్తువులు ఉంచి, ఆవునేతితో చేసిన తీపి వంటకాలను నివేదిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రోక్తి. సాయంత్రం వేళ నూత్న వస్త్రాలు ధరించి పెద్దల ఆశీస్సులు అందుకోవాలి. అనంతరం బాణసంచా కాల్చి, నోరు తీపి చేసుకోవాలి. – డి.వి.ఆర్. భాస్కర్ -
Hurricane Milton: మిల్టన్ ధాటికి ఫ్లోరిడా అతలాకుతలం
మిల్టన్ తుఫాను ఫ్లోరిడాలో బీభత్సం సృష్టించింది. భయంకరమైన గాలులు, వర్షంతో నగరాలను అతలాకుతలం చేసింది. సెయింట్ లూసీ కౌంటీలో టోర్నడోల ధాటికి ఐదుగురు మరణించారు. విద్యుత్ లేక 30 లక్షల మంది అంధకారంలో ఉండిపోయారు. బుధవారం రాత్రి 3 కేటగిరీగా తీరం దాటిన తుఫాను తరువాత ఒకటో కేటగిరీకి బలహీనపడింది. అయినా ముప్పు ఇంకా పొంచి ఉందని అధికారులు పునరుద్ఘాటించారు. టంపా: మిల్టన్ ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు ఫ్లోరిడా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. గంటకు 205 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. బుధవారం ఉదయం దక్షిణ ఫ్లోరిడాలోని కొన్ని ప్రాంతాల్లో టోర్నడోలు సంభవించాయి. సెయింట్ లూసీ కౌంటీలో టోర్నడోల ధాటికి ఐదుగురు మృతి చెందారు. ఫ్లోరిడా అట్లాంటిక్ తీరంలోని ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఫోర్ట్ మైయర్స్లో మరో టోర్నడో ధాటికి చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్థంభాలు నేలకొరగడంతో రాష్ట్రవ్యాప్తంగా 33 లక్షల మంది అంధకారంలో ఉండిపోయారు. హార్డీ కౌంటీ, హైలాండ్స్ కౌంటీతో సహా పలు ప్రదేశాల్లో 90% మందికి విద్యుత్ అంతరాయం కలిగింది. సానిబెల్ నగరంలో రోడ్లన్నీ వరదతో ముంచెత్తాయి. రహదారులపై 3 అడుగుల మేర నీరు చేరింది. వరదలతో టంపా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. నేపుల్స్లో రికార్డు స్థాయిలో నీరు నిలిచింది. తుఫాను ధాటికి తీవ్ర ప్రాణ నష్టం జరిగి ఉంటుందని, అయితే ఎంత మంది చనిపోయారనేది చెప్పలేమని అధికారులు వెల్లడించారు. అత్యధిక వర్షపాతం... సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 41 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వెయ్యేళ్లలో ఇదే అత్యధిక వర్షపాతం. ఈదురు గాలులు ట్రోపికానా ఫీల్డ్ పైకప్పును చీల్చాయి. తుపాను ధాటికి పలు క్రేన్లు కూడా కూలిపోయాయి. మంచి నీటి సరఫరాను సైతం నిలిపేశారు. సుదీర్ఘ విద్యుత్ అంతరాయాలు, మురుగునీటి పారుదల వ్యవస్థ సైతం మూతపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓర్లాండోలో వాల్ డిస్నీ వరల్డ్, యూనివర్సల్ ఓర్లాండో, సీ వరల్డ్ సంస్థలు గురువారం మూతపడ్డాయి. పలు ఫ్లోరిడా విమానాశ్రయాలను నిరవధికంగా మూసివేశారు. హరికేన్ కలిగించిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. పొంచి ఉన్న ముప్పు.. హెలెన్ హరికేన్‌తో ఇప్పటికే దెబ్బతిన్న ఫ్లోరిడాను మిల్టన్ మరింత దుస్థితిలోకి తీసుకెళ్లింది. ఈ ఏడాది అమెరికాను తాకిన ఐదో హరికేన్ ఇది. ఫ్లోరిడాలోని అట్లాంటిక్ తీరానికి 75 మైళ్ల దూరంలో మిల్టన్ కేంద్రీకృతమై ఉందని నేషనల్ హరికేన్ సెంటర్ (ఎన్‌హెచ్‌సీ)తెలిపింది. దీని ప్రభావంతో తూర్పు మధ్య, ఈశాన్య ఫ్లోరిడాలో ఈదురుగాలులు వీస్తాయని, ఫ్లోరిడా, జార్జియా, దక్షిణ కరోలినా తూర్పు తీరం వెంబడి తుఫాను ముప్పు ఇంకా ఉందని వెల్లడించింది. అధికారులు ఫ్లోరిడా, ఇతర రాష్ట్రాలకు చెందిన 9,000 మంది నేషనల్ గార్డ్ సభ్యులతో సహాయక చర్యలు చేపట్టారు. కాలిఫోరి్నయా వరకు 50,000 మందికి పైగా యుటిలిటీ కారి్మకులను అందుబాటులో ఉంచారు. టంపా, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని 60 శాతానికి పైగా గ్యాస్ స్టేషన్లలో బుధవారం రాత్రే గ్యాస్ నిండుకోవడంతో గ్యాసోలిన్ ట్యాంకర్లను తరలించడానికి సైరన్లతో హైవే పెట్రోలింగ్ కార్లు పనిచేస్తున్నాయి. -
వీథి దీపం వెలగకపోతే...!!!
‘అచ్చమైన దీప సన్నిధిని మరుగిడబడి చెఱచినట్లున్నది...’. అంటున్నాడు త్యాగయ్య ఆ కీర్తనలో. కాంతినివ్వడం ఒక్కటే దీపశిఖ లక్షణం. దీపానికీ, ఈశ్వరుడికీ ఓ లక్షణం ఉంటుంది. వీథి దీపం వెలుగుతుంటే ఆ వెలుగులో అక్కడేమయినా పామున్నా, తేలున్నా తెలుస్తుంది. గుంటలు, రాళ్ళురప్పా కనబడతాయి... అని చెప్పి ‘ఓ దీపమా! నా మార్గమును నిష్కంటకం చేసితివి, నాకు దారి చూపితివి. నీకిదే నా నమస్కారం..’ అంటూ ధ్యానశ్లోకాలంటూ ఏమీ ఉండవు దానికి. అయితే మనకు దారి చూపినందుకు దానికేసి గౌరవంగా చూస్తాం. ఓ రోజున ఒక ధూర్తుడు రాయి విసిరి దాన్ని పగలగొట్టాడు. ఇంతమందికి వెలుగిచ్చే దీపం, ఇంతమందికి దారిచూపే దీపం... అది మలిగిపోయేటట్లు చేస్తే ... రాయి విసిరినవాడిపై ఆ దీపమేమీ తిరగబడదు. ఆ వెలుగు ప్రయోజనాన్ని అనుభవిస్తున్న మనం దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ‘‘అది లేకపోయినా ఫరవాలేదు. మా బతుకు మేం బతికేస్తాం ...’’ అంటే దీపానికి వచ్చిన నష్టమేమీ లేదు... మనకు మాత్రం ఆ చీకటే మిగులుతుంది, దానిలో దేవులాటే ఉంటుంది. భగవంతుడు కూడా అంతే. ‘నివాసవృక్షః సాధూనాం ఆపన్నానాం పరాగతిః/ఆర్తానాం సంశ్రయశ్చైవ యశసః చ ఏకభాజనమ్’.. అంటారు కిష్కింధకాండలో. భగవంతుడున్నాడు.. అని నీవు నమ్మి బతకగలిగితే భగవదనుగ్రహం. ఆయనేమిటి ? ఆయనెందుకు?.. అని చెప్పి ఆయనను తిరస్కరిస్తే చీకటి మిగిలేది మనకే, ఆయనకు కాదు. ‘అచ్చమైన దీపశిఖ సన్నిధిని మరుగు అడ్డుపడి చెఱచినట్టున్నది...’ ఓ దట్టమైన బట్టలాంటిది అడ్డు వచ్చిందనుకోండి.. అప్పుడు ఆ వెలుతురూ ఉండదు. దాని సహాయంతో చూసే అవకాశమూ ఉండదు. కాబట్టి ఆ దీపశిఖ నాకు కనబడడం లేదు... అంటే ఆ దీప శిఖ మరేదోకాదు, పరబ్రహ్మమే. అది ఒక్కటే వెలుగుతోంది. ‘‘లోకంబులు లోకేశులు లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెంజీకటికవ్వల నెవ్వండేకాకృతి వెలుగునతని నే సేవింతున్’’ అంటారు పోతన గారు భాగవతంలో...అటువంటి వెలుగు ఇక్కడ వెలుగుతుంది. కానీ ఆ దీపం కనబడకుండా ఒక తెర అడ్డుపడుతున్నది. ఈ తెరను నేను తీయలేను ... అని ఆర్తితో వేడుకుంటున్నాడు త్యాగయ్య. ఇదెలా ఉందంటే...‘మత్స్యము ఆకలిగొని గాలముచే మగ్నమైన రీతియున్నది’ అని పోలికను చెబుతున్నాడు. చేప దానిదారిన అది పోతూ దారిలో కనిపించిన ఎరచూసి ఆశపడింది. దాన్ని కొరికింది. ‘మఛ్లీ జల్ కా రాణీ, ఉస్కా జీవన్ పానీ, హాథ్ లగావ్ తో డర్ జాయేగీ, బాహర్ నికాలేతో మర్ జాయేగీ’’.. ఇంకేముంది.. నీళ్ళలోంచి తీసి భూమ్మీద పడేస్తే చచ్చిపోయింది. అంటే తిందామనుకుని తినబడింది. ఈ మత్సరమను తెరతీయనంతకాలం నా పరిస్థితీ ఇంతే.. దీపం కనిపించదు.. స్వామీ ఆ తెరతీయి.. అంటే. అరిషడ్వర్గాల గురించీ నీ ద్వారా ఒక సందేశం లోకానికి అందాలని అనుకున్నాడేమో, ఆయన ఆ తెరనుదీసి దర్శనమిచ్చాడు. ఇదీ సంగీతంవల్ల, పాట పాడడం వల్ల, వినడం వల్ల ప్రయోజనం. అది ఆయనకే కాదు అందరి ఆత్మోద్ధరణకు కారణమయి నిలిచింది. అంత గొప్ప వాగ్గేయకారులు, లోకానికి ఆధ్యాత్మిక భిక్ష పెట్టినవారు, దీప స్తంభాల వంటివారు.. మన మధ్య గడిపిన వారు కావడం మన అదృష్టం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
దేశవ్యాప్తంగా కరెంట్ బంద్.. ‘చీకటి’లో పాకిస్తాన్ ప్రజలు (ఫోటోలు)
-
అల్లాడుతున్న పాకిస్తాన్ ప్రజలు.. దేశవ్యాప్తంగా కరెంట్ కట్!
ఇస్లామాబాద్: ఇప్పటికే ఆర్థిక కష్టాలతో అల్లాడిపోతున్న పాకిస్తాన్ నెత్తిపై మరో పిడుగు పడింది. అకాశన్నంటిన నిత్యావసరాల ధరలు, ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు మరో కష్టం వచ్చిపడింది. నేషనల్ గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు సోమవారం అంధకారంలోనే గడిపారు. హోటళ్లు, రెస్టారెంట్లు దీపాల వెలుగులోనే నడిచాయి. సాధారణ పౌరులు ఇళ్లలో కొవ్వత్తులు వెలిగించుకొని జీవనం సాగించారు. నేషనల్ గ్రిడ్‌లో ఫ్రీక్వెన్సీ పడిపోడవంతో సోమవారం ఉదయం 7:30 గంటలకు దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీన్ని పునరుద్ధరించేందుకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే ఎట్టకేలకు ఇస్లామాద్, గుజ్రావాలా ప్రాంతాల్లో మాత్రం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. మిగతా నగరాల్లో కూడా పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు విద్యత్ శాఖ మంత్రి ఖురాం దస్తగిర్ పేర్కొన్నారు. కరెంటు కోతలు సహజమే.. విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న పాకిస్తాన్లో కరెంటు కోతలు సర్వసాధరణమైపోయాయి. హాస్పిటళ్లు, ఫ్యాక్టరీలు, ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు జనరేటర్ల సాయంతో నడుస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పాఠశాలల్లో కూడా వెలుతురు లేకుండానే పాఠాలు బోధిస్త్నున్నారు. కొన్ని చోట్ల బ్యాటరీతో నడచే లైట్లను ఉపయోగిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భాలు మాత్రం చాలా తక్కువే. గతంలో 2021లో గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా పాక్ మొత్తం విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు మరోసారి ఇదే కారణంతో దేశం మొత్తం అంధకారంలోకి వెళ్లింది. చదవండి: ఆందోళనలతో అట్టుడుకుతున్న బ్రెజిల్, పెరు.. ఏమిటీ సమస్య? -
Ayushi: చీకటిని చీల్చి సివిల్ ర్యాంకర్‌గా..
నిమిషంపాటు కళ్లుమూసుకుని నడవాలంటేనే కష్టం. అటువంటిది పుట్టినప్పటినుంచే కారు చీకటి కమ్మేసిన కళ్లు అవి. జీవితంమొత్తం అంధకారమే అని తెలిసినప్పటికీ, బ్రెయిలీ లిపి సాయంతో అరకొర చదువుకాకుండా ఉన్నత చదువు చదివింది. అక్కడితో అగకుండా ప్రభుత్వ స్కూలు టీచర్ అయ్యింది. ఇక చాలు అనుకోకుండా .. దేశవ్యాప్తంగా పోటీపడే యూపీఎస్సీ పరీక్ష రాసి 48వ ర్యాంకు సాధించి, చరిత్ర సృష్టించింది.. చరిత్ర చెప్పే టీచర్ ఆయుషి. ఢిల్లీలోని రాణిఖేడా గ్రామంలోని ఓ సాధారణ కుటుంబం లో పుట్టింది ఆయుషి. పుట్టుకలోనే విధికన్నెర్ర చేసి తన రెండు కళ్లనూ చీకటిమయం చేసింది. రెండు కళ్లకు చీకటి తప్ప మరేం కనిపించదు. అయినా గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుకుంది. ఆ తరువాత శ్యాంప్రసాద్ ముఖర్జీ కాలేజీలో బి.ఏ, ఇగ్నో యూనివర్శిటీలో చరిత్ర ప్రధాన సబ్జెక్టుగా ఎంఏ (హిస్టరీ), జామియా మిల్లియా ఇస్లామియా నుంచి బి.ఈడీ. చేసింది. ఆ తరువాత 2012లో మున్సిపల్ కార్పొరేషన్∙స్కూల్లో కాంట్రాక్ట్ టీచర్‌గా చేరింది. 2016లో ప్రైమరీ టీచర్ అయ్యింది. 2019లో ‘ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు’ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో హిస్టరీ టీచర్ అయ్యింది. పదేళ్లుగా టీచర్‌గా సేవలందిస్తోన్న ఆయుషి ప్రస్తుతం ముబారఖ్‌పూర్ దబాస్ గవర్నమెంట్ గర్ల్స్ సీనియర్ సెకండరీ స్కూల్లో.. పదకొండు, పన్నెండు తరగతుల విద్యార్థులకు హిస్టరీని బోధిస్తోంది. సివిల్స్‌కు ఎందుకంటే.. ‘‘స్కూల్లో పాఠాలు చెబుతూ ఎంతోమంది భవిష్యత్‌ను చక్కగా తీర్చిదిద్దగలుగుతున్నాను. యూపీఎస్సీలో సెలక్ట్ అయితే మరెంతోమంది జీవితాలను తీర్చిదిద్దే అపారమైన అవకాశం లభిస్తుంది. తనలాంటి వైకల్యం కలవారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చు’’ అని ఆయుషికి అనిపించింది. దీంతో 2016 నుంచి సివిల్స్ రాయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. టీచర్‌గా బిజీగా ఉన్నప్పటికీ తన ప్రిపరేషన్‌ను మాత్రం వదల్లేదు. వలంటరీ రిటైర్మెంట్ తీసుకుని... ఆయుషి పుట్టుకతోనే అంధురాలైనప్పటికీ సివిల్స్ దాక రాణించడానికి కారణం కుటుంబం వెన్నుతట్టి ప్రోత్సహించడమే. కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా ఆయుషి తల్లి... ప్రిపరేషన్‌కు చాలా బాగా సాయం చేశారు. సీనియర్ నర్సింగ్ అధికారిగా పనిచేస్తోన్న ఆయుషి తల్లి ఆశా రాణి 2020లో వలంటరీగా పదవి విరమణ చేసి ఆయుషి ప్రిపరేషన్‌కు పూర్తి సమయాన్ని కేటాయించారు. ఆయుషికి కావాల్సిన స్టడీ మెటిరీయల్‌ను ఆయుషి భర్తతో కలిసి ఆడియో రూపంలో రికార్డు చేసి ఇచ్చేవారు. ఇవి ఆమె ప్రిపరేషన్‌కు బాగా ఉపయోగపడ్డాయి. వరుసగా నాలుగు ప్రయత్నాల్లో విఫలమైంది. వీటిలో ఒక్కసారి కూడా కనీసం మెయిన్స్ కూడా క్లియర్ చేయని 29 ఏళ్ల ఆయుషి.. తాజాగా ఐదో ప్రయత్నంలో దేశంలోనే 48వ సివిల్ ర్యాంకర్‌గా నిలిచింది. రాతపరీక్షకు ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా, మాక్ టెస్ట్‌కు మాత్రమే కోచింగ్ తీసుకుని ర్యాంక్ సాధించింది. కేంద్రపాలిత ప్రాంతాలు (డ్యానిక్స్) లేదా హర్యాణా క్యాడర్లో బాలికలు, వికలాంగుల విద్యారంగంలో సేవలందించడానికి ఆయుషి ఆసక్తి చూపుతోంది. వైకల్యం కళంకం కాకూడదు అంధురాలిగా విద్యార్థులకు పాఠాలు బోధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే టీచింగ్‌ను నేను ఎప్పుడు ఒక ఉద్యోగంగా చూడలేదు. అభిరుచిగా భావించాను. అందుకే విద్యార్థులు నా టీచింగ్‌ను ఇష్టపడేంతగా వారిని ఆకట్టుకోగలిగాను. ఆసక్తిగా పాఠాలు చెబుతూనే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాను. ఈసారి కచ్చితంగా సివిల్స్ క్లియర్ చేస్తానని నమ్మకం ఉంది. కానీ యాభైలోపు ర్యాంకు రావడం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇన్నాళ్లకు నా కల నిజమైంది. టాప్–50 జాబితాలో నా పేరు ఉందని తెలియడం మాటల్లో్ల వర్ణించలేని ఆనందాన్ని కలిగించింది. పుట్టినప్పటి నుంచి అనేక కష్టాలను ఎదుర్కొంటూ పెరిగాను. కుటుంబ సభ్యులు ముఖ్యంగా అమ్మ సాయంతో అన్నింటిని జయిస్తూ నేడు ఈ స్థాయికి చేరుకోగలిగాను. విద్య అనేది సాధికారతా సాధనం. బాలికలు, వికలాంగుల విద్యా రంగంలో పనిచేస్తూ వారికి రోల్‌మోడల్‌గా నిలవాలనుకుంటున్నాను. వికలాంగుల జీవితాల్లో వైకల్యం ఒక కళంకంగా ఉండకూడదు. వైకల్యంపట్ల సమాజ దృక్పథాన్ని మార్చుకోవాలి. వికలాంగులు కూడా అన్ని లక్ష్యాలను సాధించగలరు. – ఆయుషి దేవుడు ఆయుషి రెండు కళ్లు తీసుకున్నప్పటికీ, ఆమె బంగారు భవిష్యత్‌కు చక్కని దారి చూపాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొంది. స్కూలుకెళ్లడానికి నలభై నిమిషాలు పడుతుంది. ఆ సమయాన్ని కూడా తన ప్రిపరేషన్‌కు కేటాయించి, ఈ స్థాయికి చేరుకున్నందుకు ఆయుషి తల్లిగా ఎంతో గర్వపడుతున్నాను. – ఆశారాణి (ఆయుషి తల్లి) -
‘రాత్రి వేళ ఒంటరిగా పోలీస్స్టేషన్లకు వెళ్లకండి’
వారణాసి: మహిళలు చీకటి పడిన తర్వాత పోలీస్స్టేషన్లకు వెళ్లవద్దంటూ మాజీ గవర్నర్, బీజేపీ ఉపాధ్యక్షురాలు బేబీ రాణి మౌర్య హెచ్చరించారు. బజార్దిహా ప్రాంతంలోని వాల్మీకిబస్తీలో శుక్రవారం మహిళలనుద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లే సమయంలో కుటుంబంలోని మగవారిని వెంట తీసుకెళ్లాలంటూ సూచించారు. ‘ఠాణాల్లో మహిళా పోలీసులు కూడా ఉంటారు. కానీ, సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత, చీకటి వేళ మహిళలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లవద్దు. అవసరమైన పక్షంలో మరుసటి రోజు ఉదయం తోడుగా సోదరుడు/ భర్త/ తండ్రిని వెంట తీసుకెళ్లండి’అని చెప్పారు. మహిళల కోసం బీజేపీ ప్రభుత్వం చేసిన కృషితో పరిస్థితి మారిందన్నారు. కాగా, రాణి మౌర్య వ్యాఖ్యలపై బీఎస్పీకి చెందిన ఎంపీ కున్వర్ డానిష్ అలీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మహిళలకు పోలీస్స్టేషన్లలో కూడా రక్షణ లేదన్న విషయం రాణి మౌర్య మాటలతో తేలిపోయిందని విమర్శించారు. -
అంధకారంలో పాకిస్తాన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ చిమ్మచీకట్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. విద్యుత్ సరఫరా గ్రిడ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శనివారం దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో అంధకారం నెలకొంది. కరాచి, రావల్పిండి, ఇస్లామాబాద్, లాహోర్, ముల్తాన్, ఫైజలాబాద్ తదితర ప్రధాన నగరాల్లో శనివారం అర్ధరాత్రి ఒకే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పుడిప్పుడే కొన్ని నగరాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టు పాకిస్తాన్ ఇంధన శాఖ మంత్రి ఒమర్ అయూబ్ ఖాన్ ఆదివారం వెల్లడించారు. సింధ్ ప్రావిన్స్‌లోని గుడ్డు పవర్ ప్లాంట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శనివారం అర్ధరాత్రి 11.41 గంటలకు గ్రిడ్ కుప్పకూలిపోయింది. ఈ గ్రిడ్ నుంచే అత్యధిక నగరాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. దీంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, కొన్ని నగరాల్లో పాక్షికంగా విద్యుత్‌ని పునరుద్ధరించారు. పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా జరగడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ అత్యంత పురాతనమైనది కావడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి షిబ్లిఫరాజ్ అన్నారు. -
గ్రామస్తుల త్యాగంతో పిచ్చుక, పిల్లలు క్షేమం
సాక్షి, చెన్నై: అరుదైన ఓ పిచ్చుక కోసం ఓ గ్రామం నెల రోజులు అంధకారంలో మునిగింది. ప్రస్తుతం ఆ పిచ్చుక గుడ్లు పెట్టి పొదిగి పిల్లలతో బయటకు రావడంతో ఆగ్రామం ఆనందంలో మునిగింది. శివగంగై జిల్లా పోత్తకుడి ఓ కుగ్రామం. ఇక్కడ వంద మేరకు ఇళ్లు ఉన్నాయి. ఇక్కడి వీధుల్లో 35 విద్యుత్‌స్తంభాలు ఉన్నాయి. వీటిని ఆన్, ఆఫ్ చేయడం బాధ్యతల్ని ఆ గ్రామానికి చెందిన కరుప్పురాజాకు అప్పగించారు. వీటన్నింటికి ఒకే చోట అతి పెద్ద బాక్స్‌గా స్విచ్ బోర్డు ఉంది. ఈ పరిస్థితుల్లో నెల రోజుల క్రితం ఓ రోజు అరుదైన పిచ్చుకకు ఆ బాక్సు నుంచి బయటకు వెళ్లడాన్ని కరుప్పురాజా చూశాడు. మరుసటి రోజు అదే విధంగా ఆ పిచ్చుక వెళ్లడం, ఇదేదో అరుదైన జాతికి చెందినదిగా భావించాడు. క్రమంగా ఆ పిచ్చుక ఆ బాక్సులో గూడు కట్టింది. గుడ్లు పెట్టి పొదిగేందుకు ఆ బాక్సును ఆ పిచ్చుక ఎంపిక చేసుకున్నట్టుంది. ఈ సమాచారాన్ని కరుప్పురాజా గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆ పిచుక వర్ణం అంతా ఓ వింతగా, అరుదుగా ఉండడంతో దీనిని పరరిక్షించాల్సిన బాధ్యత ఉందని గ్రామస్తులు నిర్ణయించారు. దీంతో ఆ పిచ్చుకకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. ఆ స్విచ్ బాక్స్ వైపుగా ఎవ్వరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో నెల రోజులు ఆ గ్రామంలో వీధి దీపాలు వెలగలేదు. ఆ గ్రామమే అంధకారంలో మునిగినట్టుగా పరిస్థితి మారింది. ఈ పరిస్థితుల్లో గుడ్లు పెట్టి, పొదిగిన ఆ పిచ్చుక నెల రోజుల తర్వాత తన పిల్లలతో బయటకు రావడంతో ఆ గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవు. ఆ పిచుకను, పిల్లలల్ని పరిరక్షించేందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. -
చీకట్లోనూ పృథ్వీ–2 సక్సెస్
బాలాసోర్: అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన పృథ్వీ–2 క్షిపణి రాత్రిపూట ప్రయోగం విజయవంతమైంది. యాదృచ్ఛికంగా ఎంపికచేసిన ఈ క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) మొబైల్ లాంచర్ నుంచి శనివారం పరీక్షించారు. ఆర్మీకి చెందిన వ్యూహాత్మక విభాగం అధికారులు ఈ ప్రయోగం చేపట్టగా, డీఆర్డీఓ శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు. సాధారణ శిక్షణలో భాగంగానే ఈ పరీక్ష నిర్వహించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. క్షిపణి ప్రయాణించిన మార్గాన్ని రాడార్లు, టెలిమెట్రి, ఎలక్ట్రో ఆప్టికల్ వ్యవస్థల ద్వారా పరిశీలించారు. -
చీకట్లో ఏటీఎం..!
మద్నూర్(జుక్కల్) నిజామాబాద్ : ఏటీఎం కేంద్రాల వద్ద అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని దొంగలు దోచుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న సందర్భాల్లో ఏటీఎం కేంద్రం అంధకారంలో ఉంటే ఇంకేముంది. మండల కేంద్రంలోని ఆంధ్రాబ్యాంక్ ఏటీఎం కేంద్రంలో ఆదివారం లైట్లు వెలగకపోవడంతో లబ్ధిదారులు చీకట్లోనే డబ్బులను డ్రా, విత్‌డ్రాలు చేసుకున్నారు. జన సంచారం లేని ప్రాంతంలో బ్యాంకు ఉండడంతో వినియోగదారులు డబ్బులు డ్రా చేసేందుకు, జమ చేసేందుకు భయపడ్డారు. ఏటీఎం కేంద్రం వద్ద తప్పకుండా సెక్యురిటీ గార్డు, కేంద్రంలో విద్యుత్ లైట్లు ఉండేలా ఇప్పటికైనా బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. -
ఫ్యూజు పోతే చీకటే!
– 416 గ్రామాల్లో విద్యుత్ సిబ్బంది కరువు – గ్రామీణ, మండల కేంద్రాల్లో పనిచేసే వారికి కర్నూలులో పోస్టింగ్ – రాయకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు - నేడు సీఎండీ కర్నూలుకు రాక కర్నూలు (రాజ్‌విహార్): కోడుమూరు మండలం అమడగుంట్లలో సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఇటీవల రాత్రి 8.15 గంటలకు ఫ్యూజు కాలిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెంటనే ఫ్యూజ్ వేసే లైన్‌మన్ లేక గ్రామస్తులు రాత్రంతా చీకట్లో ఉన్నారు. గూడూరు మండలం బురాన్దొడ్డికి వచ్చే 11కేవీ వ్యవసాయ విద్యుత్ ఫీడర్ ట్రిప్ అయింది. మరమ్మతు చేసే నాథులు లేక రాత్రంతా ఆ గ్రామస్తులు వ్యవసాయ విద్యుత్ సరఫరాకు నోచుకోలేదు. ఇలాంటి సమస్యలు ఈ రెండు గ్రామాల్లోనే కాదు.. జిల్లాలోని 416కు పైగా గ్రామాల్లో ఉన్నాయి. అక్కడ కింది స్థాయి సిబ్బంది లేకపోవడం, ఉన్నవారిని ఇటీవల బదిలీ చేసి.. వారి స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. దక్షిణప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)లో ఇటీవల జరిగిన బదిలీలు వినియోగదారులకు శాపంగా మారాయి. రాజకీయ ఒత్తిళ్లు, సిబ్బంది పైరవీలు, యూనియన్ నాయకుల ఉదాసీనత కారణంగా అడ్డదారుల్లో పోస్టింగ్‌లు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. కోరుకున్న సీటు కోసం కొందరు అధికార పార్టీ నాయకులను ఆశ్రయిస్తే.. మరికొందరు ఏకంగా ఉత్తర్వులు ఇచ్చే అధికారులనే సంప్రదించి పోస్టింగ్‌లు తెచ్చుకున్నారు. వినియోగదారుడే విద్యుత్ సంస్థకు ఆదాయ వనరు. నెలనెలా బిల్లులు సక్రమంగా చెల్లిస్తేనే ఉద్యోగులకు జీతభత్యాలు అందుతాయి. అలాంటి వినియోగదారుడి అవసరాలు, సమస్యలను బదిలీల సమయంలో ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. ఏ సమస్య వచ్చినా వినియోగదారులు గంటలు, రోజుల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లా (సర్కిల్)లో 54 మండలాల్లోని 920గ్రామాలకు, 615 మజరా గ్రామాలకు విద్యుత్ సరఫరా అందుతోంది. వీటిలో 12 లక్షల మంది వినియోగదారులు ఉండగా.. 1.50లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వీరి నుంచి ప్రతి నెలా రూ.100 కోట్ల వరకు సంస్థకు బిల్లుల రూపంలో వస్తోంది. 416 గ్రామాల్లో సిబ్బంది లేరు జిల్లాలో 416కు పైగా గ్రామాల్లో సంస్థకు చెందిన రెగ్యూలర్ సిబ్బంది లేరు. ఇటీవల జరిగిన బదిలీల్లో పల్లెల్లోని సిబ్బందికి జిల్లా, రెవెన్యూ కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. కొందరికి డీఈలు, మరి కొంత మందికి ఎస్ఈ ఉత్తర్వులిచ్చారు. అసలే 250కి పైగా గ్రామాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పైగా బదిలీలు జరిగాయి. దీంతో కర్నూలు డివిజన్లోని 15 సెక్షన్ల (ఏఈ పరిధిలోని మండలం)లో 92 గ్రామాల పరిధిలో ఒక్కరు కూడా సిబ్బంది లేరు. అలాగే నంద్యాల డివిజన్లోని 17 సెక్షన్ల పరిధిలో గల 121గామాల్లో, ఆదోని డివిజన్లో 126, డోన్‌లో 52 గ్రామాల్లో ఒక్క లైన్‌మన్ లేదా జూనియర్ లైన్‌మన్ కూడా లేరని తెలుస్తోంది. అసలు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఖాళీలు లేకపోయినా ‘ఎనీ ప్లేస్ ఇన్ కర్నూలు ఆర్ టౌన్’ అని ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సమస్య వస్తే చీకట్లే నిబంధన ప్రకారం విద్యుత్ సరఫరా (డిస్ట్రిబ్యూషన్) ఉన్న ప్రతి గామానికి ఒక లైన్‌మన్ (రెగ్యులర్) లేదా జూనియన్ లైన్‌మన్ ఉండాలి. అయితే, 416గ్రామాల్లో ఫ్యూజ్ పోయినా, బ్రేక్ డౌన్ అయినా, ఫీడర్ ట్రిప్పింగ్, జంపర్ల కటింగ్, ఎగ్జిఫ్యూజ్ పోవడం వంటి సమస్యలు ఏర్పడినా పట్టించుకునే నాథులే లేరు. నేడు సీఎండీ రాక ఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్.వై. దొర బుధవారం కర్నూలుకు రానున్నారు. ఉదయం జిల్లా కేంద్రానికి చేరుకొని స్థానిక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. విద్యుత్ భవన్‌లోని సమావేశపు హాలులో ఉదయం 10గంటలకు సమీక్ష ప్రారంభం కానుంది. సీఎండీతో పాటు డైరెక్టర్ పి.పుల్లారెడ్డి కూడా హజరుకానున్నట్లు అధికారులు వెల్లడించారు. -
పెద్దాసుపత్రిలో హాహాకారాలు
► రాత్రి కరెంటు పోవడంతో అల్లాడిన రోగులు, వారిసహాయకులు ► తెల్లవారుజామున వరకు ఇదే పరిస్థితి ► ఫిర్యాదులు చేసినా పట్టించుకోని వైనం కర్నూలు(అగ్రికల్చర్) : సర్వజన వైద్యశాలలో 24 గంటలూ కరెంటు ఉండాలి. అయితే బుధవారం రాత్రి గంటల తరబడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినా... రోగులు హాహాకారాలు పెట్టినా... పట్టించుకునే వారు లేరు. నాలుగు జిల్లాలకు పెద్ద దిక్కు అయిన కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలోని వివిధ వార్డుల్లో రాత్రి 8 గంటల నుంచే కరెంటు సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా గైనిక్ విభాగంలో ఆపరేషన్ థియేటర్ మినహా అన్ని వార్డుల్లోనూ కరెంటుపోయి అంధకారం అలుముకుంది. ఉక్కపోత, దోమల బెడదతో బాలింతలు, గర్భిణిలు ఉక్కిరిబిక్కిరయ్యారు. కాన్పుల వార్డులో అనేకమంది పసిపిల్లలు ఉన్నా విద్యుత్ పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొంతమంది రోగులకు ఆక్సిజన్ అందక ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. ట్రామా కేర్, ఎంఎం–4, ఎంఎం–6 వార్డులతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సార్.. రాత్రి 8 గంటల నుంచి కరెంటు లేదు.. రిపేరీ చేయండని ఆసుపత్రి అధికారులను, విద్యుత్ అధికారులను కోరినా పట్టించుకునే దిక్కు లేకుండాపోయింది. 24 గంటలూ సరఫరా ఉండాల్సిన ఆసుపత్రిలో రాత్రి 8 గంటల నుంచి తెల్లవారే వరకు కరెంటు లేకపోవడం చూస్తే నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తోంది. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు పెద్దాసుపత్రిలోని ట్రామాకేర్, కాన్పుల వార్డు తదితర వార్డుల్లో రాత్రి 8 గంటల నుంచి కరెంటు లేదు. పిల్లలు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు... చర్యలు తీసుకుని కరెంటును పునరుద్ధరించాలని డాక్టర్లను కోరినా పట్టించుకోలేదు. ఆసుపత్రి నిర్వహణ ఇంత అధ్వానంగా ఉంటే రోగులు ఏం కావాలి. – నారాయణ, కందికాయపల్లె, పాణ్యం మండలం : -
అంధకారంలో తమిళ రాజధాని
చెన్నై: వర్దా తుపాను కారణంగా చెన్నై మహానగరం చీకటిమయం అయింది. ఆదివారం రాత్రి 10 గంటల నుంచే కరెంట్ లేకపోవడంతో చెన్నై వాసులు చీకట్లో మగ్గుతున్నారు. ఈ రోజు తుపాను తీరం దాటే సమయంలో పెనుగాలులు వీయడంతో కరెంట్ స్తంభాలు నెలకొరిగాయి. చెట్లు విరిగిపడడంతో కరెంట్ తీగలు తెగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కరెంట్ లేకపోవడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా స్తంభించింది. విద్యుత్ నిలిచిపోవడంతో సెల్ టవర్లు పనిచేయడం లేదు. మొబైల్ ఫోన్ సర్వీసులు నిలిచిపోయాయి. ఇంటర్నెట్ కూ అంతరాయం కలిగింది. తుపాను నేపథ్యంలో అమ్మ క్యాంటీన్లను 24 గంటలూ తెరిచివుంచాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం పన్నీరు సెల్వం ఆదేశించారు. -
గుడ్డి దీపం
చుట్టూ చీకటున్నా, భయం లేకుండా ఒంటరిగా వెలుగుతుందా గుడ్డి దీపం దగ్గర కొచ్చిన చీకటిని కాలుస్తూ వెలిగించిన వాడి జాడ కోసం చూస్తుందా దీపం ఇప్పుడు ఆ చీకటికి గాలి తోడైంది నలుపు నాలుగు దిక్కులనుంచీ దాడి చేస్తోంది ఆ కొండ గాలికి చెట్లూ పువ్వులూ స్వేచ్ఛా గానం చేస్తుంటే తనూ లీనమై ఆ చుక్కల్లో చేరి చిత్రాలు చూస్తోంది అతనొచ్చాడు, ఇప్పుడంతా చీకటి. నాగేంద్ర ప్రసాద్ కాశి, 8790198928 -
‘ఔటర్’పై చీకట్లు!
- ఎల్ఈడీ లైటింగ్ ఏర్పాటుకు గ్రహణం - టెండ ర్ పిలిచినా... రూ.30 కోట్ల ప్రాజెక్టు మూలకు.. బిడ్స్ స్క్రూట్నీకి సిబ్బంది కరువు - రోడ్డు ప్రమాదాలను పట్టించుకోని కమిషనర్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని జవ హర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై ఎల్ఈడీ లైటింగ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు చీకట్లు ముసురుకొన్నాయి. ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి ఆర్నెల్లు గడిచినా వాటిని స్క్రూట్నీ చేసే దిక్కులేక బిడ్స్‌ను పక్కకు పడేసినట్లు తెలుస్తోంది. ఓవైపు ఔటర్‌పై నిత్యం ప్రమాదాల పరంపర కొనసాగుతున్నా హెచ్ఎండీఏ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. టెండర్ ప్రక్రియ పూర్తయ్యే దశలో హెచ్ఎండీఏ కమిషనర్ తీసుకొన్న అనాలోచిత నిర్ణయం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని ఓఆర్ఆర్ సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. నగరం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు 22 కి.మీ. దూరం ఎల్ఈడీ లైటింగ్ ఏర్పాటు చేయాలని 2011లో హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఇందుకు అప్పటి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీవో-174ను కూడా విడుదల చేసింది. ఇందుకోసం నిధులిచ్చేందుకు ‘జైకా’ కూడా ఆమోదం తెలపడంతో రూ.30 కోట్లతో విద్యుత్ లైటింగ్ ఏర్పాటుకు అంచనాలు రూపొందించారు. 8 లేన్ల మెయిన్ కారిడార్‌లో సెంట్రల్ మీడియన్‌లో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు అధికారులు నిర్ణయిం చారు. ఆ మేరకు గత ఫిబ్రవరిలో టెండర్లు ఆహ్వానించగా 4 సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. అయితే... టెక్నికల్ స్క్రూట్నీ దశలో డిప్యుటేషన్ అధికారులను తిప్పి పంపుతూ హెచ్ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా తీసుకొన్న నిర్ణయం ఆ ప్రాజెక్టుకు బ్రేక్ వేసింది. ఆర్అండ్బి నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) మాతృ సంస్థకు వెళ్లిపోవడంతో ఆ బిడ్స్‌ను స్క్రూట్నీ చేసే నాథుడే లేకుండా పోయాడు. ఫలితంగా గత 7 నెలలుగా ఆ బిడ్స్ టెండర్ బాక్స్‌కే పరిమితమయ్యాయి. విరమించుకొన్నట్లేనా..? ఔటర్‌పై లైటింగ్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలా? లేక ముందుకెళ్లాలా? అన్న విషయమై ఓ నిర్ణయం తీసుకొనేందుకు, ఈ అంశాన్ని హెచ్ఎండీఏ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఓఆర్ఆర్ అధికారులు సాహసించట్లేదు. ఓఆర్ఆర్ రెగ్యులర్ పీడీ కూడా దీర్ఘకాలిక సెలవులో ఉండటంతో ఈ ప్రాజెక్టు ఫైల్‌కు బూజుపట్టింది. ఈ మార్గంలో ఔటర్‌పై వాహనాల రాకపోకలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో లైటింగ్ ఏర్పాటును విరమించుకుంటే హెచ్ఎండీఏ తీవ్ర విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది. గచ్చిబౌలి- శంషాబాద్ మార్గంలో లైటింగ్ ఏర్పాటు ప్రతిపాదన కొత్తది కాదు. 2011లోనే నిర్ణయం జరిగిపోయింది. ఔటర్‌పై ప్రమాదం జరిగిన ప్రతిసారీ రహదారి భద్రతపై హెచ్ఎండీఏ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ అన్ని ప్రభుత్వ శాఖలు ఇటువైపే వేలెత్తి చూపుతున్నా మహానగరాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారుల్లో చలనం లేకపోవడం వారి చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. -
వెలుగు మాటున అంధకారం
నంద్యాల/ కర్నూలు రూరల్ : కొద్ది రోజుల్లో పంట చేతికొస్తుంది.. అప్పులు తీరుతాయని రైతుల ఆశ. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. శ్రీశైలం డ్యామ్‌లో నీటిమట్టం రోజు రోజుకూ పడిపోతోంది. విద్యుత్ ఉత్పాదన పేరుతో దిగువకు నీటిని విడుదల చేయడమే ఇందుకు కారణం. విద్యుత్ వెలుగుల కోసం నీటిని విడుదల చేస్తుండడంతో రాయలసీమ జిల్లాల రైతుల బతుకుల్లో అంధకారం అలుముకోనుంది. ప్రస్తుతం డ్యామ్‌లో 859.80 అడుగుల నీటిమట్టం ఉంది. 105 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్‌కు 70 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరో పది రోజుల్లో 854 అడుగులకు చేరే అవకాశం ఉంది. ఇలాగైతే పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల కష్టమే. రాయలసీమ రైతులకు పోతిరెడ్డిపాడు వరప్రదాయిని. ఇక్కడి నుంచి కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. నీటి విడుదల ఆగిపోతే పంట మట్టిపాలు కావాల్సిందే. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలుగుగంగ ప్రాజెక్టు కింద మినహాయిస్తే మిగిలిన ఏ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని నీటిపారుదల శాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. వెలుగోడు రిజర్వాయర్‌లో 13 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో ఈ కాల్వ కింద పంటలకు ఎలాంటి ఢోకా ఉండదని చెబుతున్నారు. కేసీ కెనాల్, ఎస్సార్బీసీలకు నీరందకపోతే ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందదు. అలాగే 600 గ్రామాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంటుంది. ఇదిలా ఉంటే అధికార పార్టీ నాయకులు.. రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. నాగార్జునసాగర్‌కు నీటి విడుదలపై టీడీపీ నేతలు నోరు మెదపకపోతే అన్నదాతల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని రైతు సంఘం నాయకులు మహేశ్వరరెడ్డి, బొజ్జా దశరథరామిరెడ్డి తదితరులు హెచ్చరిస్తున్నారు. అయితే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటి విడుదలను నిలిపి వేయాలని నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటి పారుదల మంత్రులను కలిసినట్లు సమాచారం. వారి నుంచి ఆయనకు సరైన హామీ లభించలేదని తెలుస్తోంది. బాబు జీఓ.. సీమ రైతుకు శాపం శ్రీశైలం రిజర్వాయర్ నిర్వహణపై 1996లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే జీ.ఓ నెంబరు69ని జారీ చేసింది. ఇందులో శ్రీశైలంలో 860 నుంచి 863 అడుగుల మధ్య నీటి నిల్వ ఉన్నప్పుడు ప్రకాశం బ్యారేజీ, నాగార్జునసాగర్‌లకు తాగు, సాగు నీటి అవసరమైనా, లేకపోయినా జూలై నుంచి అక్టోబర్ వరకు 15 రోజులకు ఒకసారి 11 వేల క్యూసెక్కుల చొప్పన కేవలం ఆరు టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించాలని స్పష్టంగా ఉంది. అయితే కోస్తా ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేతలు ఎలాంటి అనుమతులు లేకుండానే కృష్ణా జలాలను తరలించుకుపోతున్నా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఏ మాత్రం పట్టించుకోకుండా మొద్దనిద్రలో ఉన్నారు. ఇప్పటికే రోజుకి 4.7 నుంచి 7 టీఎంసీల ప్రకారం సుమారు 250 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు. దీని వల్ల కృష్ణా జలాలపై ఆధారపడి ఉన్న ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ, కేసీ ఎస్కేప్ చానల్ పరిధిలోని ఆయకట్టులో సాగైన ఖరీఫ్ పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది. ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉంది. ఈ సమయంలో కాల్వలకు నీరు బంద్ అయితే అన్నదాతలకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. సర్కార్ కుట్ర రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన పాలకులు ఒక ప్రాంతానికి అన్యాయం చేసి మరో ప్రాంతానికి మేలు చేసేలా వ్యవహరిస్తున్నారు. శ్రీశైలం నీటి వాడకంలో రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరత నేపథ్యంలో శ్రీశైలం ఎడమగట్టు కేంద్రం నుంచి 14820 క్యూసెక్కుల నీటిని వాడేసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం గగ్గోలు పెడుతుంది. అయితే ఇక్కడే అసలు కుట్ర జరుగుతోంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా డెల్టా ఆయకట్టుకు మున్ముందు సాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తతో శ్రీశైలం కుడిగట్టు కేంద్రం నుంచి ఎడాపెడా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటి వరకు 8 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేసింది. అంటే సుమారు 40 వేల క్యూసెక్యుల నీటిని ఏపీ ప్రభుత్వమే దిగువకు వదిలేయడం గమనార్హం. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసి కుడిగట్టు కేంద్రం నుంచి ప్రతి రోజూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 20 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలంలో కనీస నీటిమట్టం తగ్గిస్తూ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి నాయకత్వంలో శ్రీశైలం డ్యామ్ వద్ద ధర్నా నిర్వహించారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. -
అంధకారంలో విశాఖ నగరం
* విద్యుత్తు, సమాచార, రవాణా వ్యవస్థలు విచ్ఛిన్నం హుదూద్ ధాటికి విశాఖపట్నంలోని విద్యుత్తు, సమాచార, రవాణా వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమైంది. వేలసంఖ్యలో విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలాయి. ఈ నష్టం కోట్లలోనే లెక్కతేలనుంది. శనివారం రాత్రి నుంచే విశాఖ నగరంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయి అంధకారం అలముకుంది. ఇక ఆదివారం నాటి విధ్వంసంతో మరో రెండురోజుల వరకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. గృహాల్లో ఇన్వర్టర్లలో ఛార్జింగ్ కూడా దాదాపు అయిపోవడంతో విశాఖ నగరం రెండురోజులు అంధకారంలో కొట్టుమిట్టాడాల్సిన దుస్థితి దాపురించింది. ఇక కేబుల్ వైర్లు చాలావరకు తెగిపోయి సెల్ టవర్లు పనిచేయడం మానేశాయి. దాంతో విశాఖ నగరంలో ల్యాండ్‌ఫోన్, సెల్ ఫోన్, ఇంటర్నెట్ సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. సమాచార సంబంధాలు తెగిపోయాయి. ఒకటీ అరా ఫోన్లు పనిచేసినా కరెంటు లేక టీవీలు కూడా పనిచేయకపోవటంతో అసలు విశాఖలో ఏం జరుగుతోందన్నది విశాఖవారే ఇతర ప్రాంతాల్లోని వారికి ఫోన్లు చేసి తెలుసుకోవాల్సి వచ్చింది. ఆదివారం రాత్రికి గాలుల తీవ్రత కొంత తగ్గినా వర్షం భారీగా కురుస్తుండటంతో ఇళ్లలోంచి బయటకి వచ్చే పరిస్థితి లేక... బయట ఏం జరుగుతోందో తెలీక భయంతో కొట్టుమిట్టాడుతున్నారు. సెల్ఫోన్లలో ఛార్జింగ్ అయిపోయి ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. విశాఖలోని రోడ్లతోపాటు ఇతర ప్రాంతాలతో అనుసంధానించే అన్ని ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎన్‌హెచ్ 16 మీద ఎక్కడిపడితే అక్కడ వందల సంఖ్యలో చెట్లు, స్తంభాలు విరిగిపడ్డాయి. దాంతో ఇతర ప్రాంతాలతో విశాఖ నగరానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కట్టర్లు తెచ్చి చెట్లను కోసి, స్తంభాలు తీసి రోడ్లపై రాకపోకలను పునరుద్ధరించడానికి ఎంతసమయం పడుతుందన్నది చెప్పలేని స్థితి నెలకొంది. -
అంధకారంలో బెజవాడ
-
అంధకారంలో అనంతపురం