
బాలాసోర్: అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన పృథ్వీ–2 క్షిపణి రాత్రిపూట ప్రయోగం విజయవంతమైంది. యాదృచ్ఛికంగా ఎంపికచేసిన ఈ క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) మొబైల్ లాంచర్ నుంచి శనివారం పరీక్షించారు. ఆర్మీకి చెందిన వ్యూహాత్మక విభాగం అధికారులు ఈ ప్రయోగం చేపట్టగా, డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు. సాధారణ శిక్షణలో భాగంగానే ఈ పరీక్ష నిర్వహించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. క్షిపణి ప్రయాణించిన మార్గాన్ని రాడార్లు, టెలిమెట్రి, ఎలక్ట్రో ఆప్టికల్ వ్యవస్థల ద్వారా పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment