odissa
-
గిరి ‘గడబ’ ప్రకృతితో మమేకం
ఆధునిక ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న గిరిజన తెగ ‘గడబ’ ఇప్పుడిప్పుడే తన రూపు మార్చుకుంటోంది. అయితే, వీరి అరుదైన సంస్కృతి అంతరించిపోకుండా కాపాడుకుంటోంది. ప్రాచీన కాలం నుంచి ఈ తెగ గోదావరి పరివాహక ప్రాంతానికి దాపుగా ఉంటోంది. ‘గ’ అంటే గొప్పతనం అని, ‘డ’ అంటే నీటికి సూచిక అని అర్థం. ‘గడ’ అంటే గొప్పదైనా నీరు అని, గోదావరి అనే పేరు ఉంది. ఒరియాలో ‘గడబ’ అంటే సహనం గలవాడు అని అర్థం. గడబ తెగలు ఒరిస్సా వింద్య పర్వత ప్రాంతాల్లో స్థిరపడ్డాయి. మధ్యప్రదేశ్‌లోనూ ఈ తెగ ఉంది. ఈ తెగను భాష గుటబ్! వీరిలో అక్షరాస్యులు, నిరక్షరాస్యులూ ఉన్నారు. మన రాష్ట్రంలో గడబలు విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో ప్రముఖంగా కనిపిస్తారు. అటవీ ఉత్పత్తులే ఆధారంగా!వీరు గడ్డి, మట్టి, కలపను ఉపయోగించి ఇండ్లను నిర్మించుకుంటారు. ఈ గుడెసెలు త్రికోణాకారంలోనూ, మరికొన్నింటికి కింది భాగం గుండ్రంగా ఉండి పైకప్పు కోన్ ఆకారంలో ఉంటుంది. మహిళలు కుట్టని రెండు వస్త్రాల ముక్కలను ధరిస్తారు. అలాగే, రెండు వలయాలుగా ఉండే నెక్‌పీస్‌ను ధరిస్తారు. వీటిలో అల్యూమినియమ్, వెండి లోహం ప్రధానమైంది. తృణధాన్యాలు, వరి పండిస్తారు. అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడే వీరంతా సహజ పద్ధతుల్లో తయారుచేసుకున్న సారాయి, కల్లు పానీయాలను సేవిస్తారు. థింసా నృత్యంమహిళలు అర్థచంద్రాకారంలో నిలబడి, ఒకరి మీద ఒకరు చేతులు వేసి, ఒక వైపుకు లయబద్ధంగా కాళ్లు కదుపుతూ నృత్యం చేస్తారు. వీరు నృత్యం చేస్తున్నప్పుడు పురుషులు సంగీతవాయిద్యాలను వాయిస్తారు. ఈ థింసా నృత్యం ఆధునిక ప్రపంచాన్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. సులువైన జీవనంఇంటిపేర్లను బట్టి వావివరసలను లెక్కించుకుంటారు. మేనబావ, మేనమరదలు వరసలు గలవారు వీరిలో ఎక్కువగా పెళ్లి చేసుకుంటారు. పెళ్లి వద్దని అమ్మాయి అనుకుంటే కుల పెద్దలతో పంచాయితీ నిర్వహించి వారి సమక్షంలో ఓలి ఖర్చు పెట్టుకుంటే చాలు విడిపోవచ్చు. అబ్బాయి కూడా ఇదే పద్ధతి పాటిస్తాడు.అన్నీ చిన్న కుటుంబాలే!గడబలో ఎక్కువగా చిన్నకుటుంబాలే. వీరికి ఇటెకుల, కొత్త అమావాస్య, తొలకరి, కులదేవత పండగలు ప్రధానమైనవి. వీరిని గడ్బా అని మధ్య ప్రదేశ్‌లో, గడబాస్ అని ఆంధ్రప్రదేశ్‌లో పేరుంది.(చదవండి: నా నుదుటి రాతలోనే నృత్యం ఉంది..!) -
యూట్యూబ్ సాయంతో గవర్నమెంట్ జాబ్..
ఒరిస్సాలోని గిరిజన తెగ. కోచింగ్‌కు డబ్బులు లేవు. ఇంట్లో ఇంటర్నెట్ రాదు.కాని జీవితంలో ఏదైనా సాధించాలి. ఇంటికి, ఊరికి దూరంగా వెళ్లి మరీ సిగ్నల్ ఉన్న చోట కూచుని యూట్యూబ్ వీడియోల సాయంతో ‘ఒరిస్సా సివిల్ సర్వీసెస్’లో ఉద్యోగం సాధించింది బిని ముడులి. సోషల్ మీడియా వల్ల కలిగిన మేలు ఇది. ఒరిస్సాలో బోండా తెగ నుంచి స్టేట్ సివిల్స్‌లో ఉద్యోగం సాధించిన మొదటి మహిళ బిని పరిచయం...ఒక్కొక్కరూ ఒక్కొక్కరూ వస్తూ ఉంటే కాసేపటికి ఆ బోండా ఘాట్ జనాలతో నిండిపోయింది. అందరూ బిని ముడులిని చూసి అభినందించేవారే. దిష్టి తీసేవారే. కారణం ఆ అమ్మాయి తమ బోండా తెగ గౌరవాన్ని పెంచింది. తమ తెగ నుంచి ‘ఒరిస్సా పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్’ (ఓపిఎస్‌సి)లో ర్యాంక్ సాధించి గవర్నమెంట్ అధికారి అవుతున్న మొదటి అమ్మాయి బిని ముడులి. ‘నాకు ఉద్యోగం వస్తే నా కంటే మావాళ్లే ఎక్కువ ఆనందిస్తున్నారు’ అంటుంది 24 ఏళ్ల బిని ముడులి. మొన్నటి శనివారం విడుదలైన ఓపిఎస్‌సి ఫలితాల్లో ఎస్.టి. కోటాలో 596వ ర్యాంకు పొంది ఉద్యోగానికి అర్హత సాధించింది బిని. ఓపిఎస్‌సి 2022–23 పరీక్షకు మొత్తం 92,194 మంది అభ్యర్థులు ΄ోటీ పడితే వారిలో 683 మంది అర్హత సాధించారు. విశేషం ఏమిటంటే టాప్ టెన్ ర్యాంకుల్లో ఐదు మంది అమ్మాయిలున్నారు. అర్హత సాధించిన వారిలో 258 మంది అమ్మాయిలే.యూట్యూబ్ పాఠాలతో2020లో ఓపిఎస్‌సి పరీక్ష రాసి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యింది బిని. ‘నా ప్రిపరేషన్ సరి΄ోదని నాకు అర్థమైంది. కాని కోచింగ్‌కు వెళ్లేందుకు డబ్బు లేదు. అదీగాక నేను సంపాదించి ఇంటికి సాయపడాల్సిన సమయం. అందుకే ఆయుర్వేదిక్ అసిస్టెంట్‌గా పని చేయడం మొదలెట్టాను. మా ఊరిలో ఇంటర్నెట్ ఉండదు. అందుకే దగ్గరిలోని గోవిందపల్లి టౌన్‌కు వచ్చి అక్కడ యూట్యూబ్‌లో దొరికే పాఠాలతో ప్రిపేర్ అయ్యాను. ఆన్లైన్లో దొరికే మెటీరియల్‌ను చదువుకున్నాను. అనుకున్నది సాధించాను’ అంది బిని.అమ్మాయిలను స్కూళ్లకు పంపండి‘ఆడపిల్లలను బాగా చదివించండి అనేదే నా పిలుపు. చదువులోనే వారి అభివృద్ధి ఉంది. డబ్బు లేక΄ోయినా ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఉచితంగా అనేక కోర్సులు, కోచింగ్‌లు దొరుకుతున్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. నేను అధికారి అయ్యాక స్త్రీల స్వయంసమృద్ధి కోసం పని చేస్తాను. అంతేకాదు మా బోండా తెగ కోసం వారికి అందాల్సిన సంక్షేమ ఫలాల కోసం పని చేస్తాను’ అంది బిని.వంటలు చేస్తూ పెంచాడుఒరిస్సాలోని మల్కన్‌గిరి జిల్లాలో ముదులిపడ అనే చిన్న బోండాల ఊరు బిని ముడులిది. తండ్రి మధుముడిలి అక్కడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వంటచేస్తాడు. తల్లి సునమణి ఊళ్లో అంగన్వాడి కార్యకర్తగా పని చేస్తోంది. ఒరిస్సాలో మొత్తం 13 గిరిజన తెగలు అంతరించిపోయే ప్రమాదంలో ఉంటే వాటిలో ఒకటి బోండా తెగ. ఆ తెగ నుంచి తాను బాగా చదువుకుని పైకిరావాలనుకుంది బిని ముడులి. జేపోర్లోని బిక్రమ్దేబ్ యూనివర్సిటీలో జువాలజీలో ఎంఎస్సీ చేసింది. ప్రభుత్వ అధికారి అయి ప్రజలకు సేవ చేయాలనేది బిని కల. (చదవండి: వీధుల్లో బిక్షాటన చేసే అమ్మాయి నేడు డాక్టర్‌గా..!) -
పూరీ తీరంలో పర్యాటకుడు మృతి
భువనేశ్వర్: పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక పర్యాటకుడిని బుధవారం పూరీ సముద్రం స్వర్గ ద్వారం తీరంలో స్నానం చేస్తుండగా కెరటాలు ఈడ్చుకుపోయాయి. తీరం చేర్చి ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు స్థానిక జిల్లా ప్రధాన ఆస్పత్రి వైద్య వర్గాలు ప్రకటించాయి. మృతుడు పశ్చిమ బెంగాల్ బంకురాలోని నిత్యానందపూర్కు చెందిన సుశాంత్ అధికారి (54)గా గుర్తించారు.విచారణకు కమిటీ..భువనేశ్వర్: గతంలో బిజూ జనతా దళ్ ప్రభుత్వం ఒడిశా రాష్ట్ర ఆహార కమిషన్ చైర్‌పర్సన్‌ను నియమించింది. ఈ నియామకం పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆహార సరఫరాలు మరియు వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణచంద్ర పాత్రో బుధవారం ప్రకటించారు. నియామక ప్రక్రియ సరికాదని తేలితే సంబంధిత వ్యక్తిని ఒడిశా రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తామని పేర్కొన్నారు.బంగారం దుకాణంలో చోరీ..కొరాపుట్: బ్రహ్మపుర నగరంలోని బంగారు దుకాణంలో చోరీ జరిగింది. బైద్యనాథ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జనని ఆస్పత్రి రోడ్డులో ఉన్న ఓం శ్రీ జ్యూయలర్స్‌లో దొంగలు పడ్డారు. ఉదయం షాపు తెరవడానికి యజమాని జమ్మల శ్రీధర్ వెళ్లినప్పుడు దొంగతనం జరిగినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విలువైన బంగారు వస్తువులను స్ట్రాంగ్ సేఫ్ లాకరులో ఉంచడంతో దానిని తెరవడానికి గ్యాస్ కట్టర్లు ద్వారా దొంగ ప్రయత్నం చేసి విఫలం అయ్యాడు. అయితే బయట ఉన్న కొన్ని బంగారు నగలు, సుమారు 20 కేజీల వెండి పట్టుకుపోయాడు.పట్టుబడిన టేకు కలప..పర్లాకిమిడి: గంజాం జిల్లా దక్షిణ ఘుమసుర అటవీ శాఖ పరిధి అస్కా రేంజ్లో నువాభావనపూర్ జంక్షన్ వద్ద బుధవారం అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలతో సహా డ్రైవర్‌ను అరెస్టు చేశారు. వాహనంలో పట్టుకున్న కలప దుంగలు 57 ఘన చదరపు అడుగులు ఉన్నవి.వెయిట్ లిఫ్టింగ్ పోటీలు..మల్కన్‌గిరి: జిల్లా కేంద్రంలో ఉన్న స్టేడియంలో తొలిసారిగా వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో మనీష మొహంతి, రెండో స్థానంలో సిప్రా, మూడో స్థానంలో ఉషా శర్మలు, పురుషుల విభాగంలో ఆలీ సర్ధార్, బిజేంద్ర బిహారీ, రంజాన్ సాహులు తొలి మూడు స్థానాల్లో నిలిచారు.ఆశ్రమ పాఠశాల సందర్శన..జయపురం: కుంద్ర సమితి అసన గ్రామ పంచాయతీ ఉదల్గుడ గ్రామంలోని కేడీఎఫ్ ఆశ్రమ పాఠశాలను జయపురం సబ్ కలెక్టర్ ప్రభాత్ కుమార్ పొరిడా సందర్శించారు. ఆశ్రమ పాఠశాలలో విషాహారం తినడం వలన 69 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వీరిలో నలుగురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని జయపురం జిల్లా కేంద్రా ఆస్పత్రికి బుధవారం తరలించారు. దీంతో ఆయన హాస్టల్‌ను సందర్శించి పరిశుభ్రత, సౌకర్యాలను పరిశీలించారు. విషాహారంపై సంబంధిత అధికారులతో చర్చించారు.రాయగడలో డీఆర్ఎం పర్యటన..రాయగడ: విశాఖపట్నం రైల్వే డివిజన్ మేనేజర్ సౌరభ్ ప్రసాద్ బుధవారం రాయగడలో పర్యటించారు. విజయనగరం నుంచి రాయగడ వరకు కొనసాగుతున్న మూడో రైల్వేలైన్ నిర్మాణం పనులను సమీక్షించారు. అనంతరం రన్నింగ్ రూమ్, కొత్తగా నిర్మించిన స్టేషన్ బిల్డింగ్‌ను పరిశీలించారు. ఆయన వెంట రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు.సత్తాచాటిన జయపురం ఆటగాళ్లు..జయపురం: కొరాపుట్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీల్లో జయపురం ఆటగాళ్లు సత్తాచాటారు. వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో గెలిపొందిన వారికి బహుమతులు అందజేశారు.దరఖాస్తుల స్వీకరణ..రాయగడ: రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం కొత్తగా అమలు చేసిన సుభద్ర పథకం దరఖాస్తుల పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అంగన్వాడీ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం రాయగడలో ప్రారంభమయ్యింది. మహిళలు తమ దరఖాస్తులను సమర్పించేందుకు పెద్ద సంఖ్యతో హాజరవుతున్నారు. దీంతొ అంగన్వాడీ కేంద్రాలు మహిళలతో రద్దీగా ఉన్నాయి.వెబ్ పోర్టల్ మెరాయింపు..పర్లాకిమిడి: పట్టణంలో బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైన సుభద్ర పథకం పోర్టల్ మొరాయించింది. దీంతో అప్లయ్ చేసుకోవడానికి వచ్చిన మహిళలు నిరాసతో వెనుదిరిగారు. కాగా సుభద్ర ఫారాలను కొందరూ డబ్బులకు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. -
ఒడిస్సీ బాలినీస్ నృత్యాల వందేమాతర సంగమం!
బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ విరచిత ‘వందేమాతరం‘ ఖ్యాతి మరోసారి విశ్వ యవనికపై తొణికిసలాండింది! వియత్నాంలోని బాలీలోని భారతీయ దౌత్య కార్యాలయం దీనికి వేదికైంది. భారత నృత్య శైలుల్లో ఒకటైన ఒడిస్సీకి బాలినీస్ శైలి కూడా తోడైంది. వందేమాతరమంటూ.. పదాలు సొగసుగా కదిలాయి. హావభావాలు వ్యక్తమయ్యాయి. ఈ వీడియో కాస్తా ఇప్పుడు నెట్లో వైరల్‌గా మారింది. పలువురి అభిమానాన్ని చూరగొంటోంది. ఎందుకు? ఏమిటి? ఎలా? చూసేయండి మరి! కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా బాలిలో వందేమాతరం పాటకు ప్రత్యేక శైలిలో నృత్య ప్రదర్శన జరిగింది. భారతదేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బాలిలో నిర్వహించారు. ఇది ఒడిస్సీ, బాలినీస్ సంప్రదాయ నృత్యాలను మిక్స్ చేసిన నృత్య ప్రదర్శన. ఇది ఎంతగా ఆకట్టుకుంటుందంటే..ప్రేక్షకులు మైమరిచి చూస్తుండి పోయేంతగా! ఆ యువతులిద్దరూ చాలా చక్కటి అభినయంతో చేశారు. బంకిం చంద్ర ఛటోపాధ్యాయ రాసిన జాతీయ గీతం వందేమాతరం పాట ప్రతి భారతీయుడిలో దేశభక్తి ఉప్పొంగేలే చేస్తుంది. తెలియని అనుభూతి కలిగుతుంది. అలాంటి అద్భుతమైన గీతానికి చక్కటి నృత్యంతో అబ్బురపరిచారు ఆ యువతులు. ఈ నృత్య ప్రదర్శన ఇచ్చిన ఇద్దరు యువతుల్లో ఒకరు బాలిలో ఒడిస్సీ టీచర్ డా పాంపిపాల్ కాగా, మరోకరు బాలినీస్ డ్యాన్సర్ మెలిస్సా ఫ్టోరెన్స్ షిల్లెవోర్ట్. ఇద్దరు వేర్వేరు డ్యాన్సర్లు కలిసి ఒక దేశ భక్తి పాటకు ఇచ్చి ఈ ప్రదర్శన అద్భుతః ! అన్నంతగా నెటిజన్లను ఆకట్టుకుంది. Vandhe Maatram - Odissa & Bali dancers pic.twitter.com/hzj4bSv26o — Aviator Anil Chopra (@Chopsyturvey) April 11, 2024 (చదవండి: అత్యంత ఖరీదైన టీకప్పు..ధర వింటే షాకవ్వుతారు!) -
మీకు తెలుసా.. ఒక అసెంబ్లీ స్థానానికి ఇద్దరు ఎమ్మెల్యేలు!
కొరాపుట్: ఎక్కడైనా ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఒక్క ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించడం సర్వసాధారణం. కానీ గతంలో ఒక అసెంబ్లీ స్థానానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించిన విషయం చాలా మందికి తెలియదు. ఈ విషయం ఒడిశా అసెంబ్లీ రికార్డుల్లో సైతం నమోదై ఉంది. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో మాత్రమే ఈ నిబంధన ఉండేదని తెలుస్తోంది. బలహీన వర్గాలకు చేయూతనివ్వడానికి ఒక నియోజకవర్గంలో ఒక జనరల్ కేటగిరి ఎమ్మెల్యేతో పాటు ఒక రిజర్వ్ కేటగిరి ఎమ్మెల్యే ఉండేవారు. నబరంగ్‌పూర్ విధానసభ స్థానం నుంచి 1951లో కాంగ్రెస్ పార్టీ తరుపున జనరల్ కేటగిరి కింద సదాశివ త్రిపాఠి, రిజర్వ్ కేటగిరిలో ముది నాయక్ ప్రాతినిధ్యం వహించారు. 1957లో ఇదే స్థానం నుంచి అదే పార్టీకి చెందిన సదాశివ త్రిపాఠితో పాటు రిజర్వ్ కేటగిరిలో మిరు హరిజన్ కొనసాగారు. ఈ నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసింది. జయపూర్, ఉదయగిరి, అనుగుల్, పాల్ లక్రా కే నగర్, డెంకనాల్, భవానీపట్న, జునాగఢ్, నువాపడా, టిట్లాగఢ్, పాట్నగఢ్, బొలంగీర్, పదంపూర్, సోహేలా, రైరాకోల్, జర్సుగుడ, బెమ్రా, సుందర్ గఢ్, కెంజోర్, ఆనంద్‌పూర్, పంచ్పిర్, బరిపద, నిలగిరి, చందబలి, సుకింద, జాజ్‌పూర్, బింజాపూర్, అవౌల్, సాలేపూర్, కటక్ రూరల్, నిమాపరా, భువనేశ్వర్, నయాగడ్, కేంద్రపడా, దసపల్లా, అస్కా, బ్రహ్మపుర, పర్లాకిమిడి స్థానాల్లో సైతం ఇద్దరేసి ఎమ్మెల్యేలు ఉండేవారు. -
పొత్తు లేనట్లే.. బీజేపీ తేల్చేసిందా?
సాక్షి, భువనేశ్వర్ : బీజేపీ - బీజేడీల మధ్య ఇక పొత్తు లేనట్లేనని తెలుస్తోంది. ఈ సారి లోక్‌సభ ఎన్నికలకు 15 ఏళ్ల తర్వాత పాత మిత్రులు మళ్లీ ఒక్కటవ్వనున్నారని అందరూ అనుకున్నారు. కానీ తాజా రాజకీయ పరిణామాలు అందుకు తావు ఇవ్వడం లేదని సమాచారం. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించారు. ఆ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేడీ అధినేత, ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌లు మంతనాలు జరిపారు. అనంతరం 15 ఏళ్ల తర్వాత బీజేపీతో జతకట్టేలా సంకేతాలిచ్చారు. అమిత్ షా తో సుదీర్ఘంగా చర్చలు ఇందులో భాగంగా పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల బరిలో దిగేలా ఇరు పార్టీల అగ్రనేతలు చర్చలు జరిపారు. అయితే, సీట్ల పంపకాల్లో విభేదాలు తలెత్తడంతో.. బీజేపీ ఒంటరిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందంటూ ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ ప్రకటించారు. పొత్తుపై చర్చించేందుకు అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన మన్మోహన్ సాముల్.. కేంద్రమంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చర్చల అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొత్తులపై మన్మోహన్ సాముల్ మాట్లాడుతూ.. ‘మా జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటరీ పార్టీ ఏది చెబితే అది తుది నిర్ణయం’ అని అన్నారు. సీనియర్ నేతలతో సీఎం భేటీ ఆ తర్వాతే ఒడిశాలో బీజేపీ సొంతంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ ఎక్స్.కామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. కొద్ది సేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. మరోవైపు బీజేడీ పార్టీ అధ్యక్షుడు, సీఎం నవీన్ పట్నాయక్ తన నివాసంలో పార్టీ సీనియర్ నేతల సమావేశాన్ని నిర్వహించారు. ఇలా వరుస పరిణామాలతో ఒడిశా రాష్ట్ర రాజకీయాలు రసకందాయంగా మారాయి. పోలింగ్‌కు సమయం ఉంది కాబట్టి పొత్తులపై బీజేపీ- బీజేడీలు చర్చలు జరుపుతుంటే.. ఇరు పార్టీల నేతలు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తుండడం గమనార్హం. -
ఒడిశా టు హైదరాబాద్.. తాజాగా పట్టుబడిన గంజాయి ‘చాక్లెట్లు’
ఖమ్మం: ఒడిశా నుంచి తెలంగాణలోని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలించే స్మగ్లర్లకు జిల్లా రాచబాటగా మారింది. ఎక్సైజ్, పోలీసు అధికారులు ఎంత కట్టడి చేసినా.. తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నా ఎక్కడో చోట గంజాయి పట్టుబడడం సర్వసాధారణమైపోయింది. అయితే, ఇన్నాళ్లు గంజాయిని బస్తాల్లో.. ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం వాహనాల్లో ఇతర సరుకుల కింద తరలించేవారు. అనంతరం నూనెగా మార్చి కూడా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇదంత ఎందుకు అనుకున్నారో ఏమో కానీ ఏకంగా గంజాయిని చాక్లెట్ల రూపంలోకి మార్చి తరలిస్తుండగా ఎక్సై జ్ అధికారులు గుర్తించారు. తాజాగా జిల్లా కేంద్రంలో చేపట్టిన తనిఖీల్లో ఈ గంజాయి చాక్లెట్లు పట్టుబడగా అవాక్కవడం ఎక్సైజ్ పోలీసుల వంతు అయింది. ఒడిశా టు హైదరాబాద్.. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా గంజాయి సాగుకు పెట్టింది పేరు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పలువురు అక్కడకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి ప్యాకెట్లుగా తీసుకెళ్తుంటారు. తాజాగా అక్కడే గంజాయిని చాక్లెట్ల రూపంలోకి మార్చి ఎవరికీ అనుమానం రాకుండా మహిళల చేత రవాణా చేయిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు మహిళలు ఖమ్మంలో పట్టుబడగా... తనిఖీ చేసిన అధికారులే నివ్వెరపోయారు. ఒక్కో ప్యాకెట్లో ఐదు గ్రామాల చొప్పున 40చాక్లెట్లుగా ఉండగా ఆ ప్యాకెట్‌ను రూ.90కు కొనుగోలు చేసి రూ.400 చొప్పున విక్రయిస్తున్నట్లు గుర్తించారు. చార్మినార్ గోల్డ్, మున్కా తదితర పేర్లతో ఈ చాక్లెట్లు ఒడిశా ప్రాంతంలోనే తయారవుతున్నట్లు తెలిసింది. చాక్లెట్లకు డిమాండ్.. గంజాయికి అలవాటు పడిన వారు పొడి కొనుగోలు చేయడం.. పీల్చడం చేస్తుంటారు. అయితే, ప్యాకెట్ల రవాణా సమయంలో తరచుగా పట్టుబడుతండడంతో అమ్మకం, కొనుగోలుదారులు చాక్లెట్లపై దృష్టి సారించినట్లు సమాచారం. దీంతో ఒడిశాలోని స్మగ్లర్లు గంజాయి చాక్లెట్లు తయారుచేస్తున్నట్లు తెలిసింది. తద్వారా వీటి వాడకం సులువవుతుందని, తనిఖీల్లోనూ పట్టుబడే అవకాశాలు తక్కువగా ఉంటాయనే భావనకు వచ్చినట్లు చెబుతున్నారు. అంతేకాక కావాల్సినప్రాంతాలకు చేరవేసి అమ్మడం సులువవుతుందని గంజాయిని చాక్లెట్ల రూపంలో మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో కొన్నాళ్ల క్రితం చాక్లెట్లు పట్టుబడగా మూడు రోజుల క్రితం వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద మూడు కేజీల గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనం కలిగించింది. పోలీసులకు చిక్కేది కొందరే.. గంజాయి తరలిస్తూ పోలీసులకు చిక్కుతున్న వారు కొందరేనని.. అది కూడా కూలీలేనని సమాచారం. అసలు సూత్రధారులు ఎక్కడా పట్టుపడకుండా తెర వెనక ఉండి దందా నడిపిస్తుంటారని తెలిసింది. ఒడిశా నుంచి గంజాయితో జిల్లాకు చేరుకుంటున్న పలువురు సాధారణ ప్రయాణికుల మాదిరి బస్సుల్లో వెళ్తుండగా.. ఇంకొందరు రైళ్లను ఎంచుకుంటున్నారు. అయితే, తెలంగాణలో మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టాక ఇదే అదునుగా రద్దీగా ఉంటున్న బస్సుల్లో గంజాయిని తరలిస్తున్నట్లు తెలిసింది. అయితే, అసలు సూత్రధారులు దొరకనంత కాలం గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయడం సాధ్యం కాకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. ఇవి చదవండి: కమీషన్లకు ఆశపడి.. -
స్పైసీ స్పైసీ ఎర్ర చీమల చట్నీ: ఇక వరల్డ్ వైడ్‌గా మారు మోగనుంది
చీమల పచ్చడి గురించి ఎపుడైనా విన్నారా? ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్, ఒడిశాలోని మయూర్‌భంజ్‌లోనూ ఇది ఫ్యామస్. రుచికరమైన చట్నీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజ నాలున్నాయని తాజాగా పరిశోధకులు తేల్చారు. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌తో సహా జిల్లాలోని ప్రతి బ్లాక్ ఏరియాలోని అడవులలో ఏడాది పొడవునా సమృద్ధిగా కనిపిస్తాయి. ఒడిశాలోని మయూర్భంజ్ ప్రజలు దీన్ని విరివిగా వాడతారు. వీరు తయారు చేసే స్పైసీ స్పైసీ రెడ్ యాంట్ చట్నీకి ఇప్పటికే భిన్నమైన గుర్తింపు లభించడంతో పాటు ఇపుడిక జీఐ ట్యాగ్ కూడా అందుకోవడం విశేషంగా నిలిచింది. దీంతో రెడ్ యాంట్ చట్నీ ఇక వరల్డ్ వైడ్‌గా గుర్తింపును తెచ్చుకోనుంది. మయూర్భంజ్ రెడ్ యాంట్ చట్నీకి GI ట్యాగ్ మయూర్భంజ్లోని రెడ్ చట్నీపై చేసిన పరిశోధనలో, శాస్త్రవేత్తలు రెడ్ వీవర్ చీమలను విశ్లేషించారు. ఇందులో ప్రోటీన్, కాల్షియం, జింక్, విటమిన్ బి-12, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, కాపర్, అమినో యాసిడ్లు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పోషకాలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులను నివారించవచ్చని గుర్తించారు. రెండ్ యాంట్ చట్నీ కేవలం రుచికి మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దాని వైద్యపరమైన లక్షణాల కారణంగా ఇది స్థానిక ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రకృతితో ముడిపడి ఉన్న ప్రజల పోషకాహార భద్రతకు ఇది చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. స్థానికుల విశ్వాసంతో పాటు, ఈ చట్నీలోని ఔషధ గుణాలను నిపుణులు ఇప్పటికే గుర్తించారు. జ్వరం, జలుబు, దగ్గు, ఆకలిని తగ్గించడానికి, కంటి చూపు, కీళ్ల నొప్పులు, ఆరోగ్యకరమైన మెదడును మెరుగుపరచడంలో సహాయపడుతుందని తేల్చిన సంగతి తెలిసిందే. ఈ చీమల నుండి తయారుచేసిన సూప్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందట. స్థానికంగా చాప్ డా అని పిలిచే ఈ చీమల పచ్చడికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎర్ర చీమల చట్నీ ఎలా తయారు చేస్తారంటే ఈ రెడ్ వీవర్ చీమలను వాటి గుడ్లతో పాటు గూళ్ళ నుండి సేకరించి శుభ్రం చేస్తారు. దీని తరువాత, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, కారం కలిపి, గ్రైండ్ చేయడం ద్వారా చట్నీ తయారు చేస్తారు. ఈ చట్నీ కారం..కారంగా , పుల్లగా ఉంటుంది కానీ చాలా రుచిగా ఉంటుంది. స్థానిక గిరిజనులు తమ ఆహారంలో చేర్చుకుంటారు. ఇందులోని ప్రొటీన్, కాల్షియం, ఫామిక్ యాసిడ్, ఇతర పోషక గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి మారుమూల గిరిజనవాసులకు ఎంతో మేలు చేస్తాయి. ఈ చట్నీ మలేరియా, కామెర్లు తదితర కొన్ని రకాల వ్యాధులను కూడా నయం చేస్తుందని స్థానిక గిరిజనుల విశ్వాసం. అలాగే కొలంబియా, మెక్సికో, బ్రెజిల్‌లోనూ చీమలను ఆహారంగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే OUAT బృందం 2020లో శాస్త్రీయ ఆధారాలతో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ గుర్తింపుకోసం చేసిన ప్రయత్నం ఫలించింది. -
అయ్యో.. ఎంత ఘోరం..! ముగ్గురు ఒకేసారి ఇలా..
ఒడిశా: విద్యుత్ తీగలు వారి పాలిట మృత్యు పాశాలయ్యాయి. ఇనుప రాడ్ రూపంలో ప్రాణాలను కబళించాయి. ఎప్పటిలా కాకుండా ముందుగా ప్రారంభిద్దామనుకున్న పనే వారి పాలిట శాపమైంది. విద్యుత్ షాక్ రూపంలో ముగ్గురిని బలి తీసుకుంది. కుటుంబీకులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. హృదయ విదారకమైన ఈ ఘటన సంతకవిటి మండలం సోమన్నపేటలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు.. సంతకవిటి మండలం సోమన్నపేట గ్రామంలో గురువారం విద్యుత్ షాక్‌కు గురై గ్రామానికి చెందిన పాండ్రంకి కేసరినాయుడు(24), గండ్రేటి చంద్రశేఖర్(18), దూబ రెయ్యమ్మ(57) మృతి చెందారు. పాండ్రంకి రామినాయుడు ఇంటి మొదటి అంతస్తు నిర్మాణ పనుల్లో భాగంగా అతని కుమారుడు కేసరినాయుడు, అదే గ్రామానికి చెందిన అతని స్నేహితుడు గండ్రేటి చంద్రశేఖర్‌ను పనికి పిలిచి డాబా ఎక్కారు. ఆ సమయంలో డాబా మీద ఉన్న 12 ఎంఎం ఇనుప రాడ్‌ను డాబా వెనుక వైపు నెట్టగా, డాబాకు కొద్ది దూరంలో ఉన్న 230 ఓల్ట్స్ విద్యుత్ సరఫరా తీగలకు రాడ్ తగలడంతో రాడ్‌ను పట్టుకున్న ఇద్దరు యువకులు పెద్దగా కేకలు వేస్తూ మృతి చెందారు. డాబా మీద యువకుల అరుపులను ఎదురుగా ఉన్న అంగన్వాడీ ఆయా దూబ రెయ్యమ్మ విని వెంటనే డాబా పైకి వెళ్లి పొరపాటున ఇనుప చువ్వను ముట్టుకోవడంతో ఈమె కూడా మృతి చెందింది. ఈ విషయాన్ని గమనిస్తున్న ఒకరిద్దరు ఏదో జరుగుతుందని ఊహించి డాబా ఎక్కకుండా పొలాల్లో ఉన్న కుటుంబీకులకు సమాచారం అందించారు. గ్రామంలోకి వచ్చిన కిరాణా సరుకుల రవాణా వ్యాపారి డోల ప్రసాద్ డాబా వెనుక వైపునకు వెళ్లి ఇనుప రాడ్ స్ట్రీట్ లైన్ విద్యుత్ తీగలకు తగిలి ఉండడాన్ని గమనించి ఎలక్ట్రికల్ ఏఈకి వెంటనే ఫోన్ చేసి విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయించారు. అనంతరం డాబా ఎక్కి ముగ్గురు పడి ఉండడాన్ని గమనించి వారిని కిందకు దించారు. ముగ్గురిలో చంద్రశేఖర్ కొన ఊపిరితో ఉన్నాడనే అనుమానం రావడంతో వెంటనే ప్రైవేట్ వాహనంలో సంతకవిటి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో తిరిగి గ్రామానికి తీసుకొచ్చారు. వీఆర్వో కనకమ్మ ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా రాజాం రూరల్ సీఐ సీహెచ్ ఉపేంద్ర, సంతకవిటి ఎస్ఐ బి.లోకేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం రాజాం ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించి అనంతరం బంధువులకు అప్పగించారు. జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఎంపీ, ఎమ్మెల్యేల సంతాపం.. సోమన్నపేట గ్రామంలో జరిగిన ఘటనకు సంబంధించి రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత పొగిరి సత్యంనాయుడుతో పాటు సంతకవిటికి చెందిన జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరో వైపు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఈ ఘటనపై మృతుల కుటుంబాలకు సానుభూతి తెలపడంతో పాటు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని సూచించారు. ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్‌లో జరగకుండా చర్యలు చేపట్టాలని ఎలక్ట్రికల్ అధికారులకు ఆదేశించారు. సంఘటనా స్థలానికి విద్యుత్ శాఖ రాజాం డీఈఈ జీవీ రమణ, ఏఈలు కుమార్, సయ్యద్‌లు చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. ముగ్గురి జీవితాల విషాద గాధ.. ఈ ఘటనలో మృతి చెందిన పాండ్రంకి కేసరినాయుడు తల్లి చిన్నమ్మడు ఆరు నెలలు క్రితమే మృతి చెందింది. కేసరినాయుడుతో పాటు తండ్రి రామినాయుడు, సోదరుడు కోటిబాబు కలసి ఉంటున్నారు. కేసరినాయుడు డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటూ తండ్రికి పొలం పనుల్లో సాయం చేస్తున్నాడు. అన్నయ్య విశాఖపట్నంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఊరికి వచ్చిన తన సోదరుడు బుధవారం విశాఖపట్నం వెళ్లిపోయాడు. ఇంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. ఆరు నెలల వ్యవధిలో తల్లీకొడుకులు మృతి చెందడం స్థానికులను కన్నీరు పెట్టించింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన గండ్రేటి చంద్రశేఖర్ కుటుంబానిది మరో విషాద గాధ. గండ్రేటి కేసరి, సూరీడమ్మలకు చంద్రశేఖర్ ఒక్కడే కుమారుడు. ఒక్కగానొక్క కుమారుడిని అల్లారు ముద్దుగా చూసుకుంటున్న తల్లిదండ్రులు రాజాంలో నాగావళి ఐటీఐలో ఫిట్టర్ కోర్సులో చేర్పించారు. గురువారం కళాశాల ఉన్నప్పటకీ స్నేహితుడు కేసరినాయుడు ఇంటి పనికి వచ్చాడు. మృత్యువులో కూడా స్నేహితునితో కలసి వెళ్లిపోయాడు. తమ కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక ఆ తల్లిదండ్రులు మాకెందుకు ఈ జీవితం అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన దూబ రెయ్యమ్మ ఒక్కర్తే ఉంటున్నారు. ఈమెకు భర్త లేరు. గ్రామంలో అంగన్వాడీ ఆయాగా ఉంటూ కాలం నెట్టుకొస్తుంది. ఈమెకు ఒక్క కుమార్తె భవానీ కాగా ఆమెకు పెళ్లి చేసి, తానొక్కర్తే జీవనం సాగిస్తుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు ఏమి జరిగిందో తెలుసుకుని వారిని కాపాడేందుకు డాబా ఎక్కి మృత్యువాత పాడింది. ఈమె మృతిని కుమార్తె జీర్ణించుకోలేక బోరున విలపిస్తుంది. మిగిలిన వారి ప్రాణాలు కాపాడిన ఆ ముగ్గురు.. ఇదిలా ఉండగా ఈ ఘటనలో మరింత మంది మృత్యువాత పడే ప్రమాదం ఘటనా స్థలంలో నెలకొంది. అయితే విద్యుత్ ఎర్త్ అవుతుందని అనుమానం వచ్చిన స్థానికురాలు నగిరి పద్మ మిగిలిన వారిని డాబా ఎక్కనీయకుండా అడ్డుకుంది. లేకుంటే మరో ఒకరిద్దరు ప్రాణాలు కోల్పోయి ఉండేవారు. గ్రామంలోకి వచ్చిన కిరాణా రవాణా వ్యాపారి డోల ప్రసాద్ డాబా ఎక్కుతుండగానే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవుతుందని గమనించి డాబా వెనుక వైపు వెళ్లి స్ట్రీట్ లైన్‌కు ఇనుపరాడ్ డాబా మీద నుంచి ఉన్నట్లు గుర్తించి వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలుపుదల చేయించి ప్రాణ నష్టాన్ని నివారించాడు. ఇంకో వైపు విద్యుత్ తీగలు మధ్య ఉన్న రాడ్‌ను గ్రామానికి చెందిన ఆబోతుల అప్పారావు గుర్తించి, వెంటనే అక్కడకు వచ్చి ఎదురు కర్రతో రాడ్‌ను తొలగించి పెద్ద ప్రమాదాన్నే తప్పించారు. లేకుంటే విద్యుత్ సరఫరా డాబా మీదకు వస్తుందని చెబుతున్నప్పటకీ కొంతమంది ఆత్రుతతో డాబా ఎక్కే ప్రయత్నం చేశారు. ఇనుప రాడ్ విద్యుత్ తీగల నుంచి తప్పించకుంటే ప్రమాదం ఇంకా పెద్దదయ్యేది. మరింత ప్రాణ నష్టం జరిగేది. -
ఒడిశా రైలు ప్రమాదం.. 3 నెలల ముందుగానే హెచ్చరిక
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ మొత్తం 275 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికిగల కారణాలు దర్యాప్తు రిపోర్టు వచ్చిన తరువాత వెల్లడికానున్నాయి. అయితే ఈ విషయమై ఒక అధికారి రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. ఈ లేఖలో ఆ రైల్వే అధికారి రాబోయే ప్రమాదాన్ని 3 నెలల ముందుగానే ఊహించి, ఉన్నతాధికారులకు తెలియజేశారు. సిగ్నల్ సిస్టమ్‌లోని లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. హరిశంకర్ వర్మ అనే ఈ రైల్వే అధికారి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో విధులు నిర్వహిస్తున్నారు. దీనికి ముందు ఆయన పశ్చిమ మధ్య రైల్వేలో పనిచేశారు. అప్పుడు ఆయన ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్‌గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో దక్షిణ పశ్చిమ రైల్వేలో రైలు మరో లైనులో వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. ఇంటర్‌లాకింగ్ కోసం తయారు చేసిన సిస్టమ్‌ను బైపాస్‌గా మార్చినపుడు లొకేషన్ బాక్సులో జరిగిన గడబిడ గురించి ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిని తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా ఆయన రైల్వే బోర్డుకు తెలియజేశారు. అలాగే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కూడా పేర్కొన్నారు. ఈ సిస్టమ్‌లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, రైలు బయలుదేరిన తరువాత డిస్పాచ్ రూట్ మారిపోతున్నదని పేర్కొన్నారు. సిగ్నల్‌కు సంబంధించిన కీలకమైన పనులు కింది ఉద్యోగుల చేతుల్లో ఉన్నాయని, దీనివలన అనుకోని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం జరిగిన ప్రమాదం విషయానికి వస్తే రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ట్రైన్ నంబర్12481 కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బహన్‌గా బాజార్ స్టేషన్‌కు చెందిన మెయిన్ లైన్లోవెళుతోంది. ఇంతలో అది పట్టాలు తప్పి లూప్లైన్లో నిలిచివున్న గూడ్సు రైలును ఢీకొంది. ఆ సమయంలో రైలు ఫుల్ స్పీడులో ఉంది. ఫలితంగా ఆ రైలుకు సంబంధించిన 21 కోచ్‌లు పట్టాలు తప్పాయి. మూడు కోచ్‌లు డౌన్‌లైన్‌లోకి చేరుకున్నాయి. నిజానికి బహన్‌గా బాజార్ స్టేషన్లో ఈ ట్రైన్‌కు స్టాపేజీ లేదు. అందుకే ఈ రైలు స్పీడుగా వెళ్లి గూడ్సును ఢీకొన్నప్పుడు దాని మూడు కోచ్‌లో డౌన్‌లైన్‌లోకి చేరుకోగా.. అటువైపుగా వస్తున్న యశ్వంత్‌పూర్- హౌరా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు బోగీలు పట్టాలపై ఉన్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొన్నాయి. ఈ ప్రమాదం భువనేశ్వర్ రైల్వేస్టేషన్‌కు సుమారు 171 కిలోమీటర్లు, ఖగర్‌పూర్ రైల్వేస్టేషన్‌కు సుమారు 166 కిలోమీటర్ల దూరంలోని బాలాసోర్ జిల్లాలోని బహన్‌గా బాజార్ స్టేషన్ వద్ద జరిగింది. చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: అయినవారి ఆచూకీ తెలియక.. -
బాలాసోర్ రైలు ప్రమాదం: ‘కూతురి మొండితనమే ప్రాణాలు నిలబెట్టింది’
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదాన్ని ఎవరూ అంత త్వరగా మరచిపోలేరు. ప్రమాదంలో కొందరు ఇంటిలోనివారిని కోల్పోగా, మరికొందరు క్షతగాత్రులుగా మిగిలారు. దీనికి భిన్నంగా కొందరు విచిత్ర పరిస్థితుల్లో ప్రాణాలతో బతికి బయటపడ్డారు. అటువంటి కథనం ఒకటి వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే తన 8 ఏళ్ల కుమార్తెతో పాటు ఒక తండ్రి కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో కటక్ వెళ్లేందుకు బయలుదేరారు. వారు కరగ్‌పూర్‌లో రైలు ఎక్కారు. వారికి థర్డ్ ఏసీలో సీటు రిజర్వ్ అయ్యింది. అయితే వారికి కిటికీ దగ్గరి సీటు లభ్యం కాలేదు. అయితే కుమార్తె తనకు కిటికీ దగ్గరి సీటు కావాలని మొండిపట్టు పట్టింది. తండ్రి ఎంత నచ్చజెప్పినా ఆ చిన్నారి మాట వినలేదు. దీంతో ఆ తండ్రి టీసీని సంప్రదించి, కిటికీ దగ్గరి సీటు కావాలని రిక్వస్ట్ చేశారు. దీనికి టీసీ సమాధానమిస్తూ మీరు మరో ప్రయాణికుని అడిగి వారి సీటు అడ్జెస్ట్ చేసుకోండని సలహా ఇచ్చారు. దీంతో ఆ తండ్రి మరో కోచ్‌లోని ఇద్దరు ప్రయాణికులను రిక్వస్ట్ చేయడంతో వారు అందుకు అంగీకరించారు. దీంతో ఆ తండ్రీకుమారులు ఆ రెండు సీట్లలో కూర్చున్నారు. కొద్దిసేపటికి వారు ప్రయాణిస్తున్న రైలు బాలాసోర్ చేరుకున్నంతలోనే ప్రమాదానికి గురయ్యింది. ఆ తండ్రీకూతుర్లు కూర్చున్న కోచ్‌కు ఈ ప్రమాదంలో ఏమీకాలేదు. అయితే అంతకుమందు వారికి కేటాయించిన సీట్లు కలిగిన బోగీ తునాతునకలైపోయింది. ఆ బోగీలోని చాలామంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం బారి నుంచి బయటపడిన ఆ తండ్రి పేరు ఎంకే దేవ్. అయిన మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె మొండితనం వలనే ఈరోజు తాము ప్రాణాలతో బయటపడగలిగామన్నారు. కాగా అతని కుమార్తె చేతికి స్వల్పగాయమయ్యింది. ఆ చిన్నారి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: ‘ ట్రైన్ టాయిలెట్లో ఉన్నాను... ఒక్క కుదుపుతో..’ -
‘ ఒక పెద్ద కుదుపు.. అంతా అయిపోయింది’
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన భయానక రైలు ప్రమాదం అందరిలోనూ దడ పుట్టించింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకూ 275 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మృత్యుముఖాన్ని చూసి, ప్రాణాలతో బతికి బట్టకట్టారు. అలాగే ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారు కూడా చాలామంది ఉన్నారు. వీరు ఈ ఘటనను మరువలేకపోతున్నామని చెబుతున్నారు. బాలేశ్వర్‌కు చెందిన జితేంద్ర నాయక్ ఈ ఘటనను ప్రత్యక్షంగా చూశారు. ఆయన ఈ దుర్ఘటన సంభవించిన సమయంలో తనకు ఎదురైన అనుభూతిని మీడియాకు తెలిపారు. జితేంద్ర నాయక్ మీడియాతో మాట్లాడుతూ ‘ నేను ఆ సమయంలో కోరమాండల్‌లోని జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నాను. ఆ బోగీలో 100 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. దీంతో బోగీ రద్దీగా మారింది. బోగీలో నేను కింద కూర్చున్నాను. రైలు ముందుకు కదిలిన కొద్దసేపటికే రైలులో వైబ్రేషన్ మొదలయ్యింది. ట్రైన్ అటుఇటు కదులుతున్నట్లు అనిపించింది. కొన్ని నిముషాల తరువాత హఠాత్తుగా పెద్ద కుదుపు వచ్చింది. దాని తరువాత ఏమయ్యిందో తెలియలేదు. చదవండి: ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’ రైలు అంతా పొగమయంగా మారిపోయింది. కళ్లు నులుముకుని చూసే సరికి, కొందరు చేతులు తెగి పడినవారు, కాళ్లను కోల్పోయినవారు, ముఖం, శరీరంపై తీవ్ర గాయాలయినవారు కనిపించారు. నేను రైలులో నుంచి ఎలాగోలా బయటకు వచ్చాను . అప్పుడు నాకు కొత్త జీవితం దొరికినట్లు అనిపించింది. ఆ సమయంలో నన్ను ఎవరూ కాపాడలేదు. నేనే అతి కష్టం మీద శిధిలాల నుంచి బయటపడ్డాను. ఆ సమయంలో చాలామంది క్షతగాత్రులు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. నేను ప్రయాణించిన జనరల్ బోగీలోని ప్రయాణికులెవరూ బతికివుండే అవకాశం లేదు. భగవంతుడు నాకు నూతన జీవితాన్ని ప్రసాదించాడు. అందుకు నేను భగవంతునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు. -
ఒకే కుటుంబంలోని ముగ్గురు సోదరులు మృతి
ఒడిశాలో చోటుచేసుకున్న రైలు ప్రమాదం ఘోర విషాదాన్ని మిగిల్చింది. పలు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. కొన్ని కుటుంబాలు ఇంటికి పెద్ద దిక్కును కోల్పోగా, మరికొన్ని కుటుంబాల్లో ఎదిగొచ్చిన పిల్లలు అకాల మృత్యువు పాలయ్యారు. అలాంటి ఉదంతం ఒకటి అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఉపాధి కోసం పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురు సోదరులు రైలులో తమిళనాడు బయలుదేశారు. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వీరు దుర్మరణం పాలయ్యారు. వీరిని 24 పరగణా జిల్లాలోని చర్నీఖలీ గ్రామానికి చెందిన హరన్ గోయెన్(40) నిశికాంత్ గోయన్(35) దివాకర్ గోయెన్(32)గా గుర్తించారు. వీరు ఏడాదిలో చాలాకాలం తమిళనాడులోనే ఉంటూ, అక్కడ దొరికిన పనులు చేస్తుంటారు. ఇటీవలే వీరు స్వగ్రామానికి వచ్చారు. కొన్నాళ్లు ఉన్నాక తిరిగి తమిళనాడు వెళ్లేందుకు కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. రైలు ప్రమాదంలో ఈ ముగ్గురు సోదరులు మరణించారనే వార్త తెలియగానే వారి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు సోదరులలో ఒకరైన హరన్ భార్య అంజిత చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇప్పుడు ఆమె గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. మృతి చెందిన ముగ్గురు సోదరుల తమ్ముడు ఇటీవలే ఒక హోటల్లో పనిలో చేరాడు. తండ్రిలేని ఈ కుటుంబానికి దిక్కు లేకుండా పోయిందని స్థానికులు విలపిస్తున్నారు. నిశికాంత్ కుటుంబం విషయానికొస్తే ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రైలు ప్రమాదంలో 24 పరగణా జిల్లాకు చెందిన 12 మంది మృతి చెందారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. 110 మంది ఆచూకీ తెలియడం లేదు. ఇప్పుటి వరకూ 16 మంది బాధితులు వారి ఇళ్లకు చేరుకున్నారు. -
మానవత్వం మరచిన అంబులెన్స్ డైవర్లు!
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో బీహార్‌లోని మోతిహర జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మృతి చెందాడు. జిల్లాకు చెందిన పలువురు గాయాలపాలయ్యారు. కాగా మృతుడు చికనీ గ్రామానికి చెందిన భూలన్ పటేల్ పెద్ద కుమారుడు రాజా కుమార్ అని చెబుతున్నారు. మృతుడు పెయింటింగ్ పనులు చేస్తుంటాడని, ఈ పనుల కోసమే వేరే ప్రాంతం వెళ్లాడని సమాచారం. ఇదే గ్రామానికి చెందిన 9మంది రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరు స్వయంగా ఫోను చేసి, కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేశారు. కాగా రాజా కుమార్ మరణవార్త తెలియగానే గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుని తల్లి, భార్యల రోదనలు మిన్నంటాయి. రాజా కుమార్‌కు రెండు సంవత్సరాల క్రితమే వివాహమయ్యింది. ఆ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే రాజా కుమార్ మృతదేహం ఇంకా గ్రామానికి చేరుకోలేదు. మృతదేహాన్ని గ్రామం వరకూ తీసుకురావాలంటే అంబులెన్స్ డ్రైవర్ రూ. 45 వేలు అడుగుతున్నాడని మృతుని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజా కుమార్ తల్లి మాట్లాడుతూ తమ కుటుంబ బాధ్యత రాజానే చూసుకుంటున్నాడని తెలిపారు. కేరళలో పని చేస్తూ తమ కుటుంబాన్ని పోషిస్తున్నాడన్నారు. రూ. 45 వేలు చెల్లించి కుమారుని మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చేంతటి స్థోమత తమకు లేదని ఆమె వాపోయింది. మృతుని తండ్రి భవన్ పటేల్ మాట్లాడుతూ తమ కుమారుని మృతదేహన్ని ఇక్కడికి తీసుకువచ్చేందుకు గ్రామస్తులు చందాలు సేకరిస్తున్నారన్నారు. ఒడిశాలో జరిగిన ఈ రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య తాజాగా 288కి చేరింది. 900 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయని సమాచారం. స్థానికంగా ఉన్న పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీని ప్రకారం చూస్తే ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు అంచనావేస్తున్నారు. కాగా ఎన్డీఆర్ఎఫ్, రైల్వే, ఇతర శాఖల సిబ్బంది క్రేన్లు, బుల్డోజర్లు, గ్యాస్ కట్టర్ల సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రమాదానికి గురైన రెండు రైళ్ల ఇంజిన్ డ్రైవర్లు, గార్డులకు తీవ్ర గాయాలయ్యాయని, వారికి చికిత్స అందిస్తున్నట్టు రైల్వే అధికారి ఒకరు తెలిపారు. కాగా ఈ ఘటనలో గూడ్స్ రైలు డ్రైవర్, గార్డుకు ఎటువంటి గాయాలు కాకపోవడం విశేషం. -
కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..
జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో అత్యంత ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఒక గూడ్సు రైలును వెనుక నుంచి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పి, పక్కనున్న ట్రాక్‌పైకి దొర్లాయి. ఆ సమయంలో ఆ ట్రాక్ మీదుగా యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ వెళ్తోంది. అవి యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్నాయి. దాంతో ఈ ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. అయితే గూడ్సును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడమే ఘటనకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. అయితే కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ హౌరాలోని షాలీమార్ స్టేషన్ నుంచి చెన్నై వరకూ నడుస్తుంది. ఈ రైలు ప్రతిరోజూ నడుస్తుంది. అలాగే నాలుగు రాష్ట్రాల మీదుగా అంటే పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల గుండా ప్రయాణిస్తుంది. కోరమండల్ తీరం అనేది భారత్‌కు ఆగ్నేయ తీరం. కోరమండల్ తీరం వెంబడి నడుస్తున్నందునే ఈ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఈ పేరు వచ్చింది. ఈ రైలులో ప్రయాణించేవారు కోరమండల్ తీరంలోని సుందర దృశ్యాలను తిలకించవచ్చు. ఈ మార్గంలో దట్టమైన అడవులతో పాటు పలు చారిత్మాక, సాంస్కృతిక స్థలాలు కూడా దర్శనమిస్తాయి. కోరమండల్ తీరం సుమారు 22,800 చదరపు కిలోమీటర్ల మేరకు వ్యాప్తిచెందింది. ఇది సముద్ర మట్టానికి 80 మీటర్ల ఎత్తులో ఉంది. కోరమండల్ తీరం వ్యవసాయానికి కూడా ఎంతో పేరుగాంచింది. ఈ ప్రాంతంలో వరితో పాటు వివిధ రకాల పప్పు ధాన్యాలు కూడా పండుతాయి. చెరకు పంట కూడా పండుతుంది. అలాగే చేపల పెంపకం, షిప్పింగ్ లాంటి పరిశ్రమలకు నెలవుగా ఉంది. -
మలేసియాలో ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి గ్రామానికి: రారాజులా లాభాల పంట
విదేశంలో ఉద్యోగం.. ఐదెంకల ఐటీ ఉద్యోగం. అయినా ఇవేవీ సంతోషాన్ని ఇవ్వలేదు. అందుకే లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి తనకెంతో ఇష్టమైన రైతుగా మారి పోయాడు. మలేషియాలో ఉద్యోగానికి బైబై చెప్పేసి ఆర్గానిక్ ఫామింగ్ (సేంద్రీయ వ్యవసాయం) ద్వారా లక్షలు సంపాదిస్తున్నాడు. ఒడిశాలోని రాయగడ జిల్లాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సత్య ప్రబిన్ వినూత్న వ్యవసాయ పద్ధతులతో విజయం సాధించి సమాజానికి ప్రేరణగా నిలుస్తున్నాడు. బీటెక్ పూర్తి చేసిన సత్య, మలేషియా ఐటీ కంపెనీలో టెకీగా 11 ఏళ్లు పని చేశాడు. నెలకు రూ.2 లక్షల వేతనం సౌకర్య వంతమైన జీవితం. అయినా అతనికి వ్యవసాయం మీద ఉన్న మక్కువ పోలేదు. ముఖ్యంగా తన చిన్నతనంలో తండ్రి జీవనోపాధి కోసం కూరగాయలు పండించేవారు. అది అతని మనసులో ఎపుడూ మెదులుతూ ఉండేది. వన్ ఫైన్ మార్నింగ్ ఇక ఉద్యోగాన్ని వదిలేసి గ్రామానికి వెళ్లి వ్యవసాయాన్ని మొదలు పెట్టాలనుకున్నాడు. క్షణం ఆలస్యం చేయ కుండా చకచకా పనులన్నీ చక్క బెట్టుకుని తనకున్న అభిరుచుని నెరవేర్చుకునేందుకు రంగంలోకి దిగిపోయాడు. 2020లో సొంత గ్రామానికి వచ్చేసి 34 ఎకరాల భూమిలో డ్రిప్ సిస్టమ్, సేంద్రీయ ఎరువులు వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం ప్రారంభించాడు. అంతే నమ్ముకున్న భూమి అతనికి గొప్ప విజయాన్ని అందించింది. సేంద్రీయ పద్ధతుల్లో భూమి సారాన్ని కాపాడుకుంటూ, వ్యవసాయంలో చక్కటి ఫలాలను అందుకుంటూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలిచాడు. సంకల్పం, పట్టుదల, వ్యవసాయంపై మక్కువతో కష్టపడి పనిచేస్తే విజయం తప్పక వరిస్తుందని ఆయన చేసి చూపించాడు. రైతుగా సత్య సాధించిన విజయాలు సమాజంలోని ఇతరులకు ఆదర్శంగా నిలవడమే కాదు ఆయన వ్యవసాయ విధానం అద్వితీయంగా, వినూత్నంగా ఉండడంతో స్థానికుల అభిమానాన్ని, అధికారుల దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు తన గ్రామం, చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 60 మందిని ఎంచుకుని వ్యవసాయాన్ని ముందుకు నడిపించాడు. తద్వారా అనేక కుటుంబాలకు అండగా నిలబడటమే కాదు, స్థానిక ఆర్థికవ్యవస్థకుగణనీయమైన ఎనలేని సహకారాన్ని అందించాడు. కలెక్టర్లు, ఇతర స్థానిక ఉ ఉన్నతాధికారులు పలువురి ప్రశంసలందుకున్నాడు. చుట్టుపక్కల సన్నకారు రైతులంతా సత్యను ఆదర్శంగా తీసుకుని సేంద్రియ ఎరువులతో తమ భూమిలో కూరగాయలు పండించి స్వయం సమృద్ధి సాధించి ఆర్థికస్థితిని మెరుగు పరుచుకోవాలని పిలుపునిచ్చారు. సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలతో అందరి ఆరోగ్యానికి తోడ్పటమే కాదు, స్థానికి ఆర్థిక పరిపుష్టికి తన వంతు సాయం అందించడం విశేషంగా నిలిచింది. వ్యవసాయంలో రారాజుగా నిలవాలన్న ఆత్మవిశ్వాసమే ఆయనను ఈరోజు విజయ వంతమైన రైతుగా నిలబెట్టి, ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలిచింది. -
ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఇక కనీస రీచార్జ్ ప్లాన్ ఎంతంటే?
సాక్షి, ముంబై: దేశీయ ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తన వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. తన నెలవారీ రీచార్జ్ ప్లాన్ ఏకంగా 57 శాతం పెంచేసింది. తన కనీస రీఛార్జ్ ధర 28 రోజుల మొబైల్‌ఫోన్ సర్వీస్ ప్లాన్ ధరను సుమారు 57 శాతం పెంచి రూ. 155కి పెంచినట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇదీ చదవండి: వన్‌ప్లస్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదే లక్కీ చాన్స్! కంపెనీ వెబ్సైట్ ప్రకారం కంపెనీ రూ.99 కనీస రీఛార్జ్ ప్లాన్‌ను నిలిపివేసింది. ఇప్పుడు అపరిమిత కాలింగ్, 1 జీబీ డేటా, 300 SMSలతో రూ.155 ప్లాన్‌ను ప్రారంభించింది. అయితే ఈ ప్లాన్ హరియాణా, ఒడిశాలకు పరిమితమైన ఈ కొత్త ప్లాన్‌ను మిగిలిన ప్రదేశాల్లో కూడా అమలు చేయనుందనే ఆందోళన యూజర్లలో నెలకొంది. అటు తొలుత ట్రయల్‌గా లాంచ్ చేసిన ఈ ప్లాన్‌ను భారతదేశం అంతటా విడుదల చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో, 2021లో ఎంపిక చేసిన సర్కిల్‌లలో కనీస రీఛార్జ్ ఆఫర్‌ను రూ.79 నుండి రూ.99కి పెంచినప్పుడు కంపెనీ ఇదే తరహా విధమైన కసరత్తు (మార్కెట్-టెస్టింగ్) చేసిందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక పేర్కొంది. ఇది చదవండి: ‘రస్నా’ ఫౌండర్ కన్నుమూత, ‘మిస్ యూ’ అంటున్న అభిమానులు -
ఒడిస్సా: ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లిన గూడ్స్ రైల్..
-
75 వేలకోట్ల పెట్టుబడులు, 24వేల జాబ్స్ , బిగ్ ఇన్వెస్టర్‌గా అదానీ
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూ.74,620 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారు. మేకిన్ ఒడిశా చొరవలో భాగంగా వీటికి ఒడిశా ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో 24వేలమందికి పైగా ఉపాధి లభిస్తుందని అంచనా. ఒడిశా ప్రభుత్వం ఆమోదించిన 10 పారిశ్రామిక ప్రాజెక్టులలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, మెటల్, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులున్నాయి. అలాగే టాటా గ్రూప్, అదానీ గ్రూప్ , ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ పెద్ద పెట్టుబడిదారులుగా ఉన్నాయి. (Moto G62 5G:మోటో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్, స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే?) బిగ్ ఇన్వెస్టర్‌గా అదానీ 7,750 మందికి ఉపాధి అవకాశాలను కల్పించే రూ. 41,653 కోట్ల పెట్టుబడితో కాశీపూర్‌లో 4.0 MTPA అల్యూమినా రిఫైనరీ, 175 MW CPP ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్న అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రతిపాదనను కమిటీ ఆమోదించింది. టాటా స్టీల్ పారాదీప్‌లో రూ.2,000 కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ (20 కేటీపీఏ), గ్రీన్ అమ్మోనియా (100 కేటీపీఏ) ప్లాంట్ల ఏర్పాటు ప్రతిపాదనకు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్లాంట్ల వల్ల 2,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ ప్లాంట్లు రాష్ట్రంలోని ఉక్కు, ఎరువుల రంగాల డిమాండ్‌ను తీర్చడంతో పాటు పర్యావరణంపై కూడా సానుకూల ప్రభావం చూపుతాయని ఒడిశా సర్కార్ ప్రకటించింది. "విజన్ 2030’’ కి ఊతమిచ్చేలా మెటల్ సెక్టార్లో డౌన్‌స్ట్రీమ్ యూనిట్ల అభివృద్ధికి ప్రోత్సాహాన్నిస్తున్నట్టు తెలిపింది. వెయ్యి కోట్ల పెట్టుబడితో 60,000 MT పారిశ్రామిక నిర్మాణం, 6,000 MT స్టీల్ ప్లాంట్ పరికరాల సౌకర్యాల ఏర్పాటుకు టాటా స్టీల్ ఆమోదం పొందింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2,451 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. జగత్సింగ్పూర్, రాయగడ, జాజ్‌పూర్, భద్రక్, కెందుఝర్, కటక్ , మయూర్‌భంజ్‌లలో ఈ ప్రాజెక్టులు అమలు కానున్నాయి. కళింగలో 2.5 MTPA స్టీల్ ప్లాంట్, 370 MW CPP ప్లాంట్‌ను కూడా ఒరిస్సా అల్లాయ్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 8,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసి 5,000 మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది .డాల్కీలో 6 MTPA బెనిఫికేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్రతిపాదనను ,1,490 కోట్ల రూపాయల పెట్టుబడితో డాల్కీలోని డబునా స్లరీ పంపింగ్ స్టేషన్ యూనిట్‌కు ప్రతిపాదిత ప్లాంట్ నుండి 12 MTPA స్లర్రీ పైప్‌లైన్‌ను కూడా కమిటీ ఆమోదించింది. దీని 600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. సోంపురి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 24 MTPA పెల్లెట్ ప్లాంట్ మరియు 6 MTPA ఫిల్టర్ కేక్, ఆర్తి స్టీల్స్ ద్వారా స్టీల్ ప్లాంట్ విస్తరణ కూడా ప్రభుత్వం ఆమోదించిన కొన్ని ఇతర ప్రాజెక్టులుగా ఉండనున్నాయి. అయితే అదానీ గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ ఆమోదం పొందిందని వార్తలు వెలువడ్డాయి. ఆసియాలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ వేగంగా విస్తరిస్తున్న తన సామ్రాజ్యానికి మరో ప్రాజెక్టును చేర్చనున్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఒడిశాలో అల్యూమినా రిఫైనరీని ఏర్పాటు చేయడానికి 5.2 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని పలు ఊహాగానాలొచ్చాయి. The High-Level Clearance Authority under the chairmanship of CM @Naveen_Odisha approved 10 industrial projects worth ₹74,620 Cr with an employment potential of 24,047. The approved projects include Metal & Metal Downstream, Green Hydrogen, Green Ammonia & Industrial Structure. pic.twitter.com/WdAY3RguP9 — CMO Odisha (@CMO_Odisha) August 10, 2022 -
చివరి వరకు వెనుకబడి.. ఆఖర్లో అద్భుతం
భువనేశ్వర్: ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా స్పెయిన్ పురుషుల జట్టుతో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతం చేసింది. ఒక దశలో 1–4తో వెనుకబడి ఓటమి ఖాయమనుకున్న స్థితి నుంచి టీమిండియా అనూహ్యంగా తేరుకుంది. వరుసగా నాలుగు గోల్స్ సాధించి చివరకు 5–4తో విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్ మరో ఎనిమిది సెకన్లలో ముగుస్తుందనగా హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ స్ట్రోక్‌ను లక్ష్యానికి చేర్చి భారత్‌ను గెలిపించాడు. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (15వ, 60వ ని.లో) రెండు గోల్స్ చేయగా... శిలా నంద్ లాక్రా (41వ ని.లో), షంషేర్ సింగ్ (43వ ని.లో), వరుణ్ కుమార్ (55వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. స్పెయిన్ జట్టుకు కెప్టెన్ మార్క్ మిరాలెస్ (20వ, 23వ, 40వ ని.లో) మూడు గోల్స్, పౌ కునిల్ (14వ ని.లో) ఒక గోల్ అందించారు. మహిళల జట్టూ గెలిచింది... మహిళల ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా స్పెయిన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 2–1తో విజయం సాధించింది. ఆట 18వ నిమిషంలో మార్టా సెగూ గోల్‌తో స్పెయిన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 20వ నిమిషంలో జ్యోతి గోల్‌తో భారత్ 1–1తో స్కోరును సమం చేసింది. అనంతరం 52వ నిమిషంలో నేహా చేసిన గోల్‌తో భారత్ 2–1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. ప్రొ లీగ్‌లో భారత్‌కిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. ఇటీవల ఒమన్‌లో చైనాతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలుపొందింది. -
యాస్ తుపాను: మూడు రాష్ట్రాలకు వెయ్యి కోట్ల తక్షణ సాయం
న్యూఢిల్లీ: ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పర్యటించారు. ఒడిశాలోని భద్రాక్ బాలేశ్వర్ జిల్లాల్లో, పశ్చిమ బెంగాల్‌లోని పూర్బా మెడినిపూర్‌లో తుపాను ప్రభావిత ప్రాంతాలలో నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే చేపట్టారు. అనంతరం ఒడిశా, బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు తక్షణ సహాయక చర్యల కింద రూ.1,000 కోట్ల ఆర్ధిక సహాయం ప్రకటించారు. భువనేశ్వర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పునరావాస చర్యలకు సంబందించి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యాస్ తుపాను కారణంగా గరిష్ట నష్టం ఒడిశాలో జరిగిందని, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా ప్రభావితమైనట్లు ప్రధానికి అధికారులు వివరించారు. ఇందులో ఒడిశాకు రూ.500 కోట్లు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు కలిపి రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు మోదీ ప్రకటించారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుందని, ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, పునర్నిర్మాణానికి అవసరమయ్యే అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. తుఫాను కారణంగా బాధపడుతున్న వారందరికీ ప్రధాని తన సంపూర్ణ సంఘీభావం తెలిపారు. తుఫాను కారణంగా తుపాను వల్ల చనిపోయినవారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాలలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సందర్శించడానికి ఒక మంత్రి బృందాన్ని నియమించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఆ కేంద్ర బృందం నివేదిక ఇచ్చిన ఆధారంగా మరింత సహాయం అందించనున్నట్లు తెలిపింది. చదవండి: యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే -
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు సీఎం వైఎస్ జగన్ లేఖ
-
పొలిమేరలో ఉన్న సమీప బంధువు ఇంటికి తీసుకెళ్లి..
తననే నమ్ముకొని ఏడడుగులు వేసి ... మూడు ముళ్లు వేయించుకొని కోటి ఆశలతో పుట్టినింటిని వీడి అత్తవారింట అడుగు పెట్టింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే భార్యను కిరాతకంగా కొట్టి ... పీక నులిమి హత్య చేశాడు. తప్పించుకుందామని పరారైన నిందితులు ఎట్టకేలకు చట్టం చేతికి చిక్కారు. రామభద్రపురం: భార్యను హత్య చేసి పరారైన నిందితుడు ఎట్టకేలకు అరెస్టయ్యాడు. మండలంలోని రావివలస పంచాయతీ పరిధిలోని మూలసెగాం గ్రామానికి చెందిన ఎన్నికల ఎర్రమ్మ (30)ను భర్త పెంటయ్య గత నెలలో హత్య చేసి కొండల్లోని లోయల్లో పడేసి పరారైన సంఘటన తెలిసిందే. ఎట్టకేలకు ఈ కేసును పోలీసులు ఛేదించి సోమవారం నిందితుడితోపాటు అతనికి సహకరించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలు ప్రకారం... నిందితుడు పెంటయ్య ఫిబ్రవరి 23న అతని చెల్లి ఇంటికి పాచిపెంట మండలం కొండతాడూరు వెళదామని మాయమాటలు చెప్పి బయలు దేరించాడు. మార్గమధ్యలో పాచిపెంట మండలం శీతం గ్రామం వద్ద ఇద్దరూ గొడవ పడ్డారు. ఎర్రమ్మను బాగా కొట్టడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. ఈమెను పొలిమేరల్లో ఉన్న దూరపు బంధువైన వి.సోమయ్య ఇంటికి తీసుకెళ్లాడు. వారింట్లో గత నెల 24,25 తేదీల్లో ఉన్నారు. అయినా భార్య సరిగా కోలుకోలేదు. కోలుకున్న తరువాత కొట్టిన విషయాన్ని ఆమె తల్లిదండ్రులతో ఎక్కడ చెబుతుందోనన్న భయంతో 26వ తేదీన పీక నులిమి చంపేశాడు. మృత దేహాన్ని సోమయ్య సహాయంతో భర్త పెంటయ్య కట్టిన డోలీలో పెదసెలగాం పరిసరాల్లో దిబ్బగుడ్డి వద్ద కొండ లోయల్లో పడేసి పరారయ్యారు. పరారైన వారిని ఎట్టకేలకు సోమవారం అదుపులోకి తీసుకొని సీఐ అప్పలనాయుడు, ఎస్.కృష్ణమూర్తిలు సాలూరు కోర్టుకు తీసుకువెళ్లారు. చదవండి: ఫోన్‌కు ఓటీపీలు వస్తాయి చెప్పమ్మా అంటూ.. -
పాత కక్షలు.. వ్యాపారి దారుణహత్య
జయపురం: నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్‌లో శుక్రవారం రాత్రి తుపాకీ తూటాలు గర్జించాయి. ఆ తూటాలకు ఒక వ్యాపారి కుప్పకూలాడు. రాత్రి 10 గంటల సమయంలో జరిగిన ఈ సంఘటన పట్టణ ప్రజలలో భయాందోళన రేకెత్తించింది. వ్యాపార శతృత్వంతోనే ఈ సంఘటన జరిగి ఉండొచ్చని ప్రజలు అనుమానిస్తున్నారు. స్థానిక వ్యాపారి సంజీవ సుబుద్ధి రాత్రి 9 గంటలకు తన దుకాణం మూసివేసి ఇంటికి బయల్దేరాడు.దారిలో ఎలక్ట్రికల్ కార్యాలయం వద్ద టీ తాగి మిత్రులతో కాసేపు ముచ్చటించి రాత్రి 9.45 గంటలకు బైక్ నెమ్మదిగా నడుపుకుంటూ ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమీపంలో ముగ్గురు దుండగులు వ్యాపారిపై కాల్పులు జరిపారు. ఆ కాల్పులకు గురైన సంజీవ్ సుబుద్ధి సంఘటనా స్థలంలోనే నేలకూలాడు. గమనించిన ఆ ప్రాంత ప్రజలు వెంటనే వ్యాపారిని ఉమ్మరకోట్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అక్కడినుంచి నవరంగపూర్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అయితే వ్యాపారి సుబుద్ధి మరణించినట్లు అక్కడి డాక్టర్లు ప్రకటించారు. కొద్ది రోజుల కిందట సంజీవ్ సుబుద్ధి కొంత మందితో గొడవ పడ్డాడు. ఆ సంఘటనపై ఉమ్మరకోట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల క్రితం ముసుగులు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు సంజీవ్ సుబుద్ధి ఫర్నిచర్ దుకాణానికి వచ్చారని అయితే వారి మధ్య ఏం జరిగిందో తెలియదని చుట్టుపక్కల దుకాణదారులు చెబుతున్నారు. గత రాత్రి జరిగిన కాల్పుల సంఘటనను ఉమ్మరకోట్ పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దుండగుల ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తుపాకీ కాల్పుల్లో వ్యాపారి దుర్మరణం చెందిన సమాచారం తెలుసుకున్న నవరంగపూర్ మాజీ ఎంపీ ప్రదీప్ మఝి హాస్పిటల్‌కు వెళ్లి మృతుని కుటుంబసభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. -
కస్టమర్ కు రూ.45వేలు చెల్లించిన అమెజాన్
ఒడిశా: ఆన్లైన్లో సహజంగానే ఈ-కామర్స్ సైట్లలో అప్పుడప్పుడు కొన్ని వస్తువులు చాలా తక్కువ ధరకు లభిస్తాయి. కొన్ని సార్లు ఈ ఆఫర్లు నిజమేనా అని మనం కూడా ఆశ్చర్యపోతుంటాం. ఈ-కామర్స్ సైట్ల నిర్వాహకులు సాధారణ సమయాలలో కూడా పలు సేల్స్ పేరిట వస్తువులను తక్కువ ధరకే విక్రయిస్తుంటారు. తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సైట్లో తలెత్తిన సాంకేతిక కారణంగా ఒక వినియోగదారుడికి నష్టపరిహారంగా రూ.45వేలు చెల్లించాల్సి వచ్చింది.(చదవండి: పెన్షన్ పొందేవారికి కేంద్రం శుభవార్త) వివరాల్లోకి వెళ్లితే.. ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్ మహాపాత్ర అనే న్యాయ విద్యార్థి 2014లో అమెజాన్‌లో ఒక ల్యాప్‌టాప్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్ రూ.190 ఆఫర్ కింద లభించడంతో దాన్నీ ఆర్డర్ చేసుకున్నాడు. అతను ఆర్డర్ చేసిన రెండు గంటల తర్వాత ఆ ఆర్డర్ రద్దు కావడంతో అమెజాన్ కస్టమర్‌ను సంప్రదించాడు. అమెజాన్ కస్టమర్ కేర్ సర్వీస్ డిపార్ట్మెంట్ సాంకేతిక సమస్య కారణంగా తక్కువ ధర చూపించిందని తెలపడంతో పాటు ఆ ఆర్డర్ ను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అతను ఈ విషయాన్నీ విడిచిపెట్టకుండా ఒడిశా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అత్యవసరంగా ల్యాప్‌టాప్ అవసరం ఉన్నందున తాను రూ.190కి ల్యాప్‌టాప్ అని చూసి దాన్ని ఆర్డర్ చేస్తే అమెజాన్ దాన్ని రద్దు చేసిందని, కనుక తనకు న్యాయం చేయాలని అతను కోరాడు. కొన్నేళ్ల పాటు సాగిన ఈ విచారణ తాజాగా ముగిసింది. ఒడిశా రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఆర్డర్ రద్దు చేసినందుకు బాధితుడికి నష్ట పరిహారం కింద రూ.40వేలు, ఖర్చుల కింద మరో రూ.5వేలను అమెజాన్ చెల్లించాలని తీర్పు ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈ వార్త చదివిన చాలా మంది నిజమే వినియోగదారుడిని మోసం చేసినందుకు అమెజాన్ కు కమిషన్ సరైన శిక్ష విధించిందని పేర్కొన్నారు.