భువనేశ్వర్ : రాష్ట్ర శాసన సభ ఆవరణలో నాగు పాములు తిరుగాడుతూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ వ్యవధిలో వరుసగా రెండు సార్లు నాగు పాముల్ని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా సోమవారం అసెంబ్లీ కార్యాలయంలోని స్విమ్మింగ్ పూల్ పరిసరాల్లో పాము తిరుగాడుతున్నట్లు భద్రతా సిబ్బంది దృష్టిలో పడడంతో స్నేక్ హెల్ప్ లైన్‌కు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న సంస్థ ప్రతినిధి సువేందు మల్లిక్ ఆ ప్రాంతానికి చేరి స్విమ్మింగ్ పూల్‌లో మెట్ల మధ్య నక్కిన పామును మెలకువగా అదుపులోకి తీసుకున్నారు. అది 6 అడుగుల నాగుపాము అని నగర శివారులోని అటవీ ప్రాంతంలో దానిని సురక్షితంగా విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment