bhuvaneswar
-
Soma Mondal: క్వీన్ ఆఫ్ స్టీల్
పెద్ద బాధ్యతను స్వీకరించినప్పుడు గర్వించదగిన క్షణాలు మాత్రమే ఉండవు. పెద్ద పెద్ద సవాళ్లు కాచుకొని కూర్చుంటాయి. భయపెడతాయి. ఆ సవాళ్లకు భయపడితే అపజయం మాత్రమే మిగులుతుంది. వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉంటే విజయం సొంతం అవుతుంది. ఇంజినీరింగ్ చదివే రోజుల నుంచి ఉక్కు పరిశ్రమలోకి అడుగు పెట్టే వరకు, ఉద్యోగ ప్రస్థానంలో రకరకాల సవాళ్లను ఎదుర్కొంది సోమా మండల్. వాటిని అధిగమించి అపురూపమైన విజయాలను సొంతం చేసుకుంది. తాజాగా... ఫోర్బ్స్ ‘వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్– 2023’ జాబితాలో చోటు సంపాదించింది. భువనేశ్వర్‌లోని ఓ బెంగాలీ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది సోమా మండల్. తండ్రి అగ్రికల్చర్ ఎకానమిస్ట్. అప్పట్లో చాలామంది తల్లిదండ్రుల ధోరణి ‘ఆడపిల్లలను ఒక స్థాయి వరకు చదివిస్తే చాలు. పెద్ద చదువు అక్కర్లేదు’ అన్నట్లుగా ఉండేది. సోమా తండ్రిలో మాత్రం అలాంటి భావన లేదు. ‘మా అమ్మాయిని పెద్ద చదువులు చదివిస్తాను’ అనేవాడు. అలాంటి వ్యక్తి కాస్తా సోమా ఇంజనీరింగ్ చేయాలనుకున్నప్పుడు ‘కుదరదు’ అని గట్టిగా చెప్పాడు. ఎందుకంటే ఆరోజుల్లో అమ్మాయిలు ఇంజినీరింగ్ చదవడం అరుదు. తల్లి సహాయంతో నాన్న మనసు మారేలా చేసింది. రూర్కెలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసింది. ఇక కాలేజీ రోజుల విషయానికి వస్తే బ్యాచ్‌లో రెండు వందల మంది ఉంటే ఇద్దరు మాత్రమే అమ్మాయిలు. పాఠం వింటున్నప్పుడు ఏదైనా సందేహం అడగాలంటే అబ్బాయిలు నవ్వుతారేమోనని భయపడేది. అయితే ఒకానొక సమయంలో మాత్రం... ‘అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే చదువు చదువుతున్నప్పుడు భయపడటం ఎందుకు?’ అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది... ఇక అప్పటి నుంచి ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. ఆ ధైర్యమే తన భవిష్యత్ విజయాలకు పునాదిగా నిలిచింది. సోమా మెటల్ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు మహిళా ఉద్యోగులు ఎక్కువగా లేరు. ‘మెటల్ ఇండస్ట్రీ అంటే పురుషుల ప్రపంచం’ అన్నట్లుగా ఉండేది. ఇక మహిళలు ఉన్నత స్థానాల్లోకి రావడం అనేది ఊహకు కూడా అందని విషయం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ భవిష్యత్‌పై ఆశను కోల్పోలేదు సోమా మండల్. నాల్కో(నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్)లోకి గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ తొలి మహిళా డైరెక్టర్(కమర్షియల్) స్థాయికి చేరింది. 2017లో సెయిల్(స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా)లోకి వచ్చిన తరువాత ఫస్ట్ ఉమెన్ ఫంక్షనల్ డైరెక్టర్, ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ సెయిల్‌గా ప్రత్యేక గుర్తింపు పొందింది. సెయిల్ చైర్‌పర్సన్‌గా బా«ధ్యతలు స్వీకరించిన కాలంలో ఆ సంస్థ వేల కోట్ల అప్పులతో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్‌లో మార్పులు తీసుకువచ్చింది. మైక్రో–మేనేజ్మెంట్పై దృష్టి సారించింది. సెయిల్ ప్రాడక్ట్స్‌ను ప్రమోట్ చేయడానికి మార్గాలు అన్వేషించింది. గ్రామీణ ప్రాంతాలలో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. కొత్త వ్యాపార వ్యూహాలను అనుసరించింది. సోమా కృషి వృథా పోలేదు. అప్పులు తగ్గించుకుంటూ ‘సెయిల్’ను లాభాల దిశగా నడిపించింది. ‘నా కెరీర్లో జెండర్ అనేది ఎప్పుడూ అవరోధం కాలేదు. మహిళ అయినందుకు గర్వపడుతున్నాను. మన దేశంలో వివిధ రంగాలలో మహిళా నాయకుల సంఖ్య పెరుగుతోంది. లీడర్‌కు అసంతృప్తి ఉండకూడదు. ఆశాభావం ఉండాలి. పరిమిత వనరులు ఉన్నా సరే మంచి ఫలితం సాధించే సామర్థ్యం ఉండాలి’ అంటుంది సోమా మండల్. టైమ్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇచ్చే సోమా మండల్ అటు వృత్తి జీవితాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లింది. ‘సక్సెస్‌కు షార్ట్‌కట్ అనేది లేదు. అంకితభావం, సమర్థత మాత్రమే మనల్ని విజయానికి దగ్గర చేçస్తాయి’ అంటుంది సోమా మండల్. -
వందేభారత్ రైలుపై రాళ్ల దాడి
భువనేశ్వర్: రూర్కెలా–పూరి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. మెరామండలి, బుద్ధపంక్ రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లోని ఒక కిటికీ రాళ్ల తాకిడికి దెబ్బతిందని తెలిపింది. -
Intercontinental Cup: భారత్‌ను గెలిపించిన ఛెత్రి
భువనేశ్వర్: ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 1–0 గోల్ తేడాతో వనుతూను ఓడించింది. భారత్ తరఫున ఏకైక గోల్‌ను కెప్టెన్ సునీల్ ఛెత్రి 81వ నిమిషంలో సాధించాడు. తొలి మ్యాచ్‌లో శుక్రవారం మంగోలియాను 2–0తో ఓడించిన భారత్ తమకంటే చాలా తక్కువ ర్యాంక్‌లో ఉన్న వనుతూపై విజయం సాధించేందుకు కూడా శ్రమించాల్సి వచ్చింది. తొలి అర్ధభాగంలో చాలా వరకు బంతిని తమ ఆదీనంలోనే ఉంచుకున్నా...గోల్ చేసేందుకు భారత్ చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. మైదానంలో తన భార్య సోనమ్ మ్యాచ్‌ను తిలకిస్తుండగా...త్వరలో తండ్రి కాబోతున్న సంకేతాన్ని ఛెత్రి తన గోల్ సంబరంలో ప్రదర్శించాడు. రెండు విజయాల తర్వాత 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ తమ చివరి పోరులో గురువారం లెబనాన్‌తో తలపడుతుంది. చదవండి: IND vs WI: టీమిండియా విండీస్ టూర్ షెడ్యూల్ ఖరారు.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే? -
హాకీ ప్రపంచకప్‌లో భారత్ బోణీ.. స్పెయిన్‌పై ఘన విజయం
భువనేశ్వర్ వేదికగా జరగుతోన్న హాకీ ప్రపంచకప్‌లో భారత్ బోణీ కొట్టింది. గ్రూప్ ‘డి’లో భాగంగా స్పెయిన్‌తో జరిగిన పోరులో 2-0 గోల్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే హర్మన్‌ప్రీత్ సింగ్ సేన అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఏ దశలోను ప్రత్యర్ధి జట్టుకు గోల్ సాధించే అవకాశం భారత డిఫెన్స్ ఇవ్వలేదు. ముఖ్యంగా భారత గోల్ కీపర్ కృష్ణ పాఠక్ అద్భుతమైన డిఫెన్సింగ్ స్కిల్స్‌ను చూపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ తరపున అమిత్ రోహిదాస్ 12వ నిమిషంలో తొలిగోల్ సాధించాడు. అనంతరం హార్దిక్ సింగ్ 26 నిమిషంలో రెండో గోల్‌ను భారత్‌కు అందించాడు. ఇక భారత తన తదుపరి మ్యాచ్‌లో జనవరి 15న ఇంగ్లండ్‌తో తలపడనుంది. మరోవైపు ఇంగ్లండ్ జట్టు కూడా ఈ మెగా టోర్నీలో శుభారంభం చేసింది. గ్రూపు-డిలోనే భాగంగా వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5-0 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. చదవండి: మహిళా క్రికెటర్ అనుమానాస్పద మృతి.. అడవిలో మృతదేహం! -
FIFA Under-17: అమెరికా చేతిలో భారత్ ఘోర పరాభవం
భువనేశ్వర్: ప్రపంచ అండర్–17 మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ఆతిథ్య భారత్ పరాజయంతో ప్రారంభించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 0–8 గోల్స్ తేడాతో 2008 రన్నరప్ అమెరికా చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. అమెరికా తరఫున మెలీనా రెబింబాస్ (9వ, 31వ ని.లో) రెండు గోల్స్ చేసింది. ఆ తర్వాత చార్లోటి కోలెర్ (15వ ని.లో), ఒన్యెకా గమెరో (23వ ని.లో), గిసెలీ థాంప్సన్ (39వ ని.లో), ఎల్లా ఇమ్రి (51వ ని.లో), టేలర్ స్వారెజ్ (59వ ని.లో), మియా భుటా (62వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. మరో మ్యాచ్‌లో బ్రెజిల్ 1–0తో మొరాకోపై నెగ్గింది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను 14న మొరాకోతో ఆడుతుంది. -
Ananya: ఏదో ఒకరోజు అనన్య నంద సైంటిస్ట్ కావడం ఖాయం!
ఒడిషాలోని భువనేశ్వర్‌కు చెందిన అనన్య శ్రీతమ్ నంద ‘స్కూల్ టాపర్’ అనే మెచ్చుకోలు దగ్గరే ఆగిపోనక్కర్లేదు. చదువులో కూడా ఆమె సూపర్‌స్టార్! చిన్నప్పుడు హిందుస్థానీ రాగాలు నేర్చుకుంది. హార్మోని వాయించడంలో ప్రావీణ్యం సంపాదించింది. నాట్యంలోనూ నందాకు ప్రవేశం ఉంది. ఇండియన్ ఐడల్ జూనియర్ 1లోకి అడుగుపెట్టినప్పుడు నందాకు నిరాశ ఎదురైంది. అయినా రెట్టించిన ఉత్సాహంతో తిరిగివచ్చి ‘ఇండియన్ ఐడల్ జూనియర్ 2’ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా ఆమెకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకునే అవకాశం వచ్చింది. ‘మోదీజీని కలుసుకునే అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదు. అంత బిజీ హెడ్యూల్‌లో కూడా 30 నిమిషాల పాటు మాట్లాడారు. ఆ రోజును ఎన్నటికీ మరిచిపోలేను’ అంటుంది అనన్య. యూనివర్శల్ మ్యూజిక్ లేబుల్‌పై తన తొలి ఆల్బమ్ ‘మౌసమ్ మస్తాన’ విడుదల చేసింది. దీనికి మంచి స్పందన లభించడంతో బాలీవుడ్లో అవకాశాలు వచ్చాయి. ‘ఎంఎస్ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమాతో బాలీవుడ్లో సింగర్‌గా తొలి అడుగు వేసింది అనన్య. కలర్స్ టీవి ‘రైజింగ్ స్టార్’లో పాల్గొని టాప్ 5లో నిలిచింది. ‘మీ లక్ష్యం ఏమిటి?’ అనే ప్రశ్నకు నంద నుంచి...‘సింగర్‌గా మంచి పేరు తెచ్చుకోవడం. కొత్త ఆల్బమ్‌లను తీసుకురావడం...’ అనే జవాబు వస్తుందని అనుకుంటాం. అయితే తన లక్ష్యం సైంటిస్ట్ కావడం అని చెబుతుంది నంద. చదువులో ఆమె ప్రతిభను గమనిస్తే ‘ఏదోఒకరోజు అనన్య నంద సైంటిస్ట్ కావడం ఖాయం’ అని ఖాయంగా అనుకుంటాం. -
అన్వి... అన్నీ విశేషాలే!
ఏడాదిలోపు పిల్లలు పాకుతూ, పడుతూ లేస్తూ నడవడానికి ప్రయత్నిస్తూ పసి నవ్వులు నవ్వుతారు. వచ్చీరాని మాటలను పలుకుతూ ముద్దు లొలికిస్తుంటారు. ‘‘దాదాపు ఈ వయసువారంతా ఇలానే ఉంటారనుకుంటే మీరు పొరపడినట్లే. ప్రతిభకు వయసుతో సంబంధంలేదు. మాలాంటి చిచ్చర పిడుగులు బరిలో దిగితే అచ్చెరువు చెందాల్సిందే’’ అంటోంది అన్వి విశేష్ అగర్వాల్. రెండున్నరేళ్ల వయసున్న అన్వి తన పెయింటింగ్స్‌తో ఏకంగా గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. రెండేళ్లకే ఈ రికార్డు సాధిస్తే ఇక పెద్దయ్యాక ఇంకెన్ని అద్భుతాలు చేస్తోందో అని అవాక్కయ్యేలా చేస్తోంది చిన్నారి అన్వి. భువనేశ్వర్‌కు చెందిన అన్వి విశేష్ అగర్వాల్ 72 చిత్రాలను గీసి అతి చిన్నవయసులో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఎక్కువ సంఖ్యలో పెయింటింగ్స్ వేసిన అతిపిన్న వయస్కురాలుగా నిలిచి లండన్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. రెండున్నరేళ్ల పాప ఇన్ని రికార్డులు సాధించిందంటే చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది అక్షరాలా నిజం. అన్వి పెయింటింగ్ జర్నీ కేవలం తొమ్మిది నెలల వయసులోనే జరగడం విశేషం. అప్పటినుంచి పెయింటింగ్స్ వేస్తూనే ఉంది. ‘‘మ్యాగ్నెంట్, పెండులమ్, కలర్స్ ఆన్ వీల్స్, రిఫ్లెక్షన్ ఆర్ట్, హెయిర్ కాంబ్ టెక్చర్, రీ సైక్లింగ్ ఓల్డ్ టాయిస్, హ్యూమన్ స్పైరోగ్రఫీ, దియా స్ప్రే పెయింటింగ్, బబుల్ పెయింటింగ్’’ వంటి 37 రకాల పెయింటింగ్ టెక్నిక్స్‌ను ఆపోశన పట్టింది. పెయింటింగేగాక పంతొమ్మిది నెలల వయసు నుంచే స్పానిష్ భాషలో మాట్లాడడం ప్రారంభించింది. 42 అక్షర మాల శబ్దాలను స్పష్టంగా పలుకుతూ ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. అత్యంత అరుదైన చిన్నారులు మాత్రమే ఇవన్నీ చేయగలుగుతారు.అన్నట్లు అన్వి అందర్నీ అబ్బురపరుస్తోంది. ‘‘కోవిడ్ సమయంలో కుటుంబం మొత్తం ఇంటికే పరిమితమయ్యాం. ఈ సమయంలో పిల్లల్ని బిజీగా ఉంచడం చాలా పెద్ద టాస్క్. ఎప్పుడూ వారికి ఏదోఒకటి నేర్పించాలనుకున్నా ఆ సమయంలో అన్నీ లభ్యమయ్యేవి కావు. ఈ క్రమంలో అన్వికి పెయింటింగ్స్ వేయడం నేర్పించాం. మేము చేప్పే ప్రతి విషయాన్నీ లటుక్కున పట్టేసుకునేది. దీంతో ఆమెకు ఆసక్తి ఉందని గ్రహించి పెయింటింగ్స్ మెలుకువలను నేర్పించగా కొద్ది నెలల్లోనే నేర్చేసుకుంది. ఆ స్పీడు చూసి ప్రోత్సహించడంతో ఈ రోజు మా పాప ఈ రికార్డుల్లో తన పేరును చేర్చింది. రెండున్నరేళ్ల అన్వి ఈ రికార్డులు సాధించి మరెంతోమంది చిన్నారులకు ఆదర్శంగా నిలవడం మాకెంతో గర్వంగా ఉంది’’ అని అన్వి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
FIH Pro League: ఆఖరి నిమిషంలో గోల్.. భారత్‌ను గెలిపించిన మన్దీప్
భువనేశ్వర్: చివరి నిమిషంలో గోల్ చేసిన మన్దీప్ సింగ్ ప్రొ హాకీ లీగ్‌లో భారత పురుషుల జట్టుకు ఐదో విజయాన్ని అందించాడు. అర్జెంటీనాతో ఆదివారం జరిగిన రెండో అంచె లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–3 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున హార్దిక్ సింగ్ (17వ ని.లో), మన్దీప్ సింగ్ (60వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... జుగ్రాజ్ సింగ్ (20వ, 52వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. ఈ విజయంతో భారత్ తొమ్మిది జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. చదవండి: IND VS SL Pink Ball Test: పింక్‌బాల్ టెస్ట్‌పై ఐసీసీ కీలక వ్యాఖ్యలు -
వైరల్: నక్క తోక తొక్కిన కుక్క ! వీఐపీలా..
సాధారణంగా ఇంట్లో పెంపుడు జంతువులంటే ముఖ్యంగా కుక్కనే ఎక్కువ మంది పెంచుకుంటారు. ఆ జాబితాలో కొందరు వాటిని జంతువుల్లా కాకుండా తమ సొంత మనుషుల్లా ట్రీట్ చేస్తుంటారు. కొందరు వీటిని అల్లారు ముద్దుగా కూడా పెంచుకునే వాళ్లు ఉన్నారు. ఇటీవల తన పెంపుడు కుక్క కోసం ఓ మహిళ ఏకంగా విమానంలోని బిజినెస్ క్లాస్ మొత్తం బుక్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: Funny Video: ఏయ్ నిన్నే.. పిలుస్తుంటే పట్టించుకోవా.. పంతం నెగ్గించుకున్న పిల్ల ఏనుగు ) తాజాగా ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క కోసం రైలులోని బిజినెస్ క్లాస్ మొత్తం బుక్ చేశాడు. అంతేనా ఆ పెట్ డాగ్ రైలు జర్నీపై ఓ వీడియోని చిత్రీకరించి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. ఒక ప్రయాణీకుడు లాబ్రడార్లు, బాక్సర్లు వంటి చిన్న లేదా పెద్ద కుక్కలను తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. కానీ పెంపుడు జంతువులు మాత్రం ఏసీ ఫస్ట్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్‌లో మాత్రమే ప్రయాణించడానికి వీలుంది. మరొక నిబంధన ఏమిటంటే తమ పెంపుడు జంతువుల కోసం సదరు వ్యక్తి రైలులోని మొత్తం కంపార్ట్మెంట్ రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న కుక్క పిల్లలు అయితే వాటి కోసం కొన్ని కంపార్ట్మెంట్లలో బాక్స్‌లు ఉంటాయి. వాటికి ఆహారం యజమానులే తెచ్చుకోవాల్సి ఉంటుంది. View this post on Instagram A post shared by Rio (@alabnamed_rio) చదవండి: చాట్ అమ్ముతూ కేజ్రీవాల్ !.. తీరా చూస్తే అసలు కథ వేరే.. -
మంత్రాలు చేస్తున్నారనే అనుమానం.. 30 మంది గ్రామస్తులు కలిసి..
భువనేశ్వర్: ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో గ్రామస్తులంతా కలిసి ఒక కుటుంబంపై దాడికి తెగబడ్డారు. ఈ అవమానవీయకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన గంజాం జిల్లాలోని బెర్హంపూర్‌లో జరిగింది. కాగా, పోలసర గ్రామానికి చెందిన బిమల్ నాయక్(45), చిరికిపాడ సాసన్ వద్ద మంత్రాలు చేస్తున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. అందుకే, గడిచిన నెలన్నర కాలంలో సాసన్లో.. 6 గురు చనిపోయారని తెలిపారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులంతా కలిసి నిన్న(ఆదివారం) మూకుమ్మడిగా బిమల్‌నాయక్ ఇంటిపై దాడిచేశారు. అతడిని బయటకులాగి విచక్షణ రహితంగా కొట్టారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు గ్రామస్తులకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించిన వినలేదు. గ్రామస్తుల దాడిలో నాయక్ కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న చిరికిపాడ పోలీసులు నాయక్‌ను, అతని కుటుంబ సభ్యులను బెర్హంపూర్‌లోని ఎంకేసీఐ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు 30 మంది గ్రామస్తులపై కేసును నమోదుచేసి, 16 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా, పరారీలో ఉన్న మరికొంత మంది కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వస్తాయని బెర్హంపూర్ పోలీసు అధికారి సూర్యమణి ప్రధాన్ తెలిపారు. -
దుబాయ్ గడ్డ మీద తెలుగు బిడ్డ రికార్డులు
dubai: యూఏఈ (దుబాయ్) గడ్డ మీద తెలుగు బిడ్డ క్రితిక్ తంగిరాల (4 సంవత్సరాల 5 నెలలు) అబ్బురపరిచే రికార్డులు సాధిస్తున్నాడు. తెలుగు బిడ్డ క్రితిక్ తల్లిదండ్రులు డాక్టర్ రవితేజ, డాక్టర్ లక్ష్మిలలిత దుబాయ్‌లో ఉంటున్నారు. పరదేశంలో ఉంటున్న ఈ బుడతడు తెలుగింటి సంప్రదాయాలు, సంస్కృత శ్లోకాల పఠనంపై మక్కువ కనబరుస్తున్నాడు. దుబాయ్ బ్రైట్ రైడర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (సీబీఎస్ఈ)లో ఎల్కేజీ ఆంగ్లభాషలో చదువుత ఆధ్మాత్మిక, భౌగోళిక, ఖగోళ అంశాల్లో విజ్ఞానంతో ప్రపంచస్థాయి గుర్తింపు సాధించాడు. చిన్నారి క్రితిక్ 105 దేశాలు–రాజధానులు, 4 సంస్కృత శ్లోకాలు, 1 నుంచి 100 నంబర్లు, ఖండాల వర్ణన, సౌర కుటుంబం సంక్షిప్త ప్రసంగంతో ఈ ఏడాది జూన్ 26వ తేదీన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సొంతం చేసుకున్నాడు. ఇంగ్లిషు అక్షరాలను అవరోహణలో (జెడ్ నుంచి ఎ వరకు) 6 సెకన్లలో వల్లించి దుబాయ్ ఎక్స్‌క్లూజివ్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. -
అలసిన ‘ఆట’: కరోనాతో ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ మృతి
భువనేశ్వర్: రాష్ట్రంలో పేరొందిన ఫుట్‌బాల్ కోచ్ నంద కిషోర్ పట్నాయక్ కరోనా చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం ప్రకటించారు. ఫుట్‌బాల్ క్రీడారంగంలో రాష్ట్రం నుంచి పలువురు అంతర్జాతీయ క్రీడాకారుల్ని ఆవిష్కరించిన విశిష్ట వ్యక్తి అని సంతాప సందేశంలో పేర్కొన్నారు. 1956 మార్చి 16వ తేదీన జన్మించిన నంద కిషోర్ పట్నాయక్ రెండుసార్లు జాతీయ జూనియర్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌కు ఒడిశా జట్టుకు సారథ్యం వహించారు. 1992-93లో ఫుట్‌బాల్ కోచ్‌గా నియమితులయ్యారు. తర్వాత 1995లో మహిళా ఫుట్‌బాల్ కోచ్‌గా నియమితులయ్యారు. ఆయన కోచింగ్‌లో శ్రద్ధాంజలి సామంత్రాయ్, రంజిత మహంతి, ప్రశాంతి ప్రధాన్, సుదీప్త దాస్, సరిత జయంతి బెహరా, మమాలి దాస్, ప్రథమా ప్రియదర్శి వంటి అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారిణులు రాష్ట్ర కీర్తి కిరీటాలుగా వన్నె తెచ్చారు. చదవండి: కరోనాతో అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు మృతి తన విద్యార్థులతో కోచ్ నందకిశోర్ పట్నాయక్ (ఫైల్) -
Yaas Cyclone: తుపానుపై ఒడిశా అలర్ట్
భువనేశ్వర్: భారత వాతావరణ విభాగం జారీ చేస్తున్న సమాచారం మేరకు యాస్ తుపానుతో బాలాసోర్ జిల్లా ప్రధానంగా ప్రభావితమవుతుంది. పొరుగు జిల్లా భద్రక్‌పై కూడా తుపాను ప్రభావం పడవచ్చు. తుపాను ప్రభావంతో ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుందని, తుపానుకు ముందు, తర్వాత కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉంటుందని అదనపు డైరెక్టర్ జనరల్ (శాంతిభద్రతలు) యశ్వంత్ జెఠ్వా ధైర్యం చెప్పారు. సోమవారం ఆయన బాలాసోర్ జిల్లాను ప్రత్యక్షంగా సందర్శించి అక్కడి ఏర్పాట్లను సమీక్షించారు. బాలాసోర్ జిల్లాలో 40 లోతట్టు గ్రామాల్ని గుర్తించి కచ్చా ఇళ్లలో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆశ్రయం కల్పించేందుకు 1,200 శాశ్వత, తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సహాయ, పునరుద్ధరణ కార్యకలాపాల కోసం బాలాసోర్ జిల్లాకు అత్యధికంగా 12 యూనిట్ల ఒడిశా విపత్తు స్పందన దళం (ఒడ్రాఫ్) జవాన్లను పంపారు. వారితో పాటు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), అగ్ని మాపక దళం జవాన్లు కూడా చేరుకుంటారు. కోవిడ్-19 నిబంధనలతో వారంతా తుపాను అనంతర పునరుద్ధరణ కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఈ ఏర్పాట్లపై బాలాసోర్ జిల్లా ఐజీ, ఎస్పీ ఇతర సీనియర్ అధికారులతో శాంతిభద్రతల అదనపు డీజీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. ఆధునిక యంత్రాలతో పునరుద్ధరణ తుపాను తదనంతర పునరుద్ధరణ కార్యకలాపాలు చేపట్టేందుకు రోడ్లు–భవనాల శాఖ 165, గ్రామీణ అభివృద్ధి విభాగం 313 ప్రత్యేక ఇంజినీరింగ్ బృందాల్ని రంగంలోకి దింపాయి. వారంతా అత్యాధునిక సహాయక, పునరుద్ధరణ యంత్ర పరికరాలతో సహాయక, పునరుద్ధరణ పనులు చేపడతారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ. 20 కోట్లు విలువ చేసిన యంత్రపరికరాల్ని కొనుగోలు చేసింది. వాటిలో టవ ర్ లైట్లు, సెర్చ్ లైట్లు, జనరేటర్లు, జేసీబీలు, హైడ్రా క్రేనులు, ఇన్ఫ్లేటబుల్ పడవలు, హై హ్యాండ్ హైడ్రాలిక్ చెట్టు కోత యంత్రాలు, గ్యాసు కట్టర్లు, ప్లాస్మా కట్టర్లు, సాట్ ఫోన్లు, వాకీటాకీలు ఉన్నాయి. ఈ ఆధునిక సామగ్రితో యాస్ తుపాను కార్యకలాపాలు చేపడతారని శాంతిభద్రతల అదనపు డైరెక్టరు జనరల్ యశ్వంత్ జెఠ్వా మీడియాకు తెలిపారు. -
ఎమ్మెల్యే నిధులతో మాస్కులు
భువనేశ్వర్: కరోనా వ్యతిరేక పోరులో మాస్కు బలమైన ఆయుధం. సమాజంలో బలహీన వర్గాలకు అనుకూలమైన రీతిలో నాణ్యమైన మాసు్కలు విరివిగా లభించేలా చర్యలు చేపట్టాలి. ఈ కార్యకలాపాల కోసం ఎమ్మెల్యే ల్యాడ్స్ నుంచి రూ. 50 లక్షల వరకు వెచ్చించాలని ముఖ్యమంత్రి కోరారు. మిషన్ శక్తి సిబ్బంది ఇస్తామన్న మాసు్కలను సేకరించి సేకరించి బీదలకు పంపిణీ చేయాలని హితవు పలికారు. రాష్ట్రంలో కోవిడ్ నిర్వహణ పరిస్థితులను బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు. హెల్ప్‌డెస్క్ సిబ్బంది స్పందించాలి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కోవిడ్ రోగుల కుటుంబీకులు, బంధుమిత్రుల ఆవేదన పట్ల మానవీయ దృక్పథంతో మసలుకోవాలి. బాధితుల ఆరోగ్య స్థితిగతులకు సంబంధించిన సమాచారాన్ని హెల్ప్‌డెస్క్ సిబ్బంది బంధువులకు అందించి ఊరట కలిగించాలని హితవు పలికారు. కోవిడ్ ఆస్పత్రుల్లో లభ్యమవుతున్న సేవలు, చికిత్స, సదుపాయాలు, రోగుల ఆరోగ్య స్థితిగతుల తాజా సమాచారం తెలియజేసేందుకు హెల్ప్‌డెస్క్‌లను మరింత బలపరచాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ప్రదీప్త కుమార్ మహాపాత్రో, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు అభయ్, ముఖ్యమంత్రి 5టీ కార్యదర్శి వి. కె. పాండ్యన్, కోవిడ్ పర్యవేక్షకులు నికుంజొ బిహారి ధొలొ, సత్యవ్రత సాహు, విష్ణుపద శెట్టి, కెంజొహార్, మయూర్భంజ్ జిల్లాల కలెక్టర్లు, కటక్, భువనేశ్వర్ నగర పాలక సంస్థల కమిషనర్లు సమావేశంలో పాల్గొన్నారు. బాధిత కుటుంబీకులకు సమాచారం కోవిడ్ ఆస్పత్రుల్లో చేరిన బాధితుల ఆరోగ్య సమాచారం వారి కుటుంబీకులకు ఎప్పటికప్పుడు చేరాలి. ఈ కార్యకలాపాల్లో పాలుపంచుకునే సిబ్బంది, యంత్రాంగం మానవతా దృక్పథంతో మసలుకోవాలి. కోవిడ్ నిర్వహణ రంగంలో టీకాల ప్రదానం కీలకమైన అంశమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. టీకాల ప్రదాన కేంద్రానికి ప్రజలు సునాయాశంగా చేరి ఇబ్బంది పడకుండా టీకాలు వేసుకునేందుకు సౌకర్యాలు కల్పించాలి. ఈ ప్రాంగణాల్లో రద్దీ నివారించి కోవిడ్ – 19 నిబంధన భౌతిక దూరానికి ప్రాధాన్యం కల్పించాలి. టీకాలు వేసే చోటు, వేళల సమాచారం సంబంధిత వ్యక్తులకు ముందస్తుగా తెలియజేయడంతో ఇది సాధ్యమతుందని నవీన్ పట్నాయక్ అభిప్రాయ పడ్డారు. ఇంటింటి సర్వే అఖిల పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటించిన మేరకు ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ చంద్ర మహాపాత్రో తెలిపారు. ఇంటింటా కరోనా రోగ లక్షణాలు కలిగిన బాధితుల సర్వే చేపడతారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్లు ప్రధానంగా ఆక్సిజన్ సంబంధిత వ్యవహారాలతో హెల్ప్ డెస్కు కార్యకలాపాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. -
మరో గండం: తుపాను ముప్పు
భువనేశ్వర్ / బరంపురం: రాష్ట్రానికి మరో తుపాను ముప్పు పొంచి ఉందని భారతీయ వాతావరణ విభాగం బుధవారం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఈ నెల 22వ తేదీన అల్ప పీడనం ఏర్పడి తుపానుగా మారి ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం దాటుతుందనిæ ముందస్తు సమాచారం జారీ చేసింది. అయితే తుపాను చిత్రం అస్పష్టంగా ఉంది. ఉత్తర అండమాన్ సాగరం, తూర్పు కేంద్ర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం చిత్రం స్పష్టమైతే తప్ప తుపాను తీవ్రత అంచనా వేయలేమని భారతీయ వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్రో తెలిపారు. వాతావరణ కదలిక పరిశీలనలో సమాచారం తెలుస్తుందని, తుపాను చిత్రం స్పష్టమైతే దాని పేరు ఖరారవుతుందన్నారు. వర్ష సూచన అల్ప పీడనం ప్రభావంతో ఈ నెల 25వ తేదీ సాయంత్రం నుంచి రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. ఒకటి, రెండు చోట్ల కుండపోత వర్షం కురుస్తుంది. బలమైన గాలులు ఈ నెల 23వ తేదీ నుంచి అండమాన్ సాగరం, పరిసర తూర్పు కేంద్రియ బంగాళాఖాతం తీరంలో గంటకు 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ వేగం గంటకు 65 కిలో మీటర్ల వరకు ఉండే అవకాశాలున్నాయి. ఈ నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు తీర ప్రాంతాల్లో గాలులు బలంగా వీస్తాయి. ఈ వ్యవధిలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ వేగం గంటకు 70 కిలోమీటర్ల వరకు ఉంటుంది. చేపల వేట నివారణ సముద్రంలో అలజడి వాతావరణం నెలకొనడంతో ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు బంగాళాఖాతం నడి భాగం, ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉత్తర బంగాళాఖాతం, ఒడిశా కోస్తా ప్రాంతంలో మత్స్యకారులకు చేపల వేట నివారించారు. సముద్రం నడి బొడ్డున ఉన్న మత్స్యకారులు ఈ నెల 23వ తేదీ నాటికి తీరం చేరాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తీరంలో కమ్ముకున్న మేఘాలు ఉపరితల ఆవర్తనం నెల కొన్న నేపథ్యంలో బుధవారం గంజాం జిల్లాలోని గోపాల్పూర్ తీరంలో సముద్రంపై మేఘాలు కమ్ముకున్నాయి. ఉపరితలంలో విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా సముద్రం నీటిమట్టం పెరగడంతో గోపాల్పూర్ తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతూ తీరాన్ని తాకుతున్నాయి. సముద్ర పోటు ఎక్కువగా ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా తీరంలో పడవలు నిలిపివేశారు. భయాందోళన వద్దు రాష్ట్రానికి తుపాను ముప్పు పరిస్థితి ఇంతవరకు స్పష్టం కాలేదు. ప్రజలు ఆందోళన చెందాలి్సన పరిస్థితులు లేనట్లు రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనర్ (ఎస్సార్సీ) ప్రదీప్ కుమార్ జెనా ధైర్యం చెప్పారు. తుపానుకు సంబంధించి అనుక్షణం తాజా సమాచారం జారీ అవుతుంది. భారతీయ వాతావరణ విభాగం ముందస్తు సూచన మాత్రమే జారీ చేసింది. తుపాను తీవ్రత, ఉపరితలాన్ని తాకే ప్రాంతం వివరాలేమీ జారీ చేయనట్లు ఆయన స్పష్టం చేశారు. వాతావరణ విభాగం ముందస్తు సమాచారం మేరకు రాష్ట్రంలో జాతీయ, ఒడిశా విపత్తు స్పందన దళాలు, అగ్నిమాపక దళం, కోస్తా ప్రాంతాల జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లతో సమావేశాలు ప్రారంభించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో విపత్తు నిర్వహణ సరంజామాతో జిల్లా యంత్రాంగం సిద్ధం కావాలని ఆదేశించారు. -
క్షీణించిన మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యం
రాయగడ: ఒడిషా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ గిరిధర్ గొమాంగొ అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స నిమిత్తం భువనేశ్వర్ ఎయిమ్స్ హాస్పిటల్లో చేర్పించినట్లు ఆయన కుమారుడు, బీజేపీ నాయకుడు శిశిర్ గొమాంగొ ఓ ప్రకటనలో సోమవారం వెల్లడించారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన ఆరోగ్యం కోలుకుని ఇంటికి చేరుకోగా, ఇంటికి చేరిన కొన్నిరోజులకే ఇలా బాగాలేకపోవడం గమనార్హం. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు శిశిర్ గొమాంగొ తెలిపారు. చదవండి: రేపు పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు అంతలోనే.. చదవండి: కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి -
మందుబాబులకు శుభవార్త: ఆర్డర్ పెట్టు.. మందు పట్టు
భువనేశ్వర్: ఖుర్దా జిల్లాలో మద్యం ఆన్లైన్ విక్రయాలకు అధికారులు చర్యలు తీసుకున్నారు. సోమవారం నుంచి మద్యం డోర్ డెలివరీ సర్వీసు అందుబాటులోకి రానుంది. అబ్కారీ విభాగం మార్గదర్శకాల మేరకు జిల్లా కలెక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆన్లైన్ మద్యం విక్రయాలు చేపట్టనున్నారు. జొమాటో, స్విగ్గీ వంటి 17 హోం డెలివరీ సంస్థలతో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. orbc.co.in వెబ్సైటులో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మద్యం బుకింగ్ చేసుకునేందుకు వీలు కల్పించారు. ఆర్డర్ చేసిన ఒకటి నుంచి రెండు గంటల వ్యవధిలో డోర్ డెలివరీ చేయస్తామని అధికారులు చెప్పారు. -
కాలవైశాఖి బీభత్సం.. వణుకుతున్న ఒడిశా
భువనేశ్వర్: రాష్ట్రంలో పలుచోట్ల కాలవైశాఖి మంగళవారం బీభత్సం సృష్టించింది. మరో 24 గంటల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని స్థానిక వాతావరణ కేంద్రం సమాచారం జారీ చేసింది. ఈ వ్యవధిలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. పిడుగులు పడే సంకేతాలు జారీ చేసింది.ఈ నెల 14వ తేదీ వరకు రాష్ట్రంలో కాల వైశాఖి తాండవించనున్న సంకేతాలు ఉన్నాయి. బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, కేంద్రాపడ, కటక్, జగత్సింగ్పూర్, పూరీ, ఖుర్దా, నయాగడ్, గంజాం, గజపతి, కొందమాల్, బౌధ్, ఢెంకనాల్, మయూర్భంజ్ జిల్లాలకు ఆరంజ్ వార్నింగ్, సుదరగడ్, ఝార్సుగుడ, బర్గడ్, సంబల్పూర్, దేవ్గడ్, అనుగుల్, కెంజొహార్, సువర్ణపూర్, నువాపడ, బలంగీరు, కలహండి, నవరంగపూర్, రాయగడ, కొరాపుట్, మల్కన్‌గిరి జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ అయింది. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు సమాచారం. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. పిడుగులు పడి ముగ్గురి మృతి 3 జిల్లాల్లో పిడుగులు పడి ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఒక మహిళ ప్రాణాపాయ పరిస్థితిలో చికిత్స పొంతోంది. బలంగీరు జిల్లాలో ఇద్దరు మహిళలు స్నానం చేసేందుకు చెరువుకి వెళ్లి పిడుగుపాటుకు గురయ్యారు. వారిలో పాణిబుడి మేష్వా (65) ఘటనా స్థలంలోనే మరణించింది. భూమిసుత మేష్వా అనే మహిళ పిడుగుపడి కాలిపోవడంతో ప్రాణాపాయ పరిస్థితిలో స్థానిక భీమభోయి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కెంజొహార్ జిల్లాలోని కాశీపూర్ గ్రామంలో సాగు పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా రాయిదాస్ ముండా అనే రైతు పిడుగు పడి మరణించాడు. అనుగుల్ జిల్లా అఠొమల్లిక్ ప్రాంతంలో ఇద్దరు పిడుగుపాటుకు గురికాగా ఓ యువకుడు ఘటనా స్థలంలోనే మరణించాడు. మరో వృద్ధుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాలవైశాఖి ప్రభావంతో 20 మిల్లీవీుటర్లు పైబడిన వర్షపాతం రాష్ట్రంలో 9 చోట్ల నమోదైంది. చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ చదవండి: ఆవు పేడతో కరోనా అస్సలు తగ్గదు.. వేరే సమస్యలు వస్తాయి -
యాంకర్ శ్యామల, క్రికెటర్ భువనేశ్వర్ అక్కాతమ్ముళ్లా?
టాలీవుడ్ యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. టీవీ షోలతో పాటు పలు ఆడియో ఫంక్షనకు తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తుంటుంది. ఇటీవల భర్త నర్సింహారెడ్డిపై చీటింగ్ కేసుతో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. తన దగ్గర నుంచి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని నర్సింహారెడ్డిపై ఓ మహిళ హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 2017 నుంచి ఇప్పటి వరకు విడతల వారిగా కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. డబ్బులు అడిగితే తనను బెదిరించడమే కాకుండా, వేధింపులకు కూడా గురిచేశాడని ఆరోపించింది. తాజాగా ఈ కేసు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన నర్సింహారెడ్డి తనపై సోషల్ మీడియాలో వస్తోన్న కథనాలపై స్పందిస్తూ.. తనపై తప్పుడు కేసు పెట్టారని, త్వరలో నిజనిజాలేమిటో అందరికి తెలుస్తాయని చెప్పారు. ఇదిలా ఉండగా శ్యామలకు క్రికెటర్ భువనేశ్వర్‌కు మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా అంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు అక్కా, తమ్ముళ్లని అందుకే వీరిద్దరికి దగ్గరి పోలికలుంటాయని మీమ్స్ క్రియేట్ చేశారు. తాజాగా ఈ వార్తలపై స్పందించిన శ్యామల.. ‘అవునా.. ఈ విషయం నాకే తెలియదు వాళ్లకేం తెలుస్తుంది’ అంటూ సెటైర్ వేశారు. దీంతో శ్యామల, భువనేశ్వర్ బ్రదర్ అండ్ సిస్టర్ అంటూ వైరలవుతున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. చదవండి : చీటింగ్ కేసు : వీడియో రిలీజ్ చేసిన యాంకర్ శ్యామల భర్త మహిళ ఫిర్యాదు.. యాంకర్ శ్యామల భర్త అరెస్ట్ -
నిండు గర్భిణిని 3 కి.మీ. నడిపించినందుకు..
భువనేశ్వర్/మయూర్భంజ్: నడిరోడ్డు మీద 8 నెలల నిండు గర్భిణిని నడిపించిన ఆరోపణ కింద స్టేషన్ ఆఫీసర్ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టరు రీణా బక్సల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కప్తిపడా స్టేషన్ ఆఫీసర్ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ సంజయ్ ప్రధాన్‌కు ఈ స్టేషన్ బాధ్యతలు అదనంగా కేటాయిస్తూ మయూర్భంజ్ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. సస్పెన్షన్ వ్యవధిలో మయూర్భంజ్ స్టేషన్ అధికారుల పర్యవేక్షణలో రీణా బక్సల్ ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తర్వుల తక్షణ అమలు కోసం ఆమె బాధ్యతలను స్టేషన్లో సహాయ సబ్ ఇన్స్పెక్టరు బి. డి. దాస్ మహాపాత్రోకు అప్పగించాలని పేర్కొన్నారు. మయూర్భంజ్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. శరత్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం హెల్మెట్ తనిఖీలు నిర్వహించారు. గర్భిణి గురుబారి బిరూలి, భర్త బిక్రమ్ బిరూలితో కలిసి ఆరోగ్య పరీక్షల కోసం వైద్యుని దగ్గరకు బైక్ మీద బయల్దేరింది. నోటా పంచాయతీ నుంచి ఉదొలా వెళ్తున్న మార్గంలో పోలీసులు తనిఖీ చేశారు. భర్త హెల్మెట్ ధరించినా భార్య ధరించనందున జరిమానా చెల్లించాలని అడ్డుకున్నారు. నగదు లేనందున ఆన్లైన్లో జరిమానా చెల్లించేందుకు బాధితులు అభ్యర్థించినప్పటికీ పోలీసులు పెడచెవిన పెట్టడంతో ఇరు వర్గాల మధ్య వాగ్యుద్ధం జరిగింది. దీంతో గర్బిణి గురుబారి బిరూలిని నడి రోడ్డు మీద వదిలేసి భర్త బిక్రమ్ బిరూలిని పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఘటనా స్థలం నుంచి 3 కిలో మీటర్ల దూరం దాదాపు 4 గంటల సేపు కష్టపడి గర్భిణి పోలీసు స్టేషన్‌కు చేరి తీవ్ర ఆవేదనకు గురైంది. ఈ మేరకు సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని బాధిత దంపతులు ఫిర్యాదు చేశారు. ఈ అమానుష సంఘటనపట్ల జిల్లా పోలీసు అధికార యంత్రాంగం స్పందించి సంబంధిత స్టేషన్ అధికారిపై సస్పెన్షన్ విధిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. చదవండి: పిల్లలకు విషమిచ్చి.. తానూ తాగి! -
అస్థిపంజరం ఆధారంగా..‘ఆమె’ కోసం గాలింపు
భువనేశ్వర్: కొన్నాళ్ల క్రితం నగర శివారులోని జాలాం పోలీస్ ఔట్‌పోస్ట్ వద్ద ఆగిఉన్న వాహనంలో ఓ మనిషి అస్థిపంజరాన్ని పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఆ అస్థిపంజరం ఎవరిదై ఉంటుందనే కోణంలో పోలీసులు ఓ ఊహాచిత్రం గీయించి, రాష్ట్రంలోని పలు పోలీస్స్టేషన్లకు శుక్రవారం దాని కాపీలను పంపారు. బెంగళూర్‌కి చెందిన కొంతమంది నిపుణులు ఈ అస్థిపంజరం ఆనవాళ్లతో ఈ ఊహాచిత్రం గీయగా ఆ అస్థిపంజరం ఓ మహిళదిగా తేలింది. అయితే స్థానిక ఎయిమ్స్(అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) వైద్యుల సమాచారం మేరకు అస్థిపంజరం మహిళదని, 45 ఏళ్ల వయసున్న ఆమె ఎత్తు 164 సెంటీమీటర్లు ఉంటుందని తెలిసింది. అలాగే మృతురాలు క్షయ వ్యాధితో బాధపడుతున్నట్లు కూడా నిర్ధారించారు. గంజాయి అక్రమ రవాణాకి సంబంధించి, 2019 నవంబరులో ఆ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అందులోని అస్థిపంజరాన్ని గుర్తించినట్లు నగర డీసీపీ ఉమాశంకర దాస్ తెలిపారు. ఇదిలా ఉండగా, అప్పట్లో వాహనంలోని అస్థిపంజరాన్ని గుర్తించడంలో అలక్ష్యం వహించిన ఔట్‌పోస్ట్ ఇన్చార్జి సత్యబ్రత గ్రహచార్య సస్పెన్షన్‌కు గురైన విషయం విదితమే. చదవండి: షాకింగ్.. అంకుల్ అస్థిపంజరాన్నే గిటార్‌గా చేసి.. -
దారుణం: నిద్రలేపి నుదుటిపై తుపాకీతో...
భువనేశ్వర్ : నిద్రపోతున్న వ్యక్తిని లేపి మరీ తుపాకీతో కాల్చి చంపిన ఘటన గుణుపూర్ సబ్‌డివిజన్ పరిధిలోని గుడారి పోలీస్‌స్టేషన్ సమీపంలో సంచలనం రేకిత్తిస్తోంది. నైరా గ్రామానికి చెందిన కిరణ్ గంటా(30) శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత తన ఇంటి బయట పడుకున్నాడు. గుర్తు తెలియని కొంతమంది దుండగులు అక్కడికి చేరుకుని, అతడిని నిద్రలేపి నుదుటిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ క్రమంలో అతడు అక్కడిక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. అనంతరం అక్కడి నుంచి దుండగులు పరారయ్యారు. అయితే తుపాకీ కాల్పుల శబ్దం విన్న ఇంటి లోపల పడుకున్న బాధిత కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూడగా, రక్తపు మడుగులో ఉన్న కిరణ్‌ని చూసి ఆశ్చర్యపోయారు. దగ్గరికి వెళ్లి అతడి శ్వాసని పరీక్షించగా, అతడు మరణించినట్లు తేలడంతో కుటుంబ సభ్యులు బోరుమన్నారు. తన భర్తకి ఎవరితో శత్రుత్వం లేదని, ఇలా ఎందుకు జరిగిందో..ఎవరు చేసి ఉంటారో తమకు తెలియడం లేదని మృతుడి భార్య రైనా గంటా తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం, సైంటిఫిక్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగిందా లేకపోతే మరేదైనా కారణం ఉండి ఉంటుందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నట్లు గుణుపూర్ సబ్‌డివిజనల్ పోలీస్ అధికారి రాజ్‌కిశోర్ దాస్ తెలిపారు. -
అగ్ని ప్రమాదం: కాలిబూడిదైన 90 మేకలు
భువనేశ్వర్ : ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలోని హింజిలికాట్ నియోజకవర్గం పరిధిలో గల లావుగుడ గ్రామంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 12 ఇళ్లు, రెండు మేకల శాలలు దగ్ధమైన సంఘటన స్థానికంగా విషాదం మిగిల్చింది. ఈ అగ్ని ప్రమాదంలో 90 మేకలు సజీవ దహనం కాగా లక్షలాది రూపాయల ఆస్తులు ధ్వంసమయ్యాయి. గ్రామంలో అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న హింజిలికాట్, అస్కా అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది తక్షణమే ప్రమాదస్థలానికి చేరుకుని మంటలు అర్పేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఎండ తీవ్రతతో పాటు గాలులు వీయడంతో అప్పటికే ఇళ్లు, మేకల శాలులు మంటల్లో పూర్తిగా బూడిదయ్యాయి. బూడిౖదైన మేకల శాల ప్రభుత్వం ఆదుకోవాలి ప్రమాదం విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రతినిధి శరత్ కుమార్ మహపాత్రో, బంజనగర్ సబ్‌కలెక్టర్ రాజేంద్ర మిజ్ఞ, బీడీఓ సురంజిత్ సాహు, అదనపు తహసీల్దార్ శరత్ కుమార్ మల్లిక్ చేరుకుని బాధితులకు తక్షణ సహాయంగా ప్లాస్టిక్ కవర్లు, ఆహారం, బియ్యం, కట్టుకునేందుకు వస్త్రాలు అందించారు. ప్రమాదంలో నష్టపోయిన బాధితులకు బిజు పక్కా గృహ పథకం కింద ఇళ్లు ఇవ్వాలని, ప్రమాదంలో సజీవ దహనమైన మేకలకు నష్ట పరిహారం, సహాయం అందించి ఆదుకోవాలని బాధిత గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న బాధిత గ్రామస్తులు -
అతడి పరిచయంతో ఆమె జీవితం మారింది
అలల ప్రయాణం తీరం చేరేవరకే. కలల ప్రయాణం మెలకువ వచ్చేంత వరకే. కానీ స్పచ్ఛమైన ప్రేమ ప్రయాణం ఎన్ని అడ్డంకులెదురైనా వివాహ బంధంతో ముడి వేస్తుందని రుజువు చేశారా దంపతులు. ఆస్తి కానీ, అందం కానీ వారిని ఆకర్షించలేదు. ఒకరిలో ఇంకొకరు ఏదో ఆశించడంతో వారి మధ్య ప్రేమ చిగురించలేదు. తొలిచూపులోనే వారి మనసులు కలిశాయి. మాటలు ఒక్కటయ్యాయి. స్వచ్ఛమైన ప్రేమకు మనసులు అందంగా ఉంటే చాలనుకున్న వారిద్దరూ మమతానురాగాలు పంచుకుని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. యాసిడ్ దాడికి గురై చూపు కోల్పోయిన యువతిని తొలిచూపులోనే ప్రేమించిన యువకుడు ఏడేళ్ల పాటు ఆమెకు అండగా ఉండి తన స్వచ్ఛమైన ప్రేమను అందించాడు. సుదీర్ఘ ప్రేమ ప్రయాణం తరువాత జగత్సింగ్ పూర్ జిల్లాలోని తిర్తోల్ సమితి కనకపూర్ గ్రామస్తురాలు ప్రమోదిని రౌల్, ఖుర్దా జిల్లాలోని బలిపట్న సమితి ఝియింటొ గ్రామానికి చెందిన సరోజ్ సాహుల వివాహం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ ప్రేమ జంట వివాహానికి ప్రముఖులు హాజరై ప్రశంసించారు. వివరాలిలా ఉన్నాయి. భువనేశ్వర్ : తిర్తోల్ ప్రాంతంలోని ఆది కవి సరళా దాస్ కళాశాలలో +2 చదువుతున్న రోజుల్లో బంధువుల ఇంటి నుంచి సోదరునితో కలిసి వస్తుండగా 2009వ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీన ప్రేమోన్మాది యాసిడ్ దాడిలో ప్రమోదిని గాయపడింది. యాసిడ్ దాడికి పాల్పడిన ప్రేమోన్మాది భద్రక్ ప్రాంతీయుడు సంతోష్ కుమార్ వేదాంత్. పారా మిలటరీ జవాన్. యాసిడ్ దాడిని పురస్కరించుకుని జగత్సింగ్పూర్ పోలీసులు సంతోష్‌ను అరెస్టు చేసి ఉద్యోగం నుంచి బహిష్కరించి కటకటాల పాలు చేశారు. యాసిడ్ దాడికి గురైన ప్రమోదిని తీవ్రంగా గాయపడి కోమాలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడింది. కోమా నుంచి కోలుకుని యాసిడ్ దాడి తీవ్రతతో బాధితురాలు ప్రమోదిని దాదాపు 5 ఏళ్లు కోమాలో ఉండి క్రమంగా 2014వ సంవత్సరంలో కోలుకోగా ఆమె కంటి చూపు కోల్పోయినట్లు గుర్తించారు. ఈ దశలో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న సరోజ్ కుమార్ సాహు విధి నిర్వహణలో భాగంగా ఆసుపత్రికి వచ్చి ఆమెకు పరిచయమయ్యాడు. దీంతో ఆమె జీవితం కొత్త మలుపు తిరిగింది. ఆమె చికిత్స వ్యవహారాల్లో నిపుణులతో నిరంతర సంప్రదింపులు, ఆరోగ్య సంరక్షణతో ప్రమోదిని జీవితంలో కొత్త వెలుగులు నింపాడు. ఆత్మస్థైర్యంతో ఆమె స్వచ్ఛంద సేవా సంస్థలో చేరి తదుపరి జీవనం గడిపేందుకు సిద్ధమైంది. 2014వ సంవత్సరంలో ఏర్పడిన తొలి పరిచయంతోనే వారిద్దరి మధ్య కలిగిన ప్రేమబంధం బలపడి పెళ్లి బాట వైపు అడుగులు వేయించింది. 2018వ సంవత్సరంలో లక్నోలో వారిద్దరి వివాహ నిశ్చితార్థం జరిగింది. వధూవరుల కుటుంబీకులు, బంధుమిత్రుల సమక్షంలో వైదిక సంప్రదాయంలో వారి వివాహం అత్యంత ఆనందోత్సాహాలతో సోమవారం జరిగింది. పెళ్లి విందుకు రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్, రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు డాక్టర్ మీనతి బెహరా, జగత్సింగ్పూర్ జిల్లా ఎస్పీ ప్రకాష్ రంగరాజన్, సబ్ డివిజినల్ పోలీసు అధికారి ఎస్డీపీఓ దీపక్ రంజన జెనా, తిర్తోల్ పోలీసు స్టేషన్ అధికారి భావగ్రాహి రౌత్, సర్పంచ్ నమిత రౌల్ ప్రత్యక్షంగా హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. -
పక్కూరి జాతరకు.. అక్కడినుంచి చెన్నై
భువనేశ్వర్ : బాలిక అపహరణ కేసులో కొశాగుమడ పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నవరంగపూర్ జిల్లా కొశాగుమడ సమితి చురాహండి గ్రామానికి చెందిన బాలికతో అదే గ్రామానికి చెందిన మధుసూదన మాలి(23) పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. జనవరి 28న పక్క గ్రామంలో జరిగిన జాతరకు బాలికను తీసుకువెళ్లాడు. అక్కడ నుంచి చెన్నై తీసుకువెళ్లి రెండు నెలలుగా అక్కడే ఉన్నారు. బాలిక అదృశ్యంపై ఆమె తల్లిదండ్రులు గతంలో కొశాగుమడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే వారిద్దరూ చెన్నై నుంచి వచ్చారని సమాచారం అందడంతో పోలీసులు శుక్రవారం గ్రామానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రేమ పేరుతో బాలికను మోసం చేసి అపహరించిన కేసులో యువకుడిని అదుపులోకి తీసుకుని శనివారం కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసు అధికారి నటబర నందో తెలిపారు. -
తవ్వకాల్లో గుట్టలు గుట్టలుగా గవ్వలు..
భువనేశ్వర్: నయాగడ్ జిల్లాలోని తరియా పంచాయతీలో ఉన్న నిచ్చిపూర్ గ్రామంలో కొత్త ఇల్లు నిర్మాణం నిమిత్తం పునాదులు తీసేందుకు తవ్వకాలు చేపడుతుండగా అక్కడి భూగర్భంలో నుంచి గుట్టలు గుట్టలుగా గవ్వలు బయటపడ్డాయి. మొత్తం 10 తట్టల గవ్వలు వెలికి తీసినట్లు సమాచారం. ఇప్పుడు ఈ సంఘటన చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచలనం రేకిత్తిస్తుండగా, పూర్వీకులు వీటిని గుప్త నిధిగా భావించి భూగర్భంలో పదిలపరిచినట్లు స్థానికులు భావిస్తున్నారు. పూర్వ కాలంలో దైనందిన లావాదేవీల్లో నేటి తరంలో వినియోగించే ధనం తరహాలోనే ఈ గవ్వలను వినియోగించే వారనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. కేవలం 4 అడుగులు లోపు జరిపిన తవ్వకాల్లోనే ఈ గవ్వలు కనిపించాయని ఇంటి స్థల యజమాని నారాయణ సాహు తెలిపాడు. చదవండి: ఒమర్ అబ్దుల్లా కుటుంబం గృహనిర్బంధం -
10 నిముషాలు చార్జ్ చేస్తే.. 450 కి.మీ. ప్రయాణం!
బయో ఆగ్రానిక్, బయో డీగ్రేడబుల్ బ్యాటరీల తయారీ కోసం ‘నెక్సెస్ పవర్’ అనే కంపెనీ స్థాపించి మన దేశంలో ఎలక్ట్రానిక్ వెహికిల్(ఈవీ) మార్కెట్‌కు భవిష్యత్ ఆశాకిరణాలుగా నిలుస్తున్న ట్విన్ సిస్టర్స్ నిషిత బాలియర్ సింగ్ (23), నికిత బాలియర్ సింగ్ (23) పరిచయం... భువనేశ్వర్ (ఒడిశా)కు చెందిన ట్విన్ సిస్టర్స్ నిషిత, నికితలు ‘నలుగురిలాగే నా ఆలోచన కూడా’ అనుకోకుండా కొత్తగా ఆలోచించడం అలవాటు. ఆ అలవాటే వారిని తాజాగా ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ యువప్రతిభావంతుల జాబితాలో చోటుదక్కేలా చేసింది. 2015లోనే ‘ఫెలిస్ లియో వెంచర్స్’ యాప్ అండ్ వెబ్ డెవలప్మెంట్ సర్వీస్‌ను ప్రారంభించి విజయకేతనం ఎగరేశారు. ఇరవై రెండేళ్ల వయసులో పర్యావరణానికి హాని కలిగించని ‘హీటింగ్’ ‘కూలింగ్’ విధానాన్ని అభివృద్ధి పరిచారు. పరిశ్రమలలో సంప్రదాయమైన బాయిలర్లు, ఏసీల స్థానంలో వీటిని ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి నష్టం జరగకపోవడమే కాకుండా ఏటా 25 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటారు. అదేమిటోగానీ ఒక పుస్తకం మాత్రం ఎలక్ట్రానిక్ వెహికిల్(ఇవీ) మార్కెట్‌కు ఊతం ఇచ్చే ‘నెక్సెస్ పవర్’ పుట్టుకకు కారణం అయింది. ఆ రాత్రి... ఆమాట ఈమాట మాట్లాడుకుంటున్న క్రమంలో వారి దృష్టిలో ఒక పాత బయోకెమిస్ట్రీ పుస్తకం పడింది. దాన్ని పూర్తిగా తిరిగేసి చర్చించడం మొదలు పెట్టారు. ఆ చర్చ ఎలక్ట్రానిక్ వెహికిల్స్ వైపు వెళ్లింది. ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ స్థాపించాలనుకున్నారు. అయితే మార్కెట్ స్టడీలో వారికి తెలిసిన విషయం ఏమిటంటే పాశ్చాత్యదేశాలతో పోల్చితే మన దేశంలో ‘ఇవీ మార్కెట్’ వేగం చాలా తక్కువని. కారణాలు ఏమిటి? అనే విశ్లేషణలో వారికి ప్రధానంగా కనిపించిన కారణం: బ్యాటరీ. రెండు, మూడు గంటలు రీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటివి మరికొన్ని సమస్యలు ఉన్నాయి. ముందు బ్యాటరీ సమస్యకు పరిష్కారం వెదికితే ఇక్కడ ఎలక్ట్రానిక్ వెహికిల్ మార్కెట్ వేగం పెంచడం పెద్ద కష్టం కాదనే నిర్ణయానికి వచ్చారు. బ్యాటరీ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణల గురించి ఆలోచించారు. ఈ క్రమంలోనే ప్రోటిన్ బేస్డ్ బ్యాటరీలు తయారుచేయడానికి 2019లో ‘నెక్సెస్ పవర్’ కంపెనీ స్థాపించారు. వ్యవసాయ వ్యర్థాలతో ఇక్కడ తయారయ్యే ప్రొటీన్ బేస్డ్ బ్యాటరీలను పది నిమిషాల వ్యవధిలోనే రీచార్జ్ చేయవచ్చు. 450 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. మరో విషయం ఏమిటంటే తమ వ్యవసాయ వ్యర్థాలను అమ్ముకోవడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం చేతికి అందుతుంది. ఇద్దరితో మొదలైన ‘నెక్సెస్ పవర్’ ఇప్పుడు 11 మంది సభ్యుల కంపెనీగా మారింది. ఈ కంపెనీ రూపొందించే వేగవంతమైన చార్జింగ్, పర్యావరణ హితమైన బ్యాటరీలు వచ్చే సంవత్సరం వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ‘ఎప్పుడూ ఒకేరకమైన విషయాల గురించి కాకుండా కొత్త విషయాల గురించి ఆలోచించడం ఇష్టం’ అని చెబుతున్న ఈ సోదరీమణులు ‘యంగ్ గ్లోబల్ అంబసిడర్’ ‘ఇనవెటివ్ ఎంటర్ప్రైజేస్ ఆఫ్ ది ఇయర్’ టైటిల్స్‌తో పాటు ఎన్నో అవార్డ్లు సొంతం చేసుకున్నారు. స్కూలు, కాలేజీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి, విజయం వైపు నడిపించడానికి వ్యక్తిత్వ వికాస తరగతులు కూడా నిర్వహిస్తుంటారు. సెంటర్ ఫర్ ఎనర్జీ ఫైనాన్స్ స్టడీ ప్రకారం మన దేశంలో ఎలక్ట్రానిక్స్ వెహికిల్స్ మార్కెట్‌కు ఉజ్వలభవిష్యత్ ఉంది. ‘నెక్సెస్ పవర్’ వినూత్న ఆవిష్కణలతో ఆ మార్కెట్ వేగం పెరుగుతుందనడంలో సందేహం లేదు. చదవండి: ఒక్కో డ్రెస్ ధర లక్షల్లో: నువ్వు కూడా మాట్లాడుతున్నావా? జీన్స్ వేసుకుని అలా వద్దు.. ఎందుకో తెలుసా? -
మెడలో బంగారం కోసం మహిళపై దారుణం
భువనేశ్వర్ : మహిళ గొంతుకోసి మెడలో బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని రాయగడ జిల్లాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మృతురాలు కుభికొట పంచాయతీ పరిధి హులకాతుండ గ్రామానికి చెందిన బిజయ్ హులుకా భార్య కొసాయి హులుకా(29)గా పొలీసులు వెల్లడించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బిజయ్ తన సొంత పనిమీద శుక్రవారం రాయగడకు వెళ్లాడు. పని ముగించుకొని తిరిగి అదే రోజు రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చి చూడగా రక్తపు మడుగుల్లో తన భార్యపడి ఉండటం గమనించి, కేకలు వేశాడు. చుట్టుపక్కల వాళ్లు వెళ్లి చూసేసరికి మృతురాలి గొంతు కోసి ఉండటం గమనించారు. ఆమె ధరించిన బంగారు ఆభరణాలు కనిపించకపోగా.. ఇంట్లో ఉన్న రెండు బీరువాలు తెరిచి ఉండటంతో వెంటనే కుంభికోట పొలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం అక్కడికి చేరుకున్న రాయగడ పోలీసులు.. మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
7 కిలోమీటర్లు స్టెచ్రర్‌పై మోసుకుంటూ..
సాక్షి, భువనేశ్వర్ : గిరిజన గ్రామాల్లో గర్భిణులు, రోగుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. తాజాగా ఓ గర్భిణిని కొండలపై నుంచి 7 కిలోమీటర్లు స్ట్రక్చర్‌పై మోసుకు వచ్చిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కొరాపుట్ జిల్లా బరిణిపుట్ పంచాయతీ కొండప్రాంతం లోని లట్టిగుడ గ్రామానికి చెందిన గుప్త జాని భార్య లక్ష్మికి గురువారం పురిటి నొప్పులు మొదలయ్యాయి. 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. గ్రామానికి చేరుకునేందుకు రహదారి లేకపోవడంతో అక్కడికి వరకు చేరుకోలేమని సిబ్బంది తెలిపారు. దీంతో కొందమంది మహిళలు గ్రామం నుంచి 7 కిలోమీటర్ల స్టెచ్రర్‌పై మోసుకుంటూ కొండ దిగువన ఉన్న రోడ్డుకు చేర్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో జయపురం ఫూల్బడి లోని కొరాపుట్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం లక్ష్మీ పండండి బిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం. కాగా.. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రమంలో ఎవరికి అనారోగ్యం వచ్చినా.. ఇదే పరిస్థితి తలెత్తుతుందని, అధికారులు స్పందించి, రోడ్డు సౌకర్యం కల్పించాలని వారంతా కోరుతున్నారు. -
మఫ్టీలో పోలీసులు.. అది తెలియని గ్రామస్తులు
భువనేశ్వర్ : మల్కన్‌గిరి జిల్లాలోని కలిమెల సమితిలో ఉన్న మారగాన్ పల్లి గ్రామంలో పోలీసులపై గ్రామస్తులు దాడికి దిగారు. ఈ ఘటనలో ఎస్డీపీ అభిలాష్ సహా మరో ఎనిమిది మంది పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కలిమెల పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం చికిత్స నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. సంక్రాంతి పండగ నేపథ్యంలో గ్రామ శివారులోని ఓ తోట వద్ద కొంతమంది గ్రామస్తులు మద్యం తాగడం, కోళ్ల పందేలు నిర్వహించడం వంటివి చేస్తుండగా అక్కడికి మఫ్టీలో చేరుకున్న పోలీసులు వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులను ఎవరో కొత్త వారు అని భావించిన గ్రామస్తులు.. ‘మా ప్రాంతానికి వచ్చి, మాకే ఎదురు తిరుగుతారా?’ అని వారిపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఆఖరికి వారు పోలీసులని తెలియటంతో అక్కడినుంచి గ్రామస్తులు పరారయ్యారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పలువురు గ్రామస్తులను నిర్భందంలోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు. -
విధి ఆడిన వింత నాటకం!
విధి వెక్కిరిస్తే జీవితం వింత నాటకంలా మారిపోతుంది. ఆ నాటకంలో ఎవరైనా సమిధులు కావాల్సిందే... ఇదే పరిస్థితి అభం..శుభం తెలియని ఇద్దరి చిన్నారులకు ఎదురైంది. ఉన్న తల్లి ఎక్కడుందో తెలియదు. మద్యానికి బానిసై ఇబ్బందులు పెడుతున్న నాన్నను నాన్నమ్మే హతమార్చింది. ఆమెపై కేసు నమోదైంది. దీంతో చిన్నారుల జీవిత పయనమెటో తెలియని దయనీయ పరిస్థితి నెలకొంది. ఆ చిన్నారులను చూసి అంతా అయ్యో..పాపం అంటున్నారు... వారిని అక్కున చేర్చుకునేదెవరన్నది ప్రశ్నార్థకంగా మారింది. భువనేశ్వర్ : ఇద్దరు చిన్నారుల జీవితాలతో విధి ఆడుకుంది. తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోవడంతో నాలుగేళ్ల కిందట ఆ చిన్నారుల తల్లి తన భర్తను, పిల్లలను వదిలి వెళ్లిపోయింది. తండ్రి మద్యానికి బానిసై ఉన్న కుటుంబ సభ్యులను నిత్యం విసిగించడంతో విసిగిపోయిన కన్నతల్లే క్షణికావేశంలో హతమార్చింది. మూడేళ్ల కిందట చిన్నారుల తాతయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. ఉపాధి కోసం పెదనాన్న వలసబాట పట్టాడు. మేనత్త సాకుతుందా! అంటే ఆమెది రెక్కాడితేగాని కడుపు నిండని దయనీయ స్థితి. ఈ పరిస్థితుల్లో ఆ చిన్నారులకు దిక్కెవరన్నది ప్రశ్నార్ధకంగా మారింది. మక్కువ మండలం కొండబుచ్చమ్మపేట గ్రామానికి చెందిన జానకి గౌరీశంకర్, కమల దంపతులు. వీరికి హారిక, చరణ్‌తేజ సంతానం. తల్లిదండ్రులిద్దరూ గుంటూరు పట్టణం వలసవెళ్లి ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసుకుంటూ జీవించేవారు. కొన్నాళ్లు గడిచాక గౌరీశంకర్ మద్యానికి బానిసై భార్య కమలను నిత్యం వేధించడంతో విసిగిన ఆమె భర్తను ఇద్దరు చిన్నారులను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో చేసేదిలేక గౌరీశంకర్ తన ఇద్దరు చిన్నారులతో గుంటూరు వీడి కొండబుచ్చమ్మపేట గ్రామానికి వచ్చి ఓ అద్దె ఇంట్లో ఉండేవాడు. గౌరీశంకర్ మద్యానికి బానిస కావడంతో చిన్నారుల ఆలనాపాలన నాన్నమ్మ ఈశ్వరమ్మ చూస్తుండేది. ఈశ్వరమ్మకు ప్రభుత్వం అందిస్తున్న వితంతు పింఛనే జీవనాధారం. ఈ క్రమంలో ఈశ్వరమ్మను కన్నకొడుకు గౌరీశంకర్ మద్యం కోసం నిత్యం నగదు కావాలని వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తల్లీకొడుకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. క్షణికావేశంలో ఈశ్వరమ్మ కన్నకొడుకు గౌరీశంకర్‌ను హతమార్చింది. దీంతో చిన్నారుల తండ్రి లేకుండాపోయాడు. నాన్నమ్మ ఈశ్వరమ్మ రిమాండ్‌కు వెళ్లనుంది. ఇలా తల్లి ఉన్నా ఎక్కడ ఉందో తెలియక, తండ్రి హతమవగా.. ఇన్నాళ్లు తమ ఆలనాపాలన చూసిన నాన్నమ్మ రిమాండ్‌కు వెళ్లనుండడంతో ఈ చిన్నారుల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్ధకమైంది. మేనత్త ఉన్నా పేదరికంలో కొట్టుమిట్టాడుతోంది. హారిక ఐదో తరగతి, చరణ్‌తేజ రెండో తరగతి గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ పరిస్థితుల్లో చిన్నారులు హారిక, చరణ్‌తేజ జీవన పయనమెటు? అన్నది అందరి మదిలో తొలిచే ప్రశ్న. -
వావ్... వాట్ ఏ టైగర్....
భువనేశ్వర్: నలుపు రంగు డబ్బా ఏదీ దీని మీద పడలేదు.. ఇది అచ్చంగా నల్ల పులే(మెలనిస్టిక్ టైగర్).. ఇది ఎంత అరుదైనది అంటే.. ప్రపంచం మొత్తం మీద ఇలాంటివి ఆరేడే ఉన్నాయి.. అందులో ఇదొకటి. ఇంకో విశేషం ఏమిటంటే.. ఉన్న ఆరేడు కూడా మన పక్కనే ఉన్న ఒడిశా రాష్ట్రంలోనే ఉన్నాయి. అక్కడి సిమ్లిపాల్ రిజర్వులో ఈ నల్ల పులులు ఉన్నాయి. ఈ మధ్య కోల్‌కతాకు చెందిన ఫొటోగ్రాఫర్ సౌమన్ ఈ టైగర్ రిజర్వులోకి ఫొటోలు తీయడానికి వెళ్లారట. జీవిత కాలంలో ఒకే ఒక్కసారి వచ్చే చాన్స్ నా తలుపు తట్టింది. ఆ పులి కొన్ని సెకన్లపాటే కనిపించింది. చాలా వేగంగా స్పందించి.. చిత్రాలు తీయాల్సి వచ్చింది. నల్ల చిరుతలు చాలా ఉన్నాయి.. ఇది నల్ల పులి. అదీ బయటకు కనిపించడం చాలా అరుదు.. ఫుల్ హ్యాపీ అని ఆయన ఉబ్బితబ్బిబ్బయ్యారు. జన్యుపరమైన మార్పుల వల్ల ఈ పులులు ఇలా నల్లటి చారలను కలిగి ఉంటాయి. -
టపాకాయలు అమ్మొద్దు..
భువనేశ్వర్: కొవిడ్-19 రోగుల క్షేమం కోసం పర్యావరణహితమైన టపాకాయల అమ్మకాన్ని, వాడకాన్ని ఒడిశా ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నవంబర్ 10 నుంచి 30 వరకు నిషేధం ఉంటుంది. దీపావళి, కార్తీక పూర్ణిమ ఈ నెల 14, 30న ఉండటంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నవంబర్ 10 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా టపాకాయల అమ్మకం, వాడకం నిషేధించాలని ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ త్రిపాఠి ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారెవరికైనా విపత్తు నిర్వహణ చట్టం 2005, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం శిక్షకు గురవుతారని ఉత్తర్వులో పేర్కొందనన్నారు. కొవిడ్-19 మహమ్మారి పరిస్థితుల మధ్య క్రాకర్లను కాల్చడం, సీతాకాలం సమీపించడంతో.. ఒడిశా ప్రభుత్వం నవంబర్ 10 నుండి 30 వరకు ప్రజా ప్రయోజనాల కోసం టపాకాయల అమ్మకం, వాడకాన్ని నిషేధిస్తుందని ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఒడిశాలో కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి గణనీయమైన స్థాయిలో నియంత్రించబడిందని పేర్కొన్న ఈ ఉత్తర్వు, ప్రస్తుత పరిస్థితిని నియంత్రించడంలో ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. త్రిపాఠి మాట్లాడుతూ... కేసుల సంఖ్య రాష్ట్రంలో తగ్గినప్పటికీ ప్రమాదం ఇంకా ఉందని, వైరస్ కొన్ని దేశాలలో తిరిగి విజృంభించిందని, కొవిడ్-19 పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. సీతాకాలంలో మహమ్మారి మరింత వ్యాప్తి చెందుతుందని వైరస్ ప్రభావం ఎక్కువవుతుందని ఏకే త్రిపాఠి అభిప్రాయపడ్డారు. శీతాకాలంలో ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు కొవిడ్-19 పట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు. టపాకాయలు కాల్చడం వల్ల నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డై యాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికరమైన రసాయనాలు అధిక మొత్తంలో విడుదల అవుతాయి. ఈ రసాయనాలు శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని ఆయన పేర్కొన్నారు. స్థానిక అధికారులు, పోలీసులు ఈ నిషేధ అమలుకు చర్యలు తీసుకోవాలని ఏకే త్రిపాఠి ఆదేశించారు. రెండు రోజుల క్రితం రాజస్థాన్ ప్రభుత్వం కూడా కొవిడ్-19 బాధితుల క్షేమం కోసం పర్యావరణహితమైన టపాకాయలను వాడకుండా నిషేధించారు. -
స్వాతంత్య్ర సమర యోధుడికి తీవ్ర అవమానం
భువనేశ్వర్ : కొరాపుట్ జిల్లా కొట్‌పాడ్‌కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, ఆదివాసీ నేత, దేశ స్వాతంత్య్ర సమరంలో అమరుడైన ప్రథమ ఆదివాసీ నాయకుడు సహిద్ లక్ష్మణ నాయక్‌కు తీవ్ర అవమానం జరిగింది. కొట్‌పాడ్ కళాశాలలో సహిద్ లక్ష్మణ్ నాయక్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనకు తగిన గౌరవం ఇస్తున్నారు. అయితే శనివారం ఎవరో దుండగులు ఆ విగ్రహాన్ని పెకిలించి మహిళల మరుగుదొడ్డి పక్కన పడవేశారు. ( భారత్‌లో ఆకలి కేకలు ) ఈ పని ఎవరు చేసినా ఒక ఆదివాసీ సాతంత్య్ర సమర యోధునికి అవమానం జరిగినట్లేనని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహుళ ఆదివాసీ కొరాపుట్ జిల్లాలో పుట్టి దేశ స్వాతంత్య్రం కోసం చిరునవ్వుతో ఉరికంబమెక్కి ప్రాణాలు అర్పించిన దేశ భక్తుడికి జరిగిన అవమానం ఇదంటూ కేవలం ఆదివాసీ ప్రజలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. -
కరోనా ఇంజెక్షన్ల కలకలం
భువనేశ్వర్ : రాష్ట్రంలో కరోనా ఇంజెక్షన్ల తయారీ కలకలం రేపింది. బర్గడ్ జిల్లా భెడేన్ సమితిలోని రుసుడా గ్రామంలో కరోనా మందులు తయారు చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఆ మందుల తయారీ శిబిరంపై సంబల్పూర్ డ్రగ్ ఇన్స్పెక్టర్, పోలీసులు ఉమ్మడిగా దాడులు ఆకస్మికంగా చేపట్టారు. ఈ శిబిరంలో మందుల తయారీకి వినియోగిస్తున్న సామగ్రిని జప్తు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రపంచ ప్రజానీకాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి చికిత్సకు ఇంజక్షన్ ఆవిష్కరించినట్లు రుసుడా గ్రామానికి చెదిన ప్రహ్లాద్ బిసి (32) అధికారులకు తెలపడంతో ఆయన వివరణ కోరుతూ అధికారులు నోటీసులు జారీ చేశారు. (చదవండి : ఉమా భారతికి కరోనా పాజిటివ్) రెండు రకాలుగా ఇంజెక్షన్లు ఈ వ్యవహారంపట్ల ప్రహ్లాద్ బిసి స్పందించి కరోనా మహమ్మారి ప్రాణాల్ని బలిగొంటున్న తరుణంలో తాను ఈ ఇంజెక్షన్లు ఆవిష్కరించానని, ఇవి 2 రకాలుగా ఉంటాయని తెలిపాడు. ఒకటి ఎరుపు, రెండోది నీలం రంగులో ఉంటుందని చెప్పాడు. కోవిడ్–19 పాజిటివ్ ఖరారైతే ఒక ఇంజెక్షన్, మరో 2 గంటల తర్వాత మరో రంగు ఇంజెక్షన్ ఇస్తానని, ఇలా ఇచ్చిన 8 గంటల తర్వాత రోగి పూర్తిగా కోలుకుంటాడని తెలిపాడు. ఇతరులకు కరోనా సంక్రమించకుండా ఈ ఇంజెక్షన్లు దోహదపడతాయని వివరించాడు. ఈ ఇంజెక్షన్ల ఆవిష్కరణ, ప్రయోగం, వినియోగానికి సంబంధించి స్థానిక డ్రగ్ ఇన్స్పెక్టరు, రాష్ట్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా అభ్యర్థించినట్లు ప్రహ్లాద్ బిసి తెలిపాడు. కరోనా చికిత్సకు ఈ మందు చక్కగా పని చేస్తుంది. ఈ ఇంజెక్షన్ 100 శాతం విజయవంతమైన ఔషధంగా పేర్కొన్నాడు. దీని ప్రయోగం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా అభ్యర్థించడంతో ఆయన అభ్యర్థన పట్ల స్పందించిన డ్రగ్ ఇన్స్పెక్టర్, మరో ఇద్దరు ప్రభుత్వ అధికారులు గ్రామానికి వచ్చి మందుల తయారీని పర్యవేక్షించారు. భువనేశ్వర్ ప్రయోగ శాలకు పరీక్షల కోసం నమూనాల్ని సిఫారసు చేశారు. ఏ శిక్షకైనా సిద్ధం ఈ మందు నకిలీ కాదు. కరోనా రోగుల ప్రాణాల్ని రక్షిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజానీకాన్ని కలవరపరుస్తున్న కరోనా రోగులకు ఉన్నత చికిత్స అందజేస్తుందని ప్రహ్లాద్ బిసి తెలిపాడు. మందు నకిలీ లేదా హానికరం అని తేలితే ఎటువంటి శిక్షనైనా అనుభవించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ఈ వ్యవహారంలో పోలీసులు తనను అరెస్టు చేయనట్లు ప్రహ్లాద్ బిసి స్పష్టం చేశాడు. -
తాగుబోతు తల్లి వేధింపులు భరించలేక..
భువనేశ్వర్ : తాగుబోతు తల్లి వేధింపులు భరించలేక దారుణానికి ఒడిగట్టారు ఇద్దరు మైనర్లు. కన్నతల్లిని పాశవికంగా హత్య చేసి, బాత్రూంలో పడేశారు. ఈ సంఘటన బుధవారం రాత్రి ఒడిశాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భువనేశ్వర్‌కు చెందిన ఓ మహిళ అక్కడి సుందర్‌పాద ఏరియాలోని ఓ అపార్ట్మెంట్లో ఇద్దరు మైనర్ కుమారులతో కలిసి ఉంటోంది. ప్రతి నిత్యం ఆమె మద్యం తాగివచ్చి ఆ ఇద్దర్నీ హింసించేది. ఈ నేపథ్యంలో తల్లిపై పగ పెంచుకున్నారు వారు. బుధవారం రాత్రి ఫుల్లుగా తాగి వచ్చిన ఆమె.. వారిపై అరవటం మొదలుపెట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన ఇద్దరు పాలిథిన్ కవరుతో తల్లి ముఖాన్ని కప్పేసి, రాడ్డుతో తలపై బలంగా కొట్టారు. ( కోల్డ్ బ్లడెడ్ మర్డర్ : ఆచూకీ చెబితే ఎఫ్‌బీఐ రివార్డు ) ఊపిరాడని స్థితిలో.. రక్తం ఎక్కువగా పోవటంతో ఆమె అక్కడికక్కడే మృత్యువాత పడింది. తల్లి చనిపోయిందని నిర్థారించుకున్న మైనర్లు ఆమె శవాన్ని బాత్రూంలో పడేసి, పెంపుడు కుక్కను తీసుకుని అపార్ట్మెంట్ గార్డు దగ్గరకు పరిగెత్తారు. తమ ఇంట్లోకి చొరబడ్డ కొందరు దుండగులు తల్లిని కొట్టి చంపారని అతడితో చెప్పారు. గార్డు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం పోలీసుల విచారణలో ఆ ఇద్దరు మైనర్లు తల్లిని తామే చంపినట్లు ఒప్పుకున్నారు. -
అసెంబ్లీ ఆవరణలో నాగుపాములు
భువనేశ్వర్ : రాష్ట్ర శాసన సభ ఆవరణలో నాగు పాములు తిరుగాడుతూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ వ్యవధిలో వరుసగా రెండు సార్లు నాగు పాముల్ని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా సోమవారం అసెంబ్లీ కార్యాలయంలోని స్విమ్మింగ్ పూల్ పరిసరాల్లో పాము తిరుగాడుతున్నట్లు భద్రతా సిబ్బంది దృష్టిలో పడడంతో స్నేక్ హెల్ప్ లైన్‌కు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న సంస్థ ప్రతినిధి సువేందు మల్లిక్ ఆ ప్రాంతానికి చేరి స్విమ్మింగ్ పూల్‌లో మెట్ల మధ్య నక్కిన పామును మెలకువగా అదుపులోకి తీసుకున్నారు. అది 6 అడుగుల నాగుపాము అని నగర శివారులోని అటవీ ప్రాంతంలో దానిని సురక్షితంగా విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు. -
టెక్ మహీంద్ర ఆఫీసు మూత
భువనేశ్వర్ : కరోనా మహమ్మారి ప్రకంపనలు ప్రముఖ టెక్ సేవల సంస్థ టెక్ మహీంద్రను తాకాయి. గత వారంలో ఏడుగురు ఉద్యోగులు కరోనా బారిన పడటంతో ఒడిశా రాజధాని నగరం భువనేశ్వర్ లోని టెక్ మహీంద్ర కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంపీ) మంగళవారం నగరంలోని టెక్ మహీంద్ర క్యాంపస్‌కు సీలు వేసింది. (బజాజ్ ఆటోను వణికిస్తున్న కరోనా) కోవిడ్-19 కేసులను గుర్తించిన తరువాత శానిటైజేషన్ కోసం గురువారం వరకు సంస్థ కార్యాలయాన్ని 72 గంటలు మూసి వేసినట్లు బీఎంసీ నార్త్ జోనల్ డిప్యూటీ కమిషనర్ ప్రమోద్ కుమార్ ప్రస్టీ తెలిపారు. మొదటి కేసు జూన్ 29 న నమోదైనట్టు చెప్పారు. దీంతో 65 మంది ఉద్యోగులు హోం క్వారంటైన్ లో ఉన్నారని, అనుమానిత లక్షణాలు కనిపిస్తే కరోనా పరీక్షలు చేయించుకుంటారని ఆయన వెల్లడించారు. అలాగే కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా ఈ ఏడుగురు వ్యక్తులతో పరిచయం ఉన్న ఇతరులను వేరుచేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. (కరోనా వ్యాక్సిన్ : సినోవాక్ కీలక ప్రకటన) కాగా ఒడిశాలో మంగళవారం కేసుల సంఖ్య 10,000 మార్కును దాటింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 10,097 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 42 మంది మరణించారు. గత 24 గంటల్లో ఖుర్దాలో నమోదైన 37 కేసుల్లో 26 కేసులు భువనేశ్వర్ కు చెందినవేనని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. (కరోనా : శుభవార్త చెప్పిన మైలాన్) -
ఆసుపత్రి నిర్వాకం..పెరిగిన కరోనా కేసుల సంఖ్య
భువనేశ్వర్ : కోవిడ్ -19 మార్గదర్శకాలను ఉల్లంఘించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ ప్రైవేటు హాస్పిటల్ని అధికారులు బుధవారం సీజ్ చేశారు. ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్య ధోరణితో ఇప్పటిరకు 27 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. మాంచెస్టర్‌లోని బ్లూ వీల్ హాస్పిటల్లో ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ నిబంధనల్ని గాలికొదిలేశారు. కరోనా సోకిన బాధితుల్ని కూడా మిగతా సాధారణ రోగులతో కలిపి ఉంచారు. (కరోనాను అడ్డుకునే అత్యవసరాలు రైల్వే స్టేషన్లో లభ్యం ) సాధారణంగా అయితే వైరస్ సోకిన బాధుతుల్ని ఐసోలేషన్ వార్డుకు తరలించి ప్రత్యేకంగా చికిత్స అందిస్తారు. అంతేకాకుండా పీపీఈ కిట్, ఎన్95 మాస్క్ సహా పలు జాగ్రత్తలు పాటించి వైద్యం అందించాల్సి ఉంటుంది. కానీ బ్లూవీల్ ఆస్పత్రి వైద్యాధికారులు మాత్రం ఈ నిబంధనల్ని గాలికొదిలేసి సాధారణ రోగులతో సహా వీరిని కూడా ఒకే వార్డులో ఉంచారు. ఆకస్మిక తనఖీలు చేపట్టిన అధికారులు సైతం యాజమాన్యం ప్రదర్శించిన నిర్లక్ష్య ధోరణికి నివ్వెరపోయారు. మిగతా వారికి కూడా పరీక్షలు నిర్వహించగా 27 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆస్పత్రిని సీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. (రక్తం అవసరం ఉన్నవారికి ఇకపై సులభంగా ) -
లాక్‌డౌన్‌తో 6 కాస్తా 68..
సాక్షి, భువనేశ్వర్ : ఏడు రోజుల హనీమూన్ కోసం మలేషియా వెళ్లిన నవదంపతులు లాక్డౌన్ కారణంగా 68 రోజుల తరువాత ఇంటికి చేరారు. ఈ సంఘటన రాష్ట్రంలోని నవరంగపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. దంపతుల రాకతో వారి కుటుంబాల్లో ఆనందం నెలకొంది. నవరంగపూర్ ఇచ్చాగుడ గ్రామానికి చెందిన శంకర హల్దార్ అతడి భార్య పల్లవి మిశ్రాలు పెళ్లి తరువాత గత మార్చి 12వ తేదీన మలేషియా వెళ్లారు. హానీమూన్ ముగించుకొని మార్చి 17వ తేదీన భారత్ రావాల్సి ఉంది. అదే సమయంతో కరోనా వైరస్‌తో ప్రపంచం అంతా దాదాపు లాక్డౌన్లో ఉండటంతో వీరు మార్చి 17వ తేదీ రాత్రి మలేషియా విమానాశ్రయానికి స్వదేశం వచ్చేందుకు చేరుకున్నారు. అయితే అప్పటికే కరోన కారణంగా భారత్ దేశ ప్రభుత్వం విదేశాలకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసింది. ( తల్లి ప్రేమకు ప్రతీక ) దీంతో వారు విమానాశ్రయంలో చిక్కుకు పోయారు. మలేషియా ప్రభుత్వం అక్కడి ప్రయాణికులందరికి వసతి ఏర్పాటు చేసింది. భారత్ ప్రభుత్వం లాక్డౌన్ 4లో విదేశాలలో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించే కార్యక్రమంలో భాగంగా నవదంపతులు దాదాపు 68 రోజుల తరువాత శుక్రవారం భువనేశ్వర్ చేరుకున్నారు. దీంతో వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. -
గంటన్నర పాటు ట్రాక్టర్ కింద నలిగి..
భువనేశ్వర్ : ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఓ వ్యక్తి గంటన్నర పాటు ట్రాక్టర్ కింద నలిగి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన ఒరిస్సాలోని బొయిపరిగుడ సమితిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనివారం బొయిపరిగుడ సమితి దశమంతపూర్ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు గోరా మాలి, రమేష్ మాలిలు ట్రాక్టర్ నడపుకుంటూ అక్కడి జీడిమామిడి తోటకు బయలుదేరారు. ఆ సమయంలో ఓ పెద్ద గోతిలో పడ్డ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో తండ్రీకొడుకులిద్దరూ ట్రాక్టర్ ఇంజిన్ కింద పడ్డారు. ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. ఇది గమనించిన అక్కడివారు ట్రాక్టర్ క్రిందనుంచి గోరా మాలిని బయటకు తీశారు. అయితే రమేస్ మాలిని బయటకు తీయటానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కొద్దిసేపటి తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటన్నర కాలం పాటు ఇంజిన్ కింద నలిగిపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రమేష్‌ను జేసీబీ సహాయంతో బయటకు తీశారు. అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించారు. -
కే 4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం సక్సెస్..
భువనేశ్వర్ : అణు జలాంతర్గామి నుంచి 3500 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేధించేలా డీఆర్డీఓ అభివృద్ధి చేసిన కే 4 బాలిస్టిక్ క్షిపణిని విశాఖపట్నానికి 30 నాటికల్ మైళ్ల దూరంలోని సముద్ర జలాల్లో భారత్ ఆదివారం విజయవంతంగా ప్రయోగించింది. ఐఎన్ఎస్ అరిహంత్‌లో అమర్చేలా అభివృద్ధి చేసిన ఈ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం రెండేళ్లుగా పలుమార్లు విఫలమైన క్రమంలో తాజా ప్రయోగం విజయవంతం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 17 టన్నుల బరువుండే ఈ క్షిపణి రెండు టన్నుల వార్‌హెడ్‌ను మోసుకుపోగలదు. ఉన్నతమైన కచ్చితత్వాన్ని సాధించడమే ఈ క్షిపణి లక్ష్యమని డీఆర్డీఓ వెల్లడించింది. గత ఏడాది నవంబర్‌లో ఈ క్షిపణి ప్రయోగానికి సర్వం సిద్ధమైనా బంగాళాఖాతంలో బుల్బుల్ తుపాన్ ప్రభావంతో ప్రయోగం వాయిదా పడింది. అణు జలాంతర్గాముల్లో దీన్ని అమర్చే ముందు భారత్ ఈ క్షిపణిపై మరికొన్ని ప్రయోగాలు నిర్వహించే అవకాశం ఉంది. భారత్ తన జలాంతర్గాముల శ్రేణుల కోసం అభివృద్ధి చేస్తున్న రెండు అండర్‌వాటర్ క్షిపణుల్లో కే 4 క్షిపణి ఒకటి. -
ప్లాస్టిక్ తెచ్చి.. భోజనం చేసి వెళ్లండి
భువనేశ్వర్: ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడం, వాటి కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా అర కిలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి భోజన సదుపాయాన్ని కల్పిస్తోంది. ‘మీల్ ఫర్ ప్లాస్టిక్’ పేరిట చేస్తున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆహార్ పథకంలో చేర్చారు. దీని ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణతోపాటు భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు బీఎంసీ కమిషనర్ ప్రేమ్ చంద్ర చౌదరి తెలిపారు. -
టపాసులు పేల్చినందుకు వ్యక్తి దారుణ హత్య
భువనేశ్వర్ : దీపావళి పండగ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఎంతో సంబరంగా టపాసులు కాల్చుతున్న ఓ వ్యక్తికి ఆ సంతోషమే చివరి క్షణాలుగా మారాయి. టపాసులు కాల్చొద్దు అన్న మాట పట్టించుకోనందుకు కొంతమంది చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. రాజధాని సమీపంలోని సుందర్‌పాడ ప్రాంతంలో అమరేశ్ నాయక్ తన స్నేహితులతో కలిసి ఇంటి ముందు టపాసులు పేల్చుతున్నాడు. బాణాసంచా కాల్చుతుండగా ఆ దారిలో వెళ్తున్న కొంత మంది అమరేశ్ వద్దకు వచ్చి టపాకాయలు కాల్చనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. అది ఇరు వర్గాల మధ్య గొడవకు దారి తీయగా.. కోపానికి గురైన 15 మంది వ్యక్తులు మూకుమ్మడిగా అమరేశ్‌పై పదునైన ఆయుధాలతో దాడికి దిగారు. దీంతో సదరు వ్యక్తి అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు అమరేశ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా అతన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆ వ్యక్తి చనిపోయినట్లు తెలిపారు. దీపావళి నాడు జరిగిన ఘటనల్లో పలు ప్రాంతాల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. కియోంజార్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి దీపావళి పటాసులు కాల్చుతున్న క్రమంలో ఇంట్లో మంటలు చెలరేగడంతో మరణించగా, భద్రక్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఇంటిని అలంకరించే సమయంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. అనంతరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు. -
చంద్రయాన్-2 ముగిసినట్లే.. ఇక గగన్‌యాన్!
భువనేశ్వర్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోంది. చంద్రయాన్-2 ప్రయోగం 98శాతం విజయం సాధించిందన్న ఇస్రో ఛైర్మన్ శివన్.. ఇక తమ తదుపరి లక్ష్యం గగన్‌యాన్ అని ప్రకటించారు. శనివారం ఆయన ఐఐటీ భువనేశ్వర్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రయాన్-2లోని ఎనిమిది పరికరాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని వివరించారు. ఇక విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం తాము ఎంతో శ్రమించామని కానీ ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. చంద్రుడి దక్షిణధ్రువంపై శుక్రవారం-శనివారం అర్ధరాత్రి మధ్య రాత్రి సమయం ప్రారంభం కావడంతో విక్రమ్‌తో మళ్లీ సంబంధాలు ఏర్పరుచుకోవాలన్న ఇస్రో ఆశలు అడియాసలయిన విషయం తెలిసిందే. దీని నుంచి వెంటనే తేరుకున్న ఇస్రో ఇకతమ తదుపరి లక్ష్యం గగన్‌యాన్ అని స్పష్టం చేసింది. కాగా సాయుధ బలగాల్లోని టెస్ట్ పైలట్లను వ్యోమగాములుగా పంపాలని ఇస్రో భావిస్తోన్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టింది. ముగ్గురిని ఎంపిక చేసి తొలుత భారత్‌లో, తర్వాత రష్యాలో వీరికి ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నారు. గగన్‌యాన్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపితే.. స్వయంగా మానవులను అంతరిక్షంలోకి పంపిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. ఈ నేపథ్యంలో ఇస్రో ఈ ప్రయోగాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. విక్రమ్ ల్యాండర్ అసాధ్యమేనా.. ఈ నెల 7న చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో దిగుతూ విక్రమ్ ల్యాండర్ గల్లంతైన సంగతి తెలిసిందే. చంద్రుడి ఉపరితలంపై దిగుతున్న సమయంలో కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దానితో తిరిగి కమ్యూనికేషన్ పునరుద్ధరించేందుకు ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయత్నించినప్పటికీ.. అది సఫలం కాలేదు. ఆ ప్రదేశంలో 14 రోజుల పగటి సమయం శనివారం ఉదయంతో ముగిసిపోయింది. చంద్రుడిపై పగటివేళ 130 డిగ్రీల సెల్రియస్ ఉష్ణోగ్రతలు ఉండగా.. రాత్రి వేళ దాదాపు మైనస్ 200 డిగ్రీలకు అక్కడి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. విక్రమ్ ల్యాండర్.. అందులోని రోవర్ ఇంతటి చల్లటి వాతావరణాన్ని తట్టుకోలేవు. ఇక, 14 రోజుల తర్వాత పగటి సమయం మళ్లీ ప్రారంభమయ్యాక.. చంద్రయాన్-2 ఆర్బిటర్ మళ్లీ విక్రమ్ ల్యాండర్ కోసం వెతకనుంది. కానీ, అప్పటికీ విక్రమ్ దొరికే అవకాశాలు తక్కువేనని, మళ్లీ విక్రమ్‌తో కమ్యూనికేషన్ సంబంధాలు ఏర్పరుచుకోవడం అసాధ్యమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
బోల్ భం భక్తుల దుర్మరణం
భువనేశ్వర్: దీక్షయాత్రలో ఉన్న నలుగురు బోల్ భం భక్తులు వేర్వేరు ప్రాంతాల్లో శనివారం జరిగిన ప్రమాదాల్లో దుర్మరణం చెందారు. ఈ ప్రమాదాల్లో మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. మయూర్భంజ్ జిల్లా బంగిరిపొషి పోలీసు స్టేషన్ పరిధి దువార్‌సుణి గ్రామ ప్రాంతంలో బోల్ భం భక్తులు ప్రయాణిస్తున్న వాహనం ఎదురుగా వస్తున్న భారీ వాహనాన్ని ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. బలంగీరు జిల్లా గుప్తేశ్వర్ శైవ క్షేత్రానికి బోల్‌భం భక్తులు వెళ్తుండగా ఎదురుగా దూసుకువస్తున్న లారీని బోల్ భం భక్తుల వాహనం ఢీకొని దాదాపు 10 అడుగుల లోయలోకి పడిపోయింది. దీంతో వాహనంలో ఉన్న ఇద్దరు భక్తులు ఘటనాస్థలంలో తుదిశ్వాస విడిచారు. దుర్మరణం పాలైన బోల్ భం భక్తులను రంజిత్ రామ్, సిబ్బు సాహులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన 8మంది భక్తులను బరిపద ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. దుర్ఘటన సంభవించిన ప్రాంతంలో స్థానికులు తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఒక ప్రాంతం నదీ తీరం నుంచి జలం సేకరించి వేరే చోట శివాలయంలో జలాభిషేకం నిర్వహించేం దుకు బోల్ భం దీక్షకులు ప్రయాణిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ విషాద సంఘటన సంభవించింది. సంబల్పూర్ జిల్లాలో ఇద్దరి మృతి సంబల్పూర్ జిల్లాలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. బోల్‌భం భక్తులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడడంతో ప్రమాదం జరిగింది. బోల్‌భం భక్తులు సంబల్పూర్ నుంచి భువనేశ్వర్ వస్తుండగా బస్సు బోల్తా కొట్టింది. గాయపడిన వారందరినీ స్థానిక సంబల్పూర్ ఆస్పత్రిలో భర్తీ చేసి చికిత్స ప్రారంభించారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో బుర్లా మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. -
ఇంట్లో పాములు.. పొరుగిళ్లలో తలదాచుకుంటూ..
భువనేశ్వర్ : పిల్లాపాపలు తిరుగాడుతున్న ఆ ఇంటిలో నాగు పాముల సంతతి బయట పడింది. ఒకేచోట దాదాపు 24 నాగు పాములు దర్శనమివ్వటంతో ఆ కుటుంబానికి భయం పట్టుకుంది. ఇంట్లో ఉండలేక పొరుగిళ్లలో తలదాచుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ సంఘటన భద్రక్ జిల్లాలోని ధామ్‌నగర్ సమితి దిహుడి ఆనందపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆనందపూర్‌లో ఉంటున్న ఖగేశ్వర్ మహాకుడు అనే వ్యక్తి ఇంటిలో పెద్ద సంఖ్యలో నాగు పాములు బయటపడ్డాయి. తొలుత ఇంటిలోని ఓ కన్నం వద్ద చచ్చిన పాము పిల్ల వారి దృష్టిలో పడింది. అనంతరం ఇంకా కొన్ని నాగు పాము పిల్లలు అక్కడక్కడే తిరుగాడుతున్నట్లు కనిపించడంతో కుటుంబీకుల్లో భయాందోళన మొదలైంది. దీంతో వెంటనే స్థానిక స్నేక్ లైన్ వర్గానికి సమాచారం అందించారు. వారి సమాచారంతో అక్కడికి చేరుకున్న స్నేక్ లైన్ ప్రతినిధి షేక్ మీర్జా రంగంలోకి దిగి ఇంటిలో కాపురం పెట్టిన నాగు పాము సంతతి గుట్టను కనుగొన్నారు. ఒక్కొక్కటిగా వెలికి తీయగా తల్లి పాముతో పాటు 24 నాగు పాము పిల్లలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇంటిలో ఉండేందుకు కుటుంబీకులు భయపడుతున్నారు. ఇరుగు పొరుగు ఇళ్లల్లో తాత్కాలికంగా తలదాచుకుని పాముల కదలిక పట్ల నిఘా వేశారు. -
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
భువనేశ్వర్ : ఢిల్లీ - భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా ఖంటపడ రైల్వే స్టేషన్లో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. రైలు చివరి పెట్టె అయిన జనరేటర్ బోగిలో మంటలు చెలరేగాయి. దీన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే ఆ బోగిని వేరు చేసి మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రయాణికులేవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. Fire broke out in the power car of New Delhi-Bhubaneswar Rajdhani Express near Khantapada, Odisha. The fire has been brought under control and no casualties or injuries have been reported. As safety measure generator car has been detached. pic.twitter.com/stMB9yz5uf — ANI (@ANI) May 11, 2019 గత నెలలో ఇదే రైలులో కలుషిత ఆహారం తిని 20 మంది అస్వస్థతతకు గురయిన సంగతి తెలిసిందే. దాంతో అప్పటికప్పుడు రైలును బొకారో రైల్వే స్టేషన్లో ఆపి అస్వస్థతకు గురైన ప్రయాణికులకు చికిత్స అందించారు. -
రేపు ఒడిశాలో నరేంద్ర మోదీ పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ : ఫొని తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన ఒడిశాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆదివారం ఆయన ఒడిశాలో పర్యటించి, పరిస్థితిని సమీక్షించనున్నారు. ఈ మేరకు ప్రధాని శనివారం తన ట్వీటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. కాగా ఫొని తుపానుకు ఒడిశాలో ఎనిమిదిమంది మృతి చెందారు. Day after tomorrow, on the 6th morning, I will be going to Odisha to take stock of the situation arising in the wake of Cyclone Fani. — Chowkidar Narendra Modi (@narendramodi) 4 May 2019 మరోవైపు ఒడిశాలో ముందుజాగ్రత్త చర్యగా రైలు, విమాన సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. భువనేశ్వర్, కోల్‌కతా విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతోంది. భువనేశ్వర్, పర్యాటక క్షేత్రం పూరీ రైల్వేష్టేన్లు తీవ్ర గాలుల ధాటికి పూర్తిగా దెబ్బతిన్నాయి. పై కప్పులు ఎగిరిపోయాయి. ఇక వివిధ ప్రాంతాల్లో 34 సహాయక బృందాలు పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఫొని తుపాను గండం నుంచి బయటపడినా, భారీ వర్షాలు కురవడంతో ఒడిశాలో జన జీవనం స్తంభించిపోయింది. -
‘ఫొని’ భీభత్సం.. క్రేన్, బస్సు ఉఫ్!!.. వైరల్
భువనేశ్వర్ : వాయువేగంతో ఒడిశా తీరం వైపు దూసుకువచ్చిన ఫొని తుపాను శుక్రవారం ఉదయం పూరి సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో పూరి తీరప్రాంతంలో గంటకు 180–200 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ పెనుగాలుల దాటికి నిన్న భువనేశ్వర్‌లో భవననిర్మాణాలకు ఉపయోగించే పెద్ద క్రేన్ ఒకటి నేల కొరిగింది. అంతేకాకండా ఓ పెద్ద బస్సుసైతం గాలుల దాటికి అట్టముక్కలా కొట్టుకుపోయింది. ఇక బైకులు, చిన్న చిన్న వాహనాల సంగతైతే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫొని సృష్టించిన ప్రళయ కాల భీభత్సం దాటికి ఇప్పటివరకు 8 మంది మృత్యువాత పడగా.. వేలకోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. -
లోక్‌సభ బరిలోకి విద్యావేత్త సామంత
సాక్షి, భువనేశ్వర్ : సమాజంలో వెనకబడిన బడుగు వర్గాల విద్యావృద్ధిని కాంక్షించి ‘కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ), కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోసల్ సైన్సెస్ (కేఐఎస్ఎస్)’ ఉన్నత విద్యా సంస్థల స్థాపన ద్వారా విద్యారంగంలోనే విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఆధునిక విద్యావేత్త డాక్టర్ అచ్యుత సామంతకు తగిన గుర్తింపు లభించింది. స్నేహశీలిగా, మృదుభాషిగా, ఎస్సీ, ఎస్టీల విధాతగా ప్రశంసలు అందుకుంటున్న అచ్యుత సామంత సామాజిక సేవలకు గుర్తింపుగా ఆయనకు పార్టీ తరఫున కంధమాల్ లోక్‌సభ సీటును బీజూ జనతా దళ్ (బీజేడీ), ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేటాయించారు. ఇంతకుముందు ఆయన బీజేడీ తరఫునే రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. గతంలో సామాజిక రంగానికే పరిమితమై ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేసిన సామంత మొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. దళితులు ఎక్కువగా ఉన్న కంధమాల్ లోక్‌సభ సీటును తనకు కేటాయించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచినందుకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముకానీయకుండా దళితులు, క్రైస్తవుల సామాజికాభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఆయన ఆరు నెలల క్రితం క్రిస్టియన్ బాల బాలికల కోసం ‘కిస్’ బ్రాంచ్‌ను ఈ నియోజక వర్గంలో ప్రారంభించారు. కంధమాల్‌లో దళితులు ఎక్కువగా ఉన్నప్పటికీ రిజర్వ్డ్ సీటుకాదు. దళితులు, క్రైస్తవులకు పెన్నిదిగా, హిందువులకు స్నేహశీలిగా అన్నివర్గాల ప్రజలను ఆకర్షిస్తున్న అచ్యుత సామంతే అన్ని విధాల పోటీకి అర్హుడని భావించి ఆయన్ని లోక్‌సభ బరిలోకి పట్నాయక్ దించారు. విద్యావేత్తగా, సామాజిక విశిష్ట సేవకుడిగా సామంతకు అనేక అవార్డులు కూడా వచ్చాయి. -
ఫోటోగ్రాఫర్‌కు రాహుల్ చేయూత
భువనేశ్వర్ : తన కళ్లెదుట కింద పడిపోయిన ఫోటోగ్రాఫర్‌ను పైకి లేపేందుకు ఒక్క ఉదుటున కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కదిలిన వీడియో వైరల్ అవుతోంది. భువనేశ్వర్ విమానాశ్రయంలో శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి రాహుల్ స్పందించిన తీరును పలువురు ప్రశంశిస్తున్నారు. రాహుల్ ఫోటోగ్రాఫర్‌కు చేయూత ఇచ్చేందుకు కదిలిన తీరుపై కాంగ్రెస్ సభ్యులు హసీబా ప్రధాని నరేంద్ర మోదీని ఎండగట్టేందుకు ఉపయోగించుకున్నారు. కిందపడిన ఫోటోగ్రాఫర్‌కు సాయం అందించేందుకు కాంగ్రెస్ చీఫ్ ఎలా పరుగులుపెట్టారో చూడండి అంటూ ఆమె ట్వీట్ చేశారు. గతంలో మోదీ ప్రసంగిస్తుండగా ఆయన ఎదుటే ఓ పోలీస్ అధికారి కుప్పకూలినా ఆయన తన ప్రసంగం కొనసాగించిన ఘటనతో పోల్చుతూ ఇంత జరిగినా ఏమీ జరగనట్టే ప్రధాని అప్పట్లో తన ప్రసంగాన్ని కొనసాగించారని దుయ్యబట్టారు. ఒకరు ప్రాణాలు విడుస్తున్నా మోదీజీ పట్టించుకోకుండా తన ఉపన్యాసం కొనసాగిస్తారని ఆమె చురకలు వేశారు. మీ పక్కనున్న వ్యక్తి హఠాత్తుగా గుండె పోటుకు గురైతే మీరు ఆ వ్యక్తికి సాయపడేందుకు ఉద్యుక్తులవుతారు అయితే మన ప్రధాని అలా కాదంటూ అప్పటి వీడియోను పోస్ట్ చేశారు. కాగా 2013లో మోదీ గుజరాత్ సీఎంగా వ్యవహరిస్తున్న సమయంలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతుండగా అప్పటి రాష్ట్ర డీజీపీ అమితాబ్ పాథక్ ఒక్కసారిగా కుప్పకూలారు. ఆ తర్వాత తాను కుదుటపడ్డానని ఆయన చెప్పుకొచ్చారు. -
పూరీ బరిలో ప్రధాని మోదీ
భువనేశ్వర్ : ప్రధాని నరేంద్ర మోదీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒడిషాలోని పూరీ నుంచి బరిలో దిగుతారని ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే ప్రదీప్ పురోహిత్ చెప్పారు. పూరి స్ధానం నుంచి ప్రధాని పోటీ చేసే అవకాశాలు 90 శాతం ఉన్నాయని పురోహిత్ పేర్కొన్నారు. ఒడిషా రాష్ట్ర ప్రజలు ప్రధాని పూరీ లోక్‌సభ స్ధానం నుంచి పోటీచేయాలని కోరుతున్నారని, మోదీ సైతం పూరీ నుంచి పోటీకి మొగ్గుచూపే అవకాశం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్నాథ ఆలయం కొలువైన పూరీ నుంచి ప్రధాని మోదీని బరిలో దింపాలని బీజేపీ అగ్రనాయకత్వం యోచిస్తున్నదనే ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ నేత చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మోదీ జగన్నాధుడి ఆశీస్సులతోనే వారణాసి నుంచి విజయం సాధించారని, ఈసారి ఆయన పూరీ నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తారని బీజేపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఒడిషా ప్రజల పట్ల ప్రేమ కలిగిన ప్రధాని మోదీ ఈ ప్రాంత అభివృద్ధినీ కాంక్షిస్తారని చెప్పుకొచ్చారు. -
బుమ్రా, భువీ విశ్రాంతి అడిగారా?
నిరాశాజనకమైన ఇంగ్లండ్ సిరీస్ తర్వాత భారత జట్టు మళ్లీ టెస్టుల్లో విజయాల బాట పట్టాలని భావిస్తోంది. వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్ ఆ అవకాశం కల్పిస్తోంది. ఐదు టెస్టుల సిరీస్ తర్వాత రెండు మ్యాచ్‌ల సిరీస్ అంటే అర్థం లేనట్లుగా అనిపిస్తోంది. కానీ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో బిజీ షెడ్యూల్ కారణంగా అభిమానుల ఆశలకు అనుగుణంగా పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు నిర్వహించడం కష్టసాధ్యంగా మారిపోయింది. అయితే ఐదు టెస్టులు సాధ్యం కాకపోతే కనీసం మూడు టెస్టులన్నా నిర్వహించాల్సింది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఐదేళ్ల క్రితం సచిన్ వీడ్కోలు సిరీస్‌కు వచ్చిన వెస్టిండీస్ జట్టుకంటే ప్రస్తుత టీమ్ చాలా పటిష్టంగా ఉంది. కొంత మంది టి20 స్టార్లు లేకపోయినా వెస్టిండీస్ బ్యాటింగ్ బలంగానే కనిపిస్తోంది. ఊహించినట్లుగానే భారత్ ఓపెనర్ల జోడీని మార్చబోతోంది. మయాంక్ అగర్వాల్, పృథ్వీ షాలలో ఎవరు అరంగేట్రం చేస్తారనేది రాజ్‌కోట్‌లోనే తేలుతుంది. సొంతగడ్డపై భారీ స్కోరు చేసేందుకు పుజారాకు ఇది మరో అవకాశం కాగా, ఇంగ్లండ్‌లో తిరుగులేని ప్రదర్శన కనబర్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి అక్కడ చేజార్చుకున్న కొన్ని శతకాలను ఇక్కడ అందుకోవాలని భావిస్తుండవచ్చు. భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతినివ్వడం చాలా ఆశ్చర్యం కలిగించింది. తమ దృష్టిలో టెస్టు మ్యాచ్‌లకు ప్రాధాన్యత లేదని దీని ద్వారా సెలక్టర్లు చాటుకున్నారు. ఈ ఇద్దరు బౌలర్లూ తమకు విరామం కావాలని అడిగారా? నిజంగా విశ్రాంతి ఇవ్వాలనుకుంటే పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల నుంచి దూరంగా ఉంచాల్సింది తప్ప టెస్టుల నుంచి కాదు. టెస్టు క్రికెట్ మనుగడ సాగించాలంటే అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లు కచ్చితంగా బరిలోకి దిగాలి. వారిద్దరి గైర్హాజరు వల్ల శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ సిరాజ్‌లాంటి ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. తమ సత్తా ఏమిటో ప్రదర్శించి ఆస్ట్రేలియా సిరీస్‌కు కూడా చోటు ఖాయం చేసుకునేందుకు ఈ యువ పేసర్లకు ఇది మంచి అవకాశం. ఇంగ్లండ్‌తో తొలి నాలుగు టెస్టుల్లో ఐదుగురు బ్యాట్స్‌మెన్, ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగి భారత్ ఆ తర్వాత ఈ లెక్కను పక్కన పెట్టి చివరి టెస్టులో ఆరుగురు బ్యాట్స్‌మెన్‌తో ఆడింది. ఆఖరి టెస్టులో మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకుంటూ రిషభ్ పంత్ అద్భుతంగా ఆడిన తీరు చూస్తే... అశ్విన్ నాలుగు సెంచరీలు కూడా వెస్టిండీస్‌పైనే చేశాడనే విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటే మరోసారి భారత్ ఐదుగురు బౌలర్ల పాత వ్యూహాన్ని అమలు చేయవచ్చు. విండీస్‌తో 2013 టెస్టు సిరీస్ భారత్ దృష్టిలో మంచినీళ్ల ప్రాయంలా సాగింది. ఈ సిరీస్‌ను చాలా మంది ఆస్ట్రేలియా పర్యటనకు ముందు సన్నాహకంగా భావిస్తున్నా... మరీ అంత సులువుగా ఏమీ జరగదనేది నా అభిప్రాయం. -
క్లీన్ రైల్వేస్టేషన్‌గా భువనేశ్వర్
భువనేశ్వర్ : భారతీయ రైల్వే జాతీయ స్థాయిలో పరిశుభ్ర రైల్వే స్టేషన్ల జాబితాను మంగళవారం విడుదల చేసింది. మొదటి 10 ఉత్తమ పరిశుభ్ర రైల్వేస్టేషన్ల జాబితాలో భువనేశ్వర్‌కు స్థానం లభించింది. రైల్వేశాఖ రెండేళ్ల నుంచి ఉత్తమ పరిశుభ్ర రైల్వేస్టేషన్లను ఎంపిక చేస్తున్న విషయం తెలిసిందే. భారత నాణ్యతా మండలి(క్యూసీఐ) ఏటా ఈ జాబితాను విడుదల చేస్తుండడం విశేషం. ఎ–1 విభాగంలో జోధ్‌పూర్, జైపూర్, తిరుపతి మొదటి 3 స్థానాల్లో ఉత్తమ పరిశుభ్ర రైల్వేస్టేషన్లగా నిలిచాయి. ఎ–విభాగంలో మార్వార్, ఫులేరా, వరంగల్ మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. ఎ–1 విభాగంలో భువనేశ్వర్ రైల్వేస్టేషన్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఎ–1 విభాగంలో ఉత్తమ పరిశుభ్రత స్టేషన్ల జాబితాలో ఈస్టుకోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయం స్టేషన్ భువనేశ్వర్‌కు 9వ స్థానం ఎ–1 విభాగంలో పూరీ రైల్వేస్టేషన్ 37వ స్థానం నుంచి 22వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎ– విభాగం జాబితాలో కటక్ రైల్వేస్టేషన్‌కు 30వ స్థానం లభించింది. గతేడాది కటక్ రైల్వేస్టేషన్‌కు 100వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.జాతీయ స్థాయిలో 10 జోన్లు పరిశుభ్రత విషయంలో 10 నుంచి 20 శాతం పుంజుకోవడం విశేషం. 4 రైల్వేజోన్ పరిశుభ్రతలో 20 శాతం పుంజుకుంది. వాయువ్య రైల్వే ఈ జాబితాలో అగ్ర స్థానంలో నిలవగా దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్‌కోస్ట్ రైల్వే తర్వాతి రెండు స్థానాల్లో నిలిచాయి. ఎ–1 విభాగంలోని తొలి పది.. ఎ–1 విభాగంలో మొదటి 10 ఉత్తమ పరిశుభ్ర రైల్వేస్టేషన్ల జాబితాలో జోద్పూర్, జైపూర్, తిరుపతి, విజయవాడ, ఆనంద విహార్ టెర్మినల్, సికింద్రాబాద్ జంక్షన్, బంద్రా, హైదరాబాద్, భువనేశ్వర్, విశాఖపట్టణం ఉన్నాయి. ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో పలాస (20), బరంపురం (35), జాజ్‌పూర్–కెంజొహర్ రోడ్ (39), రాయగడ (64), ఖుర్దా (127), భద్రక్ (160), సంబల్పూర్ (239) ఉన్నాయి. -
చేజేతులా చేసుకున్నదే!
బ్యాటింగ్ ఎలా ఉన్నా... బౌలింగ్‌లో చేజేతులా వనరులను దెబ్బతీసుకున్నట్లు కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భువీ, బుమ్రా ఎంతటి ప్రభావం చూపారో తెలిసీ వారిని ఇంగ్లండ్ సిరీస్‌కు కాపాడుకోలేకపోయారు. ముఖ్యంగా భువీ సఫారీ గడ్డపై అటు బ్యాట్‌తోనూ ఆదుకున్నాడు. అలాంటివాడి ఫిట్‌నెస్‌పై ఐపీఎల్ సందర్భంగానే హెచ్చరికలు వచ్చాయి. ఎలాగూ పసికూనే అని అఫ్గానిస్తాన్‌తో టెస్టుకు విశ్రాంతినిచ్చారు. అప్పుడే భవిష్యత్ గురించి ఆలోచించి భువీ పూర్తిగా కోలుకునేలా చూడాల్సింది. అదేమీ లేకుండా, అందరినీ పరీక్షించాలంటూ ఐర్లాండ్‌తో రెండో టి20 ఆడించారు. సరిగ్గా ఇదే మ్యాచ్‌లో బరిలో దిగిన బుమ్రా వేలికి గాయం చేసుకుని ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు దూరమయ్యాడు. తర్వాతి మ్యాచ్‌లకూ కష్టమే అన్నట్లుంది. వాస్తవానికి ఐర్లాండ్ వంటి జట్టుపై వీరిద్దరు ఆడటం అనవసరం. అటు భువీ... ఇంగ్లండ్‌పై మొదటి టి20లో ధారాళంగా పరుగులిచ్చాడు. రెండో టి20లో ప్రారంభంలో కట్టుదిట్టంగా బంతులేసినా గెలిపించాల్సిన స్థితిలో చేతులెత్తేశాడు. మళ్లీ రెండు వన్డేలు విశ్రాంతినిచ్చి పెద్దగా అవసరం లేకున్నా చివరి వన్డే ఆడించారు. అందులో అతడు ఆసాంతం అసౌకర్యంగానే కనిపించాడు. ఇప్పుడు మూడు టెస్టులకు అందుబాటులో లేకుండా పోయాడు. బౌలింగ్‌లో వీరిద్దరూ టెస్టులకు పూర్తిస్థాయిలో ఉంటే, అటు బ్యాటింగ్ దన్నుతో పెద్దగా ఆందోళన ఉండకపోయేది. కానీ, ఇది తారుమారైంది. అంతా కలిసొచ్చి, తమదైన రోజున మాత్రమే ప్రతాపం చూపగల ఇషాంత్, ఉమేశ్‌లను, వ్యక్తిగత వివాదాలు, ఫామ్‌లేమి, ఫిట్నెస్ ఇబ్బందులతో సతమతం అవుతున్న మొహమ్మద్ షమీపై ఆధారపడాల్సి వస్తోంది. -
ఆర్తుల్ని ఆదుకోవాలి
భువనేశ్వర్ : రానున్నది విపత్తు కాలం. విపత్తు చెంతలో తలదాచుకుంటున్న వర్గాలను ఆదుకునేందుకు అనుబంధ యంత్రాంగాలు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. ఆయన అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విపత్తు నిర్వహణ సమావేశంలో మంత్రిమండలి సభ్యులు, ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని విభాగాల కార్యదర్శులు ఇతరేతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆకస్మిక విపత్తు తాండవించే ఊహాతీత పరిస్థితుల్లో గర్భిణులు, దివ్యాంగులు, వయోవృద్ధులు, వితంతువులు, పిల్లలు వగైరా వర్గాలపట్ల ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ వర్గాలను తక్షణమే అక్కున చేర్చుకుని విపత్తు నుంచి కడతేర్చాలని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సూచించారు. వాతావరణ కదలికను గమనించాలి ఈ ఏడాది వాతావరణంలో అవాంఛనీయ మార్పులు సంభవిస్తున్నాయి. రుతుపవనాలు నిర్ధారిత సమయం కంటే ముందుగా రాష్ట్రాన్ని తాకినప్పటికీ వానలు కనుమరుగ య్యాయి. వేసవి మరోసారి పునరావృతమై వాతావరణం వేధిస్తోంది. విపరీతమైన వేడి, ఉక్క పోత వంటి సహించ లేని వాతావరణం అల్లాడిస్తోంది. వానలు గాలిలో తేలిపోతున్నాయి. ఇటువంటి వాతావరణ మార్పుల పట్ల వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించడం అనివార్యం. స్థానిక ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ అనుసంధానంతో వ్యవసాయ శైలిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. ఏటా రాష్ట్రానికి ఏదో రీతిలో విపత్తు పీడించడం నిరవధికంగా జరుగుతోంది. గత ఏడాది రాష్ట్రంలో కరువు తాండవించడంతో పంటకు చీడ పట్టి వేధించిన పరిస్థితుల్ని ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖకు వేలెత్తి చూపారు. విపత్తు నిర్వహణ కంటే నివారణ ప్రధానంగా అనుబంధ వర్గాలు గుర్తించాలి. వాతావరణ స్థితిగతులకు అనుగుణంగా పొంచి ఉండే విపత్కర పరిస్థితుల్ని వ్యవసాయ పరిశోధకులు, నిపుణులతో సాంకేతిక, పాలన వర్గాలు అనుసంధానపరుచుకుని ముందుకు సాగితే విపత్తు నివారణ సాధ్యమవుతుందన్నారు. ప్రజల సంరక్షణతో పంటల సంరక్షణ కూడా అంతే అవసరంగా అధికారులు గుర్తించి విపత్తు నిర్వహణ కోసం నడుం బిగించి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. వానలు వచ్చినట్లు వచ్చి కనుమరుగయ్యాయి. వేసవి కంటే అధికంగా వేధిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలకు వేసవి సెలవుల్ని వరుసగా రెండు సార్లు పొడిగించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. పంచా యతీ రాజ్ విభాగం ఆధ్వర్యంలో జలాశయాలు, నీటి వనరుల సమీకరణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ మేరకు అదనపు నిధుల్ని ప్రభుత్వం కేటాయిస్తుందని బిజూ జనతా దళ్ నాయకుడు అమర ప్రసాద్ శత్పతి తెలిపారు. కాగితాలకే పరిమితం కాకూడదు: నర్సింగ మిశ్రా విపత్తు నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అభినందనీయం. ఈ నేపథ్యంలో తీర్మానించిన భావి కార్యాచరణ వాస్తవంగా అమలుచేసి విపత్తు నుంచి రక్షణ కల్పించాలి. సమావేశం తీర్మానాలు కలం–కాగిత పత్రాలకు పరిమితమైతే ప్రయోజనం ప్రాణాంతకంగా మారుతుందని ప్రధాన ప్రతిపక్ష నేత కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు నర్సింగ మిశ్రా తెలిపారు. -
రైల్వే బుక్లెట్పై ప్యూన్ పెయింటింగ్
రైల్వే శాఖలో అతను ఒక ప్యూన్. కానీ అతని చేతిలో ఉన్న అద్భుతమైన కళ ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అతను వేసిన ఒక పెయింటింగ్ ఏకంగా రైల్వేశాఖ ప్రచురించనున్న బుక్‌లెట్‌కు కవర్‌పేజీగా ఎంపికైంది. భువనేశ్వర్‌లోని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయంలో శ్యామ్ సుందర్ ప్యూన్‌గా పనిచేస్తున్నాడు. పెయింటింగ్‌లు వేయడం అతని హాబీ. ఇంటర్ రైల్వే పెయింటింగ్ పోటీల్లో శ్యామ్ సుందర్ చాలా సార్లు విజేతగా కూడా నిలిచాడు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని రైల్వే శాఖ మోదీ హయాంలో తాము సాధించిన విజయాలపై ఒక బుక్లెట్ తీసుకురానుంది. ఈ బుక్‌లెట్‌కు కవర్‌పేజీగా శ్యామ్ సుందర్ వేసిన ఆర్ట్ వర్క్‌ని రైల్వే శాఖ ఎంపిక చేసింది. మహాత్మాగాంధీ రైలు బోగీ దిగుతూ ఉంటే, ఆయనకు స్వాగతం పలకడానికి అభిమానులు ప్లాట్‌ఫామ్‌పై గుమిగూడి ఉన్న దృశ్యాన్ని శ్యామ్ సుందర్ పెయింటింగ్‌గా వేశారు. కవర్ పేజీ కోసం ఎన్నో చిత్రాలను పరిశీలించిన రైల్వేశాఖ చివరికి ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. అంత అద్భుతమైన చిత్రాన్ని వేసినందుకు శ్యామ్ సుందర్‌ని ఢిల్లీకి రప్పించి సన్మానించింది. ‘నేను గత పదేళ్లుగా రైల్వే శాఖలో పనిచేస్తున్నాను. ఈ చిత్రం గీయడానికి శ్రమపడ్డాను. మొదటి రెండు సార్లు చిత్రాన్ని తిరస్కరించారు. మొదటిసారి గాంధీ కెమెరా వైపు చూస్తున్నట్టు ఉండడంతో వద్దన్నారు. ఆ తర్వాత గీసిన దాంట్లో గాంధీ ముఖం సరిగా రాలేదు. ఇక మూడోసారి గీసిన ఈ పెయింటింగ్ ఎంపికైంది. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ పెయింటింగ్ చాలా బాగుందని ప్రశంసించడం మరచిపోలేని అనుభూతి‘ అని శ్యామ్ సుందర్ అన్నాడు. రైల్వే శాఖ నుంచి ఇంతటి అపూర్వమైన గౌరవం దక్కినందుకు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడు. -
రాజధానిలో నయా ట్రాఫిక్
భువనేశ్వర్ : నగరంలో అత్యాధునిక ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను త్వరలో ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. నగరవ్యాప్తంగా ట్రాఫిక్ నియంత్రణను కేంద్రీకృతం చేయడం కొత్త వ్యవస్థ ధ్యేయం. ఈ వ్యవస్థలో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటవుతుంది. జాతీయ స్థాయి స్మార్టసిటీల్లో తొలిసారిగా భువనేశ్వర్‌లో ట్రాఫిక్ నియంత్రణ కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు కావడం విశేషం. ట్రాఫిక్ నియంత్రణతో రహదారి దుర్ఘటనల నివారణకు ఈ వ్యవస్థ దోహదపడుతుంది. భువనేశ్వర్ అభివృద్ధి సంస్థ (బీడీఏ) ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ఆ సంస్థ ఇటీవల ట్విటర్లో ప్రాథమిక సమాచారం జారీ చేసింది. నగరంలో మారు మూల ప్రాంతాల్లో ట్రాఫిక్ రవాణాపట్ల ఈ వ్యవస్థ దృష్టి సారిస్తుంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ట్రాఫిక్ వ్యవస్థతో పాటు అత్యవసర సేవల్ని కూడా ఈ కేంద్రం నుంచి నిర్వహిస్తారు. పలు ప్రపంచ దేశాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణ జరుగుతోంది. కమాండ్ కేంద్రంలో భారీ తెరతో సీసీటీవీ కెమెరాతో అనుసంధానపరిచిన వ్యవస్థ పనిచేస్తుంది. నగరంలోని మారుమూల ప్రాంతాల్లో ట్రాఫిక్ కదలిక ఈ తెరపై ప్రదర్శితమవుతుంది. నగరవ్యాప్తంగా జన సందోహిత ప్రాంతాల్లో ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. వీటితో కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానపరుస్తారు. స్మార్ట్‌సిటీగా గుర్తింపు సాధించిన నగరంలో జనాభాతో పాటు వాహనాల రద్దీ కూడా నిత్యం పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ప్రతిష్టంభనతో తరచూ రహదారి దుర్ఘటనలు సంభవిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా కొనసాగుతున్న సౌర శక్తి ట్రాఫిక్ వ్యవస్థను విస్తరించి కమాండ్ కంట్రోల్ సెంటర్‌గా మలిచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు భువనేశ్వర్ నగర అభివృద్ధి సంస్థ పేర్కొంది. -
రాజధానిలో ... నగల షాపులో చోరీ
బరంపురం : రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని ఓ బంగారం దుకాణంలో జరిగిన ఆభరణాల చోరీ కేసులో సంబంధిత నిందితులైన నలుగురు మహిళలతో పాటు బంగారం కొన్న వ్యక్తిని బరంపురంలో పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ సంఘటన నగరంలో సంచలనం రేపింది. ఈ సందర్భంగా పోలీసు అధికారులు అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 18వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా రాజధాని భువనేశ్వర్‌లోని లింగరాజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల సమంతపూర్ దగ్గర ఉన్న దేవి దుర్గా జ్యుయలర్స్‌లో ముగ్గురు మహిళలు బంగారం కొనేందుకు వెళ్లగా మరో మహిళ బంగారం దుకాణం బయట పర్యవేక్షించింది. లోన ముగ్గురు మహిళలు బంగారం ఆభరణాన్ని లూటీ చేసి తప్పించుకుని వచ్చారు. జరిగిన సంఘటనపై బంగారం దుకాణం యాజమన్యం లింగరాజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దొంగలను పట్టించిన సీసీటీవీ దీంతో కేసు నమోదు చేసి పోలీస్ కమిషనరేట్ సవాల్‌గా తీసుకుని ఈ కేసును ఛేదించేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని నియమించింది. దర్యాప్తులో భాగంగా లూటీ జరిగిన దుకాణంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించి ఫొటోలు సేకరించారు. ఇటీవల బంగారం దుకాణాల్లో జరిగిన లూటీకి సంబంధించి ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిజాలు వెలుగులోకి వచ్చాయి. లూటీ చేసిన మహిళలను బరంపురం నగరంలోని హరడాఖండి బౌరి వీధికి చెందిన వారుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో శనివారం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక పోలీసు బృందం వచ్చి పెద్ద బజార్ పోలీసుల సహాయంతో నిందితులైన నలుగురు మహిళలను అరెస్ట్ చేసి పెద్ద బజార్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా లూటీ చేసిన బంగారం అభరణం కొన్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలియజేశారు. అరెస్ట్ అయిన మహిళలను హరడాఖండిలోని బౌరి వీధికి చెందిన జుమ్మురి దాస్, జుమ్మిరి బెహరా, సుశీల దాస్, సంజు బెహరాలుగా గుర్తించామని ఐఐసీ అధికారి సురేష్ త్రిపాఠి చెప్పారు. ఈ మహిళలు గతంలో కూడా రాష్ట్రంలోని వివిధ బంగారం దుకాణాల్లో నగలు లూటీ చేసిన కేసుల్లో పలుమార్లు అరెస్ట్ అయి జైల్‌కు వెళ్లినట్లు చెప్పారు. -
ఇంతులకు ఎంతగానో..
భువనేశ్వర్ : రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడం ప్రధాన ధ్యేయమని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శాసన సభలో ప్రకటించారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన వాయిదా తీర్మానంపై ఆయన సమగ్ర వివరాల్ని సభలో ప్రవేశ పెట్టారు. రాష్ట్ర హోం శాఖ బాధ్యతలు ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నందున వాయిదా తీర్మానంపట్ల ఆయన సమగ్ర సమాచారాన్ని సభలో తెలియజేశారు. బడ్జెట్ మలివిడత సమావేశాలు తరచూ వాయిదా పడుతున్నాయి. మహా నది జలాల పంపిణీ వివాదం, జగన్నాథుని ఉపవాసం వగైరా శీర్షికలతో సభా కార్యక్రమాలు వాయిదాపడిన విషయం విదితమే. జగన్నాథుని సేవల్లో అవాంఛనీయ జాప్యం వివాదాన్ని పురస్కరించుకుని రెండు రోజులుగా సభా కార్యక్రమాలు స్తంభించాయి. స్పీకర్ ప్రదీప్ కుమార్ ఆమత్ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం నిర్వహించడంతో ఈ విచారకర పరిస్థితులకు తెరపడింది. శుక్రవారం సభా కార్యక్రమాలు తొలినుంచి సజావుగా సాగాయి. మహిళలపట్ల నేరాలు, శాంతి భద్రతల శీర్షికతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాసన సభా పక్ష నాయకుడు నర్సింగ మిశ్రా సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్పీకర్ ఆమోదంతో ఈ తీర్మానంపై సభలో సుదీర్ఘంగా చర్చ సాగింది. రాష్ట్రంలో పలు చోట్ల మహిళలకు వ్యతిరేకంగా నమోదైన కేసులపట్ల తమ విభాగం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని సీఎం చెప్పారు. ఇటువంటి 943 కేసుల్ని రెడ్ ఫ్లాగ్ కేసులుగా గుర్తించి అత్యధిక ప్రాధాన్యం కల్పించామన్నారు. మహిళలపై వేధింపుల కేసులపట్ల విభాగం ఘాటుగా స్పందిస్తోందన్నారు. రాష్ట్రంలో 6 మహిళా పోలీస్ స్టేషన్లు మహిళల అక్రమ రవాణాను నివా రించడంలో జాతీయ స్థాయిలో రా ష్ట్రం అగ్ర స్థానంలో నిలిచిందన్నా రు. రాష్ట్రవ్యాప్తంగా 537 పోలీసు స్టేషన్లలో మహిళా సహాయ డెస్కుల్ని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి సభకు వివరించారు. మహిళల భద్రతా వ్యవస్థను పటిష్టపరిచేందు కు 6 మహిళా పోలీసు స్టేషన్లు పనిచేస్తున్నాయి. మహిళలు, శిశువులు, బలహీన వర్గాలకు భద్రత కల్పి ంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం కల్పి స్తుంది. కేసుల నమోదు, ఉన్నత స్థాయి దర్యాప్తు, సత్వర సముచిత న్యాయం కల్పించడంలో పోలీసు వ్యవస్థ చురుగ్గా పనిచేయడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కేసుల విచారణలో జాప్యం లేదు మహిళలు, బాలికలపట్ల అమానుష దాడులు వగైరా నేరాలకు పాల్పడిన నిందితులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టడంలో విభాగం ఏమాత్రం సంకోచించడం లేదన్నారు. ఉన్నత స్థాయి దర్యాప్తు అధికారులు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించి కేసుల విచారణలో జాప్యాన్ని నివారిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యల నివారణపట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి మేధా శక్తిని సమన్వయపరచి నిరవధికంగా కృషి చేస్తుందని ముఖ్యమంత్రి వివరించారు. పార్టీ, రాజకీయాలకు అతీతంగా సభ్యులంతా రాష్ట్ర ప్రజల రక్షణ, భద్రత వ్యవహారాల కార్యాచరణలో స్వచ్ఛందంగా పాలుపంచుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తగ్గిన మావోయిస్టుల హింస రాష్ట్రంలో మావోయిజం తగ్గుముఖం పట్టిందని హోమ్ శాఖ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శాసనసభలో ప్రకటించారు. రాష్ట్రంలోని 6 మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో మావోయిజాన్ని పూర్తిగా నివారించినట్లు సభకు వివరించారు. ఈ జాబితాలో కెంజొహర్, మయూర్భంజ్, గజపతి, జాజ్‌పూర్, ఢెంకనాల్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ జిల్లాలు మావోయిస్టుల కబ్జా నుంచి విముక్తి పొందినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయాన్ని సభలో వివరించారు. సాధారణ ప్రజానీకంపట్ల మావోయిస్టుల హింసలు గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు వివరించారు. షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, భారీ స్థాయి దుకాణాలు ఇతరేతర జన సందోహిత ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయడం నేర నియంత్రణకు ఎంతగానో దోహదపడుతోందంటూ ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తప్పి పోయిన 8,118 మంది శిశువుల్ని పలు ప్రాంతాల్లో గుర్తించి ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన ముష్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలు విజయవంతమైనట్లు ముఖ్యమంత్రి సంతృత్తి వ్యక్తం చేశారు. -
రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్తటీమ్
భువనేశ్వర్ : రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీకి కొత్త కార్యవర్గం నియామకం జరిగింది. పీసీసీ అధ్యక్షుడిగా నిరంజన్ పట్నాయక్ నియమితులయ్యారు. ప్రసాద్ హరిచందన్ స్థానంలో ఆయన నియామకం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నొబొ కిషోర్ దాస్, చిరంజీవ్ బిశ్వాల్, పార్లమెంట్ మాజీ సభ్యుడు ప్రదీప్ మఝి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర శాఖ వ్యవహారాల ఇన్చార్జి జితేంద్ర సింగ్‌లు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయిన తర్వాత ఈ నియామకం జరిగింది. ఎమ్మెల్యేలు నొబొ కిషోర్ దాస్, చిరంజీవ్ బిశ్వాల్, పార్లమెంట్ మాజీ సభ్యుడు ప్రదీప్ మఝి రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పార్టీని పటిష్ట పరుస్తా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మనోగతాలకు పార్టీ హై కమాండ్ రాహుల్ గాంధీ పరిగణనలోకి తీసుకుని తనను పీసీసీ అధ్యక్షుడిగా నియమించడంపట్ల కొత్త అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ హర్షం వ్యక్తం చేశారు. పార్టీని రాష్ట్రంలో పటిష్టపరచడమే తన ప్రధాన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం కృషి చేస్తానని తెలిపారు. నిరుద్యోగం, రైతులు, దళితులు, నీటి ఎద్దడి, మహా నది జలాల పంపిణీ వివాదం వంటిక కీలకమైన సమస్యల పట్ల పార్టీ దృష్టి సారిస్తుందని వివరించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఉభయ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే ప్రధాన కార్యాచరణగా పేర్కొన్నారు. ఇతర సభ్యులు వీరే.. మాజీ పార్లమెంట్ సభ్యుడు భక్త చరణ్ దాస్‌ను ప్రచార కమిటీ అధ్యక్షుడిగా నియమించారు.పార్టీ రాష్ట్ర శాఖ వ్యవహారాల ఇన్చార్జి జితేంద్ర సింగ్‌ను సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా అదనపు బాధ్యతలు కేటాయించారు. రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగన్నాథ్ పట్నాయక్‌ను సమన్వయ కమిటీ కన్వీనర్‌గా నియమించారు. కోర్ కమిటీ అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు జయదేవ్ జెనా, ఈ కమిటీ కన్వీనర్‌గా రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్, క్రమ శిక్షణ కమిటీ అధ్యక్షుడిగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్, సీనియర్ నాయకుడు శరత్ రౌత్ కన్వీనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బర్గడ్ జిల్లా ఉప ఎన్నికలో పార్టీ వైఫల్యాల దృష్ట్యా రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త కార్యవర్గం నియామకం జరుగుతుందని మాజీ అధ్యక్షుడు ప్రసాద్ హరిచందన్ ముందస్తు సంకేతాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తాజా నియామకాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
అలో..అలో...
భువనేశ్వర్: రాష్ట్రవ్యాప్తంగా మహిళా రైతులకు ప్రభుత్వం స్మార్ట్ఫోన్లు పంపిణీ చేస్తుంది. రాష్ట్ర సహకార శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం మహిళా రైతులకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ విభాగం మంత్రి సూర్య నారాయణ పాత్రో తెలిపారు. రానున్న ఖరీఫ్ సీజన్లో స్టార్ట్‌ఫోన్ల పంపిణీని ప్రారంభిస్తారు. వ్యవసాయ రుణాలు, వాతావరణం, వ్యవసాయ ఉత్పాదనల విక్రయాలు, ఇతరేతర వ్యవసాయ సంబంధిత సమాచారం స్మార్ట్ఫోన్లలో లభ్యమవుతుందని మంత్రి వివరించారు. స్మార్ట్‌ఫోన్ కోరుకునే వారు ఆన్లైన్లో వారి పేరు, తదితర వివరాల్ని నమోదు చేసుకోవాలని మంత్రి తెలియజేశారు. తొలి విడతలో 70 శాతం మహిళా రైతులకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేసేందుకు తమ విభాగం రంగం సిద్ధం చేసిందని చెప్పారు. స్మార్ట్‌ఫోన్ సమాచారంతో మహిళారైతులు వ్యవసాయ రంగంలో మెలకువలు తెలుసుకుని అభివృద్ధి చెందుతారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ సాగుకు వ్యవసాయ రుణాల మంజూరు కోసం ఆ విభాగం మంత్రిత్వ శాఖ ముందస్తుగా తయారైంది. ఈ ఏడాది రూ.7,600 కోట్లు వ్యవసాయ రుణాలుగా మంజూరు చేస్తారని మంత్రి తెలిపారు. ఈ మేరకు పత్రికా ప్రకటనలు కూడా జారీ చేశామన్నారు. రైతులు తమ వివరాల్ని నమోదు చేసుకోవాలని మంత్రి అభ్యర్థించారు. -
అసెంబ్లీలో చిత్ర విచిత్ర పరిస్థితులు
భువనేశ్వర్ : రాష్ట్ర శాసనసభలో చిత్ర విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికార పక్షం బిజూ జనతా దళ్ ప్రగల్భాలు బట్టబయలవుతున్నాయి. న్యాయసమ్మతమైన శీర్షికలతో ప్రతిపక్షాలు సభలో ప్రస్తావించినా సభా కార్యక్రమాలకు పరోక్షంగా గండి కొట్టిస్తున్నందున ఇటీవల వరుసగా 3 రోజులపాటు అమూల్యమైన సభా కార్యక్రమాలకు నిరవధికంగా గండిపడిన సంగతి తెలిసిందే. మొత్తం మీద ఈ వివాదానికి తెరదించి తదుపరి సభా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగించేందుకు సభలో సభ్యుల గైర్హాజరు మరో ప్రధాన సమస్యగా నిలుస్తోంది. ప్రభుత్వం తప్పిదాలే కారణం రాజ్యాంగబద్ధమైన కార్యాచరణలో ప్రభుత్వం తప్పటడుగు వేసి ప్రతిపక్షాల్ని ప్రేరేపించి సభా కార్యక్రమాలకు గండి కొట్టిస్తున్న విషయాన్ని తాజా సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఏదోలా ప్రతిపక్షాలను బుజ్జగించి సభలో శాంతియుత వాతావరణం పునరుద్ధరించే సమయానికి అధికార పక్షం సభ్యులు సభా కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారు. దీంతో సభలో కనీస సభ్యుల హాజరు కొరవడుతోంది. బడ్జెట్ సమావేశంలో అత్యంత కీలకమైన బిల్లుల ఆమోదానికి ఈ పరిస్థితులు ప్రతికూలంగా నిలుస్తున్నాయి. ఇటువంటి దయనీయ పరిస్థితి గురువారం ఎదురైంది. లోకాయుక్త నియామకం జాప్యంపట్ల చెలరేగిన వివాదం అఖిల పక్ష సమావేశం తీర్మానం తర్వాత సభా కార్యక్రమాల నిర్వహణకు అనుకూలత ఏర్పడింది. ఈ సమయంలో అధికార పక్షం సభ్యులు సభలో అదృశ్యమయ్యారు. సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యే సమయానికి సభలో నామమాత్రంగా 9 మంది సభ్యులు మాత్రమే దర్శనమిచ్చారు. మిగిలిన సభ్యులు అంతా సభా ప్రాంగణంలోకి విచ్చేసి హాజరు కావలసిందిగా స్పీకర్ అభ్యర్థించాల్సిన దయనీయ పరిస్థితులు తాండవించడం విచారకరం. సభా కార్యక్రమాలకు గంటమోగినా సభ్యుల జాడ కనబడకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. గంట మోగిన ఒక నిమిషం తర్వాత సభలో సభ్యుల సంఖ్య మెల్లగా 10కి చేరుకుంది. మరో 2 నిమిషాల తర్వాత సభ్యుల హాజరు క్రమంగా 14 మంది వరకు పుంజుకుంది. సాయంత్రం 6.37 గంటల ప్రాంతంలో బడ్జెట్ వంటి కీలకమైన అంశంపై సభలో చర్చ సాగుతుండగా కోరం కొరత కనిపించడం విచారకరం. ప్రతిపక్షాల పెదవి విరుపు సభ్యుల గైర్హాజరు పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ పెదవి విరిచింది. సభలో బిల్లుల వ్యవహారాన్ని నిరవధికంగా నిర్వహించేందుకు కోరం లేకపోవడం విడ్డూరం. ఇటువంటి దయనీయ పరిస్థితుల నివారణపట్ల స్పీకర్ స్పందించాల్సి ఉందని కాంగ్రెస్ అభ్యర్థి, ఆలీ నియోజక వర్గం సభ్యుడు దేవేంద్ర శర్మ అభ్యర్థించారు. బడ్జెట్ సమావేశాల్లో మంత్రుల గైర్హాజరుపట్ల ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి మౌనంగా వాకౌట్ చేశారు. -
సెల్‌ఫోన్స్‌పై ఆంక్షలు ఉన్నట్టుగా తెలీదు
-
భువనేశ్వర్‌లో జాతీయ స్థాయి ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్
– స్టాళ్ల ఏర్పాటునకు దరఖాస్తుల ఆహ్వానం – పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు కర్నూలు(ఓల్డ్‌సిటీ): ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో జాతీయ స్థాయి ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు తెలిపారు. బుధవారం ఆయన తన చాంబరులో ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన బ్రోచర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమాన్ని తూర్పు భారత ఫిలాటలిస్ట్ అసోసియేషన్ వారు తపాలా శాఖ సహకారంతో 30.9.16 నుంచి 2.10.16వ తేదీ వరకు ( మూడు రోజుల పాటు) నిర్వహిస్తారన్నారు. ఉత్తమంగా ఎంపికైన స్టాళ్లకు బహుమతులు ఉంటాయని తెలిపారు. వయస్సు 11 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న వారిని యూత్ కేటగిరీ, 19 ఏళ్లు ఆపైన వయస్సు కలిగిన వారిని సీనియర్ కేటగిరీగా పరిగణిస్తామన్నారు. సీనియర్ కేటగిరీ వారు ఒక్కో ఫ్రేమ్‌కు రూ. 200 రుసుం చెల్లించాల్సి ఉంటుందని, యూత్ కేటగిరీకి ఉచితమని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు రెండు దరఖాస్తు ఫారాల ప్రతులను ‘ఆర్గనైజింగ్ సెక్రటరీ, నేచరెపెక్స్–2016, సి–6, ఐఆర్సీ విలేజ్, భువనేశ్వర్ – 751 015.’ చిరునామాకు 12.8.16వ తేదీ లోపు పంపించుకోవాలని వివరించారు. మరిన్ని వివరాలకు కర్నూలు పోస్టల్ సూపరింటెండెంట్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సి.హెచ్.శ్రీనివాస్, పోస్టుమాస్టర్ వై.డేవిడ్, స్టాంప్స్ ట్రెజరర్ నాగవెంకటేశ్వర్లు, ఫిలాటెలీ విభాగపు ఉద్యోగినులు లలిత, సౌందర్య తదితరులు పాల్గొన్నారు. -
మూత్ర విసర్జన చేస్తుంటే.. తుపాకీతో కాల్చాడు
భువనేశ్వర్: ఆసుపత్రి ముందు మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని ఓ డాక్టర్ కాల్చిన సంఘటన ఆదివారం ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తే.. దారిన వెళ్తున్న ఓ వ్యక్తి ఆసుపత్రి ముందు మూత్ర విసర్జన చేశాడు. ఇది తట్టుకోలేని ఆసుపత్రి డాక్టర్ రివాల్వర్ తో అతని ఎడమకాలు మోకాలి కింద కాల్చాడు. బుల్లెట్ తగలడంతో వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు డాక్టర్ ను అరెస్టు చేసి రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు. -
మూత్ర విసర్జన చేస్తుంటే.. తుపాకీతో కాల్చాడు
-
షమీ మళ్లీ అవుట్... భారత జట్టులో భువనేశ్వర్
గాయం కారణంగా పది నెలలు భారత జట్టుకు దూరమై తిరిగి ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన పేసర్ మొహమ్మద్ షమీ మళ్లీ గాయపడ్డాడు. ఎడమ తొడ కండరాల గాయం కారణంగా అతనికి కనీసం 4 నుంచి 6 వారాలు విశ్రాంతి అవసరమని, అందుకే స్వదేశానికి వెళుతున్నాడని జట్టు ప్రకటించింది. ఆస్ట్రేలియా వెళ్లాక తొలి ప్రాక్టీస్ సెషన్లోనే అతను గాయపడ్డాడు. షమీ స్థానంలో పేసర్ భువనేశ్వర్ భారత జట్టులోకి వచ్చాడు. ఐదు వన్డేలు, మూడు టి20ల ఈ సిరీస్ ఈనెల 12 నుంచి జరుగుతుంది. -
భద్రతకే పెద్దపీట!
2015 నవకళేబర ఉత్సవానికి భారీ సన్నాహాలు 10వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత 150 సీసీ కెమెరాలతో నిఘా సింహద్వారం, దక్షిణ ద్వారాలకు స్కానర్లు సాగరతీరంలో 25 వాచ్టవర్లు నగరంలో 5 చోట్ల ఫిర్యాదుల బాక్సులు భువనేశ్వర్: శ్రీజగన్నాథుని నవకళేబర ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, దేవస్థాన యంత్రాంగాలు సంయుక్తంగా సన్నాహాలు చేపట్టాయి. యాత్రికుల భద్రతే లక్ష్యంగా పూరీ జిల్లా పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఉత్సవానికి దేశ, విదేశాల నుంచి 50 లక్షలుపైగా యాత్రికులు వస్తారని అంచనా. ఉత్సవ కార్యక్రమాల సమన్వయం కోసం పోలీసు శాఖ 14 కమిటీలను ఏర్పాటు చేస్తోంది. వీటిలో సాగరతీరం రక్షణ, జనసందోహిత నిర్వహణ, రథాల రక్షణ, ట్రాఫిక్ నిర్వహణ కమిటీలు ప్రధానమైనవి. అనుభవజ్ఞులైన పోలీసు అధికారులు పర్యవేక్షకులుగా వ్యవహిరించే కమిటీల పనితీరును 15 రోజులకోసారి సమీక్షిస్తారు. పట్టణంలో ప్రముఖ రహదారుల మరమ్మతులు పూర్తయితే ట్రాఫిక్ నిర్వహణ పనులు చేపడతారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల నుంచి ట్రాఫిక్ నిర్వహణ పనులకు శ్రీకారం చుడతారు. వాహనాల రద్దీ నియంత్రణకు పట్టణ పరిసరాల్లో 32 ప్రాంతాల్లో పార్కింగ్ కేంద్రాల్ని ఖరారు చేశారు. వీటిలో 24 పార్కింగ్ కేంద్రాలు పట్టణం నడిబొడ్డులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మాలతీపట్టొపూర్ నుంచి ఒఠొరొనొలా మధ్యలో ప్రైవే ట్ పార్కింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీమందిరానికి కట్టుదిట్టమైన భద్రత శ్రీమందిరానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు పోలీసు యంత్రాంగం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఉగ్రవాద ముప్పు ఉండడంతో జల, స్థల, ఆకాశ మార్గాల్లో శ్రీమందిరానికి గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు (ర్యాఫ్), స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజీ), నేషనల్ సెక్యురిటీ ఫోర్స్ (ఎన్ఎస్ఎఫ్), ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలతో ప్రత్యేక స్క్వాడ్ ఉగ్రవాద దాడులపట్ల నిఘా ఏర్పాటు చేశారు. సముద్ర మార్గం గుండా ఉగ్రవాద ముప్పు నివారణకు కోస్టుగార్డు విభాగం సహాయం కోరుతూ లేఖరాసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. శ్రీమందిరం ప్రాంగణంలో బలమైన 32 సీసీటీవీ కెమెరాల్ని అమర్చుతారు. మాలతీపట్టొపూర్-శ్రీమందిర్, చక్రతీర్థరోడ్-సుబాష్బోస్ ఛక్ మీదుగా శ్రీమందిర్‌కు అనుసంధానపరిచే మార్గాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటవుతాయి. మొత్తం 150 సీసీటీవీ కెమెరాల్ని వినియోగిస్తారు. వీటిని నియంత్రించేందుకు టౌన్ ఠాణాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు. కంట్రోల్ రూమ్ నిర్వహణకు 25 మంది సిబ్బందిని నియమిస్తారు. ఈ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కల్పిస్తారు. ఏప్రిల్ నెల నాటికి శిక్షణ పూర్తి చేసి మే నెల నుంచి కంట్రోల్ రూమ్ నిర్వహణకు నియమిస్తారు. శ్రీమందిరం దక్షిణ ద్వారం గుండా పోటు కేంద్రానికి తరలి వెళ్లే సామగ్రి తనిఖీ కోసం ప్రత్యేకంగా స్కానర్ ఏర్పాటు చేస్తారు. భక్తుల సామగ్రి తనిఖీ కోసం సింహద్వారం దగ్గర మరో స్కానరు ఏర్పాటవుతుంది. మార్చి నెలాఖరు కల్లా వీటిని ఏర్పాటు చేస్తారు. శ్రీమందిరం రక్షణ కోసం 4 వాచ్ టవర్లు ఉన్నాయి. యాంత్రిక, సాంకేతిక లోపాలతో ఇవి పని చేయడం లేదు. వీటిని పునరుద్ధరిస్తారు. మరో నెల రోజుల్లో ఈ పనుల్ని పూర్తి చేస్తారు. తీరం పొడవునా... సాగర తీరంలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. పెంటకోట స్టెర్లింగ్ వరకు సుమారు 6 కిలో మీటర్ల పొడవునా 24 వాచ్ టవర్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. గాంధీ ఘాట్ నుంచి స్వర్గద్వార్ మధ్య 90 మంది లైఫ్‌గార్డులు నిత్యం పర్యాటకులకు సహాయం అందజేస్తున్నారు. నవ కళేబర ఉత్సవం పురస్కరించుకుని అదనంగా మరో 200 మంది లైఫ్‌గార్డుల్ని నియమించేందుకు నిర్ణయించారు. సాగర తీరంలోని ప్రతి హోటల్ ముగ్గురు చొప్పున లైఫ్‌గార్డులను నియమించాలని హోటల్ యాజమాన్యాలను ఆదేశించారు. ఈ నెల 25 నుంచి సెయింట్ జాన్ అంబులెన్స్ ఆధ్వర్యంలో 500 మంది హోమ్‌గార్డులకు ప్రాథమిక చికిత్స శిక్షణ ఇస్తారు. ఆటోవాలాలపై నిఘా ఉత్సవానికి విచ్చేసే యాత్రికులు, పర్యాటకులకు అందుబాటులో ఉండే ఆటో రవాణాపట్ల జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా వేస్తుంది. ఆటో డ్రైవర్ల అక్రమాల్ని నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ ఖరారు చేసింది. లెసైన్స్ లేకుండా ఆటో నడిపినా, మద్యపానం చేసినా, అధిక చార్జీల మోతకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతారు. ఇటీవల 56 ఆటోల్ని అదుపులోకి తీసుకుని పీఆర్ బాండ్ మీద డ్రైవర్లను విడుదల చేశారు. వారిపై కేసులు నమోదు చేశారు. అనధికారిక ట్రావెల్ ఏజెంట్లను తొలగించేందుకు సిటీ డీఎస్పీ ఆధ్వర్యంలో పట్టణంలో ట్రావెల్ ఏజెంట్ల సర్వే ప్రారంభించారు. 15 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఎస్పీ తెలిపారు. యాత్ర, పర్యటనకు విచ్చేసే యాత్రికులు, పర్యాటకుల కోసం రైల్వే స్టేషన్, బస్టాండు, దిగొబారెణి ఖుంటి, గౌరాంగ్ ఛొకొ, సింహద్వారం తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. బాక్సులపైన పోలీసు విభాగం ఈ-మెయిల్, హెల్ప్‌లైను నంబర్లని సూచిస్తారు. బాక్సుల్లో పడిన ఫిర్యాదుల్ని పరిశీలించి దర్యాప్తుకు సిఫారసు చేస్తారు. శిథిల కట్టడాల్ని తొలగిస్తారు శ్రీజగన్నాథుని నవ కళేబర ఉత్సవం పురస్కరించుకుని బొడొదండొ మార్గంలో శిథిల అవస్థలో ఉన్న కట్టడాల్ని తొలగించేందుకు నిర్ణయించారు. ఈ మార్గంలో ఇటువంటి 17 శిథిల భవనాల్ని గుర్తించారు. వీటి తొలగింపుకు జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటి శిథిల భవనాల తొలగింపుకు మార్గదర్శకాలు, కార్యాచరణ ఖరారు చేస్తుంది. కొన్ని భవనాలకు సంబంధించి హై కోర్టు స్టే మంజూరు అయింది. వీటి తొలగింపులో చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లా కలెక్టరుతో కమిటి బృందం సంప్రదించి ఈ మేరకు చర్యలు చేపడుతుందన్నారు. ప్రమాదాల నివారణే లక్ష్యం నవకళేబర ఉత్సవంలో ప్రమాదాల్ని నివారించడమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం పని చేస్తుందని జిల్లా ఎస్పీ అశిష్ కుమార్ సింగ్ వివరించారు. పది వేల మంది పోలీసు సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపారు. వీరిలో 5,000 మంది సిబ్బంది బస చేసేందుకు జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తుందని, మిగిలినవారికి పరిసరాల్లోని పాఠశాలలు, కళాశాలల్లో ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీవో)లో డిప్యూటీ కమాండెంట్ లింగరాజ్ మిశ్రా అధికారిగా నవకళేబర సెల్ పని చేస్తుందని తెలిపారు. నవకళేబర ఉత్సవం కోసం అదనపు ఎస్పీ పోస్టు సృష్టించి ప్రఫుల్ల మిశ్రాని నియమించనున్నట్లు తెలిపారు. -
నల్ల కూనకు జన్మనిచ్చిన 'స్నేహ'
భువనేశ్వర్ : దేశంలోని తొలిసారిగా ఒక తెల్లరంగు ఆడపులి ....ఓ నల్లరంగు కూనకు జన్మనిచ్చింది. భువనేశ్వర్‌లోని నందన్కనన్ బయోలాజికల్ పార్క్‌లో ఓ ఆడపుల్లి నాలుగు పిల్లలకు జన్మనిచ్చిందని, అందులో ఒక నల్లజాతి పులికూన ఉందని ఒడిశా అటవీశాఖ ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఎస్ఎస్ శ్రీవాస్తవ్ తెలిపారు. ప్రస్తుతం సిమిలిపాల్ టైగర్ రిజర్వులో నల్లరంగు పులులు ఉన్నాయి. అయితే జూపార్కు ఆధీనంలో ఉన్న ఓ పుల్లి నల్లరంగు కూనకు జన్మ ఇవ్వడం ఇదే తొలిసారని ఆయన తెలిపారు. ఆదివారం రాత్రి స్నేహ అనే ఆడపుల్లి, తన సహచరుడు మనీష్ అనే మగపులి ద్వారా నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో ఒక నల్ల కూనతోపాటు ఒక తెల్లరంగు కూన, ఒక రాయల్ బెంగాల్ పులికూన, తక్కువస్థాయిలో నల్లరంగు ఉన్న కూన ఉన్నాయి. పుట్టిన నాలుగు పులిపిల్లలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు జూ అధికారులు తెలిపారు. స్నేహకు ఇదే తొలి కానుపు. కాగా పులుల సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతున్న నేపథ్యంలో పులి పిల్లల సంరక్షణ కోసం జూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 2011 నవంబర్‌లో నాలుగు పులి కూనలు పుట్టిన రెండు రోజుల తర్వాత చనిపోయాయి. జూ అధికారుల నిర్లక్ష్యం వల్లే కూనలు చనిపోయాయని ఆరోపణలు వచ్చాయి. 1966 నుంచి ఇప్పటి వరకూ ఈ జూలో11 తొలికాన్పులు జరిగాయి. అయితే వాటిలో చాలావరకూ పుట్టిన రెండు వారాల్లోపే మృత్యువాత పడ్డాయి. ప్రస్తుతం ఈ జూలో మొత్తం 20 పులులు ఉన్నాయి. ఇక సోమవారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా స్నేహ... పురుడు పోసుకోవడంతో పార్కులో ఆంనదోత్సాహాలు వెల్లివిరిశాయి. -
అమానుషత్వం
మానవుడిలో ఉండే గొప్ప తత్వానికే మానవత్వం అని పేరు పెట్టారు. మరి ఆ మానవుడే మానవత్వం అన్న మాటను మర్చిపోతే? దానవుడిలా ప్రవర్తిస్తే? మృగమై సాటి మనిషి ప్రాణాలు హరిస్తే? అతడిని చూసి జాలిపడాలా... ద్వేషించాలా... అసహ్యించుకోవాలా? ఏం చేసినా జరిగిన దారుణం సమసిపోదు. పోయిన ప్రాణం తిరిగి రాదు. మరి ఏం చేయాలి? డాక్టర్ సోమనాథ్ పరీదా చేసిన ఘాతుకం గురించి తెలిసిన వారెవరైనా ఇలాగే ఆలోచిస్తారు. ఇంతకీ ఎవరీ సోమనాథ్? ఏమిటతడు చేసిన నేరం, దారుణం? జూన్ 21, 2013... భువనేశ్వర్ (ఒడిశా)... ఉదయం ఏడు కావస్తోంది. కాలింగ్‌బెల్ మోగుతోంది. ముసుగుతన్ని నిద్రపోతోన్న సోమనాథ్‌కి మెలకువతో పాటు విసుగూ వచ్చింది. ‘‘మళ్లీ ఈ కమ్లియే వచ్చుంటుంది. ఫోన్ చేసేవరకూ రావొద్దన్నానుగా. మర్చిపోయిందో ఏంటో’’... విసురుగా దుప్పటి తోసి లేచాడు. చెప్పులేసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి తలుపు తీశాడు. గుమ్మంలో నిలబడి ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. ‘‘నువ్వా’’... మనసులో అనుకోబోయి పైకే అనేశాడు. ‘‘అదేంటి బావా అలా అన్నావ్? ఇంకెవరైనా వస్తారనుకున్నావా ఏంటి?’’... నవ్వుతూ అన్నాడు సోమనాథ్ బామ్మర్ది రంజన్ సమల్. నవ్వలేక నవ్వాడు సోమనాథ్. ‘‘అదేం లేదు. వస్తానని చెప్పలేదుగా. అందుకే ఆశ్చర్యపోయా.’’ ‘‘నేనూ ఆశ్చర్యపోయా... నువ్వు తలుపు తీసేసరికి. ఇంత త్వరగా లేవవు కదా, అక్కయ్యే తీస్తుందనుకున్నా.’’ సోమనాథ్ మాట్లాడలేదు. లోపలికి రమ్మని రంజన్ని పిలవనూ లేదు. దాంతో తనే సోమనాథ్‌ని తోసుకుని లోనికొచ్చాడు రంజన్. వస్తూనే ‘ఓ గాడ్’ అంటూ జేబులోని ఖర్చీఫ్ తీసి ముక్కుకు అడ్డుపెట్టుకున్నాడు. ‘‘ఏంటి బావా ఈ వాసన’’ అన్నాడు చిరాగ్గా. ‘‘ఇంటి నిండా ఎలుకలున్నాయ్లే. ఎక్కడో ఒకటి చచ్చివుంటుంది. నేనూ దానికోసమే వెతుకుతున్నా.’’ ‘‘అది సరే... అక్కయ్య ఏది?’’... అడిగాడు రంజన్. ‘‘కాలనీ వాళ్లతో కలిసి తీర్థయాత్రలకెళ్లింది.’’ ‘‘కనీసం చెప్పనైనా లేదే. పైగా ఫోన్ కూడా స్విచాఫ్ చేసి పెట్టింది.’’ ‘‘ఓ అదా... అనుకోకుండా ప్లాన్ చేసుకున్నారు. తీరా వెళ్లాక ఫోన్ పాడయ్యిందట. అప్పుడప్పుడూ ల్యాండ్‌లైన్ నుంచి చేస్తోంది.’’ అలాగా అన్నట్టు తలాడించాడు రంజన్. ‘‘సరే బావా... నేను వెళ్తాను. పనుండి ఇటువైపు వచ్చాను, ఓసారి అక్కయ్యని చూడాలనిపించింది. తను రాగానే ఫోన్ చె య్యమని చెప్పు’’ అనేసి బయటికి నడిచాడు రంజన్. అతడు కారెక్కి వెళ్లిపోయేవరకూ చూసి తలుపు మూసుకున్నాడు సోమనాథ్. ‘‘మీకీ అనుమానం ఎందుకొచ్చింది?’’... అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘మా అక్కయ్య కొడుకు, కూతురు అమెరికాలో సెటిలయ్యారు సార్. వాళ్లు చాలా రోజులుగా ఫోన్ చేస్తున్నా అక్క తీయడం లేదట. చివరకు నాకు చేసి ఓసారి చూసి రమ్మన్నారు. వెళ్తే అక్కయ్య ఇంట్లో లేదు.’’ ‘‘తీర్థయాత్రలకు వెళ్లారని చెప్తున్నారుగా... అదే నిజమై ఉండొచ్చు’’ అడ్డంగా తలూపాడు రంజన్. ‘‘లేదు సర్. నేను కాలనీలో ఎంక్వయిరీ చేశాను. ఎవ్వరూ ఎక్కడికీ వెళ్లలేదు. పైగా వాళ్లంతా అక్కయ్యని చూసి చాలా రోజులైందని చెప్పారు. మేముండేదీ ఈ ఊళ్లోనే. తీర్థయాత్రలకు వెళ్లేట్లయితే నా భార్యని కూడా రమ్మని అక్కయ్య పిలిచివుండేది. పిలవక పోయినా కనీసం చెప్పి వెళ్లేది.’’ ఇన్స్పెక్టర్ భృకుటి ముడిపడింది. ‘‘అంటే... మీ బావగారు అబద్ధం చెబుతున్నారన్నమాట’’ అన్నాడు సాలోచనగా. ‘‘అదే అన్పిస్తోంది. మరో విషయం... ఇంట్లో భరించలేని దుర్వాసన వస్తోంది. ఎందుకో నా మనసు కీడు శంకిస్తోంది.’’ ఆ మాట వింటూనే నిటారుగా అయ్యాడు ఇన్స్పెక్టర్. అతడి పోలీసు బుర్ర పరిపరి విధాల ఆలోచించడం మొదలుపెట్టింది. వెంటనే రంజన్ని, కానిస్టేబుల్స్‌ని తీసుకుని సోమనాథ్ ఇంటికి బయలుదేరాడు. రంజన్‌తో పాటు వచ్చిన పోలీసులను చూసి అదరలేదు బెదరలేదు సోమనాథ్. ‘‘ఏమయ్యింది రంజన్? పోలీసులతో వచ్చావేంటి’’ అన్నాడు నింపాదిగా. రంజన్ మాట్లాడలేదు. పోలీసులు లోనికి దూసుకెళ్లారు. ముక్కు పుటాలదిరిపోయేలా వాసన. కడుపులో దేవినట్టయ్యింది. అంత దుర్వాసనలో అతడు ఎలా ఉంటున్నాడో అర్థం కాలేదు వారికి. ‘‘ఈ వాసనేంటి’’ అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘ఎలుక చచ్చినట్టుంది సార్’’ తడబడకుండా చెప్పాడు సోమనాథ్. ‘‘సరే... ఎలుకని పట్టుకుందాం’’ అంటూ కానిస్టేబుల్స్‌కి సైగ చేశాడు ఇన్స్పెక్టర్. ఆజ్ఞ అందీ అందగానే వాళ్లు ఇల్లంతా వెతకడం మొదలుపెట్టారు. బెడ్రూమ్, గెస్ట్రూమ్, బాత్రూమ్స్... అన్నీ జల్లెడపట్టారు. చివరగా ఓ కానిస్టేబుల్ వంటగదిలోకి వెళ్లాడు. అక్కడ రెండు పెద్ద పెద్ద రేకుడబ్బాలున్నాయి. వాటిని తెరిచి చూస్తే కొన్ని స్టీలు డబ్బాలు కనిపించాయి. ఓ డబ్బాని తెరిచి చూశాడు కానిస్టేబుల్. అంతే... అదిరిపడ్డాడు. ‘సార్’ అంటూ గట్టిగా కేక పెట్టాడు. అతడి అరుపు వినగానే కంగారుగా వంటగదిలోకి వచ్చారంతా. కానిస్టేబుల్ చేతిలోని డబ్బాలో చిన్న చిన్న మాంసం ముక్కలున్నాయి. కుళ్లిపోయి కంపు కొడుతున్నాయి. వెంటనే అన్ని డబ్బాలూ తెరవమన్నాడు ఇన్స్పెక్టర్. అన్నింటిలోనూ మాంసం ముక్కలే. మొత్తం ఇరవై రెండు డబ్బాలు. ఆ డబ్బాల అడుగున, శిథిలమైపోతోన్న దశలో ఉంది... సోమనాథ్ భార్య ఉషశ్రీ తల. ‘‘అక్కా’’ అంటూ గావుకేక పెట్టాడు రంజన్. ఖాకీల కరకు గుండెలు సైతం క్షణంపాటు గుబగుబలాడాయి. వాళ్లు ఇప్పటివరకూ ఎన్నో కేసులు చూశాడు. కానీ ఇంత దారుణమైన కేసుని... ఘోరాతి ఘోరమైన దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. వెంటనే ఆ డబ్బాలన్నిటినీ పోస్ట్‌మార్టమ్‌కి పంపించారు. సోమనాథ్ చేతులకు బేడీలు వేసి స్టేషన్‌కి నడిపించారు. ‘‘చెప్పండి డాక్టర్ సోమనాథ్... మీ భార్యని ఎందుకు చంపారు’’... కటువుగా పలికింది ఇన్స్పెక్టర్ గొంతు.సోమనాథ్ కంగారు పడలేదు. చాలా కూల్‌గా ఉన్నాడు. ‘‘మొన్న మూడో తేదీన మా ఇద్దరికీ గొడవయ్యింది. కోపంలో తన తల నేలకేసి కొట్టాను, చనిపోయింది. ఆ విషయం ఎవరికీ తెలియకూడదని బాడీని మూడు వందల ముక్కలుగా కోసి, డబ్బాల్లో వేశాను. ఉషకి శిరిడీ అంటే ఇష్టం. అందుకే అక్కడ అంత్యక్రియలు చేద్దామనుకున్నాను. మరో రెండు రోజుల్లో బయలుదేరాల్సి ఉంది. ఇంతలో మీరొచ్చారు’’ చేసిన ఘాతుకాన్ని అతడంత కూల్‌గా చెబుతుంటే షాకైపోయారు పోలీసులు. డెబ్భై రెండేళ్ల వృద్ధుడు... ఆర్మీలో పేరున్న వైద్యుడు... లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో రిటైరైనవాడు... ఇంత దారుణానికి ఒడిగట్టాడా? పైగా అంత చేసి ఇంత కూల్‌గా ఉన్నాడా? నోట మాట రాలేదు వారికి. ఎలా చంపాడో, ఎలా ముక్కలు చేశాడో సోమనాథ్ చెబుతూవుంటే నోళ్లు తెరచుకుని వింటూండిపోయారు. తన భార్య తలని టేబుల్ మీద పెట్టుకుని, కొన్ని రోజుల పాటు దానితో కబుర్లు చెప్పానని... చర్మం, జుట్టు ఊడిపోతుండటంతో పెట్టెలో పెట్టేశానని చెప్తుంటే... అతడి పైశాచికత్వానికి ఎలా రియాక్టవ్వాలో అర్థం కాక చూస్తూండిపోయారు. సోమనాథ్ స్టేట్మెంట్ని రికార్డు చేశారు. రంజన్ సాక్ష్యాన్ని నమోదు చేశారు. కాలనీవాసులను కూడా విచారించారు. డాక్టర్ సోమనాథ్ వైఖరి విచిత్రంగా ఉంటుందని, అంత వయసులో కూడా కుర్రాడిలా తయారై తిరుగుతుంటాడని, ప్రవర్తన వింతగా ఉంటుందని, భార్యని ఎవరితోనూ కలవనిచ్చేవాడు కాదని, మార్నింగ్ వాక్‌కి వెళ్లినప్పుడు పరిచయమైన ఓ స్త్రీతో అతడికి సాన్నిహిత్యం ఏర్పడిందని, ఆమెతో సంబంధం పెట్టుకుని ఉషశ్రీని వేధించేవాడని... ఇలా ఒక్కొక్కళ్లూ ఒక్కో విషయాన్ని చెప్పుకొచ్చారు. దాంతో వదిలించుకునేందుకే అతడు భార్యను హత్య చేసి ఉంటాడనిపించింది పోలీసులకి. తమ నివేదికలో అదే రాసి కోర్టుకు సమర్పించారు. కానీ మన దేశంలో ఓ కేసు తేలాలంటే ఎంత సమయం పడుతుందో తెలియనిది కాదు. ఇంకొన్ని సాక్ష్యాలు కావాలి, మరిన్ని ఆధారాలు అవసరం అంటూ యేళ్లకేళ్లు గడిపేస్తుంటారు. సోమనాథ్ కేసు విషయంలోనూ అదే జరుగుతోంది. అతడు నిజం చెప్పాడా లేదా అంటూ ఇప్పటికీ లై డిటెక్టర్ టెస్టులు, నార్కో అనాలసిస్ టెస్టులు చేస్తూనే ఉన్నారు తప్ప ఏ విషయం తేల్చడం లేదు. నేనే చంపాను అంటూ అతడే తన రాక్షసక్రీడను కళ్లకు కట్టినట్టు చెబుతున్నా శిక్ష వేయడమూ లేదు. చూద్దాం... కేసు ఎన్నేళ్లకు తేలుతుందో, మానవత్వానికే మచ్చ తెచ్చిన సోమనాథ్‌కి ఏ శిక్ష పడుతుందో! - సమీర నేలపూడి డాక్టర్ సోమనాథ్, ఉషశ్రీ దంపతులకి ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, కూతురు. ఇద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారు. జూన్ 3 నుంచి తల్లి తమతో మాట్లాడక పోవడంతో అనుమానం వచ్చి మేన మామ రంజన్కి ఫోన్ చేసి చెప్పారు. అయితే తండ్రే తల్లిని చంపుతాడని, అదీ అంత దారుణంగా ఆమె ప్రాణం తీస్తాడని వాళ్లు ఊహించలేదు. వాళ్లు ఇప్పటికీ ఆ వాస్తవాన్నిజీర్ణించుకోలేకపోతున్నారు! -
ఎనిమిదేళ్లలో రూ. 3700 కోట్లు
భారీగా పెరగనున్న బీసీసీఐ ఆదాయం కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడి ఎన్నికల షెడ్యూల్ తర్వాతే ఐపీఎల్ వేదికపై నిర్ణయం భువనేశ్వర్: ఐసీసీలో సమూల మార్పులకు ప్రణాళికలు సిద్ధం చేసిన భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)... ఆదాయాన్ని కూడా భారీ స్థాయిలో పెంచుకోనుంది. రాబోయే ఎనిమిదేళ్ల (2015-23)లో దాదాపు 600 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 3724 కోట్లు) సంపాదించనుందని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఐసీసీలోని మూడు మేజర్ కమిటీల్లో భారత్ శాశ్వాత సభ్య దేశంగా ఉంటుందని శుక్రవారం ఇక్కడ జరిగిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన వెల్లడించారు. ‘చాలా కాలంగా 68 శాతం ఆదాయాన్ని ఐసీసీకి భారత్ సమకూర్చిపెడుతోంది. అందులో నుంచి 4 శాతం మాత్రమే మనం తీసుకుంటున్నాం. కానీ ప్రస్తుత ప్రణాళికలు అమలైతే రాబోయే రోజుల్లో బోర్డు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఇకపై 21 శాతం మేర ఆదాయం మనకే దక్కుతుంది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ఐసీసీ ఆదాయంలో 75 శాతం మాత్రమే పది సభ్య దేశాలకు సమానంగా పంచేవారు. మిగతాది అసోసియేట్ దేశాలకు వెళ్లేది. ఇతర కార్యక్రమాల వల్ల భారత్‌కు అదనంగా మరో 4 శాతం దక్కేది’ అని పటేల్ వివరించారు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ పర్యటనల్లో భారత్ ఘోర వైఫల్యంపై పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎంపీ పాండోవ్.. శ్రీనివాసన్‌ను వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రశ్నించారు. దీని గురించి చర్చించకుండా ఐపీఎల్ అంశాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై స్పందించిన శ్రీనివాసన్ మాట్లాడుతూ... దీనిపై విచారణకు ఆదేశించామని, జట్టు సహాయక సిబ్బంది, కోచ్‌తో కూడా మాట్లాడానని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ తర్వాతే... ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే ఐపీఎల్ తుది వేదికను ఖరారు చేస్తామని బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ వెల్లడించారు. ‘అవసరమైతే కొన్ని మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహిస్తాం. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, యూఏఈలు ఆతిథ్యమిచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఐపీఎల్ చైర్మన్ బిస్వాల్ తెలిపారు. ఏదేమైనా దీనిపై త్వరలోనే తుది నిర్ణయానికి వస్తాం’ అని శ్రీని వ్యాఖ్యానించారు. ఒకవేళ మే 15 వరకు ఎన్నికల తంతు పూర్తయితే... మొదటి రౌండ్ మ్యాచ్‌లను యూఏఈ, బంగ్లాలలో నిర్వహించి మిగతా లీగ్‌ను తిరిగి భారత్‌లోనే జరపనున్నట్లు సమాచారం. మే నెల మొత్తం ఎన్నికల ప్రక్రియ కొనసాగితే టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలించే అవకాశాలున్నాయి. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్‌లను పారదర్శకంగా నిర్వహిస్తామని బిస్వాల్ తెలిపారు. ఇందుకోసం ఫ్రాంచైజీలు, ఆటగాళ్లకు అవసరమైన శిక్షణ ఇస్తామన్నారు. ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్పై ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను 70 శాతం మేర అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. -
ఐపీఎల్ వేదికే అజెండా
బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం నేడు భువనేశ్వర్: దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్-7ను ఎక్కడ నిర్వహించాలో నిర్ణయించడమే ప్రధాన అజెండాగా శుక్రవారం బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఎన్నికల కారణంగా ఐపీఎల్‌కు భద్రత కల్పించలేమని హోంశాఖ స్పష్టం చేయడంతో ప్రత్యామ్నాయ వేదికల్ని బోర్డు పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విదేశాల్లో టోర్నీ నిర్వహిస్తే తమకు నష్టం కలుగుతుందన్న ఫ్రాంచైజీల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోనున్నట్లు, అందుకోసం ప్రత్యామ్నాయ వేదికను నిర్ణయించినా ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాతే తుదినిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, విదేశాల్లోనే నిర్వహించాల్సివస్తే దక్షిణాఫ్రికానే తొలి ప్రత్యామ్నాయంగా బీసీసీఐ పరిగణిస్తోంది. ఐపీఎల్-2ను నిర్వహించిన అనుభవం ఉండడం, అక్కడి సమయాలు కూడా భారత్‌లో టెలివిజన్ వీక్షకులకు అనుకూలమైనవి కావడంతో బోర్డు ఆ దిశగా మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అయితే యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బంగ్లాదేశ్‌లను కూడా ప్రత్యామ్నాయ వేదికలుగా భావిస్తున్నా.. యూఏఈలో బుకీలు, ఫిక్సింగ్ బెడద ఎక్కువగా ఉంటుందనే ఆందోళన ఉంది. మరోవైపు బీపీఎల్ సందర్భంగా ఫిక్సింగ్ చోటుచేసుకోవడం బంగ్లాదేశ్‌లోనూ టోర్నీ నిర్వహణ శ్రేయస్కరం కాదన్న అభిప్రాయం కలిగిస్తోంది. సహాయ కోచ్ ఆలోచన లేదు: బీసీసీఐ ముంబై: టీమిండియాకు సహాయ కోచ్‌ను నియమించే ఆలోచనేదీ లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. విదేశీ పర్యటనల్లో భారత బౌలర్ల వరుస వైఫల్యాల నేపథ్యంలో బౌలింగ్ కోచ్ జోయ్ డేవిస్‌ను తప్పించి అతని స్థానంలో స్వదేశీ సహాయ కోచ్‌ను నియమించనున్నట్లు, శుక్రవారం భువనేశ్వర్‌లో జరగనున్న బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ విషయం చర్చకు రానున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అటువంటి అజెండా ఏదీ లేదని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. టి20 ప్రపంచకప్ ముగిశాక కెప్టెన్ ధోని, కోచ్ ఫ్లెచర్లతో సమావేశం జరుగుతుందని చెప్పారు. -
విభజనలో రాజకీయ వర్గాలతో చర్చను గాలికొదిలేశారు: నవీన్ పట్నాయక్
-
భువనేశ్వర్ చేరుకున్న వైఎస్ జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ఉదయం ఒడిశా రాజధాని భువనేశ్వర్ చేరుకున్నారు. భువనేశ్వర్ లోని విమానాశ్రయంలో వైఎస్ జగన్ కు స్థానిక తెలుగువారు, నాయకులు ఘన స్వాగతం పలికారు. మరికాసేపట్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్‌తో ఆయన క్యాంప్ కార్యాలయంలో జగన్ భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజభనపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జగన్ మద్దతు కూడగడుతున్నారు. అందులోభాగంగా బీజు జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయిక్‌ను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల రాష్ట్రానికి జరగుతున్న అన్యాయాన్ని జగన్ ఈ సందర్బంగా నవీన్ పట్నాయిక్‌కు వివరించనున్నారు. అంధ్రప్రదేశ్ విభజన వల్ల ఏర్పడే నష్టాలను వైఎస్ జగన్ శనివారం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, శరద్ యాదవ్‌కు న్యూఢిల్లీలో విశదీకరించిన సంగతి తెలిసిందే. -
అప్రమత్తతే కాపాడింది
న్యూఢిల్లీ: పై-లీన్ తుపానుపై అప్రమత్తంగా ఉండడంతో భారీ స్థాయిలో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. తుపాను స్థితిగతులపై కచ్చితమైన అంచనా, ప్రజలను త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, భారీస్థాయిలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో నష్టాన్ని వీలైనంత మేర తగ్గించగలిగినట్లు చెప్పారు. విపత్తును ఎదుర్కోడానికి తాము ప్రణాళికాబద్ధంగా చేసిన ప్రయత్నాలు ఫలించాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి ఆదివారం పీటీఐతో అన్నారు. ముప్పును సరిగ్గా అంచనా వేసిన వాతావరణ విభాగం, సహాయ కార్యక్రమాలను సమన్వయం చేసిన కేంద్ర హోం శాఖ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భువనేశ్వర్‌లోని డాప్లర్ రాడార్ల సాయంతో పై-లీన్ తీవ్రతను, గమనాన్ని కచ్చింతగా అంచనా వేయగలిగామని భారత వాతావరణ విభాగం డెరైక్టర్ జనరల్ ఎల్ఎస్ రాథోడ్ చెప్పారు. -
విలయ విధ్వంసం
రెండు రాష్ట్రాల తీర ప్రాంతాల ప్రజలను నిలువెల్లా వణికించిన పెను తుపాను పై-లీన్ శాంతించింది. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు.. ప్రభుత్వ యంత్రాంగం జాగ్రత్త చర్యలతో.. పెద్దగా ప్రాణనష్టం సంభవించలేదు. కానీ.. ఈ ఇంద్రనీలం తుపాను శనివారం రాత్రి భారీ విధ్వంసమే సృష్టించింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో దాదాపు కోటి మంది జీవితాలపై ప్రభావం చూపింది. లక్షలాది ఇళ్లను దెబ్బతీసింది. లక్షలాది ఎకరాల్లో పంటను కాలరాసింది. ఒడిశాలో ఒక్క వరి పంటకు జరిగిన నష్టమే రూ. 2,400 కోట్లుగా అంచనా. శ్రీకాకుళం జిల్లాలో దెబ్బతిన్న ఉద్యానవన, ఇతర పంటల నష్టం రూ. వెయ్యి కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా. శనివారం రాత్రి ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటిన తుపాను.. గంజాం జిల్లాను కకావికలం చేసింది. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం జిల్లానూ అతలాకుతలం చేసింది. ఒడిశా తీరంలో తొమ్మిది లక్షల మందిని, ఉత్తరాంధ్ర తీరంలో లక్షన్నర మందిని ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించటంతో ప్రాణనష్టం లేకుండా నివారించగలిగారు. తుపాను తాకిన గోపాల్పూర్ నుంచి దాదాపు 95 శాతం మందిని ముందుగానే ఖాళీచేయించారు. అప్పటికీ.. ఒడిశాలో 21 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో పది మంది గంజాం జిల్లాలోనే చనిపోయారు. శ్రీకాకుళం జిల్లాలో మరో ఇద్దరు మృతిచెందారు. మొత్తం మృతుల సంఖ్య 23గా చెప్తున్నారు. సాక్షి, భువనేశ్వర్/శ్రీకాకుళం: తుపాను ప్రభావంతో ఒడిశాలో భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. దాదాపు 220 కిలోమీటర్ల వేగంతో వీచిన భీకర గాలులకు పెద్ద ఎత్తున చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. శనివారం రాత్రి పెను గాలులకు బరంపురంలోని ఓ హోటల్ వద్ద నిలిపి ఉంచిన వ్యాన్ పైకి ఎగిరి కింద పడింది. దీనినిబట్టి గాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బరంపురం నగరం ఆదివారం మధ్యాహ్నం వరకూ దాదాపు జలదిగ్బంధంలోనే ఉంది. తీర జిల్లాల్లో సమాచార వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ, రోడ్లు, రైల్వే లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జాతీయ రహదారిలో కొన్నిచోట్ల గాలుల కారణంగా లారీల వంటి భారీ వాహనాలు సైతం తిరగబడిపోయాయి. వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు స్తంభించాయి. గంజాం జిల్లాలో తుపాను ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. దాని తర్వాత పూరి జిల్లాలో అధికంగా ఉందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎస్.ఎన్.పాత్రో తెలిపారు. మిగతా కోస్తా జిల్లాలపై అంత తీవ్ర ప్రభావం లేదన్నారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 14,514 గ్రామాలు, 80,53,620 మంది జనాభాపై తుపాను ప్రభావం చూపిందని చెప్పారు. తుపాను కారణంగా 2.34 లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయని, 8.73 లక్షల మందికి పైగా ప్రజలను ఖాళీచేయించి శిబిరాలకు తరలించినట్లు వివరించారు. వర్షాలు, వరద ముంపు వల్ల ఐదు లక్షల హెక్టార్లకు పైగా పొలాల్లో పంట ధ్వంసమైందని.. ఈ నష్టం రూ. 2,400 కోట్ల వరకూ ఉంటుందని వివరించారు. తుపాను వల్ల ప్రజల ప్రాణ నష్టాన్ని అత్యంత కనిష్టానికి పరిమితం చేయటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని.. అందులో విజయం సాధించగలిగామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ ఆదివారం భువనేశ్వర్‌లో పేర్కొన్నారు. అయితే కోట్ల రూపాయల అస్తి నష్టం సంభవించిందన్నారు. ఇక పునరావాసం, పునర్నిర్మాణంలో నిమగ్నమవుతామని చెప్పారు. ప్రధానంగా రైల్వే లైన్లు, ప్రధాన నగరాల్లో త్వరగా విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలనే లక్ష్యంతో అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారు. వెస్కోకు చెందిన సుమారు 200 మందితో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే గంజాం జిల్లాలో విద్యుత్ వ్యవస్థ చక్కబడడానికి, టెలికాం వ్యవస్థ పునరుద్ధరణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. పూరి-హౌరాల మధ్య రైల్వే ట్రాక్‌లను ఆదివారం సాయంత్రానికి పునరుద్ధరించారు. రైలు సర్వీసులను కూడా నడుపుతున్నారు. ఈ నగరాల మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు కూడా ప్రారంభించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన పట్నాయక్ సోమవారం హెలికాప్టర్లో పర్యటించనున్నారు. సిక్కోలులో తుడిచిపెట్టుకుపోయిన పంటలు పెను తుపాను గండం నుంచి ఉత్తరాంధ్ర గట్టెక్కింది. శ్రీకాకుళం జిల్లా బులివాడు గ్రామంలో 60 ఏళ్ల వృద్ధుడు భారీ వర్షాలకు ఇల్లు కూలి చనిపోయాడు. కవిటి మండలంలో తుపాను శిబిరంలో నిద్రిస్తున్న 27 ఏళ్ల మత్స్యకారుడొకరు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలు మినహా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే జిల్లాలో భారీగా పంట నష్టం సంభవించింది. రోడ్లు, విద్యుత్, సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా ఉద్దానం ప్రాంతంలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని 233గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఉద్యాన పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ. 1000 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. సుమారు 29 వేల ఎకరాల్లో వరి, 17,500 ఎకరాల్లో కొబ్బరి పంట, 1000 ఎకరాల్లో మామిడి, 500 ఎకరాల్లో అరటి, 100 ఎకరాల్లో మునగ దెబ్బతిన్నాయి. భారీగా మొక్కజొన్న, చెరకు పంటలు కూడా ధ్వంసమయ్యాయి. దాదాపు వంద ఇళ్లు కూలిపోగా, మరో 50 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రోడ్లపై భారీగా చెట్లు కూలిపోవటంతో 233 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో 39 గ్రామాలు నీటి ముంపునకు గురయ్యాయని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 19 బృందాలు (ఒక్కో బృందంలో 40 మంది చొప్పున), మరో 500 మందికి పైగా సైనిక సిబ్బంది (ఇంజనీర్లు, సమాచార వ్యవస్థ నిపుణులు, వైద్య బృందాలు) సహాయ, పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యారు. శని, ఆదివారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో 294 తీర గ్రామాల నుంచి దాదాపు 1.34 లక్షల మందిని సహాయ శిబిరాలకు తరలించారు. తుపాను ప్రభావం తేలిపోవటంతో విశాఖ జిల్లాలోని సహాయ శిబిరాల నుంచి 24,000 మందిని వారి ఇళ్లకు పంపించివేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఇంకా లక్ష మందికి పైగా తీర ప్రాంత ప్రజలు శిబిరాల్లోనే ఉన్నారు. మరోవైపు ఒడిశాలో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలో వంశధార, నాగావళి నదులకు వరద ముప్పు పొంచివుంది. బీహార్‌కు వరద హెచ్చరిక ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లకు తుపాను గండం గడిచిపోయిందని.. అయితే బీహార్‌లో 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. బీహార్ మైదాన ప్రాంతాల్లో, కోసి, గంధక్ నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షపాతం ఉంటుందని చెప్తూ.. ఆ రాష్ట్రానికి వరద హెచ్చరిక జారీచేసింది. దీంతో వరద అవకాశాలున్న 28 జిల్లాలను బీహార్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్ర రాజధాని పాట్నాతో పాటు.. సుపాల్, దర్భంగా, గోపాల్‌గంజ్ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. బేగుసరాయ్, భగల్పూర్, భోజ్‌పూర్, జెహానాబాద్, పాట్నా జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. వాయుగుండంగా తుపాను పెను తుపానుగా శనివారం రాత్రి తీరం దాటిన పై-లీన్ ఆదివారం ఉదయానికి బలహీనపడి తుపానుగా మారిందని, సాయంత్రానికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారిందని, గాలుల వేగం 45-55 కిలోమీటర్లకు తగ్గిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. సోమవారం ఉదయానికి ఇది అల్పపీడనంగా మారుతుందని.. నేపాల్ వైపు పయనిస్తుందని వివరించింది. ప్రస్తుతం ఉత్తర ఒడిశాలోని జర్సీగూడ సమీపంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలతో పాటు, ఒడిశాలోని పూరి, బాలాసోర్, జగత్సింగ్ఫూర్, కటక్, సంబల్పూర్ జిల్లాలు.. బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌లలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు మరికొన్ని రోజులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఉత్తర కోస్తాంధ్రను ఆనుకొని ఉన్న పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సాగరంలో 4 కి.మీ ఈదుకుంటూ.. ఒడిశా తీరం చేరిన 18 మంది మత్స్యకారులు ఒడిశాలోని పారాదీప్ వద్ద సముద్రంలో చిక్కుకుపోయిన 18 మంది తమిళనాడు మత్స్యకారులు ఆదివారం సముద్రాన్ని ఈదుకుని సురక్షితంగా తీరం చేరుకున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన వీరు తుపాను సమయంలో పారాదీప్ వద్ద చేపలు వేటాడేందుకు ఉపయోగించే బోటులో చిక్కుకుపోయారు. గత నెల 22న ఒడిశా తీరం నుంచి సుదూర సముద్రంలో చేపల వేటకు వెళ్లిన వీరు.. తుపాను రాబోతోందని తెలియగానే తిరిగివచ్చేందుకు ప్రయత్నించారు. అయితే.. ప్రయాణం సక్రమంగా సాగకపోగా.. ట్రాలర్లో డీజిల్ కూడా అయిపోవటంతో పారాదీప్ పోర్టుకు నాలుగు కి.మీ. దూరంలో చిక్కుకుపోయారు. కోస్ట్‌గార్డ్ విభాగాన్ని సంప్రదించినప్పటికీ సముద్రం కల్లోలంగా ఉండటంతో సహాయ చర్యలు చేపట్టలేకపోయారు. దీంతో వారు ఆదివారం ట్రాలర్ నుంచి దూకివేసి సముద్రంలో నాలుగు కి.మీ. ఈదుకుంటూ జగత్సింగ్పూర్ జిల్లాలోని ఎర్సామా తీరానికి సురక్షితంగా చేరుకున్నారు. బంగాళాఖాతంలో మునిగిన నౌక! తుపాను కారణంగా అల్లకల్లోలంగా మారిన బంగాళాఖాతంలో ఎంవీ బింగో అనే సరుకు రవాణా నౌక మునిగిపోయినట్లు భావిస్తున్నామని కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ఆర్.పి.ఎస్.కహ్లోన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పనామాలో రిజిస్టరైన ఎంవీ బింగో నౌక 8,000 టన్నుల ఐరన్ ఓర్ (ముడి ఇనుము ఖనిజం)తో ప్రయాణిస్తోంది. పశ్చిమబెంగాల్ తీరంలోని సాగర్ పోర్టు నుంచి ఈ నెల 11వ తేదీన చైనా వెళ్లేందుకు బయల్దేరింది. శనివారం నుంచి అదృశ్యమైన నౌక జాడ ఆదివారం సాయంత్రానికి కూడా తెలియరాలేదు. బెంగాల్ తీరానికి 25 కిలోమీటర్ల దూరంలో లైఫ్బోట్లో ఉన్న నౌక సిబ్బందిని ఆదివారం ఉదయం కోస్ట్ గార్డ్ డోర్నియర్ విమానం గుర్తించింది. వారిని వెనక్కు రప్పించేందుకు మరో నౌకను పంపిస్తున్నారు. తుపాను సమయాల్లో నౌకలను నౌకాశ్రయాల్లో ఉంచితే భారీ నష్టం సంభవించే అవకాశం ఉండటంతో.. వాటిని సముద్రం మీదకి తరలించటం అంతర్జాతీయంగా అనుసరించే విధానం.