
భువనేశ్వర్: నలుపు రంగు డబ్బా ఏదీ దీని మీద పడలేదు.. ఇది అచ్చంగా నల్ల పులే(మెలనిస్టిక్ టైగర్).. ఇది ఎంత అరుదైనది అంటే.. ప్రపంచం మొత్తం మీద ఇలాంటివి ఆరేడే ఉన్నాయి.. అందులో ఇదొకటి. ఇంకో విశేషం ఏమిటంటే.. ఉన్న ఆరేడు కూడా మన పక్కనే ఉన్న ఒడిశా రాష్ట్రంలోనే ఉన్నాయి. అక్కడి సిమ్లిపాల్ రిజర్వులో ఈ నల్ల పులులు ఉన్నాయి. ఈ మధ్య కోల్‌కతాకు చెందిన ఫొటోగ్రాఫర్ సౌమన్ ఈ టైగర్ రిజర్వులోకి ఫొటోలు తీయడానికి వెళ్లారట. జీవిత కాలంలో ఒకే ఒక్కసారి వచ్చే చాన్స్ నా తలుపు తట్టింది. ఆ పులి కొన్ని సెకన్లపాటే కనిపించింది. చాలా వేగంగా స్పందించి.. చిత్రాలు తీయాల్సి వచ్చింది. నల్ల చిరుతలు చాలా ఉన్నాయి.. ఇది నల్ల పులి. అదీ బయటకు కనిపించడం చాలా అరుదు.. ఫుల్ హ్యాపీ అని ఆయన ఉబ్బితబ్బిబ్బయ్యారు. జన్యుపరమైన మార్పుల వల్ల ఈ పులులు ఇలా నల్లటి చారలను కలిగి ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment