Tiger Reserve
-
మగ తోడును వెతుక్కుంటూ ఓ ఆడపులి యాత్ర
ఒడిశా టైగర్ రిజర్వు నుంచి తప్పించుకున్న ఆడ పులి జీనత్.. 21 రోజుల్లో 3 రాష్ట్రాల్లోని 300 కిలోమీటర్ల పయనంరేడియో కాలర్ ఉన్నా ఎక్కడా ఉచ్చులో పడకుండా ముప్పుతిప్పలు పెట్టిన పులి.. దొరికినట్టే దొరికి జారిపోవడంతో పరుగులు పెట్టిన అటవీ శాఖఎట్టకేలకు బెంగాల్‌లోని బంకురా జిల్లాలో బంధించిన అధికారులుమొన్నటికి మొన్న జానీ అనే మగ పులి.. తోడు కోసం మహారాష్ట్ర ఆడవుల నుంచి వచ్చి.. తెలంగాణలో వందల కిలోమీటర్లు చక్కర్లు కొట్టింది. ఇప్పుడేమో జీనత్ అనే ఈ ఆడపులి మగతోడు కోసం ఒడిశాలోని టైగర్ రిజర్వు నుంచి తప్పించుకొని 3 రాష్ట్రాల్లో 300 కిలోమీటర్లు పయనించింది. లవ్.. ఇష్క్.. కాదల్.. పేరేదైనా ఓసారి ప్రేమలో పడితే.. ఇదిగో ఇలా లవర్ కోసం పడరాని పాట్లు పడాల్సిందే. జానీ ప్రేమ కథ మనకు తెలిసిందే.. జీనత్ లవ్ స్టోరీని ఇప్పుడు తెలుసుకుందాం.సాక్షి, అమరావతి : మగ తోడును వెతుక్కుంటూ దట్టమైన అటవీ ప్రాంతం నుంచి తప్పించుకున్న ఒక ఆడ పులి మూడు రాష్ట్రాల అధికారులను ముప్పతిప్పులు పెట్టింది. దాని శరీరానికి అమర్చిన రేడియో కాలర్ ద్వారా అది ఎక్కడె క్కడికి వెళుతుందో తెలుసుకుంటూ అనేకచోట్ల ఉచ్చులు వేసినా ఎక్కడా చిక్కకుండా తప్పించుకుని తిరిగింది. 21 రోజులపాటు ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ అటవీ ప్రాంతాల్లోని 300 కిలోమీటర్ల మేర అది ప్రయాణించింది. మధ్యలో కొన్నిసార్లు జనావాసాలకు దగ్గరగా రావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు వణికిపోయారు. మూడు రాష్ట్రాల అటవీ శాఖల అధికారులు దాని పాదముద్రలు, ఇతర గుర్తులు, రేడియో కాలర్ ద్వారా ఎప్పటికప్పుడు జాడ తెలుసుకుని వెళ్లినా అది వారి కళ్లు గప్పి తప్పించుకుని వెళ్లిపోయేది. చివరికి 21 రోజుల తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాల్లో దానికి మత్తు మందు ఇచ్చి బంధించడంతో ఆయా రాష్ట్రాలు ఊపిరి పీల్చుకున్నాయి.మహారాష్ట్ర నుంచి తెచ్చి..ఒడిశాలోని సిమ్లిపాల్ టైగర్ రిజర్వు ప్రాంతంలో పులుల సంతతిని పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా నవంబర్ 14న మహారాష్ట్రలోని తడోబా–అంధారి టైగర్ రిజర్వ్ నుంచి జీనత్, యమున అనే ఆడ పులులను ఒడిశాలోని సిమ్లిపాల్ టైగర్ రిజర్వుకు తీసుకొచ్చారు. కొత్త ప్రాంతం కావడంతో జీనత్‌ను 10 రోజులపాటు అలవాటు పడేందుకు సాఫ్ట్ ఎన్‌క్లోజర్‌లో ఉంచి నవంబర్ 24న సిమ్లిపాల్ కోర్ ఏరియాలో వదిలారు. మొదట్లో రెండు పులులు సిమ్లిపాల్ పరిధిలోనే తిరిగాయి. డిసెంబర్ 8న మూడేళ్ల జీనత్ టైగర్ రిజర్వు పరిధి దాటేసి తప్పించుకోవడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. దాని శరీరానికి రేడియో కాలర్ అమర్చి అది తిరిగే ప్రాంతాలను అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. కొన్నిసార్లు రేడియో కాలర్ సిగ్నల్ బలహీనంగా ఉండటంతో దాన్ని ట్రాక్ చేయడం సాధ్యమయ్యేది కాదు. అందుకే పలుచోట్ల నైలాన్ ఉచ్చులు వేసి, మత్తు బాణాలు వదిలినా అది దొరకలేదు. ట్రాన్స్‌లొకేషన్ షాక్‌తోనే..అలా వెళుతూ అది ఒడిశా నుంచి జార్ఖండ్‌లోని అటవీ ప్రాంతంలోకి ప్రవేశించడంతో అక్కడి అటవీ గ్రామాల ప్రజలు వణికిపోయారు. పులి పాదముద్రలు గుర్తించేలోపే మరో చోటుకు వెళ్లిపోయేది. ఆ తర్వాత జార్ఖండ్ దాటి మరో వంద కిలోమీటర్లు ప్రయాణించి పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించింది. మొదట ఝార్గ్రామ్లో స్థానికుల్ని హడలెత్తించింది. చివరకు అడపాదడపా వచ్చిన సిగ్నల్స్ ఆధారంగా 21 రోజుల తర్వాత బంకురా జిల్లాలోని గోసైందిహి ప్రాంతంలో జీనత్ జాడ కనిపెట్టి మత్తు మందు ఇచ్చి బంధించారు. మూడు వారాల్లో మూడు రాష్ట్రాల్లో కలకలం రేపిన పులిని బంధించారన్న సమాచారంతో ఆయా రాష్ట్రాలు ఊపిరి పీల్చుకున్నాయి. పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పులిని బంధించడంపై సంతోషం వ్యక్తం చేశారు. పట్టుకున్న తర్వాత పరీక్షించగా అది ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నట్టు గుర్తించారు. అయితే.. తన భూభాగం కాకపోవడంతో అది ట్రాన్స్‌లొకేషన్ షాక్‌కు గురైనట్టు భావిస్తున్నారు. పులులు సాధారణంగా తమ భూభాగం దాటి తిరగవు. బయట ప్రాంతం కావడం, ఆ ప్రాంతంలో ఇతర పులులు కూడా ఉండటంతో అది సర్దుకోలేక, దిక్కు తెలియక ఎటు పడితే అటు వెళ్లినట్టు అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా మగ తోడు కోసం వెతుకులాట కూడా ఒక కారణం కావచ్చని అంటున్నారు. -
రేపటి నుంచి పులుల గణన
రాష్ట్రవ్యాప్తంగా జనవరి1 నుంచి 45 రోజులపాటు పులుల లెక్కింపు జరుగనుంది. నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు ప్రాజెక్టు పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతమైన మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, ఆత్మకూరు అటవీశాఖ ప్రాంతాలతోపాటు పల్నాడు, తిరుపతి, రాజంపేట, కడప అటవీ ప్రాంతాల్లో ఉన్న పులుల సంఖ్యను లెక్కించనున్నారు. ఇందుకోసం ప్రతి 2 చదరపు మీటర్లకు రెండు కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ఏకైక టైగర్ రిజర్వు ఫారెస్టు అయిన నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్టు సుమారు 6.50 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. పులుల గణన కోసం సుమారు 2.15 లక్షల ఎకరాల్లో 400పైగా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో 86 నుంచి 88 వరకూ పులులు సంచరిస్తున్నట్లు అంచనా. – మార్కాపురం బేస్ క్యాంపులు..ప్రస్తుతం నల్లమలలో గంజివారిపల్లి సమీపంలోని పెద్దన్న బేస్ క్యాంపు, పాలుట్ల, వెదురుపడియ, నారుతడికల, ఇష్టకామేశ్వరి, పాలుట్ల, దొరబైలు, తుమ్మలబైలు, చిన్నమంతనాల, రోళ్లపెంట, కొర్రపోలు, కొలుకుల తదితర ప్రాంతాల్లో బేస్ క్యాంపులున్నాయి. రాత్రి 9 దాటితే దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో పెద్దపులుల సంచారం ఉన్నందున రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పులుల గణన..రాష్ట్రంలోని వివిధ అటవీ ప్రాంతాల్లో జనవరి 1 నుంచి 45 రోజుల పాటు పులుల గణన జరుగుతుంది. ఇవి శేషాచలం బయోస్పియర్ రిజర్వులో కూడా సంచరిస్తున్నట్లు గుర్తించారు. పులుల సంరక్షణలో లంకా మల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యం, పెంచల నరసింహ అభయారణ్యం, వెంకటేశ్వర జాతీయ ఉద్యానవనం, పులుల సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. – సందీప్‌కృపాకర్, అటవీశాఖ డెప్యూటీ డైరెక్టర్, మార్కాపురం -
బెబ్బులి బెదురుతోంది!
దేశంలోనే విస్తీర్ణంలో అతి పెద్దదైన పెద్దపులుల అభయారణ్యం శ్రీశైలం – నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్). అలాంటి చోటే వాటికి పెను ముప్పు ఎదురవుతోంది. పెరుగుతున్న పులుల సంతతికి తగ్గట్టు ఆవాసం, ఆహార లభ్యత దొరకడం లేదు. వీటి ప్రధాన ఆహార జంతువులైన దుప్పులు, కణుతుల సంఖ్య పెరగకపోగా రోజురోజుకు వాటి సంఖ్యలో తరుగుదల కనిపిస్తోంది. ఇందుకు అటవీ పరిధిలో వేటగాళ్లు మాటు వేయడం.. వారిని కట్టడి చేసే స్థాయిలో సిబ్బంది సంఖ్య లేకపోవడంతో ఎంతో భద్రమైనదిగా భావించే నల్లమలలోనే వాటి సంరక్షణ గాలిలో దీపంలా మారింది.ఆత్మకూరు రూరల్: అటవీ ఆవరణ వ్యవస్థలో అగ్రభాగాన ఉండే పెద్దపులులు అధికారిక లెక్కల ప్రకారం శ్రీశైలం– నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్‌లో 87 ఉన్నాయి. అయితే, పులులు పెరిగే కొద్ది వాటి ఆవాస ప్రాంతం, ఆహార లభ్యత పెరగడం లేదు. ఇందుకు తగినన్ని గడ్డి మైదానాలు అభివృద్ధి కాలేదు. పులుల ప్రధాన ఆహార జంతువుల సంఖ్య పెరగడమూ లేదు. నల్లమలలోని ఆత్మకూరు, నంద్యాల , గిద్దలూరు,మార్కాపురం డివిజన్లలో వేటగాళ్ల కదలికలు రోజురోజుకు పెరుగుతుండడమే అందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అటవీ సమీప గ్రామాల్లో తిష్టవేసిన కొందరు వేటగాళ్లు గడ్డితినే జంతువులు సంచరించే నీటివనరుల వద్ద, జేడ (సాల్ట్ లిక్)మైదానాల వద్ద ఉచ్చులు వేసి మాటు గాస్తున్నారు. ఆ ఉచ్చులకు చిక్కిన వన్యప్రాణులను మాంసంగా మార్చి పట్టణాల్లో పెద్ద మొత్తానికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రమాదకర స్థితిలో పులి ఎంతో భద్రమైనదని భావించే ఎన్ఎస్టీఆర్ లో ప్రాణాంతక వైరస్‌లా వేటగాళ్ల చొరబాటు పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం సిబ్బంది కొరతేనన్నది విస్పష్టం.ఎన్ఎస్టీఆర్ సర్కిల్లో మొత్తం నాలుగు డివిజన్లలో 750 (ఇది పాత లెక్క)మంది సిబ్బంది ఉండాల్సిన చోట కేవలం 250 మందే ఉన్నారు. ఈ అరకొర సిబ్బందితో వేటగాళ్లను నియంత్రించ లేని పరిస్థితి. ఫలితంగా పులి సంరక్షణ ప్రమాదకర స్థితిలో పడింది. ఫుట్ పెట్రోలింగ్‌కు అదే సమస్య అటవీ సంరక్షణలో రోజువారి ఫుట్ పెట్రోలింగ్ ( కాలి నడకతో ప్రదేశాన్ని చుట్టి రావడం)కు కూడా సిబ్బంది కొరతే ప్రధాన అడ్డంకిగా ఉంది. సుమారు 3,750 చ.కిమీ విస్తీర్ణంలో ఉన్న విశాలమైన ఎన్‌ఎస్‌టీఆర్‌లో ఫుట్ పెట్రోలింగ్‌కు ఉన్న వనరులు కేవలం బేస్ క్యాంప్ సిబ్బంది మాత్రమే. పులి సంరక్షణలో మేటి అని చెప్పుకునే ఆత్మకూరు అటవీ డివిజన్లో ఉన్న 23 బేస్ క్యాంపుల్లో సుమారు వంద మంది ప్రొటెక్షన్ వాచర్లు పని చేస్తుంటారు.అయితే, వీరిలో కొందరు వీక్లీ ఆఫ్‌లో ఉంటారు. మిగతా వారిని ప్రత్యేకించి ఫుట్ పట్రోలింగ్కు కేటాయించలేని పరిస్థితి. ప్రొటెక్షన్వాచర్లను పర్యవేక్షించేందుకు ఒక్కో బేస్ క్యాంపులో ఒక రెగ్యులర్ అటవీ సిబ్బంది ఉండాలి. ఈ రూల్ పుస్తకాలకు మాత్రమే పరిమితమైంది. వేధిస్తోన్న ఆహార కొరత .. శ్రీశైలం – నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్‌లో ఉన్న ఆహార లభ్యతను బట్టి ఒక్కో పెద్దపులి తన అధీన ప్రాంతం (టెరటరీ)గా సుమారు 40 చ.కిమీ పరిధిని ఉంచుకుంటోంది. పులి సాధారణంగా ఆరు సార్లు దాడులు చేస్తే ఒకసారి వేట సాఫల్యమవుతుంది. ఇందుకోసం అది ఆరు రోజులు కూడా ఆకలితో నకనకలాడాల్సి ఉంటుంది. కనీసం వారానికో జంతువును వేటాడినా ప్రస్తుతం నల్లమలలో ఉన్న పులులకు వారానికి సుమారు 90 ఆహార జంతువులు అవసరమవుతాయి. నెలకు 360, సంవత్సరానికి దరిదాపుగా నాలుగు వేలకు పైగా జంతువులు అందుబాటులో ఉండాలి. ఇది కనిష్ట అవసర స్థితి. ఈ నిష్పత్తిలో ఆహార లభ్యత లేక పోతే పులుల ఆధీన ప్రాంతం క్రమేపీ పెరుగుతుంది. దీంతో పులుల మధ్య ఆహారం కోసం యుద్ధాలు జరుగుతాయి. ఈ పోరులో ఎన్నో పులులు మరణించే అవకాశం ఉంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో పులి ఆహారం వేటగాళ్ల చౌర్యానికి గురైతే జరిగే నష్టం లెక్కకట్టలేనిది. అడపాదడపా కేసులు... శిక్షలు శూన్యం? అటవీ అధికారులు అడపాదడపా ఎవరో ఒకరిని వన్యప్రాణి వేట కేసుల్లో పట్టుకుని కేసులు పెడుతున్నారు. అయితే, వారిలో ఏ ఒక్కరికీ కఠిన శిక్షలు పడిన దాఖలాలు లేవు. ఇందుకు ప్రధాన కారణం కూడా సిబ్బంది కొరతే. కనీసం పీఓఆర్ను కాని చార్జ్ షీట్‌ను కాని ముద్దాయిలకు శిక్ష పడేలా రాసుకోలేని పరిస్థితి. ఈ ఏడాది జనవరిలో ఆత్మకూరు రేంజ్ లోని గుమ్మడాపురం కు చెందిన కొందరు దుప్పి తలతో అధికారులకు చిక్కారు.ఇదే రేంజ్ లోని శివపురం సమీపంలో ఏప్రిల్ నెలలో ఇద్దరు ఎలుగు బంటి మాంసంతో చిక్కారు. ముసలమడుగు సమీపంలో అక్టోబర్ నెలలో కొందరు అడవి పంది మాంసంతో పట్టుబడ్డారు. వీరందరిపై పీఓఆర్ నమోదు అయి కోర్టు ముందు హాజరు పరిచారు. అయితే వారిపై సరైన సెక్షన్లు పెట్టకపోవడంతో నిందితులు 24 గంటల్లో బెయిల్‌పై తిరిగి వస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఉచ్చులతో పులికీ ప్రమాదంవేటగాళ్లు పులి ఆహార జంతువులైన జింకల కోసం నీటి వనరుల వద్ద ఉచ్చులు పన్ని ఉంచు తారు. అయితే ఈ ఉచ్చులలో ప్రమాదవశాత్తు అప్పుడప్పుడు పెద్ద పులులు కూడా చిక్కు కుని మరణిస్తుంటాయి. గతంలో సిద్దాపురం చెరువులో పన్నిన ఉచ్చులకు ఓ పెద్దపులి చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా రెండేళ్ల కిందట ఆత్మకూరు డివిజన్ లోని నల్లకాల్వ సెక్షన్ లో ఓ పులి కళేబరం గాలేరు ప్రవాహంలో కొట్టుకు వచ్చింది. దాని మెడలో ఒక ఉచ్చు బిగిసి ఉంది. ఇలా వేటగాళ్ల వల్ల పులుల ఆహార జంతువులు తగ్గిపోవడంతో పాటు కొన్నిసార్లు అవి కూడా ప్రాణాలు కోల్పోవాల్సి రావడం ఆందోళన కలిగిస్తోంది. అదే పూర్తి స్థాయిలో సిబ్బంది ఉంటే వేటగాళ్లను నియంత్రిచవచ్చు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాగా దీనిపై ఎన్ఎస్టీఆర్ ఆత్మకూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా వివరణ కోరగా ప్రస్తుతం సిబ్బంది కొరత ఉందని, కింది స్థాయిలో రిక్రూట్మెంట్ జరగడం లేదని, తమ వరకు పులుల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఎవరీ వేటగాళ్లు... నల్లమల పులి ఆహారానికి పీడగా మారిన వేటగాళ్ల గురించి ఆరా తీస్తే కొన్ని ఆసక్తి కర విషయాలు బయట పడుతున్నాయి. ప్రధానంగా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో వేటగాళ్ల కదలికలను గమనిస్తే అవి ఎక్కువగా మండలంలోని వెంకటాపురం, నల్లకాల్వ, కొత్తరామాపురం,సిద్దాపురం పరిధిల్లోనే కనిపిస్తున్నాయి. మండలంలోని మాజీ నేరస్తుల ఆవాస గ్రామానికి చెందిన కొందరు దాదాపు ప్రతి గ్రామంలోనూ తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ అక్రమ మద్యం దుకాణాలు నడుపుతున్నారు. ఆయా గ్రామాల్లో ఉండే లుంపెన్ తరగతులకు చెందిన యువకులను తమ వెంట తిప్పుతూ ఇటు నాటుసారా అక్రమ రవాణాకు, అటు వన్యప్రాణుల వేటకు వినియోగించుకుంటున్నారు. -
దారి లేకనే దాడులు!
సాక్షి, హైదరాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను పెద్దపులుల దాడులు వణికిస్తున్నాయి. శుక్రవారం కాగజ్‌నగర్ మండలం నజ్రుల్ నగర్ గ్రామం వద్ద మోర్లె లక్ష్మి అనే యువతిపై పెద్దపులి దాడిచేసి చంపేయగా, తాజాగా మరోక్తిపై ఇవాళ దాడి చేసింది. దీంతో.. జిల్లాలో ప్రజలకు మరోసారి పులి భయం పట్టుకొంది. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న పులులు.. రిజర్వు అడవుల్లోని కోర్ ఏరియాలకు వెళ్లే దారిలో రోడ్లు, గ్రామాలు అడ్డుగా ఉండటంతోనే అవి మనుషులపై దాడులు చేస్తున్నాయని అటవీశాఖ అధికారులు అంటున్నారు. గత నాలుగేళ్లలో ఈ ప్రాంతంలో పులుల దాడిలో నలుగురు మరణించారు.ఈ ప్రాంతం మహారాష్ట్ర– తెలంగాణ మధ్యలోని టైగర్ కారిడార్‌లో భాగంగా ఉన్నది. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్‌ల నుంచి ఆవాసం, తోడు వెతుక్కుంటూ పులులు వస్తున్నాయి. దీంతో మనుషులు–పులుల మధ్య ఘర్షణ ఏర్పడుతున్నది. నవంబర్–డిసెంబర్ నెలలు పులుల సంతానోత్పత్తికి అనువుగా ఉంటాయి. ఈ సమయంలో వాటికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే కోపంతో దాడులకు దిగే అవకాశాలున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. పెరిగిన సంచారం ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లోని టైగర్ కారిడార్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో నాలుగైదు పులులు సంచరిస్తున్నట్టు గుర్తించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బండికాన, ధాబా గ్రామాల శివార్లలో ఆదివారం పశువులపై ఒక పులి దాడి చేసింది. అది మంగళవారం కూడా అక్కడే సంచరించింది. ఆ తర్వాత ఎకో వంతెన సమీపంలోని ఖిండి దేవస్థానం మీదుగా వెళ్లినట్లు కొందరు గ్రామస్తులు తీసిన వీడియోల్లో వెల్లడైంది. ఈ నెల 21న ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల్లో ఓ పెద్దపులి పశువులపై దాడి చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.ఈ నెల 17న నిర్మల్ జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లాలోకి వచి్చన పెద్దపులి.. ఉట్నూరు మండలం చాండూరు గ్రామ శివారులో రాజుల్‌గూడ గ్రా మానికి చెందిన ఓ రైతు ఎద్దుపై దాడి చేసింది. గతంలో పెద్దపులుల సంచారం అంతగా లేని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి పరిధిలోనూ పులి కనిపించింది. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ పులుల సంచారం పెరగడాన్ని పర్యావరణ ప్రేమికులు, అటవీ అధికారులు స్వాగతిస్తుండగా, ఆయా పరిసర గ్రామాల ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వలస ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)లోని కోర్ ఏరియాలోకి పులులు వెళ్లలేకపోవడం సమస్యగా మారిందని అటవీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్తోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్‌లలో పులుల సంతతి బాగా పెరిగింది. దీంతో శాశ్వత ఆవాసానికి తగిన అటవీ ప్రాంతం, ఆహారం లభించక కొన్ని పులులు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆడ పులుల తోడును వెతుక్కుంటూ మగ పులులు ఆదిలాబాద్ జిల్లాలోని పులుల కారిడార్లోకి, సమీప గ్రామాల్లోకి అడుగు పెడుతున్నాయి. దాదాపు నెలరోజుల వ్యవధిలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్, కుంటాల, సారంగాపూర్, మామడ, పెంబి మండలాలు.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, బెల్లంపల్లి.. కెరమెరి మండలంలోని లక్మాపూర్, కరంజివాడ ప్రాంతాల్లో నాలుగైదు పులులు కనిపించాయి. కవ్వాల్ టైగర్ రిజర్వు అనుకూలమైనా.. కవ్వాల్ టైగర్ రిజర్వులోని కోర్ ఏరియాలో పులుల శాశ్వత ఆవాసాలకు అనుకూల పరిస్థితులున్నా.. మధ్యలో రోడ్లు, పోడు భూములు, గ్రామాలు ఉండడం వల్ల అవి అక్కడికి చేరుకోలేకపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. టైగర్ రిజర్వుల్లోని కోర్ ఏరియా, పులుల అవాస ప్రాంతాల నుంచి కొన్ని గ్రామాల తరలింపు జరగకపోవడం వల్లే ఈ సమస్య పెరిగిందనే అంటున్నారు. కవ్వాల్, అమ్రాబాద్ రిజర్వు ఫారెస్టులోని కోర్ ఏరియాలో ఉన్న పలు గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించాలని కేంద్ర ప్రభుత్వ పరిధిలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్¯ అథారిటీ నిర్ణయించింది.ఇప్పటికే కవ్వాల్ టైగర్ రిజర్వులోని రెండు గ్రామాలను బయటకు తరలించగా, మరో రెండు గ్రామాల తరలింపునకు ప్రతిపాదించారు. కేటీఆర్‌లోని మూడు గ్రామాలను మొదటి దశలో, మరో పెద్ద గ్రామాన్ని రెండోదశలో బయటకు పంపించేందుకు ప్రతిపాదనలు తుదిదశకు చేరుకున్నాయి. ఈ గ్రామాల తరలింపు పూర్తయితే పులుల స్థిర నివాసానికి మరింత సానుకూల వాతావరణం ఏర్పడుతుందని అటవీశాఖ అంచనా వేస్తోంది. -
జంతు దాడుల పరిహారం రూ. 20 లక్షలకు పెంపుపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల దాడుల ఘటనల్లో మరణించిన వారికి ఇచ్చే నష్టపరిహారాన్ని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిహారాన్ని రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. శుక్రవారం కొండా సురేఖ అధ్యక్షతన అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ గవరి్నంగ్ బాడీస్ సమావేశం జరిగింది.ఈ భేటీలో సురేఖ మాట్లాడుతూ ఆమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ల పరిధిలోని గ్రామాల తరలింపు ప్రక్రియ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్నందున వారిలో విశ్వాసాన్ని కల్పిస్తూ పునరావాస ప్రక్రియను చేపట్టాలని అధికారులకు సూచించారు. పునరావాసం కోసం తరలించిన కుటుంబాలకు శాశ్వత పట్టాలు అందించాలని, రాకపోకల నిమిత్తం గ్రీన్ పాసులు అందించాలని, స్కూల్ ఏర్పాటు చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు మంత్రిని కోరారు. సాధారణ అటవీ ఉత్పత్తులను సేకరించే స్థానికులపై మానవత్వం చూపాలని మంత్రి అధికారులకు సూచించారు. అక్కమహాదేవి గుహలు, సలేశ్వరం జాతరకు సౌకర్యాలు దోమలపెంట–శ్రీశైలం ఎకో టూరిజం సర్క్యూట్లో భాగంగా అక్కమహాదేవి గుహలను సందర్శించే భక్తులకు యాత్రా సౌకర్యాల కల్పనకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం జాతరను భవిష్యత్తులో చేపట్టనున్న సర్క్యూట్లలో చేర్చి ప్రభుత్వపరంగా యాత్రా సౌకర్యాలను కలి్పంచే దిశగా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఈ భేటీలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్. భూపతిరెడ్డి, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డోబ్రియాల్, పిసిసిఎఫ్ (వైల్డ్ లైఫ్) ఏలూసింగ్, డీసీసీఎఫ్ ఆంజనేయులు(హెడ్ ఆఫీస్), ఓఎస్డీ శంకరన్ పాల్గొన్నారు. -
నాడు సాగర్.. నేడు టైగర్..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలోని నల్లగొండ జిల్లా చందంపేట మండలం పొగిళ్ల గ్రామానికి చెందిన ప్రజలందరిదీ ఒకటే ఆవేదన. ఇప్పుడు పులుల సంరక్షణ పేరుతో తమను పంపించాలని చూస్తున్నారని వాపోతున్నారు. తాము ఎక్కడికీ వెళ్లేది లేదని, గ్రామాన్ని వదిలేది లేదని స్పష్టం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..దేవరకొండకు 60 కిలోమీటర్ల దూరంలో అడవి లోపల ఉండే పొగిళ్ల గ్రామాన్ని జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్టీసీఏ) స్వచ్ఛంద గ్రామ తరలింపు కార్యక్రమం (వీవీఆర్‌పీ) కింద మైదాన ప్రాంతానికి తలించేందుకు కసరత్తు ప్రారంభించింది. నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో వాటి సంరక్షణతో పాటు అటవీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మెరుగైన జీవన స్థితిగతులను కల్పిం చేందుకు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఇటీవల గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు. దేవరకొండ సమీపంలోని ముదిగొండ వద్ద పునరావాసం కల్పిస్తామని, యూనిట్‌కు (భార్యాభర్తలు ఒక యూనిట్, 18 ఏళ్లు దాటి, వివాహం కాని వారు ఒక యూనిట్‌గా) రూ.15 లక్షలు.. లేదంటే వారికున్న మేరకు భూమి ఇస్తామని చెబుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రోడ్లు, ఇతర అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెబుతున్నారు. 500 కుటుంబాలు.. 2 వేల జనాభా పొగిళ్ల గ్రామంలో ప్రస్తుతం దాదాపు 2 వేల జనాభా ఉండగా 500 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడి రైతులు నాగార్జునసాగర్ వెనుక జలాల నుంచి దాదాపు 5 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఏర్పాటు చేసుకొని దాదాపు 2 వేల ఎకరాల్లో పంటలను సాగు చేసుకుంటున్నారు. ఇక్కడ మిర్చి, పత్తి అధికంగా సాగవుతుండటంతో పక్క గ్రామాల నుంచి కూడా కూలీలు ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు గ్రామాన్ని ఖాళీ చేయమంటుండడంతో అందరి పరిస్థితీ అయోమయంగా మారింది.నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు మా గ్రామం (సూర్యాపేట) ముంపునకు గురవుతుందని అక్కడి నుంచి పంపించారు. ఇక్కడికొచ్చి 60 ఏళ్లు అవుతోంది. అప్పుడు చెట్లు, రాళ్లు రప్పలే ఉన్న ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకున్నాం. గొడ్డుచాకిరీ చేస్తే ఊరికి ఇప్పుడో రూపం వచ్చింది. భూమిని బాగు చేసుకొని, వ్యవసాయం చేస్తూ బతుకుతున్నాం. ఇప్పుడు మళ్లీ పొమ్మంటున్నారు. ఎక్కడికెళ్లాలి - 75 ఏళ్ల ముత్తమ్మ, పొగిళ్ల గ్రామంఅప్పట్లో ఇక్కడ మొత్తం అడవే. అందులోనే తిరిగాం. అందులోనే ఉన్నాం. మాపై ఏజంతువూ దాడి చేయలేదు. ఐదు ఎకరాల భూమిని బాగు చేసుకొని బతుకుతున్నాం. సాగర్ వెనుక జలాలకు మోటార్లు పెట్టి, కిలో మీటర్ల పొడవునా పైపులైన్లు వేసుకొని పంటలు పండించుకుంటున్నాం. ఒక్కొక్కరికి రూ.15 లక్షల వరకు ఖర్చయింది. ఇప్పుడు పులుల పేరుతో పొమ్మంటున్నారు. ఇక్కడి నుంచి మేం వెళ్లిపోతే అవన్నీ ఇస్తారా? - మేకల పిచ్చయ్య, పొగిళ్ల గ్రామం వారు వెళతామంటేనే పంపిస్తాం కేంద్ర ప్రభుత్వం టైగర్ రిజర్వులోఉన్న ప్రజలకు మెరుగైన జీవనం కల్పిం చేందుకు, వన్యమృగాలను సంరక్షించేందుకు ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. బలవంతంగా ఎవరినీ పంపించదు. వారు వెళతామంటేనే పంపిస్తారు. ఈ పథకం గురించి వారికి తెలియజేయాలనే సమావేశం పెట్టాం. ఇక్కడి ప్రజలు ఒప్పుకుంటేనే ప్రభుత్వానికి తెలియజేస్తాం. – పి.రాజశేఖర్, నల్లగొండ జిల్లా అటవీశాఖ అధికారి -
దీని కళ్లను చూడండి : హిప్నటైజ్ చేసేయగలవు, జాగ్రత్త!
అనంతమైన ప్రకృతిలో మనకు తెలియని ఎన్నోరహస్యాలు, మరెన్నో విశేషాలు దాగి ఉంటాయి. అలాంటి విశేషాలు వెలుగులోకి వచ్చినపుడు వావ్ అనిపిస్తుంటుంది. తాజాగా కర్ణాటకలో ఉన్న బందీపూర్ టైగర్ రిజర్వ్ లో ఒక అరుదైన చిరుతను గుర్తించారు. దీనికి సంబంధించిన విశేషాలను తమిళనాడు, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి సుప్రిహ సాహు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్ అవుతోంది.‘‘జాగ్రత్త ఈ చిరుత కళ్ళు మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తాయి. భారతదేశంలో ఇలాంటి ఫోటోను తీయడం ఇదే తొలిసారి బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో రెండు వేర్వేరు రంగుల కళ్లతో ఉన్న చిరుతపులిఫోటోను ధృవ్ పాటిల్ తీశారు. ఎంత అపురూపం, హెటెరోక్రోమియా ఇరిడియం అనేది చాలా అరుదైన జన్యు పరివర్తన వలన రెండు కళ్లకు వేర్వేరు రంగుల్లో ఉంటాయి.’’ అని ఆమె ట్వీట్ చేశారు. దీంతో అద్భుతం అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. హెటెరోక్రోమియా ఇరిడియం గురించి ఇపుడే తెలుసుకుంటున్నా.. అద్భుత మైన ఫోటో నన్ను మెస్మరైజ్ చేస్తోంది. మరొకరు కమెంట్ చేశారు.Beware ! The eyes of this leapord will hypnotise you. In a first documentation of its kind in India, a leopard with two different coloured eyes has been photographed in Bandipur Tiger Reserve by Dhruv Patil. How incredible ! Heterochromia Iridium is a very rare genetic mutation… pic.twitter.com/cR1i9VAa6u— Supriya Sahu IAS (@supriyasahuias) August 3, 2024 -
‘ప్లాస్టిక్ఫ్రీ జోన్’గా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్
సాక్షి, హైదరాబాద్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను జూలై ఆఖరులోగా పూర్తి ప్లాస్టిక్ రహిత జోన్‌గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై నిషేధం అమలు చేయాలన్నారు. బుధవారం సచివాలయంలో అటవీ, పంచాయతీరాజ్, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎస్ మాట్లాడారు. కాగితపు సంచులు, జనపనార సంచులు, విస్తరాకులు మొదలైన పర్యావరణ అనుకూల ఉత్పత్తుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడానికి అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో అదనపు చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. టైగర్ రిజర్వ్‌లో ప్లాస్టిక్ నిషేధం గురించి హైవే వెంట ఉన్న స్థానిక వ్యాపారులకు అవగాహన కల్పించాలని చెప్పారు.ఈ రిజర్వ్ పరిధిలోని నాలుగు ఆవాసాల్లో నివాసముంటున్న ప్రజలను తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. హరిత నిధి కింద ఉన్న నిధులను సంబంధిత ఆర్థిక సంవత్సరంలోనే వినియోగించుకోవాలని సూచించారు. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లాలోని మైసమ్మ ఆలయంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి వాణీ ప్రసాద్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పీసీసీఎఫ్ డోబ్రియాల్, పీసీబీ సభ్య కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్, ఎండోమెంట్స్ కమిషనర్ హనుమంత రావు పాల్గొన్నారు -
పదేళ్లుగా అధికారులను అరిగోస పెట్టిన అరికొంబన్.. చివరకు
ఇడుక్కి(కేరళ): రేషన్ దుకాణాల్లోకీ, ఇళ్లలోకీ చొరబడి బియ్యాన్ని బొక్కేస్తున్న ఏనుగు అరికొంబన్(25)ను ఎట్టకేలకు కేరళ అటవీ అధికారులు పట్టుకుని, మరో చోటుకు తీసుకెళ్లి వదిలేశారు. అరికొంబన్ ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని, దానికి బిగించిన రేడియో కాలర్ ద్వారా టైగర్ రిజర్వులో ఎక్కడ ఉన్నదీ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని అధికారులు తెలిపారు. అరికొంబన్ మళ్లీ జనావాసాల్లోకి వచ్చే అవకాశాలు మాత్రం లేవన్నారు. ఇడుక్కి జిల్లా చిన్నకనల్, సంతన్‌పర కొండ ప్రాంతాల్లోని నివాసాల్లో దాదాపు దశాబ్ద కాలంగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందీ గజరాజు. బియ్యం మాత్రమే స్వాహా చేస్తున్న ఈ గజరాజుకు అరి కొంబన్(మలయాళంలో అరి అంటే బియ్యం, కొంబన్ అంటే ఏనుగు)గా పేరు వచ్చింది. అరికొంబన్‌ను ఏం చేయాలన్న అంశం పలు వివాదాలకు దారితీసింది. అరికొంబన్‌ను పట్టుకుని, శిక్షణ ఏనుగు(కుమ్కి)గా మార్చేందుకు చేసిన ప్రయత్నాలను కేరళ హైకోర్టు అడ్డుకుంది. హైకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ అరికొంబన్‌ను జనావాసాలకు దూరంగా పరాంబికులమ్ టైగర్ రిజర్వులో వదిలి వేయాలని సూచించింది. దీనిపైనా నిరసనలు వ్యక్తమయ్యాయి. చివరికి కేరళ ప్రభుత్వం సూచనలతో.. ఆ ఏనుగును వదిలి వేసే ప్రాంతాన్ని చివరి వరకు రహస్యంగా ఉంచాలన్న ప్రత్యామ్నాయం ఆచరణలోకి వచ్చింది. దీని ప్రకారం..అరికొంబన్‌కు మత్తిచ్చేందుకు శనివారం ఉదయం నుంచి ప్రయత్నాలు మొదలయ్యాయి. లాభం లేకపోవడంతో అరికొంబన్‌కు ప్రధాన పోటీదారుగా ఉన్న మరో ఏనుగును తీసుకొచ్చాక సాయంత్రానికి మత్తు ఇంజక్షన్ ఇవ్వడం సాధ్యపడింది. తర్వాత దట్టమైన అటవీ ప్రాంతానికి తరలించి ర్యాంప్ మీదుగా వదిలిపెట్టినట్టు అధికారులు తెలిపారు. -
కొత్త టైగర్ రిజర్వ్ .. చాన్సున్నా చర్యల్లేవ్?
రాష్ట్రంలో కొత్త టైగర్ రిజర్వ్‌ల ఏర్పాటుకు అన్ని సానుకూల పరిస్థితులున్నా అధికార యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లవుతున్నా ఒక్కటంటే ఒక్కటీ కొత్త టైగర్ రిజర్వ్ ఏర్పడలేదు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లు ఉండగా, కొత్తగా కనీసం రెండు పులుల అభయారణ్యాల ఏర్పాటుకు అవకాశం ఉంది. కొత్త టైగర్ రిజర్వ్ ఏర్పాటుకు కాగజ్‌నగర్, కిన్నెరసాని, ఏటూరునాగారంలలో సానుకూల వాతావరణం ఉంది. అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో నిధులొచ్చే అవకాశమున్నా రాష్ట్ర ప్రభుత్వపరంగా ముఖ్యంగా అటవీశాఖ నుంచి గట్టి ప్రయత్నాలు సాగడం లేదనే విమర్శలున్నాయి. – సాక్షి, హైదరాబాద్ తగ్గిన పులుల ఆక్యుపెన్సీ తాజాగా విడుదలైన టైగర్ స్టేటస్ రిపోర్ట్–2022లోనూ రాష్ట్రంలో ‘పులుల ఆక్యుపెన్సీ’ తగ్గిందని ప్రత్యేకంగా పేర్కొన్నారు. కొత్త టైగర్ రిజర్వ్ ఏర్పాటు ద్వారా రాష్ట్రానికి వివిధ ప్రయోజనాలు చేకూరే అవకాశమున్నా గట్టి ప్రయత్నాలు జరగడం లేదనే ఆరోపణలున్నాయి. 2014 తర్వాత దేశవ్యాప్తంగా కొత్తగా 8, 9 పులుల అభయారణ్యాలు ఏర్పడినా, రాష్ట్రానికి ఒక్కటి కూడా రాకపోవడానికి ఈ దిశలో కనీసం ప్రతిపాదనలు కూడా కేంద్రానికి చేరలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా వీటి ఏర్పాటుకు అటవీశాఖ ప్రతిపాదనలు పంపితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కవ్వాల్‌లో కనిపించని స్థిరనివాస పులులు! ఉమ్మడి ఏపీలో 2012లో కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) ఏర్పడింది. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో భాగంగా ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని రాష్ట్ర విభజన అనంతరం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌గా (ఏటీఆర్) ప్రకటించారు.ప్రస్తుతం అమ్రాబాద్‌లో పులులు పుష్కలంగా ఉన్నాయని, 2018తో పోలి్చతే వాటి సంఖ్య గణనీయంగా పెరిగిందనే అంచనాలున్నాయి. కవ్వాల్‌లోని చెన్నూరు డివిజన్లో స్థిరనివాసం ఏర్పరచుకున్న పులులే కనిపించకపోవడం ఆందోళన రేపుతోంది. ఎన్ని ఆడపులులు సంతానోత్పత్తి చేస్తున్నాయనే అంశం ప్రాతిపదికన ఆ టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య వృద్ధికి అవకాశముంది, ప్రస్తుతం ఏటీఆర్‌లో కనీసం ఏడు ‘బ్రీడింగ్ ఫిమేల్ టైగర్స్’ ఉండటంతోపాటు కనీసం నాలుగు ఆడపులులు పిల్లలు పెట్టి వాటిని సంరక్షిస్తున్నాయని ఈ ప్రాంతంతో పరిచయమున్న నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏటీఆర్‌లో 30 దాకా పులులు (నాలుగైదు పులి పిల్లలు కలుపుకొని) ఉండగా, కేటీఆర్‌లో అసలు పులులే కనిపించని పరిస్థితులు ఏర్పడినందున కొత్త టైగర్ రిజర్వ్‌ల ఏర్పాటు అవశ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగజ్‌నగర్‌లో కనిపిస్తున్నాయ్... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకునే ఉన్న మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పెద్దపులుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో తెలంగాణలోకి వాటి వలసలు పెరిగాయి. ప్రస్తుతం కొంతకాలంగా పులులు లేని ప్రాంతంగా కవ్వాల్ నిలుస్తోంది. దీని బయట టైగర్ కారిడార్‌లో ముఖ్యంగా కాగజ్‌నగర్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవి కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మూడో టైగర్ రిజర్వ్‌ను కాగజ్‌నగర్ ఏరియాలో ఏర్పాటు చేసి ఉంటే పులుల సంరక్షణకు పెద్దమొత్తంలో కేంద్ర నిధులు రావడంతోపాటు ఉద్యోగుల కేటాయింపు, స్థానికులకు ఉపాధి పెరిగే అవకాశం ఉండేదంటున్నారు. టైగర్ సఫారీ వంటి వాటికీ పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తారని, దీనివల్ల ఈ ప్రాంతానికి మరింత ప్రాచుర్యం లభిస్తుందని చెబుతున్నారు. మహారాష్ట్రలోని తడోబా, అంధారీ ప్రాంతానికి పక్కనే ఈ ప్రాంతం ఉండటంతోపాటు.. అక్కడి నుంచే పులులు ఇక్కడకు వస్తున్నందున మరో టైగర్ రిజర్వ్ ఏర్పాటుచేస్తే ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని అంటున్నారు. వైల్డ్‌లైఫ్ శాంక్చురీగా ఉన్న కిన్నెరసాని, ఏటూరు నాగారంలోనూ పులుల సంచారం ఉన్నందున వాటిని కూడా టైగర్ రిజర్వ్‌గా ప్రకటించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ మూడింటిలో కనీసం రెండుచోట్ల టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో టైగర్ రిజర్వ్‌ను ఏర్పాటు చేసినా అడవులు, పర్యావరణానికి మేలు చేకూరుతుందని అంటున్నారు. రాష్ట్రంలో పులుల అభయారణ్యానికి సానుకూలంగా ఉన్న ప్రాంతాలు 1. కాగజ్‌నగర్ 2. కిన్నెరసాని 3. ఏటూరు నాగారం -
తెప్పకడు ఎలిఫెంట్ క్యాంపును సందర్శించిన మోదీ
-
ఆస్కార్ విజేతలను కలిసిన ప్రధాని నరేంద్ర మోదీ
-
దేశంలో ఎన్ని పులులు ఉన్నాయంటే..? లెక్క చెప్పిన ప్రధాని మోదీ..
ఒకప్పుడు సరదా కోసం పులుల్ని వేటాడేవారు. ఆ తర్వాత కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు పులుల్ని బలి తీసుకున్నాయి. ప్రకృతి సమతుల్యతకి పులులెంత విలువైనవో ఆ తర్వాత మనకి తెలిసి వచి్చంది. 50 ఏళ్ల క్రితం మొదలు పెట్టిన టైగర్ ప్రాజెక్టు వల్ల పులుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. ప్రపంచంలోనే పులుల సంరక్షణ అంశంలో భారత్ అనుసరిస్తున్న విధానాలు ప్రపంచదేశాలకు మార్గదర్శకంగా మారాయి. నాలుగేళ్లకొకసారి అభయారణ్యాలలో పులుల్ని లెక్కించే ప్రక్రియ ఆసక్తికరంగా మారి గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. మన దేశంలో పులుల సంరక్షణ కోసం 50 ఏళ్ల క్రితమే టైగర్ ప్రాజెక్టు మొదలైంది. పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి సమతుల్యతకి పులులు ఎంత ముఖ్యమో గ్రహించిన అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 1973, ఏప్రిల్ 1న ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది. అప్పట్లో దేశీయంగా అంతరించడానికి సిద్ధంగా ఉన్న జాబితాలో పులులు చేరిపోయాయి. ఇరవయ్యో శతాబ్దంలో ప్రపంచ దేశాల్లో పులుల సంఖ్య లక్ష ఉంటే, మన దేశంలో 40 వేలు ఉండేవి. అలాంటిది 1970 నాటికి పులుల సంఖ్య దాదాపుగా 1,800కు పడిపోవడంతో కేంద్రం అప్రమత్తమైంది. అభివృద్ధి పేరిట అడవులకి, వన్యప్రాణులకి ఎంత నష్టం జరుగుతోందో గ్రహించి టైగర్ ప్రాజెక్టుని ప్రారంభించింది. తొలిదశలో 18,278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తొమ్మిది టైగర్ రిజర్వ్‌లు ఉండేవి. ప్రస్తుతం 75 వేల చదరపు కిలోమీటర్లు (దేశ భౌగోళిక విస్తీర్ణంలో 2.4%) విస్తీర్ణంలో 53కి పైగా టైగర్ రిజర్వులున్నాయి. ప్రపంచంలో మొత్తం పులుల్లో మన దేశంలో 70% ఉన్నాయంటే ఈ టైగర్ ప్రాజెక్టు ఎంతటి విజయాన్ని సాధించిందో తెలుస్తోంది. పులులను ఎలా లెక్కిస్తారంటే! దేశంలో పులుల సంరక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి వాటి గణన చేపట్టినప్పుడు అదో పెద్ద సవాల్‌గా నిలిచింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో తొలినాళ్లలో అటవీ సిబ్బంది అడవుల్లో నడుచుకుంటూ వెళ్లి వన్యప్రాణులు కనిపిస్తే వాటి గుర్తులతో సహా ఎన్ని కనిపించాయో వివరాలను రాసుకొని లెక్కించేవారు. ఆ తర్వాత పగ్ మార్క్ విధానం అమల్లోకి వచ్చింది. పులుల పాద ముద్రలనే వాటిని లెక్కించడానికి వాడేవారు. మనుషుల వేలిముద్రలన్నీ ఎలా ఒక్కలా ఉండవో పులుల పాద ముద్రలు కూడా ఒకేలా ఉండవు. అలా పాదముద్రల్ని బట్టి ఎన్ని పులులు ఉన్నాయో గుర్తించేవారు. బటర్ పేపర్‌పై స్కెచ్‌పెన్‌తో పాద ముద్ర ఆకారాన్ని గీస్తారు. గాజుపలకపై తెల్లటి కాగితాన్ని ఉంచి ఆకారాన్ని దానిపై పడేలా చేస్తారు. నేలపై ఉన్న ముద్రల మీద చాక్‌పౌడర్ చల్లి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిశ్రమాన్ని కలిపేవారు. ఆ మిశ్రమం గడ్డ కట్టి పులి పాదం అచ్చు లభించేది. ఆ పాద ముద్ర ఆధారంగా ఎన్ని పులులు తిరిగాయి, వాటి వయసు వంటివి తెలుసుకునేవారు. ఒక దశలో వన్యప్రాణుల గోళ్లు, మలం సేకరించి దాని ఆధారంగా కూడా గణన జరిగేది. కొన్నేళ్లు గడిచాక మరో కొత్త విధానాన్ని మొదలు పెట్టారు. పులులు చేతికి చిక్కినప్పుడు వాటిపై ప్రత్యేకమైన ముద్ర వేసేవారు. మళ్లీ వాటిని అడవుల్లో వదిలేసి ఆ తర్వాత లెక్కించే సమయంలో ముద్ర ఉందో లేదో చూసేవారు. ముద్ర లేని పులులు కనిపిస్తే కొత్తగా జాబితాలో వచ్చి చేరేవి. గత కొన్నేళ్ల నుంచి అత్యాధునిక కెమెరాలు వినియోగించి పులుల సంఖ్యని గణిస్తున్నారు. ఎక్కువగా పులులు సంచరించే ప్రాంతాలను గుర్తించి అక్కడ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా జాతీయ పులుల సంరక్షణ అథారిటీ అధికారులు చెప్పారు. అడవుల్లో ఇరువైపులా ఉన్న చెట్లకు కెమెరాలు ఫిక్స్ చేయడం వల్ల పులులతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉండే వన్యప్రాణుల గురించి కూడా తెలుస్తుంది. ఇక పులుల ఎత్తు, వాటి నడక, వాటి శరీరంపై ఉండే చారల ఆధారంగా సంఖ్యను తెలుసుకుంటారు. గిన్నిస్ రికార్డుల్లోకి పులుల గణన మన దేశంలో పులుల గణన రికార్డులు తిరగరాసింది. కెమెరాల సాయంతో భారీగా వన్యప్రాణుల గణన చేపట్టిన తొలి దేశంగా భారత్ గిన్నిస్ రికార్డులకెక్కింది. 2018–2019 పులుల గణన ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైనది. 141 ప్రదేశాల్లో 26,838 చోట్ల మోషన్ సెన్సర్లున్న కెమెరాలు అమర్చారు. ఈ ప్రక్రియలో 44 వేల మంది అధికారులు, జీవ శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 20 రాష్ట్రాల్లో రహస్య కెమెరాలు, ఇతర పద్ధతుల్లో పులులతో పాటు ఇతర వన్యప్రాణుల్ని లెక్కించడం రికార్డు సృష్టించింది. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో మోదీ ప్రాజెక్టు టైగర్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలో బందిపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పర్యటించారు. పశి్చమ కనుమల్లో ఉన్న ఈ అభయారణ్యంలో ఓపెన్ జీపులో దాదాపుగా 20 కి.మీ. దూరం ప్రయాణించి ప్రకృతి అందాలను తిలకించారు. కాకీప్యాంట్, షర్టు, నెత్తిన టోపి ధరించిన ప్రధాని మోదీ బందిపూర్ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘‘బందిపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉదయం గడిపాను. భారత దేశ ప్రకృతి రమణీయతను, వన్యప్రాణుల్లో వైవిధ్యాన్ని ఆస్వాదించాను’’ అని ట్వీట్లో పేర్కొన్నారు. బైనాక్యులర్స్ ద్వారా వన్యప్రాణుల్ని చూస్తూ, కెమెరాలో వాటిని బంధిస్తూ గడిపారు. గజరాజులతో ఆప్యాయంగా తర్వాత బందీపూర్ రిజర్వ్‌కు 12 కిలోమీటర్ల దూరంలో తమిళనాడులో మదుమలైలోని తెప్పకాడు ఏనుగుల శిబిరాన్ని మోదీ సందర్శించారు. ఏనుగులతో సరదాగా గడిపారు. ఇటీవల ఆస్కార్ అవార్డు పొందిన ఎలిఫెంట్ విస్పరర్స్ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన మావటి దంపతులు బొమ్మన్, బెళ్లిలను సన్మానించారు. వారితో కలిసి ఏనుగులకు చెరుకులు తినిపించారు. వారిని ఢిల్లీకి ఆహా్వనించారు. బుక్లెట్ విడుదల.. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ కలసికట్టుగా ముందుకు వెళ్లడానికి భారత్ ప్రాధాన్యమిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పులుల సంరక్షణ కోసం ఉద్దేశించిన టైగర్ ప్రాజెక్టుకు 50 ఏళ్లయిన సందర్భంగా ఆదివారం మైసూరులోని కర్ణాటక స్టేట్ ఓపెన్ వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘‘ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియెన్స్’’ (ఐబీసీఏ) ప్రాజెక్టును ప్రారంభించారు. వచ్చే 25 ఏళ్లలో పులుల సంరక్షణకు చేపట్టబోయే చర్యలతో ‘‘అమృత్ కాల్ కా టైగర్ విజన్’’ బుక్‌లెట్‌ను విడుదల చేశారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రపంచదేశాలు చేపట్టాల్సిన అతి ముఖ్యమైన అంశమని చెప్పారు. దేశంలో పులుల తాజా గణాంకాలను ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు. 2022 నాటికి దేశంలో పెద్ద పులుల సంఖ్య 3,167కు పెరగడం హర్షణీయమన్నారు. ‘‘పులుల సంరక్షణ ద్వారా భారత్ ప్రకృతి సమతుల్యత సాధించింది. ఇది ప్రపంచానికే గర్వకారణం. ఒకప్పుడు దేశంలో అంతరించిన జాబితాలో చేరిన చీతాలను నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తెచ్చాం. వాటి సంతతిని విజయవంతంగా పెంచుతున్నాం’’ అని చెప్పారు. పులులు, సింహాలు, చిరుతపులులు, మంచు చిరుతలు, ప్యూమా, జాగ్వార్, చీతా వంటి వన్యప్రాణుల్ని సంరక్షించడానికే ఐబీసీఏ ప్రాజెక్టుకు తెర తీసినట్టు చెప్పారు. Some more glimpses from the Bandipur Tiger Reserve. pic.twitter.com/uL7Aujsx9t — Narendra Modi (@narendramodi) April 9, 2023 చదవండి: కాంగ్రెస్‌కు మరో కొత్త సమస్య..నిరాహార దీక్ష చేస్తానంటున్న సచిన్ పైలట్ -
Viral Video: ఏనుగుల బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉంటుందో తెలుసా!
-
ఏనుగుల బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉంటుందో తెలుసా! వీడియో వైరల్
మాములుగా అడవిలో ఉండే జంతువులు తమకు నచ్చని ఆహారాన్ని స్వేచ్ఛగా తినేస్తాయి. అదే జంతుశాలలోనూ లేదా టైగర్ రిజర్వ్లలోనూ ఉంటే వాటి బాగోగులను నిర్వహణ అధికారులే చూస్తారు. అయితే అక్కడ వాటికి ఆహారం ఎలా అందిస్తారో, ఎలా తయారు చేస్తారో వంటి వాటికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏనుగులన్ని ఎలిఫెంట్ క్యాంప్ వద్ద బ్రేక్ ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాయి. వాటికోసం పశువైద్యులు బియ్యం, రాగులు, బెల్లం కలిపిన ఆహారాన్ని పెద్ద పెద్ద సైజు బంతుల్లో తయారు చేసి వాటికి అందిస్తున్నారు. అందులో ఒక ఏనుగు తనకు ముందు పెట్టమన్నట్లుగా తొండంతో శబ్దం చేయడం వీడియోలో చూడవచ్చు. ఇది తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వ్లోనిది. ఈ వీడియోని ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఐతే పలువురు నెటిజన్లు అవి స్వేచ్ఛగా ఆహారం తినేలా చేయాలి, ఇది కరెక్ట్ కాదు అంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: ఆప్ ఎన్నికల అభ్యర్ధి తుపాకీతో డ్యాన్సులు.. వీడియో వైరల్) -
1938 నుంచి తవ్వకాలు.. ఎట్టకేలకు బయటికి
పులుల అభయారణ్యంలో శాంతిబోధను చేసిన బుద్ధుని ఆనవాళ్లు బయటపడ్డాయి. మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ పులుల అభయారణ్యంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఇటీవల జరిపిన తవ్వకాల్లో అత్యంత పురాతనమైన బౌద్ధ ఆలయాలు, ఇతర బౌద్ధ చిహ్నాలు బయటపడ్డాయి. ఏఎస్ఐ ఈ ప్రాంతంలో 1938 నుంచి తవ్వకాలు సాగిస్తోంది. దాదాపు 170 చదరపు కిలోమీటర్ల పరిధిలో సాగిస్తున్న తవ్వకాల్లో ఇటీవల బౌద్ధ ఆలయాలు ఇవి. ఈ ప్రాంతంలో ఏఎస్ఐ జరిపిన తవ్వకాల్లో ఇప్పటి వరకు 26 ఆలయాలు, 26 గుహలు, రెండు స్థూపాలు, రెండు బౌద్ధారామాలు, 46 శిల్పాలు, 24 శిలాశాసనాలు బయటపడ్డాయి. ఇవన్నీ క్రీస్తుశకం ఐదో శతాబ్దానికి చెందినవని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. చదవండి: ఏడు ఖండాలు కాదు ఏక ఖండమే..! -
తల్లి ప్రేమ అంటే ఇదే కదా.. ప్రాణాలు తెగించి.. పులితో పోరాడి..
భోపాల్: పులితో ప్రాణాలకు తెగించి పోరాడి కన్నకొడుకుని కాపాడుకుంది ఓ మహిళ. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ సమీపంలోని జబల్పూర్లో చోటు చేసుకుంది. ఒక పులి రోహనియా గ్రామంలో టైగర్‌రిజర్వ్ వెలుపల తిరుగుతుందని సమాచారం. కానీ ఆ విషయం సదరు మహిళకు తెలియదు. ఆమె తన ఏడాది వయసున్న కొడుకుని తీసుకుని పొలానికి వెళ్లింది. పొలంలోని పొదలమాటున దాగి ఉంది పులి. సదరు మహిళ పొలం పనులు చేస్తుండగా..ఒక్కసారిగా మాటేసిన పులి సదరు బాలుడిపై హఠాత్తుగా దాడి చేసింది. దీంతో ఆమె తన చేతిలో ఏ ఆయుధం లేకపోయినా.. ఆ పులితో ప్రాణాలకు తెగించి పోరాడింది. పులిచేసే ప్రతి దాడిని ఎదుర్కొంటూ...మరోవైపు అరుస్తూ చుట్టుపక్కల వాళ్లను అప్రమత్తం చేసింది. దీంతో గ్రామస్తులంతా వచ్చి ఆ పులిని తరిమికొట్టారు. ఈ ఘటనలో ఆ బాలుడికి తలకు తీవ్రగాయలవ్వగా, తల్లి శరీరమంతా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ తల్లికొడుకు లిద్దరు జబల్పూర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారిద్దరు క్షేమంగానే ఉన్నారని టైగర్ రిజర్వ్ మేనేజర్ భారతి తెలిపారు. -
కవాల్ టైగర్ రిజర్వ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి రమణీయత, జలపాతాలు, ఎటుచూసినా ఆకుపచ్చని అటవీ అందాలతో అలరారుతున్న కవాల్ పులుల రక్షిత అటవీ ప్రాంతంపై అటవీ శాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. పర్యాటకులు, సందర్శకులకు ఉపయోగకరమైన పూర్తి సమాచారంతో తయారుచేసిన సైట్‌ను అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అరణ్యభవన్‌లో మంగళవారం ప్రారంభించారు. చదవండి: అక్కడ ‘కారు’ గెలుపు డౌటే!.. కారణం అదేనా? కవాల్ అటవీ ప్రాంతం ప్రత్యేకత, విస్తరించిన ప్రాంతాలు, జంతువులు, పక్షులు, చెట్ల జాతుల వివరాలు, సందర్శనీయ స్థలాలు, ఎకో టూరిజం ప్రాంతాలు, సఫారీ, అన్లైన్ బుకింగ్ వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కవాల్టైగర్.కామ్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. కాగా... కవాల్ అటవీ ప్రాంతంలో అభివృద్ది చేసిన గడ్డి మైదానాలపై (గ్రాస్ లాండ్స్) ప్రత్యేక బుక్‌లెట్‌ను, రాష్ట్రంలో మరొక పులుల సంరక్షణ కేంద్రం అమ్రాబాద్ టైగర్ రిజర్వు వార్షిక నివేదికను సైతం మంత్రి విడుదల చేశారు. కవాల్ అభయారణ్యం సిబ్బంది బాగా పనిచేస్తున్నారన్న మంత్రి... ఫీల్డ్ డైరెక్టర్ వినోద్‌కుమార్‌ను అభినందించారు. ఇక్కడ ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసిన గడ్డి మైదానాలకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోందని, జాతీయ పులుల సంక్షణ సంస్థ (ఎన్టీసీఏ) నిపుణులు ప్రశంసించారని పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్ తెలిపారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైశ్వాల్, అమ్రాబాద్, కవాల్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్లు, వివిధ అటవీ సర్కిళ్ల అధికారులు పాల్గొన్నారు. -
బెంగాల్ అడవుల్లో అత్యంత అరుదైన క్లౌడెడ్ లెపార్డ్, ఫోటో విడుదల
అత్యంత అరుదైన క్లౌడెడ్ లెపార్డ్ బుక్సా టైగర్ రిజర్వ్‌లో ఇటీవల కనిపించింది. పశ్చిమబెంగాల్ అటవీశాఖ గురువారం ఆ చిరుత ఫోటోను ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఆగ్నేయాసియా, దక్షిణ చైనా గుండా హిమాలయాల దిగువ ప్రాంతానికి వచ్చే ఈ చిరుతలు... ఇప్పుడు అక్కడా అంతరించిపోతున్నాయి. దీంతో 1980 నుంచి ప్రభుత్వాలు ఆ చిరుతలను పెంచే కార్యక్రమాన్ని చేపట్టాయి. అయినా అవింకా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. అలాంటి సమయంలో బుక్సా టైగర్ రిజర్వ్‌లో ఈ చిరుత ఇలా కెమెరా ట్రాప్స్ కంట పడటంతో... ‘అంతర్జాతీయ క్లౌడెడ్ లెపార్డ్ డే’ సందర్భంగా ఆగస్టు 4న బెంగాల్ అటవీ అధికారులు ఆ ఫొటోను షేర్ చేశారు. ఈ చిరుత గర్జించలేదట. అలాగని పిల్లిలా కూతలు కూయదట. మధ్యస్థంగా ఉంటుంది. పిల్లలు వెంట ఉన్నప్పుడు, భాగస్వామితో ఉన్నప్పుడు మాత్రమే ఆగ్రహంతో ఉండే క్లౌడెడ్ లెపార్డ్... మిగతా సమయాల్లో సాధు జంతువంటే నమ్మండి! -
కవ్వాల్‌లో వైల్డ్ డాగ్స్.. పెద్దపులిని కూడా భయపెడుతూ
సాక్షి, జన్నారం(ఆదిలాబాద్): ప్రసిద్ధి చెందిన కవ్వాల్ టైగర్‌జోన్ పరిధిలో అడవికుక్కల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అభయారణ్యం పరిధిలో ఏర్పాటు చేసిన కెమెరాలు, అధికారులు గుర్తించిన ఆనవాళ్లు ఆధారంగా దాదాపు 200 వరకు అడవి కుక్కలు ఉన్నట్లు గుర్తించారు. ఒక్క జన్నారం అటవీ డివిజన్‌లోనే సుమారుగా 90 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పది నుంచి పన్నెండు కుక్కలు గుంపుగా ఉంటూ వన్యప్రాణులపై దాడికి దిగుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి గ్రూపులు జన్నారం డి విజన్‌లో 8 వరకు ఉన్నట్లు సమాచారం. ఈ రేసు కుక్కలు గుంపుగా సంచరిస్తూ అడవిలో నిత్యం అ లజడిని సృష్టిస్తున్నాయి. ఈ కారణంగా పులి రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. వీటి సంఖ్య పెరగడంతోనే ఏడాదిగా కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని జన్నారం అటవీడివిజన్‌లో పులి అడుగు పెట్టడం లేదని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దట్టమైన అటవీప్రాంతం.. దట్టమైన అటవీ ప్రాంతం, రకరకాల వన్యప్రాణులు, జలపాతాలు కలబోసిన కవ్వాల్ అడవులు పులులకు అనువుగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం 2012 ఏప్రిల్‌లో కవ్వాల్ అభయారణ్యాన్ని టైగర్‌జోన్‌గా ప్రకటించింది. ఈ టైగర్‌జోన్‌లోకి ఉమ్మడి అదిలాబా ద్ జిల్లా అడవులు వస్తాయి. 892.23 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియా, 123.12 చదరపు కిలోమీటర్ల బఫర్ ఏరియాగా గుర్తించారు. మహారాష్ట్రలోని తాడోబా, తిప్పేశ్వర్, టైగర్ రిజర్వ్, చతీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్‌జోన్‌లో పులుల సంఖ్య అధికంగా ఉండటంతో కవ్వాల్ టైగర్ జోన్లో పులులు ఆవాసం ఏర్పర్చుకుంటాయని అధికారులు భావించారు. రాక మరిచిన బెబ్బులి.. రేసు కుక్కలుగా గుంపుగా తిరుగుతూ వేటాడుతాయి. వన్యప్రాణులను భయపెట్టే బెబ్బులి సైతం కుక్కల అలజడితో ఇటువైపు తిరిగి చూడటం లేదు. సంఖ్య బలంతో పులిని కూడా అవి భయపెడుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. దీంతో బఫర్ ఏరియా అయిన కాగజ్‌నగర్ డివిజన్లో ఆరుకుపైగా పెద్దపులులు సంచరిస్తుండగా.. వేమనపల్లి, కోటపల్లి ప్రాంతాల్లో కూడా పులి సంచారం ఉంది. కానీ అన్ని విధాలుగా అనుకూలంగా జన్నారం అటవీడివిజన్‌లో మాత్రం సంవత్సర కాలంగా అధికారులు పులి కదలికలను గుర్తించలేదు. పులులకు అనువైన ప్రాంతంగా, ఇక్కడ పదికి పైగా పులులకు సరిపడా వన్యప్రాణులు, ఆవాసాలు ఉన్నట్లు అంచనా వేశారు. తిప్పేశ్వర్, తాడోబా టైగర్ జోన్ల నుంచి కవ్వాల్ టైగర్ జోన్‌కు వచ్చే కారిడర్ నిత్యం అలజడితో ఉండటంతో పులి రాకపోకలు తగ్గిపోయాయి. బఫర్ ప్రాంతాల్లో తిరుగుతున్న పులి.. కోర్ ఏరియాలోకి అడుగు పెట్టకపోవడానికి అనేక కారణాలున్నాయి. రెండేళ్లపాటు రాకపోకలు సాగించిన పులి సంవత్సరం కాలంగా ఇక్కడ కనిపించడం లేదు. కారిడర్ వెంబడి హైవే రోడ్డు పనులు జరుగడం, మధ్యలో రైల్వేలైన్ ఉండటం కూడా ఓ కారణమని అధికారులు పేర్కొంటున్నారు. అలజడితోనే ఇబ్బంది కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో జన్నారం అటవీ డివిజన్ 12 శాతం మా త్రమే ఉంది. ఇక్కడ పులి నివాసానికి అనువైన ప్రదేశాలు ఉన్నాయి. డివిజన్ పరిధిలో ఇటీవల అడవి కుక్కల సంఖ్య పెరిగింది. పులి రాకపోవడానికి అవి కూడా కారణం కావచ్చు. కారిడర్లో నిత్యం అలజ డి ఉండటం, పుశువులు, మనుషుల సంచా రం కారణంగా రాకపోకలు తగ్గిపోయాయి. – సిరిపురం మాధవరావు, ఎఫ్‌డీవో, జన్నారం చదవండి: కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స -
చలో నల్లమల.. 17 నుంచి టూర్ ప్రారంభం
సాక్షి, నాగర్‌కర్నూల్: అడవి గురించి తెలుసుకునేందుకు, వన్యప్రాణులను ప్రత్య క్షంగా వీక్షేందుకు, ఇక్కడ స్థానికంగా ఉన్న చెంచులతో మాట్లాడి వారి స్థితిగతులను అర్థం చేసుకునేందుకు నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అవకాశం కల్పిస్తోంది. వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అమలు చేస్తోంది. నల్లమలలోని అరుదైన, ప్రత్యేకమైన వన్యప్రాణులు, పక్షులు, జీవ, వృక్షజాతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అటవీ సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదించేలా ప్రత్యేక జంగిల్ స్టే ప్యాకేజీలను అమలుపర్చబోతోంది. జంగిల్ స్టే, సఫారీ, ట్రెక్కింగ్‌తో పాటు స్థానిక గిరిజనులతో మమేకమయ్యేలా ప్యాకేజీలను రూపొందించింది. ఈనెల 17 నుంచి ఆన్లైన్ ద్వారా బుకింగ్ ప్రారంభంకానుంది. 24 కి.మీ. మేర జంగిల్ సఫారీ.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని వన్యప్రాణులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలు గా సఫారీ వాహనంలో అడవిలోకి తీసుకెళ్తారు. అమ్రాబాద్ మండలంలో హైదరాబాద్– శ్రీశైలం రహదారిపై ఉన్న గుండం చెక్‌పోస్టు నుంచి ఫర్హాబాద్ వ్యూపాయింట్ వరకు తీసుకెళ్తారు. నల్లమలలో జంగిల్‌సఫారీ ఇక్కడ నుంచి నల్లమల అటవీప్రాంతం చూడముచ్చటగా ఉంటుంది. అక్కడి నుంచి ఫర్హాబాద్ పెంట మీదుగా ఫర్హాబాద్ చెక్‌పోస్టు వరకు సఫారీ ప్రయాణం కొనసాగుతుంది. సుమారు 24 కి.మీ.మేర సాగే ఈ సఫారీలో పులులతో పాటు వివిధ వన్యప్రాణులను ప్రత్యక్షంగా చూసే అవకాశముంది. స్థానికంగా ఉండే చెంచులే టూరిస్టు గైడ్లు.. నల్లమలలో స్థానికంగా నివసించే చెంచులతో మమేకమై వారితో ముచ్చటించేందుకు ఏటీఆర్ అవకాశం కల్పిస్తోంది. చెంచుల స్థితిగతులు, జీవనవిధానంపై నాటిక రూపంలో ప్రదర్శనలు, పాటలను ఆలపిస్తారు. వారు తినే ఆహారం, స్థానికంగా ఉన్న వెరైటీలను సందర్శకులకు కూడా రుచి చూపిస్తారు. మన్ననూరు నుంచి ఉమామహేశ్వర ఆలయం వరకు అడవిలోని కొండల మధ్య ట్రెక్కింగ్‌కు సైతం చెంచులే తీసుకెళ్తారు. నల్లమల అందాలను మనసారా ఆస్వాదించేలా ఫారెస్ట్ స్టే, సఫారీ, ట్రెక్కింగ్‌లను ఏటీఆర్ అధికారులు రూపొందించారు. రెండు రోజుల పాటు అడవిలో గడిపేలా ఈ ప్యాకేజీ ఉంటుంది. -
ఆ కాసేపు.. అడవి పుత్రులుగా..
సాక్షి, అమరావతి: ప్రకృతి అందాలకు పరవశించి ‘ఆకులో ఆకునై..పువ్వులో పువ్వునై.. కొమ్మలో కొమ్మనై .. నునులేత రెమ్మనై .. ఈ అడవీ సాగిపోనా.. ఎటులైనా ఇచటనే ఆగిపోనా’ అని తన కృష్ణపక్షం తొలి కవితగా రాసుకున్న దేవులపల్లి కృష్ణశాస్త్రి భావుకతకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది నల్లమల. ఈ అభయా రణ్య విహారం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నది. పచ్చని ప్రకృతి సోయగాలు, లోయలు, ఎత్తైన పర్వతాలు, నింగిని తాకుతున్న మహావృక్షాలు, స్వేచ్ఛగా సంచరించే వన్య ప్రాణులను చూస్తూ సాగే జంగిల్ సఫారీ సందర్శకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నది. కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలోని పచ్చర్ల, బైర్లూటి, ప్రకాశం జిల్లా పెదదోర్నాల సమీపంలోని తుమ్మలబయలు క్యాంపుల్లో ఏకో టూరిజం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ.. పలువురు పర్యావరణ ప్రేమికులకు కనువిందు చేస్తున్నది. కొండల్లో..కోనల్లో.. ఎకో టూరిజంలో భాగంగా ఆరుగురు ప్రయాణించే ఓపెన్ టాప్ జీప్‌లో గంటన్నర పాటు జంగిల్ సఫారీ సాగుతుంది. స్థానిక చెంచుజాతి యువత గైడులుగా జంగిల్ క్యాంప్, ప్రకృతి వీక్షణం, ట్రెక్కింగ్, బర్డ్ అండ్ బటర్‌ఫ్లై వాకింగ్, హెరిటేజ్ వాక్, సిద్ధాపురం ట్యాంక్ వాక్.. అటవీ అందాలను పరిచయం చేస్తుంది. ఆదిమ గిరిజన జాతి ‘చెంచులు’ సంప్రదాయ విలువిద్య సాధన యువతలో సరదాను నింపుతోంది. మూడు క్యాంపుల్లో.. ► పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలోని గోర్లెస్ కాలువ నుంచి లోతట్టు అటవీ ప్రాంతంలోని నరమామిడి చెరువు, వెదురు పడియ బేస్ క్యాంప్, పులిచెరువు తదితర ప్రాంతాల మీదుగా తుమ్మలబయలు సఫారీ ఉంటుంది. ఇక్కడే వన్య ప్రాణులను వీక్షించేందుకు వాచ్ టవర్‌ను నిర్మించారు. సుమారు 13కిలో మీటర్ల ప్రయాణం 1.30 గంటల పాటు ఉంటుంది. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సఫారీకి అనుమతిస్తారు. ► మహానంది సమీపంలోని పచ్చర్ల గిరిజన గ్రామం నుంచి సుమారు 10 కిలో మీటర్ల జంగిల్ ట్రాక్ ఉంది. దాదాపు గంటర్నరకుపైగా సాగే సఫారీలో సూర్యుడు కంటికి కనిపించనంతగా ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన చెట్ల కింద ప్రయాణం పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ సందర్శకులు బస చేసేందుకు రెండు కాటేజీలు, నాలుగు టెంట్ హౌస్‌లు అందుబాటులో ఉన్నాయి. ► ఆత్మకూరు సమీపంలోని బైర్లూటి గిరిజన గ్రామంలో 10 కిలో మీటర్ల సఫారీ ట్రాక్ ఉంది. ఈ గ్రామం నుంచి మూడు కిలో మీటర్లు దూరం వెళ్తే టైగర్ జోన్ ఉంటుంది. ఇక్కడికి సమీపంలోనే శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన వీరభద్రస్వామి దేవాలయం శిథిలావస్థలో దర్శనమిస్తోంది. ఇక్కడ నాలుగు కాటేజీలు, ఆరు టెంట్లు, డార్మెట్రీలు అందుబాటులో ఉన్నాయి. ► సఫారీకి ఆరు ప్రయాణించే ఓపెన్ టాప్ జీప్లను వినియోగిస్తున్నారు. ఒక రైడ్‌కి రూ.800 (ఒక వ్యక్తికి రూ.150) వసూలు చేస్తున్నారు. ఇక కాటేజీలు, టెంట్లకు రూ.5వేల నుంచి రూ.4వేల వరకు ధర ఉంది. ఇందులోనే భోజన సదుపాయం, సఫారీ కూడా కలిపి ఉంటుంది. జీవ వైవిద్యానికి నిలయం.. తూర్పు కనుమల్లోని నల్లమల శ్రేణుల్లో నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. అంతరించిపోతున్న ఎన్నో వృక్ష, జంతుజాలానికి నిలయంగా ఉంది. పులులు, మచ్చల జింకలు, ఇండియన్ బస్టర్డ్స్, ఎలుగుబంట్లు, కుందేళ్లు, అడవి పందులతో పాటు దాదాపు 70 రకాల క్షీరదాలు, 300 రకాల పక్షులు, 100 రకాల సీతాకోక చిలుకల ఆవాసాలున్నాయి. గ్రే హార్న్‌బిల్ (పొడవాటి ముక్కు పక్షి), డ్రోంగో, కోయెల్, ఇండియన్ రోలర్, ప్యారడైజ్ ఫ్లై చోచర్, బ్లాక్ హెడ్ ఓరియోల్, రెడ్ వెంటెడ్ బుల్బుల్, పర్పుల్ సన్‌బర్డ్ జాతులు కనువిం దు చేస్తాయి. వీటిని చూడటానికి సందర్శకులు రెండు నుంచి మూడు కిలోమీటర్లకు పైగా ప్రకృతి నడకకు వెళ్తారు. అడవుల పరిరక్షణ, స్థానిక తెగల జీవన ప్రమాణాల పెంపు, అటవీ సంపదను రక్షించుకోవడంపై పర్యాటకులకు అవగాహన కల్పనలో భాగంగా పర్యాటక, అటవీశాఖ సంయుక్తంగా ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు వన్యప్రాణి వారోత్సవాలకు సిద్ధమవుతోంది. -
పులి రాక.. ఆలస్యమింకా!
సాక్షి, మంచిర్యాల: కవ్వాల్ పులుల అభయారణ్యంలో కోర్ గ్రామాల తరలింపునకు మరికొంత కాలం పట్టేలా ఉంది. చుట్టపుచూపులా వచ్చి వెళ్తున్న పులులకు స్థిర ఆవాసం ఏర్పడాలంటే కోర్ ఏరియాలోని గిరిజన గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించాలి. ఐదేళ్ల క్రితం సర్వేలో.. నిర్మల్ జిల్లా కడెం మండలం, మంచిర్యాల జిల్లా జన్నారం పరిధిలో 21 పల్లెలు పులి సంచరించే ప్రాంతంలో ఉన్నాయని గుర్తించారు. మానవ సంచారంతో పులులకు ఇబ్బందులు, ఇటు గ్రామస్తులకు ముప్పు ఏర్పడుతుండడంతో గ్రామస్తుల అంగీకారంతో వేరోచోటుకు తరలించాలని అటవీశాఖ నిర్ణయించింది. మొదటి దఫా కడెం మండలం రాంపూర్, మైసంపేటలోని 142 కుటుంబాలు, జన్నారం పరిధిలో మల్యాల, దొంగపల్లి, అలీనగర్ గ్రామాల్లోని 168 కుటుంబాలను పునరావాసం కింద తరలించాల్సి ఉంది. మొదట కడెం మండలం రాంపూర్, మైసంపేటలోని 142 కుటుంబాలను తరలించాలని నిర్ణయించారు. ఎన్టీసీఏ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) నిర్వాసిత పరిహార ప్యాకేజీలో రెండు ఆప్షన్లు ఉంటాయి. 18 ఏళ్లు నిండిన వారిని యూనిట్‌గా పరిగణిస్తూ ఇల్లు, మూడెకరాల భూమి, అలా కాకుంటే రూ.10 లక్షల నగదు ఇస్తారు. ఇందులో మొదటి ఆప్షన్‌కు 48 కుటుంబాలు, రెండో ఆప్షన్‌కు 98 కుటుంబాలు సర్వే సమయంలో ఒప్పుకున్నాయి. పునరావాస కాలనీ కోసం కడెం మండలం కొత్తమద్దిపడగ సమీపంలో ఐదు హెక్టార్లు కేటాయించారు. సాగుభూమి కోసం ఇదే మండలంలో నచ్చన్ఎల్లాపూర్ జీపీ పరిధిలోని పెత్పురులో 107 హెక్టార్లు కేటాయించారు. ఈ రెండు గ్రామాల తరలింపునకే రూ.15 కోట్లు ఖర్చవుతాయని అంచనా. ప్రాజెక్టు టైగర్‌లో భాగంగా కేంద్ర, రాష్ట్రాలు 60-40 శాతం వాటాగా భరిస్తాయి. మూడేళ్ల కిందట కేంద్రం నిధులు విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం గత జనవరిలో నిధులు విడుదల చేసింది. ఇప్పటికీ పునరావాస కాలనీలో సదుపాయాలు కల్పించకపోవడంతో తరలింపు మరింత ఆలస్యం కానుంది. మరోవైపు ఎన్టీసీఏ గత ఏప్రిల్‌లో మహారాష్ట్రలో కోర్ పరిధిలోని గ్రామాలకు పునరావాస ప్యాకేజీ రూ.15 లక్షలకు పెంచడంతో ఈ ప్యాకేజీ ఇక్కడా వర్తిస్తుందా? లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. నోటిఫికేషన్ వస్తేనే తరలింపు పునరావాస తరలింపును రెండు కమిటీలు పర్యవేక్షిస్తాయి. జిల్లాస్థాయిలో కలెక్టర్, రాష్ట్రస్థాయిలో సీఎస్ చైర్మన్లుగా ఉంటూ వ్యవసాయ, గిరిజన, అటవీ, వైద్య, విద్య, సాగునీటి శాఖల నుంచి అధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ గ్రామాల తరలింపునకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. గ్రామాల తరలింపు జాప్యంపై ఎన్టీసీఏ గతంలో లేఖ సైతం రాసింది. ఇప్పటికీ తరలింపు ప్రక్రియ మొదలు కాలేదు. మరోవైపు తమ గ్రామాలను తరిలించేందుకు గిరిజనులు స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు. మారుమూల అటవీ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న గిరిజనులు రోడ్డు, విద్య, వైద్యం తదితర సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. పునరావాస ప్రాంతాలకు తరలిస్తే తమ జీవనస్థితి మెరుగవుతుందని ఆశపడుతున్నారు. కారిడార్‌కే పులులు పరిమితం తొమ్మిదేళ్ల కిందట దేశంలో 42వ టైగర్ రిజర్వుగా ఏర్పడిన కవ్వాల్ అభయారణ్యం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2015.44 చ.కి.మీ విస్తరించి ఉంది. ఇందులో కోర్ ఏరియా 892.23 చ.కి.మీ, బఫర్ ఏరియా 1123.21 చ.కి.మీ. ఐదేళ్లుగా కోర్ పరిధిలో రూ.లక్షలు ఖర్చు చేసి అనేక చర్యలు చేపట్టినప్పటికీ మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులుగా ఉన్న కాగజ్‌నగర్, బెల్లంపల్లి, చెన్నూరు, ఆదిలాబాద్ డివిజన్లలోనే పులులు సంచరిస్తున్నాయి. ఈ ప్రాంతం పులుల రాకపోకలు ఉన్న కోర్ కాకుండా కారిడార్‌గా గుర్తించారు. ఇక్కడే కొన్ని పులులు జతకట్టి సంతానోత్పత్తిని పెంచుకున్నాయి. అలా ఫాల్గుణ అనే ఆడపులి రెండు దఫాల్లో 8 పిల్లల్ని కన్నది. ప్రాణహిత తీరం దాటగానే అవతలి వైపు తడోబా=అందేరీ టైగర్ రిజర్వ్, ఇటు ఆదిలాబాద్ జిల్లా వైపు తిప్పేశ్వర్ పులుల సంరక్షణ కేంద్రాలున్నాయి. అక్కడ పులుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ఇరుకు ఆవాసాల్లో ఇమడలేక కొత్త ఆవాసం, తోడు కోసం తెలంగాణ భూభాగంలో అడుగుపెడుతున్నాయి. వలస పులులను కొంతకాలం కవ్వాల్‌లో ఆపగలిగితే దేశంలోనే ప్రముఖ టైగర్ రిజర్వుగా మారే అవకాశం ఉందనే అశయంతోనే ఈ టైగర్ రిజర్వు ఏర్పాటు చేశారు. కోర్ పరిధిలోని కాగజ్‌నగర్ డివిజన్లో పోడు సాగుదారులకు పులి సంచారం భయాందోళన కలిగిస్తోంది. వన్యప్రాణుల నష్టపరిహారం పెంపుపై కమిటీ వేసిన ప్రభుత్వం కోర్ పరిధిలో తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై మాత్రం జాప్యం చేస్తోంది. దీనిపై నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎఫ్‌డీవో కోటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల తరలింపు కోసం నోటిఫికేషన్ రాగానే ప్రక్రియ మొదలవుతుందన్నారు. మా ఊళ్లో సౌకర్యాలు లేవు.. మా గ్రామాన్ని వేరే ప్రాంతాన్ని తరలిస్తామని అటవీ అధికారులు చెప్పి ఏళ్లు గడుస్తున్నాయి. కానీ తరలించడం లేదు. మా ఊళ్లో కనీస సౌకర్యాలు లేవు. పునరావాస ప్రాంతానికి వెళ్తే సౌకర్యాలు ఉం టాయని గ్రామస్తులం అనుకుంటున్నాం. – గాదె బచ్చవ్వ, రాంపూర్, కడెం మండలం, నిర్మల్ జిల్లా -
పులి విహారం.. టూరిస్టు గైడ్లుగా మహిళలు
రెండువేల చదరపు కిమీల విస్తీర్ణం రెండు వందల రకాల పూల చెట్లు మూడు వందల పక్షిజాతులు వందకు పైగా పులుల ఆవాసం వేలాది పర్యాటకులకు వినోదం వందలాది మందికి ఉపాధి జీపు డ్రైవర్లు... టూరిస్టు గైడ్లుగా మహిళలు ఇది కాన్హా నేషనల్ పార్కు ముఖచిత్రం పులి విహారం పర్యాటకులు జీపులో ఎక్కిన తర్వాత జీపు నీటి మడుగులో నుంచి ప్రయాణిస్తుంది. జీపు టైర్లు శుభ్రం కావడానికన్నమాట. ఆ తర్వాత కొద్దిదూరంలో వాష్రూమ్లుంటాయి. అక్కడ ఆపుతారు. ఆ తర్వాత జీపు దిగకూడదు. అడవి మధ్యలోకి వెళ్లిన తర్వాత ఇక ఏ అవసరం వచ్చినా జీపును ఆపరు. పులి కోసం మాటు వేసిన సమయంలో కూడా పర్యాటకులు జీపు దిగకూడదు. జీపు వేగం ఇరవై కిలోమీటర్లకు మించదు. జంతువులకు అసౌకర్యం కలగకుండా ఉండడానికే ఈ నిబంధన. పర్యాటకులు డియోడరెంట్లు, ప్లాస్టిక్ కూడా వాడకూడదు. పులులు ఉదయం వేళల్లో పొదల్లో నుంచి ఆరుబయటకు వచ్చి నాలుగైదు గంటల సేపు విశ్రమిస్తాయి. కొంత సేపు విహరిస్తాయి కూడా. పులులు రాత్రిపూట ఎక్కువగా సంచరిస్తాయి. కానీ, రాత్రి సఫారీలో వెళ్తే పులి రోడ్డు మీదకు వచ్చినప్పుడు మాత్రమే చూడగలుగుతాం. పొదల మాటున సంచరిస్తున్న పులిని చూడలేం. అందుకే మేము రెండుసార్లు కూడా పగటి పూట సఫారీనే ఎంచుకున్నాం. దట్టమైన అడవిలో రకరకాల జంతువులను చూడడం మనకు కొత్తగా ఉంటుంది. కానీ పర్యాటకులను చూడడం ఇక్కడి జంతువులకు బాగా అలవాటైపోయింది. పరిచయం లేని వాళ్లను చూసినట్లు ఒకసారి అలా చూసి తమ దారిన తాము వెళ్లిపోతుంటాయి. దట్టమైన అడవి. చిన్నప్పుడు విన్న కథల్లోని చీమలు దూరని చిట్టడవి, పాములు దూరని కారడవి అంటే ఇదేనేమో అనిపిస్తుంది. అడవిలో చెట్లు దట్టంగా ఉన్నాయి. ఆ చెట్ల మీద గూళ్లు కట్టుకున్న నల్లకొంగ, చిలుకలు, పాలపిట్టలు, గుడ్లగూబలు... ఇంకా పేర్లు తెలియని ఎన్నో పక్షులు. ఆ పక్షుల కువకువరవంలో తేడా వచ్చింది. జింకలు పెద్ద కళ్లను విప్పార్చుకుని బెదురు చూపులతో తమను దాచుకునే పొద కోసం చూస్తున్నాయి. నక్క దొంగచూపులు చూస్తోంది. ఈ అడవిలో గేదెను తలపించే ఆవులున్నాయి. నల్లగా పొట్టిగా ఉండడంతో గేదె అనుకుంటాం. కానీ అవి ఆవులే. అవి నిమిత్తమాత్రంగా చెవులు రిక్కించాయి. పక్షుల చూపులు, జంతువుల కదలికను బట్టి జీప్ డైరెక్షన్ మార్చుకున్నాడు డ్రైవర్. అంతలోనే గైడ్ పెదవుల మీద వేలిని ఉంచి నిశ్శబ్దంగా ఉండవలసిందిగా సూచించాడు. అందరూ ఎదురు చూసిన అడవి పెద్ద ఠీవిగా నడుచుకుంటూ రానే వచ్చింది. రోడ్డు మీద అటూ ఇటూ తిరిగింది. చెట్ల పొదల్లో నడిచింది. గడ్డి మాటున దోబూచులాడి కొంతసేపటికి దూరంగా ఉన్న తటాకం వైపు వెళ్లి పోయింది. అప్పటి వరకు ఊపిరి బిగపట్టుకుని చూసిన వాళ్లందరూ ఒక్కసారిగా దీర్ఘంగా ఊపిరి వదిలారు. ‘అమ్మో! పులిని చూడాలంటే చాలా ధైర్యం కావాలి’ అని నవ్వుకుంటూ మరోసారి హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. పులి పాదముద్రలు కాన్ హా నేషనల్ ఫారెస్ట్‌లో రకరకాల జింకలు కనిపిస్తాయి. నలభై వేల జింకలుంటాయని అంచనా. బారా సింఘా అనేది ఒక రకం జింక. మన దగ్గర మనుబోతు అంటారు. చిత్తడి నేలల్లో తిరిగే జింక ఇది. మధ్యప్రదేశ్ రాష్ట్ర జంతువు కూడా. పులులైతే వందకు పైగా ఉన్నాయట. మన చేతి వేళ్ల మీద గీతల్లాగ పులుల పాదముద్రలు వేటికవే ప్రత్యేకం. పులి పాద ముద్రల ఆధారంగా వేసిన లెక్క అది. పాదముద్రల ఆధారంగా పులులను గుర్తించి వాటికి పేర్లు కూడా పెట్టారు. పులి పిల్లల్లో ఆడపిల్లలు తల్లితోనే ఉంటాయి. మగ పిల్లలు కొత్త ప్రదేశాన్ని వెతుక్కుని సొంత టెరిటరీని ఏర్పరుచుకుంటాయి. ఈ పర్యటనలో ఉత్కంఠ అంతా మన సఫారీ టైమ్‌లో పులి బయటకు వస్తుందా లేదా అనేదే. పర్యాటకులను నిరాశ పరచకుండా పులిని చూపించి పంపించాలనే చిత్తశుద్ధితో పని చేస్తారు గైడ్లు. ఒక్కోసారి ఎంతగా అన్వేషించినా పులి కనిపించకపోవచ్చు. మొత్తానికి ఈ పర్యటన ప్రతి ఒక్కరినీ బాల్యంలోకి తీసుకెళ్లి తీరుతుంది. రడ్యార్డ్ క్లిప్పింగ్ రాసిన జంగిల్ బుక్‌ని టీవీలో చూశాం. కాన్ హా నేషనల్ పార్క్‌లో పర్యటన అంటే జంగిల్ బుక్‌లోని అడవిని లైవ్‌లో చూడడమే. శ్రవణుడి సరస్సు కాన్హా నేషనల్ పార్క్ టూర్లో ప్రధాన ఆకర్షణల్లో శ్రవణ్ తాల్ ఒకటి. శ్రవణుడు అనే మునికుమారుడు ఈ సరస్సులో నీళ్లు ముంచుతున్నప్పుడు ఆ శబ్దాన్ని ఏనుగుగా భావించి దశరథ మహారాజు బాణం వేసినట్లు రామాయణలో ఉంది. ఆ సరస్సును ప్రత్యేకంగా పరిరక్షిస్తున్నారు. ఎండాకాలంలో పులులు ఈ సరస్సులో సేదదీరుతాయి. వైల్డ్ లైప్ ఫొటోగ్రాఫర్లు, ఆర్నిథాలజిస్టులతో ఫారెస్ట్ ఎప్పుడూ సందడిగా ఉంటుంది. వనసౌందర్యాన్ని ఆస్వాదించడమే కాదు, ఇక్కడి మనుషులను కలవడం కూడా సంతోషాన్నిచ్చింది. చాలా నిరాడంబరులు, స్నేహపూర్వకంగా ఉన్నారు. దారి కోసం గూగుల్‌ని నమ్ముకోవడం కంటే మనుషులను నమ్ముకోవడం బెస్ట్ అనిపించింది. ఫారెస్ట్ లోపల ఫోన్ సిగ్నల్స్ అందవు. మేము రూట్‌ను ముందుగానే డౌన్లోడ్ చేసుకున్నాం. ఈ టూర్లో ఫోన్ కాల్స్ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ప్రకృతితో సహవాసం చేయవచ్చు. – శశాంక్, హారిక కాన్ హా నేషనల్ పార్కు పర్యాటకులు అడవి మధ్య ప్రయాణం కాన్ హా నేషనల్ పార్కుకు వెళ్లడానికి హైదరాబాద్ నుంచి జబల్పూర్కి డైరెక్ట్ ఫ్లయిట్ ఉంది. మేము హైదరాబాద్ నుంచి కారులో తెల్లవారు జామున నాలుగన్నరకు బయలుదేరాం. కాన్ హా నేషనల్ పార్కు చేరేటప్పటికి సాయంత్రం ఆరైంది. అడవి మధ్యలో ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదంగా సాగింది. ఆ రాత్రికి టూరిజం ప్యాకేజ్ బసలో విడిది. తెల్లవారి ఉదయం ఆరున్నర గంటల సఫారీలో పులి కోసం అన్వేషణ మొదలు పెట్టాం. కాన్ హా నేషనల్ పార్కులోకి ప్రధానంగా ‘ఖటియా గేట్, ముఖీ గేట్, సర్హీ గేట్’ అని మూడు గేట్లున్నాయి. ఉదయం, సాయంత్రం, రాత్రి సఫారీలుంటాయి. హాలిడే సఫారీ తీసుకుంటే రోజు మొత్తం అడవిలో విహరించవచ్చు. -
ఏ పులి ఎక్కడ తిరుగుతుందో!
సాక్షి, మంచిర్యాల: కవ్వాల్ పులుల అభయారణ్యంలో విచిత్ర పరిస్థితి.. పులులు ఉంటాయని భావించే కోర్ ప్రాంతం (టైగర్ రిజర్వ్)లో కంటే టైగర్ కారిడార్ (పులి రాకపోకలు సాగించే) ప్రాంతాల్లోనే అవి జీవనాన్ని సాగిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకుపైగా విస్తరించిన కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కేవలం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ డివిజన్ నుంచి మంచిర్యాల జిల్లా చెన్నూర్ డివిజన్ వరకే పులులు సంచరిస్తున్నాయి. ఇప్పటికే 12 పులుల వరకు అక్కడే స్థిర ఆవాసం ఏర్పర్చుకున్నాయి. గతేడాది మహారాష్ట్రలోని తడోబా నుంచి వలస వచ్చిన ఎస్6 అనే ఆడపులి తాజాగా కాగజ్‌నగర్ డివిజన్‌లోనే రెండు పిల్లలకు జన్మనిచ్చింది. ఇటీవల తల్లి పులి తన రెండు నెలల వయసున్న కూనలతో పశువును వేటాడి తింటూ కెమెరాకు చిక్కింది. వీటితోపాటు ఈ కారిడార్ పరిధిలోనే ఫాల్గుణ సంతతికి చెందిన మరో రెండు పులులు గర్భంతో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో ఫాల్గుణ అనే ఆడపులి రెండు ఈతల్లో తొమ్మిది పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో పులుల సంతతి పెరిగింది. దేశంలో పులుల చరిత్రలో అభయారణ్యం వెలుపల ఓ పులి రెండుసార్లు ఒకేచోట ప్రసవించడం అరుదైన ఘటనగా గుర్తించిన కేంద్రం.. ఫాల్గుణ పేరుతో పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా నుంచి వలస వచ్చి కాగజ్‌నగర్, మంచిర్యాల జిల్లా ప్రాణహిత తీరం చెన్నూరు డివిజన్ మీదుగా పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్ రూరల్ జిల్లాల మీదుగా చివరకు భద్రాది కొత్తగూడెం వరకూ ఇక్కడి పులులు వెళ్లాయి. ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వుకు సైతం ఫాల్గుణ సంతతికి చెందిన ఓ పులి వలస వెళ్లింది. కారిడార్‌లో పులుల సంచారం పెరుగుతున్న క్రమంలోనే మనుషులపైనా దాడులు జరుగుతున్నాయని భావిస్తున్నారు.(చదవండి: వేటగాళ్ల పాపమా?.. బర్డ్‌ఫ్లూ శాపమా?) కవ్వాల్ కోర్లో కనిపించని పులి.. కొత్తపాత పులుల మధ్య ఘర్షణ రూ. కోట్లు ఖర్చు చేసి, ఎన్ని రక్షణ చర్యలు చేపట్టినా కవ్వాల్ కోర్ పరిధిలో ఒక్క పులీ కనిపించట్లేదు. కవ్వాల్ కోర్ ప్రాంతంగా ఉన్న జన్నారం డివిజన్ పరిధిలో అభయారణ్యాన్ని గుర్తించిన రెండేళ్లకు ఓ పులి వచ్చి.. కొన్నాళ్లకే వెళ్లిపోయింది. అనంతరం వచ్చిన ఓ మగ పులి జే1.. మూడు నెలల క్రితం ఆడతోడు వెతుక్కుంటూ కాగజ్‌నగర్ డివిజన్లోకే వెళ్లింది. పులులు ఇక్కడే ఉంటాయని భావించి అధికారులు కోర్ పరిధిలో గడ్డిక్షేత్రాల, శాకాహార జంతువుల పెంపకం చేపట్టినా ఫలితం కనిపించలేదు. ప్రస్తుతం చలికాలంలో ఆడ–మగ జతకట్టే సమయం కావడంతో టైగర్ కారిడార్‌లో తమ ఆవాసంలోకి వచ్చిన కొత్త పులులకు పాతవాటికి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ కారణంతోనే గత డిసెంబర్లో కోపంగా ఉన్న పులి పంజాకు ఇద్దరు బలైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో పులుల ఆవాసాలను ఎక్కడికక్కడ గుర్తించి ఏ పులి ఎక్కడ తిరుగుతుందో.. ఇక్కడ సంచరించే ఆడ, మగ పులులతో పాటు కొత్తగా వచ్చే పులులు ఎలా ప్రవర్తిస్తున్నాయో రోజూ అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. అడవిలో పలుచోట్ల కెమెరాలు బిగించారు. పులిని బంధించేందుకు ప్రయత్నాలు మరోవైపు గత డిసెంబర్లో ఇద్దరిని చంపిన పులిని బంధించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రత్యేకంగా పులి సంచరించే ప్రాంతంలో ఎరగా పశువును వేసి.. పులి రాగానే వెటర్నరీ డాక్టర్ పర్యవేక్షణలో మత్తు మందు వదిలి బంధించాలని చూస్తున్నారు. పులి సంచారాన్ని గమనించేందుకు ఐదుచోట్ల మంచెలు ఏర్పాటు చేస్తున్నారు.