దీని కళ్లను చూడండి : హిప్నటైజ్‌ చేసేయగలవు, జాగ్రత్త! | Heterochromia Iridium a rare leaord phot by Dhruv Patil | Sakshi
Sakshi News home page

దీని కళ్లను చూడండి : హిప్నటైజ్‌ చేసేయగలవు, జాగ్రత్త!

Published Sat, Aug 3 2024 4:37 PM | Last Updated on Sat, Aug 3 2024 4:37 PM

Heterochromia Iridium a rare leaord phot by Dhruv Patil

అనంతమైన ప్రకృతిలో మనకు తెలియని ఎన్నోరహస్యాలు, మరెన్నో విశేషాలు దాగి ఉంటాయి. అలాంటి విశేషాలు వెలుగులోకి వచ్చినపుడు వావ్‌ అనిపిస్తుంటుంది. తాజాగా కర్ణాటకలో ఉన్న బందీపూర్ టైగర్ రిజర్వ్ లో ఒక అరుదైన చిరుతను గుర్తించారు. దీనికి సంబంధించిన విశేషాలను తమిళనాడు, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి  సుప్రిహ సాహు ఎక్స్‌లో  పోస్ట్‌ చేశారు. దీంతో ఇది వైరల్‌ అవుతోంది.

‘‘జాగ్రత్త ఈ చిరుత కళ్ళు మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తాయి. భారతదేశంలో  ఇలాంటి ఫోటోను తీయడం ఇదే తొలిసారి  బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో రెండు వేర్వేరు రంగుల కళ్లతో ఉన్న చిరుతపులిఫోటోను  ధృవ్ పాటిల్  తీశారు. ఎంత అపురూపం, హెటెరోక్రోమియా ఇరిడియం అనేది చాలా అరుదైన జన్యు పరివర్తన వలన రెండు కళ్లకు వేర్వేరు రంగుల్లో ఉంటాయి.’’ అని  ఆమె ట్వీట్‌ చేశారు. దీంతో అద్భుతం అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. హెటెరోక్రోమియా ఇరిడియం గురించి ఇపుడే తెలుసుకుంటున్నా.. అద్భుత మైన ఫోటో  నన్ను మెస్మరైజ్‌ చేస్తోంది.  మరొకరు కమెంట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement