cheatah
-
దీని కళ్లను చూడండి : హిప్నటైజ్ చేసేయగలవు, జాగ్రత్త!
అనంతమైన ప్రకృతిలో మనకు తెలియని ఎన్నోరహస్యాలు, మరెన్నో విశేషాలు దాగి ఉంటాయి. అలాంటి విశేషాలు వెలుగులోకి వచ్చినపుడు వావ్ అనిపిస్తుంటుంది. తాజాగా కర్ణాటకలో ఉన్న బందీపూర్ టైగర్ రిజర్వ్ లో ఒక అరుదైన చిరుతను గుర్తించారు. దీనికి సంబంధించిన విశేషాలను తమిళనాడు, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి సుప్రిహ సాహు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్ అవుతోంది.‘‘జాగ్రత్త ఈ చిరుత కళ్ళు మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తాయి. భారతదేశంలో ఇలాంటి ఫోటోను తీయడం ఇదే తొలిసారి బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో రెండు వేర్వేరు రంగుల కళ్లతో ఉన్న చిరుతపులిఫోటోను ధృవ్ పాటిల్ తీశారు. ఎంత అపురూపం, హెటెరోక్రోమియా ఇరిడియం అనేది చాలా అరుదైన జన్యు పరివర్తన వలన రెండు కళ్లకు వేర్వేరు రంగుల్లో ఉంటాయి.’’ అని ఆమె ట్వీట్ చేశారు. దీంతో అద్భుతం అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. హెటెరోక్రోమియా ఇరిడియం గురించి ఇపుడే తెలుసుకుంటున్నా.. అద్భుత మైన ఫోటో నన్ను మెస్మరైజ్ చేస్తోంది. మరొకరు కమెంట్ చేశారు.Beware ! The eyes of this leapord will hypnotise you. In a first documentation of its kind in India, a leopard with two different coloured eyes has been photographed in Bandipur Tiger Reserve by Dhruv Patil. How incredible ! Heterochromia Iridium is a very rare genetic mutation… pic.twitter.com/cR1i9VAa6u— Supriya Sahu IAS (@supriyasahuias) August 3, 2024 -
మరుట్లలో చిరుత సంచారం
కూడేరు : మండలంలోని మరుట్ల - 2 కాలనీ సమీపంలో ఉన్న కొండ పరిసర ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోంది. ఆదివారం ఉదయం కొండ దగ్గరున్న వ్యవసాయ భూముల్లో చీనీ చెట్లకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన రైతులు ఈ చిరుతను చూశారు. వారు వచ్చి గ్రామంలో ఈ విషయం చెప్పడంతో రైతులు, కూలీలు పొలాల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. గ్రామస్తులు కూడా ఎక్కడ అది గ్రామంలోకి వచ్చేస్తోందో అని ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు. -
అదిగదిగో చిరుత
–గూళ్యపాళ్యంలో మళ్లీ కలకలం వజ్రకరూరు : మండలంలోని గూళ్యపాళ్యంలో చిరుత మళ్లీ కలకలం సష్టించింది. ఆదివారం ఉదయం గ్రామసమీపంలోని కొండపై నుంచి కిందకు వచ్చింది. కొద్దిసేపు పరిసరాల్లో తిరిగింది. అక్కడున్న కుక్కపై దాడికి యత్నించగా.. అది తప్పించుకుంది. ఆ తర్వాత మళ్లీ కొండపైకి వెళ్లి..కొద్దిసేపు ఒకేచోట ఉంది. చిరుత మరోమారు కనిపించడంతో గ్రామస్తులు హడలిపోయారు. మిద్దెలపైకెక్కి దాన్ని చూశారు. గ్రామస్తులకు చిరుత కన్పించడం నెల రోజుల వ్యవధిలో ఇది నాల్గోసారి. దీంతో రాత్రి సమయాల్లో ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. కొండ సమీపంలో నివసిస్తున్న కుటుంబాలు మరింత ఆందోళనకు గురవుతున్నాయి. పంట పొలాలకు వెళ్లడానికి రైతులు కూడా జంకుతున్నారు. ఈ నెల ఎనిమిదిన కురుబ కొమ్మె కేశప్ప అనేlరైతుకు చెందిన ఆవుదూడను గ్రామ సమీపంలోని ఊరుకుంట వద్ద చంపేసింది. అలాగే తొమ్మిదోతేదీ లాలుస్వామి ఆలయానికి చెందిన గుర్రంపైనా దాడి చేసి గాయపరిచింది. చిరుత విషయమై ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి గతంలోనే జిల్లా అధికారులతో మాట్లాడారు. వారి సూచన మేరకు అటవీ శాఖ అధికారులు, రెస్క్యూటీం, పోలీసులు గ్రామంలో ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం వజ్రకరూరు ఎస్ఐ జనార్దన్ నాయుడు, ఏఎస్ఐ కుళ్లాయిస్వామి కూడా గ్రామంలో పర్యటించి.. ప్రజలను అప్రమత్తం చేశారు. కొండ పరిసరాల్లో బోన్లు ఏర్పాటు చేసి..చిరుతను బంధిస్తే సమస్య తీరుతుందని స్థానికులు అంటున్నారు. -
మళ్లీ చిరుత కలకలం
వజ్రకరూరు : గూళ్యపాళ్యం గ్రామంలో బుధవారం సాయంత్రం చిరుత మళ్లీ కనిపించింది. నాలుగు రోజుల క్రితం చిరుత దాడిలో ఒక దూడ మృతి చెందడంతో పాటు గుర్రంపై కూడా దాడి చేసి గాయపరచినట్లు గ్రామస్థులు తెలిపారు. ఎస్ఐ జనా ర్దన్‌నాయుడు గ్రామంలో పర్యటించి కొండ పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు. ఫారెస్టు ఆఫీసర్ నాగభూషణం, ఫారెస్టు సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. -
ఆవుదూడను చంపిన చిరుత
చెన్నేకొత్తపల్లి : ఒంటికొండ గ్రామ సమీపంలో గురువారం రాత్రి ఆవుదూడను చిరుత చంపేసింది. బాధితుడి కథనం మేరకు.. రైతు రామకష్ణారెడ్డికి గ్రామ సమీపంలో పశువుల పాక ఉంది. రోజులాగే గురువారం రాత్రి పదిగంటల సమయంలో రైతు పాడిపశువులకు గడ్డిని వేసి ఇంటికి వచ్చాడు. శుక్రవారం ఉదయం పశువుల పాక వద్దకు వచ్చి చూడగా ఆవుదూడ చనిపోయి ఉంది. అక్కడి ఆనవాళ్లను బట్టి చూస్తే చిరుత దాడి చేసి చంపినట్లు గుర్తించి గ్రామస్తులకు తెలియజేశాడు. గంగినేపల్లి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నాగప్ప సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. చిరుత సంచారంతో బెంబేలు చిరుత సంచారంతో ఒంటికొండ గ్రామ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నెలన్నర కిందట కూడా గొర్రెలమందపై చిరుత దాడి చేసి నాలుగు పిల్లలను ఎత్తుకెళ్లిందని గ్రామస్తులు తెలిపారు. వరుస ఘటనలతో రైతులు, గొర్రెల కాపరులు పొలాల వైపు రావడానికి భయపడుతున్నారు. చిరుతల బారి నుంచి తమను కాపాడాలని వారు కోరుతున్నారు. -
రెండో చిరుత లేదు
= కలియదిరిగిన అటవీ సిబ్బంది = జేసీబీలతో ముళ్లపొదల తొలగింపు = తేల్చిన అధికారులు రాయదుర్గం : ముళ్ల పొదల తొలగింపుతో రెండో చిరుత లేదని తేలింది. పట్టణ నడిబొడ్డున గురువారం చిరు త రేపిన కలకలం నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఒక చిరుతను వలవేసి పట్టుకుని కళ్యాణదుర్గం రేంజ్ ఆఫీసుకు తీసుకెళ్లి, అక్కడి నుంచి బుక్కపట్నం అడవుల్లో వదిలేసినట్లు ఫారెస్ట్ అధికారులు ప్రకటించారు. అయితే గురువారం రాత్రి 10.30 గంటలకు అదే ముళ్లపొదల్లో మరో చిరుత ఉందని, మేము చూశామని ఫారెస్ట్ అధికారులకు స్థానికులు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కూడా సంఘటనా స్థలాన్ని రాత్రి పరిశీలించారు. రెవెన్యూ, పోలీస్, అటవీ శాఖ అధికారులను అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి హాని జరగకూడదని ఆదేశించారు. దీంతో ఫారెస్ట్ అధికారులు రాత్రంతా ముళ్లపొదల చుట్టూ పహారా కాశారు. శుక్రవారం ఉదయం బోను తెప్పించి పొదల్లో కలియతిరిగారు. చిరుత లేదని తేలింది. అయినా ప్రజల్లో అనుమానం తగ్గలేదు. దీంతో సీఐ చలపతిరావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీపతినాయుడు, మునిసిపల్ చైర్మన్ రాజశేఖర్, కౌన్సిలర్ గాజుల వెంకటేశులు జేసీబీలను తెప్పించి ముళ్లపొదలను తొలగింపజేయడంతో ప్రజల్లో అనుమానం పోయింది. అయితే రాత్రిపూటే చిరుత కొండల్లోకి వెళ్లిపోయి ఉంటుందని ప్రజలు చర్చించుకున్నారు. -
చిరుత సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
అనంతపురం: అనంతపురం జిల్లా రొద్దం మండలం బొక్తంపల్లిలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత చిరుత సంచరించింది. గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చీకటి పడ్డాక ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారు. అటవీ అధికారులు మేల్కొని గ్రామాన్ని చిరుతల బారినుంచి రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.