అనంతపురం: అనంతపురం జిల్లా రొద్దం మండలం బొక్తంపల్లిలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత చిరుత సంచరించింది. గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చీకటి పడ్డాక ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారు. అటవీ అధికారులు మేల్కొని గ్రామాన్ని చిరుతల బారినుంచి రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.