కూడేరు : మండలంలోని మరుట్ల - 2 కాలనీ సమీపంలో ఉన్న కొండ పరిసర ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోంది. ఆదివారం ఉదయం కొండ దగ్గరున్న వ్యవసాయ భూముల్లో చీనీ చెట్లకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన రైతులు ఈ చిరుతను చూశారు. వారు వచ్చి గ్రామంలో ఈ విషయం చెప్పడంతో రైతులు, కూలీలు పొలాల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. గ్రామస్తులు కూడా ఎక్కడ అది గ్రామంలోకి వచ్చేస్తోందో అని ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు.