పోటాపోటీగా రాతిదూలం పోటీలు
కూడేరు (ఉరవకొండ) : కూడేరు మండలం మరుట్ల–3 కాలనీలో శనివారం చితంబరేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా రాతిదూలం లాగుడు పోటీలు పోటాపోటీగా జరిగాయి. మొత్తం 15 జతల వృషభాలు పాల్గొన్నాయి. విడపనకల్లు మండలం పెంచలపాడుకు చెందిన శ్రీకాంత్ వృషభాలు 1440 అడుగులు లాగి ప్రథమ స్థానంలో నిలిచి రూ.10 వేలు నగదు బహుమతిని సొంతం చేసుకున్నాయి. బెలుగుప్ప మండలం గంగవరానికి చెందిన మహేష్ వృషభాలు 1436 అడుగులు లాగి ద్వితీయ స్థానంలో నిలిచి రూ.6 వేల నగదు బహుమతి పొందాయి. తృతీయ బహుమతి రూ.4 వేలును కూడా బెలుగుప్ప మండలం గంగవరానికి చెందిన రంగనాయకులు వృషభాలు సొంతం చేసుకున్నాయి.