marutla
-
పోటాపోటీగా రాతిదూలం పోటీలు
కూడేరు (ఉరవకొండ) : కూడేరు మండలం మరుట్ల–3 కాలనీలో శనివారం చితంబరేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా రాతిదూలం లాగుడు పోటీలు పోటాపోటీగా జరిగాయి. మొత్తం 15 జతల వృషభాలు పాల్గొన్నాయి. విడపనకల్లు మండలం పెంచలపాడుకు చెందిన శ్రీకాంత్ వృషభాలు 1440 అడుగులు లాగి ప్రథమ స్థానంలో నిలిచి రూ.10 వేలు నగదు బహుమతిని సొంతం చేసుకున్నాయి. బెలుగుప్ప మండలం గంగవరానికి చెందిన మహేష్ వృషభాలు 1436 అడుగులు లాగి ద్వితీయ స్థానంలో నిలిచి రూ.6 వేల నగదు బహుమతి పొందాయి. తృతీయ బహుమతి రూ.4 వేలును కూడా బెలుగుప్ప మండలం గంగవరానికి చెందిన రంగనాయకులు వృషభాలు సొంతం చేసుకున్నాయి. -
మరుట్లలో చిరుత సంచారం
కూడేరు : మండలంలోని మరుట్ల - 2 కాలనీ సమీపంలో ఉన్న కొండ పరిసర ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోంది. ఆదివారం ఉదయం కొండ దగ్గరున్న వ్యవసాయ భూముల్లో చీనీ చెట్లకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన రైతులు ఈ చిరుతను చూశారు. వారు వచ్చి గ్రామంలో ఈ విషయం చెప్పడంతో రైతులు, కూలీలు పొలాల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. గ్రామస్తులు కూడా ఎక్కడ అది గ్రామంలోకి వచ్చేస్తోందో అని ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు.