bulls
-
కారుకు డ్రైవర్లుగా మారిన ఎద్దులు
-
కోట్ల ధర పలికిన జత ఎద్దులు
-
మొదలైన మైలేర్ల సందడి.. మొదటి బహుమతిగా లారీలు, కార్లు
పలమనేరు: చిత్తూరు జిల్లాలోని పలమనేరు, కుప్పం ప్రాంతాలతోపాటు పొరుగునే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మైలేర్ల (ఎద్దుల పరుగుపందేల) సందడి మొదలైంది. సంక్రాంతంటే ఈ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రజలకు గుర్తొచ్చేది మైలేర్లే. కనుమ పండుగ నుంచి ఏప్రిల్ వరకు మైలేర్లు జరుగుతాయి. ఈప్రాంతంలో జరిగే మైలేరు పండుగల్లో విజేతలకు మొదటి బహుమతిగా రూ.50 వేల నుంచి లక్ష దాకా ఉండేది. అదే తమిళనాడులో అయితే లారీలు, కార్లు మొదటి బహుమతిగా అందజేస్తున్నారు. మైలేరు అనే తమిళ పదానికి ఎద్దుల పరుగుపందెం అని అర్థం. తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతంలో మైలేర్లు నిర్వహించడం ఆనవాయితీ. దశాబ్దాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. పలువురు తమ ఎడ్లను ఈ పందేలకు సిద్ధం చేస్తున్నారు. ఈ పోటీలో పాల్గొనే ఎద్దును సంరక్షిస్తున్న రైతును గౌరవంగా చూస్తారు. ఇక ఈ పోటీలో తమ గ్రామం ఎద్దు గెలిచిందంటే.. ఆ వూరి వారి ఉత్సాహాన్ని వర్ణించలేం. గెలిచిన ఎద్దుకు గ్రామంలో మెరవణి (ఊరేగింపు) ఉంటుంది. పండగెద్దులా మజాకా పండుగ నెల మొదలైనప్పటి నుంచి ఎద్దుకు మంచి మేత పెడతారు. వాటి కొమ్ములను జువ్వుతారు. ఎద్దు కొమ్ములు ఎంత బాగుంటే అంత క్రేజ్. ఇలా సిద్ధం చేసిన ఎడ్లను బాగా అలంకరించి పరుగుపందేలకు తీసుకెళతారు. కొమ్ములకు రంగులు వేసి ప్రభలతో అలంకరించి బెలూన్లు కడతారు. పోటీల్లో ఎద్దుపై యువకులు దెబ్బవేసేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి దానికి రక్షణగా బ్లేడులు కట్టిన పరదాలను అమరుస్తారు. కాళ్లకు గజ్జలు కట్టి, గిట్టలకు పసుపు రాసి పూజ చేస్తారు. ఈ ప్రాంతంలో 500 వరకు ఎడ్లను ఈ పందేలకు సిద్ధం చేస్తున్నారు. పలమనేరు ప్రాంతంలో నిర్వహించే మైలేరు (ఫైల్) పందెం ఎద్దు ధర రూ. 2 లక్షల నుంచి రూ.5 లక్షలు పోటీలు జరిగేచోట కిక్కిరిసిన జనం మధ్య అల్లిని (నిర్ణీత ప్రదేశాన్ని) ముందుగా ఎద్దుకు చూపెడతారు. అనంతరం ఆ ఎద్దును మూడుసార్లు పరిగెత్తిస్తారు. ఈ మూడుసార్లలో సరాసరి తక్కువ సెకన్లలో గమ్యం చేరిన ఎద్దు విజేతగా నిలుస్తుంది. ఒక్కో మైలేరులో 500 నుంచి వెయ్యి వరకు ఎద్దులు పాల్గొంటాయి. ఒక్కో ఎద్దుకు ప్రవేశ రుసుము రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు ఉంది. మైలేరులో గెలుపొందిన ఎద్దు ధర అమాంతం పెరుగుతుంది. వీటిని లక్షలు పెట్టి కొనేందుకు పలువురు ముందుకొస్తారు. పలమనేరు ప్రాంతంలో మైలేరు విజేత ధర రూ.2 లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు ఉంది. మైలేర్లకు పేరొందిన ఊళ్లు.. ఈ ప్రాంతంలో మైలేరు పండుగను గొప్పగా జరుపుకొనే ఊళ్లు చాలా ఉన్నాయి. బైరెడ్డిపల్లె, బంగారుపాళ్యం, మండీపేట కోటూరు, చెత్తపెంట, కాబ్బల్లి, కెంచనబల్ల, రామకుప్పం, మిట్టూరు, శాంతిపురం, కెనమాకులపల్లె, మల్లానూరు, నాయినూరు, గొల్లచీమనపల్లె తదితర గ్రామాల్లో మైలేర్లు నిర్వహిస్తారు. సరిహద్దులోని తమిళనాడులో బొరుగూర్, పర్చూరు (ఇక్కడ మొదటి బహుమతి లారీ, బుల్లెట్) గుడియాత్తం, ఆంబూరు, నాట్రాంపల్లె, పేర్నంబట్, పల్లికొండ, వేలూరు, క్రిష్ణగిరి, సేలం, ధర్మపురి తదితర ప్రాంతాల్లో నిర్వహిస్తారు. కర్ణాటకలోని దూలపల్లెలో ఈ పోటీ పెద్ద ఎత్తున జరుగుతుంది. దూలపల్లెలో పోటీలను తిలకించేందుకు ఆ రాష్ట్ర మంత్రులు కూడా హాజరవుతుంటారు. -
విజృంభిస్తున్న ‘లంపీస్కిన్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెల్లజాతి ఆవులు, ఎద్దులకు సోకుతున్న లంపీస్కిన్ వ్యాధి విజృంభిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటివరకు 5,219 పశువులు ఈ వ్యాధి బారినపడగా వాటిలో 24 ఆవులు మృతి చెందాయి. 2,484 పశువులు ఇప్పటికీ వ్యాధితో బాధపడుతున్నాయని పశుసంవర్ధక శాఖ తెలిపింది. 32 జిల్లాల్లో లక్షణాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మినహా మిగిలిన 32 జిల్లాల్లోని పశువులకు ఈ వ్యాధి సోకిందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షలకుపైగా తెల్లజాతి పశువులుంటాయని అంచనా వేస్తుండగా ఇప్పటివరకు మొత్తం పశుసంపదలో 0.27 శాతానికి ఈ వ్యాధి సోకింది. గత వారం, పది రోజులుగా ఈ వ్యాధికారక క్యాప్రిపాక్స్ వైరస్ విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే 150 పశువులకు ఈ వ్యాధి సోకిందని అధికారులు వివరించారు. వ్యాధి సోకిన పశువులను ఐసొలేషన్‌లో ఉంచడంతోపాటు ఇప్పటివరకు 5,34,273 పశువులకు వ్యాక్సిన్లు వేశారు. వాతావరణ సానుకూలతతో ఉత్తరాదిలో ఐదారు నెలల కిందటి నుంచే ఈ వ్యాధి వ్యాపిస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని వేలాది పశువులు లంపీస్కిన్ కారణంగా చనిపోయాయి. అయితే సెప్టెంబర్ మధ్య వరకు రాష్ట్రంలో లంపీస్కిన్ ఆనవాళ్లు కనిపించలేదు. ఆ తర్వాత అక్కడక్కడా కనిపించినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ వ్యాధి తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే నష్టనివారణ చర్యలు చేపట్టడంతో రాష్ట్రంపై పెద్దగా ప్రభావం ఉండదని పశుసంవర్ధక శాఖ అధికారులు భావించారు. కానీ ఉన్నట్టుండి లంపీస్కిన్ వ్యాధి తీవ్రరూపం దాలుస్తోంది. దోమలు, ఈగలు, గోమార్ల ద్వారా సంక్రమించే క్యాప్రిపాక్స్ వైరస్‌కు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, చలి వాతావరణం కూడా తోడైందని అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల అనుభవాలను బట్టి రాష్ట్రంలోని 20 శాతం పశువులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేంద్రం హెచ్చరికలు.. దేశంలో లంపీస్కిన్ వ్యాధి విజృంభిస్తున్న తీరుపై కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. పశువులకు వ్యాక్సినేషన్‌ను ఉధృతం చేయాలని శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించింది. లంపీస్కిన్ లక్షణాలు కనిపించిన పశువులున్న 5 కి.మీ. పరిధిలోని అన్ని గ్రామాల్లోగల పశువులకు వ్యాక్సిన్లు వేస్తున్న పశుసంవర్ధక శాఖ... ఇకపై రాష్ట్రంలో అన్ని తెల్లజాతి పశువులకు టీకాలు వేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 15 రోజుల కార్యాచరణను రూపొందించింది. యుద్ధప్రాతిపదికన పశువులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. లంపీస్కిన్ లక్షణాలివే.. ►పశువులకు తీవ్రమైన జ్వరం ►కంటి నుంచి నీరు కారడం ►చర్మంపై పెద్దపెద్ద గడ్డలు ►తీవ్రమైన ఒళ్లు నొప్పులు ►చర్మమంతా పొలుసులుగా మారడం ►పశువు మేత తినదు... పాలివ్వదు వ్యాధిబారినపడ్డ ఆవుల పాలు తాగొద్దు పశువుల్లో లంపీస్కిన్ లక్షణాలు కనిపిస్తే రైతులు వెంటనే స్థానిక పశువైద్యాధికారికి సమాచారం ఇవ్వాలి. ముందుగా జ్వరం నియంత్రణకు వైద్యులు మందులు వాడతారు. వ్యాధి సోకిన పశువులను మంద నుంచి దూరం చేయాలి. ఆ పశువులు తిన్న గడ్డి ఇతర పశు వులకు వేయొద్దు. వాటి పాలు తాగొద్దు. ఈ వ్యాధి కారణంగా గొడ్డుమోతు తనం కూడా వచ్చే అవకాశముంది. – డాక్టర్ ఎస్. రాంచందర్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రోగం గురించి చెప్పేవారే లేరు పశువులు లంపీస్కిన్ వ్యాధి బారినపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏ మందులు వాడాలి వంటి విషయాలు చెప్పే వారు మాకు అందుబాటులో లేరు. – బొక్కల మల్లారెడ్డి, హుజూరాబాద్ వ్యాక్సిన్ ఇచ్చారు.. లంపీస్కిన్ వ్యాధి నుంచి ఆవులను కాపాడేందుకు పశువైద్యులు మా ఆవులకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఆవులను మందలోకి వదలకుండా నేనే మేతకు తీసుకువెళ్లి తిరిగి ఇంటికి తీసుకొస్తున్నా. – కరుణాకర్‌రావు, మెట్పల్లి, మాక్లూర్ మండలం, నిజామాబాద్ జిల్లా రెండు ఎడ్లకు సోకింది మా రెండు ఎడ్లకు లంపీస్కిన్ వ్యాధి సోకింది. ఎడ్ల శరీరంపై దద్దుర్లు వచ్చాయి. పశు వైద్యాధికారికి చెబితే వచ్చి టీకాలు వేశారు. జాగ్రత్తలు చెప్పారు. – రాతిపల్లి మల్లేశ్, సుబ్బరాంపల్లి, చెన్నూరు మండలం, మంచిర్యాల జిల్లా -
గ్రామాలు ముంపులోకి.. గోవులు వనంలోకి
సహజంగా అటవీ ప్రాంతాల్లో ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుతలు, జింకలు, దుప్పిలు, అడవిపందులు ఇలా రకరకాల జంతువులు ఎక్కువగా ఉంటాయి. కానీ సోమశిల వెనుక జలాలతో నిండిన అటవీ ప్రాంతంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఒకటి కాదు.. రెండు కాదు.. వేల సంఖ్యలో ఆవులు.. ఎద్దులు సంచరిస్తున్నాయి. నమ్మశక్యంగా లేదా.. అవును.. ఇది అక్షరాలా నిజం.. అంత భారీ సంఖ్యలో ఎలా ఉన్నాయని ఆశ్చర్యమేస్తోందా.. అయితే ఈ ఆసక్తికర సమాచారం మీకోసం.. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో వందకుపైగా గ్రామాలు సోమశిల వెనుక జలాలకు మునిగిపోయాయి. 1978 నుంచి సోమశిల జలాశయంలో నీటిని నింపేందుకు కడప జిల్లాలోని ముంపు గ్రామాలను గుర్తించి, వాటికి నష్టపరిహారం ఇప్పించి, ఖాళీ చేయించారు. 2007 నుంచి 70 టీఎంసీల నీరు నిల్వకు రంగం సిద్ధం చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముంపు గ్రామాలకు పరిహారం చెల్లింపు ప్రక్రియ మరింత వేగంగా పూర్తి చేశారు. నెల్లూరు జిల్లాలో సోమశిల జలాశయం నిర్మించారు. భూసేకణలో భాగంగా జిల్లాలోని వందకుపైగా గ్రామాలు నీట మునిగాయి. అప్పట్లో చాలామంది ముంపు బాధితులు గ్రామాలను వదిలి వెళ్లేటప్పుడు తమతోపాటు ఉన్న ఆవులు, ఎద్దులను అక్కడే వదిలి వెళ్లిపోయారు. విధిలేని పరిస్థితుల్లో అలా తమ పెంపుడు మూగజీవాలను వదిలి వెళ్లాల్సి వచ్చిందని వారు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. నాడు వందల్లో.. నేడు వేలల్లో సోమశిల ముంపు వాసులు 44 ఏళ్ల క్రితం తమ గ్రామాలను ఖాళీ చేసేటప్పుడు వదిలేసిన పశు సంపద అప్పట్లో వందల్లో ఉంటుంది. ఆ తర్వాత సంతానోత్పత్తి జరిగి వాటి సంఖ్య నేడు వేలల్లోకి చేరిందని అంచనా. ప్రస్తుతం సోమశిల అటవీ ప్రాంతానికి అలవాటు పడిన ఆవులు, ఎద్దులు వెనుక జలాలు తగ్గిన సమయంలో అప్పుడప్పుడూ గ్రామాల వైపు వస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. వాటిని కొందరు ఉచ్చు వేసి పట్టుకునేందుకు ప్రయతి్నస్తుంటారని అంటున్నారు. ఉచ్చులేసిపట్టుకున్నా.. సోమశిల వెనుక జలాల అటవీ ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఉన్న ఆవులు, ఎద్దులను పట్టుకోవాలంటే కష్టమే. కొంతమంది వీటితో వ్యాపారం చేసుకునేందుకు ఊచ్చులేసి పట్టుకుంటుంటారు. ఇటీవల ఉచ్చులేసి పట్టుకున్న ఆవులను పోలీసులు విడిపించి, మళ్లీ అడవిలోకి పంపించిన సంఘటన నందలూరులో చోటుచేసుకుంది. మునిగిపోయిన గ్రామాలు.. అట్లూరు మండలంలో మల్లెలపట్నం, చెండువాయి, రాఘవరెడ్డిపేట, చెర్లోపల్లె, ఒంటిమిట్ట మండలంలో గుండ్లమాడ, మాధవరం, ఉప్పరపల్లె, బోయనపల్లె, చిన్నపరెడ్డిపల్లె, కలికిరి, మదిలేగడ్డ, పొన్నపల్లె, మల్లంపేట, కొండమాచుపల్లె, కుడగుంటపల్లె, కొడుములూరు, నందలూరు మండలంలో యల్లంపేట, రంగాయపల్లె, తిమ్మరాచపల్లె, చుక్కాయపల్లె, చాపలవారిపల్లె, కొమ్మూరు, కోనాపురం, వెంకటరాజంపేట, చింతకాయలపల్లె, ఎగువరాచపల్లె, జంగాలపల్లెతో పాటు ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో మరికొన్ని ఉన్నాయి. ముంపు గ్రామాలు పశుసంపదకు నిలయాలు సోమశిల ముంపు గ్రామాలు పశు సంపదకు నిలయాలుగా ఉండేవి. పచ్చటి పొలాలు, పాడిసంపదతో కళకళలాడేవి. సోమశిల జలాశయం కోసం అప్పటి ప్రభుత్వాలు పరిహారం ఇచ్చి జిల్లాలోని వందకుపైగా గ్రామాలను ఖాళీ చేయించాయి. ఆ సమయంలో చాలా వరకు పశుసంపదను వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. –భువనబోయిన లక్ష్మనయ్య, మాజీ ఎంపీపీ, నందలూరు అడవిలోకి ప్రవేశం నిషేధం సోమశిల వెనుక జలాలు గల అటవీ ప్రాంతం లో ప్రవేశం నిషేధం. అడవిలో ఉండే జీవాలు అడవికే పరిమితం. వాటిని అక్రమ రవాణా చే యడం చట్టరీత్యా నేరం. ముంపు గ్రామాలు ఖాళీ చేసినప్పుడు పశుసంపదను ఇక్కడే వది లేయ డంతో ఇప్పుడు ఆవులు, ఎద్దులు పెద్ద సంఖ్యలో ఉన్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా అడవిలో ఉన్న వాటిని పట్టు కోవడం నేరమే. –కుందనూరి ప్రసాద్, రేంజర్, అటవీశాఖ, ఒంటిమిట్ట సోమశిల ప్రాంతంలో ఆవులు, ఎద్దులు అనేకం సోమశిల వెనుక జలాల వెంబడి ఉన్న అడవుల్లో ఆవులు, ఎద్దులు వేల సంఖ్యలో ఉంటాయి. ముంపు గ్రామాలు ఖాళీ చేసిన క్రమంలో వాటిని వదిలి వెళ్లారు. అవే ఇప్పుడు అడవిలో ఉన్నాయి. ముంపు గ్రామాలు ఒకప్పుడు పాడిపంటలతో కళకళలాడాయి. పాడి అడవిపాలై, పంటలు నీటమునిగిపోయాయి. –ఆశీర్వాదం, ముంపుబాధితుడు, కోనాపురం, నందలూరు -
బసవన్నకు ‘వీక్లీ ఆఫ్’.. ఎక్కడ? ఎప్పుడు అంటే?
మంత్రాలయం/ఆలూరు: గోవులను, ఎడ్లను పూజించడం హిందువుల సంప్రదాయం. ఏరువాక పౌర్ణమి, బసవ జయంతి పర్వదినాలను ఎద్దుల పండుగలుగా భావిస్తారు. ఆయా రోజుల్లో వాటికి స్నానాలు చేయించి, అలంకరణలు గావించి, పిండివంటలు పెట్టి పూజిస్తారు. మనకు ఇంత వరకే తెలుసు. కానీ జిల్లాలోని కర్ణాటక సరిహద్దులో ఉన్న సుళేకేరి, విరుపాపురం గ్రామాల్లో ఎద్దులను ప్రత్యక్ష దైవాలుగా కొలుస్తారు. ఇలవేల్పు బసవేశ్వర స్వామి ప్రతి రూపాలుగా భావించి వారంలో ఒక రోజు పూర్తిగా సెలవు ఇచ్చేస్తారు. ఎంత పని ఉన్నా సోమవారం వాటితో చేయించరు. శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయంపై ‘సాక్షి’ అందిస్తోన్న ప్రత్యేక కథనం. చదవండి: గుమ్మటం తండాలో పర్యటించనున్న సీఎం జగన్ కట్టుబాట్ల సుళేకేరి.. కౌతాళం మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుళేకేరి గ్రామంలో అవధూత బంధమ్మవ్వ మహిమాని్వతురాలుగా ప్రసిద్ధి. అవ్వ పరమపదించిన తరువాత గ్రామంలో జాతరతో పాటు కొన్ని కట్టుబాట్లను పాటిస్తూ వస్తున్నారు. అవ్వ జాతరకు నెల రోజుల ముందు ఓ సామాజికవర్గం గ్రామ చావిడిలో చెప్పులు వేసుకుని నడవకపోవడం ఒక సంప్రదాయం కాగా మరొకటి ప్రతి సోమవారం ఎద్దులకు సెలువు ఇవ్వడం. దాదాపు 4 శతాబ్దాల క్రితం గ్రామంలో రైతులు యథావిధిగా ప్రతి రోజు పొలాలకు వెళ్లి కాడెద్దులతో పనులు చేసుకునేవారు. అయితే సోమవారం ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకునేవి. కాడెద్దు చనిపోవడం, కాలు విరగడం, బండి ఇరుసులు, చక్రాలు విరగడం, రైతులకు గాయాలు కావడం జరిగేవి. దీంతో గ్రామంలోని అవధూత బంధమ్మవ్వకు గ్రామస్తులు గోడును వినిపించుకున్నారు. సోమవా రం కాడెద్దులను కష్టపెట్టడం మానేయాలని ఆమె ఆదేశించడంతో ఆ ఆజ్ఞను సంప్రదాయంగా పాటిస్తూ వస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. విరుపాపురంలో విత్తు ఉన్నా సెలవే.. ఆలూరు నియోజకవర్గ కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో విరుపాపురం ఉంది. ఆ గ్రామ ఇలవేల్పు బలగోట బసవేశ్వర స్వామి. ఏటా ఏప్రిల్ నెలలో వచ్చే హంపయ్య పౌర్ణమి రోజున మూడు రోజుల పాటు జాతర జరుపుకుంటారు. శివుని వాహనం బసవేశ్వరుడు కావడంతో గ్రామస్తులు బసవన్నలను దైవాలుగా పూజిస్తారు. ఇక్కడ 1975లో ఇందిరమ్మ గృహాలు రావడంతో విరుపాపురం పక్కనే బలగోట గ్రామం వెలసింది. విరుపాపురం గ్రామం రెండు గ్రామాలుగా ఆవిర్భవించడంతో బలగోట బసవేశ్వర స్వామి(బలగోటయ్య తాత) ఆజ్ఞగా భావించి ప్రతి సోమవారం కాడెద్దులకు సెలవు దినంగా ప్రకటించుకున్నారు. దాదాపు 5 శతాబ్దాలుగా ఈ సంప్రదాయం ఆచరిస్తున్నారు. సంప్రదాయంలో భాగంగా ప్రతి సోమవారం కాడెద్దులకు స్నానాలు చేయించడం, పూజాది కార్యక్రమాలు నిర్వహించడం, పిండి వంటలతో నైవేద్యాలు సమరి్పంచడం చేస్తున్నారు. అదే రోజు బలగోటయ్య స్వామి ఆలయానికి ప్రతి ఇంటి నుంచి నైవేద్యాలతో ఎద్దులను తీసుకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసుకుంటారు. విత్తు వేసే పనులు ఉన్నా, పెళ్లిళ్లకు మెరవణిలు, ప్రయాణాలు ఉన్నా ఎద్దులతో పనులు చేయించరు. -
గ్రామస్తులంతా కలిశారు.. దుక్కిటెద్దులు కొనిచ్చారు
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్: దుక్కిటెద్దులే ఆ రైతుకు జీవనాధారం. పొలాలు దున్నేందుకు వాటితో కూలికి వెళ్తే గానీ కుంటుంబాన్ని పోషించుకోలేడు. అలాంటి ఆ దుక్కిటెద్దులు వారం రోజుల కిందట కుంటలో మునిగి మృత్యువాతపడ్డాయి. దీంతో ఆ రైతు పరిస్థితి దీనస్థితికి చేరుకుంది. ఈ సంగతిని ఆ గ్రామ యువత వాట్సాప్‌లో పోస్ట్ చేయగా.. స్పందించిన గ్రామస్తులు తలా కొంత పోగుచేసి రెండు దుక్కిటెద్దులను కొని రైతుకు అందజేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తానేదార్‌పల్లిలో సోమవారం జరిగిన ఈ సంఘటన ఆ గ్రామస్తుల ఔదార్యాన్ని చాటుతోంది. గ్రామానికి చెందిన వంగపండ్ల రాజుకు 30 గుంటల భూమి ఉండగా, తన రెండు దుక్కిటెద్దులతో పొలాలు దున్నేందుకు కూలి కింద వెళ్తూ కుటుంబాన్ని వెళ్లదీస్తున్నాడు. వారం రోజుల కిందట ఓ రైతు బురద పొలం దున్నేందుకు దుక్కిటెద్దులతో కూలికి వెళ్లిన రాజు సాయంత్రం వాటిని కడిగేందుకు గ్రామంలోని కుంటలోకి వాటిని తోలాడు. రెండు ఎద్దులు అందులో ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందాయి. దీనిపై స్పందించిన 30 మంది గ్రామస్తులు చందా వేసుకుని రూ.65 వేలతో ఆ రైతుకు మళ్లీ రెండు దుక్కిటెద్దులను కొనిచ్చారు. దీంతో రాజు సంతోషం వ్యక్తం చేస్తూ సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
‘అఖండ’ లోని గిత్తలు ఎవరివో, వాటి ప్రత్యేకత ఏంటో తెలుసా?
Akhanda Movie Bulls: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాలో కనిపించిన బసవన్నలు(కోడెలు) చౌటుప్ప ల్ మండలం లక్కారం గ్రామానికి చెందినవే. గ్రామానికి చెందిన నూనె శ్రీనివాస్ స్థానికంగా తన వ్యవసాయ క్షేత్రంలో గోశాలను ఏర్పాటు చేశాడు. ప్రత్యేకమైన ఆవులు, కోడెలను పెంచుకుంటున్నాడు. అందులో భాగంగా రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన కోడెలకు కృష్ణుడు, అర్జునుడు అనే పేర్లు పెట్టాడు. నిత్యం వాటికి వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చాడు. పేరు పెట్టి పిలిస్తే పలికేలా, చెప్పిన మాట వినేలా తయారు చేశాడు. ఆక్రమంలో సొంత పని నిమిత్తం శ్రీనివాస్ గతేడాది రామోజీ ఫిలింసిటీకి వెళ్లాడు. అక్కడ షూటింగ్ జరుగుతుండడంతో ఎద్దుల చర్చ వచ్చింది. దాంతో తన కోడెలకు సంబంధించిన వీడియోలు చూపించాడు. కోడెల నైపుణ్యం నచ్చిన నిర్వాహకులు షూటింగ్‌కు ఆహ్వానించారు. ఆ మేరకు ఏడాది క్రితం రామోజీ ఫిలింసిటీలో రెండ్రోజుల పాటు కోడెలు షూటింగ్లో పాల్గొన్నాయి. చిత్రంలోని ప్రారంభ సన్నివేశంతో పాటు క్లైమాక్స్ సన్నివేశంలో ఇవి కన్పిస్తాయి. మూగజీవాలైనప్పటికీ సినిమా షూటింగ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి సినిమాకే వన్నె తెచ్చాయి. ప్రముఖ హీరోతో కలిసి ప్రధానమైన సినిమాలో తన కోడెలు నటించడం, చక్కటి గుర్తింపు రావడం ఆనందంగా ఉందని శ్రీనివాస్ తెలిపాడు. -
నిన్ను నమ్ముకొని బతుకుతున్నాం.. మా బతుకెట్ల బిడ్డో..
బయ్యారం: ‘బిడ్డా నిన్ను నమ్ముకొని బతుకుతున్నాం.. నీవు ఇట్లా ఎళ్లిపోతే మేము బతికేదెట్టా..’అంటూ రైతు దంపతులు విద్యుదాఘాతంతో మరణించిన తమ కాడెద్దు వద్ద విలపించిన తీరు పలువురిని కన్నీటి పర్యంతం చేసింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఇసుకమేది గ్రామానికి చెందిన సోలం నర్సింహారావు, కృష్ణవేణి దంపతులకు రెండెకరాల భూమి ఉంది. ఈ భూమిని తమ రెండు కాడెడ్లతో సాగు చేస్తారు. అయితే, ఆ రెండు కాడెడ్లలో ఒకటి సోమవారం ఉదయం విద్యుదాఘాతంతో మృతి చెందింది. కాగా, ఇదేచోట మరో నలుగురు రైతులకు చెందిన ఎద్దులు కూడా మృతి చెందాయి. రాష్ట్రంలో మరో రెండ్రోజులు వర్షాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండ్రోజు లు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం దక్షిణ జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నట్లు తెలిపింది. దీనికి అనుబంధంగా మధ్య ట్రోపోస్ఫియర్ వరకు ఉపరితల ఆవర్త నం వ్యాపించి ఉందని, ఎత్తుకెళ్లే కొద్దీ అల్పపీడ నం నైరుతిదిశగా తెలంగాణ వైపునకు ఉన్నట్లు తెలిపింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉన్న ట్లు వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందంది. ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అంచనా వేసింది. చదవండి: పోస్ట్ కోవిడ్‌లో కొత్తరకం సమస్య.. ‘వైరల్ ఆర్థ్రాల్జియా’ -
జత ఎద్దుల ధర రికార్డు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని మాలూరు తాలూకా తేర్నహళ్లి గ్రామంలో శ్రీ సఫళాంబ దేవి జాతరలో ఆదివారం పశువుల విక్రయాలు జోరుగా సాగాయి. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ఎద్దులతో తరలివచ్చారు. బెంగళూరు రూరల్ జిల్లా దేవనహళ్లి తాలూకా రెడ్డిహళ్లి గ్రామానికి చెందిన రైతు వెంకటరెడ్డికి చెందిన జత ఎద్దులు 10 లక్షల రూపాయలకు అమ్ముడు పోయి రికార్డు సృష్టించాయి. -
జోడెద్దుల జోరు.. ఊరంతా హుషారు
వ్యవసాయం అంటే.. ట్రాక్టర్ల పరుగులు, పవర్ టిల్లర్ల ఉరుకులు, కోత యంత్రాల సందడే కనిపిస్తాయి. దుక్కి దున్నాలన్నా.. కలుపు తీయాలన్నా.. కోత కోయాలన్నా.. ఏ పని చేయాలన్నా యంత్రాలు రావాల్సిందే. వేలకు వేలు ఖర్చు చేయాల్సిందే. కానీ.. ఆ ఊళ్లో మాత్రం మచ్చుకైనా యంత్రాలు కనిపించవు. అలాంటి మాటలూ వినిపించవు. అలాగని అదేదో మారుమూల పల్లె కాదు. అక్కడి వారికి ఆధునిక యంత్రాల వల్ల కలిగే ప్రయోజనం తెలియనిదీ కాదు. పోనీ.. ఆ ఊరోళ్లంతా కాడి వదిలేశారా అంటే అదీ కాదు. ఆ ఊరి రైతుల దృష్టిలో వ్యవసాయం అంటే.. కాడెద్దులు, నాగలి, సహజసిద్ధ ఎరువులు, కూలీలే. అందుకే.. ఇప్పటికీ కాడెద్దులను వదలడం లేదు. విత్తనం నాటడం నుంచి.. పంటను ఇంటికి చేర్చే వరకూ ఆ ఊళ్లో నేటికీ ఎద్దులదే ప్రధాన పాత్ర. సాక్షి, బేస్త వారిపేట: ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని ఆర్.కొత్తపల్లెలో ఏ గ్రామంలో లేనంతగా కాడెద్దులు కనబడతాయి. సూర్యోదయం ముందే కాడెద్దుల మువ్వల చప్పుళ్లు.. చర్నాకోల సవ్వడులే వినిపిస్తాయి. చూడగానే వరుస కట్టిన జోడెద్దులు.. హలం పట్టిన రైతన్నలే కనిపిస్తారు. ఏ మూలకెళ్లినా నాగలితో పొలం దున్నడం, నాగలి గొర్రుతో కలుపు తీయడం.. ఆ వెనుకే పక్షుల ఒయ్యారపు నడకలు కనువిందు చేస్తాయి. ఎద్దుల మాట వినిపించినా.. ఎద్దులు కనిపించినా అన్నదాతల మోముల్లో నూతనోత్సాహం ఉట్టిపడుతుంది. 100 జతల ఎడ్లు.. 2,500 ఎకరాల్లో వ్యవసాయం ఆర్.కొత్తపల్లెలో ప్రస్తుతం 100 జతల ఎడ్లు ఉన్నాయి. 2,500 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. ఎక్కువగా మిరప, పత్తి, పప్పు శనగ పంటల్ని సాగు చేస్తున్నారు. పంట ఏదైనా కాడెద్దులతోనే సేద్యం చేయడం ఇక్కడి రైతులకు అలవాటుగా మారింది. ఇక్కడి వారు బయటి ప్రాంతాలకు వెళ్లి వ్యాపారం చేసిన సందర్భాలు లేవు. గ్రామంలో ఒక్కొక్కరికీ 6 నుంచి 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీంతో ప్రతి ఒక్కరూ కాడెద్దులపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. రెండిళ్లకో ఎడ్ల జత గ్రామంలో ప్రతి రెండిళ్లలో ఒకరు ఎద్దుల్ని పెంచుతారు. పత్తి, మిరప మొక్కలు పెరిగిన తర్వాత ట్రాక్టర్‌తో పొలం దున్నకం చేస్తే మొక్కలు విరిగిపోతాయన్న ఉద్దేశంతో పంట పూర్తయ్యే వరకు కాడెద్దులనే ఉపయోగిస్తున్నారు. ట్రాక్టర్ ఉపయోగిస్తే పంట దిగుబడి తగ్గుతుందనే అభిప్రాయం రైతుల్లో ప్రబలంగా నాటుకుపోయింది. భూమిని దున్నడం, విత్తనం నాటడం, కలుపు తీయడం, ఎరువుల్ని వ్యవసాయ క్షేత్రాలకు తరలించడం, ధాన్యం మిర్చి వంటి పంటల్ని ఇంటికి లేదా మార్కెట్‌కు తరలించడం వంటి పనులన్నిటికీ అక్కడి రైతులు ఎడ్లను, ఎడ్ల బండ్లనే ఉపయోగిస్తారు. కష్టమైనా.. అదే ఇష్టం ఎడ్లను పెంచడమనేది ప్రస్తుతం చాలా కష్టమైన పనిగా మారింది. అయినా ఇక్కడి రైతులు ఎంతో ఇష్టంతో వాటిని పెంచుతున్నారు. వాటికి దాణా అందించడం ఖర్చుతో కూడుకున్న పని అయినా.. వ్యవసాయంలో అవి చేసే సేవలు అంతకంటే విలువైనవని రైతులు చెబుతున్నారు. ఖర్చులతో పోల్చుకున్నా.. ఎద్దుల వినియోగం వల్ల పెట్టుబడి వ్యయం బాగా తగ్గి మంచి లాభాలొస్తాయని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. లాభసాటి వ్యవసాయం ఎద్దుల వల్లే సాధ్యమని నిరూపిస్తున్నారు. ఖర్చుల ఆదా ఇలా.. ఎద్దుల్ని పెంచడం వల్ల వ్యవసాయ ఖర్చులు చాలా వరకు ఆదా అవుతున్నాయని ఇక్కడి రైతులు స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు ఎకరం భూమిలో పత్తి సాగు చేస్తే.. దుక్కి దున్నడం, గొర్రులు తీయడం, విత్తనాలు నాటడానికి ట్రాక్టర్‌ను వినియోగిస్తే రూ.5,600 ఖర్చవుతుంది. కలుపు తీతకు మరో రూ.3,500 ఖర్చవుతుంది. పంట రవాణా, ఆరబెట్టడం వంటి పనులకు మరో రూ.2వేల వరకు వెచ్చించాలి. అంటే 5 నెలల పంట కాలంలో ట్రాక్టర్‌ను వినియోగిస్తే ఎకరానికి రూ.11 వేల వరకు వినియోగించాలి. ఎద్దులను ఉపయోగించడం వల్ల ఆ ఖర్చులేమీ ఉండవు. అంతేకాకుండా వ్యవసాయ క్షేత్రంలో ఎద్దులతో పనులు చేయించడం వల్ల ఎకరానికి 1.5 నుంచి 2 క్వింటాళ్ల పత్తి దిగుబడి పెరుగుతుంది. పైగా ఎద్దుల నుంచి వచ్చే పేడ, అవి తినగా మిగిలే గడ్డి, చొప్ప వంటి వ్యర్థాలు 4 ట్రక్కులకు పైగా వస్తాయి. వీటిని పంటలకు సేంద్రియ ఎరువుగా వినియోగిస్తారు. దీనిని బయట కొనుగోలు చేయాలంటే రూ.12 వేల వరకు వెచ్చించాలి. ఎద్దుల మేతకు పప్పుశనగ పొట్టు, చొప్ప ఖర్చు లేకుండానే దొరుకుతుంది. రెండు ఎద్దులకు ఎండుగడ్డి కోసం ఏడాదికి రూ.20 వేలు మాత్రమే ఖర్చయినా.. వాటివల్ల వ్యవసాయ ఖర్చుల రూపంలో ఏటా కనీసం రూ.50 వేల వరకు ఆదా అవుతుందని రైతులు చెబుతున్నారు. వాటిని సాకడం, ఆలనాపాలనా చూడటం అనేది తమకో మంచి వ్యాపకమని స్పష్టం చేస్తున్నారు. గ్రామంలోని మొత్తం కుటుంబాలు : 200 వ్యవసాయ విస్తీర్ణం : 2,500 ఎకరాలు గ్రామంలో ప్రస్తుతం ఉన్న ఎడ్ల జతలు : 100 పుట్టినప్పటి నుంచీ ఎద్దులతోనే.. నేను పుట్టినప్పటి నుంచీ ఎద్దుల సాయంతోనే సేద్యం చేయడం అలవాటు. పత్తి, మిరప పంటలకు ట్రాక్టర్ ఉపయోగిస్తే మొక్కలు విరిగిపోయి చనిపోతాయి. పప్పుశనగ విత్తనం కూడా ఎద్దులతోనే వేయడం జరుగుతుంది. ఎడ్లతో పంట సాగుచేస్తే దిగుబడి ఎక్కువగా వస్తుంది. వ్యవసాయానికి ఎడ్ల వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. - కంకర పెద్దవెంకటరెడ్డి, రైతు ఖర్చు లేని సేద్యం ఎడ్లతోనే సాధ్యం గ్రామంలో ప్రతి కుటుంబానికి పొలం ఎక్కువగా ఉండటంతో వ్యవసాయమే జీవనాధారంగా ఉంది. పూర్వం నుంచీ ప్రతి కుటుంబానికి ఎడ్లు ఉంటున్నాయి. సేద్యం ఖర్చు లేకుండా వ్యవసాయం చేయడానికి ఎడ్లు తప్పక ఉండాల్సిన పరిస్థితి. అందుకే ఆధునిక యంత్రాలు వచ్చినా మా గ్రామంలో ఎడ్ల పెంపకాన్ని వదిలిపెట్టడం లేదు. - రెడ్డి చిన్న మల్లారెడ్డి -
బసవన్నా..పని నేర్చుకోవాలన్నా..
సాక్షి, విజయవాడ : సేద్యంలోకి వస్తున్న యువ బసవన్నలవి. కాస్తంత పౌరుషం, మరికాస్త రంకెతనం పాళ్లు ఎక్కువగా ఉండే తత్వం వాటిది. నయానో, భయానో రైతే వాటిని మచ్చిక చేసుకుని పొలంబాట పట్టించాలి. ఇంటి దగ్గర మెడకు కాడి తగిలిస్తే.. నేరుగా తమ పొలం దగ్గరకు యజమాని చండ్రాకోలు పట్టుకుని వెనుక లేకపోయినా వెళ్లేంతగా తర్ఫీదునివ్వాలి. అలా వాటిని తయారు చేసే పనిలో భాగంగా.. పొలాన్ని ఎంత వేగంతో నాగలిని పట్టిలాగాలో సచివాలయం నుంచి ఉండవల్లి వెళ్లే మార్గంలో ఇరువురు రైతులు స్వయంగా నేర్పిస్తున్నారు. కాడికి రెండు ఎద్దులను కట్టి దానికి ఓతాడు సాయంతో టైరు అనుసంధానం చేసుకుని అరక దున్నే విధానాన్ని నేర్పిస్తున్న దృశ్యం శనివారం ఉదయం సాక్షి కెమెరాకు చిక్కింది. -
కబేళాకు పశువులు తరలిస్తున్న వ్యాను సీజ్
ఒకరిపై కేసు నమోదు పిఠాపురం రూరల్ (పిఠాపురం) : పిఠాపురం మండలం ఎల్‌ఎనుపురం జంక్షను వద్ద పశువులను అక్రమంగా కబేళాకు తరలిస్తున్న వ్యానును గురువారం సీజ్ చేసినట్లు రూరల్ ఎస్సై వి.కోటేశ్వరరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం నుంచి 16 ఎద్దులనువ్యానులో సామర్లకోటలోని కబేళాకు తరలిస్తుండగా విలేజ్ విజిట్ చేస్తున్న రూరల్ ఎస్సై కోటేశ్వరరావు వ్యా¯ŒSను అదుపులోనికి తీసుకున్నారు. డ్రైవర్ సత్యనారాయణ నుంచి వివరాలు సేకరించగా ఎద్దులను సామర్లకోటలోని కబేళాకు తరలిస్తున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు వ్యా¯ŒSను సీజ్ చేసి అందులోని పశువులను కాకినాడ గో సంరక్షణ సమితి కార్యాలయానికి తరలించారు. డ్రైవర్ సత్యనారాయణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు ఎడ్ల ధర రూ.16.5లక్షలు
- రూ.16.5 లక్షలు పలికిన వృషభాలు సి.బెళగల్: మండలం పరిధిలోని పోలకల్ గ్రామానికి చెందిన జమ్మన్న, మహేంద్రనాయుడు ఎడ్ల జత ధర రూ.16.5 లక్షలు పలికాయి. గురువారం వీటిని తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా,హుజూర్ నగర్‌కు చెందిన రైతు సుంకి సురేంద్రరెడ్డి కొనుగోలు చేశాడు. ఇటీవల ఈ ఎడ్ల జత మహానంది క్షేత్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలో సబ్ జూనియర్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచాయి. అలాగే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన పలు పోటీల్లోనూ బహుమతలు గెలుచుకున్నాయని యజమాని మహేంద్రనాయుడు తెలిపారు. గ్రామానికి పేరు తెచ్చిన ఎడ్లను గురువారం విక్రయించిన సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు. -
పోటాపోటీగా రాతిదూలం పోటీలు
కూడేరు (ఉరవకొండ) : కూడేరు మండలం మరుట్ల–3 కాలనీలో శనివారం చితంబరేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా రాతిదూలం లాగుడు పోటీలు పోటాపోటీగా జరిగాయి. మొత్తం 15 జతల వృషభాలు పాల్గొన్నాయి. విడపనకల్లు మండలం పెంచలపాడుకు చెందిన శ్రీకాంత్ వృషభాలు 1440 అడుగులు లాగి ప్రథమ స్థానంలో నిలిచి రూ.10 వేలు నగదు బహుమతిని సొంతం చేసుకున్నాయి. బెలుగుప్ప మండలం గంగవరానికి చెందిన మహేష్ వృషభాలు 1436 అడుగులు లాగి ద్వితీయ స్థానంలో నిలిచి రూ.6 వేల నగదు బహుమతి పొందాయి. తృతీయ బహుమతి రూ.4 వేలును కూడా బెలుగుప్ప మండలం గంగవరానికి చెందిన రంగనాయకులు వృషభాలు సొంతం చేసుకున్నాయి. -
ప్రకాశం జిల్లా వృషభాల విజయకేతనం
మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీల్లో ప్రకాశం జిల్లా ఎద్దులు విజయకేతనం ఎగురువేశాయి. సీనియర్స్ విభాగంలో ఆరు జతల ఎద్దులు పాల్గొన్నాయి. ప్రకాశం జిల్లా ముదిరాళ్లముప్పాల మండలం ఎన్. ఉప్పలపాడు గ్రామానికి చెందిన అనంతనేని శ్రీలేఖ, మధులకు చెందిన వృషభాలు 2468.08 అడుగుల దూరం బండను లాగి ప్రథమస్థానంలో నిలిచాయి. కృష్ణాజిల్లా గన్నవరం గ్రామానికి చెందిన కాసరనేని రాజాచౌదరికి చెందిన వృషభాలు 2403.02 అడుగుల దూరంతో ద్వితీయ స్థానంలో నిలిచాయి. కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం, ఎనగండ్ల గ్రామానికి చెందిన బాయికాటి బోడెన్న వృషభాలు 2157.7అడుగుల దూరంతో తృతీయస్థానం, గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన తోట శ్రీనివాసరావు వృషభాలు 2155 అడుగుల దూరంతో నాలుగవస్థానం, గుంటూరు జిల్లా పొన్నూరు మండలం సీతారామాపురం గ్రామానికి చెందిన దాసరినారాయణరావు వృషభాలు 1396.9 అడుగులతో ఐదోస్థానం, శిరివెళ్ల మండలం ఖాదరబాదు గ్రామానికి చెందిన బండికృష్ణయ్య వృషభాలు 1008 అడుగుల దూరంతో ఆరోస్థానంలో నిలిచాయి. వీరికి వరుసగా రూ. 80వేలు, రూ. 60వేలు, రూ. 40వేలు, రూ. 30వేలు, రూ. 20వేలు, రూ.10వేలు బహుమతులను అందించారు. బుక్కాపురం గ్రామానికి చెందిన పన్నంగి వెంకటరమణ, పగిడ్యాల మండలానికి చెందిన అహ్మద్‌బాషాలు పోటీలను ప్రారంభించారు. ఒంగోలు జాతి పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కొప్పుల శివనాగిరెడ్డి, నిర్వాహకులు మురళీ, శివయ్య , తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న గిత్తల ర్యాంప్‌వాక్
-
రాష్ర్ట స్థాయి ఎండ్లబండ్ల పోటీలు
-
‘జల్లికట్టు’ చెల్లుతుందా?
న్యూఢిల్లీ: క్రూరమైన జంతు హింస కిందకు వచ్చే ‘జల్లికట్టు’ పోటీలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కేవలం ఒక నోటీసుతో అనుమతించడం సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘించడం కాదా? కోర్టు ధిక్కార నేరం కిందకు రాదా? రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, అక్కడి పాలకపక్ష పార్టీ ఏఐఏడిఎంకేతో పెట్టుకోవాలని ఆశిస్తున్న బీజేపీ చేసింది రాజకీయం కాదా? కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజకీయపు రంగు పులుముతారనే కాబోలు! మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, హర్యానా, కేరళ, గుజరాత్‌లలో కూడా ఎడ్ల పందాలను కూడా అదే నోటీసులో అనుమతించింది. 2011లోనే కేంద్ర పర్యావరణ, అటవి మంత్రిత్వ శాఖ ఎలాంటి ప్రదర్శనకు, పోటీలకు ఉపయోగించకూడదనే జంతువుల జాబితాలో ఎద్దులను కూడా చేరుస్తూ ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ జాబితాలో వున్న జంతువులతో జల్లికట్టు లాంటి పోటీలను నిర్వహిస్తే క్రూరత్వం నుంచి జంతువుల పరిరక్షణ చట్టం కింద శిక్షలు విధిస్తారు. దీన్ని తమిళనాడు హైకోర్టులోనూ, ఆ తర్వాత సుప్రీం కోర్టులోనూ సవాల్ చేసింది. ఫలితంగా 2014, మే నెలలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సబబేనంటూ సుప్రీం కోర్టు తీర్పు చెపింది. జంతువులను క్రూరంగా హింసించే పోటీలను ఎందుకు నిషేధించకూడదని కూడా పిటీషనర్లను ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జల్లికట్టు లాంటి సంప్రదాయ పోటీలను అనుమతించాలనుకుంటే సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి. అలా చేయకుండా 2011లో నోటిఫికేషన్ ద్వారానే పోటీలను నిషేధించారుగదా! ఇప్పుడే అలాంటి నోటిఫికేషన్ ద్వారానే తిరిగి అనుమతిస్తామన్న ధోరణిని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరించింది. 2014లో సుప్రీం కోర్టు తీర్పు వెలువడినందున ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలోనే ఉందని, ప్రభుత్వ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ ఎవరు సుప్రీం కోర్టుకు లేదా హైకోర్టుకు వెళ్లిన స్టే ఇవ్వడం ఖాయమని న్యాయనిపుణులు తెలియజేస్తున్నారు. ఇది కచ్చితంగా సుప్రీం కోర్టు తీర్పును కేంద్రం ఉల్లంఘించడమేనని వారంటున్నారు. కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదనుకుంటే పార్లమెంట్‌కు నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు లేవుకనుక ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడిదంతా జరిగే వ్యవహారం కాదనుకున్న మోదీ ప్రభుత్వం నోటిఫికేషన్ పద్ధతిని ఆశ్రయించింది. దీనిపై స్టే ఉత్తర్వులు కోర్టు జారీచేసే అవకాశాలున్నాయని కూడా కేంద్రానికి తెలుసు. మరెందుకు జారీ చేసినట్లు? జల్లికట్టు పోటీలు తమిళనాడులో సంక్రాంతికి జరుగుతాయి. ఈసారికి అవి జరిగితేచాలు కేంద్రానికి తన రాజకీయ ప్రయోజనం నెరవేరినట్లే. అందుకనే ఈ తొందరపాటు. సుప్రీం కోర్టు చెప్పినట్లే జంతువులను హింసించకుండా తమిళనాడులో ఏనాడు జల్లికట్టు పోటీలు జరిగిన దాఖలాలు లేవు. సాధు జంతువులైన ఎద్దులు ఆగ్రహావేశాలతో రంకెలు వేయాలంటే వాటిని హింసించక తప్పదు. లేకపోతే పోటీలు రక్తికట్టవు. ఎద్దులను కర్రలతో కొడతారని, కత్తులతో పొడుస్తారని, తోకలు విరిచేస్తారని, కొమ్ములను విరిచేందుకు కూడా ప్రయత్నిస్తారని, కొన్నింటికి మద్యం కూడా తాగిస్తారని తమిళనాడులో ఈ పోటీలను నిర్వహించే వారే చెబుతుండడం గమనార్హం. -
కబేళాలకు జల్లికట్టు ఎద్దులు
చెన్నై, సాక్షి ప్రతినిధి : కన్నబిడ్డలతో సమానంగా గ్రామీణులు పెంచుకున్న జల్లికట్టు ఎద్దులు కబేళాలకు తరలిపోతున్నాయి. జల్లికట్టు క్రీడపై సుప్రీంకోర్టు విధించిన నిషేధంతో ఏర్పడిన ఈ పరిణామం గ్రామస్తులను కన్నీరు పెట్టిస్తోంది. తమిళుల సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుని నిషేధ ఉత్తర్వులను పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్రంలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో జల్లికట్టు ఎద్దుల యజమానులకు ప్రతిష్ట, గౌరవం ఉండేది. వాటి పోషణకు ఎంతైనా ఖర్చుపెట్టేవారంటే జల్లికట్టు ప్రాధాన్యతను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళనాడులో ఈ క్రీడకు అంతటి క్రేజుంది. ప్రతి ఏటా పొంగల్ పండుగలో భాగంగా అనేక గ్రామాల్లో జల్లికట్టు నిర్వహించడం ఆనవాయితీ. మదురై, శివగంగై, తేనీ, దిండుగల్లు, పుదుక్కోట్టై, తంజావూరు జిల్లాల్లో జల్లికట్టు ప్రసిద్ధి చెంది నది. ముఖ్యంగా మదురై జిల్లా అలంగానల్లూరులో ఏడాదికోసారి జరిగే జల్లికట్టు ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందింది. రెచ్చిపోయి పరుగులు తీసే దున్నపోతులను అదుపులోకి తీసుకునే ఈ జల్లికట్టు క్రీడ సుమారు 400 ఏళ్లుగా సాగుతోంది. క్రీడను తిలకించేందుకు విదేశీయులు సైతం గ్రామాలకు చేరుకుంటారు. యువకులు జల్లికట్టుతో తీవ్రగాయాలపాలవడంతోపాటూ ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ దున్నను అదుపులోకి తీసుకున్న వ్యక్తిని మళ్లీ జల్లికట్టు జరిగేవరకు వీరుడిగా పరిగణిస్తారు. ఇక్కడి యువత ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందింది. ఇది ఒక రకంగా వంశపారంపర్య సాహసక్రీడగా గ్రామీణుల జీవితంలో మమేకమైందని చెప్పవచ్చు. జల్లికట్టు కోసం కాడెద్దులను ఎంతో ఖర్చుకోర్చి పెంచుతారు. అయితే జల్లికట్టు క్రీడా సమయంలో అవి రె చ్చిపోయి ప్రవర్తించేందుకు కళ్లలో కారంపొడి చల్లుతారనే అపవాదు ఉంది. క్రీడల పేరుతో వాటిని హింసించడం చట్టరీత్యానేరమని, జల్లికట్టుపై నిషేధం విధించాలని మేనకాగాంధీ నేతృత్వంలోని జంతు సంక్షేమ సంఘం 2008లో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో స్టే మంజూరైంది. అయితే ప్రభుత్వం మధ్యంతర ఉత్తర్వులను తెచ్చి కొన్ని నిబంధనలకు లోబడి జల్లికట్టును ఏటా నిర్వహిస్తూ వస్తోంది. వాదోపవాదాలు ముగియడంతో జల్లికట్టు క్రీడపై శాశ్వతంగా నిషేధం విధిస్తున్నట్లు ఈనెల 7న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పొంగల్ పండుగల్లో హైలెట్‌గా నిలిచే జల్లికట్టు ఇక ఉండదనే సత్యం వారి హృదయాలను కలచివేసింది. కబేళాలకు తరలిపోతున్న ఎద్దులు జల్లికట్టుకోసమే ప్రత్యేకంగా పెంచుకునే కాడెద్దులు కబేళాలకు తరలిపోతున్నాయి. జల్లికట్టే లేనపుడు వీటితో పనేమిటని అమ్మకానికి పెడుతున్నారు. ఖర్చు, కష్టానికోర్చి పెంచుకోవడం వల్ల ఆర్థిక భారం పెరుగుతుందని గ్రామీణులు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ పశువులు పోలీసులు, చెక్‌పోస్టు అధికారుల కళ్లుగప్పి కేరళకు చేరుకుంటున్నాయి. అక్కడ కోతకు గురై వివిధ హోటళ్ల అతిథుల కోసం మాంసంగా మారిపోతున్నాయి. ముద్దు మురిపెంగా పెంచుకున్న కాడెద్దులు కసాయికి అమ్మివేస్తూ కన్నీళ్లు కారుస్తున్నారు. జల్లికట్టు క్రీడలో పాల్గొనే అరుదైన జాతిరకం ఎద్దులు ఒకప్పుడు దేశం మొత్తంమీద 10 లక్షలుండేవి. వివిధ కారణాల వల్ల అవి క్రమేణా అంతరించిపోతూ ప్రస్తుతం అవి లక్షకు చేరుకున్నాయి. కోతకు గురికావడం వల్ల ఈ కొద్ది సంఖ్యకూడా తరిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. నిషేధంతో నాలుగు రకాల నష్టాలు జల్లికట్టుపై విధించిన నిషేధం వల్ల నాలుగు రకాల నష్టాలు వెన్నంటి ఉన్నాయని జల్లికట్టు నిర్వాహకులు మురుగేశన్ చెప్పారు. ఏడాదికోసారి జల్లికట్టులో పాల్గొనే ఎద్దులు వ్యవసాయానికి వినియోగిస్తామని, కబేళాలకు తరలిపోవడం వల్ల ప్రాచీన విధానంలో పొలం దున్నడం అంతరించిపోతుందని పేర్కొన్నారు. ఇంకా అనేక గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ఎడ్ల బండ్లపైనే ప్రయాణిస్తున్నారు, ఇది కనుమరుగై రవాణా సమస్య ఏర్పడుతుందని చెప్పారు. తద్వారా పల్లెఉత్పత్తులు పట్టణానికి చేరడం ఒక సమస్యగా మారి ధరలు పెరుగుతాయన్నారు. సరుకుల రవాణాకు, ప్రయాణాలకు ఎడ్ల బండ్ల వినియోగం వల్ల ఏటా రూ.20 వేల కోట్ల ఇంధనం ఆదా ఇక అదనపు భారం అవుతుందని చెప్పారు. నగరాల్లో ఉండే ధనికులకు గుర్రపు పందాలు, క్రికెట్, ఫుట్‌బాల్, గోల్ఫ్ వంటి ఎన్నో క్రీడలు ఉన్నాయని, పల్లె ప్రాంత ప్రజలు జల్లికట్టు వంటి సంబరాలతోనే సరిపెట్టుకుంటారని తెలిపారు. నిషేధం వల్ల ఆ సంతోషం కరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. సుప్రీంలో ప్రభుత్వ పిటిషన్జల్లికట్టు నిషేధంపై రాష్ట్ర ప్రజల్లో నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం స్పందించింది. జల్లికట్టు కేవలం ఒక వినోద ప్రధానమైన క్రీడకాదు, తమిళుల సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా పరిగణించాలని ప్రభుత్వం పేర్కొంటూ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. జల్లికట్టుపై జారీచేసిన తీర్పును పునఃసమీక్షించి నిషేధాన్ని ఎత్తివేయాలని విజ్ఞప్తి చేసింది.