కబేళాకు పశువులు తరలిస్తున్న వ్యాను సీజ్‌ | bulls seezed in pithapuram | Sakshi
Sakshi News home page

కబేళాకు పశువులు తరలిస్తున్న వ్యాను సీజ్‌

Published Fri, Apr 21 2017 12:10 AM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM

bulls seezed in pithapuram

  • ఒకరిపై కేసు నమోదు
  • పిఠాపురం రూరల్‌ (పిఠాపురం) :
    పిఠాపురం మండలం ఎల్‌ఎనుపురం జంక్షను వద్ద పశువులను అక్రమంగా కబేళాకు తరలిస్తున్న వ్యానును గురువారం సీజ్‌ చేసినట్లు రూరల్‌ ఎస్సై వి.కోటేశ్వరరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం నుంచి 16 ఎద్దులనువ్యానులో సామర్లకోటలోని కబేళాకు తరలిస్తుండగా విలేజ్‌ విజిట్‌ చేస్తున్న రూరల్‌ ఎస్సై కోటేశ్వరరావు వ్యా¯ŒSను అదుపులోనికి తీసుకున్నారు. డ్రైవర్‌ సత్యనారాయణ నుంచి వివరాలు సేకరించగా ఎద్దులను సామర్లకోటలోని కబేళాకు తరలిస్తున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు వ్యా¯ŒSను సీజ్‌ చేసి అందులోని పశువులను కాకినాడ గో సంరక్షణ సమితి కార్యాలయానికి తరలించారు. డ్రైవర్‌ సత్యనారాయణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement