seezed
-
రాత్రి సీజ్.. పొద్దున్నే పర్మిషన్
సాక్షి, కందుకూరు రూరల్: నిబంధనలకు విరుద్దంగా పబ్లిక్ సెలవు దినాల్లో పాఠశాలలను నడుపుతున్న రెండు ప్రైవేటు పాఠశాలలను శుక్రవారం మండల విద్యాశాఖాధికారి బి.శివన్నారాయణ పరిశీలించి సీజ్ చేశారు. సీజ్ చేసిన తాళాలను జిల్లా విద్యాశాఖాధికారికి శుక్రవారం రాత్రే అందజేశారు. అయితే తెల్లవారే సరికి డీఈఓ నుంచి అనుమతులు వచ్చాయని పాఠశాలలను యథావిధిగా నడుపుకున్నారు. శ్రీ చైతన్య పాఠశాలకు సీజ్ చేసిన తాళాలను తీయకుండా గేటుకు ఉన్న చిన్న గేటు నుంచి పాఠశాలను నడిపారు. నారాయణ పాఠశాల అయితే శనివారం మధ్యాహ్ననాకి డీఈఓ అనుమతులు ఇచ్చారని తాళాలు కూడా ఇచ్చారని మధ్యాహ్నం నుంచి పాఠశాలను ప్రారంభించారు. అయితే శుక్రవారం పాఠశాలలను సీజ్ చేసి ఎంఈఓ రాత్రికి డీఈఓకు తాళాలు అందజేశారు. శనివారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ కార్యాలయాలు తెరచుకుంటాయి. పాఠశాలలను మాత్రం 9 గంటలకే ప్రారంభిస్తారు. అయితే డీఈఓ అనుమతులు ఇచ్చారని సీజ్ చేసిన తాళాన్ని కూడా తీయకుండా శ్రీచైతన్య పాఠశాల తరగతులను నడిపింది. రాత్రికి రాత్రే అనుమతులు డీఈఓ అనుమతులు ఎలా ఇచ్చారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం పూట కూడా గడవకముందే అనుమతులు ఇచ్చిన డీఈఓపై పలువురు విద్యావేత్తలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నారాయణ పాఠశాల మధ్యాహ్నం వరకు పాఠశాల తెరవలేదు. మధ్యాహ్నం నుంచి డీఈఓ నుంచి అనుమతుల మేరకు తాళాలు తెచ్చుకున్నామని తాళాలు తెరచారు. విద్యాశాఖాధికారుల మధ్య సమన్వయ లోపం విద్యాశాఖలో మండల అధికారిగా ఉన్న బి.శిన్నారాయణ పాఠశాలను పరిశీలించి నిబంధనలు అతిక్రమించారని పాఠశాలను సీజ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా అధికారికి నివేదించి తాళాలు కూడా అప్పగించారు. అయితే తిరిగి సీజ్ చేసిన పాఠశాలలకు అనుమతులు ఇచ్చేటప్పుటు కనీసం ఎంఈఓకు కూడా తెలియకుండా అనుమతులు ఇవ్వడంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కింద స్థాయి నిబద్ధతతో పని చేయడం... పై అధికారులు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా యాజమాన్యాలకే తాళాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎంఈఓ ఏమన్నారంటే ఎంఈఓ శిన్నారాయణను వివరణ కోరగా సీజ్ చేసి ఉంటే పాఠశాలలు ఎలా తీశారని పాఠశాల ప్రిన్సిపాల్స్‌ను అడగగా డీఈఓ నుంచి అనుమతులు తెచ్చుకున్నామని చెప్తున్నారు. శ్రీచైతన్య అయితే పాఠశాల నడుపుకోండి తర్వాత తాళాలు వచ్చి తీసుకెళ్లండని డీఈఓ చెప్పారని వారు సమాధానం ఇచ్చారని ఎంఈఓ తెలిపారు. సీజ్ చేసిన పాఠశాలలకు అనుమతులు ఇవ్వాలని జిల్లా అధికారి నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. డీఈఓ వివరణ ఏంటంటే.. ఈ విషయమై డీఈవో సుబ్బారావును వివరణ కోరగా నిబంధనలకు విరుద్ధంగా పబ్లిక్ సెలవు రోజైన కృష్ణాష్టమి రోజున తరగతులు నిర్వహిస్తున్నందున కందుకూరులోని శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలను శుక్రవారం ఎంఈవో పరిశీలించి సీజ్ చేశారన్నారు. అయితే ఆయా పాఠశాలల నిర్వాహకులు మరోసారి ఇలాంటి పొరపాటు చేయబోమని ప్రాధేయపడటంతో శనివారం స్కూలు నిర్వహించుకోవాలని చెప్పామన్నారు. ఈ విషయాన్ని ఎంఈఓకు తెలియజేయడంలో సమాచార లోపం జరిగిందని పేర్కొన్నారు. -
218 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నెల్లికుదురు (మహబూబాబాద్) : 218క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టుకుని లారీ సీజ్ చేసి 15మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తొర్రూర్ డీఎస్పీ జి.మదన్‌లాల్, సీఐ వి.చేరాలు, ఎస్సై పెండ్యాల దేవేందర్‌లతో కలసి మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. నెల్లికుదురు, చిన్నగూడూరు, నర్శింహులపేట మండలాల్లో పోలీసులు అలర్ట్‌గా ఉన్నప్పటికీ రేషన్ బియ్యం, ఇసుక అక్రమ దందాలు నిర్వహిస్తున్నారని వారిపై ప్రత్యేక నిఘా పెంచనున్నట్లు తెలిపారు. మండలంలోని శ్రీరామగిరి, వావిలాల, బంజర, ఆలేరు గ్రామాలల్లోని రేషన్ డీలర్లు తండ్రీకొడుకులు సంద సీతయ్య, కుమారుడు సంద అనిల్ (ఇద్దరు), ఆవుల సంధ్యారాణి, భర్త వెంకటనర్సయ్య (ఇద్దరు), గట్టు వేణు, బాద ఉప్పలయ్యల, గొట్టె నర్సయ్యలతో మహబూబాబాద్ మండలం అమనగల్ గ్రామానికి చెందిన బానోతు రాములు, వేముల రామారావు, జంగిలిగొండకు చెందిన కొయ్యాల కొమురెల్లి, వావిలాల గ్రామానికి చెందిన మార్త యుగేందర్, ఓ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న గోగుల ప్రశాంత్(సాక్షికాదు), శామకూరి వెంకన్న, చిన్నముప్పారం గ్రామానికి చెందిన ఒబిలిశెట్టి నర్సయ్య, ఈస్ట్‌గోదావరి జిల్లా అద్దెటిగల్ మండల కేంద్రానికి చెందిన గొలుసు శ్రీనివాసరావులు కుమ్మకై పీడీఎస్ బియ్యాన్ని వివిధ గ్రామాల్లో సేకరించినట్లు తెలిపారు. సేకరించిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు నెల్లికుదురు ఎస్సై పెండ్యాల దేవేందర్‌కు వచ్చిన సమాచారంతో పోలీసు సిబ్బందితో కలసి వెళ్లి మండల కేంద్రంలోని క్రాస్ రోడ్ వద్ద వాహానాల తనిఖీ నిర్వహిస్తుండగా 218క్వింటాళ్ళ లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్, మరో వ్యక్తి పోలీసులను చూసి పారిపోతున్నారని తెలిపారు. వారిని పట్టుకుని విచారించి తనిఖీ చేయగా లారీలో రేషన్ బియ్యం ఉన్నట్లు తెలిపారు. రేషన్ బియ్యం లోడు లారీని సీజ్ చేసి, 15 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బానోతు రాములు, సంద అనిల్, అవుల వెంకటనర్సయ్య (ఇద్దరు), గట్టు వేణు, బాద ఉప్పలయ్యల, ఒబిలిశెట్టి నర్సయ్య, గొలుసు శ్రీనివాసరావు ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మిగిల వారు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. చాకచక్యంగా వ్యవహరించి రెండోసారి భారీ మొత్తంలో రేషన్ బియ్యాన్ని పట్టుకున్న ఎస్సై దేవేందర్, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. రివార్డులు అందజేస్తామని తెలిపారు. బియ్యం వ్యాపారంలో డీలర్లు ఉండటం విచారకరం ప్రభుత్వ సొమ్ము తింటూ రేషన్ బియ్యం దందాలో నలుగురు డీలర్లు, వారి కుటుంబ సభ్యులు ఇద్దరు ఉండడం విచారకరమని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. ఈ వ్యాపారంలో ఎంతటివారు ఉన్నా వదిలిపెట్టేది లేదని, రేషన్ డీలర్లపై, అక్రమ వ్యాపారంలో అరెస్టు అయిన వారిపై పీడీయాక్టును ఉపయోగించేందుకు నివేదికను కలెక్టర్‌కు అందిస్తామన్నారు. -
యాభై లక్షల విలువైన గుట్కా పట్టివేత
సాక్షి, హైదరాబాద్: గుట్కాను నిషేధించినా అక్రమార్కుల్లో మాత్రం మార్పు రావడంలేదు. ఎక్కడో ఓ చోట గుట్కా విక్రేతలు పట్టుబడుతూనే ఉన్నారు. పోలీసులకు చిక్కకూడదనే ఉద్దేశంతో అక్రమార్కులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. లారీలో గుట్కాప్యాకెట్లు రవాణా చేస్తే పోలీసులు పట్టుకుంటున్నారని కారులో రవాణా చేస్తున్నారు. శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా గుట్కా ప్యాకెట్లు లభించాయి. వీటి విలువ రూ. 50 లక్షలుంటుందని అంచనా. కర్ణాటక నుంచి 12 వాహనాల్లో గుట్కాను రవాణా చేస్తుండగా పోలీసులు వాహనాల్ని వెంబడించి సీజ్ చేసి, 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
గంజాయి తరలిస్తున్న లారీ పట్టివేత
నెల్లిపాక (రంపచోడవరం) : గంజాయి తరలిస్తున్న ఓ లారీని శుక్రవారం ఎటపాక మండలంలోని నెల్లిపాక అటవీ చెక్‌పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. సీలేరు ప్రాంతం నుంచి లారీలో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో చెక్‌పోస్టు వద్ద నిఘా ఉంచి భద్రాచలం వైపు వస్తున్న లారీని తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్లు గుర్తించి లారీని ఎటపాక పోలీస్టేష¯ŒSకు తరలించారు. లారీలో రహస్య అరను తయారు చేసి అందులో సుమారు 300 వరకు గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్నట్లు సమాచారం.1200 కేజీలకు పైగా గంజాయి ఉన్నట్లు తెలిసింది. గంజాయిని హైదరాబాదుకు తరలిస్తున్నట్లు పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. -
400 కిలోల గంజాయి స్వాధీనం
ఇద్దరి అరెస్టు, లారీ సీజ్ చింతూరు (రంపచోడవరం) : జిల్లాలో ని డొంకరాయి ప్రాం తం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న 400 కిలోల గంజా యిని శుక్రవారం చింతూ రు పోలీసులు స్వాధీ నం చేసుకున్నా రు. చింతూరు మండలం రత్నాపురం జంక్ష¯ŒS వద్ద ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు లారీని సీజ్ చేసినట్లు సీఐ కె.దుర్గాప్రసాద్ తెలిపారు. ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయి రవాణా అవుతోందనే సమాచారం మేరకు ఎస్ఐ శ్రీని వాస్‌కుమార్ సిబ్బందితో కలసి రత్నాపురం జంక్ష¯ŒS వద్ద వాహనాల తనిఖీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఓ లారీని తనిఖీ చేయగా 20 కిలోల చొప్పున 20 ప్లాస్టిక్ మూటల్లో రవాణా చేస్తున్న గంజాయిని గుర్తిం చామని తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.12 లక్షలు వుం టుం దని, ఈ రవాణాకు పాల్పడుతున్న వై.రామవరం మండలం డొంకరాయిలో నివాసముంటున్న ఒడిశాకు చెందిన పంగి మాణిక్యం, హైదరాబాద్‌కు చెంది న మేకల మనోహర్ అలియాస్ వందనంలను అరెస్టు చేసినట్టు తెలిపా రు. స్వాధీనం చేసుకున్న గంజాయికి ఇ¯ŒSచార్జి తహసీల్దార్ ప్రసాద్ సమక్షంలో పంచనామా నిర్వహించినట్లు సీఐ పేర్కొన్నారు. గంజాయి తరలిస్తున్న ఆటో స్వాధీనం గొల్లప్రోలు : గంజాయి తరలిస్తున్న ఆటోను గొల్లప్రోలు పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. కత్తిపూడి వైపు నుంచి పిఠాపురం వైపు వెళ్తున్న ఆటోను తనిఖీ చేయగా గంజాయిను పోలీసులు గుర్తించారు. ఆటో లోపల పైభాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన బాక్స్‌లో గంజాయి ప్యాకెట్లను అమర్చారు. ఆటోను, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చిత్రాడకు చెందిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌ను విచారించి కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కబేళాకు పశువులు తరలిస్తున్న వ్యాను సీజ్
ఒకరిపై కేసు నమోదు పిఠాపురం రూరల్ (పిఠాపురం) : పిఠాపురం మండలం ఎల్‌ఎనుపురం జంక్షను వద్ద పశువులను అక్రమంగా కబేళాకు తరలిస్తున్న వ్యానును గురువారం సీజ్ చేసినట్లు రూరల్ ఎస్సై వి.కోటేశ్వరరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం నుంచి 16 ఎద్దులనువ్యానులో సామర్లకోటలోని కబేళాకు తరలిస్తుండగా విలేజ్ విజిట్ చేస్తున్న రూరల్ ఎస్సై కోటేశ్వరరావు వ్యా¯ŒSను అదుపులోనికి తీసుకున్నారు. డ్రైవర్ సత్యనారాయణ నుంచి వివరాలు సేకరించగా ఎద్దులను సామర్లకోటలోని కబేళాకు తరలిస్తున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు వ్యా¯ŒSను సీజ్ చేసి అందులోని పశువులను కాకినాడ గో సంరక్షణ సమితి కార్యాలయానికి తరలించారు. డ్రైవర్ సత్యనారాయణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
468 కిలోల గంజాయి స్వాధీనం
రాజానగరం : జాతీయ రహదారి మీదుగా తరలిస్తున్న గంజాయిని రాజానగరం పోలీసులు పట్టుకుని, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు శుక్రవారం వివరాలు వెల్లడించారు. రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా ఎస్పీ రాజకుమారి సూచనల మేరకు జాతీయ రహదారిపై రాజానగరం సీఐ శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీలో గంజాయి పట్టుబడిందన్నారు. జీఎస్ఎల్ పెట్రోలు బంకు వద్ద జాతీయ రహదారిపై విశాఖపట్నం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న వ్యా¯ŒSలో ఉన్న 468 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని విలువ రూ. 23 లక్షల 40 వేలు ఉంటుందన్నారు. వ్యా¯ŒSతోపాటు ఆరు సెల్ఫోన్లు రూ.4550 నగదు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. తనిఖీల్లో ముగ్గురు నిందితులు పట్టుబడగా మరో ముగ్గురు పరారయ్యారు. విశాఖపట్నం జిల్లా రావికమాతం మండలం, దొండపూడికి చెందిన చందక రాము, పినపాల లోవరాజు, పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం, కాకిలేరుకు చెందిన ఇంటి శ్రీనివాసరావు పట్టుబడ్డారన్నారు. వీరిని రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. పరారైన వారు విశాఖపట్నం జిల్లా వజ్రగడకు చెందిన సూర్రెడ్డి గోవిందు, దొండపూడికి చెందిన గుడి దొరబాబు, మిరియాలకు చెందిన మస్తా¯ŒSబాషాలుగాపేర్కొన్నారు. వారి కోసం గాలిస్తున్నామని డీఎస్పీ వివరించారు. -
గంజాయి స్వాధీనం
రావులపాలెం : మొక్కజొన్న పొత్తుల రవాణా ముసుగులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతోపాటు గంజాయిని, ట్రాన్స్‌పోర్టుకు ఉపయోగించిన వ్యాన్, కారును రావులపాలెం పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటనకు సబంధించిన వివరాలను గురువారం రావులపాలెం పోలీస్‌స్టేçÙన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ పీవీ రమణ వెల్లడించారు. విశాఖ ఏజెన్సీ నుంచి రావులపాలెం మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయిని అక్రమంగా తలిస్తున్నట్టు రావులపాలెం పోలీసులకు సమాచారం అందటంతో ఎస్సై పీవీ త్రినాథ్ సిబ్బందితో కలసి పట్టుకున్నారు. రావులపాలెం మండలం రావులపాడు మల్లాయిదొడ్డి బుధవారం తెల్లవారు జామున పోలీసులు కాపుగాశారు. ఈ సమయంలో వ్యాన్‌లో మొక్కజొన్న పొత్తులను పైకి కనిపించే విధంగా ఉంచి అడుగున గంజాయి బ్యాగులు పెట్టి రవాణాకు శ్రీకారం చుట్టారు.ఈ వాహనానికి ముందు కారులో ముందస్తు సమాచారం ఇస్తూ రవాణాకు సహకరిస్తున్న రావులపాలేనికి చెందిన వి.పెదిరాజు, గుడాల సుబ్రహ్మణ్యం, విశాఖ జిల్లా పోతురాజుగుమ్మల గ్రామానికి చెందిన బురిడి బాలరాజులను పోలీసులు అరెస్టు చేశారు. వ్యాన్‌ను తనిఖీ చేయగా దానిలో 23 బ్యాగుల్లో రూ. 23,52,000 విలువైన 784 కేజీ గంజాయిని పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న వారిని విచారించగా తునికి చెందిన కొరుప్రోలు దుర్గాప్రసాద్ ద్వారా ఈ లోడు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. వ్యాన్‌లో డ్రైవర్ వి.నూకరాజు పరారవడంతో అతనితోపాటు దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేయాల్సి ఉందని సీఐ రమణ తెలిపారు. గంజాయి తరలింపును చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై పీవీ త్రినాథ్, ఏఎస్సై ఆర్వీ రెడ్డి, హెచ్‌సీ స్వామి, కానిస్టేబుళ్లు సతీష్, మూర్తి తదితరులను సీఐ అభినందించారు. నిందితులను కొత్తపేట కోర్టులో హజరుపరచనున్నట్టు తెలిపారు.