గంజాయి తరలిస్తున్న లారీ పట్టివేత
Published Sat, May 13 2017 12:18 AM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM
నెల్లిపాక (రంపచోడవరం) :
గంజాయి తరలిస్తున్న ఓ లారీని శుక్రవారం ఎటపాక మండలంలోని నెల్లిపాక అటవీ చెక్‌పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. సీలేరు ప్రాంతం నుంచి లారీలో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో చెక్‌పోస్టు వద్ద నిఘా ఉంచి భద్రాచలం వైపు వస్తున్న లారీని తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్లు గుర్తించి లారీని ఎటపాక పోలీస్టేష¯ŒSకు తరలించారు. లారీలో రహస్య అరను తయారు చేసి అందులో సుమారు 300 వరకు గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్నట్లు సమాచారం.1200 కేజీలకు పైగా గంజాయి ఉన్నట్లు తెలిసింది. గంజాయిని హైదరాబాదుకు తరలిస్తున్నట్లు పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
Advertisement
Advertisement