కంటెయినర్‌లో అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు అరెస్టు
పరారైన ఆరుగురు నిందితులు
ఆదిలాబాద్‌టౌన్: అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. బుధవారం తలమడుగు మండలంలోని మహారాష్ట్ర సరిహద్దులో లక్ష్మీపూర్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఈ ముఠాలోని ఇద్దరిని అరెస్ట్ చేయగా, ఆరుగురు పరారయ్యారు. ఆంధ్ర, ఒడిశా బార్డర్ అటవీ ప్రాంతం నుంచి ఈ ముఠా దేశంలోని వివిధ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున గంజాయిని సరఫరా చేస్తోంది.
ఉత్తరాఖండ్‌కు చెందిన కంటెయినర్ ఆదిలాబాద్ పట్టణం నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేయడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. కంటెయినర్ లోపల 292 ప్యాకెట్లలో దాదాపు 9 క్వింటాళ్ల గంజాయి లభించింది. దీని విలువ సుమారు రూ.2.25 కోట్లు ఉంటుందని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. ఈ కేసులో ఎనిమిది మంది నిందితులపై కేసు నమోదు చేశారు.
అరెస్టయినవారిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కంటెయినర్ డ్రైవర్ వసీమ్ అన్సారి, క్లీనర్ అర్మాన్‌లు ఉన్నారు. కాగా ఒడిశా రాష్ట్రం మ ల్కాజిగిరికి చెందిన ఆశిష్, యూపీలోని మీరట్‌కు చెందిన పండిత్‌జీ, మహారాష్ట్రలోని బుల్దాన, దులే జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు, అలాగే ఉత్తరాఖండ్‌కు చెందిన అన్షుజైన్, సోను అన్సారీలు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి ఐచర్ కంటైనర్‌తో పాటు 292 గంజాయి ప్యాకెట్లు, రెండు సెల్‌ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment