ganjai
-
రూ.2.25 కోట్ల గంజాయి స్వాధీనం
ఆదిలాబాద్‌టౌన్: అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. బుధవారం తలమడుగు మండలంలోని మహారాష్ట్ర సరిహద్దులో లక్ష్మీపూర్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఈ ముఠాలోని ఇద్దరిని అరెస్ట్ చేయగా, ఆరుగురు పరారయ్యారు. ఆంధ్ర, ఒడిశా బార్డర్ అటవీ ప్రాంతం నుంచి ఈ ముఠా దేశంలోని వివిధ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున గంజాయిని సరఫరా చేస్తోంది. ఉత్తరాఖండ్‌కు చెందిన కంటెయినర్ ఆదిలాబాద్ పట్టణం నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేయడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. కంటెయినర్ లోపల 292 ప్యాకెట్లలో దాదాపు 9 క్వింటాళ్ల గంజాయి లభించింది. దీని విలువ సుమారు రూ.2.25 కోట్లు ఉంటుందని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. ఈ కేసులో ఎనిమిది మంది నిందితులపై కేసు నమోదు చేశారు. అరెస్టయినవారిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కంటెయినర్ డ్రైవర్ వసీమ్ అన్సారి, క్లీనర్ అర్మాన్లు ఉన్నారు. కాగా ఒడిశా రాష్ట్రం మ ల్కాజిగిరికి చెందిన ఆశిష్, యూపీలోని మీరట్‌కు చెందిన పండిత్‌జీ, మహారాష్ట్రలోని బుల్దాన, దులే జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు, అలాగే ఉత్తరాఖండ్‌కు చెందిన అన్షుజైన్, సోను అన్సారీలు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి ఐచర్ కంటైనర్‌తో పాటు 292 గంజాయి ప్యాకెట్లు, రెండు సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. -
ఆపరేషన్ ధూల్‌పేట్
సాక్షి, హైదరాబాద్: గంజాయికి నగరంలో కేంద్రంగా మారుతున్న ధూల్‌పేట్ ప్రాంతాన్ని ఆగస్టు 31లోపు గంజాయి రహిత ప్రాంతంగా మార్చే లక్ష్యంతో ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ ధూల్‌పేట్ చేపట్టినట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. నగరంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్‌పేట్‌లోనే మూలాలు ఉంటున్నందున ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలిపారు. ధూల్‌పేట్ ప్రాంతంలో గంజాయి రవాణా, అమ్మకాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న 15 మంది నిందితులను గుర్తించామని, ఇందులో ఇద్దరిని అరెస్టు చేశామని తెలిపారు. శనివారం ఆబ్కారీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాయింట్ కమిషనర్ ఖురేషితో కలిసి కమలాసన్‌రెడ్డి మాట్లాడారు. ఎక్సైజ్ శాఖ పోలీసు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారుల సమన్వయంతో దాడులు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ధూల్‌పేట్‌తోపాటు గంజాయికి అడ్డాలుగా మారుతున్న నానక్‌రామ్‌గూడ, లంగర్‌హౌస్, సీతాఫల్మండి సహా ఇతర ప్రాంతాల్లోనూ నిఘా పెంచినట్టు తెలిపారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈఎస్ అంజిరెడ్డి బృందం శనివారం జరిపిన సోదాల్లో 54 కిలోల గంజాయి పట్టుబడిందని, గంజాయి రవాణా ముఠాలో కీలకంగా ఉన్న ఏ–1 రాహుల్సింగ్పై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. మత్తుపదార్థాలపై ఉక్కుపాదం మోపాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్‌లో గంజాయితోపాటు ఇతర మత్తుపదార్థాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో క్రమంగా పెరుగుతున్న నాటుసారాపై సైతం దృష్టి పెట్టామని, మూడు నెలల్లో దీన్ని పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. దేవరకొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4,200 కిలోల బెల్లాన్ని , 50 కిలోల పటిక స్వాధీనం చేసుకున్నట్టు కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఎక్సైజ్‌శాఖ జాయింట్ కమిషనర్ ఖురేషి మాట్లాడుతూ, ఆపరేషన్ ధూల్‌పేట్ ఈనెల 20 నుంచి ప్రారంభించామన్నారు. స్థానిక పోలీస్, ఎక్సైజ్‌శాఖ, టీజీఏఎన్‌బీ ఉమ్మడిగా కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు. ఈ నెలలో ఇప్పటివరకు ధూల్‌పేట్ ప్రాంతంలో 12 కేసులు నమోదు చేశామని, మొత్తం 37 మంది నిందితులను గుర్తించామన్నారు. ఈ ముఠాలు ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు నుంచి పెద్దమొత్తంలో తెచ్చిన ఎండు గంజాయిని ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, బీబీనగర్ ప్రాంతాల్లో స్థావరాలు పెట్టుకుని, అక్కడ నుంచి ద్విచక్రవాహనాలు, ఆటోల్లో కొద్దికొద్ది మొత్తాల్లో నగరంలోకి తెస్తున్నట్టు గుర్తించామన్నారు. ధూల్‌పేట్‌తోపాటు ఇతర ప్రాంతాలపైనా గంజాయి ముఠాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. -
నమ్మించి.. మత్తులో ముంచి..
తిరుపతి రూరల్ : ఫ్రెండ్ అని నమ్మించింది.. ప్రాణం కన్నా ఎక్కువ అని నమ్మబలికింది.. ఇంటికి తీసుకెళ్లి భర్తకు పరిచయం చేసింది.. నమ్మి వచ్చిన ఫ్రెండ్‌కు భర్తతో కలిసి గంజాయి మత్తును అలవాటు చేసింది. మత్తులో ఉన్న ఫ్రెండ్‌పై భర్తతో లైంగిక దాడి చేయించింది.. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీసింది. ఆపై బ్లాక్ మెయిల్‌కు పాల్పడటం మొదలెట్టింది. శారీరకంగా, మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్న సమయంలో అమ్మకు చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.. తిరుపతిలో జరిగిన దారుణానికి సంబంధించిన వివరాలు.. కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన విద్యార్థి (22) తిరుపతి శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో ఎల్ఎల్బీ మూడో సంవత్సరం చదువుతోంది. తిరుపతి రూరల్ మండలం పుదిపట్లకు చెందిన కృష్ణకిషోర్‌రెడ్డి భార్య ప్రణవకృష్ణ కూడా ఆమె చదువుతున్న క్లాస్‌లోనే సహ విద్యార్థి నిగా ఉంది. తన తోటి విద్యార్థి ని నమ్మించి పుదిపట్లలోని తన ఇంటికి తీసుకెళ్లి భర్త కృష్ణకిషోర్‌రెడ్డికి పరిచయం చేసింది ప్రణవకృష్ణ. అనంతరం ఇద్దరు కలిసి విద్యార్థి కి గంజాయిని అలవాటు చేశారు. మత్తులో ఉన్న విద్యార్థి నిపై కృష్ణకిషోర్‌రెడ్డి లైంగికదాడి చేసేవాడు. దీనిని ప్రణవకృష్ణ ఫొటోలు, వీడియోలు తీసింది. ఇదంతా గతేడాది జూన్ 13 నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు కొనసాగింది. ఇటీవల కర్నూలు విద్యార్థి కి తమ కుటుంబ సభ్యులు చూసిన వ్యక్తితో నిశి్చతార్థం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రణవకృష్ణ, కృష్ణకిషోర్‌రెడ్డి విద్యార్థి ని బ్లాక్మెయిల్ చేయసాగారు. నగ్నంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చూపించి డబ్బు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విద్యార్థి వద్ద బంగారు గొలుసు, నిశ్చితార్థం ఉంగరం, నగదును సైతం లాక్కున్నారు. మరిన్ని డబ్బులతో తిరుపతికి వచ్చి సెటిల్ చేసుకోకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఆలస్యం అవుతుందని శారీరకంగా, మానసికంగా దాడులు చేస్తూ వేధించారు. ఇంట్లో చెప్పుకోలేక, వేధింపులు భరించలేక విద్యార్థి ఆత్మహత్యే శరణ్యం అని భావించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన విద్యార్థిని తల్లి పద్మావతి సొంతూరు నుంచి తిరుపతిలోని వర్సిటీకి వచ్చి 0ది. బిడ్డ దుస్థితి చూసి లోతుగా ఆరా తీసింది. దీంతో జరిగిన ఘటన, బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యవహారంపై తల్లి వద్ద వాపోయింది. దీంతో ఈ నెల 25న తిరుపతి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో తల్లితో కలిసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు రూరల్ సీఐ తమీమ్ అహ్మద్ తెలిపారు. కేసులో నిందితులైన ప్రణవకృష్ణ, కృష్ణకిషోర్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు రిమాండ్ విధించింది. ఇదిలా ఉండగా, ప్రణవకృష్ణను సస్పెండ్ చేస్తున్నట్టు వర్సిటీ అధికారులు ప్రకటించారు. -
ప్రముఖ కాలేజీల్లో గుట్టుగా గంజాయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డట్లు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ) డైరెక్టర్ సందీప్ శాండిల్య సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పట్టుబడిన వారిలో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 15 మంది విద్యార్థులతోపాటు కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియాకు చెందిన నలుగురు, సీబీఐటీలో ఒకరు, బాసర ట్రిపుల్ ఐటీకి చెందిన కొందరు, జేఎన్టీయూ (జోగిపేట్)లో ముగ్గురు, సింబయోసిస్ కాలేజీకి చెందిన 25 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. అలాగే ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఆరుగురు జూనియర్ డాక్టర్లు గంజాయి తాగుతూ పట్టుబడ్డారని.. వారిపై చర్యలు తీసుకోవాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశామన్నారు. ఇండస్ స్కూల్ విద్యార్థులకు కోడ్ పేర్లతో ఈ–సిగరెట్లు విక్రయిస్తున్న అహ్మద్, జాఫర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వారి వివరాలు వెల్లడించలేకపోతున్నామని పేర్కొన్నారు. ఆయా విద్యార్థులను అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. సాంకేతిక సహకారం, నిఘా వర్గాల నుంచి సేకరిస్తున్న సమచారంతో విజయవంతంగా మత్తుపదార్థాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.నిఘా పెంచాం..రాష్ట్రంలోని పబ్బుల్లో మత్తుపదార్థాల వాడకంపై నిఘా పెంచినట్లు టీజీఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఇటీవలే హెచ్ఐసీసీ నోవాటెల్‌లోని ఆర్టిస్ట్రి పబ్‌లో డ్రగ్స్ సేవిస్తున్న ముగ్గురు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా కేవ్ పబ్‌లో ఫారెస్ట్ ఆల్కెమీ పేరిట నిర్వహించిన పార్టీలో పాల్గొన్న 52 మందికి పరీక్షలు నిర్వహించగా 33 మంది గంజాయి, కొకైన్, ఎండీఎంఏ వాడినట్లు నిర్ధారణ అయిందన్నారు. హైదరాబాద్‌లో తరచూ ఈవెంట్లు నిర్వహిస్తున్న డీజేల వివరాలను సేకరించినట్లు సందీప్ శాండిల్య తెలిపారు. పబ్బుల్లో 21 ఏళ్లలోపు యువతకు మద్యం సరఫరా చేస్తున్నారా లేదా అనే దానిపైనా నిఘా పెట్టాలని, ఆధార్ కార్డులను తనిఖీ చేసి వయసు నిర్ధారించాలని యూనిట్ అధికారులకు సూచిస్తున్నట్లు చెప్పారు. డ్రగ్స్ వాడకాన్ని నిరోధించేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రముఖ విద్యాసంస్థలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు సూచిస్తున్నామని తెలిపారు. మత్తుపదార్థాలకు బానిసలైన వారిని అందులోంచి బయటపడేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.80 శాతం గంజాయి ఒడిశా నుంచే..!ఏపీ, తెలంగాణలోకి రవాణా అవుతున్న గంజాయిలో 80 శాతం వరకు ఒడిశా నుంచే వస్తోంది. ఒడిశాలో సాగుచేసి రవాణా చేస్తున్న గంజాయి ప్రధానంగా ఖమ్మం జిల్లా సరిహద్దు నుంచే తెలంగాణలోకి వస్తున్నట్లు వెల్లడించాయి. డ్రగ్స్, గంజాయి వినియోగం, రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం ఆదేశించడంతో రాష్ట్ర సరిహద్దులో మరింత నిఘా పెంచామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. -
15 మంది గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
విజయవాడస్పోర్ట్స్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని ఏజెన్సీల నుంచి సేకరించిన గంజాయిని విజయవాడ, పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముఠాలోని ప్రధాన నిందితుడితో పాటు మరో14 మందిని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగం అరెస్ట్ చేసింది. డీజీపీ ద్వారకా తిరుమలరావు, జిల్లా పోలీస్ కమిషనర్ ఎన్.వి.రాజశేఖరబాబు ఆదేశాలతో ఈ ముఠా కదలికలపై ప్రత్యేక దృష్టి సారించింది. యాంటి నార్కోటిక్ సెల్, టాస్క్‌ఫోర్స్, లా అండ్ ఆర్డర్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ వివరాలను విజయవాడ కమాండ్కంట్రోల్ రూంలో విజయవాడ డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ) హరికృష్ణ శుక్రవారం వెల్లడించారు.ప్రధాన నిందితుడు పింక్రౌత్..పోలీసుల అదుపులో నున్న 14మంది గంజాయి స్మగ్లర్లు ఇచ్చిన సమాచారంతో గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ప్రధాన నిందితుడు ఒడిశాకు చెందిన పింకి రౌత్‌ను అరెస్ట్ చేశారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతా లైన బరంపురం, పీలేరు ఏజెన్సీ ప్రాంతాల్లోని వ్య క్తుల నుంచి గంజాయిని సేకరించి విజయవాడకు సరఫరా చేయడంలో పింక్రౌత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని డీసీపీ హరికృష్ణ తెలిపారు.ఇతనిపై గతంలో మాచవరం పోలీస్‌స్టేషన్‌లో అనేక కేసులు నమోదయ్యాయన్నారు. విజయవాడ సిటీ, చుట్టుపక్కలనున్న పలు ప్రాంతాల్లో గంజాయిని విక్రయిస్తున్న గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన గోగినేని మాధవరావు, తెలంగాణా, మేడ్చల్, పోతయిపల్లికి చెందిన మురుగన్ మణికంఠ, సంకేలి గణేష్, కృష్ణా జిల్లా, పెనమలూరుకు చెందిన షేక్ మొహమ్మద్ గౌస్ అబ్దుల్ హబీబ్, విజయవాడ అజిత్ సింగ్‌నగర్‌కు చెందిన మర్రి రఘురాం, విజయవాడ మాచవరం డౌన్‌కు చెందిన కొమ్ము రాకేశ్, విజయవాడ భవానీపురానికి చెందిన పాలెటి మమతరాజు, మహమ్మద్ ముజ్జమిల్ సుల్తాన్, షేక్ నజీర్, మత్తే నాని, ఇల్లురి మధుసూదన్‌రెడ్డి, కృష్ణలంకకు చెందిన అడపాల వంశీ, అమన్‌సింగ్‌ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరిందరిపై గతంలో అనేక కేసులు నమోదయినట్లు చెప్పారు. నిందితుల నుంచి 90.5 కేజీల గంజాయితో పాటు ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా, ప్రజలు 91211 62475కు గంజాయి సమాచారం ఇవ్వాలని ప్రజ లను కోరారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ శ్రీహరి, సీఐలు నాగేంద్రకుమార్, శ్రీధర్, రమేష్ పాల్గొన్నారు. -
గంజాయి మత్తులో బాలికలపై అఘాయిత్యాలు
తిరుపతి(అలిపిరి)/తిరుమల: రాష్ట్రంలో గంజాయి మత్తులో బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని.. ఈ పరిణామాలు చూసి ప్రజలు భయాందోళనకు గురికావొద్దని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. తిరుపతిలోని శ్రీపద్మావతి అతిథి గృహంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, బాలికలపై దాడులు చేస్తున్న వారిని వెంటనే పట్టుకుంటున్నట్టు తెలిపారు. తప్పుచేసిన వారిని కఠినంగా శిక్షిస్తున్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని చెప్పారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీ నేతలు పాకులాడుతున్నారని, గత ప్రభుత్వం కారణంగానే చిన్నపిల్లల సంచుల్లోకి గంజాయి చేరుతోందని ఆరోపించారు. గంజాయిని రాష్ట్ర పంటగా పండించింది వైఎస్సార్సీపీ నేతలేనని.. లిక్కర్‌పైన పెట్టిన దృష్టి గంజాయిపై ఎందుకు పెట్టలేదన్నారు. పోలీసుల్ని కాపలాకు ఉపయోగించుకున్న గత ప్రభుత్వంలోనే వందలాది మంది బాలికలు కనిపించకుండా పోయారని ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా, కాలినడక మార్గంలోనే శ్రీవారి దర్శనం టికెట్లు జారీచేయాలని హోం మంత్రి అనిత కోరారు. అలిపిరి కాలినడక మార్గాన నడుచుకుంటూ ఆమె తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నడక మార్గంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. అదృశ్యమైన ఎంపీడీవో వెంకటరమణ ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నామని అనిత చెప్పారు. -
హత్యాచారం కేసులో ముగ్గురి అరెస్ట్
చీరాల/చీరాల అర్బన్: బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం సీతారాంపేటకు చెందిన యువతిపై హత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం రాత్రి మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. సీతారాంపేటకు చెందిన పౌజుల సుచరిత (21) ఇంటర్ వరకు చదివి టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. శుక్రవారం ఉదయం 5.45 గంటలకు ఆ యువతి ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్ సమీపంలో బహిర్భూమికి వెళ్లింది. ఆ తరువాత రైల్వే ట్రాక్ పక్కన ముళ్లపొదల్లో వివస్త్రగా ఆమె మృతదేహం కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారం జరిపి, హత్య చేశారని హతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీరాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో పోలీసులు సవాల్‌గా తీసుకుని 10 బృందాలను రంగంలోకి దించి దర్యాప్తు చేపట్టారు. గంజాయి మత్తులో.. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టగా.. ఈపూరుపాలెం గ్రామానికే చెందిన దేవరకొండ విజయ్, కారంకి మహే‹Ù, దేవరకొండ శ్రీకాంత్ ఈ దురాగతానికి పాల్పడినట్టు తేలింది. నిందితులు ముగ్గురినీ శనివారం సాయంత్రం చీరాల బైపాస్ రోడ్డు వద్ద హాయ్ రెస్టారెంట్ సమీపంలోని వాడరేవు వెళ్లే రోడ్డులో 50 మీటర్లు దూరంలో అరెస్ట్ చేసినట్టు ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. గంజాయి మత్తుకు బానిసలైన నిందితులు శుక్రవారం తెల్లవారుజామున రైల్వేట్రాక్ సమీపంలో బహిర్భూమికి వెళ్లిన యువతిని ఏ1 విజయ్, ఏ2 మహేష్ బలవంతంగా చెట్ల పొదల్లోకి లాక్కెళ్ళారు. యువతి నోరుమూసి బలవంతంగా అత్యాచారం చేసి అనంతరం ముఖంపై దాడి చేయడంతోపాటు నోరు, ముక్కు మూసి హత్య చేశారన్నారు. ఆ ఇద్దరికీ ఏ3 శ్రీకాంత్ ఆశ్రయం కల్పించాడన్నారు. ముగ్గురు నిందితులకు నేరచరిత్ర ఉందని.. వారిపై చీరాల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో గతంలో పలు కేసులు నమోదై ఉన్నాయని ఎస్పీ చెప్పారు. అడిషనల్ ఎస్పీ టీపీ విఠలేశ్వర్ ఆధ్వర్యంలో చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్, బాపట్ల డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ పర్యవేక్షణలో చీరాల రూరల్ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణ దర్యాప్తు చేశారన్నారు. ముగ్గురు నిందితులపై కోర్టులో చార్జిïÙట్ వేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలి యువతి హత్యాచార ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యువతి కుటుంబ సభ్యులను శనివారం సునీత పరామర్శించారు. రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు జరగడం దారుణమన్నారు. ఆమె వెంట జెడ్పీటీసీ ఆకురాతి పద్మిని, గంజి చిరంజీవి ఉన్నారు. ఇదిలావుండగా.. హత్యాచారానికి గురైన పౌజుల సుచరిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి శనివారం పరామర్శించారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి వారికి భరోసా కల్పించారు. యువతిపై హత్యాచార ఘటన దారుణమని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. -
వ్యాపారులకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి
గాం«దీనగర్ (విజయవాడ సెంట్రల్)/కడప కల్చరల్/తణుకు అర్బన్: కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారంటూ రావులపాలెంలో వర్తక వ్యాపారులపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్యులు, ఇతర వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యలను విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఖండించగా, రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ చింతకుంట పుల్లయ్య మండిపడ్డారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం విజయవాడలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కె.విద్యాధరరావు మీడియాతో మాట్లాడారు. తక్షణమే చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని, కిరాణా వ్యాపారులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు వ్యాఖ్యలు ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీశాయన్నారు. ఎక్కడైనా కిరాణా దుకాణంలో గంజాయి అమ్ముతూ పట్టుబడిన ఘటనలు రాష్ట్ర చరిత్రలో ఉన్నాయా అని ప్రశి్నంచారు. ఎక్కడో గంజాయి దొరికితే వ్యాపారులకు దాన్ని ఆపాదించడం సరికాదన్నారు. ఆర్యవైశ్యులను అవమానించడం బాబుకు అలవాటుగా మారిందని, ఉద్దేశపూర్వకంగానే విమర్శలు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు క్షమాపణ చెప్పే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు పల్లపోతు మురళీకృష్ణ మాట్లాడుతూ బాబు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన తీరును ఖండిస్తూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఈమని దామోదర్‌రావు, మద్దాల సుధాకర్, శేగు వెంకటేశ్వర్లు, పోకూరి రమేశ్, ఎస్.వెంకటేశ్వరరావు, నాళం నాగేశ్వరరావు, మద్ది బాలు పాల్గొన్నారు. వైశ్యుల ఆత్మగౌరవాన్ని కించపరచకండి కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కడప నగర ఆర్యవైశ్య ప్రముఖుడు, రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ చింతకుంట పుల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైశ్యుల ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ మాట్లాడటం చంద్రబాబుకు తగదన్నారు. తక్షణమే ఆయన మాటలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఆర్యవైశ్యుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎన్నికల్లో ఓటు రూపంలో తమ సమాధానం చెబుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా శనివారం మధ్యాహ్నం గంటపాటు కిరాణా దుకాణాలను మూసివేశారు. అంత చులకనా?: కారుమూరి కిరాణా వ్యాపారులను గంజాయి అమ్మకందారులుగా చిత్రీకరిస్తున్న చంద్రబాబు దుర్మార్గుడని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రావులపాలెం బహిరంగ సభలో చంద్రబాబు కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారంటూ వ్యాపారులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. అధికారంలో ఉండగా ఎస్సీలు, బీసీలపై, ఈ మధ్య టిప్పర్ డ్రైవర్‌కి ఎమ్మెల్యే సీటా? అంటూ అవహేళన చేసి, తాజాగా ఆర్యవైశ్యులపై వ్యాఖ్యలు చూస్తుంటే పక్కా ప్రణాళిక ప్రకారమే పేద వర్గాలను టార్గెట్ చేస్తున్నట్టుగా అర్థమవుతోందన్నారు. చెప్పినవే కాదు.. చెప్పనివి కూడా చేసిన సీఎం వైఎస్ జగన్ సేవా రాజకీయాలు మాత్రమే చేస్తారని చెప్పడానికి గర్వపడుతున్నానని కారుమూరి అన్నారు. ఈ సమావేశంలో నరసాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల పాల్గొన్నారు. -
బాబు పాలన గంజాయి ఖజానా
చంద్రబాబు అక్రమాలను కడుపులో పెట్టుకుని దాచుకోవడంలో రామోజీ సిద్ధహస్తుడు. బాబు ఓటమి రామోజీ కళ్లముందు స్పష్టంగా కనిపిస్తుంటే...ఆ మనోవేదనలో చిత్తచాంచల్యపు రాతలతో జగన్ ప్రభుత్వంపై చెలరేగిపోతున్నారు. చంద్రబాబు పాలనలో గంజాయి దందాను సాక్షాత్తూ టీడీపీ నేతలే సాగించినా, ఆ సమయంలో ఏ రోజునా ఈ అక్రమాల గురించి రామోజీ రాయలేదు. నర్సీపట్నం కేంద్రంగా బాబుకు సన్నిహితులైన టీడీపీ నేతలు బరితెగించి, అంతర్ రాష్ట్ర సిండికేట్ నడిపారు. బాబు హయాంలో అక్రమాలను రాయడానికి రామోజీ లేని చత్వారాన్ని, బధిరత్వాన్ని అరువు తెచ్చుకుని, పెన్ను మూసుక్కూర్చున్నారు...వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి దందాలపై ఉక్కు పాదం మోపుతోంది. అన్ని మార్గాల్లోనూ గంజాయి దందాలకు చెక్ పెట్టి, దాని ఆనవాళ్లు లేకుండా చేయాలని నిరంతరం దాడులు చేస్తుంటే ఆ నేరనిరోధ చర్యలు రామోజీకి నచ్చడం లేదు... పనిలో పనిగా గంజాయి సాగును అరికట్టే క్రమంలో సంస్కరణలు సైతం చేపట్టింది. ఆపరేషన్ పరివర్తన్ కింద గంజాయి సాగును ధ్వంసం చేయడంతోపాటు గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధిగా ఆపరేషన్ నవోదయం పథకాన్ని తీసుకొచ్చింది. ఇలా సంస్కరణలనే ఆయుధంగా చేసుకుని, గిరిజన జీవితాల్లో వెలుగురేఖలు నింపుతోంది. సాక్షి, అమరావతి: రాబోయే ఎన్నికల్లో టీడీపికి మరోసారి ఓటమి ఖాయమన్న స్పష్టమైన సంకేతాలు ఈనాడు రామోజీరావుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హైదరాబాద్ శివారులోని ఫిల్మ్ సిటీ కొండపైన అక్రమంగా కట్టుకున్న కోటవంటి భవంతిలో నిద్రలేని రాత్రులు గడుపుతున్న రామోజీలో పైత్యం పరిపరి విధాలుగా ప్రకోపిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గంజాయి దందా అంతర్జాతీయ స్థాయికి చేరుకుందని పిచ్చపిచ్చగా పచ్చ రాతలతో విరుచుకుపడుతున్నారు. ఏదో విధంగా రోజూ ఈనాడు పత్రిక నిండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం చేయందే రామోజీకి తిన్న ఆ కాస్త ముద్ద అరిగేలా అనిపించడం లేదు. ఆ పైత్యపు రాతలతో రామోజీ కడుపు మంట తీరుతుందేమోగానీ, అవాస్తవాలను వాస్తవం అంటూ ప్రజల్ని మోసం చేయలేరు. చంద్రబాబు హయాంలో విశృంఖలంగా నడిచిన గంజాయి మాఫియాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు... వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి సాగును ధ్వంసం చేసిన ఆపరేషన్ పరివర్తన్ విజయవంతం కావడాన్నీ గుర్తించారు. మీ ఒక్కరే వీటిని గుర్తించనట్లు నటిస్తున్నారు రామోజీ... మీ నిద్రలేమి సమస్యకు... కడుపు మంటకు ఏదైనా డాక్టర్‌ను సంప్రదిస్తే మంచిది.... కట్టుకథలతో ఈనాడు పత్రికను నింపేస్తే చిరిగేది మీ చాటేనని చెప్పేందుకే ఈ ఫ్యాక్ట్ చెక్... చంద్రబాబు హయాంలోనే గంజాయి మాఫియా... చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో గంజాయి మాఫియా రాజ్యమేలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ... 2014లో విభజన అనంతరం 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్న కాలంలోనే రాష్ట్రంలో గంజాయి దందా యథేచ్చగా సాగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ గంజాయి దందాకు ఏపీ కేంద్ర బిందువుగా మారింది. అంటే అదంతా టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. చంద్రబాబుకు సన్నిహితులైన టీడీపీ కీలక నేతలు నర్సీపట్నం కేంద్రంగా అంతర్రాష్ట్రస్థాయిలో గంజాయి సిండికేట్‌ను నిర్వహించారు. ఏకంగా పోలీసు ఉన్నతాధికారుల అండతో ఉత్తరాంధ్రలో అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో భారీ ఎత్తున గంజాయి సాగు చేయించారు. 2014 తరువాత అప్పట్లో ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా పోలీసు ఉన్నతాధికారిగా నియమితుడైన టీడీపీ రాజ్యసభ సభ్యుడి సమీప బంధువే ఈ దందాకు సూత్రధారిగా వ్యవహరించారు. గంజాయి సాగు కోసం విశాఖ ఏజెన్సీలో ఓ వ్యవస్థను సృష్టించారు. సాగును ధ్వంసం చేస్తే గిరిజనులు మావోయిస్టులకు సన్నిహితమయ్యే ప్రమాదముందని ఓ కట్టుకథను అధికారికంగా తెరపైకి తెచ్చారు. ఆ సాకుతో సాగును చూసీచూడనట్టు వదిలేయాలని టీడీపీ ప్రభుత్వం అధికారికంగా విధాన నిర్ణయం తీసుకుంది. ఇదే అదనుగా టీడీపీ గంజాయి మాఫియా చెలరేగిపోయింది. వేలాది ఎకరాల్లో దర్జాగా సాగు చేస్తూ... నర్సీపట్నం గుండా అటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు, ఇటు చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి మీదుగా ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా స్మగ్లింగ్ చేస్తూ బరితెగించి మరీ అక్రమాలకు పాల్పడింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి మాఫియా ద్వారా చంద్రబాబు కోటరీ వేల కోట్ల రూపాయలు ఆర్జించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే నవోదయం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో డ్రగ్స్ దందాను నిర్మూలించేందుకు విప్లవాత్మక విధాన నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానమైనది గంజాయి సాగును ధ్వంసం చేయడం. రాష్ట్రంలో దశాబ్దాలుగా వ్యవస్థీకృతమైన గంజాయి సాగును అడ్డుకోలేమని పలువురు అభిప్రాయపడినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ససేమిరా అన్నారు. యువత భవిష్యత్‌ను నాశనం చేస్తున్న ఈ మత్తు పంటను తుదముట్టించాల్సిందేనని విస్పష్టంగా ప్రకటించారు. గంజాయి, అక్రమ మద్యం, నాటుసారా దందాను సమూలంగా తుడిచిపెట్టడానికి ప్రత్యేకంగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటు చేసి, ఈ బ్యూరోకు విస్తృత అధికారాలు కల్పించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ‘సెబ్’ గంజాయి సాగును నిర్మూలించేందుకు ‘ఆపరేషన్ పరివర్తన్’ కార్యక్రమాన్ని రెండు దశల్లో విజయవంతంగా పూర్తి చేసింది. అందుకోసం గిరిజనుల్లో చైతన్యం కలిగించి వారి సహకారం తీసుకోవడం వ్యూహాత్మకంగా సత్ఫలితాలనిచ్చింది. గంజాయి సాగు వల్ల అనర్థాల గురించి ప్రభుత్వం ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో విస్తృత అవగాహన కల్పించింది. పోలీసు, రెవెన్యూ, సెబ్, గ్రామ సచివాలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేపట్టిన అవగాహన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఈ పంట సాగు నిర్మూలన కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. శాటిలైట్ ఫొటోలతో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంత్రాన్ని జియో మ్యాపింగ్ చేశారు. అనంతరం ప్రత్యేక యంత్రాలతో రెండు దశల్లో ఏకంగా 11,550 ఎకరాల్లో పంటను ధ్వంసం చేశారు. ఏకంగా 4.50 కోట్ల గంజాయి మొక్కలను తొలగించి దహనం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో గంజాయి సాగు లేనేలేదు. ఆ విషయాన్ని స్వయంగా కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి సాగును నిర్మూలించినప్పటికీ సరిహద్దు అవతల ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సాగు కొనసాగుతోంది. ఆ రాష్ట్రాల్లో పండించిన గంజాయిని ఆంధ్రప్రదేశ్ మీదుగా సాగుతున్న అక్రమ రవాణానూ అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. అందుకోసం ప్రత్యేకంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, ఇతర చెక్ పోస్టులను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 4.50 లక్షల కేజీల గంజాయి, 131 లీటర్ల ద్రవ రూప గంజాయిని స్వాదీనం చేసుకుంది. 13,210 మందిని అరెస్ట్ చేయడంతో పాటు 2,950 వాహనాలను జప్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’కు జాతీయస్థాయిలో ప్రశంసలు లభించాయి. గంజాయి సాగును సమర్థంగా అడ్డుకున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మొదటిస్థానంలో నిలిచిందని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం దశాబ్దాలుగా జీవనోపాధి లేక గంజాయి సాగుపై ఆధారపడుతున్న గిరిజనుల జీవితాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా వారిని ప్రోత్సహించింది. అందుకోసం రూ.144 కోట్లతో ఆపరేషన్ నవోదయం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. కాఫీ, రాగులు, జొన్నలు, రాజ్మా, మామిడి, కొబ్బరి, నిమ్మ, జీడి మామిడి, వేరుశెనగ, డ్రాగన్ ఫ్రూట్ తదితర పంటల సాగు చేపట్టేలా ప్రోత్సహించింది. ఇందులో భాగంగా ఉచితంగా విత్తనాలను సరఫరా చేయడంతో పాటు ఈ–క్రాపింగ్ ద్వారా అన్నిరకాల పథకాలను అందుబాటులోకి తెచ్చింది. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పిస్తూ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేసింది. -
'పచ్చ' మత్తు కిక్కుతో వంకర రాతలు
రామోజీ దుష్ప్రచారం చూస్తుంటే ఆయన ఎంతగా భయపడిపోతున్నారో స్పష్టంగా తెలుస్తోంది. చంద్రబాబు హయాంలో గంజాయి సాగు చేసిన పచ్చ బ్యాచ్ గురించి అక్షరమ్ముక్క రాయని ఈ గురివింద.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ తప్పుడు రాతలతో రెచ్చిపోతున్నారు. రాసిందే రాస్తూ.. చెప్పిందే చెబుతూ.. ‘పచ్చ’ మత్తు కిక్కులో అనునిత్యం ప్రభుత్వంపై కక్షగట్టి వ్యవహరిస్తుండటం రామోజీకి పరిపాటిగా మారింది. సీఎం జగన్ చేస్తున్న ప్రతి మంచి పనిలోనూ కోడిగుడ్డుపై వెంట్రుకలు పీకాలన్న చందంగా వ్యవహరిస్తుండటం చూస్తుంటే రామోజీ పచ్చ పిచ్చి వైద్యానికి అందనంతగా ముదిరిపోయిందని స్పష్టమవుతోంది. సాక్షి, అమరావతి : ఎక్కడైనా దొంగలను పట్టుకుంటే పోలీసులు సమర్థవంతంగా పని చేస్తున్నట్టు భావిస్తారు. కానీ రామోజీరావు మాత్రం అలాంటి మంచిని ప్రభుత్వ అసమర్థతగా వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గంజాయి దందాపై ఉక్కుపాదం మోపింది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో దశాబ్దాలుగా సాగుతున్న గంజాయి సాగును ధ్వంసం చేయడంతో పాటు గంజాయి అక్రమ రవాణాను సమర్థంగా కట్టడి చేస్తోంది. అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తోంది. నిందితులను అరెస్ట్ చేస్తోంది. అంత సమర్థంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశంసించాలి. రామోజీరావు మాత్రం.. ‘చూడండి.. అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.. స్మగ్లర్లను అరెస్ట్ చేశారు.. ఇదంతా ఈ ప్రభుత్వ తప్పిదమే’ అని టముకేస్తూ వక్రభాష్యం చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో చేసినట్టుగా గంజాయి దందాను ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండాలన్నది రామోజీరావు ఉద్దేశమేమో! దశాబ్దాలుగా గంజాయి సాగు, అక్రమ రవాణా సాగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. గంజాయి సాగును ధ్వంసమూ చేయలేదు. అక్రమ రవాణాను అడ్డుకోలేదు. దీని వెనుక అసలు రహస్యమేంటంటే.. టీడీపీ ప్రభుత్వంలో గంజాయి దందా సాగించింది అంతా పచ్చ నేతలే. అదే రామోజీరావుకు నచ్చింది. తద్భిన్నంగా ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం గంజాయి దందాకు అడ్డుకట్ట వేస్తుంటే రామోజీరావు సహించలేకపోతున్నారు. జాతీయ స్థాయిలో ప్రశంసలు గంజాయి దందాను నిర్మూలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు జాతీయస్థాయిలో ప్రశంసలు లభించాయి. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్‌ను అభినందించింది. ప్రత్యేక పరిశీలకులను పంపించి ఆపరేషన్ పరివర్తన్ పై అధ్యయనం చేయించింది. గంజాయి సాగును సమర్థంగా అడ్డుకున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మొదటిస్థానంలో నిలిచిందని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. దేశం మొత్తం మీద గంజాయి సాగు ధ్వంసంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. రూ.144 కోట్లతో ఆపరేషన్ నవోదయం దశాబ్దాలుగా జీవనోపాధి లేక గంజాయి సాగుపై ఆధారపడుతున్న గిరిజనుల జీవితాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా వారిని ప్రోత్సహించింది. అందుకోసం రూ.144 కోట్లతో ఆపరేషన్ నవోదయం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. కాఫీ, రాగులు, జొన్నలు, రాజ్మా, మామిడి, కొబ్బరి, నిమ్మ, జీడి మామిడి, వేరుశెనగ, డ్రాగన్ ఫ్రూట్ తదితర పంటల సాగు చేపట్టేలా ప్రోత్సహించింది. ఇందులో భాగంగా ఉచితంగా విత్తనాలను సరఫరా చేయడంతో పాటు ఈ–క్రాపింగ్ ద్వారా అన్నిరకాల పథకాలను అందుబాటులోకి తెచ్చింది. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పిస్తూ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేసింది. పచ్చ పెద్దలదే గంజాయి దందా చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఆయనకు అత్యంత సన్నిహితులైన టీడీపీ కీలక నేతలు నర్సీపట్నం కేంద్రంగా గంజాయి సిండికేట్‌ను నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వ హయంలో ఉత్తరాంధ్రలో అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో యథేచ్ఛగా గంజాయి సాగు చేయించారు. అప్పట్లో ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఈ గంజాయి దందాకు పూర్తి అండదండలు అందించారు. గంజాయి సాగును అడ్డుకుంటే గిరిజనులు నక్సలైట్లకు అనుకూలంగా మారతారన్న వితండవాదాన్ని బాబు ప్రభుత్వం తీసుకురావడాన్ని ఈనాడుకు కనిపించినట్లు లేదు. ఈ క్రమంలోనే టీడీపీ ప్రభుత్వం గంజాయి దందాకు పచ్చ జెండా ఊపడంతో విశాఖపట్నం ఏజెన్సీలో వేలాది ఎకరాల్లో గంజాయి సాగు యథేచ్ఛగా సాగిపోయింది. విశాఖపట్నం ఏజెన్సీలో సాగు చేసిన గంజాయిని నర్నీపట్నంలోని టీడీపీ సిండికేట్ నేతలు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులతోపాటు ఉత్తరాది రాష్ట్రాలకు సరఫరా చేసేవారు. అందుకోసం ప్రత్యేకంగా వ్యవస్థీకృత కొరియర్ వ్యవస్థను సైతం ఏర్పాటు చేశారు. ఆ విధంగా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గంజాయి సాగు ద్వారా టీడీపీ ప్రభుత్వ పెద్దలు వేల కోట్ల రూపాయలు ఆర్జించారు. 11,550 ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గంజాయి దందాపై ఉక్కుపాదం మోపింది. ఈ సాగును నిర్మూలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసు యంత్రాంగాన్ని విస్పష్టంగా ఆదేశించారు. గంజాయి, అక్రమ మద్యం, నాటుసారా దందాను తుదముట్టించేందుకు ప్రత్యేకంగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటు చేసి, ఈ బ్యూరోకు విస్తృత అధికారాలు కల్పించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ‘సెబ్’ గంజాయి సాగును నిర్మూలించేందుకు ‘ఆపరేషన్ పరివర్తన్’ కార్యక్రమాన్ని చేపట్టింది. ముందుగా గంజాయి సాగు వల్ల అనర్థాలపై ఆపరేషన్ పరివర్తన్ ద్వారా ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో విస్తృత అవగాహన కల్పించింది. పోలీసు, రెవెన్యూ, సెబ్, గ్రామ సచివాలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేపట్టిన అవగాహన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఈ పంట సాగు నిర్మూలన కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. శాటిలైట్ ఫొటోలతో ఆంధ్ర –ఒడిశా సరిహద్దు పాంత్రాన్ని జీయో మ్యాపింగ్ చేశారు. అనంతరం ప్రత్యేక యంత్రాలతో సాగును ధ్వంసం చేశారు. రెండు దశల్లో ఏకంగా 11,550 ఎకరాల్లో పంటను ధ్వంసం చేశారు. ఏకంగా 4.50 కోట్ల గంజాయి మొక్కలను తొలగించి దహనం చేశారు. ఒడిశా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో సాగు చేస్తున్న గంజాయిని ఆంధ్ర ప్రదేశ్ గుండా అక్రమ రవాణానూ పోలీసు యంత్రాంగం సమర్థంగా అడ్డుకుంటోంది. దీనికోసం ప్రత్యేకంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, ఇతర చెక్ పోస్టులను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 4.50 లక్షల కేజీల గంజాయి, 131 లీటర్ల ద్రవ రూప గంజాయిని స్వాధీనం చేసుకుంది. 13,210 మందిని అరెస్ట్ చేయడంతో పాటు 2,950 వాహనాలను జప్తు చేసింది. -
పోలీసు స్టిక్కర్ తగిలించి.. గంజాయి తరలించి
రామచంద్రాపురం (పటాన్చెరు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ ఏజెన్సీ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని బాలానగర్ ఎస్వోటీ, రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ నరేందర్‌రెడ్డి అందించిన వివరాలివి. మహారాష్ట్ర బడ్లాపూర్‌కు చెందిన ధీరజ్ మున్నాలా డ్రైఫ్రూట్స్ వ్యాపారం చేస్తుంటాడు. అందులో సరైన ఆదాయం రాకపోవడంతో స్నేహితుడు ప్రశాంత్ సంజయ్ షిండేతో కలిసి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయించాలని నిర్ణయించాడు. ఇన్నోవా కారు అద్దెకు తీసుకొని ఇద్దరూ విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వినయ్ మండల్ ద్వారా కిలో రూ.3 వేల చొప్పున 58.5 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. వాటిని 39 ప్యాకెట్లుగా విభజించి కారులో పెట్టుకుని మహారాష్ట్రకు బయల్దేరారు. వీరు గంజాయి తరలిస్తున్నట్లు గురువారం సాయంత్రం బాలానగర్ ఎస్వోటీ పోలీసులు, రామచంద్రాపురం పోలీసులకు సమాచారం అందింది. దీంతో రామచంద్రాపురం పట్టణ పరిధిలోని ఇక్రిశాట్ వద్ద గంజాయి తరలిస్తున్న ఇన్నోవా వాహనాన్ని పట్టుకున్నారు. అందులో ఉన్న ధీరజ్ మున్నాలా జైస్వాల్, ప్రశాంత్ సంజయ్ షిండేలను అదుపులోకి తీసుకొని విచారించగా విషయం బయటపడింది. కాగా ఇన్నోవా వాహనానికి నంబర్ ప్లేట్ మార్చి, ముందు భాగంలో పోలీస్ స్టిక్కర్‌ను పెట్టుకొని గంజాయిని తరలిస్తున్నట్టు విచారణలో తేలింది. దాంతో వారి వద్ద నుంచి రూ.11 లక్షల 70 వేల విలువైన 58.8 కిలోల గంజాయిని, ఇన్నోవా కారు, డూప్లికేట్ నంబర్ ప్లేట్, కొడవలి, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
ఐదెకరాల్లో గంజాయి పంట ధ్వంసం
జి.మాడుగుల (అల్లూరి సీతారామరాజు జిల్లా)/అనకాపల్లి టౌన్: గంజాయి సాగు, రవాణా, విక్రయాలపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలోని నుర్మతి పంచాయతీ గాదిగుంట గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న ఐదు ఎకరాల్లోని గంజాయి పంటను ఎస్ఐ శ్రీనివాస్‌తో కూడిన బృందం మంగళవారం గుర్తించింది. గ్రామస్తుల సహకారంతో గంజాయి మొక్కలను ఒక చోటకు చేర్చి తగులబెట్టారు. పారిపోతున్న ముగ్గురు వ్యక్తులను వెంబడించి పట్టుకున్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కాగా, అనకాపల్లి జిల్లా, అనకాపల్లి మండలం కొత్తూరు ఏఎంఏఎల్ కళాశాల కూడలిలో మంగళవారం 280 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ జంక్షన్లో ఎస్ఐ సింహాచలం వాహనాలను సాధారణ తనిఖీ చేస్తుండగా అనకాపల్లి నుంచి యలమంచిలి వైపు వెళ్తున్న కారులో గంజాయి బయటపడింది. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన కారు డ్రైవర్ తూము బాలిరెడ్డిని అదుపులోకి తీసుకుని, కారును సీజ్ చేసి కేసు నమోదు చేశారు. గంజాయి విలువ సుమారు రూ.5.5 లక్షలు ఉంటుందని సీఐ దాడి మోహన్‌రావు చెప్పారు. -
‘తమ్ముళ్లే’ ఆ గంజాయి బాబులు!
సాక్షి, పుట్టపర్తి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక.. ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎదుర్కొనే దమ్ములేక టీడీపీ నేతలు విష సంస్కృతికి తెరలేపారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బలో గంజాయి సేవించి హల్చల్ చేసిన యువకులు టీడీపీ కార్యకర్తలు అయినప్పటికీ వారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనుచరులని తప్పుడు ప్రచారం చేస్తూ బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌కు సన్నిహితంగా ఉండే కార్తీక్.. ఈ నెల 23న తన స్నేహితులతో కలిసి గంజాయి సేవించి వాహనాలతో రోడ్లపై హడావుడి చేశారు. అడ్డొచ్చిన వాహనాలను ఢీకొట్టారు. ఎదురు మాట్లాడిన వ్యక్తిని చితకబాదారు. పోలీసులు పట్టుకుంటే ‘వైఎస్సార్సీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి’ స్టిక్కర్ చూపించారు. తాము చేసిన అరాచకాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపైకి నెట్టేందుకే ఈ స్టిక్కర్’ చూపించినట్లు తెలుస్తోంది. బురద జల్లేందుకే.. నిజానికి.. 2019 ఎన్నికల్లో రాప్తాడు నుంచి టీడీపీ తరఫున పోటీచేసి ఘోరంగా ఓడిపోయిన పరిటాల శ్రీరామ్.. రాజకీయంగా ఎదుర్కొనే సత్తాలేక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై బురదజల్లేందుకు ఆకతాయిలను రోడ్లపై వదిలినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. గంజాయి మత్తులో వీరంగం చేయడంతో పాటు అధికార పార్టీ నేతలను లాగాలని చూడటం తెలుగు తమ్ముళ్లకు సరికాదని వైఎస్సార్సీపీ శ్రేణులు సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చాయి. ఇక ముదిగుబ్బ పోలీసుల అదుపులో ఉన్న కార్తీక్ గురించి వైఎస్సార్సీపీ నేతలు ఆరా తీయగా పరిటాల శ్రీరామ్‌కు అత్యంత సన్నిహితుడిగా తేలింది. అదేవిధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో దిగిన అతని ఫొటోలూ సేకరించారు. -
గంజాయి విక్రేతల అరెస్ట్
జి.మాడుగుల (అల్లూరి సీతారామరాజు జిల్లా)/ కోనేరుసెంటర్ (కృష్ణాజిల్లా): అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ గిన్నెగరువు గ్రామానికి చెందిన వ్యక్తి నుంచి 1,760 కిలోల గంజాయిని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం పాడేరు ఏఎస్పీ ధీరజ్ మీడియాకు వెల్లడించారు. జూన్1, 2023లో ఎండీఎస్, చెన్నై జోన్ యూనిట్ 13 ఎన్సీబీ కేసులో తమిళనాడుకు చెందిన సురేష్ 160 కిలోల గంజాయితో రాగమటన్పల్లి వేపనహీళి పోలీస్‌లకు పట్టుబడ్డాడు. ఈ గంజాయిని పాడేరు ప్రాంత సుందరరావు వద్ద కొనుగోలు చేసినట్టు చెప్పాడు. చెన్నై నుంచి వచ్చిన బృందం పాడేరు వచ్చి జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. జిల్లా ఎస్పీ, ఏఎస్పీ సూచనల మేరకు స్థానిక పోలీసులు పెదబయలు మండలం, ఇంజరి పంచాయతీ గిన్నెగరువు గ్రామానికి చెందిన సుందరరావు ఇంట్లో తనిఖీ చేయగా.. 1,760 కిలోల గంజాయి లభించింది. దీని విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుంది. సుందరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ పట్టివేత.. అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ను కృష్ణా జిల్లా పోలీసులు పట్టుకున్నారు. అతనితో పాటు జిల్లాలో గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్న మరో ముగ్గురు వ్యాపారులనూ అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ పి.జాషువా తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా పాడువ మండలం చత్వా గ్రామానికి చెందిన కొర్రా రాందాస్ అలియాస్ భట్టుభాయ్ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ గంజాయి సరఫరా చేయడం మొదలెట్టాడు. దీనిలో భాగంగా గుడివాడ, అవనిగడ్డ, ఘంటసాల తదితర ప్రాంతాలకు రాందాస్ గంజాయిని సరఫరా చేస్తుంటాడు. మచిలీపట్నంలో గంజాయి అమ్మకాలు సాగిస్తున్న బడుగు నాగరాజును పలుమార్లు పోలీసులు పట్టుకున్నారు. అతని నేర చరిత్రను పరిశీలించిన ఎస్పీ.. నాగరాజుతో పాటు గుడివాడకు చెందిన మందాల కిరణ్‌రాజు, పమిడిముక్కలకు చెందిన చీకుర్తి నాని అలియాస్ బీస్ట్‌పై పీడి యాక్టును అమలుపరిచి జైలుకు పంపారు. పై ముగ్గురు పట్టుబడిన కేసులో రాందాస్ గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలుసుకున్న ఎస్పీ జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా మచిలీపట్నంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా రాందాస్ కంటబడ్డాడు. వెంటనే పోలీసులు రాందాస్‌ను అదుపులోకి తీసుకుని బ్యాగు సోదా చేయగా పెద్ద మొత్తంలో గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. రాందాస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తక్షణం అతని వద్ద గంజాయి కొనుగోలు చేసిన గుడివాడలో ఒకరిని, ఘంటసాలలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. వారి నుంచి ఆరు కేజీల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. -
అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): ఖమ్మం ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి నెల్లూరు, తమిళనాడులో విక్రయాలు సాగిస్తున్న ఓ ముఠా గుట్టును నెల్లూరు ఎస్ఈబీ అధికారులు రట్టు చేశారు. ముఠాలోని ఏడుగురు సభ్యులతోపాటు నలుగురు వినియోగదారులను అరెస్ట్ చేసి వారివద్ద నుంచి రూ.15.83 లక్షలు విలువచేసే గంజాయి, కారు, 10 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ కె.తిరుమలేశ్వరరెడ్డి ఈ కేసు వివరాలను గురువారం వెల్లడించారు. చెన్నై ఆంజనేయనగర్ ఆరో వీధికి చెందిన రాఘవన్ కావలిలో తన అత్త వద్ద ఉంటున్నాడు. అతను ఖమ్మం జిల్లా భద్రాచలంలోని పేపర్‌మిల్లులో పనిచేస్తున్న సమయంలో గంజాయి సరఫరాదారులైన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం శారపాక గ్రామానికి చెందిన యు.బాలమురళీకృష్ణ, కె.సురేష్‌తో పరిచయం ఏర్పడింది. వారు ఏవోబీలో గంజాయి కేజీ రూ.3 వేలకు కొనుగోలు చేసి రూ.7,500కు రాఘవన్‌కు విక్రయించారు. ఆయన కావలితోపాటు తమిళనాడు రాష్ట్రంలో కేజీ రూ.15 వేలు చొప్పున విక్రయించి సొమ్ము చేసుకోసాగాడు. ప్రస్తుతం రాఘవన్ దంపతులు కావలి తుఫాన్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డికి సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఎస్ఈబీ జిల్లా ఇన్చార్జ్ డి.హిమవతి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ హుస్సేన్‌బాషా, నెల్లూరు–1, కావలి ఎస్ఈబీ ఇన్స్పెక్టర్లు కేపీ కిశోర్, శ్రీనివాసరావు తమ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టారు. గురువారం తుఫాన్‌నగర్‌లో రాఘవన్ దంపతులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిచ్చిన సమాచారం మేరకు శారపాకకు చెందిన బాలమురళీకృష్ణ, సురేష్, తరుణ్, దుమ్మగూడు మండలం తూరుబాక గ్రామానికి చెందిన సతీష్‌ను అరెస్ట్‌చేసి వారి వద్ద నుంచి 25 కేజీల గంజాయిని, కారును స్వాదీనం చేసుకున్నారు. అలాగే కావలిలోని బాలకృష్ణారెడ్డినగర్‌లో గంజాయి విక్రయదారురాలైన డి.శారదను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుంచి 2 కేజీల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. నలుగురు వినియోగదారులు అదే క్రమంలో రాఘవన్ దంపతులు, శారదల వద్ద కావలిలోని పాతూరుకు చెందిన డి.చైతన్య, వెంగళరావ్‌నగర్‌కు చెందిన వై.లక్ష్మీప్రవీణ్కుమార్, ఆంధ్రావీధికి చెందిన జి.శ్రీకాంత్, శివాలయం ప్రాంతానికి చెందిన పి.ఎం.శ్రీనివాసులు గంజాయిని కొనుగోలు చేసి సేవిస్తున్నట్లు తెలియడంతో వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4.2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ టీడీపీ నేతలు
పుత్తూరు రూరల్ (తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలో గంజాయి విక్రయిస్తూ ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం దొరికిపోయారు. వారిలో ఒకరు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మాజీ మంత్రి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు. వీరిద్దరితోపాటు మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇన్చార్జి డీఎస్పీ రామరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పుత్తూరు పట్టణంలోని స్వర్ణా హౌసింగ్ కాలనీలో గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో సీఐ లక్ష్మీనారాయణ అక్కడికి సిబ్బందితో వెళ్లారు. ముళ్ల పొదల మధ్యలో 8 మంది గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారిని పట్టుకోబోగా, ఆరుగురు దొరికారు. మరో ఇద్దరు పరారయ్యారు. అరెస్టయిన వారిలో నాగలాపురం మండలం వినోబానగర్‌కు చెందిన ఎ.విజయభాస్కర్ (22), నెల్లూరు బాలాజీనగర్‌కు చెందిన కె.యూకేష్ (21), పుత్తూరుకు చెందిన కాశీం మస్తాన్ (29), టి.సందీప్‌కుమార్ (27), సి.ఎం.శరవణ (35), బి.ఎస్.హరికృష్ణ అలియాస్ హరి (30) ఉన్నారు. వీరి నుంచి రూ.2.52 లక్షలు విలువ చేసే 21.05 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా అరకుకు చెందిన వెంకటేష్ వద్ద గంజాయిని కొని పుత్తూరులో విక్రయిస్తున్నట్లు నిందితులు విచారణలో తెలిపారు. పరారైన మోనిష్, బాలుతో పాటు అరకుకు చెందిన వెంకటేష్‌ను త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. గంజాయి విక్రేతలపై పీడీ యాక్టు పెట్టేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. గతంలోనూ అరెస్టయిన హరికృష్ణ అరెస్టయిన వారిలో హరికృష్ణ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు. గతంలో పుత్తూరు పట్టణ తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. శరవణ ప్రస్తుతం టీడీపీ పుత్తూరు పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు. గత ఏడాది జనవరి 10న విజయనగరం జిల్లా కాపుసోంపురం వద్ద 28 కిలోల గంజాయిని కారులో తరలిస్తుండగా పోలీసులు అరెస్టు చేసిన నలుగురిలో హరికృష్ణ రెండో నిందితుడు. అదే రోజు అరెస్టయిన వారిలో మరో టీడీపీ నాయకుడు హేమంత్ మూడో నిందితుడు. ఆ కేసులో బెయిల్‌పై బయటికి వచ్చిన హరికృష్ణ మరోసారి గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డాడు. -
కోట్ల విలువచేసే గంజాయి దగ్ధం చేసిన పోలీసులు
-
గంజాయి సరఫరా కేసులో అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్
గంజాయి సరఫరా కేసులో సినీ అసిస్టెంట్ డైరెక్టర్ హాథీరామ్ను రాచకోండ పోలీసులు అరెస్టు చేశారు. చాలా కాలం నుంచి సినిమా ఆర్టిస్టులకు హాథీరామ్ గంజాయి సరఫరా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అతని దగ్గర నుంచి దాదాపు 190 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హాథీరామ్ కొంతకాలంగా కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు గంజాయిని సరఫరా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసుల సమాచారం ప్రకారం.. కురుక్షేత్రం, యుద్ధం శరణం గచ్చామి సినిమాలకు హాథీరామ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో కర్ణాటక నుంచి కారులో గంజాయిని హాథీరామ్ సరఫరా చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. దీనిపై తమకు కొద్ది రోజుల క్రితమే సమాచారం అందిందని. సోమవారం ఖచ్చితమైన సమాచారం అందడంతో దాడి చేశామన్నారు. ఈ కేసులో హథిరామ్తో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. ఈ కేసులో హాథీరామ్ను ఏ2 నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. -
Hyderabad: పూల కుండీల్లో గంజాయి మొక్కలు
సాక్షి, జవహర్‌నగర్ (హైదరాబాద్): గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే దర్జాగా గంజాయి మొక్కలు పెంచుతున్నారు. నేరేడ్మెట్ డివిజన్ యాప్రాల్ గోదావరి గార్డెన్స్‌లో ఉన్న ఓ ఇంట్లో పూల కుండీల్లో గంజాయి మొక్కలు పెంచుతున్న విషయం బయటపడింది. పక్కా సమాచారంతో జవహర్‌నగర్ సీఐ భిక్షపతిరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి ఇంటి యజమానిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శివ, శర్మఅనే మరో వ్యక్తితోపాటు.. విదేశీ మహిళతో కలిసి తన ఇంట్లో కొన్ని రోజులుగా గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వీరిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. చదవండి: ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచార దందా.. ఇద్దరు అరెస్టు -
Telangana: గంజాయి కట్టడికి మూడంచెలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గంజాయి సాగు, సరఫరా, స్మగ్లింగ్‌ను నియంత్రించేందుకు పోలీస్ శాఖ, ఎక్సైజ్ విభాగాలు నడుం బిగించాయి. ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తున్నాయి. మూడు రోజుల క్రితం సీఎం కేసీఆర్ పోలీస్, ఎక్సైజ్ విభాగాలతో గంజాయి నియంత్రణపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాలకనుగుణంగా మూడంచెల వ్యవస్థను ఏర్పాటుచేసే పనిలో పోలీస్, ఎక్సైజ్ విభాగాలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి. పటిష్టమైన నిఘా.. ఇతర రాష్ట్రాల నుంచి రవాణా అవుతున్న గంజాయితోపాటు రాష్ట్రంలో సాగువుతున్న గంజాయిని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు అంతర్రాష్ట్ర, రాష్ట్ర, జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నేతృత్వంలో జిల్లా కమిటీ గంజాయి నియంత్రణకు కృషి చేస్తుంది. అదేవిధంగా ఎక్సైజ్ కమిషనర్, శాంతి భద్రతల అదనపు డీజీపీ నేతృత్వంలోని రాష్ట్ర కమిటీ జోనల్ ఐజీలతో నియంత్రణ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక పోలీస్, ఎక్సైజ్ విభాగాలతో నిరంతరం సమాచార మార్పిడి చేసుకునేలా అంతర్రాష్ట్ర కమిటీ చర్యలు చేపట్టనుంది. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలో ప్రవేశించే పాయింట్ల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటుచేయాలని ఇరు విభాగాలు నిర్ణయించాయి. ఇందుకోసం పోలీస్ శాఖ బెటాలియన్ల నుంచి 10 మంది సాయుధ బలగాలను ఒక్కో చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేయనుంది. ఎక్సైజ్ విభాగం సైతం ఆయా జిల్లాల పరిధి నుంచి 10 మంది సిబ్బందిని అక్కడ నియమించనున్నట్లు తెలిసింది. ఈ చెక్‌పోస్టులను ఇరు విభాగాల సీఐ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. ఇలా ఏపీ–తెలంగాణ సరిహద్దులో, మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దు (నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో), కర్ణాటక–తెలంగాణ సరిహద్దు (వికారాబాద్, మహబూబ్‌నగర్)లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ), ఎక్సైజ్ శాఖ నేతృత్వంలో రైళ్లలో నిఘాను పెంచి గంజాయి రవాణాను కట్టడి చేయాలని భావిస్తున్నారు. ప్రతీ మండల పరిధిలో ఇన్ఫార్మర్ వ్యవస్థ ద్వారా గంజాయి సాగు చేస్తున్న వారి వివరాలను కనిపెట్టి వాటిని ధ్వంసం చేయాలని ఇప్పటికే పోలీస్ నిఘా వ్యవస్థ అధికారులను ఆదేశించింది. రొటేషన్ పద్ధతిలో కేసులు.. రెండు విభాగాలకు కేసులు నమోదు చేసే అధికారం ఉండటంతో ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా ఉండేందుకు రొటేషన్ పద్ధతిలో కేసుల నమోదుకు నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఒక కేసు పోలీస్ శాఖ, ఒక కేసు ఎక్సైజ్ విభాగం నమోదు చేసేలా వెసులుబాటు చేసుకున్నట్టు తెలిసింది. దీనివల్ల న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉంటాయని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో మొదలైన ఆపరేషన్ ఇప్పటికే హైదరాబాద్‌లో పోలీస్–ఎక్సైజ్ శాఖ నేతృత్వంలో ఆపరేషన్ గాంజా ప్రారంభించారు. నగర కమిషనరేట్ ప«రిధిలోని వెస్ట్ జోన్ జాయింట్ సీపీ–ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు కమిషనర్ అజయ్‌రావ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఇం దులో భాగంగా నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్, గంజాయి అమ్మకాలు జరిపే హాట్ పాయింట్స్‌లో పోలీస్–ఎక్సైజ్ సిబ్బందిని మఫ్టీలో రంగంలోకి దించారు. ఫూట్ పెట్రోలింగ్ గంజాయి అమ్మకందారులు, కొనుగోలుదారులు, స్మగ్లర్లను గుర్తించేందుకు మొదటిసారి రెండు విభాగాల నేతృత్వంలో ఫూట్ పెట్రోలింగ్ (కాలినడక గస్తీ) చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పది మంది సిబ్బంది హాట్ స్పాట్స్‌లో గస్తీ కాస్తారని, అనుమానిత వ్యక్తులు, కారణం లేకుండా ప్రాంతాలు సందర్శించే వారిని గుర్తించి తనిఖీలు చేయడంతోపాటు ప్రశ్నిస్తారని ఉన్నతాధికారులు తెలిపారు. -
TS: గంజాయిపై జంగ్: కేసీఆర్
రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను నిరోధించేందుకు పోలీస్, ఎక్సైజ్ అధికారులకు ఏం కావాలన్నా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గంజాయి మాఫియాను అణచివేయండి. నేరస్తులు ఎంతటి వారైనా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. గుడుంబా తాగడం వల్ల భర్తలను కోల్పోయి ముక్కు పచ్చలారని గిరిజన యువతులు వితంతువులుగా మారుతుండటం నా హృదయాన్ని కలచివేస్తోంది. అందుకే రాష్ట్రంలో గుడుంబా నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నాం.– సీఎం కేసీఆర్ సుదీర్ఘ పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అభివృద్ధి దిశగా అనేక లక్ష్యాలను పూర్తి చేసుకున్నాం. గంజాయి పీడను త్వరగా తొలగించకపోతే రాష్ట్రం సాధిస్తోన్న ప్రగతి ఫలితాలు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి. గంజాయి కోసం గ్రూపులుగా ఏర్పడి వాట్సాప్ మెసేజ్‌లు పెట్టుకుని తెప్పించుకుంటున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గంజాయి సాగు చేస్తున్న వారికి రైతుబంధు, రైతు బీమా రద్దు చేయడంతోపాటు, ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో సాగు చేసే వారి పట్టాలను కూడా రద్దు చేసే అంశాన్ని పరిశీలి స్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరిం చారు. రాష్ట్రంలో ఒక్క గంజాయి మొక్క కూడా కని పించకూడదని స్పష్టం చేశారు. గంజాయి విని యోగం పెరుగుతోందని నివేదికలు వస్తున్న నేపథ్యంలో పరిస్థితి అదుపుతప్పక ముందే తీవ్ర యుద్ధం ప్రకటించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గంజాయిని నిరోధించేందుకు డీజీ స్థాయి పోలీసు అధికారి నేతృత్వంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దాని ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించేందుకు అవసరమైన సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిరోధంపై బుధవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర పోలీస్, ఎక్సైజ్ ఉన్నతాధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. హోం, ఎక్సైజ్ శాఖ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, హోంశాఖ సలహాదారు అనురాగ్‌శర్మ, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, కార్యదర్శులు స్మితా సభర్వాల్, శేషాద్రి, రాహుల్ బొజ్జా, భూపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌లతో పాటు పోలీసు, ఎక్సైజ్ శాఖల ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. మాదక ద్రవ్యాల లభ్యత పెరగడం శోచనీయం ‘రాష్ట్రంలో తీవ్రవాదాన్ని అరికట్టగలిగాం. ఈ విజయం వెనుక పోలీస్ శాఖ త్యాగాలున్నాయి. వారు చేసిన వీరోచిత పోరాటం ఉంది. దీంతో రాష్ట్ర గౌరవ, ప్రతిష్టలు ఎంతగానో పెరిగాయి. రాష్ట్రం గొప్ప అభివృద్ధిని సాధిస్తున్న సందర్భంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల లభ్యత పెరగడం శోచనీయం. వ్యవసాయంలో వచ్చిన అభివృద్ధి కారణంగా రాష్ట్రంలో కోటీ 30 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. పంజాబ్ రాష్ట్రాన్ని కూడా మించిపోతున్నాం. మిషన్ భగీరథ ద్వారా అటవీ ప్రాంతాల్లో మారుమూల గ్రామాలకు కూడా పరిశుభ్రమైన నీటిని అందిస్తున్నాం. విద్యుత్ రంగంలో అపూర్వ విజయం సాధించాం. ఉద్యమ ఆకాంక్షలన్నింటినీ నెరవేర్చుకుంటూ ముందడుగులు వేస్తున్నాం. ఈ క్రమంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రపంచంలోని దిగ్గజ సంస్థల్లో 99 శాతం సంస్థలు మన రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసు శాఖ ప్రదర్శించిన ప్రతిభ, నైపుణ్యం కారణంగానే మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి..’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఎంతో ఆవేదనతో ఈ సమావేశం పెట్టా.. ‘ఈ నేపథ్యంలో నేను ఎంతో ఆవేదనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశా. గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం వల్ల మానసిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉంటుంది. అమాయక యువత తెలిసీ తెలియక దీని బారిన పడుతోంది. మాదకద్రవ్యాల వినియోగాన్ని మాన్పించడం చాలా క్లిష్టమైన, సుదీర్ఘమైన ప్రక్రియ. అందువల్ల వీటి వినియోగంపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపాలి. మత్తు పదార్థాల వినియోగంతో వచ్చే అనర్ధాల గురించి, యువతకు తెలిసేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి. యువకుల్లో అవగాహన, పరిణతి కలిగించేలా, గొప్ప ప్రభావం చూపించే విధంగా అద్భుతమైన రీతిలో ప్రచార కార్యక్రమాలు కొనసాగాలి. గతంలో ఎయిడ్స్ వ్యాధిపై ఉధృత ప్రచారంతోనే ఆ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించగలిగాం. పోలీస్, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పటిష్టమైన వ్యూహం రూపొందించుకొని, గంజాయి, గుడుంబాలను సమూలంగా నిర్మూలించాలి..’అని సీఎం స్పష్టం చేశారు. ఫలితాలు సాధించినవారికి రివార్డులు, పదోన్నతులు ‘రాష్ట్రంలో గంజాయిని నిరోధించేందుకు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయండి. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్క్వాడ్లను పూర్తిస్థాయిలో బలోపేతం చేయండి. విద్యాసంస్థల వద్ద పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలి. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల సంఖ్యను పెంచాలి. సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవడంతో పాటు తగినన్ని వాహనాలను సమకూర్చుకోవాలి. ఇంటెలిజెన్స్ విభాగంలో కూడా ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గంజాయి నిర్మూలనలో ఫలితాలు సాధించిన అధికారులకు నగదు రివార్డులు, ప్రత్యేక పదోన్నతులు, ఇతర ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఇస్తుంది. దేశంలోని ఏదైనా రాష్ట్రంలో గంజాయిని సమర్థవంతంగా అరికట్టిన అనుభవాలను అధ్యయనం చేయాలి. గంజాయి వాడకందారుల ఆధారంగా సరఫరా చేసేవారిని పట్టుకోవాలి. రాష్ట్రంలో గంజాయి వ్యాపారం చేయలేం అని వాటి వ్యాపారస్తులు భయపడేలాగా కఠిన చర్యలకు ఉపక్రమించాలి. చెక్ పోస్టులను, నిఘా కేంద్రాలను కేవలం హైవేల మీదనే కాకుండా, అవసరమైన అన్నిచోట్లా ఏర్పాటు చేయాలి. సర్పంచ్‌లు సమాచారం ఇవ్వాలి గంజాయి సాగును, రవాణా, వినియోగాన్ని అరికట్టే విషయంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ కీలకంగా వ్యవహరించాలి. చీమ చిటుక్కుమన్నా తెలిసే విధంగా ప్రత్యేకంగా ఆధునిక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. హైదరాబాద్‌కు గంజాయి రాకుండా ఆపే విధంగా పటిష్టమైన వ్యూహం అవలంబించాలి. తమ గ్రామాల్లో గంజాయి సాగు అవుతున్నట్లయితే, ఆయా గ్రామాల సర్పంచ్‌లు సమాచారాన్ని ఎక్సైజ్, పోలీసు శాఖలకు అందించాలి..’అని ముఖ్యమంత్రి సూచించారు. గుడుంబా అమ్మకందారులకు ప్రత్యామ్నాయ ఉపాధి ‘గుడుంబా, గ్యాంబ్లింగ్ కూడా రాష్ట్రంలో మళ్లీ కనిపిస్తున్నాయి. గుడుంబా తయారీ మళ్లీ మొదలవుతున్నట్లు వస్తున్న సమాచారాన్ని బట్టి ఎక్సైజ్ అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. నిషేధం అమలులో ఏవైనా లోపాలు జరుగుతుంటే వెంటనే సరిదిద్దుకోవాలి. గుడుంబా అమ్మకం మీద ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి, పునరావాసం కల్పించాలి. ఇందుకు అవసరమైన నిధులను కలెక్టర్లకు విడుదల చేస్తాం. గతంలో పేకాట నిషేధం అమలు చేసిన తీరుపై మహిళల ప్రశంసలు లభించాయి. పేకాట పూర్తిస్థాయిలో ఆగిపోవాలి. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నంబర్‌వన్‌గా పేరు తెచ్చుకున్నాం. రాష్ట్ర ప్రతిష్టను కాపాడే విధంగా ఎక్సైజ్, పోలీసు శాఖలు కలిసికట్టుగా, కట్టుదిట్టంగా పనిచేయాలి. ‘తెలంగాణ పోలీస్ బెస్ట్ పోలీస్’అనే పేరును నిలబెట్టుకోండి. మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దండి..’అని సీఎం ఆదేశించారు. ప్రస్తుత సమావేశంలో అందిన వివరాల ఆధారంగా త్వరలోనే ముఖ్యమైన అధికారులతో మరొక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అందులో పూర్తిస్థాయి వ్యూహాన్ని ఖరారు చేస్తామని ప్రకటించారు. గంజాయి విచ్చల విడిగా లభించడంపై ఇటీవల ‘సాక్షి’ ప్రచురించిన కథనం ఏఓబీ నుంచి రాష్ట్రానికి గంజాయి ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏఓబీ) ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతున్నదని, అక్కడి నుంచి చింతూరు – భద్రాచలం మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించి, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రవాణా జరుగుతున్నట్లు ఎక్సైజ్, పోలీసు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీన్ని అరికట్టేందుకు ఇతర రాష్ట్రాల పోలీసు, ఎక్సైజ్ శాఖలతో సమన్వయ వ్యవస్థ అవసరముందని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలోకి ఎక్కువశాతం గంజాయి ఇతర రాష్ట్రాల నుంచే వస్తోందని, ఛత్తీస్‌గఢ్‌లో సైతం గంజాయి సాగు, సరఫరా జరుగుతోందని తెలిపారు. గంజాయిని వినియోగిస్తున్న వారిలో వలస కూలీలు, యువకులు ఎక్కువగా ఉన్నారని, ఆటో డ్రైవర్లు, హమాలీలు కూడా ఉన్నట్లు వివరించారు. కాగా మత్తు పదార్థాలతో వచ్చే అనర్థాలపై ప్రభావపూరితమైన షార్ట్ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలు, సందేశాత్మక ఆడియో, వీడియో ప్రచార ప్రకటనలను రూపొందించే బాధ్యతను సీఎస్ సోమేశ్ కుమార్‌కు సీఎం అప్పగించారు. విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగే విధంగా ప్రత్యేక పాఠాలను రూపొందించి, సిలబస్‌లో చేర్చాలని, అందుకవసరమయ్యే చర్యలు ప్రారంభించాలని ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ను ఆదేశించారు. డ్రగ్స్ దుష్ఫలితాలపై ప్రతిభావంతంగా నిర్మించే సినిమాలకు సబ్సిడీ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామని సీఎం పేర్కొన్నారు. కాగా గంజాయి వినియోగంలో హాట్ స్పాట్లుగా మారిన సెంటర్లను వెంటనే గుర్తించి, నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి అధికారులకు సూచించారు. -
కేర్‌టేకర్ హల్చల్.. గట్టిగా కేకలేస్తూ, నగ్నంగా తిరుగుతూ
సాక్షి, నాగోలు: ఇంట్లో ఉన్న వృద్ధుడికి సేవ చేసేందుకు కేర్ టేకర్‌ను నియమించుకుంటే గంజాయి మత్తులో ఇంటి యజమానిపై దాడి చేశాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ నాగార్జున కాలనీలో ఉండే దామోదర్‌రావు, గిరిధర్ల తండ్రి రంగారావు (96). ఆయనకు సేవలందించడానికి సోదరులు కుత్బుల్లాపూర్ హరికృష్ణ హోమ్ కేర్ అండ్ సరీ్వసెస్ నిర్వాహకుడు వెంకటరమణకు సంప్రదించారు. అతడు కుత్బుల్లాపూర్ రాజీవ్‌గృహకల్పకు చెందిన సూర్యపవన్ను వారి ఇంటికి పంపాడు. సోదరిలిద్దరూ కుటుంబంతో పై అంతస్తులో ఉంటున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న వారి తండ్రి రంగారావుకు సూర్యపవన్ సేవలు అందిస్తున్నారు. ఈనెల 27వ తేదీన సాయంత్రం సూర్యపవన్ గట్టిగా కేకలేస్తూ నగ్నంగా తిరుగుతుండగా సోదరిలిద్దరూ కిందకు వచ్చారు. ఎందుకు అలా చేస్తున్నావని వారు ప్రశ్నించగా అతడు వారిపై దాడి చేయడంతో పాటు పిచ్చిపిచ్చిగా సమాధానమిచ్చాడు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూర్యపవన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారికి అతడు సరైన సమాధానం ఇవ్వలేదు. అతడి వద్ద పోలీసులు గంజాయి ప్యాకెట్, చిన్న మద్యం బాటిల్ స్వాదీనం చేసుకున్నారు. అతడు గంజాయి సేవించడంతో అలా ప్రవర్తంచి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మంగళవారం ఉదయం అతడు పోలీస్స్టేషన్లోనూ కేకలేస్తూ హల్చల్ చేశాడు. ఈ మేరకు పోలీసులు అతడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన్నట్లు సమాచారం. దామోదర్‌రావు ఇచ్చిన ఫిర్యాదుతో ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: 3 వైన్స్‌లు.. 30 ‘బెల్ట్’లు: లాభాల కోసం ‘చీప్’ ట్రిక్స్.. -
మత్తు అలవాటు పడితే.. భవిష్యత్తు చిత్తు
సాక్షి, ఆల్విన్‌కాలనీ( హైదరాబాద్): మాదక ద్రవ్యాలకు, గంజాయికి బానిసలుగా మారి యువత మత్తులో తూగుతూ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నది. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. మాదకద్రవ్యాలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా ముఠాలుగా ఏర్పడి జన సంచారం లేని ప్రాంతాలను ఎంచుకొని గంజాయి, మాదక ద్రవ్యాలను పీలుస్తున్నారు. యువతే ప్రధాన లక్ష్యంగా తీసుకొని ఈ చీకటి వ్యవహారాన్ని నిర్వహిస్తుండటంతో యువత రోగాల బారిన పడుతుండటంతో పాటు చెడుదారి పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ► కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని పలు కాలనీలు, బస్తీలు, ఫ్లై ఓవర్లు, చెరువు కట్టలు, నిర్మానుష ప్రదేశాలు ఎంచుకొని యువత మాదకద్రవ్యాలు సేవిస్తూ అటుగా వెళ్లే వారిపై దురుసుగా ప్రవర్తిస్తూ దాడులకు పాల్పడుండటం గమనార్హం. అదేమిటని ప్రశ్నిస్తే ఏమి చేసుకుంటావో చేసుకో మేము స్థానికులమంటూ దుర్భాషలాడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. కొన్ని రోజుల క్రితం కూకట్పల్లి నుంచి జగద్గిరిగుట్టకు వెళ్లే చిత్తారమ్మ ఆలయ రోడ్డులో ఓ దుకాణం సమీపంలో యువత మాదకద్రవ్యాలను సిగరెట్లో నింపుకొని సేవిస్తూ చిందులేస్తూ రహదారిపై వెళ్లేవారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో వారిని మందలించగా ఎదురుదాడికి దిగారని స్థానికులు, ప్రయాణికులు వాపోయారు. ► కూకట్పల్లి సర్కిల్ ధరణినగర్ సమీపంలో పరికి చెరువు కట్టపై నిత్యం పగలు, రాత్రి అనే తేడా లేకుండా మత్తుపదార్థాలు సేవించటమే కాకుండా మందుబాబులకు కూడా అడ్డాగా మారింది. స్థానికులు వారిని ప్రశ్నిస్తే మత్తులో ఉండి బెదిరింపులకు పాల్పడుతున్నారని రాత్రి వేళల్లో అరుపులు, కేకలతో అలజడి సృష్టిస్తున్నారని స్థానికులు తెలుపుతున్నారు. ► ఎల్లమ్మబండ చౌరస్తాలో, ఎన్టీఆర్నగర్, రైతు బజార్, మహదేవ్‌పురం చౌరస్తాలోని సిక్కుల కాలనీల్లో గంజాయి వ్యాపారం విరివిగా జరుగుతుందని యువతను టార్గెట్ చేసి గంజాయిని విక్రయిస్తూ యువతను చెడు అలవాట్లకు బానిసలుగా మారుస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ► భరత్‌నగర్ బ్రిడ్జి నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో సైతం యువత గంజాయి మాదకద్రవ్యాలను సేవిస్తున్నారు. ఈ విషయమై స్థానికులు గమనించి అటుగా వెళ్లాలంటేనే జంకుతున్నారు. మత్తులో ఉన్నవారు ఎప్పుడు ఏ అఘాయిత్యానికి పాల్పడతారో అని ఆందోళన చెందుతున్నారు. ► జగద్గిరిగుట్ట, ఆస్బెస్టాస్ కాలనీ, హుడా పార్కు ప్రాంతాలను ఆసరాగా తీసుకొని రాత్రి వేళల్లో యువత గంజాయి సేవిస్తూ ఆ ప్రాంతవాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ► కేపీహెచ్‌బీ కాలనీ కళామందిర్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం, పద్మావతి ప్లాజా ప్రాంతం, జనసంచారం లేని ప్రాంతాలను ఎంచుకొని యువత జోరుగా మత్తుమందులు సేవిస్తున్నారు. ► ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ప్రత్యేకంగా పెట్రోలింగ్ పెంచి మాదక ద్రవ్యాలు సేవించే వారిపై దృష్టి సారించి వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తే తప్ప వారిలో మార్పు రాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు సేవిస్తూ యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. పరికి చెరువు కట్టపై రోజూ యువత గుంపులుగా వచ్చి సిగరెట్లలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన మందును నింపుకొని పీలుస్తూ దాడులకు దిగుతున్నారు. పోలీసు వారు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో వారికి ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు. వారు వెళ్లిపోగానే తిరిగి గంజాయి పీలుస్తున్నారు. ప్రశ్నించే వారిపై దాడులు కూడా చేస్తున్నారు. వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి. – గోపాల్, ధరణినగర్ జనరల్ సెక్రటరీ కఠిన చర్యలు తథ్యం నిర్జన ప్రాంతాల్లో యువత గంజాయి తాగుతూ పెడదారిన పడుతున్నారని తమకు ఫిర్యాదు రావటంతో వెంటనే స్పందించి వారిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశాము. ఇటీవల మూసాపేటలో గంజాయి విక్రయిస్తుండగా ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం. ఎక్కడి నుంచైతే ఫిర్యాదులు వస్తాయో ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిఘా ఏర్పాటు చేస్తు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. – నర్సింగరావు, ఇన్స్పెక్టర్, కూకట్పల్లి ( చదవండి: టీలో పొడి ఎక్కువైందని తిట్టిన అత్త, దీంతో కోడలు.. ) -
అతివేగం ప్రాణాలు తీసింది!
దుండిగల్: వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం మూలమలుపు వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వారి బైక్‌లో గంజాయి లభించడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాలలో అనంత్ విశాల్(23), సుజిత్(21) బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు. సుజిత్ స్థానికంగా ఉన్న మహాలక్ష్మీ బాయ్స్ హాస్టల్లో, విశాల్ మరో హాస్టల్లో ఉంటున్నారు. వీరిద్దరూ శనివారం రాత్రి 11 గంటల సమయంలో యమహా బైక్‌పై సూరారం ప్రాంతానికి వచ్చారు. తిరిగి బహదూర్‌పల్లి వైపు వేగంగా వెళ్తుండగా సూరారం కట్టమైసమ్మ దేవాలయం సమీపంలోని మూలమలుపు వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన విశాల్, సుజిత్ అక్కడికక్కడే మృతి చెందారు. దుండిగల్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశాల్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా కొడిగిరి మండలం దోమలెడిగి కాగా, తండ్రి విఠల్ పటేల్ ఎంపీటీసీ. సుజిత్ స్వస్థలం మంచిర్యాల. బైక్‌లో లభ్యమైన గంజాయి.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల వద్ద ఉన్న ఎరుపు రంగు బ్యాగ్‌లో గంజాయి లభించడం స్థానికంగా కలకలం రేపింది. మైసమ్మగూడలోని హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు రాత్రి సమయంలో సూరారం ప్రాంతానికి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. గంజాయిని కొనుగోలు చేసేందుకే ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు.. విద్యార్థుల వద్ద కిలో గంజాయి దొరకడంతో దుండిగల్ పోలీసులు ఎన్డీపీఎస్(నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులు సంచరించినట్లు అనుమానిస్తున్న సూరారంలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అలాగే గతంలో ఇదే తరహాలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన, విక్రయించే పాత నేరస్తుల చిట్టాను సైతం వెలికితీస్తున్నారు. దీనికి తోడు గంజాయి క్రయవిక్రయాలపై హాస్టల్లోని తోటి విద్యార్థులను సైతం విచారించే అవకాశం ఉంది. చనిపోయిన ఇద్దరు విద్యార్థుల్లో ఒకరి ఫోన్ సంఘటన స్థలంలోనే ధ్వంసంకాగా, మరో విద్యార్థి ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. బైక్ నడిపిన సమయంలో విద్యార్థులు గంజాయి సేవించారా.. లేదా అన్నది పోస్టుమార్టం నివేదికలో వెల్లడవుతుందని వారు పేర్కొంటున్నారు. -
కమెడియన్ భార్తీ సింగ్ అరెస్ట్
ముంబై: కమెడియన్ భార్తీ సింగ్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబైలో అరెస్టు చేసింది. శనివారం ఉదయం భార్తీ సింగ్ నివాసం లోఖండావాలా కాంప్లెక్స్‌తోపాటు కార్యాలయంలో అధికారులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా ఆమె నివాసంలో స్వల్ప మొత్తంలో 86.5 గ్రాముల గంజాయి లభ్యమైంది. దీంతో ఆమెతోపాటు, భర్త హర్ష లింబాచియాను ఎన్సీబీ కార్యాలయానికి తీసుకెళ్లి, ప్రశ్నించారు. విచారణ అనంతరం భార్తీ సింగ్‌ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. నటుడు సుశాంత్ సింగ్ మృతికి, డ్రగ్స్‌కు సంబంధంపై విచారణ జరుపుతున్న ఎన్సీబీ ఇటీవల పలువురు సినీ రంగ ప్రముఖులు, సరఫరా దారులను ప్రశ్నించడంతోపాటు కొందరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ సరఫరాదారు ఒకరు తెలిపిన సమాచారం ఆధారంగా భార్తీ సింగ్ ఇంటితోపాటు ముంబైలోని మరో రెండు ప్రాంతాల్లో సోదాలు జరిపామని ఎన్సీబీ అధికారి ఒకరు చెప్పారు. గంజాయిని వాడినట్లు భార్తీ సింగ్ దంపతులు అంగీకరించారని కూడా ఆయన వెల్లడించారు. భార్తీని నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్డీపీఎస్) చట్టం కింద అరెస్టు చేశామనీ, లింబాచియా నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందన్నారు. చట్ట ప్రకారం..వెయ్యి గ్రాముల వరకు గంజాయి దొరికితే చిన్న మొత్తంగానే పరిగణిస్తారు. ఈ నేరానికి 6 నెలల జైలు శిక్ష లేదా 10వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, భార్తీ సింగ్ టీవీల్లో పలు కామెడీ, రియాల్టీ షోల్లో పాల్గొన్నారు.