పోలీసు స్టిక్కర్‌ తగిలించి.. గంజాయి తరలించి | Ramachandrapuram police seize 58 kg ganja | Sakshi
Sakshi News home page

పోలీసు స్టిక్కర్‌ తగిలించి.. గంజాయి తరలించి

Published Sat, Sep 9 2023 2:53 AM | Last Updated on Sat, Sep 9 2023 2:53 AM

Ramachandrapuram police seize 58 kg ganja - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న సీఐ నరేందర్‌ రెడ్డి

రామచంద్రాపురం (పటాన్‌చెరు): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖ ఏజెన్సీ నుంచి మహా­రాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని బాలా­నగర్‌ ఎస్‌­వోటీ, రామచంద్రాపురం పోలీసు­లు అదుపు­లోకి తీసుకున్నారు.  ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి అందించిన వివరాలివి. మహారాష్ట్ర బడ్లాపూర్‌కు చెందిన ధీరజ్‌ మున్నాలా డ్రైఫ్రూట్స్‌ వ్యాపారం చేస్తుంటాడు. అందులో సరైన ఆదాయం రాకపోవడంతో స్నేహితుడు ప్రశాంత్‌ సంజయ్‌ షిండేతో కలిసి విశాఖ­పట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయించాలని నిర్ణయించాడు.

ఇన్నోవా కారు అద్దెకు తీసుకొని ఇద్దరూ విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వినయ్‌ మండల్‌ ద్వారా కిలో రూ.3 వేల చొప్పున 58.5 కిలోల గంజాయిని కొనుగో­లు చేశారు. వాటిని 39 ప్యాకెట్లుగా విభజించి కారులో పెట్టుకుని మహారాష్ట్రకు బయల్దేరా­రు. వీరు గంజాయి తరలిస్తున్నట్లు గురు­వారం సాయంత్రం బాలానగర్‌ ఎస్‌వోటీ పోలీసులు, రామచంద్రాపురం పోలీసులకు సమాచారం అందింది. దీంతో రామచంద్రాపురం పట్టణ పరిధిలోని ఇక్రిశాట్‌ వద్ద గంజాయి తరలిస్తున్న ఇన్నోవా వాహనాన్ని పట్టుకున్నారు.

అందులో ఉన్న ధీరజ్‌ మున్నా­లా జైస్వాల్, ప్రశాంత్‌ సంజయ్‌ షిండేలను అదుపులోకి తీసుకొని విచారించగా విషయం బయటపడింది. కాగా ఇన్నోవా వాహనానికి నంబర్‌ ప్లేట్‌ మార్చి, ముందు భాగంలో పోలీస్‌ స్టిక్కర్‌ను పెట్టుకొని గంజాయిని తర­లిస్తున్నట్టు విచారణలో తేలింది.  దాంతో వారి వద్ద నుంచి రూ.11 లక్షల 70 వేల విలువైన 58.8 కిలోల గంజాయిని, ఇన్నోవా కారు, డూప్లికేట్‌ నంబర్‌ ప్లేట్, కొడవలి, మొబైల్‌ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసు­కు­న్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement