ముంబై: ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో పోలిసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ప్రధాన నిందితుడు మిహిర్ షా,అతని డ్రైవర్ రాజశ్రీ బిదావత్‌తో పోలీసులు బుధవారం రాత్రి ప్రమాధ ఘటన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. అయితే వారు వేగంగా కారుతో స్కూటీని ఢీకొట్టిన తర్వాత తమకారు మృతి చెందిన మహిళను కొంత దూరం ఈడ్చుకువెళ్లినట్లు తెలియదని పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది.
ఘటనాస్థలంలో నిందితుడు మిహిర్ షా,అతని డ్రైవర్ రాజశ్రీ బిదావత్ తాము చేసిన తప్పును ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తాను చేసిన తప్పుకు మిహిర్ షా పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు.. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు మిహిర్ షా, డ్రైవర్ రాజశ్రీ బిదావత్ ఇచ్చిన స్టేట్‌మెంట్లపై పూర్తి నమ్మకం లేదని, వారి వాంగ్మూలంపై పరిశీలన చేస్తున్నామని పోలసులు తెలిపారు. మరోవైపు.. ఈ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షాకు జూలై 16 వరకు పోలీసు కస్టడీ విధించింది కోర్టు.
కాగా జులై 7న (ఆదివారం తెల్లవారుజామున) మద్యం మత్తులో మిహిర్ షా బీఎండబ్ల్యూ కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో 45 ఏళ్ల మహిళ అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె భర్త గాయాలతో బయటపడ్డాడు. అయితే ప్రమాదం జరిగినప్పటి నుంచి మిహిర్ షా పరారీలో ఉన్నాడు. దాదాపు 72 గంటల తర్వాత నిందితుడిని విహార్‌లో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు నిందితుడు తండ్రి, శివసేన నాయకుడు రాజేష్ షాను పార్టీ సస్పెండ్ చేసింది. ఇక ప్రమాదం తర్వాత మిహిర్ తన ప్రియురాలికి 40 సార్లు ఫోన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మహిళను కారుతో గుద్ది చంపిన తర్వాత కారును విడిచిపెట్టి ఆటో ఎక్కి ఆమె ఇంటికి వెళ్లిన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రియురాలిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోవచ్చని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment