ముంబై: మహారాష్ట్రలో జరిగిన బీఎండబ్ల్యూ కారు ప్రమాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రమాదానికి కారణమైన మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాకు చెందిన శివసేన నేత(ఏక్‌నాథ్ షిండే) రాజేష్ షా కుమారుడు మిషిర్ షా కోసం పోలీసులు గాలిస్తున్నారు. లింది. ప్రమాద సమయంలో 24 ఈ యువకుడే ఈ కారును నడుపుతున్నట్లు తేలింది.
దీంతో ఒక్కసారిగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. మిహిర్ షా నిర్లక్ష్యంగా కారు నడపడంతో ప్రమాదం జరిగినట్లు విచారణలో తేలింది . ఘటన జరిగిన సమయంలో మిహిర్ షా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండగా.. అతని డ్రైవర్ రాజ్ రిషి బిజావత్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడు మిషిర్ షా కోసం పోలీసులు గాలిస్తున్న క్రమంలో ఓ సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. మిహిర్ షా తన నలుగురు స్నేహితులతో కలిసి మెర్సిడెస్ కారులో పబ్ నుంచి బయలు దేరినట్లు ఈ వీడియోలో కినిపిస్తుంది. అయితే తరువాత అతడు కారు మారాడు. మిహిర్ బీఎండబ్ల్యూ కారు నడపడగా.. అతడి డ్రైవర్ ప్యాసింజర్ సీటులో కూర్చొని ఉన్నాడు.
అయితే మిహిర్ తప్పించేందుకు అతడి గర్ల్‌ఫ్రెండ్ సాయం చేసి ఉండవచ్చిన పోలీసులు అనుమానిస్తున్నారు, ఈ నేపథ్యంలో ఆమెను కూడా వారు విచారిస్తున్నారు. మిహిర్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
మిహిర్ సంఘటనా స్థలం నుంచి కాలా నగర్ మీదుగా వెళ్లి బాంద్రా ఈస్ట్ వద్ద కారును విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. తరువాత ఓ ఓటోలో అక్కడ ఇనుంచి పరారైనట్లు పేర్కొన్నారు. మిహిర్ కోసం నాలుగు పోలీసు బృందాలు వెతుకుతున్నట్లు తెలిపారు. కారు ఎక్కడ మారిందనే విషయంపై కూడా విచారణ జరుపుతున్నారు.
అసలేం జరిగిందంటే..
ముంబైలోని వర్లీలో ఆదివారం ఉదయం వేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో స్కూటీపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు మహిళపై నుంచి దూసుకెళ్లడం వల్ల కావేరి నక్వా (45) అక్కడికక్కడే మరణించింది. ఆమె భర్త ప్రదీప్‌కు స్వల్పగాయాలయ్యాయి. చేపలు అమ్ముకుంటూ జీవిస్తున్న ఈ దంపతులు ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
కొత్త క్రిమినల్ కోడ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం నేరపూరిత హత్య, ర్యాష్ డ్రైవింగ్, సాక్ష్యాలు నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారు రాజేష్ షా పేరుతో రిజిస్టర్ అయింది. ప్రమాదం అనంతరం నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్లుగా పోలీసులు తెలిపారు.
నిందితుడు మిహిర్ శనివారం అర్ధరాత్రి జూహూలోని ఓ బార్‌లో మద్యం తాగి.. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో కారు తానే నడుపుతానని పట్టుబట్టి డ్రైవరు సీటులోకి మారి ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే స్పందించారు. చట్టం అందరికీ సమానమేనని తెలిపారు. ఎవరినీ విడిచిపెట్టబోమని చెప్పారు.
కాగా ఈ ప్రమాదం పుణెలో జరిగి పోర్చే కారు ప్రమాద ఘటనను గుర్తు చేసింది. 17 ఏళ్ల మైనర్ బాలుడు మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ల ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో అనేక ట్విస్టుల అనంతరం నిందితుడు తల్లి, తండ్రి, తాత అరెస్ట్ అయ్యారు. చివరికి నిందితుడైన మైనర్‌ను అతని అత్త సంరక్షణలో ఉండేలా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment