ముంబై: ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షాను జూలై 16 వరకు పోలీసు కస్టడీ విధించింది కోర్టు. దీంతో నేటి నుంచి ఏడు రోజులపాటు మిహిర్ షాను ముంబై పోలీసులు విచారించనున్నారు. ప్రమాదానికి సంబంధించిన విషయాలను నిందితుడి నుంచి రాబట్టనున్నారు. అయితే మిహిర్ మొబైల్ ఇంకా రికవరీ కాలేదని పోలీసులు తెలిపారు.
కాగా జులై 7న (ఆదివారం తెల్లవారుజామున) మద్యం మత్తులో మిహిర్ షా బీఎండబ్ల్యూ కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో 45 ఏళ్ల మహిళ అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె భర్త గాయాలతో బయటపడ్డాడు. అయితే ప్రమాదం జరిగినప్పటి నుంచి మిహిర్ షా పరారీలో ఉన్నాడు. దాదాపు 72 గంటల తర్వాత నిందితుడిని విహార్‌లో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు నిందితుడు తండ్రి, శివసేన నాయకుడు రాజేష్ షాను పార్టీ సస్పెండ్ చేసింది. ఇక ప్రమాదం తర్వాత మిహిర్ తన ప్రియురాలికి 40 సార్లు ఫోన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మహిళను కారుతో గుద్ది చంపిన తర్వాత కారును విడిచిపెట్టి ఆటో ఎక్కి ఆమె ఇంటికి వెళ్లిన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రియురాలిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోవచ్చని పేర్కొన్నారు.
చదవండి: ముంబై బీఎండబ్ల్యూ ఘటన... నిందితుడి తండ్రిపై శివసేన చర్యలు
Comments
Please login to add a commentAdd a comment