BMW
-
రూ.74.9 లక్షల కొత్త జర్మన్ బ్రాండ్ కారు ఇదే..
బీఎండబ్ల్యూ ఇండియా '2024 ఎం340ఐ' పర్ఫామెన్స్ సెడాన్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 74.9 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ సెడాన్ కోసం కంపెనీ దేశవ్యాప్తంగా బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.2024 బీఎండబ్ల్యూ ఎం340ఐ 48వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ అసిస్ట్‌తో 374 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే.. 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 4.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. ఇది మెర్సిడీ బెంజ్ ఏఎంజీ సీ 43, ఆడి ఎస్5 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.కొత్త బీఎండబ్ల్యూ ఎం340ఐ సెడాన్ 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటితో పాటు ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైనవన్నీ ఉంటాయి. ఇది ఆర్కిటిక్ రేస్ బ్లూ, ఫైర్ రెడ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. డిజైన్, సేఫ్టీ పరంగా ఇది దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అంటే ఇందులో ఎలాంటి అప్డేట్స్ లేదు. -
భారత్‌లో అత్యంత ఖరీదైన బైకులు ఇవే! (ఫోటోలు)
-
అర్థం కాని.. అత్యద్భుతమైన మోటార్‌సైకిల్స్ (ఫోటోలు)
-
స్టార్ హీరోయిన్ హోటల్లో చోరి.. ఫైర్ అయిన కస్టమర్
బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టికి చెందిన రెస్టారెంట్లో భారీ చోరీ జరిగింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. ముంబైలోని పలు ప్రాంతాల్లో బాస్టియన్ పేరుతో ఆమె రెస్టారెంట్స్ నిర్వహిస్తున్నారు. దాదర్‌లోని కోహినూర్ స్క్వేర్ బేస్మెంట్ పార్కింగ్‌లో ఉన్న కారు చోరీకి గురైంది. ఒక నివేదిక ప్రకారం.. బాంద్రాకు చెందిన రుహాన్ ఖాన్ అనే వ్యాపారవేత్త తన స్నేహితులతో బాస్టియన్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో తన కారును అక్కడే వ్యాలెట్ పార్క్ చేశాడు. స్నేహితులతో కలిసి డిన్నర్ పూర్తి అయిన తర్వాత వాలెట్ నుంచి తన కారును తీసుకురావాలని ఖాన్ కోరాడు. అయితే, పార్కింగ్ చేసిన ప్రదేశంలో కారు లేదు. దీంతో దొంగతనం జరిగిందని వారు గుర్తించారు. వెంటనే రెస్టారెంట్ సిబ్బంది CCTV ఫుటేజీని పరిశీలించారు.ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు జీప్ కంపాస్ వాహనంలో తెల్లవారుజామున 2 గంటలకు బేస్మెంట్లోకి ప్రవేశించినట్లు వెల్లడైంది. వారిలో ఒకరు ఖాన్‌కు సంబంధించిన BMW Z4 కన్వర్టిబుల్ కారును చోరి చేశారని తేలింది. కారును అన్‌లాక్ చేయడానికి అధునాతన హ్యాకింగ్ పద్ధతులను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఆ కారు ధర సుమారు రూ. 90 లక్షలకు పైగానే ఉంటుందని సమాచారం.కారు ఓనర్ CCTV ఫుటేజీ ఆధారంగా శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అధికారులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. శిల్పా శెట్టికి చెందిన రెస్టారెంట్ భద్రతా చర్యలపై ఖాన్ ఫైర్ అయ్యాడు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరాడు. ఇంత సంఘటన జరిగినప్పటికీ, శిల్పా శెట్టి ఈ విషయంపై మౌనంగా ఉన్నారని ఆయన తప్పుపట్టారు. -
దీపావళి ఆఫర్: కొత్త కారు కొనడానికే ఇదే మంచి సమయం!
అసలే పండుగ సీజన్.. కొత్త కారు కొనాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు దిగ్గజ కంపెనీలు సైతం భారీ డిస్కౌంట్స్ ప్రకటించాయి. ఇందులో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కంపెనీలు ఉన్నాయి. ఒక్కో కంపెనీ ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ రూ.10 లక్షల వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నాయి.కార్లు, వాటిపై లభించే డిస్కౌంట్స్ఆడి క్యూ3: రూ. 5 లక్షలుమెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ: రూ. 5 లక్షలుఆడి క్యూ5: రూ. 5.5 లక్షలుబీఎండబ్ల్యూ ఐ4: రూ. 8 లక్షలుమెర్సిడెస్ బెంజ్ సీ200: రూ. 9 లక్షలుఆడి క్యూ8 ఈ ట్రాన్: రూ. 10 లక్షలుఆడి ఏ6: రూ. 10 లక్షలుబీఎండబ్ల్యూ ఎక్స్5: రూ. 10 లక్షలుకియా ఈవీ6 ఆల్ వీల్ డ్రైవ్: రూ. 12 లక్షలుకార్లపైన కంపెనీలు ఇస్తున్న ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ తగ్గింపులు ఎంచుకునే మోడల్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్లను పొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైన తగ్గింపులను గురించి తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
7 లక్షల వాహనాలకు రీకాల్: బీఎండబ్ల్యూ కీలక ప్రకటన
బీఎండబ్ల్యూ కంపెనీ చైనాలో దాదాపు 7,00,000 బ్రాండ్ వాహనాలకు రీకాల్ ప్రకటించింది. కార్లలోని కూలెస్ట్ పంపులో ఏర్పడిన సమస్య కారణంగా జర్మన్ కార్‌మేకర్ ఈ రీకాల్ ప్రకటించినట్లు సమాచారం. ఇందులో స్థానికంగా ఉత్పత్తి చేసిన కార్లు మాత్రమే కాకుండా.. దిగుమతి చేసుకున్న కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ వెల్లడించింది.బీఎండబ్ల్యూ మోడళ్లలో అమర్చిన లోపభూయిష్ట కూలెస్ట్ పంప్ ప్లగ్‌లు తుప్పు పట్టే అవకాశం ఉంది. ఇది షార్ట్ సర్క్యూట్లకు కారణమైతే.. వాహనంలో మంటలు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి సమస్యకు సంబంధించిన ఫిర్యాదులు కంపెనీ దృష్టికి రాలేదు, కానీ కంపెనీ ముందు జాగ్రత్తగా రీకాల్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.రీకాల్ ప్రకటించిన కార్లలో స్థానికంగా తయారైన బీఎండబ్ల్యూ 3 సిరీస్, 5 సిరీస్ వాహనాలు ఉన్నాయి. అలాగే దిగుమతి చేసుకున్న కార్లలో ఎక్స్ సిరీస్ కార్లు ఉన్నాయి. రీకాల్ కారణంగా కంపెనీ కార్ల సేల్స్ ప్రస్తుతం గణనీయంగా తగ్గింది. గత నాలుగు సంవత్సరాల్లో అమ్మకాలు భారీగా పడిపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.ఇదీ చదవండి: ఆ కంపెనీలో జాబ్ ఆఫర్ వదులుకున్న రతన్ టాటా: ఎందుకంటే..కంపెనీ గత సెప్టెంబర్ నెలలో కూడా కాంటినెంటల్ ఏజీ ద్వారా సరఫరా చేసిన కార్లలో బ్రేకింగ్ సిస్టమ్‌లలో సమస్య ఉందని గుర్తించి.. ప్రపంచ వ్యాప్తంగా 1.5 మిలియన్ కార్లకు రీకాల్ ప్రకటించింది. ఈ లోపాన్ని కంపెనీ సరి చేయడానికి ఏకంగా 1.1 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. -
లాంచ్‌కు సిద్దమవుతున్న బీఎండబ్ల్యూ కారు ఇదే..
బీఎండబ్ల్యూ కంపెనీ తన 2 సిరీస్ గ్రాన్ కూపే ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే కంపెనీ ఈ కారును అధికారికంగా లాంచ్ చేయడానికి ముందే దీనికి సంబంధించిన వివరాలను, ఫోటోలను విడుదల చేసింది. దీన్ని బట్టి చూస్తే ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంత బిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే ఫేస్‌లిఫ్ట్ ఒక పెద్ద ఎయిర్ డ్యామ్ పొందుతుంది. బంపర్ విశాలంగా ఉంటుంది. పరిమాణంలో కూడా ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కొంత పెద్దదిగానే ఉంది. ఇంటీరియర్ స్పేస్ కూడా కొంత పెరిగినట్లు తెలుస్తోంది. లోపలి భాగం చాలా వరకు బ్లాక్ అవుట్ ట్రీట్మెంట్ పొందుతుంది. అంతే కాకుండా ఇక్కడ ఫిజికల్ బటన్ల సంఖ్య కూడా చాలా తక్కువగానే ఉంటుంది. వెనుక వైపు నెంబర్ ప్లేట్ టెయిల్ ల్యాంప్‌ల మధ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: రూ.80 లక్షల జీతం: సలహా ఇవ్వండి.. టెకీ పోస్ట్ వైరల్బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే ఫేస్‌లిఫ్ట్ 1.5 లీటర్ త్రి సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 48 వోల్ట్స్ మైల్డ్-హైబ్రిడ్ సెటప్‌తో వస్తుంది. ఈ కారు 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. మొత్తం మీద పనితీరు కూడా దాని మునుపటి మోడల్ కంటే ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు 2025 ప్రారంభంలో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. -
ఎలక్ట్రిక్ కారు కొన్న అమితాబ్.. ఎన్ని కోట్లంటే?
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన గ్యారేజీలోకి కొత్త కారు తీసుకొచ్చాడు. ఈ మధ్యే 82వ పుట్టినరోజు జరుపుకున్న ఈయన బీఎమ్‌డబ్ల్యూ ఐ7 బ్రాండెడ్ లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. ఇది ఎలక్ట్రిక్ వాహనం. అద్భుతమైన డిజైన్‌తో ఆకట్టుకుంటున్న ఈ కారు ధర రూ.2.03 కోట్లు విలువ చేస్తోంది. ఇకపోతే బచ్చన్‌కు కార్ల మీద మక్కువ ఎక్కువ. ఈయన తొలిసారి కొన్న కారు ఫియాట్ 1100. కార్ల కలెక్షన్..తన తొలి సినిమా 'సాట్ హిందుస్తానీ (1969)' సక్సెస్ తర్వాత ఫియాట్ కారు కొన్నాడు.. అది కూడా సెకండ్ హ్యాండ్లో! అప్పటినుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండియన్ సినిమా గర్వించే స్థాయికి చేరుకున్నాడు. ఈయన గ్యారేజీలో ల్యాండ్ రోవర్ డిఫెండర్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ సెవన్, లెక్సస్ ఎల్ఎక్స్ 570 కార్లు ఉన్నాయి. ఇవే కాకుండా మినీ కూపర్ కూడా ఉంది.చదవండి: పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా.. ఏకంగా 1600 కిలోమీటర్లు! -
50 మందికే ఈ బీఎండబ్ల్యూ కారు
బీఎండబ్ల్యూ స్కైటాప్ వీ8 రోడ్‌స్టర్ ఈ సంవత్సరం ప్రారంభంలో కాంకోర్సో డి'ఎలెగాంజా విల్లా డి'ఎస్టేలో ఒక కాన్సెప్ట్‌గా మొదటిసారిగా కనిపించింది. అయితే ఇప్పుడు ఉత్పత్తి దశకు చేరుకుంది. కానీ ఇది కేవలం 50 యూనిట్లకు మాత్రమే పరిమితమైనట్లు సమాచారం.బీఎండబ్ల్యూ స్కైటాప్ వీ8 రోడ్‌స్టర్ 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజన్ పొందుతుంది. ఇది 617 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ రోడ్‌స్టర్ 8 స్పీడ్ స్టెప్ట్రానిక్ స్పోర్ట్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.రెండు సీట్లు కలిగిన ఈ కారు షార్ప్ అండ్ యాంగ్యులర్ ఫ్రంట్ ఎండ్, ఎల్ఈడీ హెడ్‌లైట్ పొందుతుంది. ఇందులో డోర్ హ్యాండిల్స్ లేకపోవడాన్ని గమనించవచ్చు. లోపలి భాగం మొత్తం ఎరుపు-గోధుమ రంగులో ఉండటం చూడవచ్చు. గేర్ సెలెక్టర్‌కు క్రిస్టల్ లాంటి రూపాన్ని అందించారు.ఇదీ చదవండి: ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా: ఎందుకంటే..బీఎండబ్ల్యూ స్కైటాప్ వీ8 రోడ్‌స్టర్ క్యాబిన్లో ప్రీమియం బోవర్స్ & విల్కిన్స్ సౌండ్ సిస్టమ్ ఉంది. మిగిలిన అన్ని ఫీచర్స్ దాదాపు 8 సిరీస్ మోడల్లో మాదిరిగానే ఉన్నట్లు సమాచారం. ఈ కారు ధర, ఇతర వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. లాంచ్ డేట్, డెలివరీ డీటైల్స్ కూడా తెలియాల్సి ఉంది. -
10,000 మార్కుకు బీఎండబ్ల్యూ–మినీ
ముంబై: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బీఎండబ్ల్యూ గ్రూప్ భారత్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. 17 ఏళ్ల కంపెనీ చరిత్రలో బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్లు దేశీయంగా 10,000 యూనిట్ల మార్కును తొలిసారిగా దాటాయి. గతేడాదితో పోలిస్తే 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య 10 శాతం వృద్ధితో 10,556 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఇందులో 10,056 బీఎండబ్ల్యూ, 500 యూనిట్లు మినీ బ్రాండ్‌లో విక్రయించింది. 2023 జనవరి–సెపె్టంబర్ మధ్య రెండు బ్రాండ్లలో కలిపి మొత్తం 9,580 యూనిట్లు రోడ్డెక్కాయి. మోటరాడ్ బ్రాండ్‌లో 5,638 యూనిట్ల మోటార్‌సైకిల్స్ సైతం అమ్ముడయ్యాయని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో విక్రమ్ పావా తెలిపారు. బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్లలో ఈ ఏడాది 725 ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపై పరుగుతీస్తున్నాయని చెప్పారు. భారత్‌లో లగ్జరీ కార్ల రంగంలో 2,000 యూనిట్ల ఈవీల అమ్మకాల మార్కును దాటిన తొలి కంపెనీగా స్థానం సంపాదించామన్నారు. బీఎండబ్ల్యూ భారత్‌లో శుక్రవారం ఎం4 సీఎస్ లగ్జరీ స్పోర్ట్స్ కారును ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.1.89 కోట్లు. -
వ్యాపారి అదృశ్యం కలకలం.. బిడ్జ్ వద్ద ప్రమాదానికి గురైన కారు
బెంగళూరు: కర్నాటకలో ఓ వ్యాపారవేత్త అదృశ్యం కలకలం రేపుతోంది. ఆ వ్యాపారికి సంబంధించి ప్రమాదానికి గురైన బీఎండబ్ల్యూ కారును మంగళూరులోని ఓ బిడ్జ్ వద్ద ఆదివారం పోలీసులు గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మొహియుద్దీన్ బావా సోదరుడు వ్యాపారవేత్త ముంతాజ్ అలీ ఆదివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. ఆయన కుమార్తె పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆయన కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు వ్యాపారవేత్త ముంతాజ్ అలీ తన ఇంటి నుంచి బయలుదేరి కారులో మంగళూరు నగరం చుట్టూ తిరిగారు. 5 గంటల సమయంలో మంగళూరులోని కులూరు వంతెన దగ్గర ఆయన కారు ఆపారు. కారులో ప్రమాదానికి సంబంధించిన కొన్ని గుర్తులు ఉన్నాయని తెలిపారు. తన తండ్రి అదృశ్యానికి సంబంధించి ముంతాజ్ అలీ కుమార్తె స్థానిక పోలీసులకు సమాచారం అందించటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ వెల్లడించారు.ముంతాజ్ అలీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే.. ఆయన వంతెనపై నుంచి దూకి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నదిలో గాలించడానికి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, కోస్ట్ గార్డ్లను మోహరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.చదవండి: రూ. 1,800 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ పట్టివేత -
రూ.1.89 కోట్ల కొత్త బీఎండబ్ల్యూ కారు ఇదే.. పూర్తి వివరాలు
బీఎండబ్ల్యూ కంపెనీ భారతదేశంలో 'ఎం4 సీఎస్' పేరుతో ఓ కొత్త కారును లాంచ్ చేసింది. దీని ధర రూ.1.89 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన మొట్ట మొదటి బీఎండబ్ల్యూ సీఎస్ మోడల్. ఎం4 కాంపిటీషన్ మోడల్ కంటే కూడా దీని ధర రూ. 36 లక్షలు ఎక్కువ.కొత్త బీఎండబ్ల్యూ ఎం4 సీఎస్ స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే 3.0 లీటర్ ట్విన్ టర్బో స్ట్రెయిట్-సిక్స్ ఇంజిన్ పొందుతుంది. ఇది 550 హార్స్ పవర్, 650 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టర్బో బూస్ట్ ప్రెజర్ 1.7 బార్ నుంచి 2.1 బార్కి పెంచడం వల్ల పవర్ కొంత ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కారు 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టాప్ స్పీడ్ 302 కిమీ/గం.బీఎండబ్ల్యూ ఎం4 సీఎస్.. టైటానియం ఎగ్జాస్ట్ సైలెన్సర్, సెంటర్ కన్సోల్, గేర్‌బాక్స్ ప్యాడిల్స్ వంటివి ఫైబర్ నిర్మితం. ఈ కారు ముందు భాగంలో 19 ఇంచెస్ అల్లాయ్స్, వెనుక 20 ఇంచెస్ అల్లాయ్స్ పొందుతుంది. ఎం4 సీఎస్ కారులో ఎల్లో కలర్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఉంటాయి. కిడ్నీ గ్రిల్ బార్డర్ ఎరుపు రంగులో ఉండటం చూడవచ్చు.ఇదీ చదవండి: డిజిటల్ అరెస్ట్ అంటే తెలుసా?: తెలుసుకోకపోతే మోసపోతారు..ఫ్లాట్ బాటమ్ ఆల్కాంటారా ఎం స్టీరింగ్ వీల్ కలిగిన ఎం4 మోడల్ 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. సెంటర్ కన్సోల్‌లోని సీఎస్ ఎరుపు రంగులో ఉండటం చూడవచ్చు. ఈ కారు ఆడి ఆర్ఎస్5కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
బీఎండబ్ల్యూ కొత్త ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే..
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ 'బీఎండబ్ల్యూ' ఇండియన్ మార్కెట్లో సరికొత్త ఎక్స్7 సిగ్నేచర్ ఎడిషన్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త లగ్జరీ కారు ధర రూ. 1.33 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా లేటెస్ట్ అప్డేట్స్ పొందింది.ఎక్స్‌డ్రైవ్40ఐ వేరియంట్లో మాత్రమే లభిస్తున్న ఈ కారు పరిమిత సంఖ్యలో మాత్రమే లభిస్తుంది. అయితే ఎన్ని యూనిట్లు విక్రయానికి ఉన్నాయనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కారు స్వరోవ్స్కీ గ్లాస్ కట్ క్రిస్టల్స్, అల్యూమినియం శాటినేటెడ్ రూఫ్ రెయిల్‌లతో కూడిన క్రిస్టల్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ వంటివి పొందుతుంది.టాంజానైట్ బ్లూ, డ్రవిట్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు ఇండివిజువల్ లెదర్, యూనిక్ క్రిస్టల్ డోర్ పిన్స్,అల్కాంటారా కుషన్స్ వంటి వాటితో పాటు 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కూడా పొందుతుంది. పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఇందులో లభిస్తుంది.ఇదీ చదవండి: ఒక్కరికి మాత్రమే ఈ కొత్త కారు.. ధర ఎంతంటే?బీఎండబ్ల్యూ ఎక్స్7 సిగ్నేచర్ ఎడిషన్ 3.0 లీటర్ 6 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 48వీ మైల్డ్-హైబ్రిడ్ టెక్ కూడా పొందుతుంది. ఈ ఇంజిన్ 381 హార్స్ పవర్, 520 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో.. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది. -
ఒక్కరికి మాత్రమే ఈ కొత్త కారు.. ధర ఎంతంటే?
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బీఎండబ్ల్యూ ఇండియన్ మార్కెట్లో కొత్త 'ఎక్స్ఎమ్ లేబుల్' కారును లాంచ్ చేసింది. దీని ధర రూ. 3.15 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర బీఎండబ్ల్యూ కార్లకంటే కూడా భిన్నంగా ఉంది.గత ఏడాది ఏప్రిల్‌లో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త 'ఎక్స్ఎమ్ లేబుల్ రెడ్' పేరుతో అడుగుపెట్టింది. ఇదే భారతీయ విఫణిలో ఎక్స్ఎమ్ లేబుల్ రూపంలో లాంచ్ అయింది. ఇది 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 హైబ్రిడ్ ఇంజిన్ కలిగి 748 హార్స్ పవర్, 1000 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇందులో 25.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది గరిష్టంగా 82 కిమీ రేంజ్ అందిస్తుంది.ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు 3.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. పవర్ నాలుగు చక్రాలకు డెలివరీ అవుతుంది.ఎక్స్ఎమ్ లేబుల్.. కిడ్నీ గ్రిల్ సరౌండ్, రియర్ డిఫ్యూజర్ ఇన్సర్ట్, మోడల్ బ్యాడ్జ్‌లు, విండో ఫ్రేమ్ సరౌండ్, షోల్డర్ లైన్, వీల్ ఇన్సర్ట్లు వంటివన్నీ రెడ్ ఎలిమెంట్లను పొందుతాయి. ఇందులో 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇంటీరియర్ కూడా రెడ్ అండ్ బ్లాక్ కలర్ చూడవచ్చు.ఇదీ చదవండి: ఈ ఏడాది 850 టన్నులు!.. బంగారానికి భారీ డిమాండ్ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. కంపెనీ ఈ కారును ప్రపంచ వ్యాప్తంగా 500 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. ఇందులో నుంచి ఒక్క కారు మాత్రమే ఇండియాకు కేటాయించి. అంటే భారతదేశంలో ఈ కారును కేవలం ఒక్కరు మాత్రమే కొనుగోలు చేయగలరు. ఇది స్పెషల్ ఎడిషన్ అని చెప్పడానికి కంట్రోల్ డిస్ప్లే క్రింద “500లో 1” అని ఉంటుంది. -
రూ.65 లక్షల బీఎండబ్ల్యూ కొత్త కారు: పూర్తి వివరాలు
బీఎండబ్ల్యూ కంపెనీ ఇండియన్ మార్కెట్లో ఎట్టకేలకు '320ఎల్‌డబ్ల్యు ఎమ్ స్పోర్ట్ ప్రో' లాంచ్ చేసింది. ఈ సెడాన్ ధర రూ.65 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.బీఎండబ్ల్యూ 320ఎల్‌డబ్ల్యు ఎమ్ స్పోర్ట్ ప్రో మోడల్ బ్లాక్ కిడ్నీ గ్రిల్, స్మోక్డ్ అవుట్ ఎఫెక్ట్ అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్లైట్లు, గ్లోస్ బ్లాక్ రియర్ డిఫ్యూజర్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా బ్లైండ్ స్పాట్ అసిస్టెంట్, లేన్ చేంజ్ అసిస్టెంట్, పార్కింగ్ అసిస్టెంట్ ప్లస్ వంటి అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టం ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.కొత్త బీఎండబ్ల్యూ కారు మినరల్ వైట్, స్కైస్క్రాపర్ గ్రే, కార్బన్ బ్లాక్, పోర్టిమావో బ్లూ అనే నాలుగు రంగులలో లభిస్తుంది. యాంబియంట్ లైటింగ్‌లో భాగంగా ఫ్రంట్ సీట్స్ వెనుక భాగంలో కొత్త ఇల్యూమినేటెడ్ కాంటౌర్ స్ట్రిప్ కూడా ఉంది.బీఎండబ్ల్యూ 320ఎల్‌డబ్ల్యు ఎమ్ స్పోర్ట్ ప్రో 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే, 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 16 స్పీకర్లతో హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: సింగిల్ ఛార్జీతో 611 కిమీ రేంజ్.. కొత్త బెంజ్ కారు వచ్చేసిందిబీఎండబ్ల్యూ 320ఎల్‌డబ్ల్యు ఎమ్ స్పోర్ట్ ప్రో మోడల్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా 190 హార్స్ పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 7.6 సెకన్లలో 0 - 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందిన ఈ కారు 19.61 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులో ఎకో ప్రో, కంఫర్ట్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. -
'అలాంటిదేం లేదు.. అదంతా తప్పుడు ప్రచారం': ఆనంద్ మహీంద్రా
పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' మేడ్ ఇన్ ఇండియా అని చెబుతూనే అన్యదేశ్య బ్రాండ్స్ అయిన బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ కార్లను ఎందుకు ఎంచుకున్నారు, అని 'రతన్ దిలాన్' (Rattan Dhillon) అనే వ్యక్తి ప్రశ్నిస్తూ.. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు.దీనిపైన 'హార్మజ్ద్ సొరాబ్జీ' (Hormazd Sorabjee) స్పందిస్తూ.. ఆనంద్ మహీంద్రా నిబద్దత కలిగిన వ్యక్తి. ఈయన కేవలం ఇండియన్ బ్రాండ్ కార్లను మాత్రమే ఉపయోగితున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త పూర్తిగా అవాస్తవమని అన్నారు.Given Mr. Anand Mahindra’s strong advocacy for “Made in India,” why does he opt to drive BMW and Mercedes cars instead of a Mahindra Thar, which is built by his own company? @anandmahindra pic.twitter.com/aHl299W1DI— Rattan Dhillon (@ShivrattanDhil1) September 1, 2024ఈ విషయం మీద స్వయంగా ఆనంద్ మహీంద్రా స్పందించారు. నేను విదేశీ బ్రాండ్ కార్లను ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు. నాకు మా అమ్మ మొదట్లో తన లైట్ స్కై-బ్లూ కలర్ ప్రీమియర్ కారులో డ్రైవింగ్ నేర్పించారు. 1991 నుంచి ఇప్పటి వరకు కేవలం మహీంద్రా కార్లను మాత్రమే ఉపయోగిస్తున్నాను. నాకు కంపెనీ కేటాయించిన మొదటి కారు హిందూస్థాన్ మోటార్స్ కాంటెస్సా.ఆ తరువాత కొన్నేళ్ళకు నేను ఆర్మడ, బొలెరో, స్కార్పియో క్లాసిక్, ఎక్స్‌యూవీ 5OO ఉపయోగించని. ఇప్పుడు లేటెస్ట్ రెడ్ స్కార్పియో ఎన్ వినియోగిస్తున్నానని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. సొంత కంపెనీ కార్లను ఉపయోగించడం నాకు ఎంతో గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు.సోషల్ మీడియాలో వెల్లడవుతున్న ఫోటో.. మా బట్టిస్టా ఎలక్ట్రిక్ హైపర్‌కార్‌ను విడుదల చేస్తున్నప్పుడు మాంటెరీ కార్ వీక్‌లో తీసుకున్నదే. అది పాతకాలపు సిసిటాలియా. దీనిని మహీంద్రా కంపెనీ డిజైన్ చేసింది. నేను ఇప్పటి వరకు ఎలాంటి అన్యదేశ్య కార్లను కొనుగోలు చేయలేదని ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు.Hormazd, you have covered Mahindra since the time I joined the company. So you are in a unique position to call out this fabricated and fake story. Thank you.And for the record:I was taught how to drive by my mother, in her light sky-blue colour Premier car (earlier known as… https://t.co/BXFr3hfYVU— anand mahindra (@anandmahindra) September 2, 2024 -
7.20 లక్షల బీఎండబ్ల్యూ కార్లకు రీకాల్: ఎందుకో తెలుసా?
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సుమారు 7,20,796 యూనిట్ల వాహనాలకు రీకాల్ ప్రకటించింది. ఇంతకీ కంపెనీ ఈ రీకాల్ ఎంధుకు ప్రకటించింది. దీనికయ్యే ఖర్చును ఎవరు భరిస్తారు అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.బీఎండబ్ల్యూ కంపెనీ తన కార్లలో వాటర్ పంప్లో ఒక లోపభూయిష్ట సీల్‌తో కూడిన సమస్య కారణంగా రీకాల్ ప్రకటించింది. ఈ లోపం కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ రీకాల్ జెడ్4 కన్వర్టిబుల్తో సహా 2012 నుంచి 2018 మోడల్ సంవత్సరాల వరకు 12 మోడళ్లను ప్రకటించింది. ఇందులో 2,3,4,5 సిరీస్ కార్లు మాత్రమే కాకుండా ఎక్స్1, ఎక్స్3, ఎక్స్4, ఎక్స్5 కార్లు ఉన్నాయి.ఈ 'రీకాల్'కు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ ఇప్పటికే డీలర్లకు తెలియజేసింది. కస్టమర్లకు అక్టోబర్ ప్రారంభం నుంచి వెల్లడించే అవకాశం ఉంది. సమస్యను పరిష్కరించడానికి కస్టమర్లు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికయ్యే మొత్తం ఖర్చును కంపెనీ భరిస్తుంది. -
ఖైరతాబాద్‌లో బీఎండబ్ల్యూ కారు బీభత్సం
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్స సృష్టించింది. ఖైరతాబాద్ నుంచి బంజారా హిల్స్ వైపు అతి వేగంతో వెళ్తూ.. ఓ బీఎండబ్ల్యూ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నారు. ఇద్దరికి తీవ్రంగా గాయాలు కావటంతో బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. ఉదయం 7.30 గంటలకు ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారును జితేష్ బుగాని అనే యువకుడు నడిపినట్లు పోలీసులు తెలిపారు. జితేష్ బుగాని తండ్రి ప్రభుత్వంలో ఒక ఉన్నత అధికారి అని సమాచారం. కేసు నమోదు చేసిన ఖైరతాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మద్యం మత్తులో కారు ప్రమాదం జరిగిందా? లేదా నిర్లక్ష్యమా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ఖరీదైన కారు కొన్న బుల్లితెర నటి.. ఎన్ని లక్షలంటే?
ఇమ్లీ సీరియల్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అద్రిజా రాయ్. ప్రస్తుతం ఆమె కుండలి భాగ్య సీరియల్లో నటిస్తోంది. దుర్గా ఔర్ చారుతో తన కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ బుల్లితెర అభిమానులను అలరిస్తోంది. బాలీవుడ్లో పలు సీరియల్స్‌లో నటించిన ఆద్రిజా తాజాగా ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. నా కష్టం, దృఢ సంకల్పంతో మొదటి కారును కొనుగోలు చేసినట్లు ఆద్రిజా రాయ్ తెలిపింది. ఈ కారు విలువ దాదాపు రూ.65 లక్షలుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన తల్లిదండ్రులు, శ్రేయోభిలాషుల ప్రేమనే తనను ముందుకు నడిపిస్తున్నదని నటి పేర్కొంది. కుండలి భాగ్య సీరియల్లో నటించడం మంచి అనుభవమని.. తాను ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి ఉందని అద్రిజ రాయ్ వెల్లడించింది. నా ముందు ఇంకా ఎన్నో మైలురాళ్లు ఉన్నాయని వివరించింది. View this post on Instagram A post shared by Adrija Roy ❤️ (ADDY) (@adrija_roy_official) -
2000 సీసీ బీఎండబ్ల్యూ బాక్సర్ (ఫోటోలు)
-
నెల వ్యవధిలో మూడు హిట్ అండ్ రన్ కేసులు
ముంబై: మహారాష్ట్రలో వరుసగా చోటు చేసుకుంటున్న హిట్ అండ్ రన్ ఉదంతాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా.. నగరంలో మరో ప్రమాదం జరగ్గా, బాధితుడు ప్రాణం కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 20వ తేదీన వర్లీ ప్రాంతంలో ఓ బీఎండబ్ల్యూ కారు వేగంగా వెళ్తూ.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన బైకర్.. జూలై 27న మృతి చెందారు. ఈ ఘటన జూలై 20న ముంబైలోని వర్లీ ప్రాంతంలో చోటుచేసుకుంది. క్షతగాత్రుడ్ని వినోద్ లాల్(28)గా పోలీసులు నిర్ధారించారు. ఇక ప్రమాదానికి కారణమైన వ్యక్తిని కిరణ్ ఇందుల్కర్గా గుర్తించి అరెస్ట్ చేశారు. ముంబైలో ఈ నెలలో ఇది మూడో హిట్ అండ్ రన్ కేసు. జూలై 7న ముంబైలోని వర్లీలో శివసేన నాయకుడు రాజేష్ షా కుమారుడు మిహిర్ షా నడిపిన బీఎండబ్ల్యూ.. ముందు వెళ్తున్న ఓ స్కూటర్‌ను ఢీకొట్టడంతో ఒక మహిళ మరణించగా.. ఆమె భర్త గాయపడ్డాడు. జూలై 22 న ముంబైలో వేగంగా వెళ్తున్న ఆడి కారు రెండు ఆటో-రిక్షాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు ఆటో రిక్షాల డ్రైవర్లు, ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. -
రూ.72.90 లక్షల కొత్త బీఎండబ్ల్యూ కారు - వివరాలు
బీఎండబ్ల్యూ కంపెనీ సరికొత్త 5 సిరీస్ కారు ఎల్డబ్ల్యుబీ లాంచ్ చేసింది. ఇది 530ఎల్ఐ అనే సింగిల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ. 72.90 లక్షలు (ఎక్స్ షోరూమ్).కొత్త బీఎండబ్ల్యూ 530ఎల్ఐ వేరియంట్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో 48వోల్ట్స్ మైల్డ్ హైబ్రిడ్ అసిస్ట్ పొందుతుంది.ఇది 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రాలను పవర్ డెలివరీ చేస్తుంది. ఇది 6.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ లగ్జరీ కారు టాప్ స్పీడ్ 250 కిమీ/గం.కొత్త డిజైన్ కలిగిన బీఎండబ్ల్యూ 5 సిరీస్.. పరిమాణంలో దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కొంత పెద్దగా ఉంటుంది. ఇందులో కిడ్నీ గ్రిల్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, స్పోర్టియర్ ఫ్రంట్, రియర్ బంపర్లు ఉన్నాయి. లోపల 12.3 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ మొదలైనవి ఉన్నాయి. -
భారత్‌లో రూ.14.90 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. వివరాలు
భారతీయ మార్కెట్లో బీఎండబ్ల్యూ సీఈ (BMW CE) లాంచ్ అయింది. దీని ధర రూ. 14.90 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ధరలను బట్టి చూస్తే ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ టూ వీలర్ అదే అని తెలుస్తోంది.దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ 8.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 130 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ 2.3 kW ఛార్జర్ ద్వారా 4 గంటల 20 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ అవుతుంది. 6.9 kW ఛార్జర్ ద్వారా 1 గంట 40 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.సీఈ04 ఎలక్ట్రిక్ స్కూటర్లోని మోటారు 42 హార్స్ పవర్, 62 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ 2.6 సెకన్లలో 0 నుంచి 50 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టాప్ స్పీడ్ 120 కిమీ.ఎల్ఈడీ లైటింగ్స్, 10.25 ఇంచెస్ TFT డిస్ప్లే, కీలెస్ ఇగ్నిషన్, ట్రాక్షన్ కంట్రోల్, USB ఛార్జర్, సైడ్-మౌంటెడ్ స్టోరేజ్ కంపార్ట్మెంట్ వంటివి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పొందుతుంది. ఇది బ్లూ, వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ఎకో, రెయిన్, రోడ్ అనే మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. -
ముంబై బీఎండబ్ల్యూ కేసు: నిందితుడు మిహిర్ షా పశ్చాత్తాపం!
ముంబై: ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో పోలిసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ప్రధాన నిందితుడు మిహిర్ షా,అతని డ్రైవర్ రాజశ్రీ బిదావత్‌తో పోలీసులు బుధవారం రాత్రి ప్రమాధ ఘటన సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అయితే వారు వేగంగా కారుతో స్కూటీని ఢీకొట్టిన తర్వాత తమకారు మృతి చెందిన మహిళను కొంత దూరం ఈడ్చుకువెళ్లినట్లు తెలియదని పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో నిందితుడు మిహిర్ షా,అతని డ్రైవర్ రాజశ్రీ బిదావత్ తాము చేసిన తప్పును ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తాను చేసిన తప్పుకు మిహిర్ షా పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు.. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు మిహిర్ షా, డ్రైవర్ రాజశ్రీ బిదావత్ ఇచ్చిన స్టేట్మెంట్లపై పూర్తి నమ్మకం లేదని, వారి వాంగ్మూలంపై పరిశీలన చేస్తున్నామని పోలసులు తెలిపారు. మరోవైపు.. ఈ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షాకు జూలై 16 వరకు పోలీసు కస్టడీ విధించింది కోర్టు.కాగా జులై 7న (ఆదివారం తెల్లవారుజామున) మద్యం మత్తులో మిహిర్ షా బీఎండబ్ల్యూ కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో 45 ఏళ్ల మహిళ అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె భర్త గాయాలతో బయటపడ్డాడు. అయితే ప్రమాదం జరిగినప్పటి నుంచి మిహిర్ షా పరారీలో ఉన్నాడు. దాదాపు 72 గంటల తర్వాత నిందితుడిని విహార్‌లో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నిందితుడు తండ్రి, శివసేన నాయకుడు రాజేష్ షాను పార్టీ సస్పెండ్ చేసింది. ఇక ప్రమాదం తర్వాత మిహిర్ తన ప్రియురాలికి 40 సార్లు ఫోన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మహిళను కారుతో గుద్ది చంపిన తర్వాత కారును విడిచిపెట్టి ఆటో ఎక్కి ఆమె ఇంటికి వెళ్లిన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రియురాలిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోవచ్చని పోలీసులు తెలిపారు. -
ముంబై బీఎండబ్ల్యూ ఘటన.. మిహిర్ షాకు పోలీస్ కస్టడీ
ముంబై: ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షాను జూలై 16 వరకు పోలీసు కస్టడీ విధించింది కోర్టు. దీంతో నేటి నుంచి ఏడు రోజులపాటు మిహిర్ షాను ముంబై పోలీసులు విచారించనున్నారు. ప్రమాదానికి సంబంధించిన విషయాలను నిందితుడి నుంచి రాబట్టనున్నారు. అయితే మిహిర్ మొబైల్ ఇంకా రికవరీ కాలేదని పోలీసులు తెలిపారు.కాగా జులై 7న (ఆదివారం తెల్లవారుజామున) మద్యం మత్తులో మిహిర్ షా బీఎండబ్ల్యూ కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో 45 ఏళ్ల మహిళ అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె భర్త గాయాలతో బయటపడ్డాడు. అయితే ప్రమాదం జరిగినప్పటి నుంచి మిహిర్ షా పరారీలో ఉన్నాడు. దాదాపు 72 గంటల తర్వాత నిందితుడిని విహార్‌లో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నిందితుడు తండ్రి, శివసేన నాయకుడు రాజేష్ షాను పార్టీ సస్పెండ్ చేసింది. ఇక ప్రమాదం తర్వాత మిహిర్ తన ప్రియురాలికి 40 సార్లు ఫోన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మహిళను కారుతో గుద్ది చంపిన తర్వాత కారును విడిచిపెట్టి ఆటో ఎక్కి ఆమె ఇంటికి వెళ్లిన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రియురాలిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోవచ్చని పేర్కొన్నారు.చదవండి: ముంబై బీఎండబ్ల్యూ ఘటన... నిందితుడి తండ్రిపై శివసేన చర్యలు