జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ 'బీఎండబ్ల్యూ' ఇండియన్ మార్కెట్లో సరికొత్త ఎక్స్7 సిగ్నేచర్ ఎడిషన్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త లగ్జరీ కారు ధర రూ. 1.33 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా లేటెస్ట్ అప్డేట్స్ పొందింది.
ఎక్స్‌డ్రైవ్40ఐ వేరియంట్లో మాత్రమే లభిస్తున్న ఈ కారు పరిమిత సంఖ్యలో మాత్రమే లభిస్తుంది. అయితే ఎన్ని యూనిట్లు విక్రయానికి ఉన్నాయనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కారు స్వరోవ్‌స్కీ గ్లాస్ కట్ క్రిస్టల్స్, అల్యూమినియం శాటినేటెడ్ రూఫ్ రెయిల్‌లతో కూడిన క్రిస్టల్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ వంటివి పొందుతుంది.
టాంజానైట్ బ్లూ, డ్రవిట్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు ఇండివిజువల్ లెదర్, యూనిక్ క్రిస్టల్ డోర్ పిన్స్,అల్కాంటారా కుషన్స్ వంటి వాటితో పాటు 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా పొందుతుంది. పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఇందులో లభిస్తుంది.
ఇదీ చదవండి: ఒక్కరికి మాత్రమే ఈ కొత్త కారు.. ధర ఎంతంటే?
బీఎండబ్ల్యూ ఎక్స్7 సిగ్నేచర్ ఎడిషన్ 3.0 లీటర్ 6 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 48వీ మైల్డ్-హైబ్రిడ్ టెక్ కూడా పొందుతుంది. ఈ ఇంజిన్ 381 హార్స్ పవర్, 520 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో.. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment