జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బీఎండబ్ల్యూ ఇండియన్ మార్కెట్లో కొత్త 'ఎక్స్ఎమ్ లేబుల్' కారును లాంచ్ చేసింది. దీని ధర రూ. 3.15 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర బీఎండబ్ల్యూ కార్లకంటే కూడా భిన్నంగా ఉంది.
గత ఏడాది ఏప్రిల్‌లో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త 'ఎక్స్ఎమ్ లేబుల్ రెడ్' పేరుతో అడుగుపెట్టింది. ఇదే భారతీయ విఫణిలో ఎక్స్ఎమ్ లేబుల్ రూపంలో లాంచ్ అయింది. ఇది 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 హైబ్రిడ్ ఇంజిన్ కలిగి 748 హార్స్ పవర్, 1000 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇందులో 25.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది గరిష్టంగా 82 కిమీ రేంజ్ అందిస్తుంది.
ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు 3.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. పవర్ నాలుగు చక్రాలకు డెలివరీ అవుతుంది.
ఎక్స్ఎమ్ లేబుల్.. కిడ్నీ గ్రిల్ సరౌండ్, రియర్ డిఫ్యూజర్ ఇన్సర్ట్, మోడల్ బ్యాడ్జ్‌లు, విండో ఫ్రేమ్ సరౌండ్, షోల్డర్ లైన్, వీల్ ఇన్‌సర్ట్‌లు వంటివన్నీ రెడ్ ఎలిమెంట్‌లను పొందుతాయి. ఇందులో 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇంటీరియర్ కూడా రెడ్ అండ్ బ్లాక్ కలర్ చూడవచ్చు.
ఇదీ చదవండి: ఈ ఏడాది 850 టన్నులు!.. బంగారానికి భారీ డిమాండ్
ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. కంపెనీ ఈ కారును ప్రపంచ వ్యాప్తంగా 500 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. ఇందులో నుంచి ఒక్క కారు మాత్రమే ఇండియాకు కేటాయించి. అంటే భారతదేశంలో ఈ కారును కేవలం ఒక్కరు మాత్రమే కొనుగోలు చేయగలరు. ఇది స్పెషల్ ఎడిషన్ అని చెప్పడానికి కంట్రోల్ డిస్‌ప్లే క్రింద “500లో 1” అని ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment