భారతదేశంలో 2024 ఏప్రిల్ నుంచి ఆగష్టు వరకు బంగారం దిగుమతులు 22.70 బిలియన్ డాలర్లు పెరిగాయి. దేశంలో పసిడికి డిమాండ్ పెరగటం వల్ల దిగుమతులు గతంలో కంటే కూడా గణనీయంగా పెరిగాయి.
బంగారం దిగుమతులు పెరగడానికి ప్రధాన కారణం.. సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, పండుగ సీజన్‌లో పెరిగిన డిమాండ్‌తో నగల వ్యాపారులు కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా యూనియన్ బడ్జెట్‌లో గోల్డ్ ట్యాక్స్ తగ్గించడం అని తెలుస్తోంది. అయితే రత్నాలు, రత్నాలకు సంబంధించిన ఆభరణాల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి.
2024 మొదటి త్రైమాసికం కంటే.. రెండో త్రైమాసికంలోనే బంగారం దిగుమతులు పెరిగాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సెమీ అర్బన్, గ్రామీణ మార్కెట్ కూడా పెరిగింది. పండుగ సీజన్ కోసం దేశం సిద్ధమవుతున్నందున, పెరుగుతున్న బంగారం డిమాండ్‌ను తీర్చడానికి రిటైలర్లు తమ స్టోర్ నెట్‌వర్క్‌లను విస్తరిస్తున్నారు.
జులై యూనియన్ బడ్జెట్‌లో బంగారం మీద ట్యాక్ తగ్గించడం కూడా బంగారం కొనుగోళ్లను బాగా పెంచింది. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా కలిసొచ్చింది. మొత్తం మీద 2024లో భారతదేశంలో బంగారం డిమాండ్ 850 టన్నులకు చేరుకుంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) అంచనా వేసింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే సుమారు 12 శాతం ఎక్కువ.
ఇదీ చదవండి: ఏఐకు అదో పెద్ద సవాలు: తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చు
పెరుగుతున్న ధరలు
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నెలలోనే తులం బంగారం ధర ఏకంగా రూ. 2000 పెరిగింది. ఈ రోజు (సెప్టెంబర్ 17)న గోల్డ్ రేటు రూ. 74890 (తులం 24 క్యారెట్స్) వద్ద ఉంది. ఈ ధరలు ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment