imports
-
పేపర్ పరిశ్రమకు దిగుమతుల దెబ్బ
న్యూఢిల్లీ: పేపర్, పేపర్‌బోర్డ్ దిగుమతులు 2024–25 ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో 9,92,000 టన్నులకు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 3.5 శాతం పెరిగాయని ఇండియన్ పేపర్ మాన్యూఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఎంఏ) తెలిపింది. చైనా నుండి ఎగుమతులు గణనీయంగా అధికం కావడమే ఇందుకు కారణమని అసోసియేషన్ వెల్లడించింది. దేశంలో తగినంత ఉత్పత్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో చైనా నుండి కాగితం, పేపర్‌బోర్డ్ దిగుమతులు 44 శాతం దూసుకెళ్లాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం అధిక ఎగుమతులు కారణంగా 2023–24లో ఆసియాన్ దేశాల నుండి ఈ ఉత్పత్తుల దిగుమతులు 34 శాతం పెరిగి 19.3 లక్షల టన్నులకు చేరుకున్నాయి. ఈ వారం ప్రారంభంలో ఆర్థిక, వాణిజ్య మంత్రిత్వ శాఖలతో జరిగిన ప్రీ–బడ్జెట్ సమావేశాలలో అసోసియేషన్ తన గళాన్ని వినిపించింది. కాగితం, పేపర్‌బోర్డ్ దిగుమతిపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 10 నుండి 25 శాతానికి పెంచాలని సిఫార్సు చేసింది. క్లిష్ట పరిస్థితుల్లో పరిశ్రమ.. రెండు కోవిడ్ సంవత్సరాల్లో కొంత నియంత్రణ తర్వాత.. భారత్‌కు కాగితం సరఫరా పెరుగుతూనే ఉందని ఐపీఎంఏ ప్రెసిడెంట్ పవన్ అగర్వాల్ తెలిపారు. ‘దేశీయ తయారీ పరిశ్రమ వృద్ధిని దిగుమతులు దెబ్బతీస్తున్నాయి. దీంతో ఇక్కడి ప్లాంట్లు తక్కువ సామర్థ్యంతో నడుస్తున్నాయి. పరిశ్రమ నిరుత్సాహంతో కొట్టుమిట్టాడుతోంది. చైనా, చిలీ, ఇటీవల ఇండోనేíÙయా నుండి పెరుగుతున్న దిగుమతుల దృష్ట్యా వర్జిన్ ఫైబర్ పేపర్‌బోర్డ్‌ను దేశీయంగా తయారు చేస్తున్న కంపెనీలకు పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ఈ దేశాల నుంచి భారత్‌కు సరఫరా 2020–21 నుండి మూడు రెట్లు ఎక్కువయ్యాయి. దేశీయ కాగితపు పరిశ్రమ ఇప్పటికే సామర్థ్యాలను పెంపొందించడానికి గణనీయంగా మూలధన పెట్టుబడులు పెట్టినప్పటికీ, వాటి ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతుంది. దోపిడీ దిగుమతులు పెరగడం వల్ల లాభదాయత ప్రభావితమైంది’ అని వివరించారు. -
వంట నూనెల దిగుమతులు తగ్గాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల దిగుమతులు 2023–24 ఆయిల్ మార్కెటింగ్ సంవత్సరానికి 3.09 శాతం తగ్గి 159.6 లక్షల టన్నులు నమోదయ్యాయి. దేశీయంగా నూనె గింజల ఉత్పత్తి పెరగడం, అధికం అవుతున్న ధరలతో డిమాండ్ తగ్గడం ఈ క్షీణతకు కారణమని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) తెలిపింది.ప్రపంచంలో అత్యధికంగా వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్న భారత్.. 2022–23 నవంబర్–అక్టోబర్ ఆయిల్ మార్కెటింగ్ ఏడాదికి 164.7 లక్షల టన్నులు దిగుమతి చేసుకుంది. విదేశాల నుంచి భారత్ కొనుగోలు చేసిన ఈ నూనెల విలువ 2022–23తో పోలిస్తే రూ.1,38,424 కోట్ల నుంచి 2023–24లో రూ.1,31,967 కోట్లకు పడిపోయింది. వివిధ కారణాల వల్ల అంతర్జాతీయ ధరలు స్థిరపడ్డాయి. ఇది దేశీయ ధరల పెరుగుదలతో ప్రతిబింబించింది. అలాగే కొంత మేరకు దిగుమతులను తగ్గించింది’ అని అసోసియేషన్ తెలిపింది. విభాగాల వారీగా ఇలా.. ముడి పామాయిల్ దిగుమతులు 75.88 లక్షల టన్నుల నుంచి 69.70 లక్షల టన్నులకు వచ్చి చేరాయి. ఆర్బీడీ పామోలిన్ 21.07 లక్షల టన్నుల నుంచి 19.31 లక్షల టన్నులకు క్షీణించింది. సోయాబీన్ నూనె 35.06 లక్షల టన్నుల నుంచి 34.41 లక్షల టన్నులు నమోదైంది. పొద్దుతిరుగుడు నూనె 30.01 లక్షల టన్నుల నుంచి 35.06 లక్షల టన్నులకు ఎగసింది. శుద్ధి చేసిన నూనెల వాటా అయిదేళ్లలో 3 నుంచి ఏకంగా 12 శాతానికి దూసుకెళ్లింది. -
చైనా వస్తువుల దిగుమతులకు చెక్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా చైనా నుంచి దిగుమతయ్యే ఐదు వస్తువులపై ఐదేళ్లపాటు అమలయ్యేలా యాంటీడంపింగ్ డ్యూటీకి తెరతీసింది. వీటిలో గ్లాస్ మిర్రర్, సెల్‌ఫోన్ ట్రాన్స్పరెంట్ ఫిల్మ్ తదితరాలున్నాయి. తద్వారా పొరుగు దేశం నుంచి భారీగా దిగుమవుతున్న వస్తువులకు చెక్ పెట్టింది. దీంతో చౌక దిగుమతుల నుంచి దేశీ తయారీదారులకు రక్షణ లభించనుంది.యాంటీడంపింగ్ డ్యూటీ విధించిన చైనా వస్తువుల జాబితాలో ఐసోప్రొపిల్ ఆల్కహాల్, సల్ఫర్ బ్లాక్, సెల్‌ఫోల్ ట్రాన్స్పరెంట్ ఫిల్మ్, థెర్మోప్లాస్టిక్ పాలీయురెథేన్, అన్ఫ్రేమ్డ్ గ్లాస్ మిర్రర్ చేరాయి. సాధారణ ధరలకంటే తక్కువ ధరల్లో ఈ వస్తువులు చైనా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. రెవెన్యూ శాఖ, పరోక్ష పన్నులు, కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ విడిగా జారీ చేసిన ఐదు నోటిఫికేషన్ల ద్వారా డ్యూటీలు ఐదేళ్లపాటు అమల్లో ఉంటాయని వెల్లడించింది.మెడికల్, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే ఐసోప్రొపిల్ ఆల్కహాల్‌పై టన్నుకి 82 డాలర్ల నుంచి 217 డాలర్ల మధ్య వివిధ కంపెనీలపై సుంకాన్ని విధించింది. చర్మంపై యాంటీసెప్టిక్, హ్యాండ్ శానిటైజర్గానూ ఈ ప్రొడక్ట్ వినియోగమవుతోంది. టెక్స్టైల్ డయింగ్, పేపర్, లెదర్ తయారీలో వినియోగించే సల్ఫర్బ్లాక్పై టన్నుకి 389 డాలర్ల సుంకాన్ని ప్రకటించింది.ఇదీ చదవండి: డాలర్లు దండిగా.. కొరతలోనూ చింత లేని బంగ్లాదేశ్!ఈ బాటలో ఆటోమోటివ్, మెడికల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలలో వినియోగించే థెర్మోప్లాస్టిక్ పాలీయురెథేన్పై కేజీకి 0.93 డాలర్ల నుంచి 1.58 డాలర్లు, ప్యాకేజింగ్ మెటీరియల్‌గా వినియోగించే సెల్‌ఫోన్ ట్రాన్స్పరెంట్ ఫిల్మ్‌పై కేజీకి 1.34 డాలర్లు చొప్పున డ్యూటీ విధించింది. అన్ఫ్రేమ్డ్ గ్లాస్ మిర్రర్లపై టన్నుకి 234 డాలర్ల యాంటీడంపింగ్ సుంకాన్ని ప్రకటించింది. వాణిజ్య శాఖ పరిశోధన విభాగం డీజీటీఆర్ సూచనలమేరకు ప్రభుత్వం తాజా చర్యలను చేపట్టింది. -
పెట్రోలియం దిగుమతులకు చెక్!
న్యూఢిల్లీ: భారీ పరిమాణంలో మెథనాల్ ప్లాంట్ల ఏర్పాటుతో శిలాజ ఇంధనాలైన పెట్రోలియం తదితర ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవచ్చని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ సూచించారు. థర్మల్ ప్లాంట్లపై ఆధారపడడం భవిష్యత్తులో తగ్గుతుందంటూ.. మెథనాల్ తయారీకి పరిశ్రమ ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. మెథనాల్‌ను శుద్ధ ఇంధనంగా పేర్కొంటూ, భారీ వాణిజ్య వాహనాల్లోనూ దీన్ని వినియోగించొచ్చన్నారు. మెథనాల్‌తో నడిచే ఓడను నిర్మించాలంటూ ఓ విదేశీ కంపెనీ కోచి్చన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌కు ఆర్డర్ ఇచి్చనట్టు చెప్పారు. ఈ నెల 17, 18 తేదీల్లో ఢిల్లీలోని మనేక్షా కేంద్రంలో రెండు రోజుల పాటు అంతర్జాతీయ మెథనాల్ సెమినార్, ఎక్స్పోను నీతి ఆయోగ్ నిర్వహిస్తున్నట్టు సారస్వత్ ప్రకటించారు. 2016లో అమెరికాకు చెందిన మెథనాల్ ఇనిస్టిట్యూట్‌తో నీతిఆయోగ్ భాగస్వామ్యం కుదుర్చుకోగా.. ఈ ఎనిమిదేళ్లలో ప్రాజెక్టులు, ఉత్పత్తులు, పరిశోధన, అభివృద్ధికి సంబంధించి సాధించిన పురోగతిని సెమినార్లో తెలియజేస్తామని చెప్పారు. ఉత్పత్తులు, టెక్నాలజీలను ఈ ఎక్స్‌పోలో ప్రదర్శిస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెథనాల్ తయారీ, వినియోగానికి వీలుగా ప్రభుత్వం ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోందని, ఆ తర్వాత పెద్ద స్థాయి మెథనాల్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలతో సమగ్ర విధానాన్ని ప్రకటిస్తుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 0.7 మిలియన్ మెట్రిక్ టన్నుల మెథనాల్ తయారీ సామర్థ్యం ఉండగా.. డిమాండ్ 4 మిలియన్ టన్నులు మేర ఉండడం గమనార్హం. -
ఈ ఏడాది 850 టన్నులు!.. బంగారానికి భారీ డిమాండ్
భారతదేశంలో 2024 ఏప్రిల్ నుంచి ఆగష్టు వరకు బంగారం దిగుమతులు 22.70 బిలియన్ డాలర్లు పెరిగాయి. దేశంలో పసిడికి డిమాండ్ పెరగటం వల్ల దిగుమతులు గతంలో కంటే కూడా గణనీయంగా పెరిగాయి.బంగారం దిగుమతులు పెరగడానికి ప్రధాన కారణం.. సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, పండుగ సీజన్లో పెరిగిన డిమాండ్‌తో నగల వ్యాపారులు కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా యూనియన్ బడ్జెట్లో గోల్డ్ ట్యాక్స్ తగ్గించడం అని తెలుస్తోంది. అయితే రత్నాలు, రత్నాలకు సంబంధించిన ఆభరణాల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి.2024 మొదటి త్రైమాసికం కంటే.. రెండో త్రైమాసికంలోనే బంగారం దిగుమతులు పెరిగాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సెమీ అర్బన్, గ్రామీణ మార్కెట్ కూడా పెరిగింది. పండుగ సీజన్ కోసం దేశం సిద్ధమవుతున్నందున, పెరుగుతున్న బంగారం డిమాండ్‌ను తీర్చడానికి రిటైలర్లు తమ స్టోర్ నెట్‌వర్క్‌లను విస్తరిస్తున్నారు.జులై యూనియన్ బడ్జెట్లో బంగారం మీద ట్యాక్ తగ్గించడం కూడా బంగారం కొనుగోళ్లను బాగా పెంచింది. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా కలిసొచ్చింది. మొత్తం మీద 2024లో భారతదేశంలో బంగారం డిమాండ్ 850 టన్నులకు చేరుకుంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) అంచనా వేసింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే సుమారు 12 శాతం ఎక్కువ.ఇదీ చదవండి: ఏఐకు అదో పెద్ద సవాలు: తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చుపెరుగుతున్న ధరలుదేశంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నెలలోనే తులం బంగారం ధర ఏకంగా రూ. 2000 పెరిగింది. ఈ రోజు (సెప్టెంబర్ 17)న గోల్డ్ రేటు రూ. 74890 (తులం 24 క్యారెట్స్) వద్ద ఉంది. ఈ ధరలు ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. -
నాలుగేళ్ల ఆంక్షలు ఎత్తివేత!
వాహన దిగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు శ్రీలంక ప్రకటించింది. అక్టోబర్ 1, 2024 నుంచి వివిధ దశల్లో ఈ నిర్ణయం అమలవుతుందని పేర్కొంది. కరోనా సమయంలో ఆర్థిక సంక్షోభానికి గురైన శ్రీలంక 2020లో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాహనాలను నిలిపేస్తున్నట్లు తెలిపింది. 2022లో సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. దాంతో స్థానిక ప్రభుత్వం రద్దయింది. దానికితోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి భౌగోళిక అనిశ్చితులు నెలకొన్నాయి. తర్వాత శ్రీలంకలో ఇతర పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. క్రమంగా స్థానిక ఆర్థిక పరిస్థితులు గాడినపడుతున్నాయి.ఐఎంఎఫ్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ ప్రోగ్రామ్ నిబంధనల్లో భాగంగా దేశీయంగా వివిధ దశల్లో వాహన దిగుమతులు పెంచాలని శ్రీలంక నిర్ణయించింది. మొదట దశలో అక్టోబర్ 1, 2024న ప్రజా రవాణా వాహనాలు, రెండో దశ కింద డిసెంబర్ 1, 2024 నుంచి వాణిజ్య వాహనాలు, మూడో దశ ఫిబ్రవరి 1, 2025 నుంచి ప్రైవేట్ మోటార్ వాహనాల దిగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే విదేశీ మారక నిల్వల నిర్వహణకు మాత్రం అదనపు కస్టమ్స్ సుంకాలు విధిస్తామని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఏప్రిల్ 2022లో భారీగా క్షీణించిన విదేశీ మారక నిల్వలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తుంది.ఇదీ చదవండి: ఐదు లక్షల మంది రైతులకు సాయంభారత్లో వాహన తయారీ కంపెనీలైన మారుతీసుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీవీఎస్ మోటార్స్..వంటి కంపెనీలకు శ్రీలంక ప్రభుత్వ నిర్ణయంతో మేలు జరగనుంది. ఆ దేశానికి ఎక్కువగా ఈ కంపెనీలు వాహనాలు సరఫరా చేస్తుంటాయి. దాంతో రానున్న రోజుల్లో కంపెనీల రెవెన్యూ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
వంటనూనె ధరలు పెంపు..?
వంటనూనెల దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయిం తీసుకుంది. ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దాంతో వచ్చే పండగ సీజన్లో వీటి ధరలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.భారత్‌లో ఎక్కువగా వినియోగిస్తున్న పామాయిల్, సోయానూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు తగ్గితే వాటి ధర పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. రానున్న పండగ సీజన్లో సగటు వినియోగదారులపై ఈ భారం పడనుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా వంటనూనెలను దిగుమతి చేసుకుంటున్న భారత్‌లో దిగుమతి సుంకాన్ని పెంచడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దేశీయ నూనెగింజల రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ముడి పామాయిల్, సోయానూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్‌ను వసూలు చేస్తుండడంతో గతంలో ఉన్న దిగుమతి సుంకం 5.5 శాతాన్ని 27.5 శాతానికి పెంచారు. రిఫైన్డ్ పామాయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో ఉన్న 13.75% సుంకాన్ని 35.75%కు మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.భారత్ వంటనూనెల దిగుమతిపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఏటా దేశీయంగా వినియోగించే వంటనూనెల్లో 70 శాతం కంటే ఎక్కువ ఇతర దేశాల నుంచే కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నారు. అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయాఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతోంది.ఇదీ చదవండి: ప్రపంచంలోని బెస్ట్ కంపెనీలుఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేతఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా ఉల్లి ధరలు పెరగకుండా ఎగుమతులపై కేంద్రం గతేడాది ఆంక్షలు విధించింది. తాజాగా వీటిని ఎత్తేయడంతో తిరిగి ఎగుమతులు పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం తొలుత ఆంక్షలు పెట్టిన సమయంలో 40 శాతం ఎగుమతి సుంకం చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు. ప్రస్తుతం అది 20 శాతంగా ఉంది.పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు..?మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
దేశీ స్టీల్ పరిశ్రమకు చైనా ముప్పు!
న్యూఢిల్లీ: చైనాలో డిమాండ్ పడిపోవడంతో ఆ దేశం నుంచి ఉక్కు దిగుమతులు దేశాన్ని ముంచెత్తుతున్నాయంటూ కేంద్ర ఉక్కు శాఖ మాజీ కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా తెలిపారు. ‘‘ఫ్లాట్ స్టీల్ ఉత్పత్తుల పరంగా చూస్తే దిగుమతులు పెద్ద సమస్యగా ఉంది. చైనాలో వినియోగం పడిపోవడం మన మార్కెట్‌ను కుదిపేస్తోంది’’అని సిన్హా పేర్కొన్నారు.‘ఇండియన్ ఐరన్ ఓర్, పెల్లెట్’ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పెరిగిపోతున్న దిగుమతులతో స్థానిక ఉక్కు ఉత్పత్తుల ధరలపై, స్టీల్ తయారీ సంస్థల లాభాలపై ప్రభావం పడుతుందన్నారు. ‘‘చైనా నుంచి అనుచితంగా దిగుమతులు వచ్చి పడుతున్నాయి. దీని పట్ల భారత ప్రభుత్వం సకాలంలో స్పందించాలి’’ అని అన్నారు. చైనా తదితర దేశాల నుంచి ముంచెత్తుతున్న చౌక స్టీల్ దిగుమతులను అడ్డుకోవాలంటూ పరిశ్రమ ఇప్పటికే ఎన్నో పర్యాయాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం గమనార్హం.ప్రపంచ ఉక్కు ఎగుమతుల కేంద్రంగా భారత్ మారాలన్న లక్ష్యానికి విరుద్ధంగా.. మన దేశం నికర దిగుమతుల దేశంగా మారుతుండడం పట్ల పరిశ్రమ ఆందోళనను వ్యక్తం చేసింది. దిగుమతులపై సంకాల విధింపునకు ఏడాది, ఏడాదిన్నర సమయం తీసుకుంటే, అది దేశీ పరిశ్రమకు మేలు చేయబోదని సిన్హా అభిప్రాయపడ్డారు. -
భారీగా పెరుగుతున్న డిమాండ్.. బంగారం కంటే ప్రియం!
సోలార్ ప్యానెల్, ఎలక్ట్రానిక్స్ తయారీదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ సంవత్సరం భారతదేశపు వెండి దిగుమతులు దాదాపు రెండింతలకు చేరుకునే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే బంగారం కంటే వెండికి డిమాండ్ విపరీతంగా పెరుగుతోందని స్పష్టమవుతోంది.బంగారం, వెండి వినియోగంలో భారత్ ప్రధానంగా చెప్పుకోదగ్గ దేశం. భారత్ గతేడాది 3,625 మెట్రిక్ టన్నుల వెండిని దిగుమతి చేసుకుంది. పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ కారణంగా ఈ సంవత్సరం వెండి దిగుమతి 6500 నుంచి 7000 టన్నుల వరకు ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.2024 ప్రథమార్థంలోనే భారతదేశపు వెండి దిగుమతులు 560 టన్నుల నుంచి 4,554 టన్నులకు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ దిగుమతులు పెరగటానికి మరో కారణం ట్యాక్స్ తగ్గించడం కూడా. స్మగ్లింగ్‌ను అరికట్టడం లక్ష్యంగా పెట్టుకుంని ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించడం జరిగింది.భారత్ ప్రధానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, చైనా నుంచి వెండిని దిగుమతి చేసుకుంటుంది. ఈ రోజు దేశీయ మార్కెట్లో రూ. 300 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర 91700 రూపాయలకు చేరింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కేజీ వెండి ధర త్వరలోనే రూ. 1 లక్షకు చేరుకునే అవకాశం ఉంది. -
రష్యా నుంచి రూ.23,240 కోట్ల చమురు
న్యూఢిల్లీ: రష్యా నుంచి జూలై నెలలో 2.8 బిలియన్ డాలర్ల చమురు భారత్‌కు దిగుమతి అయింది. రష్యా చమురు ఎగుమతులు చైనా తర్వాత భారత్‌కే ఎక్కువగా వచ్చాయి. రష్యా నుంచి చమురు దిగుమతుల్లో చైనా అగ్ర స్థానంలో ఉంది. ఇక గత నెలలో భారత్‌కు అత్యధిక చమురు సరఫరా చేసిన దేశంగా రష్యా మొదటి స్థానంలో ఉంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ తర్వాత యూరప్ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు దూరం కావడం తెలిసిందే. దీంతో మార్కెట్ కంటే కొంత తక్కువ ధరకే చమురును రష్యా అందిస్తుండడంతో, భారత్ దిగుమతులకు ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముందు భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఒక శాతం లోపే ఉండేది. అది ఇప్పుడు 40 శాతానికి పెగిపోయింది. రష్యా నుంచి చమురు ఎగుమతుల్లో 47 శాతం చైనాకు వెళుతుంటే, 37 శాతం భారత్‌కు, యూరప్‌కు 7 శాతం, టరీ్కకి 6 శాతం చొప్పున సరఫరా అవుతున్నాయి. ఈ వివరాలను సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లియర్ ఎయిర్ (సీఆర్ఈఏ) నివేదిక వెల్లడించింది. బొగ్గుకు సైతం డిమాండ్.. ఇక రష్యా నుంచి బొగ్గు దిగుమతులకు సైతం చైనా, భారత్ ప్రాధాన్యం ఇస్తున్నాయి. 2022 డిసెంబర్ 5 నుంచి 2024 జూలై వరకు రష్యా బొగ్గు ఎగుమతుల్లో 45 శాతం చైనాయే సొంతం చేసుకుంది. ఆ తర్వాత అత్యధికంగా 18 శాతం బొగ్గు భారత్‌కు దిగుమతి అయింది. టరీ్కకి 10 శాతం, దక్షిణ కొరియాకి 10 శాతం, తైవాన్‌కు 5 శాతం చొప్పున రష్యా నుంచి బొగ్గు ఎగమతులు నమోదయ్యాయి. మన దేశ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతుండడం తెలిసిందే. జూలై నెలలో 19.4 మిలియన్ టన్నుల చమురు దిగుమతుల కోసం భారత్ 11.4 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. సీఆర్ఈఏ నివేదిక ప్రకారం రష్యా సముద్ర చమురు ఎగుమతుల్లో 36 శాతమే ట్యాంకర్ల ద్వారా జరిగింది. పాశ్చాత్య దేశాలు విధించిన ధరల పరిమితి వీటికి వర్తించింది. ఇది కాకుండా మిగిలిన చమురు అంతా షాడో ట్యాంకర్ల ద్వారా రష్యా సరఫరా చేసింది. ఇవి అనధికారికం కనుక ధరల పరిమితి పరిధిలోకి రావు. మరీ ముఖ్యంగా విలువ పరంగా చూస్తే జూలై నెలలో 81 శాతం రష్యా చమురు సరఫరా షాడో ట్యాంకర్ల రూపంలోనే జరిగినట్టు సీఆర్ఈఏ నివేదిక వెల్లడించింది. -
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత.. వాణిజ్యంపై ప్రభావం
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రధాని షేక్ హసీనా దేశం వదిలివెళ్లారు. దాంతో అక్కడి పరిపాలన సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్లింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ తెలిపింది. సంస్థ వెల్లడించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.భారత్ బంగ్లాదేశ్‌కు చాలా వస్తువులను ఎగుమతి చేస్తోంది.ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం తగ్గుతుంది. అయితే దీని ప్రభావం పెద్దగా ఉండదు.2023-24లో బంగ్లాదేశ్‌కు భారత్ 11 బిలియన్ డాలర్లు(రూ.92 వేలకోట్లు) విలువ చేసే వస్తువులను ఎగుమతి చేసింది. అంతకుముందు ఏడాది నమోదైన 12.21 బిలియన్ డాలర్లతో(రూ.1 లక్ష కోట్లు) పోలిస్తే ఇది తక్కువ.గత ఆర్థిక సంవత్సరంలో బంగ్లా నుంచి భారత్‌కు దిగుమతుల విలువ రెండు బిలియన్ డాలర్ల(రూ.16 వేలకోట్లు) నుంచి 1.84 బిలియన్ డాలర్లకు(రూ.15 వేలకోట్లు) తగ్గింది.ఇదీ చదవండి: 16.8 లక్షల కార్లను రీకాల్ చేసిన టెస్లా!ఎగుమతులు: కూరగాయలు, కాఫీ, టీ, మసాలాలు, పంచదార, చాక్లెట్లు, శుద్ధిచేసిన పెట్రోలియం, రసాయనాలు, పత్తి, ఇనుము, ఉక్కు, వాహనాలు.దిగుమతులు: చేపలు, ప్లాస్టిక్, తోలు ఉత్పత్తులు, దుస్తులు. -
‘ప్రమాదంలో దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ’
ఎలక్ట్రానిక్స్ విడిభాగాల దిగుమతులు పెరుగుతుండడం వల్ల దేశీయ సంస్థల ఉత్పత్తి ప్రమాదంలో పడుతుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) హెచ్చరించింది. దీనివల్ల స్థానిక కంపెనీల స్థిరత్వంపై ప్రభావం పడుతుందని నివేదికలో పేర్కొంది.సీఐఐ తెలిపిన వివరాల ప్రకారం..‘భారత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ క్లిష్ట దశలో ఉంది. దిగుమతి ఆధారిత ఉత్పత్తులు పెరుగుతున్నాయి. విడిభాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని ఉత్పత్తులను తయారుచేసుకునేందుకు బదులుగా దేశీయంగా తయారవుతున్న పరికరాలను వినియోగించుకోవాలి. ఈ రంగంలో దేశీయ విలువ జోడింపు 15% వద్దే ఉంది. దీన్ని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఈ పరిశ్రమ ఊపందుకునేందుకు ఏటా 6-8% చొప్పున వృద్ధి నమోదవ్వాలి. ఎంపిక చేసిన విడిభాగాలను స్థానిక కంపెనీలు వినియోగించేలా, అందుకు అవసరమయ్యే ఆర్థిక సహాయాన్ని అందించేలా పథకాలను రూపొందించాలి. 25-40% సబ్సిడీతో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్, సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలి. మార్కెట్లో డిమాండ్ ఉన్న కెమెరా మాడ్యూల్స్, డిస్ప్లే మాడ్యూల్స్ తయారీకి అవసరమయ్యే కాంపోనెంట్స్ దిగుమతి సుంకాలను తగ్గించాలి. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న నిపుణులు ఇతర దేశాలకు వలస వెళ్లకుండా అటు కంపెనీలు, ఇటు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొంది.ఇదీ చదవండి: రూ.కోట్లు సంపాదించిన శ్రేయో ఘోషల్.. ఆమె భర్త ఏం చేస్తారో తెలుసా?‘చైనాతో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీదారులకు గత నాలుగేళ్లలో 15 బిలియన్ డాలర్ల (రూ.1.2లక్షల కోట్లు) మేరకు నష్టం వాటిల్లిందని అంచనా. దాంతో పాటు 1,00,000 కొలువులపై ప్రభావం పడింది. కొన్ని చైనా కంపెనీలు భారత్‌లో తమ కార్యకలాపాలు పెంచుతున్నాయి. అయితే ఆయా ఉత్పత్తుల్లో ఇతర దేశాల్లో తయారుచేస్తున్న ఎలక్ట్రానిక్స్ విడిభాగాలను వినియోగిస్తున్నారు. దానివల్ల ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చైనాతో వాణిజ్య సంబంధాలను సమీక్షించాలి. యురోపియన్ యూనియన్, ఆఫ్రికా వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కొనసాగించాలి’ అని సీఐఐ తెలిపింది. -
భారీగా బంగారం వెండి దిగుమతులు
న్యూఢిల్లీ: యూఏఈ నుంచి బంగారం, వెండి దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం లో గణనీయంగా పెరిగాయి. 210 శాతం అధికంగా 10.7 బిలియన్ డాలర్లు (88,810 కోట్లు) విలువైన బంగారం, దిగుమతులు నమోదైనట్టు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీ యేటివ్ (జీటీఆర్ఐ) సంస్థ అధ్యయనంలో తెలిసింది. 2022–23లో బంగారం, వెండి దిగుమతుల విలువ 3.5 బిలియన్ డాలర్లుగానే ఉంది. భారత్–యూఏఈ సమగ్ర ఆరి్థక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) కింద యూఏఈకి భారత్ కలి్పంచిన కస్టమ్స్ డ్యూటీ రాయితీలే ఈ పెరుగుదలకు కారణమని జీటీఆర్‌ఈ ఓ నివేదికలో వెల్లడించింది. పెరిగిన దిగుమతులను నియంత్రించేందుకు కస్టమ్స్ డ్యూటీ రాయితీలను సమీక్షించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. యూఏఈ నుంచి వెండి దిగుమతులపై 7 శాతం టారిఫ్ రాయితీని భారత్ కల్పిస్తోంది. దిగుమతుల పరిమాణంపై ఎలాంటి పరిమితి విధించలేదు. అదే బంగారం అయితే ఒక ఆరి్థక సంవత్సరంలో 160 మెట్రిక్ టన్నుల వరకు ఒక శాతం డ్యూటీ రాయితీ కింద అనుమతించింది. 2022 మే నుంచి రెండు దేశాల మధ్య సీఈపీఏ అమల్లోకి వచ్చింది. దీనికితోడు గిఫ్ట్ సిటీలోని ‘ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్సే్ఛంజ్’(ఐఐబీఎక్స్) ద్వారా యూఏఈ నుంచి ప్రైవేటు సంస్థలు బంగారం, వెండి దిగుమతులకు ప్రభుత్వం అనుమతించింది. బంగారం, వెండి మినహా యూఏఈ నుంచి ఇతర ఉత్పత్తుల దిగుమతులు గత ఆరి్థక సంవత్సరంలో క్షీణించాయి. 2022–23లో 48 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు యూఏఈ నుంచి భారత్‌కు రాగా, 2023–24లో 9.8 శాతం తక్కువగా 48 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.ఇదే ధోరణి ఉండకపోవచ్చు.. యూఈఏ నుంచి బంగారం, వెండి దిగుమతులు ఇక ముందూ ఇదే స్థాయిలో కొనసాగకపోవచ్చని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఎందుకంటే యూఏఈలో బంగారం లేదా వెండి తవ్వకాలు (మైనింగ్) లేవని, కనుక ఆ దేశానికి ఈ ఉత్పత్తుల ఎగుమతులతో ఒనగూడే అదనపు విలువ ఏమంత ఉండదన్నారు. ‘‘ప్రస్తుతం భారత్‌లో బంగారం, వెండి, ఆభరణాల దిగుమతులపై 15 శాతం సుంకం అమలవుతోంది. ఇదే అసలు మూలంలోని సమస్య. టారిఫ్‌లను 5 శాతానికి తగ్గించినట్టయితే అక్రమ రవాణా, దురి్వనియోగానికి అడ్డుకట్ట పడుతుంది’’అని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. యూఏఈ నుంచి దిగుమతులపై తక్కువ టారిఫ్ నేపథ్యంలో ఆర్బిట్రేజ్ ట్రేడింగ్‌ను నియంత్రించేందుకు రాయితీతో కూడి కస్టమ్స్ సుంకాలను సమీక్షించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. బంగారం మాదిరే వెండి దిగుమతులపై వార్షిక పరిమితిని అయినా విధించాలని సూచించారు. దీనివల్ల ఆదాయ నష్టాన్ని తగ్గించుకోవచ్చన్నారు. గిఫ్ట్ సిటీ ద్వారా బంగారం, వెండి దిగుమతుల విషయంలో నిబంధనలను కఠినతరం చేయాలని సూచించారు. -
ఎకానమీకి వాణిజ్యలోటు పోటు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు మేలో 9 శాతం (2023 ఇదే నెలతో పోల్చి) పెరిగాయి. విలువలో 38.13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులుసైతం సమీక్షా నెల్లో 7.7 శాతం పెరిగి 61.91 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు భారీగా 7 నెలల గరిష్ట స్థాయిలో 23.78 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇంత భారీ వాణిజ్యలోటు ఎకానమీకి ఒక్కింత ఆందోళన కలిగించే అంశం. తాజా గణాంకాలను పరిశీలిస్తే.. → అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి పరిస్థితి నెలకొన్నప్పటికీ, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, జౌళి, ప్లాస్టిక్స్ వంటి రంగాలు మంచి పనితీరును ప్రదర్శించాయి. → మొత్తం దిగుమతుల్లో చమురు విభాగంలో 28 % పెరుగుదలను నమోదుచేసుకుని విలువలో 20 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. → పసిడి దిగుమతులు మాత్రం స్వల్పంగా తగ్గి 3.69 బిలియన్ డాలర్ల నుంచి 3.33 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏప్రిల్– మే నెలల్లో వృద్ధి 5.1 శాతం ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలు–ఏప్రిల్, మేలలో ఎగుమతులు 5.1 శాతం పెరిగి 73.12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 8.89 శాతం పెరిగి 116 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి వాణిజ్యలోటు 42.88 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఈ నెలల్లో ఒక్క చమురు దిగుమతుల విలువ 24.4 శాతం పెరిగి 36.4 బిలియన్ డాలర్లకు చేరింది. సేవలూ బాగున్నాయ్... సేవల రంగం ఎగుమతులు మేలో 30.16 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తొలి అంచనా. 2023 మేలో ఈ విలువ 26.99 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ ఇదే కాలంలో 15.88 బిలియన్ డాలర్ల నుంచి 17.28 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. రత్నాలు, ఆభరణాల ఎగుమతులు డౌన్ మరోవైపు రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి ఒక ప్రకటన చేస్తూ, మేనెల్లో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 5 శాతం తగ్గి రూ.20,713.37 కోట్లుగా నమోదయినట్లు పేర్కొంది. 2023 ఇదే నెల్లో ఈ విలువ రూ.21,795.65 కోట్లు (2,647 మిలియన్ డాలర్లు). -
టాప్ 5 దేశాలను వెనక్కి నెట్టిన భారత్!
ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ఉత్పత్తి చేసే టాప్ 5 దేశాలతో పోలిస్తే భారత్‌లోనే వృద్ధి నమోదైనట్లు ప్రపంచ స్టీల్ అసోసియేషన్(డబ్ల్యూఎస్‌ఏ) నివేదిక వెల్లడించింది. స్టీల్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న చైనా ఏప్రిల్ నెలలో 85.9 మిలియన్ టన్నులతో 7 శాతం క్షీణించినట్లు డబ్ల్యూఎస్‌ఏ తెలిపింది.డబ్ల్యూఎస్‌ఏ రిపోర్ట్ ప్రకారం..ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు చైనా ఉక్కు ఉత్పత్తి 343.7 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది 2023తో పోలిస్తే 3% తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న భారత్ ఏప్రిల్‌లో 3.6% పెరుగుదలతో 12.1 మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేసింది. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్య 49.5 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసి 8.5% వృద్ధి సాధించింది. జపాన్, అమెరికా, రష్యాలు మొదటి త్రైమాసికంలో 2-6% క్షీణించాయి. జనవరి-ఏప్రిల్ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇండియా మినహా మిగతా నాలుగు అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి చేసే దేశాల్లో ప్రొడక్షన్ తగ్గింది.ఇదీ చదవండి: ఏఐతో మరింత అందంగా: రిలయన్స్ఇండియాలో స్టీల్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నప్పటికీ ప్రపంచ డిమాండ్ ఇంకా కోలుకోలేదని డేటా సూచిస్తుంది. క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ రీసెర్చ్ డైరెక్టర్ సెహుల్ భట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘అధిక వడ్డీ రేట్లు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉక్కు వినియోగిస్తున్న రంగాల్లో డిమాండ్ తగ్గింది. 2023లో ఐరన్‌ఓర్(ముడి ఉక్కు) ఉత్పత్తిలో ఎలాంటి మార్పులులేవు. ఈ ట్రెండ్ 2024లోనూ కొనసాగుతుందని అంచనా. ఈ ధోరణి భారతీయ ఉక్కు తయారీదారుల మార్చి త్రైమాసిక ఆదాయాలపై ప్రభావం చూపింది. దేశంలో అధిక ఐరన్‌ఓర్ దిగుమతి కారణంగా ధరలు ప్రభావితమయ్యాయి’ అని చెప్పారు. -
ఇరాన్ అధ్యక్షుడు హఠాన్మరణం.. భారత్‌తో వాణిజ్యం ఎలా ఉందంటే..
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్(బెల్-212) ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పరం ప్రతీకార దాడులు జరుపుకుంటున్న నేపథ్యంలో ఇరు దేశాలు భారత్‌తో జరుపుతున్న వాణిజ్యం ఏమేరకు ప్రభావం పడుతుందోననే ఆందోళనలు నెలకొంటున్నాయి. ఇప్పటివరకైతే రెండు దేశాలతో భారత్ మెరుగైన సంబంధాలను కలిగి ఉంది. ఏటా ఆయా దేశాలతో చేసే వాణిజ్యాన్ని పెంచుకుంటుంది. ప్రధానంగా వాటి నుంచి జరిపే దిగుమతులు, ఎగుమతులు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.2022-23లో 2.33 బిలియన్డాలర్ల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అది 21.7 శాతం అధికం. భారత్ నుంచి ఇరాన్‌కు చేసే ఎగుమతులు 1.66 బి.డాలర్లు(ముందు ఏడాదితో పోలిస్తే 14.34శాతం అధికం)గా ఉన్నాయి. ఇరాన్ నుంచి భారత్ చేసుకునే దిగుమతులు 672 మిలియన్ డాలర్లు(ముందు ఏడాదితో పోలిస్తే 45.05 శాతం)గా ఉన్నాయి.భారత్ నుంచి ఇరాన్ వెళ్తున్న వాటిలో ప్రధానంగా బాస్మతి బియ్యం, టీ పౌడర్, షుగర్, పండ్లు, ఫార్మా ఉత్పత్తులు, కూల్‌డ్రింక్స్, పప్పుదినుసులు ఉన్నాయి. ఇరాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువుల్లో మిథనాల్, పెట్రోలియం బిట్యుమెన్, యాపిల్స్, ప్రొపేన్, డ్రై డేట్స్, ఆర్గానిక్ కెమికల్స్, ఆల్మండ్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ 15 బీటా 2లోని కొత్త ఫీచర్లుఇజ్రాయెల్తోనూ భారత్‌కు మెరుగైన సంబంధాలే ఉన్నాయి. ఇబ్రాయెల్‌కు భారత్ ఎగుమతుల్లో ప్రధానంగా ఆటోమేటివ్ డీజిల్, కెమికల్ ఉత్పత్తులు, ఎలక్ట్రికల్ వస్తువులు, ప్లాస్టిక్, టెక్స్ట్టైల్, మెటల్ ఉత్పత్తులు ఉన్నాయి ఫెర్టిలైజర్ ఉత్పత్తులు, రంగురాళ్లు, పెట్రోలియం ఆయిల్స్, డిఫెన్స్ పరికరాలను భారత్ దిగుమతి చేసుకుంటోంది. -
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
బఠానీలను ఉచితంగా దిగుమతి చేసుకునే గడువును ప్రభుత్వం అక్టోబర్ 2024 వరకు పొడిగించింది. ఈమేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.గతేడాది డిసెంబరులో ప్రభుత్వం బఠానీల దిగుమతిపై ఎలాంటి సుంకం విధించకూడదని నిర్ణయించింది. దాంతో కొన్ని నిబంధనలు తయారుచేసి మార్చి 2024 వరకు అవి అమలులో ఉంటాయని పేర్కొంది. తర్వాత వాటిని జూన్ వరకు పొడిగించారు. తాజాగా ఈ నిబంధనలు అక్టోబర్ వరకు అమలవుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.డీజీఎఫ్టీ నోటిఫికేషన్ ప్రకారం.. బఠానీల ఇంపోర్ట్స్‌కు సంబంధించి కనీస దిగుమతి ధర (ఎంఐపీ) షరతులు వర్తించవు. ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్‌కు లోబడి ఎంతైనా దిగుమతి చేసుకోవచ్చు. ఎలాంటి సుంకం ఉండదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 235.92 మిలియన్ డాలర్ల విలువైన బఠానీలను దిగుమతి చేసుకున్నట్లు తెలిసింది. -
అధిక దిగుమతి సుంకాలపై కీలక నివేదిక
న్యూఢిల్లీ: బియ్యం వంటి సున్నితమైన వ్యవసాయ ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాలు కొనసాగించడం, దేశీయ వ్యవసాయ రంగాన్ని తక్కువ టారిఫ్‌లకు అనుకూలంగా మార్చాలన్న ఒత్తిళ్లను నిరోధించడం అన్నవి భారత్ ప్రజల ఆహార భద్రత, స్వావలంబనకు కీలకమని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్షియేటివ్ (జీటీఆర్ఐ) సూచించింది. మెరుగైన ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భారత్ వెజిటబుల్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని, ఇది దిగుమతుల బిల్లును తగ్గిస్తుందని తన తాజా నివేదికలో పేర్కొంది. స్థానికంగా ఉత్పత్తి చేసిన ఆవనూనె, వేరుశనగ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలి్పంచాలని సూచించింది. ప్రపంచంలో భారత్ అతిపెద్ద వంట నూనెల దిగుమతిదారుగా ఉన్న విషయాన్ని పేర్కొంది. 2017–18 సంవత్సరంలో 10.8 బిలియన్ డాలర్ల విలువైన నూనెలు దిగుమతి అయితే, 2023–24లో ఇది 20.8 బిలియన్ డాలర్లకు పెరగడాన్ని ప్రస్తావించింది. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఉత్పత్తిని పెంచడం, దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు అధిక సుంకాల విధింపు చర్యలతో యూఎస్, ఈయూ తమ వ్యవసాయ రంగానికి మద్దతుగా నిలుస్తున్నట్టు గుర్తు చేసింది. ఆ్రస్టేలియా వంటి దేశాలు అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాలపై వ్యవసాయ ఉత్పత్తుల సబ్సిడీలు, టారిఫ్‌లు తగ్గించాలనే ఒత్తిడిని తీసుకువస్తూనే ఉంటాయని తెలిపింది. ‘‘భారత్ కీలకమైన వ్యవసాయ ఉత్పత్తులపై 30–100 శాతం మధ్య టారిఫ్‌లు అమలు చేస్తోంది. సబ్సిడీ సాయంతో వచ్చే దిగుమతులను నిరోధించడానికి ఇది మేలు చేస్తోంది. ఎఫ్‌టీఏ భాగస్వామ్య దేశాలకు సైతం టారిఫ్‌లు తగ్గించడంలేదు. ఈ చర్యలు వంట నూనెలు మినహా దాదాపు అన్ని రకాల సాగు ఉత్పత్తుల విషయంలో భారత్ స్వావలంబన శక్తికి సా యపడుతున్నాయి’’అని ఈ నివేదిక వివరించింది. ఇదే విధానం కొనసాగాలి ‘‘తక్కువ టారిఫ్, సబ్సిడీలతో కూడిన దిగుమతులకు దేశీ వ్యవసాయ రంగాన్ని తెరవకుండా ఉండాలన్న ప్రస్తుత విధానాన్ని భారత్ కొనసాగించాలి. సున్నితమైన ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు కొనసాగించాలి. టారిఫ్‌లు తగ్గించాలన్న ఒత్తిళ్లకు తలొగ్గకూడదు. ఎంతో కష్టపడి సాధించుకున్న స్వీయ సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి ఇది అవసరం’’అని జీటీఆర్ఐ పేర్కొంది. భారత వ్యవసాయ దిగుమతులు 2023లో 33 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా. భారత్ మొత్తం దిగుమతుల్లో ఇది 4.9 శాతంగా ఉండడం గమనార్హం. ‘‘హరిత, క్షీర విప్లవం తరహా విధానాలపై దృష్టి సారించడం, అధిక దిగుమతి సుంకాలు.. సబ్సిడీ ఉత్పత్తుల దిగుమతులకు భారత వ్యవసాయ రంగం ద్వారాలు తెరవాలన్న అభివృద్ధి చెందిన దేశాల ఒత్తిళ్లకు తలొగ్గకుండా.. 140 కోట్ల ప్రజల ఆహార భద్రత కోసం ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద చురుకైన సంప్రదింపులు నిర్వహించడం భారత్ ఈ స్థితిలో ఉండేందుకు దారితీశాయి’’అని జీటీఆర్ఐ సహ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
అర్జెంటీనా లిథియం నిల్వలపై భారత్ దృష్టి
న్యూఢిల్లీ: లిథియం దిగుమతుల కోసం ప్రస్తుతం చైనాపైనే ఎక్కువగా ఆధారపడుతున్న భారత్.. ఇతరత్రా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా అర్జెంటీనాలో అయిదు లిథియం బ్లాకులను కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టింది. భారత అవసరాల కోసం విదేశాల్లో ఖనిజ నిక్షేపాలను అభివృద్ధి చేసే జాయింట్ వెంచర్ కంపెనీ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ (కాబిల్), అర్జెంటీనాకు చెందిన క్యాటామార్కా మినరా వై ఎనర్జెటికా సొసైడాడ్ డెల్ ఎస్టాడో (క్యామ్‌యెన్) ఇందుకు సంబంధించిన ఒప్పందంపై కసరత్తు చేస్తున్నాయి. చర్చలు తుదిదశలో ఉన్నాయని, త్వరలోనే ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే అయిదేళ్లలో లిథియం నిక్షేపాల అన్వేషణ, గనుల అభివృద్ధిపై భారత్ సుమారు రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించాయి. భారత్ ఇప్పటికే ఆ్రస్టేలియాలో రెండు లిథియం, మూడు కోబాల్ట్ గనులను అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే క్రమంలో లిథియంకు సంబంధించి అర్జెంటీనాతో ఒప్పందం రెండోది కానుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మొదలైన వాటి బ్యాటరీల్లో లిథియంను విరివిగా ఉపయోగిస్తారు. భారత్ గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 25,000 కోట్ల విలువ చేసే లిథియంను చైనా, హాంకాంగ్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 98 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలు ఉండగా ఇందులో 20 శాతం నిక్షేపాలు అర్జెంటీనాలో ఉన్నాయి. -
సముద్ర మార్గంలో పండ్లు, కూరగాయల ఎగుమతులు
న్యూఢిల్లీ: సముద్ర మార్గంలో తాజా పండ్లు, కూరగాయల ఎగుమతులను ప్రోత్సహించేందుకు వీలుగా నియమావళిని (ప్రొటోకాల్) కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ప్రకటించారు. అరటి, మామిడి, దానిమ్మ, జాక్‌ఫ్రూట్ తదితర ఉత్పత్తులను ప్రస్తుతం విమాన రవాణా ద్వారా పంపిస్తున్నారు. ఎగుమతుల పరిమాణం తక్కువగా ఉండడం, పండ్లు పక్వానికి వచ్చే కాలం వేర్వేరుగా ఉండడమే ఇందుకు కారణం. సముద్ర రవాణా ప్రోటోకాల్‌లో భాగంగా, పండ్లు పరిపక్వానికి వచ్చే నిర్ధిష్ట కాల వ్యవధి, ఒక్కో ఉత్పత్తి శాస్త్రీయంగా ఎన్ని రోజులకు పండుతుంది? నిర్దేశిత సమయంలో వాటిని సాగు చేయడం, రైతులకు శిక్షణ ఇవ్వడం వంటివి భాగంగా ఉంటాయి. ఒక్కో పండు, కూరగాయకు ఇది వేర్వేరుగా ఉంటుంది. సముద్ర మార్గంలో రవాణాతో తక్కువ వ్యయానికి, ఎక్కువ మొత్తంలో పంపించుకోవచ్చని రాజేష్ అగర్వాల్ తెలిపారు. ‘‘ఇప్పటి వరకు వీటిని వాయు మార్గంలోనే ఎగుమతి చేస్తున్నాం. అగ్రి ఉత్పత్తుల ఎగుమతులకు సముద్ర రవాణాను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చన్నది పరీక్షించి చూస్తున్నాం. అందుకే సముద్ర ప్రొటోకాల్‌ను అభివృద్ధి చేస్తున్నాం’’అని రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం విమానయానం ద్వారా పంపిస్తుండడంతో, ధరల పరంగా పోటీ ఇచ్చే సానుకూలత ఉండడం లేదన్నారు. అపెడా, ఇతర భాగస్వాములతో కలసి అరటి పండ్ల ఎగుమతులకు సంబంధించిన ప్రోటోకాల్‌ను అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ‘‘ఖాళీ కంటెయినర్లో పరీక్షించి చూశాం. ప్రత్యక్ష పరిశీలనలో భాగంగా రోటెర్డ్యామ్కు మొదటి షిప్పింగ్‌ను పంపించాం. ఇది విజయవంతమవుతుందన్న నమ్మకం ఉంది. ఒక్కసారి ఇది పూర్తయితే దిగుమతిదారులు ఆమోదించడం మొదలవుతుంది. అప్పుడు పెద్ద మొత్తంలో ఎగుమతులకు వీలు కలుగుతుంది’’అని అగర్వాల్ వివరించారు. అరటి సాగులో నంబర్ 1 ప్రపంచంలో అరటి తయారీలో భారత్ మొదటి స్థానంలో ఉంది. అయినా కానీ, ప్రపంచ అరటి ఎగుమతుల్లో భారత్ వాటా కేవలం 1% మించి లేదు. ప్రపంచ అరటి ఉత్పత్తిలో భారత్ వాటా 26. 45 శాతంగా ఉంది. ఇది 35.36 మిలియన్ మెట్రిక్ టన్నులకు సమానం. గత ఆర్థిక సంవత్సరం (2022–23) మొత్తం మీద చేసిన అరటి ఎగుమతులు ఏ మాత్రం మార్పు లేకుండా 176 మిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఆగస్ట్ వరకు మామిడి ఎగుమతులు 19% పెరిగి 48 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మన దేశం నుంచి పండ్లు, కూరగాయల ఎగుమతులు 13% వృద్ధితో 2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
రష్యా నుంచి భారీగా దిగుమతులు
న్యూఢిల్లీ: రష్యా నుంచి దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య 36.27 బిలియన్ డాలర్లు విలువైన (రూ.3.01లక్షల కోట్లు) దిగుమతులు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దిగుమతుల్లో 65 శాతం వృద్ధి కనిపిస్తోంది. 2022 ఏప్రిల్–అక్టోబర్ మధ్య రష్యా నుంచి దిగుమతులు 22.13 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ముడి చమురు, ఎరువులు ప్రధాన దిగుమతులుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో భారత్ దిగుమతులకు రష్యా రెండో అతిపెద్ద కేంద్రంగా నిలిచింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముందు మన దేశ దిగుమతుల్లో రష్యా వాటా కేవలం ఒక్కశాతమే. కానీ, ప్రస్తుతం భారత చమురు దిగుమతుల్లో రష్యా 40 శాతం వాటా ఆక్రమించేసింది. ఉక్రెయిన్‌పై దాడికి ప్రతీకారంగా పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో భారత్‌కు మార్కెట్ కంటే తక్కువ ధరకే చుమురు సరఫరాకు రష్యా ముందుకు వచ్చింది. అప్పటి నుంచి భారత్ భారీగా చమురును రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది. దేశాల వారీగా.. ► ఇక ఏప్రిల్–అక్టోబర్ మధ్య చైనా నుంచి దిగుమతులు 60.02 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి రూ.60.26 బిలియన్ డాలర్ల వద్దే ఉన్నాయి. ► అమెరికా నుంచి దిగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూసినప్పుడు 16 శాతం తగ్గి 24.89 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ► యూఏఈ నుంచి దిగుమతులు 21 శాతం తగ్గి 24.91 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ► అంతేకాదు సౌదీ అరేబియా, ఇరాక్, ఇండోనేíÙయా, సింగపూర్, కొరియా నుంచి కూడా దిగుమతులు క్షీణించాయి. ► స్విట్జర్లాండ్ నుంచి దిగుమతులు క్రితం ఏడాది మొదటి ఏడు నెలల్లో 10.48 బిలియన్ డాలర్లుగా ఉంటే, అవి ఈ ఆర్థిక సంవత్సరం అదే కాలంలో 13.97 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందాయి. ► మరో వైపు భారత్ ఎగుమతులకు కేంద్రంగా ఉన్న టాప్–10 దేశాలలో, ఆరు దేశాలకు ఏప్రిల్–అక్టోబర్ మధ్య ఎగుమతులు ప్రతికూలంగా నమోదయ్యాయి. అమెరికా, యూఏఈ, సింగపూర్, జర్మనీ, బంగ్లాదేశ్, సౌదీ అరేబియాకు తగ్గాయి. ► బ్రిటన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌కు ఎగుమతులు వృద్ధి చెందాయి. ► చైనాకు ఎగుమతులు 8.92 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది మొదటి ఏడు నెలల్లో ఇవి 8.85 బిలియన్ డాలర్లు. -
టాప్‌గేర్‌లో టెస్లా దిగుమతులు..!
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. భారత్ నుంచి ఆటో విడిభాగాల దిగుమతిని రెట్టింపు చేసుకునే యోచనలో ఉంది. నాలుగు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఫ్రీమాంట్ (కాలిఫోరి్నయా)లోని కంపెనీ ప్లాంటును సందర్శించిన సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ఈ విషయం తెలిపారు. అనారోగ్య కారణాల రీత్యా గోయల్‌ను టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కలవలేకపోయారు. ‘టెస్లా అధునాతన ప్లాంటును సందర్శించాను. మొబిలిటీ ముఖచిత్రాన్ని మారుస్తున్న టెస్లా వృద్ధి ప్రస్థానంలో పలువురు భారతీయ ఇంజ నీర్లు, ఫైనాన్స్ నిపుణులు సీనియర్ల స్థాయిలో పాలుపంచుకుంటూ ఉండటం సంతోషం కలిగించింది. అలాగే టెస్లా సరఫరా వ్యవస్థలో భారతీయ ఆటో విడిభాగాల సరఫరా సంస్థలకు ప్రాధాన్యం పెరుగుతుండటం గర్వకారణం. భారత్ నుంచి టెస్లా దిగుమతులను రెట్టింపు చేసుకునే దిశగా ముందుకెడుతోంది. మస్క్ వేగంగా కోలుకోవాలని ఆశిస్తున్నాను‘ అని సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్‌లో గోయల్ ట్వీట్ చేశారు. ‘మీరు టెస్లా ప్లాంటును సందర్శించడం సంతోషం కలిగించింది. కాలిఫోరి్నయాకు రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. భవిష్యత్తులో మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను‘ అని దానికి ప్రతిస్పందనగా మస్క్ ట్వీట్ చేశారు. టెస్లా 2022లో భారత్ నుంచి 1 బిలియన్ డాలర్ల విలువ చేసే విడిభాగాలను దిగుమతి చేసుకోగా, ఈసారి 1.9 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని భావిస్తున్నట్లు గోయల్ ఇటీవలే తెలిపారు. పరిశీలనలో మినహాయింపులు.. టెస్లా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా దిగుమతులతో ప్రారంభించి ఇక్కడ డిమాండ్‌ను బట్టి ప్లాంటును నెలకొల్పే యోచనలో ఉన్నట్లు రెండేళ్ల క్రితం మస్క్ చెప్పారు. అయితే, భారీ స్థాయి దిగుమతి సుంకాల విషయంలో భారత్ తమకు కొంత మినహాయింపు కల్పించాలని కోరారు. కానీ, టెస్లా కూడా ఇతర సంస్థల బాటలోనే రావాల్సి ఉంటుందని కేంద్రం అప్పట్లో స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్‌లో అమెరికాలో ప్రధాని మోదీతో మస్క్ సమావేశం అనంతరం.. దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలను ఆకర్షించేందుకు తగిన విధానాన్ని రూపొందిస్తామంటూ కేంద్రం వెల్లడించడం గమనార్హం. దీనితో టెస్లా ఎంట్రీకి మార్గం సుగమం చేసేలా కంపెనీకి వెసులుబాట్లునిచ్చే అవకాశాలు ఉన్నాయంటూ అంచనాలు నెలకొన్నాయి. -
జర్మనీ నుంచి టెస్లా దిగుమతులు!
న్యూఢిల్లీ: జర్మనీ ఫ్యాక్టరీలో తయారైన కార్లను దిగుమతి చేసుకోవడం ద్వారా భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వాలని ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భావిస్తోంది. చైనాలోనూ ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ ఆ దేశంతో నెలకొన్న ఉద్రిక్తతలరీత్యా అక్కణ్నుంచి దిగుమతులపై భారత్ అంత సుముఖంగా లేకపోవడంతో టెస్లా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా నుంచి కార్లను దిగుమతి చేసుకోవద్దంటూ టెస్లా టాప్ మేనేజ్మెంట్కు కేంద్ర ప్రభుత్వ శాఖలు సూచించినట్లు వివరించాయి. దీంతో భారత్‌తో సత్సంబంధాలున్న జర్మనీ నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. జర్మనీలోని బ్రాండెన్‌బర్గ్‌లో టెస్లాకు గిగాఫ్యాక్టరీ ఉంది. భారత మార్కెట్లో 25,000 యూరోల (సుమారు రూ. 20 లక్షలు) కారును ప్రవేశపెట్టే యోచనలో కంపెనీ ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, జర్మనీ నుంచి దిగుమతి చేసే విద్యుత్ వాహనాలపై కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపులు ఇవ్వాలని కూడా టెస్లా కోరుతున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఒకవేళ వాటిపై సుంకాలను 20–30 శాతం మేర తగ్గిస్తే టెస్లా మాత్రమే కాకుండా జర్మనీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి పలు లగ్జరీ కార్ల తయారీ సంస్థలకు కూడా ప్రయోజనం లభించవచ్చని పేర్కొన్నాయి. -
110 సంస్థలకు అనుమతులు..
-
110 సంస్థలకు అనుమతులు
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు వంటి ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు 110 సంస్థలకు కేంద్రం అనుమతినిచి్చంది. యాపిల్, డెల్, లెనొవొ, హెచ్‌పీ ఇండియా సేల్స్, అసూస్ ఇండియా, ఐబీఎం ఇండియా, షావోమీ టెక్నాలజీ ఇండియా, శాంసంగ్ ఇండియా ఎల్రక్టానిక్స్ మొదలైనవి వీటిలో ఉన్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. అనుమతుల కోసం మొత్తం 111 దరఖాస్తులు వచి్చనట్లు వివరించారు. అయితే, ’నిరాకరణ జాబితా’లో ఉన్న ఒక హైదరాబాద్ సంస్థకు మాత్రం అనుమతి లభించలేదని పేర్కొన్నారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించే దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నిర్దిష్ట ఐటీ హార్డ్‌వేర్ దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా అనుమతులకు లోబడి దిగుమతి చేసుకునే వెసులుబాటు కలి్పంచింది. నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆథరైజేషన్ విధానం 2024 సెపె్టంబర్ వరకు అమల్లో ఉంటుంది. అక్టోబర్ 31న పరిశ్రమ వర్గాలతో సమావేశమైన డీజీఎఫ్టీ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) అనుమతుల ప్రక్రియ గురించి వివరించారు. ’నిరాకరణ జాబితా’లో ఉన్న సంస్థలకు అనుమతులు లభించవు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ ఎగుమతి నిబంధనలను పాటించని సంస్థలు, డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) కేసులు ఎదుర్కొంటున్న కంపెనీలు ఈ జాబితాలో ఉంటాయి. ఐటీ హార్డ్‌వేర్ సంబంధ దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం 8.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే ల్యాప్‌టాప్‌లు సహా పర్సనల్ కంప్యూటర్లు దిగుమతయ్యాయి. అత్యధికంగా చైనా (5.11 బిలియన్ డాలర్లు), సింగపూర్ (1.4 బిలియన్ డాలర్లు), హాంకాంగ్ (807 మిలియన్ డాలర్లు) నుంచి ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులు దిగుమతవుతున్నాయి.