చైనా దిగుమతులకు చెక్
చైనా దిగుమతులకు చెక్
Published Fri, Sep 8 2017 6:12 PM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM
న్యూఢిల్లీః విదేశాల నుంచి చౌక దిగుమతులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చైనా నుంచి దిగుమతి అయ్యే కొన్ని స్టెయిన్‌లెస్ స్టీల్ ఉత్పత్తులపై అదనపు దిగుమతి పన్ను విధించింది. దిగుమతుల నుంచి దేశీయ స్టీల్ తయారీదారులకు ఉపశమనం కలిగించేలా కొన్ని హాట్‌రోల్డ్,కోల్డ్ రోల్డ్ స్టెయిన్‌లెస్ స్టీల్ దిగుమతులపై 18.95 శాతం అదనపు పన్ను విధించినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
చైనా నుంచి వెల్లువెత్తుతున్న ఈ దిగుమతులతో దేశంలో స్టెయిన్‌లెస్ స్టీల్ పరిశ్రమ సంక్షోభం ఎదుర్కొంటున్నదని, దీన్ని నివారించేందుకు దిగుమతులపై అదనపు పన్ను విధించినట్టు తెలిపాయి. ,చైనా, జపాన్, దక్షిణ కొరియాల నుంచి స్టీల్, స్టెయిన్‌లెస్ స్టీల్ దిగుమతులపై భారత్ ఇప్పటికే యాంటీ డంపింగ్ సుంకాలను విధించింది.
Advertisement