duties
-
కోల్‌కతా: విధుల్లో చేరిన జూనియర్ డాక్టర్లు
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణ ఘటన నేపథ్యంలో బెంగాల్లో జూనియర్ డాక్టర్లు సమ్మె ద్వారా తమ నిరసనలు కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో జరిపిన చర్చల అనంతరం 42 రోజుల విరామం తర్వాత జూనియర్ డాక్టర్లు బెంగాల్ వ్యాప్తంగా శనివారం తిరిగి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా అత్యవసర వైద్య సేవల్లో విధులు నిర్వహిస్తామని జూనియర్ డాక్టర్లు వెల్లడించారు. ఇక.. తమ డిమాండ్లలో కొన్నింటికి సీఎం మమత ప్రభుత్వం అంగీకరించడంతో ఇవాళ విధుల్లోకి చేరినట్లు పేర్కొన్నారు. కానీ, ఔట్ పేషెంట్ విభాగానికి సంబంధించిన జూనియర్ డాక్టర్లు ఇంకా విధుల్లో చేరలేదు.చదవండి: కోల్‌కతా డాక్టర్ కేసు: కుట్ర కోణంలో సీబీ‘ఐ’ దర్యాప్తు!‘‘ఈరోజు తిరిగి విధుల్లో చేరడం ప్రారంభించాం. జూనియర్ ఈ ఉదయం నుంచి అవసరమైన, అత్యవసర సేవలకు సంబంధించిన విభాగాల్లో తిరిగి సేవలు ప్రారంభించారు.కానీ ఔట్ పేషెంట్ విభాగాల్లో ఇంకా చేరలేదు. ఇది పాక్షికంగా విధులను ప్రారంభించడం మాత్రమే. నా తోటి ఉద్యోగులు ఇప్పటికే రాష్ట్రంలోని వరద బాధిత జిల్లాలకు బయలుదేరారు. అక్కడ ప్రజారోగ్యం పట్ల తమ నిబద్ధతను ప్రదర్శించడానికి ‘అభయ క్లినిక్‌లు’(వైద్య శిబిరాలు) ప్రారంభిస్తారు’’ అని సమ్మె చేసిన డాక్టర్లలో ఒకరైన అనికేత్ మహతో తెలిపారు.బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జూనియర్ డాక్టర్ల మధ్య ఇటీవల కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జూడాల డిమాండ్లకు దీదీ అంగీకరించారు. తమ డిమాండ్లలో అధిక శాతానికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో శనివారం నుంచి పాక్షికంగా విధులకు హాజరుకావాలని జూనియర్ వైద్యులు నిర్ణయించారు. అయితే.. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అత్యవసర, తప్పనిసరి సేవల విభాగాల్లో మాత్రమే తాము విధుల్లో పాల్గొంటామని ప్రకటించారు. కానీ, అవుట్ పేషంట్ విభాగాల్లో మాత్రం విధులు చేపట్టబోమని స్పష్టం చేశారు. చదవండి: కోల్‌కతా కేసు.. సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు -
జైల్లోంచి పనిచేయకుండా కేజ్రీవాల్‌పై నిషేధం ఉందా?
సాక్షి, న్యూఢిల్లీ: జైలులో నుంచి విధులు నిర్వర్తించకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై నిషేధమేమైనా ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఖైదీల ముందస్తు విడుదలకు సంబంధించిన ఫైళ్లపై సంతకం చేయడంలో జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు అవరోధాలేమిటని నిలదీసింది. ముందస్తు విడుదలకు సంబంధించి ఫైళ్లపై నిర్ణయాలు ఆలస్యం కావడం సరికాదని అభిప్రాయపడింది. ఓ ఖైదీ ముందస్తు విడుదలకు సంబంధించిన కేసును శుక్రవారం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జిలతో కూడిన ధర్మాసనం విచారించింది. సాధారణంగా ఓ ఖైదీ ముందస్తు విడుదలకు సంబంధించిన ఫైలు లెఫ్టినెంట్ గవర్నర్‌ను చేరాలంటే తొలుత ముఖ్యమంత్రి సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే, ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ సదరు ఫైలుపై సంతకం చేయడం ఆలస్యం కావడాన్ని కోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో ‘‘జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ ముందస్తు విడుదల ఫైళ్లపై సంతకం చేయకూడదని ఏమైనా నిబంధన ఉందా? స్వయంగా ఓ కేసులో విచారణ ఖైదీగా ఉన్న సీఎం సదరు ఫైలుపై సంతకం చేయకుండా నిషేధం ఏమైనా ఉందా?’’అని ఢిల్లీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకుంటామని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యభాటి, సీనియర్ న్యాయవాది అర్చనా దవేలు కోర్టుకు తెలిపారు. ఇప్పటివరకూ ఇలాంటి ఘటన ఎదురు కాలేదని వివరించారు. ఒకవేళ అలాంటి నిబంధన ఏమైనా ఉంటే చెప్పాలని లేదంటే ఆరి్టకల్ 142 ఇచి్చన అధికారాలతో కోర్టు పరిశీలన చేస్తుందని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి కేసులు ఎక్కువ కాలం వేచి ఉండరాదని అభిప్రాయపడుతూ ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. -
మారింది పేరొక్కటే
సాక్షి, అమరావతి: ఏపీ డిజిటల్ కార్పొరేషన్ (ఏపీడీసీ) ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రమోట్ చేయడం. ప్రభుత్వాన్ని నడిపే ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాలను హైలైట్ చేస్తూ వివిధ పధకాల ద్వారా ప్రజలు ప్రయోజనం పొందేలా విస్తృత ప్రచారం కల్పించడం వారి విధుల్లో భాగమే. టీడీపీ హయాంలోనూ అదే జరిగింది. ఇప్పుడు కూడా అంతే. ఒక్క పేరు మార్పు మినహా ఎలాంటి తేడా లేదు. నాడు కంటెంట్ కార్పొరేషన్‌గా వ్యవహరించగా ఇప్పుడు డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా డిజిటల్ కార్పొరేషన్‌గా మార్పు చేశారు. డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులను వైఎస్సార్ సీపీ కార్యకర్తలుగా అభివర్ణిస్తూ కథనాలను ప్రచురించిన ఈనాడుకు వారిలో కొందరు గతంలో తమ వద్ద కూడా పని చేశారనే విషయం తెలుసా? చంద్రబాబు హయాంలో పీఆర్వోలుగా పనిచేసిన వారంతా ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి మీడియా సంస్థల్లో పనిచేసిన వారే కదా? ఇక ఏపీడీసీ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు జీతభత్యాలు, కార్యక్రమాల ప్రమోషన్ల కోసం చేసిన మొత్తం ఖర్చు రూ.88.56 కోట్లు కాగా రూ.500 కోట్లు దోచిపెట్టారంటూ ఈనాడు తప్పుడు కథనాలను అచ్చోసింది. ఏపీడీసీకి నాలుగేళ్లలో సగటున రూ.౨౨ కోట్లు కూడా ఖర్చు కాలేదన్నది వాస్తవం. ♦ గత సర్కారు చంద్రబాబు ఇమేజీని పెంచడానికి గ్రూప్– ఎమ్ లాంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని కోట్లాది రూపాయలు చెల్లించిన మాట వాస్తవం కాదా? ♦ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలైన ఎమ్ఈఐటీవై, ఎమ్ఐబీ, డీఏవీపీ లాంటి వాటి మార్గదర్శకాలనే ఏపీడీసీ కూడా అనుసరిస్తోంది. వాటికి అనుగుణంగానే ఏపీడీసీ డిజిటల్ పాలసీ ఫ్రేమ్ వర్క్ తయారైంది. పద్ధతి ప్రకారం ఇవన్నీ నడుస్తున్నప్పుడు పసలేని విమర్శలు ఎందుకు? ♦ రేట్ కార్డులను కూడా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల మార్గదర్శకాలకు అనుగుణంగానే ఏపీడీసీ స్వీకరించింది. దానికి అనుగుణంగానే వెబ్సైట్లు, సోషల్, డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, యాడ్ ఏజెన్సీలు మొదలైన వాటికి ఎంప్యానెల్ చేయడానికి ప్రముఖ జాతీయ, ప్రాంతీయ ప్రింట్ మీడియా పబ్లికేషన్స్‌లో ఆర్ఎఫ్పీలను ఏపీడీసీ ప్రచురిస్తుంది. అన్నీ సక్రమంగా జరిగాకే ఎంప్యానెల్ ఏజెన్సీలకు ఏపీడీసీ వర్క్ ఆర్డర్లను జారీ చేస్తుంది. ♦ ఏపీడీసీ ఇప్పటివరకు ఏ ఒక్క కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనలను కూడా ఏదో ఒక ఏజెన్సీకి కట్టబెట్టిన సందర్భం లేదు. ప్రతి ప్రచార కార్యక్రమంలోనూ కనీసం 5 లేదా అంతకంటే ఎక్కువ ఏజెన్సీలకు ఏపీడీసీ ప్రకటనలు విడుదల చేసింది. కేవలం ఒక మీడియా సంస్థకు మాత్రమే ప్రత్యేకంగా ప్రకటనలు ఇస్తున్నారనే ప్రశ్నే తలెత్తదు. కార్యక్రమాలు, లక్షిత వీక్షకుల ఆధారంగా వీలైనంత ఎక్కువ మందికి చేరే ప్లాట్‌ఫామ్స్‌కే ఏపీడీసీ ప్రకటనలు విడుదల చేస్తూ వచ్చింది. ప్రకటనల జారీలో వివిధ ఆధీకృత సంస్థలు పాటించే పద్ధతే ఇది. ♦ వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీ కాన్సెప్ట్ అనేది అసలు ఏపీడీసీ పరిధిలోకే రాదు. ఏపీడీసీ దానికి ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ కూడా కాదు. ఇలాంటి పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడం ఈనాడుకే చెల్లింది. ♦ ఐప్యాక్‌కు ప్రకటనలు ఇస్తున్నారన్నది పూర్తి అబద్ధం. ఐప్యాక్ అనేది ఎంప్యానెల్ అయిన ఏజెన్సీ కాదు. ఐప్యాక్‌కు ఏపీడీసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలూ ఇవ్వలేదు. ఐడ్రీమ్‌కు కూడా ఎలాంటి ప్రకటనలూ ఇవ్వలేదు. ♦ రిక్రూట్మెంట్ విషయానికి వస్తే సాంకేతిక పరిజ్ఞానం, మీడియాలో అపార అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అర్హతలు ప్రామాణికంగా నియామకాలు జరిగాయి. నియామకాలన్నీ జీఓ 94 ప్రకారమే జరుగుతున్నాయి. గతంలో ఇదే ఉద్యోగులు ఈనాడులో కూడా పనిచేశారు. సలహాదారులైన సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్, ధనుంజయ్‌రెడ్డి, ముఖ్యమంత్రి సీపీఆర్వో శ్రీహరి తదితరులు ఈనాడులో పనిచేసిన వారే అన్న విషయాన్ని ఆ పత్రిక ఖండించగలదా? ఈనాడులో పని చేసి అక్కడనుంచి సాక్షికి వచ్చారన్నది వాస్తవం. వారికి అర్హతలున్నాయి కాబట్టే ఈనాడు ఉద్యోగాలు ఇచ్చింది. అవే అర్హతల ప్రామాణికంగా సాక్షిలో కూడా ఉద్యోగాలు పొందారు. వాటిని పరిగణలోకి తీసుకుని ఇటు ప్రభుత్వంలోనూ అటు ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ వారికి సముచిత స్థానం కల్పించారు. ఈ విషయంలో టీడీపీ, ఈనాడు చేస్తున్నవి అడ్డగోలు వాదనలని ఇక్కడే తేలిపోతోంది. ♦ ఓ కార్పొరేషన్‌గా ఏపీడీసీ వివిధ విభాగాల నుంచి ఆదాయాన్ని కూడా ఆర్జిస్తోంది. అన్ని ప్రభుత్వ విభాగాలూ ఏపీడీసీ సేవలను, డిజిటల్ స్పేస్‌లో అనుభవాన్ని ఉపయోగించుకోవాలని సాధారణ పరిపాలన శాఖ సూచించింది. ఏపీడీసీ ఖర్చు చేసే ప్రతి రూపాయికీ లెక్క ఉంటుంది. ♦ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసే యత్నాలను తీవ్రంగా పరిగణిస్తున్న ఏపీడీసీ సంబంధిత వ్యక్తులు, సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకునే యోచనలో ఉంది. ♦ గతంలో చంద్రబాబు హయాంలో ఏర్పాటైన ఏపీ కంటెంట్ కార్పొరేషన్ పేరును మారుస్తూ జారీ చేసిన జీవో 19 ద్వారా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఇదేమీ ఇవాళ కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్ కాదు. ఏపీడీసీ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ కార్యక్రమాలకు బహుళ ప్రాచుర్యం కల్పించడం, ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం, ప్రభుత్వం – ప్రజల మధ్య వారధిగా పనిచేయడం. ♦ రాష్ట్ర ప్రభుత్వం సహా అన్ని విభాగాల తరపున ఏపీడీసీ ప్రకటనలు రూపొందిస్తుంది. ప్రభుత్వాధి నేతగా, ప్రభుత్వ సారథిగా, ఆ కార్యక్రమాల రూపకర్తగా ముఖ్యమంత్రి ఈ ప్రకటనలన్నింటిలోనూ కనిపిస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఇదేమీ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకం కాదు. దీనిపై విమర్శలు చేయడం వెనుక ఆంతర్యం కేవలం బురద జల్లడమే. ‘‘డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులు వైకాపా కార్యకర్తలే.. సాక్షికి, ఏపీడీసీకి తేడాలేదు.. ఆ రెండింటి పని జగన్‌కు బాకా ఊదడమే’’నంటూ టీడీపీ చేసిన ఆరోపణలను ఒక కథనం రూపంలో 10–10–2023న ‘ఈనాడు’ దినపత్రిక ప్రచురించింది. ఇందులోని అంశాలన్నీ పూర్తిగా నిరాధారమైనవి. నిజాలకు పాతరేస్తూ వక్రీకరణలతో… pic.twitter.com/5RC5M1Gnlo — FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) October 10, 2023 -
విధుల్లో చేరిన రాజమండ్రి జైలు సూపరిండెంట్ రాహుల్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్ రాహుల్ విధుల్లోకి చేరారు. కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో భార్య మృతి చెందడంతో సూపరిండెంట్ రాహుల్ విధులకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. జైలు సూపరిండెండెంట్ భార్య అనారోగ్య కారణాలతో సెలవు పెడితే పచ్చ మీడియా విపరీతార్థాలు తీసింది. దీంతో పచ్చ మీడియా తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ భార్య ఎస్ రాహుల్ భార్య కిరణ్మయి(46) ఈ నెల 15న మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్మయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతదేహాన్ని అంబులెన్సులో గుంటూరు తీసుకెళ్లారు. భార్య అనారోగ్యం కారణంతో జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవులపై వెళ్లారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నేపథ్యంలో ఒత్తిడిపై రాహుల్ సెలవులపై వెళ్లారని పలువురు దుష్ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఎస్పీ జగదీష్ స్పందిస్తూ ఆ వార్తలను కొట్టిపారేశారు. భార్య అనారోగ్యం కారణంగానే ఆయన సెలవుపై వెళ్లారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన అవాస్తవ కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఒత్తిళ్లు లేవని, తమ డ్యూటీ తాము చేస్తున్నానమని స్పష్టం చేశారు. -
ఎగుమతుల పెంపునకు ప్రోత్సాహకాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: ఎగుమతుల పెంపు లక్ష్యంగా రాబోయే 2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో విద్యుత్ సుంకం మాఫీ, సులభతర రుణ లభ్యత వంటి సహాయక చర్యలను ప్రకటించాలని ఎగుమతిదారులు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల ఉపశమన (ఆర్ఓడీటీఈపీ) పథకం రీయింబర్స్మెంట్ కోసం మాత్రమే కాకుండా, ఎగుమతుల పెంపు లక్ష్యంగా ఇతర కార్యక్రమాల కోసం కూడా తగిన నిధులను వాణిజ్య మంత్రిత్వశాఖకు ఆర్థికశాఖ అందజేయాలని ఎగుమతిదారులు కోరుతున్నారు. ఆర్ఓడీటీఈపీ కింద వివిధ కేంద్ర– రాష్ట్ర సుంకాలు, ఇన్పుట్ ఉత్పత్తులపై వసూలు చేసిన పన్నులు, లెవీలను తిరిగి ఆయా ఎగుమతిదారులకు చెల్లించడం జరుగుతుంది. ఎగుమతులను పెంచడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి కస్టమ్స్ సుంకాలలో కొన్ని మార్పులు, తగిన వడ్డీరేటులో రుణ లభ్యత అవసరమని ఈ రంగంలో నిపుణులు సూచిస్తున్నారు. భారత్ గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల విలువ 400 బిలియన్ డాలర్లు. 2022–23లో 450 బిలియన్ డాలర్ల లక్ష్యం. ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఈ లక్ష్య సాధనపై సందేహాలు నెలకొన్నాయి. ఎకానమీలో కీలకపాత్ర... దేశ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి ఎగుమతులు కీలకమైన చోదకమని, ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను బడ్జెట్లో ప్రస్తావించాలని ముంబైకి చెందిన ఎగుమతిదారు, ది బాంబే టెక్స్టైల్ రీసెర్చ్ అసోసియేషన్ చైర్మన్ ఎస్ కె సరాఫ్ పేర్కొన్నారు. ‘‘తమ ఉత్పత్తిలో 50 శాతానికి పైగా ఎగుమతి చేస్తున్న యూనిట్లకు విద్యుత్ సుంకాన్ని మినహాయించే విధానాన్ని బడ్జెట్ అందించాలి. ఉత్పత్తిలో 50 శాతానికి పైగా ఎగుమతి చేసే తయారీదారు ఎగుమతిదారులకు 2 శాతానికి సమానమైన పరిహారాన్ని మంజూరు చేయాలి. ఎగుమతిదారులు ఆర్థిక ఇబ్బందుల భర్తీకి ఇది దోహదపడుతుంది. ఈ పరిహారాన్ని ప్రోత్సాహకంగా పరిగణించకూడదు’’ అని సరాఫ్ సూచించారు. ఎగుమతుల రంగం అధిక నాణ్యతతో కూడిన ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. సాంకేతికత, నాణ్యత స్పృహ, మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఈ రంగం ప్రోత్సహిస్తోందని కూడా ఆయన అన్నారు. ‘భారత్ వస్తు, సేవల ఎగుమతులు 2021–22 ఆర్థిక సంవత్సరం జీడీపీలో 21.5 శాతంగా ఉన్నాయి. ఆసియాలోని చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలలో నమోదవుతున్న 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఎగుమతుల సగటుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. బ్యాంకింగ్, షిప్పింగ్, బీమా, టూరిజం వంటి అనేక రంగాల నుంచి సేవల పరమైన ఎగుమతులకు ప్రోత్సాహకాలు అవసరం’’ అని కూడా ఆయన ఈ సందర్భంగా విశ్లేషించారు. కాగా, లూథియానాకు చెందిన హ్యాండ్ టూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్సి రాల్హాన్ మాట్లాడుతూ, ఆధునిక మౌలిక సదుపాయాలతో సెక్టార్–నిర్దిష్ట క్లస్టర్లు లేదా పార్కులను ఏర్పాటు చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ తగినన్ని నిధులను అందించాలని కోరారు. ఇది తయారీదారుల పోటీతత్వాన్ని పెంచడానికి సహాయపడుతుందని అన్నారు. ఆఫ్రికా వంటి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో భారీ ఎగుమతి సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఎగ్జిబిషన్లు, ఫెయిర్లను నిర్వహించడానికి కూడా నిధులు మంజూరు చేయాలనీ ఆయన కోరారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన 2023–24 బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పిస్తారని భావిస్తున్న సంగతి తెలిసిందే. -
టీచర్ల విధుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
ఆయుధాలు ఇవ్వాల్సిందే.. తెలంగాణ సర్కార్‌కు అల్టిమేటం
సాక్షి, హైదరాబాద్: ఎఫ్ఆర్వో శ్రీనివాసరావుపై దాడి ఘటనతో.. అటవీశాఖ సిబ్బంది డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఆయుధాలు ఇస్తేనే తాము విధులు నిర్వహిస్తామంటూ స్పష్టం చేస్తున్నారు వాళ్లు. ఈ క్రమంలో రేపటి నుంచి(గురువారం) నుంచి విధుల బహిష్కరణకు ఫారెస్ట్ సిబ్బంది పిలుపు ఇచ్చారు. పోలీసులకు ఇచ్చినట్లే ప్రభుత్వం తమకూ ఆయుధాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఫారెస్ట్ సిబ్బంది. స్పష్టమైన హామీ ఇస్తేనే విధులకు హాజరు అవుతామని తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు వాళ్లు. దీంతో.. తెలంగాణ ప్రభుత్వం ఏదైనా ప్రకటన ఇస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే.. ఖమ్మం ఈర్లపుడిలో గుత్తికోయల దాడిలో మరణించిన శ్రీనివాసరావుకు అంత్యక్రియలు ఇవాళ(బుధవారం) ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరుకాగా.. ఫారెస్ట్ సిబ్బంది తమ నిరసన తెలియజేయడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆరు నెలల క్రితమే గోత్తి కోయలు, శ్రీనివాసరావు హత్యకు ప్లాన్ చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అక్కడి అటవీశాఖ సిబ్బంది. తనకు ప్రాణహాని ఉందని పలుమార్లు ఆయన తమ వద్ద ప్రస్తావించిన అంశాన్ని సైతం వాళ్లు లేవనెత్తారు. ఫారెస్ట్ సిబ్బందిపై దాడుల అంశాన్ని చాలాకాలంగా ప్రభుత్వాల ముందు ఉంచుతున్నామని, ఈ పర్వంలో శ్రీనివాసరావు మృతి ఆఖరిది కావాలంటూ నినాదాలు చేశారు వాళ్లు. ఈ క్రమంలో దాడులను నిరసిస్తూ ఫారెస్టు సిబ్బంది ఆందోళన చేపట్టారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేయడంతో పోలీసులు వాళ్లను అడ్డుకునే యత్నం చేశారు. -
Queen Elizabeth II: మహారాణి రాయల్ డ్యూటీస్ కుదింపు
లండన్: ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ అనుభవించనంత వైభవాన్ని బ్రిటీష్ సామ్రాజ్యపు మహారాణి క్వీన్ ఎలిజబెత్. ఎంతలా అంటే.. బ్రిటన్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ(Democracy) వచ్చినా.. ఆమె కుటుంబం రాయల్ డ్యూటీస్ అనుభవిస్తోంది. అయితే తాజాగా అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. క్వీన్ ఎలిజబెత్ రాయల్ డ్యూటీస్ ను తగ్గించేశారు. రాజకుటుంబ వార్షిక నివేదికలో రాణి రాయల్ డ్యూటీస్ ను తగ్గించిన విషయాన్ని పేర్కొన్నారని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. రాజకుటుంబం తరపున తప్పనిసరిగా ఆమె హాజరు కావాల్సిన కార్యక్రమాలకు ఇక నుంచి ఆమె దూరంగా ఉండనున్నారు. ఎలిజబెత్ రాణి విధులను సర్దుబాటు చేయడం గత దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. క్వీన్ ఎలిజబెత్ వయసు 96 సంవత్సరాలు. గత ఫిబ్రవరిలో ఆమె కరోనా బారిన పడి కోలుకున్నారు. ఆమె కోసం నిర్వహించిన ప్లాటినం జుబిలీ వేడుకులకు కూడా... వయసు ఇబ్బందుల కారణంగా ఆమె హాజరు కాలేకపోయారు. సెయింట్ పాల్ కేథడ్రల్ లో జరిగిన థ్యాంక్స్ గివింగ్ సర్వీసుకు కూడా ఆమె హాజరు కాలేదు. వయసు పెరిగిన నేపథ్యంలో, రాణికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఆమె విధులను కుదించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ప్రతి ఈవెంట్ కు తాను వ్యక్తిగతంగా హాజరు కాలేనప్పటికీ... తన హృదయం ఎల్లప్పుడూ మీ అందరితో ఉంటుందని ఎలిజబెత్ రాణి ఇటీవల తెలిపారు. తన కుటుంబ సహకారంతో తన శక్తి మేరకు మీకు సేవ చేస్తానని ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు కూడా. -
విధులకు రాం.. జీతం మింగేస్తాం
టౌన్‌ప్లానింగ్ విభాగంలో చైన్‌మ్యాన్‌గా పనిచేస్తున్న సూర్యనారాయణ దాదాపు 8 నెలలుగా పత్తాలేడు. జీతం మాత్రం నెలనెలా దాదాపు రూ. 25 వేలకు పైగా ఠంచనుగా ఆయన ఖాతాకు చేరుతోంది. కారుణ్య నియామకం కింద ఉద్యోగం సంపాదించుకున్న ఈయన విధులకే హాజరుకావడం లేదు. సెలవులకూ దరఖాస్తు చేసుకోలేదు. సంబంధిత విభాగం అధికారి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.ఇంజినీరింగ్ విభాగంలో ఏకైక వర్క్ ఇన్స్పెక్టర్గా ఉన్న మాధవరెడ్డి కొన్ని నెలల క్రితం దిశ యాక్టు కింద కేసు నమోదు కావడంతో అరెస్ట్ అయ్యాడు. అనేక సంవత్సరాలుగా ఉద్యోగానికి రాకపోయినా అధికారులు పట్టించుకోలేదని, దీంతో అమ్మాయిలకు వల వేయడమే పనిగా పెట్టుకున్న ఇతని బండారం చివరికి ఓ బాధితురాలి ఫిర్యాదుతో బయటపడిందని నగరపాలక సంస్థలో చర్చించుకుంటున్నారు. అనంతపురం సెంట్రల్: నగరపాలకసంస్థలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉద్యోగులు తయారయ్యారు. సంబంధిత విభాగపు అధికారిని ప్రసన్నం చేసుకుంటే చాలు ఉద్యోగానికి వచ్చినా రాకపోయినా అడిగే నాథుడు లేరనే ధీమాతో పలువురు ఉన్నారు. పింఛన్ విభాగంలో ఓ రెగ్యులర్ అటెండర్ ఉద్యోగానికి సంవత్సరాల పాటు రాకపోవడంతో ‘సాక్షి’లో కొన్ని రోజుల క్రితం కథనం వెలువడింది. దీంతో ఆయన ఇటీవల కాలంలో చుట్టపుచూపుగానైనా వస్తున్నారు. అయితే, ఇలాంటి అధికారులు నగరపాలకసంస్థలో కోకొల్లలుగా ఉన్నారని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయా విభాగాలకు చెందిన అధికారులను మచ్చిక చేసుకుని విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలిసింది. కార్యాలయానికి ఉదయం వచ్చే అధికారుల్లో సగం మంది మధ్యాహ్నానికల్లా కనిపించడం లేదు. కింది స్థాయి సిబ్బందిపై నిఘా లేకపోవడంతో ఇతరత్రా ప్రైవేటు కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. కొంతమంది కార్యాలయంలోనే వేరే విభాగాల్లో పనులు చేయిస్తూ దళారుల అవతారం ఎత్తుతుంటే, మరికొందరు రియల్ ఎస్టేట్, ఇతరత్రా పనులు చేసుకుంటున్నట్లు సమాచారం. చాలా నెలలుగా ఇదే పరిస్థితి. కొత్త కమిషనర్ భాగ్యలక్ష్మి దృష్టి సారిస్తే ఉద్యోగులు దారికొస్తారని పలువురు చెబుతున్నారు. సార్ తిట్టాడని రాలేదు విధులకు సక్రమంగా రాకపోవడంతో చైన్‌మ్యాన్ సూర్యనారాయణను గతంలో ఉన్న కమిషనర్ తిట్టారు. దీంతో ఆయన విధులకు రావడం లేదు. ఎలాంటి సెలవు కూడా పెట్టలేదు. దీనిపై అదనపు కమిషనర్‌కు రిపోర్టు చేశాం. సీసీఏ రూల్స్ ప్రకారం అతనిపై చర్యలు ఉంటాయి. – శాస్త్రి, ఏసీపీ, టౌన్‌ప్లానింగ్ (చదవండి: రోజూ చిల్లరకొట్టుకు వస్తూ.. నిర్వాహకుడి కూతురిని ట్రాప్ చేసి..) -
శభాష్ తహసీల్దార్
మునుగోడు: వైకల్యం శరీరానికి తప్ప మనసుకు కాదని నల్లగొండ జిల్లా మునుగోడు తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు నిరూపిస్తున్నారు. ఆయన వీల్ చైర్లోనే విధులు నిర్వహిస్తున్నారు. పుట్టుకతోనే దివ్యాంగుడైన ఆయన గతంలో మునుగోడు డీటీగా పనిచేశారు. ఆరు నెలల క్రితం తహసీల్దార్‌గా పదో న్నతి పొంది ఇక్కడే పనిచేస్తున్నారు. సోమవారం మండలంలోని చొల్లేడు గ్రామంలో బృహత్ ప్రకృతివనం ఏర్పాటుకు అధికారులు చేపట్టిన భూ పరిశీలనకు ఆయన వీల్ చైర్లో హాజరయ్యారు. -
ఏపీ: విధులకు హాజరవ్వని వైద్యులపై చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కొందరు వైద్యులు అనేక ఏళ్లుగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్నారు. వీరందరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల అధిపతులకు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.రవిచంద్ర ఆదేశాలు జారీ చేశారు. వారి జాబితా తక్షణమే పంపించాలని స్పష్టం చేశారు. డిప్యుటేషన్‌పై ఇతర విభాగాల్లో ఉంటూ.. గడువు ముగిసినా ఇంకా అక్కడే కొనసాగుతున్న వారిని కూడా సొంత శాఖకు పిలిపించాలని ఆదేశించారు. ఎలాంటి సమాచారం లేకుండా అనధికారికంగా సెలవుపై ఉన్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. బదిలీ జరిగినా కదలడం లేదు.. కొంతమంది వైద్యులు, స్టాఫ్ నర్సులు డిప్యుటేషన్ రద్దయినా.. కదలకుండా అక్కడే కొనసాగుతూ వేతనాలు తీసుకుంటున్నారు. పదోన్నతులు పొంది బదిలీ అయినా.. వెళ్లడం లేదు. తాజాగా ఆరుగురు ప్రొఫెసర్లకు అదనపు సంచాలకులుగా పదోన్నతి ఇచ్చారు. ఇందులో ఒక్కరు మాత్రమే(విశాఖ కింగ్‌జార్జి ఆస్పత్రిలో) విధుల్లో చేరారు. మిగతా ఐదుగురు విధుల్లో చేరకుండా పాత చోటే ఉన్నారు. ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు, ఎవరు ఎక్కడ వేతనం తీసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి వారందరిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే.. హెచ్‌వోడీలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
ఏళ్ల తరబడి తిష్ట: కదలరు.. వదలరు!
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీలో ఉద్యోగం వచ్చిందంటే చాలు.. ఆ కుర్చీని వదిలేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. కీలమైన ఉద్యోగి ఏదైనా అక్రమాలకు పాల్పడినప్పుడు కదల్చాలని ప్రయత్నించినా ‘మేనేజ్’ చేసుకుంటూ ఏళ్ల తరబడి పాతుకుపోతున్నారు. అవకతవకలకు పాల్పడుతూ కొంతమంది ఉద్యోగులు చక్రం తిప్పుతున్నారు. రిటైర్ అయ్యే చివరి క్షణం వరకు చేయిచాపే పనులు కొనసాగిస్తున్నారు. కాంట్రాక్టర్లను బినామీలుగా మార్చుకుంటూ కార్పొరేషన్ ఖజానాను దోచేస్తున్నారు. మహా విశాఖ నగర పాలక సంస్థ రాష్ట్రంలో అతి పెద్ద కార్పొరేషన్. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతో కలిపి అత్యధిక మంది విధులు నిర్వర్తిస్తున్న కార్పొరేషనూ ఇదే. ఏటా రూ.150 నుంచి రూ.300 కోట్ల కార్పొరేషన్ నిధులతో పాటు, వివిధ గ్రాంట్లతో కలిపి మొత్తం రూ.వెయ్యి కోట్లకు పైగానే పనులు జరుగుతుంటాయి. అందుకే ఇక్కడి నుంచి వేరే కార్పొరేషన్‌కు బదిలీపై వెళ్లాలన్నా, తాము పనిచేస్తున్న జోన్ నుంచి వేరే జోన్‌కు వెళ్లాలన్నా కొందరు అధికారులు ఇష్టపడటం లేదు. ఫలితంగా అవకతవకలు, అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. సాధారణంగా కార్పొరేషన్లో ఒక చోట మూడు నుంచి మూడున్నరేళ్లు మాత్రమే పనిచెయ్యాలి. టీడీపీ ప్రభుత్వ హయాంలో బదిలీ జీవోలు వచ్చినా వాటిని తొక్కిపెట్టి అక్కడే విధులు నిర్వర్తించేవారు. ప్రస్తుతం కూడా చాలా జోన్లలో ఏళ్లతరబడి పాతుకుపోయినవారే పనిచేస్తున్నారు. చివరి రోజుల్లో ఉద్యోగ జీవితం ప్రశాంతంగా ఉండాలని, అవినీతి మరక పడకూడదని అంతా అనుకుంటారు. కాని జీవీఎంసీలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇందుకు ఉదాహరణ ఈ నెల 30న పదవీవిరమణ పొందనున్న జీవీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడమే. చివరి నిమిషం వరకూ దోచుకోవాలనే దాహంతో కొందరు ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. పదోన్నతులు వదులుకుంటూ..? ఎవరైనా ఉద్యోగికి పదోన్నతి వస్తే ఎగిరి గంతేస్తారు. ప్రమోషన్ వచ్చిన చోటికి ఆగమేఘాల మీద వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తారు. కాని కార్పొరేషన్లో పనిచేసే ఉద్యోగులు మాత్రం ప్రమోషన్ వచ్చినా పట్టించుకోరు. దాన్ని వదులుకొని జీవీఎంసీలోనే కొనసాగేందుకు లాబీయింగ్ చేస్తూ ప్రమోషన్‌ను సైతం రద్దు చేసుకుంటున్నారు. ప్రధాన కార్యాలయంలో ఆర్వో గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి రెండేళ్ల క్రితం అసిస్టెంట్ కమిషనర్‌గా పదోన్నతి లభించింది. ఈ పదోన్నతి తీసుకుంటే వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లాలి. కాని తన పలుకుబడితో ప్రమోషన్‌ను రద్దు చేయించుకొని కార్పొరేషన్లోనే ఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే మాదిరిగా ఓ మహిళా ఉద్యోగి కూడా ప్రమోషన్‌ను వదులుకొని ఇక్కడే పనిచేస్తున్నారు. బదిలీ అయినా నెలరోజ్లులోనే తిరిగి ఇక్కడ పోస్టింగ్ సంపాదించుకుంటూ అదే కుర్చీకి ఇంజినీర్లు అతుక్కుపోతున్నారు. ఐదుగురు ఇంజినీర్లు ట్రాన్స్‌ఫర్‌పై అలా వెళ్లి ఇలా తిరిగి వచ్చేశారు. మెకానికల్ విభాగంలో ఓ ఇంజినీరింగ్ అధికారికి డీఈ హోదా పదోన్నతి లభించినా.. దాన్ని డీగ్రేడ్ చేసుకొని ఏఈగానే కొనసాగుతున్నారంటే ఆ పోస్టు ఎంత లాభసాటిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా జరిగిన ఏసీబీ దాడులతో ఇంజినీరింగ్ విభాగంలో దడపుడుతోంది. ఏసీబీ వలలో చిక్కిన ఈఈకి ఇద్దరు బినామీ కాంట్రాక్టర్లు కూడా ఉన్నట్టు తెలిసింది. ఈ ఇద్దరు కాంట్రాక్టర్లు ఓ ఇంజినీరింగ్ అధికారికి సైతం బినామీలుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇలా కార్పొరేషన్లో తిష్టవేసిన అధికారులే ఇష్టారాజ్యంగా పనిచేస్తూ నిజాయితీగా పనిచేస్తున్న వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్గత బదిలీలకు శ్రీకారం చుట్టి కార్పొరేషన్ని ప్రక్షాళన చేస్తే కొంతవరకు అవినీతిని అరికట్టవచ్చని భావిస్తున్నారు. మెకానికల్ మాయాజాలం ఇక మెకానికల్ విభాగమంటే.. జీవీఎంసీ కమిషనర్ సైతం చేతులెత్తేసే పరిస్థితి దాపురించింది. ఎవరిని మార్చినా ఆ అధికారులు వారందర్నీ ఏమార్చి కమిషన్ల వేట కొనసాగిస్తున్నారు. మెకానికల్‌లో ఓ ఇంజినీరింగ్ అధికారి కాంట్రాక్ట్‌ల విషయంలో చక్రం తిప్పుతున్నారు. టీడీపీ హయాంలో ఓ ఎమ్మెల్యేకు అనుచరుడిగా ఉంటూ ఇప్పటికీ వారు చెప్పిందే వేదంగా పనులు సాగిస్తున్నారు. 30 ఏళ్లుగా కార్పొరేషన్లో పనిచేస్తూ ఇంజినీర్ హోదాకు వచ్చిన ఆ అధికారి మెకానికల్‌లో ఉన్న లొసుగుల్ని క్యాష్ చేసుకుంటున్నారు. టెండర్ల విషయంలో కమిషనర్‌ను సైతం తప్పుదారి పట్టించి తాము చెప్పిందే వేదమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని నెలల క్రితం జీవీఎంసీ కమిషనర్ ఈ విభాగంలో అంతర్గత బదిలీలు చేసినా మార్పు మాత్రం కనిపించడం లేదు. వారు చెప్పిందే వేదం ఓ స్థాయి పదోన్నతి లభిస్తే చాలు.. ఆ కుర్చీ నుంచి కదిలేందుకు ససేమిరా అంటున్నారు. ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తూ.. అందులో లోటుపాట్లు, ఇతర విషయాలపై పూర్తి పట్టుసాధించి శాసిస్తున్నారు. ఉన్నతాధికారులను సైతం ఏమార్చుతూ అవకతవకలకు పాల్పడుతున్నారు. ఎటువైపు నుంచి కార్పొరేషన్‌కు ఆదాయం వస్తుంది, తమ జేబులు ఎలా నింపుకోవాలన్న ఆలోచనతోనే వీరు పనిచేస్తున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో ఓ అధికారి కొన్నేళ్ల క్రితం అ..ఆ..ల నుంచి ప్రారంభించి ఇప్పుడు అన్నీ తానే అనే స్థాయికి ఎదిగిపోయారు. ఆయనను బదిలీచేస్తూ గతంలో జీవోలు వచ్చినా తన పలుకుబడితో అమలుకాకుండా చూసుకున్నారు. యూసీడీ విభాగంలో సూపరింటెండెంట్ హోదాలో పనిచేస్తున్న ఉద్యోగి సైతం అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు. ఉన్నతాధికారి అండతో తోపుడు బళ్ల వ్యాపారుల వద్ద నుంచి లక్షలు గుంజుకుంటూ పంచుకుంటున్నారు. చదవండి: అంతా మా ఇష్టం: అక్కడవన్నీ ‘వెలగపూడి’ ఫుడ్‌కోర్టులే.. వాహన పన్ను చెల్లింపు గడువు పొడిగింపు -
బాబోయ్ ఆ డ్యూటీలా.. వద్దే వద్దు
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ పోలీసు కమిషరేట్‌లో పోస్టు అంటే ఏ పోలీసు అధికారి అయినా ఎగిరి గంతేస్తారు. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ పరిస్థితి ఉంది. లా అండ్ ఆర్డర్ విభాగంలో పనిచేయలేమని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. అవసరమైతే లూప్లైన్లో పనిచేయడానికైనా సిద్ధమంటున్నట్లు తెలుస్తోంది. తీరిక లేని విధులే ఇందుకు కారణమని సమాచారం. ప్రస్తుత పని విధానం.. ప్రతిరోజు డ్యూటీలో చేరిన వెంటనే టెలీ కాన్ఫరెన్స్‌కు హాజరు కావాలి. తరువాత స్టేషన్ పరిధిలో అప్పటి వరకు ఉన్న కేసులు పరిశీలించడంతో పాటు వీఐపీల రాక వంటి బాధ్యతలు చూసుకోవాలి. సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్, మళ్లీ రాత్రికి వాహనాల తనిఖీ, వీటితో పాటు నిత్యం స్టేషన్లకు వచ్చే కేసుల దర్యాప్తు ఉండనే ఉంటుంది. వీటితో వీక్లీ ఆఫ్‌లు సరిగా వినియోగించుకోలేని పరిస్థితి. కొత్తగా స్టేషన్లలో విధుల్లో ఉన్న యువ ఎస్‌ఐలూ మా వల్ల కాదంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ విభాగం పరిధిలోని స్టేషన్లలో కొందరు ఉన్నతాధికారులు రెండేళ్లుగా పనిచేస్తున్నారు. వీరంతా కొంత కాలంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. ఎందుకీ పరిస్థితి.. నగర కమిషనరేట్ పరిధిలో చిన్నచిన్న ఘటనలపైనా మినిట్ టూ మినిట్ వాకబు ఉంటోంది. అధికారులు ఫోన్లలోనే పరిస్థితిని సమీక్షిస్తారు. చిన్న పొరపాట్లకు చార్జీ మెమోలు జారీ. దీంతో మానసిక వేదనకు గురవుతున్నట్లు చెబుతున్నారు. పోలీసు బాస్‌లు మారిన ప్రతిసారి ఆయా పోలీసు అధికారుల తీరు నచ్చకపోతే వారి స్థానంలో కొత్త వారు రావడం సహజంగా జరిగే పనే. అయితే ప్రస్తుతం పనితీరు బాగున్నా కొందరు అధికారులను తప్పించేందుకు కొందరు పావులు కదుపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ నగరంలో కీలకమైన ఓ జోన్ పరిధిలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఉన్నతాధికారి ఒకరు ఇటీవల తాను శాంతిభద్రతల విభాగంలో పనిచేయలేనని ఓ ఉన్నతాధికారికి తేల్చిచెప్పగా.. మరో అధికారి ఆ జోన్లో ఫోకస్ పోస్ట్ వద్దు బాబోయ్.. లూప్లైన్లో పనిచేస్తానని ఉన్నతాధికారి వద్ద మొర పెట్టుకున్నట్లు తెలిసింది. ఇలా నగర కమిషనరేట్ పరిధిలో పలువురు అధికారులు లూప్లైన్లో పనిచేయడానికి ఇంటెలిజెన్స్, టాస్క్‌ఫోర్స్, ఎస్బీ విభాగాలకు దరఖాస్తు చేసుకునేందుకు క్యూ కడుతున్నట్లు తెలిసింది. పోలీసులపై ఒత్తిడి లేదు.. నగర కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసులపై ఎలాంటి ఒత్తిడి లేదు. అందరూ సమన్వయంతో పనిచేయాలంటున్నాం. విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చాం. ప్రస్తుతం పోలీసులు సమర్ధవంతంగా పనిచేయడం వలనే పెండింగ్‌లో ఉన్న 10 వేల కేసులను నాలుగు వేలకు తీసుకురాగలిగాం. పోలీసుల పనితీరు వల్లే ఇది సాధ్యమైంది. పనితీరు బాగాలేకపోతే వారి స్థానంలో కొత్త వారు వస్తారు. –బత్తిన శ్రీనివాసులు, నగర పోలీసు కమిషనర్, విజయవాడ -
డ్రాగన్ దూకుడు : భారత్ దిగుమతులపై సుంకాల పొడిగింపు
బీజింగ్ : భారత్‌లో తయారయ్యే ఆప్టికల్ ఫైబర్‌పై యాంటీ డంపింగ్ టారిఫ్‌ను చైనా పొడిగించినట్టు విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ఈ సుంకాలు మరో ఐదేళ్ల పాటు అమల్లో ఉంటాయి. భారత్‌లో ఉత్పత్తయ్యే ఆప్టికల్ ఫైబర్‌పై ఆగస్ట్ 14 నుంచి ఐదేళ్ల పాటు యాంటీ డంపింగ్ డ్యూటీలు వర్తిస్తాయని బీజింగ్ పేర్కొంది. ఈ ప్రకటనలో పలు భారతీయ కంపెనీల పేర్లను డ్రాగన్ ప్రస్తావించింది. భారత తయారీదారులకు అనుగుణంగా ఈ సుంకాలు 7.4 శాతం నుంచి 30.6 శాతం దాకా ఉంటాయని చైనా పేర్కొంది. ఇండో-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో యాంటీ డంపింగ్ డ్యూటీల పొడిగింపుపై డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. యాంటీ డంపింగ్ సుంకాలను తొలగిస్తే చైనా పరిశ్రమలకు కలిగే నష్టాన్ని అంచనా వేసి విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది. చైనా, మలేషియా, తైవాన్‌ల నుంచి బ్లాక్టోనర్ దిగుమతులపై యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాలని భారత్ ప్రతిపాదించిన నేపథ్యంలో చైనా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 23న చైనా, దక్షిణ కొరియా, వియత్నాం నుంచి దిగుమతయ్యే కొన్ని ఉక్కు ఉత్పత్తుల దిగమతులపైనా భారత్ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది. చదవండి : చైనా కంపెనీల మనీలాండరింగ్ రాకెట్ -
కానిస్టేబుల్ ప్రాణాన్ని కాపాడిన పర్సు!
ఫిరోజాబాద్: కొన్ని నాణేలు, నాలుగు ఏటీఎం కార్డులు, ఒక శివుడి ఫొటో ఉన్న పర్సు ఓ కానిస్టేబుల్ ప్రాణాన్ని కాపాడింది. అదెలా అనుకుంటున్నారా? పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో జరుగుతున్న ఆందోళనల్లో కానిస్టేబుల్ విజేందర్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. ‘ఆందోళనకారులెవరో కాల్పులు జరిపారు. దీంతో దూసుకొచ్చి న బుల్లెట్ నా జాకెట్ నుంచి చొచ్చుకుపోయి నా జేబులో ఉన్న పర్సులో చిక్కుకుపోయింది. పర్సులో కొన్ని నాణేలు, ఏటీఎం కార్డులు, శివుని ఫొటో ఉన్నాయి. నిజంగా నాకిది పునర్జన్మగా భావిస్తున్నాను’అని విజేందర్ చెప్పారు. -
ఇదేమి ఉద్యోగంరా బాబూ!
విజయనగరం గంటస్తంభం: వారికేం ప్రభుత్వ ఉద్యోగం.. ఆఫీస్‌కు ఇలా వెళ్లి అలా వచ్చేస్తే చాలు... నెలయ్యేసరికి జీతం బ్యాంకు ఖాతాలో పడుతుంది.. ఇదీ సాధారణ జనాల్లో ఉద్యోగులపై ఉన్న భావన. అయితే, ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తీసుకున్నది జీతమే అయినా పగలు, రాత్రనకు పనిచేస్తున్నారు. ఉదయం 9 గంటలకు విధులకు వెళ్తే రాత్రి 10 గంటలైనా ఇంటికి చేరలేకపోతున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దీంతో కుటుంబ జీవనం గతి తప్పి సతమతమవుతున్నారు. సెలవు రోజూ విధులు..! మూడేళ్లగా ఉద్యోగులు తీవ్ర పనిఒత్తిడి ఎదుర్కొంటున్నారు. వరుసగా ఏదో ఒక పని చెప్పడం, లక్ష్యాలు నిర్వేశించి పని చేయాలని ఆదేశించడం, గడువులు విధించడంతో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం సంపూర్ణ బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మార్చి నెలాఖరులోగా ప్రటించాలని ప్రభుత్వం లక్ష్యం విధించడం, కలెక్టర్ అంతకంటే ముందే డిసెంబర్ నాటికి చేయాలని అధికారులు, సిబ్బందిపై ఒత్తిడి తేవడంతో అధికారులు సెలవులు, పగలు, రాత్రి అని తేడా లేకుండా పని చేస్తున్నారు. ఓ విధొంగా చెప్పాలంటే చేయడం లేదు... అధికారులే చేయిస్తున్నారు. ఆదివారం సెలవు దినమని అందరికీ తెలిసిన విషయమేనైనా ఉదయం టెలికాన్ఫరెన్స్, సాయంత్రం 6 గంటలకు వీడియో కాన్ఫరెన్సు పెట్టడంతో మండల స్థాయి అధికారులు మండలాల్లో గడాపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇకరోజూ లక్ష్యాలపై నివేదికలు కోరడంతో పగలంతా గ్రామాల్లో ఉంటున్న అధికారులు రాత్రిపూట నివేదికలు, సాధారణ విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకే ఇంటి నుంచి బయలుదేరిన ఉద్యోగులు రాత్రి 9, 10 గంటల వరకు ఇంటికి చేరడం లేదు. జిల్లా కేంద్రంలో ఉన్న అధికారులు, సిబ్బందికి సైతం సమయంలో మినహాయింపు లేదు. ప్రస్తుతం గృహనిర్మాణశాఖ అధికారులకు కూడా లక్ష్యాలు విధించడంతో పరుగులు తీయాల్సి వస్తోంది. ఇప్పటికే రెవెన్యూ, వెలుగు శాఖల సిబ్బంది పని ఒత్తిడితో నలిగిపోతున్నారు. ఈ ప్రభుత్వంలో ఇంతే..! తెలుగుదేశం ప్రభుత్వంలో ఉద్యోగులకు సుఖముండదు. ఇదీ సాధారణంగా ఉద్యోగుల్లో నెలకొన్న భావన. 2004కు ముందు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి ఉండగా ఇలాగే రాత్రి పగలు పని చేయించారు. ఫలితంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాస్త సేద తీరారు. అలాగని వారి హయాంలో కూడా ఒత్తిడి లేదని చెప్పలేం. అయితే, అది సాయంత్రం వరకు పని వేళలకు పరిమితమయ్యేది. అయితే, ఏడాదిలో ఎప్పుడో వారం పదిరోజులు మాత్రమే రాత్రి వరకు పని చేయాల్సి వచ్చేది. దీంతో అప్పట్లో ఉద్యోగుల్లో ఇంత వ్యతిరేకత లేదు. అయితే 2014లో మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కంటే సర్వేలు ఎక్కువ కావడం, పూటకో నివేదిక కోరడం పరిపాటిగా మారింది. అంతా క్షణాలు, రోజులు, నెలల్లో అయిపోవాలని భావించడంతో భారం ఉద్యోగులపై పడుతుంది. తీవ్ర ఆవేదన... ప్రభుత్వం, ఉన్నతాధికారులు వైఖరిపై ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్ల విషయంలో టార్చర్ అనుభవిస్తున్నామని ఒక ఎమ్పీడీవో తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ఉద్యోగులు పని ఒత్తిడి ఎదుర్కొంటున్నారని మూడురోజుల కిందట కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభూజీ నిరసన తెలిపారు. వ్యవస్థను చూసి బాధగా ఉందని, ఇదేం వ్యవస్థ అని ఒక ఇంజినీరింగ్ అధికారి నిట్టూర్చడం విశేషం. ఇకపోతే అందరూ ఉద్యోగులు ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్యాలు విధించడంతో తమ కుటుంబాలకు దూరమవుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు కొంచెం ఆలోచించి ప్రభుత్వం విధించిన సమయాల్లో పని చేయించాలని కోరుతున్నారు. -
చైనా దిగుమతులకు చెక్
న్యూఢిల్లీః విదేశాల నుంచి చౌక దిగుమతులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చైనా నుంచి దిగుమతి అయ్యే కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తులపై అదనపు దిగుమతి పన్ను విధించింది. దిగుమతుల నుంచి దేశీయ స్టీల్ తయారీదారులకు ఉపశమనం కలిగించేలా కొన్ని హాట్రోల్డ్,కోల్డ్ రోల్డ్ స్టెయిన్లెస్ స్టీల్ దిగుమతులపై 18.95 శాతం అదనపు పన్ను విధించినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. చైనా నుంచి వెల్లువెత్తుతున్న ఈ దిగుమతులతో దేశంలో స్టెయిన్లెస్ స్టీల్ పరిశ్రమ సంక్షోభం ఎదుర్కొంటున్నదని, దీన్ని నివారించేందుకు దిగుమతులపై అదనపు పన్ను విధించినట్టు తెలిపాయి. ,చైనా, జపాన్, దక్షిణ కొరియాల నుంచి స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్ దిగుమతులపై భారత్ ఇప్పటికే యాంటీ డంపింగ్ సుంకాలను విధించింది. -
అమ్మో... అమరావతి డ్యూటీయా!
►బెంబేలెత్తిపోతున్న పొరుగు జిల్లాల పోలీసులు ►రాజధానిలో ట్రాఫిక్, బందోబస్తులకు పదేసి రోజుల డ్యూటీలు ►కడుపునిండా తిండి, కంటి నిండా నిద్రలేక అవస్థలు ►అనారోగ్యం పాలవుతున్నా ప్రభుత్వానికి పట్టని వైనం ►కనీస వసతులు సమకూర్చని సర్కారు అమరావతి : ఏపీ రాజధాని అమరావతిలో డ్యూటీ అంటే పొరుగు జిల్లాల పోలీసులు బెంబేలెత్తి పోతున్నారు. రాజధానిలో ట్రాఫిక్, ఎస్కార్ట్, బందోబస్తు తదితర విధుల కోసం వస్తున్న కానిస్టేబుళ్లకు సర్కారు కనీస సౌకర్యాలు సమకూర్చకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒక్కొక్కరు పదేసి రోజులు డ్యూటీ చేయాల్సి రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీసులకు ఇక్కడ డ్యూటీలు వేస్తున్నారు. రాష్ట్ర విభజన నాటికి రాష్ట్రంలో సుమారు 17వేల పోలీస్ సిబ్బంది కొరత ఉంది. దీంతో గడిచిన మూడేళ్లుగా రాష్ట్రంలోని ప్రతి సర్కిల్ నుంచి ఒకరు చొప్పున కేటాయిస్తున్నారు. వీరిని పదేసి రోజుల విధులకు రాజధాని ప్రాంతానికి డిప్యూటేషన్‌పై పంపిస్తున్నారు. 13 జిల్లాల నుంచి పది రోజులకు 878 మంది చొప్పున నెలకు 2,634 మందిని రాజధానిలో రోజువారీ విధులకు కేటాయిస్తున్నారు. వీరు నిత్యం ప్రముఖులు (వీఐపీలు) తిరిగే విజయవాడలో రోడ్లపై ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విధులు నిర్వహిస్తున్నారు. నగరంతో ఏమాత్రం సంబంధం లేని పోలీసులు రోజూ ఎనిమిది గంటలపాటు ట్రాఫిక్ విధులు నిర్వహిస్తూ శ్వాసకోశ సమస్యలతో అనారోగ్యం పాలవుతున్నా పట్టించుకునే నాధుడు లేడు. మరోవైపు రాజధాని ప్రాంతంలో వీఐపీలకు ఎస్కార్ట్, విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం, ఉండవల్లిలో సీఎం నివాసం, వెలగపూడి సెక్రటేరియెట్‌కు వెళ్లే దారిలోనూ పొరుగు జిల్లాల పోలీసులకు డ్యూటీలు వేయడంతో వారి అవస్థలు చెప్పనలవికావు. కనీసం మరుగుదొడ్డి సౌకర్యం కూడా లేని ప్రాంతాల్లో మహిళా కానిస్టేబుళ్ల పరిస్థితి మరీ దయనీయం. విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లే నిందితుల ఎస్కార్ట్‌గా కూడా ఇతర జిల్లాల నుంచి వచ్చిన పోలీసులనే పంపుతుండటంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిండి.. నిద్ర కరువే.. పొరుగు జిల్లాల నుంచి విధి నిర్వహణకు వస్తున్న వారికి ప్రభుత్వం కనీస సౌకర్యాలు సమకూర్చకపోవడంతో సమయానికి తిండి, నిద్రలేక ఆరోగ్యం పాడవుతోందని వారు వాపోతున్నారు. మరోవైపు ఉండేందుకు లాడ్జి రూమ్‌కు రోజుకు కనీసం రూ.500, టిఫిన్, భోజనాలకు రూ.250 సొంత ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పది రోజులకు లాడ్జి, తిండి ఖర్చులు కింద రూ.7500 అవుతోందని కానిస్టేబుళ్లు అంటున్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో విధులకు వెళ్లిన పోలీసులకు అప్పట్లో వసతి సౌకర్యాలు సమకూర్చేవారని గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో విధులు నిర్వర్తించేందుకు పలువురు కానిస్టేబుళ్లు ఆయా జిల్లాల ఉన్నతాధికారుల వద్ద వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. రాజధాని విధుల కోసం జిల్లాల నుంచి పోలీసులు వెళ్లిపోవడంతో తమకు సిబ్బంది కొరత ఉంటుందని పలువురు పోలీస్ అధికారులు చెబుతున్నారు. -
విధి నిర్వహణలో అలసత్వం వద్దు
- పాఠశాలలను శుభ్రంగా ఉంచుకోవాలి - విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి - మెనూ ప్రకారం మధ్యాహ్నభోజనం వడ్డించాలి - ఏ సమస్య ఉన్నా 1100కు ఫోన్ చేయవచ్చు - తరిగోపులలో జిల్లా కలెక్టర్ పర్యటన జూపాడుబంగ్లా : విధి నిర్వహణలో అలసత్వాన్ని సహించబోమని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. పల్లెపిలుపు కార్యక్రమంలో భాగంగా బుధవారం తరిగోపుల గ్రామంలో ఆయన పర్యటించారు. పాఠశాలలు, అంగన్వాడీ, ఆరోగ్య ఉపకేంద్రం, సచివాలయం, ఇందిరమ్మగృహాలను తనిఖీచేశారు. ముందుగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలను తనిఖీచేసి..రిజిష్టర్లను పరిశీలించారు. హాజరుశాతం మెరుగుపర్చాలని ఉపాధ్యాయులకు సూచించారు. మూడోతరగతి చదువుతున్న అశోక్, శివమణి, హేమలతలను అడిగి..ఎక్కాలు చెప్పించుకొన్నారు. శివమణి 13వ ఎక్కం బాగా చెప్పటంతో అభినందించారు. ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అక్కడి విద్యార్థులతో మాట్లాడి వారి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆంగ్లమాధ్యమంలో సోషల్ పుస్తకాన్ని విద్యార్థులతో చదివించారు. విద్యార్థులకు ఇంకా మెరుగైన విద్యను అందించాలని సూచించారు. బయోమెట్రిక్ తీసుకుంటున్నారా? బయోమెట్రిక్ ద్వారా హాజరుశాతం తీసుకుంటున్నారా లేదా అంటూ కలెక్టర్ ఆరాతీశారు. బయోమెట్రిక్ యంత్రం సక్రమంగా పనిచేయటం లేదని హెచ్ఎం మల్లిఖార్జునాచారి పేర్కొనటంతో కలెక్టర్ వెంటనే డీఈఓ తెహరాసుల్తానాకు ఫోన్‌చేసి ప్రశ్నించారు. దీంతో హెచ్ఎం, డీఈఓల మద్య వాడివేడిగా సంభాషణ జరిగింది. పాఠశాలల్లో లెట్రిన్లు శుభ్రంగా ఉంచకపోవటంపై కలెక్టర్.. హెచ్ఎం మల్లిఖార్జునాచారిని సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ముందుగా మంచి పద్ధతులు నేర్చుకోవాలని సూచించారు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలని మందలించారు. పాఠశాలల్లోని బాత్రూంల నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా మహిళలకు అప్పగించాలని సూచించారు. మధ్యాహ్నభోజనాన్ని తనిఖీచేసిన కలెక్టర్.. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని వండిపెట్టాలని నిర్వాహకులకు సూచించారు. పాఠశాలల ఆవరణలోని మైదానాల్లో ఆకుకూరలు, కూరగాయల మొక్కలు నాటుకోవాలని సూచించారు. అందుకుగాను బయోఫెన్సింగ్‌ను మంజూరు చేస్తామన్నారు. త్వరలో మరుగుదొడ్ల బిల్లులు.. గ్రామంలోని అంగన్వాడీ, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఎన్టీఆర్ గృహనిర్మాణాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు.. మరుగుదొడ్లు నిర్మించుకొని రెండేళ్లు గడిచినా బిల్లులు మంజూరు చేయటం లేదని కలెక్టర్‌కు తెలిపారు. త్వరలో బిల్లులు మంజూరయ్యేలా చేస్తామని కలెక్టర్ భరోసానిచ్చారు. గ్రామంలోని ఎస్సీ కాలనీల్లో సిమెంటు రోడ్లు, డ్రెయినేజి నిర్మాణం చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా రైతులకు 70వేల మెట్రిక్ టన్నుల విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పత్తిపంట సాగును తగ్గించుకోవాలని రైతులకు సూచించారు. సమస్యలు ఏమైనా ఉంటే 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఈశ్వర్, ఎంపీడీఓ ఇవి.సుబ్బారెడ్డి, తహసీల్దారు రమణారావు, ఎంపీపీ మంజుల, సర్పంచ్ దీవెనమ్మ, కార్యదర్శి తిప్పన్న, ఏఈలు బషీర్, మహమ్మద్‌హుసేన్, ఐసీడీఎస్ సూపర్వైజర్ కుమారి, గిరీశ్వరరెడ్డి, నారాయణరెడ్డి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఎవరి పని వారే చేయండి
- ఇతరులతో చేయిస్తేనే సమస్యలు - తాజా ప్రగతి నివేదికలు ఇవ్వండి - కలెక్టర్ ఎస్. సత్యనారాయణ - జిల్లా అధికారులతో సమావేశం కర్నూలు(అగ్రికల్చర్): ఎవరికి కేటాయించిన పని వారే స్వయంగా చేస్తే ఏ సమస్యలుండవని, పైగా పరిష్కారం కూడా పక్కాగా ఉంటుందని కలెక్టర్ ఎస్. సత్యనారాయణ అన్నారు. వివిధ జిల్లాల్లో మీ కోసం కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తుల పరిష్కారం 99శాతం ఉందని, మన జిల్లాకు సంబంధించి కొత్తపల్లి, శ్రీశైలం, కొసిగి, తుగ్గలి, పాములపాడు, అవుకు తదితర మండలాల్లో 90శాతానికి మించకపోవడంపై ఆయన ప్రశ్నించారు. ప్రజాపంపిణీ కూడా 81.08 శాతం మాత్రమే ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవ్వరికి అప్పగించిన పనులు వారే స్వయంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. బ్యాంకుల వారీగా అధికారులతో చర్చించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పోరేషన్ల ద్వారా స్వయం ఉపాధి యూనిట్లను వంద శాతం గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు, బ్యాంకర్లు పరస్పర సహకారంతో పనిచేసినపుడే ఇది సాధ్యమవుతుందన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఈ-ఆఫీసులుగా నిర్వహించాలని ఆదేశించిన కలెక్టర్.. కంప్యూటర్ల కొరత ఉంటే కొనుగోలు చేయడానికి ప్రతిపాదనలివ్వాలని ఆదేశించారు. తాజా ప్రగతి నివేదికలు ఇవ్వండి.. సీఎం చంద్రబాబు ఈ నెల 17, 18వతేదీల్లో విజయవాడలో కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్న దృష్ట్యా జిల్లా అధికారులందరూ తమ శాఖలకు సంబంధించి తాజా ప్రగతి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి హామీ పథకం అమలు, పింఛన్ల పంపిణీ, మీ కోసం దరఖాస్తుల పరిష్కారం, మీసేవ కేంద్రాల పనితీరు, రెవెన్యూ అంశాలపై నివేదికలివ్వాలన్నారు. దీపం పథకం కింద రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ గ్యాస్ క¯ðనెక్షన్ ఇవ్వాలని, ఈ దిశగా చర్యలను వేగవంతం చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జేసీ-2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
విధులు బహిష్కరించిన న్యాయవాదులు
కర్నూలు(లీగల్): అనంతపురం జిల్లా రాయదుర్గం కోర్టు న్యాయవాది సునిత హత్యను ఖండిస్తూ కర్నూలు జిల్లా న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించి న్యాయదేవత విగ్రహం వద్ద నిరసన తెలిపారు. మహిళా న్యాయవాది సునీతను హత్య చేసిన హంతకులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.చాంద్‌బాషా, బార్ కౌన్సిల్ సభ్యులు పి.రవిగువేరా, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సి.వి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం కూడా విధులు బహిస్కరించనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో మహిళా న్యాయవాదులు డి.సాయిలీల, యు.వి.లక్ష్మి, గీతామాధురి, జయలక్ష్మి, లక్ష్మిబాయి, హైమావతి, శిరీష తదితరులు పాల్గొన్నారు. -
టీబీ శాఖలో ఉద్యోగుల ఇష్టారాజ్యం
చక్రం తిప్పుతున్న ఒకేఒక్కడు వ్యాపారాలపైనే ప్రధాన దృష్టి మందుల కాల్చివేతలో ప్రధాన పాత్ర కొనసాగుతున్న విచారణ నిజామాబాద్ అర్బన్ : జిల్లా టీబీ శాఖపై ఇటీవల నిఘా అధికారులు దృష్టిపెట్టారు. జిల్లా కేం ద్రంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో వారం రోజులుగా విచారణ కొనసాగుతోంది. ఇందులో ఓ ఉద్యోగి వ్యవహార శైలి వెలుగులోకి రావడం నిఘా అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ఉద్యోగి విధులకు ఎగనామం పెడుతూ అనేక అక్రమాల్లో ముఖ్యపాత్ర పోషించినట్లు వెల్లడైంది. రెండేళ్లుగా కొం దరు ఉద్యోగులను కలుపుకొని తన దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. గత జనవరి 2 న నిజామాబాద్ నగరం కంఠేశ్వర్‌లోని పూలాంగ్‌వాగు సమీపంలో కాలం చెల్లిన వేలాది కొలది టీబీ మందులను చెత్తకుప్పలో పారవేశారు. సం చుల నిండా మందులను రాత్రివేళ పారవేసిన ట్లు స్థానికులు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సిరాజొద్దీన్కు సమాచారం ఇవ్వగా ఆయన వెళ్లి పరిశీలించారు. విలువైన మందులు రోగులకు అందించకుండా మురికి కాలువ పాలు చేసినట్లు ఎంహె^Œ వో గుర్తించారు. వాటి విలువ సుమారు రూ. 5 లక్షల వరకు విలువ ఉంటుందని పేర్కొన్నారు. ఈ మందులను జిల్లా వైద్యాధికారికి అందించారు. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించగా మందులు పారావేసిన ప్రధాన నిం దితులను వదిలేసిశారు. విచారణను తూతూ మంత్రంగా ముగించారు. మందులు పారవేయడంలో టీబీ సెంటర్లో పనిచేస్తున్న ఉద్యోగి ప్రధానపాత్ర వహించాడు. టీబీ రోగులకు అం దించవల్సిన మందులను రిజిష్టర్‌లో అందిస్తున్నట్లు పేర్కొంటూ మందులను మాత్రం బయ ట పారవేశారు. సదరు ఉద్యోగి కొందరు అధికారులను మచిక చేసుకొని ఈ వ్యవహారం నుంచి బయటపడినట్లు తెలిసింది. ఎల్లారెడ్డిలో ముగ్గు రు టీబీ రోగులు చనిపోయి మూడు నెలలు అయినా వారికి మందులు అం దిస్తున్నట్లు రికార్డుల్లో నమోదు చేశారు. సదరు ఉద్యోగి క్షేత్ర స్థాయి పర్యవేక్షణకు వెళ్లకుండా కేవలం ఫోన్లో సమాచారం తీసుకుంటూ రికార్డులో నమోదు చేయడంతో అధికారులు పట్టుకున్నారు. గతంలో టీబీ శాఖలో ల్యాబ్టెక్నీషియన్ల అవుట్సోర్సింగ్ నియామకాలు జరిగాయి. ఇందులో ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఇద్దరిని నియమించుకోవడం గమనార్హం. సదరు శాఖ అధికారిణి మచ్చిక చేసుకొని ఒక ముఖ్య ఉద్యోగి ఈ నియామకాల్లో ప్రధాన పాత్ర వహించినట్లు తేలింది. టీబీ శాఖలో ఉద్యోగుల పనితీరును బట్టి ప్రతి ఏడాది వారి కాంట్రాక్టును రెన్యూవల్ చేయవల్సి ఉంటుంది. రెండేళ్లుగా అధికారులను మచ్చిక చేసుకొని సదరు ఉద్యోగి, మరికొందరు క్షేత్ర స్థాయి పనితీరు లేకున్నా రెన్యూవల్ చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో టీబీ రోగులను గుర్తించినప్పుడు వారి రోగాన్ని తగ్గించేందుకు మం దులు ఇవ్వడం, రోగం ముదరకుండా క్రమం గా మందులు వినియోగించేలా చూడడం రోగి ఇంటికి వెళ్లి పరిశీలించడం చేయాల్సి ఉంటుంది. జిల్లా కార్యాలయానికే పరిమితమై ఫోన్ సమాచారంతో కేసుల నమోదు కొనసాగుతుంది. డిచ్‌పల్లిలో ఆరు కేసులు ఉన్నట్లు నమోదు కాగా క్షేత్ర స్థాయిలో ఉన్నతాధికారులు పరిశీలనచేయగా కేవలం రెం డు కేసులు మాత్రమే ఉన్నాయి, మరో 4 కేసు లు తప్పుగా నమోదు చేశారు. ఆయా మండలాల్లో వైద్యసిబ్బందిపై ఒత్తిడి తీసుకువచ్చి తప్పుడు రిపోర్టులతో అధికారులను బురిడికొట్టిస్తున్నారు. సదరు ఉద్యోగి తన వాహనాన్ని అద్దెకు ఏర్పాటు చేసుకోవాలని, వాహనం తిరుగకు న్నా అధికారులపై ఒత్తిడి చేసి బిల్లులు తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల వాహనాన్ని తీసివేయడంతో అధికారులను బ్లాక్మెయిల్ చేస్తూ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. విధి నిర్వహణ సమయంలో సొం త వ్యాపారాలు చూసుకోవడం, కార్యాలయానికి రాకుండా రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నారు. ఎవరెవరు విధులకు ఎగనామం పెడుతున్నారు, వారి కాంట్రాక్టు విధానం, క్షేత్ర స్థాయి పని ఎలా ఉంది తదితర విషయాలపై నిఘా వర్గాలు నివేదికను సిద్దం చేశాయి. -
అలసత్వం వహిస్తే సహించం
మున్సిపల్ ఆర్డీ చల్లా అనూరాధ బాపట్ల: మరుగుదొడ్ల నిర్మాణంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని మున్సిపల్ ఆర్డీ చల్లా అనూరాధ తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో పురపాలకసంఘం అధికారులు, చైర్పర్సన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనూరాధ మాట్లాడుతూ పట్టణంలో మరుగుదొడ్ల నిర్మాణం అసంతృప్తిగా నిర్వహిస్తున్నారని చెప్పారు. స్లమ్‌లెవల్ ఫెడరేషన్ (ఎస్ఎల్ఎఫ్) సిబ్బంది పనితీరు అస్తవ్యస్తంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డి స్థాయి అధికారి సమావేశం నిర్వహిస్తే కనీసం హాజరుకాలేని సిబ్బందిని ఎందుకు నియమించారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో త్వరితగతిన మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేయాలని, అలా చేయలేని పక్షంలో పనిచేయని వారిని గుర్తించి కొత్తవాళ్లకు అవకాశం కల్పించాలని సూచించారు. జిల్లాలో నరసరావుపేట, మంగళగిరి ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం 99 శాతం, తెనాలి, మాచర్ల, సత్తెనపల్లి ప్రాంతాల్లో 87 శాతం పూర్తి అయితే బాపట్లలో కేవలం 70 శాతం మాత్రమే పూర్తి అయ్యాయన్నారు. వార్డుల్లో మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో కౌన్సిలర్లకు తెలియజేయాలే కానీ, కౌన్సిలర్ల అనుమతి తీసుకొని నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం లేదన్నారు. బాపట్లలో ఇప్పటివరకు ప్రజాసాధికారిత సర్వే కేవలం 40 శాతం మాత్రమే అయ్యిందని, మిగిలిన 60 శాతం సెప్టెంబర్ 25లోగా పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ తోట మల్లీశ్వరి, మున్సిపల్ డీఈ సీతారామరావు, ఏఈ శ్రీనివాస్, మున్సిపల్ మేనేజర్ పోతురాజు ఉన్నారు. -
ఎంపీడీవోలు.. విధులకు డుమ్మా!
* జెడ్పీ సీఈవో ఆకస్మిక తనిఖీల్లో వెల్లడి * మొన్న ముప్పాళ్ల.. తాజాగా బెల్లంకొండ ఎంపీడీవోలకు చార్జి మెమోలు గుంటూరు వెస్ట్: మండల స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టడంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)ది కీలక పాత్ర. అనేక అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కేంద్ర బిందువుగా ఉంటూ ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందించడంలో వీరిపైనే ప్రధాన బాధ్యత ఉంటుంది. జిల్లాలోని పలువురు ఎంపీడీవోల పనితీరుపై ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా కార్యాలయాలకు గైర్హాజరు కావడం, జిల్లాస్థాయిలో సమావేశాలకు హాజరవుతున్నామని చెబుతూ సొంత వ్యవహారాలు చక్కబెట్టుకోవడం వంటి విషయాలు ఇటీవల కాలంలో అధికంగా వెలుగులోకి వస్తున్నాయి. ముప్పాళ్ల ఎంపీడీవోపై చర్యలకు సీఈవో సిఫార్సు... ఇటీవల కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశానికి గైర్హాజరైన ముప్పాళ్ల ఎంపీడీవో టి.ఉషారాణిపై విచారణ జరిపాలనిSకలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. విచారణ జరిపిన సీఈఓ సోమేపల్లి వెంకటసుబ్బయ్య ఆమె కార్యాలయ విధులకు తరచుగా గైర్హాజరవుతున్నట్లు ధృవీకరించుకున్నారు. ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్‌కు ఫైల్ పెట్టారు. ఈ ఘటన ఎంపీడీవోల్లో తీవ్ర చర్చకు దారితీసింది. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు సీఈవో వెంకటసుబ్బయ్య ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ నెల తొమ్మిదిన బెల్లంకొండ మండల పరిషత్ కార్యాలయాన్ని మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి ఎంపీడీవో కేహెచ్ భ్రమరాంబ విధులకు గైర్హాజరైనట్లు తేలింది. దీంతో ఆమెకు చార్జిమెమో అందజేశారు. చార్జిమెమో నుంచి తప్పించుకునే చర్యల్లో భాగంగా భ్రమరాంబ శుక్రవారం సాయంత్రం తనకు 10 రోజులపాటు సెలవులు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా పరిషత్‌కు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. సగానికిపైగా ఎంపీడీవోలది ఇదే తీరు... జిల్లాలోని సగానికిపైగా ఎంపీడీవోలు గుంటూరులో ఉంటూ విధులకు హాజరవుతున్నారు. వారంలో ఒకటి రెండు రోజులు విధులకు హాజరై, మిగిలిన రోజుల్లో సొంత వ్యవహారాలు చూసుకుంటున్నారనే విధులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలకు హాజరవుతున్నామంటూ విధులకు గైర్హాజరవుతుండటం గమనార్హం. పల్నాడు ప్రాంత మండలాల్లో విధులు నిర్వహించే ఎంపీడీవోలు ఈ తరహా సాకులు చెబుతూ విధులకు డుమ్మా కొడుతున్నారు. బొల్లాపల్లి ఎంపీడీవో ఎం.అశోక్‌బాబు విధులకు సక్రమంగా హాజరుకారని స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు కె.సంతోషమ్మ అనేకమార్లు సర్వసభ్య సమావేశాల్లో ప్రస్తావించడం గమనార్హం. కొంతమంది ఎంపీడీవోలు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలు చూసుకుని ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నట్లు ఉద్యోగుల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో జెడ్పీ ఇన్చార్జి సీఈవో చేపడుతున్న ఆకస్మిత తనిఖీలతో ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. -
సర్వాధికారాలు వెంకట్రావుకే..!
టీబీజీకేఎస్ ఉత్తర ప్రత్యుత్తరాలు ఆయన ద్వారానే ‘గుర్తింపు’ ఎన్నికలయ్యేవరకూ పాత కమిటీల కొనసాగింపు గోదావరిఖని : తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)కు నూతనంగా అధ్యక్షుడిగా నియమితులైన బి.వెంకట్రావుకే సర్వాధికారాలను కట్టబెట్టారు. సింగరేణి యాజమాన్యంతో యూనియన్ పరంగా జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఆయన ద్వారానే జరపాలని శనివారం టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణ యం తీసుకున్నట్టు సమాచారం. అయితే యూనియన్ బైలాస్ ప్రకారం ప్రధాన కార్యదర్శికి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే(లెటర్ కరస్పాండింగ్ అథారిటీ) అవకాశం ఉంది. గతంలోనూ ప్రధాన కార్యదర్శులుగా చేసిన వారే ఆ పనిని కొనసాగించారు. తాజాగా ప్రకటించిన కొత్త కమిటీలో వెంకట్రావును అధ్యక్షుడిగా, కెంగెర్ల మల్లయ్యను ప్రధాన కార్యదర్శిగా నియమించినప్పటికీ వెంకట్రావుకే అధికారాలను కట్టబెట్టినట్టు తెలిసింది. తాజా పరిస్థితు ల నేపథ్యంలో త్వరలో జరిగే గుర్తింపు సం ఘం ఎన్నికల వరకూ యూనియన్ పాత కమిటీలు యథాతథంగా ఉండనున్నాయి. ఎన్నిక ల సమయంలో డివిజన్ల ఉపాధ్యక్షులను మార్చితే ప్రతికూల ప్రభావం చూపుతుందని భావించిన అధిష్టానం మార్పులు చేయవద్దని సూచించినట్టు సమాచారం. ‘మిర్యాల’కు సముచిత స్థానం ? ఇటీవలి వరకు ప్రధాన కార్యదర్శిగా కొనసాగి న మిర్యాల రాజిరెడ్డికి నూతన కమిటీలో స్థానం కల్పించకపోవడంపై ఆయన కినుక వహించారు. అయితే త్వరలోనే తిరిగి సముచి త స్థానం కల్పించేలా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రాజ స్థాన్ రాష్ట్రం జైపూర్‌లో కాన్ఫరెన్స్‌కు వెళ్లిన యూనియన్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత ఈనెల 24న తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాతనే ఈ విషయమై నిర్ణయం తీసుకుం టారని సమాచారం.