టీబీ శాఖలో ఉద్యోగుల ఇష్టారాజ్యం | TB department | Sakshi
Sakshi News home page

టీబీ శాఖలో ఉద్యోగుల ఇష్టారాజ్యం

Published Wed, Sep 14 2016 12:53 AM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

టీబీ శాఖలో ఉద్యోగుల ఇష్టారాజ్యం - Sakshi

టీబీ శాఖలో ఉద్యోగుల ఇష్టారాజ్యం

  • చక్రం తిప్పుతున్న ఒకేఒక్కడు
  • వ్యాపారాలపైనే ప్రధాన దృష్టి
  • మందుల కాల్చివేతలో ప్రధాన పాత్ర
  • కొనసాగుతున్న  విచారణ
  • నిజామాబాద్‌ అర్బన్‌ :
    జిల్లా టీబీ శాఖపై ఇటీవల నిఘా అధికారులు దృష్టిపెట్టారు. జిల్లా కేం ద్రంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో వారం రోజులుగా విచారణ కొనసాగుతోంది. ఇందులో ఓ ఉద్యోగి వ్యవహార శైలి వెలుగులోకి రావడం నిఘా అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ఉద్యోగి విధులకు ఎగనామం పెడుతూ అనేక అక్రమాల్లో ముఖ్యపాత్ర పోషించినట్లు వెల్లడైంది. రెండేళ్లుగా కొం దరు ఉద్యోగులను కలుపుకొని తన దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. గత జనవరి 2 న నిజామాబాద్‌ నగరం కంఠేశ్వర్‌లోని పూలాంగ్‌వాగు సమీపంలో కాలం చెల్లిన వేలాది కొలది టీబీ మందులను చెత్తకుప్పలో పారవేశారు. సం చుల నిండా  మందులను రాత్రివేళ పారవేసిన ట్లు స్థానికులు మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ సిరాజొద్దీన్‌కు సమాచారం ఇవ్వగా ఆయన వెళ్లి పరిశీలించారు. విలువైన మందులు రోగులకు అందించకుండా మురికి కాలువ పాలు చేసినట్లు ఎంహె^Œ వో గుర్తించారు. వాటి విలువ సుమారు రూ. 5 లక్షల వరకు విలువ ఉంటుందని పేర్కొన్నారు. ఈ మందులను జిల్లా వైద్యాధికారికి అందించారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ విచారణకు ఆదేశించగా మందులు పారావేసిన ప్రధాన నిం దితులను వదిలేసిశారు. విచారణను తూతూ మంత్రంగా ముగించారు. మందులు పారవేయడంలో టీబీ సెంటర్‌లో పనిచేస్తున్న ఉద్యోగి ప్రధానపాత్ర వహించాడు. టీబీ రోగులకు అం దించవల్సిన మందులను రిజిష్టర్‌లో అందిస్తున్నట్లు పేర్కొంటూ మందులను మాత్రం బయ ట పారవేశారు. సదరు ఉద్యోగి కొందరు అధికారులను మచిక చేసుకొని ఈ వ్యవహారం నుంచి బయటపడినట్లు తెలిసింది. ఎల్లారెడ్డిలో ముగ్గు రు టీబీ రోగులు చనిపోయి మూడు నెలలు అయినా వారికి మందులు అం దిస్తున్నట్లు రికార్డుల్లో నమోదు చేశారు. సదరు ఉద్యోగి క్షేత్ర స్థాయి పర్యవేక్షణకు వెళ్లకుండా కేవలం ఫోన్‌లో సమాచారం తీసుకుంటూ రికార్డులో నమోదు చేయడంతో అధికారులు పట్టుకున్నారు. 
    గతంలో టీబీ శాఖలో ల్యాబ్‌టెక్నీషియన్‌ల అవుట్‌సోర్సింగ్‌ నియామకాలు జరిగాయి. ఇందులో ఎలాంటి నోటిఫికేషన్‌ లేకుండా ఇద్దరిని నియమించుకోవడం గమనార్హం. సదరు శాఖ అధికారిణి మచ్చిక చేసుకొని ఒక ముఖ్య ఉద్యోగి ఈ నియామకాల్లో ప్రధాన పాత్ర వహించినట్లు తేలింది.
    టీబీ శాఖలో ఉద్యోగుల పనితీరును బట్టి ప్రతి ఏడాది వారి కాంట్రాక్టును రెన్యూవల్‌ చేయవల్సి ఉంటుంది. రెండేళ్లుగా అధికారులను మచ్చిక చేసుకొని సదరు ఉద్యోగి, మరికొందరు క్షేత్ర స్థాయి పనితీరు లేకున్నా రెన్యూవల్‌ చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
    క్షేత్ర స్థాయిలో టీబీ రోగులను గుర్తించినప్పుడు వారి రోగాన్ని తగ్గించేందుకు మం దులు ఇవ్వడం, రోగం ముదరకుండా క్రమం గా మందులు వినియోగించేలా చూడడం రోగి ఇంటికి వెళ్లి పరిశీలించడం చేయాల్సి ఉంటుంది.  జిల్లా కార్యాలయానికే పరిమితమై ఫోన్‌ సమాచారంతో కేసుల నమోదు కొనసాగుతుంది. డిచ్‌పల్లిలో ఆరు కేసులు ఉన్నట్లు నమోదు కాగా క్షేత్ర స్థాయిలో ఉన్నతాధికారులు పరిశీలనచేయగా కేవలం రెం డు కేసులు మాత్రమే ఉన్నాయి, మరో 4 కేసు లు తప్పుగా నమోదు చేశారు. ఆయా మండలాల్లో వైద్యసిబ్బందిపై  ఒత్తిడి తీసుకువచ్చి తప్పుడు రిపోర్టులతో అధికారులను బురిడికొట్టిస్తున్నారు.  
    సదరు ఉద్యోగి తన వాహనాన్ని అద్దెకు ఏర్పాటు చేసుకోవాలని, వాహనం తిరుగకు న్నా అధికారులపై ఒత్తిడి చేసి బిల్లులు తీసుకున్నట్లు తెలిసింది.
    ఇటీవల వాహనాన్ని తీసివేయడంతో అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. విధి నిర్వహణ సమయంలో సొం త వ్యాపారాలు చూసుకోవడం, కార్యాలయానికి రాకుండా రియల్‌ ఎస్టేట్, ఫైనాన్స్‌ నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నారు. ఎవరెవరు విధులకు ఎగనామం పెడుతున్నారు, వారి కాంట్రాక్టు విధానం, క్షేత్ర స్థాయి పని ఎలా ఉంది తదితర విషయాలపై నిఘా వర్గాలు నివేదికను సిద్దం చేశాయి.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement