cases
-
న్యాయాధికారిపై ఇంటెలిజెన్స్ నిఘా!
చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా న్యాయమూర్తులపైనే నిఘా పెట్టిందా..? ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాదిని రంగంలోకి దించి చంద్రబాబుపై కేసులను నీరు గార్చేలా పోలీస్ వ్యవస్థకు ‘కౌన్సెలింగ్’ చేస్తోందా..? తాజా పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుపై నమోదైన అవినీతి కేసులను అడ్డగోలుగా మూసివేసే పన్నాగమే లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తోంది. ఏకంగా ఆ కేసులను విచారిస్తున్న న్యాయాధికారి కదలికలపై ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా నిఘా పెట్టిందన్న విషయం సంచలనం కలిగిస్తోంది. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని ఆ జడ్జీ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో గత ఏడాది చంద్రబాబుకు రిమాండ్ విధించిన పరిణామాల నేపథ్యంలోనే ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ దుశ్చర్యకు తెగించినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు చంద్రబాబు నిందితుడిగా ఉన్న కేసులో చార్జిషీట్లను న్యాయస్థానానికి సమర్పించకుండా తాత్సారం చేయడంపై ఆ జడ్జీ ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తున్న ఈ ఉదంతం ఇలా ఉంది...ఇంటి వద్ద ఎందుకు మాటు వేశారు?– పోలీసు అధికారిని ప్రశ్నించిన న్యాయాధికారి చంద్రబాబుపై నమోదైన కేసులను విచారిస్తున్న ఓ న్యాయస్థానం న్యాయాధికారిపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఆ జడ్జీ ఇంటి పరిసరాల్లో తిష్ట వేసిన ఇంటెలిజెన్స్ అధికారులు ప్రతికదలికనూ గమనిస్తూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయడం గమనార్హం. అయితే నిఘా వేసిన ఇంటెలిజెన్స్ అధికారులను న్యాయాధికారి సిబ్బంది గుర్తించారు. న్యాయాధికారి కోసం వాకబు చేస్తున్న విషయాన్ని పసిగట్టారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జడ్జీ ఓ పోలీసు అధికారిని దీనిపై న్యాయస్థానంలోనే ప్రశ్నించడం గమనార్హం. తన నివాసం వద్ద ఇంటెలిజెన్స్ అధికారులు ఎందుకు మాటు వేశారు...? తన ప్రతి కదలికను ఎందుకు పరిశీలిస్తున్నారని సూటిగా ప్రశ్నించడంతో ఆ పోలీసు అధికారి తత్తరపాటుకు గురయ్యారు. చార్జిషీట్లు ఎందుకు తొక్కిపెట్టారు? – సీఐడీని ప్రశ్నించిన న్యాయాధికారి చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను నీరుగార్చేందుకు సీఐడీ పన్నిన పన్నాగంపై కూడా న్యాయాధికారి ప్రశ్నించారు. 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు అవినీతిని ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దీనిపై ఇప్పటికే న్యాయస్థానంలో చార్జిషీట్లు దాఖలు చేసింది. అయితే న్యాయస్థానం కొన్ని వివరణలు కోరుతూ చార్జిషీట్లను ఈ ఏడాది ఏప్రిల్‌లో వెనక్కి పంపింది. వివరణలతో ఆ చార్జిషీట్లను మళ్లీ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈమేరకు అప్పటి సీఐడీ అధికారులు వివరణలతో చార్జిషీట్లను సిద్ధం చేశారు. అయితే జూన్‌లో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తగా నియమితులైన సీఐడీ ఉన్నతాధికారులు ఆ చార్జిషీట్లను తొక్కిపెట్టారు. వాటిని న్యాయస్థానంలో దాఖలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఆ కేసులో సాక్షులను బెదిరించి చంద్రబాబుకు అనుకూలంగా తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించాలన్నది సీఐడీ ఉన్నతాధికారుల లక్ష్యం. అప్పటివరకు చార్జిషీట్లను న్యాయస్థానంలో దాఖలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి పి.నారాయణ ప్రధాన నిందితులుగా ఉన్న అసైన్డ్ భూముల కేసులో గత ఏడాది సిట్ అధికారులు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నివాసంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూముల కుంభకోణం అంతా వెల్లడిస్తానని, తనను అప్రూవర్‌గా గుర్తించాలని కోరుతూ ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ జప్తు చేసిన తన పత్రాలను విడుదల చేయాలని ఆయన ఇటీవల న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై కొద్ది రోజుల క్రితం విచారించిన న్యాయమూర్తి అసలు సీఐడీ ఇంతవరకు చార్జిషీట్లను ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఆ చార్జిషీట్లు దాఖలు చేయనంతవరకు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి అప్రూవరా లేక నిందితుడా అన్నది నిర్ధారించలేమన్నారు. చార్జిషీట్లను ఇంకా ఎందుకు దాఖలు చేయడం లేదని న్యాయమూర్తి ప్రశ్నించగా సీఐడీ తరపు న్యాయవాది సరైన సమాధానం చెప్పలేకపోయారు. లూథ్రా కంట్రోల్లో పోలీస్ వ్యవస్థ!చంద్రబాబు తరపున కేసులను వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా తాజాగా విజయవాడలోని నోవాటెల్ హోటల్లో వరుసగా రెండు రోజుల పాటు పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో సమావేశమై ఆ కేసులను నీరుగార్చే చర్యలను స్వయంగా పర్యవేక్షించడంపై న్యాయ వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ఈ కేసులో గతంలో వాంగ్మూలాలు ఇచ్చిన ఉన్నతాధికారులు, ఇతరులను బెదిరింపులకు గురి చేసి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లకు గురి చేయాలని పథక రచన చేశారు. మొత్తం పోలీస్ వ్యవస్థను లూథ్రా తన కంట్రోల్లోకి తీసుకోవడం.. చంద్రబాబుపై కేసుల దర్యాప్తు అధికారులకు దిశా నిర్దేశం చేయడం.. దీన్ని నుంచి ఆయన్ను మూడు నెలల్లోగా బయట పడేయాలని ఏకంగా డెడ్‌లైన్ విధించడం రాష్ట్రంలో ఎలాంటి పాలన సాగుతోందో చెప్పేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సాక్షులను బెదిరించి దారికి తేకుంటే ఈ కేసులో చంద్రబాబుకు విముక్తి కలిగించడం కష్టమని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది. -
కేరళలో మళ్లీ మంకీపాక్స్ కలకలం
తిరువనంతపురం:మంకీపాక్స్ వైరస్ కేసులు కేరళలో మళ్లీ నమోదయ్యాయి. తాజాగా రెండు కేసులు వెలుగుచూడడం ఇక్కడ కలకలం రేపింది. యూఏఈ నుంచి ఇటీవలే కేరళ వచ్చిన ఇద్దరికి మంకీ పాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.వయనాడ్‌కు చెందిన వ్యక్తికి తొలుత మంకీపాక్స్ నిర్ధారణ కాగా తాజాగా కన్నూర్ జిల్లా వాసికి వైరస్ సోకినట్లు తేలింది.దీంతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు వైరస్ సోకిన వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు.ఇదిలాఉంటే కేరళలో ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ కొన్ని మంకీపాక్స్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. -
చంద్రబాబు అక్రమాలపై విచారణ చేపట్టాలి
-
Magazine Story: చంద్రబాబుపై విచారణలో ఉన్న కేసులను నీరుగార్చే కుట్ర
-
Big Question: బాబు అవినీతి కేసులు.. CBIకి అప్పగించాల్సిందేనా ?
-
మూడు నెలల్లో ముగించేద్దాం
సాక్షి,టాస్క్ ఫోర్స్: ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమోదైన కేసులను యుద్ధప్రాతిపదికన మూసివేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర కార్యాచరణను వేగవంతం చేసింది. చంద్రబాబు కేసులను మొదటి నుంచి పర్యవేక్షిస్తున్న అత్యంత ఖరీదైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఇప్పుడు ఈ వ్యవహారంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. పోలీసు, సీఐడీ విభాగాలను వీలైనంత మేర ఉపయోగించుకోవడం, కేసులను నీరుగార్చడం.. ఇదీ పథకం. ఈ పథకాన్ని సిద్ధార్థ్ లూథ్రా స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం. విజయవాడలోని నోవాటెల్ హోటల్ కేంద్రంగా ఆది, సోమవారాల్లో నిర్వహించిన రహస్య సమావేశాల్లో ఈ మేరకు ఓ కుట్రను ఖరారు చేశారని వినిపిస్తోంది. లూథ్రాతో పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు వరుసగా రెండో రోజు మంగళవారం కూడా భేటీ అయ్యారని విశ్వసనీయ సమాచారం. సాక్షులను బెదిరించండి... వాంగ్మూలాలు మార్చండి.. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు బరితెగించి పాల్పడిన దోపిడీని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆధారాలతోసహా నిగ్గు తేల్చింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, అసైన్డ్ భూముల దోపిడీ, అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణాల కుట్రదారు, లబ్ధిదారు చంద్రబాబేనన్నది ఆధారాలతో బట్టబయలైంది. నిబంధనలకు విరుద్ధమని చెప్పినా సరే సీఎం హోదాలో చంద్రబాబు ఆదేశించడంతోనే అక్రమాలకు పాల్పడాల్సి వచ్చిందని ఆనాటి ఉన్నతాధికారులతోపాటు ఇతరులు వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. అక్రమ నిధులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి, టీడీపీ బ్యాంకు ఖాతాలకు చేరినట్టు ఆధారాలను సిట్ సేకరించింది. దాంతోనే ఆ కేసుల్లో చంద్రబాబు అడ్డంగా దొరికినట్టైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ కేసుల నుంచి చంద్రబాబు పేరు తప్పించేందుకు కుట్ర పన్నుతోంది. అందుకు గతంలో వాంగ్మూలాలు ఇచ్చిన ఉన్నతాధికారులను, ఇతరులను తీవ్రస్థాయిలో బెదిరించి బెంబేలెత్తించాలని పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులకు ఆదేశాలందాయని తెలుస్తోంది. అవసరమైతే వారిపై ఇతరత్రా అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేయాలని కూడా లూథ్రా సలహా ఇచి్చనట్లు సమాచారం. సాక్షులను బెదిరించి దారికి తెచ్చుకోకపోతే చంద్రబాబును ఈ అవినీతి కేసుల నుంచి బయటపడేయడం సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎంతమందిని బెదిరించారు... ఎంతమంది ఇంకా బెదిరించాల్సిన జాబితాలో ఉన్నారనే వివరాలు కూడా లూథ్రా అడిగి తెలుసుకున్నారట.అన్నీ మూసేద్దాం..చంద్రబాబు అవినీతి కేసుల్లో గతంలో సిట్ సేకరించిన డాక్యుమెంటరీ ఆధారాలను తారుమారు చేయాలనేది కూడా ఈ రెండు రోజుల సమావేశాల్లో ఖరారు చేసిన కుట్రలో భాగంగా ఉంది. గతంలో సిట్‌లో పనిచేసిన కిందిస్థాయి అధికారులను పిలిపించి బెదిరించాలని కూడా లూథ్రా సలహా ఇచ్చారట. ఇప్పటికే తాము నాలుగైదు సార్లు ఆ కిందిస్థాయి అధికారులను తీవ్రస్థాయిలో బెదిరించామని పోలీసు, సీఐడీ అధికారులు ఆయనకు చెప్పారు. అది సరిపోదని....ఆ వేధింపులను ఇంకా తీవ్రతరం చేయాలని లూథ్రా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలన్నీ గరిష్టంగా మూడు నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉందని, ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ రోజువారీగా తనకు నివేదిక ఇవ్వాలని ఓ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారికి లూథ్రా సూచించినట్లు పోలీసు అధికారులు చర్చించుకుంటున్నారు. పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు ఈ పనులు పూర్తి చేస్తే అనంతరం చంద్రబాబుపై కేసులను మూసివేసే సంగతి తాను చూసుకుంటానని సీనియర్ న్యాయవాది లూథ్రా ఈ సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై కేసులను నీరుగార్చే పన్నాగాన్ని కచ్చితంగా అమలు చేస్తామని... త్వరలోనే టాస్క్ పూర్తి చేస్తామని పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో లూథ్రా వ్యాఖ్యానించినట్లు పోలీసు వర్గాలంటున్నాయి. రెండు రోజుల సమావేశాల అనంతరం లూథ్రా ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారని సమాచారం.అంతా లూథ్రా చెప్పినట్లే..సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో యావత్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవçÜ్థకు సూపర్ బాస్‌గా అవతరించారు. గతంలో చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టు కాగానే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడలో వాలిపోయిన ఆ సీనియర్ న్యాయవాది వ్యవహారం అప్పట్లోనే తీవ్ర చర్చనీయాంశమైంది. రోజుకు రూ.కోటి ఫీజుతోపాటు అదనపు ఖర్చులు వసూలు చేసే లూథ్రా ప్రస్తుతం చంద్రబాబు అవినీతి కేసులను అడ్డగోలుగా క్లోజ్ చేసే పన్నాగానికి సర్వం తానై వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అవినీతి కేసులను మూసివేయడంతోపాటు...వైఎస్సార్సీపీ నేతలను అక్రమ కేసులతో వేధింపులకు గురిచేసే కుట్రను కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. లూథ్రాయే సుప్రీం అని, ప్రభుత్వ కీలక విభాగాల ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి తేల్చి చెప్పారని కూడా వినిపిస్తోంది. అందువల్లే పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్, న్యాయ విభాగాలు పూర్తిగా లూథ్రా నియంత్రణలోకి వచ్చేశాయి. ఆయన ఆదేశాలకు రాష్ట్ర పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు జీ హుజూర్ అంటున్నారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులే కాదు... జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, అవసరమని భావిస్తే చివరికి స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు కూడా ఆయన ఫోన్లు చేసి ఆదేశిస్తున్నారు. వారు చిత్తం మహా ప్రభో.. అని ఆయన ఆదేశాలను శిరసావహిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో చేసిన ఫిర్యాదు మేరకు నమోదుచేసిన అక్రమ కేసులో రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌పై అక్రమ కేసు నమోదు చేయడంతో పాటు విచారణ పేరుతో ఎలా వేధించాలో ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారికి లూథ్రాయే స్వయంగా నిర్దేశించారని పోలీసులు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, ఇతర అక్రమ కేసులతో వేధింపులను కూడా లూథ్రా నిశితంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారట. సిద్ధార్థ్ లూథ్రా రాజ్యాంగేతర శక్తిగా ఆవిర్భవించారని ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
కట్టడి చేస్తున్నా...కేసులు పెరుగుతున్నాయ్!
దాదర్: ప్రాణాంతక హెచ్ఐవీ వ్యాధిని నియంత్రించేందుకు ప్రభుత్వం, ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు (ఏసీబీ)అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ ముంబైలో ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముంబై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ ఏటా నిర్వహిస్తున్న వైద్య పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడు వేల మంది హెచ్ఐవీ రోగులన్నుట్లు తేలింది. ప్రస్తుతం ముంబైలో 40,658 హెచ్ఐవీ రోగులున్నట్లు ముంబై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ స్పష్టం చేసింది. దీంతో ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు, వైద్య శాఖ, ప్రభుత్వ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు హెచ్ఐవీ రోగుల సంఖ్య తగ్గించేందుకు గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందుకోసం పెద్ద ఎత్తున జనజాగృతి కార్యక్రమాల చేపడుతోంది. నేటి ఆధునిక యుగంలో కొత్తకొత్త మందులు మార్కెట్లోకి వచ్చాయి. రోగులు కూడా ఆయుర్వేదం జోలికి పోకుండా ఆధునిక మందులు, మాత్రలను వాడుతున్నారు. అయినా ముంబైలో ఏటా మూడు వేలమందికి వ్యాధి నిర్ధారణ జరగడం ఆందోళన కల్గిస్తోంది. ఏటా నిర్వహిస్తున్న వైద్య పరీక్షల్లో బయటపడుతున్న కొత్త రోగుల్లో 75 శాతం 15–49 ఏళ్ల మధ్య వయసున్న వారున్నారు. వీరిలో 31 శాతం మహిళలున్నారు. అనేక సందర్భాల్లో రక్షణ ప్రమాణాలు పాటించకుండా లైంగిక సంబంధాలు కొనసాగించడం, అక్రమ సంబంధాల వల్ల ఈ వ్యాధి సోకుతోందని వైద్య పరిశీలనలో తెలిసింది. హెచ్ఐవీ గురించి భారీగా అవగాహన సదస్సులు, జనజాగృతి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ పెద్ద మొత్తంలో ఎయిడ్స్ కేసులు బయటపడుతుండటంతో ముంబై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. తగ్గిన వివక్ష... హెచ్ఐవీ రోగులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా కొద్ది సంవత్సరాల నుంచి నియంత్రణ కమిటీ కొత్త విధానాలను అమలు చేస్తోంది. రోగులు ఉన్నచోటే పరీక్షలు నిర్వహించడం, వ్యాధి ఏ దశలో ఉందో గుర్తించడం, ఒక్క ముంబైలోనే 20కి పైగా కేంద్రాల ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం, రోగులకు ఉచితంగా మందులు లభించేలా ఏర్పాటు చేసినట్లు ముంబై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ అదనపు డైరెక్టర్ డా.విజయ్‌కుమార్ కారంజ్కర్ తెలిపారు. మరోవైపు ప్రభుత్వం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తుంది. గతంలో వారు చికిత్స పొందుతున్న ఆస్పత్రుల్లోనే మందులు ఇచ్చేందుకు స్వతంత్రంగా కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఎలాంటి ఆహారం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి నియంత్రణలోకి వస్తుందనే విషయంలో మార్గదర్శనం చేస్తున్నారు. సమయానికి మందులు, మంచి ఆహారం తీసుకుంటే ఎప్పటిలాగే జీవనం సాగిస్తారని రోగులకు మనోధైర్యాన్ని నూరిపోస్తున్నారు. గతంలో హెచ్ఐవీ రోగులంటేనే వారి కుటుంబసభ్యులు, ప్రజలు కూడా చిన్న చూపు చూసేవారు. వారి పట్ల బేధభావం ప్రదర్శించేవారు. వారు వాడే దుస్తులు, వస్తువులను వేరుగా ఉంచడంతోపాటు పడుకునేందుకు ప్రత్యేకంగా గది కేటాయించేవారు. కానీ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన జనజాగృతి కార్యక్రమాలవల్ల ప్రజల్లో అవగాహన వచ్చింది. దీంతో ఇలాంటి ఘటనలు కూడా గణనీయంగా తగ్గిపోయాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. -
కేసులకు భయపడటంలేదు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తనపై నమోదైన కేసులకు సంబంధించి తాను భయపడటం లేదని సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ స్పష్టం చేశారు. తన కోసం పోలీసులు గాలిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో మంగళవారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘ఏడాది క్రితం నేను చేసిన ట్వీట్లకు ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయని చెబుతున్నారు. ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయి? అలాంటప్పుడు ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయి? ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకుని పాలన సాగిస్తున్నారు. అమెరికా, యూరఫ్, ఇక్కడా అదే జరుగుతోంది. ప్రస్తుతం నేను ఓ మూవీ షూటింగ్లో ఉన్నాను. మధ్యలో వదిలేసి వస్తే నిర్మాతకు నష్టం వస్తుందని విచారణకు రాలేకపోతున్నా’ అని ఆర్జీవీ పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణసోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు బుధవారం విచారణ జరపనుంది. ఈ వ్యాజ్యాల గురించి వర్మ తరఫు న్యాయవాది మంగళవారం న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ముందు ప్రస్తావించారు. అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి బుధవారం విచారణ జరుపుతామని చెప్పారు. -
లోకేష్‌కు శాపంగా మారనున్న రెడ్‌బుక్: అంబటి రాంబాబు
సాక్షి,గుంటూరు: సోషల్‌మీడియాలో పోస్టులపై వైఎస్సార్సీపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నపుడు టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయరని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. గుంటూరులో సోమవారం(నవంబర్ 25)అంబటి మీడియాతో మాట్లాడారు.‘వైఎస్సార్సీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్టు చేస్తున్నారు. ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. అసభ్యకరమైన పోస్టింగ్స్ పెడితే టీడీపీ వాళ్లను కూడా అరెస్ట్ చేస్తామని చంద్రబాబు నీతి వ్యాక్యాలు చెప్పారు.అయితే వైఎస్సార్సీపీ నేతలపై అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం లేవు.ఇప్పటికే ఈ నెల 17,18,19 తేదీల్లో వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు మా కుటుంబ సభ్యులపైన టీడీపీ నాయకులు పెట్టిన పోస్టులపై వివిధ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశాం.నిన్న అన్ని పీఎస్‌లకు వెళ్ళి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించాం. స్పష్టమైన సమాధానం మాకు రాలేదు. ఇప్పుడు స్పీకర్‌గా ఉన్న వ్యక్తి వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.లోకేష్ కూడా వైఎస్ జగన్‌పై అసభ్యకరమైన పోస్టు పెట్టారు. రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. పోలీసులు స్పందించకుంటే న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తాం. స్పీకరైనా,మంత్రైనా చట్టం దృష్టిలో ఒకటే. ఇది అంతం కాదు ఆరంభమే. జమిలి ఎన్నికలొస్తాయన్న ప్రచారం జరుగుతోంది.డైరెక్టర్ రాంగోపాల్ వర్మపైన కూడా కేసులు పెట్టారు. పోసాని మురళీకృష్ణ వైఎస్ జగన్ అభిమాని. ఆయనపై కేసులు పెట్టి భయపెట్టొచ్చేమో కానీ వైఎస్ జగన్‌పై ఆయనకున్న ప్రేమను మాత్రం తొలగించలేరు. రెడ్‌బుక్ లోకేష్ రాశాడు. రెడ్‌బుక్ లోకేష్‌కు శాపంగా మారుతోంది. రెడ్‌బుక్ రచయితగా లోకేష్ చరిత్రలో నిలిచిపోతాడు’అని అంబటి ఎద్దేవా చేశారు. -
పాక్‌లో కొత్తగా రెండు పోలియో కేసులు.. 41కి చేరిక
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో కొత్తగా మరో రెండు పోలియో కేసులు నమోదు కావడంతో కలకలం చెలరేగింది. దేశంలో ఈ ప్రాణాంతక ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న రోగుల సంఖ్య 41కి చేరింది. పాకిస్తాన్‌కు చెందిన డాన్ వార్తాపత్రిక తెలిపిన వివరాల ప్రకారం గురు, శుక్రవారాల్లో కొత్తగా రెండు పోలియో కేసులు నమోదయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 24ను పోలియో దినోత్సవంగా జరుపుకుంటారు. ఇదే సమయంలో కొత్తగా కేసులు నమోదుకావడం పాక్ ప్రభుత్వానికి సవాల్‌గా నిలిచింది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లలో నమోదైన ఈ రెండు కేసులు పోలియో వైరస్‌ను నిర్మూలించడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బగా నిలిచాయి.బలూచిస్థాన్‌లోని లోరాలై జిల్లాలోని మూడేళ్ల బాలికకు పోలియో వ్యాధి సోకింది. ఈ చిన్నారి అక్టోబర్ 8న పోలియో బారిన పడింది. పోలియో వ్యాక్సినేషన్ ప్రచారంలో వ్యాధి సోకిన ఈ చిన్నారికి యాంటీ పోలియో డోస్ ఇవ్వలేదని వెల్లడయ్యింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కోహట్ జిల్లాలోని రెండేళ్ల బాలునికి పోలియో సోకింది.ఇప్పటివరకు బలూచిస్తాన్‌లో 21, సింధ్‌లో 12, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఆరు, పంజాబ్, ఇస్లామాబాద్‌లలో ఒక్కొక్కటి చొప్పున పోలియో కేసులు నమోదయ్యాయి. పాక్‌లో పోలియో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 4.5 కోట్ల మందికి పైగా పిల్లలకు పోలియో డోస్‌లు వేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూన్ 2025 నాటికల్లా పాకిస్తాన్ నుంచి ఈ వ్యాధిని తరిమికొట్టేందుకు పెద్ద ఎత్తున ప్రణాళిక అమలు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం పోలియో ఇప్పటికీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో మహమ్మారిగా ఉంది.ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్లో తొక్కిసలాట.. తొమ్మిదిమందికి గాయాలు -
సుప్రీంకోర్టులో అన్ని విచారణలు త్వరలో లైవ్
న్యూఢిల్లీ: పారదర్శకత విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు త్వరలో కొత్త చరిత్ర లిఖించనుంది. ఇకపై కోర్టులో జరిగే అన్ని కేసుల విచారణను ప్రత్యక్షప్రసారం(లైవ్ స్ట్రీమింగ్) చేసేందుకు చర్యలు ప్రారంభించింది. కేసుల ప్రత్యక్ష ప్రసారాల కోసం రూపొందించిన యాప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. యాప్‌లో ఏమైనా మార్పులు అవసరమైతే చేసి త్వరలో అన్ని కేసుల విచారణను ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నారు. సుప్రీంకోర్టులో రెండేళ్ల నుంచి రాజ్యాంగ ధర్మాసనం ముందు జరుగుతున్న కేసుల విచారణను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తురన్నారు.మహారాష్ట్ర శివసేన పార్టీ చీలిక కేసు విచారణను తొలిసారి ప్రత్యక్ష ప్రసారం చేశారు. అన్ని కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు 2018లోనే నిర్ణయించినప్పటికీ పలు కారణాల వల్ల అమలు ఆలస్యమైంది.ఇదీ చదవండి: ఈషా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట -
ఏపీలో విజృంభిస్తున్న విషజ్వారాలు
-
మెట్రో రైల్లో రీల్స్ : తస్మాత్ జాగ్రత్త!
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యంతరకరంగా, విచక్షణ లేకుండా ఢిల్లీ మెట్రో రైలులో రీల్స్ చేస్తూ ప్రయాణికులకు అసౌకర్యం కలిగించిన సోషల్ మీడియా యూజర్లకు గట్టి షాక్ ఇచ్చింది. ఏప్రిల్ నుండి జూన్ వరకు రీల్స్ చేసిన 1,600 మందిపై కేసులు నమోదు చేసింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే మూడు శాతం పెరిగిందని డీఎంఆర్సీ సీనియర్ అధికారులు గురువారం తెలిపారు.రైలులో తినడం, కింద కూర్చుని న్యూసెన్స్ చేయడం వంటి నేరాలు కూడా ఇందులో ఉన్నట్టు తెలిపింది. మెట్రో రైల్వేస్ (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) చట్టంలోని సెక్షన్ 59 ప్రకారం 1,647 మందిపై కేసులు నమోదైనట్టు ప్రకటించింది. గతేడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 1600. ఏప్రిల్‌లో 610 మంది,మే నెలలో 518, జూన్‌లో 519 మందిపై జరిమానాలు విధించినట్టు తెలిపింది. మెట్రో ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా పెట్టినట్టు చెప్పారు. మెట్రో రైలు పరిసరాల్లో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. -
‘చండీపురా’కు 16 మంది బలి.. 50 కేసులు నమోదు
గుజరాత్‌ను చండీపురా వైరస్ వణికిస్తోంది. తాజాగా రాష్ట్రంలో 50 చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయని గుజరాత్ ఆరోగ్య మంత్రి హృషికేష్ పటేల్ తెలిపారు. ఈ వైరస్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు.రాష్ట్రంలోని హిమ్మత్‌పూర్‌లో మొత్తం 14 చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయని, వీరిలో ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని హృషికేష్ పటేల్ తెలిపారు. చండీపురా వైరస్‌కు సంబంధించిన మూడు కేసులు ఇతర రాష్ట్రాల నుండి వచ్చాయని, రాష్ట్రంలో 50 చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయన్నారు. దీని బారినపడి 16 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ రాష్ట్రంలో చండీపురా వైరస్ పరిస్థితులను సమీక్షించారు. ఈ అంటువ్యాధి నియంత్రణకు అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. గుజరాత్ ఆరోగ్య మంత్రి హృషికేష్ పటేల్, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వైరస్ నివారణకు జిల్లాల్లో మలాథియాన్ పౌడర్‌ను పిచికారీ చేసేలా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. జ్వరాలతో బాధపడుతున్న వారికి వెంటనే చికిత్స అందించాలని ఆయన కోరారు. -
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో విజృంభిస్తున్న డయేరియా
-
తిరుపతిలో డయేరియా డేంజర్ బెల్స్
-
అధికారుల నిర్లక్ష్యంతో ఇద్దరి ప్రాణాలు బలి
-
మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం
మహారాష్ట్రలోని పూణెలో ఆరు జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడినవారిలో ఇద్దరు గర్భవతులున్నారు. జికా వైరస్ కేసులు వెలుగు చూసిన నేపధ్యంలో రాష్ట్ర ఆరోగ్యవిభాగం అప్రమత్తమయ్యింది. పూణె మున్సిపల్ అధికారులు వైరస్ నివారణకు చర్యలు ప్రారంభించారు. జికా వైరస్ వ్యాప్తికి కారణమైన దోమలను తరిమికొట్టేందుకు నగరంలో విస్తృతంగా ఫాగింగ్ చేస్తున్నారు.రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం అరంద్వానేలోని 46 ఏళ్ల డాక్టర్ జికా వైరస్ బారిపడ్డారు. ఇది రాష్ట్రంలో జికా వైరస్ తొలికేసుగా గుర్తించారు. అనంతరం ఆ వైద్యుని కుమార్తె(15)కు వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వీరిద్దిరితోపాటు ముండ్వాకు చెందిన ఇద్దరి రిపోర్టులు పాజిటివ్‌గా వచ్చాయి. ఈ నాలుగు కేసులు నమోదైన దరిమిలా అరంద్వానేకు చెందిన ఇద్దరు గర్భిణులకు జికా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. అయితే జికా వైరస్ సోకిన వీరందరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. కాగా వైరస్ సోకిన ఎడెస్ దోమ కాటు కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకినప్పుడు బాధితునిలో డెంగ్యూ లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్‌ను తొలిసారిగా 1947లో ఉగాండాలో కనుగొన్నారు. -
భారీగా పెరుగుతున్న డయేరియా కేసులు
-
డయేరియా డేంజర్ బెల్స్
-
ఏపీలో డయేరియా విజృంభణ..
-
17 మందిలో 14 మందిపై కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి లోక్‌సభకు ఎన్నికైన 17 మంది ఎంపీల్లో 14 మందికి నేరచరిత్ర ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై అత్యధికంగా 54 కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఎంపీలు తమ ఎన్నికల అఫిడవిట్లలో పొందుపరిచిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడించినట్టు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి వివరించారు.కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై 42 కేసులు, మెదక్ ఎంపీ రఘునందన్‌రావుపై 29 కేసులు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై 22 కేసులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఐదు కేసులు ఉన్నట్టు పద్మనాభరెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, వరంగల్ ఎంపీ కడియం కావ్యలపై మాత్రం ఎలాంటి కేసులు నమోదై లేవని వెల్లడించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియెజకవర్గంలో అత్యధికంగా 13,366 ఓట్లు ‘నోటా’కు పడినట్లు తెలిపారు. -
విచ్చలవిడిగా సైబర్ క్రైమ్స్
సైబర్ నేరాలకు, మోసాలకు అడ్డుఆపు లేకుండా పోతోంది. ప్రతిరోజూ కొత్త కొత్త రూపాలలో ఈ నేరాలు వెలుగుచూస్తున్నాయి. పోలీస్ డ్రెస్ వేసుకొని, పోలీస్టేషన్ ఆఫీస్ బ్యాంక్ గ్రౌండ్లో కూర్చొని పోలీసులమని చెబుతూ నేరగాళ్ళు అమాయకులతో ఆడుకుంటున్నారు. మీమీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయని, మీ పేరుతో మొబైల్ నెంబర్ తీసుకున్నట్లు సమాచారం వుందని, ఆ నెంబర్ నుంచి నేరమయమైన కమ్యూనికేషన్ ఉందని, మీ ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ ఉందని, అందులో కోట్లాదిరూపాయల లావాదేవీలు జరిగాయని, మనీ ల్యాండరింగ్ కేసు బుక్ అయిందని, విదేశాల లావాదేవీలు కూడా జరిగాయని, మీరు వెంటనే ముంబయి పోలీస్ స్టేషన్‌కు రావాలని, మిమ్మల్ని అరెస్టు చేయాలని, మీరు మాకు సహకరిస్తే, మిమ్మల్ని ఈ మోసం నుంచి కాపాడుతామని చెబుతూ, అమాయకుల నుంచి బ్యాంక్ వివరాలు, ఆధార్ కార్డు వివరాలు తీసుకోవడం మొదలైన చర్యలు ఈ నేరగాళ్ళు చేస్తున్నారు.పోలీసులు వేషాలతో, పోలీసులు కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్లుగా వాట్సాప్‌లో వీడియో కాల్లో మాట్లాడుతూ అమాయకులతో ఆడుకుంటున్నారు. పోలీస్ వేషంలో ఉండడంతో, నిజమైన పోలీసులే ఆనుకొని, తమ నిజాయితీని నిరూపించుకొనే దిశగా అమాయకంగా సమాచారం ఇస్తూ సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఉద్యోగాలు ఇప్పిస్తామని, లాటరీ అని, ఇలా ఎన్నో రకాలుగా సైబర్ నేరగాళ్ళు చెలరేగిపోతున్నారు. ఇటువంటి ఫేక్ కాల్స్ ఎదుర్కొంటున్నవాళ్ళలో మేధావులు, చదువుకున్నవాళ్ళు కూడా ఉండడం గమనించదగిన అంశం. జర్నలిస్టులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్ వేర్ ఉన్నత ఉద్యోగులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ప్రజల్లో అవగాహన కలిపించే దిశగా పోలీసులు, సైబర్ సాంకేతిక నిపుణులు, సంబంధిత వర్గాలు, మేధావులు, సామాజిక బాధ్యత కలిగిన పౌరులు కృషి చేస్తూనే వున్నారు.కమ్యూనికేషన్ రంగం విస్తృతంగా ప్రజలకు చేరుతోంది. దానికి తగ్గట్టుగా విజ్ఞానం, మెలుకువలు పెరగడం లేదన్నది వాస్తవం. దేశంలోనూ,ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ కొన్ని లక్షల మంది సైబర్ మోసాలకు బలవుతున్నారు. మోసపోతున్నవారిలో నిరక్షరాస్యులే కాదు అక్షరాస్యులు కూడా ఉంటున్నారు. ఆ మధ్య మహారాష్ట్రలో జరిగిన సంఘటన ఈ తీరుకు అద్దం పట్టింది. న్యాయస్థానంలో సూపరింటెండెంటుగా పనిచేసి రిటైరయిన ఓ మహిళ ఏకంగా కోటి రూపాయలకు పైగా పోగొట్టుకుంది.కేవలం సోషల్ మీడియాలో పరిచయాలు, తదనంతర పరిణామాలు ఈ మోసానికి ఆసరాగా నిలిచాయి. బంగారం బహుమతులుగా అందుకోండని యూకే నుంచి వచ్చిన ఫోన్ కు ఆమె చిక్కుకున్నారు. కస్టమ్స్ పన్ను చెల్లించాలని చెప్పగానే వెంటనే 1.12 కోట్లు ఆమె ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తి నుంచి ఎటువంటి స్పందన లేకపోగా, ఫోన్ కు కూడా అందకుండా ఉన్న పరిస్థితి ఎదురైంది. మోసపోయానని గ్రహించిన తర్వాత ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. బహుమతులు వచ్చాయి, పన్ను కట్టాలని ఫోన్ వచ్చినప్పుడే పోలీసులను సంప్రదించి వుంటే? ఆమె నష్టపోయేది కాదు.చేతిలో ఫోన్ ఉంది కదా! అని ముక్కుముఖం తెలియనివారితో స్నేహం చేయడమే మొదటి తప్పు. మనకు సంబంధించిన సమాచారం అందరితో పంచుకోవడం రెండో తప్పు. బహుమతులకు ఆశపడడం ఇంకో తప్పు. ఇటువంటి ఫోన్స్, మెసేజెస్ వచ్చినప్పుడు ముందుగానే పోలీసుల దృష్టికి తీసుకెళ్ళక పోవడం అంతకు మించిన తప్పు.జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఎవరినన్నా ఏమీ ప్రయోజనం లేదు. ఇలా ఎన్నో మోసాలు ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. బ్యాంకులు కూడా ఈమెయిల్స్, మెసేజెస్ రూపంలో ప్రతిరోజూ ఖాతాదారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. ఇక లోన్ యాప్ ల దారుణాలు అన్నీ ఇన్నీ కావు. మెసేజెస్ రావడమే ఆలస్యం వెంటనే క్లిక్ చేసి కొంతమంది దొరికిపోతున్నారు.లక్ష పెట్టుబడితో కేవలం 8 నెలల్లోనే 4 కోట్లు సొంతం చేసుకోండని కనిపించిన యాప్‌ను చూసి వెంటనే డబ్బులు కట్టేసి ఎంతోమంది మోసపోయిన వార్త ఆ మధ్య బయటకు వచ్చింది. ఆన్ లైన్ ట్రేడింగ్‌లో ఆ భారీ మోసం జరిగింది. ఈ మోసం విలువ 100కోట్ల పైనేనని ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. పూర్తిగా దర్యాప్తు జరిగితే మోసాల చిట్టా మరింత బయటపడుతుంది. ఇలాంటి సంస్థలు దేశ వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.మోసపోయాక లక్షలాది మంది రోడ్డు మీదకు వస్తున్నారు. సాధారణంగా ఆన్ లైన్ ట్రేడింగ్‌కు సెబీ గుర్తించిన సాంకేతికతను వినియోగించాలి. ప్రజలవ్వేమీ చూసుకోవడం లేదు. మొదటిది అవగాహన లేకపోవడం, రెండోది అత్యాశ. ఫోన్స్ హ్యాక్ చేస్తూ కోట్లాది రూపాయలు కొట్టేసిన ఉదంతాలు కూడా మనం వింటూనే ఉన్నాం. నకిలీ యాప్స్ తో పాటు నకిలీ పేర్లతో సోషల్ మీడియా వేదికలు కూడా నిర్మించి మోసాలకు తెరతీస్తున్నారు. నకిలీ మెయిల్స్ కూడా సృష్టిస్తున్నారు.వాట్సాప్ స్టేటస్లు చూసి కొందరు మోసపోతున్నారు. ముఖ్యంగా ప్రజల ఆధార్ కార్డు అనేక విభాగాలతో అనుసంధానమై ఉండడం వల్ల కూడా ఇటువంటి నేరాలకు అవకాశం ఇస్తోందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఆధార్ కార్డును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంపై విమర్శలు పెరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే సామాన్యుల రక్షణ ప్రశ్నార్ధకమవుతోంది. బ్యాంకుల్లో డబ్బులు ఉంచుకోవాలా? లేదా అనే సందేహాలు కూడా ప్రజల్లో వస్తున్నాయి.ఈ సైబర్ మోసాలు ఇన్నిన్ని కాదయా! అని చెప్పవచ్చు. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండడం, అత్యాశకు పోకుండా ఉండడం, అందరినీ నమ్మకుండా ఉండడం, ముందుగానే పోలీసులను, సంబంధిత అధికారులను సంప్రదించడం తప్ప వేరు మార్గాలు లేవు. కోట్లాదిగా పెరిగిపోతున్న నకిలీ సైబర్ వ్యవస్థలను పూర్తిగా నియంత్రించే శక్తి ఏ ప్రభుత్వాలకు ఉండదు. స్వయం నియంత్రణ కూడా అవసరం.-మాశర్మ -
కేరళలో ‘వెస్ట్ నైల్’ వైరస్ కేసులు
తిరువనంతపురం: కేరళలో వెస్ట్ నైల్ వైరస్( (డబ్ల్యూఎన్వీ) కేసులు మళ్లీ వెలుగు చూశాయి. మొత్తం 10 కేసులు తాజాగా నమోదయ్యాయి. మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో ఒక్కో జిల్లాకు ఐదు చొప్పున కేసులు రికార్డయ్యాయి. వెస్ట్ నైల్ వైరస్ సోకిన 10 మందిలో 9 మంది ఇప్పటికే కోలుకోగా ఒక్క వ్యక్తి మాత్రం ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఇటీవల సంభవించిన ఇద్దరి వ్యక్తుల మరణాలకు కూడా వెస్ట్ నైల్ వైరస్ కారణమన్న అనుమానాలున్నాయి. ఇది నిజమా కాదా అన్నది తేల్చడానికి సాంపుల్స్‌ను ల్యాబ్‌కు పంపారు.ఎన్సెఫలైటిస్ ఫ్లావి వైరస్ రకానికి చెందిన వెస్ట్ నైల్ వైరస్ దోమల నుంచి మనుషులకు సోకుతుంది. మనుషుల నుంచి మనుషులకు వ్యాధి వ్యాప్తి చెందదు. ఈ వైరస్ పది మందిలో ఇద్దరికి ప్రాణాంతకంగా పరిణమించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. 2019,2022 కేరళలో వెస్ట్ నైల్ వైరస్ సోకి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. -
HD Revanna: అంతా రాజకీయ కుట్ర
బెంగళూరు/శివమొగ్గ: తనపై, తన కుమారుడు ప్రజ్వల్‌పై లైంగిక వేధింపులు, కేసులు అంతా రాజకీయ కుట్రలో భాగమని కర్ణాటక జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ వ్యా ఖ్యానించారు. సోమవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర కోణం ఉంది. ఆరోపణలపై దర్యాప్తును ఎదుర్కొంటా. ఆరోపణల్లో నిజం ఉందని దర్యాప్తులో తేలితే ఎలాంటి శిక్ష అనుభవించడానికైనా సిద్ధం. నాలుగైదేళ్లనాటి పాత అంశాలను పట్టుకుని ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. సిట్ దర్యాప్తు చేశాక నిజాలు బయటికొస్తాయిగా. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. వాళ్లనుకున్నదే చేస్తారు. ఇవన్నీ ఈనాటివి కాదు. కాంగ్రెస్ నేతలు ఆరోపించినట్లుగా ఇది పెద్ద సెక్స్ కుంభకోణమే అయితే సిట్ ఏర్పాటుచేశారుగా. సమగ్ర దర్యాప్తు చేయనివ్వండి. సాధారణంగానే ప్రజ్వల్ విదేశాలకు వెళ్తాడు. ఇప్పుడూ అలాగే వెళ్లాడు. ఎఫ్ఐఆర్ వేస్తారనిగానీ, సిట్‌తో దర్యాప్తు చేయిస్తారనిగానీ ప్రజ్వల్‌కు తెలీదు. దర్యాప్తు అధికారులు ఆదేశించినప్పుడు ప్రజ్వల్ వచ్చి వారికి సహకరిస్తాడు’’ అని రేవణ్ణ చెప్పారు.పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్!లైంగిక ఆరోపణల నేపథ్యంలో ప్రజ్వల్‌ను సస్పెండ్ చేయాలనే నిర్ణయానికొచ్చినట్లు జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి సోమ వారం చెప్పారు. ‘‘ ప్రజ్వల్‌పై ఆరోపణలు నిజమైతే ఆయనకు శిక్ష పడాల్సిందే. వివాదంలో ప్రజ్వల్‌ను వెనకేసుకొచ్చే ప్రసక్తే లేదు. తప్పు అని తేలితే కఠినచర్యలు తీసు కోవాల్సిందేనని మా కుటుంబం మొత్తం కోరుకుంటోంది. ప్రజ్వల్ సస్పెన్షన్ నిర్ణయా న్ని మంగళవారం హుబ్బళిలో పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ప్రతిపాదిస్తాం. పార్ల మెంట్‌సభ్యుడు కాబట్టి నిర్ణయం ఢిల్లీ స్థాయి లో జరగాలి. ఈ విషయాన్ని జేడీఎస్ జాతీ య అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడకు వివరించా’’ అని కుమారస్వామి అన్నారు.